అంతర్జాతీయ న్యాయస్థానం
ది హేగ్: పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అ«దీనంలో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని, అక్కడ స్థిర నివాసానికి కాలనీల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని సూచించింది. 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ అజమాయిషీని తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయం స్థానం తీర్పు ఇవ్వడం అసాధారణ విషయంగా పేర్కొంటున్నారు.
వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను నిర్మించడం, విస్తరించడం, ఆక్రమిత ప్రాంతాలను స్వా«దీనం చేసుకోవడం, వాటిపై నియంత్రణ, అక్కడి సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని జడ్జీల ప్యానెల్ అభిప్రాయపడింది.
ఆక్రమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్‌కు సార్వ¿ౌమాధికారం లేదని, పాలస్తీనాలోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించడంఅంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని పేర్కొంది. అయితే అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచి్చన ఈ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిన, పాటించాల్సిన అవసరం ఇజ్రాయెల్‌కు లేదు. ఇదొక అభిప్రాయం మాత్రమే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ.. ఆ ప్రాంతాలు యూదు ప్రజల చారిత్రక మాతృభూమిలో భాగమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment