
చైనాలోని పలు కంపెనీలు.. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ దేశం మొదటిసారి ఐక్యరాజ్యసమితి మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీస్ యాన్యువల్ ర్యాంకింగ్‌లో టాప్ 10లోకి ప్రవేశించింది. యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని అధిగమించి ఈ రికార్డ్ కైవసం చేసుకుంది.
2011 నుంచి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 78 సూచికల ఆధారంగా 139 ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) సర్వేలో చైనా 10వ స్థానంలో నిలిచింది.
జాబితాలోని టాప్ 10 దేశాలలో.. వరుసగా స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, కొరియా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనా ఉన్నాయి.
ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
జర్మనీ ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని GII కో ఎడిటర్ 'సచా వున్ష్-విన్సెంట్ (Sacha Wunsch-Vincent) అన్నారు. కొత్త ర్యాంకింగ్.. అమెరికాలో ట్రంప్ పరిపాలన విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రతిబింబించలేదని అన్నారు.