intelligent
-
ఆల్ రౌండర్
-
ఇప్పటికీ అర్థం కావడం లేదు
సినిమాలోని పాత్రకు సరిపడ గ్లామర్ లేదు.. ఫేస్‌లో సరైన ఎక్స్‌ప్రెషన్స్‌ను చూపించడం లేదు... ఇలాంటి కారణాలతో హీరోయిన్స్‌ను రిజెక్ట్ చేస్తుంటారు కొందరు డైరెక్టర్లు. కానీ, తెలివైన అమ్మాయిలా కనిపించినందుకు ఓ సినిమా చాన్స్‌ను కోల్పోయారట బాలీవుడ్ బ్యూటీ స్వరభాస్కర్. ఈ వింత అనుభవం గురించి ఆమె చెబుతూ–‘‘లుక్స్ బాగుండే హీరోయిన్స్‌కు మంచి అవకాశాలు వస్తుంటాయి. లేకపోతే ఏ హీరోయిన్ మేకప్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టరు. కానీ, నేను ముంబైకి వచ్చిన కొత్తల్లో సినిమా చాన్స్ కోసం ఓ డైరెక్టర్‌ను కలిశాను. ‘నువ్వు చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావు.. మా సినిమాలో తీసుకోలేం’ అన్నారాయన. ఆ డైరెక్టర్ మాటల్లోని మర్మం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అలాంటి సంఘటనలను వీలైనంత త్వరగా మర్చిపోవడమే మంచిది’’ అని చెప్పుకొచ్చారు స్వరభాస్కర్. -
అరుదైన మేధావి!
మన కాలపు మహా మేధావి... ఐన్‌స్టీన్‌కు మాత్రమే సాటిరాగల విజ్ఞానఖని స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఆద్యుడైన గెలీలియో పుట్టిన జనవరి 8న ఒక అమ్మ కడుపున జన్మించి, మరో విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ జన్మ దినం రోజైన మార్చి 14న కన్నుమూసిన హాకింగ్ భౌతిక శాస్త్రాన్నీ... ప్రత్యేకించి విశ్వనిర్మాణ శాస్త్రాన్నీ ఒడిసిపట్టినవాడు. అందులోని ఎత్తుల్నీ, లోతుల్నీ మధించి లోకులకు తేటతెల్లమైన రీతిలో విప్పి చెప్పినవాడు. ఈ భూగోళం మనుగడపైనా, ఇక్కడి మానవాళి భవిష్యత్తుపైనా ఎంతగానో బెంగపెట్టుకున్నవాడు. వీళ్లందరికీ ఒక సురక్షితమైన గ్రహాన్ని చూపించి కాపాడాలని తపన పడినవాడు. ‘ఇది ఊహ కాదు... కల్పన కాదు, నూటికి నూరుపాళ్లూ వాస్తవం. సమయం మించిపోతోంది సుమా’ అంటూ పిలుపునిచ్చినవాడు. ఎవరెలాపోతే మనకేం అనుకునే లోకంలో మానవాళి భద్రత గురించి ఇలా ఆలోచించడం వింతగానే అనిపిస్తుంది. విశ్వాంత రాళంలో మనిషిని పోలిన జీవులుండొచ్చునని పదేళ్ల క్రితం జోస్యం చెప్పి వారివల్ల ప్రమాదం ముంచుకు రావొచ్చునని హెచ్చరించినప్పుడు అందరూ ఆయన్ను వెర్రి వాడిగా లెక్కేశారు. గ్రహాంతరజీవులు(ఏలియన్స్) మనకన్నా బాగా తెలివైనవాళ్లు అయివుండొచ్చునని, ప్రయోగాల పేరిట వాళ్లని నిద్ర లేపితే ఈ భూమి మనకు కాకుండా పోవచ్చునని కూడా హాకింగ్ హెచ్చరించారు. నిత్యం అంకెలతో సావాసం చేస్తూ జీవించినంతకాలమూ వాటితో ఆడుకున్న హాకింగ్... గణితంలో ఆసక్తి ఉండే వారంతా ‘పై డే’ (22/7= 3.14)గా పిలుచుకునే రోజైన మార్చి 14నే యాదృచ్ఛి కంగా కన్నుమూశాడు. విశ్వరహస్య పేటికను ఛేదించి అందులోని ప్రతి అంశాన్నీ పామర జనానికి కూడా విప్పి చెప్పిన హాకింగ్‌ను నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే ప్రకృతి చిన్న చూపు చూసింది. కండరాల కదలికల్ని స్తంభింపజేసే మాయదారి అమియోట్రోఫిక్ లాటరల్ స్కెలరోసిస్(ఏఎల్ఎస్) అనే వ్యాధి ఆవహించి అరుదైన ఆ మేధావిని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. అయితే అది శరీరాన్ని చేతనారహితం చేసిందే మోగానీ మెదడును తాకలేకపోయింది. ఆలోచనలకు ఆటంకాలు సృష్టించలేకపోయింది. వాటిని వ్యక్తీకరించే కంఠాన్ని నొక్కిపెట్టి ఉంచిందేమోగానీ ఆయన సంక ల్పాన్ని నిరోధించలేకపోయింది. చక్రాల కుర్చీకే అతుక్కుపోక తప్పని స్థితి ఏర్పడ్డా, ఆలోచనలు మెరుపు వేగంతో విశ్వాంతరాళాన్ని నిరంతరరాయంగా అన్వేషిస్తూనే వచ్చాయి. అందులోని వింతలనూ, విశేషాలనూ మధించాయి. ఆయన ఆత్మ స్థైర్యం ముందు ఆ మాయదారి వ్యాధి ఓడిపోయింది. అనుక్షణమూ దాన్ని ధిక్క రిస్తూ అపురూపమైన, అనూహ్యమైన సిద్ధాంతాలను ప్రతిపాదించి శాస్త్ర విజ్ఞాన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఏఎల్ఎస్ వ్యాధి సోకింది గనుక ఇక రెండే ళ్లకు మించి బతకడని చెప్పిన వైద్యుల్ని పరిహసించడమే కాదు... అంతక్రితం ఎవరి చూపూ పడని అనేకానేక అంశాలపై దృష్టి సారించి అరుదైన ప్రతిపాదనలు చేశారు. అసంఖ్యాకంగా గ్రంథాలు వెలువరించారు. ఆయన రాసిన ‘ఏబ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ ప్రపంచవ్యాప్తంగా నలభై భాషల్లోకి అనువాదమైంది. 237 వారాలపాటు నిరంతరాయంగా లండన్ ‘సండే టైమ్స్’ బెస్ట్ సెల్లర్ గ్రంథాల్లో అగ్రభాగాన ఉంది. ప్రపంచ దేశాల్లో ఆ గ్రంథం చదివిన అనేకులు అనంతరకాలంలో శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకున్నారు. చిన్నప్పుడు తరగతి గదిలో టీచర్ పాఠం చెబుతుంటే బుద్ధిగా కూర్చుని వినే లక్షణం హాకింగ్‌కు లేదు. ఆ పాఠంలో టీచర్ కూడా గమనించని సంగతుల్ని ఇట్టే పట్టేయడం, వాటిల్లోని గుణదోషాలను చర్చించడం ఆయనకు హాబీ. కాగితం, కలంతో పనిలేకుండా కేవలం కళ్లతో చూసి చటుక్కునచెప్పే హాకింగ్ టీచర్లకు ఒక వింత. గెలీలియో త్రిశత జయంతి రోజునే పుట్టిన హాకింగ్‌కు ఆ శాస్త్రవేత్తంటే వల్ల మాలిన అభిమానం. ‘అందరూ కళ్లతో వస్తువుల్ని చూస్తారు. అందుకోసమే వాటిని వినియోగిస్తారు. కానీ ఆ వస్తువుల లోలోతుల్ని ఆరా తీసేలా కళ్లను సమ ర్ధవంతంగా వినియోగించింది గెలీలియోనే’ అని ఒక సందర్భంలో హాకింగ్ అంటాడు. చిత్రమేమంటే ఈ మాటలే ఆయనకు కూడా వర్తిస్తాయి. కృష్ణ బిలాల గురించి, వాటి పనితీరు గురించి అంచనా వేయడానికి హాకింగ్ ఒక విధానాన్ని రూపొందిం చారు. విజ్ఞాన శాస్త్రంలో అది ‘హాకింగ్ రేడియేషన్’గా గుర్తిం పుపొందింది. భౌతిక శాస్త్రంలోని ఏ రెండు విభాగాలకూ పొసగదని ఒక చమత్కారం ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని, క్వాంటమ్ మెకానిక్స్‌నూ మేళ వించి అందులోని సూక్ష్మాంశాల ప్రాతిపదికగా కృష్ణబిలాలు క్రమేపీ ద్రవ్యరాశిని కోల్పోతూ నక్షత్రాల్లాగే అవి అంతరించి పోతాయని హాకింగ్ రుజువుచేశాడు. అంతేనా... ‘మీ జీవితం ఒక కృష్ణబిలం అను కుంటున్నారా... అను కోండి. కానీ అది కూడా అంతరించిపోయి కొత్తరూపు దాల్చకతప్పదని తెలుసుకోండి’ అంటూ నిరా శావాదులకు ఆత్మవిశ్వాసం నూరి పోశాడు. ‘కిందనున్న పాదాలకేసి కాదు... నక్షత్రాలవైపు చూపు సారించండ’ని ఉద్బోధించాడు. హాకింగ్‌కొచ్చిన వ్యాధి ఎలాంటిదో, దానివల్ల ఆయన పడుతున్న యాత నేమిటో, అందుకు అలవాటుపడి ఆ పరిమితుల్లోనే ఎలా జీవనం సాగిస్తున్నాడో తెలియజెప్పే ‘ద థియరీ ఆఫ్ ఎవ్విర్‌థింగ్’ అనే చిత్రం నాలుగేళ్లక్రితం వచ్చింది. ‘మనమేం అధికులం కాదు. కోతుల్లో కాస్త అభివృద్ధిచెందిన జాతివాళ్లం’ అంటూ హెచ్చరించి మన చేష్టలతో పర్యవరణకొస్తున్న ప్రమాదాన్నీ, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తెచ్చే పరిణామాల్నీ చర్చించిన అరుదైన శాస్త్రవేత్త ఆయన. అయిదారు నెలలక్రితం ఒక చర్చ సందర్భంగా ‘ప్రజలకు రోబోలకన్నా పెట్టుబడిదారీ విధానంతోనే, అది తెచ్చే అసమానతలతోనే ముప్పు ఎక్కువ’ని హాకింగ్ చెప్పడాన్నిబట్టి ఆయన ఆలోచనాధారను అర్ధం చేసుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రంపైన మాత్రమే కాదు... సమాజగమనంపై కూడా ఆయన చూపెంత నిశితమో ఈ వ్యాఖ్య పట్టి చూపుతుంది. స్టీఫెన్ హాకింగ్‌వంటి అరుదైన మేధావిని, అపు రూపమైన శాస్త్రవేత్తను కోల్పోవడం మానవాళి చేసుకున్న దురదృష్టం. -
వారి జీవితాలను రంగులమయం చేయండి : హీరో
దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వీరిలో సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రతిజ్ఞ తీసుకోండి’ అంటూ అవయవధానానికి సంబంధించిన పోస్టర్‌ను ట్వీట్ చేశాడు సాయి. ‘మీకు అంధ ప్రపంచాన్ని రంగులమయం చేయగలిగే శక్తి ఉంది. ప్రతిజ్ఞ చేయండి’ అన్న కామెంట్స్ ఉన్న పోస్టర్‌ను ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. పండుగ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌పై అభిమానులు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంటిలిజెంట్ సినిమాతో నిరాశపరిచిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. Wishing everyone a very happy #holi #takeapledge 🙏🏼 pic.twitter.com/pgzXA38kDz — Sai Dharam Tej (@IamSaiDharamTej) 2 March 2018 -
లేడీ ఓరియంటెడ్ సినిమాలో మెగా హీరో..?
ఇంటిలిజెంట్ సినిమాతో మరోసారి షాక్ ఇచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్, తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే కరుణాకరణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా కథ కూడా హీరోయిన్ వైపు నుంచే నడుస్తుంది. ఇప్పుడు అదే తరహాలో సాయి ధరమ్ కొత్త సినిమా సాగనుందట. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న సుప్రీం హీరో సక్సెస్ కోసం ఈ జానర్‌ను ఎంచుకున్నాడు. లవ్ స్టోరిలను తెరకెక్కించటంతో స్పెషలిస్ట్ గా పేరున్న కరుణాకరన్ అయినా సాయి ధరమ్ తేజ్ కెరీర్ ను గాడిలో పెడతాడేమో చూడాలి. -
మే నుంచి సాయి ధరమ్, గోపిచంద్ కొత్త సినిమా
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను మే లో మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సాయి ధరమ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సాధించుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇటీవల ఇంటిలిజెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో త్వరలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీ బాలజీ సినీ మీడియా బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మించనున్నారు. గతంలో సాయి ధరమ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన విన్నర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే మరోసారి గోపిచంద్ సినిమా చేసేందుకు అంగీకరించాడు సుప్రీం హీరో. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా నటీనటులు ఎంపిక జరుగుతోంది. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు సంగీతమందించనున్నట్టుగా తెలిపారు చిత్ర నిర్మాతలు. -
‘ఇంటిలిజెంట్’ మూవీ రివ్యూ
తారాగణం : సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, బ్రహ్మానందం తదితరులు జానర్ : యాక్షన్, కామెడీ నిర్మాత : సి. కళ్యాణ్ సంగీతం : ఎస్. తమన్ దర్శకుడు : వి.వి. వినాయక్ మెగా అల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే సుప్రీం హీరోగా ఎదిగాడు సాయి ధరమ్ తేజ్. గత కొంతకాలంగా సరైన హిట్‌లేక సతమతమవుతున్న తరుణంలో మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేసిన సినిమా ఇంటిలిజెంట్. మెగాస్టార్ కమ్‌బ్యాక్ మూవీతో హిట్ కొట్టిన వినాయక్, ఫుల్ ఎనర్జీ ఉన్న సాయిధరమ్ కలిసి చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం... కథ నందకిషోర్ (నాజర్) ఓ సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని. తనకు వచ్చిన లాభాలతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఎంతో మంది పేద పిల్లలను, అనాథలను చేర దీసి ఆదరిస్తూ ఉంటాడు. ప్రతిభ ఉన్న చిన్నారులను చదివిస్తుంటాడు. అలా తేజ (సాయిధరమ్ తేజ్)ను చదివిస్తాడు. ఆ కృతజ్ఞతతో నాజర్ వద్దే పనిచేస్తూ ఉంటాడు. తన సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల మిగతా ఏ కంపెనీలు మనుగడను సాధించలేకపోతాయి. అలా ఓ కంపెనీ యజమానులు మాఫియా డాన్ విక్కీభాయ్ (రాహుల్ దేవ్)ను ఆశ్రయిస్తారు. విక్కీభాయ్ తమ్ముడు దేవ్‌గిల్ రంగంలోకి దిగి నాజర్‌ను బెదిరిస్తాడు. కానీ నాజర్ వాటికి తలొంచడు. ఇదంతా తేజ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆ మరునాడే నాజర్ ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ తేజ ఇదంతా నమ్మడు. దేవ్‌గిల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తేజ ఏం చేస్తాడు? అసలు నాజర్‌ది ఆత్మహత్యనా? హత్యనా? అసలు ఏం జరిగింది? తేజ ధర్మభాయ్గా ఎందుకు మారాడు? ధర్మభాయ్ ఏం చేశాడన్నదే మిగతా కథ. నటీనటులు సాయిధరమ్ తేజ్ డ్యాన్సులు, ఫైట్స్‌తో మెగా అభిమానులను అలరించాడు. లావణ్య త్రిపాఠి తన అందంతో ప్రేక్షకులను ముగ్దుల్ని చేసింది. బ్రహ్మానందం కనిపించే రెండు మూడు సీన్లలో నవ్వులు పండించాడు. నాజర్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే తమకు అలవాటైన పోలీస్ పాత్రలో మెప్పించారు. సప్తగిరి, పృథ్వీ, బ్రహ్మానందం, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ కామెడీని బాగానే పండించారు. విశ్లేషణ భారీ యాక్షన్ సీన్స్ , కామెడీతో తనదైన శైలిలోనే వినాయక్ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. కథలో కొత్తదనం లేదు. ఆకుల శివ అందించిన మాటలు కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే స్థాయిలో లేవు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. సాంగ్స్ లొకేషన్స్ బాగున్నాయి. చమక్ చమక్.. సాంగ్ తీసిన విధానం ఆకట్టుకుంది. వినడానికే కాదు చూడడానికి కూడా బాగుంది. తమన్ సంగీతానికి మార్కులు పడ్డాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్. ఎస్వీ విశ్వేశ్వర్ ఛాయాగ్రహణంతో మెప్పించాడు. ఆయన కెమెరా పనితనం స్క్రీన్‌ను అందంగా కనపడేలా చేసింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. కొరియోగ్రఫీలో కొత్తదనం కనిపించింది. ప్లస్ పాయింట్స్ పాటలు, ఫైట్స్ కామెడీ చమక్ చమక్ సాంగ్ మైనస్ పాయింట్స్ కథలో కొత్తదనం లోపించడం ముగింపు: ‘ఇంటిలిజెంట్’ అభిమానులు ఆశించినంత ఇంటిలిజెంట్‌గా లేదు. - బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
ఇద్దరం కలిసి సక్సెస్‌మీట్ పెడతాం
‘‘రీమిక్స్ సాంగ్స్ కావాలని నేనెప్పుడూ అడగలేదు. అది డైరెక్టర్స్ ఛాయిస్. ఆ రీమిక్స్‌కి నా బెస్ట్ ఇవ్వటానికి కృషి చేస్తాను. నాలుగు రీమిక్స్ సాంగ్స్‌ను ఎంజాయ్ చేస్తూ, బాధ్యతగా చేశాను’’ అన్నారు సాయిధరమ్ తేజ్. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఎప్పుడూ ట్రై చేయడు. ఫ్రెండ్స్, పేరెంట్స్ వల్ల కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చే ప్రాసెస్‌లో ఎంత ఇంటిలిజెంట్‌గా బిహేవ్ చేసి, తన వాళ్లను కాపాడుకుంటాడనే పాయింట్‌తో నా క్యారెక్టర్ని బిల్డ్ చేశారు.మనకి హెల్ప్ చేసినవాళ్లను ఎప్పుడూ మరచిపోకూడదు. వాళ్లకు అవసరం వచ్చినప్పుడు మనం వాళ్లకు ఉండాలనే మెసేజ్ ఉంది. ► ఫస్ట్ టైమ్ ఫుల్ లñ ంగ్త్ కమర్షియల్ మూవీ చేశా. కొత్తగా అనిపించింది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ప్రతి సినిమా బ్రేక్ ఇస్తుందనే చేస్తాం. అన్ని సినిమాలకూ ఒకేలా కష్టపడతాం. ► వినాయక్‌గారు ఏం చెప్పినా చేసేస్తాం. ఆయన అడిగే విధానం అంత బావుంటుంది. అంత కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు మన దృష్టి మొత్తం మన డైలాగ్స్ మీద, మన షాట్స్ మీద పెట్టుకొని ఇంకా బాగా వర్క్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్‌తో చేస్తే ఇలా ఉంటుందా? అనిపించింది. నాలో మా ఇద్దరి మావయ్యలు కనిపిస్తారని, వినాయక్‌గారు దాన్ని బెస్ట్‌గా యుటిలైజ్ చేసుకొని ఆడియన్స్‌కు ఇవ్వాలనుకున్నారు. ఆకుల శివగారు రాసిన కథకు ఆయన స్టైల్లో స్క్రీన్‌ప్లే రాశారు. నేనెంత ఇంటెలిజెంట్ అంటే ఒక 60 పర్సెంట్ అనుకుంటున్నాను. కానీ నా గురువులందరూ ఇంటెలిజెంట్సే. ► నా లాస్ట్ సినిమాల్లో చేసిన తప్పులు ఎనలైజ్ చేసుకుంటున్నాను. డైరెక్టర్స్ అనుకున్నట్టుగానే తీశారు కానీ ఆడియన్స్ ఆశించింది ఇవ్వలేకపోయాం. అది ఎవ్వరి తప్పు కాదు. సినిమా అంటేనే కలñ క్టివ్ ఎఫర్ట్. ఎవర్నీ బ్లేమ్ చేయడానికి లేదు. ► వరుణ్, నేను ఒకేసారి రావాలనుకోలేదు. అది తెలియకుండా జరిగింది. ఇద్దరం కూర్చుని డిస్కస్ చేశాం. కానీ ప్రొడ్యూసర్స్ ఇష్యూ కదా అని చేతులు ఎత్తేశాం. కానీ నాకనిపించింది ఇద్దరం ఒకేసారి హిట్ కొడితే ఆ కిక్కే వేరని. మా మెగా హీరోస్ ఇంతమంది అయ్యేసరికి ఇలా రిలీజ్ డేట్ ఇష్యూ అవుతోంది అంటే.. మాకు ఇదో టెస్ట్ అనుకుంటాను. ప్రేక్షకులకు రెండు సినిమాలు నచ్చుతాయని ఆశిస్తున్నాను. మా సినిమాలు హిట్ అయ్యాక వరుణ్, నేను కలిసి సక్సెస్ మీట్ పెడతాం. ⇒ మీ స్పెషల్ ఫ్రెండ్ రెజీనా ఈ మధ్య ఓ యంగ్ హీరోతో లవ్‌లో పడి, కెరీర్ పాడు చేసుకున్నా అన్నారు. మీ ఒపీనియన్? ► క్లోజ్ ఫ్రెండే.. కాదనడంలేదు. కానీ తన పర్సనల్ విషయాల గురించి నేను కామెంట్ చేయదలచుకోలేదు. -
అందరికంటే సినిమానే గొప్ప
‘‘నిన్నే ఫైనల్ కాఫీ చూశాం. సినిమా చాలా బాగా వచ్చింది. తేజు, లావణ్య బాగా చేశారు. నేను అందర్నీ బాగా చూసుకుంటాను. కల్యాణ్ గారు నన్నో గాజు బొమ్మలా చూసుకున్నారు. ఖచ్చితంగా ‘ఇంటిలిజెంట్’ సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు వీవీవినాయక్. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా వినాయక్ పలు విశేషాలు పంచుకున్నారు. ► ఈ సినిమాలో ఒక సోషల్ ఇష్యూను టచ్ చేశాం. మైండ్ గేమ్స్ మీద సినిమా ఉంటుంది. అందుకే ‘ఇంటిలిజెంట్’ అని పెట్టాం. నా స్టైల్లోనే ఫుల్ కమర్షియల్ మీటర్లో ఉంటుంది. సాయిధరమ్, నేను, కల్యాణ్... మా ముగ్గురిలో ఎవరు ఇంటిలిజెంట్ అంటే సి.కల్యాణ్ గారే (నవ్వుతూ). ► ఆకుల శివ మంచి కథ అందించారు. తమన్ సూపర్ మ్యూజిక్ అందించాడు. జానీ, శేఖర్ మాస్టర్లు డ్యాన్స్‌లు బాగా కంపోజ్ చేశారు. కాంబినేషన్ ప్రెష్‌గా ఉంటుందని తేజ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠిను తీసుకున్నాం. తను కుడా చాలా బాగా చేసింది. సినిమా టెంపోకు అడ్డు రాకూడదని కేవలం నాలుగు పాటలే పెట్టాము. నా మునుపటి సినిమా ఖైదీ నెం.150లో కూడా నాలుగు పాటలే ఉన్నాయి. ► ఈ సినిమాతో ఎంత పెద్ద కమర్షియల్ కథనైనా మోయగలడు అనే నమ్మకం తీసుకొచ్చాడు తేజ్. తనని హీరోగా ఫిక్స్ చేశాక ‘చమక్ చమక్’ సాంగ్‌ను రీమిక్స్ చేయాలనుకున్నాను. చిరంజీవిగారి పాటల్లో అది నా ఫెవరేట్ సాంగ్. అడిగిన వెంటనే ఇళయరాజాగారు పాటను మాకు ఇచ్చారు. ► మెగా ఫ్యామిలిలో నాలుగో హీరోతో చేశాను. చిరంజీవిగారితో సినిమా అంటే సెట్లో అందరం చాలా టెన్షన్‌గా ఉంటాం. చరణ్, బన్నీ విషయానికి వస్తే వాళ్లను ఠాగూర్’ సినిమా అప్పుడు నుంచి చూస్తున్నాను. చరణ్ చాలా సౌమ్యుడు. బన్నీ చాలా హార్డ్ వర్కింగ్. తేజ్, వరుణ్‌తేజ్ ఒకేసారి వస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగింది. బాగుంటే రెండు సినిమాలు ఆడతాయి. సినిమాకు హీరో, దర్శకుడు, నిర్మాత.. ఎవరు గొప్ప అంటే నా దృష్టిలో అందరికంటే సినిమానే గొప్ప. ► బయట కథలతో సినిమా ఎందుకు తీస్తున్నానంటే, ఒక్కో కథకు చాలా టైమ్ పడుతుంది. రాఘవేంద్రరావుగారు ఓసారి అన్నారు. ఎప్పుడూ మన కథలే కాదు బయట కథలు కూడా చేయాలి. లేకపోతే మన ఐడియాలే రిపీట్ అవుతాయని. బయట కథలు చేస్తే కొత్త యాంగిల్ ఓపెన్ అవుతుంది. ► మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి నాకా ఆలోచన లేదు. దర్శకుడిని కావాలనుకోలేదు.. అయ్యాను. సో... డెస్టినీకు వేరే ప్లాన్స్ ఏం ఉన్నాయో నాకు తెలీదు. ► రెండేళ్ల తర్వాత కొత్తవాళ్లతో సినిమా తీస్తాను. అప్పుడే ప్రొడక్షన్ హౌస్ ప్లానింగ్స్ కూడా చెబుతా. స్టార్స్‌తో అయినా కాబోయే స్టార్స్‌తో సినిమా అయినా నాకు టెన్షనే. బేసిక్‌గా సినిమా అంటేనే టెన్షన్. ఈ మధ్యన ఎవరో ఎయిర్‌పోర్ట్‌లో ఒ వ్యక్తి ‘సుమోలు గాల్లో లేస్తేనే మీ సినిమాలా ఉంటుంది సార్’ అన్నారు. ప్రతి సినిమాలోనూ సుమోలు గాల్లో ఎలా లేపుతాం (నవ్వుతూ). సినిమా సినిమాకు గ్యాప్ కావాలని తీసుకోం. రైటర్స్ కొరత కూడా అనను. టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు రావట్లేదు. అవకాశం ఉన్నవాళ్లకు మంచి కథలు సెట్ కావట్లేదు. ► నా తర్వాత సినిమా ఏంటో నాక్కూడా తెలియదు. ‘అదుర్స్ 2’ వర్క్‌వుట్ చేద్దామనుకున్నాం. బట్ సెట్ అవ్వలేదు. కానీ తప్పకుండా ఉంటుంది. మహేశ్‌తో సినిమా చేద్దామనుకున్నాను కానీ మంచి కథ చెప్పలేకపోయా. -
‘త్వరలో ఆ సూపర్ హిట్‌కు సీక్వల్’
మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా అదుర్స్. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో రికార్డ్లను తిరగ రాసింది. తరువాత చాలా సందర్భాల్లో ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందంటూ వినాయక్ హింట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్’ సినిమా ప్రమోషన్ సందర్భంగా మరోసారి వినాయక్ అదుర్స్ సీక్వల్ ప్రస్తావన తీసుకువచ్చారు. ‘గతంలోనే అదుర్స్ సీక్వల్ కు ప్రయత్నాలు జరిగినా అది సాధ్యం కాలేదు. కానీ తప్పకుండా అదుర్స్ సీక్వల్ చేస్తాన’ని అన్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఇంటిలిజెంట్ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది. సీ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది. -
ఆ పాట రీమిక్స్ అనగానే టెన్షన్ పడ్డా
‘‘ఒక్కో డైరెక్టర్ టేకింగ్ ఒక్కో విధంగా ఉంటుంది. ‘ఇంటిలిజెంట్’ విషయానికొస్తే వినాయక్‌గారి టేకింగ్ భిన్నంగా అనిపించింది. నా క్యారెక్టర్‌కి ఎక్కువ నటనకు స్కోప్ ఉంది. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అని హీరోయిన్ లావణ్య త్రిపాఠి అన్నారు. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా లావణ్య చెప్పిన విశేషాలు... ►‘ఇంటిలిజెంట్’లో నా పాత్ర పేరు సంధ్య. అమెరికాలో చదువుకుని, ఇండియా వచ్చి తండ్రికి బిజినెస్‌లో సహాయం చేస్తుంటా. సంధ్య కొంచెం కోపిష్టి. రియల్ లైఫ్‌లో నేనలా కాదు. హీరో తన ఇంటెలిజెన్స్‌తో విలన్లని ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ. అందుకే సినిమాకి ఆ టైటిల్ పెట్టారు. ►తేజ్ (సాయిధరమ్ తేజ్) ఎప్పుడూ ఫన్నీగా ఉంటాడు. మంచి డ్యాన్సర్. నేను పని చేసిన హీరోల్లో తేజ్ చాలా కంఫర్ట్. నా గత సినిమాల కంటే ఈ చిత్రంలో ఎక్కువ డ్యాన్సులు చేశా. అందుకోసం బాగా ప్రాక్టీస్ చేశా. ►వినాయక్‌గారు చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనకు కావాల్సింది మా చేత సులభంగా రాబట్టుకున్నారు. మమ్మల్నందర్నీ చిన్న పిల్లల్లా చూసుకున్నారు. కల్యాణ్‌గారికి సినిమా అంటే ప్యాషన్. ఎప్పుడూ సెట్స్‌లోనే ఉంటూ షూటింగ్‌ను ఎంజాయ్ చేసేవారు. ►చిరంజీవిగారి ‘చమకు చమకు..’ పాట రీమిక్స్ అనగానే కొంత టెన్షన్ పడ్డా. చిరంజీవిగారు చేసిన ఆ సాంగ్ రీమేక్ అంటే టెన్షన్ ఉంటుంది కదా. నేను ఆయన అభిమానిని. చిరంజీవిగారు, విజయశాంతిగారి స్థాయిలో చేయడం సాధ్యం కాదు. ప్రేక్షకులకు నచ్చేలా చేయడానికి మా ప్రయత్నం చేశాం. ►భిన్నమైన కథలను ఎంచుకునే వీలు హీరోయిన్లకు తక్కువ. ఆ విషయంలో హీరోలకు మంచి అడ్వాంటేజ్. కథానాయికలకు కూడా భిన్నమైన కథలు ఎంచుకునే అవకాశం రావాలని కోరుకుంటున్నా. నా మటుకు నేను వచ్చిన కథల్లో నటిగా నాకు మంచి పేరు తెచ్చేవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ►నేను కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నాననే వార్తలు వచ్చాయి. అన్ని వార్తల్లోనూ నిజం ఉండకపోవచ్చు. నాకు కొందరితో విభేదాలు వచ్చాయని కూడా ప్రచారం జరిగింది. అది కూడా నిజం కాదు. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటున్నాను. -
‘తొలిప్రేమ’తో ‘ఇంటిలిజెంట్’గా..!
ఫిబ్రవరి రెండో వారంలో వెండితెరపై ఆసక్తికరమైన పోటి నెలకొంది. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు ఒక్క రోజు తేడాతో థియేటర్లలోకి వస్తున్నారు. తొలిప్రేమ, ఇంటిలిజెంట్ సినిమాలు ఈ నెల 9, 10 తేదిల్లో రిలీజ్ కానున్నాయి. 9వ తారీఖున మోహన్‌బాబు లీడ్ రోల్లో నటిస్తున్న గాయత్రి సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూడు సినిమాలకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూడు చిత్రాలకు సంగీత దర్శకుడు ఒకరే. తొలిప్రేమ, ఇంటిలిజెంట్, గాయత్రి చిత్రాలకు యువ సంగీత దర్శకుడు తమన్ సంగీత మందిస్తున్నారు. గాయత్రి సినిమా పనులు ఇప్పటికే పూర్తి కాగా తొలిప్రేమ, ఇంటిలిజెంట్ సినిమాలు ప్రస్తుతం రీ రికార్డింగ్ దశలో ఉన్నాయి. రెండు సినిమాలకు ఒకేసారి పని చేస్తున్న తమన్, ఆ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘తొలిప్రేమతో ఇంటిలిజెంట్‌గా పని జరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశాడు తమన్. తొలి ప్రేమతో క్లాస్, ఇంటిలిజెంట్ తో మాస్ ఆడియన్స్ ని ఒకేసారి అలరిస్తున్నాడు ఈ యువ కళాకారుడు. #tholiprema tho #intelligent ga pannijaruguthondhiiiii ♥️💯 🎹🎧 pic.twitter.com/iOnto9qHs1 — thaman S (@MusicThaman) 31 January 2018 -
తెలివిగా తీశారని ప్రేక్షకులు అంటారు
‘‘నా సినిమాలు సూపర్ హిట్ సాధించకపోవచ్చు. నా కెరీర్లో సూపర్ ఫ్లాప్ సినిమా లేదు. బ్యాడ్ లేదా వల్గర్ సినిమాలను కల్యాణ్ తీశాడని అనిపించుకోలేదు. సెట్ అయ్యే ప్రాజెక్ట్ కోసమే తపన పడతాను. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయాలని ఎగబడలేదు. రామానాయుడిగారిని స్ఫూర్తిగా ఫీలయ్యి కెరీర్లో ముందుకు సాగుతున్నాను. ఈ జర్నీ ఎక్కడ ఆగుతుందో తెలీదు. నిర్మాతగా వంద చిత్రాలను కంప్లీట్ చేయాలన్నది నా ప్రయత్నం’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్. సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సీకే ఎంటర్టైన్మెంట్స్పై సి. కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఈ ఏడాది ‘జై సింహా’ చిత్రంతో నిర్మాతగా నాకు శుభారంభం జరిగింది. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వీవీ వినాయక్‌గారు దర్శకత్వం వహించిన ‘ఇంటిలిజెంట్’అందరి అంచనాలను మించేలా ఉంటుందన్న నమ్మకం ఉంది. తేజూ కెరీర్ గ్రాఫ్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధిస్తుంది. తేజూ డ్యాన్స్ ఇరగదీశాడు. చాలా కష్టపడ్డాడు. ‘ఇంటిలిజెంట్’ చూసిన తర్వాత, వీళ్లు చాలా ఇంటెలిజెంట్‌గా తీశారని ప్రేక్షకులు అనుకుంటారు. తమన్ మంచి సంగీతం ఇచ్చారు. వినాయక్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఆడుతూ పాడుతూ సినిమాను కంప్లీట్ చేశాం. ► ఒకే టైమ్‌లో మోహన్‌బాబుగారి ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్’.. ఇంకా వేరే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ నెక్ట్స్ డే ‘తొలి ప్రేమ’ రిలీజ్ అవుతుంది. మోహన్‌బాబుగారి ఇంటి నుంచే నా సినీ ప్రయాణం మొదలైంది. నాగబాబు, వరుణ్‌తేజ్‌లతో మంచి ఎటాచ్మెంట్ ఉంది. మా సినిమాతో పాటు రిలీజ్ కానున్న అన్ని సినిమాలూ ఆడాలి. ► న్యూమరాలజీ మీద నాకు నమ్మకం ఉంది. అందుకే ‘ఇంటిలిజెంట్’ అని పెట్టాం. స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. సుమన్ హీరోగా ‘నేటి న్యాయం’ చిత్రంతో నేను డైరెక్టర్‌గా పరిచయం కావాల్సింది కానీ కుదర్లేదు. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. నిర్మాతగా 70వ సినిమా ‘ఇంటిలిజెంట్’. కథలో ఇన్వాల్వ్ అవుతాను. కాకపోతే నా ఆలోచనలను సూచనలుగా పరిశీలించమని డైరెక్టర్‌కు చెబుతాను. ► ఓ చిన్న డైరెక్టర్‌తో ‘భారతి’ అనే సినిమాను తీయబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను. శివ దర్శకత్వంలో రానా హీరోగా చేస్తున్న ‘1945’ చిత్రం ఫైనల్ స్టేజ్‌లో ఉంది. వినాయక్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నా. -
‘ఇంటిలిజెంట్’ సాంగ్ రిలీజ్ చేసిన ప్రభాస్
-
మెగా హీరోకు ప్రభాస్ హెల్ప్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్లో స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇంటిలిజెంట్. సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్‌కు మరో స్టార్ హీరో సాయం చేయనున్నాడు. ఇంటిలిజెంట్ సినిమాలో తొలి సింగిల్‌ను బాహుబలి స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం సాయత్రం 4 గంటలకు ఈ పాట సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. #Baahubali Prabhas Will be releasing #Inttelligent 1st single " Let's Do " today @ 4 P. M#InttelligentOnFeb9th #VVVinayak@IamSaiDharamTej @ProducerCKalyan @Itslavanya @MusicThaman @adityamusic pic.twitter.com/jh8mISSAcd — CK Entertainments (@CKEntsOffl) 28 January 2018 -
సెన్సేషనల్ హిట్ సాధించాం అనిపిస్తోంది – సి. కల్యాణ్
‘‘ఆర్టిస్టుల నుంచి ఎలా నటన రాబట్టుకోవాలో వినాయక్‌కి బాగా తెలుసు. ఆయన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో నటవారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘ఇంటిలిజెంట్’ హిట్ అవ్వాలి. సీకే ఎంటర్టైమెంట్స్ నా సొంత బేనర్‌తో సమానం. కళ్యాణ్‌గారు పెద్ద హీరోలతో, చిన్న హీరోలతో ఇంకా సినిమా చేయాలి. ఈ సినిమా విషయానికి వస్తే వినాయక్, ఆకుల శివ కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. టీజర్ చాలా బాగుంది. సినిమా ఎప్పుడు చూడాలా అనిపిస్తోంది. మెగా అభిమానులకు, ఇది నా బేనర్ కాబట్టి నా అభిమానులకు, ముఖ్యంగా యూత్‌కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు హీరో బాలకృష. సాయిధరమ్ తేజ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైమెంట్స్పై సి. కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ చిత్రం టీజర్‌ను బాలకృష్ణ విడుదల చేశారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ– ‘‘మా బాలయ్యబాబు టీజర్ రిలీజ్ చేయడంతో నేను పెద్ద సెన్సేషన్ హిట్ సాధించినట్లుగా భావిస్తున్నాను. 2018 ప్రారంభంలో బాలకృష్ణగారు ‘జై సింహా’ హిట్ రూపంలో నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు. ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న ‘ఇంటిలిజెంట్’ సూపర్‌హిట్ గ్యారంటీ’’ అన్నారు. ‘‘మేం అడగ్గానే బాలకృష్ణగారు రావడంతో ఈ సినిమా సూపర్‌హిట్ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది’’ అన్నారు వినాయక్. ‘‘కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చెయ్యడానికి బాలకృష్ణగారు ముందుంటారని అందరూ అంటారు. మా సినిమాకి ఆశీస్సులు అందించడానికి రావడంతో మరోసారి అది ప్రూవ్ అయ్యింది’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకను రాజమండ్రిలో జరపాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సహ నిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా. -
‘ఇంటిలిజెంట్’ టీజర్ విడుదల చేసిన బాలయ్య
-
పేదోడికి ప్లాట్ ఫాం.. ధర్మాభాయ్.కామ్
వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ఇంటిలిజెంట్. సాయి ధరమ్ ధర్మభాయ్ గా నటిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఇంట్రస్టింగ్ పోస్టర్లతో ఆకట్టుకున్న ఇంటిలిజెంట్ యూనిట్, తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. సుప్రీం హీరోని తన మార్క్ మాస్ లుక్ లో చూపించాడు వినాయక్. టీజర్ లోనే సినిమా పక్కా మాస్ యాక్షన్ అని కన్ఫామ్ చేశారు. టీజర్ మొత్తం సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ ను ప్రజెంట్ చేసేందుకే కేటాయించారు. స్టైలిష్ లుక్ లో రాహుల్ దేవ్ లోను కొన్ని క్షణాలు పాటు చూపించగా హీరోయిన్ను అసలు పరిచయం చేయలేదు. -
నాన్నగారి కోరిక నెరవేరింది
‘‘మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. సి.కల్యాణ్‌గారి సంస్థలో ఓ సినిమా చేయమని. ‘ఇంటిలిజెంట్’ చిత్రంతో మా నాన్నగారి కోరిక నెరవేరింది. కల్యాణ్‌గారు నిర్మాతలా కాకుండా మా అన్నయ్యలాగా అనిపించారు. సెట్లో ఇద్దరు అన్నదమ్ములం ఉన్నట్టు అనిపించింది’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. సాయిధరమ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జంటగా వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినాయక్ మాట్లాడుతూ– ‘‘కృష్ణ’ సినిమాలాగా ఈ చిత్రంలోనూ అన్ని అంశాలుంటాయి. తేజ్ బాగా చేశాడు. తను ఎంత ఎదిగినా అన్నయ్యలాగా(చిరంజీవి) ఇలాగే ఉండాలి. ‘కొండవీటి దొంగ’ సినిమాలోని ‘చమక్కు చమక్కు’ పాటను రీమిక్స్ చేశాం’’ అన్నారు. ‘‘మా సినిమా ఏ చిత్రానికీ పోటీ కాదు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్’ కుటుంబ ప్రేక్షకులకూ నచ్చుతుంది. సినిమా చూశా. చాలా బాగా నచ్చింది’’ అన్నారు సి.కల్యాణ్. ‘‘మావయ్యతో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా తర్వాత వినాయక్‌గారు నాతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం. డబ్బింగ్లో కొన్ని సీన్లు చూసి ఇవి చేసింది నేనేనా? అని షాక్ అయ్యాను. మా సినిమాతో పాటు వస్తున్న వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’ సినిమా కూడా హిట్ కావాలి’’ అన్నారు సాయిధరమ్ తేజ్. లావణ్యా త్రిపాఠి, నటుడు సప్తగిరి, కథ, మాటల రచయిత శివ ఆకుల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: తమన్, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా. -
తప్పు కాదు కావాలనే అలా..!
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ఇంటిలిజెంట్. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఇప్పటికే టైటిల్ లోగో రిలీజ్ చేయగా ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈసినిమా టైటిల్ లోగోలో ఇంటిలిజెంట్ పదం ఇంగ్లీష్‌లో స్పెల్లింగును మార్చి రాశారు. ‘INTELLIGENT’ స్పెల్లింగ్ ను ‘INTTELLIGENT’గా రాశారు. దీంతో పోస్టర్ లో తప్పు వచ్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఈ విషయంపై బిఏరాజు క్లారిటీ ఇచ్చారు. న్యూమరాలజీ కరెక్షన్ కారణంగానే స్పెల్లింగ్ ను మార్చి రాశారని తెలిపారు. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న సాయి ధరమ్ కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్న వినాయక్ సినిమాను సక్సెస్ చేసేందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. That is Not a spelling mistake !! You know that it is spelled according to Numerology, because you are too 'INTTELLIGENT' #Intelligent — BARaju (@baraju_SuperHit) 22 January 2018 -
మిమ్మల్ని మీరు స్మార్ట్ అనుకుంటుంటారా?
సెల్ఫ్‌చెక్ నేను డైలాగేస్తే చప్పట్లు మోగాల్సిందే... నేను చాలా స్టైల్, మీ అందరికంటే నేనే అందగా ఉంటాను... యు నో ఐ యామ్ సో ఇంటెలిజెంట్... ఇలాంటి డైలాగులేస్తూ వారికి వారు గొప్పతనాన్ని ఆపాదించుకొనే వారిని మన మధ్య చూస్తూనే ఉంటాం. వీరు వాస్తవానికి చాలా దూరంగా ఉంటారు. ఊహల్లో తేలిపోతుంటారు. దీనివల్ల ఇబ్బందులెదుర్కొంటున్నా, ఎదుటివారి ముందు చులకనవుతున్నా ఏమీ పట్టనట్టే ఉంటారు. చాలా ప్రశాంతంగా, బాధలు లేనట్లు కనిపించటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ప్రవృత్తి మీలో కూడ ఉందా? 1. ఎంత బిజీగా ఉన్నా మీ హెయిర్‌స్టైల్, డ్రెస్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. కొత్తకొత్త ఇతర భాషాపదాలు నేర్చుకొని వాటిని ఇతరుల ముందు మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 3. కొత్తగా ఏదైనా వస్తువు కొంటే దాన్ని ఇతరులకు చూపించకుండా ఉండలేరు. ఎ. అవును బి. కాదు 4. మీకు తెలిసిన విషయాలను అందరికీ చెప్తుంటారు. అవి ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తున్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించరు. ఎ. అవును బి. కాదు 5. మీ చుట్టూ ఉన్నవారందరికంటే మీరే స్మార్ట్ (చురుకైన/అందమైన) అని మీ ఫీలింగ్ ఎ. అవును బి. కాదు 6. మీకు పరిచయమున్న వీఐపీలను కలిసే అవకాశమొస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. ఒక వేళ మీరు వారిని కలవలేకపోతే చాలా దిగాలు పడతారు. ఎ. అవును బి. కాదు 7. మీ సామర్థ్యం గురించి అందరికీ తెలిసినా అంతకంటే ఎక్కువగా మీ నుంచి ఎదుటివారు ఎక్స్పెక్ట్ చే స్తారనుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. బయటకెళ్లినప్పుడు ఇతరుల ముందు గొప్పకోసం మీకు ఇష్టంలేని ఆహారపదార్థాలను కూడ తినటానికి ట్రై చేస్తారు. ఎ. అవును బి. కాదు 9. మీకు ఇబ్బంది కలుగుతున్నా ఏమీ జరగనట్టే అందరిముందు యాక్ట్ చేస్తుంటారు. ఎ. అవును బి. కాదు 10. కారణం లేకుండానే నవ్వుతుంటారు. పేలని జోకులేస్తూ అందరినీ నవ్వించటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు వస్తే మీ చర్యలతో పక్కవారికి విసుగు పుట్టిస్తుంటారు. మీరే స్మార్ట్ అని పిలిపించుకోవాలని ఆరాటపడటాన్ని మీతోటివారు గమనించి మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంటారు. మీరు చాలా కూల్‌గా ఉంటారని మీ ఫీలింగ్ కాని మీ చేష్టల వల్ల మిమ్మల్ని మీరే చులకనగా మలచుకుంటుంటారు. ‘బి’ లు ఆరు దాటితే మీరు చాలా డీసెంట్‌గా ఉంటారు. మీ హద్దుల్లో మీరుంటారని అర్థం. -
చీమ శ్రమైక జీవనంలో.. విలువైన పాఠాలెన్నో!
మనం జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవసరమైన పాఠాలను వివిధ వ్యక్తుల నుంచి నేర్చుకుంటాం. వీరే కాకుండా మన చుట్టూ ఉండే చిరుప్రాణులు సైతం ఎంతో విలువైన విషయాలను మనకు నేర్పుతాయి. మనలో తెలివితేటలు, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కానీ.. చిన్న జీవుల నుంచే పెద్ద పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు.. సుఖవంతమైన జీవనం గడపాలంటే.. ఏం చేయాలో చీమలను చూసి నేర్చుకోవచ్చంటే మీరు నమ్ముతారా? నమ్మితే నాలుగు విలువైన పాఠాలేంటో చూద్దాం.. పట్టిన పట్టు విడవొద్దు తాము వెళ్తున్న దారిలో ఏదైనా అడ్డంకి ఎదురైతే చీమలు ఏం చేస్తాయో తెలుసా? చీమల మార్గంలో మీ వేలును అడ్డంగా పెట్టండి. ఏం జరుగుతుందో నిశ్శబ్దంగా గమనించండి. ఊహించని అవాంతరం ఎదురైందని చీమలు వెనక్కి వెళ్లవు. వేలు పక్కనుంచే కొత్తదారిని ఏర్పరచుకుంటాయి. అవసరమైతే వేలుపైకి ఎగబాకి ముందుకు కదులుతాయి. దారి దొరికేదాకా ప్రయత్నిస్తూనే ఉంటాయి. నిరాశ చెంది ప్రయత్నం నుంచి విరమించుకోవు. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఉంది. మన జీవితంలోనూ ఎన్నో ఊహించని అడ్డంకులు, నివారించలేని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అంతమాత్రాన లక్ష్యాన్ని వదిలేసి వెనక్కి పారిపోవాల్సిన అవసరం లేదు. గమ్యం చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉండాలి. పట్టిన పట్టు విడవొద్దు(నెవర్ గివ్ అప్).. అంటూ బ్రిటీష్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ నుంచి వెలువడిన గొప్ప సూక్తికి స్ఫూర్తినిచ్చింది.. ఓ చిన్న చీమే. మంచి కాలం శాశ్వతం కాదు చీమల ఆహార సేకరణకు అత్యంత అనువైన కాలం.. వేసవి. వర్షాకాలం, శీతాకాలంలో భూఉపరితలంపై స్వేచ్ఛగా తిరగడం వీటికి వీలుకాదు. కాబట్టి సంవత్సరం మొత్తానికి సరిపడా ఆహారాన్ని వేసవిలోనే సేకరించుకొని, భద్రపరుచుకుంటాయి. ఈ కాలంలో ఆహార సేకరణలో తీరిక లేకుండా ఉంటాయి. మంచి కాలం(వేసవి) శాశ్వతం కాదని, శీతాకాలం రాక తప్పదని చీమలకు బాగా తెలుసు. అందుకే అవసరమైన తిండిని ఇప్పుడే సంపాదించుకుంటాయి. ప్రతికూల కాలంలో హాయిగా కడుపు నింపుకుంటాయి. మనం అప్రమత్తంగా ఉండాల్సింది ఇక్కడే. మన టైమ్ బాగున్నప్పుడు అదే మత్తులో ఏమరుపాటుగా ఉండొద్దు. ఎప్పుడూ మనకు మంచే జరుగుతుందనుకోవడం తెలివైన లక్షణం కాదు. విపత్కర పరిస్థితులు ఎదురుకాబోవని భావిస్తూ ధీమాగా తిరగడం సరికాదు. మీ చుట్టూ ఉండేవారితో మంచి సంబంధాలు ఏర్పరచుకోండి. వారితో మంచిగా ఉండండి. మంచి స్నేహితులను సంపాదించుకోండి. మంచి కాలం ఎప్పటికీ ఉండకపోవచ్చు. కానీ, మంచి మనుషులు మనతోనే ఉంటారు. చెడు కాలమూ ఇలాగే ఉండదు శీతాకాలంలో భరించలేనంత చలితో ఇబ్బందిపడే చీమలకు వెచ్చటి వేసవికాలందగ్గర్లోనే ఉందని తెలుసు. వేసవిలో తొలి సూర్యకిరణాలు భూమిపై ప్రసరించగానే.. చీమలు తమ నెలవుల్లోంచి వెలుపలికి వస్తాయి. కార్యాచరణను యథావిధిగా ప్రారంభిస్తాయి. ఆహారాన్వేషణకు బయలుదేరుతాయి. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు.. మనుషులు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతారు. తమ బతుకింతే అని చింతిస్తూ కూర్చుంటారు. ఇలాంటి సమయాల్లో చీమల సిద్ధాంతాన్ని గుర్తుకు తెచ్చుకోవడం మంచిది. పరిస్థితులెప్పటికీ ఇలాగే ఉండబోవని, మనదైన మంచికాలం దగ్గర్లోనే ఉందని తెలుసుకోవాలి. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం చాలా అవసరం. అంతా మంచే జరగబోతోందనే ఆశావాదాన్ని మనసులో నింపుకోవాలి. చెడు కాలం శాశ్వతం కాదన్న సత్యాన్ని స్మరించుకోవాలి. శక్తివంచన లేకుండా శ్రమించాలి చీమ తనకు చేతనైనంత తిండిని సేకరించుకుంటుంది. తన సాటి చీమ ఎంత తిండిని సంపాదించుకుంటోందనే విషయాన్ని మరో చీమ పట్టించుకోదు. తన కంటే ఎక్కువ సంపాదించుకున్న చీమలను చూసి అసూయ చెందదు. వాటిపై ద్వేషాన్ని పెంచుకోదు. ఒకవేళ తన దగ్గర వాటి కంటే తక్కువ ఆహారం ఉంటే చింతిస్తూ కూర్చొదు. తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. శక్తివంచన లేకుండా శ్రమించి, తనకు చేతనైనంత తిండిని సమకూర్చుకుంటుంది. ఇదొక గొప్ప పాఠం. మీరు చేయగలిగేంత శ్రమను 100 శాతం చేస్తే.. మీకు విజయం, సంతోషం బహుమతులుగా లభిస్తాయి. ఇక్కడితో అంతా ముగిసిపోలేదు.. చీమల నుంచి నేర్చుకోవాల్సిన మరో పాఠం మిగిలే ఉంది. ఒక చీమ తన బరువు కంటే 20 రెట్ల ఎక్కువ బరువును సులువుగా మోస్తుంది. ఈ విషయంలో చీమ శక్తి కంటే మన శక్తి తక్కువేం కాదు. మనం ఊహించుకొని భయపడుతున్న వాటి కంటే ఎన్నో రెట్ల ఎక్కువ బరువు బాధ్యతలను మన భుజాలపై తేలిగ్గా మోయవచ్చు. ఈసారి మోయలేనంత బరువులు మీ భుజాలపైకి చేరినప్పుడు.. కుంగిపోకండి. చిన్న చీమను గుర్తుకుతెచ్చుకోండి! ఆ బరువుబాధ్యతలు మిమ్మ ల్ని బాధించవు!! -కెరీర్స్ 360 సౌజన్యంతో