Palestine
-
ట్రంప్‌నకు పాలస్తీనా అధ్యక్షుడి ఫోన్.. ‘గాజాలో శాంతి కోసం రెడీ’
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ శుక్రవారం యూఎస్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా గాజాలో న్యాయమైన, సమగ్రమైన శాంతి కోసం పని చేయడానికి సంసిద్ధతను ట్రంప్‌నకు తెలియజేసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయానకి అబ్బాస్ అభినందనలు తెలియజేశారు.‘‘అంతర్జాతీయ చట్టాల ఆధారంగా న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించేందుకు ట్రంప్‌తో కలిసి పని చేసేందుకు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ప్రపంచంలోని సంబంధిత పార్టీలతో కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అబ్బాస్ ట్రంప్‌నకు తెలిపారు. దీంతో గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కృషి చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని ట్రంప్ తెలిపారు’’ అని పాలస్తీనా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే ట్రంప్ తన ప్రచారం సమయంలో గాజాలో యుద్ధం ముగించడానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.గత ఏడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో హమాస్, ఇజ్రాయెల్ బలగాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో 43,500 మంది గాజా ప్రజలు మృతిచెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.వేల మంది ప్రజలు గాజా నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. -
ఇజ్రాయెల్‌కు షాక్.. పాలస్తీనా కోసం రంగంలోకి సౌదీ అరేబియా
హమాస్, హోజ్బొల్లా ఉగ్రవాద సంస్థలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా, లెబనాన్, ఇరాన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది.ఈ క్రమంలో తాజాగా గాజా, లెబనాన్‌తో ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించేందుకు సౌదీ అరేబియా అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది. నవంబర్ 11న జరగనున్న ఈ సమ్మిట్ పాలస్తీనా రాజ్య స్థాపనపై దృష్టి సారించనుంది. రియాద్‌లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.ఈ శిఖరాగ్ర సమావేశం గత సంవత్సరం 2023 అరబ్-ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డీనరీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జరగనుంది. ఇది సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్‌పై ఎలా ఒత్తిడి తేవాలనే దానిపై ఈ సదస్సులో ఇస్లామిక్ దేశాలు చర్చించనున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, యుద్ధాన్ని ముగింపుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి ప్రధాన సమస్యలపై ఈ దేశాలు చర్చించనున్నాయి.కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక 2023లో జరిగిన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో గాజాపై దాడులను ఆపేందుకు, శాంతి స్థాపనకు కృషి చేసేందుకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, ఈజిప్ట్, ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, నైజీరియా, తుర్కియే వంటి ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ (ఓఐసీ) ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 7న హమాస్ తమ దేశంలోకి చొరబడి నరమేథానికి పాల్పడటంతో ఇజ్రాయేల్ ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాదిగా సాగుతున్న ఈయుద్ధం కారణంగా- గాజాలో 43,000 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో సగానికిపై మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 1,01,110 మంది గాయపడినట్లు పేర్కొంది. అయితే మృతుల్లో ఎంతమంది పౌరులు, మిలిటెంట్లు ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు. -
బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తారా?
అక్టోబరు 23 (బుధవారం)న సాక్షి దిన పత్రిక ఎడిట్ పేజీలో పాలస్తీనా సమస్యపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ రాసిన వ్యాసం వాస్తవాలకు భిన్నంగా ఇజ్రాయెల్‌కు వత్తాసు పలికేలా ఉంది. వ్యాసం మొత్తంగా చూసినప్పుడు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ కాండకు మద్దతిస్తున్నట్లే ఉంది. రాజ్య నైజాన్ని గురించి కానీ, దానికి ఆయుధాలు, డబ్బు ఇచ్చి ప్రోత్సహిస్తున్న అమెరికా, యూరప్ దేశాల పాత్ర గురించి కానీ ఎక్కడా ప్రస్తావించకుండా బాధితులనే దోషులుగా చిత్రించేందుకు వ్యాసకర్త యత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ వ్యవహారమంతా నాగరికతకు సంబంధించిన సమస్య అనడం అంతకన్నా శోచనీయం. ఆ వ్యాసంలో ఒక చోట ఆయన ‘ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ... ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కు అమలు లోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు’ అని పేర్కొన్నారు. దీని ద్వారా ఆయన ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? ఇజ్రాయెల్ ఒక లౌకిక ఘనమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్ప దలచుకున్నారా? అలా చెప్పడమంటే వాస్తవాన్ని చూడ నిరాకరించడమే అవుతుంది.ప్రముఖ యూదు చరిత్రకారుడు, యూరోపియన్ సెంటర్ ఫర్ పాలస్తీనా స్టడీస్ డైరెక్టర్ ఇలాన్ పాపే ఇటీ వల బ్రస్సెల్స్‌లో ‘అనడోలు’ అనే వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో... పశ్చిమ దేశాల మద్దతుతో పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్నది ముమ్మాటికీ జాతి నిర్మూలన కార్యక్ర మమేనని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రాజకీయాలు సెటి ల్మెంట్ల నిర్మాణం నుంచి యూదు దురహంకారాన్ని రెచ్చగొట్టే దశకు వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఈ శక్తులే ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలోనూ, పోలీస్ వ్యవస్థలోనూ తిష్ట వేసుక్కూర్చున్నాయి. ఈ నాయకత్వం వల్లే ఇజ్రాయెల్ దురాక్రమణదారుగా పాలస్తీనా అంతటా విస్తరిస్తోంది. నీరు, ఆహారం, మందులపై ఆంక్షలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ఒక వైపు అమానుష చర్యలకు పాల్పడుతూ, మరోవైపు పాలస్తీనియన్లే ఈ ప్రాంతంలోని అన్ని సమస్యలకూ కారకులుగా, అనైతిక చర్యలకు పాల్పడే వారిగా చిత్రిస్తున్నారు. వీరిని అక్కడ నుంచి వెళ్లగొట్టడమే పరిష్కారమన్న ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అమెరికా, యూరప్‌లు చాలా కాలంగా ప్రచారంలో పెడుతూ వస్తున్నాయి. 76 ఏళ్ల తరువాత కూడా అదే పాచికను ప్రయోగిస్తే అది చెల్లుబాటు కాదు అని చరిత్ర కారుడు పాపే తేల్చి చెప్పాడు.రెండవ అంశం: ‘అక్టోబరు 7 నాటి మారణ కాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతునిస్తూ ఈ యుద్ధంలోకి ప్రవేశించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి’ అని ప్రొఫెసర్ గారు సూత్రీకరించారు. అది వాస్తవమా? పాలస్తీనా, అలాగే యావత్ పశ్చిమా సియా ప్రాంతానికి పెనుముప్పుగా తయారైంది ఇజ్రా యెల్. పశ్చిమ దేశాలు తమ ఆధిపత్యానికి కాలం చెల్లుతుండడం, ఏక ధృవ ప్రపంచం నుంచి బహుళ ధృవ ప్రపంచం వైపు పరిణామాలు చోటుచేసుకుంటుండడంతో బెంబేలెత్తి వలస వాదాన్ని మళ్ళీ విస్తరించేందుకు పూనుకుంటున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయిల్ గాజాపై దాడిని... లెబ నాన్కు, అటు నుంచి ఇరాన్‌కు, తద్వారా యావత్ పశ్చి మాసియాకు విస్తరింపజేయాలనే పన్నాగాన్ని ఈ సంద ర్భంగా గుర్తించాలి.ఇందుకోసం ఇజ్రాయిల్‌కు అమెరికా వంటి దేశాలు పెద్ద యెత్తున ఆయుధాలు, డబ్బు అందజేస్తున్నాయి. మూడవ అంశం... 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయిల్ అంగీకరించి సంతకం చేయగా పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాన్ని తిరస్కరించాయనీ... 1948కు ముందున్న చోటికి తిరిగి వెళ్లాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోందని’ ఐలయ్య తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇది వాస్తవాన్ని వక్రీకరించడమే. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్య వర్తిత్వంలో 1993లో ఓస్లో ఒప్పందం (నార్వే ఒప్పందంపై ఇజ్రాయిల్ ప్రధాని ఐజాక్ రాబిన్, పాలస్తీనా విమో చనా సంస్థ నేత యాసర్ అరాఫత్ సంతకాలు చేశారు. ఆ తరువాత ఆ ఒప్పందానికి ఇజ్రాయెలే తూట్లు పొడిచింది. నాల్గవ అంశం... హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్ హుడ్లు ప్రపంచం మొత్తానికి సమస్యలు సృష్టిస్తున్నాయి అని చెప్పడం కన్నా అన్యాయం ఏముంటుంది? అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాల అండతో ఇజ్రాయెల్ యథేచ్ఛగా ఈ ప్రాంతంలో సాగిస్తున్న అణచివేత, దురాక్రమణకు వ్యతిరేకంగా, పాలస్తీనా స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటం లోంచి పుట్టుకొచ్చినవే హమాస్ వంటి సంస్థలు.అయిదవదీ, చివరిదీ నాగరికతకు సంబంధించిన అంశం: ఇజ్రాయెల్– పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య అని ప్రొఫెసర్ ఐలయ్య ముక్తాయింపు ఇచ్చారు. ఏది నాగరికతో ఏది అనాగరికతో ఆయన వివరించి ఉంటే బాగుండేది. ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాగతాలను కప్పి పుచ్చి ఆ దేశ నాగరికత, ప్రజాస్వామ్యం గురించి కీర్తించడాన్ని ఏమనాలి? ఇప్పుడు జరగాల్సింది యుద్ధ నేరాలకు పాల్పడిన నెతన్యాహునూ, ఆయనకు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలను బోనులో విలబెట్టడం. – కె. గడ్డెన్న ‘ సీనియర్ పాత్రికేయుడు -
రెండు దేశాలుగా బతకడమే దారి
హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసియాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. యుద్ధం వల్ల దయనీయంగా మారిన పాలస్తీనా ప్రజానీకం పట్ల సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? అది రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు.పాలస్తీనాలోని గాజా విముక్తి దళం అని పిలవబడే హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఒక వేడుకలో పాల్గొన్న 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ దళాలు దారుణంగా వధించడంతో ఇది ప్రారంభమైంది. 2023 అక్టోబర్ 7న జరిగిన ఆ అనాగరిక దాడిలో ఇజ్రాయెల్ పిల్లలు, మహిళలు, పురుషులు దారుణంగా చంపబడ్డారు. ఏ నిర్వచనం ప్రకార మైనా, ఇది ఉగ్ర వాద దాడి. ప్రతీకారంగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌పై భారీ యుద్ధాన్ని ప్రారంభించింది. పాలస్తీనాలో పిల్లలు, మహిళలు సహా వేలాదిమంది చనిపోయారు. వెస్ట్‌బ్యాంక్ దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.2023 అక్టోబర్ 7 నాటి మారణకాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతుగా ఈ యుద్ధంలోకి ప్రవే శించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. కానీ అవి ఇజ్రాయెల్ బలంతో సరిపోలగలవా? ఇజ్రా యెల్ తన అత్యంత అధునాతన సాంకేతికత, యుద్ధ వ్యూహంతో హమాస్ ఆయుధ శక్తిని, ప్రధాన నాయకత్వాన్ని నాశనం చేసింది.దక్షిణ గాజాలోని రఫా లక్ష్యంగా సాగించిన గ్రౌండ్ ఆపరేషన్ లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అక్టోబర్ 17న ప్రకటించింది. సిన్వార్ హత్య హమాస్‌కు చావుదెబ్బ. ఇరాన్, లెబనాన్ ఈ యుద్ధంలో తమ పౌర, సైనిక సిబ్బందిని పణంగా పెట్టడానికి సాహసించక పోవచ్చు.రెండు దేశాల పరిష్కారంసమస్యకు పరిష్కారం రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు. ఇజ్రా యెల్ ఆ సూత్రాన్ని అంగీకరించింది. కానీ హమాస్, ఇరాన్ వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ, తన ప్రజల సుదీర్ఘ ప్రవాస జీవితం తర్వాత, ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కులు అమలులోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు. ఇతర ముస్లిం మత నిరంకుశ దేశాల కంటే అధ్వానంగా, పాలస్తీనా, ఇరాన్, ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలు ఉగ్రవాద కేంద్రాలుగా మారాయి.ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తిగత హక్కుల క్రమబద్ధమైన ప్రక్రియను అంగీకరించే ఏ దేశమూ ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో స్వీయ విధ్వంస స్థితిని సృష్టించదు. హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్హుడ్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచం మొత్తానికి సమస్యలను సృష్టించాయి.ఇవి ప్రజల ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టవు. ప్రజలు శాంతియుతంగా వ్యవసాయ లేదా పారిశ్రామిక పనిలో పాల్గొనడానికి అనుమతించవు. స్త్రీ వ్యతిరేక ఆధ్యాత్మిక సైద్ధాంతిక చర్చలకు పూనుకుంటాయి. తాలిబన్ రూపంలో ఇలాంటి బలగం కారణంగా అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోందో మనకు తెలుసు.75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసి యాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1948కి ముందు దాని ప్రజలు పదేపదే దేశభ్రష్టులైనప్పటికీ, ఇజ్రాయెల్ ఉనికిని తిరస్కరించడాన్ని చరిత్ర అంగీకరించదు.సామాజిక–ఆర్థిక పరిస్థితులు2019లో నేను ఇజ్రాయెల్, పాలస్తీనాలో విస్తృతంగా పర్యటించి రెండు దేశాల సామాజిక–ఆర్థిక పరిస్థితులను గమనించాను. ఇజ్రా యెల్ వైభవాన్ని, గొప్ప పచ్చని ఉత్పత్తి క్షేత్రాలలో సర్వత్రా చూడ వచ్చు. వారు ఎడారులను ఉత్పాదక భూములుగా మార్చారు. పేదరి కంతో కొట్టుమిట్టాడుతున్న పాలస్తీనా ప్రజలు, అక్కడి ఏ శ్రామిక ప్రజానీకం... పురుషులు, మహిళలు కూడా ఎడారిలోని పాక్షిక సాగు పొలాల్లో కనిపించరు. వారి వ్యవసాయ భూములలో ఒక్క స్త్రీని కూడా మనం చూడలేము. ఇజ్రాయెల్ స్త్రీలు భారతీయ శూద్ర, దళిత స్త్రీల లాగే నిత్యం పని చేస్తూనే ఉంటారు.యూదుల కష్టపడి పనిచేసే సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం వారికి సహాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సహాయం ఉన్నప్ప టికీ, అర్థవంతమైన విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా పాలస్తీనా పేద దేశంగా మిగిలిపోయింది. వారి ఏకైక ఆశ మతం. ఉత్పత్తి లేకుండా మతం వారికి సహాయం చేస్తుందా?ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ సెక్యులరిజం సూత్రాలపై ఆధార పడి నడుస్తుంది. కానీ, పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, ఈజిప్టులలో ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయా? అవి మత నియంతృత్వాలని మనకు తెలుసు.కొత్త ఒప్పందాలు అవసరమా?1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. రెండవది 1994 నాటి అబ్రహాం ఒప్పందం. ఇది అబ్రహామిక్ సంస్కృతికి చెందిన పిల్లలుగా యూదులు, ముస్లింల ఉమ్మడి చారిత్రక వారసత్వంతో రెండు దేశాల సహజీవనం గురించి మాట్లాడుతుంది. పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాలను తిరస్క రించాయి.పాలస్తీనా సాధారణ ప్రజానీకం పట్ల, ప్రత్యేకించి పిల్లలు, మహిళలు, శరణార్థుల దుఃస్థితి పట్ల మనమందరం సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? పాలస్తీనా, ఇజ్రాయెల్ ఆ రెండు ఒప్పందాలను గౌరవించాలా లేక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలా? పాలస్తీనా దైవపాలనా సూత్రాల ఆధారంగా పనిచేస్తోంది. ఇజ్రాయెల్‌కు ప్రజాస్వామ్యం పట్ల ఉన్నంత గౌరవం పాలస్తీనా నాయకులకు లేదు. నా ఉద్దేశంలో వారు ఆ చిన్న భూమిలో రెండు చిన్న దేశాలుగా జీవించాలి. వేరే అవకాశమే లేదు.ఉభయ దేశాలలోని, ముఖ్యంగా పాలస్తీనాలోని కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల సానుభూతి చూపుతున్న ప్రపంచ మేధావులు ముస్లిం ప్రపంచంలో సంస్కరణల గురించి మాట్లాడుతూనే ఉండాలి. ముస్లిం దేశాలు సరైన ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్యాల వైపు వెళ్లాలి. మత నిరంకుశ రాజ్యాలలో ఉండకూడదు. యూదులు ఆ భూమిని విడిచి పెట్టి, 1948కి ముందున్న చోటికి తిరిగి వెళ్లాలంటున్న పాలస్తీనా, ముఖ్యంగా హమాస్, ఇరాన్ డిమాండ్‌ను వారు అంగీకరిస్తున్నట్ల యితే, అలాంటి మేధో అజ్ఞానం మానవ విలువలకు మరింత వినాశ నాన్ని తెస్తుంది.పాలస్తీనియన్లను ఆ భూభాగం నుండి బయటకు వెళ్ళమని ఇజ్రాయెలీలు కోరినట్లయితే వారికి కూడా అదే విషయం వర్తిస్తుంది. ఇలాంటి ఘోరమైన సమస్యలన్నింటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే రెండు దేశాల పౌరుల్లోనే పరిష్కారాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి వారి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలను వింటున్నాము. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రా యెల్ పౌరులు ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి దించేయవచ్చు. యాహ్యా సిన్వార్ బతికి ఉంటే పాలస్తీ నియన్లు అలా చేసి ఉండేవారా?ఉక్రెయిన్, రష్యా సమస్యలా కాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య. కాబట్టి మనమందరం ముస్లిం దేశాలు మొత్తంగా ప్రజాస్వామ్యం వైపు మారడం గురించి ఆలోచించాలి. పాలస్తీనా తన సొంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హమాస్ పట్టు నుండి బయటపడాలి. రెండు దేశాల పరిష్కారాన్ని అంగీకరిస్తూ, ప్రపంచానికీ, దాని సొంత ప్రజలకూ మేలు చేయాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
పాలస్తీనా మా సొంతం
న్యూయార్క్: గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక దాడులను పాలస్తీనా అథారిటీ చీఫ్ మహ్మూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా మా సొంతం. పాలస్తీనా నుంచి వెళ్లిపోవాల్సిన వారు ఎవరూ అంటే ఆక్రమణదారులు మాత్రమే’ అని ఆయన అన్నారు. గురువారం అబ్బాస్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన స్టేడియం వైపు వెళ్తుండగా కరతాళధ్వనులు, చప్పట్లు హాలంతా మారుమోగాయి. అర్థంకాని కేకలు వినిపించాయి. పోడియం వద్దకు చేరుకున్న అబ్బాస్..మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం..అంటూ ప్రసంగం మొదలుపెట్టారు.గాజాను, అక్కడి ప్రజలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న నరమేధాన్ని ఆపాలంటూ ప్రపంచ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గాజాను నివాసయోగ్యం కాకుండా చేస్తోంది. యుద్ధానంతరం ఏర్పడే గాజాను మేమే పాలిస్తాం. పాలస్తీనా మా మాతృ భూమి. మా తండ్రులు, తాతలది. అది ఎప్పటికీ మాదే. వెళ్లిపోవాల్సింది ఎవరైనా ఉంటే వారు ఆక్రమిత వడ్డీవ్యాపారులు మాత్రమే’అని వ్యాఖ్యానించారు. -
గాజా యుద్ధం కొనసాగిస్తాం
గాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టపోయినా తమ పోరాటం కొనసాగిస్తామని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమకు తగినంత వనరులు ఉన్నాయని హమాస్ సీనియర్ నేత ఇస్తాంబుల్‌లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘‘ గాజాలో 11 నెలలకు పైగా యుద్ధం జరగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నష్టపోయినప్పటికీ మా పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటానికి మా వద్ద తగినంత వనరులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఘటన దాడులు కొనసాగించడానికి మేము అధిక సామర్థ్యాన్ని కలిగిఉన్నాం. అమరవీరులు ఉన్నారు, వారి త్యాగాలు ఉన్నాయి. ప్రతిఘటనలో కొత్త తరాలను చేర్చుకోవడం జరుగుతోంది. ఈ యుద్ధంలో మేము ఊహించిన దానికంటే.. ప్రాణనష్టం, యుద్ధ విస్తరణ తక్కువగానే జరిగింది’ అని అన్నారు.ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ‘11 నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ హమాస్ నేత స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.చదవండి: హమాస్ మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగదు: ఇజ్రాయెల్ -
ప్రాణం... పణం అక్షర సమరం
ప్రమాదపు అంచున పనిచేసిన, ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధవార్తలను రిపోర్ట్ చేసిన సాహసికులైన ఎంతోమంది జర్నలిస్ట్‌ల గురించి తెలుసుకుందిపాలస్తీనా అమ్మాయి ప్లెస్తియ. వారి గురించి విన్నప్పుడల్లా....‘ఎంత కష్టం. ఎంత సాహసం!’ అనుకునేది.ఆ కష్టం, సాహసం తన స్వీయానుభవంలోకి రావడానికి ఎంతోకాలం పట్టలేదు.జర్నలిజంలో పట్టా పుచ్చుకున్న తరువాత హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ఆమెని ఆహ్వానించింది.హమాస్–ఇజ్రాయెల్ వార్‌ను రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్‌గా ప్రపంచానికి పరిచితం అయిన ప్లెస్తియ యుద్ధభూమిలో కత్తి అంచున నడక అంటే ఏమిటో తెలుసుకుంది. యుద్ధ బీభత్సాన్ని దగ్గరి నుంచి చూసింది. తాజాగా...‘అలాకాద్ అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరుట్’లో మీడియా స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి లెబనాన్‌కు వెళ్లింది. దాంతో ప్రముఖ జర్నలిస్ట్ కాస్తా మళ్లీ విద్యార్థిగా మారింది.‘యుద్ధకాలంలో భావోద్వేగాలకు అవకాశం లేదు. ఏడ్వడానికి కూడా టైమ్ దొరకనంతగా ఉరుకులు పరుగులు. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధం ఆగి΄ోతుందని మనసులో చిన్న ఆశ. అంతలోనే మరో పెద్ద విషాదాన్ని రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. పూర్తిగా నష్ట΄ోయాం. ఇంతకంటే ఎక్కువగా నష్ట΄ోయేది ఏమిటి అనిపించేది కొన్నిసార్లు’ గతాన్ని గుర్తు చేసుకుంది ప్లెస్తియ.గాజాలో యుద్ధవార్తలు కవర్ చేస్తున్న రోజుల్లో ప్లెస్తియకు నిద్రపోవడానికి కూడా టైమ్ దొరికేది కాదు. తిండి సరిగా ఉండేది కాదు. పెట్రోల్ కొరత వల్ల మీడియా వాహనం ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడం కష్టంగా ఉండేది. కొన్నిసార్లు టీమ్‌తో సంబంధాలు తెగిపోయేవి. కరెంట్ కష్టాలు, ఫోన్ కష్టాలు సరే సరి.‘ఈ రోజు సరే, రేపు బతికి ఉంటానా అని ఎప్పటికప్పుడు అనుకునేదాన్ని’ అంటూ గత రోజులను గుర్తు చేసుకుంది ప్లెస్తియ. వార్తలను కవర్ చేసేందుకు మొదట్లో మెడలో ఐడీ ట్యాగ్ వేసుకునేది. ప్రెస్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించేది. అయితే వీటివల్లే ఎక్కువ ప్రమాదం ఉందని గ్రహించి వాటికి దూరంగా ఉంది.‘ఈ రోజు ఏం కవర్ చేయాలి...అని ఎప్పుడూ ΄్లాన్ చేసుకోలేదు. కొన్నిసార్లు స్టోరీ కోసం వెదికేదాన్ని. మరికొన్ని సార్లు స్టోరీ నన్ను వెదుక్కుంటూ వచ్చేది’ అంటున్న ప్లెస్తియ రిపోర్టింగ్‌కు వెళుతున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చేవి. ఆ గండాల నుంచి అదృష్టశాత్తు బయటపడింది.గాజాలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు తనకు ప్రజల నుంచి రకరకాల స్పందనలు ఎదురయ్యేవి. కొందరు ఆ΄్యాయంగా పలకరించి బ్రెడ్, టీ ఇచ్చేవారు. ‘ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు వెరవకుండా మీ జర్నలిస్ట్‌లు పనిచేస్తున్నారు. మీ వల్లే మా బాధలు ప్రపంచానికి తెలుస్తున్నాయి’ అని ప్రశంసించేవాళ్లు.కొందరు మాత్రం...‘నేను జర్నలిస్ట్’ అని పరిచయం చేసుకోగానే భయపడేవారు. ‘ఇప్పటికే ఎంతోమంది జర్నలిస్ట్‌లు చని΄ోయారు. మా గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందు మీరు జాగ్రత్తగా ఉండండి’ అనేవాళ్లు. ‘నిజానికి నేను వారి దగ్గరికి జర్నలిస్ట్‌గా కంటే సాటి మనిషిగా వెళ్లాను. వారి బాధలను పంచుకున్నాను. ధైర్యం చె΄్పాను’ అంటున్న ప్లెస్తియ ఆశావాది. యుద్ధం లేని రోజులు, గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్ర΄ోయే రోజులు వస్తాయని, మాయమైపోయిన నవ్వుల పువ్వులు మళ్లీ వికసిస్తాయని, ‘యుద్ధం గతం మాత్రమే. వర్తమానం కాదు’ అని బలంగా నమ్మే రోజులు వస్తాయనే ఆశిస్తోంది ప్లెస్తియ. ఇజ్రాయెల్ సైనిక దాడి గురించి రిపోర్టింగ్ చేస్తూ మరణించిన జర్నలిస్ట్ షిరీన్ అబూ స్మారక స్కాలర్షిప్ ΄÷ందిన ప్లెస్తియ లెబనాన్‌లో స్టూడెంట్‌గా మరో ప్రయాణం మొదలుపెట్టింది. ఈ యువ జర్నలిస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. -
హమాస్ క్షీణత ఖాయం: ఇజ్రాయెల్
పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగున్నాయి. మరోవైపు.. ప్రపంచంలోని పలు దేశాలు హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బంధీ విడుదలకు సంధి ఒప్పందానికి ప్రయత్నిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఓ మిలటరీ వ్యవస్థలా ఎక్కువ కాలం కొనసాగలేదని పేర్కొన్నారు. తొలి దశలో ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్‌తో ఒప్పందానికి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో హమాస్‌తో ఒప్పందం ఓ వ్యూహాత్మక అవకాశంగా నిలుస్తుంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ బందీలను స్వదేశానికి తీసుకురావడమే సరైన నిర్ణయం. ఇజ్రాయెల్ ఆరు వారాల పాటు కాల్పుల విరామం తీసుకుని, బందీలను తిరిగి తీసుకురావడానికి ఒప్పందాన్ని ఆమోదించాలి. 11 నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా. హమాస్ గెరిల్లా యుద్ధంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్ కూడా హమాస్ మిలిటెంట్లతో తీవ్రంగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ పటిష్టమైన మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగుతుందనే నమ్మకం లేదు’’ అని అన్నారు.ఇక.. గాజాలో ఇజ్రాయెల్, హమాస్ జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తులు ప్రయత్నాలు సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక.. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటిరకదాదాపు 41 వేల మంది పాలస్తీనియలు మృతి చెందారు. -
గాజా సొరంగంలో ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు
దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో ఓ సొరంగంలో ఆరుగురి బంధీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు వీరిని బంధీలు గాజా తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్, అలెగ్జాండర్ లోబనోవ్, అల్మోగ్ సరుసి, ఒరి డానినో మృతదేహాలను ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. వీరు తాము స్వాధీనం చేసుకునే కొంత సమయం ముందు హమాస్ మిలిటెంట్ల చేతిలో దారుణంగా హత్యకు గురైనట్లు ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. దక్షిణ గాజాలోని భూగర్భ సొరంగం నుంచి 52 ఏళ్ల ఇజ్రాయెల్ బంధీ ఖైద్ ఫర్హాన్ అల్కాడిని సైన్యం రక్షించి వారం రోజులు గడవక ముందే ఒకేసారి ఆరుగురి మృతి దేహాలను స్వాధీనం చేసుకోవటం గమనార్హం. ఈ ఆరుగురిలో ఇజ్రాయెలీ-అమెరికన్ హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్ అన్నారు. గోల్డ్బెర్గ్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు రోజు.. గాజా యుద్ధాన్ని ముగించాలని బైడెన్ పిలుపునిచ్చారు. బందీల విడుదల, విధ్వంసమైన గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ కోసం పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో కొనసాగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.‘ గాజా ఒప్పందాన్ని ముగించగలమని భావిస్తున్నాం. ఇరువురు సంబంధిత ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు చెప్పారాయన.ఇదిలాఉండగా.. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 40,691 మంది మరణించగా.. 94,060 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చేసిన 1,200 మందిని మృతి చెందగా.. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లారు. -
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురి పాలస్తీనా ఉగ్రవాదుల మృతి
గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులను కొనసాగిస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు.. స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంటోంది. తాజాగా తమ సైన్యం చేతిలో ఐదుగురు పాలస్తీనా ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లోని ఓ మసీదులో దాక్కుకొని ఉన్న ఉగ్రవాదులను ఇజ్రాయెల్ దళాలు కాల్చిచంపినట్లు పేర్కొంది. ఈ ఐదుగురిలో ఒక స్థానిక కమాండర్ మహ్మద్ జాబర్ అలియాస్ అబూ షుజా ఉన్నట్లు ఇజ్రాయెల్ బలగాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చేసిన పలు దాడుల్లో అబూ షుజా హస్తం ఉన్నట్లు ఆర్మీ పేర్కొంది. జూన్‌లో జరిపిన భారీ కాల్పులకు అబూ షుజా ప్లాన్ చేసినట్టు తెలిపింది.అబూ షుజా గతంలోనే మృతి చెందినట్లు పలు నివేదికలు వెల్లండించాయి. అయితే పలువురు మిలిటెంట్ల అంత్యక్రియల్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. నూర్ షామ్స్ శరణార్థి శిబిరంలోని ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్ కమాండర్ మహ్మద్ జాబర్ మృతిపై పాలస్తీనా ఇంకా ధృవీకరించకపోవటం గమనార్హం. బుధవారం నుంచి పాలస్తీనాపై చేస్తున్న ఇజ్రాయెల్ దాడుల్లో 10 మంది ఫైటర్లు మృతి చెందినట్లు హమాస్ మలిటెంట్ సంస్థ పేర్కొంది. -
ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు.. వీళ్ల వైరం ఏనాటిది!
పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. అయితే.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు! దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం మొదలైంది.పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్‌లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్‌లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్ నేతలతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్బొల్లా, యెమన్‌కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది.హనియేను ఇజ్రాయెల్ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్‌పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గలాంట్ ప్రకటించారు.గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్ నమ్ముతోంది.హనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు.మరోవైపు.. హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమొందించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1983లో బీరూట్‌లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్ ఆ దేశ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.హనియే హత్యపై ప్రకటన వెలువడగానే బుధవారం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహిస్తారు. తాజా పరిణామాలపై ఈ భేటీలో ఖమేనీ సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగాలని సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పడానికి ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండగా, పూర్తిస్థాయి యుద్ధానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఇరాన్‌కు సందేశం చేరవేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ‘చానెల్ 12’ తెలియజేసింది. తమ దేశంపై ఇరాన్ గానీ, దాని మిత్రదేశాలు గానీ దాడులకు దిగితే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లేనని ఇజ్రాయెల్ తేలి్చచెప్పినట్లు వివరించింది. ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది ముమ్మటికీ ఇజ్రాయెల్ సైన్యమేనని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా నోరువిప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తాజాగా స్పందించారు. తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ‘అసోసియేటెడ్ ప్రెస్’తో మాట్లాడుతూ చెప్పారు.హమాస్ మిలటరీ విభాగం ‘ఖస్సం బ్రిగేడ్స్’ అధి నేత మొహమ్మద్ దీఫ్‌ను ఖతం చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీ శివారులో ఓ కాంపౌండ్‌పై నిర్వహించిన వైమానిక దాడులో అతడు హతమయ్యాడని వెల్లడించింది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను హత్య చేసిన మరుసటి రోజే మొహమ్మద్ దీఫ్ మృతిని ఇజ్రాయెల్ నిర్ధారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం!గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. అనంతరం ఇరాన్ పాలనా పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికా పట్ల దేశ వైఖరిని మార్చేసింది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారిపోయింది. దాంతో ఇజ్రాయెల్, అమెరికాలు ఆ దేశానికి దూరం అయ్యాయి. సామ్రాజ్యవాదాన్నే తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్‌ను వ్యతిరేకించడం మొదలు పెట్టాయి. అమెరికాను ‘మహా సాతాను’గా, ఇరాన్ చివరి చక్రవర్తి మొహమ్మద్ రెజా పహ్లావీకి మద్దతు తెలుపుతున్న ఇజ్రాయెల్‌ను ‘చిన్న సాతాను’గా అభివర్ణించింది. నాటి నుంచి టెహ్రాన్-టెల్ అవీవ్ మధ్య శత్రుత్వం క్రమంగా పెరగడంతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఖమేనీ ఆరోపించారు.ఇజ్రాయెల్ పౌరుల పాస్‌పోర్టులను గుర్తించడం మానేసింది. టెహ్రాన్‌లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి, దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ)కు అప్పగించింది. 1990 వరకు కూడా ఇజ్రాయెల్‌కు ఇరాన్ మీద శ్రతుత్వం లేదు. కానీ కాలక్రమంలో ఇరాన్‌ను తన మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది. దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్లో షియాలు మెజార్టీ కాగా, మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తన పై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ హిజ్బుల్లాను పుట్టించింది.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని ‘షాడో వార్’ గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఈ షాడో వార్‌కు లెబనాన్, సిరియా యుద్ధవేదికలుగా ఆవిర్భవించాయి. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూపునకు ఇరాన్ అండగా నిలిచింది. మరోవైపు సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు కూడా ఇరాన్ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో 1967 యుద్ధం తర్వాత సిరియాలోని గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. నాటి నుంచి సిరియా, లెబనాన్‌పై దాడులు జరిపేందుకు గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటుంది.1992లో ఇరాన్‌కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూపు బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసి, 29మంది మృతికి కారణమైంది. దానికి కొన్నిరోజుల ముందే హిజ్బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు ఆపాదించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేది. ఇరాన్ వద్ద అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ప్రజా అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మకపోవడం గమనార్హం. ఈక్రమంలో 2000 సంవత్సరంలో ఇరాన్ అణు సంపద మీద దాడి చేసింది ఇజ్రాయెల్. న్యూక్లియర్ ప్రాజెక్ట్ లో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్‌దే బాధ్యత అని టెహ్రాన్ నిరసన వ్యక్తం చేసింది. 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదెహ్ హత్యకు గురవడానికి కూడా ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నమ్ముతోంది. మరోవైపు తమ ప్రాంతాల్లో రాకెట్, డ్రోన్ల దాడులకు కారణం ఇరానేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దాంతో పాటూ ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలిచింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్రసముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది.గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన భీకర దాడుల్లో తమ పాత్ర లేదని ఇరాన్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడిని స్వాగతించింది. మరోవైపు హమాస్‌కు మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 1న ఇజ్రాయెల్‌కు చెందినవిగా అనుమానిస్తున్న కొన్ని యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో సీనియర్ కమాండర్లు సహా ఏడుగురు అధిదారులు మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. -
పాలస్తీనాను అదీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం
ది హేగ్: పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అ«దీనంలో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని, అక్కడ స్థిర నివాసానికి కాలనీల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని సూచించింది. 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ అజమాయిషీని తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయం స్థానం తీర్పు ఇవ్వడం అసాధారణ విషయంగా పేర్కొంటున్నారు. వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను నిర్మించడం, విస్తరించడం, ఆక్రమిత ప్రాంతాలను స్వా«దీనం చేసుకోవడం, వాటిపై నియంత్రణ, అక్కడి సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని జడ్జీల ప్యానెల్ అభిప్రాయపడింది. ఆక్రమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్‌కు సార్వ¿ౌమాధికారం లేదని, పాలస్తీనాలోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించడంఅంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని పేర్కొంది. అయితే అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచి్చన ఈ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిన, పాటించాల్సిన అవసరం ఇజ్రాయెల్‌కు లేదు. ఇదొక అభిప్రాయం మాత్రమే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ.. ఆ ప్రాంతాలు యూదు ప్రజల చారిత్రక మాతృభూమిలో భాగమన్నారు. -
ఖాన్ యూనిస్‌ను వెంటనే ఖాళీ చేయండి.. ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భారీగా దాడులకు పాల్పడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ గాజాలోని రెండో అతిపెద్ద నగం అయిన ఖాన్ యూనిస్‌లో దాడుల స్థాయిని పెంచనున్నట్ల సమాచారం. ఈ మేరకు ఖాన్ యూనిస్‌లో ఉండే పాలస్తీనియన్లు వెంటనే ఖాళీ చేయాలని సోమవారం ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది పాస్తీనియన్లు ఇతర ప్రాంతాకు తరలివెళ్తుతున్నారు. దీంతో ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ ఆస్పత్రిలోని పేషెంట్లను సైతం ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలిస్తున్నారు. గతవారం ఉత్తర గాజాలోని షెజాయా నగరంలో ప్రజలకును ఖాళీ చేయమన్న ఇజ్రాయెల్ ఆర్మీ.. ఐదో రోజు కూడా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. దక్షిణ రఫా ప్రాంతంలో జరిగన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు మృతి చెందాడు.హమాస్‌ను అంతం చేసే దశలో ఇజ్రాయెల్ పురోగతి సాధింస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నాడు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా దాడుల తీవ్రత పెంచాలని ఆర్మీకి సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖాన్ యూనిస్‌లో మళ్లీ దాడులకు ఇజ్రాయెల్ ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ మిలిటెంట్లను అంతం చేయటంలో భాగంగా ఈ ఏడాది మొదట్లో ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉండే పాలస్తీనా ప్రజలు దక్షిణ గాజా నగరమైన రఫాకు తరలివెళ్లారు.అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1200 మృతి చెందగా.. 251 మందిని బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హామాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై విరచుకుపడుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పవరకు 37,900 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.చదవండి: ట్రంప్ విషయంలో కోర్టు తీర్పు ఎంతో ప్రమాదకరం: బైడెన్ -
ప్రపంచాన్ని నిలదీస్తున్న యువత
పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ అమెరికాలోని నూటయాభై విశ్వవిద్యాలయలలో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఏప్రిల్ 2024లో కొనసాగిన నిరసన కార్యక్రమాల్లో బోధన–బోధనేతర ఉద్యోగులు కూడా విద్యార్థులతో పాటు భాగస్వాములయ్యారు. ఇందులో హార్వర్డ్, బర్రత్ హాల్, కొలంబియా, ప్రిన్స్టన్, న్యూయార్క్, యేల్ వంటి అన్ని అమెరికన్ యూనివర్సిటీల విద్యార్థులున్నారు. అయితే నిరసనలో చురుకుగా పాల్గొన్న పదమూడు మంది విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ డిగ్రీలివ్వకుండా ఆపేసింది. ‘గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలకు విద్యార్థులందరూ హాజరు కావచ్చు, కానీ, డిగ్రీలు రద్దయిన ఆ పదమూడు మందికి పట్టా ఇవ్వబడదు’– అని యూనివర్సిటీ ప్రకటించింది. నిరసన సెగలకు తట్టుకోలేక, కొన్ని యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లు వాయిదా వేసుకున్నాయి. కొన్ని మాత్రం నిర్వహించుకున్నాయి. నిర్వహించుకున్న వాటిలో హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒకటి. గాజా మీద దాడులు ఆపాల్సిందిగా, పాలస్తీనాను రక్షించాల్సిందిగా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం విద్యార్థులు కోరారు. తమ తమ క్లాసురూముల్లో నుండి ఆడిటోరియంలోని వేదిక మీదికి ఒక్కొక్కరుగా వరుస క్రమంలో క్రమశిక్షణతో నడిచి వస్తూ ‘ఫ్రీ గాజా నౌ’ ‘ఫ్రీ పాలస్తీనా నౌ’–గాజాకు స్వేచ్ఛనివ్వండి! పాలస్తీనాకు స్వేచ్ఛనివ్వండి! అని రాసి ఉన్న గుడ్డ, పేపర్ బేనర్లను ప్రదర్శిస్తూ వేదిక మీదకు నడిచివెళ్లారు. డిగ్రీలు తీసుకున్నారు. డిగ్రీ తీసుకున్న విద్యార్థుల నుండి కొందరికి మాట్లాడే అవకాశం ఇస్తారు. అలా మాట్లాడే వారిని విద్యార్థులే ఎన్నుకుంటారు. ఆ అవకాశం దక్కించుకుంది భారతీయ–అమెరికన్ విద్యార్థిని శ్రుతీ కుమార్. ఆమె ప్రసంగంలోని సారాంశం ఇలా ఉంది: ‘‘నేను తీవ్రంగా నిరాశ చెందాను. ఈ కేంపస్‌లో భావ వ్యక్తీకరణను శిక్షించడం జరిగింది. శాసనోల్లంఘన జరిగిందని శిక్షించడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ ఎక్కడున్నాయి? పదిహేను వందలమంది విద్యార్థులు మాట్లాడారు. పిటిషన్లు సమర్పించారు. ఐదు వందల మంది అధ్యాపకులు మాట్లాడారు. మా ఆక్రోశం, మా ఆవేదన హార్వర్డ్– నీకు వినిపిస్తోందా?గాజాలో జరుగుతున్న సంఘటనలతో మనం మన సమాజంలో నిలువుగా బలంగా విడిపొయ్యాం! మనకు తెలియని వారిలోని మానవత్వాన్ని మనం గుర్తించలేమా? మనకు భేదాభిప్రాయాలు ఉన్నంతమాత్రాన వారి వేదననూ, నొప్పినీ అర్థం చేసుకోలేమా? గాజాలో జరుగుతున్న మారణకాండను మేమెవ్వరం సమర్థించడం లేదు. భావ ప్రకటన, సంఘీ భావ ప్రకటన ఈ కేంపస్‌లో శిక్షలకు గురయ్యాయి. ఈ సెమిస్టర్లో ఈసారి నా పదమూడు మంది సహ విద్యార్థులకు డిగ్రీలు అందడం లేదు. వారు మాతో పాటు పట్టభద్రులు కాలేకపోతున్నారు. శాసనోల్లంఘన జరిగిందని– ఉద్యమిస్తున్న విద్యార్థుల పట్ల యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం మా విద్యార్థి లోకాన్ని ఎంతగానో బాధించింది. ఇంకా చెప్పాలంటే నలుపు, చామనచాయ చర్మం గల నాలాంటి విద్యార్థినీ విద్యార్థులకు ఇక్కడ వ్యక్తిగత భద్రత లేదు. మా పట్ల ఎందుకీ అసహనం? ఎందుకీ అణచివేత? హార్వర్డ్! మా మాటలు నీకు వినిపిస్తున్నాయా?’’అమెరికాలోని నిబ్రాస్కాలో పుట్టి పెరిగిన ఇరవైయేళ్ళ యువతి శ్రుతీ కుమార్, తన పదినిముషాల ప్రసంగంతో ప్రపంచాన్ని కదిలించింది. తన తోటి విద్యార్థులకు పట్టాలు రాకపోవడం పట్ల ఆవేదన తెలియజేస్తూ– గాజాపై జరుగుతున్న దాడుల గూర్చీ, నల్లచర్మం ఆధారంగా సాగుతున్న జాతి వివక్ష గూర్చీ ఆక్రోశిస్తూ మాట్లాడిన మాటలకు హార్వర్డ్ యూనివర్సిటీ ఆడిటోరియంలో, ఆడిటోరియం బయట ఉన్న వేలమంది, వేదిక మీద ఉన్న అధ్యాపకులతో సహా– అందరికందరూ లేచి నిలబడి కాంపస్ దద్దరిల్లిపోయేట్లు చప్పట్లు చరిచారు. ‘హార్వర్డ్ నీకు వినిపిస్తోందా?’ అని గద్గద స్వరంతో ఆమె ఆక్రోశించినపుడల్లా విద్యార్థులు పెద్దఎత్తున చప్పట్లు చరిచి ఆమెకు తమ సంఘీభావం తెలియజేశారు. అయితే ఆ ఆవేదన, ఆ ఆక్రందన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రాంగణానికే పరిమితం కాలేదు. ‘ప్రపంచమా! నీకు మా ఆక్రోశం, ఆవేదన వినిపిస్తోందా?– అని యువతరం ప్రశ్నిస్తున్నట్టు ప్రపంచ శ్రోతలకు అనిపించింది.సంఘసేవ పట్ల ఆసక్తి గల శ్రుతీ కుమార్, డాక్టర్ కోర్సును వదులుకుని, వైజ్ఞానిక శాస్త్ర చరిత్ర, ఆర్థిక శాస్త్రం చదువుకుని పట్టా సాధించారు. తమిళనాడు నుండి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ దక్షిణ భారత సంప్రదాయ కుటుంబం వారిది. మనదేశంలోనూ విద్యార్థి ఆందోళనలు జరుగుతున్నాయి. వెంటనే కులగణన జరిపించాలనీ, అందరికీ సమానంగా ఉద్యోగాల్లో అవకాశాలుండాలనీ హరియాణాలోని అశోక విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన సమ్మె, నిరసనలూ తక్కువవి కావు. ప్రపంచంలో యువతరం ప్రశ్నని బలోపేతం చేస్తూ ఉందన్న దానికి అన్ని చోట్లా జరుగుతున్న విద్యార్థి నిరసనలను సంకేతాలుగా చూడాలి!!డా‘‘ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత ‘ మెల్బోర్న్ నుంచి -
న్యూయార్క్‌లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
అమెరికాలోని న్యూయార్క్లోగల బ్రూక్లిన్ మ్యూజియంపై వందలాది మంది పాలస్తీనా అనుకూల నిరసనకారులు హఠాత్తుగా దాడికి దిగారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.అయితే పోలీసుల రాకకుముందే నిరసనకారులు బ్రూక్లిన్ మ్యూజియం వద్దకు చేరుకుని, ఆ ప్రాంగణంలో టెంట్లు వేసి, భవనంపై ‘ఫ్రీ పాలస్తీనా’ పేరుతో గల బ్యానర్లను ఎగురవేశారు. మ్యూజియం వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో న్యూయార్క్ నగర పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో కొంతమంది నిరసనకారులు పోలీసు అధికారులపై ప్లాస్టిక్ బాటిళ్లను విసిరారు.ఘటనా స్థలంలో పోలీసులకు, ఆందోళనకారులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యూయార్క్ పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. దీనికిముందు పాలస్తీనా మద్దతుదారులు బార్క్లేస్ సెంటర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్నవారు డప్పులు కొడుతూ, పలు నినాదాలు చేస్తూ మ్యూజియం వైపు తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే!
నోరు మూయించి పెత్తనం చేసే పాలకులు నోరు మూసుకుని బతికే ΄పౌరులు చరిత్ర నిండా ఉంటారు. కాని నోరు మూసుకొని ఉండటం చేతగాక అన్యాయాన్ని చూస్తూ ఉండలేక గొంతెత్తి గర్జించేవాళ్లు చరిత్రలో నిలబడిపోతారు. మన దేశ మూలాలున్న హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని శ్రుతి కుమార్– ఆ ప్రతిష్టాత్మక ్రపాంగణంలో గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా నోరు విప్పింది. ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. వెనుకంజ వేయని మానవత్వం చాటిన శ్రుతి కుమార్ పరిచయం, నేపథ్యం.హార్వర్డ్ యూనివర్సిటీ తన విద్యార్థుల గురించి సరిగ్గా అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉంటే బహుశా శ్రుతి కుమార్‌కు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ సెరెమొనీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు విశేషంగా హాజరయ్యి వేదిక మీద పట్టా అందుకుంటున్న తమ పిల్లలను హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రతి ఏటా ఈ సెర్మనీలో పట్టా పొందుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈసారి ప్రసంగం చేసే అవకాశం శ్రుతి కుమార్‌కు వచ్చింది. అక్కడే ఆమెకు గొంతెత్తే అవకాశం లభించింది.నిరసనల నేపథ్యంఅక్టోబర్ 7, 2023న హమాస్ సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేసి 1400 ఇజ్రాయిలీల మరణానికి కారణం కావడంతో బదులు తీర్చుకోవడానికి రంగంలో దిగిన ఇజ్రాయిల్ నేటికీ ఆగని బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇప్పటికి 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వీరిలో కనీసం ఇరవై వేల మంది స్త్రీలు, పసి పిల్లలు. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు మొదలైనా ఇజ్రాయిల్ మరింత దుర్మార్గంగా గాజాలోని ఆస్పత్రుల పై, స్కూళ్లపై దాడులు చేస్తుండటంతో ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. ఏప్రిల్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు ‘యాంటీ ఇజ్రాయిల్’ నిరసనలతో హోరెత్తాయి. యూనివర్సిటీలు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటికి 900 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వారిలో ఒక భారతీయ విద్యార్థిని కూడా ఉంది. అమెరికా యూనివర్సిటీలు తమ దగ్గర పోగయ్యే ఫండ్స్‌ను ఇజ్రాయిల్‌కు వంత పాడే బహుళ జాతి వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని, ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్. అంతే కాదు టెల్ అవివ్ (ఇజ్రాయిల్) యూనివర్సిటీతో కోర్సుల ఆదాన ప్రదానాలు చేసుకోవడం బంద్ చేయాలని కూడా డిమాండ్. ఏప్రిల్ 18న ఇదే విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు ఏకంగా మూడు చోట్ల పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దాంతో యూనివర్సిటీ కన్నెర్ర చేసి ‘వయొలేషన్ ఆఫ్ యూనివర్సిటీ పాలసీ’ కింద 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా శిక్షించింది. అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రుతి కుమార్ ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీని ఎంచుకుంది.ఆమె ఒక టోర్నడోబీభత్సమైన పిడుగుపాట్లకూ, టోర్నడోలకు పేరు పెట్టిన నెబ్రాస్కా (అమెరికా) రాష్ట్రంలో పుట్టిన కన్నడ మూలాలున్న అమ్మాయి శృతి కుమార్. అక్కడ విస్తారంగా సాగు చేసే జొన్నరైతుకు పెద్ద కూతురు ఆమె. చదువుతో పాటు ఆట, పాట, మాటలో కూడా ఆసక్తి చూపింది. మంచి వక్త. ‘నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ –2019’లో పాల్గొని ఐదవ ర్యాంకులో నిలిచింది. 2020లో ‘వాయిస్ ఆఫ్ డెమొక్రసీ’ పోటీలో మొదటి విజేతగా నిలిచి 30 వేల డాలర్లు గెలుచుకుంది. అంతేకాదు తన చదువుకు స్పాన్సర్ని కూడా. యోగాలో దిట్ట. ముందు నుంచి అన్యాయాల, అపసవ్యతల మీద వ్యతిరేకత తెలిపే అలవాటున్న శ్రుతి కుమార్‌కు హార్వర్డ్ అవకాశం ఇవ్వడంతో ఆ యూనివర్సిటీనే హెచ్చరించి ఖంగు తినిపించింది.తెలియనితనపు బలంహార్వర్డ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో శ్రుతి కుమార్ తన ప్రసంగానికి పెట్టుకున్న పేరు ‘తెలియనితనంలో ఉండే బలం’. ఆమె తన ప్రసంగం చేస్తూ ‘ప్రపంచంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ తెలిసి నోరు మెదపని వారి కంటే ఏమీ తెలియకనే అది అన్యాయమనే కేవలం గ్రహింపుతో బరిలోకి దిగి ఎదిరించే నాలాంటి విద్యార్థులకు ఉండే బలం పెద్దది’ అని అంది. ‘పసిపిల్లల వంటి అమాయకత్వంతో కొత్త జన్మెత్తి అన్యాయాలను ప్రతిఘటించడానికి ముందుకు రావాలనే’ అర్థంలో శ్రుతి కుమార్ మాట్లాడి హర్షధ్వానాలు అందుకుంది. ‘మన విశ్వవిద్యాలయ ్రపాంగణంలో భావ ప్రకటనా స్వేచ్చపట్ల వ్యక్తమైన అసహనాన్ని చూసి నేను చాలా నిరాశకు గురవుతున్నాను. 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా ఆపారు. దీనిని వ్యతిరేకిస్తూ పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదు వందల మంది అధ్యాపకులం ఖండించాం. విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. అయినా సరే వినలేదు. హార్వర్డ్, మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్, మా మాటలు వింటున్నావా?’ అని శ్రుతి గర్జించింది. ‘ఇప్పుడు గాజాలో జరుగుతున్న ఘటనల మీద క్యాంపస్ మొత్తంగా దుఃఖం, అనిశ్చితి, అశాంతి చూస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ఇటువంటి క్షణంలోనే తెలియనితనపు శక్తి కీలకమైన దవుతుంది’ అందామె.పర్యవసానాలను గురించి వెరవక శ్రుతి ఈ ప్రసంగం చేసింది. యూనివర్సిటీకి తాను ఇచ్చిన ప్రసంగం పేజీలలో లేనిదాన్ని మధ్యలో ఇమిడ్చి ధైర్యంగా మాట్లాడింది. నిజం చె΄్పాలంటే శ్రుతి అన్ని దేశాల విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తోంది. అన్నీ తెలిసి ఊరికే ఉండటం కన్నా, ఏమీ తెలియకనే ‘అన్యాయం’ అనిపించినప్పుడు వెంటనే గొంతెత్తాలని సందేశం ఇస్తోంది.ఆమె ప్రసంగంలో కొంత‘నేడు ఈ ఉత్సవం మనకు తెలిసినదాని కోసం చేస్తున్నారు. మనకు ఏం తెలుసో దానిని ప్రశంసిస్తున్నారు. కాని తెలియనితనపు బలం ఒకటుంటుంది. నేనిక్కడికి (హార్వర్డ్) వచ్చేవరకూ ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ అనే పాఠ్యాంశం ఉన్నదనేదే నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆ శాఖ నుంచి నేను గ్రాడ్యుయేట్ నయ్యాను. చరిత్రంటే మనకు తెలిసిన కథల గురించి ఎంత చదవాలో... తెలియని కథల గురించి కూడా అంత చదవాలని ఇక్కడే తెలుసుకున్నాను’(మరికొంతసేపు మాట్లాడి తన దుస్తులలో నుంచి చిన్న కాగితం తీసి ప్రధాన ప్రసంగానికి విరామం ఇచ్చి ఇలా మాట్లాడింది) ‘నా నాల్గవ సంవత్సరం చదువులో యూనివర్సిటీలో మా భావ ప్రకటనా స్వేచ్ఛ, మా నిరసన ప్రదర్శనా స్వేచ్ఛ నేరాలుగా మారిపోయాయి. నేనిక్కడ ఇవాళ మీ ముందు నిలబడి నా సహ విద్యార్థులైన పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. ఆ పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఇవాళ పట్టభద్రులు కాలేకపోతున్నారు. మన విశ్వవిద్యాలయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల వ్యక్తమైన అసహనం ఫలితం ఇది. దీనికి నేను చాలా నిరాశæ చెందుతున్నాను. పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదువందల మంది అధ్యాపకులం ఈ అసహనాన్ని ఖండించాం. యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. విద్యార్థులు మాట్లాడినా అధ్యాపకులు మాట్లాడినా అదంతా ఈ క్యాంపస్‌లో స్వేచ్ఛ గురించే. ΄పౌరహక్కుల గురించే. హార్వర్డ్... మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్... మా మాటలు వింటున్నావా?’(అని మళ్లీ ప్రధాన ఉపన్యాసంలోకి వచ్చింది) ‘ఒక జాతి అయిన కారణాన తనను లక్ష్యంగా చేసి దాడులకు గురి చేయడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. హింసా, మృత్యువూ మన కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. మనకు తెలియవలసిన అవసరం కూడా లేదు. మనం కూడగట్టి మాట్లాడటం అనేది మనకు తెలిసి ఉన్న విషయాల గురించే కానక్కరలేదు. మనకు తెలియనిదాని గుండా కూడా ప్రయాణించాలి’ అందామె.ప్రసంగం చివర ఎమిలీ డికిన్సన్ కవితా వాక్యాన్ని కోట్ చేసింది. ‘ప్రభాతం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతి తలుపూ తెరిచి పెడతాను’. -
‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ వైరల్ ఫొటోపై ఇజ్రాయెల్ కౌంటర్
హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని రఫా నగరంపై దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం.. రఫాలో పాలస్తీనా పౌరులు తల దాచుకుంటున్న శిబిరాలపై భీకర వైమానిక దాడులకు తెగపడింది. ఈ దాడుల్లో 45 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు రెండువేల మంది గాయపడ్డారు. దీంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తమైంది.All eyes on #Rafah 🇵🇸 pic.twitter.com/bg3bAtl3dQ— The Palestinian (@InsiderWorld_1) May 27, 2024 ‘ఆల్ ఐస్ ఆన్ రఫా (అందరి దృష్టి రఫా పైన)’అని పాలస్తీనా శిబిరాలపై రాసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు షేర్ చేసి పాలస్తీనా పౌరులకు మద్దతుగా నిలిచారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను సెలబ్రిటీలు, నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. మరికొంత మంది నెటిజన్లు.. పాలస్తీనా పౌరులపై దాడులు ఆపేయాలని కోరారు.ALL EYES ON RAFAH pic.twitter.com/2dstfq7rWt— The Saviour (@stairwayto3dom) May 30, 2024 అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి వ్యక్తమైన ఆగ్రహం,వ్యతిరేకతపై తాజాగా ఇజ్రాయెల్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. ‘‘ మేము అక్టోబర్ 7 ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడులను మాట్లాడటం మానుకోము. అదేవిధంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను విడిపించుకునే వరకు మా పోరాటం ఆపము ’’ అని ‘వేర్ వర్ యువర్ ఐస్’అని చిన్నపిల్లాడి ముందు హమాస్ మిలిటెంట్ తుపాకి పట్టుకొని ఉన్న ఫొటోను షేర్ చేసి కౌంటర్ ఇచ్చింది.We will NEVER stop talking about October 7th. We will NEVER stop fighting for the hostages. pic.twitter.com/XoFqAf1IjM— Israel ישראל (@Israel) May 29, 2024‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ ఫొటో హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 45 మిలియన్ల మంది షేర్ చేశారు. భారతీయ సినీ సెలబ్రిటీలు సైతం తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫొటోను షేర్ చేశారు. ప్రియాంకా చోప్రా జోనస్, అలియా బట్, కరీనా కపూర్ ఖాన్, మధూరి దీక్షిత్, వరుణ్ దావన్, సమంత్ రుత్ ప్రభు తదితరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 36,050 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు 81,026 మంది గాయపడ్డారు. -
పాలస్తీనాకు మద్దతుగా పోస్ట్.. రోహిత్ శర్మ భార్యపై ట్రోల్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా ట్రెండింగ్‌లో ఉన్న ఓ పోస్ట్‌ను షేర్ చేయడమే ఇందుకు కారణం.వివరాల్లోకి వెళితే.. హమాస్ (పాలస్తీనాలో అధికారిక పార్టీ) నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులు జరుపుతుంది. ఈ దాడుల్లో 37 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. ఈ దాడుల అనంతరం రఫా నగరం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. విశ్వవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు రఫా నగరాన్ని హైలైట్ చేస్తూ పాలస్తీనాపై సానుభూతి చూపిస్తున్నారు.Meet Ritika Sajdeh, wife of Rohit Sharma.“Did she ever talk about Kashmiri Pandits?”-No“Did she ever talk about the vιolence happening by a specific community in India?”-No“Did she ever raise her voice for Hindus being persecuted in Pakistan and Bangladesh?”-No“Did she… pic.twitter.com/SFNrMHOtAM— Mikku 🐼 (@effucktivehumor) May 28, 2024టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక కూడా పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే ట్రెండింగ్‌లో ఉన్న ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.BIG NEWS 🚨 Rohit Sharma’s wife Ritika Sajdeh removes ‘All Eyes On Rafah’ Instagram story after facing backlash from Hindus 🔥🔥She had posted "All Eyes on Rafah" on social media in support of Palestine.Many Hindus started questioning her about her silence on the issue of… pic.twitter.com/ayfbgjtYV6— Times Algebra (@TimesAlgebraIND) May 29, 2024రితిక ఈ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. భారత్‌లో ఎన్ని అరాచకాలు జరిగినా స్పందించని రితిక పరాయి దేశంలోని సమస్యపై స్పందించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కశ్మీరీ పండిట్లపై దాడులు, మణిపూర్‌లో హింస, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఈమె ప్రశ్నించలేదే అని నిలదీస్తున్నారు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో, భారత్‌కు ఏమాత్రం సంబంధం లేని అంశంపై రితక స్పందించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇంటి సమస్యలు (భారత్‌లో జరిగేవి) పట్టవు కాని పరాయి దేశ సమస్యలపై గళం విప్పడం ఫ్యాషన్ అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. రఫా పోస్ట్‌పై నెట్టింట తీవ్ర వ్యతిరేత ఎదురవడంతో రితిక ఈ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేసి సైలెంట్ అయిపోయింది.ఇదిలా ఉంటే, రితిక కంటే ముందు చాలామంది భారతీయ సెలబ్రిటీలు పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే పోస్ట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ లిస్ట్‌లో కరీనా కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, త్రిప్తి దిమ్రీ, సమంత రూత్ ప్రభు, ఫాతిమా సనా షేక్, స్వరా భాస్కర్, దియా మీర్జా లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. -
ఇజ్రాయెల్‌పై కొత్త ఒత్తిళ్లు
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ కొత్తగా నార్వే, స్పెయిన్, ఐర్లాండ్ ప్రకటన చేయడం ఇజ్రాయెల్ మీద ఒత్తిడిని పెంచింది. ప్రస్తుతం రఫా మీద భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పటివరకూ సుమారు 36,000 మంది పాలస్తీనియన్ల మరణానికి కారణమైంది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ ఏకంగా గాజా నేరాలపై విచారణ కోసం నెతన్యాహూకు అరెస్టు వారెంట్లు జారీ చేయవలసిందిగా కోర్టుకు ప్రతిసాదించారు. నిరుడు అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల దాడిలో సుమారు 1200 మంది యూదులు మృతి చెందడానికి ప్రతీకారంగా తమ ఆత్మ రక్షణ కోసం హమాస్‌ను పూర్తిగా నిర్మూలించటం తమ లక్ష్యమనీ, తమను నిందించవలసింది లేదనీ ఇజ్రాయెల్ వాదిస్తున్నది. దీన్ని ప్రపంచం నిరాకరిస్తున్నది.పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు మూడు యూరోపియన్ రాజ్యాలు ఈ నెల 22న ప్రకటించటంతో ఇజ్రాయెల్‌కు కొత్త చిక్కులు మొదలవుతున్నాయి. అమెరికా ఒత్తిళ్లను సైతం తోసిపుచ్చి నార్వే, స్పెయిన్, ఐర్లండ్‌లు ఈ ప్రకటన చేయటం గమనార్హం. పైగా వీటిలో నార్వే, స్పెయిన్ నాటో సభ్య దేశాలు. పాలస్తీనాను ప్రపంచంలో ఇప్పటికే 143 దేశాలు గుర్తించినందున ఆ జాబితాలో ఈ మూడు కూడా చేరటం వల్ల సాధారణంగానైతే విశేషం ఉండదు. కానీ ఇజ్రాయెల్ సైన్యం గాజాలో గత ఆరు మాసాలుగా సాగిస్తున్న మారణహోమం పట్ల ప్రపంచ వ్యాప్తమైన తీవ్ర నిరసనల మధ్య సైతం అమెరికన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు అడుగడుగునా మద్దతునిస్తున్న స్థితిలో, ఈ మూడు దేశాల ప్రకటనకు తగిన ప్రాముఖ్యత ఏర్పడుతున్నది. వీరి నిర్ణయంతో ఇజ్రాయెల్‌పై కలిగిన ఒత్తిడికి రుజువు కొద్ది గంటలలోనే కనిపించింది. నార్వే, ఐర్లండ్, స్పెయిన్‌ల నుంచి తమ రాయబారులను నెతన్యాహూ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. తమ రాజధాని టెల్ అవీవ్‌లో గల ఆ మూడు దేశాల రాయబారులను పిలిపించి నిరసనను తెలియజేసింది. వారు పాలస్తీనియన్ల తీవ్రవాదాన్ని సమర్థిస్తున్నారనీ, తమకు గల ఆత్మ రక్షణ హక్కును గుర్తించటం లేదనీ, సమస్య పరిష్కారానికి ఆటంకాలు సృష్టిస్తున్నారనీ వ్యాఖ్యానించింది. అదే సమయంలో, గాజాపై తమ యుద్ధం యథావిధిగా కొనసాగగలదని స్పష్టం చేసింది. దీనిని బట్టి, మూడు యూరోపియన్ దేశాల ప్రకటన ఇజ్రాయెల్‌పై ఏవిధంగా ప్రత్యేకమైన ఒత్తిడిని సృష్టించిందో గ్రహించవచ్చు. ఈ విధమైన తీవ్ర ఒత్తిడి ఇది మూడవది కావటం మరొక గమనించదగ్గ పరిణామం. గతవారం ద హేగ్ లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు) ప్రాసిక్యూటర్ కరీం ఖాన్, గాజా నేరాలపై విచారణ కోసం నెతన్యాహూకు అరెస్టు వారెంట్లు జారీ చేయవలసిందిగా కోర్టుకు ప్రతిసాదించారు. అది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఇజ్రాయెల్ అయితే భూమ్యాకాశాలను ఏకం చేయటం మొదలుపెట్టింది. అమెరికన్ బైడెన్ ప్రభుత్వమైతే కోర్టును ఖండించటమే గాక, ఆ న్యాయమూర్తులపై ఆంక్షలు విధించగలమనే స్థాయికి వెళ్ళింది. విశేషమేమిటంటే, స్వయంగా నాటో సభ్య దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం మొదలైనవి కరీం ఖాన్ ప్రతిపాదనలను బలపరిచాయి. ఇందులో మరో విశేషం ఉన్నది. ఈ నాటో రాజ్యాలు ఒకవైపు అమెరికాతో పాటు ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా చేస్తున్నాయి. మరొకవైపు ఐక్యరాజ్య సమితిలో, భద్రతా సమితిలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా అమెరికా ఓటు వేస్తున్నా అవి మాత్రం ఓటు వేయటం లేదు. పైగా ఇప్పుడు కరీం ఖాన్ చర్యను సమర్థిస్తున్నాయి. ఇది ఒక స్థాయిలో పరస్పర విరుద్ధమైన వైఖరి. కానీ వారనేది, ఇజ్రాయెల్ ఆత్మరక్షణ చేసుకోవలసిందే గానీ అంతర్జాతీయ నియమ నిబంధనలను ఉల్లంఘించకూడదని!మొత్తానికి క్రిమినల్ కోర్టు పరిణామం ఇజ్రాయెల్‌పై ఇటీవలనే ఏర్పడిన మరొక ఒత్తిడి. ప్రాసిక్యూషన్ వారంట్ల జారీ ముగ్గురు హమాస్ అగ్ర నేతలకు కూడా జరగాలని కరీం ఖాన్ సిఫారసు చేశారు. దానిని హమాస్ కూడా ఖండించింది. కానీ ఇజ్రాయెల్ స్పందనలు విపరీత స్థాయిలో ఉన్నాయి. అమెరికాతో పాటు ఆ శిబిరానికి చెందిన కొన్ని దేశాలు అందుకు తోడయ్యాయి. ఇంతకూ కరీం ఖాన్ ప్రతిపాదనను చివరికి కోర్టు ఆమోదిస్తుందా, మార్పులు చేస్తుందా, తిరస్కరిస్తుందా తెలియదు. ఒకవేళ ఆమోదిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. హమాస్ నేతలు అజ్ఞాతంలో ఉన్నందున వారి అరెస్టు సాధ్యం కాదు. నెతన్యాహూ ఇజ్రాయెల్‌లో ఉన్నంతకాలం ఆయన అరెస్టూ వీలుకాదు. ఇందులో మరొక మెలిక ఉంది. కోర్టులో సభ్యత్వం గల దేశాలకు వెళ్లినట్టయితే మాత్రమే వారంట్లు వర్తిస్తాయి. ఆ యా ప్రభుత్వాలు వారిని అరెస్టు చేయక తప్పదు. ప్రస్తుతం ఆ సభ్య దేశాల సంఖ్య 124. వాటిలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా వంటివి లేవు. సభ్య దేశాలలో అమెరికా లేదు గాని యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం 27 దేశాలకూ సభ్యత్వం ఉంది. ఇది నెతన్యాహూకే గాక అమెరికాకు కూడా చాలా చిక్కులు తెచ్చి పెట్టే స్థితి. నెతన్యాహూకు వారంట్లు జారీ కావచ్చుననే చర్చ ఇప్పటికే వారం రోజులుగా సాగుతున్నది. దానితో, ఏమి చేయాలంటూ అమెరికా, యూరోప్ ఇప్పటికే తలలు పట్టుకుంటున్నాయి. కొందరు అటు, కొందరు ఇటుగా చీలిపోయారు. వారికి సంకట పరిస్థితి ఏమంటే, ప్రపంచ వ్యవహారాలన్నీ నియమ నిబంధనల ప్రకారం సాగాలని పట్టుదలగా వాదించేది వారే. అటువంటప్పుడు, తామే ఒప్పందంపై సంతకాలు చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారంట్లను ఎట్లా తిరస్కరించగలరు? ఈ స్థితి నెతన్యాహూను గత పదిరోజులుగా భయపెడుతున్నది. ఆయనపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టించిన మూడవ పరిణామం అంతర్జాతీయ న్యాయస్థానం గత జనవరిలో చెప్పిన వ్యతిరేక తీర్పు. గాజాలో ఇజ్రాయెల్ అమాయక పౌరుల సామూహిక హననానికి, విధ్వంసానికి పాల్పడుతున్నదనీ, వేలాదిమంది స్త్రీ పురుషులు, పిల్లలు, వృద్ధులు, రోగులు ప్రాణాలు కోల్పోయారనీ, ప్రజలకు ఆహార పానీయాలు, మందులు సైతం అందకుండా నిర్బంధాలు విధిస్తున్నారనీ దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ న్యాయస్థానంలో కేసు వేసింది. అప్పుడు కూడా ఇజ్రాయెల్ నానా హంగామా సృష్టించింది. అయినా కోర్టు ఇజ్రాయెల్‌కు వ్యతిరేక తీర్పునిచ్చింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ మారణకాండ ఆగలేదు. దక్షిణాఫ్రికా ఆరోపణలు నిజమైనట్లు అనేక స్వతంత్ర సంస్థల నివేదికలే గాక, సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆహార సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మానవ హక్కుల సంస్థల నివేదికలు కూడా ధ్రువీకరించాయి. అయినప్పటికీ, నిరుడు అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల దాడిలో సుమారు 1200 మంది యూదులు మృతి చెందడానికి ప్రతీకారంగా తమ ఆత్మ రక్షణ కోసం హమాస్‌ను పూర్తిగా నిర్మూలించటం తమ లక్ష్యమనీ, ఆ క్రమంలోనే ఇప్పటికి దాదాపు 35,000 పాలస్తీనియన్లు మరణించారనీ, అందులో తమను నిందించవలసింది లేదనీ ఇజ్రాయెల్ వాదిస్తున్నది. ఈ వాదనలను అత్యధిక ప్రపంచం నిరాకరిస్తున్నది.ఇక్కడ రెండు సమస్యలున్నాయి. మొదటిది, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు. రెండవది, మౌలికంగా పాలస్తీనా సమస్య దశాబ్దాల పాటు పరిష్కారం కాకుండా పెచ్చరిల్లుతుండటం. ఇటీవల ఇంత జరుగుతున్నా అమెరికన్లు ఇజ్రాయెల్‌కు వేలకు వేల కోట్ల డాలర్ల ఆయుధాలు సరఫరా చేస్తూ, ఆర్థికసాయం కూడా పంపుతున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఓటు వేస్తూ, భద్రతా సమితిలో వీటోను ఉపయోగిస్తున్నారు. పాలస్తీనా రాజ్యం ఏర్పాటును వ్యతిరేకిస్తూ, అటువంటి ఒప్పందం అంటూ జరిగితే అది ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య చర్చల ద్వారా జరగవలసిందే తప్ప బయటి జోక్యంతో కాదని విచిత్రమైన వాదన చేస్తున్నారు. మరొకవైపు ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా ప్రసక్తే లేదనీ, తామే ఆ భూభాగాలను నియంత్రించగలమనీ అంటున్నది. గాజా బయట వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో యూదు సెటిలర్లు క్రమక్రమంగా పెరిగిపోతూ అక్కడి పాలస్తీనియన్లను నిర్మూలిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా ఈ విధమైన వైఖరి తీసుకోవటానికి ఏకైక కారణం వారి సామ్రాజ్యవాద ప్రయోజనాలు. మొదటి నుంచి ఇప్పటి వరకూ అంతే. కనుకనే తాము స్వయంగా నిర్వహించిన క్యాంప్ డేవిడ్, ఓస్లో ఒప్పందాల ప్రకారం గానీ, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం గానీ పాలస్తీనా దేశాన్ని ఏర్పడనివ్వటం లేదు. వారిని ధిక్కరించి ఇప్పుడు నార్వే, స్పెయిన్, ఐర్లండ్‌లతో కలిపి (ఇండియా సహా) 146 ప్రపంచ దేశాలు స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తున్నాయి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
హమాస్ చెరలో ఇజ్రాయెల్ మహిళా సైనికులు! వీడియో విడుదల
హమాస్ మిలిటెంట్లు గతేడాడి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా.. హమాస్ మిలిటెంట్లు 250 ఇజ్రాయల్ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లారు. అయితే దాడి అనంతరం హమాస్ మిలిటెంట్లు సరిహద్దులో ఉన్న ఐదుగురు ఇజ్రాయల్ మహిళా సైనికులను బంధీలుగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘బంధీల కుటుంబ ఫోరం’ విడుదల చేసింది.ఆ వీడియోలో నహల్ ఓజ్ బేస్ వద్ద విధలు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ మహిళా సైనికులు.. లిరి అల్బాగ్, కరీనా అరివ్, అగామ్ బెర్గర్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ తెలుస్తోంది. మహిళా సైనికులు గాయాలతో, వారి చేతులు కట్టేసి ఉండటం ఆ వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. అందులో ఒక హమాస్ మిలిటెంట్.. ఇజ్రాయెల్ మహిళా సైనికులను ఉద్దేశిస్తూ మీరంతా అమ్మాయిలు, మహిళలు. మీరు గర్భవతులు అవుతారు’అని అన్నాడు. మరో మిలిటెంట్ ‘నువ్వు ఎంతో అందంగా ఉన్నావు’అని అన్నాడు."No You're NOT beautiful" Hamas taunts female IDF terrorists. Here's the part of the video Israel miss-translate to claim he said she was "So beautiful" God their desperation is CRINGE. pic.twitter.com/Iv3U1W3Jbi— Syrian Girl 🇸🇾 (@Partisangirl) May 23, 2024 అందులో ఓ సైనికురాలు మాట్లాడుతూ.. ‘నాకు పాలస్తీనాలో స్నేహితులు ఉన్నారు’అని అన్నారు. దీంతో వెంటనే స్పందించిన ఓ మిలిటెంట్.. ‘ మా సోదరులు ప్రాణాలు కోల్పోడానికి కారణం మీరే. మిమ్మల్ని మేము కాల్చేస్తాం’అని అన్నాడు. ఈ వీడియోను విడుదల చేసిన ‘బంధీల కుటుంబ ఫోరం’ హమాస్ చెరలో ఉన్న బంధీలను వెంటెనే విడిపించాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును డిమాండ్ చేస్తున్నారు.ఇజ్రాయెల్ మహిళా సైనికులు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. వారిలో చెరలో ఉన్న బంధీలను స్వదేశానికి రప్పించటంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవండని ప్రభుత్వ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సెర్ అన్నారు. ఇక.. ఈ వీడియోపై హమాస్ మిలిటెంట్లు స్పందించారు. ‘ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో నిజం కాదు. ఇజ్రాయెల్ కల్పిత కథనాల ప్రచారం. మహిళా సైనికులతో తప్పుగా ప్రవర్తించలేదు’అని వివరణ ఇచ్చారు. -
పాలస్తీనా స్వతంత్ర దేశం
టెల్ అవీవ్: పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం. శాంతి, సామరస్యం కోసమే.. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్ఈస్ట్ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్ గహర్ పేర్కొన్నారు. ఐర్లాండ్‌కు, పాలస్తీనాకు ఇదొక చరిత్రాత్మకమైన, ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్‌సహా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టంచేశారు. హంతకులకు, రేపిస్టులకు బంగారు పతకాలా? పాలస్తీనాను ఒకదేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చేసిన ప్రకటన పట్ల ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు దేశాల నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. తమ దేశంలో ఉన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. తద్వారా తమ నిరసనను తెలియజేసింది. హమాస్ హంతకులకు, రేపిస్టులకు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బంగారు పతకాలు బహూరిస్తున్నాయని, ఈ పరిణామాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ పేర్కొన్నారు. -
రగులుతున్న క్యాంపస్‌లు!
గాజాలో ఇజ్రాయెల్ అమానుష హత్యాకాండ మొదలైనప్పటినుంచీ అమెరికన్ విద్యాసంస్థల్లో అలుముకున్న అశాంతి ఈ వారం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. వియత్నాంను వల్లకాడు చేస్తున్న అమెరికా సైనిక దురాక్రమణకు వ్యతిరేకంగా 1968లో తిరుగుబాటు జెండా ఎగరేసిన విద్యార్థుల పోరాటాన్నీ, 1980ల్లో దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం నెల్సన్ మండేలాను దీర్ఘకాలం చెరసాలలో బంధించటాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమాలనూ గుర్తుచేస్తున్నాయి. అప్పటిమాదిరే ఈ ఉద్యమాలు అట్లాంటిక్ మహా సముద్రం ఆవలితీరాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లకు సైతం విస్తరించాయి.ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రమేకాదు... పశ్చిమాసియాలోని బీరూట్, కువైట్, లెబనాన్, ట్యునీ సియా యూనివర్సిటీలు కూడా రగులుతున్నాయి. లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు ఎవరినీ భయపెట్టడం లేదు. వేలాదిమంది విద్యార్థులను అరెస్టుచేస్తూ ఉద్యమాలను చల్లార్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా సాగటం లేదు. వీటి తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా తన క్యాంపస్‌లను ప్రస్తుతం పోలీసు శిబిరాలుగా మార్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200మంది పౌరులను కాల్చిచంపి, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉదంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర పాలస్తీనా కోసం సాగుతున్న ఉద్యమాలను ఇలాంటి దుందుడుకు చర్యలు బలహీనపరుస్తాయని హెచ్చరించారు. దాన్ని సాకుగా తీసుకుని ఇజ్రాయెల్ గత ఆర్నెల్లుగా సాగిస్తున్న మారణహోమం తక్కువేమీ కాదు. ఇంతవరకూ 35,000మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల్లో మరణించారని చెబుతున్నారు.ఇందులో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. చివరికి బాంబుదాడుల్లో శిథిలమైన జనావా సాల్లో బాధితులకు అండగా నిలబడుతున్న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చిచంపుతూ పాలస్తీనా పౌరులకు బాసటగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చేవారిని భయభ్రాంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క అనేకమంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టా మని చెప్పుకుంటోంది. ఇజ్రాయెల్‌కు ఎడాపెడా మారణాయుధాలు సరఫరా చేస్తూ, భద్రతామండలి వంటి అంతర్జా తీయ వేదికలపై అది సాగిస్తున్న నరమేథాన్ని నిలువరించే అన్ని రకాల ప్రయత్నాలకూ మోకా లడ్డుతూ మద్దతుగా నిలబడుతున్న అమెరికా అప్పుడప్పుడు కోమానుంచి నిద్రలేచిన రోగి మాదిరిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇది సబబేనా? నిరాయుధ సాధారణ పౌరులను కాల్చిచంపటం ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తూ ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలే విశ్వవిద్యాలయాల విద్యా ర్థులను కలవరపరిచాయి. తాము మూగసాక్షులుగా మిగిలిపోలేమంటూ ఆ విద్యార్థులు గొంతెత్తటం వెనకున్న నేపథ్యం ఇదే. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెలస్ (యూసీఎల్ఏ), కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వగైరా ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు నినాదాలతో మార్మోగుతున్నాయి. పేరెన్నికగన్న హార్వర్డ్, బర్క్లీ, యేల్ వర్సిటీలు సైతం రణక్షేత్రాలయ్యాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాల యాలు సాధారణమైనవి కాదు. పేరెన్నికగన్న ప్రపంచశ్రేణి సంస్థలు. ఉదాహరణకు యూసీఎల్ఏ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలను తయారుచేసింది. ఆ సంస్థనుంచి ఇంతవరకూ 15 మంది మెక్ఆర్థర్ ఫెలోషిప్లను అందుకున్నారు. అసాధారణ ప్రతిభాపాటవాలున్నవారికి ఈ ఫెలోషిప్‌లు ఇస్తారు. ఇక్కడి పట్టభద్రుల్లో క్రీడల్లో రాణించి ఒలింపిక్స్‌లో పతకాలు అందుకున్నవారెందరో! ఎన్నో దేశాలు అందుకునే పతకాల సంఖ్యతో పోలిస్తే ఈ యూనివర్సిటీ పట్టభద్రులు సాధించే పతకాలే ఎక్కువంటారు. ఇలాంటిచోట చదువుకునే పిల్లలు సమాజ పరిణామాలపట్ల ఇంతగా కలవరపడటం బహుశా మన దేశంలో చాలామందిని ఆశ్చర్యపరిచి వుండొచ్చు. విద్యార్థి ఉద్యమ కేంద్రాలుగా ముద్రపడిన ఢిల్లీలోని జేఎన్‌యూ, జమియా మిలియా, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సి టీలను ఛీత్కరించటం అలవాటు చేసుకున్న మర్యాదస్తులకు ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాల వర్త మాన పోకడలు మింగుడుపడకపోవచ్చు. అయోమయానికి గురిచేయవచ్చు. కానీ అమెరికా తదితర దేశాల విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఎప్పుడూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇప్పుడు సాగుతున్న విద్యార్థి ఉద్యమాలతో ప్రొఫెసర్లు సైతం గొంతు కలపటం, అరెస్టుకావటం యాదృచ్ఛికం కాదు. ఈ నిరసనలను యూదు వ్యతిరేక ఆందోళనలుగా చిత్రించి అధికారుల, రిపబ్లి కన్ పార్టీ శ్రేణుల ప్రాపకంతో పోటీ ఉద్యమాలను నిర్వహిస్తున్న విద్యార్థులు లేక పోలేదు. పాలస్తీనా సంఘీభావ ఉద్యమకారులపై వారు దాడులకు కూడా వెనకాడటం లేదు. ఇది విచారకరం.పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని భ్రమపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ధోరణిని విరమించుకోవాలి. తన ఆయుధ పరిశ్రమ లాభార్జనకు తోడ్పడుతున్నా యన్న ఏకైక కారణంతో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తదితర దేశాలకు అమెరికా భారీగా సైనిక సాయం అందించటం అనైతికం, అమానుషం. విద్యార్థి ఉద్యమాలు పంపుతున్న సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ప్రపంచశాంతికి దోహదపడటం అగ్రరాజ్యంగా తన బాధ్యతని ఇప్పటికైనా ఆ దేశం గుర్తించాలి. లేకుంటే మున్ముందు ఈ ఉద్యమాలు మరింత విస్తరిస్తాయి. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్‌తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్‌లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్‌చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్‌లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
ఇజ్రాయెల్‌కు షాక్.. ‘దౌత్య సంబంధాలు తెంచుకుంటాం’
కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా తమ దాడులు ఆగవని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొంటున్నారు. హమాస్‌కు గట్టిపట్టున్న రఫాలో వారిని అంతం చేయటమే తమ సైన్యం లక్ష్యమని ముందుకు వెళ్లుతున్నాడు. అయితే మరోవైపు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌లో దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని తెలిపింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.‘‘గురువారం నుంచి ఇజ్రాయెల్‌తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటున్నాం. ఒక జాతి విధ్వంసక ప్రధానితో మేము ఇక సంబంధాలు కొనసాగించలేము. జాతి విధ్వంస ప్రవర్తన, జాతీ నిర్మూలనను ప్రపంచం అస్సలు ఆమోదించదు. ఒకవేల పాలస్తీనియా అంతం అయితే.. ప్రపంచంలో మానవత్వం అంతం అయినట్లే’’అని బుధవారం మే డే ర్యాలీలో గుస్తావో పెట్రో అన్నారు.కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘‘గుస్తావో పెట్రో ఇజ్రాయెల్ పౌరుల ద్వేషి, వ్యతిరేకి. ప్రాణాలు తీసే, అత్యాచారాలు చేసే హమాస్ మిలిటెంట్లకు పెట్రో రివార్డులు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటిని ప్రస్తుతం ఆయన బయటపెట్టారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అత్యంత నీచమైన రాక్షసుల (హమాస్ మిలిటెంట్లు) పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుదన్నారు. హమాస్ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టనబెట్టుకున్నారని, మహిళలపై అత్యాచారం చేశారని, అమాయక ప్రజలను అపహరిచారని మండిపడ్డారు.హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. కొంతమందిని హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టగా.. ఇంకా 129 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అక్టోబర్ 7 తర్వాత ప్రతీకారంతో ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్నదాడుల్లో 34,568 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
మానవతకు 200 రోజుల మచ్చ
ఒకటీ, రెండూ కాదు... ఆరు నెలలు దాటింది. మంగళవారంతో ఏకంగా రెండు వందల రోజులు గడిచిపోయాయి. అయినా, పాలెస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. సంక్షోభానికి పరిష్కా రమూ కనిపించడం లేదు. సామూహిక సమాధులు, కూలిన ఆస్పత్రులు, శిథిలాల కుప్పగా మారిన భవనాలు, ప్రాణాలు పోయిన వేలాది జనం, ప్రాథమిక వసతులు పూర్తి విధ్వంసంతో పాలెస్తీనా బావురుమంటోంది.తీవ్రవాద హమాస్ బృందం తమపై ఆకస్మికంగా దాడి చేసి, 250 మందిని బందీలుగా చేసుకొని, 1200 మంది ప్రాణాలు తీసినందుకు బదులుగా గత అక్టోబర్ 7న సైనిక చర్యకు దిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు 85 శాతం మంది ఇళ్ళు వదిలి పారిపోయారు. హమాస్ ఏరివేతకని చెబుతూ మొదలుపెట్టిన ఈ పాశవిక, ప్రతీకార దాడిలో ఇప్పటికి 14 వేల పైచిలుకు పసిపిల్లలతో సహా 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని లెక్క. నిజానికి, ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని సహాయక సంస్థల అంచనా. గాజా భూఖండపు ఉత్తర ప్రాంతంపై ఇటీవల ఎన్నడూ లేనంతగా శతఘ్నుల వర్షం కురిపిస్తూ, అక్కడ నుంచి జనాల్ని ఖాళీ చేయమంటున్న ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంత ప్రధాన నగరమైన రాఫాపై దాడికి సర్వసన్నద్ధమవుతుండడం తాజా విషాద పరిణామం. పశ్చిమాసియాలోని ఈ సంక్షోభం అంతకంతకూ పెద్దదవుతూ వచ్చింది. ఇరాన్ సైతం ఇటీవల ఇజ్రాయెల్‌తో ఢీ అనడం పర్యవసానాలపై ప్రపంచం భయపడాల్సిన పరిస్థితి తెచ్చింది. పాలెస్తీనా శరణార్థులకు ఉద్దేశించిన ఐరాస సహాయ సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) ఉన్నా దానికిప్పుడు నిధులు లేని దుఃస్థితి.ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి ఆ సంస్థ సిబ్బంది కొందరు సహకరించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. దాంతో ఆ సంస్థకు సహాయం అందిస్తున్న 16 దాతృత్వ దేశాలు నిధులు నిలిపివేశాయి. పర్యవసానంగా 45 కోట్ల డాలర్ల మేర నిధుల లోటు ఏర్పడి, వేలాది పాలెస్తీనియన్లు ఈ యుద్ధకాలంలో ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్వి నిరాధార ఆరోపణలని స్వతంత్ర పరిశీలనలో ఈ వారమే తేలింది. అమెరికా సహా ఇతర దేశాలు మానవతా అవసరంగా గుర్తించి, నైతిక బాధ్యతతో యూఎన్ ఆర్‌డబ్ల్యూఏకు ఆర్థిక సాయం పునరుద్ధరించాలని అరబ్ లీగ్ తాజాగా డిమాండ్ చేస్తున్నది అందుకే. ఇజ్రాయెల్ భీకర దాడుల అనంతరం గాజాలోని ప్రధాన ఆస్పత్రుల వద్ద 300కు పైగా మృతదేహాలతో బయటపడ్డ సామూహిక భారీ సమాధుల దృశ్యాలు సహజంగానే అంతర్జాతీయ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఇజ్రాయెలీ సైనికుల దాడుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిందడానికి సమాధుల్లో కట్టేసిన చేతులతో, వివస్త్రంగా కనిపిస్తున్న శవాలే ప్రత్యక్ష సాక్ష్యం. అనుమానాలకు తావిస్తున్న ఈ సమాధులపై పారదర్శకంగా, స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐరాస ఇప్పటికే డిమాండ్ చేసింది.యూరోపియన్ యూనియన్ సైతం బుధవారం అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆగని ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బాధిత పక్షం వైపు అంతర్జాతీయంగానూ క్రమంగా మొగ్గు కనబడుతోంది. పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడమే ప్రస్తుత సమస్యకు సత్వర పరిష్కారమని భావిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గాజా సమస్య అంతకంతకూ మానవతా సంక్షోభంగా పరిణమిస్తుండడంతో తాజాగా జమైకా ప్రభుత్వం పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనమనే ఐరాస నియమావళి పట్ల నిబద్ధతే ఈ నిర్ణయానికి ప్రేరణ అని జమైకా పేర్కొంది. ప్రతి 10 నిమిషాలకూ ఓ పసివాడు చనిపోవడమో, గాయపడడమో జరుగుతున్న పాలెస్తీనాలో, ఇప్పటికి కనీసం 75 వేల టన్నుల పేలుడు పదార్థాల తాకిడికి గురై 62 శాతం ఇళ్ళు ధ్వంసమైన భూభాగంలో, ఆహార కరవుతో 11 లక్షల మంది అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్న ప్రాంతంలో... సత్వరమే సంక్షోభాన్ని పరిష్కరించి, శాంతి స్థాపన జరపకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఒకప్పటి కీలకపాత్రధారి ఐరాస ప్రస్తుతం మాటలే తప్ప చేతలు లేక చేష్టలుడిగి చూస్తోంది.కాల్పుల విరమణకై ఈ ఆరునెలల్లో ఐరాస 4సార్లు తీర్మా నాలు చేసినా, అవన్నీ అగ్రరాజ్యాలు మోకాలడ్డడంతో వీగిపోవడం దురదృష్టం. ఐరాసలో అండగా నిలవడమే కాక, ఇజ్రాయెల్‌కు ఆయుధాలిస్తున్న అమెరికా ఆ దేశానికి ఇటీవలే 2600 కోట్ల డాలర్ల సాయం మంజూరు చేసి, శరణార్థులకేమో మొండిచేయి చూపడం పెద్దన్న ద్వంద్వనీతికి దర్పణం. గాజా పోరులో అమెరికా అధ్యక్షుడి విధానాలపై స్వదేశంలోనే నిరసనలు పెరిగాయి. పాలెస్తీనాకు అనుకూలంగా అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాల్లో వేలాది విద్యార్థులు వీధికెక్కడం విశేషం.పశ్చిమాసియాలో సమస్య పరిష్కారానికి అమెరికా, దాని భాగస్వాములు పాత కథ వదిలి, మళ్ళీ మథనం చేయాలి. భద్రత పరంగా ఇజ్రాయెల్‌కు ఉన్న ఆందోళనల్ని పోగొడుతూనే, పాలెస్తీనా ప్రజల ప్రత్యేక రాజ్య ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు సఫలమయ్యేలా అటు ఇరాన్‌నూ భాగస్వామిని చేసి, శాశ్వత పరిష్కారానికై పాశ్చాత్య ప్రపంచం కృషి చేయాలి.ఇరాన్ సైతం పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కోసం లెబనాన్, గాజా, సిరియా, యెమన్లలో పరోక్ష శక్తులకు ఆయుధాలు సమకూర్చి, అండగా నిలిచే పని మానుకోవాలి. ఇలా పాముల్ని పాలుపోసి పెంచడం ఉద్రిక్తతల్ని పెంచే పాపమని గుర్తించాలి. ఈ ప్రాంతంలో 90 లక్షల మంది మన ప్రవాసులున్నందు భారత్ సైతం ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో సత్సంబంధాల రీత్యా కీలక భాగస్వాముల్ని ఒక దగ్గరకు చేర్చి, పరిష్కారానికి యత్నించాలి. వాణిజ్యంలో, ఇంధన సరఫరాలో కీలకమైన పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే... ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది.