ఆఫీసు అంటే ఎలా ఉంటుంది?.. వరుసపెట్టి టేబుళ్లు, కుర్చీలు.. కంప్యూటర్లు.. హడావుడిగా పనిచేసుకునే ఉద్యోగులు.. మరి 2050లో ఆఫీస్ ఎలా ఉంటుంది?.. హోలోగ్రామ్ రిసెప్షనిస్ట్.. వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ మీటింగ్‌లు.. చెప్పిన పనిచేసే రోబోలు.. కాసేపు కునుకు తీయడానికి బెడ్లు.. కాఫీ తెచ్చి ఇచ్చే డ్రోన్లు..
..మరో 30 ఏళ్లలో అత్యధునిక టెక్నా లజీల సాయంతో ఆఫీసుల రూపురేఖలు, పనివాతావరణం ఎలా మారిపోతాయనే అంశంపై ‘ఫర్నీచర్ ఎట్ వర్క్’ సంస్థ అధ్యయనం చేసి ఈ వివరాలను తెలిపింది. ఉద్యోగుల నుంచి మరింత ‘పని’ ని రాబట్టుకోవడంతోపాటు వారికి ఆరోగ్యం, ఆహ్లాదం అందించేలా ఆఫీ సులు రూపొందుతాయని పేర్కొంది.
►అవసరానికి తగినట్టు సులువుగా మార్చుకోగలిగేలా.. కదిలే గోడలు, ఆధునిక ఫర్నీచర్ వస్తాయి.
►అవసరానికి తగ్గట్టు లైటింగ్, గాలి నాణ్యతను చెక్ చేస్తూ శుభ్రపర్చడం, ఉష్ణోగ్రతను చెక్ చేస్తూ సమానంగా ఉంచడం వంటివి ఆటోమేటిగ్గా జరిగేలా సెన్సర్లతో ఆఫీసు భవనాలు ‘స్మార్ట్’గా మారుతాయి.
►పనితీరు మెరుగుపడేలా ఎప్పటికప్పుడు వర్చువల్ రియాలిటీతో కూడిన శిక్షణ.
►ఆఫీసుకు వచ్చే సందర్శకులకు సమాచారం ఇవ్వగల హోలోగ్రామ్ రిసెప్షనిస్ట్
►వేలిముద్రల (బయోమెట్రిక్)తో తెరుచుకునే ఫ్రిడ్జ్‌లు
►ఉద్యోగులు లేచి వెళ్లాల్సిన పనిలేకుండా కాఫీ, టీలు తెచ్చే డ్రోన్లు
►ఆఫీసులో గాలి కాలుష్యాన్ని తొలగించేలా గోడలకు నానో పెయింట్లు
►పని అలసట నుంచి చిన్న కునుకుతో సేదతీరేందుకు న్యాపింగ్ బెడ్స్
►ఒత్తిడిని తగ్గించుకునేందుకు వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీతో కూడిన మెడిటేషన్ గది
►ఒకరినొకరు సంప్రదించుకుంటూ పనిచేయాల్సిన ఉద్యోగుల కోసం ఓపెన్ ఆఫీస్
►ఆఫీసులోకి వచ్చే ప్రతి ఒక్కరిని గుర్తించే ఫేస్ స్కానింగ్ వ్యవస్థ
►అవసరమైన సమాచారాన్ని చూసేందుకు, సమావేశాల కోసం వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు
►ఆహ్లాదకరమైన, కాలుష్య రహిత వాతావరణం కోసం మాడ్యులర్ గ్రీన్ వాల్స్
►పర్యావరణ హితమైన బయోఫిలిక్ ఫర్నీచర్
►ఎక్కువ ఏకాగ్రతతో పనిచేయాల్సిన ఉద్యోగుల కోసం ‘యాంటీ డిస్ట్రా క్షన్ టెక్నాలజీ’ క్యాబిన్లు
►క్లీనింగ్‌తోపాటు వివిధ రకాల పనుల కోసం రోబోలు
►ఉద్యోగులు, ఆఫీసర్లు నేరుగా కలిసి మాట్లాడుకున్న అనుభూతి వచ్చేలా హోలోగ్రామ్ ఆధారిత వర్చువల్ సమావేశాలు
►చిన్న పిల్ల లున్న ఉద్యో గుల కోసం బేబీ సిట్టర్, ప్రత్యేక రూమ్
►శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితిని గమనించే రిస్ట్ బ్యాండ్లు
– సాక్షి, సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment