Rejected
-
ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురు
ఢిల్లీ: లైంగిక దాడుల కేసుల్లో కర్ణాటక నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భంగపాటు ఎదురైంది. బెయిల్ విజ్ఞప్తిని సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇంతకు ముందు.. కర్ణాటక హైకోర్టు కూడా ఆయన బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. -
అమెరికా మత స్వేచ్ఛ రిపోర్టు.. రిజెక్ట్ చేసిన భారత్
న్యూఢిల్లీ: అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023 పూర్తిగా పక్షపాతవైఖరితో కూడినదని భారత్ విమర్శించింది. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం(జూన్28) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. భారత్‌లో సామాజిక కూర్పును అర్థం చేసుకోకుండా కేవలం ఓట్‌బ్యాంకు పాలిటిక్స్ ఆధారంగా తయారు చేసిన నివేదికలా అది కనిపిస్తోందన్నారు. ‘రిపోర్టులో చాలా పొరపాట్లున్నాయి. ఎంపిక చేసుకున్న అంశాలను వారికి కావల్సిన చోట కావల్సినట్లుగా అన్వయించుకున్నారు. పక్షపాత వైఖరితో తయారు చేశారు. రాజ్యాంగ నిబంధనలను చట్టాలకు కూడా తమకు కావల్సినట్లుగా భాష్యం చెప్పారు’అని జైస్వాల్ తెలిపారు. -
రిజర్వేషన్ల పెంపు.. బీహార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
బీహార్‌లో రిజర్వేషన్ల పరిధిని మరింతగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిధిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఇతర వెనుకబడిన తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం మేరకు పెంచిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై పట్నా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పెంపును రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ గౌరవ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను పూర్తి చేశాక, మార్చి 11న నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. పట్నాహైకోర్టు ఈ రోజు(గురువారం) రిజర్వేషన్లపై తన తీర్పు వెలువరించింది. Patna High Court scraps 65% reservation for Backward Classes, EBCs, SCs & STs.The Court set aside the Bihar Reservation of Vacancies in Posts and Services (Amendment) Act, 2023 and The Bihar (In admission in Educational Institutions) Reservation (Amendment) Act, 2023 as ultra… pic.twitter.com/FTvY9CzvRn— ANI (@ANI) June 20, 2024 -
స్వాతిమలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి చేసిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్కు కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా బిభవ్‌కుమార్ న్యాయవాది వాదనలు వినిపించారు. బిభవ్‌కుమార్‌పై మలివాల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. మలివాల్ కావాలనే సీసీ కెమెరాలు లేని చోటే తనపై దాడి జరిగిందని కేసు పెట్టారన్నారు. అయితే బిభవ్‌కుమార్ దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని ప్రాసిక్యూషన్ వాదించింది. వాదనలు విన్న బిభవ్‌కుమార్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. తీస్‌హజారీ కోర్టు తన బెయిల్‌కు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పుపై బిభవ్‌కుమార్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
అల్లు అర్జున్‌తో ఛాన్స్.. నో చెప్పిన తెలుగు హీరో ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
నామినేషన్లలోనే సగం మంది అవుట్!
నోయిడా: లోక్‌సభ ఎన్నికల రెండో దశ నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఉత్తర ప్రదేశ్‌లోని రెండు స్థానాల్లో దాఖలైన నామినేషన్లలో సగానికి పైగా తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్‌లో 60 శాతం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా)లో దాదాపు 56 శాతం మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు స్థానిక ఎన్నికల అధికారులు తెలిపారు. ఘజియాబాద్‌లో 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 14 మంది అభ్యర్థుల దరఖాస్తులు ఆమోదించినట్లు జిల్లా ఎన్నికల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పక్కనే ఉన్న గౌతంబుద్ధ్ నగర్లో 34 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చాయని, వారిలో 15 మంది అభ్యర్థులు చెల్లుబాటయ్యారని పేర్కొంది. రెండు నియోజకవర్గాల్లో కలిపి 69 నామినేషన్లు రాగా అందులో 40 తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్‌లో నామినేషన్ల తిరస్కరణ 60 శాతం కాగా, గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో 55.89 శాతంగా నమోదైంది. అధికారిక జాబితా ప్రకారం.. ఘజియాబాద్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రెండు స్థానాల్లోనూ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8 కాగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. -
73 మంది అభ్యర్థులపై అనర్హత వేటు!
ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదయ్యింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులను భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) అనర్హులుగా ప్రకటించింది. ఖర్చు వివరాలు తెలియజేయని లేదా ఇతర నిబంధనలను పాటించని ఈ అభ్యర్థులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. భారత ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఈ అభ్యర్థుల జాబితాను బహిరంగపరిచింది. అనర్హతకు గురయిన ఈ 73 మందిలో 65 మంది అభ్యర్థులు 2024 వరకు, ఎనిమిదిమంది అభ్యర్థులు 2025 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమయ్యింది. వీటిని పరిశీలించాక సంబంధిత అధికారులు అనర్హుల జాబితాను విడుదల చేశారు. రాయ్‌పూర్ జిల్లా నుండి గరిష్టంగా 17 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఈ అనర్హుల జాబితాను భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసిందని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి యుఎస్ బాండే తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 19న ఒక స్థానానికి, ఏప్రిల్ 26న మూడు స్థానాలకు, మే 7న ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
మేం వినబోం.. హైకోర్టుకు చెప్పుకోండి
న్యూఢిల్లీ: టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడులు, అత్యాచారం ఆరోపణల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపు తన శిక్షను రద్దుచేయాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తామేమీ వినదల్చుకోలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఏదైనా ఉపశమనం కావాలంటే రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లండి’’ అని స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు ఆశారం గతంలో పెట్టుకున్న పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు నాలుగుసార్లు కొట్టేసిందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశారాం శిక్ష రద్దుచేసి మహారాష్ట్ర ఆస్పత్రిలో వైద్యానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తామేమీ చేయలేవని, మళ్లీ హైకోర్టుకే వెళ్లాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 2013 ఏడాదిలో తన ఆశ్రమంలో టీనేజీ అమ్మాయిని రేప్ చేశాడనే కేసులో అదే ఏడాది అరెస్టయి 2018లో పోక్సో కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. -
చిరంజీవి ఇంటికి పిలిచి ఆఫరిస్తే రిజెక్ట్ చేశా..
-
Israel-Hamas war: స్వతంత్ర పాలస్తీనాకు నెతన్యాహు నో
టెల్ అవీవ్: గాజాలో యుద్ధం ముగిశాక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలన్న అగ్ర రాజ్యం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హమాస్ నిర్మూలన, బందీల విడుదలతో సంపూర్ణ విజయం లభించేదాకా గాజాలో యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. గాజాలోని 25 వేల మంది ప్రజలు మృత్యువాత, 85% మంది ప్రజలు వలసబాట పట్టిన నేపథ్యంలో యుద్ధం విరమించుకునేలా చర్చలు జరపాలంటూ ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా సహా పలు దేశాలు ‘రెండు దేశాల’విధానాన్ని పునరుద్ధరించాలంటూ కోరుతున్నాయి. అయితే, నెతన్యాహు తాజా ప్రకటనతో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ నిర్ణయంలో మార్పులేదని స్పష్టమైంది. నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ప్రతినిధి జాన్ కిర్బీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికాలు ఒకే అంశంపై భిన్నంగా ఆలోచించడం సహజమేనన్నారు. -
మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకులపై కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఆయన భార్య పాయల్ అబ్ధుల్లా నుంచి విడాకులు మంజూరు చేసేందుకు ఢిల్లీ హై కోర్టు నిరాకరించింది. ఒమర్ అబ్దుల్లా విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని హై కోర్టు వ్యాఖ్యానించింది. ఒమర్ అబ్దుల్లాపై ఆయన భార్య చూపిన క్రూరత్వం ఏమీ లేదని అందుకే విడాకుల మంజూరు కుదరదని తేల్చి చెప్పింది. ‘ఒమర్ అబ్దుల్లా పిటిషన్లో క్రూరత్వానికి సంబంధించిన ఆరోపణలు స్పష్టంగా లేవు. వాటికి పెద్దగా ఆధారాలు లేవు. కింది కోర్టు తీర్పుపై వేసిన అప్పీల్ పిటిషన్లో ఎలాంటి మెరిట్స్ లేవు. అందుకే ఈ అప్పీల్‌ను డిస్మిస్ చేస్తున్నాం’అనిజస్టిస్ సంజీవ్ సచ్దేవ,జస్టిస్ వికాస్ మహాజన్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒమర్ అబ్దుల్లా విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. పాయల్ రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేత సచిన్ పైలట్ చెల్లెలు కావడం విశేషం. ఇదీచదవండి..నా పై దాడికి సీఎం కుట్ర: గవర్నర్ సంచలన ఆరోపణలు -
లిక్కర్ స్కాంలో ఆప్ నేత మనీష్ సిసోడియాకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశే ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో కేసు విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హాజరయ్యారు. మనీష్ సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలను వినిపించారు. రూ. 338 కోట్ల బదిలీకి సంబంధించి సందేహాస్పదమైన కొన్ని అంశాలున్నందవల్లే బెయిల్‌ను తిరస్కరించామని జస్టిస్ ఖన్నా అన్నారు. విచారణ నెమ్మదిగా సాగితే సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. తాజా తీర్పుతో సిసోడియాకు మరో ఆరు నెలల పాటు జైలులోనే ఉండనున్నారు. అయితే, ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో తన తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో విచారణకు ఎంత సమయం పడుతుందని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్యం కుంభకోణంలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. అరెస్టయిన సమయంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో ఫిబ్రవరి 28న క్యాబినెట్‌కు రాజీనామా చేశారు. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా ♦ ఈ కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారులుబదులుగా కొంతమంది వ్యాపారులకు మద్యం లైసెన్స్‌లు మంజూరు చేసేందుకు సహకరించారనే ఆరోపణలు ♦ కొందరు మద్యం విక్రయదారులకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ఎక్సైజ్ పాలసీని మార్చారని అభియోగాలు ♦ ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ ♦ ఎక్సైజ్ శాఖతో సహా 18 పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తున్న సిసోడియా ఫిబ్రవరి 28న క్యాబినెట్‌కు రాజీనామా ♦ మనీలాండరింగ్ కేసులో మార్చి 9న తీహార్ జైలులో విచారించిన తర్వాత ఈడీ అరెస్టు చేసింది. ♦ "హై ప్రొఫైల్" వ్యక్తి అంటూ మే 30న సీబీఐ కేసులోబెయిల్ నిరాకరించిన హైకోర్టు ♦ జూలై 3న మనీలాండరింగ్ కేసులో కూడా బెయిల్‌ను తిరస్కరణ ♦ సిసోడియాను సుదీర్ఘ కాలం కటకటాల వెనుక ఉంచలేరు, ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి- సుప్రీం ♦ విశ్లేషణలో కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ తిరస్కరించినట్టు తాజాగాపేర్కొన్న సుప్రీంకోర్టు Supreme Court dismisses the bail plea of former Delhi Deputy CM Manish Sisodia in connection with cases related to alleged irregularities in the Delhi Excise Policy case. pic.twitter.com/3gAYUMGW9I— ANI (@ANI) October 30, 2023 -
టీడీపీ సోషల్ మీడియా అత్యుత్సాహం
సాక్షి, అమరావతి: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు అరెస్ట్‌పై వాదోపవాదాలు నడుస్తున్న సమయంలో టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా అత్యుత్సాహంతో చెలరేగిపోయింది. జడ్జి ఎటువంటి నిర్ణయం చెప్పకుండానే మధ్యాహ్నం 2 గంటల నుంచి చంద్రబాబు రిమాండ్‌ను తిరస్కరిస్తున్నట్టు తమకు సమాచారం ఉందని విపరీతంగా ప్రచారం చేశాయి. ఐటీడీపీకి చెందిన కార్యకర్తలు ట్విట్టర్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియాల్లో రిమాండ్‌ను తిరస్కరించినట్టు పోస్టులు కూడా పెట్టి వైరల్ చేశారు. ఇంకా జడ్జి తీర్పు వెల్లడించలేదని తెలిసి కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఇష్టానుసారం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అంతటా గందరగోళం నెలకొంది. చంద్రబాబు ఇంటికి వెళ్లిపోతారని, కోర్టులో ఆయనకు అనుకూలంగా నిర్ణయం ఉందనే భావన వచ్చేలా చేశారు. కొన్నిచోట్ల అయితే టపాసులు కాల్చడం, స్వీట్లు పంచడం కూడా చేశారు. పలుచోట్ల సంబరాలకు నేతలు సిద్ధమయ్యారు. చంద్రబాబు తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించి బయటకు వచ్చి విక్టరీ గుర్తు చూపించడంతో దాన్ని వైరల్ చేస్తూ చంద్రబాబు ఇంటికి వెళ్లిపోతారనే ప్రచారం చేశారు. కోర్టు నుంచి చంద్రబాబు నేరుగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళతారని అక్కడ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహిస్తారని, అనంతరం పవన్ కళ్యాణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడతారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. చివరకు చంద్రబాబుకు జడ్జి రిమాండ్ విధించడంతో ఒక్కసారిగా ఎల్లో మీడియా, ఐటీడీపీ సైలెంట్ అయిపోయాయి. -
పవన్ ప్రత్యేక విమానానికి పోలీసుల అనుమతి నిరాకరణ
సాక్షి, విజయవాడ: విజయవాడలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలు సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతిని పోలీసులు నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు పవన్‌కు అనుమతి లేదని.. కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ పర్మిషన్ లేదని పోలీసులు స్పష్టం చేశారు. భువనేశ్వరి, లోకేశ్‌లకు అనుమతిస్తామని తెలిపారు. ఉద్రిక్తతలు కోసం పవన్ వస్తున్నారంటూ తమకు సమాచారం ఉందన్న పోలీసులు.. ఆ మేరకు పవన్ ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్‌పోర్టు అధికారులకు పోలీసులు సమాచారం పంపించారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విధ్వంసం సృష్టించడానికి టీడీపీ కుట్రకు తెరలేపింది. చంద్రబాబుని తీసుకొచ్చే మార్గంలో అల్లర్లకు పథక రచన చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అన్ని జిల్లాల నేతలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. పలు చోట్ల పోలీసులపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెట్టి.. శాంతి భద్రతల సమస్య సృష్టించాలంటూ టీడీపీ నేతలకు కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా మైలేజ్ పొందాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. చదవండి: CBN: కళ్లు మూసుకుని అవినీతిని ప్రోత్సహించి.. -
టిమ్ కుక్కి చేదు అనుభవం - క్రెడిట్ కార్డుకి అప్లై చేస్తే..
ఆధునిక కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం ఎక్కువైంది.. సర్వ సాధారణమైపోయింది. నేడు చిన్న జాబ్ చేసే ఉద్యోగి నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల వరకు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం చాలా సంస్థలు సంపాదనను బేస్ చేసుకుని ఈ కార్డులను ప్రొవైడ్ చేస్తాయి. అయితే ప్రముఖ వ్యాపార వేత్తకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి బ్యాంక్ నిరాకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫైనాన్సియల్ సర్వీస్ ప్రొవైడర్ గోల్డ్‌మన్ సాచ్స్‌తో ఆపిల్ క్రెడిట్ కార్డు అందిస్తుంది. ఇలాంటి క్రెడిట్ కార్డు కోసం ఆపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయింది. ఆపిల్ అండ్ గోల్డ్‌మన్ సాచ్స్ కలిసి 'ఆపిల్ క్రెడిట్' ఒకే సమయంలో ప్రారంభించాయి. ఆ సమయంలో చాలామంది ప్రముఖులు కూడా దీని కోసం అప్లై చేసుకున్నారు. వారివి కూడా చాలా వరకు రిజెక్ట్ అయ్యాయి. ఇదీ చదవండి: కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా! టిమ్ కుక్ ధరఖాస్తుని తిరస్కరించడానికి ప్రధాన కారణం అయన పేరుని ఉపయోగించి ఎవరైనా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసి ఉండవచ్చనే అనుమానమే అని తెలుస్తోంది. ప్రస్తుతం కుక్ నికర సంపద విలువ 2 మిలియన్ డాలర్లని సమాచారం. -
ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!
ఉద్యోగమంటే టాలెంట్ చూసి ఇవ్వడం ఆనవాయితీ, అయితే బెంగళూరులో ఒక యువతి తెల్లగా ఉందన్న కారణంతో జాబ్ ఇవ్వలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బెంగళూరులో ఒక సంస్థ ఉద్యోగ ప్రకటన చూసి 'ప్రతీక్ష జిక్కర్' అనే యువతి అప్లై చేసుకుంది. కంపెనీ నిర్వహించిన పరీక్షలో విజయం పొందింది, ఆ తరువాత జరిగిన మూడు రౌండ్లను కూడా ఆమె పూర్తి చేసింది. అయితే చివరికి కంపెనీ మాత్రం ఈమెను రిజెక్ట్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఆమె తెల్లగా ఉండటమే అని సంస్థ తెలిపింది. కంపెనీ పంపిన మెయిల్లో 'మేము మీ ప్రొఫైల్ చూసాము, ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు మీకు ఉన్నాయి, కానీ మా మొత్తం టీమ్‌లోని ఇతర సభ్యులకంటే తెల్లగా ఉండటం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నామని' తెలిపింది. ఈ విషయాన్ని ప్రతీక్ష జిక్కర్ లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..) నిజానికి కంపెనీ మెయిల్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, మనిషి రంగును బట్టి కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని నేను ఊహించలేదు, మనిషి కలర్ కాకుండా ప్రతిభను బట్టి ఉద్యోగం ఇవ్వాలని కంపెనీని కోరుతూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన చాలామంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. బహుశా ఇలాంటి సంఘటన బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కావచ్చు. -
చైనా కంపెనీ విషయంలో భారత్ కీలక నిర్ణయం!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'బివైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) హైదరాబాద్‌కి చెందిన మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) కంపెనీతో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనికోసం కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కోసం చైనా సంస్థ మన దేశంలో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రతి పాదనను కేంద్రం నిరాకరించింది. భద్రత పరమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) ఇప్పటికే బివైడీ కంపెనీ ఈ6, ఆటో వంటి కార్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా త్వరలోనే మరో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. కాగా ఈ సమయంలో కేంద్రం ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. సరిహద్దు దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, కేంద్ర కూడా దీనికి అనుమతిస్తుంది. -
పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పురుషుల హక్కుల పరిరక్షణకు ‘జాతీయ కమిషన్ ఫర్ మెన్’ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గృహ హింస కారణంగా ఆత్మహత్యలకు పాల్పడే పురుషుల కేసులపై విచారణకు మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషనర్ న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ కోరారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2021లో 1,64,033 ఆత్మహత్యలు చేసుకోగా వారిలో 81,063 మంది వివాహితులైన పురుషులున్నారని, 28,680 మంది వివాహిత మహిళలని వివరించారు. వీరిలో కుటుంబ సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడిన వారు 33.2% కాగా, వివాహ సంబంధిత సమస్యలతో 4.8% మంది తనువు చాలించినట్లు తెలిపారు. వివాహమైన పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు, గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ పిల్‌పై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘మీరు నాణేనికి ఒక వైపునే చూపించాలనుకుంటున్నారు. పెళ్లవగానే చనిపోతున్న యువతుల డేటాను మీరివ్వగలరా? చనిపోవాలని ఎవరూ అనుకోరు. అది వ్యక్తిగతంగా వారు ఎదుర్కొనే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొంది. పిల్ ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌కు అవకాశం ఇచ్చింది. -
అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి
కథానాయకిగా నటి ప్రియమణికి మంచి పేరు ఉంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ కన్నడ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్ అయింది. తెలుగులో కొంతకాలం స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియమణి పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల నాగచైతన్య 'కస్టడీ'లో సీఎంగా మెప్పించింది. త్వరలో షారుఖ్ 'జవాన్' చిత్రంతో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రియమణి. కిస్ సీన్లకు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటో తాజాగా వెల్లడించింది. (ఇదీ చదవండి: ఆమెతో సుధీర్ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..) 'నేను స్క్రీన్‌పై ముద్దు సీన్లలో నటించకూడదని అనుకున్నాను. ఇప్పుడు నేను అలాంటి పాత్రలు చేయడం కరెక్ట్ కాదనిపించింది. సినిమాలో నాది ఒక పాత్ర అయినా వ్యక్తిగతంగా దాని వల్ల ఇబ్బంది పడతాను. అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా నేను తెరపై మరొక వ్యక్తిని ముద్దుపెట్టుకోవడం అంత సౌకర్యంగా కూడా అనిపించదు.' అని చెప్పింది. 2021లో ZEE5లో వచ్చిన 'హిస్ స్టోరీ' వెబ్ సీరిస్‌లో సత్యదీప్ మిశ్రాతో రొమాన్స్ సీన్‌తో పాటు ముద్దు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయని మేకర్స్ చెప్పారు. కానీ వాటికి ఒప్పోకోలేదని ప్రియమణి గుర్తుచేసింది. అలాంటి సన్నివేశాలలో నటించమని భారీ ప్రాజెక్ట్‌లు వచ్చాయి. అంతే కాకుండా భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. పెళ్లి తర్వాత అలాంటి వాటిలో నటించకూడదని కండీషన్స్ పెట్టుకున్నట్లు ప్రియమణి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) 2017లో తనకు వివాహమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి బోల్డ్ సీన్స్‌లో నటించలేదు. సినిమాను అంగీకరించడానికి ముందే ఈ విషయం గురించి దర్శక-నిర్మాతలకు తెలియజేస్తానని చెప్పింది. ఏ సినిమాలో నటించినా దాన్ని తమ ఇరు కుటుంబాల వాళ్లు చూస్తారు. అలాంటి సన్నివేశాల వల్ల వాళ్లు ఇబ్బంది పడడం తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రియమణి అని తెలిపింది. -
Adani Row: కేంద్రానికి సుప్రీం ఝలక్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సీల్డ్ కవర్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. అదానీ స్టాక్ పతనం తర్వాత ఇన్వెస్టర్ల సంపదను సంరక్షించేందుకు పటిష్ట యంత్రాంగం అవసరమని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది. అయితే ప్యానెల్ వివరాలను కేంద్రం సీల్డ్ కవర్లో సమర్పించగా.. సుప్రీం దానిని తిరస్కరించింది. ‘నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి’ ఏర్పాటు చేయబోయే ప్యానెల్ వివరాల ప్రతిపాదనలను ‘సీల్డ్’ కవర్లో ఇవ్వడం సరికాదు. మాకు సీల్డ్ కవర్ అక్కర్లేదు. మేము పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నాము. మేము ఈ సూచనలను అంగీకరిస్తే.. అది మేం కోరుకోని, ప్రభుత్వం నియమించిన కమిటీగా కనిపిస్తుంది. ఆ నిర్ణయం మాకే వదిలివేయండి అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కమిటీపై తన ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. కోట్లాది ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టి, విపక్షాల నుంచి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమైంది అదానీ స్టాక్స్ పతన వ్యవహారం. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు ఓ న్యాయమూర్తితో సహా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు గత వారం కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రం రెడీ అయ్యింది. ఇక అదానీ వ్యవహారం కేసులో సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లు ఇలా ఉన్నాయి. అదానీ కంపెనీల అడిటింగ్ వివరాలతో పాటు బ్యాంక్ రుణాల ఇచ్చిన షేర్ల విలువ తెలియజేయాలని కోరారు. మరో పిటిషన్లో అడ్వొకేట్ ఎంఎల్ శర్మ.. హిండెన్‌బర్గ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హిండెన్‌వర్గ్ నివేదికపై సుప్రీం కోర్టు ఆధారిత సిట్‌ను దర్యాప్తు కోసం ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తునకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్రం ఇదివరకే సుప్రీంకు తెలిపింది కూడా. -
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. రోహిత్‌రెడ్డి అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఆయన లేఖను ఈడీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రోహిత్‌రెడ్డి హాజరుకానున్నారు. కాగా, విచారణకు హాజరు కాలేనని లాయర్‌తో ఈడీకి రోహిత్‌రెడ్డి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని, వరుస సెలవులు కారణంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే రోహిత్‌రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. -
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. జైన్‌తో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్లకు కూడా బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్‌ను మే 30న అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయన జూన్‌లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. ఇప్పుడు రెండో సారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ కేసులో విచారణకు జైన్ సహకరించడం లేదని, దర్యాప్తు ముందుకుసాగకుండా తమను తప్పదోవ పట్టిస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో న్యాయస్థానం జైన్‌కు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. 2017 ఆగస్టు 24న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా జైన్‌ను ఈడీ అదికారులు మే 30న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. తిహాడ్ జైల్లో జైన్‌కు వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నాడనే ఆరోపణలతో ఆ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్ర ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ: 80 శాతంపైగా తిరస్కరణ?
సాక్షి, హైదరాబాద్: సర్కారు అక్రమిత నివాస స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులో సుమారు 80 శాతం పైగా తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. మిగతా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. గత మూడు నెలల క్రితమే జీవో 58 కింద దరఖాస్తులపై విచారణ పూర్తి కాగా, తాజాగా జీవో 59 కింద దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. ప్రతి మండలానికీ ఒక జిల్లా స్థాయి అధికారిని కేటాయించడం ద్వారా క్రమబద్దీకరణ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతంగా కొనసాగుతోంది.గతంలో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మరోసారి పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే క్రమబద్దీకరిస్తారు. చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు ప్రభుత్వ విలువ ఆధారంగా.. 59 జీవో కింద అక్రమిత స్థలాలను ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువ ఆధారంగా క్రమబద్దీకరించనున్నారు. 126 నుంచి 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువలో 25 శాతం.. 251 నుంచి 500 గజాల వరకు 50 శాతం.. 500 నుంచి 100 గజాల వరకు 75 శాతం.. 1000 గజాలపైన పూర్తి విలువను దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంటుంది. రెండు నెలల క్రితమే.. జీవో 58 కింద ఉచిత క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులపై రెండు నెలల క్రితమే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయింది. ప్రతి 250 దరఖాస్తులకు ఒక బృందం చొప్పున రంగంలో దిగి క్షేత్రస్థాయిలో వివరాలు, ఫొటోలు, తదితర ఆధారాలు ప్రత్యేక రూపొందించిన ‘జీవో 58 మొబైల్ యాప్’లో నమోదు చేశారు.అనంతరం సమగ్ర నివేదికను అధికార యంత్రాంగాలకు సిఫార్సు చేశారు. దరఖాస్తుల సంఖ్య 1.14 లక్షలపైనే ప్రభుత్వం అక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ పాత జీవో 58, 59లకు అనుబంధంగా కొత్త జీవోలను జారీ చేసంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు సుమారు 1.14 లక్షల పైన కుటుంబాలు ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 71,316, ఆతర్వాత రంగారెడ్డి జిల్లాలో 31,830, హైదరాబాద్ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచి్చనట్లు రెవెన్యూ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
కాంగ్రెస్ ఎన్నికలు: ఆయన నామినేషన్ తిరస్కరణ
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తైంది. సెప్టెంబర్ 30తో నామినేషన్ల దాఖలు గడువు పూర్తికాగా, ఇవాళ పరిశీలన కూడా పూర్తైంది. అయితే అందులో నుంచి ఓ నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ త్రిపాఠి(45) నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసుదన్ మిస్ట్రీ వెల్లడించారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల సెట్ నిబంధనల ప్రకారం లేదని, సంతకాలకు సంబంధించిన సమస్య తలెత్తిందని తెలిపారు. మొత్తం 20 పత్రాలు వచ్చాయని, అందులో నాలుగు సంతకాల సంబంధిత కారణాలతో తిరస్కరణకు గురైనట్లు మధుసుదన్ వెల్లడించారు. దీంతో బరిలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మరో ముఖ్య నేత శశిథరూర్‌లు నిలిచారు. కేఎన్ త్రిపాఠి.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. జార్ఖండ్ మాజీ మంత్రిగా కూడా పని చేశారు. గతంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(సొంత వర్గం)కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయితే.. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పని చేసిన త్రిపాఠి.. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచాడీయన. కోషియారా గ్రామంలో బీజేపీ అభ్యర్థి మద్దతుదారులు ఆయన్ని చుట్టుముట్టగా.. తుపాకీతో కాల్పులకు దిగాడు. అయితే ఆ పరిణామం ఆయనకేం సహకరించకపోగా.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. మావో ప్రభావిత పాలము జిల్లాకు చెందిన త్రిపాఠి.. లైసెన్స్ రివాల్వర్ కలిగి ఉన్నారు. ప్రాణహని నేపథ్యంతో ఎన్నికల టైంలోనూ ఆయన ఆ తుపాకీని అప్పగించాల్సిన అవసరం కూడా లేదు. ఇదిలా ఉంటే.. 2009లో దాల్టోన్‌గంజ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన. అదృష్టవశాత్తూ 2014లో త్రిపాఠికి మంత్రి బెర్త్ దక్కింది. దీంతో రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్, లేబర్ మినిస్టర్‌గా పని చేశారు. శుక్రవారం నామినేషన్ల సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. తాను రైతు బిడ్డను మాత్రమే కానని, సోనియాకు కూడా కొడుకు లాంటి వాడినేనంటూ ఉపన్యాసం దంచాడు. అందుకే పార్టీ టాప్ పోస్ట్‌కు పోటీ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు హైకమాండ్ ఏం చెబితే.. అది పాటిస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. అయితే ఆయన నామినేషన్ వేసి వచ్చిన కాసేపటికే పార్టీలో చర్చ నడిచింది. త్రిపాఠి బరిలో నిలవాంటే.. నాలుగు రాష్ట్రాల నుంచి కనీసం పది మంది ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలి. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ చివరి వరకు ఉంటుందా? అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే.. ఆయన నామినేషన్ చివరకు తిరస్కరణకు గురైంది. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని, ఆ తేదీ నాటికి ఒక ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ఓ స్పష్టత వస్తుందని మధుసుదన్ మిస్ట్రీ తెలిపారు. అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు. 19వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. -
బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పి రిస్క్ తీసుకున్నా:కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ విషయమైన సూటిగా స్పష్టంగా చెప్పేసే ఆమె ప్రస్తుతం సక్సెస్ఫుల్ హోస్ట్‌గా కూడా రాణిస్తోంది. ఇకపోతే కంగనా లేటెస్ట్ మూవీ 'ధాకడ్' నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కంగనా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పలు పెద్ద చిత్రాలను తిరస్కరించడం, అవార్డు ఫంక్షన్లకు దూరంగా ఉండటం వంటి పెద్ద రిస్క్ తీసుకోవడం వల్లే తను ఈ స్థాయికి ఎదిగినట్లు కంగనా తెలిపింది. 'నేను చాలా మేల్ సెంట్రిక్ చిత్రాలను తిరస్కరించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఖాన్, కుమార్ వంటి పెద్ద హీరోల సినిమాలు చేయనన్నందుకు 'ఎందుకు తన జీవితాన్ని వృథా చేసుకుంటుంది' అన్నట్లుగా నన్ను చూసేవారు. కానీ మీ భవిష్యత్తు పట్ల మీకు పూర్తి విజన్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీలో ఏదో సమస్య ఉందని మాత్రం అనుకుంటారు.' అని కంగనా పేర్కొంది. కాగా కంగనా నటించిన 'ధాకడ్' మూవీ మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ షారుఖ్, అక్షయ్, ప్రియాంక చోప్రా అంతా ఫెయిల్యూర్స్.. కంగనా షాకింగ్ కామెంట్స్