robos
-
ఈ రోబో ఇంటి పనులన్నీ సులభంగా చేసేస్తుంది!
ఇంటి పనులన్నీ చేసే రోబోలను సినిమాల్లోనూ లేదా కార్టూన్ షోల్లోనే చూశాం. నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటుందనేది తెలియదు. అందుకోసం ఇప్పటికే పరిశోధనలు చేయడమే గాక పలు రూపాల్లో రోబోలను తీసుకొచ్చారుగానీ. ఎలా రోబోలతో పనిచేయించుకోవాలనేది కాస్త సమస్యాత్మకంగా ఉంది. ఏం చేయాలన్నిది రోబోకి ముందుగానే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమస్య లేకుండా శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కూడిన సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీని సాయంతో రోబోకు సాధారణ ఇంటి పనులను ఎలా నిర్వహించాలో సులభంగా నేర్చుకుని చేసేస్తుంది. ఈ మేరకు రోబోని ట్రైయిన్ చేసేలా డాబ్ ఈ అనే కొత్త ఓపెన్ స్టోర్ సిస్టమ్‌ని రూపొందించారు. వాస్తవంగా ప్రతి ఇంట్లో ఉంటే పనులను పరిగణలోకి తసుకుని ఓ డేటాని రూపొందించారు న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం. ఈ డాబ్ ఈకి మనం సాధారణంగా వినయోగించే రీచర్ గ్రాబర్ స్టిక్కి జోడించిన ఐఫోన్‌ను ఉపయోగిస్తే చాలు. రోబో ఈజీగా అన్ని పనులను నేర్చుకుంటుంది. ఈ ఐఫోన్ దేనికంటే మనమిచ్చిన ఇన్స్ట్రక్షన్లను డాబ్ ఈ డేటా రోబోకి ఎలా చేయాలో రికార్డు చేసిన వీడియోల ద్వారా తెలుపుతుంది. దీంతో రోబో ఆటోమేటిగ్గా సులభంగా ఆ పనిని చేసేస్తుంది . ఈ సరికొత్త సాంకేతికతో కూడిన రోబో వర్కింగ్ గురించి న్యూయార్క్‌లోని దాదాపు 22 ఇళ్లల్లో టెస్ట్ చేయగా చక్కటి ఫలితం వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ డాబ్ ఈ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా పరిశోధనలు చేస్తున్నారు. ఈ డేటా మరింత ఎక్కువగా ఉంటే కొత్త ఇంటిని చూడగానే ఆ రోబోని ట్రైయిన్ చేయాల్సిన పని కూడా ఉండదనేది పరిశోధకులు ఆలోచన. ప్రతి ఇంట్లో ఉండే పనులన్నీ రోబోలకు ఇప్పటికే తెలుసు, నేర్చుకున్నాయి కూడా అన్నారు. ఇక్కడ రోబో స్టిక్సిస్టమ్లను వినియోగిస్తుంది. వీటినన్నంటిని కలిపి డాబ్-ఇ అని పిలుస్తారు. ఈ రోబో ఇల్లు తుడవడం దగ్గర నుంచి లాండ్రీ వరకు అన్నింటిని చేసేస్తుంది. (చదవండి: భారత రెస్టారెంట్‌కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్‌గా అరోరా) -
2050లో ఆఫీస్ అంటే ఇలా ఉంటుందట!
ఆఫీసు అంటే ఎలా ఉంటుంది?.. వరుసపెట్టి టేబుళ్లు, కుర్చీలు.. కంప్యూటర్లు.. హడావుడిగా పనిచేసుకునే ఉద్యోగులు.. మరి 2050లో ఆఫీస్ ఎలా ఉంటుంది?.. హోలోగ్రామ్ రిసెప్షనిస్ట్.. వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ మీటింగ్‌లు.. చెప్పిన పనిచేసే రోబోలు.. కాసేపు కునుకు తీయడానికి బెడ్లు.. కాఫీ తెచ్చి ఇచ్చే డ్రోన్లు.. ..మరో 30 ఏళ్లలో అత్యధునిక టెక్నా లజీల సాయంతో ఆఫీసుల రూపురేఖలు, పనివాతావరణం ఎలా మారిపోతాయనే అంశంపై ‘ఫర్నీచర్ ఎట్ వర్క్’ సంస్థ అధ్యయనం చేసి ఈ వివరాలను తెలిపింది. ఉద్యోగుల నుంచి మరింత ‘పని’ ని రాబట్టుకోవడంతోపాటు వారికి ఆరోగ్యం, ఆహ్లాదం అందించేలా ఆఫీ సులు రూపొందుతాయని పేర్కొంది. ►అవసరానికి తగినట్టు సులువుగా మార్చుకోగలిగేలా.. కదిలే గోడలు, ఆధునిక ఫర్నీచర్ వస్తాయి. ►అవసరానికి తగ్గట్టు లైటింగ్, గాలి నాణ్యతను చెక్ చేస్తూ శుభ్రపర్చడం, ఉష్ణోగ్రతను చెక్ చేస్తూ సమానంగా ఉంచడం వంటివి ఆటోమేటిగ్గా జరిగేలా సెన్సర్లతో ఆఫీసు భవనాలు ‘స్మార్ట్’గా మారుతాయి. ►పనితీరు మెరుగుపడేలా ఎప్పటికప్పుడు వర్చువల్ రియాలిటీతో కూడిన శిక్షణ. ►ఆఫీసుకు వచ్చే సందర్శకులకు సమాచారం ఇవ్వగల హోలోగ్రామ్ రిసెప్షనిస్ట్ ►వేలిముద్రల (బయోమెట్రిక్)తో తెరుచుకునే ఫ్రిడ్జ్‌లు ►ఉద్యోగులు లేచి వెళ్లాల్సిన పనిలేకుండా కాఫీ, టీలు తెచ్చే డ్రోన్లు ►ఆఫీసులో గాలి కాలుష్యాన్ని తొలగించేలా గోడలకు నానో పెయింట్లు ►పని అలసట నుంచి చిన్న కునుకుతో సేదతీరేందుకు న్యాపింగ్ బెడ్స్ ►ఒత్తిడిని తగ్గించుకునేందుకు వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీతో కూడిన మెడిటేషన్ గది ►ఒకరినొకరు సంప్రదించుకుంటూ పనిచేయాల్సిన ఉద్యోగుల కోసం ఓపెన్ ఆఫీస్ ►ఆఫీసులోకి వచ్చే ప్రతి ఒక్కరిని గుర్తించే ఫేస్ స్కానింగ్ వ్యవస్థ ►అవసరమైన సమాచారాన్ని చూసేందుకు, సమావేశాల కోసం వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు ►ఆహ్లాదకరమైన, కాలుష్య రహిత వాతావరణం కోసం మాడ్యులర్ గ్రీన్ వాల్స్ ►పర్యావరణ హితమైన బయోఫిలిక్ ఫర్నీచర్ ►ఎక్కువ ఏకాగ్రతతో పనిచేయాల్సిన ఉద్యోగుల కోసం ‘యాంటీ డిస్ట్రా క్షన్ టెక్నాలజీ’ క్యాబిన్లు ►క్లీనింగ్‌తోపాటు వివిధ రకాల పనుల కోసం రోబోలు ►ఉద్యోగులు, ఆఫీసర్లు నేరుగా కలిసి మాట్లాడుకున్న అనుభూతి వచ్చేలా హోలోగ్రామ్ ఆధారిత వర్చువల్ సమావేశాలు ►చిన్న పిల్ల లున్న ఉద్యో గుల కోసం బేబీ సిట్టర్, ప్రత్యేక రూమ్ ►శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితిని గమనించే రిస్ట్ బ్యాండ్లు – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. రోబోల సాయంతో మంటలు అదుపులోకి..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సుల్తాన్‌పురి రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, రోబోల సాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. కాగా, అగ్నిప్రమాద ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా డివిజన్ అగ్నిమాపక శాఖ అధికారి ఏకే జైస్వాల్ మాట్లాడుతూ.. ప్రమాద స్థలానికి 15 ఫైర్ ఇంజిన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాము. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. మంటలను ఆర్పేందుకు రోబోలను కూడా ఉపయోగిస్తున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 15 fire tenders present at the spot. The situation is under control. Robots are also being used to extinguish the fire. No casualties reported so far: AK Jaiswal, Divisional Fire Officer, Delhi pic.twitter.com/pjaBYeLc6Z — ANI (@ANI) March 2, 2023 -
హైదరాబాద్‌లో రోబోట్ తయారీ: రామరాజు సింగం
హైదరాబాద్: కరోనా మానవ జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చింది. దీంతో అనేక పద్ధతులు మారాయి. టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. వాటిలో ఒకటి రోబోట్స్ వాడకం. ముఖ్యంగా హోటల్స్ లో రోబోస్ వాడకం బాగా పెరిగింది. చాలా హోటల్స్ హ్యూమన్ కాంటాక్ట్ కి బదులు రోబోస్ ని వాడి కస్టమర్స్ కి కరోనా నుంచి అభయం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిని గమనించిన రామరాజు సింగం అనే వ్యక్తి హైదరాబాద్‌లో విస్టాన్ నెక్స్ట్‌జెన్ అనే సంస్థ స్థాపించి రోబోలు ని తాయారు చెయ్యడం మొదలుపెట్టాడు. గత 20 సంవత్సరాలుగా లండన్ లో స్థిరపడిన రామరాజు అక్కడ ఒక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాడు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో స్వదేశానికి వచ్చిన ఆయన దేశానికి ఏదైనా చెయ్యాలి అని ఈ రోబోటిక్స్ కి సంబందించిన కంపెనీ పెట్టాడు. ఒక రోబోని తయారు చేసి రెండు లక్షలకు అమ్ముతున్నారు. వేరే దేశాల్లో ఆరు లక్షలు పలికే రోబోలను ఇక్కడ రెండు లక్షలకే అమ్ముతున్నారు. చైనాకి ధీటుగా భారత్ మార్కెట్ ను నిలపాలనేది తన కల అని రామరాజు సింగం తెలిపారు. విస్టాన్ నెక్స్ట్‌జెన్ లో తయారైన రోబోలు రకరకాల పనులు చేస్తూ మరమనిషి అనే పేరుకి కరెక్ట్ గా సూట్ అవుతున్నాయి. -
విస్తారా ప్రయాణికులకు రోబో సేవలు!!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘విస్తారా’... ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలోని తన లాంజ్‌లో రోబో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది ప్రయాణికుల సందేహాలను పరిష్కరిస్తుంది. బోర్డింగ్ పాస్‌లను స్కాన్ చేస్తుంది. ఫ్లైట్ స్టేటస్‌ను తెలియజేస్తుంది. ప్రయాణికులు వెళ్లే ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేస్తుంది. అలాగే వారిని ఎంటర్టైన్ చేస్తుంది. నిర్దేశించిన దారిలో అటు ఇటు తిరుగుతూ ప్రయాణికులను పలకరించగలదు. ఇన్ని సేవలందించే ఈ రోబోకు కంపెనీ.. ‘రాడా’ అనే పేరు పెట్టింది. తమ రోబో... సాంగ్స్‌ను కూడా ప్లే చేయగలదని విస్తారా తెలిపింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టర్మినల్–3లోని తమ సిగ్నేచర్ లాంజ్‌లో జూలై 5 నుంచి రోబోను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. రోబో విషయానికి వస్తే.. దీనికి కింద 4 వీల్స్ ఉంటాయని, 360 డిగ్రీల్లో చుట్టూ తిరగగలదని, 3 ఇన్–బిల్ట్ కెమెరాలు అమర్చామని, సమర్థవంతమైన వాయిస్ టెక్నాలజీ పొందుపరిచామని వివరించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రోబోను తయారుచేసినట్లు పేర్కొంది. విస్తారా అనేది టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్. -
కృత్రిమ మేధకు కొత్త రెక్కలు!
-
కృత్రిమ మేధకు కొత్త రెక్కలు!
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) అమెరికాలో ఏటా వారం రోజుల పాటు జరిగే హైటెక్ ప్రదర్శన. టెక్ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు తమ పరిశోధనల ఫలితాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. భవిష్యత్తులో రాబోయే వింతలకు ఈ ప్రదర్శనను సూచికగా చూస్తారు. ఈ ఏడాది ఇందులో దాదాపు 4 వేల కంపెనీలు పాల్గొన్నాయి. అందులో ప్రదర్శితమైన కొన్ని సాంకేతికతల వివరాలు మీకోసం. –సాక్షి, హైదరాబాద్ అందరికీ అందుబాటులోకి ఏఐ! కృత్రిమ మేధను నిన్న మొన్నటివరకూ సంక్లిష్టమైన సమస్యల పరిష్కారానికి వాడటం చూశాం. ఇకపై అలా ఉండదు.. వాచీల్లో, స్మార్ట్ఫోన్లలో, టీవీల్లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. అమేజాన్ తన అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ మొబైల్ కిట్‌ను డెవలపర్లకు అందుబాటులోకి తేనుంది. గూగుల్ కూడా తన గూగుల్ అసిస్టెంట్‌ను ప్రజలకు మరింత దగ్గర చేసే పనులు మొదలుపెట్టింది. ఒకట్రెండేళ్లలో ఇవే టెక్నాలజీలు గొంతును గుర్తించి ఇంటి తాళాలూ తీసిపెట్టొచ్చు.. ఫలానా రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, ఆఫీసుకు వేరే రోడ్డు ద్వారా వెళదామని మీ స్మార్ట్‌ఫోన్ నుంచే సూచనలు రావొచ్చు. బాధ అర్థం చేసుకునే రోబోలు.. మీరు కష్టాల్లో ఉంటే.. మీ స్నేహితుడో.. బంధువో ఎలా ఓదారుస్తారో కొత్త రకం రోబోలు కూడా పరిస్థితికి తగ్గట్లు వ్యవహరిస్తూ మీకు సాంత్వన చేకూరుస్తాయి. ఎల్జీ కంపెనీ షాపింగ్ మాల్స్‌లో, హోటళ్లలో ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలకు ఎసరుపెట్టే స్థాయిలో సేవలందించగలవని అంచనా. టైటాన్–ఏఐ రోబో మన ముఖ కవళికలను గుర్తించడమే కాకుండా అందుకు తగ్గట్లు స్పందిస్తుంది. కోపంగా ఉంటే ఇష్టమైన పాటలు వినిపిస్తుంది.. కామెడీ సీన్స్ చూపిస్తుంది. చెప్పిన పని చేసే రోబోలతో పోలిస్తే.. మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునే రోబోలను తయారు చేయడం చాలా కష్టమని.. అయినా ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కార్లకూ టెక్ హంగులు.. డ్రైవర్ రహిత కార్ల గురించి తరచూ వింటూనే ఉన్నా.. ఈ ఏడాది సీఈఎస్‌లో మరిన్ని కంపెనీలు ఇలాంటి వాటిని ముందుకు తీసుకొచ్చాయి. చైనీస్ కంపెనీ ‘బైటన్’ఓ ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. హెన్రిక్ ఫిస్కర్ డిజైన్ చేసిన ఈ కారు ఖరీదు దాదాపు రూ.30 లక్షలు. యమహా కంపెనీ డ్రైవర్ అవసరం లేని ఓ మోటర్‌బైక్‌ను ప్రదర్శించగా.. హ్యుందాయ్ ఫుయెల్సెల్ టెక్నాలజీతో పనిచేసే నెక్సోను ప్రదర్శనకు పెట్టింది. ప్రజా రవాణాతో పాటు రకరకాల అవసరాల కోసం ఒకే ప్లాట్ఫార్మ్ అనే కాన్సెప్ట్‌తో టయోటా ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. చక్రాలు, ఛాసిస్ మాత్రమే స్థిరంగా ఉండే ఈ కాన్సెప్ట్‌లో పై భాగం అవసరాన్ని బట్టి మారుతుంటుంది. వీఆర్‌పై లెనవూ ఫోకస్.. చైనీస్ కంప్యూటర్ తయారీ సంస్థ లెనవూ సీఈఎస్‌లో ప్రదర్శించిన ఉత్పత్తుల్లో అధికం వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్)లకు సంబంధించినవే. మిరేజ్ సోలో, డే డ్రీమ్ పేర్లతో విడుదలైన వ్యవస్థలతో వర్చువల్ కంటెంట్‌ను చాలా తేలికగా సృష్టించొచ్చు. ఫొటోలు, వీడియోల ఆధారంగా డే డ్రీమ్ ఈ కంటెంట్‌ను సృష్టిస్తుంది. పదేళ్ల కిందటి మీ పెళ్లి వీడియోను ఇందులోకి ఎక్కిస్తే.. మీరు అక్కడున్న అనుభూతి పొందుతూ వర్చువల్ రియాల్టీలో చూడొచ్చన్నమాట. స్మార్ట్ఫోనే ల్యాప్‌టాప్.. ప్రాసెసింగ్ స్పీడ్ విషయంలో కంప్యూటర్లకు, స్మార్ట్ఫోన్లకు మధ్య అంతరం ఇప్పుడు దాదాపు లేదనే చెప్పాలి. ప్రాజెక్టు లిండా పేరుతో రేజర్ అనే కంపెనీ సీఈఎస్‌లో స్మార్ట్‌ఫోన్‌నే ల్యాప్‌టాప్‌గా ఎలా వాడుకోవచ్చో ప్రదర్శించింది. నిర్దిష్టమైన స్థానంలోకి చేర్చడం ద్వారా స్మార్ట్‌ఫోన్ తాలూకూ ప్రాసెసర్, సాఫ్ట్వేర్లతోనే ల్యాప్‌టాప్ తరహాలో పనిచేసుకునేందుకు వీలు కల్పిస్తుంది ఇది. -
రోబోలకు అనువైన ‘చర్మం’
వాషింగ్టన్: మనుషుల రోజువారీ పనులను చేసేందుకుగాను రోబోలకు దానికనుగుణంగా ఉండే చర్మాన్ని పరిశోధకులు రూపొందించారు. ఈ చర్మాన్ని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ)కి చెందిన 45 మంది ప్రొఫెసర్లు తయారు చేసినట్లు యూడబ్ల్యూ ప్రొఫెసర్ జోనాథన్ పోస్నర్ తెలిపారు. ఈ చర్మాన్ని తొడిగిన రోబోలు మనుషుల రోజువారీ పనులను తేలికగా, ఆటంకాలు లేకుండా చేసేస్తాయని చెప్పారు. వస్తువుల స్వభావాలను బట్టి ఈ చర్మం రోబోలకు సంకేతాలు అందిస్తుందని, దానికి తగ్గట్లుగా రోబో పనిచేస్తుందని పోస్నర్ తెలిపారు. ఈ చర్మం అక్టోబర్ నెలాఖరు నుంచి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనిపై ఇంకా తాము పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక ఉష్ణోగ్రత, అత్యంత చల్లదనమైన ప్రదేశాల్లో కూడా పనిచేసేలా ఈ చర్మాన్ని రూపొందించినట్లు పోస్నర్ వివరించారు. స్విమ్మింగ్ గగూల్స్ తయారీలో ఉపయోగించే సిలికాన్ రబ్బర్‌ను ఉపయోగించి ఈ చర్మాన్ని తయారుచేసినట్లు చెప్పారు. -
బాడీ మసాజ్లకూ రోబోలు!
రోబోలతో ఉద్యోగాలు పోతాయంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే.. సింగపూర్‌లో ఇప్పుడు ఏకంగా మసాజ్‌లు చేసే రోబోలు వచ్చేశాయి..! ఎక్స్పర్ట్ మానిప్యులేటివ్ మసాజ్ ఆటోమేషన్ (ఎమ్మా) అని పిలుస్తున్న ఈ రోబోను నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఝాంగ్ అభివృద్ధి చేశారు. ఏడాది కిందే తొలి నమూనా తయారైనా మార్పులు, చేర్పులు చేసి మరింత మెరుగుపరిచేందుకు కొంత సమయం పట్టింది. తాజాగా సోమవారం నుంచి ఈ రోబో సింగపూర్‌లోని నోవాహెల్త్ ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ క్లినిక్‌లో మసాజ్‌లు చేయడం ప్రారంభించింది. శరీరంలోని టెండాన్లు, కండరాల పటుత్వాలను సెన్సర్ల ద్వారా గుర్తించి.. మసాజ్‌లు చేయడం వీటి ప్రత్యేకత. వెన్నెముక, మోకాళ్లకు మర్దన చేయడంలో మానవ మసాజర్లకు ఏమాత్రం తీసిపోదని ఝాంగ్ పేర్కొంటున్నారు. అయితే ఇది మనుషులకు ప్రత్యామ్నాయం కాదని.. ప్రస్తుతం క్లినిక్‌లలో మసాజ్‌లు చేస్తున్న వారిపై పని ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతోనే ఎమ్మాను తయారు చేశామని చెప్పారు. ఎక్కువ సమయం పట్టే మసాజ్‌ల విషయంలో మనిషికి బదులుగా రోబోను వాడతామన్నారు. -
పనులన్నీ రోబోలు చేస్తే.. మనమేం చేయాలి?
ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ రేపటి రోజున రోబోలు, కంప్యూటర్లే చేయగలగితే... అప్పుడు మనమేం చేయాలి? రానున్న కాలంలో ఎలాంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఎంతో మందిలో తొలుస్తున్న ప్రశ్న ఇది. ఈ విషయంలో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ దీనిపై కొంత అధ్యయనం చేసింది. మరో యాభై ఏళ్లలో ఈ ప్రపంచం ఎంతగానో మారిపోనుంది. కాలానుగుణంగా ఇప్పుడు మనం చేస్తున్న పనిలో యాభై శాతం పనిని రోబోలు, కంప్యూటర్లే చేస్తాయని అమెరికాలోని ముప్పావుశాతం ప్రజలు నమ్ముతున్నారు. రానున్న కాలంలో ఆటోమేషన్ వల్ల 50 లక్షల ఉద్యోగాలు పోవచ్చని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ‘ఫ్యూచర్ ఫర్ జాబ్స్’ తాజా నివేదికలో పేర్కొంది. అంత మంది ఉద్యోగాలకు ఎసరొస్తే... అప్పుడేం చేయాలి? పయనం ఎటువైపు? దానికి సమాధానమేంటంటే... అప్పటికి కొత్త రంగాలు ఆవిర్భవిస్తాయి. అందులో ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయి. కానీ ఎంత శాతం కొత్త ఉద్యోగాలు వస్తాయన్నది ప్రస్తుతానికి అంతుచిక్కని ప్రశ్న. అందుకని ఏయే రంగాలు అభివృద్ధి చెందుతాయో ఇప్పటి నుంచే అంచనావేసి ఆ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం మంచిదని అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) నివేదిక చెబుతోంది. యాభై ఏళ్లలో ఉద్యోగ రంగంలో వచ్చే మార్పుల ప్రభావం ప్రత్యక్షంగా కొన్ని రంగాలపై లేకపోయినప్పటీకీ ఆయా రంగాల వారు కూడా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం మాత్రం తప్పదని ఆ నివేదిక స్పష్టం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని రకాల ఉద్యోగాలు తెరమరుగైనప్పటికీ కొత్తగా వచ్చే మార్పులకు అనుగుణంగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను వెల్లడించింది. ఆటోమేషన్ కు సంబంధం లేని ఉద్యోగాల్లో అది కూడా నైపుణ్యం బాగా పెంచుకోగలగితే తప్ప భవిష్యత్తు ఉండదని అంచనా. సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న వారు కూడా తమలో నైపుణ్యత మరింత పెరగాల్సిన అవసరం ఉంటుంది. * ఇప్పటి నుంచి 2014 నాటికి సాఫ్ట్ వేర్ డెవలపర్, కంప్యూటర్ సిస్టమ్స్ అనలిస్ట్, మార్కెట్ రీసెర్చ్, మార్కెటింగ్ స్పెషలిస్ట్ జాబ్స్ ఐదింతలు పెరుగుతాయని బీఎల్ఎస్ అంచనావేసింది. * మెడికల్ టెక్నిషియన్స్, ఫిజికల్ థెరపిస్టులు, వర్కప్లేస్ ఎర్గోనమిక్స్ ఎక్స్పర్ట్ జాబ్‌లు గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. * సేల్స్ అండ్ మార్కెటింగ్ స్పెషలిస్టులు, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్‌లు పెరుగుతాయని, పెరుగుదల కనిపించే ఐదు రంగాల్లో ముఖ్యంగా సేల్స్ సంబంధిత ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయని ‘ఫ్యూచర్ జాబ్’ నివేదిక తెలిపింది. ఈ రంగంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ అవసరమవుతాయని, రోబోలు ఈ పనులను చేయలేవు కనుక ఈ రంగంలో ఉద్యోగాలకు కొదవ ఉండదని నివేదిక పేర్కొంది. * వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యా, ఉద్యోగ శిక్షణా కార్యక్రమాలు కూడా ముఖ్యమే. అందుకనే అభివృద్ధి చెందే రంగాల్లో ఈ రంగం ఆరో స్థానంలో నిలిచినట్లు ‘ఫ్యూచర్ జాబ్స్’ నివేదిక తెలిపింది. * మేనేజ్మెంట్ అనలిస్ట్‌లు, అకౌంటెంట్లు, ఆడిటర్లు పురోభివృద్ధి రెండంకెల్లో ఉంటుందని, నేడున్న ఉద్యోగ నైపుణ్యాన్ని 2020 నాటికి మూడింతలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా ఆ నివేదిక వివరించింది. -
చందమామకు బహుమతులు..
వాషింగ్టన్: అందాల చందమామపైకి బహుమతులను తీసుకెళ్లే రోబోను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. భూమిపై నుంచి అతి తక్కువ బరువుతో వీటిని చంద్రమండలంపైకి చేర్చేలా రూపొందిస్తున్నారు. భూమిపై ప్రసిద్ధి గాంచిన కళ, కవిత్వం, సంగీతం, డ్రామా, నృత్యాలను చిన్నపాటి డిస్కుల్లో బంధించి ఓ మూన్ రోవర్‌తో వచ్చే ఏడాదిలో పంపేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సర్వం సిద్ధం చేస్తోంది. అమెరికాలోని కార్నిగె మిలన్ విశ్వవిద్యాలయం, రోబోటిక్స్ సంస్థ ఈ ప్రక్రియను చేపట్టింది. ప్రయివేటు నిధులతో గూగుల్ లునార్ ఎక్స్‌ప్రైజ్, యూఎస్డీ 30 మిలియన్ కాంటెస్ట్‌ను తయారు చేస్తోంది. చంద్రుడిపైకి చిన్నసైజు డిస్కులతోపాటు, డేటా తీసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు టెక్టైమ్స్ తెలిపింది. -
'మర' మనసులు కలిసిన వేళ...
మర మనిషి, మర మగువ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివాహ వేడుకలో తెలుపు రంగు పెళ్లి గౌను వేసుకున్న వధువు ఫ్రోయిస్ను వరుడు యుకిరిన్ ముద్దాడాడు. 100 మంది ప్రత్యేక అతిథుల సమక్షంలో వెడ్డింగ్ కేకును కట్‌చేశారు. శనివారం జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగిన ఈ వివాహ వేడుకకు అయోమాకే రెస్టారెంట్ వేదికగా నిలిచింది. రోబోటిక్ బ్యాండ్ ఆధ్వర్యంలో జరిగిన డాన్సింగ్, మ్యూజిక్ కార్యక్రమాల్లో అతిథులు మునిగిపోయారు. పెళ్లి కోసం నవవధూవరుల ఫొటోలతో ఆహ్వానపత్రికనూ అచ్చేశారు. మేవాదికి సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా ఇలా రెండు రోబోలకు పెళ్లి చేసి ఔరా అనిపించింది. -
బూమ్ బూమ్ రోబోడా..
డిఫరెంట్ థీమ్స్‌తో రూపొందిన రోబోలు భవిష్యత్ భారతిని ముందుంచాయి. ఘట్కేసర్ సమీపంలోని శ్రీనిధి కాలేజీలో శనివారం నిర్వహించిన రోబోవేద-2014 సరికొత్త ప్రతిభను ఆవిష్కరించింది. రొబోటిక్స్‌లో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల కృషిని వుుందుంచింది. ఈ పోటీల్లో పలు ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఈ పోటీకి హాజరయ్యూరు. విద్యార్థులు రూపొందించిన రోబోలు ఒకదానితో వురొకటి పోటీ పడ్డాయి. డిఫరెంట్ థీమ్స్‌తో తయూరు చేసిన రోబోలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రోబోల పనితనం ఎలా ఉందో తెలుసుకునేలా డిఫరెంట్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు. క్వాలిఫైరుుంగ్ రౌండ్ సక్సెస్ ఫుల్‌గా దాటిన వారిని తర్వాతి రౌండ్లకు అనువుతించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
కాదేదీ చోరీకి అనర్హం
విశ్రాంతి గదిలో సామగ్రితో ఉడాయిస్తున్న ప్రయాణికులు - మహిళా ప్రయాణికులు విశ్రమిస్తున్న చోటే చోరీలు అధికం - పాలుపోని అధికారులు - ఇతరుల తప్పులకు తాము బలవుతున్నామంటూ ఆవేదన సాక్షి, ముంబై: పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లోని విశ్రాంతి గదిలోనూ దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి. ఇందులో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచిన సామగ్రి తరచూ చోరీకి గురవుతున్నాయి. దీనిని గత ఏడాది ఏప్రిల్‌లో అప్పటి రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ ప్రారంభించారు. ఇక్కడ ప్రయాణికుల కోసం తువ్వాళ్లు, సబ్బులను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఇవి కూడా చోరీకి గురవుతున్నాయి. ఇందులో 12 గంటల పాటు ఉన్న వారి వద్ద నుంచి రూ.150, 24 గంటల పాటు ఉన్నవారి వద్ద నుంచి రూ.250 వసూలు చేస్తారు. ఇక్కడ 78 పడకలను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచారు. ఇందులో 58 పడకలు పురుషుల కోసం, మిగతావాటిని మహిళల కోసం ఉంచారు. అయితే గత కొన్ని రోజులుగా ఇందులోని బల్బులు, ఇతర చిన్న చిన్న పరికరాలు చోరీకి గురవుతున్నాయి. విచిత్రమేమిటంటే మహిళల విశ్రాంతి గదిలోనే ఎక్కువ చోరీలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. చోరీల విషయమై భద్రతా సిబ్బంది అనేక పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. ప్రయాణికులు గది విడిచి వెళుతున్న సమయంలో దుప్పట్లు కూడా తీసుకెళ్తున్నట్లు గమనించిన సిబ్బంది తమ దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ గదిని ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు సామగ్రి చోరీకి గురవుతూనే ఉందని వారు పేర్కొన్నారు. ఇందులోకి వచ్చే ప్రతి ప్రయాణికుడి సామగ్రిని తనిఖీ చేయాలంటూ ఇటీవల సంబంధిత అధికారులు సిబ్బందికి సూచించారు. అయితే రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారని, అందువల్ల తనిఖీ సాధ్యం కావడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 20 దుప్పట్లు చోరీకి గురైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక అధికారులు చవకైన సామగ్రిని ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరో చోరీలకు పాల్పడుతున్నారని, అయితే అందుకు తాము బాధ్యత వహించాల్సి వస్తోందంటూ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.