
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. వేల సంఖ్యలో మరణాలు, కోట్ల సంఖ్యలో ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది గాజా ప్రజలు తాము పుట్టిన భూమిని వదిలి శరణార్థి శిబిరాలకు వెళ్లారు.

ఇప్పుడు యుద్ధం ముగిసిన నేపథ్యంలో మళ్లీ బతుకు జీవుడా అంటూ తమ నివాసాలకు చేరుకుంటున్నారు.

పొట్టచేతపట్టుకొని ఎలా వెళ్లారో అలాగే, మళ్లీ తిరిగి వెళ్తుంటే అక్కడ తమకంటూ ఏమైనా మిగిలుందో లేదో తెలియని దుస్థితి వారిని వేధిస్తోంది

ఎలాబతకాలో తెలియని ఆందోళన వారి హృదయాలను బరువెక్కిస్తోంది

ఇవన్నీ ఆలోచించుకుంటూ లక్షలాది మంది గాజా ప్రజలు తమ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎన్నో ఆలోచనలు వారిని వెంటాడుతున్నాయి. కొన్ని లక్షల మంది గుంపు గాజా వైపు వెళ్తున్న దృశ్యాలను నెటిజన్లను కన్నీరుపెట్టిస్తున్నాయి.




























