కైరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరబ్ దేశాలు షాకిచ్చాయి. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత తాజాగా ట్రంప్ చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాలస్తీనాలోని గాజా పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ప్రజలు నివసించేందుకు అక్కడి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి.
ఈ నేపథ్యంలో అక్కడున్న పాలస్తీనీయులకు పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లలో పునరావాసం కల్పించాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఈమేరకు ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి.
కాగా, గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 45 వేలమందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టంతో పాటు గాజాలో ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ప్రజల జీవనానికి కావల్సిన మౌలిక సదుపాయాలేవీ ఇప్పుడక్కడ లేవు. గాజా పునఃనిర్మాణానికి భారీగా నిధుల అవసరం ఉంది. తాజాగా ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో గాజా నుంచి చెల్లాచెదురైన అక్కడి వారు తిరిగి గాజాకు చేరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment