స్వరభాస్కర్
సినిమాలోని పాత్రకు సరిపడ గ్లామర్ లేదు.. ఫేస్‌లో సరైన ఎక్స్‌ప్రెషన్స్‌ను చూపించడం లేదు... ఇలాంటి కారణాలతో హీరోయిన్స్‌ను రిజెక్ట్ చేస్తుంటారు కొందరు డైరెక్టర్లు. కానీ, తెలివైన అమ్మాయిలా కనిపించినందుకు ఓ సినిమా చాన్స్‌ను కోల్పోయారట బాలీవుడ్ బ్యూటీ స్వరభాస్కర్. ఈ వింత అనుభవం గురించి ఆమె చెబుతూ–‘‘లుక్స్ బాగుండే హీరోయిన్స్‌కు మంచి అవకాశాలు వస్తుంటాయి. లేకపోతే ఏ హీరోయిన్ మేకప్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టరు. కానీ, నేను ముంబైకి వచ్చిన కొత్తల్లో సినిమా చాన్స్ కోసం ఓ డైరెక్టర్‌ను కలిశాను. ‘నువ్వు చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావు.. మా సినిమాలో తీసుకోలేం’ అన్నారాయన. ఆ డైరెక్టర్ మాటల్లోని మర్మం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అలాంటి సంఘటనలను వీలైనంత త్వరగా మర్చిపోవడమే మంచిది’’ అని చెప్పుకొచ్చారు స్వరభాస్కర్.
Comments
Please login to add a commentAdd a comment