United Nation
-
పాలస్తీనాను అదీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం
ది హేగ్: పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అ«దీనంలో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని, అక్కడ స్థిర నివాసానికి కాలనీల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని సూచించింది. 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ అజమాయిషీని తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయం స్థానం తీర్పు ఇవ్వడం అసాధారణ విషయంగా పేర్కొంటున్నారు. వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను నిర్మించడం, విస్తరించడం, ఆక్రమిత ప్రాంతాలను స్వా«దీనం చేసుకోవడం, వాటిపై నియంత్రణ, అక్కడి సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని జడ్జీల ప్యానెల్ అభిప్రాయపడింది. ఆక్రమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్‌కు సార్వ¿ౌమాధికారం లేదని, పాలస్తీనాలోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించడంఅంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని పేర్కొంది. అయితే అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచి్చన ఈ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిన, పాటించాల్సిన అవసరం ఇజ్రాయెల్‌కు లేదు. ఇదొక అభిప్రాయం మాత్రమే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ.. ఆ ప్రాంతాలు యూదు ప్రజల చారిత్రక మాతృభూమిలో భాగమన్నారు. -
ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ ఎలా జరుగుతుంది?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరువైపులా వేలాది మంది ప్రజులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ యుద్ధాన్ని ఆపడం యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారింది. అమెరికా నుంచి బ్రిటన్ వరకు పలు దేశాలు ఇందుకోసం ప్రయత్నించాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్-హమాస్ విషయమై ఒక ప్రతిపాదన వచ్చింది. దీనికి సంబంధించిన ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. ఇంతకీ ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ)లో ఓటింగ్ ఎలా జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో మాదిరిగానే భారత్ ఈసారి కూడా ఐక్యరాజ్య సమితిలోని ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై రూపొందించిన ఈ ప్రతిపాదనలో వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడం, గాజాలోని బాధితులకు ఉపశమనం కల్పించడం, కాల్పుల విరమణ, బందీల విడుదల తదితర అంశాలు ఉన్నాయి. జోర్డాన్ ఈ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఏ దేశమైనా తన ప్రతిపాదనను సమర్పించవచ్చు. దీనిపై ఓటింగ్ జరగాలా వద్దా అనేదానిని యూఎన్ఓ చైర్మన్ నిర్ణయిస్తారు. ప్రతిపాదనను ఆమోదించడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ప్రపంచంలోని 193 దేశాలు ఐక్యరాజ్యసమితిలో సభ్యులుగా ఉన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ కేసులో తీసుకొచ్చిన తీర్మానానికి 120 ఓట్లు వచ్చాయి. అంటే మెజారిటీ వచ్చింది. ఎటువంటి పరిస్థితులనైనా శాంతియుతంగా పరిష్కరించడం కోసం సిఫార్సులు చేయడం యూఎన్జీఏ పని. తీర్మానం ఆమోదం కోసం వచ్చినప్పుడు ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల స్టాండ్ ఏమిటో తెలుస్తుంది. తరువాత యుద్ధంలో పాల్గొన్న దేశానికి నైతిక సందేశం పంపిస్తారు. యూఎన్జీఏ ఏ దేశాన్నీ చట్టబద్ధంగా కట్టడి చేయదు. దీని కోసం యూఎన్ఎస్సీని రూపొందించారు. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు? -
ఏపీ విద్యావ్యవస్థకు అరుదైన గుర్తింపు
-
ఐరాస భద్రతా మండలిలో భారత్.. సభ్యదేశాలదే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రపంచంలో సిసలైన దేశం అంటూ ఏదైనా ఉందంటే అది భారతదేశమేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇండియాను ‘విశ్వ దేశం(కంట్రీ ఆఫ్ ది వరల్డ్)’గా అభివరి్ణంచారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ‘ అంతర్జాతీయంగా బహుళపక్ష వ్యవస్థలో భారత అత్యంత ముఖ్యమైన భాగస్వామి. అయితే ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చే ప్రక్రియలో నా పాత్ర ఏమీ లేదు. సభ్య దేశాలదే తుదినిర్ణయం’ అని గుటెరస్ స్పష్టంచేశారు. ‘ఐరాస భద్రతా మండలిలో, బహుపాక్షిక వ్యవస్థల్లో సంస్కరణలు తప్పనిసరి. అంతర్జాతీయ ఆర్థిక మౌలికస్వరూపం సైతం పాతదైపోయింది. ఇందులోనూ నిర్మాణాత్మకమైన సంస్కరణలు జరగాలి. అంతర్జాతీయ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను అవి తీర్చాలి. యుద్ధాలు, సంక్షోభాలతో కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఓవైపు పేదరికం, ఆకలి, అసమానతలు పెరుగుతుంటే మరోవైపు సహానుభూతి, సంఘీభావం తెలిపే గుణం తగ్గిపోతున్నాయి. మంచి కోసం అందరం కలిసికట్టుగా ముందడుగువేద్దాం’ అంటూ జీ20 దేశాలను గుటెరస్ కోరారు. సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్– రష్యా శాంతి ఒప్పందం వాస్తరూపం దాలుస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచం కోరుకునే గణనీయమైన మార్పుల సాధనకు భారత జీ20 సారథ్యం సాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ ప్రపంచం ఒక వసుధైక కుటుంబంలా మనగలగాలంటే ముందుగా మనం ఒక్కటిగా నిలుద్దాం. ప్రపంచం ఇప్పుడు కీలకమైన మార్పు దశలో ఉంది. భవిష్యత్ అంతా భిన్న ధ్రువ ప్రపంచానిదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
సాక్షి రిపోర్టింగ్ ఫ్రం ఐక్యరాజ్యసమితి
అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాలను సాక్షి మీడియా గ్రూప్ తరపున కవర్ చేశారు మంగ వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి. మన దేశం నుంచి ఈ అవకాశం దక్కిన అతి కొద్ది మందిలో వెంకన్న ఒకరు. తెలుగు మీడియాలో వెంకన్న మాత్రమే ఈ అవకాశం అందుకోగలిగారు. నల్గొండ జిల్లా నుంచి చిన్న విలేకరిగా ప్రస్థానం ప్రారంభించి.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలో ఏకంగా ఐక్యరాజ్యసమితి ఈవెంట్‌ను కవర్ చేయడం జర్నలిస్టుగా వెంకన్న సాధించిన విజయం. కవరేజ్ గురించి వెంకన్న మాటల్లోనే.. "హై-లెవల్ పొలిటికల్ ఫోరమ్ 2023 సమావేశాల్లో సుస్థిర అభివృద్ధి ఎజెండాగా ఉన్నత స్థాయి రాజకీయ వేదిక (HLPF) ఆర్థిక, సామాజిక మండలి ఆధ్వర్యంలో జూలై 10, సోమవారం నుండి 19 జూలై 2023 వరకు జరిగిన సమావేశాలను కవర్ చేయడం నా జర్నలిజం కెరియర్లో దక్కిన అతి పెద్ద అదృష్టం" ప్రపంచ మేధావుల విలువైన పాఠాలు UN కౌన్సిల్ యొక్క ఉన్నత-స్థాయి విభాగంలో భాగంగా సస్టైనబిలిటీ ప్రధాన అజెండా ఫోరమ్ యొక్క మూడు రోజుల మంత్రివర్గ ECOSOC యొక్క ఉన్నత-స్థాయి సెగ్మెంట్ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేశాను. "కరోనా వైరస్ వ్యాధి (COVID-19) నుండి ప్రపంచ రికవరీని వేగవంతం చేయడం, అన్ని స్థాయిలలో సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను పూర్తిగా అమలు చేయడం ఎజెండాగా ఈ సమావేశాలు జరిగాయి. ముఖ్య అజెండా లో పేర్కొన్న అంశాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాను. ఒక్కో భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో ఒక్కొక్కరు వినూత్నమైన, విలువైన విషయాలు ఎన్నో చెప్పారు. (వరల్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చే జర స్టవ్ తో UN స్పెషల్ కన్సల్టేటివ్ మెంబర్ షకీన్ కుమార్) ఎడ్యుకేషన్ లో ఏపీ.. ది బెస్ట్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం హై లెవెల్ పొలిటికల్ ఫోరంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు స్టాల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా జెండర్ ఈక్వాలిటీ, బాలికల విద్య కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రయోజనాల వివరాలను స్టాల్ రూపంలో ఏర్పాటు చేశారు. హయ్యర్ ఎడ్యుకేషనల్ సస్టైనబులిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రాం హై లెవెల్ పొలిటికల్ ఫోరం కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థికి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానాన్ని అందిస్తున్నారని ఏపీ ప్రతినిధులు ప్రజెంట్ చేశారు. ఈ స్టాల్ ను సందర్శించిన వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి సభ్యులు విద్యావేత్తలను నేను జర్నలిస్టుగా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆయా దేశాల్లో అనుసరిస్తున్న తీరు, విద్యావిధానాలను తెలుగు ప్రజలకు చెప్పే అవకాశం వచ్చింది. నాడు-నేడు స్టాల్ గురించి తెలుసుకున్న పలువురు విదేశీ విద్యావేత్తలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావిధానాన్ని ప్రశంసించినప్పుడు తెలుగోడిగా గర్వపడ్డాను. ఐక్యరాజ్యసమితి ఆశయాలు భుజాల మీద వేసుకొని పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు, నవరత్నాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతను ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలు140 దేశాల నుండి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో వివరించడం సంతోషం కలిగింది. (కొలంబియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాధికా అయ్యంగార్ ) అమెరికాకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సెప్టెంబర్‌లో జరిగే అమెరికా పర్యటన సందర్భంగా కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాధిక అయ్యంగార్ను కలిశాను. ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్‌తో కలిసి రాధిక అయ్యంగార్తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుగు పాఠకులకు అందించగలిగాం. ప్రపంచ ఐక్యత కోసం, దేశాల మధ్య సమస్యల పరిష్కారం, ప్రపంచ శాంతి కోసం, పౌర హక్కుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఒక రకంగా ప్రతీ ఒక్కరికి ఎన్నో పాఠాలు చెబుతుంది. అనుభవాలు గొప్పగా అనిపించాయి. మంగా వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి -
అన్నా.. ఇది పద్ధతి కాదే.. పవన్ కళ్యాణ్ కు అభిమాని చురకలు
పవన్ కళ్యాణ్.. నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రతీ సారి చెప్పుకునే పీకే.. ఇప్పుడు పనికిరాని ప్రశ్నలు వేసి నవ్వులపాలవుతున్నాడు. తనకు తెలియని విద్యావిధానం గురించి, ఇంకెవరో రాసిచ్చిన ప్రశ్నలను అనుసంధానం చేసి.. దాన్ని సోషల్ మీడియా వేదికగా సంధించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్న పవన్ ప్రయత్నం పాపం.. బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాలు భేష్ ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన పథకాలకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జులై మూడో వారంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ డిస్కషన్ మీట్ సందర్భంగా ఏపీ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రంలో చేపడుతున్న విద్యావిధానాలను ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రజెంట్ తీసుకొచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే విద్యకు మించిన విధానం మరొకటి లేదన్న సీఎం జగన్ ఆశయానికి పలు ప్రశంసలు వచ్చాయి. (ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విద్యావిధానాలపై స్టాల్) (చదవండి : ఏపీ విద్యావిధానాలు భేష్) విద్యార్థులకిచ్చిన ట్యాబ్లెట్లపై అక్కసు ఏపీ విధానాలను అందరూ ప్రశంసిస్తుంటే.. కొందరిలో మాత్రం అక్కసు మొదలైంది. అసలు పేద విద్యార్థులకు ట్యాబ్‌లు ఎలా ఇస్తారన్నట్టుగా వీరి వ్యవహారం తయారయింది. విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ట్యాబ్‌లు ఉపయోగపడుతాయన్న కనీస స్పృహ లేకుండా.. దానిపై చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు జోడించి, కొన్ని ప్రశ్నలను ట్విట్టర్ వేదికగా వదిలారు పవన్ కళ్యాణ్. Points to note : 1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది. 2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి… — Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023 సొంత అభిమాని నుంచే పవన్ కు ప్రశ్న పవన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అయితే వారంతా ప్రభుత్వానికి చెందిన వారని, వైఎస్సార్ సిపి క్యాడర్ అని జనసేన చెప్పుకోవచ్చు కానీ.. పవన్ ట్వీట్‌కు సొంత అభిమాని రమేష్ బోయపాటి నుంచి ఎదురయిన విమర్శను మాత్రం కచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. మీ సినిమాలు చూస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను కానీ, పేద విద్యార్థులకు మేలు చేసే విద్యావిధానాన్ని విమర్శిస్తే మాత్రం మౌనంగా ఉండలేనంటూ నేరుగా స్పందన వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానంలో కచ్చితంగా సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనంటూ నొక్కి వక్కాణించారు రమేష్ బోయపాటి. పవన్ కళ్యాణ్ గారు బైజూస్ తో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మీరు లేవనెత్తిన సందేహాలు విలువైనవి. ఇక్కడ మీ ట్వీట్ ఉద్దేశం బైజూస్ తో ఒప్పందం గురించి కన్నా, ఆ ఒప్పందంలో ఉన్న అనేక సందేహాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం అనిపించింది. నేను కూడా ఈ విషయం గురించి అవగాహన ఏర్పరుచుకునే… pic.twitter.com/thDcCgldYM — Ramesh Boyapati (@rameshboyapati) July 24, 2023 -
బాలల సంరక్షణకు భారత్ చర్యలు భేష్
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయంగా భారత్‌కు మరో శుభపరిణామమిది. చిన్న పిల్లలు సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ (యూఎన్ఎస్జీ) వార్షిక నివేదిక నుంచి భారత్ పేరును తొలగించినట్టుగా యూఎన్ సెకట్రరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తెలిపారు. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారుల మెరుగైన సంరక్షణ కోసం భారత్ తీసుకున్న చర్యల్ని గుటెరెస్ స్వాగతించారు. 2010 నుంచి భారత్ పేరు ఈ నివేదికలో ఉంటూ వస్తోంది. కశ్మీర్లో ఉగ్రసంస్థలు బాలలను నియమించడం, భద్రత పేరుతో సైనికులు తిరిగి అదుపులోకి తీసుకోవడం వంటివాటితో భారత్ పేరు ఆ నివేదికలో ఉంటూ వస్తోంది. భారత్‌తో పాటు బుర్కినా ఫాసో, కేమరూన్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిఫ్పీన్స్లోనూ చిన్నారులు ఉగ్రముఠాల్లో చేరుతున్నట్టు యూఎన్ నివేదికలు చెబుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు కశ్మీర్లో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడంపై గుటెరెస్ హర్షం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలతో ఛత్తీస్‌గఢ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, జమ్ముకశ్మీర్‌లలో బాలల సంరక్షణ మెరుగైందని ఆ నివేదిక వెల్లడించింది. -
కాంగోలో వరదల బీభత్సం..200 మందికిపైగా మృతి
ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దక్షిణ ప్రావిన్స్‌లోని కలేహలో నదులు వరదలతో పోటెత్తాయి. దీంతో బుషుషు, న్యాముకుబి వంటి గ్రామాలను ముంచెత్తింది. ఈ వరదల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 మందికిపైగా మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 203 మృతదేహాలను గుర్తించినట్లు సివిల్ సొసైటీ సభ్యుడు కసోల్ మార్టిన్ చెప్పారు భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లోని నదులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలు మునిగిపోయాయని, చాలా ఇళ్లు కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఈ మేరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెనిస్ ముక్వేగే ప్రకృతి విపత్తులో నిరాశ్రయులైన ప్రజలకు తక్షణ వైద్య సాయం అందించేలా వైద్యులను, సాంకేతిక నిపుణలను ఆయా ప్రాంతాలకు పంపినట్లు ప్రకటించారు. ఐతే రువాండ సరిహద్దులో ఉన్న దక్షిన కిపులో తరచుగా వరదలు, కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణమని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ వారం రువాండాలో భారీ వర్షాలకు వరదలు సంభవించి.. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 130 మంది దాక మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ విధ్వంసంలో ఐదువేలకు పైగా గృహాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రువాండ, కాంగోలో సంభవించిన ప్రకృతి విపత్తులకు ప్రభావితమైన ప్రజలకు యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ తన సంతాపాన్ని తెలియజేశారు. గ్లోబల్ వార్మింగ్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోని దేశాలకు ఇదోక వినాశకరమైన ఉదాహరణ అని పేర్కొంది. వేగవంతమైన వాతావరణ మార్పులకు ఇదొక మచ్చుతునక అని స్పష్టం చేసింది. కాగా, 2014లో కూడా కాంగో ఇంతే స్థాయిలో ప్రకృతి విపత్తుని ఎదర్కొన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. నాటి విధ్వంసంలో సుమారు 130 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యినట్లు యూఎన్ పేర్కొంది. (చదవండి: చైనా తమ దేశంలోని పేదరికం గురించి బయటకు పొక్కనీయదు..ఆఖరికి ఆన్లైన్ వీడియోలను) -
పర్యావరణానికి ‘లైఫ్’
కెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది. ప్రధాని మోదీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ సంయుక్తంగా మిషన్ లైఫ్(లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ను ప్రారంభించారు. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దీనిని ప్రపంచ దేశాల ప్రజల్లోకి ఒక ఉద్యమంలా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర గురువారం లైఫ్ మిషన్‌ను ప్రారంభించారు. ప్రజలు లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సిన జాబితాతో పాటు లైఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ మిషన్ పీ3 మోడల్ అని ప్రో ప్లేనెట్, పీపుల్‌గా వ్యాఖ్యానించారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్’ విధానాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజలు చేయాల్సిందిదే..! ప్రతీ రోజూ ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లడానికి పెట్రోల్‌తో నడిచే బైక్, కారు వంటి వాహనాన్ని వాడే బదులుగా సైకిల్‌పై వెళ్లడం మంచిదన్నారు. ఎల్ఈడీ బల్బులు వాడితే విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధాని హితవు పలికారు. ఇలాంటివన్నీ ప్రజలందరూ మూకుమ్మడిగా పాటిస్తే ప్రపంచ దేశ ప్రజలందరి మధ్య ఐక్యత పెరుగుతుందని మోదీ చెప్పారు. ప్రకృతి వనరుల్ని అతిగా వాడొద్దు : గుటెరస్ ప్రకృతి వనరుల్ని అతిగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–20 దేశాలు 80 శాతం గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుటెరస్ గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతీ ఒక్కరి అవసరాలు తీర్చే వనరులు ఈ భూమిపై ఉన్నాయి. కానీ అందరి అత్యాశలను నెరవేర్చే శక్తి భూమికి లేదు. దురదృష్టవశాత్తూ ఇవాళ రేపు ప్రతీ ఒక్కరూ అత్యాశకి పోతున్నారు. దానిని మనం మార్చాలి’’ అని కొన్ని దశాబ్దాల కిందటే గాంధీజీ చెప్పారని ఇప్పటికీ అది అనుసరణీయమని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకువచ్చిన ఈ కార్యాచరణని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. -
World Refugee Day: బతుకు జీవుడా
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో శరణార్థి సంక్షోభం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా సైన్యం నుంచి ఏ క్షణం ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని కట్టుబట్టలతో కన్న భూమిని విడిచి వెళ్లిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికేడాది పెరిగిపోతున్న శరణార్థుల్ని చూసే దిక్కు లేక దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. శరణార్థుల దుస్థితిపై అవగాహన కల్పించడానికి, వారిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడాది జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినం నిర్వహిస్తోంది. 10 కోట్లు.. అక్షరాలా పది కోట్లు మంది ప్రపంచవ్యాప్తంగా.. ఉన్న ఊరుని విడిచి పెట్టి మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయారు. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్) తేల్చిన లెక్కలు ఇవి. యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆకలి కేకలు, అణచివేత, హింసాకాండ, మానవహక్కుల హననం వంటి కారణాలు దశాబ్ద కాలంగా శరణార్థుల సంఖ్యను పెంచేస్తున్నాయి. కరోనా సంక్షోభం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో బలవంతంగా వలస బాట పట్టినవారు ఎందరో ఉన్నారు. ఏటికేడు శరణార్థుల సంఖ్య ఎలా పెరుగుతోందంటే వీళ్లందరూ ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే అది ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన 14వ దేశంగా అవతరిస్తుంది. అందులోనూ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.9 కోట్ల మంది శరణార్థులు ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వారి సంఖ్య 10 కోట్లు దాటేసింది ప్రపంచాన్ని కుదిపేసిన సంక్షోభాలు ఉక్రెయిన్ ఉక్రెయిన్‌పై రష్యా ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి చేస్తున్న భీకరమైన దాడులతో ఇప్పటివరకు 50 లక్షల మందికిపైగా శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఇక అంతర్గతంగా చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయిన వారు 80 లక్షల మంది వరకు ఉంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థి సంక్షోభం రికార్డు స్థాయికి చేరుకుంది ఇప్పుడే. పోలండ్, రష్యా, రుమేనియా వంటి దేశాలు ఉక్రెయిన్ శరణార్థులను అక్కున చేర్చుకుంటున్నాయి. వారి అవసరాలు తీరుస్తున్నాయి. సిరియా దాదాపుగా పదేళ్ల పాటు అంతర్యుద్ధంతో నలిగిపోయిన సిరియాలో 2021 చివరి నాటికి 67 లక్షల మంది సిరియన్లు శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టు, టర్కీ దేశాల్లో వీరంతా బతుకులీడుస్తున్నారు. అఫ్గానిస్తాన్ ఈ దేశం నుంచి నిరంతరం శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లేవారు చాలా ఎక్కువ. ప్రతీ పది మందిలో ఒకరు అక్కడ జీవనం సాగించలేక ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. కనీసం 26 లక్షల మంది శరణార్థి శిబిరాల్లోనే పుట్టారు. సూడాన్ దక్షిణ సూడాన్‌లో నిరంతర ఘర్షణలతో ఇల్లు వీడి వెళ్లిన వారి సంఖ్య 40 లక్షలు ఉంటే, 26 లక్షల మంది దేశం విడిచి వేరే దేశాలకు వెళ్లిపోయారు. మయన్మార్ మయన్మార్‌లో రోహింగ్యాలను మైనార్టీల పేరుతో ఊచకోత కోస్తూ దేశం నుంచి తరిమి కొట్టడంతో ఏకంగా 10 లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ఆదుకోవడం ఎలా? శరణార్థులుగా ఇతర దేశాలకు వెళుతున్న వారికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించడానికి ఆయా దేశాలు ఎంతో చేస్తున్నాయి. కానీ కేవలం అవి చేస్తే సరిపోవు. వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, కుటుంబం , స్థిరత్వం అన్నింటికంటే గుర్తింపు కూడా అత్యంత ముఖ్యం. ఇల్లు, దేశం విడిచి వెళ్లిన శరణార్థి ఇతర దేశాల్లో స్థిరపడడానికి కనీసం 20 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత. శరణార్థులు కొత్త జీవితం గడపడానికి అవసరమైన నిధులు అందడం లేదు. ప్రతీ ఏడాది మానవీయ సంక్షోభాలు లెక్కకు మించి వస్తూ ఉండడంతో కనీసం వెయ్యి కోట్ల డాలర్లు (రూ.77,000 కోట్లు) లోటు ఉంది. యెమెన్, అఫ్గానిస్తాన్, సూడాన్‌లో శరణార్థులుగా మారిన వారిలో మూడో వంతు మందికి కూడా సాయం అందలేదని యూఎన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ కాకుండా నిత్యం శరణార్థుల్ని పుట్టించే 30 ఘర్షణాత్మక ప్రాంతాలు ప్రపంచంలో ఉన్నాయి. శరణార్థుల్లో సగానికి సగం మంది పిల్లలే ఉండడం ఆందోళనకరం. వారిలో ఒక్క శాతం మందికి కూడా సాయం అందడం లేదు. సంపన్న దేశాలు ఇకనైనా శరణార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
అణు నిఘాను ఇరాన్ అడ్డుకుంటోంది
వియెన్నా: అణు కేంద్రాల వద్ద ఉన్న నిఘా కెమెరాలను ఇరాన్ తొలగించడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఈఏ పర్యవేక్షణ కోసం నతాంజ్ భూగర్భ అణు శుద్ధి కేంద్రం వద్ద బిగించిన రెండు కెమెరాలను ఆఫ్ చేసినట్లు బుధవారం ఇరాన్ ప్రకటించింది. యురేనియం శుద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు కూడా ఇరాన్ ఐఏఈఏకి సమాచారం అందించింది. అగ్రరాజ్యాలతో జరుగుతున్న అణు చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకే ఇరాన్ ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. దేశంలోని మూడు అప్రటిత ప్రాంతాల్లో కనుగొన్న అణుధార్మిక పదార్ధాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందించడంలో విఫలమైందంటూ ఇరాన్‌ను బుధవారం ఐఏఈఏ తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఐఏఈఏలోని 35 దేశాలకు 30 బలపరిచాయి. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయగా లిబియా, పాకిస్తాన్, భారత్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానోవియెన్నాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్ అధికారులు నతాంజ్, ఇస్ఫాహాన్‌ల వద్ద ఉన్న రెండు మాత్రమే కాదు, మొత్తం 40కి పైగా కెమెరాలకు గాను 27 కెమెరాలను మూసేసినట్లు సమాచారం ఉందన్నారు. ఈ చర్యతో ఇరాన్ అణు కార్యక్రమం పురోగతి వివరాలు అంతర్జాతీయ సమాజానికి వెల్లడయ్యే అవకాశం లేదన్నారు. అణుకేంద్రాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఇరాన్ 2021 నుంచే ఐఏఈఏకి అందించడం మానేసింది. -
సమీపంలో మహా సంక్షోభం
ఉత్తరాదిన భానుడి చండప్రతాపం 50 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే గడచిన 122 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా ఈ మార్చి, ఏప్రిల్‌లలో ఉష్ణోగ్రత. దక్షిణాదిన బెంగుళూరులో గంటల వ్యవధిలో ఒక్కపెట్టున కురిసిన వర్షంతో తిప్పలు. అస్సామ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, భూపతనాలు. ఎండ, వాన, చలి – అన్నీ అతిగానే! ఏదైనా అకాలమే!! ఈ శతాబ్దంలో భారత్ ఎదుర్కొంటున్న పెను ముప్పు వాతావరణ సంక్షోభం అని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నది అందుకే! ప్రపంచ వ్యాప్తం గానూ ప్రధాన సమస్యలు – వాతావరణ మార్పులు, కాలుష్యమే. ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదికలు ఆ మాటే చెబుతున్నాయి. వాతావరణ మార్పునకు ప్రధాన సూచికలైన నాలుగూ (గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత, సముద్ర మట్టంలో పెరుగుదల, మహాసముద్రాల వేడిమి, ఆమ్లీకరణ) గత ఏడాది రికార్డు స్థాయిలో పెరిగాయి. మానవాళి మహా సంక్షోభం దిశగా వెళుతోంద నడానికి ఇదే సాక్ష్యమంటూ ఐరాస ప్రమాద ఘంటిక మోగిస్తోంది. ఒక రకంగా ఐరాస విడుదల చేసిన వాతావరణ రిపోర్ట్ కార్డు ఇది. దీన్ని బట్టి చూస్తే, ఉష్ణోగ్రతను పెంచే గ్రీన్హౌస్ వాయువుల స్థాయి ప్రపంచమంతటా 2020లోనూ, ఆ వెంటనే 2021లోనూ పెరుగుతూ పోయింది. పారిశ్రామికీకరణ ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత ఏకంగా 149 శాతం హెచ్చింది. ఇక, సముద్రమట్టం ఏటా సగటున 4.5 మి.మీ. వంతున పెరుగుతోంది. మహా సముద్రాల ఉష్ణోగ్రత, ఆమ్లీకరణ సైతం ఎక్కువవుతూ వస్తోంది. దీని వల్ల పగడాల దిబ్బలలాంటి నీటిలోని జీవావరణ వ్యవస్థలు, ప్రాణికోటి నాశనమవుతాయి. కాలుష్యం సంగతికొస్తే – వాయు, జల, రసాయన తదితర కారణాలతో ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మరణించారు. ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ బుధవారం బయటపెట్టిన ఈ లెక్క ప్రకారం ప్రతి 6 మరణాల్లో ఒకటి కాలుష్య మరణమే. ఈ మొత్తంలో దాదాపు 24 లక్షల చావులు భారత్‌లో సంభవించినవే. ప్రపంచ కాలుష్య మరణాల్లో 66.7 లక్షల ప్రధాన వాటా వాయు కాలుష్యానిది. మన దేశంలోనూ కాలుష్య కోరలకు బలైన 24 లక్షల మందిలో... 16.7 లక్షల మంది పీల్చే గాలే ప్రాణాంతకమైనవారు. ఆ లెక్కన భారత్‌లో వాయు కాలుష్య మరణాల సంఖ్య ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ. భారత్‌లోనే కాదు... ప్రపంచమంతటా ఉగ్ర ఉష్ణపవనాలు, తుపానులు, అకాల వర్షాలు, కొన్నిచోట్ల అనావృష్టి, సముద్రమట్టాల పెరుగుదల ఊహించని రీతిలో తరచుగా సంభవిస్తున్నాయి. వీటికి కాలుష్యం, పర్యావరణ మార్పులే కారణమన్నది శాస్త్రవేత్తల విశ్లేషణ. దేశంలో ఇవాళ 63.8 కోట్ల జనాభాకు ఆవాసమైన 75 శాతానికి పైగా జిల్లాలు ఈ విపరీత వాతావరణ మార్పులకు కేంద్రాలట. ఇలాంటి వాతావరణ వైపరీత్యాలు 1970 నుంచి 2019 మధ్య 50 ఏళ్ళలో 20 రెట్లకు పైగా పెరిగాయి. భారతీయ మేధావుల బృందమైన ‘కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’ (సీఈఈడబ్లు్య) తన అధ్యయనంలో ఈ సంగతి తేల్చింది. ఇది పైకి కనిపించకుండా శ్రామికశక్తినీ, ఆర్థిక వ్యవస్థనూ కూడా దెబ్బతీస్తున్న విషవలయం. ఏ ఏటికాయేడు పెరుగుతున్న వైపరీత్యాలతో ఇటు పట్నాల్లో, అటు పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. జీవనోపాధి పోతోంది. స్వయంకృతాపరాధమైన వాతావరణ వైపరీత్యాలతో భారీ సామాజిక ఆర్థిక మూల్యం చెల్లిం చాల్సి వస్తోంది. పెరుగుతున్న వేడిమి వల్ల వ్యావసాయిక ఉత్పత్తి క్షీణిస్తోంది. ఏటా 2.5 నుంచి 4.5 శాతం స్థూల జాతీయోత్పత్తిని నష్టపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ఐఎల్ఓ) లెక్క ప్రకారం ఉష్ణతాపంతో తీవ్రంగా దెబ్బతింటున్న దేశాల్లో భారత్ ఒకటి. వేడిమి వల్ల 1995లో దేశంలో 4.3 శాతం పని గంటలు వృథా అయ్యాయి. వచ్చే 2030 నాటికి ఆ వృథా 5.8 శాతానికి చేరుతుందని అంచనా. దేశంలో గోధుమల ధర పెరగడానికీ పరోక్షంగా వాతావరణ మార్పులే కారణం. ఈ వేసవిలో ఉష్ణపవనాలతో 10 నుంచి 15 శాతం గోధుమ పంట నష్టపోయాం. అదే సమ యంలో ప్రపంచ గోధుమల ఎగుమతిలో ప్రధాన పాత్రధారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో సరఫరా చిక్కుల్లో పడింది. గో«ధుమ పిండి ఖరీదైపోయి, సామాన్యుల చపాతీలపై దెబ్బ పడింది. ఇలాంటి ఉదాహరణలు అనేకం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నీటి భద్రత పైనా ప్రభావం చూపనున్నాయి. మరి, నీటి లభ్యతను కాపాడుకోవడంలో, నిల్వ చేసుకోవడంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నాం? తాత్కాలిక పరిష్కారాలతో సమస్య తీరేది కాదు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు విధానపరమైన మార్పులు తప్పనిసరి. పునర్వినియోగ ఇంధనం దిశగా మళ్ళాలి. వేడిని పెంచే ఏసీలు, కార్ల బదులు గాలి – వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్ళు, చల్లటి మిద్దెలు, హరితవనాల పెంపకం, అనువైన పౌర రవాణా వ్యవస్థలను ఆశ్రయించాలి. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కీలకం. నిజానికి ప్రతి రాష్ట్రంలో వాతావరణ మార్పును పర్యవేక్షించే సెల్ ఉంది. వాటన్నిటికీ పెద్దగా ప్రధాన మంత్రికి వాతావరణ మార్పుపై సలహాలిచ్చే కౌన్సిల్ కూడా ఉంది. కానీ, 2015 జనవరిలో తొలి సమావేశం తర్వాత మళ్ళీ ఇప్పటి దాకా సదరు కౌన్సిల్ కలిస్తే ఒట్టు. అలాగే, అన్ని రాష్ట్రాల్లోని సెల్స్‌ను కూడా పట్టించుకుంటున్న పాపాన పోలేదు. ప్రకృతి పెనుకేక పెడుతోంది. చెవి ఒగ్గకపోతే ముప్పు మనకీ, మన పిల్లలకే! -
చదవడమే మొదలు...
ఒకరోజు ఆన్ మోర్గాన్ తన బుక్‌షెల్ఫ్ చూసుకుంది. సుమారు ఇరవై ఏళ్ల గొప్ప కలెక్షన్ అది. కానీ ప్రధానంగా అన్నీ ఇంగ్లిష్, నార్త్ అమెరికన్ పుస్తకాలే. ఈ లండన్ నివాసికి ఏమాత్రమూ సంతృప్తి కలగలేదు. ‘ఇరవై ఏళ్లుగా చదువుతున్నానే! కానీ ఒక విదేశీ భాషా పుస్తకాన్ని నేను దాదాపుగా ముట్టుకోనేలేదు’ అనుకుంది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది, ప్రపంచంలోని దేశాలన్నింటికీ సంబంధించి కనీసం ఒక్క పుస్తకమైనా చదవాలని. ఐక్యరాజ్య సమితి గుర్తింపున్న 193 దేశాల జాబితా చూసుకుని తన యజ్ఞం మొదలుపెట్టింది. దీన్ని యజ్ఞం అనడం ఎందుకంటే, వీటన్నింటినీ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల! ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటంటే– అన్ని దేశాల పుస్తకాలు సంపాదించాలి; డబ్బు, శ్రమ. ఒక దేశానిది ఒకటే అనుకున్నప్పుడు ఏది ఎంపిక చేసుకోవాలనే సమస్య ఉండనే ఉంది. క్లాసిక్స్, జానపదాలు, సమకాలీన సాహిత్యం, నవలలు, కథాసంపుటాలు, ఆత్మకథలు, బెస్ట్ సెల్లర్స్... ఎలా వడపోయాలి? జపాకు ప్రాతినిధ్యం వహించగలిగే పుస్తకం ఏది? ఏది చదివితే కువైట్ సరిగ్గా అర్థమవుతుంది? ఉత్తర కొరియా నుంచి ఎలాంటిది తీసుకోవాలి? ఏది చదివితే తోగో పరిచయం అవుతుంది? ఖతార్‌కు చేరువ కాగలిగే పుస్తకం ఏది? వీటన్నింటినీ మదిలో ఉంచుకుని, స్నేహితులు, తెలిసినవాళ్లు, ఔత్సాహికుల సాయంతో పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టింది. అసలైన సమస్య ఇంకోటుంది. రోజువారీ పనులు మన కోసం ఆగవు. మోర్గాన్ వృత్తిరీత్యా పాత్రికేయురాలు. ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యం చేరాలంటే, అటూయిటుగా ఒక్కో పుస్తకం 200–300 పేజీలు ఉంటుందనుకుంటే, 1.85 రోజులో పుస్తకం చదివెయ్యాలి. చదవడంతోపాటు చిన్న సమీక్ష రాయాలనుకుంది. ఆ పుస్తకం ఎలాంటిదో చెబుతూ తన పఠనానుభవాల్ని కూడా జోడిస్తూ బ్లాగ్ రాసుకుంటూ పోయింది. భూటాన్, బెలారస్, మంగోలియా, బురుండి, మొజాంబిక్ లాంటి ఎన్నో దేశాల పుస్తకాలు ఆమె జాబితాలో ఉన్నాయి. ఇంతకీ భారత్ నుంచి ఏం తీసుకుంది? పదేళ్లు చదివినా భారతీయ వైవిధ్యభరిత సారస్వత వైభవపు ఉపరితలాన్ని కూడా చేరలేనని తనకు తెలుసంటుంది మోర్గాన్ . కానీ లెక్క కోసం ఎం.టి.వాసుదేవన్ నాయర్ మలయాళీ నవల ‘కాలం’ తీసుకుంది. అది ఆమెకు గొప్పగా నచ్చింది కూడా! తన పఠనానుభవాలన్నింటినీ కలిపి 2015లో ‘ద వరల్డ్ బిట్వీన్ టు కవర్స్: రీడింగ్ ద గ్లోబ్’ పుస్తకంగా ప్రచురించింది. గతేడాది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్ లీ కూడా ఇలాంటి పనే చేసింది. కాకపోతే ఆమె ప్రయోగం వేరు. కోవిడ్ మహమ్మారి మొదలైన కొత్తలో బయటికి వెళ్లలేని జీవితంతో విసుగెత్తి ఆన్ లైన్ జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంది. దానికిగానూ తనలాంటి వారందరినీ ఆహ్వానిస్తూ, లియో టాల్‌స్టాయ్ మహానవల ‘యుద్ధము–శాంతి’ని సామూహిక పఠనం చేద్దామని పిలుపునిచ్చింది. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం, మొత్తంగా 85 రోజుల్లో వెయ్యికి పైగా పేజీల నవల పూర్తయ్యింది. తన పఠనానుభవాలను ‘టాల్‌స్టాయ్ టుగెదర్: 85 డేస్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పేరుతో పుస్తకంగా రాసింది లీ. ఇరాకు చెందిన ప్రొఫెసర్ అజర్ నఫీసీ అనుభవం దీనికి భిన్నమైనది. ఆమె ‘రీడింగ్ లోలిటా ఇన్ తెహ్రాన్ ’ పేరుతో 2003లో పుస్తకం ప్రచురించింది. ఛాందస ప్రభుత్వంలో తనలాంటి ఉదారవాది ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజెప్పడమే రచన లక్ష్యం అయినప్పటికీ పుస్తకాల ఊతంగా తన అనుభవాలను చెప్పడం ఇందులోని విశేషం. కొన్ని పాశ్చాత్య రచనలను గురించి తన విద్యార్థులతో చర్చించే నేపథ్యంలో ఈ రచన సాగుతుంది. ఇందులో చర్చకు వచ్చే కొన్ని పుస్తకాలు: మదామ్ బావరీ(ఫ్లాబే), ద గ్రేట్ గాట్స్బీ(ఫిట్జ్‌గెరాల్డ్), ద డైరీ ఆఫ్ ఆన్ ఫ్రాంక్, ద ట్రయల్ (కాఫ్కా), ద అడ్వెంచర్స్ ఆఫ్ హకల్‌బెరీ ఫిన్ (మార్క్ ట్వెయిన్ ). మానవ లైంగికతను ప్రధానంగా చేసుకొన్న నబకోవ్ నవల ‘లోలిటా’ కూడా ఇందులో ఉంది. దాన్నే పుస్తక శీర్షికగా ఎంచుకోవడానికి కారణం – ఇరాన్ లాంటి దేశంలో ఉండే పరిమితులు, పరిధులు, ఆంక్షలను తెలియజెప్పడానికే! పుస్తకాన్ని రాయడం గొప్పనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ దాన్ని చదవడంలో కూడా గొప్పతనం తక్కువా? ఒక వెయ్యి పేజీల మహత్తర గ్రంథరాజాన్ని చదవడం తక్కువ ప్రయత్నంతో కూడినదా? పైగా దాన్ని చదవడం వల్ల కూడా రచయిత అనుభవాన్ని జీవించగలుగుతున్నప్పుడు, ఉత్త పాఠకులుగానే మిగిలిపోతే మాత్రమేం? పైగా రచయిత పడే శ్రమ కూడా తప్పుతుంది. కానీ మోర్గాన్ లాంటి కొందరు పాఠకులు, కేవలం వారి పఠనానుభవం కారణంగా రచయితగా మారగలిగారు. ‘మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ రాసినప్పుడు, పాత్రికేయుడు కల్లూరి భాస్కరం ప్రధాన వనరు–శీర్షిక సూచిస్తున్నట్టుగా మహాభారతమే! ఇందులోని పరిశోధనా పటిమను తక్కువ చేయడం కాదుగానీ ప్రాథమికంగా అది ఒక సీరియస్ పాఠకుడు మాత్రమే చేయగలిగే వ్యాఖ్యానం. అలాగే ‘కన్యాశుల్కం పలుకుబడి’ని వివరిస్తూ మరో జర్నలిస్ట్ మందలపర్తి కిశోర్ గురజాడ పదకోశమే వెలువరించారు. సరిగ్గా చదవడానికి పూనుకోవాలేగానీ ప్రతి పుస్తకంతోనూ ప్రపంచాన్ని దర్శించవచ్చు; అలాగే ప్రతి పుస్తకంతోనూ ప్రపంచానికి పరిచయం కూడా కావొచ్చు. ఏ రచయితైనా పాఠకుడిగానే తన కెరియర్ను మొదలుపెడతాడని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా! ఇప్పుడు మీ చేతిలో ఏ పుస్తకం ఉంది? -
ఐరాసలో రష్యా దౌత్యాధికారుల బహిష్కరణ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు చెందిన 12 మంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. వీరంతా గూఢచర్య కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని ఆరోపించింది. అమెరికాది రెచ్చగొట్టే చర్యన్న రష్యా, ఐరాసకు కేంద్రకార్యాలయం ఉన్న దేశంగా అమెరికా ఈ విధంగా చేయడం ఐరాస నిబద్ధతకు వ్యతిరేకమని విమర్శించింది. ఐరాసలో రష్యా శాశ్వత రాయబార బృందానికి, ఐరాస కేంద్ర కార్యాలయానికి బహిష్కరణ విషయాన్ని తెలియజేశామని ఐరాసలో అమెరికా రాయబారి ప్రతినిధి ఓలివియా డాల్టన్ తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని వీరిపై చర్య తీసుకున్నామని, ఐరాస కేంద్రకార్యాలయ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే వారిని బహిష్కరించామని వివరించారు. అమెరికా చర్య నిబంధనలకు వ్యతిరేకమని రష్యా రాయబారి వాస్లీ నెబెంజియా విమర్శించారు. అమెరికా చర్యకు తప్పక ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన భద్రతామండలి సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఎజెండాలో రాయబారుల బహిష్కరణ అంశం లేదని నెబెంజియాను యూఎస్ ప్రతినిధి అడ్డుకున్నారు. ఉక్రెయిన్‌లో మానవీయ సంక్షోభాన్ని చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైందన్నారు. (చదవండి: మెళ్లకు మైళ్లు నడిచి..) -
3.68 లక్షలకు చేరుకున్న ఉక్రెయిన్ వలసలు: ఐరాస
జెనీవా: రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజల వలసలు వేగంగా పెరుగుతున్నాయని ఐరాస వలస విభాగం తెలిపింది. శనివారం అంచనా ప్రకారం కనీసం 1.50 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ వీడి పోగా ఆదివారానికి ఈ సంఖ్య 3.68 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది. వీరంతా పోలండ్, హంగరీ, రొమేనియా తదితర దేశాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ వీడి వచ్చే వారితో పోలండ్ సరిహద్దుల్లో 14 కిలోమీటర్ల పొడవైన కార్ల క్యూ ఉందని వలస విభాగం ప్రతినిధి క్రిస్ మీజర్ ట్విట్టర్లో తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారన్నారు. ఎముకలు కొరికే చలిలో వీరు రాత్రంతా కార్లలోనే జాగారం చేశారని చెప్పారు. -
ఎలన్ మస్క్ సవాల్: అలా చేస్తే రూ.45 వేల కోట్లు ఇస్తాను
వాషింగ్టన్: ప్రపంచ కుబేరులు వారి సంపదలో చాలా తక్కువ మొత్తాన్ని దానం చేస్తే భూమ్మీద ఆకలి సమస్య ఉండదన్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) వ్యాఖ్యలపై స్పేస్ ఎక్స్ ఫౌండర్, బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. ఈ క్రమంలో యూఎన్డబ్ల్యూఎఫ్పీకి ఓ సవాలు విసిరారు ఎలన్ మస్క్. ఆకలి సమస్యను పరిష్కరించడానికి యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ మంచి ప్రణాళికతో వస్తే తాను 6 బిలియన్ డాలర్లు(4,49,13,30,00,000 రూపాయలు) ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఎలన్ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ సంస్థ డైరెక్టర్ సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. ‘‘మస్క్ లేదా ఇతర ప్రపంచ కుబేరుల సంపదలో కేవలం 2 శాతం దానం చేస్తే ప్రపంచంలో ఉన్న ఆకలి సమస్యను తీర్చవచ్చు’’ అన్నారు. సీఎన్ఎన్లో వచ్చిన ఈ వార్త కథనం క్లిప్పింగ్‌ని ఎలన్ మస్క్ సంస్థ సహా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎలి డేవిడ్ ట్వీట్ చేశారు. (చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్..! నీ రాక..వారికి శాపమే..!) ఎలి డేవిడ్ ట్వీట్‌పై మస్క్ స్పందిస్తూ.. ‘‘6 బిలియన్ల సంపదతో ప్రపంచ ఆకలిని ఎలా తీర్చగలదో యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఇక్కడ ట్విటర్ థ్రెడ్‌లో నాకు తెలిపితే.. నేను ఇప్పుడే టెస్లా స్టాక్‌ను అమ్మి.. ఆ మొత్తాన్ని దానం చేస్తాను’’ అన్నారు. అంతేకాక ఈ డబ్బును ఎలా వినియోగిస్తున్నారనే దాని గురించి ప్రజలకు బహిరంగ పర్చాలని.. ఒపెన్‌గా ఉండాలని సూచించారు మస్క్. యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ.. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ల మంది సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ఈ అంశంపై యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ.. ‘‘మస్క్ తన సందలో కేవలం 2 శాతం దానం చేస్తే.. 42 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు. వీరంతా ఆకలితో అలమటిస్తున్నారు. మనం వారిని ఆదుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’’ అని తెలిపారు. (చదవండి: ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా..! అనుకుంటే ఏదైనా చేస్తావ్..!) తన వ్యాఖ్యలపై బిస్లీ మరింత వివరణ ఇస్తూ.. ‘‘ఈ బిలియనీర్ల సంపద ప్రపంచ ఆకలిని తీర్చుతుందని మేం చెప్పడం లేదు. ఒక్కసారి ఇచ్చే ఈ మొత్తం.. ప్రస్తుతం ఆకలి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న 42 మిలియన్ల మందిని కాపాడగలదు. 155 మిలియన్ల మంది ఆకలి తీర్చాలంటే 8.4 బిలియన్ల సంపద కావాలి’’ అన్నారు. చదవండి: ఎలన్‌మస్క్ నంబర్ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్ మహీంద్రా -
న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీబిజీగా ఉన్నారు. నిన్న ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. వారితో ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. అంతకుముందే ప్రముఖ సంస్థల సీఈఓలతో సమావేశమై ‘భారత్‌లో పెట్టుబడులు పెట్టాలి’ అని ఆహ్వానించారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం తాజాగా ఐక్య రాజ్య సమితిలో ప్రసంగించేందుకు ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. న్యూయార్క్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వందేమాతరం అనే నినాదాలు మార్మోగాయి. 76వ నేషనల్ జనరల్ అసెంబ్లీ సమావేశం నేడు జరగనుంది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఐరాసలో ప్రధాని ప్రసంగించనున్నారు. 2014లో ప్రధానమంత్రి అయ్యాక మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది ఏడోసారి. అమెరికాలోని ఎన్నారైల్లో ప్రధానికి మంచి ఆదరణ ఉంది. #WATCH | PM Narendra Modi meets people as they cheer for him & chant 'Vande Mataram' & 'Bharat Mata ki Jai' outside the hotel in New York. He is scheduled to address at the 76th session of UNGA pic.twitter.com/hafLDBSimC — ANI (@ANI) September 25, 2021 -
అఫ్గాన్‌కు భారీ స్థాయిలో ఆర్థికసాయం!
ఐక్యరాజ్య సమితి/జెనీవా: తాలిబన్లు చెరబట్టిన అఫ్గాన్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో ఆర్థికసాయం చేస్తామని ప్రకటించాయి. కరువు, పేదరికం, వలసలతో సతమతమవుతున్న అఫ్గాన్ ప్రజల ఆకలి, వసతుల కష్టాలు తీర్చేందుకు 1.2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,836 కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని పలు దేశాలు హామీ ఇచ్చాయని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా చూడడం, మానహక్కుల పరిరక్షణ తదితర సమస్యలపైనా ప్రపంచ దేశాలు తమ వంతు కృషిచేయాలని గుటెర్రస్ సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్‌కు సత్వర ఆర్థిక సాయం కోరుతూ ఐరాస సోమవారం జెనీవాలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం తెల్సిందే. ఈ ఏడాది అవసరాలు తీర్చేందుకు కనీసం 60.6 కోట్ల డాలర్ల సాయం చేయాలని గుటెర్రస్ కోరడం విదితమే. ‘ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సమాజం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల సాయం చేస్తామని ‘ముఖ్యమైన’ దేశాలు ప్రకటించాయి. నా అంచానాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో విరాళాలు వస్తున్నాయి. అఫ్గాన్‌కు అంతర్జాతీయ సమాజం ఎంతటి భారీ స్థాయిలో ఆర్థిక తోడ్పాటు ఇస్తుందనడానికి ఈ ఘటనే తార్కాణం’ అని స్విట్జర్లాండ్ నగరం జెనీవాలో పత్రికా సమావేశంలో గుటెర్రస్ చెప్పారు. ‘తాలిబన్ల అనుమతి లేకుండా మానవతా కార్యక్రమాల అమలు అసాధ్యం. మానవ హక్కులు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం.. అంశమేదైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సాయం అందాలంటే తాలిబన్ ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాల్సిందే’ అని ఆయన స్పష్టంచేశారు. ‘ తాలిబన్ల దురాక్రమణ, కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద వేలాది మంది అఫ్గాన్ అభాగ్యుల పడిగాపులు, బాంబు పేలుళ్లు వంటి విషాదకర ఘటనలతో స్థానికుల భవిష్యత్ అగమ్యగోచరమైన నేపథ్యంలో ఐరాస అక్కడ సహాయ కార్యక్రమాలను కొనసాగించడం తప్పనిసరి’ అని గుటెర్రస్ వ్యాఖ్యానించారు. -
Yoga Day 2021: దివాణంలో దివ్యౌషధం
రోగ నిరోధక శక్తి, ఊపిరితిత్తుల సామర్థ్యం, శరీరంలో ఆక్సిజన్ స్థాయి, మానసిక దృఢత్వం... ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్–19కు గట్టి విరుగుడుగా చెబుతున్న నాలుగు మాటలు, సహజ పరిష్కారాలు ఇవే! ముందు నుంచీ ఇవి తమలో ఉన్నవారు కరోనా వైరస్‌ను ధీటుగా ఎదుర్కోగలుగుతున్నారు. వ్యాధి బారిన పడ్డాకయినా... వీటిని పెంచుకుంటే కోవిడ్ నుంచి తేలిగ్గా బయటపడగలరనీ చెబుతున్నారు. అత్యధిక సందర్భాల్లో ఇదే రుజువైంది. కానీ, ఈ నాలుగింటినీ ఇచ్చే ఔషధాన్ని ఇంతవరకు ప్రపంచ వైద్యారోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు కనుక్కోలేదు. ఔషధ పరిశ్రమలేవీ దీన్ని ఉత్పత్తి చేయలేదు. ఈ నాలుగింటినీ ధారాళంగా అందించే ఒక ప్రక్రియ మాత్రం అయిదువేల ఏళ్ల నుంచే భారతీయులకు అందుబాటులో ఉంది. అదే ‘యోగా’! సనాతన సంప్రదాయం నుంచి, మధ్యయుగాల ఆచరణ ద్వారా, ఆధునిక శాస్త్ర–సాంకేతిక తరం వరకు... అవిచ్ఛిన్నంగా భారతీయ జీవన విధానంలో అవిభాజ్య భాగమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆరేళ్ల కిందటి ఓ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితిలోనూ గుర్తింపు దక్కింది. ఫలితంగా 177 సభ్య దేశాల మద్దతుతో, మనం ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొంది, 2015 నుంచి ఏటా జూన్ 21, ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’గా జరుగుతోంది. భవిష్యత్ కార్యక్రమాల్లో యోగానొక భాగంగా యూఎన్ నిర్ణయించింది. కోవిడ్ కష్టకాలంలో యోగ ప్రాధాన్యతను అందరూ గుర్తిస్తున్నారు. ‘అందరి అభ్యున్నతికి యోగ’ ఈయేడు ప్రాధాన్యతగా యూఎన్ ప్రకటించింది. ‘ఇంటి వద్దే యోగ, కుటుంబ సభ్యులందరితో కలిసి’ అనే నినాదాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. అవగాహన లేమి వల్ల చాలా మంది ‘యోగ’ను పరిమితార్థంలో చూస్తారు. ఏవో రెండు ఆసనాలో, శ్వాస కసరత్తులనో యోగగా భావిస్తారు. కానీ, స్థూలార్థంలో ఇదొక పటిష్టమైన జీవన ప్రక్రియ. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ‘యోగ’ అంటే (విడిపోవడమనే ‘వియోగ’ శబ్దానికి వ్యతిరేకార్థం) కలిపి ఉంచడం. శరీరం, మేధ, మనసు... ఈ మూడింటినీ ఒకే మార్గంలోకి తెచ్చి, మనిషిలోని అంతఃశక్తుల్ని గరిష్టంగా ఉద్దీపించే ప్రక్రియే యోగ! మూలాలు పరిశోధించి, సాధన పద్ధతుల్ని క్రోడీకరించి పతంజలి మహర్షి ‘అష్టాంగయోగ’ను వేల ఏళ్ల కిందటే రూపొందించారు. ‘పతంజలి’ కూడా ఒకరు కాదని, వేర్వేరు కాలాల్లో తమ నైపుణ్యాల్ని సమాజహితంలో (క్రీ.పూ 500 నుంచి క్రీ.శ 400) ప్రదర్శించిన ఇద్దరు ముగ్గురు రుషితుల్యులని చరిత్రకారుల ఉవాచ. ‘యమ’ (నైతికాంశాలు), ‘నియమ’ (ప్రవర్తన కట్టుబాట్లు), ‘ఆసన’ (శరీర పటిష్టత), ‘ప్రాణాయామ’(శాస్వ నియంత్రణ), ‘ప్రత్యాహార’(ఇంద్రియ నిగ్రహం), ‘ధారణ’(ఏకాగ్రత), ‘ధ్యాన’(నిమగ్నత), ‘సమాధి’(అన్నీ అదుపులోకి తెచ్చిన ఉన్నతస్థితి)... వీటన్నింటినీ కలిపి అష్టాంగయోగగా చెబుతారు. మనిషి ఇవి సాధన చేసి, పరిపూర్ణ జీవితం గడపాలనేది లక్ష్యం. గౌతమ బుద్దుడి ‘అష్టాంగిక పథం’ కూడా ఇటువంటిదే! ఆ మహనీయుల పథనిర్దేశంలోనే మనిషి జీవిత ముఖ్యసారముందని జాతిపిత మహాత్ముడు, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డా.అంబేడ్కర్లు గట్టిగా విశ్వసించారు. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న కాలంలోనూ.. ప్రాణాంతకమైన అనూహ్య సూక్ష్మ జీవుల నుంచీ సదరు జీవనశైలి రక్షణ కల్పిస్తోంది. శతృదుర్భేధ్యమైన ఓ కోటలా శరీరాన్ని తీర్చిదిద్దుతుందీ యోగ! ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. కలవరపాటు, మానసిక ఒత్తిళ్ల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. మనిషిని ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంచడమే కాకుండా ఆధ్యాత్మిక ప్రజ్ఞ పెంచి మానసిక దృఢత్వంతో వ్యవహరించేలా చేస్తుంది. ‘ప్రాణాయామం’ శ్వాసమీద ధ్యాస నిలిపేలా చేస్తుంది. పద్దతిగా ఉశ్ఛ్వాస–నిశ్ఛ్వాస క్రియల సాధన ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు, కణజాలాలకు ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. ఈ అవసరాన్ని, ఓ గుణపాఠంగా చెప్పింది కరోనా! మెదడు, శరీరం, ఆత్మ ఒకే వరసలోకి వచ్చి ఏకీకృత శక్తిగా మారి, మనిషి తనను తాను సమగ్రంగా తెలుసుకుంటాడని విశ్లేషకులంటారు. ఫలితంగా స్వీయ అవగాహన పెరిగి, ప్రాపంచిక అంశాల పట్ల సమ్యక్ దృష్టి, తనకు తాను సమస్థితి మనిషి సాధిస్తాడనేది విశ్వాసం. ప్రకృతిని వికృతం చేస్తున్న మానవ తప్పిదాల వల్లే పర్యావరణం పాడవుతోంది. పలు విపరిణామాలొన్నాయి. వేగంగా వస్తున్న ‘వాతావరణ మార్పు’ ప్రభావంతో మున్ముందు ఇంక చాలా వైరస్లు దాడి చేస్తాయనే అధ్యయనాల నేపథ్యంలో... ఎన్నో సమస్యలకు ‘యోగ’ ఒక దీర్ఘకాలిక పరిష్కారం! జబ్బులనే కాక జీవితంలో దారితప్పిన క్రమతనూ సరిదిద్దే శక్తి యోగాకు ఉంది. ‘యోగా ఒక కాంతి ప్రజ్వలనం. ఒకసారి వెలిగితే ఆరిపోయేది కాదు. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత వెలుగు’ అన్న యోగాచార్యుడు బి.కె.ఎస్ అయ్యంగార్ మాటలు అక్షర సత్యాలు. సాధన చేస్తే, మనిషి దివాణంలో సర్వవేళలా అందుబాటులో ఉండే దివ్యౌషధం ఈ యోగా! దీనికోసం జాతి మరింత జాగృతం కావాలి. నవతరం యువత తమ జీవనశైలిలో యోగాను ఒక భాగం చేసుకోగలిగితే... శారీరకంగా, మానసికంగా తలెత్తే భవిష్యత్ సవాళ్లను వారు సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. తట్టుకొని నిలువగలుగుతారు. -
కోవిడ్ వల్ల అనాథలుగా 577 మంది బాలలు
న్యూఢిల్లీ: కోవిడ్ మరణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు 577 మంది ఉన్నట్లు రాష్ట్రాలు వెల్లడించాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ పిల్లలందరనీ వారి దగ్గర బంధువుల వద్దే ఉంచి, జిల్లా కలెక్టర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. వీరి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడం లేదని, సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో పిల్లల గురించి వివరాలు కనుక్కుంటున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. మహిళా శిశుసంక్షేమ శాఖ సహా ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ సైతం వీరికి తోడ్పాటును అందిస్తున్నాయని వెల్లడించాయి. (చదవండి: ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి) -
15 మంది రోహింగ్యాల దుర్మరణం
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఒక రోహింగ్యా క్యాంపులో చెలరేగిన మంటల కారణంగా 15మంది దుర్మరణం చెందగా 400 మంది కనిపించకుండా పోయారు. దాదాపు 45వేలమంది నివాసముండే ఈ క్యాంపులో అగ్నిప్రమాదం కారణంగా 10వేలకుపైగా గృహాలు దగ్ధమయ్యాయని ఐరాస అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికితీశారు. 560మంది గాయాలబారిన పడ్డారు. క్యాంపులో అధికశాతం షెల్టర్లు వెదురుతో నిర్మించినవి కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ ప్రతినిధి జొహన్నాస్ వాండీర్ క్లావూ చెప్పారు. మంటల్లో నాలుగు ఆస్పుత్రులు, ఆరు హెల్త్ సెంటర్లు ధ్వంసమయ్యాయి. బర్మా నుంచి రోహింగ్యాల వలసలు ఆరంభమైనప్పటినుంచి ఇది అదిపెద్ద ప్రమాదమని బంగ్లా అధికారులు చెప్పారు. ఎంతమంది మరణించింది అధికారికంగా ప్రకటించలేదు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు చెప్పారు. కాక్స్ బజార్లో దాదాపు 11 లక్షల మంది రోహింగ్యాలు వివిధ క్యాంపుల్లో ఆశ్రితులుగా ఉంటున్నారు. వీరిని బర్మా తరలించాలని భావించినా, ఆదేశంలో మిలటరీ పాలన రావ డంతో వీరి భవితవ్యంపై అయోమయం నెలకొంది. చదవండి: (అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. 10 మంది మృతి) -
మమ్మల్నీ కలుపుకోండి.. నిప్పురవ్వలం మేము
ఆషా పట్వాల్‌కు కళ్లు లేవు. ‘లేనిది మాకు కదా.. మీకు చూడ్డానికేం?’ అంటోంది. ఆమెకు చెవులూ వినిపించవు. వినికిడి లేనిది మాకు కదా.. మీకు వినడానికేం?’ అంటోంది. ‘మమ్మల్నీ కలుపుకోండి.. నిప్పురవ్వలం మేం’ అంటోంది. ఐరాస డేటా ఫోరమ్‌కి మాట లేదు! ఏం పిల్ల..! అనైతే అంది. మందాకిని, అలకనంద నదుల సంగమంలో ఉంటుంది రుద్రప్రయాగ. మహాశివుడి మూడు కళ్లలా ఉత్తరాఖండ్‌లోని చమోరి, పౌరి, తెహ్రీ జిల్లాల నుంచి రుద్రప్రయాగ ఆవిర్భవించింది. రుద్రుడంటే శివుడు. ఆ రుద్రస్థలిలో జన్మించిన ఆషా పట్వాల్‌కు రెండు కళ్లూ లేవు! కళ్లతోపాటు వినికిడి శక్తీ లేదు! అనుకోకుండా ఏదైనా అద్భుతం జరిగితే ఆ అమ్మాయికి చూపు రావచ్చు. అయితే తనకు చూపు రావాలని కోరుకోవడం లేదు ఆషా. ‘నాలాంటి వారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. మమ్మల్ని చూడండి’ అని విజ్ఞప్తి చేస్తోంది. ఆ విజ్ఞప్తిని నిముషం కన్నా తక్కువ నిడివిగల వీడియోలో చూసి ఐక్యరాజ్య సమితి అధికారులు కదిలిపోయారు! ఆషాకు పదహారేళ్లు. రుద్ర ప్రయాగ్‌లో పదవ తరగతి చదువుతోంది. చూపు, వినికిడి లేకున్నా, మాట ఉంది. చక్కగా ఆటలు ఆడుతుంది. డిస్కస్ త్రోయింగ్, పరుగు పందెం ఆమెకు ఇష్టమైన ఆటలు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ డేటా ఫోరమ్’.. ‘డేటా ఎందుకు అవసరమంటే?’ అనే టాపిక్‌ని ఇచ్చి, నిముషంలోపు వీడియోలో రికార్డ్ చేసి పంపమని ఎంట్రీలు ఆహ్వానిస్తే ఆషా కూడా తన వీడియోను రికార్డ్ చేసి పంపింది. అందుకు ఆమెను ‘సెన్స్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రోత్సహించింది. 15–24 ఏళ్ల వయసులోని వారికి డేటా ఫోరమ్ పెట్టిన ప్రపంచవ్యాప్త పోటీ ఇది. ఆ పోటీ పేరు ‘1 మినిట్ వాయిసెస్ ఆఫ్ యూత్’. షార్ట్‌లిస్టులో పదిమంది ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఆ పదిమందిలో ఒకరు ఆషా పట్వాల్! ‘ఐ యామ్ ఇన్విజిబుల్’అని ఆషా వీడియో మొదలౌతుంది. ‘నేను కనిపించను’ అని. వీడియోలో తను కనిపిస్తూనే ఉంటుంది. సైలెంట్ వీడియో అది. చేతులు కదుపుతూ, కళ్ల సైగలతో చెబుతుంటుంది. మరి కనిపించకపోవడం ఏంటి? తనను, తనలాంటి వాళ్లను ప్రపంచం చూడటం లేదని చెప్పడం. పట్టించుకోవడం లేదని, లెక్కల్లోకి తీసుకోవడం లేదని గుర్తు చెయ్యడం. జనాభా లెక్కల్లోకి తమలాంటి వాళ్లను కూడా చేర్చుకొమ్మని ఆ వీడియోలో ఆషా అభ్యర్థించింది. తమలాంటి వాళ్లు అంటే.. రెండు విధాలైన అసహాయతలతో ఉన్నవారు అని. బధిరత్వం, అంధత్వం రెండూ ఉన్నవారు. ‘‘డేటాలోకి మమ్మల్నీ తీసుకుంటే ప్రపంచంలో మేమూ ఒక భాగం అవుతాం. ఈ కరోనా సమయంలో మేము జీవితాన్ని మరింత ఛాలెంజ్‌గా తీసుకోవలసి వస్తోంది. అందుకు ఆవేదన చెందడం లేదు. టీచర్ని కావాలని నా ఆశయం. అందుకోసం కూడా కష్టపడుతున్నాను’’ అని వీడియోలో చెప్పింది ఆషా. (ఆమె సంజ్ఞలు అర్థం అయేందుకు వీడియోలో కింద టెక్స్ట్ వస్తుంటుంది). ‘‘డేటా అవసరం ఏంటి అని కదా మీరు అడిగారు. భవిష్యత్తును నిర్మించుకోడానికి డేటా అవసరం. మీ డేటాలోకి మాకూ స్థానం ఇవ్వండి. జాతిలో స్ఫూర్తిని రాజేసే నిప్పురవ్వలం మేము’’ అని ఆషా ముగించింది. బధిరత్వం, అంధత్వం రెండూ ఉన్నవారు దేశంలో ఐదు లక్షలమంది వరకు ఉన్నారు. అయితే ప్రత్యేకమైన కేటగిరీగా మాత్రం వీళ్లు జనాభా లెక్కల్లో లేరు. ఆ విషయం ఆషా తన వీడియోలో ప్రధానంగా ప్రస్తావించింది. ఆషాకు పుట్టిన కొన్నాళ్లకు చూపు సమస్య వచ్చింది. కంజెనిటల్ క్యాటరాక్ట్. తండ్రికీ, ఇద్దరు తోబుట్టువులకూ ఆ వైకల్యం ఉంది. డెహ్రాడూన్‌లోని ‘షార్ప్ మెమోరియల్ స్కూల్ ఫర్ బ్లైండ్’ ప్రిన్సిపాల్ సుమనా సామ్యేల్ ఆషాను ఢిల్లీ తీసుకెళ్లి సర్జరీ చేయించారు. తిరిగి రుద్రప్రయాగ్కి రాగానే ఆషాకు మెనింజైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది! దానిని గుర్తించి చికిత్సకు వెళ్లేలోపే వినికిడి శక్తీ పోయింది. మళ్లీ సుమననే ఆషాను డెహ్రాడూన్‌లోని ‘బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ డెఫ్ చిల్డ్రన్’లో చేర్పించి, సంజ్ఞల భాషను నేర్పించారు. ఐక్యరాజ్యసమితి ‘1 మినిట్ వాయిసెస్ ఆఫ్ యూత్’ కాంటెస్ట్ షార్ట్‌లిస్ట్‌లో ఉన్న ఆషా విజేత అయినా, కాకున్నా ఆమె చూపించే ప్రభావం మాత్రం మనదేశంలోని బధిర–అంధులకు ప్రయోజనకారిగా ఉండొచ్చు. మన దేశంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1న జనగణన మొదలవుతోంది. అందులో కనుక బధిర అంధులకు ఒక కేటగిరీ ఉంటే అది తప్పకుండా ఆషా వీడియో ఎఫెక్టే! తమనూ సెన్సస్ ‘డేటా’లో చేర్చాలన్న ఆమె విజ్ఞప్తి ఇప్పటికే ఐరాస అధికారుల దృష్టిలో ఉంది కనుక ఆ మేరకు ఈలోపే మన ప్రభుత్వానికి వారి నుంచి సూచనలు అందవచ్చు. -
అప్పటి, ఇప్పటి పరిస్థితులేంటి? : మోదీ
-
‘ఐరాస బృందం’లో భారత పర్యావరణవేత్త
ఐక్యరాజ్యసమితి: భారత్‌కు చెందిన మహిళా యువ పర్యావరణవేత్త ఒకరు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ సలహా మండలికి ఎంపికయ్యారు. రోజు రోజుకూ దారుణంగా మారుతున్న పర్యావరణ పరిస్థితిని మెరుగు పరిచేందుకు అవసరమైన సలహాలను వీరు యూఎన్ చీఫ్‌కు అందిస్తారు. ఈ మండలికి ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు (18–28 ఏళ్ల వారు) ఎంపిక కాగా భారత్ నుంచి అర్చన సొరెంగ్(24) అందులో ఒకరు కావడం విశేషం. పర్యావరణాన్ని సమతులంగా ఉంచేందుకు ఆదివాసులు ఉపయోగిస్తున్న పద్ధతులను, వారి సంప్రదాయ నైపుణ్యాన్ని పరిరక్షించేందుకు అర్చన పరిశోధనలు సాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ.. మన పూర్వీకులు సంప్రదాయ విధానాల్లో అడవులను, పర్యావరణాన్ని పరిరక్షించారని, ఇప్పుడు ఆ బాధ్యత మనపై ఉందని, వాతావరణ మార్పులతో మనం పోరాడాల్సి ఉందని చెప్పారు. ఈమె టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై (టిస్) నుంచి రెగ్యులేటరీ గవర్నెన్స్ పూర్తి చేశారు. ఆమె టిస్ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. ‘మనం పర్యావరణ అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. మనకు ఎక్కువ సమయం లేదు’అని గుటెరస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని కోవిడ్‌తో పాటు, అన్యాయం, అసమానత్వం, పర్యావరణ నాశనం వంటి వాటిపై పోరాడాలన్నారు. యువతను మరింత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే సలహామండలిని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
130 మిలియన్ డాలర్లు.. కొనేవాళ్లు లేక తిప్పలు
మెక్సికో సిటీ: గత ప్రభుత్వాల అవినీతికి నిదర్శనంగా నిలుస్తోన్న లగ్జరీ జెట్ ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్’ను అమ్మడానికి మెక్సికన్ ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రయత్నిస్తోంది. సరైన కొనుగోలుదారు కోసం ఇన్ని రోజులు ఈ లగ్జరీ జెట్‌ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉంచారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి విమానాన్ని కొనడానికి ఎవరూ ఆసక్తి చూలేదు. ఈ క్రమంలో విమానాన్ని తిరిగి మెక్సికోకు రప్పించినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ తెలిపారు. అంతేకాక ఈ లగ్జరీ విమానాన్ని మెక్సికో వాసులకే అమ్మాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మెక్సికో నగరంలోని బెనిటో జుయారెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు అక్కడి టెలివిజన్ చానెల్స్‌లో ప్రసారం అయ్యాయి. 2012లో ఈ జెట్‌ను మాజీ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దీన్ని 80 మంది ప్రయాణించేలా పునర్నిర్మించారు. బాత్రూమ్లను పాలరాయితో నిర్మించారు. ప్రస్తుతం దీనిలో ఒక ప్రెసిడెంట్ సూట్, ప్రైవేట్ బాత్ ఉన్నాయి. (ప్రధాని కోసం ప్రత్యేక విమానం) ఐక్యరాజ్య సమితి ఈ విమానం ఖరీదును 130మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఇంతకంటే తక్కువ ధరకు అమ్మడానికి లోపెజ్ ఒబ్రాడోర్ ఇష్టపడకపోవడంతో ఈ లగ్జరీ జెట్‌ను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విమానాన్ని దక్షిణ కాలిఫోర్నియాలో ఖాళీగా ఉంచితే.. విలువ పడిపోతుందని భావించి.. తిరిగి దాన్ని మెక్సికోకు రప్పించారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి విమానాన్ని కొనడానికి ఆసక్తి చూపించాడని లోపేజ్ ఒబ్రాడోర్ తెలిపారు. సదరు వ్యక్తి ఈ జెట్ కోసం 120 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని.. ఇప్పటికే కొంత ముందస్తు చెల్లింపు కూడా చేశాడని సమాచారం. మెక్సికోలో సగం పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. (మెక్సికో లేడీ డాన్ ఆఖరి క్షణాలు....) ఇలాంటి సమయంలో కరోనా ఆ దేశ పరిస్థితులను మరింత దిగజార్చింది. ఆస్పత్రుల్లో తగినన్ని ఔషధాలు అందుబాటులో లేవు. అంతేకాక కరోనా మరణాల సంఖ్యలో మెక్సికో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. ఈ లాంటి పరిస్థితుల్లో ఇంత లగ్జరీ విమానం వల్ల దేశానికి ఎలాంటి లాభం లేదని భావించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. ఈ లగ్జరీ జెట్‌లో ఓ రాఫెల్ విమానం కూడా ఉన్నట్లు సమాచారం.