కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతికి ‘మెమోరీని ఏకీకృతం’ చేయడం కీలకంగా మారుతోంది. ఏఐ వ్యవస్థను నడిపించే ముఖ్య కారకాల్లో ఇది ప్రధానమైంది. సమస్యలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి మానవులు జ్ఞాపకశక్తిపై ఆధారపడినట్లే.. ఏఐ వ్యవస్థలు వాటి సామర్థ్యాలను మెరుగుపరచడానికి మెమరీని ఉపయోగించడం ఇప్పటికే ప్రారంభించాయి. ఈ మార్పు మరింత అధునాతనంగా, మానవ తరహా కృత్రిమ మేధకు మార్గం సుగమం చేస్తోంది.
ఓహియో స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యూసు ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్నవారిలో ప్రముఖంగా ఉన్నారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో చేరడానికి ముందు తాను మైక్రోసాఫ్ట్ సెమాంటిక్ మెషీన్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేశారు. అక్కడ తాను సంభాషణాత్మక ఏఐపై విధులు నిర్వహించారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెమరీ ఆగ్మెంటెడ్ ఏఐ సిస్టమ్స్ అభివృద్ధిలో పరిశోదనలు చేశారు.
సందర్భానుసారం స్పందించే ఏఐ
అత్యాధునిక సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం కోసం గత సమాచారాన్ని గుర్తుంచుకుని, సందర్భానుసారం దాన్ని ఉపయోగించే ఏఐ వ్యవస్థలను సృష్టించడంపై దృష్టి సారించినట్లు యూసు తెలిపారు. భాషా అవగాహన, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి పనులకు ఈ విధానం కీలకమని చెప్పారు. కృత్రిమ మేధస్సులో మెమోరీని చేర్చడం ద్వారా సాంకేతిక పరిశోధకులు.. గత అనుభవాల నుంచి నేర్చుకోగల, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను అందించే ఏఐ వ్యవస్థలను సృష్టించడంలో నిమగ్నమయ్యారు.
మెమోరీతో ఉపయోగాలు..
ఏఐ వ్యవస్థలో మెమోరీ ఆగ్మెంటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆరోగ్య సంరక్షణలో, రోగి చరిత్రలు, చికిత్స ఫలితాలను గుర్తు చేసుకోవడం ద్వారా వ్యాధులను నిర్ధారించడంలో ఇది సహాయపడుతుంది. ఫైనాన్స్ విభాగంలో గత డేటాను విశ్లేషించడం ద్వారా మార్కెట్ ధోరణులను అంచనా వేయడంలో తోడ్పడుతుంది. రోజువారీ పనులను మరింత మెరుగ్గా చేసేందుకు ఉపయోగపడుతుంది. మరింత సహజంగా వినియోగదారు అవసరాలకు ప్రతిస్పందించేలా చేస్తుంది.
ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..
సమర్థమైన వ్యవస్థలు..
కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సాంకేతిక పరిశోధకుల సహకారం మెరుగైన భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఏఐ వ్యవస్థలు మరింత తెలివైనవిగా, సమర్థవంతమైనవిగా మారుతున్నాయి. ఈ రంగంలోని ఆవిష్కరణలు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇదిలాఉండగా, ఎంత అడ్వాన్స్‌డ్ పీచర్లతో ఏఐ వ్యవస్థలు వచ్చినా మనిషి మెదడుతో పోటీ పడలేవని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment