తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం | Farmer assassination attempt at Tehsildar office | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

Published Fri, Jun 28 2024 4:26 AM | Last Updated on Fri, Jun 28 2024 4:26 AM

Farmer assassination attempt at Tehsildar office

తన పేర భూమి పట్టా మార్పిడిచేయాలని ఆందోళన

నర్సింహులపేట: తన పేరున భూమి పట్టా మార్పిడి కావడం లేదని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మహ బూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం హజ తండాకు చెందిన భూక్య బాలు అనే రైతు గురువారం పురుగు మందు డబ్బాతో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. 

తండాలోని 498 సర్వేనంబర్‌లో తనకు 6 ఎకరాల భూమి ఉందని, అయితే ఆ భూమి భూక్య బాలు, భూక్య భద్రు పేరిట ఉన్నట్లు రికా ర్డులో చూపిస్తోందని, దానిని తన పేరిట పట్టాచేయాలని 6 నెలల నుంచి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాలు అవేదన వ్యక్తం చేశాడు. తన కూతురు పెళ్లి కోసం ఆ భూమి ని అమ్మానని, అయితే తన పేర పట్టాకాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నానని తెలిపాడు. 

ఇదిలా ఉండగా బాలుకు సంబంధించిన వ్యక్తులు కార్యాలయంలో మా ట్లాడుతుండగానే ఆయన పురుగుమందు డబ్బాతో చెట్టు ఎక్కాడు. సమస్య పరిష్కరి స్తామని తహసీల్దార్‌ నాగరాజు హమీ ఇవ్వడంతో కిందికి దిగాడు. ›ఈ అంశంపై తహసీల్దార్‌ నాగరాజు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement