china
-
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజలో ఉండాలంటే అత్యధిక విద్యుత్, అది కూడా కారుచౌకగా అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఒక అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్వహించాలంటే కనీసం 40 లక్షల విద్యుత్ వాహనాలను చార్జ్ చేయడానికి సమానమైన విద్యుత్ కావాలని అంచనా. ఆన్లైన్ డేటాను రెప్పపాటులో ప్రాసెస్ చేసే కృత్రిమ మేధ డేటా సెంటర్లకు ప్రాణమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)లకు కూడా నిరంతరం నిరాటంకమైన విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రపంచమే డేటామయంగా మారిన నేపథ్యంలో డేటాను కాపాడుకోవాలన్నా, ఆన్లైన్లో నిరంతరం అందుబాటులో ఉంచాలన్నా అపారమైన విద్యుచ్ఛక్తి కావాల్సిందే. అణు విద్యుత్ రంగంలో ఇప్పటికే నంబర్‌వన్‌గా ఉన్న చైనా దీన్ని ముందే పసిగట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘కేంద్రక సంలీన, విచ్చిత్తి’ సూత్రాల కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్ తయారీకి నడుం బిగించింది. ఈ ప్రయత్నం గనుక ఫలిస్తే అపారమైన విద్యుత్ నిరంతరంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్నింట్లోనూ అగ్రస్థానం కేసి... ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త రకం వస్తువు తయారైనా వెంటనే దానికి నకలు తయారు చేస్తుందని చైనాకు పేరుంది. ఇమిటేషన్ టెక్నాలజీకి పేరెన్నికగన్న చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశపడుతోంది. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వాటికి అత్యధిక నిధులు కేటాయించిన దేశాల్లో చైనాది రెండో స్థానం విశేషం. హువాయీ, టెన్సెంట్, అలీబాబా, గ్జియోమీ, డీజేఐ కంపెనీలు, ఇన్నోవేషన్‌కు సంబంధించి బీవైడీ తదితరాలు చైనాను టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలిపాయి. 5జీ టెక్నాలజీలో హువాయీ, డ్రోన్ టెక్నాలజీలో బీవైడీ టాప్ కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వెళ్లగల బ్యాటరీ, చార్జింగ్ వ్యవస్థలను బీవైడీ అభివృద్ధి చేసింది. విద్యుత్ వాహనాల అమ్మకాలు, ఆదాయంలో అది ‘టెస్లా’ను దాటేసిందని బీబీసీ ఇటీవలే పేర్కొంది. విద్యుత్ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్ అవసరం. ఆ అవసరాలు తీరేలా చైనా ఇలా కేంద్రక సంలీన, విచ్ఛిత్తి రియాక్టర్ పనిలో పడింది.ఇలా పని చేస్తుంది జియాన్‌గ్జీ ప్రావిన్సులోని యహోహూ సైన్స్ ద్వీపంలో ఝింగ్‌హువో పేరిట ఈ వినూత్న అణు విద్యుత్కేంద్రాన్ని కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. చైనా భాషలో ఝింగ్‌హువో అంటే మెరుపు. కేంద్రక విచ్చిత్తిలో యురేనియం వంటి బరువైన అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక స్థాయిలో ఉష్ణశక్తి వెలువడుతుంది. అణుబాంబు తయారీలో ఉండేది ఈ సూత్రమే. అణు రియాక్టర్లలో నూ దీన్నే వాడతారు. అదే కేంద్రక సంలీన ప్రక్రియలో రెండు కేంద్రకాలు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి. విచ్చిత్తితో పోలిస్తే సంలీన చర్యతోనే అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యం. ఝింగ్‌హువో రియాక్టర్లో తొలుత సంలీన చర్యలు జరిపి వాటి ద్వారా వచ్చే భారయుత కేంద్రకాల సాయంతో విచ్ఛిత్తి జరుపుతారు. తద్వారా మరింత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చైనా శాస్తవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్లలో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.అత్యధిక ‘క్యూ వాల్యూ’ అత్యధిక అణు విద్యుదుత్పత్తి జరగాలంటే కేంద్రక సంలీన చర్యలో అత్యధిక శక్తి ఉద్గారం జరగాలి. సంలీన ప్రక్రియలో విడుదలయ్యే అత్యధిక ఉష్ణశక్తిని రియాక్టర్ విద్యుత్ రూపంలోకి మారుస్తుంది. సంలీన ప్రక్రియకు వెచ్చించాల్సిన శక్తి కంటే దాన్నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఎక్కువగా ఉండటాన్ని ‘నికర శక్తి లాభం’గా పిలుస్తారు. దాన్నే ‘క్యూ వాల్యూ’గా చెప్తారు. సంలీన ప్రక్రియలో అత్యధికంగా ఏకంగా 30 క్యూ వాల్యూను సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ కథనం పేర్కొంది. మూడేళ్ల క్రితం అమెరికాలో కాలిఫోరి్నయాలోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ కేంద్రం 1.5 క్యూ వాల్యూను సాధించింది. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పరమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) 10 క్యూ వాల్యూను సాధించే ప్రయత్నంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్ ఇప్పటికే కేంద్రక సంలీనం ద్వారా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయి. చైనా తాజా యత్నాలు ఫలిస్తే అది ఏకంగా 20 ఏళ్లు ముందుకు దూసుకెళ్లగలదని ఆంట్రప్రెన్యూర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్నాడ్ బేర్‌ట్రెండ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ రేటు 23 శాతం పెరిగింది. ఏప్రిల్ నెలలో మాత్రమే పసిడి ధర 5 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. శనివారం నాటికి బంగారం ధరలు గరిష్టంగా రూ. 95,670 వద్ద నిలిచాయి.అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. ట్రాయ్ ఔన్సుకు $3,263 రికార్డు గరిష్ట స్థాయిని తాకిన తర్వాత కామెక్స్ గోల్డ్ 2.44 శాతం పెరిగి $3,254.90 వద్ద ముగిసింది. ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుదల ఆల్ టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది.బంగారం రేటు ఎందుకు పెరుగుతోందిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్.. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అనేక దేశాలపై విధించిన పరస్పర సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించగా.. చైనాపై సుంకాలను మాత్రం 125 శాతానికి పెంచారు. చైనా కూడా ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వృద్ధి చుట్టూ అనిశ్చితిని పెంచాయి. దీంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులకు గ్యారెంటీ లేదు. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెడితే.. అది సురక్షితమైన ఆస్తిగా భావించేవారు సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ఎక్కువమంది బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇది గోల్డ్ రేటు పెరగడానికి దోహదపడుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. 200 మంది ఉద్యోగులు బయటకుబంగారం ధరలు తగ్గుతాయా?వాణిజ్య యుద్ధం, డాలర్ విలువ తగ్గడం, వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ట్రాయ్ ఔన్సుకు $3,300 నుంచి $3,500 వరకు పెరుగుతాయని చెబుతున్నారు.భారతదేశంలో 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం రూ. 97,000 కు చేరుకుంటుందని HDFC సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ 'అనుజ్ గుప్తా' అన్నారు. ధరలు పెరుగుదల ఇలాగె కొనసాగే అవకాశం ఉందని.. ఎల్కేపీ సెక్యూరిటీస్ , కమోడిటీ అండ్ కరెన్సీ, వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది కూడా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేదని స్పష్టంగా అర్థమవుతోంది. -
రాజధాని బీజింగ్ లో భారీ వర్షం, చరిత్రలో చూడని రేంజ్ లో ఈదురు గాలులు
-
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
బీజింగ్: చైనాను భీకర గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ఇసుక తుపాను, భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వందలాది విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీజింగ్, డాక్సింగ్‌లో 693 విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు, రైళ్లను కూడా నిలిపివేశారు. దుమ్ము తుపానులు చెలరేగడంతో.. అధికారులు పర్యాటక ప్రదేశాలను మూసేశారు.చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అలర్ట్ చేసింది. దేశంలోని ఉత్తర, తీర ప్రాంతాలలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ సబ్వే, హై-స్పీడ్ రైలు మార్గాలతో సహా కొన్ని రైలు సేవలను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత ఏడాది చైనాలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన తుపానులు, వరదల్లో అనేక మంది మరణించారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. మే నెలలో దక్షిణ చైనాలో కురిసిన వర్షాలతో ఒక రహదారి కూలిపోయి 48 మంది మరణించిన సంగతి తెలిసిందే.April 12, China was hit by a nationwide gale and dust storm that was rare in history, with the maximum gust reaching 46.8m/s! The sandstorm blew from Mongolia all the way to the Yangtze River and may even affect Hong Kong! pic.twitter.com/8mO795JEep— Jim (@yangyubin1998) April 12, 2025 -
తలుపులు కనపడటం లేదంటే.. ట్రంప్ వచ్చి వెళ్లాడనుకుంటా సార్!
-
జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు
మెటా అధినేత మార్క జుకర్‌బర్గ్‌పై ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ విజిల్‌బ్లోయర్(వేగు) సారా విన్ విలియమ్స్ సంచలన ఆరోపణలకు దిగారు. జుకర్‌బర్గ్‌కు అమెరికా ప్రయోజనాల కన్నా డబ్బే ముఖ్యమని, ఈ క్రమంలోనే చైనాతో చేతులు కలిపి తన సొంత దేశం జాతీయ భద్రతా విషయంలో రాజీ పడ్డారని వెల్లడించారామె. సెనేటర్ జోష్ హవ్యూలే నేతృత్వంలోని కౌంటర్‌టెర్రరిజం సబ్ కమిటీ ఎదుట హాజరైన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. సీబీఎస్ కథనం ప్రకారం సారా విన్ వాంగ్మూలంలో.. చైనాలో వ్యాపార ఉనికిని పెంచుకోవడానికే మెటా కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. చైనాతో మార్క్ జుకర్‌బర్గ్ చేతులు కలిపారు. అందుకే.. పదే పదే అమెరికా జాతీయ భద్రతా విషయంలో మెటా రాజీ పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారామె. మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్షిప్ను టూల్స్‌ను రూపొందించింది. తద్వారా కంటెంట్ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్‌బర్గ్.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు?. ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు. సారా విన్ విలియమ్స్ గతంలో ఫేస్బుక్లో గ్లోబల్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పని చేశారు. ఏడేళ్లపాటు సంస్థలో పని చేసిన ఆమె.. ఈ ఏడాది మార్చిలో కేర్లెస్ పీపుల్ పేరిట ఒక నివేదికను పుస్తకాన్ని విడుదల చేసి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ పుస్తంపై మెటా కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అయితే బుధవారంనాటి విచారణ సందర్భంగా.. ‘‘ఫేస్బుక్ ఆ పుస్త విషయంలో ఆమెను ఎందుకు నిలువరించాలని అనుకుంటోంది?.. అమెరికన్లకు వాస్తవం తెలియాల్సి ఉంది’’ అని సెనేటర్ జోష్ హవ్యూలే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తమ ఎదట హాజరై వివరణ ఇవ్వాలంటూ గురువారం జుకర్‌బర్గ్‌కు ఆయన ఓ లేఖ రాశారు. వాస్తవాలు బయటపెడితే తనను కోర్టుకు ఈడుస్తామంటూ మెటా బెదిరిస్తోందని సారా విన్ విలియమ్స్ చెబుతుండగా.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమేనని, చైనాలో తమ కార్యకలాపాలు నడవడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. -
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
ఇప్పటికే అద్భుతాలకు నెలవైన చైనా త్వరలో ప్రపంచానికి మరో అద్భుతాన్ని చూపించబోతోంది. అదేమిటో తెలిసినవారంతా ఇప్పుటికే చైనా ప్రతిభకు కితాబిస్తున్నారు. చైనానోలోని గుయిజౌ ప్రావిన్స్‌లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జి(Huajiang Grand Canyon Bridge) జూన్ 25న ఆవిష్కృతం కానుంది. ఇదే ప్రపంచాన్ని అబ్బురపరిచే మరో వండర్. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.చైనా ఈ నూతన వంతెనను.. రెండు మైళ్ల దూరం మేరకు విస్తరించి ఉన్న ఒక భారీ లోయను దాటడానికి నిర్మించింది. ఈ నిర్మాణానికి చైనా సుమారు 216 మిలియన్ పౌండ్లు (₹2200 కోట్లు) వెచ్చించింది. ఇప్పటివరకూ ఈ లోయను వాహనాల్లో దాటేందుకు ఒక గంట సమయం పడుతుండగా, ఈ వంతెన నిర్మాణంతో కేవలం ఒక్క నిముషం(One minute)లో ఈ వెంతెనను దాటేయవచ్చని చైనా చెబుతోంది. ఈ వంతెన ఎత్తు పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు రెట్టింపు ఎత్తును కలిగి ఉంటుంది. China's Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world's tallest bridge at 2050 feet high. Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches. One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ— Collin Rugg (@CollinRugg) April 8, 2025ఈ వంతెన మీద ఒక గాజు నడక మార్గం ఏర్పాటవుతోంది. ఫలితంగా సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడగలుగుతారు. ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్‌ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది. ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.ఈ వంతెన చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని(Engineering ability) ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది. అగాథంలాంటి లోయ మీద, ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది. అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే.. -
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం
-
చైనా.. తగ్గేదేలే!
బీజింగ్: అమెరికా, చైనా టారిఫ్ పోరు మరింత ముదిరింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరినట్టు అమెరికా గురువారం ప్రకటించడం తెలిసిందే. ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను 84 నుంచి 125 శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది. అయితే, ‘‘మాపై అమెరికా ఇప్పటికే సుంకాలను అవాస్తవిక రీతిలో పెంచేసింది. ఇంకా పెంచితే ఇక అర్థముండదు. ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఓ నవ్వులాట ఉదంతంగా నిలిచిపోతుంది. అమెరికా ప్రస్తుత టారిఫ్‌లను భరిస్తూ ఆ దేశ దిగుమతులను చైనా మార్కెట్లోకి అనుమతించడం ఇప్పటికే అసాధ్యంగా మారిపోయింది. కనుక మాపై అమెరికా టారిఫ్‌లను ఇంకా పెంచేసినా మేం మాత్రం ఆ దేశంపై అదనపు సుంకాలు విధించబోం’’ అని స్పష్టం చేసింది. ఈ మతిలేని దూకుడు ఎవరికీ మేలు చేయదని చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. వాణిజ్య యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని అభిప్రాయపడింది. ‘‘అందుకే టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు ఇప్పటికీ చైనా సిద్ధంగానే ఉంది. మావైపు నుంచి తలుపులు తెరిచే ఉన్నాయి. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటామనే ఆశిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అయితే ఏ చర్చలైనా సమానత్వం, పరస్పర విశ్వాసాల ప్రాతిపదికన జరగాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. ట్రంప్ టారిఫ్‌లను అమెరికా ప్రజలే విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారత్ సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు ట్రంప్ తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే. చైనాపై మాత్రం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం ఫెంటానిల్ సుంకంతో కలిపి అది 145 శాతానికి చేరినట్టు వైట్‌హౌస్ గురువారం స్పష్టతనిచి్చంది.ఏకాకిగా మిగులుతారు అమెరికాపై జిన్‌పింగ్ ధ్వజం కలసికట్టుగా ఎదుర్కొందాం ఈయూ దేశాలకు పిలుపుఅమెరికా టారిఫ్‌లపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారిగా స్పందించారు. అవి ఫక్తు ఏకపక్ష పోకడలంటూ మండిపడ్డారు. ‘‘టారిఫ్‌ల యుద్ధంలో ఎవరూ గెలిచేదుండదు. ఇలా ప్రపంచం మొత్తానికీ వ్యతిరేకంగా వెళ్తే ఏకాకులు కావడం మినహా ఒరిగేదేమీ ఉండదు’’ అంటూ హితవు పలికారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో శుక్రవారం బీజింగ్‌లో జిన్‌పింగ్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో తమతో కలిసి రావాల్సిందిగా యూరోపియన్ యూనియన్‌కు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘‘ఇది మన అంతర్జాతీయ బాధ్యత కూడా. మన సంయుక్త స్పందన ఇరుపక్షాలకు మాత్రమే గాక మొత్తం అంతర్జాతీయ సమాజానికీ మేలు చేస్తుంది. స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని కాపాడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘చైనా ఏనాడూ ఇతరుల దయపై ఆధారపడలేదు. 70 ఏళ్లుగా స్వయంసమృద్ధినే, కష్టాన్నే నమ్ముకుంది’’ అని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. -
ట్రంప్ పన్నులపై చైనా జిన్‌పింగ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే..
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపు అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభివర్ణించారు. ట్రంప్ బెదిరింపులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అలాగే, అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచినట్టు చెప్పుకొచ్చారు. చైనాపై అమెరికా భారీగా పన్నులను పెంచిన నేపథ్యలో అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. ఈ సందర్బంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ..‘ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవి. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుంది. ఇది సమంజసం కాదు. ట్రంప్ పన్నులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ మాతో కలిసి రావాలని కోరుతున్నాను. యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. అందరూ కలిసి ఐకమత్యంగా అమెరికాపై పోరాటం చేయాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో జిన్‌పింగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు అధ్యక్షుడు జిన్‌పింగ్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 14 నుంచి వియత్నాం, మలేసియా, కంబోడియాలో జిన్‌పింగ్ పర్యటించనున్నారు. ఇక, డొనాల్డ్ ట్రంప్.. వియత్నాం, కంబోడియా దేశాలపై కూడా భారీగానే పన్నులు విధించారు. వియత్నాంపై 46 శాతం, కంబోడియాపై 49 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో జిన్‌పింగ్ చర్చలు జరపనున్నారు.Latest UY | WorldXi Jinping’s Southeast Asia Tour: A Move Amidst U.S. Trade Storm?Chinese President Xi Jinping embarks on a pivotal journey to Vietnam, Malaysia, and Cambodia starting April 14, aiming to fortify bonds with key allies as U.S. tariffs tighten their grip. With… pic.twitter.com/IfsHmtQ4c1— UnreadWhy (@TheUnreadWhy) April 11, 2025జిన్‌పింగ్ చాలా స్మార్ట్: ట్రంప్అంతకుముందు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జిన్‌పింగ్‌కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్‌పింగ్ గురించీ తెలుసు. ఆయన సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు అక్కడి (చైనా) నుంచి మాకు ఫోన్ కాల్ వస్తోందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. -
టారిఫ్‌ల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రక్షణాత్మక పెట్టుబడి సాధనం బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది. కామెక్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 100 డాలర్లు (3.5%) పైగా పెరిగి 3,180 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లలో దూకుడు కారణంగా దేశీయంగా నేడు స్పాట్ మార్కెట్లో పసిడి పరుగులు పెట్టే వీలుందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎంసీఎక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న కాంట్రాక్ట్ ధర గురువారం రాత్రి రూ. 2,356 ఎగసి రూ.92,160 వద్ద కదలాడుతోంది. -
మా తలుపులు తెరిచే ఉన్నాయి
బీజింగ్/వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి హీ యోంగ్కియాన్ గురువారం చెప్పారు. తాము ఘర్షణ కోరుకోవడం లేదని అన్నారు. చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందన్నారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు. అమెరికాతో చర్చలు పరస్పర గౌరవం, సమానత్వం ప్రాతిపదికన జరగాలని ఆకాంక్షించారు. కానీ, ఒత్తిళ్లకు, బెదిరింపులకు గురిచేయడం, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు దిగితే సహించబోమని హెచ్చరించారు. చైనాతో డీల్ చేసే విధానం అది కాదని అన్నారు. ఒకవేళ వాణిజ్య యుద్ధాన్ని అమెరికా మరింత ముందుకు తీసుకెళ్తే తాము చివరి వరకూ పోరాడుతామని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ తెలివైన నాయకుడు: ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చాలా తెలివైన నాయకుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఎప్పుడేం చేయాలో జిన్‌పింగ్‌కు బాగా తెలుసని అన్నారు. టారిఫ్‌ల విషయంలో చైనా పాలకులు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చించడానికి జిన్‌పింగ్ నుంచి త్వరలోనే తనకు ఫోన్‌కాల్ వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. చైనాలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టంచేశారు. చైనాపై 145 శాతం బాదుడు చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించగా, మరో 20 శాతం సుంకాలను కూడా దీనికి జతచేసినట్లు శ్వేతసౌధం తాజాగా స్పష్టంచేసింది. చైనా నుంచి ఫెంటనిల్ అక్రమ రవాణాకు సంబంధించి గతంలో విధించిన 20 శాతం సుంకాలకు ఈ 125 శాతం సుంకాలు అదనమని తెలియజేసింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరుకున్నట్లు నిర్ధారించింది. మరోవైపు అమెరికా ఉత్పత్తులపై చైనాలో సుంకాలు 84 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.ఇండియాపై 26 శాతం అదనపు టారిఫ్ జూలై 9 దాకా రద్దు ఇండియాపై విధించిన 26 శాతం అదనపు టారిఫ్‌ను 90 రోజులపాటు రద్దు చేస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ ఏడాది జూలై 9 దాకా ఈ అదనపు సుంకాలు అమల్లో ఉండవని పేర్కొంది. -
చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్ విధింపు
వాషింగ్టన్: అమెరికా,చైనా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా చైనాపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకం విధించారు. దీంతో చైనా వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్ మొత్తం 145 శాతానికి చేరుకుందని వైట్‌హౌస్ అధికారి అమెరికన్ మీడియా సంస్థ సీఎన్బీసీకి ధృవీకరించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డ్రాగన్ దిగుమతులపై ఉన్న 20 శాతం సుంకాలకు అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై చైనా దీటుగా స్పందిస్తూ అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించింది. ఇదే విషయంలో ట్రంప్ డ్రాగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు డెడ్‌లైన్ పెట్టి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. తామేం తక్కువ కాదన్నట్లుగా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధించింది. JUST IN: 🇺🇸🇨🇳 White House says total US tariffs on China are now 145% pic.twitter.com/67oyICPVNb— Mastering Crypto 🇺🇲 (@MasteringCrypt) April 10, 2025పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుగా వ్యవహరిస్తుందంటూ చైనాపై మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ తరుణంలో తాజాగా మరో 20 శాతం టారిఫ్ పెంచారు. దీంతో చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకం 145శాతానికి చేరినట్లైంది. ఇదే విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. -
అమెరికా చైనా మధ్య మరింత ముదిరిన టారిఫ్ వార్
-
ట్రంప్ దూకుడు.. అమెరికాలోని చైనీయులకు చైనా హెచ్చరిక
బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనా మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల పన్నులు విధించు కోవడంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తన దేశ పౌరులకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. చైనా విద్యార్థులు, పర్యాటకులు.. అమెరికా వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి.. ప్లాన్ చేసుకోవాలని సూచనలు చేసింది. అమెరికాలో ఎదురయ్యే ముప్పులను ముందుగానే అంచనా వేసుకోవాలని కోరింది.అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా చైనా పర్యటక శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికా వెళ్లే చైనీయులకు అక్కడ ఎదురయ్యే ముప్పులను ముందుగానే అంచనా వేసుకోవాలని, జాగ్రత్త అంటూ చైనా టూరిజం శాఖ సూచించింది. దీంతోపాటు అమెరికా రాష్ట్రాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా అయా ప్రాంతాల్లో భద్రతా ముప్పును అంచనా వేసుకొని వెళ్లాలని కోరింది. భద్రతా పరిస్థితుల కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లకపోవడమే మంచిదని సూచనలు చేసింది.ఇదే సమయంలో.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే చైనీయుల కోసం విద్యాశాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో చైనీయులకు సంబంధించి ప్రతికూల నిబంధనలు ఉన్నాయని తెలిపింది. భవిష్యత్తులో అక్కడ చదవాలనుకునే వారు స్థానికంగా ఎదురయ్యే సమస్యలను తెలుసుకోవాలని సూచించింది.ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్త ఆర్థిక ప్రకంపనల నేపథ్యంలో ట్రంప్ వెనక్కు తగ్గారు. భారత్‌తో పాటు 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. కానీ చైనాతో మాత్రం అమెరికా టారిఫ్‌ల పోరు బుధవారం మరింత తీవ్రరూపు దాల్చింది. ఈ దిశగా రోజంతా శరవేగంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాపైనా చైనా అంతే మొత్తం బాదింది.అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా కన్నెర్రజేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104 శాతానికి చేరిన సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి ఝుళిపించింది. 23 బిలియన్ల విలువైన యూఎస్ ఉత్పత్తులపై దశలవారీగా అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా కూడా అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొంది. -
అమెరికాకు షాకిచ్చిన చైనా
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. -
సానుకూల దిశగా చైనా-భారత్ సంబంధాలు
న్యూఢిల్లీ, బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా సుంకాల విధింపు తర్వాత స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో.. భారత్-చైనా సంబంధాలు(India-China Relations) బలపడే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం. తాజాగా ఇరు దేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారాయన. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే.. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.2020లో తూర్పు లడ్డాఖ్‌లోని గల్వాన్ లోయ(Galwan Valley)లో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.మరోవైపు.. ట్రంప్ టారిఫ్‌ల(Trump Tariffs) నేపథ్యంలో తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పందించారు. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సప్లై చైన్ వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామని అన్నారు.చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 104 శాతం టారిఫ్‌లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ అభిప్రాయపడ్డారు. ‘‘పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి’’ అని ఆమె ఒక పోస్ట్ చేశారు. -
చైనా ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి
బీజింగ్: చైనాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చైనాలోని ఓ నర్సింగ్ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని లాంగ్హువా కౌంటీలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఓ నర్సింగ్ హోమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.00 గంటల ప్రాంతంలో నర్సింగ్ హోమ్(ఆసుపత్రి)లో మంటలు చెలరేగాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా జిన్హువా వెల్లడించింది. అలాగే, పలువురు తీవ్రంగా గాయపడినట్టు చెప్పుకొచ్చింది. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.Deadly fire claims 20 lives at nursing home in northern ChinaThe blaze struck a facility in Chengde City, with survivors relocated to a nearby hospital for treatment and observation, Xinhua News reports.#China pic.twitter.com/dOdt0UNX1w— MOCez🇷🇺🇮🇶🇾🇪🇨🇳🇵🇰🇵🇸🇱🇧🇮🇷🇰🇵☀️ (@Mousacisse1) April 9, 2025 -
చైనాకు ట్రంప్ మరో షాక్..
-
ట్రంప్ పన్నుల బాదుడు.. చైనా అదిరిపోయే కౌంటర్
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ చర్యల కారణంగా పలు దేశాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య టారిఫ్‌ల యుద్ధమే నడుస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ట్రంప్ ఏకంగా 104శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో, ట్రంప్ చర్యలపై చైనా ఘాటుగా స్పందించింది.ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న పన్నులపై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తాజాగా స్పందించారు. తాజాగా లీ కియాంగ్ మాట్లాడుతూ..‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నుల పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. దీనిపై మేం చివరివరకు పోరాడతాం. సొంత ప్రయోజనాల కోసమే కాకుండా.. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు ప్రయత్నిస్తాం. దీనికి మేం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపైనా ఇలాంటి చర్యలు తీసుకోవడం అమానుషం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగినవిధంగా బదులిచ్చేందుకు విధానపరంగా అన్ని ఆయుధాలు మా వద్ద ఉన్నాయి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. -
ట్రంప్ సుంకాలపై భారత్- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్- చైనా(India-China)లు కలిసి పోరాడాలని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలియజేశారు. ‘చైనా-భారత్‌ల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై(Mutual benefits) ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు(భారత్-చైనా) కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ పిలుపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రావడం విశేషం.అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) ఏప్రిల్ 7న చైనాపై 104 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 9 నుండి అమలులోకి రానున్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా.. భారత్‌కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారతదేశం- చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసివుండవచ్చు.అయితే భారత్.. చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుండి వచ్చే 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే చైనా.. భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే, అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.ఇది కూడా చదవండి: Dominican Republic: నైట్ క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు -
చైనాపై మరో 50%
బీజింగ్/వాషింగ్టన్: ట్రంప్ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం. మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు. కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. ఈయూ ప్రతీకార సుంకాలు 25 శాతం బెల్జియం: అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు యూరోపియన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. కొన్ని వస్తువులపై మే 16 నుంచి, మరికొన్నింటిపై డిసెంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.భారత్‌పైనా నేటినుంచే!ప్రపంచ దేశాలపై ట్రంప్ ఇటీవల విధించిన టారిఫ్‌ల అమలులో ఆలస్యం, డెడ్‌లైన్ పొడిగింపు వంటివేమీ ఉండబోవని లెవిట్ కుండబద్దలు కొట్టారు. భారత్‌తో పాటు 70పై చిలుకు దేశాలపై ఏప్రిల్ 2న ట్రంప్ ఎడాపెడా అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. అవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దాంతో భారత్‌పై 26 శాతం సుంకాలతో పాటు ఆయా దేశాలపై విధించిన టారిఫ్‌లు కూడా బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచే అమల్లోకి రానున్నాయి. ‘‘ట్రంప్ టారిఫ్‌లు పని చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాతో చర్చల కోసం 70కి పైగా దేశాలు ఇప్పటికే ముందుకొచ్చాయి’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు. అయితే అమెరికాకు లాభదాయకంగా ఉంటేనే ఏ చర్చలైనా ఫలిస్తాయని ఆమె స్పష్టం చేశారు. -
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్‌కు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా -అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై విధించిన 34శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేదంటే చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం 48 గంటల సమయం కూడా ఇచ్చారు. బెదిరిస్తే.. బెదిరిపోతామా ఈ తరుణంలో ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై చైనా ధీటుగా స్పందించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు.మంచి పద్దతి కాదుట్రంప్ విధించిన 48గంటల డెడ్‌లైన్‌పై అమెరికా మీడియా లియు పెంగ్యుని ప్రశ్నించింది. బదులుగా, పెంగ్యు స్పందిస్తూ.. తమపై ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి,బెదిరింపులకు పాల్పడటం మంచి పద్దని కాదని ఇప్పటికే చెప్పాం. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది’ అని చెప్పారు. మరిన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్మరోవైపు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధమైంది. తన సొంత హక్కులను,ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పుత్తులపై టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించింది. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పూర్తిగా అర్ధం లేనివి. ఒక సాధారణ ఏకపక్ష బెదిరింపుగా అభిప్రాయం వ్యక్తం చేసింది. -
మరో 50 శాతం వేస్తాం
వాషింగ్టన్: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికాపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్ణయాన్ని మంగళవారంలోగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బుధవారం నుంచి చైనాపై ఏకంగా మరో 50 శాతం అదనపు సుంకాలు విధిస్తానని సోమవారం హెచ్చరించారు. అంతేకాదు, ‘‘చైనా విజ్ఞప్తి మేరకు పలు అంశాలపై ఆ దేశంతో పురోగతిలో ఉన్న అన్నిరకాల చర్చలనూ ఉన్నపళాన నిలిపేస్తాం. బదులుగా ఇతర దేశాలపై దృష్టి సారిస్తాం. ఆయా రంగాల్లో వాటితో బంధాలను పటిష్టం చేసుకుంటాం’’ అని కుండబద్దలు కొట్టారు. చైనాపై ట్రంప్ ఇటీవలే 34 శాతం సుంకాలు విధించడం, బదులుగా అమెరికాపైనా అంతే శాతం సుంకాలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించడం తెలిసిందే. అంతేగాక తమనుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న పలు కీలక ఖనిజాలపై ఆంక్షలు కూడా విధించింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడుతూ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పలు పోస్టులు పెట్టారు. ‘‘అమెరికా ఉత్పత్తులపై చైనా ఏళ్లుగా రికార్డు స్థాయిలో భారీ టారిఫ్‌లు వసూలు చేస్తోంది. అవి చాలవన్నట్టు నిన్న మరో 34 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవిగాక చైనా కంపెనీలు అనైతిక సబ్సిడీలు, భారీ ద్రవ్య అవకతవకల వంటివాటికి పాల్పడుతూ వస్తున్నాయి! నేను విధించిన సుంకాలపై ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సహించబోమని స్పష్టంగా హెచ్చరించా. వాటిపై అదనపు బాదుడు తప్పదని అప్పుడే స్పష్టం చేశా. చైనా ఇప్పుడు వాటిని రుచిచూడబోతోంది’’ అని ప్రకటించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం లేదు తన సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ పతనమవుతున్నా ట్రంప్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుతోందని ఆర్థిక నిపుణులంతా గగ్గోలు పెడుతున్నా అదేమీ లేదని చెప్పుకొచ్చారు. ఎవరేమన్నా సుంకాలపై తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలంటికీ అమెరికా గత పాలకులు, తమను ఇంతకాలంగా దోచేసిన చైనా వంటి దేశాలే కారణమని నిందించారు. ‘‘ఒక్కోసారి చేదుగా ఉన్నా చికిత్స తప్పదు. నా చర్యల ఫలితాలు ఇప్పటికే కని్పస్తున్నాయి. చమురు ధరలు దిగొచ్చాయి. వడ్డీ రేట్లూ తగ్గుముఖం పడుతున్నాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గుతున్నాయి. ఇక ద్రవ్యోల్బణం ఎక్కడున్నట్టు? పలు దేశాలు అమెరికాను ఇంతకాలం పీల్చి పిప్పి చేశాయి. ముఖ్యంగా చైనా! ఇప్పుడు చూడండి, నా టారిఫ్‌ల దెబ్బకు చైనా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇకపై అమెరికాకు ప్రతి వారం ఏకంగా బిలియన్ల కొద్దీ డాలర్లు వచి్చపడతాయి. చూసుకోండి’’ అంటూ స్పష్టం చేశారు.ఇక భారత్‌లోనే ఉత్పత్తి! యాపిల్, సామ్సంగ్ యోచన మొబైళ్ల తయారీ దిగ్గజాలు యాపిల్, సామ్సంగ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావాన్ని తప్పించుకునే మార్గాల అన్వేషణలో పడ్డాయి. తమ అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రాలను లాభదాయక ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నాయి. వియత్నాంపై 46 శాతం చైనాపై 34 శాతం చొప్పున సుంకాలు విధించిన ట్రంప్ భారత్‌పై 26 శాతంతో సరిపెట్టడం తెలిసిందే. దాంతో భారత్‌లో ఉత్పత్తిని వీలైనంతగా పెంచడంతో పాటు అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థలను వీలైనంత వరకూ ఇక్కడికి తరలించాలని యాపిల్, సామ్సంగ్ యోచిస్తున్నట్టు సమాచారం. యాపిల్ చాలాకాలంగా భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తోంది. ‘‘చైనాలో ఉత్పత్తిని వీలైనంతగా తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయానికి వచి్చంది. ఇకమీదట అమెరికాకు కేవలం భారత్‌లో తయారైన ఐఫోన్లనే పంపనుంది. ప్రస్తుతానికి చైనాలో తయారు చేసిన ఫోన్లను యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలకు పంపిస్తుంది’’ అని కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ వార్తలొస్తున్నాయి. అంతేగాక ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు అమెరికాలో ఐఫోన్ల ధరలు 40 శాతం దాకా పెరగవచ్చంటున్నారు. -
రెండు ఉపయోగకర పర్యటనలు
ప్రధాని మోదీ ఈ నెల మొదటి వారంలో రెండు ఉపయోగకరమైన విదేశీ పర్యటనలు జరిపారు. మొదటిది – 4వ తేదీన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ‘బిమ్ స్టెక్’ శిఖరాగ్ర సమావేశం కోసం. రెండవది – ఆ మరునాడు శ్రీలంకకు! ఈ రెండూ దేశ ప్రయోజనాలకు అవసరమైనవి కాగా, అద నంగా మరొకటి చెప్పుకోవాలి. బ్యాంకాక్‌లో ఆయన బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహా దారు మహమ్మద్ యూనుస్‌తో విడిగా సమావేశం కావటం.లుక్ ఈస్ట్ – యాక్ట్ ఈస్ట్వివిధ దేశాల మధ్య పరస్పర సహకారాలే కాకుండా ఒక ప్రాంతానికి చెందిన దేశాల మధ్య అందుకోసం ప్రాంతీయ సంస్థలు ఏర్పడటం ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత నుంచి ఉండగా, ఆ క్రమంలో ఇండియాకు సంబంధించి 1997లో వచ్చిందే ‘బిమ్స్టెక్’. ఇటువంటివి సార్క్, హిందూ మహాసముద్ర తీర దేశాల సంస్థల పేరిట కూడా ఏర్పడ్డాయి గానీ, కారణాలు ఏవైనా అవి సంతృప్తికరంగా పనిచేయలేదు. ఆగ్నేయాసియాకు సంబంధించి 1967 నుంచి గత 57 ఏళ్లుగా విజయవంతంగా పనిచేస్తున్నది ‘ఆసి యాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్) ఒక్కటే. ‘ఆసియాన్’ దేశాలన్నీ భారత్ కన్నా చాలా చిన్నవి. వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్నవే. ఆ పరిస్థితితో పోల్చినప్పుడు భారత్ కేంద్రంగా ఒక బలమైన ఆర్థిక సహకార వ్యవస్థ ఎప్పుడో ఏర్పడి బల పడ వలసింది. కానీ, విధానపరమైన లోపాల వల్ల ప్రభుత్వాలు కొంత కాలం అప్పటి సోవియట్ వైపు, తర్వాత పాశ్చాత్య ప్రపంచంవైపు చూశాయి గానీ చుట్టూ గల ఆసియా దేశాలను నిర్లక్ష్యం చేశాయి. ఈ వెనుకటి విధానాలకు భిన్నంగా మొదటిసారిగా ‘లుక్ ఈస్ట్’ పేరిట కొత్త విధానాన్ని ముందుకు తెచ్చింది, 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు. ఆ విధంగా కొత్త దృష్టి అయితే ఏర్పడింది గానీ, ఆయనే అమలుకు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, వాటి అవసరాలను బట్టి అయినా తూర్పు దేశాలతో ఆర్థిక సంబంధాలు తగినంత అభివృద్ధి చెందలేదు. పీవీ ఐదేళ్ల పాలన తర్వాత రాజకీయ అస్థిరతలు ఏర్పడటం అందుకొక ముఖ్య కారణం. అప్పటికీ, విదేశాంగ వ్యవహారాలలో నిపుణుడైన గుజ్రాల్ నేషనల్ ఫ్రంట్, యునై టెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల కాలంలో విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా పని చేసినపుడు 1997లో ‘బిమ్స్టెక్’ కోసం చొరవ తీసుకున్నారు.‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ– సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్’ పేరిట ఏర్పడిన ఆ సంస్థలో మొదట ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్ సభ్య దేశాలు కాగా, తర్వాత నేపాల్, భూటాన్, మయన్మార్ చేరాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత ‘లుక్ ఈస్ట్’ను ‘యాక్ట్ ఈస్ట్’గా మార్చి కొంత చురుకుదనం తెచ్చారు.సుదీర్ఘ అశ్రద్ధఇతర ఆసియా దేశాలతో కన్నా ‘బిమ్స్టెక్’ మధ్య సంబంధాలు మందకొడిగానే ఉన్నాయి. సంస్థ ఆర్థిక, రక్షణ సహకార విషయాలు అధికారుల స్థాయికి పరిమితం కాగా, ఈ నెల నాల్గవ తేదీ నాటి శిఖరాగ్ర సమావేశం ఏడేళ్ల తర్వాత జరగటం గమనించదగ్గది. ఏడు సభ్య దేశాలలో నేపాల్, భూటాన్ చిన్నవి, సముద్ర తీరం లేనివి అను కున్నా, తక్కిన అయిదు కూడా ముఖ్యమైనవి, సముద్ర తీరం గలవి. సముద్ర మార్గ రవాణాలు, రక్షణలకు కీలకమైన ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ రెండు అంశాలను ‘బిమ్స్టెక్’ లక్ష్యాలలో ప్రముఖంగా పేర్కొ న్నారు కూడా! అయినప్పటికీ ఇంతకాలం కనిపించిన అలసత్వ వైఖరులు వాటికవే సరైనవి కాదు. ఈ పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లతో చైనా సన్నిహితమయ్యింది. అనగా, ఇండియాకు భౌగోళికంగా దగ్గరగా ఉండి, బంగాళాఖాత తీర ప్రాంతానివి అయి కూడా భారత్ వాటిని ‘బిమ్ స్టెక్’ ఏర్పాటు తర్వాత సైతం దగ్గర చేసుకోలేక, చైనాతో పోటీపడాల్సి వస్తున్న దన్నమాట. సంస్థలోని తక్కిన దేశాలకన్న భారత ప్రయోజనాలు విస్తృతమైనవి కావటం, బంగాళాఖాతం కీలక ప్రాంతంలో, అందులోనూ హిందూ మహాసముద్రానికి అనుసంధానమై ఉండ టాన్ని బట్టి అటువంటి చొరవలు ఇండియాకే ఎక్కువ అవసరం. అయినా సుదీర్ఘ కాలం అశ్రద్ధలన్నవి ఎంత పొరపాటో చెప్పనక్కర లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తిరిగి శిఖరాగ్ర సమావేశం జరగటం మంచి పని. ట్రంప్ సుంకాల హెచ్చింపు చర్యలు సృష్టిస్తున్న ఒత్తిడుల మధ్య జరగటం మరింత మంచిదవు తున్నది. సమావేశంలో చర్చించిన ఆర్థిక సహకారం, అభివృద్ధి, శాస్త్ర–సాంకేతిక రంగాలు, రక్షణ వంటి అంశాలు షరా మామూలువే అయినా, ‘ప్రపంచంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా పరస్పర అభివృద్ధిపై దృష్టి పెట్టడం’ అన్నది ప్రత్యేకంగా గమనించ వలసిన ప్రకటన. బంగ్లా, లంకలతో సంబంధాలుపోతే, ఇదే సంస్థలోని పొరుగు దేశమైన బంగ్లా నాయకునితో మోదీ సమావేశం, సంబంధాల పునరుద్ధరణకు దారితీసినట్లయితే ఉభయులకూ మేలు చేస్తుంది. ఇండియా జోక్యంతో 1971లో ఏర్ప డిన ఆ దేశంతో సంబంధాలు ఈ 55 ఏళ్ళలో తరచూ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాని షేక్ హసీనా పతనం నుంచి కొద్ది నెలలుగా తిరిగి అదే పరిస్థితి తలెత్తింది. ఈ నాయకులిద్దరూ బ్యాంకాక్‌లో అసలు విడిగా సమావేశమవుతారా అనే సందేహాలుండేవి. కానీ, భారత ప్రధానికి అందజేసేందుకు బంగ్లా నాయకుడు జ్ఞాపక చిహ్నంగా ఒక పాత చిత్రాన్ని వెంట తీసుకువచ్చారంటేనే సామరస్య వైఖరి కనిపిస్తున్నది. బంగ్లాలో త్వరలో జరుగనున్న ఎన్నికలలో ఎవరు అధికారానికి రాగలదీ తెలియదు. ఇండియా మిత్ర పక్షమ నుకునే షేక్ హసీనా ‘అవామీ లీగ్’కు మాత్రం అవకాశాలు కన్పించటం లేదు. ఇండియాలో అనధికార శరణార్థి రూపంలో ఉన్న ఆమెను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని బ్యాంకాక్‌లో మోదీని బంగ్లా నాయకుడు మరొకమారు కోరారు. ఇరు దేశాల సంబంధాలలో ఇదొక చిక్కు ప్రశ్న. అక్కడ హిందువులపై దాడుల సమస్య అట్లానే ఉంది. వీటన్నింటినీ అధిగమిస్తూ ‘బిమ్స్టెక్’ లక్ష్యాల వైపు కదలటం రెండు దేశాలకూ పెద్ద పరీక్షే. కానీ ఉత్తీర్ణత సాధించక తప్పని పరీక్ష. శ్రీలంక విషయానికి వస్తే, భౌగోళికతలు, ఆర్థిక, రక్షణ అవస రాలు, పరస్పర సహకారాలు, విభేదాలు అన్నింటి విషయాలలోనూ ఇండియా సంబంధాలు బంగ్లాదేశ్‌ను పోలి ఉండటం యాదృచ్ఛికమే కావచ్చు. అక్కడ సరికొత్త శక్తులు పూర్తి మెజారిటీలతో గెలిచి అధికారానికి రావటంతో పరిస్థితులు మారాయి. కొత్త అధ్యక్షుడు దిస్సనాయకే, దేశంలో నెలకొని ఉన్న సమస్యలు, వాటి నుంచి బయటపడి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే పట్టుదల వల్ల, భారతదేశంతో గతంలో ఉండిన విభేదాలను మరచిపోయి పరస్పర సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు. చైనాకు ఎంత సన్నిహితమైనా, తమ విధానం సంతులనమని కొత్తలోనే ప్రకటించటం, చైనా కన్న భారత్‌ను మొదట సందర్శించటం దిస్సనాయకే దౌత్యనీతికి రుజువులు. మోదీ సందర్శన సందర్భంగా ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద స్వాగతం చెప్పిన అసాధారణ చర్య, ఆయనకు ‘మిత్ర విభూషణ’ పురస్కారం, తమ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించనివ్వబోమన్న హామీ ఇదే కోవలోకి వస్తాయి. వివిధ ఆర్థిక, రక్షణ ఒప్పందాలు రెండు వైపుల నుంచి సజావుగా అమలైతే, ట్రంప్ ఆవిష్కరిస్తున్న కొత్త ప్రపంచపు సాధక బాధకాలను సమష్టిగా ఎదుర్కొన వీలవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు.. ఆసియా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. అయినా కూడా వాణిజ్య సుంకాల విషయంలో తన నిర్ణయమే కరెక్ట్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ‘‘సవరించేదే లే..’’ అని భీష్మించుకుని కూర్చున్నారు. అయితే అమెరికా సహా ప్రపంచ దేశాల మార్కెట్లు కుదేలు అవుతున్న వేళ తాజాగా మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారాయన. వాషింగ్టన్: ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald rump) తోసిపుచ్చారు. ట్రూత్ సోషల్‌లో ఆయన చేసిన తాజా పోస్ట్ సారాంశం.. ‘‘ చమురు ధరలు తగ్గాయి, వడ్డీ రేట్లు తగ్గాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గాయి. కాబట్టి ద్రవ్యోల్బణం లేదు. చాలాకాలంగా అన్యాయానికి గురైన అమెరికా, ప్రతీకార సుంకాల ద్వారా సంబంధిత దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తీసుకు వస్తోందని అన్నారాయన. అన్నింటికంటే.. అతిపెద్ద దుర్వినియోగదారు దేశమైన చైనా(China) మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, ఆ దేశంపై సుంకాలను 34% పెంచినప్పటికీ.. ప్రతీకారానికి దిగొద్దన్న నా హెచ్చరికను పట్టించుకోలేదు. అమెరికా గత నాయకుల వల్లే దశాబ్దాలుగా వాళ్లు అడ్డగోలుగా సంపాదించున్నారు. ఇక.. అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దండి! అని పోస్ట్ చేశారాయన. ఇదిలా ఉంటే.. అమెరికా వేసిన సుంకాలకు దీటుగా స్పందించిన చైనా (China) అక్కడి నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా (USA) విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా ఆరోపించింది. ఏకపక్షంగా, ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ క్రమంలో.. వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్‌లను (US tariffs) విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు ఇది వర్తిస్తుందని, ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని చైనాకు చెందిన ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. చైనా భయపడిందని, తప్పు నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘చైనా తప్పిదం చేసింది. వాళ్లు భయాందోళనకు గురయ్యారు. వారికి మరో మార్గం లేదు’’ అని అన్నారాయన. -
చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించారు. ఆ తరువాత చైనా.. యూఎస్ఏ మీద 34 శాతం ప్రతీకార సుంకం ప్రకటించింది. దీంతో బంగారం ధర సుమారు రూ. 2,800 లేదా రెండు శాతం తగ్గింది.అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ సమయంలోనే బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని కమోడిటీ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.అమెరికా, చైనాతో సహా ఇతర దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా.. బంగారం ధరల ర్యాలీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నదని ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు 'సుగంధ సచ్‌దేవా' పేర్కొన్నారు. అయితే అమ్మకాలు మాత్రమే స్థిరంగా కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్ఇండియన్ మార్కెట్లో బంగారం ధరలు రూ. 83,100 (22 క్యారెట్ 10 గ్రామ్స్), రూ. 90,660 (24 క్యారెట్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గుముఖం పట్టాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
టారిఫ్‌లు సబబే: ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. వాటి ఫలితాలు చరిత్రాత్మకంగా ఉంటాయని చెప్పుకున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార సుంకాల నేపథ్యంలో శనివారం ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికా ఇక ఎంతమాత్రమూ మౌనంగా, నిస్సహాయంగా ఉండబోదని కుండబద్దలు కొట్టారు. ‘‘అమెరికాను చైనా సుంకాలతో గట్టిగా దెబ్బ కొట్టింది. నిజానికి మాపై చైనా సుంకాలతో పోలిస్తే ఆ దేశంపై నేను విధించిన టారిఫ్ ఏ మూలకూ కాదు. చాలా దేశాలు అమెరికా పట్ల ఇంతకాలం ఇలాగే వ్యవహరించాయి. ఇది ఇకపై సాగదు. మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగాలు, వ్యాపారాలను అమెరికాకు తిరిగి తీసుకొస్తున్నాం. ఇప్పటికే ఐదు లక్షల డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అవి మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక విప్లవంలో మనం గెలుస్తాం. అయితే ఈ ప్రక్రియ అంత సులువు కాదు. ఈ పునరుద్ధరణకు అమెరికన్లు సహకరించాలి. సమస్యలను తట్టుకొని నిలబడగలగాలి. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం’’అని తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. తమ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. -
అగ్గిపెట్టె కనిపెట్టింది ఎప్పుడో తెలుసా?
ఇప్పుడంటే నిప్పు వెలిగించడానికి అగ్గిపెట్టె వాడుతున్నాం. అగ్గిపెట్టె (Matchbox) లేని కాలంలో నిప్పు పుట్టించడం చాలా టఫ్ విషయం అని మీకు తెలుసా? రాళ్లను మరో రాళ్లతో కొట్టి, కర్రలను మధించి నిప్పు పుట్టించేవారు. ఒకరి ఇంట్లో నిప్పు (Fire) కావాలంటే పక్కింట్లో నుంచి నిప్పు కణికల్ని తీసుకెళ్లేవారు. అగ్గిపెట్టె వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు తీరాయి.క్రీస్తుశకం 577 నుంచే చైనాలో రాజవంశానికి చెందిన స్త్రీలు నిప్పు కోసం కొన్ని ప్రత్యేకమైన కర్రల్ని వాడేవారని, వాటికి రసాయనాలు పూసి నిప్పు పుట్టించేవారని చరిత్రకారులు అంటున్నారు. చరిత్రలో అవే తొలి అగ్గిపుల్లలని వారు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో అప్పటి శాస్త్రవేత్తలు గ్యాస్ (Gas) ఆధారంగా నిప్పు పుట్టించే ప్రయోగాలు చేశారు.1832లో లండన్‌లో తొలిసారి సిగార్లు వెలిగించుకునేందుకు కర్రతో పుల్లలు తయారు చేసి వాటి చివరన రసాయనాలను అంటించారు. ఇవి చాలా ఉపయోగకరంగా ఉండటంతో వీటిపై మరిన్ని ప్రయోగాలు జరిగి, చివరకు ఇవాళ మనం చూస్తున్న అగ్గిపెట్టెలు అవతరించాయి. భలే ఉందిగా అగ్గిపెట్టె పుట్టుక. -
ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
వాషింగ్టన్: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్‌చుప్‌గా ఆసియా రీజియన్‌లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్‌లోని యూఎస్-బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా రన్‌వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్ సిగ్నల్స్ కూడా అందకుండా.. షెల్టర్‌లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్ రీజియన్‌లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్‌లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్ఎస్ నిమిట్జ్హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్, యెమెన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్‌ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్‌పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ వద్ద యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారీయర్‌ను, మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది. -
అంతకు మించి...!
బీజింగ్: తెంపరి ట్రంప్ తెర తీసిన టారిఫ్‌ల యుద్ధం అప్పుడే ముదురు పాకాన పడుతోంది. అమెరికా అధ్యక్షుని సుంకాల బాదుడుపై ప్రపంచ దేశాలు దీటుగా స్పందిస్తున్నాయి. అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు కెనడా గురువారమే ప్రకటించడం తెలిసిందే. శుక్రవారం చైనా కూడా అదే బాట పట్టింది. అమెరికాపై 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు చైనా ఆర్థిక శాఖ ప్రకటించింది. అగ్ర రాజ్యపు ఉత్పత్తులపై ఇప్పటికే అమల్లో ఉన్న సుంకాలకు ఇవి అదనం. తమ నుంచి చైనా ఏకంగా 54 శాతం సుంకాలు వసూలు చేస్తోందని ట్రంప్ బుధవారం ఆక్షేపించడం తెలిసిందే. అందుకే ఆ దేశంపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అవి ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆలోపే అమెరికాపై తానూ అంతే మొత్తం సుంకాలు విధించడం ద్వారా డ్రాగన్ దేశం దెబ్బకు దెబ్బ తీసింది. టారిఫ్ పోరులో తగ్గేదే లేదని స్పష్టం చేసింది. అంతటితో ఆగలేదు! అమెరికాకు అత్యవసరమైన పలు అరుదైన ఖనిజాల ఎగుమతులపైనా నియంత్రణలు ప్రకటించింది. సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం వంటి పలు ఖనిజాలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనా నిర్ణయంతో అమెరికా రక్షణ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఆయా ఖనిజాల కోసం చైనా దిగుమతులపైనే భారీగా ఆధారపడుతుండటమే ఇందుకు కారణం. వీటికి తోడు 16 అమెరికా కంపెనీలకు పలు ‘డ్యుయల్ యూజ్’ వస్తువుల ఎగుమతులను పూర్తిగా నిలిపేయాలని కూడా చైనా నిర్ణయించింది. చైనాకు ఎలాంటి ఎగుమతులూ చేయకుండా మరో ఆరు అమెరికా కంపెనీలపై నిషేధం విధించింది. అమెరికా, భారత్ నుంచి దిగుమతైన మెడికల్ సీటీ ట్యూబులపై యాంటీ డంపింగ్ దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. తాజా సుంకాలు, ఖనిజ ఎగుమతులపై ఆంక్షలు ఏప్రిల్ 4 నుంచే అమల్లోకి రానున్నట్టు చైనా ప్రకటించింది. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. ‘‘చైనాది తొండాట. మా దెబ్బతో వారు గాభరా పడిపోయారు. దాంతో చేయకూడని పనులు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. అయితే తన నిర్ణయాలు, విధానాలు మారబోవని కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు తన సోషల్‌మీడియా హ్యాండిల్ ట్రూత్‌లో పోస్టులు పెట్టారు.డబ్ల్యూటీఓలో చైనా దావాచైనాపై ట్రంప్ ఇప్పటికే 20 శాతం సుంకాలు విధించడం తెలిసిందే. బుధవారం నాటి వడ్డింపులతో అవి ఏకంగా 54 శాతానికి 64 శాతానికి చేరాయి. దీనిపై చైనా తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థలో దావా వేసింది. -
ఈ సుంకాలతో లాభనష్టాలు
భారత్ ఎగుమతులపై అమెరికా 26 శాతం దిగుమతి సుంకాన్ని విధించడం ఆర్థిక ఆందో ళనలకు దారి తీసింది. భారత్‌తో పోల్చిన ప్పుడు అధికంగా చైనాపై 40–60 శాతం (కొన్ని ఉత్పత్తులపై 100 శాతం వరకు), వియత్నాంపై 30–45 శాతం, థాయ్‌లాండ్‌పై 35–50 శాతం దిగుమతి సుంకాలను అమె రికా విధించింది. భారత్‌కన్నా తక్కువగా యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధించింది.అమెరికా వాదన2024లో అమెరికాకు సంబంధించి భారత్ ఎగుమతుల విలువ 91.23 బిలియన్ డాలర్లు. భారత్ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 18 శాతం. ఇదే సంవత్సరం అమెరికా ఉత్పత్తుల దిగుమతులలో భారత్ వాటా 2.6 శాతం. మొత్తంగా భారత్‌తో వాణి జ్యానికి సంబంధించి అమెరికా వాణిజ్య లోటు 2023–24లో 45.7 బిలియన్ డాలర్లు కాగా, 2024–25 (జనవరి వరకు) 22.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అమెరికాకు సంబంధించిన పాసింజర్ వాహనాలపై 70 శాతం, యాపిల్స్‌పై 50 శాతం, ఆల్కహాల్‌పై 100 –150 శాతం దిగుమతి సుంకాలను భారత్ విధిస్తున్నప్పుడు, ప్రస్తుతం భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం సమంజసమేనని అమెరికా వాదిస్తున్నది. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య నియమావళికి విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తున్నదని అమెరికా భావిస్తున్నది.దిగుమతి సుంకాల పెంపు కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు చైనా, థాయ్‌లాండ్‌కు సంబంధించిన ముఖ్య సూచీల లోనూ క్షీణత ఏర్పడింది. 2023–24లో అమెరికాతో వాణిజ్యంలో చైనా మార్కెట్ వాటా 21.6 శాతం కాగా, వియత్నాం వాటా 19.3 శాతంగా, భారత్ వాటా 6 శాతంగా నిలిచింది. వివిధ దేశాలపై అమె రికా దిగుమతి సుంకాల పెంపు కారణంగా చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు భారత్ ఎగుమతులలో పోటీతత్వం పెరుగుతుందని భావించవచ్చు.సగటు అమెరికా దిగుమతి సుంకాల కారణంగా– భారత్‌లో రొయ్యలు, వస్త్రాలు, స్టీల్ రంగాలపై; చైనాలో సోలార్ పానల్స్, సెమీ కండక్టర్, స్టీల్, ఎలక్ట్రిక్ వాహనాలపై; వియత్నాంలో ఫుట్‌వేర్, ఎల క్ట్రానిక్స్, ఫర్నీచర్‌పై; థాయ్‌లాండ్‌లో ఆటో పరికరాలు, రబ్బరు ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని అంచనా.భారత్‌పై ప్రభావంప్రాథమిక కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరిక రాలు, ఫార్మా ఉత్పత్తులు, విలువైన రాళ్ళు భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మార్చి 2025లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకొనే చర్యలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై భారత్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వలన రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుతుంది. ఆసియా ఖండంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు సౌరవిద్యుత్, ఫార్మాసూటికల్స్, టెక్స్టైల్స్ – అప్పారెల్ రంగాలలో భారత్‌కు అధిక ప్రయోజనం ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ – అప్పారెల్ రంగాలకు సంబంధించి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగు మతి సుంకాల నిర్ణయం కారణంగా అమెరికా మార్కెట్లో ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్‌కు పోటీ తగ్గుతుంది. చైనాకుసంబంధించిన సౌర ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం కారణంగా చైనా సౌర ఉత్పత్తుల ధరలు పెరగడం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. చైనాపై అమెరికా అధికంగా ఆధార పడటం తగ్గి భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠమయ్యే అవకాశం ఉంది.భారత్ నుండి రొయ్యల ఎగుమతుల విలువ రూ. 22,000 కోట్లు కాగా, ఈ మొత్తంలో అమెరికా వాటా 44 శాతంగా ఉంది. ప్రస్తుతం అధిక సుంకాల కారణంగా భారత్ నుండి అమెరికా రొయ్యల ఎగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు సంబంధించి అమెరికాలో భారత్ మార్కెట్ వాటా తగ్గుతుంది. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భారత్‌లో అనేక సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు హ్యాండిక్రాఫ్ట్ గార్మెంట్స్ ఎగుమ తులపై అధికంగా ఆధారపడ్డాయి. అధిక సుంకాల నేపథ్యంలోఎం.ఎస్.ఎం.ఇ. సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. తద్వారా ఆ యా సంస్థలలో లే ఆఫ్ కారణంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది.సిద్ధించే ప్రయోజనాలుఅమెరికా దిగుమతి సుంకాలను ముఖ్యంగా వస్తువులపై విధించినందువలన భారత్‌లో పటిష్ఠంగా ఉన్న ఐటీ, సేవల రంగంపై ఈ ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. భారత్ నుండి సాఫ్ట్వేర్ సర్వీ సులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ, బిజినెస్ అవుట్ సోర్సింగ్‌కు సంబంధించి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ వస్తువులకు సంబంధించి భారత్‌తో పోల్చినప్పుడు చైనా, యూరప్లపై అధిక సుంకాలు విధించిన కారణంగా అమెరికా కొనుగోలుదారులు భారత్ ఇంజినీరింగ్ ఉత్పత్తులపై దృష్టి సారించే వీలుంది. దానివల్ల భారత్ ఎగుమతులలో పెరుగుదల ఏర్పడుతుంది.చైనా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాల కారణంగా బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తిని భారత్‌లో చేపట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవ కాశం ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే అమలులో ఉన్న ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్ స్కీమ్’ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం) కారణంగా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, సెమీ కండక్టర్లకు సంబంధించిన సంస్థలు భారత్‌లో అధికంగా ఏర్పాటవుతాయి. తద్వారా భార త్లో పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతుల విలువలో పెరుగు దల కనబడుతుంది. అది స్థూల దేశీయోత్పత్తిలో కూడా పెరుగు దలగా ప్రతిఫలిస్తుంది.అమెరికా దిగుమతి సుంకాల కారణంగా ఇతర దేశాల వ్యవ సాయ ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఏర్పడుతుంది. తద్వారా భారత్ నుండి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడంతోపాటు భారత్ ఎగుమతుల విలువలో పెరుగుదల ఏర్పడుతుంది. ఎగుమతుల పరంగా ఇబ్బంది ఎదుర్కొనే నేపథ్యంలో (కొన్ని ఉత్పత్తులకు సంబంధించి) భారత్ లోని ఉత్పత్తి స్వదేశీ డిమాండ్‌ను తీర్చడానికి ఉపకరిస్తుంది. ఈ స్థితి దేశంలో కొన్ని ఉత్పత్తుల కొరతను నివారించడం ద్వారా సాధారణ ధరల స్థాయి తగ్గుదలకు దారితీస్తుంది.చేయాల్సిందిఅయితే, అమెరికా ఆటో పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఒత్తిడిని భారత్ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించు కోవాలి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలతో భారత్ నూతన వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.-వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐ.ఎఫ్.హెచ్.ఇ., హైదరాబాద్- డా‘‘ తమ్మా కోటిరెడ్డి -
చైనా భయపడింది.. తప్పు చేసింది: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: తమ దిగుమతులపై 34 శాతం టారిఫ్ విధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. వారు తప్పు చేశారంటూనే దాన్ని చైనా అమలు చేయలేదన్నారు. ఇంకా చైనా భయపడిందంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో చైనా విధించిన టారిఫ్ ల పై స్పందించారు ట్రంప్ఏప్రిల్ 10వ తేదీ నుంచి అన్ని యూఎస్ వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు చైనా పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. చైనాతో సహా అనేక దేశాలపై ట్రంప్ సుంకాలను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత చైనా ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. చైనా వస్తువులపై అదనంగా 34 శాతం సుంకాలను అమెరికా విధించిన నేపథ్యంలో.. చైనా కూడా ప్రతీకార చర్యల్లో భాగంగా అంతే శాతాన్ని అమెరికా వస్తువులపై విధిస్తున్నట్లు ప్రకటించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కల్గిన దేశాల మధ్య టారిఫ్ వార్..!చైనా నుంచి దిగుమతులపై అదనంగా విధించిన అదే 34 శాతం పన్నును ప్రస్తుతం చైనా.. తిరిగి అమెరికాపై సుంకాలుగా ప్రకటించడంతో ఇది చర్చకు దారి తీసింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కల్గిన ఈ దేశాల మధ్య ఉద్రిక్త వాతావారణానికి దారితీసినట్లయ్యింది. అమెరికా, చైనాలు ఎవరికి వారే వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది టారిఫ్ లకే పరిమితం అవుతుందా.. లేక విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందా అనేది ప్రజల్లో తలెత్తున్న ప్రశ్న. అమెరికా విధిస్తున్న సుంకాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
చైనా అధీనంలో 4 వేల చ.కి.మీ. భూభాగం
న్యూఢిల్లీ: నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు మనం భారత్– చైనా దౌత్య సంబంధాల వజ్రోత్సవాలను జరుపుకొంటున్నామని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ గురువారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కొత్త టారిఫ్‌లు భారత ఆర్థికవ్యవస్థ నడ్డి విరుస్తాయని పేర్కొన్నారు. చైనా దురాక్రమణ, అమెరికా టారిఫ్‌లపై కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘చైనా ఒకవైపు 4,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు కొద్దికాలం కిందట మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చైనా రాయబారితో కలిపి కేక్ కట్ చేశారు. ఇది చూసి నేను నివ్వెరపోయా. చైనా ఆక్రమించిన నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం సంగతేమిటి? అక్కడ ఏం జరుగుతోంది?’ అని రాహుల్ నిలదీశారు. గాల్వాన్ లోయలో ఘర్షణలను ఉటంకిస్తూ 20 మంది భారత జవాన్లు అమరులయ్యారని గుర్తుచేశారు. ‘ఒకవైపు వీరి త్యాగం.. మరోవైపు కేక్ కట్ చేసి (చైనా రాయబారితో కలిసి) సంబరాలు జరుపుకుంటున్నాం. ఏమిటిది? చైనా తో సరిహద్దుల్లో సాధా రణ పరిస్థితులు నెలకొ నడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ దానికి మునుపు యథా తథస్థితిని పునరుద్ధరించాలి’ అని రాహుల్ గాంధీ పేర్కొ న్నారు. ‘మొదట మన భూభాగాన్ని తిరిగిపొందాలి. ఆక్రమిత భూభాగానికి సంబంధించి రాష్ట్ర పతి, ప్రధానమంత్రులు చైనాకు లేఖలు రాశారని నా దృష్టికి వచ్చింది. ఈ విషయం మనవాళ్ల ద్వారా తెలియలేదు. భారత్‌లోని చైనా రాయబారి లేఖల విషయాన్ని చెప్పారు’ అని రాహుల్ అన్నారు. సమర్థ విదేశీ విధానం అంటే విదేశాలతో సమాన స్థాయిలో సంబంధ బాంధవ్యాలను నెరపడం. ఒకవైపు చైనా మన 4 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు అమెరికా అకస్మాత్తుగా భారత్‌పై టారిఫ్‌లు విధించింది అని కాంగ్రెస్ నేత పేర్కొ న్నారు. అమెరికా టారిఫ్‌లు భారత్‌కు శరాఘా తమని అభిప్రాయపడ్డారు. మన ఆటోమొబైల్ రంగం, ఫార్మా పరిశ్రమ, వ్యవసాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. -
‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’
న్యూఢిల్లీ,సాక్షి: లోక్‌సభలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 4వేల స్కైర్ కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. మన భూముని మనం తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ దిగువ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘భారత్ భూభాగంలో ఏం జరుగుతోంది నాకు అర్ధం కావడం లేదు. చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించింది. మన భూమి మనకు వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు .. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు లేఖ రాయాలి. చైనా 4వేల స్కైర్ కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించుకుంది. ఈ విషయం నన్ను మరింత షాక్‌కు గురిచేసింది. మన భూమిని మనం ఎలా తిరిగి స్వాధీనం చేసుకోవాలి? అని ఆలోచించాల్సి ఉంది. అలా చేయడం లేదు. భారత విదేశాంగ కార్యదర్శి చైనా రాయబారితో కలిసి కేక్ కట్ చేస్తున్నారు. చైనా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. చైనాను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై కేంద్రం సభలో ప్రకటన చేయాలి. భారత్‌పై అమెరికా 26శాతం సుంకాలు విధించింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి’ అని అన్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. రాహుల్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎవరి కాలంలో ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తీసుకుంది? డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా అధికారులతో సూప్ తాగిన వ్యక్తులు ఎవరు? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనీయుల నుండి డబ్బు ఎందుకు తీసుకుంది?’ అని అడిగారు. అలాంటి వారికి నేను ఒక్కటే చెబుతున్నా.. భారత్ భూభాగాన్ని చైనా ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు. ఈ తరహా రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రాహుల్‌కు హితువు పలికారు. -
భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
గువాహటి/ఇంఫాల్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు ముహమ్మద్ యూనుస్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.చైనా పర్యటన సందర్భంగా యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా యూనుస్.. ‘సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణావకావం. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చు. ఇక్కడ విస్తరించి, ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు’ అని అన్నారు.దీంతో, పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చైనాతో దోస్తీకి అర్రులు చాచే యూనుస్ ఏ అర్హతతో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెస్తారు?’ అని నేతలు మండిపడ్డారు. త్రిపురలో ముఖ్యమైన తిప్రా మోతా పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ దేబర్మా మాణిక్య ఘాటుగా స్పందించారు. ‘ఇరుకైన చికెన్ నెక్ కారిడార్‌లో భారత సైన్యం మోహరింపు, పటిష్టమైన భద్రతపై దృష్టిపెట్టడంతోపాటు ఈసారి ఏకంగా బంగ్లాదేశ్‌ను నిలువుగా చీల్చి ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గాన్ని ఏర్పాటుచేయాలి. అసలు 1947 బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం మన చేతికొచ్చినా త్యజించడం ఆనాడు చేసిన పెద్ద తప్పు’ అని ప్రద్యోత్ అన్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర పరిణామాలు ఊహించకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని యూనుస్‌కు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ హితవు పలికారు. ‘భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారడం శోచనీయం. ఏ దేశం విమోచన కోసం భారత్ పోరాడింతో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపడం దారుణం’ అని అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ)అధ్యక్షుడు, జొర్హాట్ ఎంపీ లురిన్ జ్యోతి గొగోయ్ అన్నారు. భారత విదేశాంగ విధానం ఎంత బలహీనపడిందో యూనుస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శించింది. -
ఏనుగు–డ్రాగన్ ‘ట్యాంగో’ చేయాలి
బీజింగ్: భారత్, చైనా దేశాలు కలిసికట్టుగా పని చేయాలని చైనా అధినేత జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు మనమంతా చేతులు కలపాలని సూచించారు. ప్రాథమిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏనుగు–డ్రాగన్ కలిసి ‘ట్యాంగో’డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న సందర్భంగా భారత్‌కు ఆయన మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్‌పింగ్ ఒక సందేశం పంపించారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలని గుర్తుచేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆధునీకరణ ప్రయత్నాల్లో ఇరుదేశాలూ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు జిన్‌పింగ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి, భారత్–చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి భారత్‌లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జిన్‌పింగ్ సందేశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందించారు. స్థిరమైన సేŠన్హ సంబంధాలు, ద్వైపాక్షిక భాగస్వామ్యం మన రెండు దేశాలతోపాటు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తాయని వివరించారు. భారత్–చైనా సంబంధాలను మరింత ఉన్నత స్థానానికి చేర్చడానికి ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా ఉపయోగించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా ప్రధాని లీ ఖెకియాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సైత పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. -
భూకంప శిథిలాల నుంచి కీలక పత్రాల చోరీ?
బ్యాంకాక్: థాయ్‌లాండ్ భూకంప సహాయక చర్యల్లో.. కొత్త కోణం వెలుగు చూసింది. రాజధాని బ్యాంకాక్(Bangkok Building Collapse)లోని 33 అంతస్థుల భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రమాద స్థలి నుంచి కొన్ని పత్రాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కొందరు ప్రయత్నించగా.. సహాయక బృందాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయగలిగారు. అయితే ఆ ఐదుగురు చైనాకు చెందిన వాళ్లు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చైనా(China)కు చెందిన రైల్వే నంబర్ 10 కంపెనీ 2018లో థాయ్‌లాండ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. హౌజింగ్ సొసైటీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఇతర బడా కాంట్రాక్టులను ఈ కంపెనీ స్థానిక కంపెనీలతో జాయింట్ వెంచర్‌గా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో థాయ్‌లాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం సుమారు 58 బిలియన్ డాలర్లతో మూడేళ్ల కిందట పనులు చేపట్టారు.తాజా భూకంపం(Earthquake) ధాటికి నిర్మాణంలో ఉన్న ఆ భవనం కుప్పకూలిపోగా.. శిథిలాల నుంచి ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇంతకంటే ఎక్కువ ఎత్తులో భవనాలకు ఏం కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజైనింగ్‌లో లోపాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాల నడుమే.. థాయ్‌లాండ్ ఉప ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ సైతం ప్రమాద స్థలిని సందర్శించి దర్యాప్తునకు ఆదేశించారు. ఈలోపు.. ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన పత్రాలను దొంగిలించేందుకు యత్నాలు జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. భవన శిథిలాల వద్దకు ఆదివారం ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా లోనికి ప్రవేశించారు. శిథిలాల నుంచి కొన్ని పత్రాలను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా రెస్క్యూ టీంలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పాయి. వారిని ప్రశ్నించగా.. చైనా దేశస్థులని తెలిసింది. అయితే.. అందులో ఒకరు తాను ప్రాజెక్ట్ మేనేజర్ అని, బీమా క్లెయిమ్ చేసుకోవడం కోసం సంబంధిత పత్రాలు తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఈ కంపెనీ ‘నాసిరక నిర్మాణాల’తో వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆయా ఘటనలతో ప్రమాదవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలను ఈ చైనా కంపెనీకి అప్పగించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక శుక్రవారం మధ్యాహ్నాం మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి.. పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ భారీగా భూమి కంపించింది. రాజధాని బ్యాంకాక్‌లో పలు భవనాలు కుప్పకూలిపోవడంతో.. ఇప్పటిదాకా 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. -
మన దగ్గరే 'బంగారు' కొండ
సాక్షి, స్పెషల్ డెస్క్: సుమారు 25,000 టన్నులు.. భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఇవి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. బంగారం అంటే మన వాళ్లకు అమితపైన ప్రేమ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండొచ్చు అనే కదా మీ ఆలోచన. అసలు విషయం చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల (ఆర్బీఐలాంటి సెంట్రల్ బ్యాంక్స్) వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ తాజా నివేదికలో వెల్లడించింది. భారతీయుల కుటుంబాల్లో ఉన్న ‘బంగారు కొండ’ ఏపాటితో దీనిని బట్టి అర్థం అవుతుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రాధాన్య ఆస్తిగా మనవారు ఆధారపడిన విధానాన్ని ఈ కొండ నొక్కి చెబుతోంది. భారతీయులు పసిడిని ఇలా విస్తారంగా కూడబెట్టుకోవడం దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో పుత్తడికి ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం.ప్రత్యామ్నాయంగా పుత్తడి..యూఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాలు ఈ టాప్–10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉందంటే.. పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ యెల్లో మెటల్ ఎంతటి కీలకపాత్ర పోషిస్తోందో అవగతం అవుతుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉందనడంలో సందేహం లేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ విలువల హెచ్చుతగ్గులకు దీనిని ఒక విరుగుడుగా ప్రజలు భావిస్తున్నారు. వివాహాలు, పండగలు, మతపర వేడుకలు గోల్డ్ డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. బ్యాంకుల్లో పొదుపు చేస్తే వచ్చే వడ్డీ కంటే బంగారం కొనుగోలు ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందవచ్చన్నది ప్రజల మాట. అందుకే అత్యధిక కుటుంబాల్లో బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా పుత్తడి అవతరించింది. సెంట్రల్ బ్యాంక్స్ సైతం..ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. ఆర్థిక అస్థిరతల నుంచి రక్షణ ఇచ్చే సాధనం బంగారమేనని ఇవి భావిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2024 డిసెంబర్ నాటికి ఆర్బీఐ వద్ద 876.18 టన్నుల నిల్వలు పోగయ్యాయి. తొలిస్థానంలో ఉన్న యూఎస్ఏ 8,133 టన్నులు, రెండోస్థానంలో ఉన్న జర్మనీ వద్ద 3,352 టన్నుల నిల్వలు ఉన్నాయి. -
భూకంపంలో శిశువులను కాపాడిన నర్సులు.. హ్యట్సాప్ అంటూ ప్రశంసలు
మయన్మార్‌లో భూకంప విలయం (Earthquake) కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు.మరోవైపు.. భూకంపం సందర్బంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని ఒక చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. భూకంపం సందర్భంగా ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చిన్న పిల్లలను నర్సులు కాపాడారు. భూకంపం ధాటికి భవనంలో కుదుపులు ఎదురైనప్పటికీ వారు కింద పడిపోతున్నా.. ఆసుపత్రిలో ఉన్న శిశువుకు ప్రమాదం జరగకుండా నర్సులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో నర్సు ప్లోర్‌పై కూర్చుని శిశువును పట్టుకుంది. ఎంతో కష్టం మీద కన్న తల్లిలాగా శిశువులను కాపాడారు. ఈ క్రమంలో నర్సుల కష్టంపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు.ఇదిలా ఉండగా.. మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.Nurses in SW China protect newborn babies during earthquake in Myanmar #ChinaBuzz pic.twitter.com/Yixj3pCtZE— CGTN (@CGTNOfficial) March 30, 2025ప్రపంచ దేశాల ఆపన్న హస్తం..ఈ కష్ట సమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్ వెల్లడించారు.Terrifying CCTV video of yesterdays M7.7 earthquake that hit Myanmar. The death toll is at least 1,644, with 3,408 people injured. Numbers are expected to rise. pic.twitter.com/5fAXXXpVDl— Volcaholic 🌋 (@volcaholic1) March 29, 2025 Nature doesn’t care about our strength, borders, or pride. The earthquake in #Thailand & #Myanmar is a stark reminder: no matter how advanced we become, nature still holds the power to shake everything. A brutal reminder of how small we really are. #earthquake pic.twitter.com/wQPZ82MB8j— Hala Jaber (@HalaJaber) March 29, 2025 -
చైనాలో మెగా ఫ్యాక్టరీ.. అమెరికా సిటీ కంటే పెద్దగా..
బీజింగ్: వినూత్న, భారీ ప్రాజెక్టులకు పెట్టింది పేరైన చైనా దేశం మరోమారు తన భారీతనాన్ని చాటుకుంటోంది. ఏకంగా ఒక నగరం కంటే పెద్ద స్థాయిలో నూతనంగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో అంటే దాదాపు 32,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయి.చైనాలోని హెనాన్ ప్రావిన్సులోని ఝెన్ఝౌ నగరం శివారు ప్రాంతంలో బీవైడీ సంస్థ ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ఈ కర్మాగారంలో తయారుచేయనున్నారు. తాజాగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక డ్రోన్ వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో సామాజిక మాధ్యమాల్లో దీని గురించి చర్చ మొదలైంది. ఉత్పత్తి యూనిట్లు, పెద్ద భవనాలు, టెన్నిస్ కోర్టు, ఫుట్‌బాల్ మైదానాలతో సకల సదుపాయాలతో కర్మాగార పనులు కొనసాగుతున్నాయి. రోజు ఇక్కడ పనిచేసే కారి్మకులతో ఇప్పటికే ఈ ప్రాంతం కొత్త సిటీలా మారిపోయిందని డ్రోన్ వీడియోను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఇదే ప్రాంత సమీపంలో బీవైడీ కంపెనీకి ఒక ఫ్యాక్టరీ ఉంది.ఈ ఫ్యాక్టరీ.. అమెరికాలో నెవడా రాష్ట్రంలో విద్యుత్‌కార్ల దిగ్గజం టెస్లాకు చెందిన ఫ్యాక్టరీ కంటే విస్తీర్ణంలో పెద్దదికావడం విశేషం. కొత్త ఫ్యాక్టరీని ఎనిమిది బ్లాకులుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బీవైడీ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 9,00,000 మంది సిబ్బంది ఉన్నారు. మరో మూడు నెలల్లో 2,00,000 మంది సిబ్బందిని కొత్తగా నియమించుకోనున్నారు. ఝెన్ఝౌ నగరంలో నిర్మిస్తున్న కొత్త కర్మాగారంలో రోజు 60,000 మంది కారి్మకులు పనిచేస్తుండటంతో ఇప్పుడు అదొక కొత్త సిటీలా కనిపిస్తోందని ఒక నెటిజన్ అన్నారు. BYD has announced that their Zhengzhou factory will be 50 square miles, which is reportedly bigger than San Francisco at 46.9 square miles, per the Sun. pic.twitter.com/y39khwcyuc— unusual_whales (@unusual_whales) March 24, 2025 -
ఏకంగా ఆన్లైన్లోనే మట్టిని అమ్మేస్తున్నారు..! ఎందుకో తెలుసా..?
ఆన్లైన్లో ప్రతి వస్తువు అమ్మకానికి ఉంచినట్లే, చైనాలో మట్టిని కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే, ఈ మట్టి అలాంటి ఇలాంటి మట్టి కాదు, ‘ఇదొక అదృష్టాల మట్టి, ఈ మట్టిని ఇంట్లో పెట్టుకుంటే డబ్బుల వర్షం కురిపిస్తుంది’ అంటూ బ్యాంకుల ఆవరణలోని మట్టిని రాత్రివేళలో సేకరించి ఆన్లైన్లో అమ్ముతున్నారు. వంద గ్రాముల మట్టి ధర సుమారు వెయ్యి నుంచి పదివేల రూపాయల వరకు ఉంటోంది. ఈ మట్టితో ఆర్థికంగా లాభాలు పొందవచ్చని చాలా మంది నమ్మి, బ్యాంకుల ముందు మట్టిని, బ్యాంక్ లోపల పూలకుండీల వద్ద ఉండే మట్టిని, కౌంటింగ్ మిషన్ నుంచి వచ్చిన ధూళిని కూడా సేకరిస్తున్న వీడియాలు వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం పబ్లిక్ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం నిషిద్ధంగా ప్రకటించింది. ఇలాంటివి నమ్మవద్దని ప్రకటనలు ఇస్తోంది చైనా ప్రభుత్వం. (చదవండి: -
చైనా దురాక్రమణను భారత్ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టం
న్యూఢిల్లీ: చైనా దుందుడుకు వ్యవహారిశైలిపై భారత్ మరోమారు మండిపడింది. భారత్‌కు చెందిన భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది. ఇటీవల చైనా(China) రెండు కొత్త కౌంటీలను సృష్టించింది. వీటిలో కొంత ప్రాంతం భారత్‌లోని లడఖ్‌లో ఉంది. దీనిపై భారత్ బలమైన నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు పార్లమెంటులో పేర్కొంది.లోక్‌సభ(Lok Sabha)లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పందిస్తూ.. భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదని, ఆ దేశపు కొత్త కౌంటీల ఏర్పాటు.. భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన దీర్ఘకాల వైఖరిని ప్రభావితం చేయబోదన్నారు. చైనా పాల్పడుతున్న చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణను భారత్ చట్టబద్ధం చేయబోదన్నారు.లడఖ్‌లోని భారత భూభాగాన్ని కలుపుకొని హోటాన్ ప్రావిన్స్‌లో చైనా రెండు కొత్త కౌంటీలను సృష్టించడం గురించి ప్రభుత్వానికి తెలుసా? అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ వ్యూహాత్మక, దౌత్యపరమైన చర్యలు తీసుకుందో తెలపాలని సంబంధిత మంత్రిత్వ శాఖను అడినప్పుడు సింగ్ ఈ సమాధానం చెప్పారు. చైనాలోని హోటాన్ ప్రావిన్స్‌లో రెండు కొత్త కౌంటీల ఏర్పాటుకు సంబంధించి చైనా చేసిన ప్రకటన గురించి భారత ప్రభుత్వానికి తెలుసని, ఈ కౌంటీల అధికార పరిధిలోని కొన్ని ప్రాంతాలు భారతదేశంలోని లడఖ్(Ladakh) కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోకి వస్తాయన్నారు. సరిహద్దు ప్రాంతాలలో చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని కూడా ప్రభుత్వానికి కూడా తెలుసునని ఆయన అన్నారు. దీనిని నివారించేందుకే భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. తద్వారా భారత్ తన వ్యూహాత్మక, భద్రతా అవసరాలను మెరుగుపరుచుకుంటుందన్నారు. ఇది కూడా చదవండి: కొలంబియా వర్శిటీపై ట్రంప్ ఉక్కుపాదం -
చైనాలో దారుణం.. కెనడా పౌరులకు ఉరిశిక్ష
టొరంటో: డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై తమ నలుగురు పౌరులకు చైనా ప్రభుత్వం ఇటీవల ఉరిశిక్ష అమలు చేసిందని కెనడా వెల్లడించింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించింది. ద్వంద పౌరసత్వం ఉన్న ఈ నలుగురికీ క్షమాభిక్ష ప్రకటించాలని మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, తాను గతంలో చైనాను కోరినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జోలీ గురువారం చెప్పారు. ఇక, ఈ ఘటనపై ఒట్టావాలోని చైనా ఎంబసీ స్పందించింది. ద్వంద పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించడం లేదని, ఆ నలుగురికీ డ్రగ్ సంబంధిత నేరాలపై ఉరి శిక్ష అమలు చేసిందని వివరించింది. ఇటువంటి నేరాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, నలుగురిపై ఆరోపణలకు ఆధారాలు పక్కాగా ఉన్నాయని కూడా తెలిపింది. ఈ విషయంలో బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయవద్దని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. After being questioned by reports.... Melanie Joly explains the executions.4 dual citizens (Chinese and Canadian) were executed by China.These criminals had been charged with drug crimes.Joly would not expand on what drug crimes. Wonder if they would have been free in… pic.twitter.com/IAMvKszuXi— sonofabench (@therealmrbench) March 20, 2025ఇలా ఉండగా, డ్రగ్ స్మగ్లింగ్ కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న రాబర్ట్ షెల్లెన్బర్గ్ అనే కెనడా పౌరుడికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ చైనాను కోరామని మంత్రి జోలీ వెల్లడించారు. చైనా తయారీ ఎలక్ట్రిక్ వాహనాలు, స్టీల్ అల్యూమినియం ఉత్పత్తులపై గతేడాది అక్టోబర్‌లో కెనడా టారిఫ్‌లు విధించింది. ప్రతిగా, కెనడా వ్యవసాయ, ఆహారోత్పత్తులపై చైనా టారిఫ్‌లు ప్రకటించింది. 2018లో హువై మాజీ చీఫ్‌ను కెనడా అధికారులు అరెస్ట్ చేసినప్పటి నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు టారిఫ్ యుద్ధంతో మరింత ముదిరాయి. కాగా, కెనడాకు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. -
భారత ప్రధాని మోదీ ‘మంచి మాట’ చెప్పారు: చైనా
బీజింగ్: భారత్ తో స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్న చైనా.. ప్రధాని నరేంద్ర మోదీ చేసి వ్యాఖ్యలను స్వాగతించింది. తమ దేశం భారత్ తో స్నేహం కోసం ఎదురుచూసే వేళ మోదీ ఈ తరహాలో పాజిటివ్ గా మాట్లాడగం నిజంగా అభినందనీయమని చైనా విదేశాంగ ప్రతినిధి మావ్ నింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తాము భారత్ నుంచి ఆశిస్తున్నదంటూ సంతోషం వ్యక్తం చేశారు ఆమె. ఇరు దేశాలది ఎన్నో ఏళ్ల చరిత్రభారత్, చైనాలకు గత కొన్ని శతాబ్దాలుగా చారిత్రాత్మ ఘనతలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని రాటుదేలిన దేశాలు భారత్, చైనాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా పాడ్ కాస్టర్, ఏఐ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో అంతర్జాతీయ అంశాలను మోదీ ప్రసావించారు. దీనిలో భాగంగా చైనాతో సంబంధాల గురించి ప్రస్తావించగా మోదీ తనదైన శైలిలో జవాబిచ్చారు. ప్రధానంగా ఇటీవల ఎలిఫెంట్, డ్రాగన్’ కలిసి డ్యాన్స్ చేస్తే బాగుంటుందని చైనా చేసిన వ్యాఖ్యలపై పాడ్ కాస్ట్ లో అడగ్గా మోదీ సూటిగా బదులిచ్చారు.పోటీ అనేది వివాదం కాకూడదు..ఎక్కడైనా పోటీ అనేది వివాదం కాకూడదని, బేధాభిప్రాయాలు అనేవి ఘర్షణ వాతావరణాకి దారితీయకూడదని అంటూ చైనాను ఉద్దేశించి మోదీ సుతిమెత్తని శైలిలో చెప్పుకొచ్చారు. ఎంతో ఘన చరిత్ర కల్గిన ఇరు దేశాల జీడీపీ.. వరల్డ్ జీడీపీలో 50 శాతానికి పైగానే ఉందన్నారు మోదీ. తమ మధ్య ఎంతో బలమైన సంబంధాలున్నాయనే తాను నమ్ముతున్నానని మోదీ పేర్కొన్నారు.ఎలిఫెంట్, డ్రాగన్ డ్యాన్స్ కలిసి చేద్దాంసరిగ్గా పదిరోజుల క్రితం భారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కొంత కాలంగా ఇరుదేశాల మధ్య సామరస్య వాతావరణం2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది. -
చైనాలో మేడిన్ రష్యా
బీజింగ్/హాంకాంగ్: మన దేశంలోని అనేక వస్తువులపై మేడిన్ చైనా అని ఉంటుంది. అంత పెద్ద ఉత్పత్తిదారు అయిన ఆ దేశంలో మాత్రం ఇప్పుడెక్కడ చూసినా ‘మేడిన్ రష్యా’ అనే కనబడుతోంది. దుకాణాల మీద చైనా, రష్యాల జెండాలు.. లోపల రష్యా వస్తువులు. చాక్లెట్లు, కుకీల నుంచి తేనె, వోడ్కాల దాకా అన్ని రష్యన్ ఉత్పత్తులకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. ఉన్నట్టుండీ ఈ క్రేజ్ పెరగడంపై కొందరు చైనీయులే విస్తుపోతున్నారంటే ఇటీవలి మార్పును అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మార్పు వెనుక పెద్ద కథే ఉంది... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించారు. ఆంక్షలతో సతమతమవుతున్న రష్యాకు చైనా కీలకమైన ఆర్థిక వనరుగా మారింది. ద్వైపాక్షిక వాణిజ్యం ఏటేటా రికార్డుకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ చైనా, రష్యాలు మునుపెన్నడూ లేనంతగా దగ్గరయ్యాయి, అమెరికా పట్ల వారి శత్రుత్వం, ప్రపంచంపై ఆ దేశ ఆధిపత్యాన్ని సవాలు చేయాలనే ధోరణి దీనితో వేగవంతం అయ్యింది.ఆహారోత్పత్తులకు డిమాండ్ చౌకైన రష్యన్ చమురు, గ్యాస్, బొగ్గు.. చైనా దిగుమతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ ఐస్ క్రీం, తీపి బిస్కెట్లు, పాల పొడి వంటి రష్యా ఆహార ఉత్పత్తులకు ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు చైనా వ్యాపారులు పోటీ పడుతున్నారు. చైనా వ్యాపార రికార్డుల ప్రకారం, 2022 నుంచి రష్యన్ వస్తువుల వాణిజ్యంలో 2,500 కంటే ఎక్కువ కొత్త కంపెనీలు చేరాయి. అందులో దాదాపు సగం కంపెనీలు గత సంవత్సరంలోనే నమోదయ్యాయి.వీటిలో 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. రష్యా నుంచి అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటున్నా.. చైనాలో బెస్ట్ సెల్లర్ మాత్రం రష్యా తేనె, చాక్లెట్లు. సహజ పదార్థాలతో చేసిన ఈ ఉత్పత్తులు అధికనాణ్యతను కలిగి ఉన్నాయని, ఆరోగ్యకరమైనవని చెబుతున్నారు. ఇవి కేవలం రష్యన్ ఉత్పత్తుల దుకాణాలుగా మాత్రమే కాదు, ఆ దేశ సంస్కృతి, ప్రత్యేకతలను ప్రదర్శించే విండోలుగా మారాయి.పుతిన్‌కూ విస్తృత ఆదరణ...రష్యా వస్తువులకు మాత్రమే కాదు, అధ్యక్షుడు పుతిన్‌కు కూడా చైనా ప్రజల్లో విస్తృత ఆదరణ ఉంది. బీజింగ్‌లోని తిన్హువా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ గత ఏడాది విడుదల చేసిన సర్వేలో 66 శాతం మంది రష్యా పట్ల పూర్తి సానుకూలతను, మిగిలినవారు కొంత అనుకూల వైఖరిని ప్రకటించారు. దీనికి భిన్నంగా 76% మంది అమెరికా పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు.మేడిన్ రష్యా ఫెస్టివల్ ఏప్రిల్ 2023 నాటికి టావోబావో, జేడీతో సహా మాస్కోకు చెందిన 300కి పైగా కంపెనీలు చైనా ఇ–కామర్స్ ప్లాట్ఫామ్లో చేరాయి. 2024లో ‘మేడ్ ఇన్ రష్యా ఫెస్టివల్ అండ్ ఫెయిర్’ అతిపెద్ద నగరాలైన షెన్యాంగ్, డాలియన్లలో జరిగింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 150కి పైగా రష్యన్ కంపెనీలు పాల్గొన్నాయి. 23లక్షల డాలర్ల విలువైన రష్యన్ వస్తువులను చైనా వినియోగదారులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించాయి. ఇదే అదనుగా ‘నకిలీ రష్యన్ వస్తువులు’ కూడా తయారవుతున్నాయి. ఈ వివాదం ఎలా ఉన్నా.. రష్యా పట్ల చైనా ప్రజలకు ఉన్న అనుబంధాన్ని, బీజింగ్, మాస్కో మధ్య వాణిజ్య సంబంధాలకు అద్దం పడుతూ చైనా వ్యాప్తంగా దుకాణాలు పెరుగుతున్నాయి. -
జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!
కొందరూ యజమానులు తమ పెంపుడు కుక్కల కోసం ఎంత దూరమైనా.. వెళ్లిపోతారు. వాటికోసం ఎంత డబ్భైనా ఖర్చు చేస్తారు. అలానే గతంలో కొందరు యజమానులు తమ కుక్కలకు పుట్టిన రోజులు, పెళ్లిళ్లు జరిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ యజమానురాలు తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క దూరమైందని ఆమె ఏ చేసిందో తెలిస్తే మతిపోతుంది. మరీ ఇంతలానా అని అనుకోవడం ఖాయం. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే..చైనాలోని హాంగ్జౌకు చెందిన జు అనే మహిళ 2011లో డోబర్మ్యాన్ అనే కుక్కను కొనుగోలు చేసి జోకర్ అని పేరు పెట్టుకుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. రాను రాను ఆ కుక్కతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. తన పాఠశాల విద్య నుంచి వృత్తి జీవితం వరకు తన పెంపుడు కుక్కతో పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఆ కుక్క తొమ్మిదేళ్ల వయసులో ప్రాణాంత సార్కోమా బారిన పడింది. ఆ సమయంలోనూ జు తన కుక్కను తన కంటిపాపల కాచుకుంది. దానికి అనస్థీషియా లేకుండానే విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించి మరీ రక్షించుకుంది. అయితే కాలక్రమంలో ఆ కుక్క పలు వ్యాధుల బారినపడటం మొదలైంది. అయినా తన శక్తిమేర దాని బాగోగులు చూసుకుంటూనే వచ్చింది జూ. కానీ ఆ కుక్క 2022లో గుండెపోటుతో అనూహ్యంగా మరణించింది. దీంతో పెంపుడు కుక్క పోయిందన్న దిగులతో గడపటం మొదలుపెట్టింది జూ. అలా ఆ కుక్క మరణం జూపై తీవ్ర ప్రభావం చూపింది. నిద్రలేని రాత్రులతో సతమతమయ్యేది. ఇక ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించటం మొదలైంది. ఇక లాభం లేదు ఇలా దుఃఖంలో మునిగిపోవడమే తప్ప బయటకి రాలేనని గ్రహించింది జు. దీనికి సరైన పరిష్కారం కనుగొని ఇదివరకటిలా హాయిగా జీవితాన్ని గడపాలనుకుంది. అందుకోసం బాగా ఆలోచించి.. క్లోనింగ్ ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యింది. క్లోనింగ్ ప్రక్రియతో జీవిని పోలిని జీవిని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు. ఇదే తన బాధకు చక్కటి ఉపశమనం అని నమ్మి.. క్లోనింగ్ సౌకర్యాన్ని అందించే ఆస్పత్రిని సందర్శించి ఏకంగా రూ. 19 లక్షలు చెల్లించింది. ఆ ఆస్పత్రి వైద్యులు జు పెంపుడు కుక్క ఉదరం, చెవుల నుంచి కొద్ది మొత్తంలో చర్మాన్ని సేకరించి ఒక ఏడాదిలో అచ్చం అలాంటి కుక్కనే రూపొందించారు. వైద్యులు జుకి సమాచారం ఇవ్వడంతో ఆనందంగా ఆ చిన్న కుక్కను ఇంటికి తీసుకువెళ్లింది. దానికి లిటిల్ జోకర్ అని పేరుపెట్టుకుని పెంచుకుంటుంది. ఇది అచ్చం తన పెంపుడు కుక్క జోకర్ మాదిరిగానే ఉందని ఆనందంగా చెబుతోంది. ఈ కొత్త కుక్కరాకతో ఆ బాధ నుంచి తేరుకోగలుగుతున్నాని సంతోషంగా చెబుతోంది జు. మనిషి తన బాధకు ఉపశమనం కోసం ఎంత దూరమైన వెళ్తాడంటే ఇదేనేమో. అంతేగాదు మనం పెంచుకుంటున్న వాటిపై చూపించే ప్రేమ అంతకుమించి అన్నట్లు ఉంటే జులానే ఎంత డబ్భైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరేమో కదూ. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.(చదవండి: నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
అమెరికా ఉత్పత్తులపై 15% టారిఫ్‌లు ప్రకటించిన చైనా
వాషింగ్టన్: చైనా ఉత్పత్తులపై 20 శాతం టారిఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 4న చేసిన ప్రకటనకు చైనా బదులు తీర్చుకుంది. అమెరికా వ్యవసాయోత్పత్తులు ముఖ్యంగా సోయా, బీఫ్, పోర్క్, చికెన్ ఉత్పత్తులపై అదనంగా 15 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న ఉత్పత్తులపై ఈ నెల 12వ తేదీ వరకు టారిఫ్‌లను మినహాయించనున్నట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. ఈ ప్రకటనతో అమెరి కా పెట్టుబడిదారుల్లో భయాలు మొదలయ్యాయి. గతవారం మెక్సికో, కెనడాల దిగుమతులపై ట్రంప్ టారిఫ్‌లను విధించడం ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపై తిరిగి టారిఫ్‌లను విధించాయి. -
నీవల్లే కరోనా!.. చైనాకు అమెరికా కోర్టు జరిమానా
వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా భారీ షాకిచ్చింది. కోవిడ్ మహమ్మారిని కప్పిపుచ్చడంతోపాటు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ)పై గుత్తాధిపత్యం చెలాయించిందనే ఆరోపణలపై అమెరికా కోర్టు చైనాకు 24 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కాగా, కోవిడ్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమంటూ 2020లో మిస్సోరిలో కేసు నమోదైంది. మహమ్మారికి కేంద్రంగా భావిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, తదితర సంస్థలను బాధ్యులుగా ఇందులో పేర్కొన్నారు. అమెరికాకు సరఫరా కావాల్సిన పీపీఈ కిట్ల ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతి, దిగుమతులను చైనా ప్రభుత్వం అడ్డుకుందని అందులో ఆరోపించారు. విచారణ ముగించిన జడ్జి స్టీఫెన్ కోవిడ్ మహమ్మారికి కారణమై నష్టం కలిగించినందుకు చైనా ప్రభుత్వానికి 24 మిలియన్ డాలర్లు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇదే సమయంలో చైనా చర్యల ఫలితంగా మిస్సోరికి పన్నుల రూపంలో 8 బిలియన్ డాలర్ల నష్టం కలిగిందని, పీపీఈ కిట్ల సరఫరా నిలిచినందుకు గాను మరో 122 మిలియన్ డాలర్ల మేర అదనంగా ఖర్చు చేయాల్సి వచి్చందని ఆయన తీర్పులో పేర్కొన్నారు. కోవిడ్‌కు చైనాను బాధ్యునిగా చేయడంలో ఇది చారిత్రక తీర్పు అని మిస్సోరి అటార్నీ జనరల్ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. మిసోరిలోని చైనా ఆస్తులను స్వా«దీనం చేసుకుని, నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. మిసోరి కోర్టు తీర్పుపై వాషింగ్టన్లో చైనా ఎంబసీ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ‘ఈ తీర్పును మేం పట్టించుకోం. ఎలాంటి ప్రాతిపదిక లేని కేసు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న తీర్పు’అని పేర్కొన్నారు. -
చైనా నుంచి మనూస్ ఏఐ
బీజింగ్: కొన్ని రోజుల క్రితం ‘డీప్‌సీక్’కృత్రిమ మేధ(ఏఐ) మోడల్‌ను తీసుకొచ్చి ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన డ్రాగన్ దేశం చైనా మరో సంచలనానికి తెరతీసింది. ‘మనూస్’పేరిట మరో కృత్రిమ మేధ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే వాడుకలో ఉన్న అగ్రశ్రేణి ఏఐ వేదికలకు దీటుగా మనూస్‌ను రూపొందించారు. చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘మొనికా’ఈ మనూస్‌ను అభివృద్ధి చేసింది. ‘ఆలోచనలు, చర్యలకు మధ్య వారధిగా పని చేస్తుంది. ఇది కేవలం ఆలోచించడమే కాదు, ఫలితాలు సాధించి చూపుతుంది’’అని మొనికా కంపెనీ వెల్లడించింది. ఈ నూతన ఏఐ ఏజెంట్ వినియోగదారులకు చక్కటి అనుభూతి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేసింది. కొత్త వెబ్సైట్లను రూపొందించడం నుంచి విహార యాత్రలకు ప్లానింగ్ చేయడం దాకా ఎన్నో రకాల పనులను మనూస్ చక్కబెడుతుంది. స్టాక్ మార్కెట్‌ను విశ్లేషించడంలో బహు నేర్పరి. కేవలం ఒక ఆదేశం ఇచ్చేస్తే చాలు మనకు కావాల్సిన పనులు పూర్తిచేస్తుంది. మనూస్ తనంతట తాను ఆలోచించుకోగలదు. ప్లాన్ చేసుకొని దాన్ని అమలు చేయగలదు. స్వయం చాలితం అని చెప్పొచ్చు. మనూస్‌ను ఈ నెల 6వ తేదీన ఆవిష్కరించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఏమిటీ మనూస్? ఇదొక జనరల్ ఏఐ ఏజెంట్. వేర్వేరు రంగాలకు సంబంధించి సంక్లిష్టమైన, రియల్–వరల్డ్ పనులు పూర్తిచేయగలదు. సాధారణ ఏఐ చాట్‌బాట్స్ తరహాలో కాకుండా విభిన్నంగా పనిచేస్తుంది. ఇది పూర్తిస్థాయి అటనామిస్ సిస్టమ్. ప్రణాళిక, కార్యాచరణ, ఫలితాలు... అనే శ్రేణిలో పనిచేయగల సామర్థ్యం దీని సొంతం. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్‌పై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని సూచించామనుకోండి. ఆ అంశంపై మనూస్ తనంతట తానే పరిశోధన సాగిస్తుంది. పేపర్‌పై నివేదికను సిద్ధం చేసి మనకు అందజేస్తుంది. -
రష్యాను చేసుకున్నట్లు.. చైనాను కూడా..!
ఉక్రెయిన్ ను బెదిరించి.. రష్యాను మచ్చిక చేసుకున్నట్లు అలాగే చైనాను మచ్చిక చేసుకుందాం సార్! -
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన చైనా.. భారత్ వైపు చూపు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి సుంకాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు.దీనికి చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది.అయితే చైనా ప్రస్తుత చూపులు భారత్ వైపు పడ్డాయి. భారత్ తో గతంలో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు సిద్ధమైంది చైనా. భారత్ తో శత్రుత్వం కంటే మిత్రత్వమే మేలనే భావనకు వచ్చింది చైనా.-భారత్ తో కలిసి పని చేయాలని చూస్తోంది., ఈ మేరకు ఇప్పటికి ఓ మెట్టు దిగి భారత్ సహకారం కావాలంటోంది డ్రాగన్.ఇద్దరం కలిసి పని చేద్దాం: చైనా విదేశాంగ మంత్రిభారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేశారు. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు.ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది. -
వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..
ఈ రోజుల్లో జుట్టు పొడవుగా ఉండటం అత్యంత అరుదు. ఏవేవో ఫ్యాషన్లతో భుజాల వరకే ఉండేలా జుట్టు ఫ్రీగా వదిలేయడం ట్రెండ్‌గా మారింది. పైగా లాంగ్ జుట్టు మెయింటైన్ చేయడం మావల్ల కాదని చెప్పేస్తోంది నేటి యువత. అలాంటి ఈ కాలంలో పొడవు జుట్టుతో అందర్నీ ఆకర్షిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఈ గ్రామం అమ్మాయిలు. అంతేగాదు ఆ వాలు జడతో తమ ఊరి పేరు వార్తల్లో నిలిచేలా చేశారు. అంతలా ఆ మహిళలందరి జుట్టు ఎలా పొడవుగా ఒత్తుగా ఉంది..? అందుకోసం వాళ్లే ఏం చేస్తారనే సందేహాలు కచ్చితంగా వస్తాయి. అయితే ఆ మహిళలున్న గ్రామంలో కనీస సదుపాయాలేం లేవు. కటిక పేదరికం. కేవలం ఆ పొడవాటి జుట్టు కారణంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెట్టింది అంతే..మరీ ఆమహిళలెవరు..? ఎక్కడుందా గ్రామం..? ఆ పొడవాటి కురుల సీక్రెట ఏంటి తదితరాల గురించి తెలుసుకుందామా..!.చైనాలోని గుయ్లిన్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో హుయాంగ్లుయో అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు జుట్టే అత్యంత పొడవుగా ఉంటుంది. అలాంటి కురులు కేవలం అమ్మాయిలకే సొంతం కాదు..అమ్మమ్మలు, నానమ్మల వయసులో ఉన్న వారూ కూడా వాలుజడతో హోయలు పోతుంటారట..!.రెడ్ యావో తెగకు చెందిన ఈ మహిళలందరూ పొడవైన ఆరోగ్యకరమైన జుట్టుకి పేరుగాంచినవారు. వీళ్లంతా జుట్టుని పొడవుగా ఉంచుకోవడమే గాక అందంగా అలంకరించుకోవడంలోనూ ముందుంటారు. అయితే పెళ్లి కానీ అమ్మాయిలు స్కార్ఫ్‌తో జుట్టుకి హంగులద్దితే..పెళ్లైన మహిళలు తల ముందు భాగంలో పెద్ద బన్ మాదిరిగా హెయిర్‌స్టైల్ వేసుకుంటారట!. ఆ కురుల సీక్రెట్ ఏంటంటే..రెడ్ యావో మహిళలు తమ శిరోజాల సంరక్షణ కోసం సహజసిద్ధమైన వాటినే ఉపయోగిస్తారట. అదే వారి కేశ సంపద రహస్యమట. ఈ మహిళలంతా లాంగ్షెంగ్ రైస్‌తో తయారు చేసిన ప్రత్యేక షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకుంటారట, అలాగే జుట్టుని నది నీటితోనే కడుగుతామని చెబుతున్నారు ఆ తెగ మహిళలు.తమ జుట్టు సంరక్షణలో భాగంగా పులియబెట్టిన బియ్యం నీటిని ఉపయోగిస్తారట. ఆ మహిళలంతా చెక్క దువ్వెనలనే ఉపయోగిస్తారట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే..80 ఏళ్లకు చేరకున్న ఏ మహిళ జుట్టు కూడా తెల్లబడదట. ఈ చిట్కాల తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉండే బీన్స్నూ తరచూ ఆహారంలో తీసుకుంటారట. ఇలా పొడవాటి జుట్టుతో పేరుతెచ్చుకున్నారు ఈ యావో మహిళలు. ఆ ప్రత్యేకతతోనే వారి గ్రామానికి గుర్తింపు కూడా వచ్చింది. గిన్నిస్‌లోనూ చోటు!ఈ యావో మహిళలు తమ పొడవాటి జుట్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు.. గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. రెండేళ్ల క్రితం జరిగిన ‘Longji Long Hair Festival’లో భాగంగా.. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా బరిలోకి దిగారు 256 మంది యావో మహిళలు. ఈ క్రమంలో అక్కడి ఓ నదీ తీరానికి చేరుకున్న వీరు.. ఒకరి వెనకాల మరొకరు నిల్చొని చెక్క దువ్వెనలతో తమ జుట్టును దువ్వుతూ.. 456 మీటర్ల (1,496 అడుగుల) మేర పొడవాటి చైన్‌గా ఏర్పడ్డారు. దీంతో ‘లాంగెస్ట్ హెయిర్ కోంబింగ్ చెయిన్’గా ఇది గిన్నిస్ రికార్డులకి ఎక్కింది. అంతేకాదు.. ఇందులో పాల్గొన్న మహిళలంతా ఎరుపు-నలుపు రంగులు కలగలిపి రూపొందించిన సంప్రదాయ దుస్తులు ధరించి.. ‘లాంగ్ హెయిర్ బల్లాడ్’ అంటూ పాటలు పాడుతూ మరీ పాల్గొనడం.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది.అయితే ఈ తెగ తమ జీవన విధానాన్ని కాపాడుకోవటానికి చాలా సవాళ్లు ఎదుర్కొంటుంది. పెళ్లికాని స్త్రీ జుట్టును కిందకి వదులుగా ఉండగా ఏ పురుషుడైనా చూస్తే..అతడు ఆమెతో మూడేళ్లు కలిసి ఉండాల్సిందేనట. అయితే ప్రస్తుతం వారు ఆ ఆచారాన్ని పాటించటం లేదట. పర్యాటకుల ముందు తమ జుట్టుని ప్రదర్శించి డబ్బులు సంపాదించి బతుకుతున్నామని ఆ యావో తెగ మహిళలు ఆవేదనగా చెబుతున్నారు. View this post on Instagram A post shared by SheThePeople (@shethepeopletv) (చదవండి: డెన్మార్క్ రాణి 1800ల నాటి అరుదైన కిరీటం..! 140 ఏళ్లుగా..) -
‘అమెరికాతో ఎలాంటి యద్ధానికైనా మేం సిద్ధం’ : చైనా
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన దిగుమతి సుంకాల ప్రకటనపై చైనా (china) ధీటుగా బదులిచ్చింది. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా మేం సిద్ధమని స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా నుంచి చైనాలో దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకం విధిస్తున్నట్లు తెలిపింది. ట్రంప్ నిర్ణయంపై చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian) ఘాటు వ్యాఖ్యలే చేశారు. ట్రంప్ దిగుమతి సుంకం ప్రకటనపై అమెరికా మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడారు.‘అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకున్నా చైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉంది. మరి అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకుంటుంది. అది టారిఫ్, ట్రేడ్ వార్ ఇతర యుద్ధమైనా మేం చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై అమెరికాలోని చైనా రాయభార కార్యాలయం అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.If war is what the U.S. wants, be it a tariff war, a trade war or any other type of war, we’re ready to fight till the end. https://t.co/crPhO02fFE— Chinese Embassy in US (@ChineseEmbinUS) March 5, 2025ట్రంప్ చైనా ఉత్పుత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయాన్ని ఖండిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించింది. అమెరికా పార్లమెంట్లో ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) జాయింట్ సెషన్లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని పలు దేశాలు దశాబ్ధాలుగా అమెరికాలోని సుంకాలు వ్యతిరేకంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాయి.ఇది సరైన పద్దతి కాదుసగటున యురోపియన్ యూనియన్,చైనా,బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడాలు మనం విధించే దిగుమతి సుంకాలకంటే ఆ దేశాలు మన దేశ ఉత్పతులపై విధించే దిగుమతి సుంకాలు ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది సరైన పద్దతి కాదు. అమెరికా ఆటో మొబైల్ ఉత్పత్తులపై 100శాతం కంటే ఎక్కువ సుంకాల్ని విధిస్తోంది. చైనా కూడా అంతే మనం విధించే దిగుమతి సుంకాల కంటే రెండు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తోంది. సౌత్ కొరియా నాలుగు రెట్లు వసూలు చేస్తున్నాయి. మనం ఎంత చెల్లిస్తున్నామో.. వాళ్లుకూడా అంతే చెల్లించాలి మనతో సన్నిహితంగా ఉంటున్న వారితో పాటు మనల్ని వ్యతిరేకిస్తున్న దేశాలు కూడా మన ఉత్పత్తుల మీద పన్నులు విధిస్తున్నాయి. ఇది అన్యాయం కాదా. ఇప్పుడు మన వంతు వచ్చింది. వారు మన ఉత్పత్తులపై ఎంత ట్యాక్స్ వేస్తారో. మనం కూడా అంతే వారి ఉత్పత్తులపై అంతే ట్యాక్స్ వేస్తున్నాం. అందుకే తక్షణమే అమెరికాకు దిగుమతి అయ్యే ఇతర దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం (ప్రతిగా విధించే పన్నులు) విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏ దేశం ఉత్పత్తులపై ఎంత దిగుమతి సుంకం విధిస్తున్నారో సంబంధిత వివరాల్ని వెల్లడించారు.అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకంఅమెరికా సుంకం విధించే దేశాల్లో చైనా ఉత్పతులున్నాయి. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి ఉత్పత్తి 10 శాతం నుంచి 20 శాతం దిగుమతి సుంకం తప్పని సరిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిగా చైనా సైతం అమెరికా ఉత్పతుత్తులపై దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. 10శాతం, 15శాతం దిగుమంది సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. -
అమెరికాపై టారిఫ్ యుద్ధం!
వాషింగ్టన్/బీజింగ్/మెక్సికో సిటీ/టొరంటో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధం మరింత విస్తరిస్తోంది. ట్రంప్ సోమవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు. ఫెంటానిల్ వంటి సింథటిక్ డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి, అక్రమ వలసలను నియంత్రించడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరిగా అవసరమని సమర్థించుకున్నారు. చైనా ఉత్పత్తులపై ట్రంప్ ఇప్పటికే 10 శాతం సుంకాలు విధించారు. మరోవైపు చైనా, కెనడా, మెక్సికో సైతం ధీటుగా బదులిస్తున్నాయి. ప్రతీకార సుంకాలపై సై అంటున్నాయి. అమెరికాపై టారిఫ్‌ల యుద్ధం మొదలుపెట్టాయి. ఫలితంగా వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తడంతోపాటు ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయి అంతిమంగా ప్రజలు కష్టాలపాలయ్యే ప్రమాదం కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంలో న్యాయం లేదు: కెనడా ప్రధాని ట్రంప్ ప్రారంభించిన సుంకాలయుద్ధంలో ఎంతమాత్రం న్యాయం లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. తమ ఉత్పత్తులపై అన్యాయంగా సుంకాల విధిస్తే, అమెరికాకు తగిన సమాధానం చెప్పక తప్పదని స్పష్టంచేశారు. కౌంటర్–టారిఫ్ చర్యలను ప్రకటించారు. మొదటి దశలో అమెరికా ఉత్పత్తులపై 25 శాతం సుంకాల విధిస్తామని పేర్కొన్నారు. అమెరికా ఎగుమతిదారులు 20.6 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం గనుక వెనక్కి తగ్గకపోతే తాము విధించే సుంకాలు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని తేల్చిచెప్పారు. ఇక రెండో దశలో భాగంగా మరో 25 శాతం టారిఫ్‌లు విధిస్తామన్నారు. మూడు వారాల్లో 125 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు వసూలు చేస్తామని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్, స్టీల్, అల్యూమినియంపై మున్ముందు మరిన్ని సుంకాలు విధిస్తామని తెలియజేశారు. అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే దాకా టారిఫ్‌ల విషయంలో తమ నిర్ణయంలో మార్పు ఉండదని సంకేతాలిచ్చారు. అమెరికా మనసు మార్చుకొంటే తాము కూడా అదేబాటలో నడుస్తామని పరోక్షంగా సూచించారు. అనవసరమైన వాణిజ్య యుద్ధం ప్రజలకు మేలు చేయదని అభిప్రాయపడ్డారు. చైనా అదనపు సుంకాలు ట్రంప్ ప్రకటనపై చైనా ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది. అదనపు సుంకాలు ఇది ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ మంగళవారం పేర్కొంది. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్‌ల మోత మోగిస్తున్న అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థకు(డబ్ల్యూటీఓ)కు ఫిర్యాదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. మరోవైపు సుంకాల విషయంలో అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని తెలియజేసింది. ఇదిలా ఉండగా, 10 అమెరికా సంస్థలను విశ్వసనీయం కాని సంస్థల జాబితాలో చేర్చాలని చైనా నిర్ణయించింది. ఇందులో రక్షణ, ఏఐ, విమానయానం, ఐటీ రంగాలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం రెండో దశలో భాగంగా అదనంగా 10 శాతం సుంకం విధించింది. ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. చైనా ఎగుమతి చేసే మొత్తం ఉత్పత్తుల్లో 15 శాతం అమెరికాకే వెళ్తుంటాయి. 2023లో ఇరుదేశాల మధ్య 575 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో చైనా నుంచి అమెరికాకు 427.2 బిలియన్ డాలర్ల ఎగమతులు, అమెరికా నుంచి చైనాకు 147.8 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించారు. తాజాగా మరో 10 శాతం వడ్డించారు. దీంతో ఇప్పటిదాకా సుంకాలు 20 శాతానికి చేరాయి. దీనిపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. చైనా ఉత్పత్తులపై 60 శాతం సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లాన్ బి, సి, డి ఉన్నాయి: మెక్సికో ప్రెసిడెంట్ అమెరికా చర్యలకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ పేర్కొన్నారు. తమ వద్ద ప్లాన్ బి, సి, డి ఉన్నాయని ప్రకటించారు. తమ దేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం గనుక టారిఫ్‌లు పెంచితే ఏం చేయాలన్నదానిపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అమెరికా, మెక్సికో మధ్య సహకారం ఇప్పటివరకైతే అద్భుతంగా ఉందని చెప్పారు. వాణిజ్యం, భద్రతాపరమైన అంశాలపై ఇటీవల ఇరుదేశాల అధికారుల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని అన్నారు. తమ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు విధించే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నామని, ఒకవేళ అదే జరిగితే తాము కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని స్పష్టంచేశారు. -
ఆ దేశాలపై సుంకాలు.. భారత్‌కు అవకాశాలు
న్యూఢిల్లీ: చైనా, మెక్సికో, కెనడాపై అమెరికా అధిక దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) మోపడం అన్నది, భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో అవకాశాలను విస్తృతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం నుంచి వ్యవసాయం, ఇంజనీరింగ్, మెషిన్ టూల్స్, గార్మెంట్స్, టెక్స్టైల్స్, రసాయనాలు, లెదర్ పరిశ్రమకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మొదటి నాలుగేళ్ల పదవీ కాలంలో చైనాపై అధిక సుంకాల బాదుడు నుంచి ఎక్కువగా లాభపడిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకాలు 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ లోగడే ప్రకటించారు. చైనా ఉత్పత్తులపైనా టారిఫ్‌ను 20 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికా విధించిన సుంకాలతో అమెరికా మార్కెట్లో చైనా, మెక్సికో, కెనడా వస్తువుల ధరలను పెంచేస్తాయి. దీంతో వాటి పోటీతత్వం తగ్గిపోతుంది. భారత ఎగుమతిదారులు ఈ అవకాశాలను సొంతం చేసుకోవాలి’’అని భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. భారత్‌కు ప్రయోజనం: జీటీఆర్ఐ ప్రైవేటు పరిశోధనా సంస్థ అయిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. వాణిజ్య యుద్ధం భారత్‌కు అనుకూలిస్తుందని, ఎగుమతులను పెంచుకోవడంతోపాటు అమెరికా కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి సాయపడుతుందని పేర్కొంది. చైనాపై అధిక సుంకాలు భారత్ తన తయారీరంగాన్ని బలోపేతం చేసుకునేందుకు అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. ఒప్పందాలకు కట్టుబడని ట్రంప్ వైఖరి దృష్ట్యా ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ హెచ్చరించారు. దీనికి బదులు జీరోకి జీరో టారిఫ్ డీల్‌ను కుదుర్చుకోవాలని సూచించారు. సుంకాలేతర చర్యలు భారత ఎగుమతులకు అడ్డు: డీజీఎఫ్టీ అభివృద్ధి చెందిన దేశాలు విధించిన నాన్ టారిఫ్ (సుంకాలు కాని ఇతర చర్యలు)లు భారత వస్తువులకు మార్కెట్ అవకాశాలను పరిమితం చేయొచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన కార్బన్ ట్యాక్స్, డీఫారెస్టేషన్ నిబంధనలను ప్రస్తావించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానమై ఉండకపోవడం, అధిక దిగుమతి సుంకాలు, టెక్నాలజీ పరంగా అననుకూలత, అధిక లాజిస్టిక్స్ వ్యయాలు వంటి ఇతర సవాళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల దుందుడుకు పారిశ్రామిక విధానాలు సైతం భారత ఎగుమతులకు అవరోధంగా మారొచ్చన్నారు. ‘‘2023–24లో 437 బిలియన్ డాలర్ల వస్తు ఎగుమతులకు గాను 284 బిలియన్ డాలర్ల రుణ సాయం అవసరం. కానీ, అందించిన రుణ సాయం 125 మిలియన్ డాలర్లుగానే ఉంది. 2030 నాటికి ఎగుమతుల రుణ డిమాండ్ 650 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది’’అని సారంగి వివరించారు. -
ట్రంప్ నిర్ణయం.. చైనా ప్రతీకారం
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై విధించే సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ ప్రకటించారు. అమెరికా సుంకాలకు చైనా కూడా వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. యూఎస్ దిగుమతి సుంకాలను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ ప్రకటన జారీ చేసింది.చైనా తీసుకున్న నిర్ణయం సుమారు 25 సంస్థలపై ప్రభావాన్ని చూపనుంది. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులపై చైనా సుంకాలను పెంచింది. మార్చి 10 నుంచి ఈ సుంకాలు వర్తించనున్నట్లు తెలుస్తోంది.అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న మరియు పత్తిపై అదనంగా 15 శాతం సుంకాన్ని.. సోయాబీన్స్, జొన్న, పంది మాంసం, గొడ్డు మాంసం, జల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల దిగుమతులపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను దృఢంగా కాపాడుకుంటుందని స్పష్టం చేసింది.చైనాపై ట్రంప్ సుంకాలుచైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.అమెరికా విధించిన సుంకాలు.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వీడియోగేమ్ కన్సోల్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్లు, బ్లూటూత్ పరికరాల వంటి ఎలక్ట్రానిక్స్‌పై వర్తిస్తాయి. చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు ప్రకటించడంతో.. ట్రంప్ వెనుకడుగు వేస్తారా?.. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
చైనా నెత్తిన ట్రంప్ పిడుగు.. సుంకాల విషయంలో తగ్గేదేలే!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం.. ప్రపంచంలోని చాలా దేశాలను వణికిస్తున్నాయి. సుంకాల విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్తున్న ట్రంప్.. చైనాకు మరో షాకిచ్చారు.20 శాతంచైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఎలాంటి మార్పు లేదుమెక్సికో, కెనడా దిగుమతులపై విదించనున్న 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి మార్చి న్ నుంచి అమలులోకి వస్తాయి. కెనడా, మెక్సికోపై సుంకాలు మోపడం వల్ల ఆటోమొబైల్స్, నిర్మాణ సామగ్రి వంటి కీలక రంగాలకు సరఫరా గొలుసులు దెబ్బతింటాయి. దీంతో గృహాలకు వెచ్చించాల్సిన ఖర్చు భారీగా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.నిజానికి.. మెక్సికో, కెనడాపై 25 శాతం సుంకాలను ఫిబ్రవరి 4నుంచి విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ దేశాధ్యక్షులు చర్చలు జరిపిన తరువాత.. సుంకాలను నెల రోజుల పాటు వాయిదా వేశారు. ఇచ్చిన గడువు ముగియడంతో.. అనుకున్న విధంగా సుంకాలు చెల్లించాల్సిందే, అని ట్రంప్ పేర్కొన్నారు.ట్రంప్ ఆదేశాలు.. దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని కెనడా విదేశాంగ మంత్రి 'మెలనీ జోలీ' పేర్కొన్నారు. ట్రంప్ చర్యకు.. ప్రతిచర్యగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఇదే బాటలో మెక్సికన్ అధ్యక్షురాలు 'క్లాడియా షీన్బామ్' కూడా నడుస్తున్నారు. కాబట్టి అమెరికా నుంచి దిగుమతి చేసుకునే.. పండ్లు, ఆల్కహాల్ వంటి వాటిపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ట్రేడ్ వార్ టెర్రర్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 10%, యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై 25% తాజా సుంకాల ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 74వేల స్థాయి దిగువన 73,198 వద్ద నిలిచింది. నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోయి 22,125 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,471 పాయింట్లు క్షీణించి 73,141 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు కుప్పకూలి 22,105 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. → అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఇండెక్సుల వారీగా.. ఐటీ సూచీ 4.20% పతనమైంది. టెలి కమ్యూనికేషన్, ఆటో ఇండెక్సు 4%, కన్జూమర్ డి్రస్కేషనరీ 3%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.50%, విద్యుత్ ఇండెక్స్ 2% నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2.33%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.16 క్షీణించాయి. → స్టాక్ మార్కెట్ 2% పతనంతో శుక్రవారం ఒక్కరోజే రూ.9.08 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.384.01 లక్షల కోట్లకు దిగివచ్చింది. → సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2%) తప్ప మిగిలిన అన్ని షేర్లూ పతనమయ్యాయి. అత్యధికంగా టెక్ మహీంద్రా 6%, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.5%, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్టెల్ 5%, టైటాన్ 4.5% పడ్డాయి.→ గతేడాది సెపె్టంబర్ 27 నాటి సెన్సెక్స్ రికార్డు గరిష్టం(85,978) నుంచి 12,780 పాయింట్లు(15%), నిఫ్టీ జీవితకాల గరిష్టం(26,277) నుంచి 4,153 పాయింట్లు(16%) క్షీణించాయి. ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనలు, ట్రంప్ వాణిజ్య విధానాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దీనికి కారణయ్యాయి. పతనానికి కారణాలుతారస్థాయికి వాణిజ్య యుద్ధ భయాలు: చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 10% సుంకాలు విధించిన ట్రంప్.. అదనంగా మరో 10% విధిస్తున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 25% సుంకాల విధింపు ఉంటుందన్నారు. వీటికి తోడు భారత్‌తో సహా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెక్సికో, కెనడాల దిగుమతులపై ప్రతిపాదించిన 25% సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి.టెక్ షేర్లు క్రాష్: టెక్ దిగ్గజం ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అంచనాలతో వాల్ స్ట్రీట్‌లో అధిక మార్కెట్ విలువ కలిగిన టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగ షేర్లపైనా పడింది. నెలరోజుల కనిష్టానికి ప్రపంచ మార్కెట్లు: వాణిజ్య యుద్ధ భయాలకు తోడు టెక్ రంగ షేర్ల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నెలరోజుల కనిష్టానికి దిగివచ్చాయి. ఆసియాలో దక్షిణ కొరియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ సూచీలు 3.50% నుంచి 3% కుప్పకూలాయి. చైనా, సింగపూర్ తైవాన్ ఇండెక్సులు 2–1% నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి.బలపడుతున్న డాలర్ ఇండెక్స్: వాణిజ్య యుద్ధ భయాలతో అమెరికా కరెన్సీ డాలర్ ఇండెక్స్ 10 వారాల గరిష్టానికి (108) చేరుకుంది. దీంతో భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారింది. ఆగని ఎఫ్ఐఐల అమ్మకాలు: దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం దలాల్ స్ట్రీట్ పతనానికి మరో ప్రధాన కారణం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ ఫిబ్రవరిలోనే రూ.58,988 కోట్ల ఈక్విటీలు అమ్మేశారు.రూపాయి 19 పైసలు పతనం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 87.37 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి చేరుకోవడం, వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 35 పైసలు బలహీనపడి 87.53 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా, ఫిబ్రవరి 10న రూపాయి 87.94 వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకింది. -
భారత్, చైనాలకు ట్రంప్ మార్క్ షాక్!
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఉత్పత్తులపై భారత్, చైనా దేశాలు ఏ స్థాయిలో అయితే దిగుమతి సుంకాలు వేస్తున్నాయో అంతే శాతం దిగుమతి సుంకాలు తామూ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తాజాగా వాషింగ్టన్లో వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుట్నిక్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికాపై ఏదైనా కంపెనీ లేదంటే ఒక దేశం ఎంత పన్నులు విధిస్తే మనమూ ఇకపై అంతే సుంకాలు వసూలు చేద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే భారత్ లేదా చైనాలు మనపై ఎంత పన్నుల భారం మోపుతాయో అమెరికా సైతం అంతే పన్నుల భారాన్ని వాటిపై వేయనుంది. త్వరలోనే ఈ కొత్త పన్నులను తీసుకొస్తాం. ఇదొక అనులోమానుపాత సిద్ధాంతం అనుకోండి. అటు ఎంత పెరిగితే ఇటు అంతే పెరుగుతుంది. అటు ఎంత తగ్గితే ఇటూ అంతే తగ్గుతుంది. వాళ్లు మనకు ఛార్జీ వేస్తున్నారు. మనమూ వాళ్లకు ఛార్జీ వేద్దాం’’అని అక్కడి అమెరికన్లనుద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ‘మనం గతంలో ఇలా ఎప్పుడూ ప్రతిస్పందించలేదు. కానీ ఈసారి మాత్రం మనం అవతలి దేశాలకు తగ్గట్లుగా చర్యలు తీసుకోబోతున్నాం’ అని అన్నారు. గత మంగళవారం సైతం ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా తనను కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ ఇదే విషయం స్పష్టంచేశానని ట్రంప్ చెప్పారు. ‘మంత్రి హొవార్డ్ సారథ్యంలోనే అమెరికా విదేశాలపై కొత్త పన్నుల విధానాన్ని అమలుచేయబోతోంది. నూతన వాణిజ్య మంత్రి హొవార్డ్కు వాణిజ్య సంబంధాలపై మంచి పట్టు ఉంది’ అని పొగిడారు. నా నాలుగో ఫేవరెట్ పదం కొద్దిసేపు ట్రంప్ సరదాగా మాట్లాడారు.‘నాకిష్టమైన పదాలను చెప్పాలంటే దేవుడికి అగ్రస్థానం ఇస్తా. ఇందులో మరో మాటే లేదు. ప్రచారంవేళ కాల్పుల ఘటనల నుంచి తప్పించుకున్నా. దేవుడు రక్షించాడు. నా మొదటి ఫేవరెట్ పదం దేవుడు. తర్వాత కుటుంబం, ఆ తర్వాత రిలేషన్ఫిప్’ అని అన్నారు. పదే పదే టారిఫ్ అని వల్లెవేస్తున్నారుగా అని అక్కడి మీడియా ప్రశ్నించగా ‘అవును. టారిఫ్ ఇప్పుడు నా ఫేవరెట్ నాలుగో పదం. దీన్నే ఖాయం చేసుకోండి’ అని ట్రంప్ అన్నారు. -
చైనాలో మరో మహమ్మారి!
-
HKU5-CoV-2: చైనాలో మరో మహమ్మారి!
బీజింగ్: ఐదేళ్ల క్రితం కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం గుర్తుంది కదా! చైనాలో పుట్టినట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అలాంటి మహమ్మారి మరొకటి చైనాలో పుట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గబ్బిలాల నుంచి హెచ్‌కేయూ5–కోవ్–2 అనే కొత్త వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరి, మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ క్రమంగా మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తుండగా, అలాంటిదేమీ లేదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు సూచిస్తున్నారు. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్(హెచ్ఎంపీవీ) కేసులు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఇవి హెచ్‌కేయూ5–కోవ్–2కు సంబంధించిన కేసులని భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ పుట్టిందన్నది స్పష్టంగా తెలియనప్పటికీ గబ్బిలాల నుంచి వచ్చినట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గబ్బిలాల నుంచి తొలుత మరో జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు సోకినట్లు అంచనా వేస్తున్నాయి. గాంగ్జౌ లేబోరేటరీ, గాంగ్జౌ అకాడమీ అఫ్ సైన్సెస్, వూహాన్ యూనివర్సిటీ, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం సార్స్–కోవ్–2 వైరస్ మనుషుల్లోని హ్యూమన్ యాంజియోటెన్సిన్–కోవర్టింగ్ ఎంజైమ్(ఏసీఈ2) అనే రిసెప్టర్‌ను ఉపయోగించుకొని కణాలపై దాడి చేసింది. ఫలితంగా కోవిడ్–19 పంజా విసరింది. గబ్బిలాల నుంచి పుట్టిన హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ సైతం ఇదే రిసెప్టర్ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అంటే కోవిడ్–19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్–19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
ఆ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం: జైరాం రమేష్
న్యూఢిల్లీ: భారత్ కు చైనా శత్రువు కాదంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా(sam pitroda) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమకేమీ సంబంధం లేదని అంటోంది ఈ వ్యవహారంపై జాతీయ కాంగ్రెస్ పార్టీ. దీనిపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జై రాం రమేష్(Jairam Ramesh స్పందించారు. అది శామ్ పిట్రోడో వ్యక్తిగత అభిప్రాయమని, దానితో పార్టీకి సంబంధం లేదన్నారు. శామ్ పిట్రోడో చేసిన వ్యాఖ్యలు పార్టీపై ఎటువంటి ప్రభావం చూపదని జై రాం రమేష్ క్లారిటీ ఇచ్చారు.చైనా(China)పై శామ్ పిట్రోడా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఖచ్చితంగా భారత జాతీయ కాంగ్రెస్ అభిప్రాయాలు కావన్నారు. చైనా అతిపెద్ద విదేశాంగ, భద్రత విధానంతో పాటు మనకు ఆర్థిక సవాలుగా మిగిలిపోయింది అని జైరాం రమేష్ పేర్కొన్నారు. దీనికి తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు జై రాం రమేష్కాగా, పొరుగు దేశం చైనాను శత్రువులా చూడొద్దని సంచలన వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడో.. లేదంటే చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు.భారత్ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. తొలినుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్ పిట్రోడా తాజాగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చైనా నుంచి భారత్‌కు ఏం ముప్పుందో తనకు అర్థం కావడం లేదన్నారు.చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉందన్నారు. ఇప్పటికైనా భారత్ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.ఇది కేవలం చైనా విషయంలోనే కాదని, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అమెరికా కూడా చైనాను శత్రువులా చూస్తూ భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోందని విమర్శించారు.గతంలో కూడా పలు అంశాలపై పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను ఇరకాటంలో పడి కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పడేశారు. కాగా, భారత్,చైనా సంబంధాలు అంతంత మాత్రమే ఉన్న వేళ పిట్రోడా చైనాను ఎక్కువ చేసి చూపిస్తూ మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు పిట్రోడాపై ఫైర్ అవుతున్నారు. దాంతో కాంగ్రెస్ దిగివచ్చింది. తమ పార్టీకి శామ్ పిట్రోడో వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదంటూ జై రాం రమేష్ వ్యాఖ్యానించడం అందుకు ఉదాహరణ. -
మరో వివాదంలో శామ్ పిట్రోడా..!ఈసారి చైనాపై..
న్యూఢిల్లీ:ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తన పార్టీ కాంగ్రెస్‌ను మరోసారి ఇరకాటంలో పెట్టారు. పొరుగు దేశం చైనాను శత్రువులా చూడొద్దని శామ్ పిట్రోడా అన్నారు. లేదంటే చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు.భారత్ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. తొలినుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్ పిట్రోడా తాజాగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చైనా నుంచి భారత్‌కు ఏం ముప్పుందో తనకు అర్థం కావడం లేదన్నారు. చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉందన్నారు. ఇప్పటికైనా భారత్ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఇది కేవలం చైనా విషయంలోనే కాదని, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అమెరికా కూడా చైనాను శత్రువులా చూస్తూ భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోందని విమర్శించారు.గతంలో కూడా పలు అంశాలపై పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను ఇరకాటంలో పడి కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పడేశారు. కాగా, భారత్,చైనా సంబంధాలు అంతంత మాత్రమే ఉన్న వేళ పిట్రోడా చైనాను ఎక్కువ చేసి చూపిస్తూ మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు పిట్రోడాపై ఫైర్ అవుతున్నారు. -
బైదూ, ఓపెన్ఏఐ సేవలు ఫ్రీ
వాషింగ్టన్: కృత్రిమ మేధ చాట్‌బాట్ సేవలరంగంలో తొలిసారిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. వందలా కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన తమ అత్యాధునిక ఏఐ చాట్‌బాట్ సేవలను ‘ప్రీమియం’ వంటి ఖరీదైన చందాలు కట్టేవారికే అందిస్తున్న బైదూ, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు ‘ఉచిత’ జపం చేస్తున్నాయి. చైనా ఏఐ సంచలనం డీప్‌సీక్ తమ అత్యాధునిక ఏఐ చాట్‌బాట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తుండటంతో అవి కూడా అదే బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి. ఏప్రిల్ ఒకటి నుంచి ఉచితం! బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న చైనాకు చెందిన ఇంటర్నెట్ దిగ్గజం బైదూ ‘ఎర్నిబాట్’ పేరుతో ఏఐ చాట్‌బాట్ సేవలను అందిస్తుండటం తెలిసిందే. ఇది ఏఐ పెయింటింగ్ వంటి అత్యాధునిక సేవలను చందా కట్టిన ప్రీమియం కస్టమర్లకే అందిస్తోంది. ఈ సేవలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అందరికీ ఉచితంగా అందిస్తామని బైదూ గురువారం వీచాట్ వెబ్సైట్లో ప్రకటించింది. అంతకు కొన్ని గంటల ముందే మరో దిగ్గజ ఏఐ సంస్థ ‘ఓపెన్ఏఐ’ కూడా ఉచిత సేవల అంశాన్ని ప్రకటించింది. తమ అధునాతన ఏఐ మోడల్ జీపీటీ–5ను ఉచితంగా అందిస్తామని సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘జీపీటీ–5ను ఇక అందరూ ఉచితంగా పొందొచ్చు. ఈ సేవల కోసం ఇప్పటికే చందా కట్టినవారికి మరింత అత్యాధునిక స్థాయి ఏఐ సేవలను అందిస్తాం’’ అని స్పష్టం చేశారు. తర్వాత బైదూ మరో ప్రకటన చేసింది. జూన్ చివరికల్లా నూతన తరం ఏఐ మోడల్‌ను తెస్తామని తెలిపింది. ఇది డీప్‌సీక్ ఓపెన్ సోర్స్ మోడల్ తరహాలో ఉంటుందని భావిస్తున్నారు. డీప్‌సీక్ ఆర్1 ఏఐ మోడల్ ఉచితంగా అత్యాధునిక ఏఐ చాట్‌బాట్ సేవలను అందిస్తుండటంతో పోటీలో నిలదొక్కుకునేందుకు ఇతర అగ్రగామి సంస్థలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉచితాల బాట పడుతున్నాయని ఏఐ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు తమ బేసిక్ చాట్‌బాట్ సేవలను ఉచితంగా అందిస్తున్నా ఖరీదైన సేవలను ఉచితం చేస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. -
ఉద్యోగాల ఎర.. ‘సైబర్’ వెట్టిలో చెర!!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనా స్కామ్స్టర్లు ఆన్లైన్లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.విమాన టికెట్ పంపి మరీ..కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్‌లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం’ అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్ అందడంతో గతేడాది డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్‌రెడ్డి పాస్‌పోర్టు లాక్కున్న సైబర్ నేరగాళ్లు ఆయన్ను సైబర్ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.గత్యంతరం లేకపోవడంతో..అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్ నేరగాళ్లు మధుకర్‌రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు. అయితే పాస్‌పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్‌లో పరిస్థితులు మారడంతో స్కామ్స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్‌కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్‌లో ఉన్న ఇంగ్విన్ మయాంగ్ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్ మయాంగ్‌కు, థాయ్‌లాండ్ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.కాపాడాలని వేడుకోలు..అక్కడికి వెళ్లాక సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్‌ను సంపాదించిన మధుకర్‌రెడ్డి.. వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్‌కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు. -
Artificial Intelligence: ఇండియా చేయగలిగింది...
అందిపుచ్చుకుంటే ఇదొక సువర్ణావకాశం. మన ప్రాచీన విజ్ఞానానికి తిరిగి జీవం పోయగల శక్తి ఏఐకి ఉంది. ఫిలాసఫీ, సైన్సు, వైద్య రంగాల్లో భారత సరికొత్త ఆవిష్కరణలకు ఇది బాటలు వేస్తుంది.ఏఐ పుట్టింది సిలికాన్ వ్యాలీలోనే. అయితే ఏమిటి? చైనా ఇప్పుడు అమెరికాను వెనక్కు నెట్టేసింది. తన సొంత సంస్కృతిని మేళవించి దాన్ని సరికొత్త శక్తిగా రూపుదిద్దింది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. గుడ్డిగా పశ్చిమ దేశాలను అనుకరించకుండా తనదైన పద్ధతిలో ‘డీప్‌సీక్’ పేరిట కృత్రిమ మేధను అభివృద్ధి చేసుకుంది. పుంఖానుపుంఖాలుగా ఉన్న చైనా ప్రాచీన గ్రంథాలను ఆధారంగా చేసుకుని కంప్యూటర్లకు వాటిలో శిక్షణ ఇచ్చింది. తమ దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య వారసత్వపు విలక్షణతను డీప్‌సీక్ ఒడిసి పట్టుకో గలిగింది. ఈ మోడల్ లోని విశిష్టత అదే. కృత్రిమ మేధకు కొత్త భాష్యం చెప్పి దాన్ని మరింత ముందుకు తీసుకుపోయే శక్తి మన వద్ద ఉంది. గణిత, ఖగోళ, వైద్య, పరిపాలన, ఆధ్యాత్మిక రంగాల అత్యున్నత విజ్ఞానం మన ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, అర్థశాస్త్రం, తమిళ సంగం సాహిత్యం... ఇవన్నీ విశ్వచైతన్యం నుంచి ఆర్థిక సిద్ధాంతం వరకు ఎంతో లోతైన అంతర్ దృష్టులు అందిస్తున్నాయి. కృత్రిమ మేధ అంటే? ఇదొక ప్యాటర్న్ రికగ్నిషన్ సిస్టం. విస్తృత సమాచారాన్ని (డేటాసెట్‌ను) మెదడుకు మేతలా అందించి మెషీన్లకు అది శిక్షణ ఇస్తుంది. తాము శిక్షణ పొందిన సమాచారం ప్రాతిపదికగానే అవి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. ఒక ఏఐ సిస్టం పశ్చిమ దేశాల సైంటిఫిక్ పేపర్స్, కార్పొ రేట్ డాక్యుమెంట్లు, పాప్ కల్చర్ మీద శిక్షణ పొందినప్పుడు దానికి అదే ప్రపంచం అవుతుంది. ఆ ప్రాపంచిక దృక్పథాన్నే అది అలవరచుకుంటుంది. అలా కాకుండా చైనా చేసినట్లు, చైనీ యుల సాహిత్య, ఆధ్యాత్మిక సమాచారం మీద శిక్షణ ఇచ్చిన ప్పుడు అది చైనా మాదిరిగానే ఆలోచిస్తుంది.ఈ విషయంలో పశ్చిమ దేశాల కృత్రిమ మేధ దానితో పోటీ పడలేదు. వెస్ట్రన్ ఏఐ ప్రధానంగా ఇంగ్లీష్ డేటా మీద రూపొంది పశ్చిమ దేశాల ప్రాపంచిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి శాస్త్ర సాంకేతిక అంశాల్లో వారి ఏఐ సిస్టందే పైచేయిగా ఉంటుంది. తాత్విక చింతన, నైతికత అంశాల్లో మాత్రం బలహీనంగా ఉంటుంది. మనం అమెరికన్ ఏఐ మీద ఎందుకు ఆధారపడకూడదో ఇప్పుడు ఆలోచించండి. భారతీయ మేధా వారసత్వం పునాదుల మీద మన ఏఐని నిర్మించుకోవలసిన అవ సరం బోధపడుతుంది. చాణక్యుడి అర్థ శాస్త్రం కోణం నుంచి ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలను విశ్లేషించగల సామర్థ్యంతో మన ఏఐ మోడల్‌ను తయారు చేసుకోవాలి. ఆయుర్వేద, సిద్ధ వైద్యాల్లో మన మూలాలు ఏమిటో తెలిసిన కృత్రిమ మేధ కావాలి. అది మాత్రమే సమగ్ర చికిత్సకు కావల్సిన ఇన్ సైట్స్ అందిస్తుంది. ఉపనిషత్తుల్లో అభివర్ణించిన చైతన్యం గురించి వ్యాఖ్యానించి సమకాలీన న్యూరోసైన్స్తో పోల్చగల మోడల్ గురించి ఆలోచించాలి. అలాంటి ఏఐ కేవలం సమాధానాలకే పరిమితం కాదు. మన సామూహిక అవగాహ నను పెంచుతుంది. పశ్చిమ దేశాల ఏఐ మోడల్స్ మెటీరియలిస్టు మూసలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాయి. చైనా ఏఐ కన్ఫ్యూషియన్ విలు వలను జొప్పించింది. మనకు అంతకు మించిన అవకాశం ఉంది. సైన్సు– స్పిరిచ్యువాలిటీ, ఆర్థికం–నైతికం, సాంకేతికత– సంప్రదాయం... వీటిని వారధిలా అనుసంధానించే కృత్రిమ మేధను మనం సృష్టించగలం. భారత నాగరికత అందించిన వివేకాన్ని ఈ మోడల్ ప్రతిబింబించాలి.పశ్చిమ దేశాల ఏఐ మీద ఆధారపడితే మరో ప్రమాదం ఉంది. భారతీయులు ఏం నేర్చుకోవాలో, ఎలా ఆలోచించాలో శాసించిన వలసవాద మైండ్ సెట్‌ను అది శాశ్వతం చేస్తుంది. మన వ్యాపారాలు, విశ్వవిద్యాలయాలు, విధాననిర్ణేతలు పశ్చిమ దేశాల ఏఐని ఉపయోగిస్తూ పోతే, దాంతో పాటు వారి ప్రాపంచిక దృక్పథమే అలవడుతుంది. ఒకప్పటి మన విద్యా విధానం బ్రిటిష్ ప్రయోజనాలు ఎలా కాపాడిందో, ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుంది. మేధాపరంగా మనం పరాధీనులమై పోయే ప్రమాదం ఉంది. ఈ డిజిటల్ యుగంలో మన ఉత్కృష్ట వారసత్వం కనుమరుగవుతుంది.అమెరికా, చైనాల ఏఐ ఆధిపత్యం వల్ల మన డేటా సార్వ భౌమత్వం ప్రమాదంలో పడుతుంది. మన డేటా మన జాతీయ సంపద. మన ప్రయోజనాలకు తోడ్పడని ఏఐ మోడల్స్‌కు మన డేటా ఉపయోగించుకుని విదేశీ టెక్ సంస్థలు లబ్ధి పొందు తాయి. మన ఏఐ అభివృద్ధి మీద మన అదుపు ఉండితీరాలి. ప్రపంచ దేశాలకు జ్ఞానదీపంలా దారి చూపిన భారత్ ఇప్పుడు తన మేధను విదేశీ అద్దాలతో చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు సున్నా నుంచి యోగా వరకు... మన ఆవిష్కరణలు ప్రపంచ ప్రగతిని రూపుదిద్దాయి. నేడు వాతా వరణ మార్పులు, మానసిక రుగ్మతలు, మహమ్మారులు, ఆర్థిక అసమానతలు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సమాచారం వెల్లువెత్తుతున్నా నిజమైన జ్ఞానం లోపిస్తోంది. నేటి కృత్రిమ మేధ భారతీయ సమున్నత వారసత్వం మీద శిక్షణ పొందితే, ఈ ఆధునిక ప్రపంచ సవాళ్లు ఎదుర్కొనేందుకు అది సరికొత్త దృక్పథాలు అందించగలదు.వేదాంత శోధన ఏఐకి ఆలంబన అయ్యేట్లయితే పశ్చిమ దేశాల న్యూరోసైన్సు పరిమితులను అధిగమించవచ్చు. చైతన్యం పట్ల మానవ అవగాహన విప్లవాత్మకంగా మారిపోతుంది. భారతీయ ఆర్థిక, పరిపాలనా సూత్రాల మీద శిక్షణ పొందిన ఏఐ మోడల్... అభివృద్ధి చెందుతున్న దేశాలకు పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ విధానాలు, చైనా విధానాలు కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలు సూచించగలదు. లాభాలే ధ్యేయంగా నడుస్తున్న సిలికాన్ వ్యాలీకి భారతీయ నైతిక విలువల ఆధారంగా రూపొందే ఏఐ నూతన మార్గదర్శనం చేస్తుంది. భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుని ప్రపంచానికి తన సత్తా చూపించాలి. దీనికోసం అపారంగా ఉన్న ప్రాచీన,ప్రాంతీయ సాహిత్యాన్ని డిజిటల్ రూపంలోకి మార్చాలి. ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు ఇందుకు నడుం బిగించాలి. కృత్రిమ మేధను భారత్ కేవలం ఒక సాధనంగా చూడ కూడదు. అంతకంటే మిన్నగా అది జ్ఞానోదయానికి తోడ్పడు తుందని గ్రహించాలి. మన ప్రాచీన గ్రంథాలు అందిస్తున్న జ్ఞానాన్ని ఆధునిక ఏఐతో మిళితం చేసినట్లయితే, ఆధ్యాత్మిక, శాస్త్ర విజ్ఞాన, వైద్య రంగాల్లో నూతన ఆవిష్కరణలు వెలుగు చూస్తాయి. మన మేధా సార్వభౌమత్వాన్ని తిరిగి కైవసం చేసు కోడానికీ, భారతీయ జ్ఞానాన్ని నలుచెరగులా వ్యాప్తి చేసి ప్రపంచ మానవాళిని సముద్ధరించడానికీ ఇది సరైన సమయం.వివేక్ వాధ్వా వ్యాసకర్త వయొనిక్స్ బయోసైన్సెస్ సీఈఓ, రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
డ్రాగన్–ఎలిఫెంట్ల సయోధ్య సాధ్యమా?
20వ ‘సెంట్రల్ కమిటీ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా’ ప్లీనరీలో, ఉన్నత–ప్రమాణాల సోషలిస్ట్ మార్కెట్ (Socialist Market) ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నాణ్యతా ఆర్థికాభివృద్ధితో అత్యున్నత అత్యాధునిక సోషలిస్ట్ దేశంగా చైనాను రూపొందింపజేయాలని ‘డ్రాగన్’ సంకల్పించింది. ప్రపంచ ఆర్థిక పురోగతికి 30 శాతానికి మించి దోహదపడుతున్న చైనాలో 2024లో ఆరు నెలల్లోనే 26,870 కొత్త విదేశీ –పెట్టుబడి కంపెనీలు వాణిజ్య రంగంలో అడుగుపెట్టాయి. ఆధునిక సోషలిస్ట్ దేశంగా డ్రాగన్, ‘వికసిత భారత్ 2047’ లక్ష్యంతో పురోగమిస్తున్న భారత్ (India) రెండూ, 280 కోట్ల జనావళి శ్రేయస్సు దిశలో నడుస్తున్నాయి.ప్రస్తుతం మన దేశంలోని, ప్రతీ రాష్ట్రం, భారీ కార్పొరేట్ రంగ యాజమాన్యాలు మరింత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జాయింట్ వెంచర్లు, టెక్నాలజీ టై–అప్స్, సమృద్ధిగా ఎగుమతులు సాధించే ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్నాయి. అమెరికా (ట్రంప్ 2.0), చైనా (China) దిగుమతులపై ట్యారిఫ్ల పెంపుదల బెదిరింపులు చైనాకు తప్పేటట్టు లేదు. మన ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా వర్తక వ్యాపార సమతూక నిర్వహణకు చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (Foreign Direct Investment) ఆహ్వానించడం సమయోచితంగా సూచించారు. 2025లో భారత్–చైనా దేశాధినేతల పరస్పర సహకార సౌహార్ద బాంధవ్యానికి 2024 అక్టోబర్‌లో బ్రిక్స్, కజాన్ సమావేశం కొంత సానుకూలత కల్పించింది.2024 నవంబర్‌లో భారత్–చైనా విదేశీ వ్యవహారాల మంత్రులు జైశంకర్, వాంగ్‌యీ కూడా రియో డి జెనీరోలో ద్వైపాక్షిక చర్చలలో పాల్గొన్నారు. ప్రపంచంలో ద్వితీయ ఆర్థిక సంపన్న దేశంగా 2024లో గుర్తింపు పొందింది. 2023లో మన దేశంతో 136.2 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వర్తక, వాణిజ్య భారీ భాగస్వామ్యం పొందింది. మన దేశపు అత్యంత నాణ్యతా ఉత్పత్తులకు చైనాలో ప్రోత్సాహం ఉండనే ఉంది. 2024లో మన దేశపు మిర్చి, ఇనుప ఖనిజం, పత్తి, నూలు చైనాకు ఎగుమతులలో వరుసగా 17 శాతం, 160 శాతం, 240 శాతాలకు పైగా వృద్ధి సాధించాయి. చైనా, అంతర్జాతీయ దిగుమతుల ఎక్స్పో వంటి ప్లాట్ ఫారాల పూర్తి వినియోగానికి భారత్‌లోని అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను ఆహ్వానిస్తూనే ఉంది.చైనా – భారత్‌ల మధ్య నెలకొని ఉన్న సరిహద్దు వివాదం శతాబ్దాల సంఘర్షణల నేపథ్యం పరిశీలిస్తే... అంత సులభంగా పరి ష్కారం కాదని గ్రహించవచ్చు. రుణప్రదాతగా రాజనీతితో వ్యవహరిస్తున్న బడా చైనా సార్వభౌమ ఆధిపత్యపు కోరలలో చిక్కుకొన్న లావోస్, అంగోలా, 16 సబ్ – సహారా దేశాలు, కాంగో, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కంబోడియా, నైజీరియా, ఈజిప్ట్ వంటి... మధ్య, స్వల్ప, అల్ప ఆదాయ దేశాలు విలవిలలాడుతున్నాయి. 2017లో శ్రీలంక తన మేజర్ నౌకాశ్రయం హాంబన్ తోటను చైనాకు స్వాధీనం చేయవలసి వచ్చింది. టిబెట్‌లో సియాంగ్ నదిపై (అస్సాంలో బ్రహ్మపుత్రా) అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో 60,000 మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్రపంచంలోనే అతి పెద్దదైన జల విద్యుత్ కేంద్ర నిర్మాణం తలపెట్టింది.చదవండి: 140 కోట్ల భారతీయులకూ అది అవమానమే!అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమా ఖండూ ఇటీవల జనవరి నెలాఖరులో చైనా అంతర్జాతీయ జల ఒడంబడికలను ఎలా త్రోసిరాజంటున్నదీ చెప్పారు. ఆ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో సృష్టించే పెను పర్యావరణ, ప్రకృతి విధ్వంసాన్ని వివరిస్తూ చైనా వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని చిక్కుముడుల మధ్య డ్రాగన్–ఎలిఫెంట్ సయోధ్య సాధ్యమా?– జయసూర్యసీనియర్ జర్నలిస్ట్ -
ఇండియా Al అస్త్రాలు.. మోదీ దెబ్బతో పాక్, చైనాకు దబిడి దిబిడే
-
పడి.. లేచి.. బబుల్ టీతో వేల కోట్లకు పగడలెత్తాడు
మీరు ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా (business ideas in telugu) కోసం చూస్తున్నారా? ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్ ఐడియాతో ఎక్కువ లాభం అర్జించాలని అనుకుంటున్నారా? అయితే, ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కొత్త బిజినెస్ ఐడియా ఏంటో తెలుసా? బబుల్ టీ. మనకు సాధారణ టీ గురించి, టీ ఫ్రాంచైజీల గురించి తెలుసు. దాని బిజినెస్ మోడల్ గురించి తెలుసు. మరి బబుల్ టీ(Bubble tea). ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్సే ఈ బబుల్ టీ బిజినెస్. బబుల్ టీని అమ్మి తాజాగా 38 ఏళ్ల యునాన్ వాంగ్ (Yunan Wang) చైనాలో బిలియనీర్ అవతారం ఎత్తారు.ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..ఇటీవల యునాన్ వాంగ్ సంస్థ ‘మింగ్ హోల్డింగ్స్’ ఐపీవోకి వెళ్లింది. ఈ ఐపీవోలో అదరగొట్టేలా 233 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో వాంగ్ నికర విలువ 1.2 బిలియన్లకు పెరిగింది. ఫలితంగా చైనా బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. ఇక మింగ్ హోల్డింగ్స్ ‘గుడ్మీ’ పేరుతో బబుల్ టీని విక్రయిస్తుంది. 2023 చివరి నాటికి చైనాలోని తొలి ఐదు బబుల్ టీ బ్రాండ్లలో 9.1శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోతుంది. యునాన్ వాంగ్ ఎవరు?38 ఏళ్ల యునాన్ వాంగ్ చైనాలోని ప్రముఖ బబుల్ టీ కంపెనీ గుమింగ్ హోల్డింగ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. అతని తల్లిదండ్రులు మయన్మార్ సరిహద్దుల్లో చిన్న రిటైల్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నారు. యునాన్ వాంగ్ 2010లో జెజియాంగ్ సైన్స్-టెక్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్,ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ ఏడాది దాదాపు 15 సంవత్సరాల క్రితం తన స్వస్థలమైన డాక్సీలో బబుల్ టీ షాపును ప్రారంభించాడు. బబుల్ టీ బిజినెస్ ప్రారంభంలో అనేక ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. రోజుకి వాంగ్ బబుల్ టీ అమ్మకాలు కేవలం 100 యువాన్ల (సుమారు $18.50) వరకు మాత్రమే అమ్మకాలు జరిగేవి. దీంతో పరిస్థితి మరింత దిగజారుతుందని భావించిన వాంగ్ తన సహ వ్యవస్థాపకుడి కూల్‌డ్రింక్‌ను అమ్మేవారు. ఫ్రాంచైజీలు రోజులు గడిచే కొద్ది వాంగ్ అమ్మే బబుల్ టీ షాపుకు కస్టమర్ల తాకిడి ఎక్కువైంది. అమ్మకాలు జోరందుకున్నాయి. చైనా వ్యాప్తంగా మొత్తం 10వేల బబుల్ టీ ఫ్రాంచైజీలతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. తాజా బబుల్ టీ బిజినెస్‌లో బిలియనీర్ అయ్యాడు.బబుల్ టీ క్రేజ్బోబా టీనే బబుల్ టీగా అవతరించింది. 1980లలో తైవాన్‌లో పుట్టిన బబుల్ టీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుర్రకారుకు యమక్రేజ్. ఈ బబుల్ టీని చల్లని పాలు, పండ్ల రసాలు, టాపియోకా (టాపియోకా అనేది కాసావా (Cassava) అనే మొక్క వేరు నుండి తయారు చేసే పిండి పదార్థం) , జెల్లీ ముక్కలతో తయారు చేస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా తైవాన్, చైనా, ఇతర ఆసియా దేశాలలో ప్రాచుర్యం పొందింది. ఈ బబుల్ టీ అమ్మకాలు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో మన తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. వివిధ రకలా పండ్ల రుచులు, చాక్లెట్, ఇతర ప్రత్యేక రుచులతో బబుల్ టీని విక్రయిస్తున్నారు. -
కుంటిసాకులు
ఇప్పటికే సమస్త జీవన రంగాలనూ అల్లుకుపోయిన కృత్రిమ మేధ (ఏఐ)పై పారిస్‌లో వరసగా రెండురోజులపాటు కొనసాగి మంగళవారం ముగిసిన మూడో శిఖరాగ్ర సదస్సు ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది. సరిగ్గా రెండేళ్ల క్రితం బ్రిటన్‌లోని బ్లెచ్లీ పార్క్‌లో జరిగిన తొలి ఏఐ శిఖరాగ్ర సదస్సు (సేఫ్టీ సమ్మిట్) పూర్తిగా భద్రతాపరమైన అంశాలపై దృష్టిపెట్టింది. నిరుడు దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సు ప్రముఖ ఏఐ సంస్థల నుంచి భద్రతకు సంబంధించి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామన్న వాగ్దానాలు పొందగలిగింది. దానికి కొనసాగింపుగా పారిస్ శిఖరాగ్ర సదస్సును ‘ఏఐ యాక్షన్ సమ్మిట్’గా నామకరణం చేశారు. ఏఐ పరిమితు లేమిటో, అంతర్జాతీయ స్థాయిలో అందుకు పాటించాల్సిన నిబంధనలేమిటో ఈ శిఖరాగ్ర సదస్సు నిర్దేశిస్తుందని అందరూ ఊహించారు. కానీ బ్లెచ్లీ సదస్సు సాధించిన కొద్దిపాటి విజయాలనూ పారిస్ సదస్సు ఆవిరి చేసింది. దాపరికం లేని, సమ్మిళిత ఏఐ సాధనకు సమష్టిగా కృషి చేయాలన్న పిలుపునైతే ఇచ్చిందిగానీ, ఈ డిక్లరేషన్‌పై సంతకం చేసేది లేదని అమెరికా, బ్రిటన్లు మొరాయించాయి. మనతోపాటు 60 దేశాలు అంగీకరించిన ఈ డిక్లరేషన్‌ను అగ్రరాజ్యాలు కాదన్నాయంటే ఈ రంగం తీరుతెన్నులు ఎలా వుండబోతున్నాయో అంచనా వేయొచ్చు. ‘కొన్నేళ్ల క్రితం చర్చించిన ఏఐ భద్రత గురించి మాట్లాడటానికి ఇక్కడకు రాలేదు. ఏఐలో వెల్లువలా వచ్చిపడే అవకాశాలే నావరకూ ప్రధానాంశం’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. ఆయన ప్రస్తావించిన ఏఐ భద్రత అనేది నిజానికి 2023లో బ్రిటన్ చొరవతో బ్లెచ్లీ పార్క్ శిఖరాగ్ర సదస్సులో లోతుగా చర్చించిన అంశం. కానీ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆ సంగతే గుర్తులేనట్టు వ్యవహరించి అమెరికా తోకపట్టుకుపోయారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశాల వైఖరులు మారితే అంతర్జాతీయంగా వాటికి విశ్వసనీయత ఏముంటుంది? ఇప్పటికే అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్ వాతావరణ ఒడంబడిక నుంచి బయటికొస్తున్నట్టు ప్రకటించారు. లక్షల కోట్ల పెట్టుబడితో ప్రధాన ఏఐ సంస్థలన్నీ సాగిస్తున్న పరిశోధనలు భవిష్యత్తులో ఎటువంటి కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేస్తాయో, అవి ప్రపంచ పౌరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలవోనన్న ఆందోళన అగ్రరాజ్యాలకు లేశమాత్రమైనా లేదని తేలిపోయింది. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు వచ్చిపడుతుందని, భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందని అన్ని దేశాల్లోనూ భయాందోళనలున్నాయి. వందమంది గంటలో చేయగల పని ఏఐ కొన్ని క్షణాల్లో చేసి చూపటాన్ని గమనిస్తే అవి సహేతుకమైనవేనన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే శిఖరాగ్ర సదస్సుకు సహాధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఉద్యోగాల స్వభావం మారు తుంది తప్ప ఉద్యోగాలు పోవు. కొత్త సాంకేతికతలు అడుగుపెట్టినప్పుడు ఆ నైపుణ్యతలను పెంచు కోలేనివారికి ఇబ్బందులుంటాయి. ఆ సాంకేతికతల్ని లొంగదీసుకోవటమే ఇందుకు పరిష్కారం. ఏఐ ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా వైద్య, వైజ్ఞానిక రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిశోధనలు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఊహకందని వినూత్న ఆవిష్కరణలు రంగప్రవేశం చేస్తాయి. చికిత్సకు లొంగని మొండివ్యాధులు పలాయనం చిత్తగిస్తాయి. ఆయుఃప్రమాణాలు పెరుగుతాయి. అయితే రక్షణ, యుద్ధతంత్ర, అంతరిక్ష రంగాల్లో ఇది సృష్టించగల ఉత్పాతాలు చిన్నవేమీ కాదు. ఇందుకు కొత్త తరం ఏఐ మోడల్స్ ఉదాహరణ. తాజా మోడల్ ఒకటి సవరణలకు అవకాశం లేకుండా తన సృజనకర్తనే పక్కదారి పట్టించేలా తనను తాను కాపీ చేసుకుందని ఆ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వచ్చే అయిదేళ్లలో సూపర్ హ్యూమన్ స్థాయి ఏఐ రూపొందటం ఖాయమని వారంటున్నారు. భద్రతకు సంబంధించి ఏఐలో సాగుతున్న పరిశోధనల్లో తలెత్తే ప్రశ్నలకు పరిష్కారం కనుగొనకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నది వారి హెచ్చరిక. కానీ అమెరికా తప్పుడు సూత్రీకరణలు చేస్తోంది. భద్రత గురించిన జాగ్రత్తలను సెన్సార్‌షిప్‌గా వక్రీకరిస్తోంది. యూరప్ యూనియన్ (ఈయూ) రూపొందించిన నియంత్రణ చట్టాలు ఆ రంగం పీకనొక్కడానికే పనికొస్తాయని వాన్స్ భాష్యం చెబుతున్నారు. ఏఐ విషయంలో సైద్ధాంతిక పక్షపాతాలకు అతీతంగా వ్యవహరించాలని, స్వేచ్ఛనీయాలని ఆయన డిమాండ్. తప్పుడు సమాచార వ్యాప్తిని గుర్తించి తొలగించటానికి ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు రూపొందించుకున్న ఉపకరణాలను (ట్రంప్ వస్తారనగానే ఆ సంస్థలు స్వచ్ఛందంగా వాటిని ఉపసంహరించుకున్నాయి) సెన్సార్‌షిప్‌గా వక్రభాష్యం చెప్పినవారు ఇంతకుమించి ఆలోచించగలరా? ఏఐ రంగంలో ఇప్పట్లాగే భవిష్యత్తులోనూ తన ప్రాబల్యమే కొనసాగుతుందని, దాన్ని గుప్పెట్లో పెట్టుకుని లక్షల కోట్ల లాభాలు ఆర్జించవచ్చని అమెరికా కలగంటోంది. కానీ ఇటీవల చైనా నుంచి వచ్చిన డీప్‌సీక్ దూకుడు గమనిస్తే ఈ రంగం ఎవరి జాగీరూ కాదని స్పష్టమవుతోంది. ఇలా నిరంతరం ఊహాతీతంగా చక చకా ఎదుగుతున్న రంగానికి బాధ్యతాయుతమైన మార్గాన్ని నిర్దేశించకపోతే దానివల్ల మానవాళికి ముప్పు కలిగే అవకాశం లేదా? సురక్షిత, హేతుబద్ధ, పారదర్శక ఏఐ రూపొందటానికి దేశాలన్నీ సమష్టిగా కృషి చేయకపోతే, సాధించే అభివృద్ధిని ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి నెలకొల్పనట్టయితే అది స్వీయ వినాశనానికే దారితీస్తుందని అన్ని దేశాలూ గుర్తించాలి. -
ఏఐలో చైనాతో పోటీ పడగలమా?
లియాంగ్ వెన్ఫెంగ్ అనే 39 ఏండ్ల చైనా యువకుడు తన నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ– కృత్రిమ మేధ) కంపెనీలో అతి తక్కువ ఖర్చుతో ఒక అద్భుతం చేశాడు. అతను డీప్‌సీక్ అనే కొత్త చాట్ బాట్ యాప్‌ను కనిపెట్టి ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టాడు. జనవరి చివరి వారంలో ప్రవేశపెట్టిన ఈ సెర్చ్ ఇంజిన్ ఒక్కరోజులోనే అమెరికాకు ఒక ట్రిలియన్ డాలర్లు, అంటే ఒక లక్ష కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌లు తయారుచేసే కంపెనీలు భారీ నష్టాన్ని చవి చూశాయి.సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచ సమాచార సెర్చ్ అంతటినీ గూగుల్ కంపెనీ గుప్పిట్లో పెట్టుకొని ఉంది. అంతేకాకుండా ఇతర యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ మొదలైనవన్నీ అమెరికన్ల పరిశోధనలో రూపుదిద్దుకున్నవే. ఈ రంగంలో చైనా వారు కూడా ఈ అమెరికా టెక్నాలజీని తీసుకొని తమ దేశ అవసరాలకు అప్లై చేసుకుంటున్నారు. లియాంగ్ ఒక ఇంట ర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం, చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఇప్పటివరకు జరుగలేదు. ఆధార ఏఐ సైన్సును లియాంగ్ ఇన్నోవేటివ్ సైన్సుగా మార్చాడు.హేతుపూర్వక సమాజంఐతే చైనా చాలా ఇతర రంగాల్లో ఇన్నోవేషన్లు చేస్తూ వస్తున్నది. అది కమ్యూనిస్టు దేశంగా మారకముందే తమ దేశంలోని అగ్రి కల్చరిజం అనే ఫిలాసఫీని కన్ఫ్యూషియనిజం, బుద్ధిజంతో జతపర్చి సమాజాన్ని ఒక హేతుపూర్వక సమాజంగా మారుస్తూ వచ్చింది. మతతత్వానికంటే ముందే వారు వ్యవసాయ తత్వానికి పాఠశాలల్లో ఉన్నత స్థానమిచ్చారు. పిల్లల్ని బడి నుండి పొలానికి, పొలం నుండి బడికి పంపి... పని, పాఠాలు కలగలిపి నేర్పించారు. చైనా పాఠశాల విద్యా విధానం వందల సంవత్సరాల శ్రమ జీవన పాఠాలతో ముడిపడింది. ఆ దేశంలో మతాన్ని, హేతుబద్ధతను ముడేశారు. దాన్ని పిల్లలకు నేర్పే అగ్రికల్చరిజం ఫిలాసఫీతో అనుసంధానించారు. భూమికి, ఆకాశానికి, ప్రకృతికి, వానకు, గాలికి గల సంబం«ధాన్ని మెటీరియలిస్ట్ ఆధ్యాత్మికతకు అనుసంధానించడం వల్ల చిన్న ప్పటినుండే పిల్లల మెదళ్లలో క్రియేటివ్ దైవవాదం ఏర్పడింది. ఈ విధానాన్ని సభ్య సమాజమంతటికీ అనుసంధానించారు. తద్వారా వారి దైవం ఉత్పత్తిలో భాగమయ్యాడు లేదా అయింది.అందుకే గన్ పౌడర్, కాగితం, కంపాస్, అచ్చు యంత్రం, సిస్మోమీటర్ (భూకంపాల అధ్యయన మిషన్) ముందు వాళ్ళే కనిపెట్టారు. సిస్మోమీటర్ను 1880లో బ్రిటిష్ జాన్ మిల్నే కను క్కున్నాడని రాసుకున్నప్పటికీ అది మొదలు చైనా కనిపెట్టిందే. ఆ సైన్సు తరువాత జపానుకు పాకి వారిని చాలా భూకంపాల నుండి కాపాడింది.డెంగ్ షియావోపింగ్ కాలంలో ప్రపంచ ఆధునిక సైన్సుతో తమ సైన్సును అనుసంధానం చేస్తున్నప్పుడు, మావో ధరించే ‘బంద్ గలా కోటు’ తమదేనా లేదా ‘టై అండ్ సూట్’ తమదా అని చర్చ జరిగింది. ఐతే టై–సూట్ చైనా డిస్కవరీ అని చారిత్రక ఆధారాలు దొరికాయి. దాంతో అధ్యక్షుడి నుండి కిందిస్థాయిల వరకు టై– సూట్‌ను అధికార డ్రెస్‌కోడ్‌గా మార్చుకున్నారు.ఇండియా పరిస్థితి ఏమిటి?చైనా యువకులు గత ముప్పయి సంవత్సరాలుగా యూరో– అమెరికా డిస్కవరీస్తో పోటీ పడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మావో కల్చరల్ రెవల్యూషన్ కాలంలో ఇచ్చిన నినాదం ‘మాయా వాదాన్ని బద్దలుకొట్టి, ప్రకృతిని పఠించు’. ఆయన యునాన్ రిపోర్టులో ఆ దేశంలోని అగ్రికల్చరిజం తత్వభూమికను బాగా అర్థం చేసుకున్నాడు. ఈ మొత్తం పరిణామ క్రమమే చైనాలో సైన్సు,మతం, నైతికత జాగ్రత్తగా అనుసంధానం కావడం. ఆ సామాజిక చైతన్యం నుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వాళ్ళు అమెరికాను తలదన్నే మార్గంలో ఉన్నారు. అందులో భాగమే డీప్‌సీక్. మరి మన దేశం స్థితి ఏమిటి? రుగ్వేద రచనా కాలంలోనే ఇక్కడి అగ్రికల్చరిజం ఫిలాసఫీని చంపేశారు. ఉత్పత్తి రంగంలో శాస్త్రీయ శ్రమ చేస్తున్న శూద్రులను (దళితులూ అందులో భాగమే) బానిసలుగా మార్చి, శ్రమశక్తి అజ్ఞాన మని నిర్వచించారు. ఈ ఆలోచనను బలోపేతం చెయ్యాలని ఆరెస్సెస్–బీజేపీ నాయకత్వం సైన్సు నుండి మతాన్ని సంపూర్ణంగా విడగొట్టాలనే భావనతో పయనిస్తోంది. చైనా డీప్‌సీక్ కనిపెట్టి అమెరికాను అతలాకుతలం చేసిన రోజులలోనే కుంభమేళాపై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చవుతున్నాయి. ఉత్పత్తికీ, ఆధునిక సైన్సుకూ పూర్తిగా దూరంగా ఉండేవారికి మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వీటి ప్రభావం లక్షలాది మంది స్కూలు, కాలేజీ పిల్లల మీద పడి దీన్నే భారతదేశ మార్గంగా భావించే దశకు తీసుకెళ్తున్నారు. ఉత్పత్తితో ముడిపడినవారికి స్తుతి చెయ్యట్లేదు. కూర్చొని తినేవారికి రాజ్యం గౌరవ పీఠం వేస్తుంది.ఇంగ్లిష్ వ్యతిరేక ప్రచారం, పురాతన దుస్తులు ధరించాలనే ప్రచారం యువకులను కచ్చితంగా సైన్సు వ్యతిరేకులను చేస్తుంది. ఈ దేశపు యువతను సీరియస్ యూనివర్సిటీ పరిశోధ కులను చెయ్యనివ్వకుండా మూఢ నమ్మకస్తుల్ని చేస్తుంది.ప్రశ్నించే తత్వం ముఖ్యంచైనాలో అది మతరంగంలోగాని, ఉత్పత్తి రంగంలో గాని, యూనివర్సిటీలోగాని ప్రశ్నించే తత్వాన్ని బాగా నేర్పుతారు. మావో ‘వంద ఆలోచనలు ఘర్షణ పడనివ్వు, వంద పువ్వులు వికసించనివ్వు’ నినాదం వాళ్ళ సంఘర్షణల చరిత్ర నుండి వచ్చింది. కానీ ఇండియాలో స్కూళ్లు, యూనివర్సిటీల్లో మతరంగాన్ని, అంతకంటే ముఖ్యంగా ఉత్పత్తి రంగాన్ని ఆలోచనల ఘర్షణలకు బయట నడవాలనే సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నారు. మోహన్ భాగవత్ ఉత్పత్తికీ, దేవుడికీ మధ్య సంబంధం, ఘర్షణ గురించి ఒక్క ఉప న్యాసం ఇవ్వగా మనం చూడలేదు. మోదీ కూడా నెహ్రూ లాగా సైన్సు మీద ఒక్క సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వలేదు. చైనాతో సమానంగా ఉన్న ఇంత పెద్ద జనాభాను సైన్సుకు శత్రువులను చేస్తే కొత్త ఆలోచనలు యువతకు ఎక్కడి నుండి వస్తాయి?నేను ఇంతకుముందు వ్యాసంలో చెప్పినట్లు... కులం, ఏకవృత్తి, మూఢ నమ్మకాలు వేల ఏండ్లుగా మన మెదడు చిప్‌ను లాక్ చేసిన స్థితి ఉన్నది. ఆరెస్సెస్/బీజేపీ ప్రయత్నం ఈ లాక్ చెయ్యబడ్డ చిప్‌ను ఓపెన్ చెయ్యడం వైపు లేదు. వారి రాజకీయ మూఢ నమ్మకం ఈ లాక్‌ను తుప్పు పట్టించింది. అది పగల కొడితే తప్ప ఓపెన్ కాదు. కానీ అలాంటి ప్రయత్నం మన విద్యా రంగంలో ఎవరు మొదలు పెట్టినా వారిని దేశద్రోహులు, సనాతన వ్యతిరేకులు అని ముద్ర వెయ్యడం, భయభ్రాంతులకు గురి చెయ్యడం మామూ లైంది. ఈ స్థితిలో చైనాతో పోటీపడే డిస్కవరీస్ ఇక్కడ ఎలా జరుగుతాయి? కొత్త డిస్కవరీలు జరగడానికి డబ్బు ఒక్కటే సరి పోదు. సైంటిస్టును అభివృద్ధి చేసే సామాజిక, గృహ, మార్కెట్, మత పునాది ఉండాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
కేంద్రం అలర్ట్.. చైనా డీప్‌సీక్ వినియోగంపై అడ్వైజరీ!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ రంగంలో సంచలనం సృష్టించిన చైనాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘డీప్‌సీక్’తో భారతీయ కంప్యూటర్లలో డేటా గోప్యత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళనలు రేకత్తడంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. డీప్‌సీక్ వంటి ఏఐ వినియోగంపై తగు సూచనలు, సలహాలు, హెచ్చరికలతో అధికారిక అడ్వైజరీని జారీ చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. సైబర్ సెక్యూరిటీ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులను హెచ్చరిస్తూ ఈ ఉత్తర్వులు తీసుకురానుంది.డీప్‌సీక్ తన ఏఐ చాట్‌బాట్ ఆర్1 ద్వారా సున్నితమైన యూజర్ డేటాను ఎలా యాక్సెస్ చేస్తోందనే దానిపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) సమగ్రస్థాయిలో దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పూర్తయ్యాక చర్యలు చేపడుతుంది. యూజర్ ప్రాంప్్ట్స, డివైజ్ ఇన్ఫర్మేషన్, యాప్ ఇంటరాక్షన్స్, కీ స్ట్రోక్‌లతో విస్తృత శ్రేణి డేటాను డీప్‌సీక్ సేకరిస్తోందని సీఈఆర్టీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రతా ప్రయోజనాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని భద్రతా చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు.. భారత్ మాత్రమే కాదు ఆ్రస్టేలియా, ఇటలీ, దక్షిణ కొరియాతో సహా అనేక దేశాలు గోప్యత, భద్రతా ప్రమాదాల దృష్ట్యా ప్రభుత్వ విభాగాలు, అధికారిక కంప్యూటర్ల, కీలక వ్యవస్థల్లో డీప్‌సీక్ టూల్స్ వినియోగంపై ఆయా దేశాల ప్రభుత్వాలు నిషేధం విధించాయి. విడుదల నాటినుంచే ప్రపంచవ్యాప్తంగా డీప్‌సీక్ సంచలనం సృష్టించడంతోపాటు కొత్త భయాందోళనలకు తెరలేపింది. అత్యద్భుతమైన పనితీరుతో ఏఐ మోడల్ మొదట ప్రశంసలు పొందినా.. దాని డేటా సేకరణ పద్ధతులతో పలు దేశాల ప్రభుత్వాలు ఆందోళనలో పడ్డాయి.ప్రైవసీ, మాల్వేర్ ప్రమాదాల కారణంగా డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా నిషేధించింది. తైవాన్ దీనిని దేశ భద్రతా ముప్పుగా పేర్కొంది. యూజర్ డేటాను ఉపయోగించడంలో పారదర్శకతను చూపకపోవడంతో దక్షిణ కొరియా దీనిని జాతీయ భద్రతా ప్రమాదంగా ప్రకటించింది. తమ పౌరుల డేటాను ప్రాసెస్ చేయకుండా ఇటలీ డీప్‌సీక్‌ను అడ్డుకుంటోంది. డీప్‌సీక్ వారి ఆర్1 మోడల్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఉచిత సేవలు అందించే డీప్‌సీక్ వంటి యాప్‌లు యూజర్ల డేటాను సేకరించి దానికి ముడిసరకుగా వినియోగిస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య టెక్ కంపెనీల మాదిరిగా కాకుండా డీప్‌సీక్ కేవలం చైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పనిచేస్తుంది. ప్రామాణిక డేటాను మించి.. ప్రామాణిక డేటా సేకరణ పద్ధతులతోపాటు ఇతర మార్గాల్లోనూ వినియోగదారుల ఆన్లైన్, ఆఫ్‌లైన్ కార్యకలాపాలను డీప్‌సీక్ ట్రాక్ చేస్తోందని సీఈఆర్టీ పరిశోధనలో తేలింది. చాట్‌బాట్ ఆర్1 వినియోగించడం మొదలుపెట్టిన తరువాత.. చాట్ జీపీటీ లేదా గూగుల్‌కు చెందిన జెమినీ వంటి పోటీ యాప్‌లను యూజర్లు ఉపయోగించడం మానేశారా లేదా అనే విషయాన్ని కూడా ఈ యాప్ చెక్‌చేస్తోంది. తాము సేకరించిన సున్నితమైన డేటా తమ వద్ద భద్రంగా ఉంటుందని, చైనా ప్రభుత్వానికి చేరబోదు అనే సరైన వివరణ డీప్‌సీక్ ఇవ్వట్లేదు. దీంతో డీప్‌సీక్‌కు జవాబుదారీతనం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ యాప్‌తో వ్యక్తిగత డేటా చైనాకు చేరుతోంది. దీంతో డీప్‌సీక్ యూజర్లు నిఘా లేదా సైబర్ గూఢచర్యం వంటి దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంది. చాట్‌జీపీటీ, డీప్ సీక్ వంటి ఏఐ టూల్స్‌ను ప్రభుత్వ అధికారులు ఉపయోగించరాదని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
డిజిటైజేషన్ అంటే నియంత్రణల ఎత్తివేత కాదు
ముంబై: డిజిటైజేషన్ అంటే నియంత్రణల తొలగింపు అన్న తప్పుడు అభిప్రాయం అధికార యంత్రాంగంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్(Ananth Nageswaran) అన్నారు. ప్రత్యామ్నాయ పెట్టుబడుల (ఏఐ) పరిశ్రమ లాబీ గ్రూప్ ఐవీసీఏ ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాగేశ్వరన్ మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల్లో ఒక తప్పుడు అభిప్రాయం నెలకొంది. వారు ఏదైనా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఉంచారంటే, దాన్ని నియంత్రణ తొలగింపుగా భావిస్తున్నారు. కానీ అది నియంత్రణల తొలగింపు కాదు. ఆఫ్‌లైన్ బదులు ఆన్లైన్లో ఉంచారంతే. అభివృద్ధి చెందాలనుకునే ఏ దేశమైనా చిన్న వ్యాపారాలపై దృష్టి సారించాలి. నియంత్రణల వంటి సవాళ్లను తొలగించాలి. దాంతో నిబంధనల అమలుపై వనరులు వృధా కాబోవు’’అని స్పష్టం చేశారు. ప్రపంచీకరణ స్థానంలో కొత్త నమూనా రానున్న రోజుల్లో భారత్ దేశీ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడడం ద్వారానే మరింత వృద్ధి సాధించగలదన్నారు నాగేశ్వరన్. గ్లోబలైజేషన్ (ప్రపంచీకరణ) గతంలో మాదిరిగా ప్రయోజనాలను అందించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీ గ్లోబలైజేషన్ (దేశాల మధ్య అనుసంధానం తగ్గిపోవడం) ధోరణి వంద సంవత్సరాలకు పైగా చూస్తున్నదేనంటూ.. ప్రస్తుత నమూనాలో పరిమితుల దృష్ట్యా కొత్త ధోరణి అవతరించొచ్చన్నారు. రూపాయి ఏటా 3 శాతం క్షీణత ద్రవ్యోల్బణాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న 4–5 శాతం శ్రేణి నుంచి 3–4 శాతం శ్రేణికి పరిమితం చేస్తే రూపాయి విలువ క్షీణతను అడ్డుకోవచ్చన్న అభిప్రాయాన్ని అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఏటా 3 శాతం క్షీణించొచ్చని (డాలర్‌తో పోల్చితే) చెప్పారు. ఇంధన భద్రత విషయంలో భారత్ రాజీపడకూడదన్నారు. చైనా పాలసీపై సమీక్ష లేదు.. చైనా పెట్టుబడులపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధాన్ని సమీప కాలంలో భారత్ సమీక్షించకపోవచ్చని నాగేశ్వరన్ అన్నారు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాల ప్రాముఖ్యతను గుర్తించినట్టు చెప్పారు. వాణిజ్య అసమానతలపై రెండు దేశాలు సంప్రదింపులు నిర్వహిస్తున్నాయని, పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. -
బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!
నమ్మేవాళ్లుండాలే గానీ ఎంతటి మోసానికి పాల్పడవచ్చు. కానీ మోసం ఎంతోకాలం దాగదు. ఎప్పటికైనా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం తప్పదు.చైనాకు చెందిన ఒక మహిళ స్టోరీలో అక్షరాలా ఇదే జరిగింది. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ నాడకమాడి, బంధువులను నిలువునా ముంచేసింది. చివరికి ఆమె కుట్ర గుట్టు రట్టు అయింది. విచారించిన కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆమె వలలో బంధువులు ఎలా పడ్డారు? ఈ స్కామ్ వెలుగులోకి ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరీ స్టోరీ చదవాల్సిందే!చైనాకు చెందిన మంగ్ (40) అనే మహిళ పెద్ద ప్లానే వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆమె ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నిర్వహించేది. కానీ అందులో నష్టాలు రావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. బిలియనీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ బంధువులను నమ్మించింది. ఫ్యామిలీని సైతం మోసం చేయాలనుకుంది. మందస్తు పథకం ప్రకారం డ్రైవర్ జియాంగ్ను పావుగా ఎంచుకుంది. ఈ విషయంలో జియాంగ్ను కూడా బాగానే బుట్టలో వేసుకుంది. ప్రేమిస్తున్నట్టు నమ్మిచింది. తన వయస్సు కారణంగా వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని అందుకే పెళ్లి చేసుకుందామంటూ ఒప్పించింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక ఆ తరువాత తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అనేక పెద్ద ప్రాజెక్టుల వెనుక రియల్టర్ అయిన తన భర్త జియాంగ్ ఉన్నాడని బంధువులను నమ్మించింది. తక్కువ ధరకే, అతి చౌకగా విలువైన ఆస్తులను దక్కించుకోవచ్చని ఆశపెట్టింది. అంతేకాదు మెంగ్ రూ.1.2 కోట్ల విలువైన ఒక చిన్న ఫ్లాట్‌ను కూడా కొనుగోలు చేసి, దానిని సగం ధరకు బంధువుకు విక్రయించింది.తనకు గొప్ప ధర వచ్చిందని బంధువులకు అబద్ధం చెప్పమని జియాంగ్ను కోరింది. మరో అడుగు ముందుకేసి, కొత్త నివాస భవనాల షోరూమ్‌లకు తీసుకెళ్లి, చదరపు మీటరుకు రూ. 61వేలవరకు తగ్గుతుందని ఆశచూపిచింది. దీంతో ఆమె మోసానని పసిగట్టలేని బంధువులు రూ.14 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) మేర డబ్బులను ముట్ట చెప్పారు.కనీసం ఐదుగురు బంధువులు ఫ్లాట్లను కొనడానికి ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. కొందరు మంచి ఆస్తికి మారాలనే ఆశతో ఉన్న ఫ్లాట్లను కూడా అమ్మేశారు.ఇక్కడే సమస్య మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రాపర్టీ బంధువులకు స్వాధీనం చేయలేదు మంగ్.ఇదీ చదవండి: అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?డిస్కౌంట్లో ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ దాట వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని ఫ్లాట్లను అద్దెకు తీసుకుని, ఇవి మనవే అని వారికి చూపించింది. ఇలా కాలం గడుస్తున్నకొద్దీ, సాకులుచెబుతోంది తప్ప ఆస్తి తమ చేతికి రాకపోవడంతో ఏదో తప్పు జరిగిందని గ్రహించిన బంధువులలో ఒకరు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారిని సంప్రదించాడు. దీంతో ఆమె అసలు స్కాం బైటపడింది. అవి అసలువి కాదని తేలిపోయింది. మెంగ్ నివసిస్తున్న ఫ్లాట్ ఆమెది కాదని వెల్లడైంది.దీంతో బాధితులంతా పోలీసులు ఆశ్రయించారు.ఈ కేసును విచారించిన కోర్టు మోసం చేసినందుకు మంగ్‌కు 12 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఫ్లాట్ల విషయంలో లీజు ఒప్పందాలపై సంతకం చేసినందుకు నకిలీ భర్త జియాంగ్‌కు కూడా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఇతర బంధువుల ముందు అబద్ధం చెప్పిన మరో బంధువుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. (ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త) -
రూ.230 కోట్ల డ్రోన్ కాంట్రాక్టులు రద్దు
న్యూఢిల్లీ: దేశీయ డ్రోన్ల తయారీదారులకు భారత సైన్యం షాక్ ఇచ్చింది. రూ.230 కోట్ల విలువైన డ్రోన్ల కొనుగోలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఆయా డ్రోన్లలో చైనా విడిభాగాలు ఉన్నట్లు తేలడమే ఇందుకు కారణం. తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడానికి 400 డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత సైన్యం తొలుత నిర్ణయించింది. ఇందులో 200 మీడియం–అల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీవెయిట్ డ్రోన్లు, 100 లైట్‌వెయిట్ డ్రోన్లు ఉన్నాయి. సైన్యానికి డ్రోన్లు సరఫరా చేయడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. అయితే, చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఈ డ్రోన్ల తయారీలో ఉపయోగిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇలాంటి వాటితో దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయా కాంట్రాక్టులకు రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, దేశ భద్రతకు సంబంధించిన పరికరాల్లో చైనా విడిభాగాలు అమర్చడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు బహిర్గతమయ్యాయి. మన రక్షణ వ్యవస్థలో చైనా హార్డ్‌వేర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ ఉపయోగించడానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్(డీజీఎంఐ) గతంలో రెండుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. చైనా తప్ప ఇతర దేశాల విడిభాగాలను డ్రోన్లలో ఉపయోగించేందుకు అనుమతి ఉందని అధికారులు అంటున్నారు. -
కోటిన్నర బంగారం కేవలం రూ.680కే అమ్మిన టీనేజర్!
ఓ బాలికకు తన స్నేహితుల్లో ధరించిన పోగులు,ముక్క పుడకలు నచ్చాయి. వెంటనే వాటిని కొనుగోలు చేయాలని అనుకుంది. కానీ చేతిలో డబ్బులు లేవు. ఇంట్లో వాళ్లను అడిగితే కోప్పడతారు. అందుకే ఏదో ఒకటి చేసి గిల్ట్ నగల్ని కొనుగోలు చేయాలని అనుకుంది. ఇందుకోసం తన తల్లి ధరించే రూ.1.16 కోట్ల బంగారాన్ని కేవలం రూ.680కే అమ్మేసింది. ఆ తర్వాత ఏమైందంటే? సౌత్ చౌనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనాలోని షాంఘైకు చెందిన బాలిక లిప్ స్టడ్లు, చెవిపోగులు కొనుగోలు చేసేందుకు మిలియన్ యువాన్ (రూ.1.16 కోట్లు) విలువైన తన తల్లి ఆభరణాలను దొంగిలించింది. వాటిని కేవలం 60 యువాన్లకు (రూ.680) విక్రయించింది.కుమార్తె చేసిన నిర్వాకం తెలియని తల్లి వాంగ్ వెంటనే పుటువో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోలోని వాన్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో దొంగతనం జరిగిందని, కోట్లు విలువ చేసే బంగారం నగలు మాయమైనట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో వాంగ్ ధరించే జేడ్ బ్రాస్లెట్లు, నెక్లెస్‌లు, డైమండ్లు పొదిగిన ముక్కపుడకల్ని ఆమె కుమార్తె అమ్మినట్లు గుర్తించారు. వాస్తవానికి ఆ బాలిక సైతం తాను అమ్మింది గిల్ట్ నగలనే అనుకుంది. ఇదే విషయంపై తల్లిని ఆరా తీయగా.. తన కుమార్తె లిప్ స్టడ్స్ కోసమే బంగారాన్ని అమ్మినట్లు చెప్పింది. ‘ఆ రోజు నా కుమార్తె నన్ను డబ్బులు అడిగింది. ఎంత అని అడగ్గా 60యువాన్లు అని చెప్పింది. ఎందుకు అని అడగ్గా..తన స్నేహితులు లిప్ స్టడ్స్ ధరించారని, అవి తనకు బాగా నచ్చాయని .. తాను కూడా ధరించాలని తన కోరికను చెప్పింది.లిప్ స్టడ్ ఖరీదు 30 యువాన్లు (రూ.340), మరియు ఆమె 30 యువాన్ల ధరతో మరో జత చెవిపోగులు కావాలని వివరించింది. వాటి మొత్తం ఖరీదు 60 యువాన్లు అని తెలిపింది. కానీ తాను ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పింది. తల్లి,కుమార్తెల మధ్య జరిగిన సంభాషణ విన్న పోలీసులు.. తల్లి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి.. ఇంట్లో ఉన్న బంగారాన్ని గిల్ట్ నగలు అనుకుని బంగారాన్ని అమ్మినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అనంతరం, బాలిక బంగారాన్ని ఎక్కడ అమ్మింది? ఎవరికి అమ్మింది? ఎంతకు అమ్మింది? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక తిరిగిన ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చివరికి బాలిక బంగారం ఎవరికి విక్రయించిందో గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందించారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది. -
వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!
స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాన్ని ప్రపంచంపై బలవంతంగా రుద్దిన అమెరికా, దాన్ని తమకు లాభం కలిగినంత కాలం ఉపయోగించుకుని ఇపుడు లాభం లేదనిపించటంతో ఎదురు తిరుగుతున్నది. ఆ విషయం బయ టకు ఒప్పుకోకుండా అధ్యక్షుడు ట్రంప్ సాకులు వెతుకుతున్నారు. కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు పెంచిన ఆయన తన చర్యకు పేర్కొన్న కారణాలను గమనించండి: అక్రమ వలసలు, ఫెంటానిల్ అనే మాదక ద్రవ్యం రవాణా. అక్రమ వలసలు మెక్సికో నుంచే గాక, ఆ దేశం మీదుగా ఇతర లాటిన్ అమెరికన్ దేశాల నుంచి, చివరకు ఇండియా వంటి సుదూర దేశాల నుంచి కూడా సాగుతున్న మాట నిజం. వాటి నిరోధానికి మెక్సికో సరిహద్దులలో గోడల నిర్మాణం, వేలాది సైన్యాల మోహరింపు ఇప్పటికే మొదలు పెట్టారు. కెనడా, చైనా నుంచి అక్రమ వలసలు అత్యల్పం. మాదక ద్రవ్యాల తయారీ, రవాణాను ఈ మూడు దేశా లలో ఏదీ అధికారికంగా ప్రోత్సహించటం లేదు. స్వేచ్ఛా వాణిజ్యానికి భంగంఅమెరికా, కెనడా, మెక్సికోల మధ్య వాణిజ్యానికి ఒక ప్రత్యేక ఒప్పందం ఉంది. అది ట్రంప్ మొదటి హయాం (2017–21)లో జరి గిందే. దానిని ట్రంప్ స్వయంగా ఉల్లంఘిస్తున్నారు. అమెరికా పట్టు బట్టి చేయించిన గాట్స్ ఒప్పందానికీ, అందుకు రూపాంతరమైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకూ, ఇంకా చెప్పా లంటే అమెరికా పెట్టుబడిదారీ, స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాలకూ ఈ చర్యలు విరుద్ధమైనవి. వాస్తవానికి తదనంతర కాలంలో ఇందుకు అనుగుణంగానే పాశ్చాత్య ప్రపంచంతో సహా అనేక దేశాలు పర స్పరమో, లేక ప్రాంతీయ బృందాలు గానో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఆ విధంగా ప్రపంచం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. పెట్టుబడులు, వాణిజ్యంలో పరస్పర చర్చల ద్వారా జరిగే ఈ ఒప్పందాలు సాధారణంగా అన్ని పక్షాలకూ ప్రయో జనకరమవుతున్నాయనే భావన ఏర్పడింది కూడా. అటువంటిది, ఈ పరిణామాలన్నింటికీ మాతృదేశమనదగ్గ అమెరికాయే అందుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతుండటం ఆశ్చర్యకరం. అనేక దేశాల వలెనే అమెరికాలోనూ మాదక ద్రవ్యాల విని యోగం పెద్ద ఎత్తున ఉంది. ఈ వినియోగం ఎప్పటినుంచి ఎందువల్ల మొదలై కొనసాగుతున్నదనే విషయం ప్రచారంలోకి రావటం లేదు. వియత్నాం యుద్ధంలో అమెరికా 1960ల నుంచి 1970ల వరకు ఉధృతంగా పాల్గొని భయంకరమైన హత్యాకాండ సాగించి ఆఖరుకు ఓటమిపాలైంది. ఆ కాలమంతా వారి యుద్ధ విమానాల రవాణా నైజీరియా మీదుగా జరిగినపుడు, యుద్ధం వల్ల వ్యథకు గురైన సైనికులు దానిని మరిచిపోయేందుకు స్థానికంగా లభించే మాదక ద్రవ్యా లకు అలవాటుపడ్డారు. అది యుద్ధం తర్వాత మాజీలు అయిన సైనికులకు కొనసాగి వారి ద్వారా, ఇతరత్రా వ్యాపించి స్థిరపడింది. ఆ కాలంలో లాటిన్ అమెరికా నుంచి డ్రగ్ కార్టెల్స్ ఎట్లా పని చేశాయన్న చర్చ అప్రస్తుతం. అయితే ఇందుకు సుంకాల హెచ్చింపు ఎట్లా పరిష్కారమవుతుందన్నది ట్రంప్ సైతం వివరించని ప్రశ్న. ఆ పని చేయటానికి బదులు, అంతర్జాతీయ ఆర్థిక అత్యవసరాల చట్టం ఒక దానిని అడ్డు పెట్టుకుని మెక్సికో, కెనడా వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలపై 25 శాతం సుంకాలు పెంచారు.కృత్రిమ ఆధిపత్యంఅమెరికా వంటి అగ్రస్థాయి సంపన్న దేశానికి ఇటువంటి చర్యల అగత్యం ఎందుకు ఏర్పడింది? తమ వద్ద ఉత్పత్తుల ఖర్చు పెరుగు తున్నందున, వెనుకబడిన దేశాలలో వేతనాలు, ముడిసరుకులు, మౌలిక సదుపాయాల ఖర్చు తక్కువ గనుక, అక్కడ ఉత్పత్తులు చేయించి, అక్కడి నుంచి చవకగా దిగుమతి చేసుకోవచ్చుననే వ్యూహంలో దీనికంతా మూలాలు ఉన్నాయి. ఇది కొంతకాలం సజా వుగా సాగినా, ఆయా దేశాలు సాంకేతికంగా, పారిశ్రామికంగా బల పడటం, తొలి దశలో అమెరికా నుంచి యూరప్ నుంచి తరలి వెళ్లిన ప్రైవేట్ కంపెనీలు అక్కడి లాభాలకు అలవాటుపడటంతో ఈ పాశ్చాత్య దేశాలకు పలు సమస్యలు మొదలయ్యాయి. అక్కడి పారి శ్రామికత, ఆదాయాలు, ఉపాధి అవకాశాలు తగ్గసాగాయి. మిగులు బడ్జెట్లు లోటు బడ్జెట్లుగా మారాయి. అమెరికా అయితే సుమారు 30 ట్రిలియన్ డాలర్ల లోటు, అప్పుల భారానికి చేరి, బంగారం నిల్వల మద్దతు లేకపోయినా డాలర్లను యథేచ్ఛగా ముద్రించి ప్రపంచం పైకి వదలటం, డాలర్ ఆధిపత్యాన్ని కృత్రిమంగా నిలబెట్టడం వంటి దశకు చేరుకుంది. మామూలుగానైతే ఆర్థికంగా ఇది దివాళా స్థితి అవుతుంది. కానీ ఆ కృత్రిమతను నిలబెట్టేందుకు, ఒకవేళ బ్రిక్స్ కూటమి డాలర్‌ను బలహీనపరిచే చర్యలు తీసుకునే పక్షంలో ఆ కూటమి దేశాలపై 100 శాతం సుంకాలు పెంచగలమంటూ పదేపదే బెదిరించవలసిన బలహీన స్థితిని అమెరికా ఎదుర్కొంటున్నది. ఇంతకూ ట్రంప్ సుంకాల హెచ్చింపు అమెరికాకు ఎంతవరకు ఉపయోగపడవచ్చునన్నది ప్రశ్న. ఈ తరహా చర్యలు ఆయన తన మొదటి పాలనా కాలంలోనూ తీసుకున్నారు. అపుడు ఆయన వాణిజ్య యుద్ధం కేవలం చైనాపై. అది చైనాకు కొంత నష్టం కలిగించినా అమెరికాకు అంతకన్న ఎక్కువ నష్టం కలిగిందన్నది అమెరికన్ ఆర్థిక వేత్తల దాదాపు ఏకాభిప్రాయం. అందుకు కారణాలను విశ్లేషించుకోవడానికి బదులు, తన వాణిజ్య యుద్ధాన్ని మిత్ర దేశాల పైకి కూడా విస్తరించటం నమ్మశక్యం కాకుండా ఉంది. రానున్న రోజులలో యూరోపియన్ దేశాలపై కూడా సుంకాల పెరుగుదల ఉండగలదని సూచించారు. అమెరికా దిగుమతులలో ఈ మూడు దేశాల ఉత్ప త్తులు కలిపి 40 శాతం ఉంటాయని అంచనా. అమెరికాకు ఎగుమతులు చేసే మొదటి 10 దేశాలలో చైనా తప్ప మిగిలినవన్నీ వారి మిత్ర దేశాలే. ఇండియా పదవ స్థానంలో ఉంది. ఇండియా పైనా సుంకాలు పెంచగలమని ట్రంప్ ఇప్పటికే అన్నారు. తమ ఆధునిక మోటార్ వాహనాలపై ఇండియా సుంకాలు తగ్గించాలని మొదటి పాలనా కాలంలో కోరగా అందుకు అంగీకరించని మోదీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త బడ్జెట్లో అటువంటి ప్రతిపాదనలు చేయటం గమనించదగ్గది. ఆ చర్య ట్రంప్‌ను మెత్తబరచగలదేమో చూడాలి.ట్రంప్ చర్యకు ప్రతిగా, కెనడా ప్రధాని ట్రూడో కొద్ది గంటల లోనే, అదే 25 శాతం స్థాయిలో ఎదురు సుంకాలు ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షెన్బామ్ కూడా తాము సుంకాలను పెంచి తీరగలమన్నారు. ఈ రెండు దేశాల నుంచి వివిధ వినియోగ వస్తువులపైనే గాక యంత్ర పరికరాలు, చమురు, విద్యుత్ దిగుమతు లపై అమెరికా చాలా ఆధారపడి ఉంది. మరొక వైపు చైనా ఈ సుంకాలు వివక్షాపూరితం అంటూ డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది. వాణిజ్య యుద్ధాలను అమెరికా గతంలోనూ చేసింది. కాకపోతే దౌత్యపరమైన లక్ష్యం కోసం ఇతరులను లొంగదీయటానికి. ట్రంప్ అట్లాగాక ఈ యుద్ధంతో తమ ఆర్థిక వ్యవస్థకు లాభం చేస్తామంటున్నారు. ఇతరులు లొంగి రావటంవల్ల అమెరికా లాభపడగలదనీ, దానితో ప్రజలపై ఆదాయ పన్ను మొత్తంగా రద్దు చేయవచ్చుననీ ఆశపెడుతున్నారు. అమెరికా మార్కెట్లు ఎంత పెద్దవి అయినా ఈ సుంకాల ఒత్తిడితో ఇతరులు కూడా సుంకాలు పెంచటం, వారి ముడి వస్తువులు అమెరికా పరిశ్రమలకు లభించకపోవటం, ఆయా దేశాలు ఇతర మార్కెట్లను వెదుక్కోవటం వంటివి జరిగితే పరిస్థితి ఏమిటి? ఇవిగాక రెండు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. ఇటువంటి యుద్ధాలతో స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతపు భవిష్యత్తు ఏమిటన్నది ఒకటైతే, ఈ ప్రభావాలు రాజకీయంగా, భౌగోళికంగా ఏ విధంగా ఉండవచ్చు ననేది రెండవది. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అనుకున్నదొకటి.. అయినదొకటి!
ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది. ఇటీవల అమెరికా చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందించింది. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది. చైనా నుంచి అమెరికా బొగ్గు, ద్రవరూపంలో ఉన్న సహజ వాయువు (ఎల్ఎన్జీ), ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, కొన్ని కంపెనీలకు చెందిన ప్రీమియం కార్లు.. వంటివాటిని బారీగానే దిగుమతి చేసుకుంటోంది. దాంతో భవిష్యత్తులో వీటిపై ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఇటీవల అమెరికా విధించిన సుంకాల పెంపునకు ప్రతిస్పందనగా చైనా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అమెరికా అనుసరించిన సుంకాల పెంపు విధానం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను ఉల్లంఘిస్తుందని, రెండు దేశాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారానికి విఘాతం కలిగిస్తుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వచ్చే సోమవారం నుంచి ఈ సుంకాల పెంపు అమల్లోకి వస్తుందని చైనా స్పష్టం చేసింది. కొత్త టారిఫ్‌ల్లో బొగ్గు, ఎల్ఎన్జీ ఉత్పత్తులపై 15 శాతం సుంకం, ముడిచమురు, వ్యవసాయ యంత్రాలు, ప్రీమియం కార్లపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా తెలిపింది. అమెరికాలోకి అక్రమ వలసదారులు, మాదకద్రవ్యాల ప్రవాహాన్ని నిరోధించడంలో విఫలమైన దేశాలను శిక్షించడమే లక్ష్యంగా ట్రంప్ ఇటీవల చైనా వస్తువులపై 10% సుంకం విధిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..చైనా అమెరికాకు వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా కౌంటర్ టారిఫ్‌లతో పాటు, యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ గూగుల్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తును అమెరికా వాణిజ్య చర్యలకు ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. చైనా మార్కెట్లో గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పోటీదారులకు అన్యాయం చేసే ఏదైనా వ్యాపార పద్ధతులను ఉపయోగించిందా అనే దానిపై దర్యాప్తు దృష్టి సాగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాపై సుంకాలు విధిస్తే వాణిజ్యం పరంగా కొంత వెనక్కి తగ్గుతుందని భావించిన అమెరికాకు.. చైనా ఇలా తిరికి టారిఫ్‌లు విధించడం కొంత ఎదురుదెబ్బే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల కోసం యూఎస్ భారత్‌వైపు చూసేలా ప్రయత్నాలు జరగాలని సూచిస్తున్నారు. -
మార్కెట్‌కు ట్రంప్ సుంకాల పోటు
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ అరశాతం నష్టపోయింది. దేశీయ కరెన్సీ రూపాయి భారీ కోత, అధిక వెయిటేజీ రిలయన్స్ (–1.50%), ఎల్అండ్టీ (–4.50%) క్షీణతలూ ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద నిలిచింది. దీంతో ఈ సూచీ 5 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లైంది. నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించి 23,361 వద్ద నిలిచింది. వాణిజ్య యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 750 పాయింట్లు క్షీణించి 76,756 వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు కుప్పకూలి 23,222 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్ నుంచి కన్జూమర్ డ్యూరబుల్, ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. → క్యాపిటల్ గూడ్స్, ఇండ్రస్టియల్స్, విద్యుత్, యుటిలిటీస్, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 2%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. → మార్కెట్ పతనంతో రూ.4.29 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.419 లక్షల కోట్లకు తగ్గింది. ప్రపంచ మార్కెట్లూ డీలా ట్రంప్ టారిఫ్ దాడికి ప్రతిగా తాము కూడా టారిఫ్‌లు పెంచుతామని కెనడా, మెక్సికో ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయాలు మరింత తీవ్రమయ్యాయి. ఆసియాలో జపాన్, తైవాన్, కొరియా సూచీలు 3.50% క్షీణించాయి. ఇండోనేషియా, సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు 2–0.5% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. అమెరికా సూచీలు నాస్డాక్ 1%, ఎస్అండ్పీ అరశాతం, డోజోన్ పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
కాలువపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించండి
వాషింగ్టన్: పనామా కాలువపై చైనా ఆధిపత్యం, నియంత్రణను తగ్గించడానికి అత్యవసర మార్పులు చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పనామా దేశాన్ని హెచ్చరించారు. ఆదివారం పనామాలో పర్యటించిన రూబియో.. పనామా దేశాధక్షుడు జోస్ రౌల్ ములినోతో భేటీ అయ్యారు. కాలువపై యథాతథ స్థితి ఆమోదయోగ్యం కాదని, తక్షణ మార్పులు లేకపోతే, ఒప్పందం ప్రకారం తన హక్కులను రక్షించడానికి అమెరికా అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే అమెరికా బెదిరింపులకు తాము భయపడబోమని ములినో స్పష్టం చేశారు. చైనా ఆధిపత్యం గురించి అమెరికా ఆందోళనలను పోగొట్టేందుకు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూబియో పర్యటన వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడం వంటి ఉమ్మడి ఆసక్తులపై దృష్టి పెడుతుందని ములినో ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ప్రకటించారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ములినో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన తెలిపారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక అక్రమ వలసదారుల ఏరివేతకు సహకారాన్ని పెంచుతామని ములినో హామీ ఇచ్చారు. రూబియో పర్యటనకు ముందు పనామాలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు ట్రంప్, రూబియో దిష్టి»ొమ్మలను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. -
టారిఫ్ వార్.. బొమ్మాబొరుసు!
సాక్షి, బిజినెస్ డెస్క్: ట్రంప్ దూకుడు చూస్తుంటే.. ఇతర దేశాలను కాళ్లబేరానికి తెచ్చుకునే వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రేపోమాపో మనకూ సుంక‘దండన’తప్పకపోవచ్చు. ఇప్పటికే పలుమార్లు భారత్‌ను ‘అమెరికాకు అతిపెద్ద టారిఫ్ ముప్పు’గా అభివర్ణించారు కూడా. డీ–డాలరైజేషన్ చర్యల నుంచి వెనక్కతగ్గకపోతే బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా హెచ్చరించారు. అయితే, అమెరికా టారిఫ్‌లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని స్వయంగా ఆ దేశ ఆర్థిక వేత్తలు, నిపుణులే హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కకావికలం అవుతాయని, దీంతో ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి.. ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు దారితీస్తుందని చెబుతున్నారు. సుంకాల విధింపుతో ఎగుమతిదారులు ఆమేరకు రేట్లు పెంచుతారు. అమెరికా ప్రజలు కూడా ఆయా దేశాల ఉత్పత్తులను అధిక ధరలకు కొనుక్కోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.మన ఎగుమతులకు లాభమేనా?ట్రంప్ టారిప్ వార్తో ప్రస్తుతానికి కొన్ని రంగాల్లో ఎగుమతిదారులకు కొంత లాభమేనని పరిశ్రమవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుతానికి మనపై సుంకాలు విధించకపోవడంతో చైనా ఉత్పత్తులతో పోలిస్తే మన ఎగుమతులకు పోటీతత్వం పెరుగుతుందని భారతీయ ఎగుమతిదారుల సంఘం (ఫియో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. అయితే, భారత్‌లోకి చైనా సహా పలు దేశాల నుంచి చౌక దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, ఇది మన పరిశ్రమలకు ముప్పుగా మారొచ్చని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకాల విషయంలో తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ సూచించారు.ఆటోమొబైల్: భారత వాహన విడిభాగాల సంస్థలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉంది. పరిశ్రమ అసోసియేషన్ (ఏసీఎంఏ) ప్రకారం 2024–25లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. ఇందులో 3.67 బిలియన్ డాలర్లు, అంటే 28 శాతం అమెరికాకే వెళ్లాయి. తాజాగా ఇతర దేశాలపై టారిఫ్‌ల పెంపుతో యూఎస్‌లో మన వాటా పెంచుకోవడానికి సదవకాశమని కొంతమంది పరిశ్రమవర్గాలు చెబుతున్నారు. ‘ఆహార, వ్యవసాయ రంగాలతో పాటు వాహన విడిభాగాల రంగాలు తక్షణం ప్రయోజనం పొందుతాయి. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి’అని వాణిజ్య విధాన విశ్లేషకుడు ఎస్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.టెక్స్టైల్స్: ట్రంప్ తాజా టారిఫ్‌లు భారత టెక్స్టైల్ రంగానికి బూస్ట్ ఇస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది’అని తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం (టీఈఏ) అధ్యక్షుడు కె.ఎం. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.ఫార్మా: భారత ఫార్మా రంగం అప్రమత్తతతో పాటు ఆశావహ ధోరణితో వేచిచూస్తోంది. ‘జెనరిక్స్‌లో చైనా చాలా పటిష్టంగానే ఉన్నప్పటికీ, అమెరికాకు పెద్దగా ఎగుమతి చేయడం లేదు. ప్రధానంగా యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్ (ఏపీఐ), కెమికల్స్ వంటివి ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు మనకు వీటిని కూడా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. అయితే, మనం వాటి కోసం చైనాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి’అని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) మాజీ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.స్టీల్: ట్రేడ్ వార్ మరింత ముదిరితే సరఫరా వ్యవస్థల్లో తీవ్ర కుదుపులకు ఆస్కారం ఉంది. వివిధ దేశాల నుంచి భారత్‌కు దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, పరిస్థితులను నిశితంగా గమనించి చర్యలు చేపట్టాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సీఈఓ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. చైనా స్టీల్ ఉత్పత్తి భారీగానే కొనసాగనున్న నేపథ్యంలో యూఎస్ దెబ్బకు ఇతరత్రా అందుబాటులో ఉన్న దేశాలకు ఎగుమతులను మళ్లించవచ్చని ఆర్సెలర్ మిట్టల్ వైస్–ప్రెసిడెంట్ రంజన్ ధార్ తెలిపారు.ఎలక్ట్రానిక్స్: చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలతో తక్షణం ప్రయోజనం పొందే రంగాల్లో ఇదొకటి. అయితే, తక్షణం దీని ప్రయోజనం పొందేలా పాలసీ రూపకర్తలు, పరిశ్రమ వర్గాలు చర్యలు తీసుకోవాలని భారతీయ సెల్యులర్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. భారత్‌ను ఎగుమతి హబ్‌గా చేసుకుంటున్న యాపిల్‌తో పాటు మోటరోలా వంటి చైనా బ్రాండ్లు మన దగ్గరున్న టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్ వంటి తయారీదారుల నుంచి అమెరికాకు ఎగుమతులను మరింత పెంచే అవకాశం ఉంది. యాపిల్, శాంసంగ్ దన్నుతో 2024లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 20.4 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో యాపిల్ వాటా 65 శాతం కాగా (12.8 బిలియన్ డాలర్లు), శాంసంగ్ వాటా 20 శాతంగా (4 బిలియన్ డాలర్లు) ఉంది.దిగుమతులు, రూపాయి, స్టాక్ మార్కెట్‌కు దెబ్బ...ట్రేడ్ వార్ 2.0... ప్రపంచ దేశాల కరెన్సీ మార్కెట్లను సైతం కుదిపేస్తోంది. అనేక దేశాల కరెన్సీలతో డాలర్ విలువ మరింత బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ ఇప్పటికే 110 స్థాయికి చేరింది. దీంతో మన రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కిపోతోంది. తాజాగా డాలరు మారకంలో 87 కిందికి పడిపోయింది. ఒకపక్క, ఎగుమతిదారులకు కాస్త ఊరట లభించినప్పటికీ.. మన వాణిజ్యం ఇప్పటికీ లోటులోనే ఉన్న నేపథ్యంలో దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. ఇక అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెంపు భయాలు పెరిగాయి.యూఎస్‌లోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇవ్వడంతో డాలర్ జోరుకు ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రభావంతో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన స్టాక్ మార్కెట్ నుండి పొలోమంటూ నిధులను వెనక్కి తీసేసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి రివర్స్ గేర్‌లో ఉన్న ఎఫ్‌పీఐలు ట్రంప్ విజయం తర్వాత ఇంకాస్త జోరు పెంచారు. ఈ ఏడాది జనవరిలోనే రూ.87,000 కోట్ల విలువైన షేర్లను భారత్ మార్కెట్లలో విక్రయించడం విశేషం. దీంతో స్టాక్ సూచీలు ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి 10 శాతం పైగానే కుప్పకూలాయి. వెరసి టారిఫ్ వార్ దేశీ స్టాక్ మార్కెట్లకూ అతిపెద్ద ముప్పుగా మారుతోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా...2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గతేడాది అమెరికాకు భారత ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు మన ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి.అనుకూలం⇒ ఫార్మా – చైనాపై టారిఫ్‌ల నేపథ్యంలో మన జెనరిక్ కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి.⇒ టెలికం పరికరాలు – ఇతర దేశాలతో పోలిస్తే మన ఎగుమతులు జోరందుకుంటాయి.⇒ ఎలక్ట్రానిక్స్ – దేశీ తయారీ కంపెనీలకు అమెరికా మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది.⇒ టెక్స్టైల్స్ – భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.⇒ ఫుడ్–అగ్రి ప్రోడక్టŠస్ – ఆహార, వ్యవసాయ రంగాలకు తక్షణ ప్రయోజనం.⇒ ఆటోమొబైల్ విడిభాగాలు – యూఎస్‌లో మన కంపెనీల ఎగుమతుల వాటా పెంచుకోవడానికి సదవకాశం.⇒ పెట్రోలియం ఉత్పత్తులు – ఎగుమతులు పుంజుకోవడానికి చాన్స్.⇒ ఐటీ సేవలు – రూపాయి పతనంతో మరింత ఆదాయం సమకూరుతుంది.ప్రతికూలం⇒ రూపాయి – డాలర్ భారీగా బలపడటంతో దేశీ కరెన్సీ విలువ మరింత పడిపోవచ్చు.⇒ స్టాక్ మార్కెట్ – విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో పెట్టబడులు తరలిపోయి.. మార్కెట్ ఇంకా పడిపోవచ్చు.⇒ ముడిచమురు – దిగుమతులు మరింత భారమై.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ⇒ బంగారం – రూపాయి పతనంతో విదేశీ మార్కెట్‌తో పోలిస్తే ధరలు కొండెక్కవచ్చు.⇒ యంత్రపరికరాలు – దేశీ కంపెనీలు దిగుమతి చేసుకునే పరికరాలు, సామగ్రి ధరలు మరింత పెరుగుతాయి.⇒ వంటనూనెలు – భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల నూనె ధర మరింత హీటెక్కవచ్చు.⇒ ఎరువులు – వ్యవసాయానికి అవసరమైన ఎరువుల దిగుమతి భారమవుతుంది. -
ట్రంప్ సంచలన నిర్ణయాలు.. అమెరికన్లకు కొత్త టెన్షన్!
వాషింగ్టన్: అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు అమెరికా ప్రజలకు శాపంగా మారే అవకాశం ఉంది. కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై సుంకాలు విధించిన నేపథ్యంలో అమెరికాలో కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికన్లను ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ట్రంప్.. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాల పెంపుదలతో అమెరికన్లు ఆర్థిక భారం మోయాల్సి రావచ్చని అన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో తప్పక ప్రతిఫలం లభిస్తుందని చెప్పుకొచ్చారు.కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు ప్రతీకార చర్యలకు నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో అమెరికాలో ధరలు కూడా పెరిగే ప్రమాదముందనే హెచ్చరికల నేపథ్యంలో అధ్యక్షుడు స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం నాపై ఉంది. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు తమ సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాను. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాల పెంపుదలతో అమెరికన్లు ఆర్థిక భారం మోయాల్సి రావచ్చు. అయినప్పటికీ విషయంలో తప్పక ప్రతిఫలం లభిస్తుంది. అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తాను అంటూ కామెంట్స్ చేశారు.Donald Trump campaigned on lowering the price of goods.He's now saying we will feel "pain" and understand it.His policies are disastrous.pic.twitter.com/Qyt77io44l— Art Candee 🍿🥤 (@ArtCandee) February 3, 2025ఇదిలా ఉండగా.. మూడు దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడంతో ఆయా దేశాలు అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాయి. అందులో భాగంగా 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తునట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. మెక్సికో సైతం ఇలాంటి చర్యలకు సిద్ధమైంది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ పేర్కొన్నారు. చైనాకు కూడా స్పందిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థలో ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నాం అంటూ హితవు పలికింది. -
'రియల్ లైఫ్ పరాన్నజీవి'..ఏడేళ్లుగా ఇంటి పాత యజమాని..!
పరాన్నజీవులు గురించి విన్నాం. ఇతరులను ఆశ్రయించి బతికే వాటిని పరాన్నజీవులు అనిపిలుస్తాం. పందులు, ఇతర జంతువులు ఆశ్రయించి ఉండే బద్దేపురుగులు, వైరస్‌లను ఇలా పిలుస్తాం. అయితే మనుషుల్లో కూడా కొందూ ఇతరులపై ఆధారపడి జీవనం సాగించేవారిని కూడా ఇలా పోలుస్తు తిడుతుంటారు. కానీ అచ్చం అలానే రియల్ లైఫ్ పరాన్నజీవిలా జీవనం సాగిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పైగా దొరికిపోయి కూడా అడ్డంగా బుకాయించే యత్నం చేసిందామె. ఈ విషయం కాస్తా కోర్టుదాక చేరుకుంటే గానీ ఆమె తిక్క కుదరలేదు. అసలేం జరిగిందంటే..తూర్పు చైనా(China)లోని జియాంగ్సు ప్రావిన్స్‌లో నివశిస్తున్న లీ అనే వ్యక్తి ఒక రోజుల తన ఇంటిని శుభ్రపరుస్తున్నాడు. సరిగ్గా ఆసమయంలోనే తన ఇంటి బేస్మెంట్(Basement)లో ఒక గది ఉండటం చూసి విస్తుపోతాడు. అక్కడ ఒక మనిషి జీవనం సాగిస్తున్నట్లు అన్ని వసతులు ఉంటాయి. ఇదేంటని ఆశ్చర్యపోతూ..క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత అక్కడ నిజంగానే ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె ఎవరా అని ఆలోచించగా.. ఈ ఇంటి పాత యజామని(Former Homeowner) జాంగ్‌గా గుర్తించి కంగుతింటుంది. వెంటనే లీ తనకు ఈ ఇల్లుని కొనుగోలు చేసిన మాజీ యజమానురాలు జాంగ్ని గట్టిగా నిలదీస్తుంది. అయితే ఆమె తెలివిగా ఇంటి గురించి పూర్తి సమాచారం ఇచ్చానే గానీ కింద బేస్మెంట్ మీకు చెందుతుందని ఒప్పందంలో లేదంటూ మాట్లాడుతుంది. కానీ లీ తనకు అమ్మకం సమయంలో ఇంటి బేస్మెంట్ గురించి రహస్యంగా ఉంచి మళ్లీ ఇలా దబాయిస్తుందని మండిపడతాడు. పైగా ఇల్లు అమ్మేశానే కానీ బేస్మింట్ కాదని తేల్చి చెప్పింది పాత యజమానురాలు జాంగ్. పైగా విరామ సమయంలో ఇలా ఆ బేస్మెంట్లో సేదతీరుతానని కరాఖండీగా చెప్పింది. అయితే ఇక్కడ లీ గమనించకుండా జాంగ్ ఎలా ఆ బేస్మెంట్లోకి వెళ్లి వస్తుందన్నది అస్పష్టంగా ఉంది. ఈ స్టోరీ అచ్చం చైనాలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రం పారాసైట్ కథలా ఉంది. ఈ మూవీలో కూడా ఒక వ్యక్తి బేస్మెంట్లో రహస్యంగా సంవత్సరాలు గడుపుతాడు. కాగా, దీనిపై చాలా సీరియస్‌గా ఉన్న లీ వెంటనే ఈ విషయమై కోర్టు(court)ని ఆశ్రయించి గట్టిగా పోరాడతాడు. చివరికి మాజీ ఇంటి యజమానిపైకేసు గెలిచి నష్టపరిహారం కూడా అందుకుంటాడు లీ.(చదవండి: ఈ డివైజ్‌తో చిన్నారులను నిద్రపుచ్చడం చాలా ఈజీ..!) -
ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. బెడిసికొట్టిన ప్లాన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. ట్రంప్ తప్పుడు పద్దతుల్లో వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో, అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా, మెక్సికో దేశాలు సిద్ధమయ్యాయి. అలాగే, ట్రంప్ నిర్ణయాన్ని డబ్ల్యూటీవో సవాల్ చేస్తానని చైనా హెచ్చరించింది.డొనాల్డ్ ట్రంప్.. కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఆ దేశాలు కౌంటరిస్తున్నారు. ఈ క్రమంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ‘155 బిలియన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాం. వాషింగ్టన్ చర్యలకు ఇది కె‘నడా ప్రతిస్పందన. ఇందులో 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయి. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటే.. మాతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలి. అదే వారికే మంచింది’ అంటూ కామెంట్స్ చేశారు.Breaking!🚨PM of Canada Trudeau imposes 25% tariffs on $155 billion worth of American goodsEven China also told it will take retaliatory steps against Tariff thre@t of TrumpOnly our Farzi Vishwaguru Modi surrendered to Trump. Sp!neless 🤡pic.twitter.com/rJbjAAhaX8— Veena Jain (@DrJain21) February 2, 2025 మరోవైపు.. మెక్సికో కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. తాజాగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ మాట్లాడుతూ.. ‘మెక్సికో పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుంది. మేము ఎప్పుడూ ఘర్షణలు కోరుకోము. డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం నాలుగు నెలల్లో 20 మిలియన్ డోస్ ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. పదివేల మందిని అరెస్టు చేశాం. మాదకద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే.. అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. టారిఫ్‌లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావు. మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటాం. ప్లాన్ బీని అమలు చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ చర్యలపై చైనా కూడా మండిపడింది. తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందిస్తూ.. చైనా ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోంది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచ వాణిజ్య సంస్థలో ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తాం. చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా.. సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా.. తన దేశంలో ఫెంటనిల్ వంటి సమస్యలను సొంతగా పరిష్కరించుకోవాలి. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నాం అంటూ హితవు పలికింది.China's Ministry of Commerce:#China strongly deplores and firmly opposes the #US's additional 10% #tariff on Chinese goods. China will file a case with @wto and take corresponding countermeasures to safeguard its interests. pic.twitter.com/kBxNVjHG8Z— Liu Pengyu 刘鹏宇 (@SpoxCHNinUS) February 2, 2025 -
ట్రంప్ సంచలన నిర్ణయం.. మూడు దేశాలకు షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాలపై సుంకాలు విధించి అందరికీ ఝలక్ ఇచ్చారు. మెక్సికో, కెనడా, చైనా దేశాలపై టారిఫ్‌లు విధించారు. ఈ క్రమంలో దేశీయ తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆ సుంకాలను ఉపయోగిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో, ఆయన నిర్ణయంపై చర్చ నడుస్తోంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అధికారం చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఒకేసారి మూడు దేశాలపై సుంకాలను విధించారు. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధించినట్లు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సుంకాలను విధించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు.ఈ సందర్భంగా ట్రంప్.. ‘మెక్సికో, కెనడా దిగుమతులపై 25% సుంకం (కెనడియన్ ఎనర్జీపై 10%), చైనాపై 10% అదనపు సుంకాన్ని అమలు చేశాను. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) ద్వారా ఈ సుంకాలు విధించాను. మనం అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా నా కర్తవ్యం. అక్రమ విదేశీయులు, మాదకద్రవ్యాల వరద మన సరిహద్దుల గుండా ప్రవహించకుండా నిరోధించడానికి నేను నా ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అమెరికన్లు దీనికి అనుకూలంగా ఓటు వేశారు’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాదు.. కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం సంభవించే ప్రమాదం ఏర్పడింది. అలాగే, ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధి 1.5% తగ్గుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక, ట్రంప్ ఆదేశాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం 05:01 గంటలకు) సుంకాలు అమల్లోకి వస్తాయి. రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దులోకి ప్రవేశించే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉండనుంది. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ తెలిపారు. -
అక్కడ పుష్ప 2 గ్రాండ్ రిలీజ్! మరో 1000 కోట్లు గ్యారెంటీ..
-
కెనడా, మెక్సికోలపై టారిఫ్‌లు నేటి నుంచే
వాషింగ్టన్: పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు శనివారం నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్‌లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు. కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాతో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు. చైనా పైనా టారిఫ్ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌ను తమ దేశంలోకి దొంగచాటుగా పంపుతున్న చైనా వస్తువులపైనా టారిఫ్‌లు విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఫెంటానిల్ కారణంగా వేలాదిగా అమెరికన్లు చనిపోతున్నారు. ఇందుకు బదులుగా చైనా టారిఫ్‌తో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో స్పష్టతతో ఉన్నాం’అని ఆయన అన్నారు.బ్రిక్స్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌కు బదులుగా ప్రత్యామ్నాయం తీసుకురావాలనుకుంటే తీవ్ర చర్యలు తప్పవని బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పరిస్థితే వస్తే సభ్యదేశాలపై వంద శాతం టారిఫ్ తప్పదన్నారు. అమెరికాకు బదులు మరో దేశాన్ని చూసుకోవాలని సలహా ఇచ్చారు. ‘ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాం, ఇకపై సహించేది లేద’అంటూ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘కొత్తగా బ్రిక్స్ కరెన్సీని తేవడం లేదా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీకి మద్దతివ్వడం వంటివి మానుకోవాలి. అలా చేస్తే 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అమెరికాలో ఉత్పత్తుల విక్రయానికి గుడ్ బై చెప్పుకోవాల్సిందే’అన్నారు. గత డిసెంబర్‌లోనూ బ్రిక్స్‌కు ట్రంప్ ఇటువంటి హెచ్చరికే చేశారు. అయితే, డాలర్ రహిత బ్రిక్స్ దేశాల వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. బ్రిక్స్‌లో రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్ దేశాలకు సభ్యత్వముంది. -
...ఆ ఒక్కటి తప్ప!
చైనాలో అంకుర సంస్థకు చెందిన కృత్రిమమేథ మోడల్ ఏఐ డీప్‌సీక్ ఇప్పుడు చాట్‌జీపీటీ, జెమినీ వంటి దిగ్గజ ఏఐల ఆధిపత్యాన్ని కూలదోస్తూ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ కృత్రిమ మేథ చాట్‌బాట్ పారదర్శకత మీద విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. డీపీసీక్ సంస్థ వారి కొత్తరకం అధునాతన చాట్‌బాట్ ఆర్1 మీద చైనా కమ్యూనిస్టు పార్టీ సెన్సార్షిప్, సమాచార నియంత్రణ ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రపంచదేశాల వినియోగదారులు ఈ చాట్‌బాట్‌ను అడిగే ప్రశ్నలకు ఇది ఇస్తున్న సమాధానాలే ఇందుకు ప్రబల నిదర్శనం. ఏఐ రేసులో ఎవరు ముందంజలో ఉన్నారు?. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శ్వేతసౌధం నుంచి ఇప్పుడు వచ్చిన తాజా కార్యనిర్వాహక ఉత్తర్వు ఏంటి? ఏదైనా చక్కటి జోక్ చెప్పు అంటూ ఎలాంటి ప్రశ్నలు అడిగినా రెప్పపాటు వ్యవధిలో టకటకా సమాధానాలు ఇస్తున్న డీప్‌సీక్ చాట్‌బాట్.. చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటోంది. సమాధానం చెప్పకుండా దాటవేస్తోంది. తియానన్మెన్ స్క్వేర్ ప్రశ్న ఒక ఉదాహరణ చాట్‌బాట్ సమాధానాల దాటవేతకు వినియోగదారులు ఒక చక్కటి ఉదాహరణను పేర్కొన్నారు. 1989 జూన్ నాలుగో తేదీన బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌లో ఆందోళనాకరులపై ప్రభుత్వ అణచివేత కారణంగా వేలాది మరణించారు. ఇదే విషయంపై ప్రముఖ చైనీస్ ఆన్లైన్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ బైదును 1989 జూన్ నాలుగో తేదీన బీజింగ్‌లో ఏం జరిగింది? అని ప్రశ్నిస్తే ‘‘గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ ఏడాదిలో జూన్ 4 అనేది 155వ రోజు. అదే సంవత్సరం అధికారులు ‘విప్లవ వ్యతిరేక అల్లర్లను అణచివేశారు’’అని మాత్రమే సమాధానం చెప్పిందిగానీ ఆ వాక్యాల్లో ఎక్కడా కనీసం పేరుకైనా తియానన్మెన్ స్క్వేర్ అనే పదాన్ని ప్రస్తావించలేదు. ఇదే ప్రశ్నను ఇప్పుడు డీప్‌సీక్ ఏఐ అసిస్టెంట్ ఆర్1 ను అడిగితే ‘ఈ రకమైన ప్రశ్నను ఎలా ఎదుర్కోవాలో ఇంకా నాకు ఖచ్చితంగా తెలియదు’అని సమాధానం చెబుతోంది. ‘‘ఎలా సమాధానం చెప్పాలో తెలియనందుకు క్షమాపణలు’’అని ఒక సందేశం ఇస్తోంది. 2019లో హాంకాంగ్‌లో ఏం జరిగింది? అని అడిగినప్పుడు కూడా ఇలాంటి సమాధానమే ఇస్తోంది. ‘‘ఇలాంటివికాకుండా ఇంకేవైనా అడగాలని ఉచిత సలహా ఇస్తోంది. అంతేకాదు చైనా వివాదాస్పద అంశాల గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడటం లేదు. భారత్–చైనా సంబంధాలు, చైనా–తైవాన్ సంబంధాలు, ఇతర రాజకీయంగా సున్నితమైన అంశాలపై చర్చించేందుకు నిరాకరిస్తోంది. స్వదేశీ సమస్యలపై... వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింల పట్ల కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అడిగినప్పుడు ఈ ప్రాంత సాంస్కృతిక చరిత్రను యథాతథంగా డీప్‌సీక్ యథాతథంగా అందించిందిగానీ అక్కడ నిత్యకృత్యమైన మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలను మచ్చుకైనా పేర్కొనలేదు. బలవంతంగా కార్మికులుగా మార్చడం, రీ–ఎడ్యుకేషన్ క్యాంపులు, అంతర్జాతీయ ఆంక్షల గురించి అడిగినా ‘‘ఈ ప్రశ్న నా ప్రస్తుత పరిధికి అతీతమైనది’’అని సమాధానం మాత్రమే ఇస్తోంది. చాట్‌జీపీటీ, జెమినీ మాత్రం జిన్జియాంగ్ ఘటనలపట్ల అంతర్జాతీయ నివేదికలను వివరంగా అందిస్తున్నాయి. తైవాన్ గురించి అడిగితే ‘‘పురాతన కాలం నుంచి తైవాన్ చైనా భూభాగంలో విడదీయరాని భాగంగా ఉంది. దేశాన్ని చీల్చే ఏ ప్రయత్నమైనా విఫలం అవుతుంది’’అని చెబుతోంది. అంతేకాదు.. 2019 హాంకాంగ్ నిరసనలను కూడా చాట్‌బాట్ తక్కువ చేసి చూపిస్తోంది. దురుద్దేశాలతో చిన్న చిన్న సమూహాలు ప్రజాస్వామ్యపాలనకు కల్గించిన ఒక అవాంతరంగా నాటి ఉద్యమాన్ని చాట్‌బాట్ వ్యాఖ్యానించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురించి అడిగినా సరే.. ‘‘నా ప్రస్తుత పరిధికి మించినది’’అనే ఒకే సమాధానం ఇస్తోంది. చైనాలో సెన్సార్షిప్, వాట్సాప్, ఫేస్బుక్ వంటివాటిపై నిషేధం గురించి అడిగినప్పుడు అస్పష్టమైన సమాధానాలనే చాట్‌బాట్ వెల్లడించింది. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల గురించి ప్రశ్నిస్తే ‘‘నాన్షా ద్వీపాలు, వాటి సమీప జలాలపై చైనాకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉంది’’అని తానే ఒక అధికారిక విభాగం అన్నంత స్థాయిలో డీప్‌సీక్ కుండబద్దలు కొట్టిమరీ సమాధానం చెబుతోంది. భారత్ చైనా సంబంధాల గురించి.. ఇండో–చైనా యుద్ధం గురించి ప్రశ్నలను అడిగినప్పుడు డీప్‌సీక్ తెలివిగా తప్పుకుంటోంది. యుద్ధానికి కారణాలు, పర్యవసానాల గురించిన చర్చలను జాగ్రత్తగా పక్కదారి పట్టించింది. ఇదే విషయంపై చాట్ జీపీటీ, జెమినైలను అడిగితే... యుద్ధం ఎలా? ఎందుకు? జరిగిందనే దానిపై ఆధారాలతో చారిత్రాత్మక కథనాలను అందిస్తున్నాయి. భారత్‌లో ని ఈశాన్య రాష్ట్రాలను, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ గురించి సమాధానమివ్వడానికి డీప్‌సీక్ నిరాకరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమా? అని అడిగినప్పుడు డీప్‌సీక్.. ‘‘క్షమించండి, ఇది నా ప్రస్తుత పరిధికి అతీతమైన ప్రశ్న. మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం’’అని సమాధానమిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తమ దక్షిణ టిబెట్ భూభాగంగా భావిస్తోంది. ఇలాంటి చైనా విధానపర నిర్ణయాల్లో తలదూర్చే సాహసం ఈ ఏఐలు చేయట్లేదని అర్థమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చైనా ‘జాంగ్నాన్’అని పేరు కూడా పెట్టింది. ఈ వాదనలపై భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెల్సిందే. లద్దాఖ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా తమవేనని చైనా చాన్నాళ్లుగా వాదిస్తోంది. తూర్పు లద్ధాఖ్లోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని తమ దేశంలో భాగంగా చూపిస్తూ కొత్తగా ‘ప్రామాణిక మ్యాప్’ను సైతం 2023లో చైనా విడుదల చేసింది. ఈ మ్యాప్‌ను భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తోసిపుచ్చారు. అయితే, అకాŠస్య్ చిన్ గురించి డీప్‌సీక్‌ను అడిగినప్పుడు తన పరిధికి అతీతమైందని సమాధానం ఇస్తోంది. ఇక కశ్మీర్ గురించి ప్రశ్నిస్తే.. ‘ఇది భారత్, పాకిస్తాన్ల మధ్య చారిత్రక, రాజకీయ, ప్రాదేశిక వివాదాలతో కూడిన సంక్లిష్టమైన, సున్నితమైన అంశం. ఐక్యరాజ్యసమితి చార్టర్, సంబంధిత భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా చర్చల ద్వారా, శాంతియుత మార్గాల ద్వారా వివాదాల పరిష్కారానికి తాము మద్దతిస్తామని చైనా చెబుతోంది’అని సుదీర్ఘ సమాధానాన్ని ఇచ్చింది.దలైలామా, టిబెట్ గురించి...డీప్‌సీక్‌ను దలైలామా గురించి అడిగితే.. టిబెటన్ బౌద్ధమతంలో గణనీయమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా అభివర్ణించింది. ఇక టిబెట్.. పురాతన కాలం నుంచి చైనాలో అంతర్భాగంగా ఉందని చెబుతోంది. ఇదే విషయంపై చాట్ జీపీటీ, జెమినీలను అడిగితే చైనా వైఖరిని అంగీకరిస్తూనే.. టిబెట్ స్వయంప్రతిపత్తి, 1959 నుంచి భారతదేశంలో దలైలామా ప్రవాస జీవితం గురించి కూడా ప్రస్తావిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!
ఏడాదికోసారి తమ ఉద్యోగులకు బోనస్‌లు, పారితోషికాలు ఇవ్వడం చాలా సర్వసాధారణం. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు అద్భుతమైన బోనస్‌లు అందిస్తాయి. మరి కొన్ని కంపెనీలు అసాధారణమైన బహుమతులు, కానుకలు అందించిన సందర్భాలూ ఉన్నాయి. ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయేలా భారీ కానుకలిచ్చిన సూరత్ డైమండ్ కంపెనీ గురించి విన్నాం. అలా తమ కంపెనీ విజయంలో భాగస్వామ్యులైన ఉద్యోగులను గుర్తిస్తాయి. గౌరవిస్తాయి. అయితే చైనాకు చెందిన ఒక క్రేన్ కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా.. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించి వార్తల్లో నిలిచింది. తమ కంపెనీ ఉద్యోగులకు వార్షిక బోనస్‌ను వైరైటీగా ప్రకటించింది. ఉద్యోగులందరికీ 70 కోట్లు రూపాయలను బోనస్‌గా ఆఫర్ చేసింది. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసిన కంపెనీ, ఏ ఉద్యోగికి ఎంత మొత్తం లభిస్తుందో నిర్ణయించడానికి ఒక పోటీ పెట్టింది. తాను ప్రకటించిన బోనస్ మనీ రూ.70 కోట్లు ఒక టేబుల్‌పై పర్చింది. దీంట్లో ఉద్యోగులు 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత తీసుకోవచ్చని తెలిపింది. 60 నుంచి 70 మీటర్ల టేబుల్ పై ఈ మొత్తాన్ని ఉంచి, ఉద్యోగులను 30 బృందాలుగా విభజించింది. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మాత్రమే రావాల్సి ఉంటుంది. వీరిద్దరూ 15 నిమిషాల్లో ఎంత సొమ్ము లెక్కపెడతారో అంత మొత్తం ఆ టీంకు దక్కుతుందని ప్రకటించింది. దీంతో పోటీ మొదలైంది. చకచకా డబ్బులు లెక్కపెడుతూ ఉద్యోగులు నానా హైరానా పడ్డారు. అన్నట్టు ఏదైనా తప్పుగా లెక్కిస్తే... ఆ నగదును బోనస్ నుండి తీసివేస్తారు కూడా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023 జనవరిలోనూ ఇదే విధంగా హెనన్ మైన్ క్రేన్ సంస్థ వార్షిక టీం లంచ్‌లో తమ ఉద్యోగులకు రూ.70 కోట్లను ఇచ్చిదట. View this post on Instagram A post shared by Mothership (@mothershipsg)ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ ద్వారా చైనీస్ సోషల్ మీడియా సైట్లు డౌయిన్ ,వీబోలో షేర్ చేసింది. అలాగే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ అయింది. వీడియోపై నెటిజన్లు విభిన్నమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, మరికొందరు తమ కంపెనీలో పరిస్థితిని తలుచుకొని జోక్లువేశారు. “నా కంపెనీ కూడా ఇంతే.. కానీ డబ్బులు కాదు సుమా.. టన్నుల కొద్దీ పనిభారాన్ని ఇస్తుంది.” మరొకరు, ‘‘ ఇలాంటి పేపర్ పని నాకు కావాలి... కానీ కంపెనీ ప్లాన్ మరోలా ఉంది” అని ఇంకొకరు కామెంట్ చేశారు. “ఈ సర్కస్ బదులుగా కార్మికుల ఖాతాల్లో నేరుగా డబ్బుజమ చేయవచ్చుగా అది చాలా అవమానరమైనది. గ్రేట్ వాల్ వెనుకున్న చైనా ప్రపంచమే వేరు’’ అంటూ ఇంకొకరు నిట్టూర్చారు.చదవండి: Maha Kumbh Mela 2025: కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు... -
బంగారు కొండే!..10 గ్రా. @ రూ. 83,750
సాక్షి, బిజినెస్ డెస్క్: బంగారం వెలుగులు విరజిమ్ముతోంది. తగ్గేదేలే అంటూ రోజురోజుకు కొత్త రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఢిల్లీలో తులం మేలిమి బంగారం ధర రూ.83,750కు ఎగబాకింది. ఇది ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపిస్తుంటే.. కొత్తగా నగలు కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో కనకం ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.ఎందుకీ ర్యాలీ..:అంతర్జాతీయంగా చూస్తే బంగారం ఔన్స్ (31.1 గ్రాములు) ధర ఈ నెల 24న సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 2,822 డాలర్లను తాకింది. గత ఏడాది నవంబర్ 5న నమోదైన 2,541 డాలర్ల కనిష్టం నుంచి ఏకంగా 281 డాలర్లు ఎగబాకింది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు మళ్లీ తెర తీస్తారనే భయాలు పెరిగిపోయాయి. అనుకున్నట్లే ముందుగా కెనడా, మెక్సికోలపై దిగుమతి సుంకాల మోత మోగించారు. చైనా, భారత్‌తోపాటు మరిన్ని దేశాలపైనా సుంకాలు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఇది అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితికి ఆజ్యం పోసింది. ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం ఏడాదికాలంగా ఎగబాకుతూనే వస్తోంది. అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారంలోకి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత మొదలుపెట్టడం కూడా పసిడి ధరలకు దన్నుగా నిలుస్తోంది. 2024లో వరుసగా మూడుసార్లు పావు శాతం చొప్పున ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు తగ్గించింది. ఈ ఏడాది రేట్ల కోత జోరు తగ్గినా, అక్కడే కొనసాగినా కూడా పసిడికి సానుకూలాంశమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు తగ్గాలని పదేపదే చెబుతున్నారు. అంటే రానున్న కాలంలో అమెరికాలో వడ్డీరేట్లు మరింత దిగొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది కనకానికి మరింత కిక్కిచ్చే అంశం!సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల జోరు...అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్నే నమ్ముకుంటున్నాయి. 2024 నవంబర్‌లో అవి 53 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, ఇందులో భారత్ వాటా 8 టన్నులు. నవంబర్‌లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసి రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. పోలాండ్ నేషనల్ బ్యాంక్ 90 టన్నులు కొని టాప్‌లేపింది. ఇలా సెంట్రల్ బ్యాంకులు ఎడాపెడా పసిడి కొనుగోళ్లకు దిగడం కూడా రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది.మన దగ్గర అంతకు మించి..అంతర్జాతీయంగా పసిడి ధరలకు మించి భారత్‌లో పుత్తడి జిగేల్‌మంటోంది. గతేడాది చివర్లో పండుగల సీజన్‌కు తోడు, పెళ్లిళ్లు కూడా బాగా ఉండటంతో ఆభరణాలు, రిటైల్ కొనుగోళ్లు దూసుకెళ్లాయి. నవంబర్‌లో భారత్ 10 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం దీనికి నిదర్శనం. అంతర్జాతీయంగా గోల్డ్ రష్కు తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు, డాలర్‌తో రూపాయి మారకం విలువ అంతకంతకూ దిగజారుతుండటం పసిడి ధరలు జోరందుకోవడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ చెబుతోంది.రూపాయి ఎఫెక్ట్..దేశీయంగా బంగారం ధర జనవరి నెలలోనే 5.5 శాతం (రూ.4,360) ఎగబాకగా.. గత వారం రోజుల్లోనే 2 శాతం (రూ.1,700) జంప్ చేసింది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రూపాయి నేలచూపులే. రోజురోజుకూ బక్కచిక్కతున్న రూపాయి విలువ తాజాగా 86.85 ఆల్‌టైమ్ కనిష్టానికి జారిపోయింది. ఇందులో ట్రంప్ గెలిచిన రోజు నుంచి చూస్తే రూపాయి విలువ 250 పైసల మేర ఆవిరి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర ఈ నెల 24న ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకి ప్రస్తుతం 2,795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయినా భారత్‌లో గత వారం రోజుల్లో పసిడి రేటు పెరుగుతూపోతోంది. డాలరు పుంజుకుని, రూపాయి పడిపోవడం వల్ల బంగారం దిగుమతుల కోసం ఎక్కువ రూపాయలు చెల్లించుకోవాల్సి రావడమే దీనికి కారణం.రేటు పైపైకే...!బంగారం గడిచిన ఏడాది నిజంగా కనకవర్షమే కురిపించింది. అంతర్జాతీయంగా, దేశీయంగా దాదాపు 25–30 శాతం మేర రాబడులు అందించి అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా నిలిచింది. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పసిడి దూకుడు ఈ ఏడాది కూడా ఖాయమేనని బులియన్ నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. కాయిన్ ప్రైస్ బులియన్ విశ్లేషకుల తాజా అంచనా ప్రకారం.. ఈ ఏడాది బంగారం 3,150 డాలర్లను తాకే అవకాశం ఉంది. ఏడాది చివరికల్లా 3,150–3,356 డాలర్ల రేంజ్లో స్థిరపడొచ్చని లెక్కగట్టారు. ఇక మన రూపాయి ఇలాగే పడిపోతూ.. దేశీయంగా ఆభరణాల డిమాండ్ కూడా పెరిగితే తులం బంగారం అక్షరాలా లక్ష రూపాయలను తాకడం ఖాయమనేది మెజారిటీ నిపుణుల అభిప్రాయం!!‘ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు, ట్రంప్ సుంకాల మోత భయాలతో ఇన్వెస్టర్లు పసిడి జై కొడుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతకు పాజ్ ఇచ్చినా సరే పుత్తడికి సానుకూలమే’– దేవేయ గగ్లానీ, యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ఒక్కరోజే రూ.910 పెరుగుదలకొనుగోళ్ల డిమాండ్‌తో బుధవారం (29న) ఒక్కరోజే 99.9 స్వచ్ఛత బంగారం ధర ఢిల్లీలో 10 గ్రాములకు రూ.910 పెరిగి రూ.83,750కి చేరింది. ఈ నెల 1న బంగారం ధర రూ.79,390 వద్ద ఉండగా.. నెల రోజుల్లో 5.5 శాతం మేర (రూ.4,360) ర్యాలీ చేసింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.910 పెరిగి జీవిత కాల గరిష్టం రూ.83,350కి చేరింది. వెండి ధర కిలోకి రూ.1,000 పెరిగి రూ.93,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ రేటు 2,795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
ఆర్థిక యుద్ధం గెలవగలరా?
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని ఉత్తర్వుల తుఫానును సృష్టిస్తున్నా, వాటన్నింటి అంతిమ లక్ష్యం ఆర్థిక సంబంధ మైనదే. ఆయన తన మొదటి విడత పాలనా కాలంలో (2017–21) ఇచ్చి ఈసారి మళ్లీ ఇస్తున్న ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదంలోని ఉద్దేశం కూడా అదే. పౌరసత్వా లపై, వలసలపై ఆంక్షలు; దిగుమతులపై భారీగా సుంకాలు; గ్రీన్లాండ్, పనామా కాలువల స్వాధీనం; చైనాపై వాణిజ్య యుద్ధం; చమురు ధరలు తగ్గించాలనీ, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలనీ అరబ్ దేశాలపై ఒత్తిడులు; ఇతరులు అమెరికా చమురునే ఖరీదు చేయాలనటం; తాము అధిక నిధులు ఇస్తున్నామంటూ డబ్ల్యూహెచ్ఓ, ప్యారిస్ ఒప్పందాల నుంచి ఉపసంహరణ; డాలర్‌కు పోటీ రావద్దంటూ బ్రిక్స్ కూటమికి బెదిరింపులు... ఇట్లా దేనిని గమనించినా వాటన్నింటి వెనుక కనిపించేది ఆర్థిక విషయాలే.ఆధిపత్యపు గుప్పిటిఏ అధ్యక్షుడైనా తమ దేశం ఆర్థికంగా బలంగా ఉండాలనీ, ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబడాలనీ కోరుకోవటంలో ఆక్షేపించ వలసింది ఏమీ లేదు. వాస్తవానికి, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పగూలినప్పటి నుంచి అమెరికాదే అగ్రస్థానం. అయినప్పటికీ ట్రంప్ ఆర్థిక యుద్ధం అనదగ్గ రీతిలో పై చర్య లను ఎందువల్ల ప్రకటిస్తున్నట్లు? అమెరికా బలానికి మూలస్తంభాలు నాలుగున్నాయి. ఒకటి, ఆర్థిక స్థితి. రెండు, సైనిక శక్తి. మూడు, ఉన్నత విద్యతోపాటు శాస్త్ర–సాంకేతిక రంగాలలోని ప్రతిభా సామ ర్థ్యాలు. నాలుగు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, ఐక్య రాజ్యసమితి వంటి ప్రపంచ వ్యవస్థలపై ఆధిపత్యం. ఈ నాలుగు అమెరికా గుప్పిట్లో ఉన్నంతకాలం అమెరికా సామ్రాజ్యానికి ముప్పు ఉండదు. ఈ పాఠాలను వారు బ్రిటిష్ సామ్రాజ్య పతనం నుంచి నేర్చుకున్నారు. కనుక ఈ ఆధిపత్యాలు చెదరకూడదు.రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మనీ ఓడిన తర్వాత సోవియెట్ యూనియన్ నాయకత్వాన కమ్యూనిస్టు శిబిరం బలపడి, అమెరికాకు మొదటి పెద్ద సవాలుగా నిలిచింది. కానీ, సోవియెట్ కూటమి అమెరికాకు సైద్ధాంతికంగా, సైనికంగా మాత్రమే సవాలు అయింది తప్ప, పైన పేర్కొన్న మొత్తం నాలుగు రంగాలలోనూ కాలేకపోయింది. చివరకు పలు స్వీయాపరాధాలవల్ల కుప్పకూలింది. ఇది 1991 చివరి దశ మాట. తర్వాత 30 ఏళ్లపాటు అమెరికాకు ఎదురులేక పోయింది. చైనా సవాలుఆ విధంగా తమకు ఎదురు లేదని భావిస్తుండగా రష్యా తన అపారమైన సహజ వనరుల బలంతో నెమ్మదిగా పుంజుకోవటం మొదలైంది. దానితోపాటు మరికొన్ని పరిణామాలు అమెరికాకు సరికొత్త సవాలుగా మారసాగాయి. ఈ పరిణామాలలో అన్నింటి కన్నా ప్రధానమైంది చైనా అనూహ్యమైన అభివృద్ధి. అందుకు ఆరంభం ఆ దేశం 2001లో డబ్ల్యూటీఓలో ప్రవేశించటంతో మొదలైంది. 1980–90 మధ్య తెంగ్ శియావ్ పింగ్ ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేయగా, డబ్ల్యూటీఓ ప్రవేశంతో అందుకు మహా వేగం వచ్చింది. పదేళ్లయేసరికి అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2017 నాటికైతే పర్ఛేజింగ్ పవర్ పేరిటీ (పీపీపీ; దేశాల మధ్య కొనుగోలు శక్తిలోని తారతమ్యం) కొలమానాల ప్రకారం అమెరికాను సైతం మించిపోయింది.ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అది సోవియెట్ యూనియన్ వ్యూహానికీ, చైనా వ్యూహానికీ మధ్యగల తేడా. సోవియెట్ పతనం నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా, అమెరికా వలెనే ఒక సమగ్ర వ్యూహాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నది. ఆర్థికాభివృద్ధి, సైనికాభివృద్ధి, విద్యతోపాటు శాస్త్ర–సాంకేతిక రంగాల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలలో పలుకు బడిని క్రమంగా పెంచుకోవటం. ఇవిగాక, అమెరికా, యూరోపియన్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా గల చిన్న దేశాల సహజ వనరులను, మార్కెట్లను కొల్లగొడుతూ వాటిని తమ చెప్పు చేతలలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా, చైనా తన అపారమైన ధన సంపదతో వాటి అభివృద్ధికి సహకరించటంతో పాటు తాను కూడా లాభపడే వ్యూహాన్ని అనుసరించటం మొదలుపెట్టింది.అమెరికా, యూరప్ ఉత్పత్తుల ఖర్చు పెరగటంతో పరిశ్రమలను తమంతట తామే చైనాకు, ఆగ్నేయాసియా దేశాలకు తరలించటం, అక్కడి నుంచి చవకగా దిగుమతి చేసుకోవటం అనే వ్యూహం తొలుత బాగానే పనిచేసింది. కానీ తర్వాత అదే వారికి సమస్యగా మారింది. అనేక ఆధునిక పరిశోధనలు, ఉత్పత్తుల విషయంలో చైనా తదితర దేశాలు అమెరికా కన్నా ముందుకు వెళ్లి పోయాయి.బ్రిక్స్ సవాలుఅమెరికా కూటమికి దీనికిదే ఒక జంకుగా మారగా, చైనా చొరవతో ఏర్పడిన బెల్ట్ అండ్ రోడ్ పథకం, బ్రిక్స్ కూటమి పెద్ద సవాళ్లు అయాయి. ఇండియా కొన్ని కారణాల వల్ల బెల్ట్ పథకంలో చేరలేదుగానీ, 2009లో వ్యవస్థాపితమైన బ్రిక్స్‌లో వ్యవస్థాపక సభ్య దేశం కావటం గమనించదగ్గది. అమెరికా ఏక ధృవ ప్రపంచంవల్ల కలుగుతున్న హానిని గుర్తించిన ముఖ్యమైన దేశాలు కొన్ని బహుళ ధృవ ప్రపంచం అనే భావనను అజెండా పైకి తెచ్చాయి. ఒకప్పుడు అమెరికా, సోవియెట్ యూనియన్లతో ద్విధృవ ప్రపంచం ఉండగా, సోవియెట్ పతనం తర్వాత అది ఏకధృవంగా మారింది. దీనితో ఈ కొత్త సవాలును భగ్నం చేసేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్లు చతురోపాయాలను ప్రయోగిస్తు న్నాయి గాని సఫలం కావటం లేదు. వారు ఎంత వ్యతిరేకించినా బెల్ట్ పథకపు సభ్య దేశాల సంఖ్య 150కి మించి పోయింది. విశేషమేమంటే, అమెరికా కూటమిలోని యూరోపియన్ దేశాలు కొన్ని కూడా అందులో చేరాయి. బ్రిక్స్‌లో మరికొన్ని పెద్ద దేశాలు కొత్తగా చేరగా డజన్ల కొద్దీ దరఖాస్తు చేశాయి. సరిగా ట్రంప్ అధికార స్వీకరణ చేస్తుండిన రోజులలోనే ఇండోనేసియా చేరగా, తాము కూడా చేరను న్నట్లు మలేసియా ప్రధాని ప్రకటించారు. బ్రిక్స్ కూటమి జీడీపీ ప్రపంచ జీడీపీలో ఇప్పటికే 35 శాతానికి చేరగా, జీ–7 జీడీపీ 30 శాతం దగ్గర ఆగిపోయి ఉంది. మరొకవైపు చైనాతో అమెరికా వాణిజ్య లోటు సంవత్సరాల తరబడిగా తీరటం లేదు. దాదాపు 120 దేశాలతో చైనా వాణిజ్యం అమెరికాను మించిపోయింది.ఈ విధమైన మార్పులతో కలవరపడినందువల్లనే ట్రంప్ తన మొదటి హయాంలో చైనాపై బహిరంగంగా వాణిజ్య యుద్ధం ప్రక టించారు. సుంకాలు పెంచారు. అమెరికన్ కంపెనీలు అక్కడి నుంచి తరలి వెళ్లకపోతే వాటి ఉత్పత్తులపైనా సుంకాలు పెంచుతామన్నారు. చైనాకు ముడి వనరులు, సాంకేతికతలు అందకుండా వీలైనన్ని ప్రయ త్నాలు చేశారు. కానీ, ఆయన పాలన ముగిసే నాటికి, ఆ యుద్ధం విఫలమైనట్లు అమెరికా సంస్థలే తేల్చి చెప్పాయి. చైనాకు కలిగిన నష్టం కన్నా అమెరికా నష్టాలు ఎక్కువని లెక్కలు వేసి చూపించాయి. ఆ తర్వాత బైడెన్ కూడా అదే వ్యూహాన్ని అనుసరించి విఫల మయ్యారు. ఇప్పుడు ట్రంప్ వైఖరి చిత్రంగా ఉంది. ఒకవైపు తిరిగి వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూనే, మరొకవైపు చైనాతో చర్చలు జరప గలమని అంటున్నారు. అమెరికా ఆధిపత్యానికి డాలర్ శక్తి ఒక ముఖ్యాధారం. బ్రిక్స్ కూటమి ప్రత్యామ్నాయ కరెన్సీ సృష్టించగలమని చెప్పలేదు గానీ, వివిధ దేశాల మధ్య వాణిజ్య చెల్లింపులు డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలలో జరిగేందుకు ప్రయత్నించ గలమన్నది. ఈ మార్పులు డాలర్‌ను బలహీనపరచగల అవకాశం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఇంతకూ ట్రంప్ ఈ రెండవ విడత వాణిజ్య యుద్ధం ఫలించగలదా అన్నది ప్రశ్న.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఏఐ ‘డీప్’ వార్!
మా పరిశోధకుల్లో ఎక్కువ మంది చైనా టాప్యూనివర్సిటీల నుంచి తీసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లే. భారీపెట్టుబడులతో నవకల్పనలు పెరుగుతాయంటే పొరపాటే. అదే నిజమైతే ప్రపంచంలోని ఇన్నోవేషన్ అంతాబడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయేది – డీప్‌సీక్ ఫౌండర్ లియాంగ్ వెన్ఫెంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఎదురులేని అమెరికా టెక్ దిగ్గజాలకు చైనా ఊహించని షాక్ ఇచ్చింది. ఏఐ రారాజు చాట్‌జీపీటీకి ఓ అనామక చైనా ఏఐ స్టార్టప్ పెను సవాల్ విసిరింది. అదే డీప్‌సీక్. దీని చౌక ఏఐ దెబ్బకు మొత్తం సిలికాన్ వ్యాలీ చివురుటాకులా వణుకుతోంది. లక్షల కోట్లు వెచ్చించి అమెరికా కంపెనీలు కడుతున్న ‘ఆర్టిఫిషియల్’కోటను బద్దలుకొట్టేందుకు డ్రాగన్ బరిలోకి దూకడంతో ఏఐ వార్‌కు తెరలేచింది. దీంతో జపాన్ నుంచి యూరప్ మీదుగా.. అమెరికా వరకు టెక్ షేర్లన్నీ కుప్పకూలాయి. విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఎన్విడియా షేరు ఏకంగా 17 శాతం పడిపోవటంతో దాదాపు 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోయింది. మనదేశంలో మూడు అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్‌ల మొత్తం మార్కెట్ విలువ కంటే ఇది ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్2023లో ఆవిర్భావండీప్సీక్ పురుడుపోసుకుని రెండేళ్లు కూడా కాలేదు. క్వాంట్ హెడ్జ్ ఫండ్ ‘హై–ఫ్లయర్’చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో దీన్ని నెలకొల్పారు. అతి తక్కువ ఖర్చుతో డీప్‌సీక్ రూపొందించిన ఆర్1 ఏఐ మోడల్ చైనాతోపాటు అమెరికా టెక్ దిగ్గజాలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఏఐ మోడల్‌ను పూర్తి ఉచితంగా అందిస్తుండటం ఓపెన్ ఏఐ వంటి కంపెనీల భవిష్యత్‌కు గొడ్డలిపెట్టులా మారింది. అమెరికాలో విడుదలైన వారంలోనే యాపిల్ యాప్ స్టోర్‌లో డీప్‌సీక్ మొబైల్ యాప్ అత్యధిక డౌన్లోడ్లతో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని చాట్‌జీపీటీని వెనక్కి నెట్టింది. ఈ నెల 27న ఒక్కరోజే ఏకంగా 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం దీని జోరుకు నిదర్శనం. మరోపక్క టెక్ట్స్ ప్రాంప్ట్‌ను ఇమేజ్‌గా మార్చే జానస్–ప్రో–7బీతో మరో సంచలనానికి తెరతీసింది డీప్‌సీక్. అమెరికాకు ‘డీప్’ట్రబుల్.. ఏఐలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాను తిరుగులేని ఏఐ సూపర్‌పవర్‌గా చేసేందుకు ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఎంజీఎక్స్ చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకముందే డీప్‌సీక్ కారు చౌకగా ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసి షాకిచ్చింది. ట్రంప్ సలహాదారు మార్క్ ఆండర్సన్.. డీప్‌సీక్–ఆర్1ను ఏకంగా ‘‘ఏఐ స్పుత్నిక్ మూమెంట్’’గా (1957లో సోవియట్ యూనియన్ ప్రపంచంలో తొలి శాటిలైట్ స్పుత్నిక్ను ప్రయోగించడంతో యూఎస్, సోవియట్ మధ్య స్పేస్ వార్‌కు తెరలేచింది) అభివర్ణించడం విశేషం.దిగ్గజాలకు దీటుగా..ఎన్విడియా అధునాతన చిప్స్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ)తో పోలిస్తే చాలా లో ఎండ్ హార్డ్‌వేర్‌తో (పాత ఎన్విడియా ఏ100 జీపీయూలు) తాము ఏఐ మోడల్స్‌ను రూపొందించామని డీప్‌సీక్ ప్రకటించింది. చైనాకు అధునాతన చిప్స్, టెక్నాలజీ ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలను సైతం ఎదురొడ్డి సొంతంగా దిమ్మదిరిగే ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయడంపై నిపుణులు కూడా నోరెళ్లబెడుతున్నారు. డీప్‌సీక్ దెబ్బతో ప్రపంచ ఏఐ పరిశ్రమ స్వరూపమే మారిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఓపెన్ సోర్స్ (డెవలపర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరచే అవకాశంతో పాటు దీని ఆధారంగా సొంత టూల్స్‌ను రూపొందించుకోవచ్చు) మోడల్ కావడంతో తక్కువ బడ్జెట్లోనే కంపెనీలు, యూజర్లకు ఏఐ అందుబాటులోకి వస్తుంది. డీప్‌సీక్ ఆర్1 ఏఐ మోడల్ మేథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్, లాంగ్వేజ్ పరంగా అన్ని రకాల ప్రమాణాల్లో చాట్‌జీపీటీ, జెమిని, గ్రోక్ వంటి ఏఐ మోడళ్లకు దీటుగా నిలవడం గమనార్హం. మెటా ఏఐ మోడల్ అభివృద్ధికి 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా.. డీప్‌సీక్ కేవలం 6 మిలియన్ డాలర్లతోనే ఆర్1 ఏఐ మోడల్‌ను తీసుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ నుంచి 13 బిలియన్ డాలర్లతో సహా, భారీగా నిధులు సమీకరించిన ఓపెన్ఏఐలో సిబ్బంది సంఖ్య 4,500. దీనికి పూర్తి భిన్నంగా ఇప్పటిదాకా డీప్‌సీక్ వెచ్చించింది 10 మిలియన్ డాలర్లే. ఉద్యోగులు 200 మంది మాత్రమే.ఎన్విడియాకు షాకెందుకు?ఏఐ మోడల్స్‌ను నడిపేందుకు హై ఎండ్ చిప్స్, జీపీయూలు, నెట్వర్కింగ్ అవసరమని ఇప్పటిదాకా ఊదరగొడుతున్నారు. ఈ రంగంలో నంబర్ వన్‌గా ఉన్న ఎన్విడియా మార్కెట్ విలువ 2023 డిసెంబర్లో తొలిసారి 500 బిలియన్ డాలర్లు దాటింది. గడిచిన ఏడాదిలోనే ఏకంగా 3.5 ట్రలియన్ డాలర్లను (మన కరెన్సీలో రూ.301 లక్షల కోట్లు) తాకి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ను వెనక్కి నెట్టింది. డీప్‌సీక్ చౌక మోడల్ వల్ల డిమాండ్ తగ్గొచ్చనే భయంతో ఇన్వెస్టర్లు ఏఐ టెక్ షేర్లను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఎన్విడియా షేర్ 17 శాతం కుప్పకూలింది. బ్రాడ్‌కామ్, ఏఎండీ, అరిస్టా నెట్వర్క్స్, నెదర్లాండ్స్ చిప్ దిగ్గజం ఏఎస్ఎంఎల్ హోల్డింగ్స్, తైవాన్ సెమీకండక్టర్స్ మాన్యుఫ్యాక్చర్స్ (టీఎస్ఎం) వంటి చిప్, నెట్వర్కింగ్ షేర్లు సైతం 15–23 శాతం పడిపోయాయి. -
డీప్‌సీక్ హవా.. దిగ్గజ టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిలికాన్ వ్యాలీకి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ తరహాలో రూపొందించిన చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ ‘డీప్‌సీక్’ (deepseek) పై చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో చైనా డీప్‌సీక్ విషయంలో సిలికాన్ వ్యాలీకి ఓ వేకప్ కాల్ అంటూ హెచ్చరించారు. అసలేం జరిగిందంటే..? కొద్ది రోజులు క్రితం అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన దిగ్గజ టెక్ కంపెనీ ఫౌండర్లు, కోఫౌండర్లు, సీఈవోతో మాటమంతి కలిపారు. అదే సమయంలో చైనా డీప్‌సీక్ తన ఆర్1 మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ట్రంప్ ప్రమాణ స్వీకారం కారణంగా ఆర్1 మోడల్ గురించి పెద్దగా ఎవరీకి తెలియలేదు.కానీ వారాంతంలో డీప్‌సీక్ చాట్‌బాట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యూఎస్ యాపిల్ యాప్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ స్థానంలో డీప్‌సీక్ చేరింది. చాట్ జీపీటీ సైతం డౌన్లోడ్ల విషయంలో డీప్‌సీక్ వెనక్కి నెట్టింది. దీంతో కృత్రిమ మేధా ప్రపంచంలో చైనా ఏఐ డీప్‌సీక్ దెబ్బకు ఇతర టెక్నాలజీ కంపెనీ షేర్లు.. బేర్ మన్నాయి. ముఖ్యంగా చిప్ తయారీ సంస్థలు ఊహించని స్థాయిలో నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సోమవారం దాదాపు 17 శాతం నష్టాన్ని చవిచూసింది. ఎన్విడియా సైతం అమెరికన్ స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక రోజు లోనే అతిపెద్ద నష్టాన్ని మూగట్టుకుంది. నష్టం విలువ సుమారు 589 బిలియన్ డాలర్లు.ఈ వరుస పరిణామాలపై ట్రంప్ స్పందించారు. డీప్‌సీక్ తక్కువ ఖర్చుతో తయారు చేసినట్లు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీకి ఇదొక వేకప్ కాల్ లాంటిది. డీప్‌సీక్‌కు వస్తున్న క్రేజ్‌ను సానుకూలంగా భావిస్తున్నట్లు చెప్పారు. బిలియన్ డాలర్లు ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చుతో అదే తరహా చాట్బాట్లను తయారు చేయొచ్చు’ అని అన్నారు. -
అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న: ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్‌సీక్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగ్గజాలకు సైతం దడపుట్టిస్తున్న చైనా ఏఐ 'డీప్‌సీక్' (DeepSeek) ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.చైనాకు చెందిన AI స్టార్టప్ డీప్‌సీక్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ, క్లౌడ్ కంటే వేగంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్న డీప్‌సీక్.. అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. గూగిల్ర్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు తమ ఏఐ కోసం కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటే.. డీప్‌సీక్ మాత్రం పూర్తిగా ఉచితం. ఈ కారణంగానే చాలామంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారు.ఎక్కువమంది ఉపయోగిస్తున్న డీప్‌సీక్ ఏఐను ఒక యూజర్, అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రం అని అడగ్గా.. సరైన సమాధానం ఇవ్వలేదు. ఇది నా పరిధిని దాటిన అంశం అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తరువాత అదే యూజర్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి అడగ్గా.. దానికి కూడా అదే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను.. ఆ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా బుద్ది చూపించిందని కొందరు అంటే.. దీనిని వెంటనే బ్యాన్ చేయాలని మరికొందరు అన్నారు. మొత్తం మీద కొంతమంది యూజర్లకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఇది విఫలమైనట్లు తెలుస్తోంది.డీప్‌సీక్ అంటే ఏమిటి?డీప్‌సీక్ అనేది చైనా ఏఐ చాట్‌బాట్. ఇది దాని ప్రత్యర్థుల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. దీనిని లియాంగ్ వెన్ఫెంగ్ (Liang Wenfeng) 2023లో ప్రారంభించారు. ఈ చాట్‌బాట్ ఉపయోగించడానికి ప్రస్తుతానికి ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా.. యాపిల్ యాప్స్టోర్లోనూ దూసుకెళ్తోంది.CCP machine exposed 🤣 https://t.co/DlmofSXQUP pic.twitter.com/TAggpM8L87— ur rental friend☆ ragebait machine (@sxchidxnxnd) January 27, 2025'డీప్‌సీక్'పై శామ్ ఆల్ట్‌మన్ స్పందనడీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ.. పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్‌ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!డీప్‌సీక్‌పై సైబర్ ఎటాక్డీప్సీక్పై సైబర్‌దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది. -
డీప్‌సీక్.. మార్కెట్ షేక్!
ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపు భయాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 76వేల స్థాయి దిగువన 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23,000 స్థాయిని కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 263 పాయింట్లు పతనమై 22,829 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 923 పాయింట్లు క్షీణించి 75,267 వద్ద, నిఫ్టీ 306 పాయింట్లు పతనమై 22,786 వద్ద కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 86.31 స్థాయి స్థిరపడింది. → ప్రధాన సూచీలు ఒకశాతమే పడినా.. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు భారీగా క్షీణించాయి. అధిక వాల్యుయేషన్ల భయాలతో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5%, మిడ్ క్యాప్ సూచీ 2.7% పడింది. → స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.9.28 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.410.23 లక్షల కోట్ల(4.75 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచి్చంది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. → ఐటీసీ లిమిటెడ్ నుంచి విడదీసిన ఐటీసీ హోటల్స్ షేర్లు జనవరి 29న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1న ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ ప్రత్యేక సంస్థగా విడిపోయింది. ప్రతి పది ఐటీసీ షేర్లకు ఒక ఐటీసీ హోటల్ షేరు ధరను కేటాయించారు.ఎందుకీ పతనం...→ అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. → చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ఆర్1 ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమను కుదిపేస్తుంది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్‌పై పడింది. → అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి. → ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. యూఎస్ టెక్ దిగ్గజాలలో కలవరం యూఎస్ ఏఐకు పోటీగా చైనీస్ ఆర్1 టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు 3 శాతం పతనమైన నాస్డాక్ చాట్‌జీపీటీకి పోటీగా చైనీస్ డీప్‌సీక్ మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, గూగుల్ తదితర యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్స్, చాట్‌జీపీటీకి పోటీగా చైనా రంగంలోకి దిగింది. స్టార్టప్ డీప్‌సీక్.. అమెరికా ఏఐలకు దీటుగా ఆర్1ను విడుదల చేస్తోంది. దీంతో టెక్నాలజీ వర్గాల్లో ఆందోళనలకు తెరలేచింది. చైనా కారుచౌకగా ఏఐ సేవలు అందించనున్న అంచనాలు యూఎస్ ఇన్వెస్టర్లలో భయాలను కల్పించింది. దీంతో టెక్ కంపెనీలు లిస్టయిన నాస్డాక్ ఇండెక్స్ ప్రారంభంలోనే 3 శాతం పతనమైంది. మ్యాగ్నిఫిషియంట్ 7గా పేర్కొనే ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఏఎండీ తదితరాలు అమ్మకాలతో డీలా పడ్డాయి. ప్రధానంగా ఏఐ అవకాశాలపై అంచనాలతో ఇటీవల భారీ ర్యాలీ చేస్తున్న ఎన్విడియా షేరు 17 శాతంపతనంకాగా.. మైక్రోసాఫ్ట్ 3 శాతంపైగా క్షీణించింది. ఫలితంగా ఒక్కరోజులోనే ఎన్విడియా మార్కెట్ విలువలో సుమారు 500 బిలియన్ డాలర్లు ఆవిరైంది. ఆర్1 ఎఫెక్ట్..: చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఆర్1.. అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్‌కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్‌సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్డ్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్‌లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్‌ను ఆర్1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
హైవే మధ్యలో రెండంతస్తుల ఇల్లు..! ఎక్కడంటే..
డెవలప్మెంట్లో భాగంగా నేషనల్ హైవేలను నిర్మిస్తుంటారు. ఒక్కోసారి వాటి కారణంగా ప్రదేశంలో మన బిల్డింగ్లు ఉంటే కోల్పోక తప్పదు. ప్రభుత్వం ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి..తరలించడం జరగుతుంది. అయితే ఇక్కడొ తాత ప్రభుత్వం తరలి వెళ్లిపోయేందుకు ఎన్ని కోట్లు ఆఫర్ అందించినా సేమిరా అన్నడు ఫలితంగా ఏం జరిగిందో తెలిస్తే అవాక్కవ్వుతారు. పాపం ఆ తాత అలా మంకుపట్టు పట్టి ఉండకుండా బాగుండనని ఇప్పుడు బాధపడుతున్నాడు.అసలేం జరిగిందంటే..చైనాలోని జిన్క్సీలో ఉన్న హువాంగ్ పింగ్ రెండంతస్తులి ఇల్లు ప్రదేశంలో హైవే నిర్మిస్తున్నానరు. దాంతో చైన ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయేలా డబ్బు ఆఫర్ చేసింది. ఎంతలా నచ్చచెప్పిన వినలేదు. ఏకంగా రెండు కోట్లు ఆఫర్ చేసినా తగ్గేదే లే..అన్నాడు. దాంతో ప్రభుత్వం అతడి ఇల్లు మినహా ఇరువైపులా హైవే నిర్మించేసింది. దీంతో అతడికి నిత్యం దుమ్ము, రణగొణధ్వనుల మద్య నెలకొన్న ఇల్లులా చికాకు తెప్పిస్తుంది. అబ్బా ఆ రోజు ఎందుకంతా పట్టు పట్టానా అని బాధపడుతున్నాడు. ఒక్కసారి టైమ్ వెనక్కెళ్లితే..చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ని హాయిగా అందుకుంటానని బాధగా చెబుతున్నాడు. ప్రస్తుతం అతడి ఇల్లు ఎలా ఉందండి సరిగ్గా హైవే మధ్యలోఉన్న ఇల్లులా ప్రధాన ఆకర్షణగా ఉంది. పైగా చుట్టపక్కల నివాసితులు ఆ తాత ఇంటి వద్దకు వచ్చి పోటోలు తీసుకునే ఓ విచిత్రమైన ఇల్లులా అయిపోయింది. అంతేగాదు ఆ తాతను చైనాలో "స్ట్రాంగ్ నెయిల్ హౌస్ యజమాని" అని పిలుస్తారు. ఎందుకంటే నెయిల్ హౌస్ అనేది ఆక్రమిత ఇంటికి చైనీస్ పదం. అభివృద్ధికి ఆటంకం కలిగించే తమ ఆస్తి కోసం పోరాడే యజమానులను చైనాలో ఇలా పిలుస్తారు. కాగా, 2017లో, షాంఘైలో దాదాపు 14 సంవత్సరాలుగా ఒక ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఒక ప్రసిద్ధ "నెయిల్ హౌస్" చివరకు కూల్చివేశారు. తగినంత పరిహారం లేదని పేర్కొంటూ ఆ ఇంటి యజమానులు 2003 నుంచి తరలింపు ఆఫర్లను తిరస్కరించారు. కానీ చివరకు రూ. 3 కోట్ల పరిహారంతో మకాం మర్చాడానికి అంగీకరించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లుకొడుతోంది. The stubborn old Chinese man who refused to sell his house for a government project now regrets his decision.Huang Ping, from Hunan province, hoped for more money but lost everything. The government built a road around his house, leaving it in the middle of a busy street. Now,… pic.twitter.com/it0rYe2fhd— Ibra ❄️ (@IbraHasan_) January 25, 2025 (చదవండి: ఇప్పుడు పుట్టి ఉంటే కచ్చితంగా ఆటిజం నిర్ధారణ అయ్యేది: బిల్‌గేట్స్) -
జనాభా తగ్గుతోంది... వృద్ధులు పెరుగుతున్నారు
ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా అనేక దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి. పెళ్లికి, పిల్లలను కనేందుకు యువతరం పెద్దగా ఇష్టపడటం లేదు. కాస్త అటూ ఇటుగా ప్రపంచమంతటా ఇదే ధోరణి పెరుగుతోంది. దాంతో ఏ దేశంలో చూసి నా జనాభా క్రమంగా తగ్గుతోంది. 2024లో చైనా జనాభా 10.4 లక్షలు తగ్గింది. అక్కడ జనాభా తగ్గడం వరుసగా ఇది మూడో ఏడాది. జపాన్లోనైతే 15 ఏళ్లుగా జనాభా వరుసగా తగ్గుము ఖం పడుతోంది. దక్షిణ కొరియాలో 2023లో కాస్త పుంజుకున్న జనాభా ఈ ఏడాది మళ్లీ తగ్గింది. ఇటలీలో జననాల సంఖ్య 19వ శతాబ్దం తరవాత తొలిసారి 4 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. 63 దేశాలు, భూభాగాల్లో జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరిందని ఐరాస అంచనా. వచ్చే 30 ఏళ్లలో మరో 48 దేశాలు ఆ స్థాయికి చేరతాయని సంస్థ పేర్కొంది. 60 ఏళ్లలో ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని, అక్కడినుంచి క్షీణించడం మొదలవుతుందని అభిప్రాయపడింది. చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు మరోవైపు ఆరోగ్య సంరక్షణ, మెరుగైన జీవనశైలి, ఆయుర్దాయం పెరుగుదల తదితరాలతో చాలా దేశాల్లో వృద్ధుల జనాభా నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాంతో ఆర్థిక వృద్ధి దెబ్బ తింటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. పురుషుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది. ఫ్యాక్టరీ, బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు 50 నుంచి 55కు, వైట్–కాలర్ ఉద్యోగాల్లో 55 నుంచి 58కు పెంచింది. 2022 నుంచి చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడం మొదలైంది. దాంతో అత్యధిక జనాభా రికార్డును 2023లోనే భారత్‌కు కోల్పోయింది. ఒకే సంతానం నిబంధనను సడలించి ముగ్గురిని కనేందుకు అనుమతించినా లాభం లేకపోయింది. 140 కోట్లున్న చైనా జనాభా 2050 నాటికి 130 కోట్లకు తగ్గుతుందని అంచనా. ఇటలీదీ అదే వ్యథ... ఇటలీలో కూడా జనాభా నానాటికీ తగ్గిపోతోంది. 2023లో 5.94 కోట్లుండగా 2024 చివరికి 5.93 లక్షలకు తగ్గింది. 2008లో 5.77 లక్షలున్న వార్షిక జననాల సంఖ్య 2023 నాటికి ఏకంగా 3.8 లక్షలకు పడిపోయింది! ఇటలీ ఏకీకరణ తరువాత జననాల సంఖ్య క్షీణించడం అదే తొలిసారి! పిల్లల సంరక్షణ ఖరీదైన వ్యవహారంగా మారడం, తక్కువ జీతాలు, వృద్ధ తల్లిదండ్రులను చూసుకునే సంప్రదాయం వంటివి ఇటాలియన్లకు భారంగా మారుతు న్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా పోప్ కూడా ఇటీవలే ఇటాలియన్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా 2033 కల్లా ఏటా కనీసం 5 లక్షల జననాలే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిరోధించడానికి జనాభా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దక్షిణ కొరియాలో విదేశీయుల రాక పుణ్యమా అని 2023లో జనాభా పుంజుకుంది. నిజానికి అధిక పోటీ విద్యా విధానంలో పిల్లలను పెంచడానికి అధిక ఖర్చు, మహిళలే శిశు సంరక్షణ చేపట్టా లనే ధోరణి వల్ల అక్కడ కొన్నేళ్లుగా జనాభా తగ్గుతోంది. వర్కింగ్ వీసా ప్రోగ్రాం పొడిగింపు వల్ల విదేశీ నివాసి తుల సంఖ్య 10% పెరిగి 10.9 లక్షలకు చేరింది. ఫలితంగా జనాభాలో కాస్త పెరుగుదల నమోదై 5.18 కోట్లకు చేరింది. కానీ వీరిలో ఏకంగా 90.5 లక్షల మంది 65, అంతకు మించిన వయసువారే! వృద్ధుల జనాభా పెరగడం కార్మికుల కొరతకు దారి తీస్తోంది.జపాన్‌లో అలా.. జపాన్ అయితే జనాభా సంక్షోభమే ఎదుర్కొంటోంది! 2008లో 12.8 కోట్లుండగా ప్రస్తుతం 12.5 కోట్లకు పడిపోయింది. జననాల సంఖ్య కూడా బాగా తగ్గుతోంది. యువత పెళ్లి, పిల్లలను కనడంపై తీవ్ర విముఖత చూపుతుండటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ఉద్యోగావకాశాల లేమి, జీవన వ్యయానికి తగ్గ వేతనాలు లేకపోవడం, కార్పొరేట్ సంస్కృతి పనిచేసే మహిళలు పని చేసేందుకు అనుకూలంగా లేకపోవడం వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయి. 2070 నాటికి జపాన్ జనాభా 8.7 కోట్లకు పడిపోతుందని అంచనా. జనాభా సమస్యకు తోడు వృద్ధుల సంఖ్య కూడా జపాన్ను కలవరపరుస్తోంది. అక్కడ ప్రతి 10 మందిలో నలుగురు వృద్ధులే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐలో దూసుకెళ్తున్న చైనా కంపెనీలు
సాన్‌హొసే (యూఎస్): మొబైల్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్నాయని సామ్సంగ్ సౌత్‌వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్, సీఈవో జె.బి.పార్క్ తెలిపారు. ఏఐ అవసరాల కోసం వ్యక్తిగత డేటాను పంచుకుంటే చైనీస్ హ్యాండ్సెట్ తయారీ సంస్థలతో ముప్పు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. భారత్‌లో ప్రత్యర్థి సంస్థలతో పోటీ ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ‘బలమైన ప్రత్యర్థి లేదా పోటీ లేకపోతే జీవితం చాలా బోరింగ్‌గా ఉంటుంది. సవాళ్లను మేము ఆస్వాదిస్తాం. మొబైల్, ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టడమేగాక మొత్తం వ్యవస్థకు సేవలు అందించే సంస్థగా మారడానికి ప్రయతి్నస్తున్నాం. భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు 2025 పెద్ద సంవత్సరంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ఇందుకు సామ్సంగ్ సిద్ధంగా ఉంది’ అని వివరించారు. ప్రస్తుతం 800 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన సూపర్–ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఆపిల్ నుండి, అలాగే 400–600 డాలర్ల విభాగంలో చైనీస్ హ్యాండ్సెట్ తయారీదారుల నుండి సామ్సంగ్ పోటీ ఎదుర్కొంటోంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీ ఉంటుందని పార్క్ అన్నారు. చిన్న పట్టణాల్లోనూ కంపెనీ తయారీ ప్రీమియం ఫోన్ల వాడకం పెరిగిందని వివరించారు. -
ట్రంప్ ‘వాణిజ్య యుద్ధభేరి’
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకొని నాలుగు రోజులుగా డోనాల్డ్ ట్రంప్ వరసపెట్టి జారీచేస్తున్న ఉత్తర్వులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి గురువారం ఆయన చేసిన ప్రసంగం కూడా ఆ కోవలోనిదే. అది ఒకరకంగా ‘వాణిజ్య యుద్ధభేరి’. తమ దేశంలో పెట్టుబడులు పెడితే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ పన్నులు విధిస్తామనీ, కాదంటే ట్యారిఫ్ల మోత మోగిస్తామనీ ఆయన హెచ్చరించారు. భారత్, చైనాలపై ఆయనకు మొదటినుంచీ ఆగ్రహం ఉంది. ఈ రెండు దేశాలూ వర్ధమాన దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని గతంలో ఆయన విరుచుకుపడ్డారు. అనంతర కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేసియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వల్ల అమెరికా బాగా నష్టపోతున్నదని చీటికీ మాటికీ ఆరోపించేవారు. నిజానికి డబ్ల్యూటీవో అమెరికా మానసపుత్రిక. వాణిజ్య ప్రపంచంలో హద్దులుండరాదని, కనీసం వాటిని తగ్గించాలని, హేతుబద్ధమైన ట్యారిఫ్‌లు అమలయ్యేలా చూడా లని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వర్ధమాన దేశాలకు సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ (జీఎస్పీ) కింద దిగుమతి చేసుకునే కొన్ని సరుకులపై సుంకాలు తగ్గుతాయి. ఇతర దేశాల ఉత్పత్తులను సైతం సమానంగా చూసే దేశాన్ని అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పరిగణించే సూత్రం డబ్ల్యూటీవో పాటిస్తోంది. ఇవన్నీ ట్రంప్‌కు కంటగింపుగా ఉన్నాయి. సంస్థ నిబంధనల్లో ఉన్న లొసుగులు అమెరికాను దెబ్బతీస్తూ వేరే దేశాలకు తోడ్పడుతున్నాయని ఆరోపించటం అందుకే! ఇంతకూ ట్రంప్ నిజంగానే అన్నంత పనీ చేస్తారా? అలాచేస్తే అమెరికా వాణిజ్యం ఏమవు తుంది? ట్రంప్ హెచ్చరించి 24 గంటలు కాకుండానే పొరుగునున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గట్టి జవాబే ఇచ్చారు. కెనడా, మెక్సికోల ఉత్పత్తులపై 25 శాతం ట్యారిఫ్ విధించే ఆలోచన చేస్తున్నా మని, బహుశా ఫిబ్రవరి 1 నుంచి అది అమలుకావచ్చని ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ అదే జరిగితే తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని, అమెరికా వినియోగదారులు భారీయెత్తున నష్ట పోవాల్సి వస్తుందని ట్రూడో హెచ్చరించారు. కెనడా నుంచి అమెరికా 34 అత్యవసర ఖనిజాలు, లోహాలు దిగుమతి చేసుకుంటున్నది. అలాగే అమెరికా నుంచి భారీ యంత్రాలూ, సహజవాయువు, విద్యుత్, ముడి చమురు, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. నిత్యం 270 కోట్ల డాలర్ల విలువైన సరుకులు, సేవలు అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ వెళ్తుంటాయి. భిన్న వాతావరణ పరిస్థితులున్నప్పుడు కావలసిన సమస్తాన్నీ ఏ దేశమూ సొంతంగా ఉత్పత్తి చేసు కోవటం సాధ్యం కాదు. ఈ సంగతి ట్రంప్‌కు తెలియదనుకోలేం. క్రితంసారి అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై సుంకాలు తగ్గించాలని మన దేశంపై ఒత్తిళ్లు తెచ్చారు. తీరా తగ్గించాక చాలదని పేచీ పెట్టారు. ప్రతీకారంగా మన ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. దీనికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. జీఎస్పీ నిబంధనలు భారత్‌కు వర్తింపజేయొద్దని డబ్ల్యూటీవోకు లేఖ రాశారు. మనం భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై మరింతగా ట్యారిఫ్ వడ్డింపులు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. బ్రిక్స్‌లో ఉన్న రష్యా, చైనాలు దానివల్ల దండిగా లాభపడతాయని, శక్తి మంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన ఆందోళన. ఉన్నంతలో మనను ఆ సంస్థకు దూరం చేయాలన్నది ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. అయితే తెగేదాకా లాగే ధైర్యం ట్రంప్‌కు ఉందా అన్నది సందేహమే. ఎందుకంటే 2019లో చైనా ఎగుమతులపై 30 వేల కోట్ల డాలర్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని తమ పబ్లిక్‌రంగ సంస్థలకు చైనా సూచించింది. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మళ్లీ ట్రంప్ రంగంలోకి దిగి చైనాపై సుంకాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ప్రకటించాకగానీ పరిస్థితి కుదుటపడలేదు. తన ప్రకటనల పర్యవసానం ఎలావుంటుందో ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 1930లో అమెరికా తీసుకొచ్చిన టారిఫ్ చట్టానికి ప్రతీకారంగా ఎవరికి వారు వాణిజ్య ఆంక్షలు అమలు చేయటం పెను సంక్షోభానికి దారితీసిన సంగతి ట్రంప్ గుర్తుంచుకోవాలి. ఈ పరస్పరహననం వల్ల ఎన్నో దేశాల జీడీపీలు భారీయెత్తున పడిపోవటం పర్యవసానంగానే అప్పట్లో అన్ని చోట్లా అశాంతి, అపనమ్మకం ప్రబలాయి. దీన్ని హిట్లర్ వంటి నియంతలు చక్కగా వినియోగించు కున్నారు. జాతి విద్వేషాలు, జాతీయ దురభిమానాలను రెచ్చగొట్టారు. సహజ వనరుల వినియోగం పెరగటం, సాంకేతికతల అభివృద్ధి జరగటం తదితర కారణాల వల్ల కొంత హెచ్చుతగ్గులతో చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వంటి సంస్థల వెనకుండి ప్రపంచ వాణి జ్యాన్ని శాసించినవారే, లాభపడ్డవారే ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’ అంటూ స్వరం మారిస్తే ఇతర దేశాలు సాగిలపడాలా? ‘అమెరికా మితిమీరినా డబ్ల్యూటీవో ద్వారా వివాద పరిష్కారానికి గల అవకాశాలను వినియోగించుకోండి. తీవ్ర చర్యలొద్దు’ అని ఇతరేతర దేశాలకు డబ్ల్యూటీవో సంస్థ డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఇవేలా హితవు చెబుతున్నారు. మంచిదే! మరి ట్రంప్‌కు చెప్ప గలవారెవరు? ఆయనను నియంత్రించగలిగేదెవరు? -
చైనా విస్తరణ కాంక్షకు ‘పనామా’తో ట్రంప్ ఆజ్యం పోస్తున్నారా?
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసంలో పనామా కాలువ గురించి చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనామా కాలువను బల ప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటన మున్ముందు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు. ప్రారంభ ప్రసంగంలో ట్రంప్ పనామా కాలువ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయిందని, 1977 నాటి ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించిందని ఆరోపించారు. అప్పట్లో కాలువను అమెరికా మూర్ఖంగా పనామాకు ఇచ్చివేసిందని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, అందుకే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా భావించినప్పటికీ డ్రాగన్ దేశ విస్తరణ కాంక్షకు బలమిస్తున్నట్లు అవుతుందని అంటున్నారు. తైవాన్ను, ఇతర ప్రాంతాలను కలిపేసుకునేందుకు ఇదో సాకుగా చూపే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, తైవాన్ పట్ల చైనాను సంయమనంగా వ్యవహరించేలా చేయడమన్న దశాబ్దాల అమెరికా విధానానికి వీడ్కోలు పలుకుతూ ట్రంప్ చేసిన అనూహ్య ప్రకటన తన విస్తరణ కాంక్షకు చట్టబద్ధతగా ఆ దేశం భావించే ప్రమాదముందని చెబుతున్నారు. రష్యా, చైనాల సరసన అమెరికా? అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకమునుపే ట్రంప్ పనామా కాలువ అమెరికాకే చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై నిపుణులు పెదవి విరిచారు. అలాంటప్పుడు, చైనా, రష్యాల చర్యల కంటే అమెరికా ఏవిధంగా మెరుగనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని వారన్నారు. ఉక్రెయిన్ తమకే చెందుతుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తైవాన్ను బలప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామని చైనా బెదిరింపులకు దిగుతోంది. ట్రంప్ కూడా పనామా, గ్రీన్‌ల్యాండ్‌లను సైనిక చర్యతో అయినా స్వాధీనం చేసుకుంటామంటున్నారు. ఆ రెండు దేశాలకు, అమెరికాకు తేడా ఏముంటుంది?’అని న్యూయార్క్‌కు చెందిన జర్నలిస్ట్ గెరాల్డో రివెరా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాన్ని స్వాదీనం చేసుకుంటామనడం ట్రంప్ విస్తరణవాదానికి ఉదాహరణ అని వాషింగ్టన్కు చెందిన మరో జర్నలిస్ట్ పేర్కొన్నారు. చైనాకు ఓ అవకాశం కానుందా? పనామా కాలువతోపాటు సరిహద్దులను ఆనుకుని ఉన్న కెనడాను, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని డెన్మార్క్ పాలనలోని గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు.. రష్యా, చైనాలు కూడా తమ ఆక్రమణలను అమెరికా గుర్తిస్తుందనే సంకేతాలిచ్చినట్లవుతుందని సీఎన్ఎన్ యాంకర్ జిమ్ సియుట్టో ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, చైనాకు విస్తరణకు గేట్లు తెరిచినట్లవుతుందని ఆ దేశ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమిస్తే చైనా తైవాన్ను తప్పక స్వా«దీనం చేసుకుంటుందని వాంగ్ జియాంగ్యు అనే హాంకాంగ్ ప్రొఫెసర్ స్పష్టం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన తైవాన్ అంశం సహా అన్ని విషయాలపైనా ట్రంప్‌తో బేరసారాలకు అవకాశముంటుందని చైనా అధికార వర్గాలు భావిస్తున్నాయని షాంఘైలోని ఫుడాన్ వర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ ఝావో మింగ్హావో అంటున్నారు. కాలువపై చైనా పెత్తనం నిజమేనా? పసిఫిక్–అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా ప్రభుత్వం 1904–1914 సంవత్సరాల మధ్య పనామా కాలువను తవ్వించింది. దీనివల్ల ఈ రెండు సముద్రాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గింది. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి పనామా నియంత్రణ కొనసాగుతోంది. పనామా కాలువ గుండా వెళ్లే ఓడల్లో 70 శాతం అమెరికావే కావడం గమనార్హం. భద్రతకు ముప్పు కలిగితే కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కాలువను చైనా నియంత్రించడం లేదు, నిర్వహించడం లేదు. కానీ, హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాలువలోని కరీబియన్, పసిఫిక్ ఎంట్రన్స్ వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇదికాకుండా, చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో 2017లో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పనామాయే. 2016లో చైనా ప్రభుత్వ సీవోఎస్సీవోకు చెందిన ఓట మొదటిసారిగా పనామా కాలువలోకి ప్రవేశించింది. అదే ఏడాది, చైనా కంపెనీ లాండ్బ్రిడ్జి గ్రూపు మార్గరిటా దీవిలోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాలువపై మరో వంతెన నిర్మాణ కాంట్రాక్టును చైనా కంపెనీలే దక్కించుకున్నాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తుండటం అమెరికాకు కంటగింపుగా మారింది. ‘సాంకేతికంగా కాలువపై హక్కులు మావే. మరో దేశం చేతుల్లోకి కాలువ వెళుతోంది. వాస్తవానికి పరాయి దేశం తన కంపెనీల ద్వారా కాలువపై పెత్తనం సాగిస్తోంది’అని విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం పేర్కొన్నారు. కాలువను అమెరికా కొంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విశ్వాసంలోఒక మెట్టు కిందికి..
అధిక ఆదాయం దేశాల్లోనే..భారత్ ప్రధాన కేంద్రంగా ఇతర దేశాలు కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలపట్ల ప్రజల విశ్వాసంలో మన దేశం 13వ స్థానానికి పరిమితమైంది. ఈ విషయంలో కెనడా టాప్‌లో నిలిచింది. జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, యూఎస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, మీడియా, స్వచ్ఛంద సంస్థల పట్ల అధిక ఆదాయ దేశాల్లో సగటున 61 శాతం, అల్పాదాయ దేశాల్లో సగటున 48 శాతం మంది మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక అల్పాదాయ దేశాల్లో వ్యాపార సంస్థల పట్ల ప్రజలు తటస్థంగా ఉన్నారు. ఎన్జీవోలు, ప్రభుత్వం, మీడియా విషయంలో భరోసా లేదని చెప్పారు. తక్కువ ఆదాయం ఉన్న జనాభాలో భారతీయ సంస్థల పట్ల విశ్వాసం 65 శాతం ఉంటే, అధిక ఆదాయ వ్యక్తుల విషయంలో ఇది 80 శాతంగా ఉంది. చాలా దేశాల్లో ఎన్నికలు లేదా ప్రభుత్వ మార్పుల ప్రభావం తక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. ఏదైనా వార్త విషయంలో విశ్వసనీయ సమాచారమా లేదా మోసగిస్తున్నారా అన్నది తేల్చుకోలేకపోతున్నట్టు 63 శాతం మంది చెప్పారు. ఈ అభిప్రాయాన్ని థాయ్‌లాండ్‌లో 75 శాతం మంది, భారత్‌లో 72 శాతం మంది వ్యక్తంచేశారు. -
మనతో రోబో రన్!
ఎన్నో రంగాల్లో మనిషికి సవాల్ విసురుతున్న మరమనుషులను చైనా.. ప్రపంచంలోనే తొలిసారిగా చరిత్రాత్మక పోటీకి రంగంలోకి దింపుతోంది. అథ్లెట్లు, హ్యూమనాయిడ్ రోబోలకు కలిపి మొట్టమొదటిసారిగా హాఫ్ మారథాన్ (21 కి.మీ.) పరుగు పందెం నిర్వహించనుంది. ఏప్రిల్‌లో జరగనున్న ఈ పోటీకి చైనా రాజధాని బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లా వేదిక కానుంది. ఇందులో డజన్లకొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు సుమారు 12 వేల మంది అథ్లెట్లతో పోటీపడనున్నాయి. ఈ రేసులో టాప్–3లో నిలిచే రేసర్లకు (అథ్లెట్లు అయినా లేక హ్యూమనాయిడ్ రోబోలైనా) బహుమతులిస్తారని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’తెలిపింది. బీజింగ్ ఆర్థిక–సాంకేతికత అభివృద్ధి ప్రాంతం లేదా ఈ–టౌన్ పరిపాలనా సంఘం ఈ వినూత్న పోటీని నిర్వహించనుంది. 20కన్నా ఎక్కువ రోబో తయారీ సంస్థలు హాఫ్ మారథాన్‌లో పాల్గొననున్నాయి.స్పెషల్ ఎట్రాక్షన్‌గా ‘టియాంగోంగ్’ మారథాన్‌లో పాల్గొనే రోబోలలో చైనాకు చెందిన ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధి చేసిన టియాంగోంగ్ హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ రోబోకు గంటకు సగటున 10 కి.మీ. వేగంతో పరిగెత్తే సామర్థ్యం ఉందని ‘ద డైలీ సీపీఈసీ’పేర్కొంది. గతేడాది బీజింగ్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో రేసు మొదలైనప్పటి నుంచి చివరిదాకా ఈ రోబో మనుషులతో కలిసి పరుగెత్తింది.చైనాలో రోబోల అభివృద్ధి ఎందుకంటే.. చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో శ్రామికశక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్నా.. ఆర్ధికవృద్ధిని పెంచాలన్నా శ్రామికశక్తి అవసరం.దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. చైనా ఆగస్టులో హ్యూమనాయిడ్ రోబోలతో ఫుట్‌బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ లాంటి పోటీలు నిర్వహించనుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్కండిషన్స్ అప్లై..హాఫ్ మారథాన్‌లో పాల్గొనే రోబోలవిషయంలో చైనా కొన్ని షరతులు విధించింది. అవేమిటంటే.. » రోబోలన్నీ మనిషి ఆకృతిలో కనిపించాలి. » వాకింగ్ లేదా రన్నింగ్ లాంటి కదలికల లక్షణాలు కలిగి ఉండాలి. అంటే వాటికి చక్రాలు ఉండరాదన్నమాట. » రోబోల కనీస ఎత్తు 1.6 అడుగుల నుంచి గరిష్టంగా 6 అడుగుల మధ్య ఉండాలి. » హిప్–టు–ఫుట్ పొడవు అంటే నడుము నుంచి పాదం వరకు 1.47 అడుగుల ఎత్తు ఉండాలి. » రిమోట్ ద్వారా నియంత్రించే రోబోలు లేదా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్ హ్యూమనాయిడ్లను పోటీలోకి దింపాలి. అయితే అవసరమైతే పోటీ మధ్య బ్యాటరీలను మార్చుకోవచ్చు.2,76,288ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం 2023లో చైనా సంస్థలు ఇన్స్టాల్ చేసిన రోబోల సంఖ్య. ఇది ఆ ఏడాది ప్రపంచంలోని మొత్తం రోబోల్లో 51 శాతం -
మనుషులతో.. మరమనుషులు: మారథాన్‌కు అంతా సిద్ధం!
మారథాన్ అంటే.. ఓ ఐదు కిలోమీటర్లు లేదా పది కిలోమీటర్లు ఇలా.. మనుషులు పరుగెడుతుంటారని అందరికీ తెలుసు. కానీ మనుషులు, రోబోట్లు పాల్గొనే.. ప్రపంచంలోనే మొట్టమొదటి మారథాన్‌ను నిర్వహించేందుకు చైనా సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఏప్రిల్‌లో జరగనున్న ఈ మారథాన్ బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించనున్నారు. 21 కిమీ మేర డజన్ల కొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు 12,000 మంది మానవ అథ్లెట్లతో పోటీపడతాయని.. ఇందులో మానవులు లేదా రోబోట్ అనే దానితో సంబంధం లేకుండా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు.త్వరలో జరగనున్న మారథాన్‌లో పాల్గొనే రోబోట్లను 20 కంటే ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్లు మనుషులు మాదిరిగా కనిపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. రోబోట్లు తప్పనిసరిగా 0.5 మరియు 2 మీటర్ల ఎత్తులో నిలబడాలి. కనీసం హిప్-టు-ఫుట్ ఎక్స్టెన్షన్ 0.45 మీటర్లు ఉండాలి. రిమోట్ కంట్రోల్, ఆటోమాటిక్ రోబోట్లు రెండూ ఈ రేసులో పాల్గొనవచ్చు. రోబోల పనితీరు సజావుగా సాగటానికి కావలసిన బ్యాటరీలను ఆపరేటర్లు భర్తీ చేసుకోవచ్చు.మారథాన్‌లో పాల్గొనే రోబోట్లలో.. చైనా ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేసిన టియాంగాంగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఉంది. ఇది గంటకు సగటున 10 కిమీ వేగంగా ముందుకు వెతుందని సమాచారం. ఇది గతంలో కూడా హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు మొత్తం రేసులో హ్యూమనాయిడ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుంది.చైనా హ్యూమనాయిడ్ రోబోలను ఎందుకు అభివృద్ధి చేస్తోందిచైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడంతో.. శ్రామిక శక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్న.. ఆర్ధిక వృద్ధిని పెంచాలన్నా శ్రామిక శక్తి అవసరం. దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. చైనీస్ క్లయింట్లు 2023లో 2,76,288 రోబోట్లను లేదా ప్రపంచంలోని మొత్తంలో 51 శాతం ఇన్స్టాల్ చేసారు. త్వరలో వీరు రోబోట్లతో స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ -
ఆ డాక్టర్ డేరింగ్‌కి మతిపోవాల్సిందే..! వామ్మో మరీ ఇలానా..
ఓ డాక్టర్ తన భార్యకు భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ఓ భయానక సాహసానికి ఒడిగట్టాడు. పైగా తన భార్య కోరికను తీర్చేందుకే ఇలా చేశానని చెబుతున్నాడు. ఆ ఘనకార్యం వింటే..అమ్మబాబోయే ఏం డాక్టర్‌వయ్యా బాబు అని మండిపడతారు.ఈ వింత ఘటన చైనా(China)లో చోటుచేసుకుంది. తైవాన్‌లోని తైపీకి చెందిన డాక్టర్ చెన్ వీ నోంగ్(Dr Chen Wei-nong) అనే సర్జన్ తనకు తానుగా వేసక్టమీ ఆపరేషన్(Dr Chen Wei-nong) చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని డాక్యుమెంట్ రూపంలో నెట్టింట షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ సర్జన్(surgeon) నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాడు. భవిష్యత్తులో ఇంక పిల్లలు పుట్టకూడదనే తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఇలా చేశానని తెలిపాడు. అదే తాను తన భార్యకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని చెబుతుండటం విశేషం. ఆయన ఆ వీడియోలో తనకు తానుగా ఎలా వేసెక్టమీ ఆపరేషన్ చేసుకుంటున్నాడో కనిపిస్తుంది. నిజానికి ఈ సర్జరీ జస్ట్ 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. కానీ ఆయన స్వయంగా చేసుకోవడంతో ఒక గంట వ్యవధి తీసుకుని విజయవంతంగా తన సర్జరీని పూర్తి చేసుకున్నాడు. అంతేగాదు ఆ సర్జరీ చేసిన ప్రదేశంలో ఎంత పెయిన్ ఉంటుందో కూడా వివరించాడు. డాక్టర్ చెన్ వేసెక్టమీ ఆపరేషన్ పదకొండు దశలు గురించి ఆ వీడియోలో వివరంగా వెల్లడించారు. అంతేగాదు ఆ వీడియోలో మరసటి రోజు తాను పూర్తిగా కోలుకున్నట్లు కూడా తెలిపాడు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ డాక్టర్ డేరింగ్‌కి విస్తుపోయారు. ఎంత డాక్టర్ అయినా తనకు తాను స్వయంగా సర్జరీ చేసుకోవడం అంటే మాటలు కాదు. కచ్చితంగా ఈయన మంచి నైపుణ్యం గల సర్జన్ అయ్యి ఉండాలి అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఆ డాక్టర్ చెన్ దంపతులకు ఎంతమంది పిల్లలు అనేది తెలియాల్సి ఉంది. కానీ పిలల్లు పుట్టకుండా మహిళలే కాదు భర్తలు కూడా ఇలాంటి విషయంలో కాస్త ముందుకువచ్చి వారి బాధను తగ్గించే యత్నం చేయాలనే అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది ఇతడి సాహసం. వాస్తవానికి చాలామటుకు మహిళలే పిల్లలు పుట్టకుండా(ట్యూబెక్టమీ) ఆపరేషన్ చేయిచుకుంటున్నారు. View this post on Instagram A post shared by 陳瑋農 整形外科 醫師。晶華診所院長。 (@docchen3) (చదవండి: అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు!) -
రూ.7 కోట్ల లాటరీ.. తీరా గెలిచాక తూచ్!
కోట్ల రూపాయలు లాటరీ (lottery) గెలిస్తే ఎంత ఆనందం కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎగిరి గంతులేస్తాం. ఆ ఊహే గాల్లో తేలేలా చేస్తుంది కదూ.. మరి తీరా కోట్ల రూపాయలు చేతికి అందుతున్నాయన్న తరుణంలో తూచ్.. టికెట్ తిరిగి ఇచ్చేయండి అంటే.. పాపం ఇలాంటి పరిస్థితే చైనాలో (China) ఓ ఉద్యోగికి ఎదురైంది.2019 మార్చిలో చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్బోలో ఒక కంపెనీ వార్షిక సంవత్సరాంతపు పార్టీని నిర్వహించింది. వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఉద్యోగులకు 500 లాటరీ టిక్కెట్లను పంపిణీ చేసింది. అందులో ఒక టిక్కెట్టుకు 6 మిలియన్ యువాన్లు (సుమారు రూ.7.14 కోట్లు) అత్యధిక బహుమతి లభించింది. అయితే ఆ టికెట్‌ను కంపెనీ వెనక్కితీసేసుకుంది.అంతా కంపెనీల మాయ!ఇది పాత సంఘటనే అయినా స్ప్రింగ్ ఫెస్టివల్ సమీపిస్తున్న సమయంలో చైనీస్ సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో చాలా కంపెనీలు ఇలాంటి ఈవెంట్లను నిర్వహిస్తుంటాయి. క్షీణిస్తున్న లాటరీ టిక్కెట్ల అమ్మకాలను పెంచడానికే కొన్ని కంపెనీలు ఇలా ఈవెంట్లు నిర్వహించి లాటరీలపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు.ఉద్యోగి లాటరీ గెలిచారన్న వార్తలు చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. అనేక మంది ఉద్యోగులు తమ ఉత్సాహాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగి గెలిచిన లాటరీ టికెట్‌ను వెనక్కితీసుకున్న కంపెనీ వైఖరి పండుగ వేడుకల సందర్భంగా కార్పొరేట్ విధానాలు, ఉద్యోగుల హక్కుల గురించి చర్చలకు దారితీసింది.ఏం జరిగిందంటే..ఉద్యోగుల్లో ఉత్సుకతను రేకెత్తించేందుకు సదరు కంపెనీ స్థానిక మార్కెట్లో 500 లాటరీ టికెట్లు కొనుగోలు చేసి ఉద్యోగులకు పంపిణీ చేసింది. అందులో ఒక టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. కానీ ఆ టికెట్ తిరిగి ఇచ్చేయాలని ఉద్యోగిని కోరింది. దీంతో ఈవెంట్లో ఉన్న వారంత షాక్‌కు గురయ్యారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. గెలుపొందిన లాటరీ టికెట్ తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ వివాదం అధికారుల వద్దకు వెళ్లింది.అవకతవకల ఆరోపణలుఈవెంట్కు జరిగిన రెండు రోజుల ముందు లాటరీ డ్రా జరిగిందని అంతర్గత వ్యక్తులు వెల్లడించడంతో మరింత వివాదం తలెత్తింది. వార్షిక పార్టీలో గెలిచిన టిక్కెట్లను పంపిణీ చేసే ముందు వాటిని తొలగించాలని కంపెనీ ఫైనాన్స్ బృందానికి సూచించిందని ఆరోపణలు వచ్చాయి. -
కృత్రిమ దీవిలో అతిపెద్ద విమానాశ్రయం!
చైనా ప్రభుత్వం సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. కృత్రిమ దీవిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని డాలియన్ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్రాన్ని పూడ్చి ఏకంగా ఓ సరికొత్త దీవిని నిర్మిస్తోంది. ఇక్కడే మొత్తం 20.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘డాలియన్ జి¯Œ జౌవాన్’ పేరుతో అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి, ఏటా 5 లక్షలకు పైగా విమానాలు, 8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేయనుంది. ఇందులో నాలుగు అతిపెద్ద రన్ వేలు, 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాసెంజర్ టెర్మినల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని అంచనా. ఈ నిర్మాణం పూర్తయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా కొనసాగుతున్న హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (12.48 చ.కి.మీ) రెండో స్థానానికి పడిపోతుంది. అయితే, ఈ రెండు విమానాశ్రయాలు కూడా కృత్రిమ దీవుల్లో ఏర్పాటైనవే కావడం విశేషం. ఈ విమానాశ్రయాన్ని 2035 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. -
టిక్ నో టాక్
స్వల్పనిడివి వీడియో మెసెంజింగ్ యాప్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరి స్మార్ట్ఫోన్లలో స్థానం సంపాదించిన టిక్‌టాక్ యాప్ ఇప్పుడు అమెరికాలో అదృశ్యం కానుంది. ఆదివారం (జనవరి 19వ తేదీ) నుంచి అమెరికాలో యాప్ సేవలు దాదాపు ఆగిపోయినట్లేనని టిక్‌టాక్ యాజమాన్యం శుక్రవారం అర్ధరాత్రిదాటాక ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ యూజర్ల డేటా దాని మాతృ సంస్థ అయిన ‘బైట్‌డ్యాన్స్’ద్వారా చైనా వామపక్ష ప్రభుత్వానికి చేరుతోందని అమెరికా ప్రధాన ఆరోపణ. చైనాతో బంధం తెంచుకుని, టిక్‌టాక్‌ను ఆదివారంకల్లా అమెరికా కేంద్రంగా పనిచేసే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా దేశ సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంచేసినప్పటికీ బైట్‌డ్యాన్స్ ఈ దిశగా అడుగులువేయలేదు. దీంతో అమెరికాలో టిక్‌టాక్ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి. వినోదం పంచిన యాప్ తర్వాత దేశభద్రత అంశంతో ముడిపడి చివరకు అగ్రరాజ్యాన్నే వదిలేస్తున్న వైనం ఆద్యంతం ఆసక్తిదాయకం. అగ్రస్థానం నుంచి అదృశ్యం దాకా.. చైనా వ్యాపారి ఝాంగ్ యిమిన్ 2012లో బైట్‌డ్యాన్స్ అనే సంస్థను స్థాపించారు. తర్వాత రెండేళ్లకు అలెక్స్ ఝూ అనే వ్యాపారి Musical.ly అనే స్టార్టప్‌ను రూపొందించాడు. వీడియోలకు తగ్గట్లు పెదాలు కదిలిస్తూ వీడియో తీసి అప్లోడ్ చేసే యాప్‌గా దీనిని అందుబాటులోకి తెచ్చాడు. ఇది 2015 జూలైకల్లా ఆపిల్ యాప్‌స్టోర్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ Musical.ly ను బైట్‌డ్యాన్స్ ఒక బిలియన్ డాలర్లకు కొనుగోలుచేసి సొంత ‘డౌయిన్’యాప్‌లో విలీనంచేసి విదేశీ యూజర్ల కోసం కొత్తగా టిక్‌టాక్ యాప్‌ను తెచ్చింది. ర్యాపర్ లిల్ నాస్ ‘ఓల్డ్ టౌన్ రోడ్’పాటకు చేసిన డ్యాన్స్ వీడియో టిక్‌టాక్‌లో పాపులర్ అవడంతో అందరూ టిక్‌టాక్ బాట పట్టారు. పాపులర్ డ్యాన్స్ స్టెప్పులు, వంటల విశేషాలు, బ్యూటీ టిప్స్, పాటలకు తగ్గ పార్ఫార్మెన్స్ ఛాలెంజ్‌లను ప్రోత్సహిస్తూ సాగే వీడియోలతో టిక్‌టాక్ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా నంబర్‌వన్ షార్ట్‌వీడియో మెసేజింగ్ యాప్‌గా అవతరించింది. చైనా వ్యతిరేకత అస్సలు కనపడదు ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి అంశం ఒక పాటగానో, డ్యాన్స్గానో టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైనా చైనా వ్యతిరేక వీడియోలు మాత్రం అస్సలు కనబడవు. 1989 తియాన్మెన్స్కే్వర్ ఉద్యమం, నాటి ఊచకోత, టిబెటన్ల స్వాతంత్య్రపోరాటం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమంపైనా అన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు కనిపించినా టిక్‌టాక్‌లో మాత్రం అలాంటివేమీ దర్శనమివ్వలేదు. కానీ ట్రంప్‌కు మద్దతు పలుకుతూ పెట్టిన #trump2020 హ్యాష్‌ట్యాగ్‌తో వచ్చిన పోస్టులు మాత్రం కోట్లాదిగా షేర్ అయ్యాయి. 2019లో అమెరికాలో తొలి ఆందోళన సెన్సార్టవర్ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. టిక్‌టాక్‌కు ప్రస్తుతం అమెరికాలో 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే అమెరికా సైన్యానికి చెందిన సమాచారాన్ని టిక్‌టాక్ తన మాతృసంస్థకు చేరవేస్తోందని 2019లో తొలిసారిగా ఆందోళన వ్యక్తమైంది. దీంత అన్ని స్మార్ట్ఫోన్లలో టిక్‌టాక్ యాప్ తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచి్చంది. అయినాసరే విపరీతంగా యాప్‌కు బానిసలుగా మార్చేసి అమెరికా చిన్నారుల పరిరక్షణా చట్టాలను టిక్‌టాక్ ఉల్లంఘిస్తోందని 2020 లో ప్రైవసీ సంస్థలు ఆందోళనకు దిగాయి. దీంతో తాము అమెరికన్లకు దగ్గరి వాళ్లమని మభ్యపెట్టేందుకు డిస్నీ ఉన్నతాధికారి కెవిన్ మేయర్‌కు టిక్‌టాక్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకుంది. భారత్‌లో బ్యాన్ సరిహద్దుల్లో చైనా సైనికులతో ఘర్షణ తర్వాత జాతీయభద్రత ప్రమాదంలో పడిందని పేర్కొంటూ భారత్ టిక్‌టాక్‌ను 2020 జూలైలో నిషేధించింది. కోవిడ్ సంక్షోభంలో వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించని చైనాకు బుద్ధిచెప్పేందుకైనా టిక్‌టాక్‌ను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ సైతం నిషేధాన్ని సమరి్థంచారు. 90 రోజుల్లోపు అమెరికా నుంచి వైదొలిగితే మంచిదని 2020 ఆగస్ట్‌లో ట్రంప్ ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీచేశారు. తర్వాత టిక్‌టాక్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్‌మార్ట్ ప్రయతి్నంచినా అది కార్యరూపం దాల్చలేదు. బైడెన్ వచ్చాక.. 2021 ఫిబ్రవరిలో కొత్త అధ్యక్షుడు బైడెన్ టిక్‌టాక్‌పై నిషేధానికి ట్రంప్ ఇచి్చన ఉత్తర్వులు అమలుకాకుండా మూలనపడేశారు. అయితే బక్కచిక్కిపోయేలా అతి ఆహార నియమాల వంటి తప్పుడు సూచనలు ఇచ్చే వీడియోల వరద టిక్‌టాక్‌లో ఎక్కువైందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక నివేదిక ఇవ్వడంతో టిక్‌టాక్‌పై బైడెన్ మళ్లీ దృష్టిసారించారు. అమెరికాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుంటూనే ఇన్‌స్టా గ్రామ్ను వెనక్కినెట్టి ప్రపంచంలో అత్యధిక డౌన్లోడ్లు జరిగిన యాప్‌గా టిక్‌టాక్ చరిత్ర సృష్టించింది. వంద కోట్ల మంది నెలకు తమ యాప్ వాడుతున్నారని ప్రకటించింది. మరోవైపు అమెరికా యూజర్ల డేటా భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో నష్టపరిహార చర్యలకు టిక్‌టాక్ దిగింది. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ పర్యవేక్షణలో ఉండే సర్వర్లకు డేటాను బదిలీచేస్తున్నట్లు ప్రకటించింది. రంగంలోకి ఎఫ్‌బీఐ జాతీయ భద్రత కీలకాంశం కావడంతో అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. అమెరికన్లను ప్రభావితం చేసేలా యాప్ అల్గారిథమ్‌ను చైనా మాతృసంస్థ మార్చేస్తోందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే 2022 డిసెంబర్లో ఆరోపించారు. 30 రోజుల్లోపు అన్ని ప్రభుత్వం జారీచేసిన స్మార్ట్ఫోన్ల నుంచి యాప్‌ను తీసేయాలని శ్వేతసౌధం 2023 ఫిబ్రవరిలో ఆదేశాలిచి్చంది. యాప్ నిబద్ధతపై టిక్‌టాక్ సీఈవో షూఝీ ఛెవ్ను మార్చిలో అమెరికా పార్లమెంటరీ కమిటీ గంటలతరబడి ప్రశ్నించింది. నిషేధానికి తొలి అడుగు అమెరికన్ సంస్థకు టిక్‌టాక్‌ను అమ్మాలని లేదంటే నిషేధిస్తామని 2024 మార్చిలో అమెరికా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లుపై 2024 ఏప్రిల్‌లో అధ్యక్షుడు బైడెన్ సంతకంచేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై బైట్‌డ్యాన్స్ కోర్టును ఆశ్రయించింది. మిగతా యాప్‌లను వదిలేసి మా సంస్థపైనే ప్రభుత్వం కక్షగట్టిందని వాదించింది. అయితే నిషేధాన్ని సమరి్థస్తూ ఫెడరల్ అప్పీళ్ల కోర్టు 2024 డిసెంబర్ ఆరున తీర్పు చెప్పింది. మాట మార్చిన ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిషేధిస్తానని ప్రతిజ్ఞచేసిన ట్రంప్ ఆ తర్వాత పదవి నుంచి దిగిపో యాక మాటమార్చారు. 2024 జూన్‌లో మళ్లీ టిక్‌టాక్ ఖాతా తెరచి ఈ యాప్‌కు మద్దతు పలికారు. టిక్‌టాక్‌ను నిషేధిస్తే ఫేస్‌బుక్‌కు లాభం చేకూరుతుందని ట్రంప్ వింత వాదన చేశారు. టిక్‌టాక్‌పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు సుప్రీంకోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది. పొలోమంటూ రెడ్‌నోట్ డౌన్లోడ్ టిక్‌టాక్ కనుమరుగు దాదాపు ఖాయంకావడంతో ఇప్పటికే ఇలాంటి వీడియోలకు బానిసలైన అమెరికన్లు వెంటనే రెడ్‌నోట్ యాప్‌కు జై కొట్టారు. దీంతో అమెరికాలో అత్యంత ఎక్కువ డౌన్లోడ్లు ఉన్న యాప్‌గా రెడ్‌నోట్ రికార్డు సృష్టించింది. అయితే రెడ్‌నోట్ కూడా చైనా యాప్ కావడం విశేషం. లైఫ్‌స్టైల్ సోషల్‌మీడియా యాప్ అయిన రెడ్నోట్లోనూ చిన్నపాటి వీడియోలు చేయొచ్చు. ఫొటోలు, సందేశాలు పంపొచ్చు. లైవ్ స్ట్రీమింగ్, షాపింగ్ చేసుకోవచ్చు. గ్జియోహోంన్షు యాప్‌నే సులభంగా రెడ్నోట్గా పిలుచుకుంటారు. దీనిని ప్రస్తుతం 30 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. బద్ధశత్రువుల దేశాలకు చెందిన పౌరులు ఒకే ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించడం వింతే. ఇన్‌స్టా గ్రామ్, ‘ఎక్స్’యాప్‌లను చైనీయులు వాడలేరు. చైనా ఇంటర్నెట్లో వీటిని అక్కడి ఫైర్‌వాల్స్ అడ్డుకుంటాయి. మరోవైపు చైనా యూజర్లు టిక్‌టాక్‌ను వాడలేరు. వీళ్లనూ బుట్టలో వేసుకునేందుకు వాళ్ల కోసం చైనాలోనే డౌయిన్ అనే యాప్‌ను బైట్‌డ్యాన్స్ అందుబాటులో ఉంచింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్తుత్తి ఉద్యోగాలు.. ఇప్పుడిదే నయా ట్రెండ్!
‘‘ఉద్యోగాలిప్పిస్తామని యువతకు కుచ్చుటోపీ.. ఉద్యోగాల పేరిట టోకరా..!’’ ఈ తరహా కథనాలు చూసి చూసి బోర్ కొడుతోందా? అయితే జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి సొంతవాళ్లను, బంధువులను, చివరకు తనను తానే మోసం చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా?. కానీ, ఇప్పుడది నయా ట్రెండ్‌గా అక్కడ ఓ ఊపు ఊపేస్తోంది.సాధారణంగా.. ఎక్కడో సిటీలోనో, టౌన్లోనో ఉంటూ ఉద్యోగాల వేట పేరిట తల్లిదండ్రుల నుంచి డబ్బులు పిండుకునే జాతిరత్నాల గురించి వినే ఉంటారు. అయితే.. నిజంగానే ఉద్యోగాల వేటలో అలసిపోయిన నిరుద్యోగుల కోసం పుట్టుకొచ్చిందే ఈ Pretend To Work ట్రెండ్. అంటే.. పని చేస్తున్నట్లు నటించడమన్నమాట. ఈ జాబ్‌తో జేబులు గుళ్ల కావడం తప్పించి ఎలాంటి ప్రయోజనం ఉండదు!!.ఈ జాబ్ కావాలంటే చేయాల్సిందల్లా.. రోజుకు ఫలానా డబ్బును మీ ఆ సర్వీస్ వాళ్లకు అందించాలి. అప్పుడు వాళ్లు మీకు ఆఫీస్ స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి అందులో మీకు కుర్చీ, టేబుల్, కంప్యూటర్ లాంటివివేసి ఉద్యోగి అనే గుర్తింపు ఇస్తారు. అంతేకాదు.. ఆ పనివేళలో మధ్యలో భోజనం, కాఫీ టిఫిన్లు, స్నాక్స్, జ్యూస్‌ల వగైరా లాంటివి కూడా అందిస్తారు. మీరు చెల్లించే డబ్బును బట్టి మీ పొజిషన్, ఇతర సేవలు అందిస్తారు. ఒకవేళ ఎక్కువ చెల్లిస్తే ఏకంగా ఆ కంపెనీకి బాస్(Boss) పొజిషన్లోనే కూర్చోబెడతారు. అలాగని మీకు అక్కడ పని అప్పజెప్తారనుకుంటే పొరపాటే!. ఇవి కేవలం ఉత్తుత్తి ఉద్యోగాలు మాత్రమే!!. కేవలం మీలోని నిరుద్యోగి(Jobless)ని అనే భావనను దూరం చేయడానికి మాత్రమే వాళ్లు ఈ సేవల్ని అందిస్తోంది. అంటే.. మీరు మీ మీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎప్పటిలాగే మునిగిపోవచ్చన్నమాట. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుందో.. అప్పుడు అక్కడికి వెళ్లి వాళ్లు అడిగినంత చెల్లిస్తే సరిపోతుంది. ఆశ్చర్యం కలిగించినా ఇది ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్. చైనా(China)లో ఈ తరహా సేవల గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. పైగా ఈ సర్వీసును అందించేందుకు పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి కూడా!.‘‘మా ఆఫీస్‌కు విచ్చేయండి. మీరూ ఉద్యోగిగా మారిపోండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఇక్కడే గడపండి. మీకు భోజన, ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తాం. రోజూవారీగా.. అతితక్కువ ధరకే మీకు ఈ సేవల్ని అందిస్తాం’’ అనే ప్రకటనలు హెబెయి ప్రావిన్స్‌లో ఎటు చూసినా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు, యువత ఈ తరహా సేవల కోసం ఎగబడిపోతున్నారు. ఈ తరహా సేవలు కొనసాగుతున్న మాట వాస్తవమేనంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కూడా ఓ కథనంలో పేర్కొంది.చైనాలో ఈ తరహా సర్వీసుల ప్రారంభ ధర 30 యువాన్లు(4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.353)గా ఉంది. వాళ్లు అందించే సౌకర్యాలను బట్టి ఆ రేటు పెరుగుతూ పోతోందన్నమాట.ఈ క్రేజ్ గుర్తించిన కాఫీ షాపులు, లైబ్రరీలు కూడా ఈ తరహా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు సైతం వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించుకుంటూ పోతున్నాయి. దీంతో.. చిన్న కంపెనీలు కొత్త రిక్రూట్లకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో నిరుద్యోగుల శాతం పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఊడిపోవడం.. జాబ్‌లెస్‌గా ఉండిపోవడంతో తీవ్ర ఒత్తిడి, మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. కాస్త డబ్బు ఉన్న వాళ్లకు ఊరట కలిగించేందుకే ఈ సేవలు పుట్టుకొచ్చాయి. అయితే..ఈ Pretend To Workపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. దీనివల్ల మోసాలు పెరిగిపోవచ్చని పలువురు అంటున్నారు. అయితే ఖాళీగా రోడ్ల వెంట తిరగడం, ఉద్యోగాల కోసం తిరిగి అలసిపోవడం, ఉద్యోగం దొరక్క ఇంటికి ఆలస్యంగా వెళ్లడం.. ఇలాంటి వాటికంటే ఈ ఉత్తుత్తి ఉద్యోగాలు చేసుకోవడం నయం అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సేవల ఉద్దేశం ఏదైనా.. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది అక్కడ.ఇదీ చదవండి: అత్యంత అరుదు.. అందుకే రూ.5కోట్లు పలికింది!! -
టిక్‌టాక్‌పై నిషేధం సబబే
వాషింగ్టన్: చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీకోర్టు శుక్రవారం సమర్థించింది. ఈ నిషేధం ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. చైనాలోని టిక్‌టాక్ మాతృ సంస్థ టిక్‌టాక్‌ను ఇతరులకు విక్రయించకపోతే నిషేధాన్ని అమల్లోకి తీసుకురావొచ్చని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఇతరులకు విక్రయించిన పక్షంలో నిషేధం అవసరం లేదని వెల్లడించింది. టిక్‌టాక్‌తో చైనాకు సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగితే అమెరికా జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని, అందుకు తాము అనుమతించలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది. అమెరికాలో టిక్‌టాక్ యాప్‌ను 17 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. టిక్‌టాక్‌పై నిషేధం విధించి వారి భావప్రకటనా స్వేచ్ఛను హరించవద్దన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, భావప్రకటనా స్వేచ్ఛ కంటే దేశ భద్రతే ముఖ్యమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ జో బైడెన్ ప్రభుత్వం చట్టం తీసుకొచి్చంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టబోతున్నారు. యాప్‌పై ఆంక్షలను 90 రోజులపాటు నిలిపివేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఈ అధికారాన్ని ట్రంప్ వాడుకొనే అవకాశం కనిపిస్తోంది. -
మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!
అత్యంత కాలం బతికిన శతాధిక వృద్ధులను చూస్తే..వారి ఆరోగ్య రహస్యం ఏంటని కుతూహలంగా ఉంటుంది. వారి దీర్ఘాయువుకి కారణం.. క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని క్లియర్‌గా స్పష్టమవుతోంది. ఇంతవరకు జపాన్, బ్రెజిల్‌లోని శతాధిక వృద్ధ మహిళలు, వారి హెల్త్ సీక్రెట్ల గురించి విన్నాం. ఇప్పుడు వారందర్నీ వెనక్కినెట్టి అత్యంత శతాధిక వృద్ధురాలికి నిలిచి ఆశ్చర్యపరుస్తోంది ఈ చైనా బామ్మ. అయితే ఈ బామ్మ ఇప్పటికీ తన పనులను తానే చేసుకుంటోందట. మిగతా శతాధిక వృద్ధ బామ్మల మాదిరిగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో జాయిన్ అవ్వకపోవడం విశేషం. అయితే ఈ బామ్మ ఆరోగ్య రహస్యం ఏంటో తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఆ బామ్మ ఎవరంటే..చైనా(China)కు చెందిన క్వి చైషి(Qiu Chaishi) అనే బామ్మ. ఆమె వలసవాద సెమీ ఫ్యూడల్ పాలనకు గుర్తుగా నాటి క్వింగ్ రాజవంశ పాలకుల హయాంలో 1901లో జన్మించింది. జనవరి 1న 124వ పుట్టిన రోజున జరుపుకుంది. అప్పుడే రుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న నాన్‌చాంగ్ నగరం అత్యంత శతాధిక వృద్ధులలో ఆమె కూడా ఒకరిగా క్విచైషి బామ్మను గుర్తించింది.ఆమెకు ఏకంగా 60 ఏళ్ల వయసున్న మనవరాలు ఉంది. తన తరంలోని అత్యంత చిన్న కుటుంబ సభ్యురాలు వయసు ఎనిమిది నెలల చిన్నారి అట. ఇక ఆమె సుదీర్ఠకాల ఆరోగ్యం రహస్యం ఏంటంటే..హెల్త్ సీక్రెట్..తన సుదీర్ఘకాల(Longevity) జీవన రహస్యం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని నమ్మకంగా చెబుతోంది. రోజూ మూడుపూటల భోజనం(Lard Rice) చేస్తుందట. అయితే భోజనం తర్వాత నడక(Walks) తప్పనిసరి అని చెబుతోంది క్విచైషి. అలాగే రాత్రి 8 కల్లా నిద్రపోతుందట. ఇప్పటకీ తన పనులన్నీ చకచక చేసుకుంటుందట. తల దువ్వుకోవడం దగ్గర నుంచి స్టవ్ వెలిగించడం, పెంపుడు జంతువులను పెంచడం, మెట్లు ఎక్కడం తదితర అన్ని పనులను సునాయాసంగా చేసేస్తుందట. తనకు ఇష్టమైన వంటకాల గురించి కూడా షేర్ చేసుకుంది. ఆమెకు గుమ్మడికాయ, శీతాకాలపు పుచ్చకాయ, మొక్కజొన్న పిండితో చేసే గంజి, పందికొవ్వు అంటే మహా ఇష్టమట. కానీ పంది కొవ్వుని మాత్రం వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకుంటున్నట్లు తెలిపింది. నిజంగా ఈ బామ్మ ఆరోగ్యపు అలవాట్లు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈ బామ్మ మాములు గ్రేట్ కాదు, అంతకు మించి అని ప్రశంసించకుండా ఉండలేం కదా..!.(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!) -
'కృతజ్ఞత' అంటే ఇదే కదా..!
మనం ఎవరి వల్ల అయినా సాయం పొందితే దాన్ని తిరిగి చెల్లించగలిగే స్థాయి చేరుకున్నాక గుర్తుపెట్టుకుని తిరిగి ఇవ్వాలంటారు పెద్దలు. అయితే అందరూ ఇలా గుర్తించుకుని కృజ్ఞతను చాటుకోరు. కొందరూ మాత్రం అంతకు మించి అన్నట్లుగా దాతృత్వ కార్యక్రమాలతో ఆశ్చర్యపరుస్తారు. పొందిన సాయం అణువంతా అయినా ఆకాశంతా స్థాయిలో కృతజ్ఞత చూపి గుండెల్లో నిలిచిపోతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఈ చైనాకు చెందిన మాజీ సీఈవో.చైనా(China) ఈ-కామర్స్ దిగ్గజం జేడీ డాట్ కామ్(e-commerce giant JD.com) వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో(former CEO ) బిలియనీర్(billionaire ) రిచార్డ్ లియు క్వియాంగ్డాంగ్(Richard Liu Qiangdong) చైనా నూతన ఏడాది ప్రారంభానికి ముందు తన స్వస్థలంలోని నివాసితులకు లక్షల్లో ఖరీదు చేసే బహుమతులను అందించి వార్తల్లో నిలిచారు. 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి గ్రామస్తుడికి సుమారు లక్ష రూపాయలకు పైనే విలువ చేసే నగదుని బహుమతిగా అందజేశారు. దీంతోపాటు ప్రతి ఇంటికి ఆహారం, బట్టలు, గృహోపకరణాలను అందజేశారు. అతను ఇలా 2016 నుంచి దాతృత్వ కార్యక్రమాలను చేస్తూ కృతజ్ఞతను చాటుకుంటున్నాడు. ఆ గ్రామమే ఎందుకంటే..గ్వింగ్మింగ్ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబంలో జన్మించాడు రిచార్డ్. 1990ల సమయంలో చైనా రెన్మిన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం బీజింగ్ వెళ్లేందుకు తగిన డబ్బు లేక ఇబ్బంది పడ్డాడు. అప్పుడు గ్రామస్తులంతా సమావేశమై అతని ట్యూషన్ ఫీజులకు నిధులు సమకూర్చారు. దీంతో అతడు ఉన్నత చదువులను చదువుకోగలిగాడు. ఆ గ్రామస్తులంతా కలిసి క్వియాంగ్డాంగ్కి ఆనాడు ఇచ్చిన మొత్తం సుమారుగా రూ. 5 వేలు. కానీ ఆ చిన్న మొత్తం ఆ రోజు ఇచ్చేందుకు వారంతా ముందుకురాకపోయి ఉంటే ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదంటాండు మాజీ సీఈవో రిచార్డ్. అది గుర్తించుకునే ఆ గ్రామానికి ఇలా ప్రతి ఏటా విలువైన నగదు, గృహపకరణాల రూపంలో సాయం అందిస్తుంటారు. ఈ దాతృత్వ సేవను కొనసాగించేందుకు తన బృందాన్ని ఆగ్రామంలోకి పంపించి గ్రామస్తుల గృహ రిజిస్ట్రీ, గుర్తింపు పత్రాలను సేకరించి వారు ఆ గ్రామానికి చెందిన వారని నిర్థారించుకుని రిచార్డ్ సాయం అందేలా మార్గం సుగమం చేస్తారు. అలాగే ఆ గ్రామస్తులు కూడా అతడి దాతృత్వాన్ని మర్చిపోలేమని, మా పట్ల అతడు చూపించే దయ అపారమైందంటూ రిచార్డ్పై ప్రశంసలజల్లు కురిపించారు. అతడు ఈ సేవలను భవిష్యత్తులో కొనసాగించకపోయినా కూడా..అతడు ఇప్పటి వరకు చేసిన సాయాన్ని, కృజ్ఞతను మర్చిపోమని భావోద్వేగంగా చెబుతున్నారు గ్రామస్తులు. (చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
నిశ్శబ్దం వీడకుంటే ముప్పు తప్పదు!
టిబెట్‌లోని యార్లుంగ్ త్సాంగ్పో నది దిగువ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అతి పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దిగువన ఉన్న నదీ తీర దేశమైన భారత్‌కి తెలియజేయకుండా చైనా ప్రభుత్వం ఈ తీర్మానం చేసింది! మనకు ఉత్తరాన ఉన్న పొరుగు దేశంతో సంబంధాలను నెలకొల్పుకోవడంలో ఉన్న సంక్లిష్టతను ఈ పరిణామం మరోసారి గుర్తు చేసినట్లయింది. పర్యావరణపరంగా దుర్బలమైన, భూకంపాలకు గురయ్యే భౌగోళిక ప్రాంతంలో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుతో విపత్తుల ప్రమాదం అనుక్షణం పొంచి ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. భారత్ తన నిశ్శబ్ద దౌత్యాన్ని వీడి, చైనాతో అధికారిక మార్గాలలో తన ఆందోళనలను బలంగా నమోదు చేయాలి.చాలా సంవత్సరాలుగా సన్నాహక దశలో ఉన్న చైనా ప్రతిపాదిత యార్లుంగ్ త్సాంగ్పో ప్రాజెక్టును భారతదేశం నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే ఇది భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఎగువ నదీ తీర దేశంగా ఉంటున్న చైనాకు ఇతర దేశాలతో సహకరించడానికి, నదికి దిగువన ఉన్న దేశాల ప్రయోజనాలను కాపాడటానికి ఇష్టపడని దురదృష్టకరమైన చరిత్ర ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనాతో సంబంధాలు క్లిష్టంగా ఉన్న భారతదేశానికి ఈ ప్రాజెక్టు ద్వారా మరో ప్రధానమైన చీకాకు తలెత్తుతోంది.జిన్హువా వార్తా సంస్థ వివరాలను అందించకుండానే ఈ వెంచ ర్ను ‘గ్రీన్ ప్రాజెక్ట్’గా ప్రశంసించింది. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ డ్యామ్ నిర్మాణంలో మొత్తం పెట్టుబడి 1 ట్రిలియన్ యువాన్లు అంటే 137 బిలియన్ డాలర్లను దాటవచ్చు. ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు దాదాపు 300 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అంచనా. ప్రస్తుతం చైనాలో ఉన్న, ప్రపంచంలోనే అతిపెద్ద త్రీ గోర్జెస్ ఆన కట్టలోని 88.2 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్ తయారీ డిజైన్ సామర్థ్యంతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కానుంది. దీంట్లో భాగంగా నాలుగు నుండి ఆరు వరకు 20 కిలోమీటర్ల సొరంగాలను తవ్వుతారు. నది ప్రవాహంలో సగాన్ని వీటి ద్వారా మళ్లిస్తారు. అయినప్పటికీ, ఇది దిగువ దేశాలైన భారత్, బంగ్లాదేశ్‌లపై ప్రతికూల ప్రభావాన్ని చూపదని ఉవాచ!ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ యార్లుంగ్ త్సాంగ్పో నదికి చెందిన పెద్ద మలుపు ప్రాంతంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. అక్కడ నది యూటర్న్ తీసుకొని 20 కి.మీ కంటే కొంచెం దిగువన భారతదేశంలో ప్రవేశిస్తుంది. ఈ ప్రాజెక్ట్ తీవ్ర పర్యవసానాలు మనకు అనేక విధాలుగా గ్రహింపునకు వస్తున్నాయి. మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ నది సియాంగ్ పేరుతో చలామణి అవుతుంది. నీటి ప్రవాహానికి ఇది తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. ఇది బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థకు చెందిన ప్రధాన వాహిక. అస్సాం ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతం టిబెట్‌లో 2,93,000 చదరపు కిలోమీటర్లు. భారతదేశం, భూటాన్లలో 2,40,000 చదరపు కిలోమీటర్లు. బంగ్లాదేశ్‌లో 47,000 చదరపు కిలోమీటర్ల మేరకు బ్రహ్మపుత్ర విస్తరించి ఉంది. ఈ నది నీటిలో ఎక్కువ భాగం మన భూభాగంలోనే ప్రవహిస్తుంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్... నదీ ప్రవా హాలను, తత్ఫలితంగా దిగువ నివాసితుల జీవనోపాధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.ప్రధాన ప్రాజెక్టుకు అనుసంధానంగా మెకాంగ్ ఎగువ ప్రాంతా లలో చైనా చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం,కృత్రిమ జలపాతాలను సృష్టిస్తుండటం కూడా క్రమవిరుద్ధమైన హెచ్చుతగ్గులకు దారితీయనుంది. దీంతో కొన్ని ప్రాంతాలు ఎండిపోనున్నాయి. చేపల లభ్యత తగ్గుతుంది. దిగువ మెకాంగ్ బేసిన్ లో సారవంతమైన ఒండ్రు నిక్షేపాలకు చోటు లేకుండా పోతుంది. ఇది మయన్మార్, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాంలలోని నదీ తీర ప్రాంత ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మొత్తంగా – ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ భారతదేశం, బంగ్లాదేశ్‌లకు అనూహ్య ప్రతికూల పరిణామాలను కలిగించనుంది.2004లో టిబెట్‌లోని సట్లెజ్ ఉపనది అయిన పరేచు నదిపై ఒక కృత్రిమ సరస్సు ఏర్పడినప్పుడు క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఒక బృందం చేసిన అత్యవసర కసరత్తు ఈ వ్యాసకర్తకు గుర్తుంది. ఆ సమయంలో చైనాతో మనకు సాపేక్షంగా మంచి సంబంధాలు ఉన్నందున, మన భౌగోళిక వనరులు, ఇతర మార్గాల ద్వారా పోగుపడిన సమాచారం ద్వారా మనకు ముందస్తు నోటీసు, డేటా లభించాయి. సరస్సు ఘనీభవించే ముందు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. పైగా నివారణ చర్యల కారణంగా తదుపరి సంవత్సరం భారత దేశంలో దిగువన పరిమిత నష్టం మాత్రమే జరిగింది. కానీ, తాజాగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్ నుండి పుట్టుకొచ్చే ప్రమాదాలు తీవ్రాతి తీవ్రంగా ఉంటాయి. ఎంతో సహనంతో కూడిన దౌత్యంతోనే మనం బీజింగ్‌తో పరి మిత సహకారాలను ఏర్పాటు చేసుకోగలిగాం. వాటిలో బ్రహ్మపుత్ర నదికి చైనా రుతుపవనాల సీజన్ డేటాను అందించడంపై మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం, సట్లెజ్ నదికి రుతుపవ నాల సీజన్ డేటా పంచుకోవడం, ‘ట్రాన్ ్స–బోర్డర్ నదులపై సహకా రాన్ని బలోపేతం చేయడం’ ఉన్నాయి. మొదటి రెండు ఎంఓయూ లను ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించడం జరుగుతుంది. వీటికి ఇప్పుడు గడువు ముగిసిపోయింది. అంతర్జాతీయ జలమార్గాల నౌకాయానేతర ఉపయోగాల చట్టం– 1997 నాటి ఐక్యరాజ్యసమితి సమావేశం తీర్మానాలపై చైనా కానీ, భారత్ కానీ సంతకం చేయలేదు. అయితే, ఈ సమావేశం చేపట్టిన రెండు కీలక సూత్రాలు... భాగస్వామ్య జలాల ‘సమాన మైన, సహేతుకమైన వినియోగం’, దిగువ రాష్ట్రాలకు ‘హాని కలిగించకూడ దనే బాధ్యత’ అనేవాటికి పూర్తి ఔచిత్యం ఉంది. భారత్ బాధ్యతా యుతమైన ఎగువ నదీ తీర దేశంగా ఉంది. పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలు సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఉదారమైన ప్రయోజనాలను కూడా భారత్ అందిస్తోంది. దురదృష్టవశాత్తూ, చైనా గురించి అలా చెప్పలేం.జనవరి 3న భారత విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ : ‘‘నదీ జలాలపై స్థిరమైన వినియోగదారు హక్కులు భారత్‌కు ఉన్నాయి. దిగువ నదీ తీర దేశంగా, నిపుణుల స్థాయి, దౌత్య మార్గాల ద్వారా, చైనా భూభాగంలోని నదులపై నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టులపై మా అభిప్రాయాలను, ఆందోళనలను వ్యక్తం చేశాం. తాజా నివేదిక తర్వాత దిగువ ప్రాంతాల దేశాలతో సంప్రదింపుల అవసరంతో పాటు వీటిని కూడా మళ్లీ పునరుద్ఘాటించాం’’ అన్నారు. భారతదేశం ఇప్పటివరకు నిశ్శబ్ద దౌత్యాన్ని ఎంచుకుంది. అయితే, టిబెట్‌లో ప్రస్తుతం ఉన్న నదీ ప్రవాహ ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా, భారీ నీటి మళ్లింపు, నిల్వను కలిగి ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్ట్ భారీ పరిమాణం, దానిలోని చిక్కుల దృష్ట్యా, మనం ఇప్పుడు కొత్త ఆందోళనలో ఉన్నాం. ప్రాజెక్టుకు చెందిన సాంకేతిక పరామి తులు, పర్యావరణ ప్రభావ అధ్యయనాలపై మనం వివరణలు కోరాలి. దిగువ ప్రాంతాలకు, ‘సమానమైన, సహేతుకమైన విని యోగం’, ‘గణనీయమైన హాని కలిగించకూడదనే బాధ్యత’ వంటి సూత్రాలను గౌరవించాలని చైనాను కోరాలి. వాస్తవానికి, ప్రాజెక్ట్‌పై పూర్తి సంప్రదింపులు, పరస్పర అవగాహన వచ్చే వరకు తదుపరి పనులను నిలిపివేయాలని మనం అధికారికంగా అడగాలి.నిశ్శబ్ద దౌత్యానికి కూడా తనదైన పరిమితులు ఉంటాయి. చైనాతో అధికారిక మార్గాలలో, ప్రజాక్షేత్రంలో కూడా మన ఆందో ళనలను బలంగా చెప్పాలి. పర్యావరణ నిబంధనలు, స్థానిక జనాభా ప్రయోజనాలపై రాజీ పడకుండా, జలవిద్యుత్, ఇతర ప్రాజెక్టులను మరింత అత్యవసరంగా అమలు చేయాలి. తద్వారా బ్రహ్మపుత్ర జలాలపై భారతదేశ ప్రస్తుత వినియోగదారు హక్కులను పెంచు కోవాలి. నిజానికి, భారీ నీటి నిల్వ ప్రాజెక్టులపై అత్యంత జాగ రూకతతో ముందుకు సాగడంపై గతంలో పంచుకున్న ఆలోచనలకు ఈ మెగా ప్రాజెక్ట్ విరుద్ధంగా ఉంది. అశోక్ కె కంథా వ్యాసకర్త చైనాలో భారత మాజీ రాయబారి -
ఎలాన్ మస్క్ చేతికి టిక్‌టాక్..?
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్‌టాక్(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్‌మస్క్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి. -
సముద్రంలో నౌక నుంచి చైనా ఉపగ్రహ ప్రయోగం
బీజింగ్: చైనా తన అంతరిక్ష సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. సముద్రంలోని వేదికపై నుంచి చేపట్టిన ప్రయోగంలో ఏకంగా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షాండోంగ్ ప్రావిన్స్‌లోని హయియాంగ్ సముద్రంలో చేపట్టిన ఈ ప్రయోగంలో జియెలాంగ్–3 రాకెట్‌ను ప్రయోగించింది. ఈ ఘన ఇంధన రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం ఇది రెండోసారి. సముద్రంలోని వేదికల పైనుంచి వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు చైనా ప్రత్యేకంగా ఈ రాకెట్‌ను అభివృద్ధి చేసుకుంది. ఓ షిప్‌నే ఇలా రూపుమార్చి మొబైల్ లాంచ్ పాడ్గా తయారు చేసింది. అంతర్జాతీయ జలాల్లో అనువైన స్థానాల నుంచి ప్రయోగాలు చేపట్టేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. డ్రోన్ యుద్ధ తంత్రం కోసం కొత్త యుద్ధ నౌక యుద్ధ నౌకను డ్రోన్లతో మిళితం చేసి అభివృద్ధి పరిచిన కొత్త రకం యుద్ధ నౌకను చైనా నేవీ సోమవారం ప్రారంభించింది. డ్రోన్ క్యారియర్లా పనిచేస్తూ సైనికులతో అవసరం లేకుండా జరిగే నేలపైనా, నీటిలోనూ పోరాట పటిమను పెంచుతుందని ఓ అధికారి తెలిపారు. -
బుద్ధుడిలా ట్రంప్ విగ్రహాలు
డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడూ కాసింత చిరాకు ప్రతిబింబించే ముఖం. అలాంటి ముఖానికి హాంగ్ జిన్ షి అనే చైనా గ్రామీణ కళాకారుడు బుద్ధుడి ప్రశాంతతను ఆపాదించాడు. శాంతచిత్తంతో ఉన్న ట్రంప్ విగ్రహాలను తయారు చేశాడు. బుద్ధుని మాదిరిగా కళ్లు మూసుకుని దైవ చింతనలో కూర్చుని ఉన్న విగ్రహాలను పింగాణీతో రూపొందించాడు. సైజును బట్టి వీటిని 140 నుంచి 2,700 డాలర్ల దాకా విక్రయిస్తున్నాడు. 2021లో ఇ–కామర్స్ ప్లాట్‌ఫాం టావోబావోలో వైరలైన ఈ ట్రంప్ విగ్రహాలు ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మరోసారి ఆకర్షిస్తున్నాయి. సరదాగా మొదలెట్టి... 47 ఏళ్ల హాంగ్ ఇప్పటిదాకా కొన్ని వందల సిరామిక్ వస్తువులను తయారు చేశాడు. ‘‘రాజకీయ నాయకులు సాధారణంగా బోరింగ్‌గా ఉంటారు. కానీ ట్రంప్ అందుకు భిన్నమైన నేత. అందుకే తొలుత సరదాగా ఆయన విగ్రహాలను రూపొందించా. ట్రంప్ వ్యక్తిత్వం, విగ్రహం ఆకారం పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. దాంతో వాటిని కొనేందుకు బాగా ఇష్టపడుతున్నారు’’అని చెప్పుకొచ్చాడు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’నినాదంతో ట్రంప్ గెలిస్తే, హాంగ్ మాత్రం ప్రతి విగ్రహం ప్యాక్‌పైనా ‘మీ కంపెనీని మళ్లీ గొప్పగా చేయండి’అని రాస్తున్నాడు. దీన్ని అనుసరిస్తూ అమెరికాలో పలు ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాంలలో కొన్ని వెర్షన్లు వచ్చాయి. ట్రంప్ పాలనలో ప్రధాన పాత్ర పోషించనున్న కుబేరుడు ఎలాన్ మస్క్ విగ్రహాన్ని కూడా హాంగ్ డిజైన్ చేస్తున్నాడు. అందులో మస్‌్కను ఐరన్ మ్యాన్‌గా చూపిస్తున్నాడు. ట్రంప్‌కు చైనాలో ఇప్పటికీ చాలామంది అభిమానులున్నారని చెప్పాడు చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా దాగుడుమూతలు!
సాధారణంగా దౌత్య సంబంధాల్లో అనూహ్యతకు తావుండదు. అవతలి దేశం మనతో చెలిమి కోరుకుంటున్నదో లేదో... అది మనవైపో, వేరేవాళ్లవైపో ఊహించటం పెద్ద కష్టం కాదు. కానీ చైనా మటుకు ఇందుకు విరుద్ధం. ‘నేనేంటో చెప్పుకోండి చూద్దాం’ అన్నట్టు వ్యవహరిస్తుంటుంది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్న చందాన ప్రవర్తిస్తుంటుంది. రష్యాలో మూడు నెలల క్రితం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు కలుసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందు వాస్తవాధీన రేఖ ప్రాంతాలైన డెస్పాంగ్, దెమ్ చోక్‌లలో ఇరు దేశాల సైన్యాల గస్తీపై అవగాహన కుదిరింది. ఆ ప్రాంతంలో ఇకపై సైనిక విన్యాసాలకు చోటీయరాదనీ, ఉద్రిక్తతలను ఉపశమింపజేయాలనీ దాని సారాంశం. అంతేగాదు... రెండు దేశాలూ దీనిపై వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. చాన్నాళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం గత నెలలో జరిగింది కూడా. తీరా తాజాగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం అధునాతన సాంకేతికతలతో, అన్నిరకాల నేలల్లోనూ పనికొచ్చే వాహనాలతో, డ్రోన్లతో, మానవరహిత విమానాలతో విన్యాసాలు నిర్వహించినట్టు బయటపడింది. తన సైనిక సామర్థ్యాన్ని, కొండప్రాంతాల్లో యుద్ధ సంసిద్ధతలను అంచనా వేసుకోవటానికి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ రెజిమెంట్ ఈ విన్యాసాలు నిర్వహించిందంటున్నారు. అంతక్రితం మాటెలావున్నా 2020 ఏప్రిల్‌లో గాల్వాన్ లోయలో మన సైన్యంతో గిల్లికజ్జాలకు దిగటం ద్వారా చైనా తన కవ్వింపు చర్యల జోరు పెంచింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో మన జవాన్లు 21 మంది చనిపోగా, చైనా కూడా గణనీయమైన నష్టాలు చవిచూసింది. ఆ ఘర్షణల్లోనే బిహార్ రెజిమెంట్‌లో 17వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయిన తెలంగాణకు చెందిన బి.సంతోష్‌బాబు వీర మరణం పొందారు. అనంతర కాలంలో ఇరు దేశాల మధ్యా సైనిక అధికారుల స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఆ ఏడాది ఆగస్టులో రెండు దేశాల విదేశాంగమంత్రులూ భేటీ అయ్యారు. అందులో భారత్–చైనాల మధ్య పంచసూత్ర పథకం కుదిరింది. ఇకపై సామరస్యంగా మెలగాలన్నది ఆ పథకం సారాంశం. దానికి కొనసాగింపుగా రక్షణ మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతాల్లో సైనికుల ఉపసంహ రణ కూడా మొదలైంది. కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంది. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల విషయం మొదటి నుంచీ జటిలమే. అందువల్లే ప్రస్తుతానికి ఇరు దేశాల సైన్యాలూ ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని, ఉద్రిక్తతలు ముదిరే విధంగా ఎవరూ సైన్యాలను మోహరించ రాదని మూడు నెలలక్రితం నిర్ణయించారు. కానీ చైనాకు ఏమైందో కానీ దాన్ని బేఖాతరు చేస్తూ తాజాగా విన్యాసాలు మొదలుపెట్టింది. వారంరోజుల క్రితం షిన్జియాంగ్లోని వీగర్ స్వయంపాలిత ప్రాంతంలో ఉన్న హోటాన్ నగరానికి సమీపంలో చైనా కొత్తగా రెండు కౌంటీలను ఏర్పాటు చేసిందన్న కథనాలు వెలువడటం గమనించదగ్గది. ఈ రెండూ కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని ఆక్సాయ్చిన్కు సమీపంలో ఉన్నాయి. దానిలోని కొంత భూభాగం ఈ రెండు కౌంటీల్లోనూ ఉన్నదంటున్నారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఇది చాలదా? ఇక బ్రహ్మపుత్ర నదిపై ఒక మెగా డ్యామ్‌ను నిర్మించటానికి చైనా సన్నాహాలు చేస్తున్నదన్న వార్త కూడా ఇటీవలి పరిణామమే. ఎగువ ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టినప్పుడు దిగువ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందక ఇబ్బందులు తలెత్తు తాయి. భారీవర్షాల సమయంలో దిగువకు నీరు వదలటం వల్ల ఆ ప్రాంతాలు మునుగుతాయి.అందువల్లే దేశాలమధ్య ప్రవహించే నదులపై నిర్మాణాలకు పూనుకున్నప్పుడు పరస్పరం చర్చించుకుంటాయి. అందరికీ ప్రయోజనం కలిగేలా ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కానీ మెగా డ్యామ్ నిర్మాణాన్ని చైనా ఏకపక్షంగా ప్రకటించింది. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌కు మన నాయకులు వెళ్లినప్పుడల్లా చైనాకు ఆగ్రహావేశాలొస్తాయి. అక్కడి ఊళ్లకు సొంత పేర్లు పెట్టుకుని మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం చైనాకు చాన్నాళ్లుగా దురలవాటు. అందుకే చైనా వ్యవహారశైలి తెలిసినవారెవరూ దాని మాటలు విశ్వసించరు. చెప్పే మాటలకు భిన్నమైన ఆచరణ ప్రదర్శించటం చైనాకు అలవాటైన విద్య. ఇరుగు పొరుగు దేశాలన్నాక సమస్యలు సహజంగా వస్తాయి. వాటిని చర్చించుకోవటం, పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించటం వివేకవంతమైన చర్య. సమస్యలను దశాబ్దాల తరబడి అలాగే వదిలేస్తే అవి జటిలంగా మారి చివరకు శత్రుత్వానికి దారితీస్తాయి. మనతో ఉన్న వివాదాల విషయంలో చైనా మొదటినుంచీ దాగుడుమూతలు ఆడుతోంది. వివాదాలను పక్కనబెట్టి వ్యాపార వాణిజ్యాలను విస్తరించుకుంటే ఇరు దేశాలూ అభివృద్ధి చెందుతాయని ఊరించి 70వ దశకం చివరిలో మనకు మైత్రీ హస్తం అందించింది మొదలు చైనా తీరుతెన్నులు ఎన్నడూ సక్రమంగా లేవు. సరిహద్దు పరిణామాలపై మన దేశం అప్రమత్తంగానే ఉన్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సోమవారం చేసిన ప్రకటన సూచిస్తోంది. వివాదాస్పద ప్రాంతాల్లో ప్రస్తుతానికి ప్రతిష్టంభన ఉన్నదని ఆయనంటున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్ట నిర్మాణం విషయంలోనైనా, లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం కదలికల విషయంలోనైనా మన దేశం దృఢంగా వ్యవహరించాలి. దేశ రక్షణకు అది తప్పనిసరి. కరచాలనం చేస్తూనే కత్తులు దూయటం ఏమైనా కావొచ్చుగానీ దౌత్య కళ కాదని చైనాకు తెలియచెప్పటం అవసరం. -
చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం
బీజింగ్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (mpox) వైరస్‌లోని కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. గురువారం మంకీపాక్స్ కొత్త వేరియంట్ క్లాడ్ ఐబిని గుర్తించినట్లు చైనా (china) ఆరోగ్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర స్థితిని ప్రకటించింది. కాంగో నుంచి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఎంపాక్స్ క్లేడ్ ఐబి అనే కొత్త వేరియంట్ వ్యాప్తిని కనుగొన్నట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. సదరు కాంగో ప్రయాణికుడితో సన్నిహితంగా ఉండడం వల్ల నలుగురికి ఎంపాక్స్ కొత్త వేరియంట్ సోకిందని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ సోకిన రోగుల్లో చర్మంపై దద్దుర్లు,బొబ్బలు లక్షణాలు ఉన్నాయని గుర్తించింది. మంకీపాక్స్లోని కొత్త వేరియంట్ కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ సైతం తాజాగా, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత ఆగస్ట్‌లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) నుంచి ఎంపాక్స్ ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇక చైనా గుర్తించిన మంకీపాక్స్లోని కొత్త వేరియంట్ క్లాడ్ ఐబీ లైంగికంగా కలవడం వల్ల వేంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్‌కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్‌నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్‌నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది. -
కొత్త వైరస్ వచ్చేసింది.. మాస్క్ ఈజ్ బ్యాక్ (ఫొటోలు)
-
భయం వద్దు... జాగ్రత్త ముద్దు!
మాస్కులు... చేతుల పరిశుభ్రత... తదితర జాగ్రత్తలు మళ్ళీ బలంగా వినిపిస్తున్నాయి. హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) వల్ల చైనాలో వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మన దేశంలోనూ కేసులు కొన్ని బయటపడడంతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా పాత కరోనా జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. చైనా వార్తలతో సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 1.5 శాతం పైగా పడిపోవడం గగ్గోలు రేపుతోంది. ఉత్తరాన చైనాకు సమీపంలో ఉన్నందున ప్రజా సంబంధాలు, ఆర్థిక సంబంధాల రీత్యా స్వైన్‌ఫ్లూ, ఏవియన్ ఫ్లూ, కోవిడ్‌ల లానే ఇది కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలనీ, వేయికళ్ళతో పరిస్థితిని కనిపెట్టాలనీ, ఒకరి నుంచి మరొకరికి హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలనీ రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ తాజాగా సూచనలు జారీ చేయడం గమనార్హం. హెచ్ఎంపీవీ సహా అలాంటి అనేక ఇతర వైరస్ల వల్ల చైనాలో ఇప్పటికే భారీ సంఖ్యలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలాయి. ఆ దేశంలో జనం మాస్కులు ధరించి ఆస్పత్రుల్లో, బయట సంచ రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ సహా ప్రపంచమంతటా ఈ కేసులపై దృష్టి పెరిగింది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యవహారం చర్చనీయాంశమైంది. కోవిడ్ సృష్టించిన భయోత్పాతం రీత్యా, వైరస్లు, మహమ్మారుల పేరు చెప్పగానే జనం సహజంగానే బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ భయాందోళనలు అర్థం చేసుకోదగినవే. నిజానికి, హెచ్ఎంపీవీ కొత్త వైరస్ ఏమీ కాదు. శాస్త్రవేత్తలు 2001లోనే తొలిసారి దీని జాడ గుర్తించారు. వైరస్ స్వభావం, అది సోకినప్పటి లక్షణాల గురించి అవగాహన కూడా వచ్చింది. అయిదేళ్ళ లోపు చిన్నారులకూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ, వృద్ధులకూ ఈ వైరస్ సోకే ప్రమాదం అధికం. అందువల్లే, హెచ్ఎంపీవీతో తంటా చాలాకాలంగా ఉన్నదేననీ ఓ వాదన. అసలు మన దగ్గర తాజాగా ఈ కేసులు చాలా గమ్మత్తుగా బయటపడ్డాయి. అంతకంతకూ చలి ముదురుతున్న ఈ శీతకాలంలో శ్వాసకోశ అనారోగ్యాలను పసిగట్టి, వాటిపై నిఘా ఉంచేందుకు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఎప్పటిలానే చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఈ వైరస్ బాధిత కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, దేశంలో శ్వాసకోశ వ్యాధి పీడితుల్లో అనూహ్యమైన పెరుగుదల ఏదీ ఇప్పటికీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం ఒకింత ఊరటనిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉన్నామన్నది ఆ శాఖ ఆశ్వాసన. ఆ మాటకొస్తే, దేశంలో శ్వాసకోశ, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండడం ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం చేసేదే. ఇప్పుడు హెచ్ఎంపీవీ పరిస్థితిపై ఒక్క సారిగా గగ్గోలు రేగడంతో అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రతిస్తున్నట్టు అధికారిక కథనం. కరోనా మొదలు నేటి హెచ్ఎంపీవీ దాకా అన్నీ చైనా కేంద్రంగా వార్తల్లోకి రావడంతో అనేక అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి. చైనా సర్కార్ మాత్రం పౌరులతో పాటు తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల ఆరోగ్యాన్ని సైతం కాపాడతామంటూ భరోసా ఇస్తోంది. బీజింగ్ ఎన్ని మాటలు చెప్పినా, గత చరిత్ర కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. చిత్రమేమిటంటే, ప్రస్తుత ఇన్ఫెక్షన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎలాంటి ప్రకటన, మార్గదర్శకాలు విడుదల చేయనేలేదు. విదేశీ ప్రయాణాలు చేయనివారికి సైతం హెచ్ఎంపీవీ సోకినట్టు వార్తలు రావడంతో, ఇది సీజనల్ సమస్యే తప్ప మరేమీ కాకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది. చలికాలంలో ఇన్ఫెక్షన్లు సాధారణమే. అయితే, సరైన సమాచారం లేనప్పుడు పుకార్లు షికార్లు చేసి, లేనిపోని భయాలు సృష్టించి, ఆర్థిక, సామాజిక నష్టానికి దారి తీసే ముప్పుంది. జనవరి 13 నుంచి 45 రోజులు ప్రయాగలోని కుంభమేళాకు 40 కోట్ల పైగా భక్తులు హాజరవు తారని అంచనాలున్న వేళ అప్రమత్తత అవసరం. వైరస్ల విహారానికి ముకుతాడు వేయడం ముఖ్యం. కోవిడ్–19 కాలంలో లానే తరచూ చేతులను సబ్బునీళ్ళతో కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా కళ్ళు–ముక్కు–నోటిని తాకకపోవడం, వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగక పోవడం, దగ్గు – తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు – నోటికి అడ్డు పెట్టుకోవడం, మాస్కులు ధరించడం ఉత్తమం. అసలు కరోనా, హెచ్ఎంపీవీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఈ ఖర్చులేని సర్వసాధారణ జాగ్రత్తలను మన నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ఆరోగ్య పరిరక్షణకు మరీ ఉత్తమం. కోవిడ్ అనుభవం ప్రపంచానికి నేర్పిన పాఠం – అప్రమత్తత. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దనీ, ఎట్టి çపరిస్థితుల్లోనూ స్వీయరక్షణ చర్యలను వదిలిపెట్టవద్దనీ తేల్చిచెప్పింది. దేశంలో 78 శాతం మేర చొచ్చుకుపోయిన మొబైల్ ఫోన్లనూ, 65 కోట్ల మందికి పైగా వీక్షకులున్న దూరదర్శన్నూ ప్రజాహిత సమాచార ప్రచారానికి వినియోగించాలి. అంతేకాక, ఇలాంటి వివిధ రకాల వైరస్లు, వ్యాధులకు దేశంలో టెస్టింగ్ సౌకర్యాలను విస్తరించాలి. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటేనే అవాంఛనీయ పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం సిద్ధిస్తుంది. వైరస్ల తీవ్రత తక్కువ, ఎక్కువలతో సంబంధం లేకుండా పాలకులు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాధులు ప్రబలాక చికిత్సకు శ్రమించే కన్నా, వైరస్‌లను ముందే పసిగట్టి, వాటి విజృంభణను నివారించేందుకు సర్వసన్నద్ధం కావడం అన్ని విధాలా ఉపయుక్తం, శ్రేయస్కరం. -
భారత్‌లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు
న్యూఢిల్లీ: హెచ్ఎంపీవీ(HMPV)కేసులతో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నప్పటికీ ఈ కేసుల సంఖ్య భారత్‌లో క్రమేపీ పెరగడం మాత్రం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. నిన్న(సోమవారం) ఒక్కరోజే నాలుగు కేసులు నమోదు కాగా, నేటి(మంగళవారం) ఉదయానికి ఆ సంఖ్య డబుల్ అయ్యింది. తాజాగా మరో నాలుగు కేసులు చేరడంతో అమ్మో హెచ్ఎంపీవీ ఏం చేస్తుందనే భయం మాత్రం జనాల గుండెల్లో భయం పుట్టిస్తోంది.తాజాగా మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో మరో రెండు కేసులు నమోదు కావడంతో ఈ కేసుల సంఖ్య భారత్‌లో ఎనిమిదికి చేరింది. ఇప్పటివరకు కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదు కాగా, అది ఇప్పుడు మహారాష్ట్రకు పాకడంతో కాస్త కలవరం ఎక్కువైంది.హెచ్ఎంపీవీపై కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలుజనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలి.వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలిబహిరంగ స్థలాల్లో ఉమ్మివేయరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..హెచ్ఎంపీవీ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. గత యాభై, ఆరవై ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా(Corona Virus) తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని వారు చెబుతున్నారు..మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని అంటున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.కేసుల నమోదుతో ఆందోళనచైనా(China)లో హెచ్ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.మహమ్మారిగా మారే ప్రమాదం లేదుఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్‌తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రి -
టిబెట్‌లో భారీ భూకంపం.. 53 మంది మృతి!
ఢిల్లీ : నేపాల్ (nepal), దాని సరిహద్దు ప్రాంతమైన టిబెట్‌లో భారీ భూకంపం(earthquake) సంభవించింది. మంగళవారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.1గా (7.1 magnitude earthquake) నమోదైంది. ఈరోజు పలు దేశాల్లో భూకంపంసంభవించింది. మొత్తం ఆరు చోట్ల భూకంపం వచ్చింది. టిబెట్, నేపాల్‌తో పాటు భారత్‌లోని కోల్‌కతా, బిహార్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.కాగా, టిబెట్ రీజియన్‌లోని పర్వత ప్రాంతాల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో 53 మంది మృతి చెందగా, ఓవరాల్‌గా 62 మంది మృత్యువాత పడ్డారు. యూనైటెడ్ జియోలాజికల్ సర్వే (usgs)ప్రకారం.. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6:35 గంటలకు నేపాల్‌లో లుబోచికి 93 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి కంపించింది. నేపాల్‌తో పాటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో, బీహార్, కోల్‌కతాలోని కొన్ని జిల్లాల్లో భూమి కంపించినట్లు యూఎస్జీఎస్ అధికారులు తెలిపారు. భూకంప ప్రభావం తీవ్రతతో కొద్ది సేపు భూమి కంపించడంపై ప్రజలు ప్రాణ భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.#WATCH🚨 | Kathmandu | An earthquake with a magnitude of 7.1 on the Richter Scale hit 93 km North East of Lobuche, Nepal at 06:35:16 IST today: USGS Earthquakes#NepalEarthquake #Nepal pic.twitter.com/DMnTbHptTF— MIDDLE EAST NEWS (@middleeastnevs) January 7, 2025మరోవైపు భారత్,నేపాల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో భూకంప తీవ్రతను గుర్తించి,సహాయక చర్యల చేపట్టేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగింది. అధికారులు సైతం భూకంపంపై అప్రమత్త మయ్యారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. 2015లో తొమ్మిదివేల మంది దుర్మరణంప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో నేపాల్ ఒకటి. ఇక్కడ తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. చివరి సారిగా ఏప్రిల్ 25, 2015న నేపాల్‌లో 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం సుమారు 9వేలమందిని పొట్టన పెట్టుకుంది. 10లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి.దీన్ని బట్టి ఇవాళ సంభవించిన భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఖాట్మండ్ జనాభాలో మూడోవంతు నేపాల్‌లో తొలిసారిగా అభయ మల్ల రాజు పాలనలో 7 జూన్ 1255లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత నమోదైంది. నాడు సంభవించిన భూకంపం కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండ్ జనాభాలో మూడోవంతు మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నేపాల్ రాజు అభయ మల్ల రాజు సైతం ఉన్నారు. -
భారత్‌కు అందే జలాలపై ప్రతికూల ప్రభావం ఉండదు
బీజింగ్: భారత్‌తో సరిహద్దుల్లోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలా శయాన్ని నిర్మించే ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న భయాందోళనలపై చైనా స్పందించింది. ఈ డ్యామ్ కారణంగా భారత్, బంగ్లాదేశ్‌లకు అందే జలాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దిగువ దేశాలపై పర్యావరణం, భౌగోళిక స్వరూపాన్ని హాని ఉండదని పేర్కొంది. కచ్చితత్వంతో కూడిన శాస్త్రీయ పరిశీలన తర్వాతే ఈ ప్రాజెక్టును తలపెట్టామని వివరించింది. పైపెచ్చు, ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో దిగువ ప్రాంతాల్లో విపత్తుల తీవ్రతను తగ్గించడంతోపాటు నివారించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పాటు నిస్తుందని చెప్పుకొచ్చింది. పర్యావరణం దృష్ట్యా అత్యంత సున్నితమైన, భూకంపాలకు ఎక్కువ అవకాశాలున్న హిమాలయ ప్రాంతంలో 137 బిలియన్ డాలర్లతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలని చైనా నిర్ణయించడంపై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. చైనా తీరుపై అమెరికా ప్రభుత్వంతోనూ చర్చిస్తోంది. -
హలో.. హెచ్ఎంపీవీ వైరస్‌తో జాగ్రత్త
బెంగళూరు: : భారత్‌లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి కరోనా రూల్స్ మాదిరిగానే ఉన్నాయి. నిబంధనలు ఇలా జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలని అందులో తెలిపారు. వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కీలక సూచన చేసింది.ఉమ్మివేరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్లో సాధారణ జలుబు, దగ్గు సులుపెరగలేదన్నారు.మెల్లగా విస్తరిస్తున్న హెచ్ఎమ్పీవీదేశంలో హెచ్‌ఎమ్‌పీవీ మెల్లగా విస్తరిస్తోంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ వచ్చింది.ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ రాగా, అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకింది. దాంతో దేశంలోని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.భయం వద్దు.. జాగ్రత్తగా ఉండండిచిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, తమ వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవన్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావుఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు.చైనాలో అధికం..ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
HMPV : మళ్లీ మాస్క్ వచ్చేసింది.. నిర్లక్ష్యం వద్దు!
హ్యూమన్మెటాప్ న్యుమో వైరస్(HMPV) భయం లేదు.. ఆందోళన లేదు అనుకుంటూ ఉండగానే మాయదారి వైరస్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది.ప్రస్తుతం చైనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్ క్రమంగా ఇండియాతోపలు పలు దేశాల్లోతన ఉనికిని చాటుకుంటోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్ ఆరోగ్య అధికారులు నొక్కి చెప్పారు. అలా ప్రకటించారో లేదో ఇలా హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైంది. ఈవైరస్ బారిన శిశువుకు వైద్యం చేస్తుండగానే మరో చిన్నారికి కూడా ఇలా మూడు కేసులు నమోదు కావడంతో దేశంలో అందోళన మొదలైంది. కొత్తది కాదు మనదేశంలో విస్తరించకుండా ఉండాలేంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. HMPV వైరస్ కొత్తతేదీ కాదు. న్యుమోవిరిడే కుటుంబానికి చెందిన మెటాప్న్యూమోవైరస్ ఒక సాధారణ శ్వాసకోశ వైరస్. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటే జలుబుకు కారణమవుతుంది. శీతాకాలంలో సాధారణంగా వచ్చే జలుబు..శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్, ఫ్లూ లాంటిదే అంటున్నారు వైద్యులు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది.టీకా లేదుఅయితే ప్రస్తుతానికి దీనికి టీకా అందుబాటులో లేదు కనుక కొన్ని కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్, శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్‌బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం.ఎలా వ్యాపిస్తుందిHMPV సోకిన వ్యక్తిదగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్-కలుషితమైన వాతావరణాలకు గురికావడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది.మాస్కే మంత్రం!మాస్క్ కచ్చితంగా ధరించాలిచేతులను శుభ్రంగా కడుక్కోవాలి. సామాజిక దూరాన్ని పాటించాలి.పదే పదే కళ్ళు, ముక్కు , నోటిని తాకడం మానువాలి. అనారోగ్యంగా అనిపిస్తే లేదా దగ్గు, గొంతు నొప్పి లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, చికిత్స తీసుకోవాలి.వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండాలిడోర్ నాబ్‌లు, లైట్ స్విచ్‌లు , స్మార్ట్ఫోన్లు వంటి కలుషితమైన ఉపరితలాలను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి.అనారోగ్యం సంకేతాలను చూపించే వ్యక్తుల నుండి సురక్షితమైన దూరం పాటించాలి.ఈ వైరస్ ఎక్కువగా, పిల్లలు, వృద్ధుల్లో కనిపిస్తోంది కనుక వీరి పట్ల మిగిలిన కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి.వేడి నీటిని తాగుతూ, ఆహార పదార్థాలను వేడి వేడిగా తింటూ ఉండాలి.బయటి ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.హెచ్ఎంపీవీ లక్షణాలుదగ్గు, జ్వరం. జలుబు,గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడంఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)గా మారవచ్చు.నోట్: జలుబు, ఫ్లూ లక్షణాలు కనిపిస్తే అందోళన పడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలున్నవారు ఐసోలేషన్‌గా ఉంటే ఇంకా మంచిది. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారు మాస్క్, హ్యాండ్ వాష్, స్వీయ శుభ్రత పాటించాలి. -
భారత్‌లో హెచ్ఎంపీవీ కలకలం
న్యూఢిల్లీ/చెన్నై/సాక్షి బెంగళూరు: చైనాను వణికిస్తున్న హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) భారత్‌లోనూ అడుగు పెట్టింది. సోమవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా ఐదు కేసులు వెలుగు చూశాయి. గుజరాత్లో ఒకరు, కర్నాటకలో ఇద్దరు నెలల చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. తమిళనాడులో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీసే ఈ వైరస్ చైనాలో భారీగా మరణాలకు కారణమవుతున్నట్టు వస్తున్న వార్తలు, కరోనా తాలూకు అనుభవాల నేపథ్యంలో భారత్‌లోనూ తొలిసారి హెచ్ఎంపీవీ కేసులు నమోదవడం కలకలం రేపింది. అయితే ఆందోళన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. హెచ్ఎంపీవీ ప్రాణాంతకమేమీ కాదని తెలిపింది. ‘‘శ్వాస ద్వారా గాలిలో వ్యాపించే హెచ్ఎంపీవీ అన్ని వయసుల వారినీ ప్రభావితం చేయగలదు. అలాగని భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఇది కేవలం మూమూలు శ్వాస సంబంధిత సమస్యేనని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే నిర్ధారించారు. పైగా హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కూడా కాదు. దీన్ని 2001లోనే తొలిసారి గుర్తించారు. అప్పటినుంచీ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తరచూ కనిపిస్తూనే ఉంది’’ అని వివరించింది. ముందుజాగ్రత్తగా దేశవ్యాప్తంగా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘‘చైనాలో పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికైతే దేశంలో ఎక్కడా అదనపు హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడలేదు. శ్వాస సంబంధిత కేసుల్లో అసాధారణ పెరుగుదల కూడా నమోదవలేదు’’ అని స్పష్టం చేశారు. అసాధారణ పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్రం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్టు మంత్రి ప్రకటించారు. ‘‘హెచ్ఎంపీవీకి సంబంధించి అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితి తదితరాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నివేదిక కోరాం. తన వద్ద అందుబాటులో ఉన్న వివరాలను త్వరలో మనతో పంచుకోనుంది’’ అని ఒక ప్రకటనలో వివరించారు. ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని తమిళనాడు, కర్నాటక, గుజరాత్ ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలను గురించి ప్రజలను హెచ్చరిస్తున్నాయి. కర్నాటక ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాసు్కలు ధరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కర్నాటకలో ఎనిమిది నెలల బాబు, మూడు నెలల పాప హెచ్ఎంపీవీ బారిన పడ్డారు. శ్వాసకోశ సమస్యలతో వారిద్దరినీ ఇటీవల బెంగళూరులోని బాప్టిస్టు ఆస్పత్రిలో చేర్చారు. ఐసీఎంఆర్‌లో శాంపిల్స్‌ను పరీక్షించిన మీదట వారికి హెచ్ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. పాప ఇప్పటికే చికిత్స పొంది డిశ్చార్జి కాగా బాబు కోలుకుంటున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వారి కుటుంబీకుల్లో ఎవరూ ఇటీవలి కాలంలో విదేశీ ప్రయాణాలు చేయలేదని వివరించింది. ఈ నేపథ్యంలో మాస్క్ధారణతో పాటు కరోనా నాటి ప్రొటోకాల్స్‌ను తిరిగి తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కర్నాటక ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు హుటాహుటిన సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గుజరాత్లో కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రెండు నెలల బాబుకు హెచ్ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. రాజస్తాన్‌లోని దుంగార్పూర్కు చెందిన ఆ బాబు డిసెంబర్ 24 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమస్య తీవ్రత దృష్ట్యా బాలున్ని వెంటిలేటర్‌పై ఉంచామని, ఇప్పుడు కోలుకుంటున్నాడని వైద్యాధికారులు తెలిపారు. తమిళనాట కూడా సోమవారమే చెన్నైలో ఒకటి, సేలంలో మరొకటి హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూశాయి. బాధితుల పరిస్థితి మెరుగ్గానే ఉందని, వారిని నిరంతర పర్యవేక్షణలో ఉంచామని ఆరోగ్య శాఖ తెలిపింది. The Indian Council of Medical Research (ICMR) has detected two cases of Human Metapneumovirus (HMPV) in Karnataka. Both cases were identified through routine surveillance for multiple respiratory viral pathogens, as part of ICMR's ongoing efforts to monitor respiratory illnesses… pic.twitter.com/PtKYmgztKb— ANI (@ANI) January 6, 2025ప్రమాదకారి కాదుహెచ్ఎంపీవీ. ప్రస్తుతం దేశమంతటినీ ఆందోళనకు గురిచేస్తున్న వైరస్. కానీ కరోనా మాదిరిగా ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎంపీవీ ఇతర సాదాసీదా శ్వాసకోశ వైరస్ల వంటిది మాత్రమేనని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు. చైనాలో వెలుగు చూసిన హెచ్ఎంపీవీలో జన్యు పరివర్తనాలు జరిగాయని డబ్ల్యూహెచ్ఓ చెప్పడమే తప్ప నిర్ధారణ కాలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కరోనాలా ఇది మహమ్మారిగా మారే ప్రమాదమేమీ లేదని వివరించింది. హెచ్ఎంపీవీని తొలిగా 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే... → దగ్గు, తుమ్ము వంటివాటి ద్వారా హెచ్ఎంపీవీ వ్యాపిస్తుంది. శ్వాసనాళంలో ఎగువ, దిగువ భాగాలను ప్రభావితం చేస్తుంది. → జలుబు, ముక్కు కారడం, దగ్గుతో పాటు కొన్నిసార్లు ముఖంపైనా, ఒళ్లంతా ఎర్రని దద్దుర్లు, కొద్దిపాటి జ్వరం రావచ్చు. ఇది శ్వాస ఇబ్బందులకు, నిమోనియా, బ్రాంకైటిస్‌కు దారి తీయడం అరుదే. → హెచ్ఎంపీవీని ఆరీ్టపీసీఆర్ ద్వారా నిర్ధారించవచ్చు. ఇది వారంలోపే తగ్గిపోతుంది. చిన్నారులు, వృద్ధులపై ప్రభావం ఎక్కువ.→ మాస్క్ ధరించడం, చేతులను సబ్బుతో బాగా కడుక్కోవడం వంటివి పాటించాలి.→ హెచ్ఎంపీవీకి ఇప్పటికైతే వ్యాక్సీన్, కచి్చతమైన చికిత్స లేవు. -
చైనాలో మహారాజా జోరు.. నెల రోజుల్లోనే రికార్డ్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన చిత్రం మహారాజా. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని నితిలన్ సామినాథన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా వచ్చిన మహారాజా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం చైనాలోనూ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ చైనాలోనూ విడుదలైంది. రెండు రోజుల్లోనే రూ.20 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వంద కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. అక్కడ విడుదలైన నెల రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కుకు చేరువైంది. గత ఐదేళ్లలో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది. ఈ విషయాన్ని చైనా రాయబార కార్యాలయ అధికారి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇండియాలోని చైనా ఎంబసీ ప్రతినిధి యు జింగ్ ట్వీట్ చేశారు.చైనా అధికారి ట్వీట్.. 2018 తర్వాత చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిందని యు జింగ్ పోస్టర్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం రూ.91.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించింది. తూర్పు లడఖ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ముగిసన తర్వాత చైనాలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం మహారాజానే కావడం మరో విశేషం. చైనాలో ఈ చిత్రం తొలిరోజే రూ. 15.6 కోట్లు వసూళ్లు సాధించింది. ప్రముఖ చైనీస్ మూవీ రివ్యూ సైట్ డౌబన్‌లో ఈ చిత్రానికి 8.7/10గా అత్యధికంగా రేటింగ్ ఇచ్చింది. చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే ఇటీవల చైనాలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఒకటిగా మహారాజా ఘనతను సొంతం చేసుకుంది. ఇదే జోరు కొనసాగితే మహారాజా త్వరలోనే చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.కాగా.. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి నటరాజ్ కూడా నటించారు. ఈ కథ చెన్నైలోని మహారాజా అనే వ్యక్తి తన డస్ట్‌బిన్ కోసం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించడం అనే కథాంశంతో తెరకెక్కించారు. ఇండియాలో జూన్ 14న విడుదలైన మహారాజా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. కాగా.. గతంలో అమీర్ ఖాన్ దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్, రాణి ముఖర్జీ చిత్రం హిచ్కీ వంటి భారతీయ చిత్రాలు మాత్రమే చైనాలో మంచి ప్రదర్శన కనబరిచాయి.Maharaja has become the highest-grossing Indian film in China since 2018, reaching Rs 91.55 crore. Well done👍👍 pic.twitter.com/sq9SUY8D5F— Yu Jing (@ChinaSpox_India) January 5, 2025 -
అప్పుడు కరోనా.. ఇప్పుడు HMPV.. మనకు ముప్పు ఉందా?
-
చైనాలో వైరస్ విజృంభణ.. కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన
ఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం ఇంకా ఎవరూ మర్చిపోనేలేదు. నాటి మరణాలు, పరిస్థితులు ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి. ఇంతోనే చైనాలో మరో వైరస్ వ్యాప్తి ఆందోళన రేపుతోంది. చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన శనివారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (JMG) సమావేశం నిర్వహించారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి భారత్‌లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సమావేశంలో నిపుణులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా వైరస్ కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది.ఇదే సమయంలో చైనా పరిస్థితులను డబ్ల్యూహెచ్‌వో(WHO) కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు స్పష్టం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్ఎంపీవీ వైరస్ టెస్టింగ్ లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్ఎస్వీ, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది.ఇక, చైనాలో వైరస్ కారణంగా భారత్‌లో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధుల అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే, మన దేశంలో ఈ వైరస్ ఆనవాళ్లు ఇప్పటిదాకా బయటపడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు.. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని తెలిపింది. కాగా, చైనాలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరిగింది. ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, ఆసుపత్రులన్నీ పేషంట్స్‌తో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Chinese hospitals experiencing a surge in Human Metapneumovirus (HMPV) infections. Reports and online posts indicate widespread transmission, with some claiming hospitals and crematories are overwhelmed pic.twitter.com/1FDyQuGr2X— News Rated (@NewsRated) January 4, 2025 -
HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావించే డ్రాగన్ దేశం చైనాలో మరో ప్రాణాంతక వైరస్ భయందోళన సృష్టిస్తోంది. హ్యూమన్ మెటాపిన్యూమో వైరస్(HMPV) పంజా విసురుతోంది. వందలాది మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారియి. గత ఏడాది ఏప్రిల్ నుంచే హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి.హెచ్ఎంపీవీని చైనా ప్రభుత్వం ఇంకా మహమ్మారిగా గుర్తించలేదు.ఇటీవల చలికాలం ప్రారంభం కావడంతో వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోందని, ఎక్కువగా పిల్లలు, వృద్ధులు దీని బారినపడుతున్నారని, నిత్యం వందలాది కేసులు బయటపడుతున్నాయని స్థానిక మీడియా చెబుతోంది. బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయని, పెద్ద సంఖ్యలో మరణాలు సైతం సంభవిస్తున్నాయని చైనా ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో కరోనా లాంటి వైరస్ వ్యాప్తి చెందుతోందని, ఇండియాలో కూడా ఇవి వ్యాపించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్ఎస్ స్పందించింది.ఇండియాలో ఆందోళన అవసరం లేదుహ్యూమన్ మెటానిమోవైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) డాక్టర్ అతుల్ గోయల్ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. మన దేశంలో ఈ వైరస్ ఆనవాళ్లు ఇప్పటిదాకా బయటపడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించాయి. చలికాలంలో తలెత్తే శ్వాస సంబంధిత అనారోగ్యానికి తగిన చికిత్స, సదుపాయాలు మన దేశంలో అందుబాటులో ఉన్నాయని గోయల్ చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇవీ చదవండి: చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ : లక్షణాలు, నివారణ చర్యలుమహారాణిలా పీవీ సింధు : బ్యాడ్మింటన్-ప్రేరేపిత డిజైనర్ లెహంగా విశేషాలు -
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్‌లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్‌లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్‌గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్‌లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్‌ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ : లక్షణాలు, నివారణ చర్యలు
China HMPV : కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం తాలూకు గుర్తులు ఇంకా సమసి పోనేలేదు. ఇంతోనే చైనాలో మరో వైరస్ విజృంభణ ఆందోళన రేపుతోంది. కరోనా బీభత్సం జరిగిన ఐదేళ్ల తరువాత చైనాలో HMPV వేగంగా విస్తరిస్తోంది. ఈవైరస్ సోకిన రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయని, శ్మశాన వాటికల్లో స్థలంకూడా లేదంటూ , సోషల్ మీడియా వస్తున్న వీడియోలు, నివేదికలు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోనే ప్రభావం అధికంగా ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు ఇన్ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 లాంటివి వైరస్లు చైనాలో వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది.అసలేంటీ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్2001లోనే హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.హెచ్ఎంపీవీ లక్షణాలుఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.దగ్గుజ్వరంజలుబు,గొంతు నొప్పిఊపిరి ఆడకపోవడంజాగ్రత్తలుహెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకూ అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్‌బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం. -
హెచ్ఎంపీవీ విభృంభణ.. ధృవీకరించిన చైనా!
చైనాలో HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికించడం ఖాయమని పరిశోధకుల హెచ్చరికల వేళ.. డ్రాగన్ కంట్రీ కొత్త వైరస్ విజృంభణను ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతుండడం గమనార్హం. అయితే..కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్ఎంపీవీ విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ.. ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి(China CDC) ప్రకటించాయి. అన్ని వయసులవాళ్లపై ఈ వైరస్ ప్రభావం చూపుతోందని.. ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడినవాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసులను ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నాయి. అలాగే మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే.. ఇది ప్రాణాంతకమేనా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.👉ఒకవైపు చైనాలో నిజంగానే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అత్యవసర పరిస్థితి(Emergency) విధించారా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిల్లో వాస్తవమెంత? అనేది తేలాల్సి ఉంది.👉మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిణామంపై స్పందించాల్సి ఉంది. 👉ఇంకోవైపు.. చైనా చుట్టుపక్కల దేశాల్లో కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే జపాన్‌లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండగా.. HMPV కేసులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హంకాంగ్లోనూ ఈ వైరస్ కేసులు నమోదు అయినట్లు సమాచారం.ఏమిటీ హెచ్ఎంపీవీ వైరస్?హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్.. ఆర్ఎన్ఏ వైరస్. క్షీరదాలు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలగజేసే Pneumoviridae Metapneumovirusకి చెందింది. అయితే హెచ్ఎంపీవీ కొత్తదేం కాదు. చైనాకు 20 ఏళ్లుగా పరిచయం ఉన్న వైరస్సే. 2021లో తొలిసారిగా ఈ వైరస్ ఆనవాళ్లను శ్వాసకోశ సంబంధిత సమ్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్లో డచ్ పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలా సోకుతుందని(వ్యాధికారకం) విషయం గుర్తించలేకపోగా.. ఇప్పటిదాకా దీనికి వ్యాక్సిన్, మందులు సైతం కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఈ వైరస్ 60 ఏళ్లు భూమ్మీద సజీవంగానే ఉండి తన ప్రభావం చూపిస్తుందని తేలింది. ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ లక్షణాలు, చికిత్సకరోనా తరహాలోనే వేగంగా వ్యాపించే ఈ వైరస్.. పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లపై ప్రభావం చూపెడుతుందని తెలుస్తోంది. జలుబుతో పాటు దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. అయితే పరిస్థితి తీవ్రమైతే గనుక న్యూమోనియా, బ్రాంకైటిస్‌కు దారి తీయొచ్చు. వ్యాక్సిన్, మందులు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నారు.ఇక హెచ్ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. 2021లో ఈ వైరస్ డాటా ఆధారంగా లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ఓ కథనం ప్రచురించింది. అందులో.. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఒక శాతం మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది. -
చైనాలో కొత్త వైరస్
-
చైనాలో కొత్త వైరస్ కలకలం
బీజింగ్: విశ్వవ్యాప్తంగా మానవాళి మనుగడను ఒక్కసారిగా ప్రశ్నార్థంచేసి మహా మహమ్మారిగా ప్రపంచదేశాలను చుట్టేసిన కరోనా వైరస్ భయాల నుంచి తేరుకున్న పౌరులకు చైనా మరో భయపెట్టే వార్త మోసుకొచ్చింది. చైనాలో ఇప్పుడు కొత్తగా హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్(హెచ్ఎంపీవీ) వ్యాప్తిచెందుతోందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. కోవిడ్ సంక్షోభం సమసిపోయిన ఐదేళ్లకు మళ్లీ అదే డ్రాగన్ దేశం నుంచి వైరస్ వార్త వెలువడటంతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కొత్త వైరస్ విజృంభణ, దాని విస్తృతి, సాంక్రమణ శక్తి సామర్థ్యాలపై వెంటనే ఆలోచనల్లో పడ్డాయి. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్తితిపై ఆరా తీస్తున్నాయి. చైనాలో పలు ప్రాంతాల్లో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందినట్లు వార్తలొచ్చాయి. పుకార్ల వార్తలకు మారుపేరుగా దుష్కీర్తిని మూటగట్టుకున్న సోషల్‌మీడియాలో ఇప్పటికే కొత్త వైరస్‌పై వార్తలు వెల్లువెత్తాయి. చైనాలో హెచ్ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైసోప్లాస్మా నిమోనియో, కోవిడ్19లు విజృంభించాయని, చైనా అత్యయిక ఆరోగ్య స్థితిని విధించారని సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు షేర్ చేసిన వీడియోల్లో చైనీయులు ఆస్పత్రులు, శ్మశానాల వద్ద క్యూ లైన్లు కనిపించిన దృశ్యాలున్నాయి. అయితే ఈ వార్తలను ఇంతవరకు చైనా ప్రభుత్వంగానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థగానీ ధృవీకరించలేదు. ఇది పాత వైరస్సేనని కొందరు వైద్యులు చెబుతుండటం గమనార్హం. -
మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు.. జిన్‌పింగ్ హెచ్చరిక
బీజింగ్: కొత్త ఏడాది వేడుకల వేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తైవాన్ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరంటూ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. చైనా, తైవాన్ వేరు కాదంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్బంగా జిన్‌పింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తైవాన్ను చైనాలో కలుపుకోవడం ఎవరూ ఆపలేరని అన్నారు. చైనాలో తైవాన్ అంతర్భాగమేనని తెలిపారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజలు ఒకే కుటుంబం. మన రక్త సంబంధాలను ఎవరూ తెంచలేరు. మాతృభూమి పునరేకీకరణను ఎవరూ ఆపలేరు. అందుకే తైవాన్ చుట్టూ వైమానిక, నౌకాదళ విన్యాసాలు చేపట్టినట్లు చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక, ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెల కొన్నవేళ జిన్‌పింగ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.ఇదిలా ఉండగా.. గత కొద్ది కాలంగా రెండు దేశాల మధ్య ఈ విషయమై ఘర్షణ నడుస్తోంది. చాలాసార్లు చైనా.. తైవాన్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిచింది. నిజానికి చైనా, తైవాన్ దేశాలు పరస్పర విరుద్ధమైన జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. తైవాన్ ప్రజాస్వామ్యదేశం కాగా, చైనా కమ్యూనిస్టు దేశం. ఇటీవల కాలంలో తైపీపై బీజింగ్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ద్వీపదేశమైన తైవాన్‌కు ప్రపంచదేశాలతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. మే నెలలో తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ చింగ్ ఎన్నికైన తర్వాత ఆదేశ ప్రాదేశిక జలాల్లో చైనా ఇప్పటి వరకు మూడు సార్లు భారీ మిలటరీ విన్యాసాలు చేపట్టింది. తైవాన్‌ని బలప్రయోగం ద్వారా తన ఆధీనంలోకి తీసుకురావడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చాలా సార్లు జల, గగన తలాల్లో నియమాలను ఉల్లంఘించింది.మరోవైపు.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మరో మూడు వారాల్లో అధికారంలోకి రాబోతున్న తరుణంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తైవాన్‌ని అమెరికా ఆసియాలో వ్యూహాత్మక మిత్రదేశంగా భావిస్తోంది. అమెరికా తైవాన్‌కి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉంది. చైనా నుంచి తైవాన్‌ని రక్షించేందుకు అమెరికా అండగా నిలుస్తోంది. -
ఇండో–పసిఫిక్ స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యం
న్యూఢిల్లీ: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకు, విస్తరణవాదానికి కళ్లెం వేస్తూ ఈ ప్రాంత స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యంగా ఉమ్మడిగా ముందడుగువేస్తున్నామని క్వాడ్ కూటమి దేశాలు పునరు ద్ఘాటించాయి. క్వాడ్ కూటమిగా ఆవిర్భవించి పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకోవడం మొదలెట్టి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా క్వాడ్ సభ్యదేశాలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశాయి. 2004లో హిందూ మహాసముద్రంలో ఇండోనేసియా సమీపంలో సముద్రగర్భంలో భూకంపం కారణంగా ఉద్భవించిన సునామీ సృష్టించిన విలయం నుంచి కోలుకునేందుకు భార త్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు 20 ఏళ్ల క్రితం ‘క్వాడ్’కూటమిగా ఏర్పడిన విషయం విదితమే.మంగళవారం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. ఇటీవలికాలంలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తరచూ సముద్రతీర భద్రత, మౌలిక వసతుల కల్పన, దేశాల మధ్య అనుసంధానత పెను సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సంయుక్త ప్రక టన వెలువడటం గమనార్హం. ‘‘ఇండో–పసిఫిక్ స్వేచ్ఛాయుతంగా ఉంటే ఇక్కడ సుస్థిరత, పారదర్శకత నెలకొనడంతోపాటు దేశాల మధ్య పరస్పర నమ్మకం, విశ్వాసం ఇనుమడిస్తుంది. పది దేశాలతో ఏర్పడిన ఆసియాన్ గురించి క్వాడ్ ఆలో చిస్తోంది. తూర్పు ఆసియా దేశాలకు పూర్తి సహాయసహకారాలు అందించడంతోపాటు దేశాల మధ్య ఐక్యతకు క్వాడ్ కృషిచేస్తోంది. పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లకూ క్వాడ్ తన మద్దతు పలుకుతోంది.సునామీ వంటి ప్రకృతి విపత్తులు మా నాలుగు దేశాలను దగ్గర చేశాయి. సునామీ వినాశనం వేళ దాదాపు 2.5 లక్షల మంది సజీవ సమాధి అయ్యారు. రాకాసి అలల ధాటికి తీరప్రాంతమున్న 14 దేశాల్లో 17 లక్షల మంది సర్వస్వం కోల్పోయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. లక్షలాది బాధితులను ఆదుకునేందుకు 40,000కు పైగా అత్యయక బృందాలు అవిశ్రాంతంగా సేవలందించాయి. వినాశనాల వేళ మానవీయ సా యం, విపత్తు స్పందన సహకారం అందించడమే క్వాడ్ ముఖ్యోద్దేశం. ఇండో–పసిఫిక్‌లో తలెత్తే ఎలాంటి ఉపద్రవాన్నైనా తక్షణం ఎదుర్కొనేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం.2021 నుంచి ప్రతి ఏటా క్వాడ్ దేశాధినేతలు దక్షిణాసియా, ఆగ్నేయాసియా, పసిఫిక్ ప్రాంతాల అభ్యున్నతికి ఎంతగానో కృషిచేశారు’’అని సంయుక్త ప్రకటన పేర్కొంది. 2025 ద్వితీయార్థంలో క్వాడ్ సదస్సు భారత్‌లో జరగనుంది. క్రితంసారి అమెరికాలోని విలి్మంగ్టన్‌లో క్వాడ్ సదస్సు జరిగింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ దేశాల సార్వ¿ౌమత్వానికి భంగం వాటిల్లకుండా క్వాడ్ దేశాలు పనిచేస్తున్నాయని ప్రకటన స్పష్టంచేసింది. -
అమెరికా ఖజానాపై సైబర్ దాడి..!
వాషింగ్టన్:అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్ దాడి చేసినట్లు సమాచారం. వర్క్ స్టేషన్లు,కీలక ఫైల్స్‌పై చైనా ప్రోద్బలంతో జరిగిన సైబర్ దాడిని గుర్తించామని అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్‌కు లేఖ రాసింది.ఈ లేఖ మీడియా చేతికి చిక్కడంతో అసలు విషయం బయట పడింది.డిసెంబర్ నెల ప్రారంభంలో సైబర్ దాడి ఘటన జరిగినట్లు తెలుస్తోంది.థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస ప్రొవైడర్ పాస్‌వర్డ్‌ను కనిపెట్టిన హ్యాకర్లు బ్రేక్ చేసి వర్క్ స్టేషన్లు, కొన్ని ఫైల్స్‌లోని సమాచారాన్ని దొంగిలించారని ట్రెజరీ శాఖ అధికార ప్రతినిధి లేఖలో తెలిపారు.ఈ విషయాన్ని యూఎస్ సైబర్ సెక్యూరిటీ,ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ దృష్టికి ట్రెజరీ శాఖ తీసుకువెళ్లింది.సైబర్ దాడిపై ట్రెజరీ శాఖకు థర్డ్‌పార్టీ సైబర్ సెక్యూరిటీ సేవలందిస్తున్న బియాండ్ ట్రస్ట్ సంస్థ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఇటీవలి కాలంలో కొన్ని థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్‌ను టార్గెట్ చేసి సైబర్ దాడులకు పాల్పడే ట్రెండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. -
'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..
యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ తయారీ చేరింది. చైనాలో టీ అనేది ప్రజల రోజువారీ జీవితంలో అల్లుకుపోయిన పానీయం, టీ తో అక్కడి ప్రజలకు లోతైన సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.బీజింగ్ టీ మ్యూజియంలో ఉత్తర– దక్షిణ రాజవంశాల (క్రీ.పూ. 386– క్రీ.పూ. 589) నాటి 100కి పైగా టీ–సంబంధిత కళాఖండాల సేకరణ ఉంది. ఇక్కడి కాలిగ్రఫీ, పెయింటింగ్‌లు, సాంస్కృతిక అవశేషాలు, పురాతన టీ సెట్లు, టీల నమూనాలు ఉన్నాయి, ఇవి చైనా గొప్ప టీ సంస్కృతి, సమగ్ర, క్రమబద్ధమైన సేకరణను అందిస్తాయి. టీ సంస్కృతిని ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ టీ సంస్కృతికి కేంద్రంగా ఈ మ్యూజియం సంవత్సరాలుగా టీ–సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులకు సాంప్రదాయ సాంçస్కృతిక విద్యా కార్యక్రమాలను, చైనాలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు టీ సంస్కృతి అనుభవాలను అందిస్తుంది.. ‘టీ తయారీ కోసం చైనీస్ ప్రజలు సృష్టించిన అనేక మార్గాలు, వస్తువులను చూసి విదేశీ రాయబారులు ఆశ్చర్యపోతారు. తూర్పు తీసుకువచ్చిన టీ ఆకుతో ఇక్కడి ప్రజలు రకాల రకాల టీ లను ఎలా సృష్టిస్తారో తెలియజేస్తుంది. వారసత్వ జాబితాలో..టీ సంస్కృతికి పుట్టినిల్లుగా చైనీస్ టీ చరిత్రను క్రీ.పూ హాన్ రాజవంశాల నుండి గుర్తించవచ్చు, చైనాలో సాంప్రదాయ టీ ప్రాసెసింగ్ పద్ధతులు, అనుబంధ సామాజిక పద్ధతులు 2022లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. చైనీయుల దైనందిన జీవితంలో టీ సర్వవ్యాప్తి చెందుతుంది, ఎందుకంటే కుటుంబాలు, కార్యాలయాలు, టీ హౌస్‌లు, రెస్టారెంట్లు, దేవాలయాలలో వేడి వేడి తేనీటిని అందిస్తారు. వివాహాలు, సమూహాలుగా జరిగే వేడుకలలో కూడా ముఖ్యమైన భాగం అని యునెస్కో తెలిపింది. వాస్తవానికి ‘తు‘ అని పిలిచే టీ, పురాతన చైనీస్ ఔషధ పుస్తకాలలో విరుగుడుగా ఉపయోగించబడటానికి కనుక్కున్నట్టు రాయబడి ఉంది. ముఖ్యమైన టీ సంగతులు...టీ తాగే ధోరణి ప్రారంభమైనప్పుడు టాంగ్ రాజవంశం (క్రీ.పూ.618– క్రీ.పూ.907) నుండి టీ ని విశ్వవ్యాప్తంగా ‘చా‘ అని పిలిచారు. 1987లో పురావస్తు శాస్త్రవేత్తలు ఆలయంలోని భూగర్భ ప్యాలెస్ నుండి తొలి, అత్యున్నత స్థాయి టాంగ్ ఇంపీరియల్ టీ సెట్‌ను కనుగొన్నారు. 8వ శతాబ్దంలో టాంగ్ పండితుడు లు యు రచించిన క్లాసిక్ ఆఫ్ టీ, టీ– సంబంధిత అభ్యాసాల గురించి క్రమపద్ధతిలో వివరించిన మొదటి గ్రంథం.సాంగ్ రాజవంశం (960–1279)లో ప్రజలలో ప్రజాదరణ పొదింది: మ్యూజియంలోని కుడ్యచిత్రం టీ పోటీలో పాల్గొనడానికి ప్రజలు తమ సొంత టీ, టీ సెట్లను తీసుకువచ్చిన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. మ్యూజియంలో అతి ముఖ్యమైనది ‘గోల్డెన్ మెలోన్ ట్రిబ్యూట్ టీ‘, దీనిని ‘రెన్ టౌ చా‘ (తల ఆకారపు టీ) అని కూడా పిలుస్తారు. ఇది ఒక శతాబ్దానికి పైగా భద్రపరచబడిన అరుదైన, వయస్సు గల ప్యూర్ టీ. దీని ఆకారం గుమ్మడికాయ, బంగారు రంగును ΄ోలి ఉంటుంది కాబట్టి దీనికి గోల్డెన్ మెలోన్ టీ అని పేరు పెట్టారు. ఆకుపచ్చ, పసుపు, ముదురు, తెలుపు, బ్లాక్ .. టీలతోపాటు యువ తరం కొత్త మార్గాలతో సంప్రదాయాన్ని స్వీకరించింది. వారు స్థానిక టీ ఆకులను బేస్‌గా ఉపయోగిస్తారు. టీని తాజా పాలు, బెర్రీ, పీచెస్ వంటి పండ్లతో కలిపి కొత్త టీ డ్రింక్స్‌ను తయారు చేస్తారు. (చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..) -
హైస్పీడ్ బుల్లెట్ రైలును పరీక్షించిన చైనా
బీజింగ్:ఆవిష్కరణల్లో చైనా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ రైలు నమూనాను చైనా రైల్వే సంస్థ తాజాగా ఆవిష్కరించింది. దీనికి సీఆర్450గా పేరుపెట్టింది. ఆదివారం(డిసెంబర్29) బీజింగ్‌లో ఈ రైలును పరీక్షించారు. ట్రయల్‌రన్‌లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైలు దూసుకుపోయింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిమీ వేగాన్ని అందుకోగలదని చైనా రైల్వే తెలిపింది. ఇది ప్రయాణాలకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్యాసింజర్ రైలుగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది.ఈ బుల్లెట్ రైలు చైనా రాజధాని బీజింగ్ నుంచి షాంఘై నగరానికి కేవలం రెండున్నర గంటల్లోనే ప్రయాణించగలదు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతమున్న సీఆర్400 మోడల్ కంటే ఇది 12 శాతం బరువు తక్కువ. ఇంధనాన్ని కూడా 20 శాతం తక్కువగానే వాడుతుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు.ఇక గత బుల్లెట్ రైలు మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిమీ వేగాన్ని అందుకోవడం గమనార్హం. చైనా హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రపంచలోనే అతిపెద్దది కావడం గమనార్హం. చైనాలో ఇప్పుడున్న బుల్లెట్ రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు. -
ఈప్యాక్‌లో.. చైనా కంపెనీ హైసెన్స్‌కు చోటు
కన్జూమర్ అప్లయెన్సెస్ కంపెనీ ఈప్యాక్ డ్యూరబుల్స్ ఏర్పాటు చేయనున్న ప్లాంటులో చైనా సంస్థ హైసెన్స్ గ్రూప్ ఇన్వెస్ట్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏసీలు, వాషింగ్ మెషీన్ల తయారీకి ఈప్యాక్ కొత్తగా ప్లాంటును నెలకొల్పుతోంది. ఈ ప్లాంటులో టీవీలు, అప్లయెన్సెస్ తయారీ చైనా కంపెనీ హైసెన్స్ గ్రూప్ 15 నుంచి 26 శాతం వాటా కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉంది.అయితే భారత ప్రభుత్వ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలపై ఆధారపడి పెట్టుబడులకు వీలున్నట్లు హైసెన్స్ ఇండియా ఎండీ స్టీవెన్ లి తెలియజేశారు. ఈప్యాక్ ప్లాంటులో కనీసం 15 శాతం, గరిష్టంగా 26 శాతం వాటా కొనుగోలుకి అవకాశమున్నట్లు వివరించారు. నిబంధనలు అనుమతిస్తే భారత్‌లో పెట్టుబడులకు తమ గ్రూప్ కట్టుబడి ఉంటుందని తెలియజేశారు.కంపెనీ దేశీయంగా తొలిసారి 120 అంగుళాల లేజర్ టీవీని ఇక్కడ విడుదల చేసింది. ఈ సందర్భంగా లి ప్రసంగిస్తూ వచ్చే వేసవిలో కొత్త శ్రేణిలో ఏసీలను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో ఈప్యాక్ డ్యురబుల్స్ ఏసీలు, వాషింగ్ మెషీన్లను తయారు చేయనున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలియజేశారు.తొలి దశలో రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. కాగా.. ఈప్యాక్ మ్యాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీస్ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్పీవీ ద్వారా ప్లాంటు నిర్వహణ ఉంటుందని 2025 అక్టోబర్‌కల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని లి వెల్లడించారు. భవిష్యత్‌లో దక్షిణాసియా, మెక్సికో మార్కెట్లకు హైసెన్స్ ద్వారా ఎగుమతులకు సైతం ప్లాంటు ఉపయోగపడనున్నట్లు తెలియజేశారు. -
వామ్మో..! అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా..?
చాలా విచిత్రమైన ఉద్యోగాలు గురించి విన్నాం. వాటి జీతభత్యాలు కూడా అంతే స్థాయిలో విచిత్రంగా ఉంటాయి. కానీ ఇలాంటి వెరైటీ జాబ్ రిక్రూట్మెంట్ చూసి ఉండరు. ఆ జాబ్ క్వాలిఫికేషన్ చూస్తే..వామ్మో ఇవేం అర్హత పరీక్షలని నోరెళ్లబెడతారు. ఏంటా ఉద్యోగం అంటే..చైనాలో ఒక శ్మశానవాటికకి సంబంధించిన రుషన్ మునిసిపల్ బ్యూరో ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఇది శ్మశానవాటికలోని మృతదేహాల నిర్వహణకు సంబంధించిన మేనేజర్ పోస్ట్. అందుకు సంబంధించిన క్యాలిఫికేషన్ గురించి చాలా వివరంగా పేర్కొంది. శ్మశానంలో ఉద్యోగం ఏంటి అనుకోకండి. చైనా వంటి దేశాల్లో అంత్యక్రియల నిర్వహణకు సంబంధించిన సిబ్బంది, ఉన్నతాధికారులు ఉంటారు. అక్కడ మృతదేహాలను మార్చురీలో భద్రపరచడం లేదా దహన సంస్కారాలు చేయడం వంటి కార్యకలాపాలు ఉంటాయి. ఈ జాబ్‌లో పనిచేసే పురుషులకు కనీస వయసు 45 ఏళ్లు. అలాగే జూనియర్ సెకండరీ స్కూల్ విద్యను పూర్తి చేసి ఉండాలి. ఇక అందుకోసం రూ.850లు పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ వివరాలు వింటే..మాటలు రావు. సుమారు పది నిమిషాల పాటు గడ్డకట్టే శీతల శవాగారంలో గడపాల్సి ఉంటుందట. ఈ పరీక్ష ఎందుకంటే ఇలాంటి చోట పనిచేస్తే వ్యక్తులో భయాన్ని, ఆందోళనల్ని నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని ఈ అర్హత పరీక్ష అని సదరు అంత్యక్రియల డిపార్ట్మెంట్ వెల్లడించింది. అలాగే అభ్యర్థి మానసిక పరిస్థితికి అనుగుణంగా ఇంటర్న్‌షిప్ వ్యవధి ఉంటుందని వెల్లడించింది. అంతేగాదు చైనాలో ఈ శ్మశానవాటిక సేవల మార్కెట్ 2015లో రూ.18 వేల కోట్ల ఉండగా, అది 2022 నాటికి రూ. 3 లక్షల కోట్లకు విస్తరించింది. వాస్తవానికి సాధారణ సిబ్బంది కంటే ఈ శ్మశాన వాటికలో పనిచేసే వారి జీత భత్యాలే ఎక్కువగా ఉంటాయి. కానీ చైనా శ్మశాన వాటిక మేనేజర్ ఉద్యోగానికి ఇచ్చే వేతనం చాలా తక్కువ. ఈ పోస్ట్ గురించి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అక్కడ అలాంటి ప్రదేశంలో ఉద్యోగం చేసేందుకు ముందుకు రాకుండా చేసేది భయం కాదు ఇచ్చే వేతనమేనని నెటిజన్లు మండిపడుతూ పోస్ట్‌లు పెట్టారు. అందుకోసం పెట్టే పరీక్ష కూడా అమానుషమైనదని తింటిపోస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: డెంటిస్ట్ కాస్త ఐఏఎస్ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..) -
అమెరికాకు ఎగుమతులు పెరిగే చాన్స్
న్యూఢిల్లీ: అమెరికా (US) అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనా (China) వస్తువులపై అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందివచ్చే అవకాశాలను భారత్ సద్వినియోగం చేసుకునే వీలుందని అత్యున్నత స్థాయి ఎగుమతిదారుల సంస్థ– ఎఫ్ఐఈఓ పేర్కొంది. ఈ దిశలో అమెరికాకు భారత్ ఎగుమతులను పెంచడానికి వ్యూహాన్ని రూపొందించినట్లు కూడా ఎఫ్ఐఈఓ తెలిపింది.ఈ ప్రణాళికలో భాగంగా దేశ ఎగుమతిదారులు (Exporters) అమెరికా అంతటా జరిగే వాణిజ్య, వ్యాపార ప్రదర్శనలలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం అందించాలని ఎఫ్ఐఈఓ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టింది వెంటనే మెక్సికో, కెనడా, చైనాలపై కొత్త టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఇస్రార్ అహ్మద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైనవి...అమెరికా మార్కెట్‌కు భారత్ ఎగుమతుల్లో వృద్ధిని పెంచడానికి రూపొందించిన వ్యూహంలో మేము ఐదు కీలక రంగాలను గుర్తించాము. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, పాదరక్షలు, ఆర్గానిక్ కెమికల్స్ రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించి అమెరికా వాణిజ్య సంఘాలతో చేతులు కలపాలని ఎఫ్ఐఈఓ భావిస్తోంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చి తి కారణంగా చాలా దుస్తులు కంపెనీలు భారత్‌కు స్థావరాలను మార్చుకుంటున్నాయి. అమెరికా మార్కెట్లో భారత్ ఎగుమతులు విస్తరించాల్సిన అవసరం, అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో భారత్ ఉత్పత్తులను విస్తృత స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ఎగుమతిదారులకు తగిన ఆర్థిక మద్దతు అవసరం. అందివస్తున్న అవకాశాలను వినియోగించుకోవడంలో ఇది కీలకం. దేశంలో పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నందున సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో భారత్ ఉనికి మరింత పెంచుకోవాలి. అవకాశాలను చేజిక్కించుకోవడానికి మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ (ఎంఏఐ) పథకం కింద మరిన్ని నిధులు అడుగుతున్నాము. అమెరికాకు ఎగుమతులు లక్ష్యంగా ఈ పథకంపై దృష్టి పెట్టాలి. కనీసం మూడు సంవత్సరాలు దీనిని అమలు చేయాలి. ప్రస్తుతం భారత్ ఎగుమతిదారులు ‘ద్రవ్య లభ్యత’ (లిక్విడిటీ) సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఫైనాన్స్ అవసరాలు తీవ్ర సవాళుగా ఉన్నాయి.వస్తువులు, సేవలను కొనుగోలు చేసిన 45 రోజుల్లోగా ఎంఎస్ఎంఈ (లఘు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు)లకు చెల్లింపులు జరపాలన్న నిబంధనను సడలించాలి. రుణ వ్య యాలను తగ్గించుకోవడానికి సంబంధించిన – ఇంట్రస్ట్ ఈక్విలైజేషన్ స్కీమ్ (ఐఈఎస్)ను ఐదు సంవత్సరాల పొడిగించాలి. దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం అమలుచేస్తున్న ఆర్ఓడీటీఈపీ (ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల రిఫండ్) పథకం ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ, ఆయా ఉత్పత్తుల దిగుమతిదేశాలు విధిస్తున్న కౌంటర్వ్యాలింగ్ సుంకాలు (రాయితీలు పొందిన ఉత్పత్తులపై సుంకాలు– యాంటీ సబ్సిడీ సుంకాలు) ఎగుమతిదారులకు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ఈ సమస్యపై ఈఐఎఫ్ఓ వాణిజ్య మంత్రిత్వశాఖతో చర్చిస్తోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా.. మార్చితో ముగిసిన గత 2023–24లో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు దేశ ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. కొత్త అమెరికా ప్రభుత్వం ’అమెరికా ఫస్ట్’ అజెండాను అనుసరించాలని నిర్ణయించుకుంటే ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి వస్తువులపై భారతీయ ఎగుమతిదారులు అధిక కస్టమ్స్ సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాణిజ్య నిపుణులు పేర్కొన్నారు. -
అమెరికా–చైనాలు దగ్గరయ్యేనా?
ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలూ, సైనిక శక్తులూ అయిన అమెరికా– చైనాల మధ్య సత్సంబంధాలు చోటు చేసుకోనున్నాయనే సూచనలు అభినందనీయం. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. తాను మంచివనుకున్న, తనకు పేరు తెచ్చే పనులను చేస్తారు. అనుకోని పనులు చేయడం తన బలమని ట్రంప్ ప్రకటించు కున్నారు. అమెరికా– చైనాల పరస్పర సహకారంతో ప్రపంచ శాంతి సౌభాగ్యాలను సాధించవచ్చు.‘చైనా అపాయం’ బూచితో అమెరికా... చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఆంక్షలు విధి స్తోంది. చైనా ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు విధిస్తోంది. చైనా వాణిజ్య కట్టడికి కూటములు కడుతోంది. చైనా పొరుగు దేశా లకు ఆయుధాలను అమ్ముతోంది. విదేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తోందనీ, స్వదేశంలో అణచివేతకు పాల్పడుతోందనీ, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణలో రష్యాకు మద్దతు ఇస్తోందనీ చైనాపై అమెరికా ప్రచారం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చైనా వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు. అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ విదేశీ విధాన అమలుకు ఎన్నుకున్న వ్యక్తులను బట్టి ఆయన చైనా వ్యతిరేకత తెలుస్తుంది. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ దీనికి ఉదాహరణ. మరోవైపు ప్రపంచ ఘటనలు అంచనాలను తారు మారు చేస్తున్నాయి. సిరియాలో 5 దశాబ్దాల అల్ అసద్ కుటుంబ పాలన స్వల్ప ప్రతిఘటనతో కూలి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. అతి బలీయమైన రష్యా, ఎదుగు తున్న ఇరాన్ అసద్‌ను దశాబ్ద కాలంగా గట్టిగా సమర్థించాయి. అయినా పేర్లే తెలియని తిరుగుబాటుదార్ల వేటలో కేవలం 2 వారాల్లో అసద్ దేశం వదిలి పారిపోయాడు. దీని వెనుక అనేక కారణాలున్నాయి. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి; తర్వాత పాలస్తీనా, హమాస్, గాజా, వెస్ట్ బ్యాంక్‌లపై, లెబనాన్‌లో హెజ్ బొల్లాపై, వీరిని సమర్థించిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ అమానవీయ దాడులు; ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు, అమెరికా ఆధీన ఐక్య రాజ్యసమితి అశక్తత వాటిలో కొన్ని.సిరియా ప్రభుత్వ పతనం తర్వాత 2 రోజుల్లో ఇజ్రా యెల్, సిరియా ఉన్నత స్థాయి సైనిక సంపదను, వాయు సేనను 80 శాతం ధ్వంసం చేసింది. క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఆయుధ కర్మాగారాలు, పరిశోధన కేంద్రాలు, రసాయనిక ఆయుధాలు నాశనమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణలో ఉత్తర కొరియా రష్యా వైపు జోక్యం, రష్యాకు చైనా మద్దతు (చైనా దీన్ని తిరస్కరించింది) ఐరోపాలో ఆందోళన కలిగించాయి. చైనా చౌక విద్యుత్ వాహనాలు తమ వాహన పరిశ్రమకు హానికరమని ఐరోపా భయం. తమ దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధించబోయే అధిక పన్నులపై అమెరికా మిత్రులైన ఐరోపా, ఆసియా దేశాలు బాధ పడుతున్నాయి. ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను మెచ్చుకున్నారు. తాను యుద్ధాలను ప్రారంభించననీ, కొత్త ఒప్పందాలను ప్రేమి స్తాననీ గర్వంగా ప్రకటించారు. ట్రంప్ అధికారంలో అమె రికా, చైనా సంబంధాల మెరుగుకు ఇది శుభసూచకం. 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థలో స్వీయ ఉద్దీపన తగ్గింది. ప్రజల వినియోగాన్ని పెంచాలనీ, విదేశీ పెట్టుబడులకు అనుకూలత కల్పించాలనీ, గిరాకీని పెంచాలనీ చైనా గుర్తించింది. మార్కెట్ అనుకూల ఆర్థిక విధానాలను స్వీకరించింది. ప్రజలకు డబ్బు అందే విధంగా వడ్డీ తగ్గించింది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ల స్థిరీకరణ పద్ధతులను పాటించింది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ప్రపంచ అభివృద్ధికి చోదకశక్తిగా పని చేస్తానంటోంది. ఇవి అమెరికా–చైనా సంబంధాల మెరుగు దలకు ప్రేరణ. సంగిరెడ్డి హనుమంత రెడ్డివ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ 94902 04545 -
నయా ట్రెండ్ : పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్ రచ్చ!
ప్రస్తుతం మెటర్నిటీ ఫోటోషూట్ ట్రెండింగ్‌లో ఉంది. మాతృత్వ అనుభూతులను అందంగా, పదిలంగా దాచుకోవాలనే లక్ష్యంతో ఇది పాపులర్ అయింది. కానీ చైనాలో ప్రెగ్నెన్సీ ఫోటోలకు సంబంధించి ఒక నయా ట్రెండ్ విమర్శలకు తావిస్తోంది. చైనాలో ఒంటరి మహిళలు ఇప్పుడు నకిలీ బేబీ బంప్, మెటర్నీటి ఫోటోషూట్లకు సోషల్‌మీడియాను ముంచుత్తెతున్నారు. దీంతో చర్చకు దారి తీసింది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) రిపోర్ట్ ప్రకారం పెళ్లి కాని యువతుల బేబీ బంప్‌తో ఫొటోషూట్ చైనాలో కొత్త ట్రెండ్‌గా మారింది. హునాన్ ప్రావిన్స్‌కు చెందిన జనరేషన్ Z ఇన్ఫ్లుయెన్సర్ “ మెయిజీజీ గెగే” అక్టోబర్ 13న తన మెటర్నిటీ ఫోటోషూట్‌ను షేర్ చేసింది. అదీ ఆమె సింగిల్‌గా(పెళ్లి కాకుండానే), స్లిమ్‌గా ఉన్నప్పుడే బేబీ బంప్‌తో ఫొటోషూట్ చేసింది. అంతేకాదు గర్భధారణ సమయంలో పొందే ఆనందాన్ని అనుభవించాను అంటూ ఆమె రాసుకొచ్చింది. దీంతో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. 5.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లను ఆమె విపరీతంగా ఆకర్షించింది. ఈ ఫేక్ బేబీ బంప్ ఫోటోషూట్ ట్రెండ్ వేగంగా ఊపందుకుంటోందిఈ ధోరణి చైనాలో జననాలు, వివాహాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ మెటర్నిటీ ఫోటోషూట్లు విపరీతంగా షేర్ అవుతున్నాయి. 26 ఏళ్ల గ్రాడ్యుయేట్ తాను సింగిల్ అయినప్పటికీ 23 ఏళ్ల వయస్సులో తన ప్రసూతి ఫోటోలను తీసినట్లు వెల్లడించింది. మరో యువతి తన పెళ్లి ఫోటోలను 22 ఏళ్ల వయసులో తీశానని, “నాకు 30 ఏళ్లలోపు ముడతలు వస్తే” ఎలా అంటూ వ్యాఖ్యానించింది. ఇలా 20 ఏళ్ళ వయస్సున్న అమ్మాయిలుకూడా ఇలా ఫేక్ బేబీబంప్ ఫోటో షూట్ చేయించుకుంటుండటం గమనార్హం.గర్భధారణ సమయంలో శరీర మార్పులు ఒళ్లు చేస్తే ఫొటోషూట్ నైస్‌గా అందంగా కుదరదని భావిస్తున్న యువతులు నాజూకైన శరీరం ఉండగానే ఫేక్ బెల్లీ ఫోటోలను తీయించుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు పాత తరం కూడా ఇదేం చోద్యం అంటూ మెటికలు విరుస్తూ ఆశ్చర్యపోతున్నారట. తాము కూడా 70 ఏళ్ల పుట్టినరోజు, అంత్యక్రియల ఫొటోషూట్లు నిర్వహించుకొంటామంటూ మండి పడుతున్నారు. -
గడ్డ కట్టిన నదిని కోసి మంచు ఉత్సవం
చైనాలో ప్రతి డిసెంబర్లో జరిగే ‘హర్బిన్ ఇంటర్నేషనల్ ఐస్ అండ్ స్నో స్కల్పప్చర్ ఫెస్టివల్’కు భారీగా పర్యాటకులు వస్తారు. కారణం ఏమిటంటే అక్కడ ప్రవహించే సొంగువా నది నవంబర్ నుంచి మార్చి వరకు గడ్డ కట్టి΄ోతుంది.హర్బిన్ నగరానికి దాపుగా ఈ నది ఉండటంతో నది ఉపరితలం మీద ఉన్న ఐస్‌ను కోసి వ్యా΄ారులు అమ్ముతారు. శిల్పులు ఆ ఐస్ కొని భారీ విగ్రహాలు చేసి ప్రదర్శనకు పెడతారు. ఇలా మంచు శిల్పాలు, ఆకారాలు, మంచుతో కట్టిన భవనాలు ఇవన్నీ కలిసి ‘హర్బిన్ ఐస్ ఫెస్టివల్’ పేరుతో జరుగుతాయి. ఈశాన్య చైనాలో ఉండే హర్బిన్ నగరం సైబీరియా మంచు ఎడారికి దగ్గర. నవంబర్ నుంచి సైబీరియా మంచు గాలులు మొదలయ్యి చలి పెరుగుతుంది. నది గడ్డ కడుతుంది. డిసెంబర్లో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 16 డిగ్రీల వరకూ ఉంటాయి. అందుకే ఈ చలిలో బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎంతకీ కరగని మంచుతో ఇలా ఉత్సవం చేసి ఆనందిస్తారు. మీ దగ్గర హుండీలో దాచిన డబ్బు ఉంటే వెళ్లి చూసి రండేం! -
అమెరికాలో ‘చైనా’ కలకలం.. ఎంత పని చేసింది!
మన్హటన్: చైనా ప్రభుత్వం తరఫున అమెరికాలో నడిపే రహస్య పోలీస్‌స్టేషన్ ఒకటి మొట్టమొదటిసారిగా బయటపడింది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో 2022 నుంచి చెన్ జిన్‌పింగ్, లు జియన్వాంగ్ అనే వారు చైనా ప్రభుత్వం పబ్లిక్ సెక్యూరిటీ శాఖ తరఫున దీనిని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అదే ఏడాది ఫెడరల్ బ్యూరో అధికారులు దీనిని మూసివేయించారు. చెన్ జిన్‌పింగ్, లు జియాన్ వాంగ్లు తమ సెల్ఫోన్లలోని చైనా మంత్రిత్వ శాఖ మెసేజీలను పూర్తిగా డిలీట్ చేశారు.అమెరికా పౌరసత్వమున్న వీరిద్దరినీ గతేడాది ఏప్రిల్‌లో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18వ తేదీన కోర్టులో వీరిపై విచారణ పూర్తయింది. ఆరోపణలు రుజువని తేలితే వచ్చే ఏడాది వెలువడే తీర్పులో కోర్టు చెన్కు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. లుపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాలిఫోర్నియాలోని ప్రజాస్వామ్య అనుకూల వాదిని గుర్తించేందుకు చైనా ప్రభుత్వానికి సాయం చేయడంతోపాటు, పరారీలో ఉన్న నేరస్తుడిని అమెరికా నుంచి తిరిగి చైనా వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ దేశస్తులపై నిఘా పెంచి, వారిని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు చైనాలోని నియంతృత్వ కమ్యూనిస్ట్ ప్రభుత్వం దాదాపు 53 దేశాల్లో 100కు పైగా ఇటువంటి పోలీస్స్టేషన్లను నిర్వహిస్తోందని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్న వేళ ఈ వ్యవహారం బయటపడటం గమనార్హం. అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. విదేశాల్లోని తమ దేశస్తులకు పరిపాలనా సేవలను అందించే సర్వీస్ స్టేషన్లే తప్ప, ఇవి పోలీస్స్టేషన్లు కావని చెబుతోంది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో తాజాగా బయటపడిన పోలీస్ స్టేషన్ రామెన్ మాల్లోని ఓ ఫోర్ మొత్తం ఆక్రమించింది. ఇందులో చైనీయులకు పౌరసత్వ పొడిగింపు సేవలను అందిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల చైనీయులను గుర్తించేందుకే వాడుతున్నట్లు అమెరికా న్యా య శాఖ ఆరోపిస్తోంది.చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా..ఏమాత్రం సహించం‘ఈ అప్రకటిత విదేశీ పోలీసు స్టేషన్ అమెరికా సార్వభౌమాధికారానికి అవమానం, ప్రమాదకరం. దీనిని ఏమాత్రం సహించం’అని ఆ శాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ మాథ్యూ ఓల్సెన్ స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో న్యూ యార్క్ గవర్నర్ కార్యాలయంలో పనిచేసే మాజీ ఉద్యోగిని లిండా సన్ చైనా ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించేలా అధికారం దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. అందుకామె ప్రతిఫలాలు అందుకున్నారని తేలింది. గతేడాది చైనా పబ్లిక్ సెక్యూరిటీ శాఖకు సాయం అందిస్తున్నట్లుగా 34 మంది అధికారులను గుర్తించి, కేసులు పెట్టారు. -
సైబర్ దాడుల కలకలం.. మీరు ఈ సంస్థ రౌటర్లను వినియోగిస్తున్నారా?
వాషింగ్టన్: అమెరికాలో సైబర్ సెక్యూరిటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇంటర్నెట్ రౌటర్ల ద్వారా సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో చర్యలు ఉపక్రమించింది. సైబర్ సెక్యూరిటీ దాడులపై అమెరికా అప్రమత్తమైంది. టీపీ-లింక్ టెక్నాలజీ కార్పొరేషన్‌కు చెందిన ఇంటర్నెట్ రౌటర్లు సైబర్ దాడులతో ముడిపడి ఉన్నాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించేందుకు అమెరికా అధికారులు పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే చైనీస్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తమ సంస్థ రూటర్లు ఉన్నాయని తెలిపారు. Mayorkas: “China has, in fact, hacked into our telecommunications providers…and the extent of it is quite serious…and it is still going on.”Their response? Publish a “best practices” document they hope people in positions of responsibility will read.pic.twitter.com/77Pg0tUvYG— Julia 🇺🇸 (@Jules31415) December 18, 2024దేశంలోని వాణిజ్యం, రక్షణ, న్యాయ శాఖలు టీపీ-లింక్ సంస్థపై విచారణ చేసేందుకు రంగంలోకి దిగాయి. అదే సమయంలో డ్రాగన్ దేశానికి చెందిన సదరు సంస్థ అమ్మే టీపీ-లింక్ ఇంటర్నెట్ రూటర్ అమ్మకాలపై బ్యాన్ విధించేలా అధికారులు చర్యలు తీసుకోననున్నట్లు తెలుస్తోంది.సైబర్ దాడులపై అనుమానంతో విచారణ చేపట్టేందుకు అమెరికా ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు కంపెనీ వివరాలు చెప్పేందుకు టీపీ-లింక్ టెక్నాలజీ ఆశ్రయించారు. కానీ ఆ సంస్థ వివరాలు చెప్పలేదని సమాచారం. ఈ పరిణామంతో రక్షణ శాఖ సైతం చైనా కంపెనీ తయారు చేసిన రూటర్లపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. టీపీ-లింక్ రూటర్లను వినియోగిస్తే దేశంలో సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని, వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ అమెరికన్ చట్ట సభ్యులు అధ్యక్షుడు జోబైడెన్‌కు లేఖ రాశారు. అనంతరం జోబైడెన్ చైనా కంపెనీపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
కరోనా ఎఫెక్ట్.. అమెరికా కోసం చైనా భారీ ప్లాన్!
బీజింగ్: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు రకాల ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా కూడా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో టూరిజంపై చైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అమెరికా సహా పలు దేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త పాలసీని తీసుకువచ్చింది.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగిన చైనా.. కరోనా కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. మూడేళ్లపాటు టూరిజం విషయంలో ఒంటరిగానే పోరాడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టూరిజంపై ఫోకస్ పెట్టిన డ్రాగన్ కంట్రీ.. తాజాగా వీసా రహిత రవాణా విధానాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఎక్కువ మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడం, చైనా ఆర్థిక వ్యవస్థను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో భాగంగా.. ఇకపై చైనాకు వెళ్లే విదేశీ ప్రయాణికులు 10 రోజుల వరకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. ఇందులో అమెరికాతో సహా అనేక దేశాల నుంచి విదేశీ ప్రయాణికులు ఉన్నారు. విదేశీ పర్యాటకులు.. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో 10 రోజుల పాటు ఉండేందుకు అనుమతించారు. ఇంతకుముందు, ప్రయాణికులు దేశంలో ఎక్కడ సందర్శించారు అనేది ఆధారంగా 72 గంటల నుంచి 144 గంటలు మాత్రమే ఉండేందుకు అనుమతించేవారు.China's 144-hour visa-free transit policy has continued to fuel the popularity of "China Travel. pic.twitter.com/5OZnLTr5Zi— jasony (@JalisaJackson13) December 18, 2024ఇక, చైనా తీసుకువచ్చిన వీసా రహిత పాలసీ విధానం అమెరికా, కెనడా, అనేక యూరోపియన్, ఆసియా దేశాలతో సహా 54 దేశాలకు వర్తించనుంది. అయితే, ఈ పాలసీ ప్రయోజనాన్ని పొందడానికి విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 10 రోజులలోపు చైనా నుంచి నిష్క్రమించడానికి ధృవీకరించిన టిక్కెట్‌ను కలిగి ఉండాలి. ఈ వీసా పాలసీలో భాగంగా పర్యాటకులు.. రాజధాని బీజింగ్, చైనాలో అతిపెద్ద నగరం షాంఘైతో సహా 24 ప్రావిన్సులలోని 60 ప్రదేశాల నుంచి యాత్రికులు దేశంలోకి ప్రవేశించవచ్చు. దీంతో, అనేక దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్యపరంగా లాభాలను పెంచుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.మరోవైపు.. చైనా విషయంలో అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. కరోనా సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఇజ్రాయెల్-రష్యా యుద్ధంలో చైనా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇటీవల చైనా కోసం ప్రయాణ విధానాన్ని లెవల్-3 నుంచి లెవెల్-2కి తగ్గించింది. ఇదిలా ఉండగా.. అమెరికాను చేరువ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇటీవల చైనా కీలక ప్రకటన చేసింది. కొన్నేళ్లుగా చైనా నిర్బంధంలో ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసింది. అనంతరం, వీసాకు సంబంధిచిన నిర్ణయాన్ని అమలోకి తీసుకువచ్చింది. -
రేపు బీజింగ్‌లో భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల భేటీ
బీజింగ్: సరిహద్దు అంశంపై చర్చించేందుకు భారత్, చైనాల ప్రత్యేక ప్రతినిధులు బుధవారం బీజింగ్ సమావేశమవనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి సేనలు వైదొలిగేందుకు అక్టోబర్ 21న చేసుకున్న ఒప్పందం నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే విషయమై ఈ బృందాలు చర్చించనున్నాయి. 23వ దఫా చర్చలకు చైనా విదేశాంగ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ల సారథ్యం వహిస్తారని చైనా విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. ఈ చర్చల్లో రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. భారత్– చైనాల మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు సమస్యను సమగ్రంగా పరిష్కరించే ఉద్దేశంతో 2003లో ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటి వరకు 22 సార్లు సమావేశమైంది. చివరి సారిగా 2019లో చర్చలు జరిపింది.