గాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టపోయినా తమ పోరాటం కొనసాగిస్తామని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమకు తగినంత వనరులు ఉన్నాయని హమాస్ సీనియర్ నేత ఇస్తాంబుల్‌లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘ గాజాలో 11 నెలలకు పైగా యుద్ధం జరగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నష్టపోయినప్పటికీ మా పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటానికి మా వద్ద తగినంత వనరులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఘటన దాడులు కొనసాగించడానికి మేము అధిక సామర్థ్యాన్ని కలిగిఉన్నాం. అమరవీరులు ఉన్నారు, వారి త్యాగాలు ఉన్నాయి. ప్రతిఘటనలో కొత్త తరాలను చేర్చుకోవడం జరుగుతోంది. ఈ యుద్ధంలో మేము ఊహించిన దానికంటే.. ప్రాణనష్టం, యుద్ధ విస్తరణ తక్కువగానే జరిగింది’ అని అన్నారు.
ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ‘11 నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ హమాస్ నేత స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
చదవండి: హమాస్ మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగదు: ఇజ్రాయెల్
Comments
Please login to add a commentAdd a comment