office
-
భలేవాడివి బాసు!
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగుంటేనే ప్రతిరోజూ ఆనందం ఉంటుంది. అసలే దూరాభారం ప్రయాణాలు, ట్రాఫిక్ చిక్కులు, టార్గెట్లు వంటి కారణాలతో అలిసిపోవడం సహజం.. అయితే మన రోజువారీ ఆరోగ్య పరిస్థితిని ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అన్నింటి కన్నా మనపై ఉన్న బాస్ ప్రవర్తనను బట్టే మన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. మనం పనిచేసే ప్రాంతం బాగుంటే మానసిక ప్రశాంతత ఉంటుందని మానసిక నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే రోజుకు కనీసం 9 గంటల పాటు ఆఫీస్‌లోనే గడపాల్సి వస్తుంది కాబట్టి.. అక్కడి వాతావరణం బాగుంటేనే మిగతా రోజంతా సులువుగా గడిచిపోతుందని పేర్కొంటున్నారు. పై అధికారి శాడిస్టు అయితే మానసిక ఆరోగ్యంతో పాటు మన పనితనం, భవిష్యత్తు, ఇతరులతో సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘకాలిక ప్రభావం.. ఆఫీస్‌లో బాస్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే.. అది ఉద్యోగిపై స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ నెగెటివిటీతో బాస్ మాట్లాడుతుంటే ఉద్యోగుల సొంత తెలివితేటలపైనే అనుమానం వస్తుంటుంది. వారిని వారే తక్కువ అంచనా వేసుకోవడంతో పనితీరు కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఉద్యోగంపై విరక్తి కలిగి రాజీనామా చేసేంత వరకూ వెళ్తుందని పేర్కొంటున్నారు. మోటివేషన్ ఉండాల్సిందే.. పని చేసే ప్రదేశంతో నెగెటివ్ వాతావరణం కన్నా మోటివేషన్ ఉంటే ఉద్యోగులు క్రియాశీలకంగా పనిచేస్తుంటారని, చేసిన పనికి మెచ్చుకోలు లేకపోయినా కనీసం కించపరిచేలా మాట్లాడటం, అందరి ముందు మందలించడం వంటి పనులు చేస్తే మానసిక వేదనకు గురై.. పని తీరు మందగిస్తుందని పేర్కొంటున్నారు. పనిచేసే ప్రదేశంలో ఆరోగ్యకరమైన పోటీతత్వం, స్వతంత్రత, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు ఉంటే ఉద్యోగులకు మోటివేషన్ వస్తుందని పేర్కొంటున్నారు. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.ఎలా బయటపడాలి..?కర్కశమైన బాస్ కింద పనిచేసిన వారి మానసిక స్థితిని మళ్లీ తిరిగి పొందొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కన్నా అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక, పాత ఆఫీస్ జ్ఞాపకాలను మర్చిపోయి.. ఆత్మన్యూనత భావం నుంచి బయటపడటం కాస్త కష్టమైనా కూడా సాధించొచ్చని చెబుతున్నారు. మన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుని, మనం గతంలో సాధించిన విజయాలను నెమరువేసుకుంటూ ఉండాలని పేర్కొంటున్నారు. మన మంచి కోరే సహోద్యోగులతో మనం చేసిన పనిపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉండాలని, చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని పూర్తి చేస్తుంటే మళ్లీ మనలో కాని్ఫడెన్స్ పెరుగుతుందంటున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఆత్మ స్థైర్యం సాధించాలని పేర్కొంటున్నారు. ఆఫీస్‌లో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం.. ‘ఎక్కువ కాలం ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో నేర్చుకునే తత్వం తగ్గిపోతుందని, కొత్త విషయాలు రూపకల్పన చేయడం, సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే డోపమైన్ తగ్గుముఖం పట్టి.. కారి్టసాల్ స్థాయి పెరిగుతుందని ఢిల్లీకి చెందిన సైకోథెరపిస్టు డాక్టర్ చాందినీ చెబుతున్నారు. అద్భుతంగా ఎలా పని చేయాలా..? అని ఆలోచించడం మానేసి.. తన మీదికి రాకుండా ఏం చేయాలనే దానిపైనే దృష్టి సారిస్తారని ఆమె వివరించారు. ఆఫీస్ వాతావరణం చాలాకాలం పాటు సరిగ్గా లేకుంటే ఉద్యోగులకు వేరే వారితో సంబంధాలు దెబ్బతింటాయని, అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు చేసుకుంటారని, అలాగే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.లీడర్షిప్ ముఖ్యం.. ఆఫీస్ వాతావరణం చెడిపోడానికి కారణాల్లో ప్రధానమైనది లీడర్షిప్ లేకపోవడం. బాస్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. బాస్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోతే తాను చెప్పాలనుకున్న విషయాలు ఉద్యోగులకు వ్యక్తీకరించలేరు. దీంతో ఉద్యోగులకు ఉన్న సమస్యలు నేరుగా చెప్పుకోలేరు. పక్షపాత వైఖరి, అసాధ్యమైన టార్గెట్లు పెట్టడం కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా ఆఫీస్ వాతావరణం పూర్తిగా చెడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది.అనేక ఆరోగ్య సమస్యలు.. పనిచేసే ప్రదేశంలో బాస్ సపోర్టు ఉంటే ఉద్యోగులు వ్యక్తిగతంగా ఎదుగుదలకు ఉపయోగపడటమే కాకుండా సంస్థ పనితీరు కూడా బాగుంటుంది. ఏం చేసినా తప్పులు వెతకడం, విమర్శలు చేస్తుండటం వల్ల ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేక, అక్కడే భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ పరిస్థితులను ఎవరికీ చెప్పుకోలేక నిద్రలేమి, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. బాస్ ప్రవర్తనతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో కుదిరితే నేరుగా చెప్పి సమస్యలను పరిష్కరించుకోవాలి. నచ్చిన వారితో కాసేపు ప్రశాతంగా గడిపినా, ఫోన్లో మాట్లాడినా మనసులోని బరువు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. – డాక్టర్ పి.హరీశ్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ -
అడ్డగోలు కేసులతో అడ్డంగా దొరికిన పోలీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అడ్డగోలుగా కేసులు పెట్టిన మంగళగిరి పోలీసులు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయారు. దాడి జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్నారంటూ గుంటూరుకు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డిపై తప్పుడు కేసు పెట్టిన పోలీసులు ఇప్పుడు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ బాసులను సంతృప్తిపరిచేందుకు ముందువెనకా ఆలోచించకుండా కేసులు పెట్టిన పోలీసులు అందుకు తగిన మూల్యం చెల్లించాల్సిన స్థితికి వచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో తాను నరసరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉన్నానంటూ సుబ్బారెడ్డి తగిన ఆధారాలను హైకోర్టు ముందుంచడంతో పోలీసులు హైకోర్టుకు దొరికిపోయారు. ఆ ఆధారాలను పరిశీలించిన హైకోర్టు ఘటన జరిగిన సమయంలో సుబ్బారెడ్డి తన మేనల్లుడి పెళ్లిలో ఉంటే.. ఆయన టీడీపీ ఆఫీసు వద్ద ఉన్నారని, ఇదే విషయాన్ని సాక్షులు కూడా రూఢీ చేశారంటూ సీఐడీ దర్యాప్తు అధికారి కౌంటర్ దాఖలు చేయడంపై ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. సుబ్బారెడ్డి టీడీపీ ఆఫీసు వద్ద ఉన్నట్టు అక్కడి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందని కూడా కౌంటర్లో చెప్పడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన జరిగిన రోజున సుబ్బారెడ్డి నర్సరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉంటే, అదే రోజున ఆయన టీడీపీ కార్యాలయం వద్ద ఉండటం ఎలా సాధ్యమని పోలీసులను ప్రశ్నించింది. అలా ఉండే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చిచెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారి అయిన సీఐడీ డీఎస్పీని ఆదేశించింది. ఈ నెల 12న మధ్యాహ్నం 2.15 గంటలకు స్వయంగా తమ ముందు హాజరు కావాలని డీఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో..2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అడ్డగోలుగా కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లేని వారిని కూడా నిందితులుగా చేర్చారు. అలా నిందితులుగా చేర్చిన వారిలో గుంటూరు 28వ డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును సీఐడీకి బదలాయించింది. సుబ్బారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లో దర్యాప్తు అధికారి అయిన సీఐడీ డీఎస్పీ కౌంటర్ దాఖలు చేశారు. ఘటన జరిగిన రోజున సుబ్బారెడ్డి టీడీపీ కార్యాలయం వద్దే ఉన్నారని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని తన కౌంటర్లో పేర్కొన్నారు. సుబ్బారెడ్డి అక్కడ ఉన్నట్టు సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఉందని వివరించారు.పోలీసులు చిక్కుకున్నారిలా..సుబ్బారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం మరోసారి విచారణకు రాగా.. జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసుల అడ్డగోలుతనానికి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ అని న్యాయస్థానానికి తెలిపారు. మేనల్లుడి పెళ్లిలో ఉన్న వ్యక్తిని ఘటనా స్థలంలోనే ఉన్నారని పేర్కొంటూ ఏకంగా హైకోర్టు ముందు కౌంటర్ దాఖలు చేసేంత సాహసం చేశారన్నారు. సుబ్బారెడ్డి ఘటన జరిగిన రోజున నరసరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉన్నారనేందుకు ఇప్పటికే ఆధారాలను కోర్టు ముందుంచామన్నారు. సీఐడీ డీఎస్పీ తన కౌంటర్లో సుబ్బారెడ్డి ఘటనా స్థలంలో ఉన్నట్టు పేర్కొన్న విషయాన్ని నాగిరెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.పిటిషనర్ సీసీ టీవీలో ఎక్కడ ఉన్నారో చూపేలా డీఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పెళ్లిలో ఉన్న సుబ్బారెడ్డి, ఘటనా స్థలం (టీడీపీ పార్టీ కార్యాలయం) వద్ద ఉండటమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. -
కునుకు తీస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా ?
-
ఉద్యోగికి యాక్సిడెంట్.. మేనేజర్ రియాక్షన్‌కు షాక్!
ఆఫీసులకు ఆలస్యంగా వస్తే.. ఉద్యోగులు తమ ఆలస్యానికి అనేక కారణాలు చెబుతారు. కారణం బలమైనదైతే బాస్ కూడా ఏమి అనలేరు. అయితే ఇటీవల ఒక ఉద్యోగి ఆఫీసుకు లేటుగా రావడానికి కారు ప్రమాదం కారణమని చెప్పినా.. మేనేజర్ వ్యవహరించిన తీరు ఉద్యోగిని చాలా బాధించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.ఉద్యోగి కారు ప్రమాదానికి గురై ముందు భాగం భారీగా దెబ్బతినింది. ఈ విషయాన్ని మేనేజర్‌ను తెలియజేస్తూ.. దెబ్బతిన్న కారు ఫోటోలను షేర్ చేశారు. ఉద్యోగికి ఏమైందో అడగటం మానేసి.. మీరు ఏ సమయానికి ఆఫీసుకు రావాలనుకుంటున్నారో తెలియజేయండి అని మెసేజ్ చేశారు. అంతటితో ఆగకుండా.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే తప్పా గైర్హాజరు క్షమించరానిదని వెల్లడించారు.ఉద్యోగి, మేనేజర్ మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్.. ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ మేనేజర్ ఇలా చెబితే మీరందరూ ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు.దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఉద్యోగి క్షేమం గురించి అడగకుండా.. పని గురించే ఆలోచించే మేనేజర్ మీద చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, అని ఒక వ్యక్తి అంటే.. ఆ కంపెనీకి ఇకపై వెళ్ళవద్దు అని సలహా ఇచ్చారు. ఎందుకు ఉద్యోగం వదిలేసావు అనే విషయాన్ని ఎవరైనా అడిగితే, స్క్రీన్ షాట్స్ చూపించండి అని అన్నారు. మేనేజర్‌కు కూడా ఇలాంటి అవస్థ వచ్చేలా చేస్తానని ఇంకొకరు పేర్కొన్నారు.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 -
ఆఫీసుకు రాకుండా ఉండేదుకు ఉద్యోగులు వాడే ట్రిక్స్ ఇవే..
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాయి. ఈ జాబితాలో అమెజాన్ కూడా ఉంది. 2025 నుంచి వారానికి ఐదు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు రావాలని కంపెనీ ఆదేశించింది. అందరూ ఆఫీస్ నుంచి పనిచేస్తే కలిగే ప్రయోజనాలను గురించి కూడా అమెజాన్ సీఈఓ 'ఆండీ జాస్సీ' వెల్లడించారు.ఇన్నిరోజులు ఇళ్లకు పరిమితమైన చాలా మంది ఉద్యోగులు.. ఆఫీసుకు రావాలనే వార్తతో కొంత నిరాశకు గురయ్యారు. ఈ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలని అభ్యర్థించారు. మరికొందరు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పించుకోవడానికి మూడు ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు 'ఆండీ జాస్సీ' చెప్పుకొచ్చారు.కాఫీ బ్యాడ్జింగ్అమెజాన్ ఉద్యోగులు మాత్రమే కాకుండా.. చాలామంది ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్ చేస్తున్నారని తెలిసింది. అంటే సమయానికి ఆఫీసులకు వచ్చి పంచ్ వేయడం, అల్పాహారాని కొంత సమయం, కాఫీ తాగటానికి కొంత సమయం ఇలా కేటాయించుకుంటూ.. మళ్ళీ టైమ్ అవ్వగానే పంచ్ వేసి వెళ్ళిపోతారు. ఇదెలా ఉండేదంటే.. ఆఫీసులో కనిపించి, కాఫీ తాగి వెళ్లిపోవడం అన్నమాట. ఈ విధానం కొంత తగ్గుముఖం పట్టింది.హోమ్ వై-ఫై పేరు మార్చేయడంఉద్యోగులు ఆఫీసులకు రాకుండా ఇంట్లోనే పనిచేస్తూ.. హోమ్ వై-ఫైకి ఆఫీస్ వై-ఫై పేరు ఇచ్చేవారు. ఇలా చేసి ఉద్యోగి లాగిన్ అయినప్పుడు రిపోర్టింగ్ సాఫ్ట్వేర్ ద్వారా వారు ఆఫీసులో ఉన్నట్లు తెలిసేది. ఇలా కూడా చేసేవారు ఎక్కువయ్యారు. ఆఖరికి రిపోర్టింగ్ సాఫ్ట్‌వేర్‌ను మరింత పటిష్టంగా చేయడంతో ఇది కొంత కనుమరుగైంది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ఆఫీసులో బ్యాడ్జ్ వదిలి వెళ్లడంమూడో ట్రిక్ ఏమిటంటే.. కొంతమంది ఉద్యోగులు తమ బ్యాడ్జ్‌ని ఆఫీసులోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ బ్యాడ్జ్‌తో సహోద్యోగి చెక్ ఇన్, చెక్ అవుట్ వంటివి చేస్తారు. ఇలా చేస్తే సదరు ఉద్యోగి ఆఫీసుకి వచ్చి వెళ్తున్నట్లు రిపోర్టులో చూపిస్తుంది. కానీ నిజానికి వారు ఆఫీసుకే రారని తెలుస్తుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి..
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం డెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను సెప్టెంబరు 30 నుండి ఆఫీస్‌లకు వచ్చేయాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజులూ ఆఫీస్ నుంచే పనిచేయాలని డెల్ ఉద్యోగులను కోరిందని దీనికి సంబంధించిన మెమోను తాము చూసినట్లు రాయిటర్స్ పేర్కొంది.ఉద్యోగులకు సహకార వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు డెల్ తెలిపింది. ఇందుకోస టీమ్ ఆఫీస్‌లో ఉండాల్సిన అవసరం ఉందని మెమో పేర్కొంది. "రిమోట్‌గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది.మెమో ప్రకారం.. సేల్స్ టీమ్‌లోని ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజులు కస్టమర్లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో వీరు వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని చేయాల్సి ఉండేది. ఇక ఆఫీస్‌కు వచ్చేందుకు సాధ్యపడని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్‌గానే పని చేయవచ్చని అని డెల్ వెల్లడించింది.కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయం నుండి చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. అయితే, కొన్ని టెక్ సంస్థలు, ఇప్పుడు ఉద్యోగులతో వారంలో రెండు నుండి మూడు రోజులు ఆఫీస్‌ల నుంచి పని చేయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారానికి ఐదు రోజులు కంపెనీ కార్యాలయాలలో పని చేయాలని గత వారం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేసింది. -
YSRCP కార్యాలయంపై దాడి
-
'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్'
దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి 'రిటర్న్-టు-ఆఫీస్' విధానం చేపడుతున్నాయి. అమెజాన్ కూడా ఈ ఫార్ములానే అనుసరిస్తోంది. ఈ విధానం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికే.. అంటూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో పనిచేసిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 'జాన్ మెక్‌బ్రైడ్' పేర్కొన్నారు.2023 జూన్ వరకు అమెజాన్ కంపెనీలో ఒక ఏడాది పనిచేసిన మెక్‌బ్రైడ్.. సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటనపై స్పందించారు. అమెజాన్ వర్క్‌ఫోర్స్ తగ్గింపు ప్రణాళిక ఐదు దశలుగా ఉందని వివరించారు. మొదటి దశలో 30000 మంది ఉద్యోగులను తొలగించారు. రెండవ దశలో రిటర్న్-టు-ఆఫీస్ విధానం అమలు చేయడం జరిగింది.రిటర్న్-టు-ఆఫీస్ విధానం అమలు చేసిన తరువాత కొందరు ఉద్యోగులు.. తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నేను (జాన్ మెక్‌బ్రైడ్) ఆఫీసుకు వెళ్ళడానికి 20 నిమిషాల ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణమయింది. నాలాగే కొందరు ఉద్యోగులను వదులుకున్నారని వెల్లడించారు.ఇదీ చదవండి: ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?నాల్గవ, ఐదవ దశలో వర్క్ ఫ్రమ్ హోమ్ తరువాత ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులకు అప్పటికే పెండింగులో ఉన్న చాలా పనులను అప్పగించారు. దీంతో పనిభారం ఎక్కువైంది. ఇది మరికొందరు ఉద్యోగాలను వదిలిపోయేలా చేసింది. మొత్తం మీద కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి.. మళ్ళీ లాభాలబాట పట్టాలని సంస్థ చేస్తున్న చర్య అని అన్నారు.I’m a former AWS employee: most of the hot takes on Amazon's new strict return-to-office policy are wrong.Anyone who’s been paying attention saw this coming years ago. And ultimately, it comes down to taxes and economics.Here's their plan:Phase 1: layoff over 30k people.…— John McBride (@johncodezzz) September 18, 2024 -
ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!
ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కొత్త కండీషన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫీస్‌లో హాజరుకు ఉద్యోగుల లీవ్‌లకు లింక్ పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలి. లేకుంటే లీవ్స్ వదులుకోవాల్సిందే..కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ గురించి తెలియజేస్తూ సెప్టెంబర్ 2వ తేదీనే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపింది. ఈ పాలసీకి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హమ్ రిక్వెస్ట్‌లకు అనుమతి ఇచ్చి ఉంటే తక్షణమే వాటన్నింటినీ రద్దు చేసి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్‌కి వచ్చేలా సూచించాలని హెచ్ఆర్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ‘మింట్’ కథనం పేర్కొంది.ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పనివిప్రో అమలు చేస్తున్న కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ ప్రకారం.. వారంలో మూడు రోజులు ఆఫీస్ హాజరు తప్పనిసరి. ఒక వేళ ఆఫీస్‌కి హాజరుకాకపోతే దాన్ని సెలవుగా పరిగణిస్తారు. అంటే వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రాకపోతే ఆ రోజులను సెలవుగా పరిగణించి ఆ మేరకు లీవ్స్ కట్ చేస్తారని ఓ ఉద్యోగిని ఉటంకిస్తూ మింట్ వివరించింది. అయితే ఈ నిర్భంధ హాజరు విధానం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు మాత్రమేనని, అందరికీ ఇది వర్తించదని చెబుతున్నారు. -
వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పని
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి దాదాపు అన్ని కంపెనీలు ముగింపు పలుకుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం అమెజాన్ కూడా దీనికి సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పని చేయాలని ఉద్యోగులను ఆదేశించింది.ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని అమెజాన్ డాట్ కామ్ తెలిపింది. ఇది 2025 జనవరి 2 నుండి అమలులోకి వస్తుంది. "యూఎస్ ప్రధాన కార్యాలయ స్థానాలు (పుగెట్ సౌండ్, ఆర్లింగ్టన్)తో సహా పలు చోట్ల గతంలో మాదిరే డెస్క్ ఏర్పాట్లను తిరిగి తీసుకురాబోతున్నాము" అని సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులకు ఒక నోట్లో తెలిపారు.సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా 2025 మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి మేనేజర్లు, ఉద్యోగుల నిష్పత్తిని కనీసం 15% పెంచాలని అమెజాన్ చూస్తోంది. గత ఏడాది మేలో అమెజాన్ సీటెల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు వాతావరణ విధానం, తొలగింపులు, రిటర్న్ టు ఆఫీస్ ఆదేశాలను నిరసిస్తూ వాకౌట్ చేశారు. -
తాడేపల్లి వైఎస్సార్సీపీ ఆఫీస్ లో వినాయక చవితి ఉత్సవాలు
-
ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్
ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్.. ఈ శీర్షిక చూడగానే మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. కానీ ఇలాంటిదొకటి ఉందని నాకు 15 ఏళ్ల కిందటే తెలుసు. సమాజంలో వస్తున్న కొత్త ట్రెండ్ లను ఎప్పటికప్పడు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం సైకాలజిస్టుగా నాకు అవసరం. అలా దాని గురించి తెలుసుకున్నా. ఆ మధ్య కాలంలో అలాంటి కేస్ ఒకటి నా దగ్గరకు వచ్చింది. దాని గురించే ఈరోజు మీతో పంచుకుంటా.అసలేంటీ కాన్సెప్ట్? ఆఫీస్ వైఫ్/ఆఫీస్ హజ్బండ్ అనే పదాలు ఒకరి వర్క్ లైఫ్ లో ముఖ్యమైన సహాయక పాత్ర పోషించే కొలీగ్ గురించి చెప్పేవి. లైఫ్ పార్టనర్ కు సమానమైన ఎమోహనల్ సపోర్ట్, గైడెన్స్, కంపాయిన్షిప్ అందించే వ్యక్తిని ఆఫీస్ స్పౌజ్ అంటారు. వారిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్, కొలాబరేషన్ ఉంటుంది. ఇతర కొలీగ్స్ తో పంచుకోని, పంచుకోలేని వృత్తిగత, వ్యక్తిగత విషయాలు వారితో పంచుకుంటారు. వారి బంధం అంతవరకే పరిమితం, ఎలాంటి లైంగిక సంబంధం ఉండదు.ఎమోషనల్ డిపెండెన్సీ...హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేషన్లో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గా పని చేస్తున్న ప్రియా శర్మ తన సహోద్యోగి రాజీవ్ పటేల్ ఐదేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు. చాలా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో రాజీవ్ ఆమెకు తన సహకారం అందించాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇరువురి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, బాధ్యతలు, బాధలు పంచుకునేవారు.ఒత్తిడి సమయాల్లో ప్రియకు రాజీవ్ ఎమోషనల్ సపోర్ట్ అందించగా, రాజీవ్ కు కష్ట సమయాల్లో ప్రియ భరోసాగా నిలిచింది. అలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది వృత్తిపరమైన సరిహద్దు రేఖలను చెరిపేయడం ప్రారంభించింది. తరచుగా తమ వ్యక్తిగత వివరాలను పంచుకునేవారు. ఆఫీస్ తో పాటు బయట కూడా తరచూ కలుసుకునేవారు.రాజీవ్ పై ఆమె ఎమోషనల్ గా బాగా ఆధారపడింది. ఎప్పుడు ఒత్తిడి, ఆందోళన అనిపించినా అతనితో మాట్లాడి రిలాక్స్ అయ్యేది. అతను అందుబాటులో లేనప్పుడు అభద్రతకు, ఆందోళనకు లోనయ్యేది. అతను లేకుంటే సరిగా పనిచేయలేకపోయేది.పుకార్లు షికారు... ఇవన్నీ కలిసి ఆఫీసులో వారిద్దరి రిలేషన్ షిప్ పై అనుమానాలకు కారణమయ్యాయి. టీమ్ లో కూడా సమస్యలు మొదలయ్యాయి. తామెంత పనిచేసినా రాజీవ్ ప్రియనే సపోర్ట్ చేస్తాడని, తమకు అన్యాయం చేస్తాడని మిగతావాళ్లు భావిస్తున్నారు. వారిని ‘ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్’ అని అనుకోవడం మొదలుపెట్టారు.ఈ మాటలు ప్రియ వరకు వచ్చేసరికి తల్లడిల్లిపోయింది. ఫ్రెండ్లీగా ఉన్నంతమాత్రాన ఇలా మాట్లాడతారా.. అని బాధపడుతోంది. ఇదంతా ఆమె కుటుంబ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కౌన్సెలింగ్ కోసం వచ్చింది.ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరు క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ తో సంబంధం అంటగట్టేవాళ్లు మీ పక్కనే ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ తుఫాన్ ను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అవసరం. అలానే ప్రియ కౌన్సెలింగ్ కోసం వచ్చింది.మూడు నెలల థెరపీ...ప్రియాశర్మ తన సమస్య గురించి వివరించాక సైకోడయాగ్నస్టిక్స్ ద్వారా ఆమె తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జయిటీకి లోనవుతున్నట్లు నిర్ధారణైంది. దీంతో ఆమెకు సైకోథెరపీ ప్రారంభించాను. ఈ థెరపీ లక్ష్యం ప్రియ, రాజీవ్ మద్య ప్రొఫెషనల్ బౌండరీస్ ను తిరిగి ఏర్పాటు చేయడం, అతనిపై ఎమోషనల్ డిపెండెన్సీని తగ్గించి, స్వంత కోపింగ్ మెకానిజమ్ లను మెరుగుపరచడం, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరచడం. వారానికో సెషన్ చొప్పున మూడు నెలలపాటు రోల్-ప్లేయింగ్ బౌండరీస్, కాగ్నిటివ్ బిహేవియరల్ టెక్నిక్స్, ఎమోషనల్ రెగ్యులేషన్, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరిచేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ తదితర టెక్నిక్స్ ద్వారా ఆమె మామూలు మనిషి కాగలిగింది. రాజీవ్ తో ఫ్రెండ్లీగా ఉంటూనే తన సైకలాజికల్ వెల్ బీయింగ్ ను కాపాడుకోగలిగింది.ముందిలా చేయండి.. అంటే ఏంటి సర్, ఇప్పుడే సమస్య వచ్చినా మీ దగ్గరకు రావాలంటారా? అని మీరు అనుకోవచ్చు. అలా నేనెప్పుడూ చెప్పను. ఎవరైనా సరే మొదట తన సమస్యను తానే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. అలా చేసినా ఫలితం లేనప్పుడే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. మీకోసం కొన్ని సెల్ఫ్ హెల్ప్ టిప్స్...1.సహోద్యోగులతో మీ సరిహద్దులను స్పష్టంగా నిర్దేశించుకోండి. ఆఫీస్ టైంలో పర్సనల్ ఇష్యూస్ చర్చించవద్దు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ను పరిమితం చేయండి. 2. రోజూ డైరీ రాయడం మీ ఆలోచనలను, చర్యలను గమనించడానికి, అవి మీ ప్రొఫెషనల్ బౌండరీస్ కు అనుగుణంగా ఉన్నాయో లేవో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. 3. మీ కొలీగ్ పై ఆధారపడేలా చేసే ట్రిగ్గర్ లను గుర్తించి, వాటిని మేనేజ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. 4.మిమ్మల్ని మానసికంగా సంతృప్తి పరిచే హాబీల్లో కొంత సమయం గడపండి. ఇది ఇతరులపై ఎమోషనల్ గా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. 5. ఏ ఒక్కరికో పరిమితం కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు లతో సపోర్ట్ నెట్‌వర్క్‌ను రూపొందించండి, 6. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోండి.7. ఒత్తిడిని మేనేజ్ చేసేందుకు మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నెస్, మెడిటేషన్ లను రోజూ ప్రాక్టీస్ చేయండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comConnections corner -
ఆఫీసులో బాస్ కొత్త రూల్: పనివేళల్లో..
ఆఫీసులో పని చేసి అలసిపోయినప్పుడు ఉద్యోగులు మధ్యలో విరామం తీసుకోవడంలో భాగంగా కాఫీ కోసం బయటకు వెళ్లారు. ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన తరువాత కాఫీ కోసం బయటకు వెళ్ళకూడదు ఆస్ట్రేలియన్ మైనింగ్ బాస్ & మినరల్ రిసోర్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ 'క్రిస్ ఎల్లిసన్' ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టారు.ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన తరువాత కాఫీ తాగాలని బయటకు వెళ్తే, కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భావించిన ఎల్లిసన్.. రోజంతా ఉద్యోగులను ఆఫీసులోనే ఉంచడానికి కొత్త రూల్ పాస్ చేశారు. ఇందులో భాగంగానే ఆఫీసులోనే ఉద్యోగులకు కావలసిన సకల సౌకర్యాలు అందించడానికి సన్నద్ధమయ్యారు.ఉద్యోగుల కోసం ఆఫీసులోనే రెస్టారెంట్, జిమ్, స్టాఫ్ సైకాలజిస్ట్‌లు, క్రెచ్ వంటి సౌకర్యాలను ఏపాటు చేయడానికి ఎల్లిసన్ పెట్టుబడి కూడా పెట్టారు. ఇవన్నీ ఆఫీసులోనే ఉంటే ఉద్యోగి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ఉద్యోగులు ఓ కప్పు కాఫీ కోసం రోడ్డుపైకి (బయటకు) వెళ్లడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆయన అన్నారు.ఇదీ చదవండి: నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్ఉద్యోగులు బయటకు వెళ్లడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కూడా సరైనది కాదని వెల్లడించారు. కోవిడ్ 19 తరువాత రిమోట్ వర్క్ విధానానికి అనుమతి ఇచ్చిన కంపెనీలను కూడా అయన విమర్శించారు. ఎల్లిసన్ గత ఏడాది వర్క్-ఫ్రమ్-హోమ్ విధానానికి మంగళం పాడేసారు. -
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్‌డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్‌కాల్‌ను తిరస్కరించకూడదు. ఎఫ్‌డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్‌టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
Bangladesh: పత్రికా కార్యాలయం ధ్వంసం.. మహిళా జర్నలిస్టుపై దాడి
బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా రాజధాని ఢాకాలోని ఓ మీడియా సంస్థ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు హాకీ స్టిక్స్, కర్రలతో దాడి చేశారు. అలాగే అక్కడున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం గుంపుగా వచ్చిన దాదాపు 70 మంది బషుంధరా గ్రూప్‌నకు చెందిన ‘ఈస్ట్ వెస్ట్ మీడియా గ్రూప్’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగక ఒక మహిళా జర్నలిస్ట్‌పైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.కాగా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్ అధికార ప్రతినిధి బృందాన్ని కలిసిన సందర్భంగా బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడి హిందువులు, వారి సంస్థలపై వరుస దాడులు జరుగుతున్నాయి. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు సెట్ కాదు.. ఆఫీస్‌కి వచ్చేయండి’
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తమ ఉద్యోగులందరూ ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘నథింగ్’ సీఈఓ కార్ల్ పీ ప్రకటించారు. కోవిడ్ నుంచి సంవత్సరాల తరబడి రిమోట్‌గా పనిచేస్తున్న లండన్ ఉద్యోగులు ఇక ఆఫీస్‌కు రావాలంటూ వారికి ఈమెయిల్స్ పంపించారు.కంపెనీ భవిష్యత్తు వృద్ధికి, ఆవిష్కరణలకు ఆఫీసు నుంచి పని చేయడం చాలా కీలకమని కార్ల్ పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన లింక్డిన్ ఖాతాలో పూర్తి ఈమెయిల్‌ను కూడా షేర్ చేశారు. "మనం తక్కువ సమయంలోనే చాలా దూరం వచ్చాం. పదేళ్లలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని స్థాపించి భారతదేశంలో 567 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. అయినప్పటికీ, మనం మన సామర్థ్యంలో 0.1% వద్దే ఉన్నాం" అంటూ రాసుకొచ్చారు.రిమోట్ లేదా హైబ్రిడ్ విధానం చాలా కంపెనీలకు సరిపోయినప్పటికీ, ‘నథింగ్’కు సెట్ కాదని వివరించారు. ఇందుకు ఆయన మూడు ముఖ్యమైన కారణాలను పేర్కొన్నారు. భౌతిక ఉత్పత్తులను రూపొందించడంలో సన్నిహిత సహకారం అవసరం. బలమైన పోటీదారులను ఓడించడంలో సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యత. నవతరం టెక్ కంపెనీగా మారాలనే కంపెనీ ఆకాంక్ష అని వివరించారు. -
మారని ఉద్యోగుల తీరు.. ఉదయం 11 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనం
-
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం(ఆగస్టు7) ఎరుపు రంగు దుస్తులు వేసుకొని రాష్ట్ర బీజేపీ ఆఫీసు ముందు నిరసనకు బయలుదేరారు. మహిళా నేతలను గాంధీభవన్ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా పోలీసులకు మహిళా కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. దేశంలో మహిళకు రక్షణ లేదని, నిత్యావసర వస్తువుల పెరుగుదల వల్ల మహిళలపై పడుతున్న భారంపై దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఆఫీసులు ముట్టడించాలని జాతీయ మహిళా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. -
బీఆర్ఎస్ కార్యాలయాలపై కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
-
బీఆర్ఎస్ ఆఫీస్‌ను కూల్చేయండి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆదేశాలు
సాక్షి నల్గొండ జిల్లా: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆఫీస్‌ను నిర్మించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి.. తాను గతంలోనే అధికారులకు ఈ విషయంపై ఆదేశాలిచ్చాను కదా వ్యాఖ్యానించారు.‘‘నేను అమెరికాకు వెళ్తున్నా.. ఆగస్టు 11న తిరిగి వస్తాను.. వచ్చేలోపు అనుమతి లేని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలి.. లేకపోతే అధికారులపై యాక్షన్ తీసుకుంటా అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. -
Bangladesh: పీఎం కార్యాలయం, పోలీస్ వెబ్సైట్ హ్యాక్
బంగ్లాదేశ్‌లో ఉద్యోగ రిజర్వేషన్లపై తీవ్రమైన అశాంతి నెలకొంది. ఈ నేపధ్యంలో తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం, సెంట్రల్ బ్యాంక్, పోలీసుల అధికారిక వెబ్సైట్లు హ్యాక్‌నకు గురయ్యాయి. ‘ది ఆర్3 సిస్టన్స్3’ అనే గ్రూప్ ఈ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు ప్రకటించుకుంది. ‘ఆపరేషన్ హంట్డౌన్, స్టాప్ కిల్లింగ్ స్టూడెంట్స్’ అనే సందేశం హ్యాక్ అయిన ఈ మూడు సైట్లలో కనిపించింది.‘వీరత్వం కలిగిన విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం, దాని రాజకీయ మిత్రపక్షాలు చేసిన క్రూరమైన దాడులను వారు ఎదుర్కోవలసి వచ్చింది. ఇది కేవలం నిరసన కాదు, న్యాయం, స్వేచ్ఛ, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం’ అని హ్యాకర్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో, రిజర్వేషన్లలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ హింసాయుత దాడుల్లో 100 మందికి పైగా జనం మృతి చెందారు. మూడు వేల మందికి పైగా జనం గాయపడ్డారు.ఈ హింసాకాండ కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. రైల్వేలు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. విద్యార్థుల ఆందోళనలను నియంత్రించడానికి ప్రధాని షేక్ హసీనా దేశంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. నిరసనకారులు ఎవరైనా కనిపిస్తే కాల్చివేయాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. -
అధికారుల నిర్వాకం.. సర్కారీ ఆఫీస్‌ల్లో ‘పరిటాల’ ఫోటో
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో అధికారుల నిర్వాకం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫోటోలు వెలిశాయి. ధర్మవరం నియోజకవర్గానికి బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ధర్మవరం టీడీపీ ఇంఛార్జి గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు.ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఫోటోలతో పాటు పరిటాల శ్రీరామ్ ఫోటోలను అధికారులు ఉంచారు. ఏ పదవి లేని పరిటాల శ్రీరామ్ ఫోటో ఉంచటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రికార్డు స్థాయిలో ఇళ్ల అమ్మకాలు, ఆఫీస్ లావాదేవీలు
దేశంలో ఈ ఏడాది ప్రథమార్థంలో ఇళ్ల అక్మకాలు, ఆఫీస్ లావాదేవీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ప్రకారం.. 2024 ప్రథమార్థంలో (హెచ్ 1) దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ మార్కెట్ లావాదేవీలు రికార్డు స్థాయిలో 33 శాతం వార్షిక వృద్ధితో 34.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. గతేడాది ప్రథమార్థంలో ఇవి 26.1 మిలియన్ చదరపు అడుగులు ఉండేవి.2024 జనవరి నుంచి జూన్ వరకు ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస, కార్యాలయ మార్కెట్ పనితీరును విశ్లేషించిన ఈ నివేదిక 8.4 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలతో బెంగళూరు అతిపెద్ద కార్యాలయ మార్కెట్‌గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా మొత్తం కార్యాలయ పరిమాణ లావాదేవీల్లో 26 శాతం అని వెల్లడించింది.ముంబై (5.8 మిలియన్ చదరపు అడుగులు), ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (5.7 మిలియన్ చదరపు అడుగులు), హైదరాబాద్ (5.0 మిలియన్ చదరపు అడుగులు) మార్కెట్లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వృద్ధి పరంగా చూస్తే అహ్మదాబాద్‌లో అత్యధికంగా 218 శాతం వృద్ధి నమోదైంది. గ్రేడ్-ఎ స్థలం తీవ్రమైన పరిమితి కారణంగా లావాదేవీ పరిమాణాలలో తగ్గుదల చూసిన ఏకైక మార్కెట్ చెన్నై.రెసిడెన్షియల్ విక్రయాలు 2024 ప్రథమార్థంలో మొత్తం 1,73,241 యూనిట్ల అమ్మకాలతో రెసిడెన్షియల్ విభాగంలో అమ్మకాల పరిమాణాలు 11 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. 2024 హెచ్1లో అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ముంబైలో అత్యధికంగా 47,259 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వృద్ధి పరంగా చూస్తే కోల్‌కతాలో అత్యధికంగా 25 శాతం, హైదరాబాద్ 21 శాతం (18,573 యూనిట్లు) విక్రయాలు జరిగాయి. -
వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలపై తొందరపడొద్దు: ఏపీ హైకోర్టు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. స్టేటస్ కో(యధాతధ) స్థితిని కొనసాగించాలని.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. అదే సమయంలో అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని.. వైఎస్సార్సీపీ వివరణ తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించింది.వైఎస్సార్సీపీ ఆఫీసుల కూల్చివేతలపై చట్ట నిబంధన అనుసరించాలని కోర్టు పేర్కొంది. అదనపు ఆధారాలు ఉంటే 2 వారాల్లో సమర్పించాలన్న హైకోర్టు.. వాదనలు విన్న తర్వాత పూర్తిస్థాయి ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పింది. కోర్టులో వాదనల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అయితేనే చర్యలు తీసుకోవాలని.. లేదంటే పార్టీ కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. -
మార్గాని భరత్ ప్రచార రథానికి నిప్పు పెట్టిన పచ్చ మూకలు