మాస్కో: పఠాన్కోట్ ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి, జైషే ఈ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను యునైటెడ్ నేషన్స్ నిషేధ జాబితా1267లో చేర్చాలనే ఇండియా ప్రతిపాదనకు చైనా వ్యతిరేకత చూపడంపై రష్యా, ఇండియా, చైనా విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, చైనా మంత్రితో చర్చించారు.
భారత్తో పాటు చైనాలో కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయని వాటిని ఆపాలంటే ఇరుదేశాలు సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చైనా సానుకూలతను చూపిందని, ఈ అంశంపై చర్చలు జరగాలని ఇరువర్గాలు భావించాయని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. గత జనవరిలో పఠాన్కోట్ దాడి తర్వాత ఇండియా మసూద్ను నిషేధిత టెర్రరిస్టు జాబితాలో చేర్చాలని యూఎన్ను కోరింది. కాగా, మసూద్ను యూఎన్ జాబితాలో చేర్చేంతలా టెర్రరిస్టు కాదని, భారత్ కోరికను ఆపాలని చైనా యూఎన్ను కోరిన విషయం తెలిసిందే.