Farmer
-
త్వరలోనే ‘ఆ పది’కి ఉప ఎన్నికలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/షాబాద్: బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా ఈ నెల 26 నుంచి రైతులందరికీ ఎకరానికి రూ.17,500, కౌలు రైతులకు రూ.15,000, భూమిలేని రైతు కూలీలకు రూ.12,000 ఇవ్వాలనే డిమాండ్‌తో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘రైతు దీక్ష’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘చేవెళ్ల సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఆ పది నియోజకవర్గాల్లోనూ త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది.అప్పట్లో కాంగ్రెస్ తరఫున వాదించిన న్యాయవాది ఆర్య సుందరం ఈ ఉప ఎన్నికలపై కూడా వాదిస్తున్నారు. కచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పేందుకు ఆ స్థానాల్లో పోటీకి బీఆర్ఎస్లో అనేక మంది సిద్ధంగా ఉన్నారు’అని తెలిపారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు గల్లాపట్టి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ సహా సీఎం రేవంత్‌రెడ్డిపై 420 కేసు నమోదు చేయాలని అన్నారు. ఇక్కడ ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే.. అన్నీ చేసినట్లు ఢిల్లీలో సీఎం గప్పాలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తామంటుండు కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తంలా మారిందని కేటీఆర్ విమర్శించారు. ‘నాడు కేసీఆర్ రైతులకు నాట్లు వేసేటప్పుడు పైసలు ఇస్తే.. నేడు రేవంత్ ఓట్లప్పుడు మాత్రమే ఇస్తా అంటుండు. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి..తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇవ్వలేక పోయిండు. 1.60 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ.30 వేలు బాకీ పడింది. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ముందు తమ బాకీ తీర్చాలని అడగండి’అని పిలుపునిచ్చారు. 21న నల్లగొండలో రైతు ధర్నా నిర్వహిస్తామని, ఆ తర్వాత ఇతర జిల్లాల్లోనూ ఈ దీక్షలు కొనసాగుతాయని కేటీఆర్ ప్రకటించారు. ఈ రైతు దీక్షలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కూలీల బాగే వ్యవసాయ బాగు
అనేక కారణాల వల్ల వ్యవసాయ కూలీలు ఊర్లో ఉండి పని చేసుకుని బతికే అవకాశాలు తగ్గుతున్నాయి. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులు పని అవకాశాలను తగ్గించాయి. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. వ్యవసాయేతర అవసరాల కొరకు భూసేకరణ జరిగి, భూమి వినియోగం మారినప్పుడు, దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధానికి తగిన ప్రభుత్వ మద్దతు, ఉపశమనం కలిగించే పథకాలు ఉంటేనే వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది.వ్యవసాయంలో 2018–19 నాటికి సగటు రోజువారీ ఆదాయం 27 రూపాయలు మాత్రమే. ఆర్థిక సర్వే 2021–22 ప్రకారం, 2019 నాటికి వ్యవసాయ కుటుంబ సగటు నెలవారీ ఆదాయం రూ.10,218. రైతు ఆదాయమే అంత తక్కువ ఉండగా, వ్యవసాయ కూలీ ఆదాయం అంతకంటే ఘోరంగా ఉన్నది. ఉపాధి హామీ పథకంలో సగటు రోజు కూలీ రూ.179.70 చూపించి రైతు కన్నా వాళ్లకు ఎక్కువ వస్తుంది అనుకుంటారు. పథకంలో అమలు అవుతున్న పని దినాలు చాలా తక్కువ. కూలీల వలసలు తగ్గకపోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సగటు రైతు ఆర్థిక పరిస్థితే బాగాలేనప్పుడు సగటు రైతు కూలీ పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం లేదు. వ్యవసాయ కూలీలకు సంవత్సరం మొత్తం పని ఉండదు. కూలీ సరిపోక చాలా కుటుంబాలు పిల్లలను బడికి కాకుండా పనికి పంపిస్తున్నాయి. భారతదేశంలో బాల కార్మి కుల సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 1.75 నుండి 4.4 కోట్లు.అప్రకటిత నిర్లక్ష్యం2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం వ్యవసాయ కార్మికుల సంఖ్య 2001లో ఉన్న 23.41 కోట్ల (12.73 కోట్ల సాగు దారులు, 10.68 కోట్ల వ్యవసాయ కూలీలు) నుండి 2011లో 26.31 కోట్లకు (11.88 కోట్ల సాగుదారులు, 14.4 కోట్ల వ్యవసాయ కూలీలు) పెరిగింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 45.5 శాతం మంది 2021–22 నాటికి వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. దేశంలోని శ్రామిక శక్తి ఉపాధిలో వ్యవసాయ రంగం వాటా 2020–21లో 46.5 శాతం ఉండగా, 2021–22 నాటికి 45.5 శాతానికి తగ్గింది. పల్లెలలో సాగుదారులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాలని గత 40 యేండ్ల నుంచి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కొందరు అపర మేధావులు కూడా ఉత్పాదకత పేరు మీద, ఇంకేవో లెక్కల ఆధారంగా వ్యవసాయంలో ఇంత మంది ఉండొద్దు, తగ్గించే కార్యక్రమాలు చేపట్టమని ప్రభుత్వా నికి పదేపదే చెబుతుంటారు. వ్యవసాయ కూలీలను నిర్లక్ష్యం చేసే అప్రకటిత ప్రభుత్వ విధానం ఆ కోణం నుంచే వచ్చింది. రైతులు, కూలీల సంఖ్య తగ్గించాలనుకునేవారు వారికి ఇతర మార్గాల ఏర్పాటు గురించి ఆలోచనలు చేయడం లేదు.వ్యవసాయమే ఆధారంగా ఉండే పల్లెలలో వ్యవసాయం ఆదాయాన్ని బట్టి, అందులో ఉన్న మార్పులను బట్టి ఇతర వృత్తుల మీద ప్రభావం ఉంటున్నది. రోడ్లు, విమానాశ్రయం, పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరాలకు కొరకు భూసేకరణ జరిగి, భూమి ఉపయోగం మారినప్పుడు, ఆ ఊర్లో ఆ మేరకు వ్యవసాయం తగ్గుతుంది. దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. బహుళ పంటలు ఉంటే నిరంతరం పని ఉంటుంది. ఒక్కటే పంట ఉంటే విత్తనాలప్పుడు, కోతలప్పుడు తప్పితే పని ఉండదు. ఇదివరకు రైతులు పండించి కొంత తమ దగ్గర పెట్టుకుని మిగతాది మార్కెట్‌కు తరలించేవారు. ఇప్పుడు మొత్తం నేరుగా మార్కెట్‌కు తరలిస్తున్నారు. రైసు మిల్లులు అధునాతనం అయినాక వాటి సగటు సామర్థ్యం పెరిగింది, కూలీ పని తగ్గింది. తగ్గుతున్న పనికాంట్రాక్ట్ వ్యవసాయం, యాంత్రీకరణ, రసాయనీకరణ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం డిజిటలీకరణ అంటున్నది. సబ్సిడీలు ఇచ్చి తెస్తున్న ఈ మార్పులు ఖర్చులను పెంచడంతో పాటు వ్యవ సాయ కూలీలకు పని అవకాశాలు తగ్గించాయి. కూలీ రేట్లు పెరిగి నందువల్ల కలుపును చంపే రసాయనాల వాడకం పెరిగిందని చాలా మంది నమ్ముతున్నారు. అది పెస్టిసైడ్ కంపెనీల మార్కెట్ మాయ మాత్రమే. సగటు పంట ఖర్చు పెరుగుదలలో విత్తనాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాలు వగైరా అన్ని పెరిగినాయి. వాటి ధరల మీద, నాణ్యత మీద, వాటి కొరకు అయ్యే రవాణా, ఇతర ఖర్చుల మీద రైతులకు నియంత్రణ లేదు. పట్టణవాసులు ఐస్‌క్రీమ్, సబ్బులు, సినిమా టికెట్ కొనేటప్పుడు, హోటల్ బిల్లు కట్టేటప్పుడు పెద్దగా ఆలోచించరు. కానీ, కొత్తిమీర కట్ట రేటు పెరిగితే తెగ బాధపడతారు. అట్లాగే, రైతు బయట సరుకుల రేటు, వాటి కొరకు చేసే అప్పులు, వాటి మీద వడ్డీలు, తన ప్రయాణం, సరుకుల రవాణా వగైరా ఖర్చులను లెక్కలోకి తీసుకోడు. కానీ ఊర్లో ఉండే కూలీకి ఎంత ఇవ్వాలి అని మాత్రం ఆలోచిస్తాడు. కూలీ గురించి రైతుకు ఉన్న చింత బయటి నుంచి కొనుక్కొస్తున్న వాటి మీద ఉండటం లేదు. ఎందుకంటే కూలీ ఒక్కటే తన పరిధిలో ఉంటుంది.వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు సంక్షోభంలో ఉన్నాడు. వ్యవసాయ కూలీలు సంక్షోభంలో ఉన్నారు. పాడి పశువుల పరిస్థితి భిన్నంగా లేదు. పల్లెలు మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఊర్లోకి రూపాయి రాకడ కంటే పోకడ ఎక్కువ అయినందున సగటు గ్రామీణ కుటుంబం అప్పులలో ఉన్నది. అందుకే వ్యవసాయ కూలీలు వలస పోతున్నారు. స్థానిక వ్యవసాయ కూలీలను కోల్పోతే వారి స్థానంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు శారీరక శ్రమ చేయగలుగుతారేమో కానీ రైతుకు పూర్తి మద్దతు రాదు. స్థానిక వాతా వరణాన్ని బట్టి ఉండే నైపుణ్యం, జ్ఞానం, అనుభవం ఉన్న స్థానిక వ్యవసాయ కూలీలు రైతుకు అనేక రూపాలలో మద్దతు ఇవ్వ గలుగుతారు. వలస వచ్చిన కూలీలు ఆఫీసుకు వచ్చి పోతున్నట్లు వ్యవహరిస్తారు. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధా నికి తగిన ప్రభుత్వ మద్దతు, సానుకూల విధానాలు, ఉపశమనం కలిగించే పథకాలు, సంక్షేమ నిధులు ఇస్తేనే భారత వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది. లేకపోతే, మన ఆహార భద్రత ఆందోళన కలిగించకమానదు.కూలీలు కేంద్రంగా విధానంఆధునిక వ్యవసాయంలో విపరీతంగా వాడుతున్న ప్రమాదకర కీటకనాశక రసాయనాల వల్ల, వాతావరణ మార్పుల వల్ల వ్యవ సాయ కూలీల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, పిడుగుపాటు వల్ల ప్రతి సంవత్సరం సుమారు 2,000 మంది చనిపోతున్నారు. భారతదేశపు మొట్టమొదటి వార్షిక ఉరుములు మెరుపుల నివేదిక (2019–2020) ప్రకారం, పిడుగుపాటు మరణాలకు ప్రధాన కారణం చెట్టు కింద నిలబడటం. ఇది మొత్తం పిడుగుపాటు మరణాలలో 71 శాతం. అత్యధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు ఆరు బయట పని చేస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆయా కుటుంబాలకు ఉపశమనం కల్పించటానికి ఒక్క అడుగు కూడా వేయలేదు. 2021లో భారతదేశం ప్రకృతి వైపరీత్యాల వల్ల దాదాపు రూ. 27 వేల కోట్ల నష్టం అయ్యిందని ఒక అంచనా. ఇందులో వ్యవసాయ కూలీల జీవనోపాధికి వచ్చిన నష్టం కలుపలేదు. వీరిని కూడా నష్టాల అంచనాలలో, నష్ట నివారణ చర్యలలో ముఖ్యంగా పరిగణించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా చెప్పింది. ఈ సంస్థ తయారు చేసిన విధి విధానాలు భారతదేశంలో అమలు చేయడానికి ఒక జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చెయ్యాలి. జాతీయ బడ్జెట్లో దీనికి అవసరమైన కేటాయింపులు చేయాలి. వ్యవసాయ కూలీలు కేంద్రంగా సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అనుకూల గ్రామీణ విధానాలు తయారు చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
చిరుతను బంధించిన ధైర్యశాలి
తుమకూరు: చిరుత కనిపించిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆమడ దూరం పరిగెడతారు. అయితే ఓ యువకుడు ధైర్యసాహసాలు ప్రదర్శించి, ప్రాణాలకు తెగించి ఓ చిరుతను తోక పట్టుకొని బోనులోకి నెట్టేశాడు. ఈఘటన జిల్లాలోని తిపటూరు తాలూకా రంగాపురం వద్ద జరిగింది.గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేయగా అటవీశాఖ అధికారులు సమీపంలో బోను ఏర్పాటు చేశారు. పరలేహళ్లి రోడ్డులోని కుమార్ అనే వ్యక్తికి చెందిన తోటలో చిరుత నిద్రావస్థలో ఉండగా దానిని బంధించేందుకు అటవీ అధికారులు, సిబ్బంది సకల సరంజామాతో వచ్చారు.అయితే చిరుతను పట్టుకునేందుకు భయంతో వెనుకాడుతుండగా గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు ముందుకు వచ్చాడు. చిరుత తోకను పట్టుకుని బోనులోకి లాగి పడేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న అటవీ సిబ్బంది వల విసిరి చిరుతను బంధించడంలో సఫలమయ్యారు. కాగా యువకుడి ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. The #forest department officials with the help of a local youth Anand captured a #leopard at Rangapur Village in #Tumakuru... pic.twitter.com/QFrdogAvqt— Yasir Mushtaq (@path2shah) January 7, 2025 -
తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త!
భూపాలపల్లి రూరల్: ‘తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త.. అమ్మను బాగా చూసుకో.. అమ్మకు, నీకు తోడుగా, అండగా ఉండాల్సిన సమయంలో మీకు అన్యాయం చేసి తిరిగిరాని లోకానికి వెళ్తున్నా.. నన్ను క్షమించండి’.. అంటూ ఓ యువరైతు సెల్ఫీ వీడియో తీసి, లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన నీలాల శేఖర్ (29)తండ్రి రాజయ్య 15 ఏళ్ల క్రితం చనిపోయాడు.తల్లి వెంకటమ్మ, తమ్ముడు సిద్ధూతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి సరిగ్గా లేక, పెట్టుబడి కూడా రాలేదు. రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. వీటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన శేఖర్.. నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న శేఖర్ ఆదివారం చనిపోయాడు. కాగా, తాను కచ్చితంగా చనిపోతానని భావించిన శేఖర్.. ముందే తీసిన సెల్ఫీ వీడియోలో అప్పుల బాధతోనే పురుగు మందు తాగినట్లు స్పష్టం చేశాడు. అంతకుముందే ఆయన రాసి పెట్టుకున్న లేఖ కూడా బయటికి వచ్చింది. లేఖ, సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
రెవెన్యూ నిబంధనలపై మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: ‘రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా 22 ఏ, భూ సర్వే, భూ రికార్డుల సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని వెంటనే పరిష్కరించేందుకు, భూములకు సంబంధించి రెవెన్యూ నిబంధనల సరళతరం కోసం పరిశ్రమలు, మునిసిపల్, ఆర్థిక, రెవెన్యూ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది’ అని మంత్రి పార్థసారథి తెలిపారు. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించినట్లు తెలిపారు.రైతులకు తదుపరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా వాటాను చూశాక... రైతు భరోసాలో రాష్ట్రం వాటాపై ఆలోచన చేయాలని చర్చించినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు ‘తల్లికి వందనం’ అమలు చేయాలని చర్చించినట్లు చెప్పారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏప్రిల్‌లో రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి మెగా డీఎస్సీతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు రాజకీయ కమిటీని నియమించి కూటమి నేతలంతా జన సమీకరణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. విశాఖ పర్యటనలో ఎన్టీపీసీ ఇంటిగ్రేడెట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండ్రస్టియల్ హబ్, బల్క్ డ్రగ్ పార్కు, రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ భవనాలకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.⇒ తిరుపతిలో 50 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని వంద పడకలకు అప్‌గ్రెడేషన్, 191 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం. ⇒ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సూచనల మేరకు రాజధానిలో మరో రూ.2,723.02 కోట్లతో రెండు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సీఆర్డీఏకు అనుమతి.⇒ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం. తద్వారా రాజధాని మాస్టర్ ప్లాన్‌తో పాటు జోనల్ డెవలప్మెంట్లో అవసరమైన మార్పులు.⇒ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 6.35 ఎకరాల్లో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ఆమోదం. ⇒ కడపలో టీడీపీ కార్యాలయానికి గత ప్రభుత్వం రద్దు చేసిన రెండు ఎకరాలను తిరిగి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం. ⇒ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐబీపీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో రిలయన్స్ లిమిటెడ్ నెలకొల్పే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వృథాగా ఉన్న ప్రభుత్వ భూమి అయితే ఎకరాకు ఏడాదికి 15 వేల చొప్పున, అదే రైతుల భూమి అయితే ఎకరాకు ఏడాదికి 30 వేల చొప్పున 15 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం.డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో కారిడార్విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారులు ఉన్నచోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో కారిడార్ నిర్మించాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో మెట్రో ప్రాజెక్టుల నిధుల అంశంపై సీఎం ఎన్.చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.విశాఖలో మొదటి స్టేజ్‌లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించాలన్న మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలుక్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన ఖేల్‌రత్న అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో అభినందనలు తెలిపారు. -
తల్లి మామిడి అంట్లకు కేరాఫ్ పాణ్యం
పాణ్యం: మామిడి సాగు చేయాలకునే రైతులకు టక్కున గుర్తొచ్చేది నంద్యాల జిల్లా పాణ్యంలో లభించే అంటు మొక్కలే. ఇక్కడ అప్రోచ్ గ్రాఫ్టింగ్ (తల్లి అంటు మొక్కలు) పద్ధతిలో అంట్లు కట్టడం ఇక్కడి రైతులు స్పెషాలిటీ. ఈ ప్రాంతంలో 1885లో మామిడి సాగు ప్రారంభమైంది. అప్పటినుంచీ ఇప్పటివరకు ఆరోగ్యకరమైన, మంచి రుచికరమైన ఫలాలను అందించే మొక్కలను ఇక్కడ రూపొందిస్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ పాణ్యంలో మాత్రం తల్లి చెట్ల నుంచే అంటుకట్టి పిల్ల మొక్కలను ఉత్పత్తి చేయడం నేటికీ కొనసాగుతోంది.అప్రోచ్ గ్రాఫ్టింగ్తో ఆరోగ్యంపాణ్యంలో దాదాపుగా 70 ఎకరాల్లో మామిడి అంటు మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. 30 సెంట్లు మొదలుకుని ఎకరా వరకు చిన్న, సన్నకారు రైతులు మామిడి మొక్కలను పెంచుతున్నారు. వాటిలో 6 ్ఠ6 వెడల్పుతో తల్లి మొక్కలను నాటి.. ఇతర ప్రాంతాలను నుంచి మొలకను తెచ్చి వాటిని ఈ తల్లిమొక్కలకు అంటుకడతారు. ఇలా 90–100 రోజుల వరకు అంటును అలాగే ఉంచుతారు. దీంతో ఆ మొలక 4–5అడుగుల వరకు ఎత్తు పెరిగి.. ఆరోగ్యంగా, ఎలాంటి తెగుళ్లనైనా తట్టుకునేలా పెరుగుతుంది. మొక్కలు కావాలకునే రైతులు మే, జూన్ నెలల్లోనే ఆర్డర్లు ఇస్తారు. పది రోజుల్లో మొక్కలను తీసుకెళ్లాలని చెప్పగానే మామిడి రైతులు తల్లి అంటు నుంచి మొలకల్ని వేరుచేసి తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో 10 రోజుల పాటు డిపోలో ఉంచుతారు. ఆ తరువాత మొక్క ఆరోగ్యంగా ఉంటేనే రైతుకు విక్రయిస్తారు. లేకపోతే పక్కనపెడతారు. మొక్కను నాటుకున్న రైతులు మూడో ఏడాది నుంచే కాపు తీసుకోవచ్చు.ఇతర రాష్ట్రాలకు ఎగుమతిపాణ్యం నుంచి ఏపీలోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు మామిడి మొక్కలను ఎగుమతి చేస్తుంటారు. ఏటా కనీసం లక్ష మొక్కల వరకు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. సీజన్ ప్రారంభమైదంటే నర్సరీల్లో కూలీలకు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు గిరాకీ ఉంటుంది.నమ్మకంతో తీసుకెళ్తారు30 ఏళ్లు నర్సరీని నడుపుతున్నాను. మామిడిలో అన్ని వెరైటీలు అందుబాటులో ఉంటాయి. సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి చాలామంది రైతులు వచ్చి మొక్కల కోసం ఆర్డర్ ఇస్తారు. ఎప్పుడైనా మొక్కకు డ్యామేజీ జరిగితే తిరిగి ఇస్తాం. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి మొక్కలు కొంటారు. – జంపాల నడిపెన్న, శ్రీనివాస నర్సరీ యజమాని మొక్కలు చాలా బాగా పెరిగాయినేను మూడేళ్ల క్రితం రెండెకరాల్లో మామిడి మొక్కలను సాగు చేశాను. పాణ్యం నుంచే 120 మొక్కలు తెచ్చుకున్నాను. ఇప్పటివరకు మొక్క ఎదుగుదల విషయంలో ఎలాంటి సమస్య రాలేదు. మొక్కలు తెచ్చుకునే సమయంలో నేను చాలాసార్లు నర్సరీకి వెళ్లి చూశాను. – మహరాజ్, రైతు రామవరం, అవుకు మండలంనర్సరీ రైతులకు లైసెన్స్లుపాణ్యంలోని నర్సరీలకు లైసెన్స్‌లు ఇచ్చాం. రైతులు ఎలాంటి మొక్కలు విక్రయించినా కొన్నవారు బిల్లులు తీసుకోవాలి. అంతేకాక పాణ్యంలో అప్రోచ్ గ్రాఫ్టింగ్ (తల్లి అంటు మొక్కలు) అధికంగా సాగు చేస్తుంటారు. మామిడి సాగు చేయాలనుకునే రైతులు అప్రోచ్ గ్రాఫ్టింగ్ మొక్కలనే ఇష్టపడతారు. – నాగరాజు, జిల్లా ఉద్యాన అధికారి -
రైతు కుటుంబంపై పవన్ అవహేళన
-
అప్పు ఇచ్చిన వ్యక్తి పంట తీసుకెళ్లడంతో..కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
నకరికల్లు: అప్పు తీర్చలేదని తాను పండించిన పంటను అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకెళ్లడంతో అవమానభారం తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన కౌలు రైతు చెన్నంశెట్టి కోటేశ్వరరావు కొన్నేళ్లుగా కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా రెండెకరాల్లో సాగు చేశాడు. వరుస నష్టాలతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు భారంగా మారాయి.ఒక ఎరువుల దుకాణంలో పంటకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.2 లక్షలకు చేరింది. అప్పును తీర్చేందుకుగాను 95 బస్తాలకు పైగా ధాన్యం, మరోవైపు రూ.50 వేల నగదు దశలవారీగా చెల్లించినా ఇంకా బాకీ మిగిలి ఉంది. కాగా, శుక్రవారం వరి పంట నూర్పిడి చేయగా వచ్చిన మొత్తం 80 ధాన్యం బస్తాలను దుకాణదారుడు తన గుమస్తాను పంపి తీసుకెళ్లాడు. దీంతో కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. -
రైతు కుటుంబం బలవన్మరణం.. కూటమి సర్కార్ అవహేళన
వైఎస్సార్ జిల్లా: అప్పుల బాధ తాళలేక వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దెకుంటలో రైతు నాగేంద్ర కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈ విషాదాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలపై రైతులు, రైతుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలుకు వేసిన పంటలు పండక రైతు నాగేంద్ర రూ. 15 లక్షల అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో ఇటీవలే లోన్ ద్వారా తీసుకున్న ట్రాక్టర్ జప్తుకు గురి కావడం, కౌలు యజమాని డబ్బు అడిగితే ఏం చెప్పాలోనని ఆవేదన, అప్పు ఇచ్చిన వాళ్ళ ఒత్తడితో నాగేంద్ర తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్య, కుమార్తె, కుమారుడికి ఉరి వేసి తానూ ఆత్మహత్య పాల్పడ్డారు.అయితే, ఇంతటి విషాదంలో రైతు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవహేళన చేస్తూ మాట్లాడారు. రైతు నాగేంద్ర మరణంపై పోలీసుల విచారణ పూర్తిగాక ముందే పవన్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘రైతు నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ’ బుకాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు నాగేంద్ర, అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యలపై డీఎస్పీ విచారణ చేపట్టారు. విచారణలో అప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ రైతు కుటుంబానికి డబ్బు సమస్య కాదంటూ అవహేళనగా కూటమి నేతలు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. -
అప్పుల బాధ తాళలేక.. రైతు కుటుంబం బలవన్మరణం
సాక్షి ప్రతినిధి, కడప/సింహాద్రిపురం (పులివెందుల రూరల్)/కడప కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు కుటుంబం శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఆశించిన స్థాయిలో దిగుబడులులేక ఆదాయం రాకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికమవడం.. కౌలుకిచ్చిన భూ యజమానులకు ముఖం చూపించలేక రాత్రి భార్యాపిల్లలను తన పొలానికి విడివిడిగా తీసుకెళ్లి రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కలిసిరాని వ్యవసాయం..వ్యవసాయం చేసుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్న నాగేంద్ర (45)కు భార్య వాణి (38), కుమారుడు భార్గవ్ (13), కుమార్తె గాయత్రి (11) ఉన్నారు. అతనికి భార్య వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉంటోంది. నాగేంద్ర తనకున్న 1.50 ఎకరాల సొంత పొలంతోపాటు ఆరేళ్ల క్రితం ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేశాడు. కౌలు భూమిలో ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. రెండేళ్ల క్రితం సుంకేసుల గ్రామానికి చెందిన మరో ఇద్దరి నుంచి 13 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సోయా చిక్కుడు పంట సాగుచేశాడు. ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చయింది. ఈసారీ ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.మళ్లీ రబీలో కొర్ర పంటను సాగుచేసేందుకు ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షలు ఖర్చుచేసి పంటను సాగుచేశాడు. తెగుళ్ల నివారణకు పెద్ద మొత్తంలో మందులు కొన్నాడు. అయినా, ఈ పంట కూడా దిగుబడి రాకపోవడంతో తీవ్రనష్టం చవిచూశాడు. అప్పటికే అప్పులు ఉండడంతో సొంత భూమి ఒకటిన్నర్ర ఎకరాల్లో సాగుచేసిన చీనీ పంట పొలాన్ని నాగేంద్ర కుదవపెట్టాడు. దీనికితోడు.. సేద్యం కోసం కొన్న ట్రాక్టర్‌ను కంతులు చెల్లించలేదని స్వాధీనం చేసుకున్నారు. అవమానభారంతో ఉన్న నాగేంద్రకు కౌలుకు ఇచ్చిన యజమానులకు మోహం ఎలా చూపించాలి.. అప్పులెలా తీర్చాలన్న ఆవేదన వేధిస్తోంది.క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు..వ్యవసాయానికి అనుబంధంగా పాడి ఉంటే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లుగా ఉంటుందని నాగేంద్ర సుమారు రూ.4లక్షలతో నాలుగు పాడి గేదెలు కొని పోషించేవాడు. కానీ, రెండేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దూడలతో సహా వీటిని అపహరించారు. వరుసగా ఇలా ఆటుపోట్లతో నాగేంద్ర ఆర్థికంగా బాగా చితికిపోయాడు. రూ.15 లక్షల వరకు అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వారు సైతం పదేపదే అడగడం ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన పొలంలో భార్య వాణి, ఇద్దరు పిల్లలకు ఉరివేసి నాగేంద్ర సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటినుంచి వెళ్లిన వీరు ఎంతకు రాకపోయేసరికి తల్లి సిద్దమ్మ ఆందోళన చెందింది. ఇరుగు పొరుగు వారిని విచారించగా.. పొలం వైపు వెళ్లారని తెలుసుకుని అదే గ్రామంలో ఉన్న పెద్ద కొడుకు నాగరాజుకు తెలిపింది. గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే నలుగురూ విగతజీవులుగా మారారు.భార్య, పిల్లలు తనలాగ కష్టపడకూడదనే..విగతజీవులుగా పడిపోయి ఉన్న నాగేంద్ర కుటుంబాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు పోలీసు లకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ మురళీనాయక్, ఎస్ఐ ఓబన్న ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తానుపడ్డ కష్టాలు తన భార్యకు, పిల్లలకు రాకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రైతు నాగేంద్ర తల్లి సిద్ధమ్మ కన్నీరుమున్నీరవుతోంది. మృతుడు ఉపయోగించిన తాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో దిద్దేకుంట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.అప్పుల బాధతోనే ఆత్మహత్య : డీఎస్పీఅప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ మురళీ నాయక్ శనివారం మీడియాకు తెలిపారు. ముందు భార్యను.. ఆ తర్వాత కుమార్తెను, అనంతరం కుమారుడికి ఉరివేసి చివరికి రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రాత్రి 10గంటలకు మృతుడి బావమరిది రాజేష్, బంధువులు సంఘటనాస్థలికి వెళ్లి పోలీసులకు సమాచారమిచ్చారని చెప్పారు. మృతదేహాలను పులివెందుల సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మార్చురీలోని మృతదేహాలను డీఎస్పీతో కలిసి పరిశీలించారు. రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఈ విషయమై కలెక్టర్, ఇన్చార్జి ఎస్పీతో మాట్లాడామని, విచారించాలని ఆదేశించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరూ అధైర్యపడొద్దు.. మంచిరోజులొస్తాయి : ఎంపీ అవినాష్రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుల బాధ తాళలేక రైతన్న తనతోపాటు భార్య, ముక్కుపచ్చలారని పిల్లలకు కూడా ఉరివేయడం బాధాకరమన్నారు. రైతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని, దేవుడి దయతో మంచిరోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని తెలిపారు.నంద్యాల జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకొత్తపల్లి : అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాకు చెందిన మరో రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపల్లి మండలం ఎం. లింగాపురం గ్రామానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న (68) తనకున్న ఐదెకరాలతో పాటు మరో 17 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నాడు. ఇందుకు నాలుగేళ్ల నుంచి సుమారు రూ.10 లక్షల వరకు అప్పుచేశాడు. దీంతోపాటు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణానికీ మరికొంత అప్పుచేశాడు. వీటిని తీర్చేందుకు తన ఐదెకరాల్లో మూడెకరాలను అమ్మి కొంతమేర అప్పులు కట్టాడు.ఇక ఈ ఏడాది సాగుచేసిన పొగాకు, మినుము, మొక్కజొన్న పంటలు అధిక వర్షాలతో దిగుబడిలేక నష్టపోయాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలీక మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు మారెన్నను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుమారుడు అల్లెన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ బాబా ఫకృద్దీన్ తెలిపారు. తహసీల్దార్ ఉమారాణి, మండల వ్యవసాయాధికారి కె. మహేష్‌లు శనివారం లింగాపురం చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తింపజేస్తామన్నారు. -
చనిపోతున్నా బిడ్డా..!
ఇచ్చోడ: ‘‘చనిపోతున్నా బిడ్డా..’’అంటూ ఓ తండ్రి కూతురికి వీడియో కాల్ చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసి.. వారు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తూ వెళ్లేసరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జున్ని గ్రామంలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. అప్పులు పెరిగిపోవడంతోపాటు, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.గ్రామస్తులు, ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. జున్ని గ్రామానికి చెందిన అడిగే జనార్దన్‌కు భార్య గంగబాయి, ముగ్గురు కూతుళ్లు లక్ష్మి, ప్రియ, గంగమణి, కుమారుడు విఠల్ ఉన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. జనార్దన్ తనకున్న మూడెకరాల్లో పత్తి, సోయా సాగు చేశాడు. కొన్ని నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే ట్రాక్టర్ సరిగా నడవకపోవడంతో కిస్తీలు కట్టలేకపోయాడు. దీంతో కిస్తీలు కట్టాలని ఫైనాన్స్ వారు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో జనార్దన్ మద్యానికి బానిసయ్యాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పుణేలో ఉంటున్న కూతురికి వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే ఆమె గ్రామంలోని తన కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించింది. వీడియో కాల్లో కనిపించిన ప్రదేశంలో సిమెంటు బెంచీలు ఉన్నాయని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చోడ పార్కులో గాలించారు. అక్కడ కనిపించకపోవడంతో పొలం చుట్టుపక్కల ప్రదేశంలో గాలిస్తుండగా.. ఓ స్టోన్ క్రషర్ సమీపంలో చెట్టుకు జనార్దన్ (50) మృతదేహం వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు. -
రైతు అదిరిపోయే ఐడియా
-
ఈ యుద్ధం గెలవాలంటే మనం కలిసి పోరాడాలి
చండీగఢ్: ‘ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలంటే సమైక్యంగా ఉంటూ పోరాడాలి’అని రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లెవాల్(70) ఉద్బోధించారు. పంజాబ్–హరియా ణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద ఆయన చేపట్టిన దీక్ష మంగళవారం 29వ రోజుకు చేరుకుంది. డల్లెవాల్ ఆరోగ్యం విషమంగా ఉన్న ట్లు ఆయన్ను పరీక్షించిన వైద్యులు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖనౌరీలో ని దీక్షా శిబిరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన మాట్లాడారు. ‘నిరశన దీక్షకు మద్దతుగా నిలిచిన వారందరికీహృదయ పూర్వక కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నానని, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ యుద్ధంలో మనం గెలవాలి. దేశం యావత్తూ కలిసికట్టుగా పోరాడినప్పుడు మాత్రమే ఈ పోరాటంలో నెగ్గగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మనల్ని ఇక్కడి నుంచి తొలగించరాదని నేను కోరుతున్నా. ప్రభుత్వం మన పోరాటాన్ని కొనసాగనిస్తే మనం గెలుస్తాం లేదా ఇక్కడే చనిపోతాం. ఈ రెండింటిలో ఒకటి ఖాయం’అని ఆయన స్పష్టం చేశారు. డల్లెవాల్ చాలా బలహీన స్వరంతో నెమ్మదిగా రెండు నిమిషాలసేపు మాత్రం మాట్లాడగలిగారని ఆయనకు సహాయకుడిగా ఉంటున్న రైతు నేత అభిమన్యు కొహార్ చెప్పారు. తాను బాగానే ఉన్నానంటూ డల్లెవాల్ చెప్పడం అంటే..శారీరకంగా అత్యంత బలహీనంగా ఉన్నప్పటికీ, మానసికంగా ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు అర్థమని అనంతరం కొహార్ వివరించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కలి్పంచడం వంటి డిమాండ్లతో రైతు సంఘాలు ఆందోళనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలకు మద్దతుగానే డల్లెవాల్ నిరాహార దీక్ష చేపట్టారు. -
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్‌లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
50 ఏళ్లుగా చొక్కా వేసుకోలేదు చివరికి పెళ్ళికి కూడా..
-
లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు
-
‘లగచర్ల’ రైతుకు బేడీలు!
సంగారెడ్డి/ సంగారెడ్డిటౌన్/దుద్యాల్/సాక్షి, హైదరాబాద్: ‘లగచర్ల’కేసులో అరెస్టయి జైలులో ఉన్న రైతు ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురైతే.. చేతులకు సంకెళ్లు వేసి, గొలుసుతో కట్టి ఆస్పత్రికి తరలించిన ఘటన కలకలం రేపింది. ఆరోగ్యం బాగోలేని రైతుకు బేడీలు వేయడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమైంది. సంగారెడ్డి జైలులో అస్వస్థతకు గురైన రైతు హీర్యానాయక్‌ను జైలు అధికారులు, పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు రైతుకు బేడీల ఘటనపై సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బుధవారమే అస్వస్థతకు గురైన రైతు వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలో ఫార్మా విలేజీ వద్దని, తమ భూములు ఇవ్వబోమని గిరిజన రైతులు ఆందోళనకు దిగడం.. ‘లగచర్ల’గ్రామంలో కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో అరెస్టయిన 45 మంది రైతులు సుమారు నెల రోజులుగా సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారిలో దుద్యాల్ మండలం పులిచర్లకుంట తండాకు చెందిన గిరిజన రైతు హీర్యా నాయక్ బుధవారం సాయంత్రం ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక పరీక్షలు చేసిన జైలు వైద్యులు, అధికారులు.. చికిత్స కోసం గురువారం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రైతును పోలీసు జీపులో.. చేతులకు బేడీలు వేసి, గొలుసుతో కట్టి తీసుకువచ్చారు. అలాగే బేడీలు, గొలుసుతో ఆస్పత్రి లోపలికి నడిపించుకుని తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం చెలరేగింది. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి... సంగారెడ్డి ఆస్పత్రి వైద్యులు హీర్యానాయక్‌కు పలు వైద్య పరీక్షలు చేశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. హీర్యానాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని రిఫర్ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. అక్కడి అనుభవజు్ఞలైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఈ మేరకు జైలు అధికారులు, పోలీసులు హీర్యానాయక్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ ఎమర్జెన్సీ యూనిట్లో కార్డియాలజీ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు నిమ్స్ అధికారులు తెలిపారు. హీర్యానాయక్ వెంట ఆయన భార్య దేవిబాయి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. ఛాతీలో నొప్పి వస్తోందని రోదిస్తూ.. జైలులో ఉన్న హీర్యానాయక్ బుధవారం రాత్రి తండ్రి రూప్లానాయక్, తల్లి జెమినీబాయి, భార్య దేవిబాయిలతో ఫోన్లో మాట్లాడారు. ఆ సమయంలో తనకు ఆరోగ్యం బాగోలేదని, ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తనను ఎలాగైనా తీసుకెళ్లాలని, అక్కడే ఉంటే చనిపోయేలా ఉన్నానని రోదించాడని తెలిపారు. దీనితో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం సంగారెడ్డికి బయలుదేరారు. అప్పటికే ఆయనను ఆస్పత్రికి తరలించారని తెలిసి, అక్కడికి వెళ్లారు. అయితే హీర్యానాయక్‌ను చూసేందుకు పోలీసులు చాలాసేపు అనుమతించలేదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఆయనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. గుండె పోటుకు గురైన వ్యక్తికి ఇలా బేడీలు వేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుక్కి ఏం జరిగినా సీఎం బాధ్యత వహించాలి.. నా కొడుకును అనవసరంగా కేసులు పెట్టి జైలులో పెట్టారు. నా కొడుక్కి ఏమైనా జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలి. హీర్యాను వెంటనే విడుదల చేయాలి. ఆరోగ్యం బాగోలేనివారికి బేడీలు వేయడం ఏమిటి? – రూప్లానాయక్, హీర్యానాయక్ తండ్రి రైతుకు బేడీలపై సీఎం సీరియస్ – ఇలాంటి చర్యలను సహించబోమని అధికారులకు హెచ్చరిక – ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశం ‘లగచర్ల’ఘటనలో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న రైతు హీర్యానాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై అధికారులతో మాట్లాడి వివరాలను ఆరాతీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించబోదని పేర్కొన్నారు. జైలుకు వెళ్లి సమీక్షించిన ఐజీ జైలులో రైతుకు గుండెపోటు, బేడీలు వేసి ఆస్పత్రికి తరలించిన అంశం వివాదాస్పదం కావడంతో మలీ్టజోన్ ఐజీ సత్యానారాయణ గురువారం సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లి సమీక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న సీఎం ఆదేశాల మేరకు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. జైలర్ సస్పెన్షన్.. సూపరింటెండెంట్‌పై విచారణ లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనలో సంగారెడ్డి సెంట్రల్ జైలు జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే, జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్‌పై విచారణకు ఆదేశించారు. -
లగచర్లకు చెందిన రైతు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం
-
లగచర్ల రైతుకు సంకెళ్లు.. సీఎం రేవంత్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స కోసం రైతుకు బేడీలు వేసి సంగారెడ్డి ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లడంపై సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారులతో ఆరా తీసిన సీఎం. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని రేవంత్ హెచ్చరించారు.ఇదెక్కడి పాలన?: హరీష్రావుమరోవైపు, రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. లగచర్ల రైతు ఉగ్రవాదా? లేక దోపిడీ దొంగా?. ఇదెక్కడి పాలన అంటూ నిప్పులు చెరిగారు. చేతికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్తారా. రైతుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?. భూములు గుంజుకొని తిరగబడితే అరెస్ట్ చేశారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన’ అంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు.దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య. ఇంత కంటే దారుణం ఏముంటుంది. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..?… pic.twitter.com/qJQG14Cbwq— Harish Rao Thanneeru (@BRSHarish) December 12, 2024 -
రైతుల కోసం 13న జరగబోయే కార్యక్రమంపై దేవినేని అవినాష్
-
చౌడు పీడ రబీలోనే ఎక్కువ!
చౌడు సమస్య ఖరీఫ్‌లో కన్నా రబీలోనే ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. చౌడు వల్ల ధాన్యం దిగుబడి తగ్గడం కూడా రబీలోనే ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చౌడును తట్టుకొని 20–25 బస్తాల దిగుబడినిచ్చే డి.ఆర్.ఆర్. ధన్ 39, జరవ, వికాస్ అనే వరి వంగడాలు ఉన్నాయి. ఇవి 120–130 రోజుల్లో కోతకొస్తాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో చౌడు సమస్య ఉంది. మట్టిలో లవణ సూచిక (ఇ. సి.) 4 వరకు ఉంటే కొంత ఫర్వాలేదు. కానీ, మా క్షేత్రంలో ఈ ఏడాది 10.9 ఉంది. ఎక్స్ఛేంజబుల్ సోడియం పర్సంటేజ్ (ఈ.ఎస్.పి.) 15% కన్నా పెరిగితే చౌడు సమస్య తలెత్తుతుంది. చౌడు భూముల్లో కాలువ నీటితో సాగు చేయడానికి అనువైన మూడు వరి వంగడాలను శాస్త్రవేత్తలు గతంలోనే రూపొందించారు. ఎం.సి.ఎం. 100 అనేది రబీకి అనుకూలం. 125 రోజులు. 28–30 బస్తాల దిగుబడి వచ్చింది. ఎం.సి.ఎం. 101 రకం 140 రోజుల పంట. ఖరీఫ్‌కు అనుకూలం. 35 బస్తాల దిగుబడి. అగ్గి తెగులును, దోమను తట్టుకుంది. ఎం.సి.ఎం. 103 ఖరీఫ్ రకం. ఇది రాయలసీమ జిల్లాల్లోనూ మంచి దిగుబడులనిస్తోంది. చౌడు భూముల్లో నాట్లకు ముందు జీలుగ సాగు చేసి కలియదున్నాలి. ఇతర పచ్చిరొట్ట పైర్లు వేస్తే ఉపయోగం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైపైనే దమ్ము చేయాలి. సమతూకంగా ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. రబీలో పొలాన్ని ఖాళీగా ఉంచితే, ఖరీఫ్‌లో చౌడు సమస్య ఎక్కువ అవుతుందట. (చదవండి: నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) -
ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి అలజడి
-
నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం
న్యూఢిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ రైతులు మరోసారి ఉద్యమం బాట పట్టారు. నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ నుంచి నేడు(సోమవారం) రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడా సరిహద్దుల్లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. భారతీయ కిసాన్ పరిషత్ నేత సుఖ్బీర్ ఖలీఫా మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలను కోరుతూ రైతులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.రైతుల డిమాండ్లు ఇవే..పాత భూసేకరణ చట్టం ప్రకారం బాధిత రైతులకు 10 శాతం ప్లాట్లు, 64.7శాతం పెంచిన పరిహారం ఇవ్వాలి. జనవరి 1, 2014 తర్వాత సేకరించిన భూమికి మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం, 20 శాతం ప్లాట్లు ఇవ్వాలి. భూమిలేని రైతుల పిల్లలకు ఉపాధి, పునరావాసం కల్పించాలి. హైపవర్ కమిటీ ఆమోదించిన అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి.సరిహద్దుల్లో తనిఖీలు- ట్రాఫిక్ మళ్లింపులురైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకున్న ఢిల్లీ పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ నుండి ఢిల్లీ సరిహద్దు వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్‌లో తెగల వైరం.. 130 మంది మృత్యువాత -
సంక్రాంతి తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో ‘రైతు భరోసా’ ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని చెప్పారు. రైతు భరోసా విధివిధానాల పై మంత్రివర్గ ఉపసంఘం వేశామని, త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించామని, రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామని అన్నారు. మారీచుల తరహాలో మారువేషంలో వచ్చి అబద్ధాలు చెప్పే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దని రైతులను కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. మరో నాలుగేళ్లకు అవసరమైన శక్తి లభించింది ‘2023 వానాకాలం రైతుబంధును నాటి సీఎం కేసీఆర్ ఎగ్గొట్టారు. మేము అధికారంలోకి రాగానే రూ.7,625 కోట్లు రైతుబంధు కింద చెల్లించాం. శనివారం పాలమూరులో జరిగిన రైతు పండుగలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు తరలివచ్చి మా ఏడాది పాలన బాగుందంటూ ఆశీర్వదించారు. తద్వారా మిగిలిన నాలుగేళ్లు ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన ఇంధనశక్తి మాకు లభించింది. తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న కేంద్రంలోని నాటి యూపీఏ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ.69 వేల కోట్ల అప్పులతో ఇచ్చింది. పదేళ్ల కేసీఆర్ పాలన అనంతరం 2023 డిసెంబర్ 7న రూ.7 లక్షల కోట్ల అప్పులతో మా ప్రభుత్వం ఏర్పడింది. అసలు, వడ్డీలు కలిపి ప్రతినెలా రూ.6,500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితిలో మేం అధికారం చేపట్టాం. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పులు కలిగి ఉన్నట్టు నాటి సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్లు ఎన్నడూ ప్రజలకు చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చాక డిసెంబర్ 9న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను వివరించాం..’ అని సీఎం చెప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో దానం నాగేందర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు.. ‘రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీల ను అమలు చేస్తున్నాం. రైతును రాజు చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర, ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణమాఫీని 100 శాతం పూర్తి చేశాం. బ్యాంకర్లు మాకు ఇచ్చిన రూ.2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేశాం. ఏదైనా కారణాలతో బ్యాంకర్ల నుంచి వివరాలు అందక ఎవరిదైనా రుణమాఫీ జరగకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిశీలించి రుణమాఫీ చేస్తాం. రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదు. పంట పొలాలను తనఖా పెట్టి వ్యవసాయేతర అవసరాలకు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సైతం బ్యాంకర్లు పంట రుణాలుగా చూపించడంతోనే గతంలో రూ.31 వేల కోట్ల పంట రుణాలున్నట్టు చెప్పాం. తప్పుడు సమాచారమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించడంతో బ్యాంకులు వివరాలను సరిచేసి ఇచ్చాయి. మేము అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు సంబంధించిన రూ.17,869 కోట్ల రుణాలు మాఫీ చేశాం. నాలుగో విడతగా శనివారం మహబూబ్‌నగర్ సభలో రూ.2,747 కోట్ల రుణాలు మాఫీ చేశాం. మొత్తం 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616 కోట్ల రుణమాఫీ పూర్తైంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఇది గొప్ప రికార్డు..’ అని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర ధాన్యమే పేదలకు ఇస్తాం.. ‘సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లింపు యాసంగి పంటకు సైతం కొనసాగిస్తాం. ఇప్పటివరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇక్కడ పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతాం. ప్రభుత్వ కార్యక్రమాలను మీడియా మరింతగా రైతులకు చేరవేయాలి. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలనలో సైతం తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. గుజరాత్లో మధ్య నిషేధం ఉందని బీజేపీ అంటోంది. కావాలంటే ఇక్కడి నుంచి గుజరాత్‌కు మీడియాను తీసుకెళ్లి ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూపిస్తా. కేంద్రంలో మోదీ ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో మేమిచ్చిన హామీలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం..’ అని సీఎం చెప్పారు. విలేకరుల సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మందుల సామ్యేల్, దానం నాగేందర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, శ్రీగణేష్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ రుణమాఫీ రూ.3,331 కోట్లే..‘రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఏక మొత్తంగా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారు. రెండో పర్యాయంలో అధికారంలోకి వచ్చాక తొలి నాలుగున్నరేళ్లు రుణమాఫీని పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి వచ్చిన రూ.11 వేల కోట్లతో రుణమాఫీ చేశారు. ఆ నాలుగున్నరేళ్ల కాలానికి రైతులు వడ్డీల కింద రూ.8,578.97 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. వడ్డీలు పోగా రెండో పర్యాయంలో బీఆర్ఎస్ సర్కారు చేసిన వాస్తవ రుణమాఫీ రూ.3,331 కోట్లు మాత్రమే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో చదువు పూర్తి చేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు. పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్పో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలిప్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్ బసిల్ పంటను పండిస్తున్నాడాయన. బసిల్ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు ఫిలిప్పో (బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?)మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. (పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?)ఏప్రిల్ రెండోవారంలో బసిల్ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ‘ఎలిల్బంక’. ఫిలిప్పో కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు.