breaking news
Gaza
-
Gaza Truce: స్వరం మార్చిన అమెరికా అధ్యక్షుడు
గాజా శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు తూట్లు పొడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. మంచిగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారాయన. హమాస్ సంస్థకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంచిగా ఉండాలని.. లేకుంటే అంతం తప్పదని అన్నారు. సోమవారం మీడియాతో ట్రంప్ ఇలా మాట్లాడారు.. ‘‘మంచిగా ఉండాలనే హమాస్‌తో ఒప్పందం కుదిర్చాం. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామంటే ఊరుకోం. హమాస్ మళ్లీ రక్తపాతం కోరుకుంటే మాత్రం వాళ్లకు అంతం తప్పదు’’ అని పేర్కొన్నారు... కాల్పుల విరమణకు కొంత అవకాశం ఇస్తాం. హింస తగ్గుతుందని ఆశిస్తున్నాం. కానీ దాడులు కొనసాగితే ప్రతిస్పందన తప్పదు. వాళ్లు కొనసాగిస్తే మేమే రంగంలోకి దిగుతాం. ఆ పరిష్కారం చాలా వేగంగా.. తీవ్రంగా ఉంటుంది. అలాగని మా సైనికులను అక్కడికి పంపించబోం. శాంతి ఒప్పందంలో సంతకాలు చేసిన ఇతర దేశాలే ఆ సంగతి చూసుకుంటాయి. ఇజ్రాయెల్‌ను కోరితే కేవలం రెండు నిమిషాల్లో అక్కడ వాలిపోతారు. వెళ్లి వాళ్ల అంతు చూడండి అంటే.. చూసేస్తారు. కానీ, ఇప్పటివరకు నేను అలా చెప్పలేదు. అందుకే హమాస్‌కు మరో అవకాశం ఇస్తున్నా’’ అని ట్రంప్ అన్నారు.2023 అక్టోబర్ 7వ తేదీన మొదలైన గాజా యుద్ధం.. రెండేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికతో ఆగింది. హమాస్, ఇజ్రాయెల కాల్పుల విరమణకు అంగీకరించడంతో పాటు పలు షరతులకు అంగీకరించడంతో అక్టోబర్ 13వ తేదీ నుంచి గాజా శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే.. అక్టోబర్ 19వ తేదీన దక్షిణ గాజా రఫాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించి వైమానిక దాడులు జరపడంతో 19 మంది పాలస్తీనీయులు మరణించారు. తొలుత ఇజ్రాయెల్ బలగాలే దాడులు జరిపాయని హమాస్, హమాసే దాడి చేసిందని ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపించుకున్నాయి.ఈ నేపథ్యంలో.. శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదని, తాజా దాడితో హమాస్ నాయకత్వంతో సంబంధాలు ఉండకపోవచ్చని, అది పూర్తిగా హమాస్ రెబల్స్ పని అయ్యిండొచ్చని ట్రంప్ మొన్న అభిప్రాయపడ్డారు. అయితే.. ఇరు వర్గాల దాడుల నేపథ్యంలో.. శాంతి ప్రణాళిక అమల్లో సంగ్దిగ్దత నెలకొంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా. అమెరికా ప్రతినిధులు జెరెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ కానున్నారు. సరిగ్గా.. ఈ సమయంలో ట్రంప్ మరోసారి స్వరం మార్చేసి హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.ట్రంప్ మొన్న.. గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. కాల్పుల విరమణ ఇంకా అమలులో ఉంది. హమాస్ నాయకత్వానికి ఈ దాడులతో సంబంధం లేకపోయి ఉండొచ్చు. రెబల్స్ గ్రూప్స్ ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చు. ట్రంప్ తాజాగా.. హమాస్ మంచిగా ఉండాలి. లేకుంటే వాళ్లకు అంతు తప్పదు. ఇజ్రాయెల్‌కు ఒక్కమాట చెబితే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కానీ, మరో అవకాశం ఇస్తున్నా. -
గాజా యుద్ధం మళ్లీ మొదటికి! ట్రంప్ ఏమన్నారంటే..
గాజా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విమరణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో.. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు, 97 మంది పాలస్తీనీయులు మరణించారు. శాంతి ఒప్పందం ఉల్లంఘనపై ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో.. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆదివారం రాత్రి మార్-ఎ-లాగో నుంచి వాషింగ్టన్కు తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఓ రిపోర్టర్ గాజా తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లో ఉందని భావిస్తున్నారా? అనే అడగ్గా.. ఆయన ‘అవును’ అనే సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ‘‘గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. మేము హమాస్‌తో పరిస్థితి చాలా శాంతియుతంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాం. కానీ, మీకు తెలుసు కదా.. వాళ్లు కొంచెం అతి చేస్తున్నారు. కొన్ని చోట్ల కాల్పులకు దిగుతున్నారు. అయితే.. ఆ దాడులకు హమాస్ నాయకత్వానికి సంబంధం లేదేమో అనిపిస్తోంది. బహుశా రెబల్స్ ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారేమో. అయినా సరే.. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తాం. అందుకోసం కఠినంగా అయినా వ్యవహరిస్తాం’’ అని ట్రంప్ సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు.ఏం జరిగిందంటే.. దక్షిణ గాజాలోని రఫా (Rafah) వద్ద ఇజ్రాయెల్ రక్షణ బలగాలపై హమాస్ దాడి జరిపింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారు. ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది పాలస్తీనీయులు మరణించారు.ఇజ్రాయెల్ యాక్షన్.. అక్టోబర్ 19వ తేదీన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా పరిగణించారు. ఇది హమాస్ పనేనని, కాల్పుల విరమణ ఒప్పందానికి స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంటూ.. గాజాకు మానవతా సాయం ఆపేశారు. అంతేకాదు.. ప్రతిదాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు.దీంతో.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ఈ తాజా దాడుల్లో 19 మంది పాలస్తీనయులు మరణించారు. హమాస్ ఏమందంటే.. ఇదిలా ఉంటే రఫా దాడికి హమాస్.. రక్షణాత్మక చర్యలుగా చెబుతోంది. ఇజ్రాయెల్ బలగాలే తమపై ముందుగా దాడులు చేశాయని, ప్రతిగానే తామూ దాడులు చేయాల్సి వచ్చిందని చెబుతోంది. దీంతో ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచినట్లైంది. ఈ పరస్పర ఆరోపణలు.. గాజాలో శాంతి స్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేసే పరిస్థితి నెలకొంది. అయితే.. ఈ దాడులతో గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన నష్టమేమీ లేదని ట్రంప్ అంటున్నారు. ఇదీ చదవండి: నువ్వేం రాజువి కాదయ్యా బాబూ! -
గాజాకు సాయం సరఫరా ఆపేశాం: ఇజ్రాయెల్
టెల్ అవీవ్: గాజాలోకి మానవతా సాయం సరఫరాను నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ భద్రతాధికారి ఒకరు ఆదివారం తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు అనుమ తించబోమన్నారు. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడి నట్లు ఆరోపించిన ఇజ్రాయెల్, అనంతరం ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా సారథ్యంలో రెండేళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం కనీసం వారంపాటు కూడా మానవతా సాయం సరఫరా కొనసాగకమునుపే ఈ పరిణా మం చోటుచేసుకుంది. ఆదివారం తమ బలగాలపైకి హమాస్ శ్రేణులు కాల్పులకు పాల్పడ్డాయంటూ ఇజ్రాయెల్ గాజాలోని పలుప్రాంతాలపై దాడులకు దిగింది. పాలస్తీనియన్ల కోసం ఆహారం, మందులు, దుప్పట్లు, టెంట్లు తదితర అత్యవసరాలను తీసుకువస్తున్న ట్రక్కులు ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ ద్వారా గాజాలోకి ప్రవేశిస్తుండటం తెలిసిందే. -
సోమవారం నుంచి తెరుచుకోనున్న రఫా క్రాసింగ్
కైరో: గాజాకు తిరిగి వచ్చే పాలస్తీనియన్ల కోసం సోమవారం నుంచి రఫా క్రాసింగ్ పాయింట్‌ను తెరిచి ఉంచుతామని పాలస్తీనా దౌత్య కార్యాలయం తెలిపింది. గాజాకు తిరిగి వెళ్లేందుకు తమ వద్ద పేర్లు నమోదు చేయించుకున్న పాలస్తీనియన్ల సంఖ్య భారీగా ఉందని శనివారం పేర్కొంది. అయితే, ఎందరనే విషయం స్పష్టం చేయలేదు. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించలేదు. యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ నియంత్రణలో లేని బయటి ప్రపంచానికి గాజాకు ఉన్న ఏకైక మార్గం ఈ క్రాసింగ్. గాజాను నియంత్రణ తీసుకున్న తర్వాత 2024 మే నుంచి ఇజ్రాయెల్ దీనిని మూసివేసింది. ఇలా ఉండగా, ఇజ్రాయెల్– హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో మృతుల సంఖ్య 68 వేలు దాటిపోయిందని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. వారం క్రితం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత మరణాల సంఖ్య పెరిగిందని పేర్కొంది. శిథిలాల తొలగింపు సందర్భంగా మృతదేహాలు బయటపడుతు న్నట్లు వెల్లడించింది. -
పాపం మెలోనీ! అటు ట్రంప్.. ఇటు ఎర్డోగాన్
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సోషల్ మీడియా ఇప్పుడు పాపం అంటోంది. అందుకు ఈజిప్ట్ శర్మ్ షేక్-ఎల్ నగర వేదికగా జరిగిన గాజా శాంతి సదస్సు కారణం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె అందంగా గురించి బాహాటంగా వ్యాఖ్య చేయడంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. అదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆమె వ్యక్తిగత అలవాటు చేసిన సంభాషణ సోషల్ మీడియాకు ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో ఓ మహిళను నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం.. ప్రమాదకరం. ఒకరకంగా అలా కామెంట్ చేయడం.. రాజకీయ ప్రస్థానాన్ని ముగించినట్లే. కానీ, నేను ఆ ప్రమాదాన్ని పట్టించుకోను. మీరు అందంగా ఉన్నావ్ అని చెబితే ఏమీ అనుకోవు కదా అంటూ వెనక్కి తిరిగి మెలోనీని చూస్తూ ట్రంప్ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతూ.. గుటకలు మింగారు. అలాగే.. Trump to Giorgia Meloni:“In the U.S., if you tell a woman she’s beautiful, your political career is over. But I’ll take my chances. You won’t be offended if I say you’re beautiful, right?“pic.twitter.com/YZEdsZjwSU— Spencer Hakimian (@SpencerHakimian) October 13, 2025ఇంకోవైపు.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో జరిగిన సంభాషణా వైరల్ అవుతోంది. విమానం నుంచి దిగుతున్నప్పుడు నిన్ను చూశాను. బాగా కనిపిస్తున్నావు. కానీ నీ చేత పొగతాగడం ఆపించాలి అని అన్నారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానుయేల్ మాక్రోన్ అది అసాధ్యం అంటూ జోక్ పేల్చారు. అయితే.. అది తనకు తెలుసని.. పొగ తాగడం ఆపేస్తే తాను నలుగురితో కలవలేనని అంటూ ఆమె నవ్వుతూనే బదులిచ్చారామె. Erdogan to Meloni in Cairo:“You look great but I have to get you to stop smoking”🇮🇹🇹🇷 pic.twitter.com/f1CzICF1tq— Visegrád 24 (@visegrad24) October 13, 2025ఇదిలా ఉంటే.. 48 ఏళ్ల మెలోనీకి స్మోకింగ్ అలవాటు ఉందనేది బాహాటంగా తెలిసిన విషయమే!. గతంలో తాను రాసిన పుస్తకాల్లోనూ ఆమె ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు.. ప్రపంచ నాయకులతో ఇంటెరాక్షన్ కోసం ఆ అలవాటు ఎంతో పనికి వచ్చిందని, ట్యూనీషియా అధ్యక్షుడు కైస్ సయీద్‌తో కలిసి స్మోక్కూడా చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు.. టర్కీని ధూమపాన రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎర్డోగాన్ కార్యచరణ రూపొందించారు. 2028 నాటికల్లా ఆ దేశాన్ని అలా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు.ఇదీ చూడండి: బాబోయ్.. ఇదేం భజన?: పాక్ పీఎం పొగడ్తలకు మెలోనీ రియాక్షన్ -
మోదీకి ట్రంప్ ప్రశంస.. బిత్తరపోయిన పాక్ పీఎం.. వీడియోలు చూసేయండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బిత్తరపోయారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించిన ట్రంప్.. పాక్‌తో సంబంధాలపైనా వ్యాఖ్య చేసే సరికి షరీఫ్ నోటి వెంట మాట రాలేదు. అదే సమయంలో షరీఫ్ ప్రసంగించిన టైంలోనూ మరో ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్ గాజా శాంతి సదస్సులో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిఫ్ట్ శర్మ్ ఎల్-షేక్ వేదికగా గాజా శాంతి సదస్సు Gaza Peace Summit 2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాల నేతలు 20 మంది దాకా పాల్గొన్నారు. ఆ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ గొప్ప దేశం. అక్కడ నా మంచి మిత్రుడు ఉన్నారు. ఆయన అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా జీవించగలవు అని అన్నారు. ఆ వెంటనే.. పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ వైపు చూస్తూ ట్రంప్ ‘అంతే కదా?’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు నోట మాట పడిపోయిందేమో.. షరీఫ్ నవ్వుతూ ఏదో కవర్ చేసుకోబోయారు. అదే సమయంలో.. పక్కనున్న మిగతా దేశాల నేతలు చిన్నగా నవ్వుకున్నారు. మరోవైపు.. Trump: "I think Pakistan and India are gonna live very NICELY together"Turns to Shehbaz Sharif: ‘Right?’Look at Chatukar's big smile. He still thinks this Joker Trump can save him when Bharat goes for the DECISIVE one?Anyway, let both of them happy 'TILL THEN'! pic.twitter.com/qlhS55S3GY— BhikuMhatre (@MumbaichaDon) October 13, 2025 షెహ్బాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ట్రంప్ భజనకే పరిమితం అయ్యారు. ఇండియా, పాకిస్తాన్ రెండూ అణు శక్తులు. ఈ వ్యక్తి (ట్రంప్) మరియు ఆయన బృందం నాలుగు రోజుల పాటు మధ్యవర్తిత్వం చేయకపోయుంటే, యుద్ధం ఎవరికీ చెప్పుకోలేని స్థాయికి చేరిపోయేది అని అన్నారు. ఆయన ఇప్పటికే ఏడు యుద్ధాలు ఆపారని, ఇవాళ ఎనిమిదోది(గాజా సంక్షోభం గురించి) ఆపారని అన్నారు. అలాంటి వ్యక్తిని తాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నా అనడంతో.. వెనకాలే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తల పట్టుకుని.. రకరకాల హవభావాలతో ‘ఇవేం పొగడ్తలు’ అన్నట్లు ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. వెనుకనే నోటిమీద చేయి వేసుకొని చూస్తుండిపోయారామె. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Pakistan's Prime Minister Shehbaz Sharif calls for Donald Trump to receive the Nobel Peace Prize: "Mr. President, I would like to salute you for your exemplary leadership. Visionary leadership." "I think you are the man that this world needed most at this point in time. The… pic.twitter.com/QXVOxszZx7— Mary Margaret Olohan (@MaryMargOlohan) October 13, 2025మరోవైపు.. ట్రంప్ గాజా ప్లాన్ కుదరడంపై భారత ప్రధాని మోదీ.. ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో గాజా శాంతి సదస్సుకు భారత ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానం అందించారు. అయితే మోదీ తరఫున ప్రత్యేక దూతగా విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను కలిసి.. శాంతి ఒప్పందంపై భారత్ తరఫున సంతకం చేశారాయన. ఈ విషయాన్ని విదేశాంగ ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ అధికారికంగా ధృవీకరించారు. తన చొరవ వల్లే పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు చల్లారాయంటూ ట్రంప్ మే 10వ తేదీ నుంచి నిన్న ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రసంగంలోనూ ప్రస్తావించడం తెలిసిందే. -
బందీల విడుదలను స్వాగతిస్తున్నాం: మోదీ
న్యూఢిల్లీ: గాజాలో బందీలుగా ఉన్న మొత్తం 20 మందిని హమాస్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు నిజాయితీతో సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న బందీలందరి విడుదలను స్వాగతిస్తున్నాం. వారి స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి, అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన శాంతి ప్రయత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ బలమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది’అని ప్రధాని మోదీ సోమవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలకు తాము తోడుగా ఉంటామన్నారు. -
సంక్లిష్ట వ్యవహారమిది
షర్మ్ ఎల్ షేక్(ఈజిప్ట్): గాజాలో శాంతి వీచికలు మొదలయ్యాక ఆ శాంతిని శాశ్వతంగా సుస్థిరం చేసేందుకు మొదలైన ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలుచేశారు. ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పంలోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో పలువురు యూరప్ దేశాలు, పశి్చమాసియా దేశాల అగ్రనేతల సమక్షంలో శాంతి శిఖరాగ్ర సదస్సులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ సంతకంచేశారు. ఆయనతోపాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసీ, ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అగ్రనేతల సమక్షంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇది చరిత్రాత్మకమైన ఒప్పందం. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు నెరవేరాయి. మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కియేలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మధ్యవర్తిత్వం విషయంలో ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసి అద్భుతంగా వ్యవహరించారు. మీరు నమ్ముతారో లేదో తెలీదుగానీ అసలు ఈ వివాదం 500 నుంచి మూడువేల సంవత్సరాల నాటిది అని అనుకుంటున్నా. ఇప్పటికి ఓ కొలిక్కి వచి్చంది. ఇంకా ఇందులో ఎంతో సంక్లిష్టత ఉంది. ఈ ఒప్పందం అత్యంత చిక్కుముళ్లతో కూడుకుంది. ఎన్నో నిబంధనలు, షరతులను పొందుపరిచాం. వాస్తవానికి పశ్చిమాసియాలో ఈ యుద్ధం చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చాలా మంది భావించారు. ఇకపై అలాంటిదేమీ ఉండబోదు. నేను గతంలో ఎన్నో సంక్లిష్టమైన సమరాలు, సమస్యలను పరిష్కరించా. ఇది మాత్రం అతిపెద్ద రాకెట్ షిప్లాగా సమస్యాత్మకంగా మారింది. చివరకు పరిష్కరించాం’’ అని ట్రంప్ అన్నారు. తర్వాత నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. తర్వాత నేతలంతా వేరే వేదికపై చేరారు. అక్కడ మళ్లీ ట్రంప్ బ్రిటన్, ఇటలీ, పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్, తుర్కియే తదితర కీలక దేశాల అగ్రనేతలను పొగుడుతూ మాట్లాడారు. భారత్ గొప్పదేశం వెనకాల పలువురు నేతలు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా వాళ్ల సమక్షంలో ట్రంప్ మాట్లాడారు. ‘‘ భారత్ గొప్పదేశం. నాకు అత్యంత మిత్రదేశం. భారత్ గొప్ప పనులెన్నో చేసింది. ఇకమీదట పాకిస్తాన్, భారత్‌లు ఇరుగుపొరుగున హాయిలా కలిసిమెలసి ఉంటాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఆ సందర్భంలో షరీఫ్ నవ్వుతూ కనిపించారు. తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ మాట్లాడారు. ‘‘పాలస్తీనియన్లకు స్వయం నిర్ణయాధికారం ఉండాల్సిందే. వాటిని భవిష్యత్తులో ఏ దేశమూ లాగేసుకోకూడదు. స్వతంత్ర దేశంగా ఎదగాలి’’ అని సిసీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఇజ్రాయిల్ పార్లమెంట్లో ట్రంప్ ప్రసంగానికి నిరసన సెగ
ఇజ్రాయిల్-హమాస్‌ల మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్ పార్లమెంట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా నిరసన సెగ ఎదురైంది. ట్రంప్ ప్రసంగించే సమయంలో ఇద్దరు ఎంపీలు ట్రంప్ ప్రసంగానికి అడ్డుతగిలారు. స్లోగాన్స్తో ట్రంప్ ప్రసంగాన్ని పదే పదే అడ్డుకున్నారు. ఇలా ట్రంప్ ప్రసంగానికి అంతరాయం ఏర్పడటంతో ఆ ఇద్దరు ఎంపీలను బహిష్కరించారు. పార్లమెంట్ నుంచి వారిని మార్షల్స్ సాయంతో బయటకు తీసుకెళ్లిపోయారు. 2023, అక్టోబర్ 7వ తేదీన హమాస్ కిడ్నాప్ చేయబడినప్పటి నుండి వారు బందీలుగా పట్టుకున్న చివరి సజీవ బందీలను ఇజ్రాయెల్‌కు తిరిగి పంపడాన్ని ట్రంప్ గుర్తు చేస్తున్న సందర్భంగా ఆయన ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తమైంది. హమాస్‌తో తొలి దశ ఒప్పందంలోని ఇది సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని ట్రంప్ వ్యాఖ్యలలపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ -
Gaza: ఏడుగురు బందీలను రెడ్ క్రాస్‌కు అప్పగించిన హమాస్
-
కతార్ రాయబారుల మృతి.. ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పంద చర్చల్లో కలకలం
కైరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న ‘షార్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’కు ముందు ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్ షేక్ వద్ద శనివారం (అక్టోబర్ 11న) జరిగిన ఘోర కారు ప్రమాదంలో కతార్‌కు చెందిన ముగ్గురు కీలక దౌత్యవేత్తలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.అక్టోబర్ 13న ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్ షేక్ అనే ప్రాంతంలో ఇజ్రాయెల్-గాజాల మధ్య శాంతి ఒప్పందం కోసం ‘షర్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు కతార్ దేశాధినేతకు సేవలందించే అమిరీ దివాన్(Amiri Diwan) కార్యాలయానికి చెందిన ముగ్గురు దౌత్యవేత్తలు కారులో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా,శాంతి చర్చలు జరిగే ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలో కతార్ రాయబారులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కతార్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శాంతి కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర దౌత్యవేత్తల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి’అని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా పక్షాలు సైతం ఈ ఘటనపై సంతాపం ప్రకటించాయి.ఇజ్రాయెల్-గాజాల మధ్య శాంతి ఒప్పందం ఈజిప్ట్ దేశంలోని రెడ్ సీ తీరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక నగరం షార్మ్ ఎల్ షేక్ వద్ద జరగనున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాన్ని ముగింపు పలికేలా తొలిసారి అక్టోబర్ 6న, అక్టోబర్ 7న రెండోసారి చర్చలు జరిగాయి. యుద్ధానికి ముగింపు, బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించేలా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో అక్టోబర్ 13న ‘షర్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదరనుంది.కతార్ రాయబారుల మరణంతో శాంతి చర్చల్లో కలకలంఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న ‘షార్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’కు ముందు జరిగిన ఘోర ప్రమాదం అంతర్జాతీయ దౌత్యపరంగా కలకలం రేపుతోంది. శాంతి చర్చల్లో పాల్గొనడానికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదం శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకోనున్నాయనే అంతర్జాతీయంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్చలకు ముందు ఇలాంటి విషాద ఘటన జరగడం వల్ల చర్చలు, భద్రతా ఏర్పాట్లు, పక్షాల నమ్మకంపై ప్రభావం పడే అవకాశముంది.మొస్సాద్ ప్రమేయంపై వస్తున్న ఆరోపణలు ఈ ఘటనను మరింత ఉద్రిక్తతకు దారి తీసేలా చేస్తున్నాయి. అయితే, ఈ విషాదం శాంతి ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతుందా? లేక మరింత నిశ్చయంతో ముందుకు సాగుతాయా? అన్నది సమయం చెప్పాలి. -
హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’
హమాస్.. నిన్న, మొన్నటి వరకూ మిలిటెట్లు(నిషేధిత ఉగ్రవాద సంస్థ). ఇప్పుడు వారి పేరు మారింది.. వారి బ్రాండ్ కూడా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడితో ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందంలో భాగంగా ఇప్పుడు హమాస్ కాస్త ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’గా రూపాంతరం చెందింది. తాజాగా వీరి బ్రాండ్ పేరును విడుదల చేసింది హమాస్. దీనిలో భాగంగా సుమారు ఏడు వేల మంది హమాస్ మిలిటెంట్లు సాధారణ పౌరుల వలే మారిపోవడానికి సిద్ధమయ్యారు.. ఈ మేరకు ఇజ్రాయిల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్).. గాజాలో ఇటీవల ఉపసంహరించుకున్న ప్రాంతాలపై నియంత్రణను తిరిగి స్థాపించడానికి పౌర దుస్తులలో దర్శనమిస్తున్నారు. మొన్నటి వరకూ చీకటిలో యుద్ధం చేసిన వీరు.. ఇప్పుడ జన జీవన స్రవంతిలోకి వచ్చి నేరుగా గాజాకు అండగా ఉంటామంటున్నారు. మా వారిని విడిచిపెడతారని ఆశిస్తున్నాం..మరొకవైపు గడువులోగా బందీలను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్ రేపు ఉదయం ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టే సమయానికి హమాస్ చేతిలో బందీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది. రెండేళ్ల నాటి యుద్ధం.. ముగిసిన వేళ..హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సుమారు రెండేళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తు న్నాయి. అక్డోబర్ 10వ తేదీ మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీని యన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది.యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో, సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో గుమికూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు. ఒప్పందం ప్రకారం...గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 48 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. వీరిలో కనీసం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది. వీరి జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఇందులో పాలస్తీనా అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మర్వాన్ బర్ఘౌటి కూడా ఉన్నారు. బందీలు, ఖైదీల విడుదల ఆదివారం రాత్రి లేదా సోమవారం మొదలవుతుందని మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు అధికారులు తెలిపారు. సిద్ధంగా మానవతా సాయంగాజాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో మానవతా సాయం తీసుకువచ్చిన ట్రక్కులు సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు ఈజిప్టు, గాజా మధ్యనున్న రఫా సహా ఐదు సరిహద్దులను తెరిచి ఉంచనున్నారు. సుమారు 1.70 లక్షల టన్నుల మందులు, ఆహారం, ఇతర అత్యవసరా లను గాజాలోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐరాస మానవతా సాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపారు. సానుకూల సంకేతాలు అందిన వెంటనే రంగంలోకి దిగుతామని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కుదిరిన డీల్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు 200 మంది సైనికులను గాజాకు పంపుతామని అమెరికా అధికారులు చెప్పారు.వారి మెడపై కత్తి ఉంది..: నెతన్యాహూఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికలో పేర్కొన్న హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. ‘ట్రంప్ ప్రకటనలో తర్వాతి భాగం హమాస్ నిరాయుధీకరణే. ఇది సులువుగా జరిగితే సరేసరి. లేదంటే బలవంతంగానైనా సాధిస్తాం. మెడపై కత్తి ఉందని తెలిసే హమాస్ ఒప్పందానికి వచ్చింది. ఇప్పటికీ కత్తి మెడపైనే ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొనడం గమనార్హం. కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా కాల్పుల విరమణ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందుగానే బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ చెప్పారు. ఉపసంహరణ అంశం సున్నితత్వం దృష్ట్యా గాజాలోని ఇటీవల స్వాధీనం చేసుకున్న 50 శాతం ప్రాంతంలో బలగాలు కొనసాగుతాయని ఓ సైనికాధికారి పేర్కొనడం విశేషం.ఇది ఇజ్రాయిల్‌కు పరోక్ష వార్నింగేనా? ప్రస్తుతం ఇజ్రాయిల్-హమాస్‌లు అమెరికా ఒత్తిడితో శాంతి ఒప్పందానికి ముందుకొచ్చినా ఇరు వర్గాల్లో ఎక్కడో భయం ఉంది. వారి మధ్య చోటు చేసుకుంది మామాలు యుద్ధం కాదు. విధ్వంసకర యుద్ధం. ఈ క్రమంలోనే వారి మధ్య శాంతి ఒప్పందం జరిగినా కూడా రెండు వర్గాలు జాగ్రత్తగా ఉండాలనే ముందస్తు ప్రణాళికతో సిద్ధమైనట్లు తెలుస్తున్నాయి. హమాస్ ఏమీ చేసే పరిస్థితి లేకే ఒప్పందానికి వచ్చిన ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ స్పష్టం చేసిన నేపథ్యంలో హమాస్ కూడా వారు మొత్తం ఆయుధాలను వదిలేయడానికి సిద్ధంగా లేరనేది అర్ధమవుతోంది. తాము ఉంటాం.. కానీ ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్ గా ఉంటామని చెబుతున్నారు. జస్ట్ మేము మారాం.. అంతే.. మా లక్ష్యం మారలేదు’ అని సందేశాన్ని ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్ ఏర్పాటు ద్వారా పంపినట్లు అయ్యింది. అంటే అవసరమైన పక్షంలో మళ్లీ తాము యుద్ధం చేయడానికి సిద్ధమేనని పరోక్ష సంకేతాలు పంపారు. ఇప్పుడు హమాస్.. ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ రూపొంతరం చెందడానికి ప్రధాన కారణం మాత్రం ఇజ్రాయిల్‌ను పూర్తిగా నమ్మలేని స్థితి. అటు ఇజ్రాయిల్ కూడా హమాస్‌ను పూర్తిగా నమ్మడం లేదు. ఒప్పందానికి కట్టుబడే అటు ఇజ్రాయిల్-ఇటు హమాస్‌లు తమ తమ చెరల్లో ఉన్న బంధీలను విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాయి. ఒకవేళ వీరి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తితే మళ్లీ యుద్ధం రాదనే విషయం కూడా చెప్పలేమనేది విశ్లేషకుల అభిప్రాయం.ఇదీ చదవండి: 58 మంది పాక్ సైనికుల మృతి -
గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ
గాజా/ కైరో: హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రెండేళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తు న్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీని యన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది. యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో, సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో గుమికూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు. 24 గంటల్లో 11 మంది మృతిగురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ భారీగా కాల్పులు జరిపిందని స్థానికులు తెలిపారు. ఆర్మీ ప్రకటన తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించలేదన్నారు. సైనిక విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించాయని చెప్పారు. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో 11 మంది పాలస్తీనియన్లు చనిపోగా మరో 49 గాయపడ్డారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. తమ బలగాలకు ప్రమాదకరమనిపించిన లక్ష్యాలపైనే దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. దీనిపై హమాస్ మండిపడింది. విడుదలవనున్న మర్వాన్ బర్ఘౌటిఒప్పందం ప్రకారం...గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 48 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. వీరిలో కనీసం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది. వీరి జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఇందులో పాలస్తీనా అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మర్వాన్ బర్ఘౌటి కూడా ఉన్నారు. బందీలు, ఖైదీల విడుదల ఆదివారం రాత్రి లేదా సోమవారం మొదలవుతుందని మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు అధికారులు తెలిపారు. సిద్ధంగా మానవతా సాయంగాజాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో మానవతా సాయం తీసుకువచ్చిన ట్రక్కులు సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు ఈజిప్టు, గాజా మధ్యనున్న రఫా సహా ఐదు సరిహద్దులను తెరిచి ఉంచనున్నారు. సుమారు 1.70 లక్షల టన్నుల మందులు, ఆహారం, ఇతర అత్యవసరా లను గాజాలోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐరాస మానవతా సాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపారు. సానుకూల సంకేతాలు అందిన వెంటనే రంగంలోకి దిగుతామని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కుదిరిన డీల్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు 200 మంది సైనికులను గాజాకు పంపుతామని అమెరికా అధికారులు చెప్పారు.కత్తి మెడపైనే ఉంది: నెతన్యాహూఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికలో పేర్కొన్న హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. ‘ట్రంప్ ప్రకటనలో తర్వాతి భాగం హమాస్ నిరాయుధీకరణే. ఇది సులువుగా జరిగితే సరేసరి. లేదంటే బలవంతంగానైనా సాధిస్తాం. మెడపై కత్తి ఉందని తెలిసే హమాస్ ఒప్పందానికి వచ్చింది. ఇప్పటికీ కత్తి మెడపైనే ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొనడం గమనార్హం. కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా కాల్పుల విరమణ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందుగానే బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ చెప్పారు. ఉపసంహరణ అంశం సున్నితత్వం దృష్ట్యా గాజాలోని ఇటీవల స్వాధీనం చేసుకున్న 50 శాతం ప్రాంతంలో బలగాలు కొనసాగుతాయని ఓ సైనికాధికారి పేర్కొనడం విశేషం. -
గాజాలో శాంతివీచిక!
రెండేళ్ల నుంచి అవిచ్ఛిన్నంగా క్షిపణులు, బాంబుల వర్షంతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన గాజా ఇకపై గుండెల నిండా ఊపిరి పీల్చుకోనుంది. హమాస్– ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందనీ, ఇరు పక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయనీ, శాంతి ప్రణాళికలో ఇది తొలి దశ అనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గమనిస్తే పూర్తిస్థాయి శాంతి స్థాపనకు మరికొంత సమయం పట్టొచ్చని స్పష్టంగానే తెలుస్తోంది. ఇంత హడావిడిగా సంధి కుదిరినట్టు ప్రకటించటం వెనక శుక్రవారం ప్రకటించబోయే నోబెల్ శాంతి బహుమతికి అర్హత సాధించటం కోసమేనని అందరికీ తెలుసు. ట్రంప్ అందుకు అర్హుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సిఫార్సు చేస్తున్నారు. తమ భూభాగంలోకి చొరబడి 2023 అక్టోబర్ 7న 1,100 మంది పౌరులను హతమార్చి, 251 మందిని అపహరించుకుపోయిన హమాస్ దుందుడుకు చర్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 24 నెలల పాటు గాజాపై నిప్పుల వాన కురిపించింది. ఏ క్షిపణి ఎక్కడ పడుతుందో, ఏ బాంబు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియక గాజా వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జనావాస ప్రాంతాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా క్షిపణులు ప్రయోగించటం, ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు క్షణంలో కూలి శిథిలాల గుట్టగా మారటం ప్రపంచ ప్రజలంతా చూశారు. కనీసం ఇద్దరో ముగ్గురో మరణించని కుటుంబం లేదు. కొన్ని కుటుంబాలైతే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మధ్యలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు... ఇజ్రాయెల్ ఉల్లంఘనల వల్ల పెద్దగా ఉపశమనం ఇచ్చింది లేదు. దీన్ని యుద్ధం అనడం ఇజ్రాయెల్ సాగించిన నరమేధాన్ని కప్పిపుచ్చే యత్నమే అవుతుంది. బలాబలాల్లో ఎంత వ్యత్యాసం ఉన్నా రెండు దేశాల మధ్య పరస్పరం కొన సాగే ఘర్షణల్ని యుద్ధం అంటారు. ఇక్కడ జరిగిందంతా వేరు. ఇజ్రాయెల్ లోపాయకారీ మద్దతుతో ఎన్నికల ద్వారా అధికారం చేజిక్కించుకుని గాజా ప్రజలపై పెత్తనం సాగిస్తూ, పాలస్తీనా అథారిటీని బేఖాతరు చేస్తూ వచ్చిన హమాస్ ఉన్నట్టుండి ఉగ్రవాద దాడికి పూనుకొంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 67,183 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,69,841 మంది గాయాల పాలయ్యారు. వైద్య సిబ్బంది, పాత్రికేయులన్న విచక్షణ లేకపోగా, చాలా సందర్భాల్లో వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యాలు హతమార్చటం ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగనిది. దాడులు ఆగుతాయంటున్నారు గనుక శిథిలాల తొలగింపు మొదలవుతుంది. అప్పుడు గానీ మృతుల అసలు సంఖ్య ఎంతో తెలియకపోవచ్చు. ఇప్పటికీ ఆచూకీ తెలియనివారు వేలల్లో ఉన్నారు. ఇజ్రాయెల్ ఘాతుకాల వెనక జాత్యహంకారం స్పష్టంగా కనబడుతుండగా, ఆ దుండగాన్ని ధర్మబద్ధంగా వ్యతిరేకించినవారిని యూదులపై వివక్ష ప్రదర్శిస్తున్నవారిగా జమకట్టి వేధించటం, విశ్వవిద్యాలయాల్లోకి పోలీసులు చొరబడి అరెస్టులు చేయటం ట్రంప్ నైజానికి అద్దం పడుతుంది. గాజాలో హమాస్ ఒక్కటే లేదు. పాలస్తీనా విమోచన కోసం పోరాడే సంస్థలు డజను వరకూ ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి పోలేదు. గాజాలోనే ఒక హద్దు నిర్ణయించుకుని ఆగింది. ఇప్పుడు కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఎంతవరకూ గౌరవిస్తుందో తెలియదనీ, ఒప్పందంలోని చాలా క్లాజులు అస్పష్టతతో ఉన్నా కేవలం ట్రంప్ హామీని నమ్మి సమ్మతించామనీ ఆ సంస్థల ప్రతి నిధులు చెబుతున్న తీరు గమనార్హం. ట్రంప్‌కు నోబెల్ వస్తే తప్ప ఈ ఒప్పందం సజావుగా ముందుకు పోదు. రెండో దశ చర్చల్లోనే అసలు అంశాలు ప్రస్తావనకొస్తాయి. అప్పుడు మరణమో, శరణమో పాలస్తీనా సంస్థలు తేల్చుకోక తప్పదు. ట్రంప్‌కు పురస్కారం లభిస్తే గాజా వాసులకు ఉన్నంతలో గౌరవప్రదమైన పరిష్కారం దొరకొచ్చు. రాకపోతే పరిణామాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. అయితే నరమేధాన్ని కొనసాగించటం ఇక సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే హమాస్ చెరలోని బందీలంతా విడుదలయ్యారు. అటు ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా పౌరులు దాదాపు 2,000 మంది విడుదలవుతున్నారు. గాజా విషయంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిపోయిన కొన్ని రోజులకే ఆ రెండు దేశాలూ తమకేం పట్టనట్టు ఈ శాంతి ఒప్పందం సాధించటం ఒక వైచిత్రి. -
ముళ్లదారిలో ఒక ముందడుగు
గాజాలో ‘శాంతి సాధన’ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రణాళికలో ‘మొదటి దశ’ అమలుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించినట్లు 8వ తేదీ రాత్రి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ప్రకటనను హమాస్, ఇజ్రాయెల్ వెంటనే ధ్రువీకరించాయి. అది స్థూలమైన అంగీకారం. అమలు ఏ విధంగా అనే వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. యథాతథంగా ఈ మొదటి దశ అనే దానిలో కాల్పుల విరమణతో పాటు రెండు అంశాలున్నాయి. ఒకటి – ఇజ్రాయెలీ బందీలను హమాస్, వారి ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయటం. రెండు – ఇజ్రాయెలీ సేనలు ‘అంగీకృతమైన’ (అగ్రీడ్ అపాన్) రేఖ వద్దకు ఉపసంహరించుకోవటం. ఈ రెండు అంశాల అమలు ఎంత సాఫీగా జరగవచ్చునన్నది వేచి చూడవలసిన విషయం. కాగా, రెండేళ్ళుగా సాగుతున్న గాజా మారణహోమంలో ఇపుడందరూ కొంత ఊపిరి తీసుకోగలరని మాత్రం చెప్పవచ్చు.ఏది అంగీకృత రేఖ?సరిగా రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై దాడి జరిపిన హమాస్, 250 మందిని బందీలుగా పట్టుకుంది. వారిలో ప్రస్తుతం సజీవులుగా 20 మంది, మృతదేహాల రూపంలో 28 మంది ఉన్నట్లు అంచనా. ఇజ్రా యెల్ వద్ద 250 మంది పాలస్తీనియన్లు జీవిత ఖైదీలుగా, సుమారు 1,300 మంది యుద్ధ ఖైదీలుగా ఉన్నట్లు చెప్తున్నారు. రెడ్ క్రాస్ ద్వారానో, మరొక విధంగానో వీరందరి విడుదలకు సమస్య ఉండక పోవచ్చు. కానీ, రెండవ అంశమైన ఇజ్రాయెలీ సేనల ఉపసంహరణ విషయం తేలటం తేలిక కాదు. ‘అంగీకృత రేఖ’ వద్దకు మాత్రమే పాక్షిక ఉపసంహరణ అన్నది ట్రంప్ ప్రణాళికలో గల అంశం కాగా, బందీలను తాము విడుదల చేయగానే పూర్తి ఉపసంహరణ జరగా లని హమాస్ షరతు పెడుతూ వచ్చింది. ఆ షరతును హమాస్ ఇప్పుడు సడలించిందా? ఏ విధంగా? ‘అంగీకృత రేఖ’ అర్థం పర స్పర అంగీకారమనా? లేక ట్రంప్, నెతన్యాహూల మధ్య అంగీ కారమా?ఇందులో ‘అంగీకృత రేఖ’ అనే మాట గురించిన సందేహాలు అనవసరమైనవిగా తోచవచ్చు. కానీ, ట్రంప్ 20 సూత్రాల ప్రణా ళికను ఎవరితోనూ సంప్రతించకుండా ట్రంప్, నెతన్యాహూల మధ్య రూపొందిన విషయాన్ని గుర్తు చేసుకుంటే, ఈ సందేహాలు సహేతు కమైన వని అర్థమవుతుంది. పైగా, మొదట తాము ట్రంప్‌కు చేసిన సూచనలను ట్రంప్, నెతన్యాహూ సమావేశం దరిమిలా మార్చివేశా రని అరబ్ నాయకులు బహిరంగంగా ఆరోపించటం కూడా గమనించదగ్గది. ‘అంగీకృత రేఖ’ అన్నది రాగల రోజులలో ఏ విధంగా ‘పరస్పర అంగీకృతం’ అయే రీతిలో రూపొందగలదో చూడవలసి ఉంటుంది.ఆయుధాలు వదిలేస్తారా?కాల్పుల విరమణ జరిగిన అనేక సందర్భాలలో ఏవో కారణా లతో ఏదో ఒక పక్షమో, ఇరుపక్షాలో ఉల్లంఘనలకు పాల్పడటం సర్వసాధారణం. ఇజ్రాయెల్‌కు సంబంధించి వారు లెబనాన్, సిరియా, గోలన్ కనుమలు, జోర్డాన్ ప్రాంతాలలో చేస్తున్నది అదే. అందువల్ల, గాజాలో ఉపసంహరణను పర్యవేక్షించేది, ‘అంగీకృత రేఖ’ వద్దకు ఉపసంహరణ తర్వాత నియంత్రించేది ఎవరో ఇంకా సూచనలు లేవు. గాజా సమస్య కేవలం గాజాకు పరిమితమైనది కాదు. వెస్ట్ బ్యాంక్‌తో కలిపి మొత్తం పాలస్తీనా దేశం ఏర్పాటుకు సంబంధించినది. ఇప్పటికే 150 దేశాలు గుర్తించినప్పటికీ కేవలం ఇజ్రాయెల్ కోసమని అమెరికన్లు భద్రతా సమితిలో పదే పదే వీటో చేస్తున్న తమ విధానాన్ని మార్చుకుని, రెండు స్వతంత్ర దేశ వ్యవస్థలు ఏర్పడే వరకు ఈ సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఈ విషయమై ట్రంప్ 20 సూత్రాలలో అస్పష్టతలు, వంచనా కళలు తప్ప నిజా యతీ లేదు. గాజాకు సంబంధించి పాలస్తీనియన్లు, అరబ్బుల ఆలో చనలు ఒక విధంగా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్ ఆలోచనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.అందుకు కొన్ని ఉదాహరణలను చెప్పుకొనేముందు... బందీలు, ఖైదీల విడుదల, అంగీకృత రేఖ వద్దకు సేనల ఉపసంహరణతో పాటుగా ఆ వెంటనే ముందుకు రాగల అంశాలేమిటో చూద్దాం. వాటిలో మొదటిది గాజా పౌరులకు సహాయం చేరటం. రెండవది హమాస్ నిరాయుధీకరణ. ఈ అంశాలు 20 అంశాలలో చేరి ఉన్నాయి గానీ, 8వ తేదీన ట్రంప్ చేసిన ప్రకటనలో లేవు. ఈజిప్టులో చర్చలు కొనసాగుతున్నందున సహజంగానే ముందుకు వస్తాయి. ఇందులో సహాయాల సరఫరాకు కూడా ఇంతకాలం ఆటంకాలు కల్పించిన ఇజ్రాయెల్, ఆ సహాయం హమాస్‌కు చేరుతున్నదనే వాదనలు చేసింది. సరఫరాలపై తమకు పూర్తి నియంత్రణ ఉండా లన్నది. ఇది పరిష్కారం కావలసి ఉన్న విషయం. హమాస్ నిరాయుధీకరణ జరిగి తీరాలన్నది అమెరికా, ఇజ్రాయెల్‌ల పట్టు దల కాగా, స్వతంత్ర పాలస్తీనాకు మార్గం సుగమం అయ్యే వరకు ఆ పని చేయబోమని హమాస్ ప్రకటిస్తున్నది. కాకపోతే, గాజాలో ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వాములం కాబోమని సూచించింది. అయితే, పాక్షిక నిరాయుధీకరణ కోసం ఒప్పించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారన్నవి 9వ తేదీ నాటి వార్తలు. పాక్షిక మంటే ఏమిటో, హమాస్ నిర్ణయమేమిటో తెలియాలి.ధూర్త ఆలోచనఇవి రెండవ దశగా భావిస్తే, ట్రంప్ ప్రణాళికలోని తక్కినవన్నీ మహా సమస్యాత్మకమైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే, స్వతంత్ర పాలస్తీనా అన్నదే లేకుండా ఆ రెండు భూభాగాలు తమ అధీనంలోకి రావాలన్నది అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఈ రోజు వరకు కూడా ఉన్న పథకం కాగా, అందుకు ససేమిరా అన్నది పాలస్తీనియన్ల చరిత్రాత్మకమైన జాతిపరమైన ఆకాంక్ష. ట్రంప్ 20 సూత్రాలలో హమాస్ సంపూర్ణ నిరాయుధీకరణ, వారి రక్షణ వ్యవస్థలన్నింటి విధ్వంసం, ఆ సంస్థ కొత్త ప్రభుత్వంలో పాల్గొనకపోవటం, గాజాను డీ–ర్యాడికలైజ్ చేయటం, గాజా పరిపాలనకు బయటి వారితో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, అమెరికా ఆధ్వర్యంలో రక్షణ బలాలు, గాజాను సెజ్‌గా మార్చి, బయటివారే అభివృద్ధి ప్రణాళికలు రచించి, బయటి నిధులతో అభివృద్ధి పరచటం వంటివి ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా అథారిటీ తాము ఆశించిన విధంగా ‘తనను తాను పూర్తిగా సంస్కరించుకున్న పక్షంలో’ స్వీయ నిర్ణయాధికారం, పాలస్తీనా ఏర్పాటు విషయాలు అపుడు ఆలోచిస్తారు. ఇదెంత ముళ్ల దారో, ధూర్తమైనదో స్పష్టంగా కనిపిస్తున్నదే!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
యుద్ధానికి ముగింపు.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందం
-
‘అపూర్వ అడుగు’.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
గాజా సంక్షోభం(Gaza War)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas)లు ముందుకు వచ్చాయి. మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. ·రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేసినట్లు ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో ట్రంప్ పోస్టు చేశారు. ‘‘గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు అంగీకరించినందుకు గర్వంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయంతో హమాస్ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుంది. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుంది. .. అన్ని పార్టీలను సమంగా చూస్తాం. అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజు. ఈ చరిత్రాత్మక, అపూర్వసంఘటన. ఇది నెరవేరడానికి మాతో పాటు కలిసి పని చేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, టర్కీ(తుర్కీయే)కు థ్యాంక్స్’’ అని ట్రంప్ పేర్కొన్నారు.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ మిలిటెంట్లు విరుచుపడి 1,200 మందికిపైగా హతమార్చి, 250 మందికిపైనే బందీలుగా చేసుకున్నారు. ఆపై హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాపై భీకరంగా విరుచుకుపడి హమాస్ ముఖ్య నేతలందరిని హతమార్చింది. ఈ రెండేళ్ల యుద్ధంలో 67 వేలమందికిపైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. 1.70 లక్షలమంది గాయపడ్డారు. లక్షకుపైగా భవనాలు నేలమట్టమయ్యాయి. గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను హమాస్ ముందు ఉంచారు. ఈ ప్రణాళికకు ఒప్పుకోకుంటే నరకం చూపిస్తానని ఇటీవల హెచ్చరించారు. మరోవైపు మూడు రోజులుగా శాంతి ప్రణాళికపై ఈజిప్టులో ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మొదటి దశ అమలుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇజ్రాయెల్ ఏమందంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌కు గొప్పరోజుగా అభివర్ణించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు, బందీలందరినీ ఇళ్లకు చేర్చేందుకు రేపు ప్రభుత్వాన్ని సమావేశపరుస్తానని పేర్కొన్నారు. హమాస్ ఏమందంటే.. ఇటు శాంతి ఒప్పందాన్ని హమాస్ ధ్రువీకరిస్తూ.. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్టు, తుర్కియే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ, మానవత సాయానికి అనుమతి, ఖైదీల మార్పిడి చోటుచేసుకోనుందని వెల్లడించింది. గాజా ప్రజలు సాటిలేని ధైర్యం, వీరత్వం ప్రదర్శించారని హమాస్ పేర్కొంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వయం నిర్ణయాలు సాధించేవరకు తమ ప్రజల హక్కులను వదులుకోమని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: దీపావళికి అమెరికాలో సెలవు ప్రకటన -
గాజా@2: యుద్ధం ముగిసేది ఎప్పుడంటే.. నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Gaza War) రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు సుమారు 67 వేలమంది పౌరులు(సగం మహిళలు, చిన్నారులే), దాదాపు 2 వేల మంది ఇజ్రాయెల్ తరఫున మరణించారు. ఈ తరుణంలో యుద్ధం ముగింపు ఎప్పుడనే దానిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. మేము యుద్ధం ముగింపు దశకు చేరుకున్నాం. కానీ ఇంకా పూర్తిగా ముగించలేదు. గాజాలో ప్రారంభమైనది గాజాలోనే ముగుస్తుంది. మిగిలిన మా 46 బందీల విడుదలతో, హమాస్ పాలన అంతమయ్యే వరకు ఇది కొనసాగుతుంది అని ఓ ఇంటర్వ్యూలో తాజాగా వ్యాఖ్యానించారాయన. బెన్ షాపిరోకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో నెతన్యాహు(Netanyahu On gaza War) మాట్లాడుతూ.. ఈ యుద్ధంతో ఇజ్రాయెల్ మరింత బలంగా ఎదిగింది. ఇరాన్ మద్దతు సంస్థల కూటమి(హమాస్, హెజ్బొల్లా, హౌతీలు ఉంటాయి)ని ఎదురించి మరీ నిలిచాం. ఇక మిగిలింది హమాస్ అంతమే అని అన్నారు. ‘‘మేం హమాస్‌ను ఇంకా పూర్తిగా నాశనం చేయలేదు. కానీ, కచ్చితంగా అక్కడిదాకా చేరతాం. యుద్ధం ముగిసింది అంటే.. మా బంధీలు విడుదల కావాలి. అలాగే.. హమాస్ పాలన అంతం అవ్వాలి అని అన్నారాయన. ట్రంప్‌తో సంబంధాల గురించి.. ఇటీవల కొన్ని అభిప్రాయ బేధాలు తలెత్తినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తన సంబంధం బాగానే ఉందని నెతన్యాహు(Trump Netanyahu Relation) చెప్పుకొచ్చారు. హమాస్‌పై పోరాటంలో అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ప్రపంచానికి నిజాన్ని చూపించాయని అన్నారాయన. అయితే.. America First" అంటే అమెరికా ఒక్కటే కాదని, ఇజ్రాయెల్ వంటి మిత్ర దేశాలు అవసరమని నెతన్యాహూ ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇరాన్ 11,000 కిలోమీటర్ల పరిధి ఉన్న అంతర్జాతీయ క్షిపణులు అభివృద్ధి చేస్తోందని.. ఇది అమెరికా తూర్పు తీరాన్ని చేరగలవని హెచ్చరించారాయన. అలా మొదలైన యుద్ధం..2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల విస్తరణ.. వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురి కావడం, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు.. ఈ వరుస పరిణామాలు హమాస్ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 67, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి.. గాజా యుద్ధం రెండో వార్షికోత్సవం (అక్టోబర్ 7, 2025)లో అడుగుపెట్టిన వేళనే.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈజిప్ట్ రాజధాని కైరో వేదికగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20-పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి. ఇదే చివరి అవకాశమని, ఆలస్యం వద్దని, త్వరపడకపోతే భారీ రక్తపాతం తప్పదని ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు కూడా.ఇదీ చదవండి: భారత్ సమాధి కాక తప్పదు! -
సమయం లేదు.. భారీ రక్తపాతం ఎదురు చూస్తోంది
గాజా శాంతి చర్చల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజా శాంతి ప్రణాళిక అమలుకు ఎంతో సమయం లేదని.. త్వరగా ముందుకు కదలాలంటూ ఇజ్రాయెల్, హమాస్లకు సూచించారాయన. ఈ క్రమంలో చర్చలు ఆలస్యమైనా.. అటు ఇటు అయినా.. దారుణమైన పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇది శతాబ్దాల నాటి ఘర్షణ. స్వయంగా ఈ చర్చలను నేనే పర్యవేక్షిస్తుంటా(Trump Gaza Plan). సమయం ఎంతో కీలకం. ఆలస్యం చేస్తే అత్యంత భారీ రక్తపాతం జరుగుతుంది. అలాంటిదాన్ని ఎవ్వరూ చూడాలనుకోరు.. అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా హెచ్చరించారు. ‘‘ఈ వారం చివర్లో గాజా యుద్ధాన్ని ముగించేందుకు.. బందీలను విడుదల చేయడానికి.. అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాంతిని నెలకొల్పేందుకు సానుకూల చర్చలే జరుగుతున్నాయి’’ ట్రంప్ అని ఆ పోస్టు ద్వారా వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ చర్చలు కీలక దశలోనే ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. ట్రంప్ గాజా ప్లాన్‌పై ఇజ్రాయెల్, హమాస్(Israel Hamas Deal) రెండూ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. చర్చలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ తరుణంలో.. ఇవాళ(సోమవారం) ఈజిప్ట్‌లో ట్రంప్ గాజా ప్లాన్‌పై చర్చలు జరగనున్న నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్‌పై ఒత్తిడిని పెంచేందుకేనని స్పష్టంగా తెలుస్తోంది. కైరో(Cairo)లో ఇవాళ జరుగనున్న ఈ చర్చల్లో హమాస్, ఇజ్రాయెల్, అమెరికా, ఈజిప్ట్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. గాజా పట్టణంలో కొనసాగుతున్న యుద్ధం.. మానవీయ సంక్షోభ నేపథ్యంలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించడం వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే హమాస్ విముక్త గాజా అంశమూ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ సరిహద్దులో జరిపిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులతో.. ఇప్పటిదాకా వేల మంది పౌరులు మృతి చెందారు. తీవ్ర ఆహార సంక్షోభం నెలకొందక్కడ. ఈ పరిణామాలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో శాంతి ఒప్పందం త్వరగా కుదరాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. గాజా శాంతి ఒప్పందంలో(Gaza Peace Deal) భాగంగా ట్రంప్ సూచించిన 20 అంశాల శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ సైతం అంగీకారం తెలిపినప్పటికీ.. హమాస్ లక్ష్యంగా గాజా నుంచి పూర్తిగా తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Truth Social వేదికగా చేసిన తాజా పోస్టులో.. గాజా శాంతి ఒప్పందం మొదటి దశ ఈ వారం పూర్తవుతుందని చెబుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: భారత్‌పై నోరు పారేసుకున్న పాక్ మంత్రి -
జుట్టుపట్టి ఈడ్చి.. నిర్బంధించి
టెల్ అవీవ్: గాజాకు మానవతా సాయం తీసుకెళ్లిన నౌకాయాత్ర సభ్యురాలైన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌తో ఇజ్రాయెల్ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని సహ కార్యకర్తలు ఆరోపించారు. ఆమెను నిర్బంధంలోకి తీసుకుని దురుసుగా ప్రవర్తించారని.. ఆ యాత్రలో పాల్గొన్న పలువురు పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు తెలిపారు. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం.. గాజాకు సహాయాన్ని తీసుకెళ్లిన నౌకలో ప్రయాణించిన 137 మంది పర్యావరణ ఉద్యమ కార్యకర్తలను ఇజ్రాయెల్ బహిష్కరించింది. వారు శనివారం ఇస్తాంబుల్‌కు చేరుకున్నారు. ఈ బృందంలో 36 మంది టర్కిష్ జాతీయులు సహా అమెరికా, యూఏఈ, అల్జీరియా, మొరాకో, ఇటలీ, కువైట్, లిబియా, మలేషియా, మౌరిటానియా, స్విట్జర్లాండ్, ట్యునీషియా, జోర్డాన్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు.జంతువుల్లా చూశారు..గ్రెటా థన్‌బర్గ్‌పై జరిగిన దురుసు ప్రవర్తనను కళ్లారా చూశామని.. మలేషియా జాతీయుడైన హజ్వానీ హెల్మీ, అమెరికన్ పౌరుడు విండ్‌ఫీల్డ్ బీవర్ అనే ఇద్దరు కార్యకర్తలు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ‘అదొక విపత్తు. మమ్మల్ని జంతువుల్లా చూశారు. గ్రెటా థన్‌బర్గ్‌ను జుట్టు పట్టుకొని లాగి, ఇజ్రాయెల్ జెండాను ముద్దు పెట్టుకోమని బలవంతం చేశారు’.. అని 28 ఏళ్ల హెల్మీ ఆవేదన వ్యక్తం చేశారు. శుభ్రమైన ఆహారం, నీరు కూడా ఇవ్వలేదన్నారు.నల్లులున్న గదిలో బంధించి..: గ్రెటా థన్‌బర్గ్ అనుచరులకు స్వీడిష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పంపిన ఒక ఈమెయిల్లో.. థన్‌బర్గ్‌ను నల్లులున్న గదిలో ఉంచారని, సరైన ఆహారం, నీరు ఇవ్వలేదని పేర్కొన్నట్లు ’ది గార్డియన్’ పత్రిక వెల్లడించింది. ‘రాయబార కార్యాలయం గ్రెటా థన్‌బర్గ్‌ను కలవగలిగింది. తనకు నీరసంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. తగినంత నీరు, ఆహారం అందలేదు. శరీరమంతా దద్దుర్లు వచ్చాయి.. అవి నల్లుల వల్లే వచ్చాయని అనుమానిస్తున్నట్లు కూడా ఆమె తెలిపింది..’ అని ఈమెయిల్లో వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అబద్ధాలని ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. -
నేడు ఇజ్రాయెల్, హమాస్ చర్చలు
కైరో: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రధాన లక్ష్యాలుగా సోమవారం ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు మొదలుకానున్నాయి. పరోక్షంగా జరిగే ఈ చర్చల కోసం ఇజ్రాయెల్, హమాస్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ వారంలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల మొదలుకానుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్‌తోపాటు హమాస్ సానుకూలంగా స్పందించడం తెల్సిందే. హమాస్ చెర నుంచి ఇజ్రాయెలీలకు విముక్తి కల్పించడం, బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీని యన్లను విడుదల చేయడంపైనే సోమవారం ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సైతం పాలుపంచుకుంటారని ఈజిప్టు విదేశాంగ శాఖ తెలిపింది. బందీల విడుదల, గాజాలో 2025 ఆగస్ట్‌లో ఉన్న ప్రాంతాల్లోకి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకోవడంపై అంగీకారం కుదిరిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అతి సమీపంలో ఉన్నట్లేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. కాల్పుల విరమణ దిశగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముస్లిం మెజారిటీ కలిగిన 8 దేశాలు ఓ ఉమ్మడి ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. పాలస్తీనా అథారిటీకి గాజాను అప్పగించాలని, గాజాను వెస్ట్‌బ్యాంక్‌లో విలీనం చేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆ దేశాలు డిమాండ్ చేశాయి. ఈ చర్యలన్నిటి కంటే ముందుగా బందీల విడుదల, అందుకు బదులుగా ఖైదీలకు విముక్తి జరగాల్సి ఉందన్నారు. ఇలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాపై బాంబింగ్‌ను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను కోరిన తర్వాతా దాడులు కొనసాగినట్లు సమాచారం. గాజా నగరం, రఫాలపై ఆదివారం జరిగిన దాడుల్లో కనీసం 12 మంది చనిపోయారని వివిధ ఆస్పత్రుల సిబ్బంది చెప్పారు. కాల్పుల విరమణ ఇంకా మొదలుకానందున, గాజాలో ప్రస్తుతానికి బాంబింగ్‌ను పూర్తిగా ఆపేయలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి మీడియాకు చెప్పారు. అదేవిధంగా, చర్చలను జాప్యం చేసేందుకు హమాస్ చేసే ప్రయత్నాలపై ఓ కన్నేసి ఉంచామని కూడా ఆమె తెలిపారు. -
‘త్వరపడండి.. లేదంటే విధ్వంసమే’.. హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు పాలస్తీనా గ్రూప్ హమాస్‌ను హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందానికి త్వరపడి, అంగీకరించాలని లేదంటే గాజాలో మరింత విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.యుద్ధ విరమణ విషయంలో హమాస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి.. లేకుంటే దానికి ఇచ్చిన అన్ని అవకాశాలు నిలిచిపోతాయి. గాజాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే సహించేదిలేదంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పేజీలోని ఒక పోస్టులో పేర్కొన్నారు.బందీల విడుదల, శాంతి ఒప్పందానికి అనుగుణంగా ఇజ్రాయెల్ తాత్కాలికంగా బాంబు దాడులను ఆపివేసిందని ట్రంప్ పేర్కొన్నారు. తమ దేశ సీనియర్ రాయబారి ఒకరు బందీల విడుదల వివరాలను ఖరారు చేయడానికి ఈజిప్టుకు వెళుతున్నారని, ఇకపై ఇజ్రాయెల్‌తో పాటు శాంతి ప్రణాళికను అమలు చేయడంలో హమాస్ జాప్యం చేస్తే సహించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. బందీల విడుదలపై వివరాలను ఖరారు చేసేందుకు, ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు రూపొందించిన ఒప్పందంపై చర్చించేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈజిప్టుకు ప్రాంతానికి వెళుతున్నారని వైట్ హౌస్ అధికారి మీడియాకు తెలిపారు.రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే ప్రణాళికకు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ శుక్రవారం సానుకూలంగా స్పందించింది. బందీలను విడుదల చేయడానికి, ఒప్పంద వివరాలను చర్చించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో యుద్ధంలో దెబ్బతిన్న భూభాగంపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రంప్ ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చారు. అయితే ఇజ్రాయెల్ దళాలు ట్రంప్ మాటను ఉల్లంఘిస్తూ గాజాలో దాడులకు దిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 57 మంది మృతిచెందారని, వారిలో ఒక్క గాజా నగరానికి చెందినవారే 40 మంది ఉన్నారని ఎన్క్లేవ్ పౌర రక్షణ సంస్థ తెలిపింది. -
బందీల విడుదలకు సిద్ధం
గాజా స్ట్రిప్: హమాస్ అంతమే లక్ష్యంగా రెండేళ్లుగా గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడుల పరంపర ముగింపునకు వచ్చిన జాడలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా శనివారం కీలక పరిణామాలు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 అంశాల ప్రణాళిక మేరకు తమ వద్ద ఉన్న బందీలందరి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించగా గాజాలో యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. గాజాలోని తమ బలగాలు ఇప్పుడు కేవలం ఆత్మరక్షణ చర్యలకే పరిమితమయ్యాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. దాడులు జరపడం లేదంది. అయితే, గాజా నుంచి బలగాలను మాత్రం ఉపసంహరించుకోవడం లేదని స్పష్టం చేసింది.కీలక పరిణామంబందీలందరినీ విడుదల చేయడంతోపాటు గాజాలో అధికారాన్ని స్వతంత్ర రాజకీయ పాలస్తీనా గ్రూపులకు అప్పగించడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడాన్ని కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. అయితే, ట్రంప్ ప్రణాళికలోని ఇతర అంశాలపై పాలస్తీనా గ్రూపులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని హమాస్ పేర్కొంది. కొన్నిటిపై మరిన్ని విస్తృత చర్చలు అవసరమవుతాయని కూడా పేర్కొంది. గాజా భవిష్యత్తును పాలస్తీనియన్లే చర్చించి నిర్ణయించుకోవాల్సి ఉందని తెలిపింది. ఈ విషయంలో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామంది. అయితే, హమాస్ ఆయుధాలను అప్పగించాలన్న ఇజ్రాయెల్ కీలక డిమాండ్ ప్రస్తావన ఇందులో లేకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్న ట్రంప్ ప్రతిపాదనలను చర్చలు జరపకుండా ఆమోదించలేమని హమాస్ సీనియర్ అధికారి మౌసా అబూ మెర్జౌక్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా, బందీలందరినీ 72 గంటల్లోగా విడుదల చేయడం సాధ్యం కాదన్నారు. వారందరినీ ఒకే చోటకు చేర్చేందుకు రోజులు లేక వారాలు పట్టొచ్చని చెప్పారు. ఆయుధాలను అప్పగించే హమాస్ సిద్ధంగానే ఉందన్నారు. అయితే, హమాస్ విడుదల చేసిన అధికార ప్రకటనలో మాత్రం ఆయుధాల అప్పగింత విషయం లేకపోవడం గమనార్హం.బాంబింగ్ ఆపేయాలి: ట్రంప్హమాస్ ప్రకటనను ట్రంప్ స్వాగతించారు. ‘శాశ్వత శాంతిని హమాస్ కోరుకుంటోందని అనుకుంటున్నా. గాజాపై బాంబింగ్‌ను ఇజ్రాయెల్ వెంటనే నిలిపివేయాలి. బందీలందరినీ తక్షణమే సురక్షితంగా తీసుకురావడానికి ఇదెంతో అవసరం. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. మిగతా అంశాలపై చర్చలకు సిద్ధం’అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.శాంతి నెలకొంటుందా?తన శాంతి ప్రణాళిక పూర్తిస్థాయి అమలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పూర్తి నమ్మకంతో ఉన్నట్లు కనిపించడం లేదు. ‘చూద్దాం.. ఏం జరుగుతుందో..మనమైతే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. స్పష్టంగా చెప్పాం’అని ఆయన వ్యాఖ్యానించడం దీనికి అద్దం పడుతోంది. ‘ఈ ఒప్పంద ఫలితంగా గాజాలో కొన్ని రోజులపాటు ఇజ్రాయెల్ కాల్పు లను ఆపేస్తుంది. బందీలను హమాస్ విడుదల చేస్తుంది. హమాస్ ఆయుధాలను అప్పగించకుంటే మాత్రం ఇజ్రాయెల్ తిరిగి దాడులు మొదలుపెడుతుంది’అని ఇజ్రాయెల్ మాజీ సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. హమాస్ చర్చలకు సిద్ధమని ప్రకటించిందే గానీ, ఆ సంస్థ డిమాండ్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదని మరో పరిశీలకుడు తెలిపారు. రెండు వర్గాల మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదని విశ్లేషించారు. -
Gaza Issue: డొనాల్డ్ ట్రంప్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికకు హమాస్ ఒప్పుకోవడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు. ‘గాజా వివాదాన్ని అంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నాము. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు, అలాగే విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతలు ఏర్పడటానికి , ఇది ఆ దేశాల అభివృద్ధికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తుంది’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవకు సంబంధిత వారందరూ కలిసి వస్తారని, ఏళ్ల తరబడి సాగుబడి సాగుతున్న సంఘర్షణను అంతం చేయడానికి, శాంతిని స్థాపించే ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాము’ అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…— Narendra Modi (@narendramodi) September 30, 2025 కాగా, గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు. హమాస్‌కు ఆదివారం వరకూ గడువు ఇవ్వగా, వారు ముందుగానే ఒప్పుకోవడం గమనార్హం.ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు -
నో అంటే నరకమే!
గాజా స్ట్రిప్: గాజాలో శాంతి సాధన కోసం తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల హమాస్ మిలిటెంట్లు ఇంకా స్పందించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా ఒప్పుకోవాలని అల్టిమేటం విధించారు. లేకపోతే నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తామని హమాస్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై ఈ నెల 7వ తేదీకి రెండేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే 20 శాతం శాంతి ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ట్రంప్ ప్లాన్‌ను ఇజ్రాయెల్ అంగీకరించింది. ప్రపంచ దేశాలు సైతం స్వాగతించాయి. హమాస్ మాత్రం ఇంకా స్పందించలేదు. ట్రంప్ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యం కాదని, ఇందులో కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. అభ్యంతకర అంశాలపై చర్చించాల్సి ఉందని మధ్య వర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్ కూడా చెబుతున్నాయి. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతాం గడువులోగా హమాస్ తమతో ఒప్పందానికి రావాల్సిందేనని ట్రంప్ స్పష్టంచేశారు. ఇదే ఆఖరి అవకాశంగా భావించాలన్నారు. ఒప్పందానికి రాకపోతే ఇప్పటిదాకా ఎవరూ చూడని నరకాన్ని హమాస్‌కు చూపిస్తామని ఉద్ఘాటించారు. మిలిటెంట్లపై పూర్తిస్థాయి సైనిక చర్య ప్రారంభమవుతుందన్నారు. ఒక మార్గంలో కాకపోతే.. మరో మార్గంలోనైనా మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతామని ట్రంప్ పేర్కొన్నారు. హమాస్‌ను పూర్తిగా అంతం చేస్తామన్న సంకేతాలిచ్చారు. -
గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు
గాజా సిటీ: గాజా వ్యాప్తంగా మంగళవారం కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. వైమానిక దాడులు, కాల్పుల ఘటనల్లో 31 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు వివిధ ఆస్పత్రులు తెలిపాయి. నెట్జరిమ్ కారిడార్ వద్ద ఏర్పాటైన ఆహార పంపిణీ కేంద్రం వద్దకు చేరిన వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోగా 33 మంది గాయపడినట్లు అల్ ఔదా ఆస్పత్రి తెలిపింది. నుసెయిరత్ శరణార్థి శిబిరంలోని ఓ టెంటుపై జరిగిన మరో దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. మువాసిలో శరణార్థులుండే రెండు టెంట్లపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఒక ఘటనలో నలుగురు మహిళలు, చిన్నారి సహా ఏడుగురు, మరో ఘటనలో..ఏడు నెలల గర్భవతి, చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, గడిచిన 24 గంటల వ్యవధిలో గాజాలో 160కి పైగా హమాస్ లక్ష్యాలపై దాడులు జరిపి పలువురు మిలిటెంట్లను చంపామని, ఆయుధాల గిడ్డంగుల్ని, నిఘా పోస్టులను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ పరిణామం...గాజాలో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతామంటూ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సమక్షంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రతిపాదనపై పాలస్తీనా ప్రజల్లో అనుమానాలు రేపుతోంది. ‘ఇది శాంతి ప్రణాళిక కాదు..లొంగుబాటు ప్రణాళిక. మమ్మల్ని మళ్లీ వలస పాలనలోకి నెట్టే ప్రయత్నం’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గాజా ఘర్షణల అంతానికి పిలుపు.. ట్రంప్‌కు ప్రధాని మోదీ మద్దతు
న్యూఢిల్లీ: గాజా ఘర్షణలను అంతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమగ్ర ప్రణాళిక ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. అధ్యక్షుడు ట్రంప్ చూపిన చొరవకు అందరూ మందుకువస్తారని, గాజాలో ఘర్షణలను అంతం చేసేందుకు, శాంతిని నెలకొల్పేందుకు మద్దతు పలుకుతారని తాను ఆశిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…— Narendra Modi (@narendramodi) September 30, 2025ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పాటు గాజా ఘర్షణలను అంతం చేసేందుకు ట్రంప్ రూపొందించిన ప్రణాళికను వైట్ హౌస్ విడుదల చేసిన కొన్ని గంటలకు ప్రధాని మోదీ నుండి ఈ ప్రకటన విడుదలయ్యింది. అయితే అమెరికా ప్రభుత్వం రూపొందించిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ లేదా హమాస్ అంగీకరించాయా లేదా అనే దానిపై ఇప్పటివరూ సమచారమేదీ లేదు. అయితే ఇంతలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో యుద్ధాన్ని ముగించే ప్రణాళికకు అంగీకారం తెలిపారని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. కానీ హమాస్ ఈ నిబంధనలను అంగీకరిస్తుందా లేదా అనేది తెలియరాలేదు.ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల ముగింపునకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. బ్రిటిష్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్‌తో సారధ్యంలో యుద్ధ-బాధిత పాలస్తీనా భూభాగంలో తాత్కాలిక పాలక మండలిని ఏర్పాటు చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ఈ ప్రణాళిక ప్రకారం ప్రజలు గాజాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇరు వైపులా పరస్పర అంగీకారంతో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్ ఆ ప్రణాళికలో పిలుపునిచ్చారు. ఈ ప్రణాళికను అంగీకరించిన 72 గంటల్లోపు హమాస్ తమ దగ్గరున్న ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని కూడా ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించకపోతే ఇజ్రాయెల్‌కు యునైటెడ్ స్టేట్స్ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ హామీనిచ్చారు. పాలస్తీనా ప్రజలు వారి విధికి బాధ్యత వహించాలని, తమ శాంతి ప్రతిపాదనను స్వీకరించాలని కోరారు. -
ట్రంప్-నెతన్యాహు గాజా గేమ్.. ఇదే లాస్ట్ ఛాన్స్!
గాజా సంక్షోభానికి తెర దించే క్రమంలో.. శాంతి ప్రణాళిక(Gaza Peace Plan) ఓ కొలిక్కి వచ్చింది. అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. వైట్‌హౌజ్ వేదికగా.. ఇజ్రాయెల్ అద్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు హమాస్ గ్రూప్ అంగీకరిస్తుందో లేదో అనే అనుమానాన్ని ఇద్దరూ వ్యక్తం చేయడం గమనార్హం. అమెరికా ప్రతిపాదించిన ఈ 20 సూత్రాల శాంతి ఫార్ములాను హమాస్ గనుక ఒప్పుకుంటే.. 72 గంటల్లో వాళ్ల చేతుల్లో ఉన్న బందీలందరినీ విడుదల చేయాల్సి ఉంటుంది. యుద్ధ విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. హింసను వదిలిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష దక్కడంతో పాటు భద్రత నడుమ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. హమాస్ ఆయుధాలు వదిలి పాలన నుంచి తప్పుకుంటుంది కాబట్టి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటునకు గాజాలో Board of Peace ఏర్పాటు చేస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సహాయానికి గేట్లు తెరుస్తారు. ఇలా మిగిలిన అంశాలు ఉన్నాయి. అయితే.. ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు హమాస్(Hamas)కు మరోసారి ఈ ఇద్దరు నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించాల్సిందేనన్న ధోరణితో ట్రంప్, నెతన్యాహులు మాట్లాడారు. ‘‘హమాస్ గనుక ఈ డీల్‌కు ఒప్పుకోకపోతే.. వారిని తుదముట్టించేందుకు ఇజ్రాయెల్‌కు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇది నా తుది హెచ్చరిక.. మరొకటి ఉండదు’’ అని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు.. ఈ ఒప్పందం అమలు సులభ మార్గంలో అయినా.. కఠిన మార్గంలో అయినా అమలు అయ్యి తీరుతుంది అంటూ హమాస్‌కు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ట్రంప్-నెతన్యాహు(Trump-Netanyahu) ప్రకటించిన శాంతి ఒప్పందానికి సౌదీ అరేబియా, ఈజిప్ట్ సహా 8 ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. యూరప్ దేశాధినేతలు మాక్రాన్, స్టార్మర్ ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటించారు. హమాస్ ఇంతదాకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. పక్షపాతంగా ఉందనే ‘గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాదు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నా. శాంతి కోసం మీ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నా. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్‌కు ముప్పు ఉండకూడదు. ఒప్పందంలో తొలి ఘట్టంగా.. గాజా నుంచి బలగాల దశలవారీ ఉపసంహరణ ఉంటుంది. వెంటనే 72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. ఆ తరువాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలి. హమాస్ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి. అంతర్జాతీయ పాలకవర్గం విజయవంతమైతే యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తాం. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలగుతుంది. కానీ భవిష్యత్తు భద్రత దృష్ట్యా చుట్టుపక్కల మోహరించి ఉంటాం’ అని నెతన్యాహు వివరించారు. గాజా శాంతి ప్రణాళిక.. ముఖ్యాంశాలుగాజా నగరాన్ని ఉగ్రవాదం లేని ప్రాంతంగా మార్చడం.హమాస్‌కు పాలనా హక్కు లేకుండా, తాత్కాలిక పాలనను ఏర్పాటు చేయడం.ఇజ్రాయెల్ బంధీలను 72 గంటల్లో విడుదల చేయడం.ఇజ్రాయెల్ 250 జీవిత ఖైదీలు, మరియు 1,700 గాజా ఖైదీలను విడుదల చేయడం.ప్రతి ఇజ్రాయెల్ బంధీ మృతదేహానికి, 15 మంది గాజా మృతదేహాలను తిరిగి ఇవ్వడం.హమాస్ సభ్యులు ఆయుధాలు వదిలి శాంతిగా జీవించాలనుకుంటే, వారికి క్షమాభిక్ష ఇవ్వడం.హమాస్ సభ్యులు గాజా విడిచి వెళ్లాలనుకుంటే, భద్రతతో కూడిన మార్గం కల్పించడం.యుద్ధం ఆగిన వెంటనే, పూర్తి మానవతా సహాయం ప్రారంభించడం.జల, విద్యుత్, ఆసుపత్రులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం.రఫా సరిహద్దు రెండు దిశలలో తెరవడం.బోర్డ్ ఆఫ్ పీస్ (Board of Peace) అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా గాజా పాలన.ట్రంప్ అధ్యక్షతన, ఈ బోర్డు పునర్నిర్మాణం, నిధుల పంపిణీ నిర్వహిస్తుంది.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులకు ఈ బోర్డులో భాగం.పాలనా కమిటీ apolitical, technocratic Palestinians తో ఏర్పాటవుతుంది.పాలస్తీనా అథారిటీ పునరుద్ధరణ తర్వాతే గాజా పాలన చేపట్టాలి.ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించడానికి, దశలవారీగా ప్రణాళిక.అంతర్జాతీయ మానిటర్లు ద్వారా గాజా లోని ఆయుధాల నిర్మూలన.ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ద్వారా “New Gaza” నిర్మాణం.ప్రత్యేక ఆర్థిక మండలం (Special Economic Zone) ఏర్పాటు.గాజా ప్రజలు అక్కడే ఉండేందుకు ప్రోత్సాహం, బలవంతంగా తరలింపు ఉండదు. -
గాజాలో 70 మంది పాలస్తీనియన్లు మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన వైమానిక దాడులు, కాల్పుల ఘటనల్లో కనీసం 70 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర, సెంట్రల్ గాజా పై శనివారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగాయని అల్ జెజీరా తెలిపింది. మృతుల్లో కనీసం 36 మంది గాజా నగరంలోని వారేనని పేర్కొంది. నుసెయిరత్ శరణార్థి శిబిరంలోని ఓ నివాసంపై జరిగిన దాడిలో కుటుంబంలోని 9 మంది చనిపోయారని అల్ ఔదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గాజా నగరంలోని టుఫాలో జరిగిన మరో దాడిలో 11 మంది మృతి చెందారు. వీరిలో సగం మంది మహిళలు, చిన్నారులేనని అల్ అహ్లీ ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. షటి శరణార్థి శిబిరంపై జరిగిన మరో దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు షిఫా ఆస్పత్రి పేర్కొంది. గాజాలోని వేర్వేరు చోట్ల ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. గాజా నగరాన్ని పూర్తిగా ఆక్రమించుకునేందుకు భారీగా సైన్యాన్ని రంగంలోకి దించిన ఇజ్రాయెల్.. వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ ప్రజలకు హెచ్చరికలు కొనసాగిస్తోంది. దీంతో, ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా నగరాన్ని విడిచి వెళ్లిపోగా, తాము ఎక్కడికి వెళ్లలేమంటూ మరో 7 లక్షల మంది భవనాల శిథిలాలు, టెంట్లలోనే ఉండిపోయారు. గడిచిన రెండు వారాల్లో ఇజ్రాయెల్ ఆర్మీ జరిపి వైమానిక దాడుల్లో రెండు క్లినిక్‌లు ధ్వంసమయ్యాయని స్థానికులు తెలిపారు. ఔషధాలు, పరికరాలు, ఆహారం, ఇంధనం లేకపోవడంతో మరో రెండు ఆస్పత్రులను నిర్వాహకులు మూసివేయాల్సి వచ్చిందన్నారు. చాలా మంది పేషెంట్లు, సిబ్బంది ఆస్పత్రులను వదిలి వెళ్లిపోతున్నారు. చాలా తక్కువ సంఖ్యలో వైద్యులు, నర్సులు మాత్రమే కదల్లేని రోగులు, ఇంక్యుబేటర్లలో ఉంచిన చిన్నా రులకు వైద్య సాయం అందిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు తీవ్ర రూపం దాల్చడంతో తమ సేవలను నిలిపివేస్తున్నామని ‘డాక్టర్స్ వితౌవుట్ బోర్డర్స్’గ్రూపు వైద్యులు శుక్రవారం ప్రకటించారు. గాజాలో హమాస్ లక్ష్యంగా చేపట్టిన తమ ఆపరేషన్ పని పూర్తయ్యాకే ఆగుతుందని ఐరాస జనరల్ అసెంబ్లీలో తోటి ప్రపంచ దేశాల నేతల సమక్షంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. 2023 అక్టోబర్ 7న హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల్లో ఇప్పటి వరకు 65 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 1.67 లక్షల మంది గాయపడ్డారు. బాధితుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులేనని గాజా ఆరోగ్య విభాగం చెబుతోంది. -
గాజాలో పని పూర్తిచేసే తీరుతాం
ఐక్యరాజ్య సమితి: గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన యుద్ధం మధ్యలో ఆపే ప్రసక్తే లేదని, పని పూర్తిచేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టంచేశారు. గాజా యుద్ధం, పాలస్తీనా విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు పశ్చిమదేశాలు తలొగ్గవచ్చేమో కానీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గదని తేల్చి చెప్పారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని దేశాలు నెతన్యాహూ ప్రసంగాన్ని బహిష్కరించాయి. కొన్ని దేశాల ప్రతినిధులు సభలోనే ఉండి నెతన్యాహూ ప్రసంగిస్తున్నప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మరికొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆమెరికా మాత్రం ఎప్పటిలాగే ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. చాలావరకు ముఖ్య దేశాలన్నీ ఈ సమావేశానికి జూనియర్ అధికారులను పంపి తమ నిరసనను తెలిపాయి. గాజాపై దాడులను ఆపాలని అంతర్జాతీయంగా ఎంతగా ఒత్తిళ్లు వస్తున్నా.. నెతన్యాహూ పట్టించుకోకపోవటంతో ఇటీవలే ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రమంగా అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతున్నా నెతన్యాహూ వెనక్కి తగ్గేదే లేదు అని ప్రకటించారు. పాలస్తీనాను గుర్తించిన దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమదేశాల నేతలు ఒత్తిళ్లకు తలొగ్గవచ్చు. కానీ, మీకు నేను ఒక హామీ ఇస్తున్నా.. ఇజ్రాయెల్ ఎప్పటికీ తలొగ్గదు. మీ అవమానకరమైన నిర్ణయం (పాలస్తీనాను దేశంగా గుర్తించటం) యూదులు, అమాయక పౌరులకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. యూదు వ్యతిరేక భావజాలం ఎప్పటికీ అంతమవదేమో.. కానీ, అది దారుణంగా చావాలి’అని పేర్కొన్నారు. ప్రసంగం సందర్భంగా నెతన్యాహూ, ఆయన బృందం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసి పౌరులను బందీలుగా తీసుకెళ్లిన ఘటనను చూపించే క్యూఆర్ కోడ్‌ను ధరించారు. ‘ది కర్స్’పేరుతో రూపొందించిన ఓ మ్యాప్‌ను కూడా ప్రదర్శించారు. -
అరెస్టు భయంతో నెతన్యాహు ఏం చేశారంటే..!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Benjamin Netanyahu) చేసిన పని ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(UNGA) సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన న్యూయార్క్ వెళ్లారు. అయితే ప్రయాణంలో ఆయన యూరప్ గగనగలం కాకుండా.. సుదీర్ఘ మార్గంలో ప్రయాణించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గాజా యుద్ధ నేపథ్యంతో.. అంతర్జాతీయ న్యాయస్థానం(International Court Of Justice) నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. యుద్ధ నేరాలకు పాల్పడ్డ ఆయన్ను అవకాశం దొరికితే అరెస్ట్ చేయొచ్చని అందులో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు ఇంటర్నేషనల్ కోర్టు సూచించింది. దీంతో ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరు కావాల్సిన ఆయన యూరప్ దేశాల మీదుగా కాకుండా.. మరో మార్గంలో వెళ్లారనే చర్చ నడుస్తోంది. ఫ్లైట్ ట్రాకింగ్ డాటా ప్రకారం.. ఆయన అధికారిక విమానం ‘వింగ్స్ ఆఫ్ జియాన్’ మధ్యధరా సముద్రం, జిబ్రాల్టార్ ద్వారం.. అట్లాంటిక్ మీదుగా న్యూయార్క్‌కు చేరుకుంది. ఈ క్రమంలో.. ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్ ఎయిర్‌స్పేస్‌ను తప్పించుకున్నట్లైంది. అయితే ఈ రూట్లో వెళ్లడం ద్వారా ఆయన అదనంగా 600 కిలోమీటర్లు ప్రయాణించారని సమాచారం. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కూడా ఆయన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే అప్పటికి నెతన్యాహుపై వారెంట్ జారీ కాలేదు. కానీ, ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలు దేశాల ప్రతినిధులు లేచి వెళ్లిపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక అంతర్జాతీయ న్యాయస్థానం కిందటి ఏడాది నవంబర్‌లో నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్లను యుద్ధనేరస్తులుగా పేర్కొంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ అభియోగాలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇదీ చదవండి: ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తాయి! -
ఐరాస అవసరం తీరిపోలేదు!
అమెరికాలో చార్లీ కిర్క్ హత్యోదంతంపై రేగుతున్న ప్రజాగ్రహం, పోలెండ్‌ను బెదిరిస్తున్న రష్యన్ డ్రోన్లు, ఇజ్రాయెల్ ఇపుడు బాహాటంగానే చెబుతున్న గాజాలోని జాతి నిర్మూలన, గాజా పొరుగు దేశాలపై ఇజ్రాయెల్ దాడులు... వీటన్నిటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) 80వ వార్షికోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందా? కానీ, సహజ జ్ఞానానికి విరుద్ధంగా, ఇటువంటి సందర్భానికి ఇదే సరైన సమయమేమో అని కూడా అనిపిస్తోంది. సమస్యలను విడి విడిగా చూడాలని, చర్చలు జరపాలని అమెరికా విజ్ఞప్తి చేస్తోంది. కాల్పుల విరమణ పాటించాలనటం, శాంతియుతంగా చర్చలు జరపాలని పిలుపు నివ్వడంలో ఆ విజ్ఞప్తులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎనభై అన్నది కీలక ఘట్టంఅంతర్జాతీయ శాంతి, భద్రతలను సాధించడంలో – ఐరాస వైఫల్యాలు; నాగరికంగా చర్చలు జరుపుకొనే పద్ధతిని పెంపొందించడంలో, అందరికీ పూర్తి మానవ హక్కులను కాపాడడంలో – అమెరికా అంతర్గత బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్న దశ ఇది. మహా అయితే, ఐరాస 80వ వార్షికోత్సవం... గతి తప్పిన జాతీయ తావాదం, మిగిలిన వర్గాలను పట్టించుకోకుండా స్వీయ వర్గానికే వీర విధేయత చూపడం, విశృంఖల హింస వంటి వాటికి అతీతంగా కొన్ని విలువలున్నాయని గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుంది. నానాజాతి సమితి 26 ఏళ్ళే మనగలిగింది. దానిని మించి మనుగడ సాగిస్తున్నందుకు ఐరాస గర్వపడవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో 80వ పడిలో పడడం కీలక ఘట్టం. ఆయుర్దాయాన్ని జాగ్రత్తగా కాపాడు కోవాల్సి ఉంటుంది. అలాగే, ఐరాస తన ప్రాధా న్యాన్ని కొనసాగించుకునేందుకు ఈ వార్షికోత్సవం కూడా ముఖ్యమైంది. ఏడేళ్లుగా నిధుల సంక్షోభం!ఐరాసలో తిరిగి జవజీవాలు నింపేందుకు ‘యూఎన్ 80 ఇనీషి యేటివ్’ పేరుతో 2025 మొదట్లో ఒక కార్యక్రమం ప్రారంభమైంది. కానీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్లుగా కనిపిస్తున్న సంస్థను ప్రక్షాళన చేసే బదులుగా అది... వెలాతెలా బోతున్న సంస్థ వేడుకగా మారినట్లు కనిపిస్తోంది. ఐరాస ఆర్థిక సంక్షోభం నానాటికీ పెరుగు తోంది. ‘‘సభ్య దేశాలన్నీ తమ చందా మొత్తాలను పూర్తిగా చెల్లించక పోవడం, చాలా దేశాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కనీసం గత ఏడేళ్లుగా ఐరాస ద్రవ్యత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది’’ అని ఐరాస ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 11 నాటికి ‘‘మొత్తం 193 దేశాలలో 75 దేశాలే వాటి వంతు మొత్తాలను పూర్తిగా చెల్లించాయి. సంస్థ 2025 సంవత్సరపు బడ్జెట్ 3.72 బిలియన్ డాలర్లుగా ఉంది’’ అని ఆ ప్రకటనలో తెలి పారు. నిధుల లోటును; మధ్య ప్రాచ్యంలోను, ఉక్రెయిన్‌లోను శాంతిని నెలకొల్పడమనే ప్రాథమిక విధి లోని వైఫల్యాలను చూస్తుంటే ఐరాస కూడా నానాజాతి సమితి బాట పడుతుందా? అనే ప్రశ్న రావటం సహజమే. ‘శాంతి కోసం సమైక్యత’అయితే, సమితి గురించి ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ ప్రొఫెసర్, జడ్జి, గుటెరస్‌కు సన్నిహితుడు అయిన జార్జ్ అబీ సాబ్ ఒక ఇంటర్వ్యూలో మూడు ఆశావహమైన సంగతులను చెప్పారు. మొదటిది: అంతర్జాతీయ సమాజం తన సమష్టి అభిమతాన్ని వ్యక్తీక రించేందుకు, ఆ సమాజాన్ని న్యాయబద్ధం చేసేందుకు ఉన్న ఒకే ఒక అంతర్జాతీయ వేదిక ఇప్పుడు ఐరాస మాత్రమే. ఖతార్ రాజధాని దోహాపై ఇటీవలి దాడిని (ఇజ్రాయెల్ పేరును నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ) భద్రతా మండలి ఖండించింది. ‘శాంతి కోసం సమైక్యత’ పేరుతో ఐరాస సర్వ ప్రతినిధి సభ చేసిన తీర్మానం ప్రకారం, ఆక్రమిత పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ తన సేనలను ఇప్పటికే సెప్టెంబర్ 18 నాటికి ఉపహరించుకుని ఉండాలి. ఇది అంతర్జాతీయ న్యాయస్థానం సలహా పూర్వకంగా వెలిబుచ్చిన అభి ప్రాయం. దాన్ని పాటించని ఇజ్రాయెల్‌పై సర్వ ప్రతినిధి సభ కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఐరాస శాంతి పరిరక్షక దళాన్ని నియోగించవచ్చు. చెప్పుకోదగిన విజయాలురెండు: శాంతి, భద్రతలను పక్కనపెడితే ఐరాస చెప్పుకోతగిన విజయాలు కొన్ని ఉన్నాయి. వివిధ ఐరాస సంస్థలు పర్యావరణం వంటి రంగాల్లో ప్రత్యేక సేవలందిస్తున్నాయి. పర్యావరణానికి హానికరమైన చేపల వేటకు పాల్పడేవారికి సబ్సిడీలను నిరాకరించే వాణిజ్య ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల కట్టుబడ వలసి వచ్చింది. మూడు: బహుళ పక్షానికి (మల్టీలేటరలిజం) వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించడం. ఏవో ఒకటి రెండు దేశాలు పెత్తనం చలాయించకుండా, ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దటంలో వివిధ దేశాలకు భాగస్వామ్యం కల్పించడానికి ఐరాస ప్రయత్నాలు ఎంతో కొంత ముందుకు సాగుతున్నాయి.షాంఘై సహకార సంస్థ ఐరాసకు ప్రత్యామ్నాయం వంటి బహుళ పక్ష వ్యవస్థ కాకపోవచ్చు. కానీ, డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులను ప్రతిఘటించే విధంగా వివిధ దేశాల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా–ఐరాస పోలికలుఅంతర్జాతీయ సహకారానికి అడ్డుపడుతున్న అంశాలకూ, అమెరికాలో రాజకీయ పోలరైజేషన్కూ మధ్యనున్న సారూప్యాలను గమనించకుండా ఉండడం కష్టం. భీకర అమెరికన్ అంతర్యుద్ధాలలో ఒకదాన్ని చవి చూసిన తర్వాత పెన్సిల్వేనియాలోని గెట్టీస్ బర్గ్‌లో 1863లో చేసిన ప్రసంగంలో అమెరికా పురుద్ధరణను అధ్యక్షుడు అబ్రహాం లింకన్ దర్శింపజేశారు. అమెరికా ఏర్పడిన 87 ఏళ్ల తర్వాత లింకన్ ‘‘ప్రజల కోసం, ప్రజలతో ఎన్నుకోబడిన, ప్రజా ప్రభుత్వం’ అన్న భావనను పునశ్చరణ చేశారు. ఐరాస ప్రణాళిక ఉపోద్ఘాతం కూడా ‘‘ఐక్యరాజ్య సమితి ప్రజలమైన మేము’’ అనే మొదలవుతుంది. అమెరికాను ఆ దేశ సంస్థాపక పితామహులు ముందుకు తెచ్చిన సుమారు 80 ఏళ్ల తర్వాత, లింకన్ ‘స్వాతంత్య్ర నూతన జననం’ గురించి మాట్లాడారు. ఇప్పుడు ‘యూఎన్ 80 ఇనీషియేటివ్’ అదే రకమైన నూతన ఆవిర్భావం గురించి ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ప్రభుత్వాల మధ్య వారధిగా పని చేస్తున్న సంస్థ ఐరాస ఒక్కటే! కనుక సమితి తన జీవిత కాలాన్ని, ప్రాధాన్యాన్ని, 80 ఏళ్లకు మించి పొడిగించుకోగలుగుతుందా అన్నసందేహం అక్కర్లేదు. డేనియల్ వార్నర్వ్యాసకర్త అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు – రచయిత -
గాజాపై రాత్రంతా ఆగని దాడులు
కైరో: గాజా నగరంపై శనివారం రాత్రంతా ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులను ఆపకుండా కొనసాగించింది. గాజా వ్యాప్తంగా జరిగిన దాడుల్లో చిన్నారులు సహా 55 మంది చనిపోయారు. ఒక్క గాజా నగరంలోనే 37 మంది అసువులు బాశారు. ఇక్కడి సబ్రా ప్రాంతంలోని నివాస భవనంపై జరిగిన దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో చిక్కుకున్న 17 మందిని కాపాడారని, మరో 50 మంది వరకు లోపలే చిక్కుకుని ఉంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. శిథిలాల నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని, కాపాడేందుకు వెళ్లిన తమపై ఇజ్రాయెల్ డ్రోన్లు కాల్పులు జరుపుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో బాధితులంతా డొఘ్ముష్ కుటుంబీకులేనని చెప్పారు. కాగా, తమ దాడిలో మాజెద్ అబూ సెల్మియా అనే హమాస్ సాయుధ విభాగానికి చెందిన స్పైపర్ చనిపోయాడని ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన ప్రకటనను ఆయన సోదరుడు, షిఫా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ అబూ సెల్మియా ఖండించారు. 57 వయస్సున్న తన సోదరుడు హై బీపీ, డయాబెటిస్, దృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. అతడు స్పైపర్ కానే కాదని, ఇజ్రాయెల్ చెప్పేదంతా కట్టుకథేనని కొట్టిపారేశారు. అదేవిధంగా, ఇజ్రాయెల్ దాడుల్లో షిఫా ఆస్పత్రి నర్సుతోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది తెలిపారు. గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులపై పోప్ లియో స్పందించారు. గాజాలోని పాలస్తీనియన్లను తమ ఇళ్ల నుంచి బలవంతపు అజ్ఞాతంలోకి పంపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. హింస, తీవ్ర ప్రతీకార చర్యల ఫలితంగా గాజా స్ట్రిప్‌కు భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు. కాగా, పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు యూకే, కెనడా, ఆ్రస్టేలియా ఆదివారం ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సమావేశాల్లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే ప్రతిపాదనను ఆమోదించే అవకాశముంది.వీడ్కోలు ఫొటో విడుదల చేసిన హమాస్ విధ్వంసం కొనసాగిస్తూ గాజా నగరాన్ని స్వా«దీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ఒక వైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, హమాస్ మిలటరీ విభాగం కస్సమ్ బ్రిగేడ్ శనివారం తమ ఉన్న సజీవ, మృతి చెందిన 48 ఇజ్రాయెల్ బందీల చిత్రాలను ‘వీడ్కోలు ఫొటో’అంటూ విడుదల చేయడం సంచలనం రేపింది. ప్రతి ఫొటోకు దిగువన ‘రొన్ అరాడ్’అనే క్యాప్షన్ ఉంచింది. 1986లో లెబనాన్‌లో కనిపించకుండా పోయిన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కెపె్టనే రొన్ అరాడ్. బాంబు అనుకోకుండా పేలడంతో గాయపడి హెజ్బొల్లాకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత రొన్ అరాడ్ జాడ తెలియకుండా పోయింది. బందీల ఫొటోల దిగువన కస్సమ్ బ్రిగేడ్.. ‘కాల్పుల విరమణకు నెతన్యాహూ నిరాకరించడం, గాజా నగరాన్ని ఆక్రమించుకునే ప్రతిపాదనను బహిరంగంగా వ్యతిరేకించి, మిలటరీ ఆపరేషన్ సారథ్యం వహించేందుకు ఆర్మీ చీఫ్ ఈయల్ జమీర్ సిద్ధపడినందుకే బందీలకు వీడ్కోలు’అని పేర్కొంది. అయితే, హమాస్ చెరలో కనీసం 20 బందీలు సజీవంగానే ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నారు. అయితే, సజీవంగా ఉన్న బందీల సంఖ్య 20 కంటే తక్కువగానే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గమనార్హం. బందీలందరినీ వెనక్కి తీసుకురావడం, హమాస్ అంతమే తమ లక్ష్యమని ట్రంప్, నెతన్యాహూ ప్రకటిస్తుండగా, గాజా నగరంలో సైనిక ఆపరేషన్ ఫలితంగా బందీల ప్రాణాలకు ముప్పు తప్పదని హమాస్ హెచ్చరిస్తోంది. -
మరో 43 మంది పాలస్తీనియన్లు మృతి
కైరో: గాజా నగరంపై గట్టి పట్టున్న హమాస్‌తో అమీతుమీ తేల్చుకుంటామంటూ భారీగా సైనికులను రంగంలోకి దించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. దాడుల తీవ్రతను కొనసాగిస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ గాజా వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో కనీసం 43 మంది ప్రాణాలు కోల్పోయారని అల్‌జజీరా తెలిపింది. వీరిలో గాజా నగరంలోని షావా స్క్వేర్ సమీపంలో జరిగిన దాడిలో ఐదుగురు, మరో దాడిలో ఒకే కుటుంబంలోని ఆరు గురు చనిపోయారని ఆరోగ్య విభాగం తెలిపింది. వీరు షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సెల్మియా బంధువులని ఆస్పత్రి ఎండీ రమీ ఎమ్‌హన్నా చెప్పారు. ఇలాఉండగా, గత 23 నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగిస్తున్న దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 65, 100 దాటిపోయింది. భవనాలను నేలమట్టం చేస్తుండటంతో గాజా ప్రాంతంలో ఉన్న కనీసం 90 శాతం మంది పాలస్తీ నియన్లకు నిలువ నీడ కూడా లేకుండాపోయింది. దాదాపు సగం మంది, అంటే సుమారు 4.50 లక్షల మంది గాజా నగరాన్ని వీడి వెళ్లిపోయినట్లు పాలస్తీనా సివిల్ డిఫెన్స్ విభాగం తెలిపింది. ఇలాఉండగా, గాజా ప్రాంతంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారుల కోసం తీసుకువచ్చిన అత్యవసర ఆహార పదార్థాలున్న నాలుగు ట్రక్కులను సాయుధులు వచ్చి తరలించుకుపోయారని యునిసెఫ్ శుక్రవారం తెలిపింది. -
గాజా తీర్మానంపై అమెరికా వీటో
ఐక్యరాజ్యసమితి: గాజాలో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని, బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతామండలి చేసిన తీర్మానాన్ని గురువారం మరోసారి అమెరికా వీటో చేసింది. హమాస్ చర్యలను ఈ తీర్మానం సరైన విధంగా ఖండించలేదంటూ అగ్ర రాజ్యం తప్పుబట్టింది. మండలిలోని శాశ్వత సభ్యత్వమున్న రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే సహా 14 దేశాలు ఈ తీర్మానాన్ని బలపర్చగా, అమెరికా మాత్రం తిరస్కరించింది. తనకున్న వీటో హక్కును వాడుకుంది. రెండేళ్ల పదవీకాలానికి ఎన్నికైన 10 శాశ్వతేతర దేశాలు ఈ తీర్మానాన్ని రూపొందించాయి. గాజాలో పరిస్థితులపై గత నెలలో విడుదల చేసిన నివేదికలో ఐరాస తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అత్యంత తీవ్రమైన కరువు నెలకొందని, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి, మానవతా సాయంపై ఆంక్షలు తొలగిస్తేనే ఈ పరిస్థితి మెరుగవుతుందని పేర్కొంది. ఈ నివేదికను మండలి ముసాయిదా తీర్మానం ప్రస్తావించింది. గాజాలో తీవ్ర మానవీయ సంక్షోభం కొనసాగుతోందని తీర్మానం పేర్కొంది. అక్కడున్న 21 లక్షల పాలస్తీనియన్లకు సాయం అందించడంలో ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని ఇజ్రాయెల్‌ను కోరింది. అయితే, ‘ఈ తీర్మానం హమాస్ చర్యలను తప్పుబట్టలేదు, ఇజ్రాయెల్కుగల ఆత్మరక్షణ హక్కును బలపర్చలేదు. హమాస్‌కు అనుకూల తప్పుడు వాదనలనే ఈ తీర్మానం తలకెత్తుకుంది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేస్తుంది’అని ఓటింగ్‌కు ముందే సీనియర్ యూఎస్ పాలసీ అడ్వైజర్ మోర్గాన్ ఒరా్టగుస్ వ్యాఖ్యానించారు. అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా మండలి సభ్యదేశాలు తీర్మానంలో వాడిన భాష కూడా ఆమోదయోగ్యంగా లేదన్నారు. మరికొద్ది రోజుల్లో ఐరాస జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రపంచ దేశాల నేతలు ప్రసంగిస్తారు. ఈ దఫా ప్రధానంగా గాజాపై చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో, అమెరికా ప్రధాన మిత్ర దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఈ వైఖరిని ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తీర్మానం వీగిన అనంతరం ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ స్పందిస్తూ.. భద్రతా మండలి సెషన్లో జరిగిన పరిణామాలు పాలస్తీనా ప్రజల్లో మరింత ఆవేదనకు ఆగ్రహానికి కారణమవుతాయని వ్యాఖ్యానించారు. మండలి సభ్యదేశం నైజీరియా స్పందిస్తూ.. సామాన్య పౌరుల ప్రాణాలను కాపాడలేకపోతున్నందుకు క్షమించాలంటూ పాలస్తీనా వాసులను కోరింది. ఇజ్రాయెల్ రాయబారి స్పందిస్తూ.. బందీల విడుదలకు గానీ, ఈ ప్రాంతంలో భద్రతను నెలకొల్పడానికి గానీ ఈ తీర్మానం ప్రయతి్నంచలేదని ఆరోపించారు. తమ పౌరుల భద్రతకు, హమాస్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. గత వారం జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశం ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల ప్రతిపాదనను అత్యధిక మెజారీ్టతో ఆమోదించింది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఇజ్రాయెల్‌ను కోరింది. హమాస్ లక్ష్యంగా గాజాను నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధించడంతోపాటు పౌరులపై యథేచ్ఛగా కాల్పులు, దాడులకు పాల్పడటాన్ని ఫ్రాన్స్, యూకే తీవ్రంగా ఖండిస్తున్నాయి. త్వరలో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే ప్రతిపాదనకు మద్దతిస్తామని ప్రకటించాయి. -
Israel Attack: తగలబడుతున్న గాజా
-
గాజా సిటీపై దాడులు ఉధృతం
గాజా సిటీ: గాజా నగరం వీడి వెళ్లిపోవాలంటూ పౌరులకు ఓ వైపు హెచ్చరికలు జారీ చేస్తూనే ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. తాజా దాడుల్లో కనీసం 32 మంది చనిపోయారని షిఫా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు దాడులు కొనసాగాయి. షేక్ రద్వాన్ ప్రాంతంలోని ఓ నివాసంపై జరిగిన దాడిలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు సహా కుటుంబంలోని 10 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం సోషల్ మీడియా వేదికలపై మరోసారి పాలస్తీనియన్లకు హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ శ్రేణులు నిఘాకు వాడుకుంటున్నాయనే సాకుతో గాజా నగరంలోని సుమారు వంద బహుళ అంతస్తులను ఇజ్రాయెల్ ఇటీవలి కాలంలో నేలమట్టం చేయడం తెల్సిందే. తక్షణమే గాజా నగరాన్ని వీడి దక్షిణ ప్రాంతానికి వెళ్లాలని అందులో అల్టిమేటం జారీ చేసింది. అయితే, చాలా మంది ఎక్కడికి వెళ్లే పరిస్థితుల్లో లేరు. అధిక రవాణా ఖర్చులు, నివాస సమస్య తీవ్రంగా ఉంది. దీంతోపాటు ఇప్పటికే పలుమార్లు ఒక చోటు నుంచి మరోచోటుకు మారుతూ వస్తున్న వారు సైతం గాజాలో ఎక్కడికి వెళ్లినా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు తప్పవనే నిస్పృహతో ఉండటం కారణాలుగా ఉన్నాయి. గాజా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 లక్షల మందిలో ఇప్పటివరకు 2.5 లక్షల మంది దక్షిణాదిన ఏర్పాటు చేసిన మానవతా జోన్‌వైపు వెళ్లినట్లు ఆర్మీ ప్రతినిధి అవిచయ్ అడ్రీ అంటున్నారు. గాజా ప్రజలకు తాత్కాలికంగా నీడ కల్పించేందుకు ఉద్దేశించిన 86 వేల టెంట్లు, ఇతర సరఫరాలను ఇజ్రాయెల్ ఆర్మీ లోపలికి అనుమతించడం లేదని ఐరాస తెలిపింది. నెలలుగా కొనసాగుతున్న దిగ్బంధం కారణంగా 24 గంటల వ్యవధిలో పోషకాహార లోపంతో ఏడుగురు చనిపోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. దీంతో, యుద్ధం మొదలయ్యాక పోషకాహార లోపం సంబంధ కారణాలతో చనిపోయిన వారి సంఖ్య 420కి చేరుకోగా, వీరిలో 145 మంది చిన్నారులే ఉన్నారని వివరించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సాగించిన దాడుల్లో ఇప్పటివరకు 64,803 మంది చనిపోయారని గాజా ఆరోగ్య విభాగం పేర్కొంది. వీరిలో సగం మంది మహిళలు, చిన్నారులేనంది. -
ఇజ్రాయెల్ ఘాతుకం
గాజాలో రెండేళ్లుగా తాను సాగిస్తున్న దుశ్చర్యలను చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిన ప్రపంచానికి ఇజ్రాయెల్ ఊహించని షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్ రాజధాని దోహాలో సమావేశమైన హమాస్ రాజకీయ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని మంగళవారం వైమానిక దాడులకు తెగబడి ఆరుగురిని హతమార్చింది. రాయబార కార్యాలయాలు, సూపర్ మార్కెట్లు, పాఠశాలలు ఉన్న కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలో దాడి జరపటాన్ని గమనిస్తే ఇజ్రాయెల్ దేన్నీ ఖాతరు చేయదల్చు కోలేదని స్పష్టమవుతోంది. కాల్పుల విరమణ సాకారమై, హమాస్ చెరలోని బందీలు విడుదల కావాలని ఇజ్రాయెల్ కూడా కోరుకుంటోంది. కనీసం పైకి అలా చెబుతోంది. ఒప్పందానికి హమాస్‌కు ఇదే చిట్టచివరి అవకాశమని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలోనే ఆ సంస్థ సమావేశమైంది. రెండేళ్లుగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు ఖతార్ ప్రయత్నిస్తోంది. అందుకు అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుంది. హమాస్‌ను ఒప్పించాల్సిన అవసరం ఏర్పడినప్పుడల్లా ఆ రెండూ ఖతార్నే ఆశ్రయించేవి. పైగా అమెరికాకు అది అత్యంత సన్నిహిత దేశం. పశ్చిమాసియాలోని అతి పెద్ద అమెరికా సైనిక స్థావరం ఆ దేశంలోనే ఉంది. ఇటీవల ట్రంప్ ఖతార్ వచ్చినప్పుడు ఆయనకు అత్యంత విలాసవంతమైన బోయింగ్–747 జెట్ విమానాన్ని కానుకగా సమర్పించుకుంది. అమెరికాతో లక్ష కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇన్ని ‘మంచి లక్షణాలు’ గల దేశంపై ఇజ్రాయెల్ ఎట్లా దాడి చేయగలిగిందన్నదే గల్ఫ్ దేశాల రాజధానుల్లో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. గాజాలో శాంతి నెలకొనకుండా చూడటమే ఇజ్రాయెల్ ఉద్దేశంగా కనబడుతోందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ చేసిన వ్యాఖ్య నిజమే కావొచ్చుగానీ... అందుకు ఖతార్ సహా గల్ఫ్ దేశాల బాధ్యత కూడా ఉంది. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాద చర్యకు పాల్పడి 1,195 మందిని అమానుషంగా కాల్చిచంపి 250 మంది పౌరులను అపహరించింది. ప్రపంచ దేశాలన్నీ ఆ ఘాతుకాన్ని ఖండించాయి. ప్రతీకారం పేరుతో ఈ రెండేళ్లలో ఇజ్రాయెల్ 64,656 మంది పాలస్తీనా పౌరులను పొట్టనబెట్టుకుంది. రేపో మాపో పూర్తిగా గాజాను అధీనంలోకి తెచ్చుకోబోతోంది. ఈ కాలమంతా గల్ఫ్ దేశాలు చోద్యం చూశాయి. సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, యెమెన్లలో అది వైమానిక దాడులు సాగించినా మౌనంగా ఉండిపోయాయి. దాని పర్యవసానంగానే ‘మిత్రదేశం’గా ఉన్న ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. మరో దేశం సార్వభౌమ త్వాన్ని దెబ్బతీసేందుకు ఏ దేశమూ పూనుకోరాదని ఐక్యరాజ్యసమితి చార్టర్ నిర్దేశిస్తోంది. అలాచేస్తే అది దురాక్రమణే అవుతుందంటున్నది. కానీ తాను అన్నిటికీ అతీతమని ఇజ్రాయెల్ భావన.గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఏదో ఒకటి చేయాలని ఖతార్ ఇచ్చిన పిలుపుతో గురువారం సమావేశం జరిగింది. త్వరలో అరబ్–ఇస్లామిక్ శిఖరాగ్ర సదస్సు కూడా ఉంటుందంటున్నారు. అయితే ఆ ‘ఏదో ఒకటి’ సైనిక చర్య అయితే కాదు. కనీసం ఆ ఆలోచన చేసినా అమెరికా నొచ్చుకుంటుందని వాటికి తెలుసు. అమెరికా–గల్ఫ్ దేశాల బంధం ఉభయ తారకం. అమెరికా సైనిక సాయంపై గల్ఫ్ ఆధారపడి ఉండగా... పశ్చిమాసియాలో తన పలుకుబడి చెక్కుచెదరకుండా ఉండటానికి గల్ఫ్ దేశాల అవసరం అమెరికాకుంది. ఈ అమరికను మార్చటమే ఇజ్రాయెల్ ఆంతర్యం కావొచ్చు. ఎటూ గాజా హస్తగతం కాబోతున్నది కనుక, ఇదే అదునుగా ఈ ప్రాంతంలో తానే ప్రధాన కేంద్రంగా ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు కనబడుతోంది. కానీ అదంత సులభం కాదు. సౌదీ, యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్ల సమష్టి మదుపు నిధి 4 లక్షల కోట్ల డాలర్ల పైమాటే. ఈ సంపద ఆసరాతో గల్ఫ్ దేశాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను శాసించగలవు. గణనీయంగా పలుకుబడి పెంచుకోగలవు. అందుకే ‘ఏదో ఒకటి’ చేయాలన్న ఖతార్ పిలుపుపై ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమ చాప కిందకు నీళ్లొస్తుంటే చూస్తూ ఊరుకోవటం ఆత్మహత్యా సదృశమని గల్ఫ్ దేశాలు ఇప్పటికైనా గుర్తించాలి. ఈ సంక్షోభ సమయంలో అమెరికాకు వంతపాడటం కాక, సొంత గొంతుక వినిపిస్తేనే మనుగడ ఉంటుందని తెలుసుకోవాలి. -
ఇస్లాం గడ్డపై ఇజ్రాయెల్ రక్తపాతం
-
పాలస్తీనా ఖైదీలకిచ్చే ఆహార నాణ్యత పెంచండి
టెల్అవీవ్: ఇజ్రాయెల్ బలగాలు గాజాలోని పాలస్తీనియన్ల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్న వేళ ఆ దేశ సుప్రీంకోర్టు స్పందించింది. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలకు సరిపోను ఆహారం సైతం అందివ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వారికిచ్చే ఆహార పరిమాణాన్ని, ఆహార నాణ్యతను కూడా పెంచాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ విధానాలపై సుప్రీంకోర్టు జోక్యం కేవలం సలహాలకు మాత్రమే పరిమితం. అయినప్పటికీ, ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగే యుద్ధంపై తొలిసారిగా సుప్రీంకోర్టు స్పందించడం విశేషం. పాలస్తీనా ఖైదీలకు కనీసం ఆహారం కూడా అందివ్వకపోవడాన్ని ఒక విధానంగా అధికారులు అమలు చేస్తున్నారంటూ ఇజ్రాయెల్‌కు చెందిన మానవ హక్కుల సంస్థలు ఇచి్చన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. ఖైదీల ప్రాథమిక మనుగడకు రోజులో మూడు భోజనాలు అందించడం ప్రభుత్వ చట్టపరమైన విధి అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అధికారులు అమలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా, అసోసియేషన్ ఫర్ సివిల్ రైట్స్ ఇన్ ఇజ్రాయెల్(అక్రి), ఇజ్రాయెలీ రైట్స్ గ్రూప్ గిషాలు గతేడాది వేసిన పిటిషన్‌పై విచారణకు సైతం తాజాగా అంగీకరించింది. దీనిని అనూహ్య పరిణామంగా పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్ జైళ్లలోని ఖైదీలకు అందించే ఆహారంపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆంక్షలు పెడుతోందని, వారిని ఆకలి చావులకు గురిచేస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు...‘మేం సుఖవంతమైన లేదా విలాసవంతమైన జీవనం గురించి మాట్లాడటం లేదు. చట్ట ప్రకారం మనిషి మనుగడకు అవసరమైన ప్రాథమిక పరిస్థితుల కల్పనపైనే మాట్లాడుతున్నాం’అని పేర్కొంది. అత్యంత దుర్మార్గులైన మన శత్రువుల మాదిరిగా మనం వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి గాజాలోని హమాస్ శ్రేణులు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాక.. ఇజ్రాయెల్‌లోని జైళ్లలో కనీసం 61 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చిలో 17 ఏళ్ల పాలస్తీనా వాసి చనిపోయాడు. ఆకలి బాధతోనే ఇతడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉండగా, సుప్రీంకోర్టు రూలింగ్‌పై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇటమర్ బెన్ గ్విర్ తీవ్రంగా స్పందించారు. జడ్జీలు అసలు ఇజ్రాయెలీయులేనా? అని ప్రశ్నించారు. ఒక వైపు గాజాలోని ఇజ్రాయెల్ బందీలకు సాయం చేసే వారే లేకపోగా, హమాస్‌కు సుప్రీంకోర్టు మద్దతు పలకడం సిగ్గు చేటన్నారు. చట్ట ప్రకారమే జైళ్లలో కనీస పరిస్థితులను కలి్పస్తున్నామని, ఇందులో ఎటు వంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు మేరకు అధికా రులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అక్రి డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ జైళ్లు టార్చర్ క్యాంపుల్లాగా మారరాదని పేర్కొంది. ‘ప్ర భుత్వం ప్రజలను ఆకలిబాధకు గురి చేయరాదు. ప్రజలు ప్రజలనే చంపుకుంటారా? వాళ్లు ఎలాంటి నేరానికి పాల్పడ్డారనేది తర్వాతి విషయం’అని స్పష్టం చేసింది. -
ఆ డాక్యుమెంట్ డ్రామ చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆగవు..!
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న భీకర దాడులు (Israel Hamas Conflict) చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. నిలువెల్లా గాయాలను మిగుల్చుతున్నాయి. 2023 అక్టోబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 21 వేలమంది గాజా చిన్నారులు దివ్యాంగులుగా మారినట్లు ‘దివ్యాంగుల హక్కులపై ఐరాస కమిటీ (CRPD)’ వెల్లడించింది. సరిగ్గా ఈ దాడుల్లో జనవరి 29, 2024న యువ రజబ్ అనే ఆరేళ్ల బాలిక కూడా బలైన దృశ్యం అందరిని శోకసంద్రంలోకి నెట్టింది. ఎందుకంటే ఆమె దాడుల్లో చిక్కుకున్న క్షణంలో రికార్డు అయిన ఆ స్వరం అందరి హృదయాలను కదలించి ఆ దాడిపై క్షణ్ణంగా దర్యాప్తు చేసేలా ప్రేరేపించింది. ఆ ఉదంతంపై తీసిన నాటకం..మరింతమందికి చేరువై ఇజ్రాయెల్ సైన్యానికి నోట మాట రాకుండా చేసింది. అంతేగాదు ఆర్ట్‌తో అలాంటి హృదయవిదారక ఘటనకు మరింతగా ప్రాణం పోసి మానవత్వానికి ఊపిరిపోయడమే కాదు కళ గొప్పదనాన్ని హైలెట్ చేసింది.ఆ నాటకమే గాజా అమ్మాయిపై తీసిన 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' అనే చిన్న డ్రామా. 29 నిమిషాల నిడివితో కూడిన డాక్యుమెంట్ డ్రామను వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ నాటకం ఇజ్రాయెల్ సైనిక కాల్పుల మధ్య ఆరేళ్ల గాజా బాలిక విషాద మరణంపై న్యాయం తోపాటు యుద్ద రక్కసి కోరల్లో పసి ప్రాణాలు ఎలా చిక్కుకుని అల్లాడుతున్నాయో అనే విషయాన్ని హైలెట్ చేసింది. అంతేగాదు ఈ 23 నిమిషా నిడివి గల నాటం స్టాండింగ్ ఒవేషన్‌ను అందుకుంది. ఫ్రాంకో-ట్యునీషియన్ కౌథర్ బెన్ హనియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇజ్రాయెల్ దళాల చేతిలో హత్యకు గురైన గాజాకు చెందిన ఆరేళ్ల బాలిక హింద్ రజబ్ హృదయ విదారకమైన చివరి క్షణాలు వివరిస్తుంది. ఈ నాటకం చూస్తున్న వాళ్లంతా "ఫ్రీ, ఫ్రీ పాలస్తీనా" అని నినాదాలు చేస్తూ, పాలస్తీనా జెండాలను ఊపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో ఈ చిత్రంలో పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ నుంచి వచ్చిన నిజమైన ఆడియో ఉంది. ఆ వీడియోలో ఆ చిన్నారి కారులో మంటల్లో చిక్కుకున్నప్పుడూ.. దయచేసి నా దగ్గరకు రండి, దయచేసి రండి. నాకు భయంగా ఉంది" అని తన చివరి క్షణాల్లో అభ్యర్థిస్తున్న స్వరం స్ఫష్టంగా వినిపిస్తోంది. రక్షణ కోసం ఆ చిన్నారి వేడుకున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదలించింది. కానీ రక్షణ చర్యలు ఆలస్యం కావడంతో తన కుటుంబసభ్యులతో కలిసి విగతజీవిగా కనిపించిందా చిన్నారి. అంతేగాదు దర్యాప్తులో ఇజ్రాయెల్ సైన్యం మొదట్లో సంఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకోనివ్వకుండా దాదాపు మూడుగంటల పాటు నిరాకరించిందని తేలింది. అంతేగాదు ఆమెను రక్షించే ప్రయత్నంలో మరణించిన ఇద్దరు అంబెలెన్స్ కార్మికులు మృతదేహాలు కూడా ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించాయి కూడా. దాంతో మరింతగా దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అల్ జజీరాతో కలిసి ఫోరెన్సిక్ ఆర్కిటెక్చర్, ఇయర్‌షాట్ చేసిన దర్యాప్తులో..ఆ ఘటన జరిగినప్పుడూ రజబ్ కారు నుంచి దాదాపు 13 నుంచి 23 మీటర్ల దూరంలోనే ఇజ్రాయెల్ ట్యాంకు ఉందని వెల్లడైంది. అలాగే జూలై 2024లో ఐక్యరాజ్యసమితి నివేదిక సైతం దీనిని ధృవీకరించింది. పైగా ఇజ్రాయెల్ దళాలు చాలా సమీపంలో కాల్పులు జరిగినట్లు నిర్థారించింది కూడా. దాంతో సంఘటన సమయంలో తమ దళాలు కాల్పుల పరిధిలో లేవంటూ అంతవరకు వాదించిన ఇజ్రాయెల్ సైన్యం సైతం మారుమాట్లాడకుండా సైలెంట్ అయ్యింది. సదరు బాలిక తల్లి విస్మామ్ హమదా కనీసం ఈ చిత్రం ద్వారా అయినా ఈ సంఘర్షణకు ముగింపు ఉంటుందేమోనని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచం మొత్తం మేము చనిపోయేలా, ఆకలితో ఉండేలా, భయంతో జీవించేలా ఫోర్స్ చేసిందంటూ కన్నీటి పర్యంతమైందామె. కాగా, దర్శకురాలు బెన్ హనియా మాట్లాడుతూ.. "ఇలాంటి యుద్ధ విదారకర సంఘటనలను ఇలా నాటకం రూపంలో చిత్రంచడం వల్ల..దాని వెనుకున్న బాధకరమైన లోతులు ప్రజలకు చేరువవ్వడమే గాక, మానవత్వపు విలువలను గురించి నొక్కి చెబుతుంది. అదే సమయంలో సినిమా ప్రాముఖ్యత ఏంటో తేటతెల్లమవుతుందని చెబుతోంది". దర్శకురాలు బెన్ హనియా. “#TheVoiceOfHindRajab cast hold up a picture of Hind Rajab during their record-breaking 23-minute-plus ovation this evening at the #VeniceFilmFestival.Rajab was killed by Israeli forces in Gaza last year. The film chronicles the 6-year-old's final hours.”via deadline pic.twitter.com/CkbumvkCn7— May ❤️🔥💊🪞 (@mayswiftiee) September 3, 2025 (చదవండి: అలా... ఆమె ప్రాణాలు కాపాడారు!) -
క్షతగాత్ర గాజా
అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్నకొద్దీ ఇజ్రాయెల్‌లో ఉన్మాదం ప్రకోపిస్తోంది. గాజాలో దాని దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచానికి చాటుతున్న పాత్రికేయులను గురిచూసి కాటేస్తూ, మరోపక్క గాజా వాసులను ఆకలితో మాడ్చి చంపుతున్న వైనం అమెరికాకు తప్ప అందరికీ ఆందోళన కలిగిస్తోంది. మనుషులు సృష్టించిన దుర్భిక్షంతో గాజా అల్లాడుతున్నదని ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను అంచనా వేసే ఐరాస అనుబంధ సంస్థ ఐపీసీ ప్రకటించిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. మర్యాదలు అడ్డువచ్చాయో, నిబంధనలు అనుమతించలేదో గానీ... గాజా దుర్భిక్షాన్ని మానవ మృగాల సృష్టిగా ప్రకటిస్తే వర్తమాన స్థితికి సరిగ్గా సరిపోయేది. ఇజ్రాయెల్ఇంతగా ఎందుకు దిగజారుతున్నదో తెలిసిందే. ఇన్ని దశాబ్దాలుగా ఆ దేశానికి గట్టి మద్దతు దార్లుగా నిలిచి, దాని దురాగతాలను సమర్థిస్తూ వచ్చిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియాలు వచ్చే నెలలో జరిగే ఐరాస సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను అధికారికంగా గుర్తించనున్నట్టు ప్రకటించాయి. దాంతో భారత్‌తో సహా 1988లోనే పాలస్తీనా ఆవిర్భావాన్ని గుర్తించిన 147 దేశాల సరసన అవి చేరనున్నాయి. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్యదేశాల్లో రష్యా, చైనాలు ఇప్పటికే పాలస్తీ నాను గుర్తించగా బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఆ జాబితాలో చేరనున్నాయి. అంటే ఇజ్రాయెల్ నరమేధానికి మౌనంగా అంగీకారం తెలుపు తున్న అమెరికా ఇకపై మండలిలో ఏకాకి కానుంది. అందుకే ఇజ్రాయెల్ ఉన్మాదం ముమ్మరించింది. సమితిలోనూ, మండలిలోనూ పాలస్తీనాపై చర్చ వచ్చేనాటికల్లా పాలస్తీనా ఉనికినే తుడిచేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తాపత్రయపడుతు న్నారు. అది సాధ్యంకాదని గాజాను వదలబోమంటున్న ప్రజానీకం చాటుతోంది.రెండేళ్ల క్రితం పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్ గడ్డపై ఉగ్రవాద చర్యకు పాల్పడి 1,200 మంది పౌరులను హతమార్చటంతోపాటు 250 మందిని అపహ రించాక నెతన్యాహూ హమాస్‌పై చర్య నెపంతో ఈ నెత్తుటి హోమాన్ని మొదలుపెట్టారు. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ, వియత్నాం, అఫ్గాన్లలో అమెరికా సాగించిన దురాక్ర మణ యుద్ధాల్లోనూ మరణించిన మీడియా సిబ్బంది కన్నా అధికంగా గాజాలో 245 మంది పాత్రికేయులు ఇజ్రాయెల్ క్రౌర్యానికి బలయ్యారు. ఈ దురాగతాలు అమెరికా అధ్యక్షుడికి తెలియనే తెలియవట. ఈ పరిణామాలకు ఆయనేమీ సంతోషంగా లేరట! నటనలో ట్రంప్‌ను నెతన్యాహూ మించిపోతున్నారు. పాత్రికేయుల మరణం విషాదకర మనీ, వైద్యసిబ్బందికీ, పౌరులకూ తామెంతో విలువిస్తామనీ చెబుతున్నారు. సోమవారం ప్రాణాలు తీసిన పాత్రికేయులపై ఆయనగారు ఎందుకనో ఉగ్రవాద ముద్ర వేయలేదు.ఐపీసీ ఇరవయ్యేళ్ల చరిత్రలో కరవు కాటకాలను ప్రకటించింది నాలుగే సందర్భాల్లో. సోమాలియాలో 2011లో, దక్షిణ సూడాన్‌లో 2017, 2020లలో, సూడాన్‌లో నిరుడు ఆ సంస్థ దుర్భిక్షం నెలకొన్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఆ జాబితాలో గాజా చేరింది. గాజా దుర్భిక్షం ఫేజ్–5లో ఉన్నదని ఐపీసీ చెబుతోంది. పిల్లల్లో 30 శాతంమంది తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉన్నారని, ప్రతి పదివేల మందిలో ముగ్గురు మరణిస్తున్నారని దానర్థం. ఇదే కొనసాగితే గాజా జనాభాలో మూడోవంతు మంది... అంటే 6,41,000 మంది ప్రమాదకర స్థితిలో పడతారని, అయిదేళ్లలోపు చిన్నారులు 1,32,000 మంది మృత్యువాత పడతారని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఆకలితో 112 మంది పసివాళ్లతో సహా 271 మంది చనిపోయారు. ఇవిగాక పంపిణీ ట్రక్కుల వద్ద గుమిగూడుతున్నవారిని కాల్చి చంపటం నిత్యకృత్యమైంది. దిగ్బంధాలతో ఆహారం, సరుకులు, ఔషధాలు ప్రజానీకానికి చేరట్లేదు. గాజా వెలుపల 6,000 ట్రక్కులు అనుమతులకై ఎదురుచూస్తున్నాయి. నిత్యం క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నా, ఈ మారణ హోమాన్ని మౌనంగా తిలకిస్తున్న ప్రపంచంలో అనాథలమయ్యామని తెలుస్తూనే ఉన్నా అత్యధిక జనాభా పాలస్తీనాను విడిచిపెట్టడానికి ససేమిరా అంటున్నది. ఆకలితో,హంతక దాడులతో మృత్యువాత పడతామని తెలిసినా వెరవట్లేదు. రెండో ప్రపంచ యుద్ధా నంతరం ఎక్కడా దిక్కులేక అగ్రరాజ్యాల అండతో ఒక దేశాన్ని ఆక్రమించుకున్న దురాక్ర మణదారుకేం తెలుసు... మాతృభూమిపై మమకారమంటే ఏమిటో?! ఇవాళ హంతకు లది పైచేయి కావొచ్చు, ప్రపంచ ప్రజానీకం మౌనంగా మిగిలిపోవచ్చు. కానీ ఈ నేరాలు సమసిపోవు... వాటికి శిక్షపడకా తప్పదు. అప్పుడు నటనలు చెల్లవు, ముసుగులు కుద రవు. ఆ రోజు ఆగమించేవరకూ పాలస్తీనా పంటి బిగువన ఈ కష్టాలు భరించక తప్పదు. -
గాజా ఆస్పత్రిపై క్షిపణి దాడి
దెయిర్ అల్–బలాహ్: గాజా దక్షిణ ప్రాంతం ఖాన్‌యూనిస్‌లోని నాస్సెర్ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ ఆర్మీ సోమవారం భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ)తరఫున ఫ్రీలాన్సర్‌గా పనిచేసే మరియం దగ్గా(33) సహా ఐదుగురు జర్నలిస్టులతోపాటు కనీసం 20 మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో ఆస్పత్రి సిబ్బంది, పౌరులుక్షతగాత్రులుగా మిగిలారు. గాజాలోని హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచి మరియం యూకే పత్రిక ఇండిపెండెంట్ అరబిక్ వెర్షన్ అయిన ఇండిపెండెంట్ అరబిక్ వంటి వార్తా సంస్థల తరఫున కూడా పనిచేశారు. ఆమె ప్రధానంగా నాస్సెర్ ఆస్పత్రి కేంద్రంగా విధులు కొనసాగిస్తున్నారు. ఆమె మరణంపై ఏపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరియం ఇటీవలే నాస్సెర్ ఆస్పత్రిలో పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులను కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషిపై కథనం వెలువరించారు. యుద్ధం ప్రారంభం కాకమునుపే తన 12 ఏళ్ల కుమారుడిని గాజా నుంచి వేరే ప్రాంతానికి పంపించారు. నాస్సెర్ ఆస్పత్రిపై జరిగిన దాడిలో మహ్మద్ సలాం అనే జర్నలిస్ట్ కూడా చనిపోయారని అల్‌జజీరా ధ్రువీకరించింది. దాడిలో తమ కాంట్రాక్ట్ కెమెరామన్ హుస్సం అల్–మస్రి మృతిచెందగా కాంట్రాక్ట్ ఫొటోగ్రాఫర్ హతెమ్ ఖలీద్ గాయపడ్డారని రాయిటర్స్ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన మరో జర్నలిస్ట్ మోత్ అబూ తహా కూడా ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 22 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో 192 మంది జర్నలిస్టులు చనిపోగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 18 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికాకు చెందిన కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్(సీపీజే)తెలిపింది. గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో జరుగుతున్న పోరుపై అంతర్జాతీయ మీడియా కవరేజీని ఇజ్రాయెల్ నిషేధించింది. దీంతో, ప్రము ఖ వార్తాసంస్థలన్నీ గాజా లోని పాలస్తీనా జర్నలిస్టులు, ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగానే అక్కడి పరిణామాలను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. తాజా ఘటనను పాలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించింది. జర్నలిస్టులే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ ఈ దాడికి తెగబడిందని అల్జ జీరా మండిపడింది. జెనీవా ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని ఆరోపించింది. ఇలాంటి దృశ్యాలు గాజాలో ప్రతిరోజూ కనిపించేవేనని ఐరాస ప్రతి నిధి ఫ్రాన్సెస్కా అల్బనీస్ ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం జరిగిందిదే..నాస్సెర్ ఆస్పత్రి భవన సముదాయంలోని నాలుగో అంతస్తుపై ముందుగా ఇజ్రాయెల్ ఆర్మీ క్షిపణిని ప్రయోగించింది. భవనం తీవ్రంగా దెబ్బతినడం ఒక్కసారిగా జనం హాహాకారాలు చేయడంతో ఎమర్జెన్సీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, మీడియా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే అక్కడే మరోసారి ఇజ్రాయెల్ మరో క్షిపణిని ప్రయోగించింది. ఆస్పత్రి బాల్కనీలో జరల్నిస్టులుండే ప్రాంతంపైనే సరిగ్గా ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఘటనలో తమ పౌర సహాయకుడొకరు చనిపోయారని గాజా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఘటనపై సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేపడతామని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఏ లక్ష్యంతో ఆస్పత్రిపై దాడి జరిగిందన్నది మాత్రం వెల్లడించలేదు. రెండు వారాల క్రితం గాజా నగరంపై జరిగిన ఇజ్రాయెల్ ఆర్మీ దాడిలో అల్జజీరాకు చెందిన అన్సాస్ అల్ షరీఫ్ సహా పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ రాకెట్ విభాగానికి అల్ షరీఫే నాయకుడని ఇజ్రాయెల్ ఆరోపించింది. -
‘గాజా సాయం’ పేరుతో నిధుల సేకరణ.. గుజరాత్లో సిరియన్ అరెస్ట్
అహ్మదాబాద్: ఇజ్రాయెల్ యుద్ధంతో పూర్తిగా దెబ్బతిన్న గాజాలోని పేదల కోసం భారత్‌లోని వివిధ మసీదుల నుండి నిధులు సేకరిస్తున్న సిరియన్ జాతీయుడిని గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తూ వస్తున్న మరో ముగ్గురు సిరియన్ పౌరులు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.నిందితునితో పాటు అతని సహచరులు గాజా బాధితుల పేరుతో విరాళాలు సేకరించి, ఆ డబ్బును వారి విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికితోడు వారు ఏదో ఒక ప్రయోజనం కోసం రెక్కీ నిర్వహించడానికి నగరంలో తిష్ట వేశారనే అనుమానాలున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఉదంతంలో ఎల్లిస్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఒక హోటల్ నుండి అలీ మేఘత్ అల్-అజార్ (23) ను అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరద్ సింఘాల్ మీడియాకు తెలిపారు. ఇదే హోటల్లో అనుమానిత సిరియస్లు జకారియా హైతం అల్జార్, అహ్మద్ అల్హబాష్, యూసఫ్ అల్-జహర్ బసచేసినట్లు పోలీసులు కనుగొన్నారు.‘ఒక నిఘా సమాచారం ఆధారంగా మేము డమాస్కస్ నివాసి అయిన అల్-అజార్‌ను అరెస్టు చేశాం. అతని వద్ద నుండి 3,600 అమెరికన్ డాలర్లు, రూ. 25,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అతని అరెస్టు తర్వాత మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే వారు దేశం నుండి పారిపోకుండా ఉండేందుకు వారిపై లుక్-అవుట్ నోటీసు జారీ చేశాం. ఈ నలుగురు సిరియన్లు పర్యాటక వీసాలపై దేశానికి వచ్చి జూలై 22న కోల్‌కతాలో దిగారు. ఆగస్టు 2న వారు అహ్మదాబాద్ చేరుకున్నారు.వారు స్థానిక మసీదుల నిర్వహకులను సంప్రదించి, గాజాలో ఆకలితో అలమటిస్తున్న వారి వీడియోలను చూపిస్తూ విరాళాలు సేకరించారు. గాజాలోని పేద లకు ఆహారం అందించేందుకు, నిధులు సేకరిస్తున్నామని వారు చెప్పేవారు. అయితే వారు గాజాకు నిధులు పంపుతున్నట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదు’ అని అని శరద్ సింఘాల్ తెలిపారు. కాగా గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, జాతీయ దర్యాప్తు సంస్థతో కలిసి అహ్మదాబాద్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ సిరియన్లు గుజరాత్‌కు రావడం వెనుక ఉన్న ఖచ్చితమైన ఉద్దేశ్యం ఏమిటి? స్థానిక మసీదుల నుండి సేకరించిన నిధులను ఎక్కడికి పంపారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.నిందితుల కదలికలు, సంబంధాల గురించి మరింత తెలుసుకునేందుకు వారు బస చేసిన ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను స్కాన్ చేస్తున్నామని ఒక అధికారి తెలిపారు. ప్రాథమికంగా.. వారు రెక్కీ చేయడానికే ఇక్కడకు వచ్చారని, కొంతమంది అనుమానాస్పద వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోందని ఆయన తెలిపారు. అరెస్టయిన సిరియన్ జాతీయుడు, అతని సహచరులు పర్యాటక వీసా షరతులను ఉల్లంఘించారన్నారు. విచారణ సమయంలో నిందితుడు తమ విలాసవంతమైన జీవనశైలి కోసం ఈ నిధులు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. -
హమాస్‌కు నరక ద్వారాలు తెరుస్తాం
గాజా నగరం: గాజా నగరాన్ని పూర్తి స్థాయిలో స్వా«దీనం చేసుకునేందుకు ఆర్మీ ప్రయత్నాలను ముమ్మరం చేసిన వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. షరతులకు అంగీకరించి, లొంగిపోకుంటే హమాస్‌కు నరక ద్వారాలు తెరుచుకుంటాయని వ్యాఖ్యానించారు. గాజా్రస్టిప్‌లో ఇప్పటికే శిథిలాల దిబ్బలుగా మారిన రఫా, బెయిట్ హనౌన్ నగరాలకు పట్టిన గతే గాజా నగరానికీ పడుతుందని శుక్రవాం ‘ఎక్స్’ద్వారా అలి్టమేటమ్ జారీ చేశారు. మిగతా బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని, హమాస్ ఆయుధాలను వదిలివేయాలని ఆయన మరోమారు డిమాండ్ చేశారు. అయితే, బందీల విడుదలకు సిద్ధమని ప్రకటించిన హమాస్..పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయకుండా ఆయుధాలను త్యజించడం మాత్రం అసాధ్యమని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తి స్థాయి ఆక్రమణ కోసం సన్నద్ధతా చర్యలను మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయి సైనిక చర్య మొదలవుతుందని భావిస్తున్నారు. ఇలా ఉండగా, శుక్రవారం గాజా నగరంపై జరిగిన దాడుల్లో కనీసం 17 మంది చనిపోయారని స్థానిక షిఫా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గాజా స్ట్రిప్ ప్రాంతంలో గట్టిపట్టున్న హమాస్ మిలటరీకి, పాలనకు గాజా నగరమే ఆయువు పట్టు. ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల నుంచి హమాస్ శ్రేణులను గాజాలోని భూగర్భ సొరంగాలు పెట్టని కోటలుగా ఉన్నాయని ఇజ్రాయెల్ భావిస్తోంది. బంకర్లలో ఉన్న ఈ షెల్టర్లలోనే వేలాదిగా పౌరులు, కీలక మౌలిక, ఆరోగ్య సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉన్నట్లు అనుమానిస్తోంది. హమాస్‌ను ఓడించడం, బందీలను సురక్షితంగా బయటకు తీసుకురావడం నగరాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడం ద్వారానే సాధ్యమని నెతన్యాహూ ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది. 22 నెలల క్రితం ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి 251 మందిని హమాస్ శ్రేణులు బందీలుగా పట్టుకెళ్లింది. ఇప్పటికీ ఇంకా సజీవులైన 20 మంది సహా మొత్తం 50 మందిని విడుదల చేయాల్సి ఉంది. -
మరణం అంచున గాజా
గాజా స్ట్రిప్: రెండేళ్ల యాజన్.. గాజా నగరంలోని బీచ్‌లో ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్నాడు. ఆ శిబిరానికి రెండు నెలలుగా పిండే కాదు.. ఎలాంటి ఆహార సహాయం అందడం లేదు. విశాలమైన అతని కళ్లు.. ఆహారం కోసం ఎదురుచూసి.. చూసి.. అలసటతో బరువెక్కాయి. ఎముకలు తేలిన శరీరం అతని ఆకలిని చెబుతోంది. ఏడవడానికి కాదు కదా.. చివరికి తిండి తినడానికి కూడా ఓపికలేక.. చిరిగిపోయిన పరుపుపై జీవచ్ఛవంలా కూర్చున్నాడు. ఇది ఒక్క యాజన్ స్థితి కాదు.. గాజా స్ట్రిప్‌లోని పిల్లలందరి సామూహిక దుంఖః. ప్రస్తుతం గాజాలో పోషకాహార లోపం వేగంగా వ్యాపిస్తోంది. గాజా నగరంలో ఆకలి మరణాలు ఫిబ్రవరి నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం గాజాలో 5లక్షల మంది తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిండీ మెక్ కెయిన్ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో అధికారికంగా కరువు నిర్ధారించడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో ఇది గాజా గవర్నరేట్ నుంచి డెయిర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్‌కు వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ‘రోజుల తరబడి తినడానికి ఏమీ లేక లక్షలాది మంది బతుకీడిస్తున్నారు. పోషకాహార లోపం స్థాయి వేగంగా పెరుగుతోంది. ఆకలి మరణాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో తక్షణ, పూర్తి స్థాయి మానవతా సాయం అవసరమని ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెప్పాయి. కరువును ఎలాగైనా ఆపాలని ఆమె పిలుపునిచ్చారు. ఆ ప్రజల ప్రాణాలు కాపడేందుకు అడ్డంకులు లేని మానవతా సహాయం, తక్షణ కాల్పుల విరమణ అవసరమని సూచించారు. లేని పక్షంలో సెప్టెంబర్ చివరి నాటికి, గాజా స్ట్రిప్ అంతటా దాదాపు 7 లక్షల మంది కరువును ఎదుర్కొంటారని ఆమె హెచ్చరించారు. ప్రాణాంతకంగా మారిన పోషకాహార లోపం రెండు సంవత్సరాల సంఘర్షణ ప్రజలను పదేపదే నిరాశ్రయులను చేస్తే.. మానవతా సాయంపై ఆంక్షలు ప్రజలను ఆకలిలోకి నెట్టాయి. ఇక్కడ ఆహారం దొరకడం లేదు. జూలై, మే నెలతో పోలిస్తే ప్రజలు రెట్టింపు సంఖ్యలో ఆకలితో అలమటిస్తున్నారు. ఇక గాజా నగరంలో మూడు రెట్లు ఎక్కువైంది. ప్రతి ముగ్గురిలో ఒకరికి రోజుల తరబడి ఆహారం దొరకడం లేదు. దొరికిన కొద్ది మొత్తంతో పిల్లల కడుపు నింపి, పెద్దలు పస్తులుంటున్నారు. పిల్లల్లో పోషకాహార లోపం వేగంగా పెరుగుతోంది. నలుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అది అత్యంత ప్రాణాంతకం. జూన్ 2026 చివరి నాటికి పోషకాహార లోపం వల్ల మరణించే ప్రమాదం ఉన్న పిల్లల సంఖ్య 14,100 నుంచి 43,400 కు అంటే మూడు రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 98 శాతం పంట భూములు దెబ్బతిన్నాయి. వ్యవసాయం లేదు. ప్రతి పది కుటుంబాల్లో తొమ్మిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. జూలై నుంచి గాజాలోకి వచ్చే ఆహారం, సహాయ సామగ్రి పెరిగింది. కానీ.. అవసరంతో పోలిస్తే అది చాలా తక్కువ. సహాయ ట్రక్కుల నుంచి ఆహారం దోచుకుంటున్నారు. వంట చేసుకోవడానికి నీళ్లు కూడా లేవంటే పరిస్థితిని ఊహించొచ్చు. మనుషులు సృష్టించిన కరువు అయితే ఈ కరువు మనుషులు సృష్టించిందని, అవకాశం ఉన్నా నివారించలేకపోవడం వెంటాడే విషయమని ఐక్యరాజ్యసమితి సహాయ అధిపతి టామ్ ఫ్లెచర్ అన్నారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇజ్రాయెల్ విధిస్తున్న అడ్డంకుల కారణంగా పాలస్తీనా భూభాగానికి ఆహారం చేరుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని అనుమతిస్తే మనం నివారించగలిగే కరువు ఇది. ఇజ్రాయెల్ అడ్డంకుల కారణంగానే సరిహద్దుల వద్ద ఆహారం నిల్వలు నిలిచిపోయాయి’ అని తెలిపారు. -
గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్య షురూ
గాజా నగరం: గాజా నగరాన్ని ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ బలగాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. హమాస్‌కు గట్టి పట్టున్న గాజాను ఆక్రమించుకునే ప్రణాళిక మొదటి దశలో భాగంగా గురువారం ఇజ్రాయెల్ బలగాలు నగర శివారులోకి ప్రవేశించాయి. సెపె్టంబర్ మొదటి వారం నుంచి మొదలయ్యే క్షేత్రస్థాయి సైనిక చర్యకుగాను ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 వేల రిజర్వు బలగాలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే సైనిక చర్యలో పాలుపంచుకుంటున్న మెజారిటీ జవాన్ల స్థానంలో వీరు విధులు నిర్వర్తిస్తారు. అంతేకాకుండా, మరో 20వేల మంది సైనికుల విధులను ప్రభుత్వం పొడిగించనుంది. పది లక్షలకు పైగా జనాభా కలిగిన గాజా నగరంపై గత కొన్ని రోజులుగా బాంబింగ్, ఫిరంగి కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో శివారు ప్రాంతాలైన జెయిటౌన్, సబ్రాల నుంచి వందలాదిగా పాలస్తీనియన్లు నగరంలోని ఇతర ప్రాంతాలకు ప్రాణభయంతో వలసవెళ్తున్నారు. ‘బాంబు ల మోత, పేలుళ్లు, ఫిరంగి కాల్పులు, యుద్ధ విమానాల రొద, అంబులెన్సులు సైర న్లు, జనం ఆర్తనాదాలతో మా ప్రాంతం రాత్రంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది’అని అహ్మద్ అల్–షాంటి తెలిపారు. బాంబుల శబ్దాలకు మా ఇళ్లు ఊగిపోతున్నాయి. కానీ, మేము ఎక్కడికి వె ళ్లాలి? అని ఆయన ప్రశ్నించారు. ‘గత ఒక్క రాత్రి మాత్రమే కాదు. వారం రోజులుగా ఇదే తంతు. గాజాలోని వారెవరికీ కంటిపై కనుకు లేదు. ఫిరంగి కాల్పులు, వైమానిక దాడులు ఆగలే’అని చెప్పారు. సైనిక చర్యను ప్రారంభించేందుకు వీలుగాజెయిటౌన్, జబాలియా ప్రాంతాల్లో బుధవారం నుంచే బలగాలు తమ పనిని ప్రారంభించాయని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. సైన్యం ముందుగా కొన్ని ప్రాంతాలను తాత్కాలికంగా ముట్టడిస్తుందన్నారు. గాజా నగరంలోని లక్షలాది మందిని ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ బలగాలు తీవ్ర ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గాజా నగరంలోని వారిని ఖాళీ చేయించి, ఉత్తరగాజాలో పునరావాసం కలి్పంచాలని ఆరోగ్య యంత్రాంగం, అంతర్జాతీయ సహాయ సంస్థలకు సైతం తాము ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. ఖాళీ చేసి వెళ్లే వారికి పునరావాసం కల్పించేందుకు అవసరమైన టెంట్లను సైతం సిద్ధం చేసి ఉంచామని చెబుతోంది. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి హెచ్చరికలను జారీ చేయలేదు. ఖండించిన గుటెర్రస్.. మండిపడ్డ హమాస్ ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్ ఇజ్రాయెల్ చర్యను తీవ్రంగా ఖండించారు. మరణాలు, విధ్వంసాన్ని ఆపేందుకు వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడులు ఎదురవుతున్నా ఇజ్రాయెల్ మాత్రం ముందుగా ప్రకటించిన విధంగానే గాజా నగర ముట్టడి కొనసాగుతుందని ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనిక చర్యపై హమాస్ మండిపడింది. నగరంలోని అమాయకులపై క్రూరమైన యుద్ధాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కొనసాగిస్తున్నారంటూ నిప్పులు చెరిగింది. మధ్యవర్తులు ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను సైతం ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. మిలటరీ ఆపరేషన్ కారణంగా హమాస్ వద్ద సజీవంగా మిగిలి ఉన్న బందీల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న భయాందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ తీవ్రమైన మానవీయ సంక్షోభం నెలకొని ఉండగా, తాజా చర్యలు పరిస్థితిని మరింతగా దిగజార్చే ప్రమాదముందంటున్నారు.అలసిపోయిన ఇజ్రాయెల్ ఆర్మీగాజాలోని హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించే లక్ష్యంతో మొదలైన యు ద్ధానికి రెండేళ్లయినా ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు విధుల్లోకి పిలిపించిన సైనికుల్లో కొందరు అసంతృప్తితో ఉన్నా రని ఆర్మీ చీఫ్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైనికులు ఆర్మీని విడిచి వెళ్లే ప్రమాదం సైతం ఉందని చెబుతున్నారు. సైన్యంలోని కనీసం 40 శాతం మంది ఇకపై విధుల్లో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని, కేవలం 13 శాతం మందే ఆసక్తితో ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. మెజారిటీ ప్రజలు సైతం యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నారు. అతివాదులైన యూదులు కొందరు సైన్యంలో చేరేందుకు నిరాకరిస్తున్నారు. వారిని కూడా బలవంతంగా సైన్యంలో చేర్చేందుకు చట్టాన్ని తీసుకురావడం సైతం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేందుకు కారణంగా మారింది. -
బందీల విడుదలకు ఒప్పందం చేసుకోండి
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గాజాపై సైనిక చర్యకు ప్రణాళికలు వేస్తుండగా.. ఇజ్రాయేలీలు నిరసన బాట పట్టారు. గాజాపై యుద్ధం ముగించాలని, బం«దీలను విడుదల చేయడానికి హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ర్యాలీలను నిర్వహించారు. జెరూసలేం, టెల్ అవీవ్‌లను కలిపే ప్రధాన రహదారిని ప్రదర్శనకారులు దిగ్బంధించారు. ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో వేలాది మంది ఇజ్రాయెలీలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీల్లో ఇజ్రాయెల్ జెండాలను ఊపుతూ, బందీల ఫొటోలను ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. కొమ్ము బూరలు ఊది, డ్రమ్స్ మోగించి నిరసన తెలిపారు. ప్రధాన రహదారులను దిగ్బంధించారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు 38 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్ నటి గాల్ గాడోట్ కూడా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బందీల కుటుంబాలను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీకి ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ హాజరై ప్రదర్శనకారులకు తన సంఘీభావాన్ని తెలిపారు. ‘దేశాన్ని బలోపేతం చేసే ఏకైక విషయం. అద్భుతమైన స్ఫూర్తితో ప్రజలు బయటకు అడుగు పెట్టారు’అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. బందీల కుటుంబాలు నిర్వహించిన ఈ సమ్మెకు వ్యాపార సంస్థలు సైతం మద్దతు ఇచ్చాయి. సిబ్బందిని నిరసనల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా మూసేశారు. వేసవి సెలవుల కారణంగా పాఠశాలలపై ఎలాంటి ప్రభావం పడలేదు. యెమెన్ క్షిపణి ప్రయోగిస్తుందని వైమానిక దాడి సైరన్లు హెచ్చరించడంతో స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రదర్శనలు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే.. హమాస్ లొంగిపోకుండా యుద్ధాన్ని ముగించాలనే పిలుపు ఆ గ్రూపును బలోపేతం చేస్తుందని ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇది బందీల విడుదల మరింత ఆలస్యం చేస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన గాజా నగరాన్ని సైన్యం స్వా«దీనం చేసుకునే ప్రణాళికలను పునరుద్ఘాటించారు. ఈ చర్యను ఇజ్రాయెలీలు, ముఖ్యంగా బందీల కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది బతికి ఉన్న బందీల ప్రాణాలకు ముప్పని భయపడుతున్నారు. -
ఇవే ప్రశ్నలు వీళ్లిద్దరినీ కాకుండా.. ఆయన్ని అడిగే దమ్ముందా?
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. శాంతి చర్చల్లో ముందడుగు పడకపోతే కఠినంగా వ్యవహరిస్తానంటూ రష్యాపై రంకెలు వేసిన ట్రంప్.. అలస్కా చర్చల తర్వాత కాస్త మెత్తబడ్డాడు. ఉక్రెయిన్ శాంతి చర్చలు అర్ధరహితంగా ముగిసినట్లు వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో.. ట్రంప్ ఇంకా అలస్కాలో ఉండగానే పుతిన్ అక్కడి నుంచి నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..అలస్కాలో జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలను ఇరు దేశాల అధినేతలు స్వీకరించలేదు. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. తలోదారి వెళ్లిపోయారు. యాంకరేజ్ విమానాశ్రయంలో, అలాగే చర్చలు ప్రారంభం కావడానికి ముందు పీస్ రూమ్‌లోనూ ఇరు దేశాధినేతలు మీడియా ముందు ఆసీనులయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ, యుద్ధంలో సాధారణ పౌరులు మరణించడం లాంటి ప్రశ్నలు పుతిన్‌కు ఎదురయ్యాయి. ‘‘సాధారణ పౌరుల్ని చంపడం ఇంకెప్పుడు ఆపుతారు?’’ అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. దానికి పుతిన్ తనకేమీ వినబడడం లేదన్నట్లు సైగ చేసి చూపించారు. అదే సమయంలో ‘‘ట్రంప్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు?’’ అని మరో విలేఖరి ప్రశ్నించగా.. జర్నలిస్టుల గోలతో పుతిన్ ఇచ్చిన వివరణ వినిపించనట్లే కనిపించింది. పుతిన్‌పై అంతర్జాతీయ నేరస్థుల కోర్టు కేసు ఉన్నప్పటికీ.. అమెరికా భూభాగంలోకి ఎందుకు ఆహ్వానించారు?. ఉక్రెయిన్ను నేరుగా భాగం కానీయకుండా కాల్పులవిరమణ డీల్ కుదర్చాలని ట్రంప్ భావిస్తున్నారా?. పుతిన్ ఎలాంటి రాయితీలు ఇవ్వవచ్చు? ట్రంప్ ఏమి అంగీకరించవచ్చు? ఇది యుద్ధ విరామానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ నాటకం మాత్రమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. అయితే వీటిలో వేటికి సమాధానాలు రాలేదు. దీంతో.. సోషల్ మీడియా సదరు జర్నలిస్టుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇవే ప్రశ్నలను గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును అడిగే దమ్ముందా? అని నిలదీస్తోంది. ‘‘2023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటిదాకా 60 వేలమందికిపైనే మరణించారు. అందులో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు గణాంకాలతో సహా చెబుతున్నాయి. అయితే ఈ మరణాలపై నెతన్యాహు ఏనాడూ స్పందించగా పోగా.. కనీసం విచారం కూడా వ్యక్తం చేసింది లేదు. పైగా ఎంతసేపు హమాస్ అంతమే శాంతికి మార్గం అంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు మానవతా సాయం అందకుండా చేశారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై వారెంట్ సైతం జారీ చేసింది.ఈ పరిణామాలపై ఇటు ఇజ్రాయెల్.. అటు అమెరికా జర్నలిస్టులెవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మరోవైపు.. రెండుసార్లు నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనూ జర్నలిస్టులెవరూ.. గాజా పౌరుల మరణాల గురించి ఎందుకు నిలదీయలేదు?’’ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో లక్షల మంది మరణించారు. మూడున్నరేళ్ల యుద్ధానికి పుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంలో పర్సూయింగ్ పీస్ పేరిట అలస్కా చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్-పుతిన్‌లు ఐదారుగంటలు అలస్కాలోనే గడపగా.. రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు పట్టుబట్టగా.. అందుకు రష్యా అధినేత ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. Vladimir Putin’s reaction was nothing short of remarkable—reporters shouted, but his expression told its own story. pic.twitter.com/07vkASuJIc— Tarique Hussain (@Tarique18386095) August 15, 2025భేటీకి ముందు జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించని ఇరువురు నేతలు.. సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు అనుమతించలేదు. మరోవైపు.. అలస్కా చర్చల సారాంశం కోసం రష్యా అధికారుల బృందాన్ని పలువురు జర్నలిస్టులు కలిసే ప్రయత్నమూ విఫలమైంది. అదే సమయంలో.. ట్రంప్ తన అనుకూల రిపోర్టర్లతో పుతిన్‌పై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారని, దాని నుంచి పుతిన్ భలేగా తప్పించుకున్నారనే వాదన నెట్టింట నడుస్తోంది... అలస్కాలో ట్రంప్ దౌత్యం విఫలమేనని కొన్ని అమెరికన్ మీడియా చానెల్స్ ప్రముఖంగా చర్చిస్తున్నాయి. కానీ, ట్రంప్ మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాం అని చెబుతుండడం గమనార్హం. ‘‘పుతిన్ చాలా టఫ్, స్ట్రాంగ్ ఫెల్లో. ఇక దారికి రావాల్సింది జెలెన్స్కీనే’ అన్నట్లు ఫ్యాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇంకోవైపు.. అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీలో రష్యా అనుకూల ఏకపక్ష డీల్ కుదరనందుకు సంతోషమంటూ ఉక్రెయిన్ ఎద్దేవా ప్రకటన విడుదల చేసింది. -
మానవత్వాన్ని మింగే ప్రపంచ స్వార్థం
‘కళ్ల ముందు హింస జరుగుతుంటే, దానిని చూస్తూ మౌనంగా ఉండటం కూడా హింసలో భాగమే’ అన్నారు మహాత్మా గాంధీ. ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని అందించి ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో ఉండాలంటే అదొక్కటే ఏకైక మార్గమని ఆయన నిరూపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధోన్మాదానికి రక్తపుటేరులై పారుతున్న ‘గాజా’ను చూస్తూ కూడా ప్రపంచంలోని అత్యధిక బలమైన దేశాలు నోళ్లు కుట్టేసుకున్నట్లు ప్రవర్తించడమే నెతన్యాహు హింస కంటే బీభత్సంగా గోచరిస్తోంది. ‘గాజా’ మొత్తం ఛిద్రం అయింది. 75,000 మంది ఇప్పటివరకు మట్టిలో కలిసిపోయారన్నది అధికారిక లెక్క. అంతకు మించిన సంఖ్యలో అక్కడి ప్రజలు, సైనికులు హతం అయ్యారన్నది అనధికార అంచనా. అంకెలను బట్టి చూస్తే, గతంలో హిట్లర్, ముస్సోలినీ నెలకొల్పిన రికార్డులన్నింటినీ నెతన్యాహు తిరగరాసినట్లే ఉంది.మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోగానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు గానీ బాధితులకు, క్షతగాత్రులకు రెడ్‌క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు అందించిన సాయాన్ని అడ్డుకొన్న దాఖలాలు లేవు. కానీ, నేడు అంతర్జాతీయ సమాజం అందిస్తున్న సాయంపై ఇజ్రాయెల్ సైనికులు ఆంక్షలు పెట్టారు. ఇంతటి అమానవీయం కనివిని ఎరుగం. 22 నెలలు గడిచినా ‘గాజా’లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఏ దేశమూ చొరవ చూపడం లేదు. ఆ ఒక్క యుద్ధం సరిపోదన్నట్లుగా... ఇరాన్లో అణ్వస్త్రాయుధాలు, శుద్ధి చేసిన యురేనియం నిక్షేపాలు ఉన్నాయనే మిషతో ఆ దేశంపై కూడా విరుచుకుపడి పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు సృష్టించి ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేశారు నెతన్యాహు. వియన్నా డిక్లరేషన్‌ను అనుసరించి యుద్ధంలో పాల్గొనే దేశాలు... సామాన్య పౌరులను చంపకూడదు. జన సామాన్యం, నివాస ప్రాంతాలపై దాడులు చేయరాదు. ఈ నిబంధనను ఇజ్రాయెల్ అటకెక్కించింది. అలాంటి నాయకులేరీ?‘వసుధైక కుటుంబం’ అన్నది భారతదేశం ప్రవచించిన మహత్తరమైన భావన. దానిని భావనగానే ఉంచకుండా ఆచరణలోకి తేవడానికి చిత్తశుద్ధితో కృషి చేసింది కూడా భారతదేశ నాయకత్వమే. గాంధీజీ, నెహ్రూ, అంబేడ్కర్, లోహియా, వినోబాభావే మొదలైన నాయకులతో పాటు, ఆ తర్వాత తరానికి చెందిన ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, అబ్దుల్ కలాం వంటివారు ప్రపంచ శాంతికి, ప్రపంచ దేశాల ఆర్థిక సామాజిక పురోగతికి కృషి చేశారు. కెన్నెడీ, చౌ ఎన్ లై, మార్షల్ టిటో, నాజర్ మొదలైన వివిధ దేశాల నాయకులు సైతం ప్రపంచశాంతికి కృషి చేశారు. మానవజాతి వినాశనానికి దారితీసే యుద్ధాల నివారణకు ఎందరో నేతలు గతంలో తాపత్రయ పడ్డారు. వివిధ దేశాల నడుమ ఘర్షణలు చెలరేగినప్పుడు ఆ ఉద్రిక్తతలను తగ్గించడంలో, సంప్రదింపుల ద్వారా, ఒడంబడికల ద్వారా యుద్ధాలను నివారించడాన్ని అనుభవంలో చూశాం. కానీ ఇప్పుడా చొరవ ఒక్క నాయకుడూ చేయడం లేదు. ‘నేను– నా పొట్ట’ అనే రీతిలో, ‘నేను– నా దేశం’ అనే విధంగా మాట్లాడటం తమ దేశీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం గానూ, తమ దేశాభి వృద్ధిని కాంక్షించే జాతీయ విధానంగానూ భావిస్తున్నారు తప్ప... అటువంటి విధానం వల్ల దేశాల మధ్య పరస్పర సహకారం, సహజీవనం, శాంతి సౌభాగ్యాలకు విఘాతం కలుగుతుందని ఆలోచించడం లేదు.అప్పుల కోసం, ఆయుధాల కోసం నేడు అనేక దేశాలు... ఆగ్రదేశాల ముందు సాగిలపడుతున్నాయి. బదులుగా అగ్రదేశాలు ఏం చేసినా... ‘తానా అంటే తందాన’ అంటున్నాయి. ఈ ధోరణి ఇప్పటికిప్పుడు అలవాటు చేసుకొన్నది కాదు. దాదాపు 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. ఇప్పుడది పరాకాష్ఠకు చేరింది. ఐక్యరాజ్యసమితి కోరల్ని ఎప్పుడో పీకేయడంతో ఆ సంస్థ అస్తిత్వం నామమాత్రంగా మారి యుద్ధాలను నివారించడంలో ఎటువంటి పాత్రనూ పోషించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపగల చొరవ ఎవరు తీసుకొంటారు? ఆ శక్తి ఎవరికి లేకపోవడం అటుంచి... అలాంటి ప్రయత్నం చేయాలన్న తపన కొరవడటమే అత్యంత బాధాకరం.ద్వంద్వ ప్రమాణాలుయుద్ధోన్మాదులు దేశాధినేతలైతే, ఆ దేశ ప్రజల భవిష్యత్తే కాదు... యావత్ ప్రపంచ భవిష్యత్ తారుమారవుతుందని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన కొన్ని గంటల్లోనే అంతర్జాతీయ చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం కారణంగా వాతావరణంలోకి ప్రవేశించిన ప్రమాదకర ‘ధూళి’ యూరప్‌తో సహా పొరుగునున్న పలు దేశాలలో ప్రతికూల ఫలితాలు చూపిస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి. దేశాల మధ్య ఏర్పడుతున్న ఉద్రిక్తతల కారణంగా తమ తమ గగనతలాలను మూసివేయడం, నౌకాయాన మార్గాలను దిగ్బంధనం చేయడం వంటి దుందుడుకు చర్యల ఫలితంగా మానవాళికి జరుగుతున్న నష్టం, కాలహరణం ఊహాతీతమైనది.ప్రపంచంలో మూడు బలమైన దేశాలు అమెరికా, రష్యా, చైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధాల్లో పాల్గొనడం లేదా మిత్రదేశాలకు యుద్ధాల్లో సాయపడటం విరమించుకోనంత వరకు ప్రపంచంలో శాంతి స్థాపన జరగడం కష్టం. నిజానికి ఈ దేశాల ప్రజలకూ, ఆ మాటకొస్తే ఉత్తరకొరియా ప్రజలకు సైతం యుద్ధం అభిలషణీయం కాదు. ప్రజలెప్పుడూ అభివృద్ధిని ఆశిస్తారు. సుఖశాంతులను కోరుకుంటారు. కయ్యానికి కాలు దువ్వే మనస్తత్వం మెజారిటీ ప్రజలకు ఉండదు.ప్రజల ఆశలు, ఆకాంక్షలకు భిన్నంగా, తమ ప్రతిష్ఠను పెంచుకోవడానికీ, తమ దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చాటుకొని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికీ కొందరు ప్రపంచ నేతలు హ్రస్వదృష్టితో అనుసరిస్తున్న విధానాల వల్లనే... యుద్ధాలు ముగింపు లేకుండా కొనసాగుతున్నాయి. యుద్ధం పేరుతో బలహీనులపై అన్ని రకాల దారుణాలూ జరుగుతున్నాయి.స్వార్థమే యుద్ధకారణంకళింగ యుద్ధంలో గెలిచిన తర్వాత అశోక చక్రవర్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రత్యర్థులకు కలిగిన నష్టం కంటే మన నష్టం కొంచెం తక్కువ... అంతే... ఇది విజయం కాదు... పరాజయం... మానవత్వానికి తీరని మచ్చ అని మథన పడతాడు. యుద్ధాలకు స్వస్తి పలికి శాంతి కాముకుడిగా మారి శాంతిని విశ్వజనీనం చేయడానికి తన జీవితాన్ని ధారపోస్తాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ కథ కూడా చివర్లో విషాదంగానే ముగిసింది. ఈ ఉదంతాల నుంచి గుణపాఠాలు నేర్చుకొనే విశాల దృక్పథం నేడు నాయకుల్లో కరువైంది. వారి స్వార్థం నుంచే యుద్ధాలు మొదలవుతున్నాయి. అవి అంతిమంగా మానవత్వాన్ని మింగేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో కావొచ్చు, గాజాలో కావొచ్చు... జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచ దేశాలు నిర్లిప్తంగా, ఉదాసీనంగా, శిలాసదృశంగా మారిపోయాయి. వీటి ప్రతికూల పరిణామాలు ఊహిస్తేనే భయంగా ఉంటుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజా నగరంలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అల్‌జజీరా అరబిక్ ప్రతినిధి 28 ఏళ్ల అనాస్ అల్ షరీఫ్‌తోపాటు మరో నలుగురు జర్నలిస్టులు మరణించారు. ఈ దాడుల్లో కరస్పాండెంట్ మహ్మద్ క్రీకే, కెమెరా ఆపరేటర్లు ఇబ్రహీం జహెర్, మహమ్మద్ నౌఫల్, మోమెన్ అలీవా, వారి సహాయకుడు మహ్మద్ నౌఫల్ మరణించినట్లు అల్‌జజీరా ధ్రువీకరించింది. అల్–షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గర్లో ఉన్న టెంట్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దాడిలో మొత్తం ఏడుగురు మరణించారని అల్–షిఫా ఆస్పత్రి అధికారి ఒకరు తెలిపారు. కాగా, అల్ షరీఫ్ రిపోర్ట్ చేస్తుండగానే బాంబు దాడి జరిగింది. ఈ ప్రాణాంతక దాడికి ముందు, అల్ షరీఫ్ గాజా నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో పెరుగుతున్న దాడులను వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రెండు గంటలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ దురాక్రమణ తీవ్రమైంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అల్ షరీఫ్ ప్రాణాలు కోల్పోవడానికి ముందు రాసిన మెసేజ్‌ను అతని ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది నా చివరి వీలునామా, నా చివరి సందేశం. నా ఈ మాటలు మీకు చేరితే, ఇజ్రాయెల్ నన్ను చంపడంలో, నా గొంతును నొక్కేయడంలో విజయం సాధించిందని అర్థం’ . అని ఆ సందేశంలో పేర్కొన్నారు. అల్ షరీఫ్ హమాస్ నాయకుడు: ఐడీఎఫ్అయితే.. వైమానిక దాడిలో మరణించిన అల్ షరీఫ్.. హమాస్ నాయకుడని ఇజ్రాయెల్ సైన్యం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ‘అనాస్ అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాద సంస్థలోని ఒక ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఇజ్రాయెల్ పౌరులు, ఐడిఎఫ్ దళాలపై రాకెట్ దాడులకు ఆయన నాయకత్వం వహించాడు’ అని ఇజ్రాయెల్ సైన్యం అల్ షరీఫ్ మరణానంతరం ఒక ప్రకటనలో తెలిపింది. అల్ షరీఫ్‌పై ఇజ్రాయెల్ చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక నివేదకురాలు ఐరీన్ ఖాన్ కొట్టిపారేశారు. అంతేకాదు.. ఫ్రంట్‌లైన్ రిపోర్టింగ్ చేస్తున్న ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె గతంలోనే హెచ్చరించారు. ఖండించిన జర్నలిస్టు సంఘాలు.. జర్నలిస్టుల హత్యను పాలస్తీనా జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. వారు ఉగ్రవాదులు కాదని, అలా నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోడీ గిన్స్బర్గ్ తెలిపారు. ‘ప్రస్తుత యుద్ధంలోనే కాదు, గత దశాబ్దాల్లోనూ ఇజ్రాయెల్ నమూనా ఇది. జర్నలిస్టును చంపడం.. అతను ఉగ్రవాది అని ముద్ర వేయడం ఇజ్రాయెల్ దళాలు పనిగట్టుకొని చేస్తున్నాయి’ అని ఆమె ఆరోపించారు. -
గాజాను గాలికి వదిలేయడమేనా?
‘మొత్తం గాజాను ఇజ్రాయెల్ తన అదుపులోకి తీసుకుంటుంది –నెతన్యాహు ప్రకటన’, ‘గాజా నగరం మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకోనున్న ఇజ్రాయెల్’– గత రెండు రోజుల్లో పత్రికల్లో కనిపించిన ఈ శీర్షికలు చూసిన ఎవరైనా అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవి: ఆ మాట అనడానికి ఆయనకు ఎంత ధైర్యం? ఆ పని చేసేందుకు ఇజ్రాయెల్‌కు ఉన్న హక్కే మిటి? కానీ, ఈ ప్రశ్నలను ఎవరూ అడిగినట్లు లేదు. కానీ, నేడు ప్రపంచంలో రాజ్యమేలుతున్న నైతిక పరిస్థితులు అలాంటి ప్రశ్నలు లేవనెత్తగల పరిధిని కుంచించివేశాయి. దాదాపు రెండేళ్ళ నుంచి పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయెల్ భయంకర హింసకు గురి చేస్తున్నా, సైనికంగా, ఆర్థికంగా శక్తిమంతమైన పాశ్చాత్య దేశాలు నిరోధించ లేదు. పరిస్థితులు ఇంతవరకు రావడానికి అవే ప్రధాన కారణం. ఇజ్రాయెల్ చేతిలో 60,000 మందికి పైగా పాలస్తీనియన్లు హతమైనా, అంతకు రెండింతల కన్నా ఎక్కువ మంది గాయపడినా ఉదార ప్రజాస్వామిక ఆదర్శాలను వల్లెవేసే ఈ దేశాలు చోద్యం చూశాయి. లేదా ఇజ్రాయెల్ చర్యలను ప్రోత్సహించాయి. అంతర్జా తీయంగా దేశాలు నాగరిక ప్రవర్తనను గాలి కొదిలేస్తే, ఆ యా దేశాలలోని సమాజాలలో ప్రజాస్వామిక విలువలే దెబ్బతింటాయి. గాజాపై సైనికచర్యలో వినియోగించడానికి అవకాశమున్న ఆయుధాలను ఇజ్రాయెల్‌కు ఇవ్వడాన్ని నిలిపివేస్తామని జర్మనీ ప్రకటించింది. ఈ ఘర్షణలో జోక్యం చేసుకోకూడదని అమెరికా నిర్ణయించుకుంది. గాజా నగరంపై దాడికి దిగాలన్న ఇజ్రాయెల్ నిర్ణయంపై వివిధ దేశాల, అంతర్జాతీయ ఏజన్సీల స్పందనలు అలా రకరకాల స్థాయుల్లో వ్యక్తమయ్యాయి. సైనిక హింసను వెంటనే నిలువరించేందుకు ఒక జీ7 లానో, జీ20 మాదిరిగానో ఏర్పడకుండా ఈ దేశాలకు అడ్డుపడిన అంశం ఏమిటి? పాలస్తీనా ప్రయోజనాలకు ఇండియా కొన్ని దశాబ్దాలుగా మద్దతు ఇస్తూ వస్తోంది. కానీ, మన దేశం కూడా ఇప్పటికీ అధికారిక స్పందనను వెల్లడించలేదు.హమాస్ 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ 15 నెలలపాటు ఏకధాటిన పాలస్తీనాను పిండి చేసిన తర్వాత అమెరికా, ఖతార్, ఈజిప్టుల మధ్య వర్తిత్వంతో మూడు దశల కాల్పుల విరమణకు జనవరిలో ఇజ్రా యెల్, హమాస్ అంగీకరించాయి. కానీ, రెండు నెలలు గడిచాయో లేదో గాజా నగరంపై రాత్రిపూట వైమానిక దాడులకు ఇజ్రాయెల్ తెగబడింది. వాటిలో 400 మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో హింసకు తాత్కాలికంగానైనా అడ్డుకట్టపడుతుందనే ఆశను కాల్పుల విరమణ ఒప్పందం కల్పించింది. ఆరు వారాల మొదటి దశలో – బందీలుగా పట్టుకున్న ఇజ్రాయలీలను హమాస్ వదిలేయాలి. ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్ళలో ఉన్న పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ సేనల ఉప సంహరణ మొదలవ్వాలి. నానా అగచాట్లు పడుతున్న పాలస్తీనియ న్లకు మానవతా సహాయం పెరగాలి. రెండవ దశలో– ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడంతో యువ బందీలు, ఖైదీల మార్పిడి సాఫీగా సాగాలి. మూడవ దశలో– బందీలు, ఖైదీల మృతదేహాల అప్పగింత అమలవ్వాలి. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ సేనల ఉపసంహ రణతోపాటు, గాజాలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలి. కానీ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనపెట్టిన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూ, పాలస్తీనియన్లను చంపుతూనే ఉంది. గాజాకు ఆహారం, దుస్తులు, ఆస్పత్రి సామగ్రితో సహా మానవతా దృష్టితో సాగుతున్న అంతర్జాతీయ సాయానికీ అడ్డుపడింది. గాజా నగరాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఇజ్రాయెల్ నిర్ణయాన్ని హమాస్ చేతిలో ఇప్పటికీ బందీలుగా ఉన్నవారి కుటుంబాల వారు వ్యతిరే కిస్తున్నారు. దాడికి సంబంధించి ఇజ్రాయెల్ సైనిక ప్రణాళికలను ఈ ప్రతిఘటన ఆపుతుందో లేదో రాబోయే రోజుల్లో చూడాలి. ఇజ్రాయెల్ సైనిక దాడులు మొదలైన తొలి నెలల్లో లక్షలాది మంది పాలస్తీనియన్లు గాజాను విడిచి వెళ్ళిపోయారు. వివిధ ప్రాంతాల్లో నిస్సహాయ పరిస్థితుల్లో తలదాచుకున్న పాలస్తీనియన్లు కాల్పుల విరమణ తర్వాత తిరిగి వచ్చారు. అప్పటికే వారి గృహాలు, వాడలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. గాజాలో నివసిస్తున్న పది లక్షల మంది పాలస్తీనియన్లను, రానున్న వారాల్లో ఇజ్రాయెల్ సేనలు తరిమేస్తే, ఆ తర్వాత వారు తిరిగి వచ్చేందుకు, ఆ మాత్రం నగరం కూడా మిగిలి ఉండదు. రఫాకు పట్టిన గతే గాజాకూ పడుతుంది. హమాస్ సేనలను పట్టుకునేందుకు రఫాలో ఉన్న పది లక్షల మంది పౌరులను ఇజ్రాయెల్ ఖాళీ చేయించేసింది. ఇపుడు రఫా ఏ మాత్రం నివాసయోగ్యం కాని విధంగా నేలమట్టమై ఉంది. గాజాలో పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న భీతావహ పరిస్థి తుల్ని ఊహించుకోవచ్చు. అస్తిత్త్వానికే ముప్పు ఎదురవుతున్న ఈ సమయంలో వారి పట్ల మనం సానుభూతితో వ్యవహరించాలి. జాతిని తుదముట్టించే ప్రణాళికలు నిర్వహించకుండా ఇజ్రాయెలీలను ఆపే బాధ్యతను శక్తిమంతమైన దేశాలు భుజానికెత్తుకుంటాయా? అలా చేస్తే, అంతర్జాతీయ వ్యవస్థపై మళ్ళీ నమ్మకం నెలకొంటుంది. తాత్కాలిక విధానాలతోనే అన్నింటిని సద్దుపుచ్చే తత్వం నేడు ప్రపంచమంతటా కనిపిస్తోంది. ఆ జాడ్యం నుంచి దూరం జరిగేందుకు కూడా అది తోడ్పడవచ్చునని ఓ చిగురాశ! ప్రొ‘‘ చందన గౌడ వ్యాసకర్త డీన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, విద్యాశిల్ప్ యూనివర్సిటీ(‘దక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో) -
Gaza: ఆకలి కేకల మధ్య ఘర్షణలకు ఇజ్రాయెల్ స్వల్ప విరామం
గాజా: ఇజ్రాయెల్ సైన్యం గాజాలో నిరంతర దాడులు కొనసాగిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఆకలికేకలు మిన్నంటుతున్న తరుణంలో.. ఇక్కడి మూడు జనావాస ప్రాంతాలలో రోజుకు 10 గంటల పాటు ఘర్షణలకు ఇజ్రాయెల్ సైన్యం పరిమిత విరామం ఇచ్చింది. 21 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ తన దూకుడుతనాన్ని నెమ్మదింపజేస్తోంది.గాజా భూభాగంలోకి ప్రవేశించే మానవతా సహాయం స్థాయిని పెంచడానికి ఇక్కడి మూడు ప్రాంతాలలో వ్యూహాత్మక విరామాన్ని ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆదివారం నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు ప్రతి రోజు ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఈ విరామం ఉంటుందని తెలిపింది. అలాగే బాధితులకు సహాయం అందించేందుకు సురక్షితమైన మార్గాలను ఏర్పాటు చేస్తామని సైన్యం తెలిపింది. గాజాలో సంభవిస్తున్న కరువుపై ఆహార నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. అయితే హమాస్ తన పాలనను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ, ఇజ్రాయెల్.. గాజాకు అందే సహాయాన్ని పరిమితం చేసింది.ఇటీవలి కాలంలో గాజాకు సంబంధించి ఇంటర్నెట్లో కనిపిస్తున్న చిత్రాల్లో కృశించిన పిల్లల చిత్రాలు అందరినీ కలచివేశాయి. ఇజ్రాయెల్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఇజ్రాయెల్ సహాయ ఆంక్షలను సడలించడానికి తీసుకున్న చర్యలను ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ స్వాగతించింది. అంతర్జాతీయ ఒత్తిడి అనంతరం ఇజ్రాయెల్ గత మేలో గాజా దిగ్బంధనను కొద్దిగా సడలించింది. నాటి నుంచి ఐక్యరాజ్యసమితి, ఇతర సహాయ బృందాలు దాదాపు 4,500 ట్రక్కుల మానవతా సహాయాన్ని పంపాయి. ప్రపంచ ఆహార కార్యక్రమం ఒక ప్రకటనలో.. గాజా జనాభాలో మూడింట ఒక వంతు మంది రోజుల తరబడి ఆహారం తినడం లేదని పేర్కొంది. -
గాజా ఆక్రమణకు నెతన్యాహూ చర్యలు
జెరూసలేం: గాజా ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకునేందుకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే గాజాలోని మూడొంతుల ప్రాంతం ఇజ్రాయెల్ ఆర్మీ నియంత్రణలోనే ఉంది. తాజాగా, బందీల విడుదలపై హమాస్ సానుకూలంగా లేకపోవడం కారణంగా నెతన్యాహూ తీసుకున్న నిర్ణయం ఫలితంగా మిలటరీ ఆపరేషన్ ఈ ప్రాంతంలో మరింతగా విస్తరించనుంది. హమాస్ బందీలను దాచి ఉంచిన ప్రాంతం కూడా ఇందులో ఉందని మీడియా అంటోంది.గాజా పూర్తి స్థాయి ఆక్రమణ ప్రయత్నాలపై నెతన్యాహూ కార్యాలయం స్పందించలేదు. సైనిక చర్యపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఇజ్రాయెల్ సీని యర్ అధికారిని ఉటంకిస్తూ ‘చానెల్ 12’ పేర్కొంది. ‘హమాస్ పూర్తిగా లొంగిపోకుండా మిగతా బందీలను విడుదల చేయదు. మేం కూడా లొంగిపోము. ఇప్పుడు ఎలాంటి చర్యా తీసుకోకుంటే బందీలు ఆకలితో చనిపోతారు, గాజా హమాస్ నియంత్రణలోనే ఉంటుంది’అని ఆ అధికారి చెప్పినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రణాళికలపై పాలస్తీనా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. -
మా షరతులు అంగీకరిస్తే బందీలకు సాయం చేస్తాం
కైరో: ఇజ్రాయెల్ కొన్ని షరతులను నెరవేరిస్తే, బందీలకు సహాయం అందించడానికి రెడ్ క్రాస్తో సమన్వయం చేసుకోవడానికి తాము సిద్ధమని హమాస్ ఆదివారం తెలిపింది. రెడ్‌క్రాస్‌తో ఏదైనా సమన్వయం కావాలనుకుంటే.. ఇజ్రాయెల్ శాశ్వతంగా మానవతా కారిడార్లను తెరవాలని, సహాయ పంపిణీ సమయంలో వైమానిక దాడులను నిలిపివేయాలని హమాస్ డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం, గాజాలో ఇప్పుడు 50 మంది బందీలు మిగిలి ఉన్నారు. వారిలో 20 మంది మాత్రమే బతికే ఉన్నారని భావిస్తున్నారు. హమాస్ ఇప్పటివరకు, మానవతా సంస్థలు బందీలను సంప్రదించకుండా నిషేధించింది. వారి పరిస్థితుల గురించి కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కృశించిపోయిన ఇజ్రాయెల్ బందీ డేవిడ్ వీడియో హమాస్ విడుదల చేయగా.. ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వీడియో.. ఇజ్రాయేలీలను భయభ్రాంతులకు గురి చేయగా.. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్‌లు హమాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాజాలో బందీల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హమాస్ తాజా ప్రతిపాదన తీసుకొచ్చింది. దాదాపు రెండేళ్ల యుద్ధం తరువాత.. మానవతా విపత్తు ఎదుర్కొంటున్న గాజాకు ఇంధన సరఫరాను అనుమతించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇంధన కొరత ఆసుపత్రుల కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఆకలి మరణాలు పెరుగుతున్నాయనే భయాల మధ్య ఇజ్రాయెల్ ఈ సడలింపును జారీ చేసింది. ఆదివారం, రెండు ట్రక్కులు ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న కారెం అబు సలేం క్రాసింగ్ ద్వారా గాజాలోకి ప్రవేశించాయి. ఆసుపత్రులు, బేకరీలు, పబ్లిక్ కిచెన్లకు సహాయం చేయడానికి ఈ వారం చివరిలో మరో నాలుగు ట్యాంకర్లు యూఎన్ ఇంధనం వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రులు, బేకరీలు, పబ్లిక్ కిచెన్లు, ఇతర ముఖ్యమైన సేవల కార్యకలాపాలకు సహాయం చేయడానికి నాలుగు యూఎన్ ఇంధన ట్యాంకర్లు ప్రవేశించాయని సహాయాన్ని సమన్వయం చేసే ఇజ్రాయెల్ సైనిక సంస్థ సీఓజీఏటీ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో గాజాలో ఆకలి లేదా పోషకాహార లోపంతో మరో ఆరుగురు మరణించారని దాని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య 175కి పెరిగింది. వీరిలో 93 మంది పిల్లలు ఉన్నారు. 4 -
ఉప్పు నీళ్లను తాగుతున్న గాజా పిల్లలు
-
బతుకుతానో లేదో.. ‘నా సమాధి నేనే తవ్వుకుంటున్నా’
ఓ 24ఏళ్ల యువకుడు. బ్రతికుండగానే తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడు. కుటుంబ సభ్యులు సైతం ఆ యువకుడిని సజీవంగా పాతిపెట్టిన సజీవ అస్థి పంజరంతో పోలుస్తున్నారు. అలా అని ఆ యువకుడికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఏదైనా ఉందా? అంటే అదేం లేదు. ఆరోగ్యంగానే ఉన్నాడు. అయినప్పటికీ తాను మరణం అంచునా ఉన్నానని, బతికే అవకాశం లేక తన సమాధిని తానే తవ్వుకున్నానంటూ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇంతకీ ఎవరా యువకుడు?. ఎందుకు తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడుఇజ్రాయెల్- గాజా యుద్ధం నేపథ్యంలో హమాస్ విడుదల చేసిన తాజా వీడియోలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. హమాస్ విడుదల చేసిన వీడియోల్లో 24 ఏళ్ల ఎవ్యాతార్ డేవిడ్ అనే ఇజ్రాయెల్ యువకుడి పరిస్థితి మరింత ధీనంగా ఉంది. మాట్లాడే ఒపిక లేక,చిక్కి శల్యమై కనిపిస్తున్న దృశ్యాలు మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.ఇక హమాస్ విడుదల చేసిన వీడియోలో డేవిడ్ మాట్లాడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఓ చిన్న పారతో తన సమాధిని తవ్వుతూ ఇజ్రాయెల్ అధికారిక భాష హీబ్రూలో తన కష్టాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు.‘రోజు రోజుకి నేను మరింత చిక్కి శల్యమైతున్నాను. నా గమ్యం ఇక సమాధివైపే. అందుకే నేను నా సమాధిని నేను తవ్వుకుంటున్నాను. అదిగో అక్కడే నా సమాధి ఉంది. నేను అక్కడే సమాధినవుతాను. ఈ బంధనాల నుంచి విడుదలై నా కుటుంబంతో నిద్రపోయే సమయం చాలా తక్కువే ఉంది’ అంటూ చెబుతున్న అతని మాటలు చూపురులను కంటతడి పెట్టిస్తున్నాయి.ఎవ్యాతార్ డేవిడ్ ఎవరు?ఎవ్యాతార్ డేవిడ్ 24 ఏళ్ల ఇస్రాయెల్ పౌరుడు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుండి హామాస్ టెర్రరిస్టులు అతడిని బంధించారు. నాటి నుంచి అతను గాజాలో బంధీగా (ఆగస్ట్ 3తో 666రోజులు) ఉన్నాడు. తాజాగా హామాస్ విడుదల చేసిన వీడియోతో డేవిడ్ కుటుంబసభ్యులు సజీవ అస్థి పంజరం,బతికుండగానే సమాధిలో ఉన్నాడని’ వర్ణిస్తున్నారు.వీడియోలో ఏముంది?డేవిడ్ గాజా టన్నెల్లో ఒక గోతిని తవ్వుతూ కనిపించాడు. ఇది నా సమాధి. నా శరీరం రోజుకో రోజు బలహీనమవుతోంది. నా కుటుంబంతో పడుకునే అవకాశం త్వరలో ముగిసిపోతుందని చెప్పుకొచ్చాడు. అతని శరీరం చాలా బలహీనంగా, ఆకలితో క్షీణించినట్లు కనిపించగా.. డేవిడ్‌తో పాటు ఇతర బంధీలు రోమ్ బ్రాస్లావ్స్కీ అనే మరో బంధీ వీడియో కూడా హమాస్ విడుదల చేసింది. అతను 21 ఏళ్ల యువకుడు. నోవా ఫెస్టివల్లో సెక్యూరిటీగా పనిచేస్తుండగా.. హామాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.గాల్లో కలిసిపోతున్న అమాయకుల ప్రాణాలుఇక నిర్విరామంగా కొనసాగుతున్న గాజా,హమాస్ యుద్ధం వేలాది మంది అమాయకుల ప్రాణాల్ని తీసింది. ఇంకా తీస్తూనే ఉంది. 1,219 మంది ఇస్రాయెల్ పౌరులు హమాస్ దాడిలో మరణించారు. 60,000 మంది పాలస్తీనియన్లు గాజాలో మరణించారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఆహార, ఔషధాల కొరత కారణంగా 169 మంది పిల్లలు ఆకలితో మరణించినట్లు తెలుస్తోంది. కాగా, హమాస్ విడుదల చేసిన వీడియోలతో బంధీలను వెంటనే విడిపించాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.సూపర్ నోవా ఫెస్టివల్ అంటే ఏమిటి..?సూపర్ నోవాను యూనివర్సల్ పారలెల్లో ఫెస్టివల్ అని కూడా అంటారు. గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతం రీమ్‌లో జరిగింది. సూపర్ నోవా పండుగను యూదులు వారంపాటు జరుపుకుంటారు. సెప్టెంబర్ 29, 2023 నుంచి అక్టోబర్ 6, 2023 వరకు జరిగే వేడుక. పంట సేకరణను ఉద్దేశించి జరుపుకునే వేడుక ఇది. పిల్లలపై దేవుడి దయకు నిదర్శనంగా సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ ఐక్యమత్యం, ప్రేమలకు గుర్తుగా మనసుకు హత్తుకునే అంశాలతో కూడుకుని ఉంటుంది.పండుగ సందర్భంగా వేలాది మంది యువకులు వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాత్రిపూట గాజా సరిహద్దును దాటుకుని వందిలాది రాకెట్ దాడులు జరిగాయి. ఉగ్రవాదులు మారణాయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. గన్లతో దాదాపు 3500 మంది ఇజ్రాయెల్ యువతపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వేడుకలో చాలా మంది అప్పటికే మద్యం సేవించి మత్తులో ఉండగా.. బైక్‌లపై వచ్చిన దుండగులు ఏకే-47 వంటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. భయంతో పరుగులు తీస్తున్న జనం, క్షతగాత్రుల అరుపులతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. How psychopathic is Hamas?It forced starving hostage Evyatar David to DIG HIS OWN GRAVE for the cameras. pic.twitter.com/iMa404St4s— Eylon Levy (@EylonALevy) August 2, 2025 -
Gaza: ఆకలి కేకలు.. 48 మంది దుర్మరణం
యుద్ధం కారణంగా గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతంలో మానవతా సహాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొకవైపు విషాద ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం గాజాలోని జికిమ్ క్రాసింగ్‌లో ఆహారం కోసం జనం ఎగబడటంతో 48 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని, పదుల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారని స్థానిక మీడియా తెలిపింది.మానవతా సహాయ బృందం క్రాసింగ్‌కు చేరుకున్న సమయంలో, ఆహారం కోసం బాధితులు ఎగబడినప్పుడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాజా సిటీలోని షిఫా హాస్పిటల్ ఈ ఘటనలో మృతుల సంఖ్యను 48గా నిర్ధారించింది. మానవతా సహాయ బృందం నుంచి కొందరు పిండి సంచులను తీసుకుని పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ పోలీసులు జనసమూహంపై కాల్పులు జరిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న సైనిక దాడి, కఠినమైన దిగ్బంధనం కారణంగా గాజాలో సంక్షోభం మరింత తీవ్రమయ్యింది.ఈ పరిస్థితుల నేపధ్యంలో గాజాలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిషికేషన్ (ఐపీసీ) గాజాలో కరువు తీవ్రతపై హెచ్చరించింది. తక్షణ చర్యలు లేకపోతే మరిన్ని మరణాలు నమోదవుతాయని పేర్కొంది. మానవతా సహాయ సంస్థలు మరింతగా ముందుకు రావాలని కోరింది. గాజాలోకి మరింత మానవతా సహాయాన్ని అనుమతించడానికి అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచుతోంది. యూఎన్ తెలిపిన వివరాల ప్రకారం గాజాకు 600 ట్రక్కుల మానవతా సహాయం అందగా, 220 ట్రక్కుల సామాగ్రిని మాత్రమే అనుమతించారు. మానవతా సహాయాన్ని అందుకునే దిశగా జరుగుతున్న తొక్కిసలాటల్లో ఇప్పటి వరకూ వెయ్యిమంది పాలస్తీనియన్లు మృతిచెందారు. -
యుద్ధాలు సాగాల్సింది కదన రంగంలో.. పసిపిల్లల పొట్టల మీద కాదు (ఫోటోలు)
-
అన్నార్థులపై బ్రహ్మాస్త్రం
డెయిర్ అల్ – బలాహ్: వ్యూహాత్మకంగా కాల్పుల విరమణ పాటిస్తామని ఇటీవల ప్రకటించిన ఇజ్రాయెల్.. గాజాలో వ్యూహాత్మకంగానే దాడులు చేస్తోంది. గాజా స్ట్రిప్‌లోని జికిమ్ క్రాసింగ్ వద్ద ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 48 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. తమ ఆస్పత్రికి 35 మృతదేహాలు వచ్చాయని అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ అబూ సలి్మయా తెలిపారు. కాల్పుల స్థలం నుంచి గాయపడిన వారిని చెక్క బండ్లలో దూరంగా తీసుకెళ్తున్న, అలాగే పిండి సంచులను మోసుకెళ్తున్న జనసమూహం మీడియా ఫుటేజీలో కనిపించాయి. 100 మందికి పైగా గాయాలతో తమ ఆస్పత్రికి వచ్చారని అల్–సరయా ఫీల్డ్ హాస్పిటల్ తెలిపింది. కొన్ని మృతదేహాలను ఇతర ఆసుపత్రులకు తరలించామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజా ఆరోగ్య శాఖ అత్యవసర సేవల ఛీఫ్ ఫేర్స్ అవద్ తెలిపారు. నిరాకరించిన ఇజ్రాయెల్.. అయితే దాడులను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. తన దళాలను సమీపించే వ్యక్తులపై మాత్రమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక కాల్పులు జరిపిందని తెలిపింది. ఇక జీహెచ్ఎఫ్ సహాయ కేంద్రాల వద్దకు వచి్చన జన సమూహాన్ని వారించడానికి సాయుధ కాంట్రాక్టర్లు పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, కాల్పులతో హెచ్చరికలు మాత్రమే చేశారని చెబుతోంది. కాల్పుల వల్ల ప్రాణ నష్టం జరిగిందేమో తమకు తెలియదని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఇంకా పరిశీలిస్తున్నామని పేర్కొంది. అంతంత మాత్రంగా సహాయం.. రోజుకు కొన్ని గంటల పాటు వ్యూహాత్మక కాల్పుల విరమణ అమలు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ.. మానవతా సహాయం సరఫరాకు అడ్డంకులు మాత్రం అలాగే ఉన్నాయి. స్ట్రిప్‌లోకి ప్రవేశించే సహాయాన్ని అందించడంలో ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ ఇబ్బంది పడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలో ఉన్న మండలాల్లో చాలా ట్రక్కులను దింపుతోంది. ఇక మరోవైపు ఇజ్రాయెల్ మద్దతుగల జీహెచ్ఎఫ్ నిర్వహిస్తున్న ప్రత్యామ్నాయ సహాయ వ్యవస్థ వల్ల హింస పెరుగుతోంది. విమానాల ద్వారా అంతర్జాతీయ సహాయాన్ని పడేయడం కూడా తిరిగి ప్రారంభమైంది. కానీ.. చాలా పార్శిళ్లు పాలస్తీనియన్లు ఖాళీ చేసిన ప్రాంతాల్లో, మరికొన్ని మధ్యధరా సముద్రంలో పడిపోయాయి. ఆ తడిసిన పిండి సంచులను తెచ్చుకోవడానికి కూడా ప్రజలు ఈత కొడుతూ వెళ్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోషకాహార లోపంతో మరణాలు.. మరోవైపు పోషకాహార లోపంతో ఒక చిన్నారితో సహా మరో ఏడుగురు పాలస్తీనియన్లు బుధవారం మరణించారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పిల్లలు పోషకాహార లోపంతో మొత్తం 89 మంది మరణించారు. జూన్ చివరి నుంచి పోషకాహార లోపం సంబంధిత కారణాలతో గాజా అంతటా 65 మంది పాలస్తీనియన్ పెద్దలు కూడా మరణించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. గాజాలో ఆకలి చావులు లేవని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజాలో ఆకలిపై దృష్టి పెట్టడం హమాస్‌తో కాల్పుల విరమణ ప్రయత్నాలను బలహీనపరుస్తుందని చెబుతోంది. ఈ గందరగోళం మధ్యనే.. అమెరికా మిడిల్ ఈస్ట్‌రాయబారి ఇజ్రాయెల్‌కు వెళుతున్నారు. గాజాలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బం«దీల విడుదలపై ఇజ్రాయెల్‌తో చర్చలు నిర్వహించనున్నారు. -
గాజాలో కరువు వాస్తవమే: ట్రంప్
స్కాట్లాండ్: గాజాలో కరువు పరిస్థితులున్న విష యం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కరువు లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. ‘టీవీల్లో చూస్తే తెలుస్తుంది. అక్కడున్న చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో... అక్కడ నిజంగానే కరువుంది. దీనిని దాచిపెట్టలేం’అని స్కాట్లాండ్లో పర్యటిస్తున్న ట్రంప్ సోమ వారం పేర్కొన్నారు. గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పొట్ట నింపుతుందని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా సంచరించే చోట, సరిహద్దులు లేని చోట తాము అవాంతరాలు కల్పించబోమన్నారు. గాజా లో హమాస్ చేయలేనిది ఎంతో చేయగలమన్నారు. ‘బందీలందరినీ హమాస్ ఎక్కడ దాచిందో తెలిసిన ఇజ్రాయెల్ హమాస్‌తో ఒప్పందం కష్టమంటోంది. అదే సమ యంలో, చిట్టచివరి 20 మంది బందీలను హమాస్ రక్షణ కవచాలుగా భావిస్తోంది. అందుకే, వారిని వి డుదల చేయడం లేదు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.గాజాలో 17 టన్నుల ఆహారం జారవేతయూఏఈ వైమానిక దళం విమానాలు రెండో రోజు సోమవారం గాజాలోని పాలస్తీనియన్లకు 17 టన్నుల ఆహార పదార్థాలను జారవిడిచాయని జోర్డాన్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 19 టన్నుల ఆహార పదార్థాలను ఒక ట్రక్కు కింద లెక్క. అంటే ట్రక్కు కంటే తక్కువ ఆహారాన్ని విడిచినట్లేనని ఐరాస పాలస్తీనా శరణార్థి విభాగం చీఫ్ ఫిలిప్ తెలిపారు. ఆదివారం 25 టన్నుల ఆహార ప్యాకెట్లను జారవిడవడం తెల్సిందే. ఇజ్రాయెల్ ఆర్మీ నెలలుగా అమలు చేస్తున్న దిగ్బంధంతో గాజాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడటం, జనం, ముఖ్యంగా చిన్నారులు ఆకలి చావులకు గురవుతుండటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.పుతిన్‌కు గడువు 10, 12 రోజులేఉక్రెయిన్తో ఒప్పందానికి రాకుంటే ఆంక్షలేట్రంప్ తాజా హెచ్చరికఉక్రెయన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు విధించిన 50 రోజుల గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదించారు. అధ్యక్షుడు పుతిన్ 10, 12 రోజుల్లో ఉక్రెయిన్‌తో ఒప్పందం చేసుకోకుంటే ఆంక్షలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం ఆయన స్కాట్లాండ్లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కావాలనే పొడిగిస్తూ పోతున్న పుతిన్ వైఖరితో అసహనంతో ఉన్నానన్నారు. ఇంత సుదీర్ఘకాలం వేచి ఉండటంలో అర్థం లేదంటూ, మున్ముందు ఏం జరగనుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అందుకే పుతిన్‌కు తక్కువ సమయం ఇస్తున్నట్లు తెలిపారు. భారీ టారిఫ్‌ల ను రష్యాపై విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన.. ఇందుకు సంబంధించిన చర్యలపై ఇవ్వాళోరేపో ఒక అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రకటించారు. ప్రస్తుత పరిణామాలపై పుతిన్‌తో మాట్లా డాలనే ఆసక్తి తనకు అంతగా లేదని చెప్పారు. -
‘ఆకలి చావులను అరికట్టండి’: గాజా పరిస్థితులపై ఒబామా ఆవేదన
గాజా: గాజా స్ట్రిప్‌లో అంతకంతకూ పెరుగుతున్న మానవతా సంక్షోభం మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో ఆకలి చావులను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గాజాలో సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. ఇజ్రాయెల్ బందీలను వెనక్కి తీసుకురావడం, ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం జరగాలని ఒబామా పేర్కొన్నారు. ఆకలితో అక్కడి అమాయక ప్రజలు చనిపోతున్నారని, దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒబామా పేర్కొన్నారు.గాజా స్ట్రిప్‌లోని బాధితులను కలుసుకునేందుకు, వారికి సహాయం చేసేందుకు అనుమతులు ఉండాలన్నారు. వారికి ఆహారం, నీటిని దూరంగా ఉంచడం సమర్థనీయం కాదన్నారు. మరోవైపు గాజాలో పోషకాహార లోపం ఆందోళనకర స్థాయికి చేరుకున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) ఆదివారం హెచ్చరించింది. వారికి అందే సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా నిరోధించడం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది నమోదైన 74 పోషకాహార లోపం మరణాలలో 63 జూలైలో సంభవించాయి. ఇందులో 24 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. While a lasting resolution to the crisis in Gaza must involve a return of all hostages and a cessation of Israel’s military operations, these articles underscore the immediate need for action to be taken to prevent the travesty of innocent people dying of preventable starvation.…— Barack Obama (@BarackObama) July 27, 2025ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, గాజాలో దాదాపు ఐదుగురు పిల్లలలో ఒకరు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆహార నిపుణులు కూడా గాజాలో కరువు పరిస్థితులపై ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇక్కడి జనాభాకు సహాయం అందించడంపై ఇజ్రాయెల్ పరిమితులు విధించింది. కాగా ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాలోని మూడు ప్రాంతాలలో రోజుకు 10 గంటల పాటు యుద్ధానికి విరామం ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ విరామం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఉంటుందని ఇజ్రాయెల్ తెలిపింది. -
గాజాలో కాల్పులకు వ్యూహాత్మక విరామం
డెయిర్ అల్–బలాహ్/జెరూసలేం: పాలస్తీనా భూభాగంలో ఆకలి మరణాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యూహాత్మక విరామం ప్రకటించింది. గాజా నగరం, డెయిర్ అల్ బలాహ్, మువాసీ నగరాల్లో రోజుకు పది గంటలు పాటు కాల్పుల విరామం ఉంటుందని తెలిపింది. తదుపరి నోటీసు వచ్చే వరకు స్థానిక సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సైనిక కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. గాజా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆహారం, మందులు పంపిణీ చేసే కాన్వాయ్‌ల కోసం సురక్షిత మార్గాలు తెరిచి ఉంటాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ ప్రకటన గాజా వాసులకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఈ సహాయ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ జాతీయ రక్షణ మంత్రి ఇటమర్ బెన్–గ్విర్ విమర్శించారు. ఇది తన ప్రమేయం లేకుండానే జరిగిందన్నారు. హమాస్ మోసపూరిత ప్రచారానికి లొంగిపోవడంగా అభివర్ణించారు. గాజాకు అన్ని రకాల సహాయాన్ని నిలిపివేయాలని, భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆదివారం నుంచే అందిన ఆహారం.. వ్యూహాత్మక కాల్పుల విరమణతో.. ఆదివారం జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విమానాలు పారాచూట్ల ద్వారా 25 టన్నుల సహాయాన్ని గాజా ఎన్‌క్లేవ్‌లో జారవిడిచాయి. జికిమ్ సరిహద్దు క్రాసింగ్ నుంచి ఆదివారం సహాయ ట్రక్కులు ఉత్తర గాజాలోకి ప్రవేశించాయి. ఆదివారం కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా దక్షిణ గాజాకు 1,200 మెట్రిక్ టన్నులకు పైగా ఆహారాన్ని పంపినట్లు ఈజిప్టు రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఇజ్రాయెల్–పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య దోహాలో జరిగిన కాల్పుల విరమణ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగియడం, గాజాలో మానవతా సంక్షోభం నెలకొనడంతో ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే.. ఆ దేశం వాటిని తిరస్కరిస్తూ వస్తోంది. తాజా వ్యూహాత్మక విరామం నేపథ్యంలో.. గాజాలో సంక్షోభానికి ఇక తమ ప్రభుత్వాన్ని నిందించడం మానేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాçహూ సూచించారు. ఇంతకుముందు కూడా సురక్షిత మార్గాలున్నా యని, ఇకనుంచి అధికారికంగా ఉంటాయని ఆయన తెలిపారు.పోషకాహార లోపంతో ఆరుగురు మృతిగాజాలో పోషకాహార లోపంతో గత 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయా రు. దీంతో ఆకలితో మరణించిన వారి సంఖ్య 133కి చేరుకుంది. వీరిలో 87 మంది పసి పిల్లలు ఉండటం గమనార్హం. మరోవైపు, ఆదివారం సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇజ్రా యెల్ జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించారని, 50 మంది గాయపడ్డారని సెంట్రల్ గాజాలోని అల్–అవ్దా, అల్–అక్సా ఆసుపత్రుల అధికారులు తెలిపారు. ఈ దాడులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఇజ్రాయెల్ సైన్యం.. ఆదివారం గాజాలో తమ సైనికులు ఇద్దరు మరణించారని ప్రకటించింది. -
పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ పాలస్తీనాకు మద్దతుగా నిలిచారు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఫ్రాన్స్ గుర్తిస్తుందని మాక్రాన్ చెప్పారు. ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటిస్తానన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. గాజాలో యుద్ధం ఆగిపోవడం, అక్కడి జనాభాను ఆకలి నుంచి రక్షించడమే ప్రస్తుతం మన ముందున్న అత్యవసర కర్తవ్యమని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిగిన వెంటనే ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చారు. యూదు వ్యతిరేకతను ఖండించారు. ఆ తరువాతి కాలంలో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, రానురాను పెరిగిన సంక్షోభం పట్ల ఆయన తీవ్ర నిరాశ చెందారు. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని గతంలో పలుమార్లు చెప్పిన ఆయన.. తాజాగా పునరుద్ఘాటించారు. నిర్లక్ష్యపూరిత నిర్ణయం: అమెరికాపాలస్తీనా పట్ల ఫ్రాన్స్ తీరును అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించాయి. ఇది హమాస్ ప్రచారానికి ఉపయో గపడే నిర్లక్ష్య పూరిత నిర్ణయ మని విదేశాంగ మంత్రి మార్కో రూబి యో అన్నారు. ‘‘యూ ఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా రాజ్యాన్ని గు ర్తించాలనే మాక్రాన్ ప్ర ణాళికను అమెరికా తిరస్కరిస్తుంది. ఈ నిర్లక్ష్య నిర్ణయం హమా స్ ప్రచా రానికి ఉపయో గపడుతుంది. శాంతిని దెబ్బ తీస్తుంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఫ్రాన్స్ తీరు సిగ్గుచేటు: ఇజ్రాయెల్ఇక మాక్రాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలస్తీనాను గుర్తించడమంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని, ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికి ముప్పు కలిగిస్తుందని ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ అన్నారు. గాజా ఇజ్రాయెల్‌ను నిర్మూలించే లాంచ్ ప్యాడ్ అవుతుందని, దాని పక్కన శాంతియుతంగా జీవించలేమని తెలిపారు. ఫ్రాన్స్ నిర్ణయం సిగ్గుచేటని ఇజ్రాయెల్ ఉప ప్రధాని యారివ్ లెవిన్ అన్నారు. అది ఫ్రెంచ్ చరిత్రపై ఒక నల్ల మచ్చని, ఉగ్రవాదానికి నేరుగా సహాయమందించడమని చెప్పారు. తాము ఆక్రమించిన వెస్ట్ బ్యాంక్‌కు ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని వర్తింపజేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్వాగతించిన హమాస్.. ఫ్రాన్స్ ప్రకటనను పాలస్తీనియన్ అథారిటీ సీనియర్ అధికారి హుస్సేన్ అల్–షేక్ స్వాగతించారు. ఇది అంతర్జాతీయ చట్టాల పట్ల ఫ్రాన్స్ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కులకు, రాజ్య స్థాపనకు మద్దతివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా గుర్తింపు విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్‌ను అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. -
గాజాలో అన్నమో రామచంద్రా!
కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కఠిన ఆంక్షలతో ఆహారం, మానవతా సాయం అందక పాలస్తీనా పౌరుల డొక్కలెండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి, ప్రాణాలు విడిచేస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే కనీసం 15 మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గాజా అరోగ్య శాఖ ప్రకటించింది. ఆకలి చావులు ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలోని పాలస్తీనా పౌరులకు ఒక్కసారిగా కష్టాలు వచ్చిపడ్డాయి. కనీస సౌకర్యాల సంగతి పక్కనపెడితే కడుపునిండా తిండి దొరకడమే గగనంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారమే ఇప్పటివరకు 111 ఆకలి చావులు సంభవించాయి. వీరిలో 80 మందికిపైగా చిన్నారులే ఉండడం గమనార్హం. గాజాలో అత్యంత భయానక వాతావరణం కనిపిస్తోందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. నిత్యం ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక జనం బలైపోతున్నారని వెల్లడించింది. ఆకలి చావులు సంభవిస్తుండడం ఇటీవలి కాలంలో అతిపెద్ద సంక్షోభమమని స్పష్టంచేసింది. ప్రాణాలకు తెగిస్తేనే.. ఉత్తర గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆరేళ్ల బాలుడు యూసుఫ్ అల్–సఫాదీ మరణించాడు. తల్లి పాలు అందక అతడు మృతిచెందినట్లు బంధువులు చెప్పారు. యూసుఫ్ తల్లికి కొన్ని నెలలుగా సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అనారోగ్యం బారినపడింది. తన బిడ్డకు స్తన్యం ఇవ్వడానికి ఆమె వద్ద పాలు లేకుండాపోయాయి. చివరకు యూసుఫ్ ప్రాణమే పోయింది. బయట ఆవు పాలు, గేదె పాలు కొందామన్న ఎక్కడా లేవు. ఒకవేళ దొరికినా లీటర్ 100 డాలర్లు(రూ.8,639) చెబుతున్నారు. 13 ఏళ్ల బాలుడు అబ్దుల్ హమీద్ అల్–గల్బాన్ది మరో వ్యధ. అతడికి చాలా రోజులుగా తిండి లేదు. చివరకు మృత్యువు కబళించింది. గాజాలో ఆకలి చావులుగా గత ఐదు నెలలుగా కొనసాగుతున్నాయి. గాజాలోకి మానవతా సాయం సరఫరా కాకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. విదేశాల నుంచి ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాలు, నిత్యావసరాలు రానివ్వడం లేదు. ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు మే నెలలో ఆంక్షలు కొంత సడలించింది. మానవతా సాయాన్ని పరిమితంగానే అనుమతిస్తోంది. ఐక్యరాజ్యసమితి మద్దతున్న గాజా హుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) గాజా ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడం లేదు. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన జనంపై ఇజ్రాయెల్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 1,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. కడుపు నింపుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి దాపురించింది. అభాగ్యుల ఎదురుచూపులు ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజా స్ట్రిప్‌లో 20 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఒకవైపు ఆహార లేమి, మరోవైపు పౌష్టిహాకార లోపం జనాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆహారం దొరకడం ఒక ఎత్తయితే, అది నాణ్యంగా లేకపోవడం మరో సవాల్‌గా మారింది. చాలినంత తిండి లేక అల్లాడుతున్నారు. చాలామంది అర్ధాకలితో కాలం గడపాల్సి వస్తోంది. ఆకలి భూతం ప్రతి ఇంటి తలుపును తడుతోంది. ఆదుకొనే ఆపన్నహస్తాల కోసం అభాగ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ దయ తలిస్తే తప్ప గాజా పౌరులు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వ్యాఖ్యానించారు. నిండిపోయిన ఆసుపత్రులు పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలై ఆసుపత్రు ల్లో చేరుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. బాధితులకు చికిత్స చేయడానికి సరైన సదుపాయాలు కూడా లేవని, వారు తమ కళ్ల ముందే మరణిస్తున్నారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సెంట్రల్ గాజాలోని అల్–అక్సా హాస్పిటల్ వైద్యుడు ఖలీల్ అల్–డక్రాన్ తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో గాయపడినవారితో ఆసుపత్రులో నిండిపోయాయని, ఇతర రోగులను చేర్చులేకపోతున్నామని మరికొందరు డాక్టర్లు వెల్లడించారు. గాజాలో ప్రస్తుతం 6 లక్షల మందికిపైగా జనం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో 60 వేల మంది గర్భిణులే కావడం గమనార్హం. ఆహార లేమికి తోడు డీహైడ్రేషన్, రక్తహీనతతో గర్భిణులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమైంది.ప్రపంచ దేశాలు స్పందించాలి గాజా పరిణామాలపై 100కిపైగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఆకలి చావులు ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. టన్నుల కొద్దీ ఆహారం, నీరు, ఔషధాలు గాజా బయటే ఉండిపోయాయని, ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా అవి పాలస్తీనా పౌరులకు అందడం లేదని మెర్సీ కారప్స్, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ తదితర సంస్థలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దమనకాండ వల్ల గాజాలో మృత్యుఘోష మొదలైందని, ఆకలి చావులు పెరిగిపోతున్నాయని వెల్లడించాయి. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా స్పందించాలని, గాజా ప్రజల ప్రాణాలు కాపాడాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా లేఖ విడుదల చేశాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పులు
గాజా/లండన్: గాజాలోని అన్నార్తుల పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని ఐరాస తీవ్రంగా ఖండించింది. ఆహార కేంద్రాల వద్దకు వచ్చే వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పుల జరుపుతోందంటూ మండిపడింది. ఆదివారం ఒక్క రోజే 80 మంది ఉసురుతీయడాన్ని ప్రస్తావించిన ఐరాస ఆహార విభాగం(డబ్ల్యూఎఫ్‌పీ)..పాలస్తీనియన్ల పాలిట భయంకరమైన రోజుల్లో ఒకటని అభివర్ణించింది. ఆదివారం ఆహార పదార్థాలతో గాజానగరంలోకి ప్రవేశించిన ట్రక్కుల దిశగా వెళ్తున్న వారిపైకి ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారీ సంఖ్యలో జనం చనిపోవడం తెల్సిందే. కాగా, డబ్ల్యూఎఫ్‌పీ ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇలా ఉండగా, ఆదివారం రాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగించిన వైమానిక దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 13 మంది చనిపోయారు.సెంట్రల్ గాజాలోని నెట్జరిమ్ కారిడార్ వద్ద గుంపుగా చేరిన పాలస్తీనియన్లపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. హమాస్ శ్రేణులు లక్ష్యంగా 21 నెలలుగా యథేచ్ఛగా ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడుల్లో మరణాలు 59 వేలు దాటాయని గాజా ఆరోగ్య విభాగం సోమవారం తెలిపింది. 2023 అక్టోబర్ 7 నుంచి సాగిస్తున్న దాడుల్లో క్షతగాత్రుల సంఖ్య 1,42,135కు చేరుకుందని వివరించింది.తక్షణమే హింస ఆగిపోవాలి గాజాపై సాగిస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని యూకే, ఫ్రాన్స్ తదితర 23 దేశాలు ఇజ్రాయెల్‌ను కోరాయి. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను గౌరవించాలని హితవు పలికాయి. ఇందులో 20 యూరప్ దేశాలతోపాటు ఆ్రస్టేలియా, కెనడా, జపాన్ ఉన్నాయి. ఆయా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గాజా పౌరుల అవస్థలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరాయి. నీరు, ఆహారం వంటి కనీస అవసరాలను తీర్చాలని కోరుతున్న పాలస్తీనా పౌరులు, ముఖ్యంగా చిన్నారులను అమానవీయంగా చంపడం ఆపాలని వారు కోరారు. -
ఎన్నాళ్లీ జనహననం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ గాజాలో కొనసాగిస్తున్న మారణకాండను ఆపదల్చుకోలేదని తాజా అమానుష ఉదంతం రుజువు చేస్తోంది. నిరాయుధ పౌరులనూ, మరీ ముఖ్యంగా స్త్రీలనూ, పిల్లలనూ హతమార్చటం ఇజ్రాయెల్ సైన్యానికి గత ఇరవైయ్యొక్క నెలలుగా రివాజుగా మారినా... ఆదివారం జరిగిన ఘోరం అత్యంత హేయమైనది. ఐక్యరాజ్యసమితి సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) ఆధ్వర్యాన ఆహార పంపిణీ మొదలుపెట్టబోతుండగా పౌరు లను చుట్టుముట్టి శతఘ్నులతో, స్నైపర్లతో విరుచుకుపడి 90 మందికిపైగా పౌరుల్ని ఇజ్రాయెల్ సైన్యాలు పొట్టనబెట్టుకున్నాయి. 2023 అక్టోబర్ 7న తమ భూభాగంలోకి అడుగుపెట్టి 1,200 మంది పౌరులను కాల్చిచంపి, మరో 251 మందిని అపహరించిన మిలిటెంట్ సంస్థ హమాస్‌ను తుదముట్టించటానికి దాడులంటూ మొదట్లో చెప్పిన ఇజ్రాయెల్ ఆనాటినుంచి మారణకాండ కొనసాగిస్తూనే ఉంది. అధికారిక లెక్క ప్రకారం ఇప్పటికి 60,000 మంది పౌరులు మరణించారంటున్నా... అంతర్జాతీయ మేగజిన్ లాన్సెట్ నిరుడు జూన్‌లో ప్రకటించిన నివేదిక అది దాదాపు రెండు లక్షలంటోంది. మధ్యధరా సముద్ర తీరానవున్న గాజా స్ట్రిప్ అనే చిన్న ప్రాంతాన్ని వదిలి రావటానికి ససేమిరా అంటున్న స్థానికులను హతమార్చయినా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రయ త్నిస్తోంది. ఆ ప్రాంతాన్ని సైతం తమ దేశంలో విలీనం చేసుకోవాలన్నది దాని ఆంతర్యం. గతంలో పాలస్తీనాపై విరుచుకుపడినప్పుడల్లా ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని 51వ అధికర ణాన్ని ఇజ్రాయెల్ ప్రస్తావించేది. సాయుధ ముఠాలు దాడులకు దిగితే ఆత్మరక్షణ చేసుకునే హక్కు దేశాలకుంటుందని ఆ అధికరణ చెబుతోంది. కానీ పాలస్తీనాలో తనదికాని భూభాగాన్ని ఆక్రమించుకుని, దాన్ని విస్తరించాలనుకున్నప్పుడల్లా ఇజ్రాయెల్ ఈ అధికరణను సాకుగా చూపుతోంది. హమాస్ సంస్థ దాడుల్ని ఎవరూ సమర్థించరు. ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెబుతూ వారికే నష్టం కలిగించే ఆ సంస్థ చర్యల్ని మొదటినుంచీ అందరూ వ్యతిరేకి స్తున్నారు. కానీ గత 21 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ మాటేమిటి? కేవలం 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల చిన్న ప్రాంతంపై యుద్ధ విమానాలతో, బాంబులతో, క్షిపణులతో దాడులు సాగించటం ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం సబబవుతుంది?ఇజ్రాయెల్ మిత్ర దేశమన్న సాకుతో పెద్ద పెద్ద దేశాలే అది సాగిస్తున్న మారణకాండను విస్మ రిస్తున్న తరుణంలో ఇటీవల 12 చిన్న దేశాలు కొలంబియాలోని బగోటాలో అత్యవసర శిఖరాగ్ర సదస్సు నిర్వహించి కార్యాచరణకు దిగబోతున్నట్టు ప్రకటించటం ఉన్నంతలో వూరటనిచ్చే అంశం. బొలీవియా, కొలంబియా, క్యూబా, ఇండొనేసియా, ఇరాక్, లిబియా, మలేసియా, నమీ బియా, నికరాగువా, ఒమన్, సెయింట్ విన్సెంట్, దక్షిణాఫ్రికాలు వీటిలో వున్నాయి. ఈ సమావేశానికి హాజరైనా, అది విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై సంతకం చేయాలా వద్దా అన్న మీమాంసలో పడిన మరో 20 దేశాలు వచ్చే సెప్టెంబర్‌కల్లా ఏ సంగతీ తేల్చాలని సదస్సు గడువు విధించింది. ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. తనదికాని ఒక ప్రాంతంపై దండెత్తి, అక్కడి పౌరులు ఎటువైపు కదలాలో హుకుం జారీ చేసే ఇజ్రాయెల్ ఆగడం నాగరిక ప్రపంచ ఉనికికే పెను సవాలు. ఇజ్రాయెల్ ఇష్టారాజ్యంగా మానవ హననానికి పాల్పడుతుంటే చూస్తూ కూర్చున్న దేశాలకు కూడా రేపన్నరోజు ఇదే గతి పట్టదన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే అంతర్జాతీయ చట్టాలకూ, ఐక్యరాజ్యసమితి చార్టర్లకూ, మానవ హక్కులకూ ఇజ్రాయెల్ పెనుముప్పుగా మారిందని 12 దేశాల సదస్సు వ్యాఖ్యానించింది.అయితే ఇజ్రాయెల్ ఏం చేసినా సమర్థించటం అలవాటైన అమెరికాను కాదని ఎన్ని దేశాలు ఈ సదస్సుతో గొంతు కలుపుతాయన్నది ప్రశ్నార్థకం. ఇప్పటికే ‘ఇంకా’ సంతకం చేయని దేశాలకు దూతల్ని పంపి ‘దారికి తేవాలని’ అమెరికా నిర్ణయించుకుంది. ఈ సదస్సుపై ట్రంప్ కారాలూ మిరియాలూ నూరుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఉనికిలోకొచ్చిన అంతర్జాతీయ సంస్థలు మొదటినుంచీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నాయి. అందరికీ ఒకే న్యాయం భావన వదిలి సంపన్న దేశాలతో ఒక విధంగా, బడుగు దేశాలతో మరో రకంగా ప్రవర్తిస్తున్నాయి. అందువల్లే ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి తదితర వేదికలపై ఇప్పుడెవరికీ పెద్దగా భ్రమలు లేవు. ఉన్నంతలో కొలంబియా సదస్సు ఒక ఆశాకిరణం.ఆహార పంపిణీ కేంద్రాలు ఐక్యరాజ్యసమితి సంస్థల కనుసన్నల్లోనే వుంటున్నా అవి పాలస్తీనా ప్రజల పాలిట ఉచ్చుగా మారుతున్నాయి. ఆసుపత్రులు, శరణార్థ శిబిరాలు మాత్రమే కాదు.. చివరకు ఆహార పంపిణీ కేంద్రాలు సైతం ఇజ్రాయెల్ సైనికుల దాడులకు లక్ష్యమవుతున్నాయి. ఆకలితో నకనకలాడుతూ తిండికోసం జనం ఒకచోట గుమిగూడినప్పుడు కాల్చి చంపితే గాజాను ఖాళీ చేయించాలన్న తమ పథకం పారుతుందని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టుంది. ఒకనాడు నాజీ జర్మనీ లక్షలాదిమంది యూదుల్ని చిత్రహింసల శిబిరాలకు చేర్చి అమానుషంగా అంతమొందించింది. ఆ తరహాలోనే పాలస్తీనాలో రఫా వంటి చోట్ల శిబిరాల నిర్మాణం మొదలైంది. మరో జనహననాన్ని నాగరిక ప్రపంచం సహిస్తుందా? ప్రపంచ ప్రజానీకం మేల్కొని తమ తమ దేశాల్లోని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తే తప్ప ఇజ్రాయెల్ దురాగతాలు ఆగవు. -
హమాస్ కమాండర్ హతం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైనిక దళం గాజాలో 75 ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసింది. ఫలితంగా నగరంలో దట్టమైన పొగతో పాటు మంటలు ఎగసిపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. హమాస్ కమాండర్ బషర్ థాబెట్ను ఐడీఎఫ్ హతమార్చింది. హమాస్ అభివృద్ధి ప్రాజెక్టుల విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ కమాండర్ బషర్ థాబెట్ మృతిని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధృవీకరించాయి. హమాస్ ఆయుధ ఉత్పత్తి, పరిశోధన కార్యకలాపాలను పర్యవేక్షించడంలో పేరొందిన థాబెట్.. ఇజ్రాయెల్ దాడుల్లో హతం కావడం హమాస్‌కు తీరనిలోటుగా పరిణమించింది. ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ హమాస్ ఉపయోగించే ఆయుధాల తయారీ ప్రదేశాలు, కీలక ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఎఎఫ్)గాజాలోని సైనిక స్థావరాలు, సెల్ సైట్లతో సహా దాదాపు 75 లక్ష్యాలను విజయవంతంగా ఢీకొట్టిందని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. యుద్ధం కారణంగా పరిస్థితులు అంతకంతకూ క్షీణిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ తాజా ఆపరేషన్ జరిపింది. గడచిన 24 గంటల్లో 115 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా ఆహారం, నీరు, వైద్య సామాగ్రి కొరత ఏర్పడి మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ, ట్యునీషియా, ఇరాక్, టర్కీ, లెబనాన్, మొరాకోతో సహా అనేక దేశాలలో నిరసనలు కొనసాగుతున్నాయి. సంఘర్షణలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్లు.. ఇజ్రాయెల్ స్థిరనివాసుల నీటి వనరులపై దాడులను మరింతగా పెంచారు. ఇరువర్గాల మధ్య శాంతి చర్చలు స్తబ్దుగా ఉండటంతో, కాల్పుల విరమణకు అవకాశాలు అనిశ్చితంగానే ఉన్నాయి. ఫలితంగా గాజాలో మానవతా సంక్షోభం మరింతగా పెరుగుతూ వస్తోంది. -
అన్నార్తులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు
గాజా: గాజా స్ట్రిప్‌లో మారణహోమం కొనసాగుతూనే ఉంది. ఆహారం, మానవతా సాయం కోసం అల్లాడుతున్న సామాన్య పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంటోంది. ఆదివారం ఇజ్రాయెల్ జవాన్ల కాల్పుల్లో కనీసం 85 మంది మరణించారు. ఇజ్రాయెల్ భూభాగం నుంచి జికిమ్ క్రాసింగ్ ద్వారా ఉత్తర గాజాలోకి ప్రవేశించిన వాహనాల వద్దకు జనం పరుగెత్తుకొని వస్తుండగా ఇజ్రాయెల్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో 79 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 150 మంది గాయపడ్డారు.వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వాహనాల్లో చేరవేస్తున్న ఆహారం కోసం జనం ఆరాటపడగా, చివరకు ప్రాణాలే పోయాయి. దక్షిణ గాజాలో జరిగిన కాల్పుల్లో మరో ఆరుగురు బలయ్యారు. సెంట్రల్ గాజా నుంచి జనం బయటకు వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ మిలటరీ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఖతార్‌లో చర్చలు కొనసాగుతుండగానే ఈ హెచ్చరికలు వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదని మధ్యవర్తులు చెబుతున్నారు. -
గాజా నేలమట్టం
డెయిర్ అల్ బలాహ్: గాజా స్వాదీన ప్రణాళికలను ఇజ్రాయెల్ అత్యంత కర్కశంగా అమలు చేస్తోంది. గత మార్చిలో కాల్పుల విరమణకు తెర దించిన నాటి నుంచీ గాజాపై భారీగా వైమానిక దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ అలా కూలిన భవనాలను కూడా తాజాగా నేలమట్టం చేస్తోంది. దాంతో రెండేళ్ల కిందిదాకా వేలాది మందితో కళకళలాడిన పట్టణాలు ఇప్పుడు బూడిద కుప్పలుగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ సైనిక నియంత్రణలో ఉన్న పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. దాడుల వల్ల ఇప్పటికే దెబ్బతిన్న భవనాలతో పాటు చెక్కు చెదరకుండా ఉన్న అనేక నిర్మాణాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం నేలమట్టం చేసి ఆ ప్రాంతాలను పూర్తిగా చదును చేస్తోంది. నివాస భవనాలు, పాఠశాలలు అని లేకుండా అన్నింటినీ వరుసబెట్టి కూల్చేస్తోంది. తాము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ‘‘పౌర ప్రంతాల్లో హమాస్ ఉగ్ర సంస్థ ఆయుధాలను దాచింది. అందుకే వాటిని సైన్యం కూల్చేస్తోంది’’అని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) అంటోంది. కాల్పుల విరమణ తరువాత గాజాలో 40 ప్రదేశాల్లోని మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ఈజిప్టు సరిహద్దులో రఫా నగరంలో విధ్వంసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రఫాలోని అనేక ప్రాంతాలాను ఇజ్రాయెల్ సైనికులు, కాంట్రాక్టర్లు చదును చేశారు. ఏప్రిల్ నుంచి గాజాలో జరిగిన విధ్వంసంలో అత్యధికం ఈ ప్రాంతంలోనే చోటుచేసుకుంది. భవనాల కింద బాంబులు పెట్టి మరీ పేలుస్తున్నారు. అనంతరం బుల్డోజర్లతో ఆ ప్రాంతాలను పూర్తిగా తుడిచి పెట్టేస్తున్నారు. రఫా నగరంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాంతాల్లో ఒకటైన టెల్ అల్ సుల్తాన్‌లో ఓ పాఠశాలను కూల్చేసిన వీడియోను బీబీసీ విడుదల చేసింది. ఆ ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుజాను సైతం ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. యుద్ధానికి ముందు ఈ పట్టణ జనాభా 11 వేలు. ఇక్కడ అత్యిధికం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉండేవి. టమాటా, గోధుమలు, ఆలివ్ పంటలకు ప్రసిద్ధి చెందిన నేల. గత మే దాకా బాగానే ఉన్న ఆ పట్టణాన్ని జూన్ మధ్య నాటికి సగానికి సగం ఇజ్రాయెల్ కూల్చేసింది. ఏకంగా 1,200 భవనాలు విధ్వంసమయ్యాయి. అబాసన్ అల్ కబీరా పట్టణానిదీ అదే దుస్థితి! యుద్ధానికి ముందు 27,000 మంది నివసించిన ఈ పట్టణం మేలో బాగానే ఉంది. జూన్‌కు వచ్చేసరికి అక్కడి ముఖచిత్రమే మారిపోయింది. సగం పట్ట ణం ఆనవాలు లేకుండా పోయింది. ఇజ్రాయెల్‌కు సరిహద్దుకు 7 కి.మీ. దూరంలో ఉన్న కిజాన్ అబు రష్వాన్లో కూడా విధ్వంసం జరిగింది. గత మార్చి దాకా పచ్చగా ఉన్న ఈ పట్టణం జూలై 4 నాటికి బూడిద కుప్పగా మిగిలింది. గాజాలో ఇజ్రాయెల్ కూల్చివేతల వేగం నానాటికీ పెరుగుతోంది! అమెరికా నుంచి ఇజ్రాయెల్ సైన్యానికి డజన్ల కొద్దీ డీ9 బుల్డోజర్లు అందినట్టు అక్కడి మీడియా గత వారం తెలిపింది. కూల్చివేతల పనులకు కాంట్రాక్టర్లు కావాలంటూ ఫేస్బుక్లో పోస్టులు చేసింది. మే నుంచి వారిని యుద్ధ ప్రాతిపదికన నియమించుకుంటోంది. శిథిలాలపై మానవతా నగరి! రఫా శిథిలాలపై మానవతా నగరాన్ని నిర్మిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. 6 లక్షల మంది పాలస్తీనియన్లకు అక్కడ ఆవాసం కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రణాళికలపై తీవ్ర విమర్శలొచ్చాయి. అది మానవతా నగరం కాదని, నిర్బంధ శిబిరమని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎముద్ ఓల్మెర్ట్ అన్నారు! శాపాలస్తీనా ప్రజలు కొంతకాలానికి తిరిగొచ్చినా స్వస్థలంలో ఏమీ మిగల్లేదనే నిరాశతో తిరిగి వలస వెళ్లేలా చేయడమే ఇజ్రాయెల్ ఉద్దేశంగా కనిపిస్తోంది. పాలస్తీనా ప్రజలు గాజాకు తిరిగి రాకుండా చేయడమే అసలు ప్రణాళిక అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ఆ దేశ ఎంపీల బృందంతో అన్నారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక్క ఇంక్యుబేటర్.. ఐదుగురు శిశువులు!
గాజా: దాదాపు రెండు నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధంలో ఉన్న గాజాలో హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆహారం, మందులు, అత్యవసర సరఫరాలతోపాటు నీరు, ఇంధన సరఫరాలను సైతం ఇజ్రాయెల్ ఆర్మీ అడ్డుకుంటోంది. హమాస్ తమపై దాడులకు ఇంధనాన్ని వాడుకుంటుందని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్.. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ సరఫరాలను అడ్డుకుంటోంది. ఈ చర్యతో జనం ఆకలి చావులకు గురవుతున్నారు. చిన్నారులకు సరైన వైద్యం అందడం లేదు. గాజా ప్రాంతంలోని ఆస్పత్రులను ఇప్పుడు ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో ఆస్పత్రులు డీజిల్‌తో నడిచే జనరేటర్లపేనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇంధనం నిల్వలు అడుగంటుతుండటంతో ఆస్ప త్రుల్లోని ఒక్కో ఇంక్యుబేటర్‌లో నలుగురైదుగురు చిన్నారులను ఉంచాల్సి వస్తోందని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. గాజా ఆస్పత్రుల్లో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుందని ఐరాస సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ‘అదనంగా ఎటువంటి నిల్వలు లేకపోవడంతో ఆస్పత్రులు ఇంధనం వాడకంపై పరిమితులు పెట్టుకున్నాయి. ఇంధనం లేక ఇప్పటికే అంబులెన్సులు సైతం నిలిచిపోయాయి. నీటి సరఫరా వ్యవస్థలు పతన దశలో ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించకుంటే మరణాలు పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది’అని ఐరాస పేర్కొంది. ఇప్పటికి 11 వారాలుగా మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ సాగిస్తున్న దిగ్బంధంతో 20 లక్షలమందికి పైగా పాలస్తీ నియన్లు ఆకలి చావులకు చేరువలో ఉన్నారని తెలిపింది. మేలో పరిమితంగా ఆహార సరఫరా లను పునరుద్ధరించినా అవసరా లకు ఏమాత్రం సరిపోవని తెలిపింది.ఇలాంటి చోట ఏ చిన్నారీ పుట్టకూడదుఒకే ఇంక్యుబేటర్‌పై నలుగురైదుగురు నవజాత శిశువులను ఉంచిన ఫొటోను గాజా సిటీలోని అల్–అహ్లి ఆస్పత్రి డైరెక్టర్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఇంక్యుబేటర్ సైతం అల్–హెలౌ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చిందేనని డైరెక్టర్ ఫదెల్ నయీం ‘ఎక్స్’లో తెలిపారు. గాజా దిగ్బంధం కారణంగా ఇక్కడి ఆరోగ్య వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయన్నారు. ‘నెలలు నిండకుండానే పుట్టిన శిశువులకు ఇది జీవన్మరణ విషయంగా మారింది. తాము చావాలో బతకాలో నిర్ణయించే బాంబు దాడులు, దిగ్బంధాలు నడిచే చోట ఏ ఒక్క చిన్నారీ పుట్టరాదు’అంటూ ఆయన ఆవేదన చెందారు. ఇంధన కొరత కారణంగానే తాము కిడ్నీ డయాలసిస్ విభాగాన్ని మూసేశామని ఉత్తర గాజాలోని అల్–షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సిల్మియా చెప్పారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్, ఆపరేషన్ థియేటర్లను మాత్రం నడిపిస్తున్నా మన్నారు. ఆస్పత్రిలోని జనరేటర్లు మరో మూడు గంటలపాటు మాత్రమే నడుస్తాయని, ఆ తర్వాత ఇంక్యుబేటర్లలోని 22 మంది శిశువులతోపాటు వందలాది మంది రోగులకు మరణమే శరణమన్నారు. రోగులకు వైద్య పరీక్షలు చేసేందుకు ఈ ఆస్పత్రి లోని వైద్యులు టార్చిలైట్లను వాడుతున్నారు. -
అన్నార్తులపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు... గాజాలో 74 మంది దుర్మరణం
దెయిర్ అల్ బలాహ్: గాజాలో అన్నార్తులపై ఇజ్రాయెల్ పాశవిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆహార కేంద్రాలపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పులు, వైమానిక దాడుల్లో ఏకంగా 74 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సముద్రతీర అల్–బకా కేఫ్‌పై సోమవారం జరిగిన వైమానిక దాడుల్లో 30 మంది మరణించారు. జీహెచ్ఎఫ్ ఆహార కేంద్రంపై జరిపిన కాల్పుల్లో 23 మంది మరణించారు. గాజాలో జరిగిన మరో రెండు దాడుల్లో 15 మంది మరణించారని షిఫా ఆసుపత్రి తెలిపింది.జవైదా పట్టణ సమీపంలో ఓ భవనంపై దాడిలో ఆరుగురు మరణించినట్టు అల్ అక్సా ఆసుపత్రి తెలిపింది. అల్ బకా కేఫ్ పరిసరాలు దాడుల ధాటికి భూకంపం వచ్చినట్టుగా కంపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 20 నెలలుగా యుద్ధం కొనసాగుతున్న సమయంలోనూ కార్యకలాపాలు కొనసాగించిన అతికొద్ది కేఫ్‌లలో ఇది ఒకటి. ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో ఫోన్ చార్జింగ్ కోసం స్థానికులు ఎక్కువగా వస్తుంటారు. నేలపై రక్తసిక్తమైన, వికృతమైన మృతదేహాలు, గాయపడిన వారిని దుప్పట్లలో మోసుకెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.ఆహారం కేంద్రం నుంచి వస్తుండగా...ఇజ్రాయెల్, అమెరికా మద్దతుతో ఖాన్ యూనిస్‌లోని గాజా హ్యుమానిటేరియన్ ఫండ్ (జీహెచ్ఎఫ్) ఆధ్వర్యంలో నడుస్తున్న సహాయ కేంద్రం నుంచి తిరిగి వస్తున్న అన్నార్తులపై కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ‘‘సైనికులతో కూడిన యుద్ధ ట్యాంకులు, వాహనాలు మావైపు దూసుకొచ్చాయి. ఇష్టానికి కాల్పులకు దిగాయి’’ అని వెల్లడించారు. పిల్లలతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని, వారి పరిస్థితి తెలియడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ ఉదంతాన్ని సమీక్షిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. -
గాజాలో 24 గంటల్లో 81 మంది మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగించిన దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో కనీసం 81 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, 422 మంది గాయాల పాలయ్యారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా నగరంలోని పాలస్తీనా స్టేడియంలో ఆశ్రయం పొందుతున్న 12 మంది శరణార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అపార్టుమెంట్లపై జరిగిన దాడిలో మరో 8 మంది మృతి చెందారని షిఫా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో 23 మృతదేహాలను తమ ఆస్పత్రి మార్చురీకి తీసుకువచ్చారని నాస్సెర్ ఆస్పత్రి అధికారులు చెప్పారు. టుఫ్పాలో నలుగురు చిన్నారులు సహా 11 మంది మృతి చెందారని అహ్లి ఆస్పత్రి తెలిపింది. రఫాలోని ఆహార పంపిణీ కేంద్రం వద్ద జనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు, ఖాన్‌యూనిస్ నగరంలోని అల్ ఖరారాలో నలుగురు చనిపోయారు. ఆ వార్తలు అబద్ధం: నెతన్యాహూ గాజాలో అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల సాయంతో ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద జనంపై కాల్పులు జరపాలని ఆరీ్మకి ఆదేశాలు జారీ చేసినట్లుగా వచి్చన వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తీవ్రంగా ఖండించారు. అవన్నీ సైన్యాన్ని అప్రతిష్ట పాలు చేసే వార్తలంటూ కొట్టిపారేశారు. జనంపై ఆర్మీ ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరుపుతోందంటూ వచి్చన వార్తలపై దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు. దాదాపు రెండున్నర నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించిన ఇజ్రాయెల్ సైన్యం నెల క్రితం ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల వద్ద సైన్యం యథేచ్ఛగా సాగిస్తున్న కాల్పుల్లో ఇప్పటి వరకు కనీసం 500 మంది పాలస్తీనియన్లు చనిపోగా వందలాదిగా గాయపడ్డారు.త్వరలోనే కాల్పుల విరమణవచ్చే వారం గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఖరారయ్యే దిశగా చర్చలు సాగుతున్నాయన్నారు. ఈ ఒప్పందంతోపాటు ఇరాన్, తదితర అంశాలపై చర్చించేందుకు ఇజ్రాయెల్ వ్యూహాత్మక వ్యవహారాల శాఖ మంత్రి రాన్ డెర్మర్ వచ్చే వారం వాషింగ్టన్ వెళ్తారని సమాచారం. -
గాజాలో మరో 26 మంది మృత్యువాత
టెల్ అవీవ్/గాజా: గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆహార పంపిణీ కేంద్రం జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన 11 మంది ఉన్నారు. మరో 20 మంది గాయపడ్డారు. దక్షిణ గాజాలోని అల్–మవాసిలో శరణార్ధులున్న టెంట్‌పై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు చనిపోగా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారని వఫా వార్తా సంస్థ తెలిపింది. నుసెయిరత్‌లో జరిగిన వైమానిక దాడిలో నలుగురు చనిపోయారు. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించిన ‘సేఫ్ జోన్’లోనే ఈ టెంట్ ఉందని పేర్కొంది. గడిచిన 48 గంటల వ్యవధిలో గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగించిన మారణకాండలో కనీసం 202 మంది చనిపోగా 1,037 మంది క్షతగాత్రులుగా మిగిలారు. కాగా, గాజాలో సోదాల సమయంలో హమాస్ ఎత్తుకుపోయిన వారిలో ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయని ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. వీరిని యోనాటన్ సమెరనో(21), ఒఫ్రా కెయిడర్(70), షే లెవిన్సన్(19)గా గుర్తించింది. 2023 అక్టోబర్ 7న హమాస్, ఇతర జిహాదీ గ్రూపులు జరిపిన మెరుపుదాడిలో వీరు చనిపోయారని వివరించింది. హమాస్ చెరలో ఇప్పటికీ 50 మంది వరకు ఉన్నారని, వీరిలో సగం కంటే తక్కువమందే సజీవులుగా ఉన్నట్లు భావిస్తున్నామంది. -
గాజాలో... ఆకలి కేకలు!
గాజా: 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంపై మెరుపుదాడి చేపట్టిన హమాస్ ఇతర జిహాదీలు 1,195 మందిని చంపేయడంతోపాటు 251 మందిని బందీలుగా పట్టుకుపోయారు. ఆ ఒక్క ఘటన..దశాబ్దాలుగా శరణార్థులుగా సొంత ప్రాంతంలోనే బతుకులీడుస్తున్న పాలస్తీనా ప్రజలను అత్యంత తీవ్రమైన కష్టాల్లోకి నెట్టివేసింది. శక్తివంతమైన ఇజ్రాయెల్ సైన్యం ఆ రోజు నుంచి గాజాపై యథేచ్ఛగా దాడులు సాగిస్తూ 50 వేల మందిని పొట్టనబెట్టుకోవడంతోపాటు సుమారు లక్షన్నర మందిని క్షతగాత్రులుగా మార్చేసింది. జిహాదీ గ్రూపులు బందీలను విడుదల చేయలేదనే సాకుతో గాజాను కొన్ని నెలలుగా పూర్తిగా దిగ్బంధంలో ఉంచింది. నీరు, ఆహారం, మందులు, ఇతర అత్యవసరాలను సైతం అందకుండా చేసింది. దీంతో ఈ ఆ ప్రాంతంలోని 22% మంది, 4.70 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అత్యంత కీలకమైన ఆస్పత్రులు, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆస్పత్రుల్లో వసతులు, మందులు కరువై సరైన వైద్యం అందక, మహిళలు, చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. మంచి నీరు, ఇంధన సరఫరాను సైతం నిలిపివేసింది. డీహైడ్రేషన్, డయేరియా, హెపటైటిస్ వంటి వాటితో జనం, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా ప్రాంతంలోని 90 శాతం నివాసాలను నేలమట్టం చేసి, నిలువ నీడ లేకుండా చేసింది. నేలమట్టమైన భవనాల శిథిలాలు, అపరిశుభ్రత మధ్యనే పాలస్తీనియన్లు భయంభయంగా బతుకుతున్నారు. ఐరాస సారథ్యంలో నడుస్తున్న ఆహార పంపిణీ కేంద్రాల నుంచి నిల్వలు హమాస్‌కు దారి మళ్లుతున్నాయని ఆరోపిస్తూ వాటిని ఇజ్రాయెల్ మూసివేయించింది. రెండు నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్ సారథ్యంలో ఆహార పంపిణీ కేంద్రాలు పరిమితంగా ఏర్పాటయ్యాయి. ఇక్కడ సైతం అన్నార్తులు తుపాకీ కాల్పులకు గురికాక తప్పడం లేదు. రోజూ పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ‘గాజాలో మానవీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే లక్షలాది మంది ఆకలి చావులకు గురికాక తప్పదు’అని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది. గాజా స్ట్రిప్‌లోని 20 లక్షల మంది ప్రజల ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఇజ్రాయెల్‌కు హితవు పలుకుతోంది. భూమిపై నరకం గాజా భూమిపై నరకం కంటే అధ్వానంగా గాజా ప్రాంతం తయారైందని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మిర్జానా స్పోల్‌జరిక్ వ్యాఖ్యానించారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు, పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు, బందీలను వదిలిపెట్టేందుకు ప్రపంచ దేశాలు అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను పట్టించుకోవడం లేదు. పాలస్తీనియన్లకు కనీస మానవీయమైన గౌరవాన్ని కూడా ఇవ్వడం లేదు. గాజాలో చట్టపరమైన, నైతిక, మానవీయ ప్రమాణాల ఉల్లంఘన జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. -
గాజాలో ఆహార సంక్షోభం.. బ్రెడ్ కి బదులు ఇసుక తింటున్న చిన్నారి
-
ఏమీ ఎరుగని పూవుల్లారా!
ఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!..రెండేళ్ల వయసులో ఎలా ఉండాలి?.. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ.. తల్లిదండ్రుల ఒడిలో సేదతీరుతూ ఉండాలి . కానీ, ఈ చిన్నారి మాత్రం తోటి పిల్లలతో కలిసి ఎక్కడ నీరు దొరక్కుండా పోతుందా? అనే భయంతో పరుగులు ఇలా పెడుతోంది. తమ బిడ్డలకు అందమైన బాల్యం చెక్కాలని ఆ దేవుడ్ని మొక్కుకోని తల్లిదండ్రులు ఉంటారా?. కానీ, తమ బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలని వేడుకుంటున్నారు గాజా ప్రజలు.గాజా.. గత ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ దాడులతో.. తీవ్ర మానవ సంక్షోభంతో అల్లలాడుతున్న నేల. మానవతా సాయం ఆగిపోవడంతో సంక్షోభం తలెత్తి చివరకు తిండి, మంచి నీటిని కూడా పరిమితులు విధించడంతో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by عبد الرحمن ناصر | Abdulrahman Nasir (@abdulrahman_nasir7)యూనిసెఫ్ గణాంకాల ప్రకారం..ప్రస్తుతం కల్లోల గాజాలో చిన్నారులకు రోజుకి ఒకటిన్నర నుంచి 2 లీటర్ల నీరు అందిస్తున్నారు. సాధారణంగా.. అన్ని అవసరాలకు కలిపి 15 లీటర్ల నీరు ఒకరోజుకి అవసరం పడుతాయి. ఇందులో తాగు నీటికే 3 లీటర్ల అవసరం. అలాంటిది ఇక్కడి చిన్నారులకు ఒకరోజులో 2 లీటర్ల లోపే నీరు అందుతుండడం.. సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది.గణాంకాలు.. కఠోర వాస్తవాలుగాజాలో 2023 అక్టోబర్ నుండి ప్రారంభమైన యుద్ధంలో వేలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, మరియు ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.2023లోనే గాజాలో జరిగిన దాడుల్లో పిల్లలే అత్యధికంగా మరణించారు అని జెనీవాలో యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్టర్ ప్రకటించారు.మొత్తం గాజా మరణాల్లో.. 70% మరణాలు మహిళలు మరియు పిల్లలే అని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. యుద్ధం, ఆకలి, నీటికొరత, వైద్య సౌకర్యాల లేమి కారణంగా 14,000 మంది పిల్లలు మరణించే ప్రమాదం ఉంది అని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.ఇంకా..19 లక్షల మంది స్థానభ్రంశం చెందారు, వారిలో సగానికి పైగా పిల్లలే.370 స్కూళ్లు నేలమట్టమయ్యాయి, పిల్లలు విద్యా అవకాశాలు కోల్పోయారు.నీటి లభ్యత 5%కి పడిపోయింది, దీని వల్ల డీహైడ్రేషన్‌తో పసికందులు మరణిస్తున్నారు.బాల్యం అనే భావన అక్కడ పూర్తిగా విచ్ఛిన్నమైందని యునిసెఫ్ పేర్కొంది. ఈ గణాంకాలు గాజాలోని పిల్లల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. *పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!అచ్చటికిచ్చటి కనుకోకుండాఎచ్చటెచటికో ఎగురుతుపోయేఈలలు వేస్తూ ఎగురుతుపోయేపిట్టల్లారా!పిల్లల్లారా!గరికిపచ్చ మైదానాల్లోనూ,తామరపూవుల కోనేరులలోపంటచేలలో, బొమ్మరిళ్లలో,తండ్రి సందిటా, తల్లి కౌగిటా,దేహధూళితో, కచభారంతో,నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,ఎక్కడ చూస్తే అక్కడ మీరైవిశ్వరూపమున విహరిస్తుండేపరమాత్మలుఓ చిరుతల్లారా!మీదే, మీదే సమస్తవిశ్వం!మీరే లోకపు భాగ్యవిధాతలు!మీ హాసంలో మెరుగులు తీరునువచ్చేనాళ్ల విభాప్రభాతములు!ఋతువుల రాణి వసంతకాలంమంత్రకవాటం తెరచుకునీ,కంచు వృషభముల అగ్నిశ్వాసంక్రక్కే గ్రీష్మం కదలాడీ,ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూఏకంచేసే వర్షాకాలం,స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,హిమానీ నిబిడ హేమంతములు,చలివడకించే శైశిరకాలంవస్తూ పోతూ దాగుడుమూతలక్రీడలాడుతవి మీ నిమత్తమే!ఇవాళలాగే ఎప్పుడు కూడాఇనబింబం పయనించు నింగిపై!ఎప్పుడు కూడా ఇవాళలాగేగాలులు వీచును, పూవులు పూచును!నాకు కనంబడు నానాతారక,లనేక వర్ణా, లనంత రోచులుదిక్కు దిక్కులా దివ్యగీతములుమీరూ వాటికి వారసులే! ఇవిమీలో కూడా మిలమిలలాడును!నా గత శైశవ రాగమాలికలప్రతిధ్వనులకై,పోయిన బాల్యపు చెరిగిన పదములచిహ్నాల కోసం,ఒంటరిగా కూర్చిండి వూరువులుకదిలే గాలికి కబళమునిస్తూ,ప్రమాద వీణలు కమాచి పాడగసెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ,పాతాళానికి పల్టీకొట్టీవైతరణీనది లోతులు చూస్తూ,శాంతములే, కేకాంతముగా, దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూమెటిక విరుస్తూ ఇట కూర్చిండిననను చూస్తుంటే నవ్వొస్తోందా?ఉడుతల్లారా!బుడతల్లారా!ఇది నా గీతం, వింటారా?*సేకరణ: శ్రీశ్రీ మహాప్రస్థానం/శైశవగీతి -
ఇజ్రాయెల్ కాల్పుల్లో 70 మంది మృతి ఆహారం కోసం వేచి ఉండగా దారుణం
గాజా: ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ బలగాల క్రౌర్యం అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతోంది. గాజా దక్షిణ ప్రాంతంలోని ఖాన్‌యూనిస్ నగరంలోని రోడ్డుపక్కన ఆహారం ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై మంగళవారం జరిగిన కాల్పుల్లో ఏకంగా 70 మంది చనిపోగా 200 మందికిపైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఆర్మీ డ్రోన్లు, మెషీన్ గన్లు, ట్యాంక్ షెల్స్‌ను అన్నార్తులపైకి ఒక్కసారిగా పెద్దపెట్టున కురిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.కాగా, తమ వద్దకు తీసుకువచ్చిన క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మరణాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని నాస్సెర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రఫాలోని ఆహార పంపిణీ కేంద్రం వద్ద సోమవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో 38 మంది చనిపోవడం తెల్సిందే.అమెరికా–ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద నిత్యం కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇజ్రాయెల్ కాల్పుల్లో మంగళవారం అత్యధికులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఆహార నిల్వలు హమాస్ శ్రేణుల చేతుల్లో పడకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని ఇజ్రాయెల్ అంటోంది. అయితే, నూతన పంపిణీ వ్యవస్థ గాజా ప్రజల అవసరాన్ని ఏమాత్రం తీర్చలేదని, ఇలాగే కొనసాగిస్తే పాలస్తీనియన్లు ఆకలి చావులు తీవ్రతరం కాక తప్పదని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
ఇజ్రాయెల్ బాధ్యతారాహిత్యం
గాజాలో నరమేధం కొనసాగిస్తూనే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మరో కుంపటి రాజేసింది. ఎలాంటి కవ్వింపూ లేకుండానే శుక్రవారం ఇరాన్‌పై దాడులకు దిగి రాజధాని తెహ్రాన్‌తో సహా అనేకచోట్ల బాంబుల వర్షం కురిపించింది. 200 యుద్ధ విమానాలు ఏకబిగిన సాగించిన ఈ దాడుల్లో ఇరాన్ సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న సైనిక దళాల చీఫ్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్, ఇరాన్ ఎమర్జెన్సీ కమాండ్ చీఫ్‌ల ప్రాణాలు తీయటంతో పాటు అణు కార్యక్రమంలో చురుగ్గా ఉంటున్న ఆరుగురు శాస్త్రవేత్తలను హతమార్చింది. ఇరాన్ అణు స్థావరాలను కూడా లక్ష్యం చేసుకున్నట్టు సమాచారం. ఆ దేశంపై తమ యుద్ధం ఆగదని కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్ వంద డ్రోన్లతో సాగించిన దాడి పెద్దగా ఫలించిన వైనం కనబడట్లేదు. అమె రికా అధ్యక్ష ఎన్నికలప్పుడూ, అధికారం స్వీకరించాకా ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం గురించి పదేపదే ప్రకటనలు చేశారు. కానీ ఇజ్రాయెల్ దుందుడుకు చర్య చూస్తుంటే ఆ ప్రకటనల్లోని నిజా యతీ ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే అమెరికా లోపాయకారీ అనుమతి లేకుండా ఆ దేశం ఇలాంటి దాడులకు తెగించే అవకాశం లేదు. తాజా దాడుల్ని ఖండించకపోగా ఒప్పందం కోసం వస్తున్న అవకాశాలను ఇరాన్ కాలదన్నుకుంటున్నదని, ఇదే కొనసాగితే పరిస్థితి విషమం కావొచ్చని శుక్ర వారం ఆ దేశాన్ని ట్రంప్ హెచ్చరించిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నిజాయతీ ఉంటే అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగా ఈ దాడులేమిటని ఇజ్రాయెల్‌ను నిలదీసి ఉండాలి. చర్చలే అణు ఒప్పందానికి సంబంధించినవైనప్పుడు ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని హత్య చేయటం నేరపూరితమని చెప్పివుండాలి. ఆ పని చేయకపోగా ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని, కనుక పశ్చిమాసియాలోని అమెరికన్ స్థావరాలపై ప్రతీకార దాడులకు దిగొద్దని ఇరాన్‌ను హెచ్చరించింది. ఇరాన్‌తో అణు ఒప్పందం గురించి తన దూతల ద్వారా చర్చలు మొదలెట్టాక వాటిని భగ్నం చేసే చర్యకు పాల్పడవద్దని ఆ మధ్య ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు. అయితే అమెరికా విధిస్తున్న షరతులు తమకు సమ్మతం కాదని మూడు రోజుల క్రితం ఇరాన్ ప్రకటించాక పరిస్థితి మారింది. వాస్తవానికి వచ్చే ఆదివారం అమెరికా–ఇరాన్‌ల మధ్య మరో దఫా చర్చలు జరగాల్సి ఉంది. తాజా దాడుల తర్వాత వాటిని నిలిపివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అణుబాంబు వైపుగా అడుగులేస్తున్నదని ఇరాన్‌పై ఆరోపణలు చేసేవారు ఏ కవ్వింపూ లేకుండానే ఇజ్రాయెల్ దాడులు చేయటాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ఈ దాడులకు 24 గంటల ముందు పశ్చిమాసియా దేశాల్లోని తమ సైనికాధికారుల కుటుంబాలు వెనక్కి వచ్చేయాలంటూ పిలుపునివ్వటం, ఇరాక్ నుంచి దౌత్య వేత్తల్ని కూడా వెనుదిరగమని అమెరికా చెప్పటం గమనార్హం. వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌కు విమానాలూ, క్షిపణులూ, ఇతర ఆయుధాలు పంపిస్తూ తాజా దాడులకు అమెరికాయే పూర్వరంగాన్ని సిద్ధం చేసిందా అనే అనుమానం కలుగుతోంది.అసలే ప్రపంచం పలు సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కరోనా మహమ్మారి కాటేయటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయి. అయిదేళ్లు కావస్తున్నా ఏ దేశమూ పూర్తిగా కోలుకున్న దాఖలా కనబడటం లేదు. అంతక్రితమే 1991లో కువైట్‌పై ఇరాక్ సాగించిన యుద్ధం మొదలుకొని ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య టర్కీ, సిరియాల మధ్య తీవ్ర ఘర్షణలు సాగాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించే పేరిట ఇరాక్‌పై అమెరికా, పాశ్చాత్య దేశాలు కొనసాగించిన యుద్ధం, లిబియాలో కల్లోలం సృష్టించి గడాఫీని అంతం చేయటం వంటి పరిణామాల నుంచి పశ్చిమాసియా ఇంకా కోలుకోలేదు. అక్కడ చాలా దేశాల్లో సాయుధ ముఠాలు పరస్పరం తలపడు తున్నాయి. ఇజ్రాయెల్–పాలస్తీనా వైరం సరేసరి.ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యా బయట కొచ్చే మార్గం తెలియక కొట్టుమిట్టాడుతోంది. దాన్నుంచి సాయం అందే దారులు మూసుకు పోవటంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మిలిటెంట్ల దాడుల తర్వాత దేశం విడిచి పరార య్యారు. ఇప్పుడక్కడ అమెరికా మద్దతుతో ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది మహమ్మద్ అల్– షారా దేశాధ్యక్షుడయ్యాడు. సరిగ్గా నెలరోజుల క్రితం గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సదస్సుకెళ్లిన ట్రంప్ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇలా పశ్చిమాసియా రకరకాల క్లేశాలతో ఇప్పటికీ నెత్తురోడుతూ ఉండగా దాన్ని మరింత ఊబిలోకి నెట్టేలా తాజా పరిణామాలున్నాయి. ఇరాన్‌పై దాడి జరిగితే తాము మౌనంగా ఉండ బోమని ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. అదే జరిగితే ఇజ్రాయెల్ తరఫున అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుంది. సారాంశంలో ఇజ్రాయెల్ దుందుడుకు చేష్టలు, అమెరికా గుడ్లప్పగించి చూడటం ఒక్క పశ్చిమాసియాను మాత్రమే కాదు... ప్రపంచాన్నే యుద్ధం అంచుల్లోకి నెడుతున్నాయి. తాను అధికారంలోకొచ్చాక ఇరాన్‌తో 46 ఏళ్లుగా కొనసాగుతున్న వైరానికి స్వస్తి పలుకుతానని, ప్రపంచంలో ఏ మూలనా అమెరికా సైన్యం ఉండాల్సిన అవసరం లేకుండా చేస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలు ట్రంప్ మరిచారా? ఈ యుద్ధం కొనసాగితే తక్షణం హార్మూజ్ జలసంధి మూతబడి ప్రపంచ దేశాలకు పోయే 25 శాతం ముడిచమురు, సహజ వాయు రవాణా నిలిచిపోతుంది. పర్యవసానంగా అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలుమరింత కుంగుతాయి. ఇక అమెరికా, రష్యా, చైనాలు నేరుగా దిగితే జరిగే పరిణామాలు ఊహకందని ఉత్పాతాన్ని సృష్టిస్తాయి. అగ్రరాజ్యాలు... ముఖ్యంగా అమెరికా తమ మూర్ఖత్వాన్ని విడనాడి ఇజ్రాయెల్‌ను దారికి తేవాలి. లేనట్టయితే భవిష్యత్తరాలు క్షమించవు. -
గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు
గాజా: గాజాలో అన్నార్తులపై ఇజ్రాయెల్ మరోసారి కాల్పులకు తెగబడింది. ఇజ్రాయెల్, అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆహార పంపిణీ కేంద్రాల సమీపంలోనే ఆదివారం ఈ ఘోరం జరిగింది. కాల్పులకు ఐదుగురు పాలస్తీనా పౌరులు బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరికొందరు గాయపడ్డారని పేర్కొంది. అయితే తమ దళాలపై దాడులకు ప్రయతి్నంచిన వారిపై ప్రతి దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వివాదాస్పద సామాజిక కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌తోపాటు మరికొందరు గాజాకు వస్తున్న పడవను అడ్డుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఆస్పత్రి కింద బంకర్: దక్షిణ గాజాలో ఖాన్‌యూనిస్‌లోని యూరోపియన్ ఆస్పత్రి కింద మరో భూగర్భ సొరంగం జాడను కనుగొన్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సంబంధిత వీడియో విడుదలచేసింది. దీన్ని హమాస్ కమాండ్ సెంటర్‌గా వాడుతోందని ఆరోపించింది. -
రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని సృష్టిస్తోంది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆహార పంపిణి నిలిపివేత,కరువు నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. ఇటీవలి ఆహార పంపిణీలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. మరోవైపుఆ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్‌మార్కెట్ దందా జోరందుకుంది. ఏ వస్తువును కొందామన్నా ధర వింటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. అతి చవకగా దొరికే పార్లే-జి బిస్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలు ధర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. గాజా నుండి ఇటీవల వైరల్ అయిన పోస్ట్ ప్రకారం ముంబైతె తయారయ్యే పార్లే జి బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడవుతున్నాయి. భారత మార్కెట్లో కేవలం 5 రూపాయలకు లభించే ఈ బిస్కెట్ల ధర చూసి సోషల్ మీడియా యూజర్లు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఈ ధరలు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుండి ఎగుమతి అవుతున్న ఒక్క పార్లే-జికే పరిమితం కాదు, అన్ని వస్తువులు పరిస్థితి అలాగే ఉంది.After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025 "మూడు నెలలకు పైగా సరిహద్దులను మూసివేయడం వల్ల 2 మిలియన్ల మంది ప్రజల అవసరాలను తీర్చలేని చాలా తక్కువ మొత్తంలో ప్రాథమిక అవసరాలు మాత్రమే అనుమతి ఉందనీ, . కాబట్టి కొంతమందిమాత్రమే ఆహారం లభించినపుడు, ఈ ఆహారాలు చాలా ఎక్కువ, భరించలేని ధరలకు అమ్ముడవుతున్నాయని స్థానిక డాక్టర్ అల్షావా చెప్పారని ఎన్డీటీవీ తన స్పెషల్ రిపోర్ట్‌లో తెలిపింది. సమస్య అసలు సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు" "ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయంగా ఉచితంగా గాజాలోకి వస్తాయి. కానీ అవికొంతమందికి లభ్యమవుతున్నాయి. మిగతావి బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు.ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!జూన్ 6 నాటికి ఉత్తర గాజాలో మార్కెట్ ధరలుకిలోల చక్కెర: రూ. 4,914వంట నూనె: రూ. 4,177కిలో బంగాళాదుంపలు: రూ. 1,965కిలో ఉల్లిపాయలు : రూ. 4,423కాఫీ కప్పు: రూ. 1,800 గత గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన తరువాత, గాజాకు ఆహార లభ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మార్చి 2 -మే 19 మధ్య, పాలస్తీనాలో ఆధీన ప్రాంతం దాదాపు మొత్తం దిగ్బంధనను ఎదుర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడి తరువాత కేవలం పరిమిత సంఖ్యలో మానవతా ట్రక్కులను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 54,510 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
అన్నార్థులపై మళ్లీ పేలిన తూటా
రఫా: గాజాలోని పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ మరోసారి పాశవికంగా వ్యవహరించింది. ఆహార పంపిణీ కేంద్రం వద్దకు వెళ్తున్న వారే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో 27 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇది మూడు రోజుల్లో జరిగిన మూడో కాల్పుల ఘటన కావడం గమనార్హం. మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల్లో కనీసం 184 మంది గాయపడినట్లు రెడ్ క్రాస్ తెలిపింది. ఐరాస మానవ హక్కుల విభాగం కూడా ధ్రువీకరించింది. మృతదేహాలను ఖాన్‌యూనిస్‌లోని నాస్సెర్ ఆస్పత్రికి తరలించారు.బుల్లెట్లు తగిలిన క్షతగాత్రులను అంబులెన్సుల్లో వేరే ఆస్పత్రులకు తరలిస్తుండగా చూశామని, కొందరు ఉత్త చేతులతోనే వెనుదిరిగి వస్తుండగా, నేలపై పడిన ఖాళీ పిండి సంచులు రక్తపు మరకలతో తడిచిపోయాయని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ ఆహార పంపిణీ కేంద్రం వద్ద దారుణ పరిస్థితిని వివరించారు. కాగా, పంపిణీ కేంద్రం వద్ద నిర్దేశించిన బాటను వదలి తమ బలగాల దిశగా వస్తున్న అనుమానితులనే కాల్చామని, హెచ్చరిక కాల్పులను సైతం వీరు లెక్కచేయలేదని ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. గాజాలో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన మిలటరీ జోన్లలో అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. హమాస్ శ్రేణులకు ఆహార పదార్థాలు అందకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ అంటుండగా..ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఐరాస అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాలు ఆకలిని ఏమాత్రం తీర్చలేవని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆది, సోమవారాల్లో ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఆర్మీ జరిపిన కాల్పుల్లో 34 మంది ప్రాణాలు విడిచారు. ఆహార పంపిణీ బాధ్యతలు చేపట్టిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ మాత్రం తమ కేంద్రాల వద్ద గానీ, చుట్టుపక్కల గానీ ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెబుతోంది. మంగళవారం 21 ట్రక్కుల ఆహారాన్ని పంపిణీ చేశామని తెలిపింది. కాల్పుల ఘటనలన్నీ రఫాలో ఇజ్రాయెల్ మిలటరీ జోన్లలోని పంపిణీ కేంద్రాల వద్దే చోటుచేసుకున్నాయి. ఇక్కడికి మీడియాను ఆర్మీ చాలా పరిమితంగా అనుమతిస్తోంది. గతంలో గాజాలోని సుమారు 20 లక్షల మందికి నిత్యం 600 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు అందేవి. వీరందరికీ ఈ ఆహారమే ఆధారం. ఇజ్రాయెల్ ఆర్మీ నెలలపాటు కొనసాగించిన దిగ్బంధనం కారణంగా ఆహార నిల్వలు పూర్తి స్థాయిలో అడుగంటాయి. -
గాజాలో అన్నార్తులపైకి కాల్పులు 31 మంది మృతి
రఫా (గాజా స్ట్రిప్): గాజాలో మాటలకందని ఘోరం చోటుచేసుకుంది. అన్నార్తులపై ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఐరాస సాయాన్ని కాదని అమెరికా దన్నుతో గాజా లో ఇజ్రాయెల్ స్వయంగా సహాయ కేంద్రాలను మొదలుపెట్టడం తెలిసిందే. వాటినుంచి ఆహారం తెచ్చుకోవడానికి వెళ్తున్న వారిపై తూటాల వర్షం కురిపించింది. ఆ కాల్పుల్లో 31 మంది పాలస్తీనావాసులు బలయ్యారు. కనీసం 170 మందికి పైగానే గాయపడ్డట్టు హమాస్ వర్గాలు వివరించాయి. సహాయ కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఈ దారుణం జరిగినట్టు గాజా ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా తెలిపారు. దీనిపై అంతర్జాతీయంగా దుమారం రేగుతుండటంతో ఇజ్రాయెల్ తీవ్ర ఇరకాటంలో పడింది. అలాంటి ఉదంతమేదీ ఇప్పటిదాకా తమ దృష్టికి రాలేదని నెతన్యాహు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొంది. -
భారతీయ విద్యార్థిని మేఘా వేమూరి సాహనం
-
ఇజ్రాయెల్ దాడుల్లో 44 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్: గాజాపై ఇజ్రాయెల్ తాజా దాడుల్లో 44 మంది మరణించారు. అల్–బురైజ్లో ఒక్కఇంటిలోనే ఏకంగా 23 మంది మరణించారు. దక్షిణ గాజాలోని అమెరికా సహాయ కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ కాల్పుల్లో ఇద్దరు మరణించగా చాలామంది గాయపడ్డారు. హమాస్‌కు సహాయ సామగ్రి అందకుండా చేసేందుకు అమెరికా మద్దతుతో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. దీన్ని ఐరాసతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇజ్రాయెల్ అన్ని నైతిక, చట్ట పరమైన హద్దులు దాటుతోందని జోర్డాన్ మండిపడింది. ఒక సంచి పిండి కోసం కూడా ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజా అంతటా డజన్ల కొద్దీ ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇంకా ఆకలి కేకలే రెండు నెలల పై చిలుకుకు దిగ్బంధం తర్వాత గాజాలోకి ఇప్పుడిప్పుడే మానవతా సాయం చేరుతోంది. ఇజ్రాయెల్ పరిమిత అనుమతితో ట్రక్కులు గాజాలోకి ప్రవేశిస్తున్నట్టు ఐరాసలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ భద్రతా మండలికి తెలిపారు. దాని పంపిణీకి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఐరాస తెలిపింది. అయినా గాజాలో ఎటు చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. విరమణకు మరో ప్రతిపాదన గాజాలో కాల్పుల విరమణ కోసం చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం హమాస్ తన వద్ద సజీవంగా ఉన్న 10 మంది ఇజ్రాయెలీ బందీలను అప్పగించాలి. 18 మంది బందీల మృతదేహాలను రెండు దశల్లో ఇజ్రాయెల్‌కు ఇవ్వాలి. బదులుగా ఇజ్రాయెల్ 60 రోజుల కాల్పుల విరమణ పాటిస్తుంది. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది. -
పాశ్చాత్య దేశాల ‘ప్రాయశ్చిత్తం’
గాజాలో కళ్లముందు 19 నెలలుగా మారణహోమం సాగుతున్నా గుడ్లప్పగించి చూసిన పాశ్చాత్య దేశాలు ఇప్పటికి తెలివి తెచ్చుకున్నాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న ఊచకోత ‘నైతికంగా సమర్థించ లేనిది, పూర్తిగా అసమతౌల్యమైనద’ంటూ కొత్త రాగం అందుకున్నాయి. మొదట బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకిస్తూ ప్రకటన చేయగా, కాస్త ఆలస్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), జర్మనీ శ్రుతి కలపడం కొత్త పరిణామం. ఇన్నాళ్ల పాపానికిది ప్రాయశ్చిత్తం అనుకోవచ్చా? అనుమానమే. గాజాలో ఏణ్ణర్ధం నుంచి అదే పనిగా బాంబుల వర్షం కురి పిస్తూ వేలాదిమంది ప్రజలనూ... వారికి తిండి నీళ్లూ ఇచ్చేందుకూ, చికిత్స అందించేందుకూ వచ్చినవారిని సైతం హతమారుస్తుంటే ఈ దేశాల్లో ఎవరికీ నోరు పెగల్లేదు. ఇప్పటికీ వాటి వైఖరి పెద్దగా మారినట్టు కాదు. ఎందుకంటే... ఊచకోత సమర్థనీయం కాదంటూనే ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని ఎప్పటిలా మర్కట తర్కానికి దిగుతున్నాయి. 2023 అక్టోబర్ 7న పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించింది మొదలు పాశ్చాత్య దేశాలు ఈ వాదనే చేస్తున్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని కాల్చిచంపి, 251 మందిని అపహరించుకు వెళ్లినప్పటి నుంచీ ఇజ్రాయెల్ ప్రతీకారం మొదలైంది. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి దేశానికీ వుంటుంది. కానీ దానికుండే పరిమితి మాటే మిటి? ఎన్ని నెలలపాటు బాంబుల వర్షం కురిపిస్తే... ఎన్ని వేలమందిని చంపితే ఆత్మరక్షణ చేకూరు తుంది? 2,000 పౌండ్ల (907 కిలోల) బంకర్ బస్టర్ బాంబులు ఒక చిన్న ప్రాంతమైన గాజాపై ప్రయోగిస్తుంటే, ఆ దాడుల్లో వేలాదిమంది అమాయక పౌరులూ, ముఖ్యంగా పిల్లలూ, స్త్రీలూ చని పోతుంటే ఎవరూ మాట్లాడలేదు. ఇజ్రాయెల్ దళాలు మూడు నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించి అక్కడికి అంతర్జాతీయ సహాయ బృందాలు అడుగుపెట్టకుండా పహారా కాస్తున్నాయి. తామే ఆ సాయాన్ని అందిస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. అదెంత బూటకమో తరచూ మీడియాలో వస్తున్న కథనాలే చెబుతున్నాయి. రోజుల తరబడి ఆహారం, మంచినీరూ లభించక వేలాదిమంది మృత్యుముఖంలో వున్నారని ఆ కథనాలు వివరిస్తున్నాయి. ఆకలికి తాళలేక వాహ నాల వెంబడి పరుగులు తీస్తున్నవారిని కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన ఉదంతాలు వెలుగులో కొచ్చాయి. చివరకు అమెరికా–ఇజ్రాయెల్ సహాయ బృందాలను పర్యవేక్షించే చీఫ్ జేక్ ఉడ్ ఆ బాధ్య తల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ బృందాల సాయమంతా కూడా ఇజ్రాయెల్ అధీనంలోని దక్షిణ గాజాలో నాలుగు శిబిరాల ద్వారా మాత్రమే అందుతోంది. సాయం కావాల్సిన వాళ్లు కిలోమీటర్ల దూరం నడిచిపోవాల్సి వస్తోంది. ఉత్తర గాజాకు ఆ మాత్రం సాయం కూడా లేదు.నదురూ బెదురూ లేకుండా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండపై సంపన్న రాజ్యాలు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాయి? ఒక నెత్తుటి హోమానికి తాము మౌన సాక్షులుగా మిగిలిపోయా మన్న నింద పడకూడదని, తమ చేతులు కూడా నెత్తుట తడిశాయని చరిత్రలో నమోదు కారాదని అవి తహతహలాడుతున్నాయి. ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు ఎడాపెడా సైనిక సామగ్రి తరలించినవే. కోట్లాది డాలర్లు కుమ్మరించినవే. భద్రతా మండలిలో దాన్ని సమర్థించినవే. ఇప్పుడు బ్రిటన్ ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలుపుదల చేసింది. పాలస్తీనా ఏర్పాటు అంశంపై వచ్చే నెలలో సౌదీ అరేబియాతో కలిసి సదస్సు నిర్వహించ నున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. ఇవి నిజానికి కంటి తుడుపు చర్యలు. కానీ ఈమాత్రం చర్యలు కూడా సమ్మతం కాదంటోంది ఇజ్రాయెల్. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు పరోక్షంగా హమాస్ బలపడేందుకు దోహదపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆరోపించారు. ఇప్పటికి 594 రోజులుగా ఏకపక్షంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథానికి ఇంతవరకూ 61,700 మంది మరణించగా, అందులో 20,000 మంది పసివాళ్లని అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద కన్నుమూసిన వారెందరో ఇంకా తెలియలేదు. వేలాదిమంది పిల్లలు అనాథలుగా మిగిలిపోగా, మరిన్ని వేలమంది పిల్లలు కాళ్లూ చేతులూ పోగొట్టుకుని వైద్యసాయం సక్రమంగా అందక రోదిస్తున్నారు. ఈ మారణహోమానికి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రోజుల తరబడి ధర్నాలు సాగాయి. పాశ్చాత్య దేశాల్లో పాలస్తీనా ప్రధాన చర్చనీయాంశమైంది. కానీ ఇవేవీ ఇజ్రా యెల్‌నుగానీ, దానికి అండగా వుంటున్న సంపన్న రాజ్యాల పోకడలనుగానీ మార్చలేకపోయాయి. ఇజ్రాయెల్ వాణిజ్యంలో మూడోవంతు వాటా యూరప్ దేశాలదే. ఆ దేశాలు తల్చుకుంటే, చిత్త శుద్ధితో ఆంక్షలు అమలు చేస్తే ఇజ్రాయెల్ మనుగడ ఇబ్బందుల్లో పడుతుంది. మొదటి నుంచీ అండగా ఉంటున్న అమెరికా ఆ దేశాలతో చేతులు కలిపితే దాని పరిస్థితి మరింత దిగజారుతుంది. కనీసం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆదేశాలను పాటిస్తే ఇజ్రాయెల్‌కు ఊపిరాడదు. కానీ అవి నిజంగా అంత పని చేస్తాయా? అసలు ఇజ్రాయెల్‌లోనే నెతన్యాహూపై తీవ్ర వ్యతిరేకత బయల్దేరింది. ఇప్పుడు ఆయన్ను సమర్థించేవారు 25 శాతం మించరని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ను ఏమాత్రం తక్కువ చేసినా అది ఇరాన్‌కు బలం చేకూరుస్తుందన్న భయం పాశ్చాత్య దేశాలకుంది. ఆ దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధానంతర రాజకీయాలన్నీ ఇజ్రాయెల్‌తో ముడిపడి వున్నాయి. దాన్ని తెంచుకోవటమంటే ఒక కొత్త ఒరవడికి తెరతీయడమే. అంత సాహసం చేయలేక కంటితుడుపు చర్యలు ప్రకటించాయి. కానీ ఇప్పటికే సమయం మించిందని ఆ దేశాలు గ్రహిస్తే మంచిది. -
హమాస్ నేత సిన్వార్ హతం
డెయిర్ అల్ బాలాహ్ (గాజా స్ట్రిప్): గాజాలో హమాస్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ సాయుధ సంస్థ సీనియర్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బుధవారం పార్లమెంట్లో ఈ మేరకు ప్రకటించారు. హమాస్‌కు గతంలో అత్యంత కీలక నేతగా నిలిచిన యాహ్యా సిన్వార్ తమ్ముడే మొహమ్మద్. యాహ్యా గతేడాది ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. 🚨 | JUST IN: Israeli PM Benjamin Netanyahu CONFIRMS the elimination of 3 top Hamas leaders -- Mohammed Deif, Yahya Sinwar, and Mohammed Sinwar.Terrorism isn't managed it’s erased.This is what real leadership looks like when evil shows its face. 🇮🇱🔥 pic.twitter.com/h1PsuLBarY— Hank™ (@HANKonX) May 28, 20252023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ మెరుపుదాడి ఘటన సూత్రధారుల్లో యాహ్యా ఒకరని ఇజ్రాయెల్ ఆరోపించడం తెల్సిందే. యాహ్యా అనంతరం ఆయన బాధ్యతలను మొహమ్మదే చూసుకుంటున్నారు. సిన్వార్ సొంతపట్టణమైన ఖాన్ యూనిస్‌పై మే 13న ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేసింది. ‘‘వాటి ధాటికి స్థానిక యూరోపియన్ ఆస్పత్రి భూగర్భంలోని హమాస్ కమాండ్ సెంటర్ నాశనమైంది. అందులో ఉన్న సిన్వార్ చనిపోయాడు’’ అని సైన్యం చెబుతోంది. సిన్వార్ మరణాన్ని హమాస్ ధ్రువీకరించలేదు. అయితే మే 13 నాటి దాడిలో ఆరుగురు చనిపోయారని, 40 మంది గాయపడ్డారని గాజా ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది. -
స్కూలు భవనంపై ఇజ్రాయెల్ దాడులు
దెయిర్ అల్బలా: గాజాపై ఇజ్రాయెల్ దాడులు నానాటికీ ఉధృతమవుతున్నాయి. సోమవారం నాటి దాడుల్లో 46 మంది మృతి చెందారు. దరాజ్ ప్రాంతంలో పునారావస కేంద్రంగా మారిన పాఠశాల భవనంపై జరిగిన దాడిలోనే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 55 మందికి పైగా గాయపడ్డారు. అందులోని వారంతా నిద్రలో ఉండగానే సోమవారం తెల్లవారుజామున మూడుసార్లు దాడులు జరిగాయి. వాటి ధాటికి అంటుకున్న మంటల్లో చాలామంది నిస్సహాయంగా కాలిపోయారు. ఉగ్రవాదులు పాఠశాల నుంచి పని చేస్తున్నందునే దాన్ని లక్ష్యం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ చెప్పింది. పౌరుల మరణాలకు హమాస్ కారణమని ఆరోపించింది. జాబాలియాలో ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మరణించారు. మరోవైపు గాజాలో మానవతా సహాయాన్ని అమెరికాకు చెందిన సంస్థకు అప్పగించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. సోమవారం నుంచి సహాయం ప్రారంభించింది. -
Gaza: వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలను కోల్పోయి.. ఐసీయూలో చేరిన వైద్యుడు
గాజా: గాజాలో చోటుచేసుకున్న మరో విషాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రెండురోజుల క్రితం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన సైనికదాడిలో తన తొమ్మిది మంది సంతానాన్ని కోల్పోయిన వైద్యుడు ప్రస్తుతం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్(Intensive care)(ఐసీయూ) చికిత్స పొందుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు.గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ అనే వైద్యుడు తన 10 మంది పిల్లలతో పాటు ఖాన్ యూనిస్‌లోని తన ఇంట్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది చిన్నారులు మృతిచెందారు. ప్రాణాలతో బయటపడిన ఒక చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుగున్నాడు. ఇదే దాడిలో గాయపడిన డాక్టర్ హమ్ది అల్-నజ్జర్ ప్రస్తుతం దక్షిణ గాజాలోని సమీపంలోని నాజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న అబ్దుల్ అజీజ్ అల్-ఫర్రా మాట్లాడుతూ డాక్టర్ నజ్జర్కు ఉదరం, ఛాతీలో అవుతున్న రక్తస్రావాన్ని నియంత్రించేందుకు రెండు ఆపరేషన్లు జరిగాయని, అతని తలకు కూడా తీవ్రగాయం అయ్యిదని తెలిపారు.ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) శుక్రవారం ఖాన్ యూనిస్‌పై వైమానిక దాడి చేసినట్లు ధృవీకరించింది. తమ ఆపరేషన్ ప్రారంభించే ముందు సైన్యం ఆ ప్రాంతం నుండి పౌరులను తరలించిందని పేర్కొంది. కాగా నజ్జర్ భార్య కూడా వైద్యురాలు. అయితే ఆమె దాడి సమయంలో ఇంటిలో లేరు. విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి చేరుకుని విగత జీవులుగా పడివున్న తన పిల్లలను చూసి షాకయ్యారు. తరువాత తేరుకున్న ఆమె యుద్ధంలో గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్స అందిస్తున్నారు. 2023 అక్టోబర్‌లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతం ఈ యుద్ధం మొదలయ్యింది. తరువాత ఇజ్రాయెల్ హమాస్‌ను నిర్మూలించడం, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడమే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేస్తూ వస్తోంది. ఇది కూడా చదవండి: పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే.. -
గాజాలోకి 90 ట్రక్కులు: ఐరాస
డెయిర్ అల్ బలాహ్: మూడు రోజుల ఆలస్యం తరువాత గాజాలోకి ఎట్టకేలకు 90 సహాయక ట్రక్కులు వచ్చినట్టు అక్కడి ఐక్యరాజ్యసమితి సహాయ బృందం తెలిపింది. పిండి, పిల్లల ఆహారం, వైద్య పరికరాలతో అవి కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా గాజాలో ప్రవేశించినట్టు ధ్రువీకరించింది. ఆ వెంటనే సహాయ పంపిణీ ప్రారంభమైంది. అందుబాటులోకి వచి్చన పిండితో బేకరీలు తెరుచుకున్నట్టు సహాయ బృందం వెల్లడించింది. గాజాలోకి మానవతా సాయంపై 11 వారాల దిగ్బంధాన్ని ఇటీవలే ఇజ్రాయెల్ పాక్షికంగా ఎత్తేసింది. అది ఏమాత్రమూ చాలదని, గాజా అత్యవసరాలతో పోలిస్తే సరఫరా చాలా తక్కువగా ఉందని ఐరాస ఆక్షేపించింది. సంఘర్షణకు ముందు గాజా రోజుకు సగటున 500 సహాయ ట్రక్కులు వచ్చేవి. ‘‘ప్రస్తుతం 140,000 టన్నులకు పైగా ఆహారం డెలివరీకి సిద్ధంగా ఉంది. మొత్తం గాజా జనాభాకు ఇది రెండు నెలల పాటు సరిపోతుంది. కానీ లోనికి ప్రవేశమే గగనంగా మారింది’’అని ప్రపంచ ఆహార కార్యక్రమం అధికారి ఒకరు తెలిపారు. గాజాలో ఇటీవల కాలంలో కనీసం 29 మంది పిల్లలు, వృద్ధులు ఆకలి చావుల పాలయ్యారు. 100కు పైగా ట్రక్కులను అనుమతించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది.ఐరాసను తప్పించే యోచన గాజాలో ఐరాస సహాయ వ్యవస్థను పూర్తిగా తప్పించేందుకు ఇజ్రాయెల్ యోచిస్తోంది. సహాయ సరఫరాలను హమాస్ మళ్లిస్తోందని ఆరోపిస్తోంది. ఐరాసను పక్కన పెట్టి అమెరికా మద్దతుతో ఇరు దేశాల సంస్థల ద్వారా సాయం అందిస్తామని ప్రతిపాదించింది. రెడ్‌క్రాస్‌తో సహా అంతర్జాతీయ మానవతా సంస్థలన్నీ ఆ ప్రణాళికను తిరస్కరించాయి. ఇజ్రాయెల్ ప్రతిపాదనకు ఒప్పుకుంటే సాయం రాజకీయ ప్రతీకారానికి మార్గంగా మారే ప్రమాదముందని ఆందోళన వెలిబుచ్చాయి.దాడులకు 107 మంది బలి గాజా అంతటా ఇజ్రాయెల్ వైమానిక దాడులు, క్షేత్రస్థాయి ఆపరేషన్లు నిరి్నరోధంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో వాటికి కనీసం 107 మందికి పైగా బలైనట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. డ్రోన్, వైమానిక దాడులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయని గాజా ఆరోగ్య శాఖ వాపోయింది. వాటిలో అల్ ఔదా ఆస్పత్రి తీవ్రంగా దెబ్బ తిన్నట్టు పేర్కొంది. మార్చి నుంచి దాదాపు 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిలో 1.61 లక్షల మంది గత వారం రోజుల్లోనే గాజా వీడారు. -
అర్థంలేని యుద్ధం చేయను
జెరూసలెం: ఇజ్రాయెల్ బందీల విడుదలపై స్పష్టత లేకుండా, గాజాలో పసిపిల్లల ప్రాణాలు తీస్తున్న అర్థం లేని యుద్ధం చేయలేనని ఆ దేశ సైనికాధికారి ఒకరు కుండబద్దలు కొట్టారు. అమాయక ప్రజల మరణాలు అంతులేని కొనసాగుతున్నాయి. ఓ రాజకీయ దృక్పథమంటూ లేని ఈ యుద్ధం చేయలేను’’అని కెప్టెన్ హోదాలో ఉన్న రాన్ ఫీనర్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు డేనియల్ యాహలోం అనే మరో సైనికుడు కూడా యుద్ధానికి నిరాకరించారు. దాంతో వారిని ఇజ్రాయెల్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. వారిద్దరూ ‘సోల్జర్స్ ఫర్ ది హోస్టేజెస్’అనే సంస్థలో పని చేస్తున్నారు. ఫీనర్ గాజాలో మూడు దశల క్రియాశీల పోరాటంలో పాల్గొన్నారు. దళాలకు నాయకత్వ బాధ్యతల్లో ఉన్నారు. తమ హమాస్ వద్ద ఇంకా బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిపించడం ప్రధాన లక్ష్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. గాజాను పూర్తిగా నేలమట్టం చేసి, హమాస్‌ను రూపమాపడమే లక్ష్యమని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ‘గాజా స్వా«దీన ప్రణాళిక’మేరకు పాలస్తీనియన్లను గాజా నుంచి పూర్తిగా వెళ్లగొట్టినప్పుడే యుద్ధం ముగుస్తుందన్నారు. దాంతో మళ్లీ యుద్ధ విధుల్లో చేరేందుకు ఫీనర్ నిరాకరించారు. గాజాలో జనం దుస్థితి చూడలేక ‘‘గాజాలో అంతులేని యుద్ధం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అమాయక ప్రజల అంతులేని మరణాలకు ఇది కారణమవుతోంది. మా ప్రభుత్వానికి ఓ దృక్పథం లేదు. గాజాలో ఎప్పటికీ అంతం కాని యుద్ధం సాగుతోంది. నేను దేశాన్ని ప్రేమిస్తున్నా. కానీ ఇక్కడ నా భవిష్యత్తు నా చేతి వేళ్లలోంచి జారిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రాధాన్యత జాబితాలో బందీలు అట్టడుగున ఉన్నారని ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించింది. గాజావాసులు ఆకలితో అలమటిస్తున్నారు. నా ప్లాటూన్‌లోని యోధులను వందల రోజుల పాటు రిజర్వ్ డ్యూటీకి పిలిచారు. వారిని ఇకపై విధుల్లో పాల్గొనేలా ఒప్పించలేను. ఈ దారుణ పరిస్థితులు మారనంత వరకు నేను నైతికంగా సేవలో కొనసాగలేను. ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా మారింది ఈ మతిలేని యుద్ధమే తప్ప విధి నిర్వహణకు నిరాకరించే నా లాంటి వ్యక్తులు కాదు. ప్రభుత్వ విధానం ఇజ్రాయెల్ విలువలను ప్రతిబింబించడం లేదు. మా ప్రభుత్వం నిజమైన దేశ రక్షణకు దోహదపడే పరిస్థితి తిరిగి వచి్చనప్పుడు తిరిగి నా సేవలందిస్తా’’అని ఫీనర్ వెల్లడించారు. -
గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) నిరంతరం తన దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ జరుపుతున్న తాజా సైనిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్(Gaza Strip)లో తాజాగా ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. వీటిని మే 17 నుంచి ప్రారంభించింది. ఈ దాడులలో వందలాది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. మే 14, 2025న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో 48 మంది మరణించారు. వీరిలో 22 మంది పిల్లలు ఉన్నారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్‌ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మూడు దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాగా ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీని వల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఐక్యరాష్ట్ర సమితి (యూఎన్ఓ) ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.ఖతార్‌లోని దోహాలో.. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ ఈ దీనిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్ నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి -
మరోసారి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 100 మంది మృతి
జెరూసలేం: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో మహిళలు, చిన్నారులు సహా 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. దాడుల్లో వందలాదిగా గాయపడ్డారని పేర్కొంది. గురువారం నుంచి కొనసాగుతున్న భీకర దాడుల్లో మొత్తం 250 మంది మృత్యువాతపడ్డారని ఆరోగ్య విభాగం వివరించింది.శనివారం అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఖాన్‌యూనిస్, ఉత్తర గాజా, జబాలియాలోని శరణార్థి శిబిరంలో మొత్తం 100 మంది మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 100 మందిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు చిన్నారులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి మొదలైన ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 53 వేల మందికి పైగా చనిపోయినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులేనని వివరించింది. క్షతగాత్రుల సంఖ్య లక్షల్లోనే ఉంటుందని పేర్కొంది. ఉత్తర, మధ్య గాజాలోని వారిని నివాసాలు, టెంట్లు విడిచిపెట్టి వెళ్లాలని హెచ్చరికలు చేస్తూ భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ కీలకమైన మరో ఆపరేషన్‌కు తెరతీసింది.లక్షిత ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ఆపరేషన్ ‘గిడియన్ చారియట్స్’ను తమ సైన్యం పూర్తి సామర్థ్యంతో కొనసాగిస్తుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. మరికొద్ది రోజుల్లోనే వేలాదిగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలో ప్రవేశించి ఆపరేషన్ మొద లుపెట్టనున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ ప్రకటనతో హమాస్ కాస్తంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా అన్ని అంశాలపైనా చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్‌తో చర్చలకు హాజరవుతామని తెలిపింది. అయితే, పాలస్తీనా ఖైదీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం సంపూర్ణ ఉపసంహరణ తమ కీలక డిమాండ్లని స్పష్టం చేసింది. -
ఖాన్‌యూనిస్ వాసులకు కాళరాత్రి
ఖాన్‌యూనిస్: గాజాలోని ఖాన్‌యూనిస్ నగర పాలస్తీనియన్లకు వరుసగా రెండో రోజు రాత్రి కూడా కాళరాత్రే అయ్యింది. ఇజ్రాయెల్ వైమానిక దళాలు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఖాన్యూనిస్తోపాటు గాజా నగరం, జబాలియాలపై యథేచ్ఛగా సాగించిన వైమానిక దాడుల్లో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. నక్బాకు 77 ఏళ్లవుతున్న వేళ ఈ దారుణాలు కొనసాగుతుండటంపై పాలస్తీనియన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఖాన్‌యూనిస్‌పై 10, జబాలియా, చుట్టుపక్కల ప్రాంతాలపై కనీసం 13 భారీ బాంబు దాడులు జరిగినట్లు మీడియా తెలిపింది. మొత్తం 59 చనిపోయారని స్థానిక పౌర రక్షణ దళాలు తెలిపాయి. కొన్ని మృతదేహాలు ఛిద్రమయ్యాయని పేర్కొన్నాయి. సరైన యంత్ర సామగ్రి లేకపోవడంతో శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను వెలికి తీయడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఖాన్‌యూనిస్‌పై జరిగిన దాడిలో ఖతార్ టీవీ ‘అల్ అరబీ’జర్నలిస్ట్ హసన్ సమౌర్ సహా అతడి కుటుంబంలోని 11 మంది చనిపోయినట్లు సోషల్ మీడియా పేర్కొంది. గాజాపై మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సాగించిన వైమానిక దాడుల్లో సుమారు 25 మంది చిన్నారులు సహా 70 వరకు ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. హమాస్‌ను తుదముట్టించాలన్న తమ మిషన్ మరికొద్ది రోజుల్లోనే పూర్తవనుందని, అప్పటి వరకు దాడులను ఆపేదిలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టం చేశారు. గాజాతోపాటు వెస్ట్‌బ్యాంక్‌లోని నగరాలు, టుబాస్, నబ్లుస్, బెత్లెహెం, కలండియా, యాబాద్, ఫవ్వర్, అస్కర్ శరణార్థి శిబిరాలపై గురువారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేపట్టాయి. ఇంటింటి సోదాలు, అరెస్ట్‌లను ముమ్మరం చేశాయి. ‘నక్బా’ ప్రాముఖ్యం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలస్తీనియన్లు ఏటా మే 15వ తేదీని నక్బా లేదా జాతి నిర్మూలన దినంగా పాటిస్తారు. పాలస్తీనా భూభాగం నుంచి 1948 మే 14వ తేదీన బ్రిటిష్ బలగాలు వైదొలగాయి. మే 15వ తేదీన ఇజ్రాయెలీలతో కూడిన జియోనిస్ట్ బలగాలు బ్రిటన్ దన్నుతో చారిత్రక పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్, గాజా స్ట్రిప్ మినహా 78 శాతం ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. ఇక్కడున్న 7.50 లక్షల పాలస్తీనియన్లను వెళ్లగొట్టి ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాయి. జియోనిస్ట్ మూకల మారణకాండలో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నగరాలు, పట్టణాలతోపాటు 530 పాలస్తీనా గ్రామాలు ధ్వంసమయ్యాయి. దారుణాలు జరిగిన మే 15ను పాలస్తీనియన్లు ‘నక్బా’గా ఏటా పాటిస్తారు. కూడు, నీడ కోల్పోయిన పాలస్తీనియన్లు గాజా, వెస్ట్ బ్యాంక్‌తోపాటు పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్, ఈజిప్టుల్లో ఏర్పాటు చేసిన 58 శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలోని 70 శాతం మంది శరణార్థులే. ఇంత సుదీర్ఘకాలంపాటు అపరిష్తృతంగా ఉన్న శరణార్థుల సమస్య ఇదే కావడం గమనార్హం. -
హమాస్ చెర నుంచి అమెరికా బందీ విడుదల
దెయిర్ అల్–బలాహ్: తమ చెరలో ఉన్న అమెరికా పౌరుడైన ఇజ్రాయెల్ సైనికుడు ఈడన్ అలెగ్జాండర్‌ను గాజాలోని హమాస్ సాయుధ సంస్థ సోమవారం రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ శ్రేణులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మెరుపుదాడి చేపట్టి వందలాది మందిని చంపడంతోపాటు 250 మందిని బందీలుగా పట్టుకుపోవడం తెల్సిందే. వీరిలో ఈడన్ సహా ఇప్పటికీ చెరలోనే ఉన్న 59 మందిలో 24 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు చెబు తున్నారు. పట్టుబడిన సమయంలో ఇతడు ఇజ్రాయెల్ సైన్యంలోని ఇన్ఫాంట్రీ విభాగంలో విధుల్లో ఉన్నాడు. దాదాపు 19 నెలలపాటు గాజాలో హమాస్ వద్ద సజీవంగా ఉన్న వారిలో అమెరికాకు చెందిన ఏకైక వ్యక్తి ఈడన్. ఈడన్ కోసం సురక్షిత కారిడార్ ఏర్పాటు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ట్రంప్ ప్రభుత్వంపై సాను కూల ధోరణితోనే ఈడన్ను వదిలిపెట్టినట్లు హమాస్ ప్రకటించింది. యుద్ధం ముగిసే దిశగా సానుకూల పరిణామమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. -
గాజాలో ఆకలి కేకలు
గాజా: ఇజ్రాయెల్ ఆర్మీ రెండు నెలలుగా కొనసాగిస్తున్న దిగ్బంధం గాజాలోని పాలస్తీనియన్లను ఆకలి చావుల ప్రమాదపుటంచుకు చేర్చింది. ఆహారం, నీరు, మందులు, ఇంధనం వంటి అత్యవసరాలను సైతం సైన్యం అడ్డుకోవడంతో సరఫరాల తో వస్తున్న ట్రక్కులు వందలాదిగా సరి హద్దుల్లోనే నిలిచిపోయాయి. తమ వద్ద ఉన్న సరుకుల నిల్వలు మరో రెండు వారాలకు మాత్రమే సరిపోతాయని గాజా ప్రజలకు ఆహారం అందిస్తున్న సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ లోగా ఇజ్రాయెల్ నిర్ణయం మా ర్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అలాకాని పరిస్థితుల్లో ఇప్పటికే అర్ధాకలితో అలమటిస్తు న్న లక్షలాది మంది పాలస్తీనియన్లకు ఆకలి చావు లు తప్పవని హెచ్చరిస్తున్నాయి. తమ వద్ద ఉన్న నిత్యావసర సరుకుల నిల్వలు పూర్తిగా అడుగంటాయని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం(యూఎన్ఆర్డబ్ల్యూఏ) తెలిపింది. మానవతా సాయం, పౌరుల ప్రాణాల విషయంలో బేరమాడటం సరైన విధానం కాదని ఐరాస మానవతా విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా ఐదేళ్లలోపు వయస్సున్న 3.35 లక్షల మంది చిన్నారులు మరణం అంచున ఉన్నారని యునిసెఫ్ ఇప్పటికే హెచ్చరించింది. ఇది యుద్ధ నేరమేనని, ఇంతటితో ఆపాలని అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిడులు వస్తున్నటికీ ఇజ్రాయెల్ లక్ష్యపెట్టడం లేదు. బందీలందరినీ హమాస్ విడిచిపెట్టేదాకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వైదొలిగేదాకా వెనక్కి తగ్గేది లేదని హమాస్ సైతం భీష్మించుకుంది. మటన్ బదులు కొషారి అమెరికన్ నియర్ ఈస్ట్ రెఫ్యూజీ ఎయిడ్(అనెరా) గాజాలో రెండు సామాజిక వంటశాలలను నడుపుతోంది. ఖాన్‌యూనిస్‌లో ని కమ్యూనిటీ కిచెన్ రోజుకు 6 వేల మందికి సరిపడా ఆహారం వండుతోంది. ప్రస్తు తం ఆకుకూరలు, బియ్యం, టమాటా సాస్‌లతో కూడిన కొషారి అనే వంటకాన్ని వండి వడ్డిస్తున్నామని నిర్వాహకుడు సమీ మ తార్ చెప్పారు. ఆహార నాణ్యతను పరీక్షించాకే పార్శిల్ చేస్తామని, ఒక్కో పార్శిల్లోని ఆహారం నలుగురికి సరిపోతుందని వివరించారు.మిగిలిన ఆహారాన్ని శరణార్థి శిబిరాలున్న అల్ మవాసీకి తరలించి, డజన్ల సంఖ్యలో ఉన్న సూపర్ వైజర్ల సాయంతో పంపిణీ చేస్తున్నామన్నారు. ‘గతంలో వారానికి వంద చొప్పున ట్రక్కుల్లో ఆహారం, మందులు ఇక్కడికి చేరేవి. ఈ ఏడాది ఆరంభంలో కాల్పుల విరమణ సమయంలో వచి్చన ఆహార పదార్థాలు, నిత్యావసరాలను నిల్వ ఉంచాం. దిగ్బంధనం కారణంగా ఆ నిల్వలు కరిగిపోయాయి. సరఫరా నిలిచిపో వడంతో స్థానిక దుకాణాలు మూతబడ్డాయి. దీంతో, ఎలాంటి ఆదాయ వనరు లు లేని వారు మేమందించే ఆహారంపైనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారు. వీరి కోసం గతంలో అన్నం, మాంసం వండే వాళ్లం. మాంసం దుకాణాలు మూతబడ్డాయి. బియ్యం, ఆకు కూరలు, పాస్టా, వంటనూనె, ఉప్పు వంటివి సైతం దొరక డం కనాకష్టంగా మారింది. గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వంట కోసం 700 కిలోల కట్టెలు కొంటున్నాం. వంట చెరుకు ధర సైతం పెరిగిపోయింది. సరుకుల కొరత కారణంగా వచ్చే రెండు వారాల్లోపే ప్రజలకు ఏకైక ప్రాణాధారమైన ఇక్కడి కిచెన్లన్నీ మూతబడే ప్రమాదముంది’అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతమున్న సరుకులు కూడా ఖర్చయిపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియడం లేదని మతార్ నిర్వేదంతో అ న్నారు. మానవతా సాయం నిల్వలను హమాస్ శ్రే ణులు దోచుకుంటున్నాయంటూ ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను మతార్ కొట్టిపారేశారు. ఇక్కడ ప్రతిదీ పారదర్శకంగా క్రమపద్ధతిలో జరుగుతోందని, బ యటి వ్యక్తుల ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. చిన్నారి ఆకలి చావు గాజా సిటీలోని రంటిసి హాస్పిటల్లో శనివారం జనన్ సలెహ్ అల్–సకఫీ అనే చిన్నారి కన్నుమూసింది. పోషహాకాహార లోపం, డీహైడ్రేషన్ ఆమె ఉసురు తీశాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదంతా ఇజ్రాయెల్ చేసిన పాపమేనని కుటుంబసభ్యులు దుమ్మె త్తి పోశారు. 63 రోజులుగా సాగుతున్న ఇజ్రా యెల్ దిగ్బంధనం ఫలితంగా కనీసం 57 మంది పాలస్తీనా బాలలు ఆకలి చావులకు గురయ్యారని గాజా ప్రభుత్వం తెలిపింది. రఫా సహా అన్ని సరిహద్దులను తెరిచి, గాజాలోని 24 లక్షల మంది పాలస్తీనవాసులకు మానవీయ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. -
రికార్డు స్థాయికి ప్రపంచ సైనిక వ్యయం
ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం భారీగా పెరిగింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ సంబంధాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రభుత్వాలు సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2024లో ప్రపంచ దేశాలు సైన్యానికి 2.7 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి. గాజా, ఉక్రెయిన్లపై యుద్ధం నేపథ్యంలో ముఖ్యంగా యూరప్, మధ్యప్రాచ్యంలో ఈ సైనిక వ్యయం అధికంగా పెరిగింది. తాజా వివరాలను స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి. 2023తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు 9.4 శాతం పెరిగింది. వరుసగా పదో సంవత్సరం కూడా సైనిక వ్యయంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. యూరప్‌లో ఊహించని పెరుగుదల యూరప్ దేశాల్లో (రష్యాతో సహా) సైనిక వ్యయంలో అధిక పెరుగుదల కనిపించింది. ఉక్రెయిన్‌లో యుద్ధం, నాటో కూటమి పట్ల అమెరికా నిబద్ధతపై సందేహాల మధ్య 17 శాతం పెరుగుదల నమోదైంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు సమయంలో సైనిక వ్యయాన్ని మించిపోయింది. ఇక రష్యా సైనిక వ్యయం 2024లో 149 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది 2023తో పోలిస్తే 38 శాతం పెరిగింది. ఇది రష్యా జీడీపీలో 7.1 శాతం. మొత్తం ప్రభుత్వ వ్యయంలో 19%. ఉక్రెయిన్ మొత్తం సైనిక వ్యయం 2.9 శాతం పెరిగి 64.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది రష్యా వ్యయంలో 43 శాతం కాగా, ఆ దేశ జీడీపీలో 34 శాతం. 2024లో అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశం ఉక్రెయిన్. రష్యా చేస్తున్న యుద్ధానికి ఉక్రెయిన్ ప్రస్తుతం తన పన్ను ఆదాయం మొత్తాన్ని సైన్యానికి కేటాయిస్తోంది. జర్మనీ కూడా సైనిక వ్యయాన్ని బాగానే పెంచింది. 28 శాతం పెరిగి, 88.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఇది భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో నాల్గో అతి పెద్ద దేశంగా నిలిచింది. పునరేకీకరణ తరువాత జర్మనీ ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. వ్యయాన్ని పెంచిన చైనా సైన్యానికి భారీగా ఖర్చు చేసే ప్రపంచంలోనే రెండో దేశమైన చైనా సైతం తన సైనిక బడ్జెట్‌ను పెంచింది. 7.0 శాతం పెరుగుదలతో చైనా సైనిక వ్యయం 314 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తన సైన్యాన్ని ఆధునీకరించడానికి, సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలు పెంచుకోవడానికి, అణ్వాయుధాల విస్తరణలో విస్తృతమైన పెట్టుబడులు పెడుతోంది. ఆసియా మొత్తం సైనిక వ్యయంలో సగం వాటాను చైనానే కలిగి ఉంది. తగ్గేదే లేదన్న అమెరికా ప్రపంచ పెద్దన్న అమెరికా కూ సైనిక వ్యయంలో వెనుకబడలేదు. మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికా వాటా 37 శాతం గమనార్హం. ఇక 2024లో మొత్తం నాటో వ్యయంలో 66 శాతం ఆమెరికా పెట్టుబడులే. 2024లో 5.7 శాతం పెంచడంతో ఆ దేశ సైనిక వ్యయం 997 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా నేతృత్వంలోని కూటమిలోని 32 సభ్యదేశాల మొత్తం సైనిక వ్యయం 1.5 ట్రిలియన్లకు పెరిగింది. 2025లో రక్షణకు అత్యధిక బడ్జెట్‌ను కేటాయించిన దేశాలు అస్థిర, సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు తమ శక్తిని, పలుకుబడిని చాటుకునేందుకు సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటున్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ డేటా ప్రకారం అమెరికా, చైనా, రష్యా, భారత్, సౌదీ అరేబియాలు తమ సైనిక శక్తికి అత్యధిక బడ్జెట్ కేయటాంచిన మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. యూఎస్ – 895 బిలియన్ డాలర్లు చైనా – 266.85 బిలియన్ డాలర్లు రష్యా – 126 బిలియన్ డాలర్లు భారత్ – 75 బిలియన్ డాలర్లు సౌదీ అరేబియా – 74.76 బిలియన్ డాలర్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘అమ్మా! ఇకపై నేను నిన్నెలా హత్తుకోనూ?
హేగ్: గాజాలో ఇజ్రాయెల్ దాడిలో రెండు చేతులు పూర్తిగా కోల్పోయిన పాలస్తీనా బాలుడి ఫొటోకి ఈ ఏడాది ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డు దక్కింది. న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన సమర్ అబూ ఎలౌఫ్ అనే పాలస్తీనా మహిళా ఫొటోగ్రాఫర్ మహ్మద్ అజ్జౌర్ అనే ఈ 9 ఏళ్ల బాలుడి ఫొటో తీశారు. తనకు రెండు చేతులూ లేవన్న విషయం తెలుసుకున్న వెంటనే ఆ బాలుడు మొట్టమొదటగా ‘అమ్మా, నేను నిన్నెలా కౌగిలించుకోను?’అని తనను ప్రశ్నించాడని అతడి తల్లి చెప్పడంతో తాను ఎంతో ఆవేదన చెందినట్లు సమర్ అబూ తెలిపారని వరల్డ్ ప్రెస్ ఫొటో ఆర్గనైజేషన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2024 మార్చిలో ఇజ్రాయెల్ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో అజ్జౌర్ భుజాల దిగువ నుంచి రెండు చేతులనూ కోల్పోయాడని వివరించింది. 68వ ఎడిషన్ పోటీ కోసం మొత్తం 141 దేశాల నుంచి 3,778 మంది ఫొటోగ్రాఫర్లు పంపిన 59,320 ఎంట్రీల నుంచి ఈ ఫొటోను ఎంపిక చేశామంది. ఈ ఫొటో ఎన్నో విషయాలను చెబుతుంది. ఒక బాలుడి గురించే కాదు, తరాలపాటు ప్రభావం చూపే ఒక యుద్ధం గురించి కూడా ఈ చిత్రం చెబుతుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెయిన్ ఖౌరీ తెలిపారు. ఫొటో జర్నలిజం చేసిన అద్భుతం ఈ చిత్రమని జ్యూరీ చైర్ లూసీ కొంటిసెల్లో పేర్కొన్నారు. -
ఆస్పత్రిపై బాంబుల వర్షం
డెయిర్ అల్–బలాహ్: గాజాపై క్షేత్రస్థాయి దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్.. ఆదివారం మరో దారుణానికి ఒడిగట్టింది. గాజాలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న అతి పెద్ద, చిట్టచివరి ఆస్పత్రి అల్–అహ్లిపై ఇజ్రాయెల్ ఆదివారం ఉదయం క్షిపణులతో దాడి చేసింది. రెండు క్షిపణి దాడుల్లో ఆక్సిజన్‌పై ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. ఆసుపత్రిలోని రెండంతస్తుల ప్రయోగశాల కూలిపోయింది. ఫార్మసీ, అత్యవసర విభాగ భవనాలు దెబ్బతిన్నాయి. సెయింట్ ఫిలిప్స్ చర్చి భవనం సహా చుట్టుపక్కల భవనాలకు కూడా నష్టం వాటిల్లింది. ఆస్పత్రిపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ భద్రతా దళాల నుంచి కాల్ రావడంతో రోగులను ఖాళీ చేయిస్తుండగానే ఘటన జరిగింది. భయాందోళనకు గురైన రోగులు వీధుల్లోకి పరుగెత్తారు. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన వారమైన పామ్ సండే నాడు ఇజ్రాయెల్ చేసిన దాడిని ఆస్పత్రిని నిర్వహిస్తున్న జెరూసలేం డయోసిస్ ఖండించింది. దాడి సమయంలో వందలాది మంది రోగులున్నారని తెలిపింది. రోగులకు ఆక్సిజన్ కూడా లేకుండా పోయిందని, వారు చనిపోతారనే ఆందోళనగా ఉందని తెలిపింది. మరో దాడిలో ఏడుగురు సోదరులు మృతి కొన్ని గంటల తరువాత, సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్–బలాహ్‌లో కారుపై జరిపిన ప్రత్యేక దాడిలో ఆరుగురు సోదరులు, వారి స్నేహితుడు మరణించారు. వారిలో 10 ఏళ్ల బాలుడు ఉన్నాడు. గాజాలోని పాలస్తీనియన్లకు ఆహారాన్ని పంపిణీ చేసే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న తన కొడుకులను చంపారని వారి తండ్రి ఇబ్రహీం అబూ మహదీ వాపోయారు. ఏం పాపం చేశారని తనపిల్లలను చంపారంటూ రక్తసిక్తమైన కారులో ఉన్న మృతదేహాలపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. గత 24 గంటల్లో 11 మంది చనిపోయారని, 100 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.హమాస్ కేంద్రంగా ఉపయోగిస్తున్నందుకే.. ఉగ్రవాద సంస్థ హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నందునే ఆయా ప్రాంతాలపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ముందస్తు హెచ్చరికలు అందించడం సహా పౌరులకు, ఆసుపత్రికి హాని కలిగించే అవకాశాలను తగ్గించడానికి చర్యలు తీసుకున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది. హమాస్‌ను తుదముట్టించాలంటే ఆస్పత్రులతో సహా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు అవసరమని ఇజ్రాయెల్ గతంలో పేర్కొంది. అయితే, తన వాదనలకు మద్దతు ఇచ్చే ఆధారాలను మాత్రం చూపలేదు. -
షుజాయా ఇళ్లపై ఇజ్రాయెల్ దాడి
గాజా: గాజాపై ఇజ్రాయెల్ మారణకాండను కొనసాగిస్తోంది. నగరంలోని షుజాయాలో బుధవారం ఇళ్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడుల్లో 35 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. 80 మంది జాడ తెలియడం లేదు. ఈ దాడుల్లో 10 భవనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షిపణుల దాడిలో కొంతమంది శిథిలాల కింద నలిగిపోయారు. భారీ విధ్వంసంతో ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. ప్రజల ఆర్తనాదాలు, కేకలతో ప్రాంతం మార్మోగింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర ప్రాంతాలైన రఫా, ఖాన్‌యూనిస్, డెయిర్ అల్–బలహాŠ, బెయిట్ హనూన్‌లపైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులు వెల్లువెత్తడంతో ఆస్పత్రులు, వైద్య సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సేఫ్‌జోన్‌గా పరిగణిస్తున్న అల్‌మవాసీని కూడా ఇజ్రాయెల్ వదల్లేదు. అక్కడ దాడులు తాము ఊహించలేదని బాధితులు వాపోతున్నారు. అయితే.. ఒక సీనియర్ హమాస్ నాయకుడిని లక్ష్యంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం దాడి తెలిపింది. అతని పేరు వెల్లడించలేదు. పౌరులకు హాని కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. గాజా భూముల్లో బఫర్‌జోన్ కోసం.. గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన నాటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులు పునఃప్రారంభించింది. ఇజ్రాయెల్ సైన్యం దాదాపు 1,500 మంది పాలస్తీనియన్లను చంపింది. వైమానిక దాడులతోపాటు క్షేత్రస్థాయిలో కూడా మారణహోమం సృష్టిస్తోంది. గాజా ప్రాంతాన్ని నేలమట్టం చేసి బఫర్ జోన్‌గా మార్చాలన్న ఆదేశాల ప్రకారం సైనికులు ముందుకెళ్తున్నారు. వ్యవసాయ భూములను, నివాస సముదాయాలను ధ్వంసం చేస్తున్నారు. అవసరమైతే అడ్డువచి్చనవారిపై కాల్పులు జరపాలన్న ఆదేశాలతో మారణకాండను కొనసాగిస్తున్నారు. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని జనసాంద్రత కలిగిన పాలస్తీనా నగరమైన రఫాను బఫర్‌జోన్‌గా మార్చాలని సైన్యం యోచిస్తున్నట్లు ఇజ్రాయెల్ వార్తాపత్రిక హారెట్జ్ బుధవారం నివేదించింది. నగరంలోని ప్రముఖ నివాస ప్రాంతాలపై దాడి చేసిన సైనికులు.. వైద్యులు సహా పౌరులను విచక్షణారహితంగా హతమార్చారు. అనేకమంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. గాజా స్ట్రిప్ మీదుగా తూర్పు నుంచి పడమరకు విస్తరించి ఉన్న ఖాన్ యూనిస్, రఫాల మధ్య ‘మోరాగ్ అక్షం’గా పిలిచే ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ నెల ప్రారంభంలో ప్రకటించారు. -
ఇజ్రాయెల్‌ను మెచ్చని అమెరికన్లు
వాషింగ్టన్: గాజా భూభాగంలో పాలస్తీనియన్లను పొట్టనబెట్టుకుంటూ, హమాస్ సాయుధులపై సమరభేరి మోగించిన ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తిస్థాయిలో ఆయుధ, ఆర్థికసాయం చేస్తుంటే మరోవైపు అమెరికన్లలో మాత్రం ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేక భావన రోజురోజుకూ పెరుగుతోంది. సంబంధిత వివరాలు ప్యూ రీసెర్చ్ పోల్‌లో వెల్లడయ్యాయి. 2022 మార్చిలో ఇజ్రాయెల్ పట్ల 42 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకత చూపిస్తే ఇప్పుడా వ్యతిరేకత 53 శాతానికి పెరిగింది. మరోవైపు విపక్ష డెమొక్రాట్లలో ఏకంగా 69 శాతం మంది ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత కనబరిచారు. 2022 ఏడాదిలో రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో 27 శాతం మంది ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత చూపగా ఇప్పుడు వారి సంఖ్య మరింత పెరిగింది. 50 ఏళ్లలోపు వయస్సున్న రిపబ్లికన్లలో దాదాపు సగం మంది ఇజ్రాయెల్ వైఖరిపై ధ్వజమెత్తారు. 2022లో డెమొక్రాట్లలో 53 శాతం మంది ఇజ్రాయెల్ పట్ల విముఖత వ్యక్తంచేయగా ఇప్పుడా వ్యతిరేకంగా 69 శాతానికి చేరిందని వ్యూ రీసెర్చ్ పోల్ వెల్లడించింది. ఈవారం అమెరికాలో ట్రంప్‌తో భేటీ కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వాషింగ్టన్కు రావడానికి కొద్దిరోజుల ముందు ఈ సర్వే చేపట్టారు. గాజాను స్వా«దీనం చేసుకోవడంపై... గాజాను స్వా«దీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచనలను అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరించిన తీరుపై అమెరికన్లలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ట్రంప్ వైఖరి ఇజ్రాయెల్‌కు అత్యంత అనుకూలంగా ఉందని 31 శాతం మంది భావిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్‌తో ట్రంప్ సమదూరం పాటిస్తున్నారని 29 శాతం మంది చెప్పారు. అయితే పాలస్తీనియన్లకు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడని కేవలం 3 శాతం మంది మాత్రమే చెప్పడం విశేషం. ఒకసారి స్వా«దీనం చేసుకుంటానని, మరోసా రి స్వా«దీనం చేసుకోబోనని, మరోసారి సుందర పర్యాటక క్షేత్రంగా మారుస్తానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలనుద్దేశిస్తూ అసలు ట్రంప్ భవిష్యత్ ప్రణాళిక ఏమిటో అర్థంకావట్లేదని 37 శాతం మంది చెప్పారు. గాజా స్ట్రిప్‌ను తన ఆ«దీనంలోకి తీసుకోవాలనే తన మునుపటి ప్రణాళికను ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ ఆలోచనను మెజారిటీ అమెరికన్లు స్వాగతించలేదు. 62 శాతం మంది అమెరికన్లు గాజాను అమెరికా స్వా«దీనం చేసుకోవాలనే ఆలోచనను చెత్తపనిగా అభివర్ణించారు. స్వా«దీనం చేసుకోవాలనే ట్రంప్ నిర్ణయాన్ని 49% మంది తీవ్రంగా వ్యతిరేకించారు. పాలస్తీనా ను దేశంగా ప్రకటిస్తే బాగుంటుందని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యవహారాలకు సంబంధించి నెతన్యాహు సరైన నిర్ణయాలే తీసుకుంటారన్న విశ్వాసం తమకు అస్సలు లేదని 52% మంది అమెరికన్లు చెప్పారు. అమెరికన్ యూదుల్లో 53% మంది సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. యూదు అమెరికన్ల భిన్న మనస్తత్వం గత కొంతకాలంగా అమెరికన్ యూదులు ఇజ్రాయెల్ ధోరణిని బాగా తప్పుబడుతున్నారు. ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థలో బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం కల్గజేసుకోవడాన్ని అమెరికన్ యూదులు విబేధిస్తున్నారు. న్యాయనియామకాల్లో ఇజ్రాయెల్ ప్రభుత్వ జోక్యం అనవసరమని వాళ్లు చెబుతున్నారు. అయితే గాజాలో హమాస్‌తో యుద్ధం విషయానికి వచ్చేసరికి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మెజారిటీ యూదు అమెరికన్లు మద్దతు పలుకుతున్నారు. ఏకంగా 73 శాతం మంది అమెరికన్ యూదులు ఇజ్రాయెల్ పట్ల సానుకూల దృక్పథం కనబరిచారు. ఇక క్రైస్తవుల్లో లెక్కిస్తే 53 శాతం మంది అమెరికన్ క్యాథలిక్‌లు ఇజ్రాయెల్‌కు మద్దతు పలకట్లేరు. శ్వేతవర్ణ ప్రొటెస్టాంట్లలో సైతం సగం మంది ఇజ్రాయెల్‌ను విమర్శిస్తున్నారు. అమెరికన్ ముస్లింలలో ఏకంగా 81 శాతం మంది ఇజ్రాయెల్ దండయాత్రను తీవ్రంగా తప్పుబట్టారు. -
యుద్ధం ఆగేనా? సుంకాలు మీకు ఓకేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) వివిధ దేశాలపై సుంకాలను విధించిన తరుణంలో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 7న జరగనున్న ఈ భేటీలో ఇరువురు నేతలు గాజా స్వాధీనం కోసం తుది యుద్ధ ప్రణాళికను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ త్వరలోనే గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోబోతోందని, ఇందుకు ట్రంప్ మద్దతుగా నిలుస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే అమెరికా సర్కారు కొత్తగా విధించిన సుంకాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ చర్చించనున్నారని సమాచారం.ట్రంప్ రెండవసారి అధ్యక్షుడైన తర్వాత వైట్ హౌస్‌లో నెతన్యాహు(Netanyahu)తో ఇప్పుడు రెండోసారి సమావేశమవుతున్నారు. ఈ సమావేశాన్ని వైట్ హౌస్ తో పాటు నెతన్యాహు కార్యాలయం ధృవీకరించాయి. హమాస్ తీవ్రవాదులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ గతకొంతకాలంగా గాజా స్ట్రిప్‌లోని నూతన భద్రతా కారిడార్‌లో సైన్యాన్ని మోహరిస్తున్న తరుణంలో ఇద్దరు నేతల మధ్య సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.గత నెలలో ఇజ్రాయెల్(Israel) కాల్పుల విరమణను ఉల్లంఘించి, అకస్మాత్తుగా గాజాపై బాంబు దాడి చేసింది. ఈ చర్యకు వైట్ హౌస్ మద్దతు పలికింది. కాగా బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశంలో సుంకాల సమస్య, ఇజ్రాయెల్-టర్కీ సంబంధాలు, ఇరాన్ నుండి పొంచివున్న ముప్పు తదితర అంశాలపై చర్చించనున్నట్లు నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బగత వారం గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణ భయంతో శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 16 మందికి పైగా పాలస్తీనా వాసులు చనిపోవడం గమనార్హం. ఈ తరుణంలో అమెరికా-ఇజ్రాయిల్ దేశాధినేతలు భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.ఇజ్రాయిల్ కు టారిఫ్ ఉపశమనం..అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు సంబంధించి ఇటీవల ప్రపంచ దేశాలపై సుంకాల విధించి షాకిచ్చిన ట్రంప్.. ఇజ్రాయిల్ పై 17 శాతం సంకాన్ని విధించారు. ట్రంప్ పలు దేశాలకు విధించిన సుంకాల పరంగా చూస్తే ఇజ్రాయిల్ కు కాస్త ఊరటనిచ్చినట్లే కనబడింది. భారత్ పై 26 శాతం సుంకాన్ని విధించిన ట్రంప్.. చాలా దేశాలపై 20 శాతం 49 శాతం వరకూ కూడా సుంకాలు విధించారు. ఇక్కడ ఇజ్రాయిల్ కు మాత్రం 17 శాతాన్ని సుంకాన్ని మాత్రమే విధించడంతో ఆ దేశంపై కాస్త ప్రేమ చూపించినట్లే అవగతమవుతుంది. సుంకాలకు సంబంధించి కూడా ఇజ్రాయిల్ తో డొనాల్డ్ ట్రంప్ చర్చించే అవకాశం ఉంది. ఒకవేశ ఇజ్రాయిల్ ఏమైనా గట్టిగా పట్టుబడితే దానిని కాస్త కుదించే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: West Bengal: నవమి వేడుకల్లో కత్తులు తిప్పిన బీజేపీ నేతలు -
Israel-Hamas War: గాజాపై మళ్లీ దాడులు..17 మంది మృతి
ఖాన్ యూనిస్: గాజాలోని దక్షిణ ప్రాంత ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం జరిపిన దాడిలో 17 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం స్థానికులు గాలిస్తున్నారు. హమాస్‌ను కట్టడి చేసేందుకు మరో సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయాలని నెతన్యాహూ ప్రభుత్వం పథక రచన చేసింది. ఇందులో భాగంగా పాలస్తీనియన్లను నివాసాలు వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. వారిని భయభ్రాంతులకు గురిచేసేలా దాడులకు పాల్పడుతోంది. అక్కడే ఉన్నవారిని వెళ్లగొట్టేందుకు ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయి. గాజాలోని వేర్వేరు ప్రాంతాలపై గురువారం ఇజ్రాయెల్ చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో 14 మంది చిన్నారులు కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొంది. -
'చిన్నారి జర్నలిస్టు'..! ఏకంగా యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ..
జర్నలిస్టు అంటే ఎవరు? ప్రపంచానికి వార్తలు అందించేవాడు. ప్రజలకు కీడు చేసే విషయాలను తెలిపి చైతన్యపరిచేవాడు. ప్రభుత్వాల దుర్మార్గాలను ఎండగట్టేవాడు. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం చేసే యుద్ధాలలో ఎంత విధ్వంసం జరుగుతుందో చూపేవాడు. జర్నలిస్టులు కొందరు ఆఫీసులో కూచుని పని చేస్తే మరికొందరు ఫీల్డులో ఉంటారు. ఆ ఫీల్టు యుద్ధ క్షేత్రమైతే ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పని చేస్తారు.ఇప్పుడు ఇజ్రాయిల్ గాజాపై యుద్ధదాడులు చేస్తోంది. ఇది టీవీల్లో మీరూ చూసి ఉంటారు. ఇజ్రాయిల్– గాజా మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో గాజాకు చెందిన 12 ఏళ్ల సుమయ్యా జర్నలిస్టు అవతారం ఎత్తింది. స్థానికంగా జరుగుతున్న అంశాల గురించి రిపోర్ట్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది.‘షిరీన్ అబూ’ అనే మహిళా జర్నలిస్టు కొంతకాలంగా గాజాపై జరుగుతున్న దాడుల గురించి అల్ జజీరా అనే ఛానెల్లో రిపోర్టింగ్ చేస్తూ ఉండేది. అయితే ఆమె మరణించింది. క్షేత్రస్థాయిలో ఆమె చెప్పే వార్తలు వింటూ ఉన్న సుమయ్యాకు ఆమె మరణం తీరని బాధను మిగిల్చింది. ఆమె ఆపిన పనని తాను పూర్తి చేయాలని భావించింది. వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ముందుగా వారు భయపడ్డారు. అప్పటికే వందమంది దాకా జర్నలిస్టులు యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ ప్రాణాలు వదిలారు. అంత అనుభవం ఉన్నవారికే అలా జరిగినప్పుడు తమ కూతురు యుద్ధరంగంలో ఏమవుతుందోనని వారు ఆందోళన చెందారు. అయితే సుమయ్యా వారికి ధైర్యం చెప్పింది. స్థానికంగా జరుగుతున్న విషయాలను ప్రపంచానికి చూపించడం తన బాధ్యత అని వారికి వివరించింది. వారి అనుమతితో జర్నలిస్టుగా మారింది. అల్ జజీరా ఛానెల్లో అతి చిన్న జర్నలిస్టుగా మారింది. గాజాపై జరుగుతున్న దాడులు, అక్కడి ప్రజల స్థితిగతుల్ని ప్రపంచానికి వివరించింది. ఏమాత్రం బెరుకు లేకుండా తను చెప్పే విషయాలు అందర్నీ ఆలోచింపజేశాయి. ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆగిపోవాలని, అంతా శాంతి నెలకొనాలని అంటోంది. అదే తన లక్ష్యమని, అందుకే ఈ రంగంలోకి వచ్చానని వివరిస్తోంది. తన ధైర్యానికి, ఆలోచనలకీ అందరూ శెభాష్ అంటున్నారు. (చదవండి: పిల్లలు స్కూల్ నుంచి రాగానే.. వారికి ఏం నేర్పిస్తున్నారు?) -
గాజాలో హమాస్‌కు బిగ్ షాక్..
ఇజ్రాయెల్-హమాస్ పరస్పర దాడులు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో పాలస్తీనియన్లు నిరసనలు తెలుపుతూ భారీ సంఖ్యలో రోడ్లకు మీదకు వచ్చారు. యుద్ధం ఆపాలంటూ నినాదాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణ భయంతో శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. దీనికి సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే, హమాస్‌కు వ్యతిరేకంగా నిరసనలకు ఎవరు నేతృత్వం వహించారు అనేది తెలియరాలేదు. టెలిగ్రామ్‌లో వచ్చిన సందేశాల ఆధారంగానే తాము ఆందోళనల్లో పాల్గొన్నామని నిరసనకారుల్లో కొందరు తెలిపారు. ఇదిలా ఉండగా.. 2007 నుంచి గాజాను హమాస్ పాలిస్తోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల కారణంగా యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 17 నెలల నుంచి ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం సాగుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు చేసిన దాడులకు 50 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 1.13 లక్షల మంది గాయపడినట్లు వెల్లడించింది.Large protests against Hamas's fascism in Gaza today, with thousands demanding dignity, an end to the war & destruction, and calling on the terror group to "get out." Listen to Palestinians in Gaza; cover these demonstrations; be their voice; amplify their cries. Down with Hamas! pic.twitter.com/c9iHyqvAO5— Ahmed Fouad Alkhatib (@afalkhatib) March 25, 2025ఈ యుద్ధం ప్రారంభం నుంచి గాజాలో హమాస్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ పొడిగింపును హమాస్ నిరాకరించింది. ఇటీవల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత వారం వ్యవధిలోనే మళ్లీ దాడులు మొదలుకాగా.. వీటిలో దాదాపు 673 మంది చనిపోయారు. దీంతో, ఇజ్రాయెల్ దాడులను మరింతగా పెంచడంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈనెల మొదట్లో గాజాలోకి మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో అక్కడి పరిస్థితులు మరింత క్షీణించాయి."Out, out, out! #Hamas get out!"#Gaza residents pour on the streets chanting slogans against the militant organization that ruled Gaza for 20 years.pic.twitter.com/af9PKVZDhg— Ahmed Quraishi (@_AhmedQuraishi) March 26, 2025 -
ఇజ్రాయెల్ దాడికి మరోమారు గాజా విలవిల
దేర్ అల్ బలా: గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులకు తెగబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) దక్షిణ గాజాలోని ప్రముఖ ఆస్పత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.⭕️A key Hamas terrorist who was operating from within the Nasser Hospital compound in Gaza was precisely struck.The strike was conducted following an extensive intelligence-gathering process and with precise munitions in order to mitigate harm to the surrounding environment as… pic.twitter.com/C3pZqlC6NO— Israel Defense Forces (@IDF) March 23, 2025అంతకుముందు దక్షిణ గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ నాయకునితో సహా 26 మంది పాలస్తీనియన్లు(Palestinians) మృతిచెందారు. ఖాన్ యూనిస్ నగరంలోని నాసర్ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తాజాగా దాడి జరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ నేపధ్యంలో పెద్ద సంఖ్యలో మృతులు, గాయపడిన వారిని నాసర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రిపై దాడిని ధృవీకరించింది. యాక్టివ్‌గా ఉన్న హమాస్ ఉగ్రవాదులపై దాడి జరిగిందని తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas war)లో ఇప్పటివరకూ 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక లక్షా 13 వేల మందికి పైగా జనం గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 673 మంది మృతిచెందారు. మృతుల్లో 15,613 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 872 మంది ఏడాది లోపు వయసు కలిగినవారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం 2023, అక్టోబర్ 7న ప్రారంభమైంది.ఇది కూడా చదవండి: కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస -
గాజా మృతులు 50 వేలు
డెయిర్ అల్–బలాహ్: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి బలైన వారి సంఖ్య 50 వేలు దాటింది! ఆదివారం గాజా ఆరోగ్య విభాగం ఈ మేరకు ప్రకటించింది. ‘‘మృతుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులే. 1.13 లక్షల మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా జనాభాలో 90 శాతం మంది నిలువనీడ కోల్పోయారు’’ అని ఆవేదన వెలిబుచ్చింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన తాజా వైమానిక దాడుల్లో హమాస్ రాజకీయ విభాగం సీనియర్ నేత సహా 23 మంది చనిపోయారు. ఖాన్‌యూనిస్ సమీపంలో దాడుల్లో పాలస్తీనా పార్లమెంట్ సభ్యుడు, తమ రాజకీయ విభాగం సభ్యుడు సలాహ్ బర్దావిల్, ఆయన భార్య చనిపోయినట్లు హమాస్ వర్గాలు ప్రకటించాయి. టెంట్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో వీరిపై దాడి జరిగిందని పేర్కొన్నాయి. హమాస్ రాజకీయ వ్యవహారాలపై తరచూ మీడియాకు బర్దావిల్ ఇంటర్వ్యూలిస్తుంటారు. ఖాన్ యూనిస్‌పై జరిగిన దాడిలో దంపతులతో పాటు వారి ఐదుగురు సంతానం చనిపోయారు. మరో దాడిలో దంపతులు, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయినట్టు యూరోపియన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో దాడిలో చనిపోయిన మహిళ, చిన్నారి మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కువైటీ ఆస్పత్రి నిర్వాహకులు చెప్పారు.మారణహోమమే హమాస్ సాయుధులు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి 1,200 మందిని చంపడం, 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధానికి దిగింది. ఆ ప్రాంతాన్ని శ్మశానసదృశంగా మార్చేసింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ రెండు నెలల ముచ్చటే అయింది. వారం రోజులుగా మళ్లీ గాజాపై దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. -
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 70 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం(Israeli army).. గాజాపై విధ్వంసకర దాడితో విరుచుకుపడింది. ఈ దాడిలో 70 మందికిపైగా ప్రజలు మృతిచెందివుంటారని సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం గాజాలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడి బుధవారం రాత్రి మొదలై గురువారం ఉదయం వరకు కొనసాగింది.ఈ భకర దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మృతిచెందారు. గాజాకు చెందిన వైద్యులు గురువారం ఈ సమాచారాన్ని మీడియాకు అందించారు. దక్షిణ గాజా పట్టణాలైన ఖాన్ యూనిస్, రఫా, బీట్ లాహియాలోని పలు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని వైద్యులు తెలిపారు. అయితే మొత్తం మరణాల సంఖ్య ఎంత అనేదీ వెల్లడించలేదు. అయితే ఉత్తర, దక్షిణ గాజాలో ఈ తెల్లవారుజామున జరిగిన దాడిలో 70 మందికి పైగా ప్రజలు మృతిచెందినట్లు అల్ జజీరా(Al Jazeera) వెల్లడించింది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ వారం రోజుల క్రితం విచ్ఛిన్నమైంది. నాటి నుండి ఇజ్రాయెల్ సైన్యం గాజాపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్.. గాజాపై భీకర దాడి చేసింది. ఈ దాడుల్లో 400 మందికి పైగా జనం మరణించారు. తమ బందీలను విడుదల చేయనందుకు హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో హమాస్‌పై భారీ దాడులు చేయాలంటూ తమ సైన్యాన్ని ఆదేశించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర , దక్షిణ గాజాలో దాడులకు దిగుతోంది. ఇది కూడా చదవండి: Parliament: నినాదాల టీ షర్టుతో ఎంపీ.. స్పీకర్ ఆగ్రహం -
కాల్పుల విరమణకు తూట్లు గాజాపై భీకర దాడులు
దెయిర్ అల్ బలా: పశ్చిమాసియాలో శాంతి యత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. గాజాలో ప్రశాంతత రెండు నెలల ముచ్చటగానే ముగిసింది. రంజాన్ మాసం ముగిసేదాకా సంయమనం పాటిస్తామన్న హామీని ఇజ్రాయెల్ తుంగలో తొక్కింది. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్ కోరిన మార్పులకు హమాస్ నిరాకరించడంతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కన్నెర్రజేశారు. ఆయన ఆదేశాలతో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మంగళవారం తెల్లవారుజామునే భారీ స్థాయిలో దాడులకు దిగింది.ఎడతెరిపి లేని బాంబుల వర్షంతో హమాస్ అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేసింది. గాజాలో హమాస్ ప్రభుత్వ సారథి ఇస్మాయిల్ అల్ దాలిస్తో పాటు అంతర్గత శాఖ సారథి మహమూద్ అబూ వటా్ఫ, అంతర్గత భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ బహజాత్ అబూ సుల్తాన్ తదితర అగ్ర నేతలు దాడుల్లో మృతి చెందారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. దాడులకు కనీసం 413 మందికి పైగా బలయ్యారని, 600 మందికి పైగా గాయపడ్డారని ప్రకటించింది. వారిలో చాలామంది బాలలేనని ఆవేదన వెలిబుచ్చింది.తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని, ఇంతకింతా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. తమవద్ద బందీలుగా ఉన్న 25 మందికి పైగా ఇజ్రాయెలీలకు తాజా దాడులు మరణశాసనమేనంటూ హమాస్ ప్రతినిధి ఇజ్జత్ అల్ రిషెక్ మండిపడ్డారు. ప్రమాదంలో పడ్డ తన సర్కారును కాపాడుకోవడానికి శాంతియత్నాలకు నెతన్యాహు ఉద్దేశపూర్వకంగానే తూట్లు పొడిచారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని ఘాటుగా స్పందించారు.తమ బందీలను సైనిక చర్య ద్వారానే విడిపించుకుంటామని ప్రకటించారు. హమాస్‌పై ఇక మరిన్ని సైనిక దాడులతో విరుచుకుపడతామని కుండబద్దలు కొట్టారు. తర్వాతి చర్యలపై అత్యున్నత స్థాయి భద్రతాధికారులతో మంగళవారం సాయంత్రం లోతుగా మంతనాలు సాగించారు. తాజా పరిణామాలతో గాజాలో శాంతియత్నాలకు తెర పడ్డట్టేనని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ తమను సంప్రదించిన మీదటే తాజా దాడులకు దిగిందన్న అమెరికా ప్రకటన కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.భూతల దాడులు! మంగళవారం నాటి దాడుల్లో డజన్ల కొద్దీ లక్ష్యాలను సమూలంగా ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాపై అతి త్వరలో భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. తూర్పు గాజాను ఖాళీ చేయాల్సిందిగా తాజా దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. వారంతా మధ్య ప్రాంతంవైపు వెళ్లాలని పేర్కొంది. మిగిలి ఉన్న హమాస్ నేతలను కూడా అంతం చేయడంతో పాటు దాని వనరులు, మౌలిక సదుపాయాలన్నింటినీ ధ్వంసం చేయడమే ఇకపై లక్ష్యమని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు.2023 అక్టోబర్ 7న హమాస్ సాయుధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి విచక్షణారహితంగా దాడులకు దిగడం తెలిసిందే. వందలాది మంది పౌరులను కాల్చి చంపడమే గాక 250 మందికి పైగా ఇజ్రాయెలీలను బందీలుగా తీసుకెళ్లారు. దానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ తెర తీసిన యుద్ధం 17 నెలలపాటు సాగింది. ఫలితంగా 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజా దాదాపుగా నేలమట్టమైంది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్, ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన శాంతి చర్చలు ఫలించి జనవరి నుంచి ఆరు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. 25 మంది బందీలను హమాస్, బదులుగా 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాయి. అది ముగిశాక రెండో దశ విరమణకు జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. తన వద్ద మిగిలిన 59 మంది ఇజ్రాయెలీ బందీలను వదిలేస్తానని, బదులుగా యుద్ధానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టి సైన్యం గాజా నుంచి పూర్తిగా వైదొలగాలని హమాస్ డిమాండ్ చేసింది. అందుకు ఇజ్రాయెల్ ససేమిరా అంది.హమాసే కారణం: అమెరికాఇజ్రాయెల్ తాజా దాడులను అమెరికా సమర్ధించింది. ఈ విషయమై ఇజ్రాయెల్ తమను ముందుగానే సంప్రదించిందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ వెల్లడించారు. ఉగ్రవాద చర్యలకు మూల్యం తప్పదంటూ హౌతీలతో పాటు హమాస్‌ను కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారని ఆమె గుర్తు చేశారు. తాజా పరిస్థితికి హమాసే కారణమని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి బ్రయాన్ హ్యూస్ ఆరోపించారు. -
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. స్పందించిన అమెరికా
ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) మరోసారి గాజాను లక్ష్యంగా చేసుకుంది. హమాస్ స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 200 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్- హమాస్(Israel-Hamas) మధ్య మొదటి దశ కాల్పుల విరమణ ముగిసిన సమయంలో.. రెండవ దశ చర్చలపై ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటారో అనే దానిపై సందేహాలు నెలకొన్న సమయంలో ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. ఈ దాడులపై అమెరికా గట్టిగా స్పందించింది.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్ గాజాలోని దేర్ అల్-బలాలోని మూడు ఇళ్లు, గాజా నగరంలోని ఒక భవనం, ఖాన్ యూనిస్, రఫాలోని పలు ప్రదేశాలపై దాడి జరిగింది. జనవరిలో ప్రారంభమైన మూడు దశల కాల్పుల విరమణ(Three-phase ceasefire)ను ఎలా కొనసాగించాలనే దానిపై ఇజ్రాయెల్- హమాస్ మధ్య విభేదాలు నెలకొన్నాయి ఈ నేపధ్యంలోనే హింస చెలరేగుతోంది. గత రెండు వారాలలో జరిగిన చర్చల్లో అమెరికా మద్దతు కలిగిన అరబ్ మధ్యవర్తులు ఇరు పక్షాల మధ్య విభేదాలను పరిష్కరించలేకపోయారు.ఇజ్రాయెల్ రెండవ దశ కాల్పుల విరమణకు వెళ్లే బదులు మొదటి దశ కాల్పుల విరమణ పొడిగింపుపై మొండిగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండవ దశ కాల్పుల విరమణలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా నుండి పూర్తిగా వైదొలగవలసి ఉంటుంది. ఇజ్రాయెల్ దీనిని కోరుకోవడం లేదు. హమాస్.. గాజాను విడిచిపెట్టే వరకు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా విడిచిపెట్టకూడదని అనుకుంటోంది. ఇజ్రాయెల్ రెండవ దశ కాల్పుల విరమణతో ముందుకు సాగడానికి ముందే హమాస్ గాజాను విడిచిపెట్టాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. అందుకే రెండవ దశ కాల్పుల విరమణకు బదులుగా, ఇజ్రాయెల్ మొదటి దశ కాల్పుల విరమణను పొడిగించాలని కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని హమాస్ మండిపడింది. తాజా దాడితో తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల ప్రాణాలను ప్రమాదంలోని నెట్టివేసిందని పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై అమెరికా స్పందించింది. గాజాపై దాడికి సంబంధించి నెతన్యాహు ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చిందని తెలిపింది. ఆ తరువాతనే దాడి చేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్‌తో సహా అమెరికాను భయపెట్టాలని చూస్తున్న హమాస్‌కు ఇదొక హెచ్చరిక అని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ పేర్కొన్నారు. గాజాను వదిలిపెట్టి వెళ్లాలని హమాస్‌ను ఇప్పుటికే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే, ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన హమాస్.. ఫలితం అనుభవిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: యెమెన్‌పై మరోమారు అమెరికా దాడి -
గాజా ప్లాన్‌పై ట్రంప్ రివర్స్ గేర్
వాషింగ్టన్: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వాధీనం చేసుకుని పునర్ నిర్మిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది కూడా. గాజాలో ఉన్న లక్షల మంది పాలస్తీనా ప్రజలు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా తరలి వెళ్లాల్సిందేనని అన్నారాయన. అయితే.. హఠాత్తుగా ఆయన యూటర్న్ తీసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శిథిలమైన గాజాను పునర్ నిర్మించే ప్రణాళికలో భాగంగా ఎవరినీ బహిష్కరించమని ట్రంప్ ఇప్పుడు అంటున్నారు. బుధవారం ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్(Micheál Martin)తో ఆయన వైట్‌హౌజ్‌లో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గాజా నుంచి బహిష్కరణలు ఉండబోవని అన్నారు. ఈ సందర్భంగా.. యూఎస్ సెనెట్ మైనారిటీ నాయకుడు చక్ షూమర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారాయన. గతంలో ఆయన(చక్ షూమర్) యూదుడైనప్పటికీ.. ఇప్పుడు మాత్రం పాలస్తీనియన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కిందటి నెలలో ఇదే అంశంపై ఆయన తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి చర్చకు దారి తీశారు కూడా. అయితే.. గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్ అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణతో పాటు హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. అయితే ట్రంప్ గాజా ప్లాన్‌ను ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) తిరస్కరించింది. ప్రతిగా.. ఈజిప్ట్ ప్రతిపాదిస్తున్న ప్రణాళికకు మద్దతు ఇచ్చింది.గాజా యుద్ధం.. మధ్యలో ఐర్లాండ్గాజాలో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఐర్లాండ్‌కు మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. గతంలో.. గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతకు పాల్పడుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా ఓ కేసు వేయగా.. అందులో జోక్యం చేసుకోవాలని ఐర్లాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగాకిందటి ఏడాది డిసెంబరులో ఐర్లాండ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు టెల్అవీవ్(ISRAEL) ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో ట్రంప్-మార్టిన్ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక.. భవిష్యత్తు గాజా పేరిట ట్రంప్ పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియోనూ సైతం ట్రంప్ విడుదల చేయగా అది తీవ్ర విమర్శలకు తావు ఇచ్చింది. హమాస్ సంస్థ సైతం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది. గాజా పాలస్తీనాలో విడదీయలేని భాగమని.. కొనుగోలు చేసి.. అమ్మడానికి అదేం స్థిరాస్తి కాదని ప్రకటించింది. అదే సమయంలో ఆ వీడియోను సృష్టించిన డిజైనర్.. అది కేవలం పొలిటికల్ సెటైర్ మాత్రమేనని ప్రకటన చేశాడు. -
ట్రంప్ ఎత్తుకు అరబ్ దేశాల పైఎత్తు
కైరో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వా«దీనం ప్రతిపాదనకు అరబ్ దేశాలు చెక్ పెట్టాయి. ‘మిడిల్ ఈస్ట్ రివేరా’విజన్‌కు భిన్నంగా గాజా పునర్నిర్మాణ ప్రణాళికను విడుదల చేశాయి. 53 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనను అరబ్నాయకులు ఆమోదించా రు. యుద్ధానంతర ప్రణాళికను ఈజిప్టు ప్రతిపాదించింది, దీని ప్రకారం పాలస్తీనా అథారిటీ (పీఏ) పరిపాలన కింద గాజా పునర్నిర్మాణం జరుగుతుంది. గాజాను అమెరికా అ«దీన ప్రాంతంగా మార్చేందుకు ట్రంప్ చేసిన ప్రణాళికకు ఇది కౌంటర్. ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి మద్దతు తెలిపిన మరుసటి రోజే కైరోలో అరబ్ లీగ్ సదస్సు జరిగింది. ముగింపు సమావేశంలో ఈ గాజా పునర్నిర్మా ణం కోసం ‘సమగ్ర అరబ్ ప్రణాళిక’ను ఆయా దేశా ల నేతలు ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రణాళికకు అంతర్జాతీయ మద్దతుకు పిలుపునిచ్చారు. భూభాగ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు కోసం అన్ని దేశాలు, ఆర్థిక సంస్థల నుంచి సహకారాన్ని స్వీకరిస్తామని పేర్కొన్నారు. 112 పేజీల డాక్యుమెంట్ పాలస్తీనియన్ల తరలింపు, గాజాను అమెరికా పునర్నిర్మించాలన్న ట్రంప్ ఆకాంక్షకు ప్రత్యామ్నాయంగా ఈజిప్టు, జోర్డాన్, గల్ఫ్ అరబ్ దేశాలు దాదాపు నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నాయి. గాజా నుంచి పాలస్తీనియన్లను సామూహికంగా తరలించడాన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి. తామే ఆ బాధ్యతలు తీసుకున్నాయి. ‘గాజా పునర్నిర్మాణ ప్రణాళిక’పేరుతో 112 పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించాయి. గాజాను తిరిగి ఎలా అభివృద్ధి చేయనున్నారనే మ్యాప్‌లు, ఇల్లు, ఉద్యానవనాలు, కమ్యూనిటీ సెంటర్లకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ చిత్రాలతో తయారు చేశారు. అలాగే వాణిజ్య నౌకాశ్రయం, టెక్నాలజీ హబ్, బీచ్ హోటళ్లు, విమానాశ్రయం కూడా ఉన్నాయి. స్వాగతించిన హమాస్..శిఖరాగ్ర సమావేశం ప్రణాళికను, సహాయక చర్యలు, పునర్నిర్మాణం, పాలనను పర్యవేక్షించడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హమాస్ తెలిపింది. అంతేకాదు.. కమిటీలో తమ అభ్యర్థులను ఉంచబోమని ప్రకటించింది. అయితే పీఏ పర్యవేక్షణలో పనిచేసే కమిటీ విధులు, సభ్యులు, ఎజెండాకు తన సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. కమిటీలో ఉండబోయే వ్యక్తుల పేర్లను నిర్ణయించినట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ మంగళవారం రాత్రి తెలిపారు. పీఏకు నాయకత్వం వహిస్తున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మాట్లాడుతూ ఈజిప్టు ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని, పాలస్తీనా నివాసితులను తరలించని ఇలాంటి ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని ఆయన ట్రంప్‌ను కోరారు. పరిస్థితులు అనుకూలిస్తే అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల ప్రణాళికను సైతం హమాస్ స్వాగతించింది. తిరస్కరించిన అమెరికా.. అరబ్ నాయకులు ఆమోదించిన గాజా పునర్నిర్మాణ ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది, ఈ భూభాగంలోని పాలస్తీనా నివాసితులను పునరావాసం కల్పిచి, అమెరికా యాజమాన్యంలోని ‘రివేరా’గా మార్చే తన పాత విజన్‌కే అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారని తెలిపింది. గాజా ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదని, శిథిలాలు, పేలని ఆయుధాలతో కప్పబడిన భూభాగంలో నివాసితులు జీవించలేరని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావడానికి మరిన్ని చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు. తోసిపుచ్చిన ఇజ్రాయెల్.. ఈజిప్టు ప్రణాళికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. కాలం చెల్లిన దృక్పథాలతో ఉందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రక టనలో విమర్శించింది. పీఏఐ ఆధారపడటా న్ని తిరస్కరించింది. ప్రణాళిక హమాస్‌కు అధికారాలిచ్చేదిగా ఉందని ఆరోపించింది. హమా స్ సైనిక, పాలనా సామర్థ్యాలను నాశనం చే యడమే తమ లక్ష్యమని, ముందు హమాస్ సై నిక ఉపసంహరణకు అంగీకరించేలా చేయాల ని డిమాండ్ చేసింది. అది తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. -
శిథిలాల మధ్యే ఇఫ్తార్
ఖాన్ యూనిస్: ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎటు చూసినా శిథిలాల నడుమే గాజావాసులకు రంజాన్ పవిత్ర మాసం మొదలైంది. చాలామంది ఆత్మియులను కోల్పోయారు. ఇళ్లు లేవు. సరైన తిండి లేదు. బతకుపై భరోసాయే లేదు. అయినా వారిలో ఆశ మాత్రం ఉంది.సగం కూలిన ఇళ్లలో, తాత్కాలిక గుడారాల్లోనే రంజాన్(Ramadan)ఉపవాసాలు పాటిస్తున్నారు. ఎన్నటికీ తిరిగిరాని తమ ఆత్మియులను పదేపదే తలచుకుంటూ ఇఫ్తార్(Iftar) టేబుళ్ల వద్ద కన్నీటి పర్యంతమవుతున్నారు. కూలగా మిగిలిన ఇళ్లకే దీపకాంతుల తోరణాలు కట్టి కోల్పోయిన వెలుగులను తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.గాజాలో చరిత్రాత్మక ప్రార్థనా స్థలం గ్రేట్ ఒమారీ మసీదు శిథిలావస్థకు చేరింది. దాంతో మతపరమైన ప్రార్థనలకు కేంద్ర స్థలమంటూ కూడా లేకుండా పోయింది. చాలాచోట్ల ప్రార్థనా స్థలాలన్నీ విధ్వంసమయ్యాయి. అయినా కూలిన భవనాలు, శిథిలాల మధ్యే పాలస్తీనావాసులు ఎన్నో ఆశలతో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పండుగ అంటే ప్రార్థనలు. రంజాన్ షాపింగ్. బంధువులతో వేడుక. ఈసారి అవన్నీ లేకపోయినా గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉందని గాజావాసులు అంటున్నారు! ‘‘తరువాత ఏం జరుగుతుందోనన్న భయం ఇంకా ఉంది. అయినా గతేడాది కంటే ఈసారి మెరుగే’’అని చెబుతున్నారు కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, వీధి వ్యాపారులు అడపాదడపా కనిపిస్తున్నా ఎవరిని చూసినా ఆర్థిక ఇబ్బందులే! నుసిరాత్‌లో హైపర్ మాల్ వంటి సూపర్ మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. కానీ దీర్ఘకాలంగా జీవనోపాధే కోల్పోయిన వారిలో కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనే సామర్థ్యం కూడా కన్పించడం లేదు! రంజాన్ ఏకం చేస్తోంది ధైర్యంగా మళ్లీ పాలస్తీనా గడ్డపై కాలు పెట్టగలిగినందుకే గర్వపడుతున్నామని గాజావాసులు చెబుతున్నారు. ప్రపంచంలోని అందరు పిల్లల్లాగే తమ చిన్నారులూ సగర్వంగా, ఆనందంగా జీవించాలని ఆశిస్తున్నారు. ‘‘ఈ రంజాన్ మాసం మా అందరినీ ఏకం చేసింది. ఇంతటి యుద్ధం మధ్య కూడా మాకు ఆనందాన్ని, ఆశను అందిస్తోంది. దాడుల్లేకుండా సురక్షితంగా జీవించడమే మా ఏకైక ఆకాంక్ష’’అని ఖాన్ యూనిస్‌కు చెందిన అబూ ముస్తఫా చెప్పుకొచ్చాడు.కువైట్ సాయం... దక్షిణ గాజా నగరం రఫాలో రంజాన్ ఉపవాసాలుంటున్న 5,000 మంది పాలస్తీనియన్లకు కువైట్ ఇఫ్తార్ భోజనాలు అందించింది. సూర్యాస్తమయం ప్రార్థన పిలుపుతో వారంతా మైళ్ల పొడవున శిధిలాల మధ్య ఏర్పాటు చేసిన బల్ల వద్ద గుమిగూడి అన్నం, చికెన్‌తో ఉపవాస దీక్షను విరమిస్తున్నారు. యుద్ధానికి ముందు ఆ వీధి రంజాన్ రోజుల్లో ఎంతగా కళకళలాడుతూ ఉండేదో ఇఫ్తార్ ఏర్పాట్లకు సహకరిస్తున్న మలక్ ఫదా భారంగా గుర్తు చేసుకున్నారు.‘‘నాటి రోజులే నాకిప్పటికీ స్ఫూర్తి! ఈ వీధికి యుద్ధానికి ముందు మాదిరిగా మళ్లీ జీవం పోయడమే నా లక్ష్యం’’అన్నారామె. ఇటు వ్యక్తిగతంగా, అటు సామూహిక నష్టాల నుంచి, యుద్ధం చేసిన గాయాల నుంచి కోలుకునేందుకు పాలస్తీనియన్లు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా గాజాను వీడేదే లేదని రఫా వాసి మమ్దౌ అరాబ్ అబూ ఒడే కుండబద్దలు కొట్టాడు. ఏం జరిగినా తామంతా ఐక్యంగా ఉన్నామని, ఉంటామని, తమ దేశాన్ని విడిచి వెళ్లబోమని స్పష్టం చేశాడు. -
గాజాకు సాయం ఆపేసిన ఇజ్రాయెల్
టెల్ అవీవ్: హమాస్‌తో కాల్పుల విరమణ తొలి దశ ఒప్పందం శనివారం ముగిసిన నేపథ్యంలో గాజాలోకి మానవతా సాయాన్ని నిలిపేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒప్పందాన్ని పొడిగించాలంటే తమ ప్రతిపాదనలకు హమాస్ ఒప్పుకుని తీరాలని షరతు విధించింది. అందుకు హమాస్ ససేమిరా అనడంతో గాజాలోకి నిత్యావసర వస్తువులు, ఔషధాలు, ఇతరత్రా సరకుల రవాణాను ఇజ్రాయెల్ బలగాలు ఆదివారం అడ్డుకున్నాయి. దాంతో మానవతా సాయానికి హఠాత్తుగా అడ్డుకట్టపడింది. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ సాయం ఆపేయం చౌకబారు బెదిరింపు చర్య. తద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడుతోంది. తొలి దశ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘిస్తోంది’’ అని ఆరోపించింది. అమెరికా ఆదేశాల మేరకే గాజాకు సాయాన్ని ఆపేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. రంజాన్ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 దాకా పొడిగించాలన్న అమెరికా అభ్యర్థనకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఆ మేరకు తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఒప్పందంలో తదుపరి దశకు వెళ్లకుండా తొలి దశను పొడిగించడాన్ని హమాస్ తప్పుబట్టింది. తమ బందీల్లో సగం మందిని హమాస్ విడుదల చేస్తేనే రెండోదశ కాల్పుల విరమణకు సిద్ధపడతామని ఇజ్రాయెల్ చెబుతోంది. రెండో దశ చర్చల వేళ మరింతమంది బందీలను వదిలేయాలని డిమాండ్ చేసింది. శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించి, ఇజ్రాయెల్ గాజా నుంచి వెనుతిరిగితేనే మొత్తం బందీలను వదిలేస్తామని హమాస్ తేలి్చచెప్పింది. -
గాజా నుంచి వైదొలగబోం
ఖాన్ యూనిస్: గాజాలో శాంతిస్థాపన ప్రక్రియ మళ్లీ డోలాయమానంలో పడింది. గాజాలోని ఫిలడెల్ఫీ తదితర వ్యూహాత్మక ప్రాంతాల నుంచి తమ సైన్యం వైదొలగే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ గురువారం కుండబద్దలు కొట్టింది. ఆయుధాల స్మగ్లింగ్ తదితరాల నిరోధానికి ఇది తప్పనిసరి పేర్కొంది. నలుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ అధికారి ఒకరు ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. దాంతో తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ముగియనున్న వేళ ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలు అనుమానంలో పడ్డాయి. ఒప్పందం మేరకు ఫిలడెల్ఫీ తదితర ప్రాంతాల నుంచి వైదొలిగే ప్రక్రియకు ఇజ్రాయెల్ శనివారమే శ్రీకారం చుట్టాల్సి ఉంది. చర్చలు ముందుకు సాగాలంటే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగాల్సిందేనని హమాస్‌తో పాటు చర్చల మధ్యవర్తి ఈజిప్ట్ కూడా స్పష్టం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. హమాస్ మాత్రం రెండో దశ కాల్పుల విరమణపై చర్చలకు సిద్ధమని ప్రకటించింది. తమ వద్ద బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ ఇజ్రాయెలీలు విడుదలవ్వాలంటే చర్చలకు, ఒప్పందానికి కట్టుబడి ఉండటమే ఇజ్రాయెల్ ముందున్న ఏకైక మార్గమని పేర్కొంది. కాల్పుల విరమణ నుంచి వెనక్కి తగ్గే ఏ ప్రయత్నమైనా బందీలకు, వారి కుటుంబాలకు మరింత నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ చెరలో ఉన్న 600కు పైగా పాలస్తీనా ఖైదీలు కూడా గురువారం తెల్లవారుజామున విడుదలయ్యారు. దాంతో ఖాన్ యూనిస్‌లో ఆనందం నెలకొంది. ఆరు వారాల తొలి దశ కాల్పుల విరమణలో భాగంగా హమాస్ ఇప్పటిదాకా 25 మంది ఇజ్రాయెలీ బందీలను, 8 మృతదేహాలను అప్పగించింది. బదులుగా దాదాపు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. రెండో దశపై ఫిబ్రవరి తొలి వారంలోనే చర్చలు మొదలవ్వాల్సి ఉండగా ఇప్పటిదాకా ఎలాంటి పురోగతీ లేదు. హమాస్ తాజాగా అప్పగించిన నలుగురు ఇజ్రాయెలీల మృతుల్లో ఒకరు 2023 అక్టోబర్ 7న దాడిలోనే చనిపోయారు. మృతదేహాన్ని హమాస్ మిలిటెంట్లు గాజాకు తరలించారు. మిగతా ముగ్గురు సజీవంగా అపహరణకు గురయ్యారు. వారి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. హమాస్ వద్ద కనీసం మరో 59 మంది ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నట్టు చెబుతున్నారు. వారిలో 32 మందికి పైగా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. -
వెస్ట్ బ్యాంక్‌పై పట్టు బిగించిన ఇజ్రాయెల్
కబాటియా: గాజాలో హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడిక వెస్ట్ బ్యాంక్‌పై దృష్టి సారించింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన రెండు రోజుల్లో భారీగా సైన్యాన్ని ఇక్కడికి తరలించింది. శరణార్థులుగా మారిన పాలస్తీనియన్లను తిరిగి వెస్ట్ బ్యాంక్‌లోకి అడుగుపెట్టకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌ను క్రమేపీ విస్తరిస్తూ వచ్చింది. వెస్ట్ బ్యాంక్ నుంచి తమపై దాడులు పెరుగుతున్నందున ఈ ప్రాంతం నుంచి మిలిటెన్సీని రూపుమాపడమే లక్ష్యమని అంటోంది. అయితే, ఇక్కడున్న 30 లక్షల మందిని సైనిక పాలన కిందికి తేవడమే ఇజ్రాయెల్ ఉద్దేశమని పాలస్తీనియన్లు అంటున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరుగుతోందని, వేలాది మందికి నిలున నీడ కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 40వేల మంది పాలస్తీనయన్లు జెనిన్ వంటి పట్టణ ప్రాంత శరణార్థి శిబిరాలను ఖాళీ చేసి వెళ్లిపోయారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. దీంతో, అక్కడ కనీసం ఏడాదిపాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలని మిలటరీకి ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. పాలస్తీనియన్లను తిరిగి అక్కడికి రానిచ్చేది లేదని, ఉగ్రవాదాన్ని పెరగనివ్వబోమని చెప్పారు. అయితే, ఎంతకాలం పాలస్తీనియన్లను అడ్డుకుంటారో ఆయన స్పష్టం చేయలేదు. ఇజ్రాయెల్‌పై సాయుధ పోరుకు కేంద్ర స్థానంగా ఉన్న జెనిన్లోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులను పంపించింది. 2002 తర్వాత ఇజ్రాయెల్ ట్యాంకులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో సొంతప్రాంతాలను వదిలిన శరణార్థుల వారసులే ఈ శిబిరాల్లో ఉంటున్నారు. కాగా, దీర్ఘ కాలంపాటు ఇజ్రాయెల్ ఆర్మీ వెస్ట్ బ్యాంక్‌లో తిష్టవేయడం 2000 తర్వాత ఇదే మొదటిసారని ఐరాస కూడా అంటోంది. గాజాలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో వెస్ట్ బ్యాంక్‌లో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఇజ్రాయెల్ కూడా ఈ ప్రాంతంపై పదేపదే దాడులకు పాల్పడింది. ఇక్కడ కనీసం 800 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మిలిటెంట్లేనని ఆర్మీ పేర్కొంది. అయితే, గాజాతోపాటు లెబనాన్‌లోనూ యుద్ధం జరుగుతున్నందున సంకీర్ణ పక్షాల నుంచి వచ్చిన ఒత్తిడుల కారణంగా ప్రధాని నెతన్యాహూ వెస్ట్ బ్యాంక్‌లో మిలిటెన్సీ అణచివేత చర్యలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. 1967లో జరిగిన యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఈ మూడు ప్రాంతాలను కలిపి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్నది పాలస్తీనియన్ల చిరకాల వాంఛ. -
హమాస్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం.. వారం రోజుల్లో..
టెల్అవీవ్:గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఏ క్షణమైనా తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఒప్పందం ప్రకారం హమాస్ తమ వద్ద ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను శనివారం వదిలిపెట్టినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం 620 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టలేదు. తమ దేశానికి చెందిన మిగిలిన బందీలను వదిలిపెట్టేదాకా ఎవరినీ విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది.పాలస్తీనా ఖైదీలను జైలు నుంచి బయటికి తీసుకువచ్చి తిరిగి జైలులోకే పంపించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఆరుగురు బందీల విడుదల సమయంలో హమాస్ వ్యవహరించిన తీరు క్రూరంగా,అవమానకరంగా ఉందని ఇజ్రాయెల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి కూడా ప్రకటించింది. శనివారం బందీలను విడిచిపెట్టే సందర్భంగా గాజాలో ప్రత్యేకంగా వేసిన స్టేజిపై వారిని ప్రదర్శించి వేడుకలాగా చేయడంపై ఇజ్రాయెల్ అభ్యంతరం తెలిపింది.పైగా బందీల వెంటే ఆయుధాలు పట్టుకున్న ఉగ్రవాదులు ఉండడం సరికాదని పేర్కొంది.తొలి విడత గాజా కాల్పుల విరమణ ఒప్పందం కాల పరిమిత మరో వారం రోజుల్లో ముగియనుంది.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి వేలాది మందిని చంపడంతో పాటు కొందరిని వారి వెంట బందీలుగా తీసుకెళ్లారు.అనంతరం ఇజ్రాయెల్ గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో 45 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. -
విడుదల చేయకుంటే నరకమే
జెరూసలెం: గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ హమాస్ విడుదల చేయకపోతే నరక ద్వారాలు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ‘‘గాజా విషయంలో ఇజ్రాయెల్, అమెరికాలకు ఉమ్మడి వ్యూహం ఉంది. ఈ వ్యూహం వివరాలను ప్రజలతో పంచుకోలేం. హమాస్ సైనిక, రాజకీయ ఉనికిని నిర్మూలించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నరకం గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయో వివరాలను తాము చెప్పలేం. బందీలందరినీ విడుదల చేయకపోతే మాత్రం అవి ఖచ్చితంగా తెరుచుకుంటాయి. గాజాలో హమాస్ సైనిక సామర్థ్యాన్ని, దాని రాజకీయ పాలనను అంతమొందిస్తాం. బందీలందరినీ స్వదేశానికి తీసుకొస్తాం. గాజా నుంచి మరోసారి ఇజ్రాయెల్‌కు ముప్పు వాటిల్లకుండా చూస్తాం’’అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదివారం జెరూసలెం నగరానికి చేరుకుని అక్కడ నెతన్యాహుతో సమావేశమయ్యారు. అధ్యక్షుడు ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనపై అరబ్ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని రూబియో పునరుద్ఘాటించారు. ‘‘హమాస్ సైనిక లేదా ప్రభుత్వ శక్తిగా కొనసాగదు. హమాస్ అధికారంలో ఉన్నంత కాలం శాంతి అసాధ్యం. దానిని నిర్మూలించలేదు’’అని ఆయన ఉద్ఘాటించారు. రూబియో గానీ, నెతన్యాహు గానీ గాజా కాల్పుల విరమణ నిబంధనలను ప్రస్తావించలేదు. ఇరాన్‌పై ప్రత్యేక దృష్టి.. గాజా పరిస్థితితోపాటు ఇరాన్ గురించి నెతన్యాహు, రూబియో ప్రత్యేకంగా చర్చించారు. పశ్చిమాసియా మొత్తం సంక్షోభానికి ఇరాన్ కారణమని రూబియో, నెతన్యాహు ఆరోపించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా ఆపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలోని ప్రతి ఉగ్రవాద సంస్థ వెనుక, ప్రతి హింసాత్మక చర్య వెనుక, ఈ ప్రాంతంలో లక్షలాదిమంది ప్రజల శాంతి, సుస్థిరతకు ముప్పు కలిగించే ప్రతి ఘటన వెనుక ఇరాన్ ఉంది’’అని రూబియో వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ మద్దతుతో మిగిలిన పనిని పూర్తి చేస్తాం’’అని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ దాడి బందీల మార్పిడి కొనసాగుతుండగా ఆదివారం ఈజిప్టు సరిహద్దులోని రఫా సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. దాడిలో ముగ్గురు హమాస్ సాయుధులు మరణించారు. ఈ దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఒప్పందాన్ని విచ్చిన్నం చేసేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని హమాస్ ఆరోపించింది. కాల్పుల విరమణ మొదటి దశ మరో రెండు వారాల్లో ముగియనుంది. రెండవ దశ కోసం చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది.త్వరలో పాలస్తీనియన్ల తరలింపు: ఇజ్రాయెల్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా నుంచి పాలస్తీనియన్ల సామూహిక తరలింపు త్వరలో ప్రారంభమవుతుందని తాను ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ అతివాద ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ శనివారం రాత్రి చెప్పారు. రాబోయే వారాల్లో ఇది ప్రారంభమవుతుందని ఆశిస్తున్నానన్నారు. ‘‘వచ్చే 10 నుంచి 15 ఏళ్ల వరకు గాజాలో పాలస్తీనియన్లకు ఏమీ ఉండదు. హమాస్ తిరిగి యుద్ధానికి ప్రయతి్నస్తే గాజా అంతా జబాలియా లాగా మరుభూమిగా మారడం ఖాయం’’అని మంత్రి బజాలెల వ్యాఖ్యానించారు. గాజా నుంచి పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా తరలించడం మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరమని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను అంతర్జాతీయ న్యాయస్థానం ఇప్పటికే పరిశీలిస్తోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కాగా, రెండు అంతర్జాతీయ ట్రిబ్యునళ్లను నెతన్యాహు తప్పుబట్టారు. అంతర్జాతీయ న్యాయస్థానంపై ఆంక్షలు విధించినందుకు ట్రంప్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన అంతర్జాతీయ న్యాయ సంస్థలపై మరిన్ని సంయుక్త చర్యలు తీసుకోవాలని సూచించారు. -
హమాస్‌ను నిర్మూలించాల్సిందే
జెరూసలేం: హమాస్‌ను గాజా నుంచి తుడిచిపెట్టాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో స్పష్టం చేశారు. సైనికపరమైన లేదా ప్రభుత్వాన్ని నడిపే శక్తిగా హమాస్ ఎంతమాత్రం కొనసాగనివ్వబోమని చెప్పారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంగా, పరిపాలనా శక్తిగా, హింసకు పాల్పడతామంటూ బెదిరించే వ్యవస్థగా హమాస్ ఉన్నంత కాలం శాంతి నెలకొనడం అసాధ్యం. అందుకే హమాస్‌ను నిర్మూలించకతప్పదు’’ అని కుండబద్దలు కొట్టారు. హమాస్‌పై పోరుకు అరబ్ దేశాల సాయం కూడా కోరుతామన్నారు. ఎవరూ ముందుకు రాకుంటే సొంతంగా ఇజ్రాయెలే ఆపని పూర్తి చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగడంపై అనుమానంగా మారింది. దాని గడువు రెండు వారాల్లో ముగియనుంది. రెండో దశలో మిగతా బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉండటం తెలిసిందే. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాపై దాడులకు దిగింది. వీటిలో తమ ముగ్గురు పోలీసులు చనిపోయినట్లు హమాస్ తెలిపింది. -
షెడ్యూల్ ప్రకారమే బందీలను విడుదల చేస్తాం
కైరో: ఇజ్రాయెల్ బందీల విడుదల విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని హమాస్ తేల్చిచెప్పింది. మందుగా ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారమే బందీలకు విముక్తి కల్పిస్తామని స్పష్టంచేసింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులు తమతో చెప్పారని వెల్లడించింది. ఈ మేరకు హమాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం చూస్తే మరో ముగ్గురు బందీలు శనివారం విడుదల కాబోతున్నారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుందని హమాస్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమాస్ కొద్దిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. గాజాలో షెల్టర్లు నిర్మించుకొనేందుకు, విదేశాల నుంచి మానవతా సాయం సరఫరాకు అనుమతి ఇవ్వకపోతే బందీల విడుదలను ఆలస్యం చేస్తామని ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం బందీలను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, గాజాపై మళ్లీ దాడులు ప్రారంభమవుతాయని హమాస్‌ను హెచ్చరించారు. దీంతో హమాస్ మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హమాస్ ఇప్పటిదాకా 21 మంది బందీలను విడిచిపెట్టింది. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం 730 మంది పాలస్తీనా ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసింది. -
ఘర్షణాత్మక ఆలోచన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చినప్పటినుంచీ మీడియాకు కావలసినంత మేత దొరుకుతోంది. వలసదారులను తిప్పిపంపటంలో ఆ దేశం ఎంత అమానుషంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నదో అందరూ చూశారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటానికి సిద్ధపడాలంటూ కెనడాను కోరటం, గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని తమకు అమ్మేయాలని డెన్మార్క్‌ను అడగటం, పనామా కాల్వను అప్పగించాలని తాఖీదు పంపటం వగైరాలన్నీ తెలిసీ తెలియక మాట్లాడే మాటలుగా అందరూ కొట్టిపారేశారు. గాజాను స్వాధీనం చేసుకుని దాన్ని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కలిసి గత బుధ వారం మీడియాకు చెప్పడాన్ని సైతం అలాగే భావించారు. సాక్షాత్తూ వైట్ హౌస్ ప్రతినిధే ట్రంప్ వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదంటూ తోసిపుచ్చారు. అదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్నారు. కానీ ట్రంప్ మరోసారి జూలు విదిల్చారు. గాజా స్ట్రిప్ అమెరికాకు కూడా చెందదట. తానే సొంతం చేసుకుంటారట. గాజా పౌరులు నివాసం ఉండటానికి చుట్టూ ఉన్న జోర్డాన్, ఈజిప్టు, సౌదీ, టర్కీ తదితర పశ్చిమాసియా దేశాల్లో ఆరుచోట్ల మెరుగైన కాలనీలు నిర్మిస్తారట. గాజా పౌరులకు ఇక తిరిగొచ్చే హక్కే లేదట. విధ్వంసం తప్ప నిర్మాణం సంగతి తెలియని దేశానికి ఇలాంటి ఆలోచన రావటం వెనకున్న వ్యూహం చిన్నదేం కాదు. తనకు 7,000 కిలోమీటర్ల ఆవల దాదాపు 25 లక్షలమంది నివసించే ఒక ప్రాంతాన్ని ‘సొంతం’ చేసుకోదల్చుకున్నట్టు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన అధినేత ఒకరు ప్రకటించారంటే అదెంత వైపరీత్యమో, అంతకుమించి మరెంత దుస్సాహసమో అర్థం చేసుకోవచ్చు. 2023 అక్టోబర్ మొదలుకొని గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేవరకూ ఇజ్రాయెల్ సైన్యాలు అక్కడ టన్నులకొద్దీ బాంబులు జార విడిచినా... దారుణ హింసను చవిచూపినా, పసిపిల్లలూ, స్త్రీలతో సహా 47,000 మంది పౌరులను హతమార్చినా, లక్షలమందిని గాయపరిచినా ఆ ప్రాంతం లొంగిరాలేదు. హమాస్ ఆనుపానులన్నీ తెలిశాయని ఇజ్రాయెల్ చెప్పుకున్నా, ఆ సంస్థ అపహరించిన పౌరులందరినీ విడిపించటంలో అది పూర్తిగా విఫలమైంది. చివరకు హమాస్‌తో కుదిరిన ఒడంబడికతోనే వారంతా దశలవారీగా విడు దలవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఎంత మతిమాలినదో అమెరికా పౌరులు గ్రహించాలి. యుద్ధాలన్నిటినీ అంతం చేస్తానని వాగ్దానాలిచ్చి పీఠం అధిష్టించిన అధినేత కొత్త కుంపట్లు రాజేయటంలోని మర్మమేమిటో నిలదీయాలి. అమెరికాతో చెట్టాపట్టాలేసుకున్న పశ్చిమాసియా దేశాలు మాత్రమే కాదు... భద్రతామండలి దేశాలన్నీ ట్రంప్ ప్రతిపాదనను ఖండించాయి. సుతిమెత్తగానే అయినా ‘ఇది యుద్ధాల యుగం కాద’ని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 1948లో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు ప్రాణప్రతిష్ఠ చేసి పాలస్తీనా పేరిట వదిలిన ఒక చిన్న ప్రాంతాన్ని సైతం ఇప్పుడు ట్రంప్ ఆక్రమిద్దామని చూస్తు న్నారు. అంతరంగంలో ఏమనుకున్నా ‘రెండు దేశాల’ ఏర్పాటే సమస్యకు పరిష్కారమని పైకి చెబుతూ వచ్చిన అమెరికా... ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తన నైజాన్ని బయటపెట్టుకుంది. పాలకులెవరైనా, పైకి ఏం చెప్పినా అమెరికా విధానాలు యుద్ధాలకూ, ప్రత్యేకించి ఇజ్రాయెల్‌కు అనుకూలమైనవే. చరిత్ర వరకూ పోనవసరం లేదు. గత 15 నెలలుగా గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నర మేథం అమెరికా ఆశీస్సులు లేకుండా జరిగే అవకాశం ఉందా? రష్యాను కవ్వించి కయ్యా నికి కాలు దువ్వమని ఉక్రెయిన్ను ప్రోత్సహించి ఓడిపోక తప్పని యుద్ధంలోకి దాన్ని దించిన ఘనత గత పాలకుడు జో బైడెన్‌ది. ఒకప్పుడు సోవియెట్ బూచిని చూపి ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలకు దిగిన అమెరికా ఇవాళ ప్రపంచ దేశాలన్నిటినీ శత్రువులుగా చూస్తోంది. వేరే దేశాల సరుకులపై భారీ సుంకాలు మోపుతూ, వాటిని దివాలా తీయించటం ఒకవైపు... ‘నచ్చిన ప్రాంతం’ సొంతం చేసుకుంటానంటూ మరోవైపు ప్రపంచాన్ని ట్రంప్ అస్థిరతలోకి నెడుతున్నారు. ఈ సంస్కృతినే రష్యా, చైనాలు కొనసాగిస్తే ఏం జరుగుతుందో ఆయనకు అర్థమవుతున్నట్టు లేదు. ప్రపంచ దేశాలన్నీ తన జాగీరుగా ఆయన భావిస్తున్నారు. పొట్టచేతబట్టుకు వచ్చిన వలసదారులను అమెరికాలో నేరస్తు లుగా పరిగణించే ట్రంప్ తన విస్తరణవాద కాంక్షను ఏమనాలో, అందుకు శిక్షేమిటో చెప్పాలి. అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన జోర్డాన్, ఈజిప్టులు రెండూ ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 ట్రంప్ హుంక రింపులను తట్టుకుని నిలబడగలరా? అనుమానమే. ఎందుకంటే అమెరికానుంచి సైనిక, ఆర్థిక సాయం పొందుతున్న దేశాల్లో జోర్డాన్ది మూడో స్థానం. ఆ దేశానికి ఏటా 1,700 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుతుంది. 1,500 కోట్ల డాలర్లతో తర్వాతి స్థానం ఈజిప్టుది. అమెరికా నుంచి 17,200 కోట్ల డాలర్ల సాయం పొందుతూ ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రథమస్థానంలో వున్నా అదెంతో కాలం సాగకపోవచ్చు. 3,300 కోట్ల డాలర్లతో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. ట్రంప్‌కు మోకరిల్లితే ఈజిప్టు, జోర్డాన్ ప్రజలు మౌనంగా ఉండరు. ఇప్పటికే గాజా శరణార్థులతో నిండివున్న ఆ దేశాల్లో మరింతమందిని తీసుకొస్తామంటే ఆగ్రహజ్వాలలు మిన్నంటుతాయి. అందుకే అక్కడి పాలకుల స్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది. గాజాను పునర్నిర్మించాల్సిందే. సర్వం శిథిలమైన చోట మెరుగైన ఆవాసాలు ఏర్పాటు కావాల్సిందే. కానీ అదంతా అక్కడి పౌరుల చేతుల మీదుగా జరగాలి. అమెరికాతో సహా బయటి దేశాలకు అక్కడ కాలుమోపే హక్కులేదు. -
దక్షిణాఫ్రికాతో కయ్యానికి కారణాలేంటి?
కొత్తగా దక్షిణాఫ్రికాతో తగువు ప్రారంభించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అందుకు ఆరంభం ఫిబ్రవరి 3న జరిగింది. దానికి ఆయన చెప్తున్న కారణాలు మూడు: ఒకటి, అక్కడి శ్వేతజాతీయుల భూములను సిరిల్ రామఫోసా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్నది. రెండు– తెల్లవారిపట్ల వివక్ష చూపుతున్నది. మూడు– అమెరికాపై, దాని మిత్ర దేశాలపై అంతర్జాతీయంగా వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నది. ఇవిగాక, తెల్లవారి విషయంలో ‘చాలా చెడ్డ పనులు చేస్తున్నది’ అని కూడా అన్నారాయన. దక్షిణాఫ్రికాలోని తీవ్ర వాద శ్వేతజాతీయుల సంస్థలు కొన్ని తమపై ‘సామూహిక హత్యా కాండలు సాగుతున్నట్లు’ 1994లో అక్కడ వర్ణ వివక్ష (అపార్థీడ్’) ముగిసినప్పటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. ‘చెడ్డ పనులు’ అనటంతో ట్రంప్ ఉద్దేశం అదేనేమో తెలియదు.భూమి చట్టంతో మొదలు...ఈ విధమైన ఆరోపణలు చేసిన అమెరికా అధ్యక్షుడు ఆ విషయమై విచారణలు చేస్తున్నామనీ, అవి నిజమైతే దక్షిణాఫ్రికాకు తమ సహాయాన్ని నిలిపి వేయగలమనీ హెచ్చరించారు. ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకోవటం వేరు. అంతకన్నా ముందే సహాయం ఆపివేయటం వంటి చర్యలు మొదలై పోయాయి. జీ–20కి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రామఫోసా త్వరలో జొహాన్నెస్‌బర్గ్‌లో నిర్వహించనున్న శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనబోవటం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ప్రకటించేశారు. హెచ్ఐవీ చికిత్సల కోసం తాము చేసే ఆరోగ్య సహాయాన్ని ట్రంప్ ఆపివేశారు. దక్షిణాఫ్రికాలోనే పుట్టి పెరిగిన ట్రంప్ ముఖ్య సలహా దారు ఎలాన్ మస్క్, ట్రంప్ తరహా ఆరోపణలు, హెచ్చరికలు రెండు రోజులకొకసారి చేస్తున్నారు. దక్షిణాఫ్రికా శరణార్థుల కోసం శిబిరాలు సిద్ధం చేయాలంటూ ట్రంప్ తమ అధికారులను ఆదేశించారు కూడా! మరొకవైపు, అమెరికా అధ్యక్షుని ఆరోపణలలో ఎంతమాత్రం నిజం లేదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు తోసిపుచ్చారు. ఆఫ్రికాలోగల తీవ్రమైన భూమి సమస్యల దృష్ట్యా ‘నిరుపయోగం’గా ఉన్న భూముల స్వాధీనానికి రామఫోసా ప్రభుత్వం గత నెల ఒక చట్టం చేసింది. నిజానికి ఇటువంటి చట్టాన్ని స్వయంగా అమెరికా కూడా 5వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన విషయాన్ని రామఫోసా గుర్తు చేస్తున్నారు. ఇండియా మొదలైన అనేక దేశాలలోనూ ఈ చట్టాలు న్నాయి. ఇక తెల్లవారి పట్ల వివక్షలు, హత్యాకాండలున్నట్లు వారి సంస్థలు ఆరోపణలు చేయటం మినహా ఎటువంటి ఆధారాలూ చూపటం లేదు. ఈ మాట రామఫోసా ప్రభుత్వమే కాదు, దక్షిణాఫ్రి కాకు చెందిన ప్రజాస్వామిక శ్వేతజాతి వర్గాలు, పార్టీలు, పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు అంటున్నదే! అట్లాంటి దేమీ లేదని నేను స్వయంగా అక్కడికి వెళ్లినపుడు గమనించాను.అటువంటి స్థితిలో ట్రంప్ విపరీత వైఖరికి కారణమేమిటి? ప్రధానంగా ఆయన శ్వేతజాతి దురహంకారి కావటమనిపిస్తున్నది. తను మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు (2017–21) కూడా రక రకాల ఆరోపణలు చేశారు. అప్పటికి దక్షిణాఫ్రికాలో ఈ చట్టం లేదు. దక్షిణాఫ్రికాకు చెందిన శ్వేతజాతి తీవ్రవాద సంస్థలు తరచుగా అమె రికా సహా పాశ్చాత్య దేశాలకు వెళ్లి లాబీయింగ్‌లు చేస్తుండేవారు. వారి వాదనలను డెమోక్రాట్లు, రిపబ్లికన్ల ప్రభుత్వాలు పట్టించు కోలేదు. తమ వంటి లక్షణాలు గల ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వా తనే అందుకు విలువ ఇస్తున్నారు. ఇందుకు ఈసారి మరొక మూడు కారణాలు చేరాయి. ఒకటి– గాజాలో ఇజ్రాయెల్ మారణ కాండపై ప్రపంచంలో మొదట దక్షిణాఫ్రికాయే చొరవ తీసుకుని అంతర్జా తీయ న్యాయస్థానం (ఐసీజే)లో కేసు వేయటం. రెండు– అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి బహుళ ధ్రువ ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్న బ్రిక్స్ కూటమిలో దక్షిణాఫ్రికా భాగస్వామి కావటం. మూడు– ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీలో 30 శాతం భాగస్వామ్యాన్ని స్థానిక నల్లవారికి ఇవ్వాలన్న షరతు. వాస్తవానికి ఇటువంటి భాగ స్వామ్య నిబంధన అక్కడి టెలికాం లైసెన్సింగ్ చట్టంలో గతం నుంచి ఉంది. తనను మినహాయించాలన్నది మస్క్ వాదన. దానిని ట్రంప్ బలపరుస్తున్నారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వంనిరాకరిస్తున్నది.అన్నీ ఉన్నా వివక్షేనా?పోతే, 1994లో అపార్థీడ్, శ్వేతజాతి పాలన ముగిసిన 30 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఇటువంటి భూమి చట్టం ఎందుకు చేయవలసి వచ్చిందన్నది అర్థం చేసుకోవలసిన విషయం. యూరోపియన్లు దక్షిణాఫ్రికాకు రావటం 1600వ సంవత్సరంలో మొదలు కాగా, వారు భూములను అత్యధిక భాగం ఆక్రమించుకున్నారు. వేర్వేరు యూరోపియన్ల మధ్య కూడా కొంతకాలం ఆధిపత్య యుద్ధాలు జరగగా చివరకు అందరూ కలిసి 1948లో శ్వేతజాతి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంతకుముందే 1913, 1936లో భూమి చట్టాలు చేసి, మొత్తం భూములలో 87 శాతం తెల్లవారికి రిజర్వ్ చేశారు. ఆ పరిస్థితి 1994లో నల్లవారి ప్రభుత్వం ఏర్పడినా కొనసాగుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే, వివిధ కారణాల వల్ల ఆఫ్రికన్ రైతుల కొద్దిపాటి భూములు కూడా క్రమంగా శ్వేతజాతీయుల పరం కాసాగాయి. ఇది నేను అక్కడి ప్రభుత్వ రికార్డులను బట్టి స్వయంగా గమనించిన విషయం. ట్రంప్ తన ప్రకటనలో, తెల్లవారిలోని ఆఫ్రికానర్ల ప్రస్తావన ప్రత్యేకంగా చేశారు. హాలండ్, ఫ్రాన్స్ నుంచి వలస వచ్చిన జాతీయులను ‘ఆఫ్రికానర్లు’ అంటారు. అక్కడి జనాభాలో వారి శాతం కేవలం నాలుగు. భూములలో అధిక భాగం, ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన భాగం వారి అధీనంలోనే ఉన్నాయి. అయినా వివక్ష అని మాట్లాడతారు. ఉదాహరణకు అక్కడ నేనుమౌంటేన్ ఫాక్స్ అనే పేరిట గల డచ్ వారి వ్యవసాయ క్షేత్రాన్ని చూశాను. ఆ కుటుంబానికి 740 ఎకరాలకు పైగా ఉంది. సొంత వైన్ యార్డ్, అందులో పండించే ద్రాక్షతో సొంత బ్రాండ్ సారాయి ఉన్నాయి. కొన్ని వాహనాలతో రవాణా కంపెనీ ఉంది. ఒక మధ్య తరహా హోటల్, ఒక బొటిక్ ఉన్నాయి. అయినా తమ ఆఫ్రికానర్ల పట్ల వివక్ష ఉందని వాపోతూ హాలండ్‌కు తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు కారణం? తమ పిల్లవాడు ఇంజనీరింగ్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం వెళితే, అక్కడి కోటాల ప్రకారం ఆ ఉద్యోగం ఒక నల్లవాడికి ఇచ్చారట! అదీ వారనే వివక్ష. ఒక్కొక్కరి వద్ద వేలాది ఎకరాలుండటాన్ని, రహదారుల వెంట ఎంతదూరం వెళ్లినా కంచెలు వేసి పడావు పడటాన్ని చూశాను. పేదరికం వల్ల కొద్దిపాటి భూములు కూడా అమ్ముకుని నగరాలకు వలస వస్తూ చిల్లర పనులతో జీవిస్తున్న నల్లవారినీ కలిసి మాట్లాడాను.ఈ పరిస్థితులలో నల్లవారికి భూమి అన్నది తీవ్రమైన సమస్యగా ఉండిపోయింది. దానితో ముడిబడిన పేదరికం వల్ల అసంతృప్తి పెరుగుతున్నది. 30 ఏళ్ల తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) మొదటిసారిగా సొంత మెజారిటీ కోల్పోవటానికి ఇది ఒక ప్రధాన కారణం. అందువల్ల రామఫోసా ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటం అనివార్యమైంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు దక్షిణాఫ్రికా ‘మానవ హక్కులను హరిస్తున్న’దనే గొప్ప మాట అన్నారు. అపార్థీ డ్‌ను అమెరికా ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గాజా, కెనడా, గ్రీన్లాండ్, పనామా వంటి ఇతర దేశాలను ఆక్రమించుకోగలమని బాహాటంగా ప్రకటించే ట్రంప్, తెల్లవారి భూమి హక్కులంటూ ఇంతగా మాట్లాడటాన్ని బట్టి ఆయన తత్త్వం అర్థం చేసుకోవచ్చు.అయితే, తాము బెదిరి లొంగబోమనీ, తమ ప్రజలకు అవసర మైంది చేస్తామనీ రామఫోసా తమ పార్లమెంటులో స్పష్టం చేశారు. ఆ దేశం ఆఫ్రికా ఖండంలో పారిశ్రామికంగా అన్నింటికన్నా పెద్దది. బ్రిక్స్ కూటమిలో ప్రముఖ దేశం. ఇప్పటికే ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా ఖండాల దేశాలతో తగవుకు దిగిన ట్రంప్, ఆఫ్రికాలోనూ అదే ధోరణి చూపటం వల్ల అంతిమంగా అమెరికాకు కలగగల నష్టాల గురించి ఆలోచిస్తున్నట్లు లేదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శనివారం డెడ్‌లైన్
వాషింగ్టన్: గాజా స్ట్రిప్‌లో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలు, ఇతర దేశస్తులను శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా విడుదల చేయకపోతే హమాస్ అంతుచూస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి బందీలను విడుదల చేసి తీరాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, అందుకు ప్రతిగా బందీల విడుదల ప్రక్రియ ఆలస్యం కావొచ్చని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు.వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఒకటి, మూడు, నాలుగు, రెండు ఇలా కాదు.. మొత్తం బందీలందరినీ విడుదల చేయాలి. శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా బందీలు అందరూ విడుదలై మా చెంతకు చేరాలి. లేదంటే హమాస్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తాం. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుచేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశిస్తా’’ అని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ అది వాళ్ల ఇష్టం. నా వరకైతే బందీలను విడుదల చేయకుంటే వాళ్ల పనిపడతా. ఇక కాల్పుల విరమణ అంశంలో వాళ్ల కోణంలో తుది నిర్ణయం ఇజ్రాయెల్‌దే. బందీలను విడుదలచేయకపోతే నా మాటల్లోని తీవ్రత ఎంత అనేది హమాస్‌కు తెలిసేలా చేస్తా’’ అని అన్నారు.ఆలస్యంపై ఇజ్రాయెల్ ఆగ్రహంకాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందుకే బందీలను ఆలస్యంగా వదిలేస్తామన్న హమాస్ ప్రకటనను ఇజ్రాయెల్ తీవ్రంగా తప్పుబట్టింది. ఒప్పందాన్ని ఉల్లంఘించింది హమాసేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భద్రతా కేబినెట్‌తో సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నా నికల్లా బందీలను వదిలేయకుంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ హమాస్‌కు అల్టిమేటమిచ్చారు. మరోవైపు బందీల విడుదల నిలిపివేత ప్రకటన నేపథ్యంలో వారి కుటుంబాలు, మద్దతుదారులు టెల్ అవీవ్ లో ఆందోళనకు దిగారు. ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్టు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. 42 రోజుల ఒప్పందంలో మొదటి దశలో విడుదల కానున్న 33 మంది బందీల్లో 16 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. ఐదుగురు థాయ్ బందీలను కూడా అనధికారికంగా విడుదల చేశారు. -
హమాస్, గాజాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్టు కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు.పాలస్తీనాకు చెందిన గాజాపై డొనాల్డ్ ట్రంప్ తన మనసులోకి మాటను బయట పెట్టారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా ఆధ్వర్యంలో గాజాను పునర్ నిర్మించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఇందు కోసం గాజాను కొనుగోలు చేసి సొంతం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఇతరులకు కూడా అప్పగించవచ్చు. ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాం. హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై గాజా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతకుముందు కూడా గాజాపై ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి, అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి, భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతమున్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చు. తుపాకీ కాల్పులు, ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధర సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.ఈ మాటలపై, పాలస్తీనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే, తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురయ్యారు. అరబ్ దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను తప్పుబట్టాయి. ఈజిప్టు, జోర్డాన్ వంటి మిత్ర దేశాలు సైతం పాలస్తీనియన్ల తరలింపును వ్యతిరేకించాయి. ఇటువంటి చర్యవల్ల పశ్చిమాసియా సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టింది. ట్రంప్ ప్రకటన సమస్యాత్మకంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. జాతి నిర్మూలన ఆలోచన వద్దు: గుటేరస్ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పునరుద్ఘాటించారు. జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు. పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి, గాజా నుంచి ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘సమస్య పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో పరిస్థితిని మరింత దిగజార్చరాదు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం అత్యావశ్యకం. ఏ రూపంలో అయినా జాతి నిర్మూలన నివారించాలి’ అని పేర్కొన్నారు. ఆక్రమణలకు ముగింపు పలకాలన్నారు. గాజా అంతర్భాగంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా శాంతి సుస్థిరతలకు ఇదే అసలైన పరిష్కారమని నొక్కిచెప్పారు. -
ఆ కారిడార్ నుంచి వెనక్కు
టెల్ అవీవ్: హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా గాజాలోని కీలకమైన నెట్జరిమ్ కారిడార్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. ఉత్తర, దక్షిణ గాజా ప్రాంతాలను నెట్జరిమ్ కారిడార్ విడదీస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటం, ఆంక్షల కారణంగా లక్షలాదిమంది పాలస్తీనియన్లు దక్షిణ భాగంలో చిక్కుకుపోయారు. ఒప్పందంలో భాగంగా వీరిని నెట్జరిమ్ మీదుగా తిరిగి ఉత్తర గాజాలోకి వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. ఇందులో భాగంగానే బలగాల ఉపసంహరణ అమలైంది. అయితే, ఆదివారం ఎన్ని బలగాలు వెనక్కి వెళ్లిపోయిందీ ఇజ్రాయెల్ వెల్లడించలేదు. మొత్తం 42 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు సగం రోజులు గడిచాయి. ఒప్పందం ప్రకారం..22వ రోజైన ఆదివారం గాజాలో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలి. గాజాలోని దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తరం వైపు వెళ్లే పాలస్తీనియన్లను ఎలాంటి తనిఖీలు జరపకుండా ఇజ్రాయెల్ బలగాలు అనుమతించాల్సి ఉంటుంది. మొదటి విడతలో హమాస్ తమ వద్ద ఉన్న 33 మంది ఇజ్రాయెలీలను విడతల వారీగా విడిచిపెట్టాల్సి ఉంది.ఒప్పందం పొడిగింపు ప్రశ్నార్థకమేకాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇరుపక్షాలు మరోసారి చర్చలు ప్రారంభించాల్సి ఉంది. పొడిగింపుపై ఏకాభిప్రాయం కుదిరిన పక్షంలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న మొత్తం ఇజ్రాయెలీలకు, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వందలాది మంది పాలస్తీనియన్లకు స్వేచ్ఛ లభించనుంది. మళ్లీ చర్చలపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరచక పోవడంతో కాల్పుల విరమణ పొడిగింపు అంశం ప్రశ్నార్థకంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ కీలక మధ్యవర్తిగా ఉంది. ఈ దఫా చర్చలకు తక్కువ స్థాయి అధికారులను ఖతార్‌కు పంపనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను పొడిగించే అవకాశాలపై ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు పరిశీలకులు. ఈ వారంలో నెతన్యాహూ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఒప్పందంపై చర్చిస్తారని భావిస్తున్నారు. అయితే, ఈ సమావేశం ఎప్పుడు జరగనుందనే విషయంలో స్పష్టత రాలేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడులు జరిపి 250 మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుపోవడంతో ఇరుపక్షాల మధ్య యుద్ధం మొదలుకావడం తెలిసిందే. -
ఆ ముస్లిం దేశాన్ని కబ్జా చేస్తా..! ట్రంప్ ప్రకటనతో అలజడి
-
గాజాపై ట్రంప్ కన్ను
వాషింగ్టన్: సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వా«దీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాలో ఉంటున్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనావాసులు ఆ ప్రాంతాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. వారిని గాజా నుంచి శాశ్వతంగా తరలించి పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలే వారిని అక్కున చేర్చుకోవాలని తేల్చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం విశేషం. పాలస్తీనావాసులను గాజా నుంచి తరలించేందుకు, ఆ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకునేందుకు అమెరికాకు ఏం అధికారముందని ప్రశ్నించగా తన చర్య గాజా, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా అంతటికీ గొప్ప స్థిరత్వాన్ని తెస్తుందని ఆయన బదులిచ్చారు. గాజా స్వా«దీనానికి సైన్యాన్ని రంగంలోకి దించుతారా అని ప్రశ్నించగా, అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని బదులిచ్చారు. ఈ సందర్భంగా నెతన్యాహూ పదేపదే చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. ట్రంప్ ప్రకటనకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘ఈ నిర్ణయం చరిత్రను మార్చేస్తుంది. గాజాకు అద్భుతమైన భవిష్యత్తు అందిస్తుంది. ఇజ్రాయెల్‌కు ముప్పును శాశ్వతంగా తొలగిస్తుంది’’ అని ప్రకటించారు. ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయ పరిస్థితులను అల్లకల్లోలం చేసేలా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనను అక్కడి దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనా, సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, తుర్కియేతో పాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ కూడా దీన్ని ఖండించాయి. అమెరికాలో విపక్ష నేతలు కూడా ట్రంప్ ప్రకటనను దుయ్యబడుతున్నారు. గాజావాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఈజిప్‌్ట, జోర్డాన్, తుర్కియే తదితర అమెరికా మిత్ర దేశాలన్నీ ఇప్పటికే ముక్త కంఠంతో తిరస్కరించడం తెలిసిందే. గ్రీన్‌లాండ్‌ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, కెనడాను అమెరికాలో కలిపేస్తానని ట్రంప్ ఇప్పటికే పలు వివాదాస్పద ప్రకటనలు చేశారు. అంతర్జాతీయ ప్రాంతంగా గాజా అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఆకస్మికంగా గాజా స్వా«దీన ప్రకటన చేశారు. దీన్ని పశ్చిమాసియా గర్వించదగ్గ విషయంగా అభివరి్ణంచారు. ‘‘పశ్చిమాసియా నమ్మశక్యం కానంత గొప్ప ప్రదేశం. అద్భుతమైన తీర ప్రాంతం. గొప్ప వ్యక్తులతో నిండిన అందమైన ప్రదేశాల్లో ఒకటి. గాజాలో త్వరలో పర్యటిస్తా. ఇజ్రాయెల్ అంటే నాకిష్టం. అక్కడ, సౌదీ అరేబియాలో, పశ్చిమాసియా అంతటా పర్యటిస్తా. గాజాలో ఇప్పుడేమీ మిగల్లేదు. ఆ ప్రాంతమంతా మృత్యువుకు, విధ్వంసానికి చిరునామాగా, నరకకూపంగా మారింది. ప్రతి భవనమూ నేలమట్టమైంది. చిరకాలంగా శప్తభూమిగా ఉన్న గాజాను పూర్తిగా పునరి్నరి్మస్తాం. పేలని బాంబులు, ఆయుధాలను తొలగిస్తాం. ధ్వంసమైన భవనాలను తొలగించి ఆ ప్రాంతాన్నంతా చదును చేస్తాం. అక్కడ అపరిమితమైన ఉద్యోగాలందించేలా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాం. గాజావాసుల జీవన స్థితిగతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏ ఒక్క సమూహానికో కాకుండా అందరికీ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పాలస్తీనావాసులతో పాటు ప్రపంచం నలుమూలలకు చెందిన ప్రజలు అక్కడ నివసిస్తారు. లేదంటే ఆ ప్రాంతం వందల ఏళ్లుగా ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఏదైనా డిఫరెంట్‌గా చేయాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదైనా అద్భుతం చేయడానికి మాకు అవకాశముంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఇదేమీ అల్లాటప్పగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై చాలా ప్రముఖులు, ముఖ్యులతో లోతుగా చర్చించా. వారంతా నా ప్రతిపాదనను అమితంగా ఇష్టపడ్డారు. గాజాను సొంతం చేసుకుని అభివృద్ధి చేసి అపారమైన ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న అమెరికా ఆలోచనలను ఇష్టపడుతున్నారు’’ అని చెప్పారు. ‘‘గాజాలో దశాబ్దాలుగా మరణమృదంగం కొనసాగుతోంది. చంపుకోవడాలు లేకుండా ఆనందంగా ఉండగలిగే అందమైన ప్రదేశంలో వారికి శాశ్వతంగా పునరావాసం కల్పించగలిగితే చాలు. మరో దారి లేకే వారు గాజాకు తిరిగి వెళ్తున్నారు. ఎప్పుడు కూలతాయో తెలియని పై కప్పుల కింద బతుకీడుస్తున్నారు. దానికి బదులుగా అందమైన ఇళ్లలో సురక్షితంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం వారి ముందుంది. ఆ మేరకు చక్కని పునరావాసం పొందగలరని, ఇప్పుడు వద్దంటున్న దేశాల్లోనే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేయగలనని నమ్ముతున్నా’’ అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించదగ్గ మార్గం ఇదేనని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. ‘‘హమాస్‌ను నిర్మూలించాలన్న మా లక్ష్యాలను సాధించడానికి ట్రంప్ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చారు. ఇది యూదు జాతికి సాయపడుతుంది’’ అని చెప్పారు. ‘‘ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్న గాజాకు భిన్నమైన భవిష్యత్తును ట్రంప్ కాంక్షిస్తున్నారు. హంతక సంస్థ (హమాస్)ను నిర్మూలిస్తే అక్కడ శాంతి సాధ్యమే’’ అన్నారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందో లేదో చెప్పలేనన్నారు. బైడెన్ ప్రభుత్వం తమకు పెద్దగా సాయం చేయలేదని నెతన్యాహూ ఆక్షేపించారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు.అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగాట్రంప్ గాజా ప్రణాళిక గాజాను పునరి్నర్మించాలంటూ పది రోజుల క్రితమే పిలుపునిచ్చిన ట్రంప్ ఆ విషయమై ఎంత సీరియస్‌గా ఉన్నారో తాజా ప్రకటనతో ప్రపంచానికి తెలిసొచి్చంది. కానీ అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైన ఆయన గాజా ప్రణాళిక పశ్చిమాసియాను అతలాకుతలం చేయడమే గాక ప్రపంచ శాంతికి గొడ్డలిపెట్టుగా మారేలా కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్–హమాస్ పరస్పర బందీల విడుదల ప్రక్రియపైనా ప్రభావం చూపేలా ఉంది. ఒక దేశ జనాభాను బలవంతంగా నిరాశ్రయులను చేయడం అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధం. ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్లను తరిమేసి గాజాను యూదు స్థావరంగా మార్చుకోవాలని ఆశపడుతోంది. ట్రంప్ ప్రకటన కార్యరూపం దాలిస్తే 20 లక్షల మంది పాలస్తీనావాసులు శాశ్వత శరణార్థులుగా మారిపోతారు. -
గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
-
గాజాపై ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ట్రంప్.. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు. అనంతరం, గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగింపు దిశగా వెళ్లాలని చెప్పారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై నెతన్యాహూతో ట్రంప్ చర్చించారు. అనంతరం ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే.. అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పించవచ్చు అని తెలిపారు. ఇదే సమయంలో భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ పర్యటన సందర్భంగా గాజా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాను సందర్శించాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు.మరోవైపు.. ట్రంప్ నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. గాజాపై ట్రంప్ ప్రకటన చరిత్రను మారస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో, ఇరువురి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.Donald Trump just announced that the United States will be “taking over” Gaza and will “level” it to the ground.He said Palestinians should not live there anymore.This is GENOCIDE!!!! pic.twitter.com/dR1UcmhiTe— Morgan J. Freeman (@mjfree) February 5, 2025ఇదిలా ఉండగా.. గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు తీవ్రంగా ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్టు, జోర్డాన్, సౌదీఅరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈక్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకొని, అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. -
ట్రంప్‌కు అరబ్ దేశాల షాక్..!
కైరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరబ్ దేశాలు షాకిచ్చాయి. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత తాజాగా ట్రంప్ చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాలస్తీనాలోని గాజా పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ప్రజలు నివసించేందుకు అక్కడి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న పాలస్తీనీయులకు పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లలో పునరావాసం కల్పించాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఈమేరకు ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి.కాగా, గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 45 వేలమందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టంతో పాటు గాజాలో ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ప్రజల జీవనానికి కావల్సిన మౌలిక సదుపాయాలేవీ ఇప్పుడక్కడ లేవు. గాజా పునఃనిర్మాణానికి భారీగా నిధుల అవసరం ఉంది. తాజాగా ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో గాజా నుంచి చెల్లాచెదురైన అక్కడి వారు తిరిగి గాజాకు చేరుకుంటున్నారు. -
నెతన్యాహు.. ఇదేం కిరికిరి : హమాస్
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనా బందీల విడుదలను ఆలస్యం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. మా బందీలు సురక్షితంగా విడిచి పెట్టే వరకు.. పాలస్తీనా బందీలను విడుదల చేయడంలో ఆలస్యం చేయాలని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌తో పాటు ప్రధాని మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు’ అని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.ఫలితంగా,హమాస్ చరనుంచి ముగ్గురు ఇజ్రాయెల్ బందీలు సురక్షితంగా విడుదలవ్వగా.. 110 మంది పాలస్తీనా బందీలను ఇజ్రాయెల్ తమ అదుపులోనే ఉంచుకుంది. దీంతో చేసేది లేక 110 మంది బందీల విడుదలలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేలా హమాస్ మధ్యవర్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
గాజాలో కండోమ్‌ల పంపిణీకి నో..ట్రంప్ కీలక ఆదేశాలు
వాషింగ్టన్:అమెరికాలో ట్రంప్ యంత్రాంగం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులతో యుద్ధంతో విధ్వంసానికి గురైన గాజాలో కండోమ్‌ల పంపిణీకి ట్రంప్ సర్కారు నిధులు నిలిపివేసింది. గాజాలో కండోమ్‌ల పంపిణీకి గత బైడెన్ సర్కారు ఏకంగా 50 మిలియన్ డాలర్ల నిధులు కేటాయించడం గమనార్హం. అయితే ప్రభుత్వ ఖర్చులు తగ్గించే క్రమంలో ట్రంప్ గాజాలో కండోమ్‌ల పంపిణీకి బైడెన్ కేటాయించిన నిధుల పంపిణీ నిలిపివేశారని వైట్‌హౌజ్ తెలిపింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డీఓజీఈ కండోమ్‌ల నిధుల వ్యవహారాన్ని గుర్తించిందని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు.అయితే బైడెన్ ప్రభుత్వం నిజంగా కండోమ్‌లకు నిధులకు కేటాయించిందన్నదానికి వైట్‌హౌజ్ ఆధారాలు చూపకపోవకపోవడం చర్చనీయాంశమవుతోంది. బైడెన్ పేషీలో పనిచేసిన ఒక అధికారి ఈ విషయాన్ని కొట్టిపారేయడం గమనార్హం. కండోమ్‌లలో మండే వాయువులను నింపి ఆ బెలూన్లను హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి దక్షిణ ఇజ్రాయెల్‌పై వదిలేవారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఒక ఆసక్తికర పోస్టు చేయడం విశేషం. Explains why all condom orders were “Magnum” 😂 https://t.co/eKKRsfkgjY— Elon Musk (@elonmusk) January 28, 2025 -
‘‘ఏం తినేది..? ఎట్లా బతికేది??’’ హృదయ విదారక గాజా చిత్రాలు
-
వీడియో: బతుకు జీవుడా.. గాజాకు నడుచుకుంటూ లక్షల మంది..
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. వేల సంఖ్యలో మరణాలు, కోట్ల సంఖ్యలో ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది గాజా ప్రజలు తాము పుట్టిన భూమిని వదిలి శరణార్థి శిబిరాలకు వెళ్లారు.ఇప్పుడు యుద్ధం ముగిసిన నేపథ్యంలో మళ్లీ బతుకు జీవుడా అంటూ తమ నివాసాలకు చేరుకుంటున్నారు. పొట్టచేతపట్టుకొని ఎలా వెళ్లారో అలాగే, మళ్లీ తిరిగి వెళ్తుంటే అక్కడ తమకంటూ ఏమైనా మిగిలుందో లేదో తెలియని దుస్థితి వారిని వేధిస్తోంది. ఎలాబతకాలో తెలియని ఆందోళన వారి హృదయాలను బరువెక్కిస్తోంది. ఇవన్నీ ఆలోచించుకుంటూ లక్షలాది మంది గాజా ప్రజలు తమ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎన్నో ఆలోచనలు వారిని వెంటాడుతున్నాయి. కొన్ని లక్షల మంది గుంపు గాజా వైపు వెళ్తున్న దృశ్యాలను నెటిజన్లను కన్నీరుపెట్టిస్తున్నాయి.The Flag of Palestine is Raised above the people returning home to Northern Gaza after 15+ months! pic.twitter.com/inLghaC33G— Ryan Rozbiani (@RyanRozbiani) January 27, 2025కాగా, అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి గాజా ప్రజల పాలిట శాపమైంది. హమాస్ దాడితో ఇజ్రాయెల్ ప్రతి దాడి మొదలుపెట్టడంతో ఉత్తర గాజా నుంచి సుమారు 10 లక్షల మంది దక్షణాదికి తరలివెళ్లిపోయారు. శరణార్థి శిబిరాల్లో కాలం వెళ్లదీశారు. ఉత్తర ప్రాంతంలో బెంజమిన్ నెతన్యాహు సేనల దాడులతో ఆ ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి సౌకర్యాలు శిథిలమయ్యాయి. ఈ ఘర్షణలో హమాస్ అగ్రనాయకత్వం మొత్తం మృత్యువాతపడింది. ఈ నేపథ్యంలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో, వీరంతా స్వస్థలం బాటపడ్డారు.A million Palestinians returning to their destroyed homes and towns in the north of #Gaza this morning is the crystal clear response to those who still plot to uproot us from our homeland. There is only one direction of travel ahead of the Palestinian people after a 100 years of… pic.twitter.com/PsU7ip89jq— Husam Zomlot (@hzomlot) January 27, 2025 THE RETURN TO THE NORTH OF GAZA pic.twitter.com/qg5ddiqAre— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) January 27, 2025ఇదిలా ఉండగా..ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లు పునరావాసం కల్పించాలన్నారు. ఈ ప్రతిపాదన వారిని తమ సొంత ప్రాంతానికి శాశ్వతంగా దూరంగా చేస్తుందా? అనే ఆందోళనా వ్యక్తమైంది. ఇక పాలస్తీనా వాసులు తిరిగి రావడాన్ని హమాస్ విక్టరీగా అభివర్ణించుకుంది. “Don’t leave, don’t leave me” .. A little girl embraces her father after returning to the north of Gaza. pic.twitter.com/0T3AhoafyF— Eye on Palestine (@EyeonPalestine) January 27, 2025We are returning to the north of Gaza pic.twitter.com/IwRFKZ2hzV— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) January 27, 2025 -
పాలస్తీనా శరణార్థులను అక్కున చేర్చుకోండి
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సర్వం కోల్పోయి శరణార్థులుగా మారిన పాలస్తీనా పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. జోర్డాన్, ఈజిప్టుతోపాటు ఇతర అరబ్ దేశాలు వారికి ఆశ్రయ మివ్వాలని సూచించారు. వారి బాగోగులు చూసుకోవాలన్నారు. ఇజ్రాయెల్‌కు 2 వేల పౌండ్ల బరువైన బాంబుల సరఫరాను నిలిపివేస్తూ బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేశానని వెల్లడించారు. వాటిని శనివారమే ఇజ్రాయెల్‌కు అందజేశామని చెప్పారు.గాజాను శుభ్రం చేయాలి గాజా పూర్తిగా విధ్వంసానికి గురైన ప్రాంతమని, శిథిలాలను తొలగించి, శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కనుక ఎక్కువ మంది ప్రజలు బయటకు వెళితే కార్యాచరణ తేలికవుతుందన్నారు. గాజా పౌరులకు మరోచోట ఇళ్లు నిర్మించి ఇస్తే, అక్కడ వారు శాంతియుతంగా జీవనం సాగించగలరన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ కార్యాలయం ఇంకా స్పందించలేదు. మరోవైపు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌కు అమెరికా బాంబులు సరఫరా చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మిగిలిన బందిలందరినీ విడుదల చేయకపోతే హమాస్‌పై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. అసలు వ్యూహం అదేనా? పాలస్తీనా శరణార్థులు అరబ్ దేశాలు అనుమతించాలనడం, ఇజ్రాయెల్‌కు అమెరికా బాంబులు సరఫరా చేయడం వెనుక మరో వ్యూహం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బందీల విడుదల పూర్తయిన తర్వాత గాజా నుంచి పాలస్తీనా పౌరులను బయటకు తరలించి, హమాస్ స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయా లన్నదే అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం కావొచ్చని తెలుస్తోంది. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఆ రెండు దేశాలు యోచిస్తున్నాయి. -
హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీల విడుదల
గాజా: గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నలుగురు మహిళా బందీలను శనివారం హమాస్ విడుదల చేసింది. కరీనా అరీవ్, డానియెల్ గిల్బోవా, నామా లెవి, లిరి అల్బాజ్ అనే బందీలకు హమాస్ తమ చెర నుంచి విముక్తి కలిగించింది. ఇందుకు ప్రతిగా వందకు పైగా పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ తన జైళ్ల నుంచి విడిచిపెట్టనుంది.ప్రస్తుతం విడుదలైన ఇజ్రాయెల్ బందీలు మహిళా సైనికులు. గాజా సరిహద్దుకు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి వారిని 2023, అక్టోబర్ 7 దాడుల సందర్భంగా హమాస్ బంధించి తీసుకెళ్లింది. ఏడాదికిపైగా వారు హమాస్ చెరలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. తాజాగా ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకొచ్చిన హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. దీంతో రెడ్‌క్రాస్ తన వాహనాల్లో వారిని ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లింది. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్, వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది ఇజ్రాయెల్ బందీల్లో 33 మందికి హమాస్ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనియులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది.కాగా, 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాడులు చేశారు. ఈ దాడుల్లో 1200 మంది దాకా ఇజ్రాయెల్ సైనికులు, పౌరులు మృతి చెందారు. ఇంతేకాక వెళుతూ వెళుతూ 100 మందికిపైగా ఇజ్రాయెల్ వాసులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులు మొదలు పెట్టింది. ఈ దాడుల్లో 46వేల మంది దాకా పాలస్తీనా వాసులు మృతి చెందినట్లు సమాచారం. -
గాజా.. చెదిరిన స్వప్నం!
పదిహేను నెలల భీకర యుద్ధం ధాటికి అంధకారమయమైన గాజా స్ట్రిప్ వీధుల్లో ఎట్టకేలకు శాంతిరేఖలు ప్రసరించినా యుద్ధంలో జరిగిన విధ్వంసఛాయలు తొలగిపోలేదు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఎట్టకేలకు తుపాకుల మోత, క్షిపణుల దాడులు ఆగిపోయాయి. అయినాసరే అశాంతి నిశ్శబ్దం రాజ్యమేలుతూనే ఉంది. మిస్సైల్స్ దాడుల్లో ధ్వంసమైన తమ ఇళ్లను వెతుక్కుంటూ వస్తున్న పాలస్తీనియన్లకు ఏ వీధిలో చూసినా మృతదేహాలే స్వాగతం పలుకుతూ నాటి మారణహోమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. గాజా స్ట్రిప్‌పై వేల టన్నుల పేలుడుపదార్ధాలను కుమ్మరించిన ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల జనవాసాలను దాదాపు శ్మశానాలుగా మార్చేసింది. స్వస్థలాలకు కాలినడకన, గుర్రపు బళ్లలో చేరుకుంటున్న స్థానికులకు ఎటుచూసినా వర్ణణాతీత వేదనా దృశ్యాలే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటికింద స్థానికుల జ్ఞాపకాలతో పాటు కలలు కూలిపోయాయి. కొందరు ఆత్మియులను పోగొట్టుకుంటే.. మరికొందరు సర్వస్వాన్ని కోల్పోయారు. ప్రతి ముఖం మీదా విషాద చారికలే. కుప్పకూలిన వ్యవస్థలు గాజా స్ట్రిప్ అంతటా ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సగం ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. మిగిలినవి సైతం పాక్షింకంగానే పని చేస్తున్నాయి. వాటిల్లోనూ సాధారణ సూదిమందు, బ్యాండేజీ, కాటన్ వంటి వాటినీ అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యారోగ్య సంస్థలను మళ్లీ పునర్నిర్మించాల్సి ఉంది. రోడ్లు, మౌలిక సదుపాయాల పరిస్థితి మరీ అధ్వాన్నం. శిథిలాల తొలగించాక ఏర్పడిన కాలిబాటే ఇప్పడు అక్కడ రోడ్డుగా ఉపయోగపడుతోంది. సొంతిళ్లు బాంబుదాడిలో ధ్వంసమయ్యాక శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నాసరే పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వైమానిక బలగాలు వదిలేయలేదు. క్యాంప్‌లపై బాంబుల వర్షం కురిపించడంతో కళ్లముందే కుటుంబసభ్యులను కోల్పోయిన వారు ఇప్పుడు ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు.యుద్ధభయం వారిని ఇంకా వెన్నాడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారిని పట్టించుకున్న నాథుడే లేడు. యుద్ధం ఆగాక సహాయక, అన్వేషణా బృందాలు అవిశ్రాంతంగా కష్టపడుతూ మరో శ్రామికయుద్ధం చేస్తున్నాయి. శిథిలాల కింద మృతదేహాల నుంచి వెలువడుతున్న దుర్వాసన మధ్యే వాళ్లు శిథిలా తొలగింపు పనులు చేస్తున్నారు. ‘‘వీధిని చక్కదిద్దేందుకు ఏ వీధిలోకి వెళ్లినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. కూలిపోయిన భవనాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చు’’అని గాజా సిటీలోని 24 ఏళ్ల సివిల్ డిఫెన్స్ కార్మికుడు అబ్దుల్లా అల్ మజ్దలావి చెప్పారు. ‘నా కుటుంబం శిథిలాల కింద కూరుకుపోయింది, దయచేసి త్వరగా రండి’’అంటూ కాల్పుల విరమణ తర్వాత కూడా స్థానికుల నుంచి తమకు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయ ని సహాయక ఏజెన్సీ తెలిపింది. పునర్నిర్మాణానికి చాలా సమయం ధ్వంసమైన పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని గాజాలోని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థి సంస్థ ఉన్వ్రా తాత్కాలిక డైరెక్టర్ సామ్ రోజ్ తెలిపారు. ‘‘గాజాలో ఆవాస వ్యవస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ కుటుంబాలు, కమ్యూనిటీలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. సహాయక చర్యలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’’అని ఆయన పేర్కొన్నారు.ప్రజల అత్యవసర అవసరాలను తీర్చడానికి, గాజా ప్రజారోగ్య వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు తొలి 60 రోజుల ప్రణాళిక ఉందని, వేలాది మంది జీవితాన్ని మార్చేసిన గాయాలను మాన్పేందుకు సిద్ధమవుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ హనన్ బాల్కీ ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా గాజా స్ప్రిప్లో ఆస్పత్రులకు మరమ్మత్తు చేయడం, దాడుల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో తాత్కాలిక క్లినిక్‌లను ఏర్పాటు చేయడం, ప్రజల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని బాల్కీ వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్అణువణువునా విధ్వంసంయుద్ధం దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లను నిరాశ్రయులను చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 46,900 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,10,700 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. తమ సిబ్బందిలో 48 శాతం మంది ఇక ఈ ఘర్షణల బాధితులున్నారని, కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారని, ఇంకొందరు నిర్బంధంలో ఉన్నారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. గాజాలోని 85 శాతం వాహనాలు ధ్వంసమయ్యాయి. తమ 17 కార్యాలయాలు దెబ్బతిన్నాయని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది.ఆదివారం కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో స్థానికుల ముఖాల్లో ఆనందం వచ్చిచేరినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తే ఉన్న ఆ కాస్త ఆనందం కూరా ఆవిరయ్యే దుస్థితి దాపురించింది. గాజా అంతటా 60శాతం నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఐక్యరాజ్యసమితి గతంలో అంచనా వేసింది. చాలా ఆలస్యంగా కుదిరిన శాంతి ఒప్పందం అమలయ్యే నాటికి మరింతగా దాడులు జరగడంతో నేలమట్టమైన నిర్మాణాల సంఖ్య మరింత పెరిగింది. కూలిన ఇళ్ల కింద 10,000కు పైగా మృతదేహాలు ఉండొచ్చని ఏజెన్సీ అంచనావేస్తోంది.నెమ్మదిగా మొదలైన సాయం కాల్పులు ఇరువైపులా ఆగిపోవడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎలాగోలా తప్పించుకుని, గాయాలపాలుకాని స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద మృతులను అన్నింటినీ తొలగించడానికి కనీసం వంద రోజులు సమయం పడుతుందని అన్వేషణా బృందాలు అంచనావేస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అవసరమైన బుల్డోజర్లు ఇతర పరికరాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో వెలికితీత మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. దాడుల ధాటికి అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడటంతో పని దొరకడం కూడా కష్టంగా ఉంది.స్థానికులకు ఆదాయం కాదు కదా ఆశ్రయం కూడా లేకపోవడంతో గాజాలో బతకడం కూడా పెద్ద అస్తిత్వ పోరాటంగా తయారైంది. కాల్పుల విరమణ జరిగిన వెంటనే ఆహారం, నిత్యావసర వస్తువులు, ఔషధాలను మానవతా సంఘాలు అందించడం మొదలెట్టాయి. ఒక్క ఆదివారం రోజే 630 లారీల నిండా సరకులు గాజాలోకి ప్రవేశించాయి. సోమవారం మరో 915 లారీలు గాజాలోకి వెళ్లాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇంతటి భారీ స్థాయిలో మానవతా సాయం అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
కాల్పుల విరమణ నేటి నుంచే!
కైరో: ఇజ్రాయెల్ దాడులతో శిథిలమైన గాజాపై నేటి నుంచి శాంతిరేఖలు ప్రసరించనున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు. 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచిపెట్టనున్నారు. సాయంత్రం 4 గంటలతర్వాతే బందీల పరస్పర బదిలీ మొదలవతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరువైపులా బందీల కుటుంబసభ్యులు, బంధువుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తమ వారిని చూడబోతున్నామన్న ఆత్రుత వారిలో కన్పిస్తోంది. స్వేచ్ఛావాయువులు పీల్చబోతున్న వీళ్లందరికీ తక్షణ ఆహారంతో పాటు ఇతరత్రా సాయం అందించేందుకు మానవీయ సంస్థలు సిద్ధమయ్యాయి. అయితే ఇరువైపులా ఈ ప్రక్రియ ఎంత సజావుగా సాగుతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు, బందీల జాబితా అందజేసేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం అర్ధరాత్రి మెలిక పెట్టారు! -
గాజాలో శాంతి సాధ్యమేనా!
బాంబుల మోత ఆగుతుందంటే... తుపాకులు మౌనం పాటిస్తాయంటే... క్షిపణుల జాడ కనబడదంటే... ఇనుప డేగల గర్జనలు వినబడవంటే... నిత్యం మృత్యువు వికటాట్టహాసం చేస్తున్నచోట హర్షాతిరేకాలు వ్యక్తం కావటం సహజమే. అందుకే 15 నెలలుపైగా... అంటే 467 రోజులుగా రాత్రింబగళ్లు ప్రాణభయంతో కంటి మీద కునుకు లేకుండా గడిపిన గాజా ప్రజానీకం వీధుల్లోకొచ్చి పండుగ చేసుకున్నారు. అటు హమాస్ చెరలో మగ్గుతున్నవారి కుటుంబసభ్యులు సైతం ఆనందో త్సాహాలతో ఉన్నారు. ఇజ్రాయెల్–మిలిటెంట్ సంస్థ హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ ప్రతినిధులు బుధవారం రాత్రి ప్రకటించగానే ప్రపంచం, ప్రత్యేకించి పశ్చిమాసియా ఊపిరి పీల్చుకున్నాయి. ‘నేను దేశాధ్యక్షపదవి స్వీకరించబోయే జనవరి 20 నాటికి బందీలకు స్వేచ్ఛ లభించకపోతే సర్వనాశనం ఖాయమ’ని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పక్షం రోజుల నాడు ప్రకటించారు. ‘నా హెచ్చరిక ఫలించబట్టే కాల్పుల విరమణ ఒప్పందం సాకారమైంద’ని ఇప్పుడు ఆయన అంటుంటే... ‘నా అనుభవంలోనే అత్యంత కఠినమైన ఈ చర్చల ప్రక్రియను మొత్తానికి సుఖాంతం చేయగలిగాన’ని ప్రస్తుత అధ్య క్షుడు జో బైడెన్ చెబుతున్నారు. ఈ ఘనత ఎవరి ఖాతాలో పడాలన్నది తేలకముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మొండికేస్తున్నారు. తొలుత ఒప్పందాన్ని స్వాగతించిన ఆయనే ఇంకా తేలాల్సినవి ఉన్నాయంటున్నారు. ఒప్పందంపై ఆమోదముద్ర వేసేందుకు నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని నిలిపివేశారు. ఈలోగా నిన్న, ఇవాళ గాజాపై ఇజ్రాయెల్ సాగించిన బాంబు దాడుల్లో 19మంది పిల్లలు సహా 80 మంది చనిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందా లేదా, ఈ ప్రాంతంలో తాత్కాలికంగానైనా శాంతి నెలకొంటుందా అన్న అంశంలో సందిగ్ధత ఏర్పడింది. సుదీర్ఘకాలం ఘర్షణలతో అట్టుడికినచోట సాధారణ పరిస్థితులు ఏర్పడటం అంత సులభమేమీ కాదు. అందునా ఇజ్రాయెల్‌తో వైరమంటే మామూలుగా ఉండదు.ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 2023 అక్టోబర్ 7న విచ్చలవిడిగా కాల్పులు జరిపి 1,200 మంది పౌరులను హతమార్చటంతో పాటు, 251 మందిని బందీలుగా తీసు కెళ్లటంతో ఇదంతా మొదలైంది. హమాస్ మతిమాలిన చర్య తర్వాత ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో గాజా, వెస్ట్‌బ్యాంక్‌లపై సాగించిన దాడుల పర్యవసానంగా ఇంతవరకూ కొందరు హమాస్ కీలకనేతలతో పాటు 46,700 మంది పౌరులు చనిపోయారు. ఇందులో అత్యధికులు పిల్లలు, మహి ళలే. ఇతరులు నిత్యం చావుబతుకుల మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం జారవిడిచే కరపత్రాలు సూచించిన విధంగా ఎటు పొమ్మంటే అటు వలసపోతూ అష్టకష్టాలు పడుతున్నారు.తిండీ, నీళ్లూ కరువై, అంతంతమాత్రం వైద్య సదుపాయాలతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఒక్కోటి 42 రోజులు (ఆరు వారాలు)ఉండే మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలవుతుందా, మధ్యలో తలెత్తగల సమస్యలేమిటి అన్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాల్లేవు. హమాస్ చెరలో ఇంకా 94 మంది బందీలు మిగిలారని, వారిలో 34మంది మరణించివుండొచ్చని ఇజ్రాయెల్ అంచనా. తొలి దశ అమల్లోవుండగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగాలి. ఆ తర్వాత పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా 33 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది. ఒకసారంటూ ఒప్పందం అమలు మొదలైతే ఇరువైపులా ఉన్న బందీలను దశలవారీగా విడుదల చేస్తారు. గాజాకు భారీయెత్తున సాయం అందటం ప్రారంభమవుతుంది. ఒప్పందం ప్రకారం తొలి దశ కొనసాగుతున్న దశలోనే ఇజ్రాయెల్ రెండోదశ కోసం హమాస్‌తో చర్చించటం మొదలెట్టాలి. రెండో దశకల్లా బందీలతోపాటు దాడుల సందర్భంగా హమాస్‌కు చిక్కిన ఇజ్రాయెల్ ఆడ, మగ సైనికులు పూర్తిగా విడుదలవుతారన్నది అంచనా. అప్పుడు మొదలుకొని తొలి దశలో వున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వత కాల్పుల విరమణగా మారుతుంది. మూడో దశ అంతా పునర్నిర్మాణంపై కేంద్రీకరిస్తారు. హమాస్ బందీలుగా ఉంటూ మరణించినవారి మృత దేహాలను అప్పగించాలి. కేవలం మొదటి దశకు మాత్రమే ప్రస్తుత ఒప్పందం పరిమితమనీ... కొత్తగా చర్చలు జరిగాకే రెండు, మూడు దశలకు సంబంధించి తుది నిర్ణయం ఉంటుందనీ ఇప్పటికే నెతన్యాహూ ప్రకటించారు. తొలి దశ పూర్తయ్యాక మళ్లీ యుద్ధం తప్పదన్న హామీ ఇవ్వకపోతే తమ ఆరుగురు మంత్రులూ తప్పుకుంటారని తీవ్ర మితవాదపక్ష నాయకుడు, జాతీయ భద్రతా మంత్రి బెన్గివర్ హెచ్చరించటం తీసిపారేయదగ్గది కాదు. లెబనాన్‌లోని హిజ్బొల్లాతో ఉన్న రెండు నెలల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ ఇరువైపులా కాల్పులు జరగని రోజంటూ లేదు. ఆ ఒప్పందం కూడా ఈనెల 26తో ముగుస్తుంది. ఇప్పుడు హమాస్‌తో కుదిరిన ఒప్పందం గతి కూడా అలాగే ఉంటుందా అన్నది ప్రశ్నార్థకం.సిరియాలో అసద్ నిష్క్రమణ, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమైవుండటం, ఇరాన్ బల హీనపడటం, ట్రంప్ ఆగమనం వంటి పరిణామాలతో హమాస్‌లో పునరాలోచన మొదలయ్యాకే ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఎనిమిదినెలల నాడు దాదాపు ఇవే షరతులు ప్రతిపాదిస్తే ఆ సంస్థ తిరస్కరించటం గమనార్హం. మొత్తానికి పశ్చిమాసియా తెరిపిన పడటానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధి ప్రదర్శించటం అవసరం. దాడులతో ఎవరినీ అణిచేయలేమని ఇన్నాళ్ల చేదు అనుభవాల తర్వాతైనా ఇజ్రాయెల్ గుర్తిస్తే మంచిది. ఎన్ని లోటుపాట్లున్నా ఘర్షణలు అంతరించాలి. శాంతి చిగురించాలి. -
గాజా ఒప్పందం.. ఆఖరి నిమిషంలో కొర్రీలు!
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ఘనంగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఆఖరి నిమిషయంలో ఇటు ఇజ్రాయెల్.. అటు హమాస్‌లు ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ(Ceasefire Deal) ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు తమ కేబినెట్ సమావేశం ప్రస్తుతానికి జరగట్లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అందుకు హమాస్ చివరి నిమిషంలో పెట్టిన కొర్రీలే కారణమని ఆరోపించింది. ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.చివరి నిమిషంలో హమాస్(Hamas) ఉగ్రసంస్థ ఒప్పందంలో మార్పులు సూచించడమే అందుకు కారణమని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయితే ఆ కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. హమాస్ మాత్రం మధ్యవర్తులు తెచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం. పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఖతార్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తొలి ఫేజ్‌లో భాగంగా.. గాజాలో తాము బంధీలుగా ఉంచిన 33 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తారు. దానికి ప్రతిగా తమ దేశ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా బంధీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ఇదీ చదవండి: గాజా శాంతి ఒప్పందం ఘనత ఎవరిదంటే..అయితే.. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ (Israel) గాజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రకటన వెలువడినప్పటి నుంచి జరిగిన దాడుల్లో 71 మంది మరణించినట్లు గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. పైగా ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని, పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా.. మరికొందరికి గాయాలైనట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ ఆదివారం(జనవరి 19) నుంచి మొదలుకావాల్సిన ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకునే అవకాశం లేకపోలేదు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 15 నెలల యుద్ధంలో 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తూ వచ్చాయి. అటు అమెరికా.. ఇటు ఈజిప్ట్,ఖతారులు కొన్ని నెలలుగా కాల్పుల విరమణ చర్చలు జరుపుతూ వచ్చాయి.ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ టెలివిజన్ ముఖంగా చేసిన ప్రకటనతో.. పాలస్తీనాలో సంబురాలు జరిగాయి. ఇటు గాజా సరిహద్దులో శరణార్థ శిబిరాల్లో ఉన్నవాళ్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా మానవతా ధృక్పథంతో ముందకు సాగాలని, గాజా కోలుకునేందుకు అవసరమైన సాయం కోసం ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. గాజా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందన్న పరిణామంపై భారత్ సహా పలుదేశాలు స్వాగతించాయి. -
హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం, ఆ ఘనత ఎవరికంటే..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావడంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంధీలను విడిచిపెట్టడంతో(Gaza hostage release) పాటు కాల్పుల విమరణ ఒప్పందానికి సిద్ధపడడంతో ఇరువర్గాలను ట్రంప్ మెచ్చుకున్నారు. అయితే.. మరో ఐదు రోజుల్లో ఆయన వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. ఈలోపే గాజా యుద్ధం ముగింపు దిశగా అడుగు పడడాన్ని ఆయన తన విజయంగా అభివర్ణించుకుంటున్నారు.‘‘కిందటి ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మేం చారిత్రక విజయం సాధించాం. ఆ ఫలితమే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అని తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ ఉంచారు. నిబద్ధతతో కూడిన తన పరిపాలన.. శాంతి, సామరస్యంతో ప్రపంచానికి శక్తివంతమైన సంకేతాలను పంపిందని విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారాయన. ఇజ్రాయెల్ సహా మా మిత్రపక్షాలతో మేం(అమెరికా) సత్సంబంధాలు కొనసాగిస్తాం. అలాగే.. గాజాను మళ్లీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చబోం అని ఆయన రాసుకొచ్చారు.తాజాగా హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు.కాగా, హమాస్‌కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లార్చేందుకు అమెరికా సహా పలు దేశాలు నిర్విర్వామంగా కృషి చేస్తూ వస్తున్నాయి. గాజా శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్, ఖతార్‌ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ టైంలో(కిందటి ఏడాది మే చివర్లో) ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఖతార్ ద్వారా హమాస్‌కు సైతం ఆ ఒప్పందం చేరవేశారు. ఇక గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు, దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న వందలమంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ తలూపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే..మొదటి దశఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి.రెండో దశసైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి.మూడో దశగాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.అయితే.. బైడెన్ ప్రతిపాదించిన ఒప్పంద సూత్రాలకే ఇరు వర్గాలు అంగీకరించాయా? లేదంటే అందులో ఏమైనా మార్పులు జరిగాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మధ్యవర్తులు చెబుతున్న సమాచారం ప్రకారం.. తొలి దశలో యుద్ధం నిలిపివేతపై చర్చలను ప్రారంభించడంతో పాటు, ఆరు వారాల పాటు కాల్పుల విరమణ పాటించాలి. హమాస్ చెరలో బందీలుగా ఉన్న సుమారు 100 మందిలో 33 మందిని ఈ సమయంలో విడిచిపెట్టాలి’’ అని ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ప్రతినిధులు ధృవీకరించారు. ఈ ఒప్పందంపై గురువారం ప్రకటన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సన్నద్ధమవుతున్నారు.ఖతార్ పాత్ర ప్రత్యేకం.. కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్టులు మధ్యవర్తిత్వం వహించాయి. ఈక్రమంలో రెండుసార్లు కాల్పుల విరమణపై చర్చలు జరగ్గా అవి ఫలించలేదు. అయితే గాజాలో శాంతి స్థాపన కోసం ఖతార్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మొదటి నుంచి ఆసక్తికరంగా సాగాయి. 2012 నుంచి దోహాలో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నాల్లో ఖతార్ కీలకంగా వ్యవహరిస్తుందని తొలి నుంచి చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే ఖతార్ ఈ చర్చల్లో ముందుకు వెళ్లింది కూడా. అయితే ఒకానొక దశలో అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గింది. దీంతో మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలను ఖతార్ నిలిపివేసిందన్న కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఖతార్ వాటిని ఖండించింది. అదే సమయంలో దోహాలో హమాస్ కార్యకలాపాలను బహిష్కరించాలని అమెరికా ఇచ్చిన పిలుపును కూడా ఖతార్ పక్కన పెట్టి మరీ చర్చలకు ముందుకు తీసుకెళ్లి పురోగతి సాధించింది ఖతార్. గాజా బాధ్యత ఎవరిది?తాజా ఒప్పందంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఒప్పందం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వెనక్కుమళ్లుతాయా?.. లేకుంటే పాక్షికంగానే జరుగుతుందా?. భవిష్యత్తులో కాల్పుల విరమణ ఉల్లంఘన జరగకుండా ఉంటుందా? అన్నింటికి మించి.. యుద్ధంతో నాశనమైన గాజా ప్రాంతాన్ని ఎవరు పాలిస్తారు? దాని పునర్నిర్మాణానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది.ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ లాంఛనం పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరించనుంది. -
దయ్యాల కోసం అద్దె చెల్లించడమా..!
అక్కడ దయ్యాలు, భూతాలు ఉన్నాయంటే ఆ వైపు కూడా వెళ్లరు చాలామంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం దయ్యాల కోసమే అద్దె చెల్లించాడు. ఈజిప్టులోని కైరో వెలుపల అతి పురాతనమైన మూడు పిరమిడ్లు ఉన్నాయి. వీటిని ఈజిప్ట్ ప్రభుత్వం అద్దెకిస్తోంది. వాటిల్లో ఒకటి, అతిపెద్దది, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. అక్కడ దాదాపు మూడువేలకు పైగా దయ్యాలు, భూతాలు ఉన్నాయని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఆ దయ్యాలను చూడటానికే ప్రముఖ యూట్యూబర్ జేమ్స్ డొనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), వాటిని వంద గంటలకు అద్దెకు తీసుకున్నాడు. ‘బియాండ్ ది రికార్డ్స్’ పేరుతో భయంకర ప్రదేశాల్లోకి వెళ్లి, అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనల వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు తన భారీ అన్వేషణ కోసం ఈజిప్ట్‌లోని ఈ పిరమిడ్లను ఎంచుకున్నాడు.మరో వింత..ఈ విమానంలో ప్రయాణించాల్సిన పనిలేదు.. ‘ఈ వంద గంటల్లో స్నేహితులతో కలసి అక్కడ ఉండే అన్ని గదులు, సమాధులను చూసి, అక్కడే నిద్రించాలన్నది నా ప్లాన్. ఇందుకోసం, అవసరమైన అన్ని వస్తువులతో పాటు, పారానార్మల్ యాక్టివిటీ డివైజ్, ఇతర పరికరాలను తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు. కొంతమంది ఇది సాధ్యం కాదని కొట్టి పారేస్తుంటే, తను మాత్రం త్వరలోనే వీడియోతో సమాధానం చెబుతానంటున్నాడు. భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు..70 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్(Israel) జరిపిన దాడుల్లో70 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో 17 మంది దాకా మరణించారు.‘తెల్లవారుజామున రెండు గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. 14,15 మంది దాకా నివసించే మా పక్కనున్న ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంట్లోని వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు’అని పొరుగున ఉండేవారు తెలిపారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు.మరోవైపు గాజా(Gaza)లో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలకు అమెరికా ప్రభుత్వ సహకారం ఉంది. బందీల విడుదలకు ఒప్పుకోవాలని హమాస్‌ను మధ్యవర్తులు కోరుతున్నారు. అప్పుడే కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. -
ఈ ఏడాది.. పిల్లల పాలిట పెనుశాపమే!
పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా నిలిచింది 2024. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ తాజాగా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 15 నెలల్లో కనీసం 17,492 మంది బాలలు మరణించినట్లు తెలిపింది...! మునుపెన్నడూ లేనంతంగా ఎక్కువ మంది పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బలవంతంగా నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణలో మరణిస్తున్న, గాయపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాలలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భద్రత మాట పక్కకు పెడితే.. ప్రాథమిక అవసరాలు తీర్చుకునే అవకాశమూ ఉండటం లేదు. వాళ్లు ఆడుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడో మరిచారు. ఈ యుద్ధాలు పిల్లల హక్కులను హరిస్తున్నాయి. ఇక, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు, పోషకాహారం విలాసంగా మారాయి. ‘‘ప్రపంచంలో అనియంత్రిత యుద్ధాలకు ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు మనుగడ కోసం పోరాటమే చేస్తున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది దారుణం’’ అని యునిసెఫ్ డైరెక్ట్ కేథరిన్ రస్సెల్ వాపోయారు. గణాంకాలు చెబుతున్న విషాదాలు.. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో పిల్లలు 30 శాతం ఉన్నారు. వారిలో 47.3 కోట్ల మంది యుద్ధ ప్రభావింత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంతర్జాతీయ ఏజెన్సీ తెలిపింది. 1990లలో సుమారు 10 శాతం మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో ఉండగా ఇప్పుడది ఏకంగా రెట్టింపుకు, అంటే 19 శాతానికి పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా 2023 చివరి నాటికి 4.7 కోట్ల మంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 2024లో హై తీ, లెబనాన్, మయన్మార్, పాల స్తీనా, సూడాన్ నుంచి అత్యధికంగా శరణార్థులుగా వెళ్లారు. ప్రపంచ శరణార్థుల జనాభాలో సుమారు 40 శాతం బాలలే. ఆయా దేశాల్లో నిర్వాసితులయినవారిలో బాలలు 49 శాతమున్నారు. 2023 నుంచి ఇప్పటిదాకా 22,557 మంది పిల్లలపై రికార్డు స్థాయిలో 32,990కు పైగా తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లో అత్యాచారాలు, లైంగిక హింస పెచ్చరిల్లాయి. ప్రమాదకర స్థాయిలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యా మౌలిక సదుపాయాల విధ్వంసం, పాఠశాలల సమీపంలో అభద్రతా భావం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పిల్లల్లో పోషకాహార లోపం కూడా ప్రమాదకర స్థాయికి పెరిగింది. యుద్ధం పిల్లల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని పిల్లల్లో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ పెరిగింది. పిల్లల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. విచారం, భయం వంటి వాటితో బాధపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 10 మంది మృతి
-
వీళ్లు వ్యాక్సిన్ వేశారు.. వాళ్లు బాంబులు వేశారు!
గాజాలోని.. ఓ ఆస్పత్రి. 22 నెలల వయసున్న చెల్లెలు మిస్క్ తో కలిసి నాలుగు నెలలుగా ఆస్పత్రిలోనే ఉంటోంది మూడేళ్ల హనన్. ‘అమ్మేది?’, ‘కాళ్లెక్కడికి పోయాయి’పదే పదే అడిగే ఈ ప్రశ్న తప్ప వారి నోటినుంచి మరో మాటలేదు. ‘నాలుగు నెలలుగా మనమో పీడకలలో ఉన్నాం’అని చెబుతోంది పక్కనే ఉన్న వారి అత్త. బాంబు దాడిలో అమ్మ చనిపోయిందని, ఆ దాడిలోనే ఇద్దరి కాళ్లూ పోయాయని వాళ్లకు చెప్పలేక కుమిలిపోతోంది. ఇది గాజాలోని ఆస్పత్రుల్లో కనిపించే నిత్య దృశ్యం. మనుషులు వేరు.. అడిగే ప్రశ్నలు వేరు.. కానీ ఎవ్వరి దగ్గరా సమాధానాలు ఉండవు. తమ ప్రమేయం ఏమాత్రం లేకపోయినా.. జరుగుతున్న మారణహోమంలో ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులు వేలమంది. వైకల్యం పాలైనవారి లెక్కలు లేనేలేవు.గాజాలో తొలి పోలియో కేసు నమోదు కావడంతో ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు యుద్ధానికి విరామం ప్రకటించాలని సూచించింది. ఇజ్రాయెల్, గాజా రెండూ ఈ విరామాన్ని అంగీకరించాయి. సెపె్టంబర్ 2న కార్యక్రమం మొదలైంది. డేర్ ఎల్ బలాహ్‌లో ఉంటున్న షైమా అల్ దఖీ... ఉదయాన్నే లేచి తన ఇద్దరు కుమార్తెలు హనన్, మిస్్కను తీసుకెళ్లి టీకా ఇప్పించింది. మరుసటి రోజు కుటుంబం భోజనం చేసింది.. నిద్రించడానికి ఉపక్రమిస్తుండగా.. వాళ్ల ఇంటిపై బాంబు దాడి. ఈ ఘటనలో షైమా ప్రాణాలు కోల్పోయింది. భర్త మహ్మద్ అల్ దఖీతో సహా ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. హనన్ రెండు కాళ్ళను కోల్పోయింది. ఆమె శరీరమంతా గాయాలే. చిన్నారి మిస్క్ ఎడమ కాలు కోల్పోయింది. తలలో తీవ్ర రక్తస్రావమవ్వడంతో మహమ్మద్ రెండు వారాలపాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. భయానకంగా భవిష్యత్... మహమ్మద్ సోదరి షెఫా.. ఇద్దరు అమ్మాయిలను ఓదార్చడానికి ప్రయతి్నస్తోంది. ఇద్దరూ భయంతో వణికిపోతూ అత్తను పట్టుకునే ఉంటున్నారు. ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పి వారిని ఊరడిస్తోంది. కానీ.. భవిష్యత్‌లో పిల్లల పరిస్థితి ఏమిటి? తమ వయసులోని ఇతర పిల్లలను చూసి వీళ్లేమనుకుంటారు. లోకమంటే తెలియని మిస్్కకు అంత కష్టం కాకపోయినా.. తన కుటుంబానికి ఏం జరిగిందో కొంచెం అర్థమైన హనన్‌కు మాత్రం ఇది కష్టంగా ఉంది. పెరుగుతున్న బాధితులతో చికిత్స అందించడానికే సమయం సరిపోని వైద్యులకు చిన్నారులకు మానసికంగా మద్దతు ఇచ్చే అవకాశం అసలే లేదు. షెఫాతోపాటు షైమా తల్లిదండ్రులు, షెమా సోదరుడు అహ్మద్ పిల్లలను చూసుకుంటున్నారు. పిల్లలు బొమ్మలు కావాలంటున్నారు.. కానీ రొట్టెముక్క విలాసంగా మారిన చోట బొమ్మలు దొరకడం అసాధ్యం కదా! ఏచిన్న అవకాశం దొరికినా పిల్లలను సంతోషంగా ఉంచేందుకు కానుకలు తెస్తున్నారు. ఇతర పిల్లల కాళ్ల వైపు చూస్తూ.. ‘‘గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచే షైమా బిడ్డల గురించి భయపడింది. వారికి పోషకాహారం అందించడానికి ఎంతో శ్రమించింది. వారితోనే సమయం గడిపింది. వాళ్లు కావాలన్నది ఇవ్వడానికి ప్రయతి్నంచింది. పోలియో వ్యాక్సిన్ల ప్రకటన రాగానే.. పోలియో నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్స్ తన పిల్లలకు వేయించడమే కాదు.. బంధువులందరినీ ప్రోత్సహించింది. కానీ ఏం జరిగింది. పోలియో నుంచి రక్షణ లభించింది కానీ.. ఇజ్రాయెల్ వైమానిక దాడి వారి కాళ్లను తీసుకుంది. షైమాను పొట్టన పెట్టుకుంది. తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. హనన్ది నా కూతురు హలాది ఒకే వయసు. హలాను ఆస్పత్రికి తీసుకొచి్చనప్పుడు.. హనన్ భావాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. హలా కాళ్ల వైపు చూస్తూ, ఆ తర్వాత తన కాళ్లను చూసుకుంటూ ఉండిపోయింది. బాంబు దాడికి ముందు వాళ్లిద్దరూ కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఆసుపత్రి మంచంపై ఆడుకుంటున్నారు’’అంటూ కన్నీటి పర్యంతమవుతోంది షెఫా. వైద్యం కోసం ఎదురుచూపులు బాంబుదాడులతో గాజా ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయింది. చిన్నారులిద్దరూ పూర్తిగా కోలుకోవాలంటే గాజాలో ఇచ్చే చికిత్స సరిపోదు. వాళ్లకు కేవలం ప్రోస్థెటిక్స్ అమరిస్తే సరిపోదు. పిల్లలిద్దరిదీ ఎదిగే వయసు. వయసుతో పాటు ఎముక పెరుగుదల కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే నిరంతర పర్యవేక్షణ, శస్త్రచికిత్సలు అవసరం. చికిత్స కోసం గాజాను విడిచిపెట్టాల్సిన వ్యక్తుల జాబితాలో వాళ్ల పేర్లను చేర్చారు. ఇజ్రాయెల్ ఆమోదిస్తే తప్ప వారిని విడిచిపెట్టలేరు. ఆమోదం కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘నేను బూట్లెలా వేసుకోవాలి?’, ‘నేను ఆడుకోవడానికి పార్క్‌కు వెళ్లొద్దా?’అంటూ పిల్లలడిగే ప్రశ్నలకు బదులెవరు చెప్తారు? గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని నిశ్శబ్దంగా చూస్తున్న ప్రపంచాన్ని భవిష్యత్‌లో ఆ చిన్నారులు ఎలా చూస్తారు? అంతటా సమాధానం లేని ప్రశ్నలే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓవైపు చలి మరోవైపు ఆకలి
శీతాకాలం.. అంటేనే భూమిమీద ఉత్తరార్థ గోళానికి పండుగ వాతావరణం. ప్రపంచంలో మూడోవంతు జనాభా ఇప్పుడు హాలిడే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఉత్తరార్థగోళ చలి ప్రభావాన్ని నేరుగా చవిచూస్తే గాజా స్ట్రిప్ మాత్రం వేడుకలకు దూరంగా ఆకలితో పోరాటం చేస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా పండుగకు సిద్ధమవుతుంటే క్షిపణుల మోతలు, బాంబుల దాడులతో ధ్వంసమైన గాజా నిరాశ, ఆకలితో మరణపు అంచున ఒంటరిగా నిలబడింది. ఉత్తరార్ధ గోళంలోకి వచ్చిన శీతాకాలం గాజాలో మరింత విషాదాన్ని తెచ్చిపెట్టింది. చల్లని వాతావరణం, వర్షం గాజాలో నిరాశ్రయులైన 20 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షం కురిసింది. నిర్వాసితుల గుడారాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని కూలిపోయాయి. ఇది వేలాది నిరుపేద కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టింది. బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇళ్ల నుంచి కేవలం కట్టుబట్టలతో బయటపడ్డారు. కొందరు శిథిలాల నుంచి బట్టలు తెచ్చుకున్నారు. కానీ అత్యధిక శాతం పాలస్తీనియన్లకు ఆ అవకాశం లేకుండాపోయింది. చలికాలం రావడంతో ఒంటిని వెచ్చగా ఉంచే సరైన దుస్తులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీసం చెప్పులు కూడా కొనుక్కోలేని దుస్థితి. ఆకాశాన్నంటుతున్న ధరలు ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఒక కొత్త గుడారం 1,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక తాత్కాలిక షెల్టర్ వందల డాలర్లు ఖర్చవుతుంది. ఒక కొత్త దుప్పటి 100 డాలర్ల వరకు ఉంటుంది. బట్టల ధరలు మరింత పెరిగిపోయాయి. ఒక లైట్ పైజామా ధర ఇప్పుడు 95 డాలర్లు. ఒక కోటు వంద డాలర్లు. ఒక జత బూట్లు 75 డాలర్లు. చలి కాచుకోవడానికి సరిపడా ఇంధనం లేదు. ఇక 8 కిలోల గ్యాస్ ధర 72 డాలర్లకు చేరుకుంది. కలప ధర కొంచెం తక్కువ. కానీ పునరావాస శిబిరాల్లో ఉన్న ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు. విపరీతమైన డిమాండ్‌ను తీర్చడానికి గాజా అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లు వెలిశాయి. అక్కడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రబలుతున్న వ్యాధులు వెచ్చగా ఉంచేందుకు బట్టలు, ఇంధనం లేకపోవడంతో శీతాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. పోషకాహార లోపంతో బలహీనపడిన శరణార్థుల శరీరాలు విపరీతమైన భయం, బాంబుల గాయాలతో అలసిపోయాయి. అందుకే సాధారణ జలుబును కూడా వాళ్లు తట్టుకోలేక ఊరకనే జబ్బు పడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. బాంబు దాడిలో తీవ్రంగా గా యపడిన వారికి మాత్రమే వైద్యం అందుతోంది. ఔషధాలు, సిబ్బంది కొరతతో సాధారణ రోగాలకు వైద్యం అందించలేకపోతున్నాయి. పరిశుభ్రత దాదాపు అసాధ్యంగా మారడంతో వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. చలివాతారణంలో సరైన విద్యుత్, ఇతరత్రా వసతులు ఏక గుడారాల్లో నిర్వాసితులు సరిగా స్నానం చేయలేక తిప్పలు పడుతున్నారు. చివరకు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోలేని దైన్యం వాళ్లది. అత్యంత విలాసం.. రొట్టె ముక్క అక్టోబర్ నుంచి గాజాలోకి వచ్చే అంతర్జాతీయ మానవతా సహాయం కూడా చాలా తగ్గిపోయింది. గాజా స్ట్రిప్ మొత్తం వినాశకరమైన కరువును ఎదుర్కొంటోంది. డిమాండ్ పెరిగి సరకు రవాణా బాగా తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పైకి ఎగశాయి. ఒక బస్తా పిండి ధర ఇప్పుడు ఏకంగా 300 డాలర్లకు పైనే ఉంది. ఇతర ఆహార పదార్థాలు కూడా ప్రియమైపోయాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేట మాంసం, కోడి మాంసం కోరుకోవడం చాలా పెద్ద అత్యాశ కిందే లెక్క. ఒకప్పుడు కుటుంబాలకు జీవనాడి అయిన బేకరీలు ఇప్పుడు ముడి సరుకులు అందక మూతపడ్డాయి. ఒక రొట్టె దొరకడమే చాలా కష్టంగా మారింది. పిండి దొరికినా అది పురుగులమయం. ఒకవేళ పురుగులు లేకుంటే అప్పటికే అది ముక్కిపోయి ఉంటోంది. దీంతో ప్రజలు ఇప్పుడు తకాయా(ఛారిటీ సూప్ కిచెన్ల)పై ఆధారపడవలసి వస్తోంది. ఉదయం 11:00 గంటలకు ఇవి తెరిచే సమయానికి పంపిణీ కేంద్రాల ముందు జనం చాంతాడంత వరసల్లో క్యూ కడుతున్నారు. వేలాది మంది శరణార్థుల కుటుంబాలకు తమ పిల్లలను పోషించడానికి ఇవి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. భరించలేని మానసిక వేదన ఆకలి శారీరక బాధే అయినా మానసిక వేదన అంతులేకుండా ఉంది. 2 లక్షలకు మందికి పైగా పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. సరైన పౌష్టికాహారం లేక చిన్నారుల శరీరాలు ఎముకల గూడులాగా తయారయ్యాయి. వందలమంది చిన్నారులు సరైన తిండితిప్పలు లేక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. పిల్లలకు సరైన తిండికూడా పెట్టలేకపోతున్నామన్న బాధ తల్లిదండ్రులను విపరీతంగా వేధిస్తోంది. ఆకలితో చచ్చిపోతున్న పిల్లలను చూసి నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. కన్నపిల్లలు కడతేరిపోతుంటే కన్నవారి కష్టాలకు హద్దుల్లేకుండా పోయిది. అత్యంత క్రూరమైన ఈ పరిస్థితులను దూరం నుంచి చూస్తున్న పశి్చమదేశాలు నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం. భూతలంపై నడిమధ్యలోనే ఉన్నా చలి, ఆకలితో పాలస్తీనా సమాజం ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ మరణంకోసం ఎదురుచూస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజాలో శరణార్థులపై ఇజ్రాయెల్ దాడులు..26 మంది మృతి
గాజా:ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో పాలస్తీనా పౌరులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 26 మంది శరణార్థులు మృతి చెందారు. ఈమేరకు పాలస్తీనా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం(డిసెంబర్ 10) అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి.శరణార్థులు ఆశ్రయం పొందుతున్న శిబిరంపై దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపైనా దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 40 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. -
గుప్పెడు మెతుకుల దొరక్క.. గాజాలో మిన్నంటిన ఆకలి కేకలు (ఫొటోలు)
-
గాజాలో ఆకలి కేకలు
ఇజ్రాయెల్ దిగ్బంధంలో ఉన్న గాజాలో పాలస్తీనియన్లు పడుతున్న అంతులేని అగచాట్లకు నిదర్శనం ఈ ఫొటోలు. కనీసం ఆహారం సైతం దొరక్క వాళ్లు అలమటిస్తున్నారు. శుక్రవారం ఖాన్‌యూనిస్‌లోని శరణార్థి శిబిరం సమీపంలోని ఉచిత ఆహార పంపిణీ కేంద్రం వద్ద పాలస్తీనా మహిళలు, బాలికలు ఆహారం కోసం ఇలా పోటీ పడ్డారు. వారి దురవస్థ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తీవ్రత నేపథ్యంలో గాజాకు ఆహార పంపిణీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఐరాస సహాయ సంస్థలు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. దాంతో గాజావాసుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. యుద్ధ తీవ్రత నేపథ్యంలో చాలాకాలంగా వారంతా ఐరాస సాయంపైనే ఆధారపడి బతుకీడుస్తూ వస్తున్నారు. దాంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటడం ఖాయమంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంతటి కారుచీకట్లలోనూ ఒక కాంతిరేఖ మిణుకుమంటోంది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలైనట్టు హమాస్ ప్రతినిధి బస్సెమ్ నయీమ్ తాజాగా చెప్పారు. పరస్పరం బందీల విడుదలతో 14 నెలల పై చిలుకు యుద్ధానికి త్వరలోనే ముగింపు వస్తుందని ఆశిస్తున్నట్టు వివరించారు.