
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అగ్రిహబ్, ఇక్రిశాట్, టిహబ్, ఐఎస్‌బి, ట్రిపుల్ ఐటి, ఐఐటి హైదరాబాద్, బిరాక్‌లలో 2017లో ఇంక్యుబేట్ అయిన అగ్రిటెక్ స్టార్టప్ ‘ఎక్స్ మెషిన్స్’. ఈ ఇండియన్ రోబోటిక్స్, ఎఐ కంపెనీ వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ కుమార్ డోగ్గా. పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో ఎఐపి బిల్డింగ్ కేంద్రంగా ఎక్స్ మెషిన్స్ రీసెర్చ్ లాబ్ పనిచేస్తోంది. ఎక్స్ మెషిన్స్ రూ పొందించిన కృత్రిమ మేధ ఆధారిత మల్టీపర్పస్ రోబో వ్యవసాయంలో కూలీలు చేసే కలుపుతీత వంటి అనేక పనులను చక్కబెడుతుంది.
పంటల సాగులో రసాయనాల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించటం, శాస్త్రీయ, సుస్థిర వ్యవసాయ సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తేవటం ఎక్స్ మెషిన్స్ లక్ష్యాలు. ప్రెసిషన్ అగ్రికల్చర్ కోసం మల్టీపర్పస్ ఎఐ బేస్‌డ్ రోబోలను తయారు చేస్తోంది. వ్యవసాయంతో ప్రారంభించి ఇతర పరిశ్రమలకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది. ఈ రోబోలను ఎవరూ నడపాల్సిన అవసరం లేదు. వాటంతట అవే తమ ప్రయాణాన్ని నిర్దేశించుకొని పనిచేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. మిరప, పత్తి, పొగాకు తదితర సాళ్లుగా విత్తే పంట పొలాల్లో అన్ని మొక్కలకూ పురుగుమందుల పిచికారీలు అవసరం ఉండదు. కనీసం 30% మొక్కలకు అవసరం ఉండదని ఎక్స్ మెషిన్స్ సంస్థ అంచనా. చీడపీడల బారిన పడిన మొక్కల్ని ఎఐ టెక్నాలజీతో గుర్తించి వాటిపై మాత్రమే పిచికారీ చేయటం ఈ రోబో ప్రత్యేకత అని చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు గోదాములు, లాజిస్టిక్స్, రక్షణ శాఖ అవసరాలు, ఉత్పత్తి యూనిట్లకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది.
చదవండి: ‘మునగరాణి’ : అపుడు ఎన్నో అవహేళనలు..ఇపుడు నెలకు లక్ష రూపాయలు
సాంకేతికత: ఎక్స్ 111– మల్టీపర్పస్ రోబో
సమస్య: కూలీల కొరత రైతులకు ప్రధాన సవాళ్లలో ఒకటి. దాని అనుబంధ ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి.
పరిష్కారం:
ఈ సవాల్‌ను అధిగమించడానికి ఎక్స్ మెషిన్స్ రోబోని రూపొందించింది.
వ్యవసాయ పంటల్లో కలుపు సమస్య, కూలీల కొరత లేకుండా చేస్తుంది.
ఇది విత్తనం వేయటం, నారు పెంపకం, మైక్రో స్ప్రేలు, ఎరువుల పిచికారీ, ఇతర పనులకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చు.
ఇది 8 గంటల సమయంలో 2.5 ఎకరాల్లోని కలుపు మొక్కల్ని తొలగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment