
దేశంలోని రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చెరకు కొనుగోలు ధరల పెంపుదలకు కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభించిన నేపధ్యంలో మోదీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ పెంపుదలతో కోట్లాది మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
చక్కెర సీజన్ 2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) కోసం చక్కెర మిల్లులు చెల్లించాల్సిన చెరకు ‘న్యాయమైన, లాభదాయక ధర’ (ఈఆర్‌పీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో చెరకు ఎఫ్‌ఆర్‌పి క్వింటాల్‌కు రూ. 340 ప్రాథమిక రికవరీ రేటు 10.25 శాతంగా నిర్ణయించారు. 10.25% కంటే ఎక్కువ రికవరీలో ప్రతి 0.1% పెరుగుదలకు, క్వింటాల్‌కు రూ. 3.32 ప్రీమియం అందించనున్నారు. ఇదేకాకుండా 9.5 శాతం లేదా అంతకంటే తక్కువ రికవరీ కలిగిన చక్కెర మిల్లులకు ఎఫ్‌ఆర్‌పి క్వింటాల్‌కు రూ.315.10గా నిర్ణయించారు. కొత్త రేట్లు 2024, అక్టోబర్ 1 నుండి వర్తించనున్నాయి.
देशभर के अपने किसान भाई-बहनों के कल्याण से जुड़े हर संकल्प को पूरा करने के लिए हमारी सरकार प्रतिबद्ध है। इसी कड़ी में गन्ना खरीद की कीमत में ऐतिहासिक बढ़ोतरी को मंजूरी दी गई है। इस कदम से हमारे करोड़ों गन्ना उत्पादक किसानों को लाभ होगा।https://t.co/Ap14Lrjw8Z https://t.co/nDEY8SAC3D
— Narendra Modi (@narendramodi) February 22, 2024
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ కొత్త రేట్లకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు ఎఫ్‌ఆర్‌పి కంటే ఇది 8 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఐదు కోట్ల మందికి పైగా చెరకు రైతులకు లబ్ధి చేకూరనుంది.
Comments
Please login to add a commentAdd a comment