Claim
-
కోట్లు పంచుకుందాం.. టికెట్ ఇవ్వండి
పారిస్: రూపాయి రూపాయి నువ్వేం చేయగలవంటే?. బంధాలు, బంధుత్వాలను తుంచేస్తా అని చెప్పిందట. డబ్బు ఉందన్న అహంతో కొందరు తమ ఆత్మియులను ఆమడ దూరం పెట్టేసిన వైనాలు మనందరం చూశాం. అయితే అదే డబ్బు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని ఫ్రాన్స్‌లోని ఓ ఘటన నిరూపించింది. సాధారణంగా మన పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేసిన వాళ్లు మనకు కనబడితే చితకబాదుతాం. కానీ ఫ్రాన్స్‌లో 40 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం తన క్రెడిట్ కార్డును కొట్టేసిన వ్యక్తులను అక్కున చేర్చుకునేందుకు తహతహలాడుతున్నాడు. ఇందులో ఒక ఆర్థిక కోణం, నగదు ప్రేమ దాగి ఉంది. ఈయన దగ్గర కొట్టేసిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఒక లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏ లక్షో రెండు లక్షలో కాకుండా ఏకంగా రూ.4,53,00,000ల జాక్‌పాట్ తగిలింది. టికెట్ ఎలా చేజిక్కించుకోవాలి? జాక్‌పాట్ తగిలిన టికెట్‌ను కౌంటర్లో ఇచ్చేసి నగదుగా మార్చుకునే అవకాశం ఆ దొంగలకు లేదు. ఎందుకంటే సంబంధిత టికెట్ కొనుగోలు పత్రాలు వాళ్ల వద్ద లేవు. ఆ టికెట్ కొనేందుకు ఉపయోగించిన క్రెడిట్ కార్డ్ వాళ్లది కాదు. దొంగతనం చేశారు కాబట్టి ఒకవేళ టికెట్ పట్టుకుని కౌంటర్ వద్దకు వస్తే పోలీసులు పట్టుకెళ్తారు. దీంతో దొంగలు ఆ రూ. 4.53 కోట్ల విలువైన లాటరీటికెట్ను నగదుగా మార్చుకునే అవకాశం కోల్పోయారు. కానీ ఆ అవకాశం క్రెడిట్ కార్డ్ యజమాని అయిన జీన్ డేవిడ్.ఈ అనే వ్యక్తికి ఉంది. కానీ అతని వద్ద టికెట్ లేదు. ఇందుకు ఆయనో పథకం వేశారు. క్రెడిట్ కార్డ్ కొట్టేసిన దొంగలపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు దొంగలించిన మీపై నాకు ఇప్పుడు కోపం లేదు. గతంలో మీపై పోలీస్ కేసు పెట్టాను. కావాలంటే ఆ కేసును ఇప్పుడు ఉపసంహరించుకుంటా. అయితే మీరు ఆ లాటరీ టికెట్‌ను నాకు ఇచ్చేయండి. కావాలంటే అందులో సగం మొత్తాన్ని మీకు వాటాగా ఇచ్చేస్తా’’అని ఒక చక్కటి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంకా తమ కౌంటర్ వద్దకు ఎవరూ రాలేదని లాటరీ నిర్వహణ సంస్థ లా ఫ్రాంకైస్ డీస్ జీయక్స్(ఎఫ్‌డీజే) శనివారం ప్రకటించింది. ఆలసించిన ఆశాభంగం క్రెడిట్ కార్డ్ యజమాని జీన్ డేవిడ్ తన లాయర్ ద్వారా మరోసారి ఒక సవివరమైన ప్రకటన ఇప్పించారు. ‘‘ఆ ఇద్దరు దొంగలు లేకుండా ఈ లాటరీ విజయం సాధ్యమయ్యేదే కాదు. వాళ్లు టికెట్ కొన్నారు కాబట్టే ఇవాళ ఇంత సొమ్ము మన పరం అయ్యే సదవకాశం దక్కింది. అందుకే దొంగల్లారా.. దయచేసి ఆ లాటరీ టికెట్ మాకు ఇచ్చేయండి. మీ వద్ద ఉన్నా అది మీకు ఉపయోగపడదు. మాకు ఇచ్చేస్తే మీకూ అందులో వాటా తప్పకుండా ఇస్తాం. డీల్ కుదుర్చుకుందాం. మా ఆఫీస్‌కు వచ్చేయండి. మీరు ఆలస్యం చేస్తే ఆ టికెట్‌ను నగదుగా మార్చుకునే క్లెయిమ్ గడువు తీరిపోతుంది. అప్పుడు మనందరికీ దక్కేది సున్నా. కాలం మించిపోతోంది. సమయం లేదు మిత్రమా. త్వరగా వచ్చి ఒడంబడిక చేసుకుని డబ్బు తీసుకెళ్లండి. ఆ డబ్బుతో మేం సెటిల్ అవుతాం. మీరూ సెటిల్ అవ్వండి’’అని లాయర్ పియరీ డెబూసన్ చెప్పారు. ఈ వింత ప్రకటన చూసి ఫ్రాన్స్ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్లు పోస్ట్‌లు పెడుతున్నారు.సిటీలో కొట్టేసి.. టౌలూస్ నగరానికి చెందిన జీన్ డేవిడ్ ఫిబ్రవరి మూడో తేదీన కారులో తన బ్యాక్‌ప్యాక్‌ను ఉంచేసి వెళ్లాడు. కారు తెరచి దొంగలు ఆ బ్యాక్‌ప్యాక్‌ను, అందులోని పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేశారు. ఆ కార్డుతో ఒక చిల్లర దుకాణంలో లాటరీ టికెట్ కొన్నారు. ‘‘ఇల్లూ, చెప్పుకోవడానికి అడ్రస్ కూడా లేని ఇద్దరు వ్యక్తులు మా దుకాణానికి వచ్చి కాంటాక్ట్‌లెస్ విధానంలో 52.50 యూరోలతో ఒక లాటరీ టికెట్, మరికొన్ని సిగరెట్లు కొన్నారు. టికెట్ కొన్న ఆనందంలో వాళ్లు సిగరెట్లు కూడా మర్చిపోయి వెళ్లారు’’అని టబాక్ దిస్ థెర్మాస్ దుకాణ యజమాని చెప్పారు. -
బీమా రంగంపై ఆపోహలు.. వాస్తవాలు
లక్షలాది మంది పౌరులను, అనేక వ్యాపారాలను రక్షిస్తున్న బీమా పరిశ్రమ తరచూ విమర్శలను ఎదుర్కొంటుందని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఛైర్మన్, బజాజ్ అలియన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు. చాలామంది బీమా కంపెనీలు కేవలం లాభాల కోసమేననే తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. ఈ రంగంపై ఉన్న అపోహలు, వాస్తవాలపై ప్రజలకు అవగాహన ఉండాలని పేర్కొన్నారు. తపన్ సింఘాల్ బీమా రంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని గణాంకాలను తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం, గత ఏడాది జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ రూ.1.72 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఇందులో రూ.80,000 కోట్లకు పైగా ఆరోగ్య బీమాకు చెల్లించిందే. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 80% కంటే ఎక్కువే. తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల్లో 20% తరచుగా మోసపూరితమైన లేదా ఆమోదయోగ్యం కాని విధంగా ఉంటున్నాయి. వైద్య ఖర్చుల కోసం బీమాపై ఆధారపడడం కంటే పొదుపు చేసి దాంతో వైద్య ఖర్చులు భరించవచ్చనే దోరణి కొందరిలో ఉంది. అయితే, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం ఆరోగ్య బీమా ఉన్నా పాలసీదారులు సుమారు 60% ఆరోగ్యానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బీమా లేకపోతే ఈ సంఖ్య 100%కు పెరుగుతుంది. ఏటా పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల ఆరోగ్య సమస్యలున్న చాలా కుటుంబాలు పేదరికంలోని నెట్టివేయబడుతున్నాయి. ప్రస్తుతం దేశ జనాభాలో సుమారు 7% మంది ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ఏటా పేదరికంలోకి జారుతున్నారు. అదే బీమా లేకపోతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.మోటార్ పరిశ్రమబీమా ఆధారిత ప్రమాద రక్షణ క్లెయిమ్ చెల్లింపులు సుమారు రూ.55,000 కోట్లు నిలిచిపోవడంతో మోటార్ బీమా విభాగం కుదేలవుతుంది. దాంతో ప్రమాదాల ఆర్థిక భారం పూర్తిగా వాహన యజమానులపై పడుతుంది. ఇది ఆర్థిక అస్థిరత పెరగడానికి, వాహన అమ్మకాలు తగ్గడానికి దారితీస్తుంది. మోటార్ థర్డ్ పార్టీ క్లెయిమ్‌లను కవర్ చేయడంలో బీమా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మోటార్ బీమా విభాగంగా థర్డ్ పార్టీ క్లెయిమ్‌ల్లో రూ.27,000 కోట్లకు పైగా సెటిల్ చేశారు.సాంఘిక సంక్షేమ పథకాలుఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి-జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) కింద 2024 నవంబర్ 30 నాటికి దాదాపు 36 కోట్ల మంది లబ్ధిదారులను ధృవీకరించారు. ఈ ప్రభుత్వ పథకం సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు ఆసుపత్రిలో చేరడానికి ఏటా రూ.5 లక్షల ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. బీమా పరిశ్రమ మద్దతు లేకుండా హైబ్రిడ్ నమూనా(ఇన్సూరెన్స్+నగదు చెల్లింపు)ను అవలంబించే రాష్ట్రాల్లో ఈ పథకం అంత ప్రభావవంతంగా ఉండదు. ఈ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.ప్రకృతి విపత్తులువరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు విపరీతమైన మానవ, ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. ఈ సమయాల్లో బీమా కీలకమైన రికవరీ మెకానిజంగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2025-26 వరకు జాతీయ విపత్తు నివారణ నిధి (ఎన్డీఎంఎఫ్)కు రూ.13,693 కోట్లు, రాష్ట్ర విపత్తు నివారణ నిధికి (ఎస్డీఎంఎఫ్) రూ.32,030.60 కోట్లు కేటాయించింది. ప్రతి ప్రకృతి విపత్తు తర్వాత ప్రభుత్వం నష్టపరిహారం కోసం భారీగా ఖర్చు చేస్తుంది. మరింత పటిష్ఠమైన బీమా కార్యక్రమాలు అమల్లోకి వస్తే ఈ నిధులను అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలకు మళ్లించవచ్చు.వ్యవసాయంభారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) వంటి పథకాలు గత ఎనిమిదేళ్లలో రూ.1.64 లక్షల కోట్ల క్లెయిమ్‌లను అందించాయి. ఈ చెల్లింపులు రైతులకు ఆర్థిక ఉపశమనం కలిగించాయి. రైతు ఆత్మహత్యలు తగ్గడానికి దోహదం చేశాయి. దేశ ఆహార భద్రతకు రైతులు తమ వంతు సహకారాన్ని అందించేందుకు బీమా దోహదపడుతుంది.రూ.1.73 లక్షల కోట్ల మోసపూరిత క్లెయిమ్లుమోసపూరిత క్లెయిమ్‌ల వల్ల బీమా పరిశ్రమకు ఏటా కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యను నిత్యం ప్రత్యేక యంత్రాగాల ద్వారా పర్యవేక్షిస్తున్నా ఫ్రాడ్ క్లెయిమ్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఐదేళ్లలో మొత్తం బీమా పరిశ్రమలో సుమారు 3.01 లక్షల మోసపూరిత కేసులను గుర్తించారు. వీటి విలువ రూ.1.73 లక్షల కోట్లని తేలింది. భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ ఈ మోసాల వల్ల ఏటా సుమారు రూ.30,000 కోట్లు నష్టపోతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.అపోహలు వీడాలి..బీమా సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయని కొందరి అభిప్రాయం. ఇవి కేవలం లాభాల కోసమే ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అయితే బీమా కంపెనీలకు లాభాలు వచ్చినా భవిష్యత్తులో క్లెయిమ్‌లకు భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ సగటు క్లెయిమ్ నిష్పత్తి 80 శాతం కంటే ఎక్కువే. కంపెనీల రాబడితో లెక్కిస్తే క్లెయిమ్ నిష్పత్తి 115% వద్ద ఉంది. అంటే ప్రీమియంల ద్వారా సమకూరిన ప్రతి రూ.100కు పరిశ్రమ రూ.115 చెల్లిస్తుంది. సరళంగా చెప్పాలంటే బీమా సంస్థలు క్లెయిమ్ చెల్లింపులు, నిర్వహణ ఖర్చులపై డబ్బును కోల్పోతున్నాయి.లక్షల మందికి ఉపాధిప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న బీమా పరిశ్రమ జీవనోపాధికి తోడ్పడుతోంది. ఈ పరిశ్రమలో లాభాపేక్ష లేదని చెప్పలేం. కానీ, అదే సమయంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. బ్రోకర్లు, టీపీఏ(థర్డ్‌పార్టీ ఏజెంట్లు)లు, ఇన్సూరెన్స్ రంగంలోని నిపుణులు ఈ పరిశ్రమ విలువను పెంచుతూ ఆర్థిక, ఉపాధి వృద్ధికి మూలస్తంభంగా నిలుస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లోకి స్టార్‌లింక్.. లైన్ క్లియర్..?వ్యవస్థను దిగజార్చకూడదు..బీమా కంపెనీలు లాభాలు సంపాదించినంత మాత్రాన అవి వినియోగదారులను మోసం చేస్తున్నాయనే అభిప్రాయాలుండడం సరైందికాదు. మోసపూరిత క్లెయిమ్‌లు చేస్తూ సంస్థలను, వ్యవస్థను దిగజార్చకూడదని నిపుణులు కోరుతున్నారు. ఈ పరిశ్రమపై అవగాహన ఉన్నవారు మరింత ఎక్కువ మందిని బీమా తీసుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. -
సులభంగా ఈపీఎఫ్‌వో క్లెయిమ్‌ల పరిష్కారం: మాండవీయ
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి క్లెయిమ్‌ల పరిష్కారాన్ని మరింత సులభంగా మార్చాలంటూ అధికారులకు కేంద్ర మంత్రి మనుసుఖ్ మాండవీయ ఆదేశించారు. సకాలంలో ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని, ప్రజలతో స్నేహపూర్వక విధానాన్ని అనుసరించాలని కోరారు. ఈపీఎఫ్‌వో ప్రాంతీయ అధికారుల పనితీరు సమీక్ష కోసం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పై ఆదేశాలు జారీ చేశారు. క్లెయిమ్ దరఖాస్తు తిరస్కారాలను తగ్గించడం, పరిష్కార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, యూనివర్సల్ అకౌంట్ నంబర్ల (యూఏఎన్) యాక్టివేషన్, అధిక వేతనాలపై పెన్షన్ అమలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు కార్మిక శాఖ ప్రకటించింది. సేవల మెరుగునకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించారు. అధిక వేతనాలపై పింఛను, పిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు. జోనల్, రీజినల్ కార్యాలయాలు సేవల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. -
నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రేషియో క్షీణత
న్యూఢిల్లీ: నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంలో నికర చెల్లింపులు (క్లెయిమ్ రేషియో) 2023–24లో స్వల్పంగా తగ్గి 82.52 శాతంగా ఉన్నట్టు బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నివేదిక ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 82.95 శాతంగా ఉంది. నాన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కలసి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్ల ప్రీమియాన్ని నమోదు చేశాయి. 12.76 శాతం పెరిగింది. ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం 9 శాతం వరకు పెరిగి రూ.82,891 కోట్ల నుంచి రూ.90,252 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ప్రీమియం రూ.1.88 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.58 లక్షల కోట్లుగానే ఉంది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల లాభం రూ.10,119 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రూ.2,556 కోట్ల మేర నష్టాలను నమోదు చేయడం గమనార్హం. నివేదికలోని వివరాలు..2023–24లో నెట్ ఇన్కర్డ్ (నికర) క్లెయిమ్‌లు 15.39 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వరంగ బీమా సంస్థల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 99.02 శాతంగా ఉంటే, 2023–24లో 97.23 శాతానికి తగ్గింది.ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 76.49 శాతానికి మెరుగుపడింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 75.13 శాతంగా ఉంది.స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 61.44 శాతంగా ఉంటే, 2023–24లో 63.63 శాతానికి మెరుగుపడింది.స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 66.58 శాతంగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 73.71 శాతంగా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్జీవిత బీమా కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.77 లక్షల కోట్లను పాలసీదారులకు చెల్లించాయి. పాలసీదారుల నుంచి వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో చెల్లింపులు 70.22 శాతంగా ఉన్నాయి. పాలసీల సరెండర్లు/ఉపసంహరణలకు సంబంధించిన ప్రయోజనాలు 15 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల వాటా 58 శాతంగా ఉంది.2023–24లో 18 జీవిత బీమా కంపెనీలు నికర లాభాలను నమోదు చేశాయి. జీవిత బీమా కంపెనీల ఉమ్మడి లాభం 11 శాతం పెరిగి రూ.47,407 కోట్లకు చేరింది.ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్ఐసీ) లాభం 11.75 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా కంపెనీల లాభంలో 5 శాతం వృద్ధి నమోదైంది.మొత్తం బీమా వ్యాప్తి 2022–23లో 4 శాతంగా ఉంటే 2023–24లో 3.7 శాతానికి పరిమితమైంది. జీవిత బీమా వ్యాప్తి 3 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గగా.. సాధారణ బీమా వ్యాప్తి (ఆరోగ్య బీమా సహా) ఒక శాతం వద్దే స్థిరంగా ఉంది. -
ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు తమ పీఎఫ్ క్లెయిమ్‌లను త్వరలో ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ ఇటీవలే ప్రకటించగా.. ఈ–వ్యాలెట్ల నుంచి సైతం ఈ సదుపాయం కల్పించే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సుమితా దావ్రా దీనిపై స్పందించారు.‘తమ సొమ్మును ఎంత సులభంగా ఉపసంహరించుకోవచ్చన్న దానిపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. ఆటో సెటిల్మెంట్లో క్లెయిమ్ మొత్తం సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళుతుంది. దాంతో బ్యాంక్ ఏటీఎం నుంచి ఉపసహరించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం వ్యాలెట్లోకి నేరుగా ఎలా పంపాలన్న విషయమై కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీనిపై బ్యాంకర్లతో చర్చలు మొదలు పెట్టాం. దీని అమలు విషయమై ప్రణాళిక అవసరం’ అని పర్యాటక సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాకు సుమితా దావ్రా వివరించారు. ఆర్బీఐని సంప్రదించి త్వరలోనే తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!ఈపీఎఫ్‌వో సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే ఆ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఇటీవల ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఏడు కోట్లకు పైగా సభ్యులకు బ్యాంక్‌ల మాదిరి సేవలు అందించాలన్నది ఈపీఎఫ్‌వో ఆలోచనగా పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో తన ఐటీ సదుపాయాలను మెరుగుపరుచుకుంటోందని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే పీఎఫ్ ప్రయోజనాలు, బీమా ప్రయోజనాలను ఏటీఎంల నుంచే పొందొచ్చని చెప్పారు. -
ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) క్లెయిమ్‌లు గత కొంతకాలంగా ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈపీఎఫ్ఓ వార్షిక నివేదిక ప్రకారం 2023లో దాదాపు ఆరు కోట్ల ఉపసంహరణ దరఖాస్తులు నమోదైతే అందులో సుమారు 27 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అయితే క్లెయిమ్ రెజక్ట్ అయ్యేందుకు చాలా కారణాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.వ్యక్తిగత వివరాలు సరిగా లేకపోవడం: క్లెయిమ్ ఫారం, ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారంలో తేడా ఉండడం వల్ల క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.కేవైసీ పూర్తి చేయకపోవడం: ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వెరిఫికేషన్ వంటి వాటిలో కేవైసీని అప్డేట్ చేయాలి. లేదంటే క్లెయిమ్ నిలిపేసే అవకాశం ఉంటుంది.తప్పుడు బ్యాంకు వివరాలు: బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎప్ఎస్సీ కోడ్‌లో తప్పుల వల్ల క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు.యూఏఎన్: ఇన్ యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో క్లెయిమ్ నమోదు చేస్తే రెజెక్ట్ అవుతుంది.తగినంత బ్యాలెన్స్ లేకపోవడం: క్లెయిమ్ చేసిన మొత్తాన్ని కవర్ చేయడానికి ఈపీఎఫ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే క్లెయిమ్ ఇవ్వరు.పెండింగ్ బకాయిలు: ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ అయ్యే వరకు క్లెయిమ్ అందించరు. కొన్నిసార్లు యాజమాన్యం చెల్లించాల్సిన ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్‌ను జమ చేయడం ఆలస్య అవుతుంది. అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ రాదు.కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు, నిబంధనల ప్రకారం సర్వీసు లేకుండానే దరఖాస్తు చేస్తుండడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది. -
ఆరోగ్య బీమా.. పాలసీ సంస్థ మారుతున్నారా?
మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతోంది. ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది ఆరోగ్య బీమాను ఎంచుకుంటున్నారు. అయితే ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ ప్రస్తుతం మారుతున్న విధానాలకు అనుగుణంగా లేకపోవచ్చు. మార్కెట్లో పోటీ నెలకొని ఇతర కంపెనీలు తక్కువ ప్రీమియంతో మరింత మెరుగైనా సదుపాయాలుండే పాలసీని అందిస్తుండవచ్చు. అలాంటి సందర్భంలో పాలసీను రద్దు చేసుకోకుండా ‘పోర్టబిలిటీ’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనివల్ల పాలసీను వేరే కంపెనీకి మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీని పెంచడానికి, పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ‘పోర్టబిలిటీ’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వెయిటింగ్ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య బీమా పాలసీని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు.ప్రస్తుత పాలసీ నిబంధనలు, షరతులు మీ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు పోర్ట్‌కు ప్రయత్నించాలి.పాలసీ చెల్లించే విలువ తక్కువగా ఉంటూ, ప్రీమియం అధికంగా ఉన్నప్పుడు పోర్ట్‌ను పరిశీలించవచ్చు. అయితే అందులో అధిక క్లెయిమ్ ఇచ్చే సంస్థలను ఎంచుకుంటే ఉత్తమం.స్థానిక ఆసుపత్రులు బీమా సంస్థ నెట్వర్క్ కవరేజ్ జాబితాలో లేనప్పుడు ఈ విధానాన్ని పరిశీలించాలి.ప్రస్తుతం పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే పాలసీ రెన్యువల్ చేయడానికి 45 రోజుల ముందే అవసరమైన చర్యలు ప్రారంభించాలి.ప్రస్తుతం చాలా సంస్థలు రెన్యువల్‌కు ఒక రోజు ముందు, పాలసీ గడువు ముగిసిన 15-30 రోజుల వరకూ పోర్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.పోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మేలు.తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత కొత్త సంస్థ పాలసీని ఇవ్వలేమంటే ఇబ్బందులు ఎదురవుతాయి.గమనించాల్సినవి..పాలసీని పోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు ప్రధానంగా బీమా మొత్తంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక బీమా సంస్థలో రూ.5లక్షల పాలసీ ఉందనుకుందాం. బోనస్‌తో కలిపి ఈ మొత్తం రూ.7.50లక్షలు అయ్యింది. కొత్త బీమా సంస్థకు మారి, రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. అప్పుడు కొత్త సంస్థ రూ.7.5 లక్షల వరకే పాత పాలసీగా భావిస్తుంది. మిగతా రూ.2.5 లక్షలను కొత్త పాలసీగానే పరిగణిస్తుంది. ఈ మొత్తానికి సంస్థ నిబంధనల మేరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనికి ఇతర షరతులూ వర్తిస్తాయి.ఇదీ చదవండి: 13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్వివరాలు అన్నీ తెలపాలి..కొత్త సంస్థకు మారేటప్పుడు ఇప్పటికే ఉన్న పాలసీలో మీరు చేసిన క్లెయిమ్ వివరాలు స్పష్టంగా చెప్పాలి. ఆరోగ్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్సల గురించీ వివరించాలి. పాలసీ ఇవ్వరు అనే ఆలోచనతో చాలామంది ఇవన్నీ చెప్పరు. కానీ, పాలసీ వచ్చిన తర్వాత ఇవి బయటపడితే పరిహారం లభించదు. -
ధీమాగా బీమా.. ఇలా!
'ఇన్సూరెన్స్'.. ఈ పదం మన నిత్యజీవితంలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులకు, జంతువులకు, వాహనాలకు ఇన్సూరెన్స్ చాలా అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు అనేక ఆఫర్లను అందిస్తూనే ఉన్నాయి. అయితే మీరు వాహనాలను కొనుగోలు చేసినప్పుడు.. దానికి ఇన్సూరెన్స్ పొందాలనుకున్నప్పుడు, తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఈ కథనంలో చూసేద్దాం..బీమా కవరేజ్వాహనాలను ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఆ పాలసీ అందించే కవరేజ్ గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో మోటారు బీమా పాలసీ రెండు ప్రధాన రకాల కవరేజీలను అందిస్తుంది. అవి థర్డ్-పార్టీ లయబిలిటీ, సమగ్ర కవరేజ్ (Comprehensive Coverage).కొత్త కారును కొనుగోలు చేసే సమయంలోనే కారు డీలర్ ద్వారా థర్డ్-పార్టీ బీమా అందిస్తారు. ఇది ఒక బేసిక్ ఇన్సూరెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. శారీరక గాయాలు, వైకల్యం, మూడో వ్యక్తి యొక్క వాహనం లేదా ఆస్తికి సంభవించే నష్టాలను మాత్రమే ఇది భర్తీ చేస్తుంది. థర్డ్-పార్టీ బీమా పాలసీ నిబంధనల ప్రకారం, మీ వాహనానికి జరిగిన నష్టానికి ఈ కవరేజి ద్వారా క్లెయిమ్ చేసుకోలేరు.ఇక సమగ్ర కవరేజ్ విషయానికి వస్తే.. రోడ్డు ప్రమాదం వంటి ఏదైనా ఊహించని సంఘటనల్లో కారుకు సంభవించే నష్టాలకు ఇది భర్తీ చేస్తుంది. కాబట్టి మోటారు బీమా పాలసీని ఎంచుకునే ముందు మీకు కావలసిన కవరేజీ గురించి తెలుసుకుని ఎంచుకోవాలి.ప్రీమియం & ఐడీవీబీమా పాలసీని ఎంచుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా ప్రీమియం లేదా ఐడీవీ (Insured Declared Value) గురించి కూడా తెలుసుకోవాలి. మీ కారు ఏదైనా రిపేరుకు మించి లేదా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పాడైపోయినప్పుడు ప్రీమియం కవరేజీ నష్టాన్ని భర్తీ చేస్తుంది.ఐడీవీ విషయానికి వస్తే.. దీనిని ఎంచుకునే ముందు మీరు కారు ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేసుకోవాలి. కారు బీమా పాలసీని ఆన్లైన్లో సరిపోల్చేటప్పుడు, కారు మార్కెట్ విలువకు దగ్గరగా ఉండే IDVని ఎంచుకోవచ్చు. అనుకోని ప్రమాదంలో మొత్తం కారు ధ్వంసమైనప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు ఈ కవరేజీ పనికొస్తుంది.యాడ్ ఆన్ కవర్స్మెరుగైన కవరేజ్ కోసం యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయవచ్చు. సమగ్ర మోటారు బీమా పాలసీలో కవర్ చేయని కొన్ని నష్టాలను దీని ద్వారా కవర్ చేసుకోవచ్చు.ఉదాహరణకు.. ప్రమాదం సమయంలో కారు టైర్లకు డ్యామేజ్ జరిగితే.. ఆ నష్టాన్ని సాధారణ బీమా ద్వారా భర్తీ చేసుకోలేరు. కానీ ఈ యాడ్ ఆన్ కవర్స్ కొనుగోలు చేసి ఉంటే.. ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసుకోవచ్చు. కొత్త కారును కలిగి ఉన్నప్పుడు టైర్ కవర్, ఇంజిన్ కవర్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్, ఇన్వాయిస్ కవర్ వంటి వాటికోసం యాడ్ ఆన్ కవర్స్ ఎంచుకోవాలి.నో క్లెయిమ్ బోనస్నో క్లెయిమ్ బోనస్ (NCB) అనేది ఒక సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయనందుకు బీమా కంపెనీలు అందించే రివార్డ్. మీరు కారు ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసినప్పుడు ప్రీమియంపై తగ్గింపు రూపంలో రివార్డ్ పొందవచ్చు. వరుసగా 5 సంవత్సరాలు క్లెయిమ్ చేయని పక్షంలో.. మీరు మీ రెన్యూవల్ ప్రీమియంపై50 శాతం వరకు NCB తగ్గింపును పొందవచ్చు.ఇదీ చదవండి: కారు ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకోండిఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలిఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్యాష్‌లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది.రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్‌ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకుని మీ అవసరాలకు సరిపోయే బీమా పాలసీని ఎంచుకోవచ్చు. -
ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..
జీవనశైలిలో మార్పు, విభిన్న ఆహార అలవాట్లతో అనారోగ్యబారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా ఉందనే ధీమాతో ఆసుపత్రిలో చేరిన కొందరి క్లెయిమ్‌లను కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. అయితే బీమా తీసుకునే సమయంలోనే పాలసీదారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ఇలా క్లెయిమ్ అందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఆరోగ్య బీమా క్లెయిమ్ ఎలాంటి పరిస్థితుల్లో తిరస్కరిస్తారు.. అలా కంపెనీలు క్లెయిమ్‌లు తిరస్కరించకూడదంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం.బీమా పాలసీ డాక్యుమెంట్లు గతంలో సామాన్యులకు అర్థంకాని కఠిన పదాలతో ఉండేవి. కానీ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీ పత్రాలు సరళమైన భాషలో ఉండాలని ఆదేశించింది. దాంతో ప్రస్తుతం అన్ని కంపెనీలు అందరికీ అర్థమయ్యే విధంగా పాలసీ పత్రాలను వెల్లడిస్తున్నాయి. అన్ని కంపెనీలు ఐఆర్డీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలసీ జారీ చేస్తుంటాయి. అయితే వాటిని సరిగా అర్థం చేసుకుని బీమా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా కింది అంశాలపై అవగాహన ఉండాలి.ఆరోగ్య సమాచారం సరిగా తెలపడంపాలసీ తీసుకునేప్పుడు ఆరోగ్య విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ గతంలో ఏదైనా సర్జరీలు, అనారోగ్య సమస్యలుంటే తప్పకుండా కంపెనీలకు ముందుగానే చెప్పాలి. దానివల్ల స్వల్పంగా ప్రీమియం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్ కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలున్నా ముందుగానే తెలియజేయడం ఉత్తమం.వెయిటింగ్ పీరియడ్పాలసీ తీసుకున్న వెంటనే కొన్ని రకాల జబ్బులకు కంపెనీలు వైద్య ఖర్చులు అందించవు. అలాంటి వ్యాధులకు బీమా వర్తించాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి. అయితే కంపెనీలకు బట్టి ఈ వ్యాధులు మారుతుంటాయి. మీకు ఇప్పటికే కొన్ని జబ్బులుండి వాటికి వైద్యం చేయించుకోవాలనుకుంటే మాత్రం అన్ని వివరాలు తెలుసుకోవాలి.సరైన ధ్రువపత్రాలతో రీయింబర్స్మెంట్బీమా కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఆసుపత్రులు అందుబాటులో లేనివారు ఇతర హాస్పటల్లో వైద్యం చేయించుకుంటారు. తర్వాత బీమా కంపెనీకి బిల్లులు సమర్పించి తిరిగి డబ్బు పొందుతారు. అయితే అందుకు సరైన ధ్రువపత్రాలు అవసరం. వైద్యం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి అవసరమైన పత్రాలు, బిల్లులు, ఆరోగ్య నివేదికలు తీసుకొని నిబంధనల ప్రకారం రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.ఇదీ చదవండి: అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..క్లెయిమ్‌ను తిరస్కరించకుండా ఏ జాగ్రత్తలు పాటించాలంటే..బీమా పాలసీ తీసుకునేముందే అన్ని నిబంధనలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సందర్భాల గురించి అవగాహన కలిగి ఉండాలి. పాలసీ కొనుగోలు సమయంలోనే అన్ని అంశాలను పరిశీలించాలి.బీమా సంస్థ నియమాలను తప్పకుండా అనుసరించాలి. పైన తెలిపిన విధంగా ఆరోగ్య విషయాల వెల్లడిలో పొరపాటు చేయకూడదు. ప్రతిపాలసీకు కొన్ని షరతులు, మినహాయింపులు, పరిమితులుంటాయి. వాటిపై పూర్తిగా అవగాహన ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగితే పాలసీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనే చేరాలి. అత్యవసరం అయితే తప్పా ఇతర హాస్పటల్స్లోకి వెళ్లకూడదు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితే డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కోపే(కొంత బీమా కంపెనీ, ఇంకొంత పాలసీదారులు చెల్లించాలి) ఎంచుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం కొంత పాలసీదారులు చెల్లించాలి.కొన్నిసార్లు చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రిని బీమా సంస్థ నిషేధిత జాబితాలో పెట్టొచ్చు. ఆ సందర్భంలో పరిహారం చెల్లించదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలను తెలుసుకోవాలి. కంపెనీ వెబ్సైట్లో వాటిని అప్డేట్ చేస్తుంటారు.బీమా క్లెయిమ్ చేసుకునే విధానంలో ఎదైనా సందేహాలుంటే కంపెనీలను సంప్రదించాలి. బీమా సంస్థలు పాలసీదారులకు ఆసుపత్రులను ఎంపిక చేసుకోవడంతోపాటు, ఇతర అంశాలపైనా సహాయం చేస్తాయి. -
బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ప్రశాంత్ కిశోర్
పట్నా: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయ పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలో బీహార్‌లో ప్రభుత్వాన్ని తమ పార్టీనే ఏర్పాటు చేస్తుందని, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కూడా తమ పార్టీకి చెందినవారేనని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.2025లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తన పార్టీ జన్ సూరజ్‌తో బరిలోకి దిగనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం వర్గానికి చెందిన 40 మందిని అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా పోరాటం ఆర్జేడీతో కాదని ఎన్డేతోనేనని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 'వక్ఫ్ సవరణ బిల్లు-2024'ను లోక్‌సభలో ప్రవేశపెట్టారని, బీహార్ సీఎం నితీష్ కుమార్ దీనికి మద్దతు తెలిపారన్నారు.తమ లాంటివారు రాజకీయాల్లోకి రాకుంటే ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదని, జేపీసీలో చర్చ జరుగుతోందన్నారు. అయితే భవిష్యత్‌లో నితీష్ కుమార్ తిరిగి మహాకూటమిలోకి వస్తారని, ముస్లింల గురించి మాట్లాడే అవకాశాలున్నాయని అన్నారు. ప్రజలను వీటన్నింటినీ గమనిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. -
ఇప్పుడు ఎన్నికలొస్తే.. 70 సీట్లూ మావే: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మొత్తం 70 స్థానాల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని అన్నారు.రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బీజేపీపై మాటల దాడి చేశారు. తనను, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించి, జైలులో పెట్టారని ఆరోపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాను చేపడుతున్న ప్రచారంలో తనకు లభించిన అభిమానాన్ని సిసోడియా గుర్తు చేసుకుంటూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని, మొత్తం ఓట్లలో 70 శాతం ఓట్లు సాధిస్తుందని వ్యాఖ్యానించారు.తాను ఏ తప్పూ చేయలేదు. అందుకే జైలు నుంచి నవ్వుతూ బయటకు వచ్చాను. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌తో సహా అనేక ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని, తమ నాయకులపైకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను పంపడం ద్వారా పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిందన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం బెదరకుండా మరింత బలం పుంజుకున్నదని అన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే మన మధ్యకు వస్తారని ఆయన అన్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో ఆప్ విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి 17 నెలలు తీహార్ జైలులో గడిపిన మనీష్ సిసోడియా ఈ నెల ప్రారంభంలో విడుదలయ్యారు. -
బీమా సొమ్ముకు దోమ కాటు!
దేశంలో బీమా సొమ్మును దోమలు ఖాళీ చేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో దోమల కారణంగా వచ్చే వ్యాధులది మూడో స్థానమంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దోమలతో వచ్చే రోగాల కేసులు అంతకంతకూ పెరుగుతుండగా.. అదే స్థాయిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లూ రెట్టింపవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ పాలసీ బజార్ ఇటీవల క్లెయిమ్స్‌పై దేశవ్యాప్తంగా అధ్యయనం చేసింది. దేశంలో హెల్త్ పాలసీలకు సంబంధించి ఏ ఏ వ్యా«ధులకు సంబంధించి క్లెయిమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే దానిపై చేసిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. బీమా సంస్థలు నమోదు చేసిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో దాదాపు మూడింట ఒక వంతు సీజనల్ అంటు వ్యాధులకే అవుతున్నాయని సర్వేలో తేలింది.వీటిలోనూ డెంగీ, మలేరియా తదితర సాంక్రమిత వ్యాధులదే అగ్రభాగంగా ఉంది. ప్రతి పది పాలసీల్లో 4 వరకూ దోమకాటుతో వచ్చే వ్యాధులవేనని పాలసీ బజార్ వెల్లడించింది. జూలై, ఆగస్ట్‌లలో ఎక్కువగా.. దోమకాటు కారణంగా క్లెయిమ్‌లు ఎక్కువగా రెండు నెలల్లోనే జరుగుతున్నాయి. జూలై, ఆగస్ట్‌లో వచ్చే క్లెయిమ్స్ దరఖాస్తుల్లో 60 శాతం వరకూ దోమకాటు వ్యాధులవే ఉన్నాయి. సెప్టెంబర్ లోనూ ఈ తరహా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని సర్వేలో తేలింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దోమల బెడద ఎక్కువగా ఉందనడానికి ఇదే నిదర్శనంగా చెప్పొచ్చు. పాలసీ బజార్ ద్వారా నివేదించిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల అధ్యయనం ప్రకారం.. సీజనల్ వ్యాధుల క్లెయిమ్‌లలో డెంగీ, మలేరియా వంటి సాంక్రమిత వ్యాధులు 15 శాతం ఉన్నాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల చికిత్సకు సాధారణంగా రూ.50,000 నుంచి రూ.1,50,000 వరకూ ఖర్చవుతోంది. జీర్ణకోశ వ్యాధులదీ అదే దారి.. వర్షాకాలంలో వచ్చే మరో అనారోగ్య సమస్య స్టమక్ ఫ్లూ వంటి జీర్ణకోశ వ్యాధులకూ క్లెయిమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి మలేరియాతో సమానమైన చికిత్స ఖర్చులుంటాయి. సీజనల్ క్లెయిమ్‌లలో 18 శాతం ఈ వ్యాధికి సంబంధించినవే. కాలానుగుణ అనారోగ్య క్లెయిమ్‌లలో మరో 10 శాతం వివిధ అలెర్జీలకు సంబంధించినవి ఉన్నాయి. అదే విధంగా.. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు, బ్రోన్కైటిస్ కారణంగా వచ్చే క్లెయిమ్‌లు 20 శాతం, సీజనల్ వ్యాధులకు మరో 12 శాతం క్లెయిమ్స్ జరుగుతున్నాయి. అయితే వీటి చికిత్స ఖర్చు రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు మాత్రమే. సీజనల్ వ్యాధులకే ఎక్కువగా క్లెయిమ్‌లు దేశంలో సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ వీటి బారిన ప్రజలు ఎక్కువగా పడుతున్నారు. దీనివల్ల క్లెయిమ్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వస్తోంది. ఇంతకు ముందు ఇళ్లల్లోనే చికిత్స పొందేవారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పెరగడం వల్ల ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. క్లెయిమ్ చేసుకోవచ్చనే ధీమాతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు వస్తుండటం సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. – సిద్ధార్థ్ సింఘాల్, పాలసీబజార్ ఇన్సూరెన్స్ హెడ్ -
కారు ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకోండి
ఒకప్పుడు ఇంటికో వాహనం ఉండేది. ఇప్పుడు మనిషికో వాహనం అన్నట్టుగా వెహికల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాహనాలను వినియోగించే ప్రతి ఒక్కరూ భీమా / ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇది ప్రమాదం జరిగినప్పుడు నష్టాన్ని కొంత వరకు భర్తీ చేస్తుంది. కాబట్టి అది కొత్త కారు అయినా.. పాత కారు అయినా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి.చట్టప్రకారం కూడా మీ కారుకు భీమా ఉండాల్సిందే. చాలా మంది తమ వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ.. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి క్యాష్‌లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్‌ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది.క్యాష్‌లెస్ క్లెయిమ్ కింద జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే.. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఇన్సురెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఆ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆ తరువాత ఇన్సూరెన్స్ సంస్థ కారును ఏదైనా గ్యారేజిలో జరిగిన నష్టాన్ని లేదా ప్రమాదాన్ని అంచనా వేసి ఖర్చు ఎంతవుతుందో లెక్కిస్తారు. అయితే ఇన్సురెన్స్ కంపెనీలకు తెలియకుండా కారును రిపేర్ షాపుకు లేదా గ్యారేజీకి తీసుకెళ్లకూడదు.కారును గ్యారేజీ సిబ్బంది రిపేర్ చేసిన తరువాత.. రిపేర్ చేయడానికి అయిన ఖర్చును నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా గ్యారేజికే చెల్లిస్తుంది. ఒకవేళా కారును రిపేర్ చేయడానికి వీలుకానప్పుడు కారు విలువ మొత్తాన్ని సంస్థ కారు యజమానికి చెల్లిస్తుంది.ఇక రెండోది.. రీయింబర్స్మెంట్ క్లెయిమ్. దీని కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే.. ముందుగా కారు ప్రమాదానికి గురైన 24 గంటలలోపు ఫోన్ చేసి లేదా ఆన్లైన్లో చెప్పే అవకాశం ఉంటే తెలియజేయాలి. ఆ తరువాత క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ తరువాత ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సంస్థకు సమాచారం అందించిన తరువాత మీ వాహనాన్ని మీకు నచ్చిన గ్యారేజికి తీసుకెళ్లి రిపేర్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: నష్టం జరిగింది.. రూ.50 కోట్లు ఇవ్వండి: రిమీ సేన్కారు రిపేర్ పూర్తయిన తరువాత.. దానికైన ఖర్చు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ ఇన్సూరెన్స్ సంస్థకు అందించాలి. వాటన్నింటినీ కంపెనీ పరిశీలించి కారు యజమానికి డబ్బు చెల్లిస్తుంది. -
ఒకరికి రెండు పాలసీలు.. క్లెయిమ్ ఎలా?
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా మంది రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.గతంలో వేరు.. ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన లోగడ ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా? రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచి్చనప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు రూ.5 లక్షల చొప్పున రెండు ప్లాన్లు ఉన్నాయని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు రూ.7 లక్షలు వచి్చంది. అప్పుడు తొలుత ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాలి. అక్కడి నుంచి వచి్చన చెల్లింపులు మినహాయించి, అప్పుడు మిగిలిన మొత్తానికి రెండో బీమా సంస్థ నుంచి పరిహారం కోరాలి. ఒక పాలసీలో రూమ్‌రెంట్ పరంగా పరిమితులు ఉండి, దానివల్ల క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లోనూ.. మిగిలిన మొత్తాన్ని రూమ్‌రెంట్ పరిమితులు లేని మరో పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కొన్ని పాలసీల్లో రూమ్ రెంట్, కొన్ని చికిత్సలకు పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్ హెల్త్ ప్లాన్లలో ఇవి చూడొచ్చు. అలాంటప్పుడు రూ.5 లక్షల కవరేజీ ఉన్నప్పటికీ పూర్తి మొత్తం రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.7లక్షల ఆస్పత్రి బిల్లుకు సంబంధించి రూ. 5 లక్షల గ్రూప్ పాలసీలో రూ.4 లక్షలే క్లెయిమ్ కింద వచి్చందని అనుకుంటే.. అప్పుడు మిగిలిన రూ. 3 లక్షలను రెండో పాలసీ కింద రీయింబర్స్మెంట్ కోరవచ్చు. ఒక బీమా సంస్థ క్లెయిమ్ దరఖాస్తును తిరస్కరించినా, రెండో బీమా సంస్థను సంప్రదించవచ్చు. వేతన జీవులు పనిచేసే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ప్లాన్, వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా ఇండివిడ్యు వల్ ప్లాన్ కలిగి ఉన్నప్పుడు.. మొదట గ్రూప్ హెల్త్ ప్లాన్ నుంచి క్లెయిమ్‌కు వెళ్లడం మంచి ఆప్షన్. గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ సులభంగా ఉంటుంది. క్లెయిమ్ మొత్తం ఒక బీమా పాలసీ కవరేజీ పరిధిలోనే ఉంటే ఒక్క సంస్థ వద్దే క్లెయిమ్‌కు పరిమితం కావాలి. దీనివల్ల రెండో ప్లాన్‌లో నో క్లెయిమ్ బోనస్ నష్టపోకుండా చూసుకోవచ్చు.నగదు రహిత చికిత్సబీమా సంస్థ నెట్వర్క్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత చికిత్సకు బీమా సంస్థలు నేడు అవకాశం కలి్పస్తున్నాయి. కాకపోతే ఆస్పత్రి నిషేధిత జాబితాలో లేని వాటికే ఈ సదుపాయం పరిమితమని గుర్తుంచుకోవాలి. రెండు ప్లాన్లలోనూ నగదు రహిత చికిత్సకు వెళ్లొచ్చు. కానీ, ఒక సంస్థ నుంచే నగదు రహిత క్లెయిమ్‌కు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మిగిలిన మొత్తం కోసం రీయింబర్స్మెంట్ విధానానికి వెళ్లాలని సూచిస్తుంటాయి. అలాంటప్పుడు నగదు రహిత విధానంలో గరిష్ట పరిమితి మేరకే ఒక బీమా సంస్థ నుంచి చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లించి, దాన్ని రాబట్టుకునేందుకు రెండో బీమా సంస్థను సంప్రదించాలి. దీనికోసం మొదట క్లెయిమ్ చేసిన బీమా సంస్థ నుంచి ‘క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ’ తీసుకోవాలి. అలాగే, హాస్పిటల్ బిల్లులు, చికిత్సకు సంబంధించి అన్ని పత్రాల ఫొటో కాపీలను సరి్టఫై (అటెస్టేషన్) చేసి ఇవ్వాలని మొదటి బీమా సంస్థను కోరాలి. వీటితో రెండో బీమా సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. రెండు బీమా సంస్థల వద్ద రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలన్నా సరే.. మొదట ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆస్పత్రి నుంచి అన్ని బిల్లుల కాపీలు, డిశ్చార్జ్ సమ్మరీ, ల్యాబ్ రిపోర్ట్లు తీసుకుని బీమా సంస్థకు సమర్పించాలి. క్లెయిమ్ ఆమోదం అనంతరం, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీతోపాటు, అన్ని డాక్యుమెంట్ల ఫొటో కాపీలతో రెండో సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలుకు కాలపరిమితి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15–30 రోజులు దాటకుండా క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. ఒకరికి ఎన్ని ప్లాన్లు? అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకు? అనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచి్చనా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కలి్పంచే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మరొక మార్గం.రీయింబర్స్‌మెంట్‌కు కావాల్సిన డాక్యుమెంట్లు డిశ్చార్జ్ సమ్మరీ, నగదు/కార్డు ద్వారా చెల్లింపులకు సంబంధించి రసీదులు, ల్యాబ్ రిపోర్ట్లు, వైద్యులు రాసిచి్చన ప్రిస్కిప్షన్లు, ఎక్స్‌రే ఫిల్మ్‌లు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ.ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు? ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు అన్న దానితో సంబంధం లేకుండా, గరిష్ట బీమా కవరేజీ పరిధిలో ఎన్ని విడతలైనా పరిహారం పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు క్లెయిమ్‌ల సంఖ్య పరంగా పరిమితులు విధించొచ్చు. కనుక పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్‌ను తప్పకుండా చదివి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. రెండు రకాల పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ సాధారణంగా రెండు రకాలు. ఇండెమ్నిటీ ఒక రకం అయితే, ఫిక్స్డ్ బెనిఫిట్‌తో కూడినవి రెండో రకం. ఇండెమ్నిటీ పాలసీలు ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలతోపాటు.. ఎంపిక చేసిన డేకేర్ ప్రొసీజర్స్ (చికిత్స తర్వాత అదే రోజు విడుదలయ్యేవి)కు మాత్రమే కవరేజీ ఇస్తాయి. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను ఫిక్స్డ్ బెనిఫిట్ పాలసీలుగా చెబుతారు. ఇందులో కేన్సర్, గుండె జబ్బులు, మూత్ర పిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏదైనా నిర్ధారణ అయిన వెంటనే నిర్ణీత పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఈ రెండింటి పరంగా గందరగోళం అక్కర్లేదు. ఇండెమ్నిటీ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ రెండూ కలిగిన వారు.. ఏదైనా తీవ్ర వ్యాధి (క్రిటికల్ ఇల్నెస్) బారిన పడినప్పుడు ఇండెమ్నిటీ ప్లాన్ కింద కవరేజీ పొందొచ్చు. అలాగే, వ్యాధి నిర్ధారణ పత్రాలతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కింద క్లెయిమ్ దాఖలు చేసి పూర్తి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. దీనివల్ల ఆయా వ్యాధులకు సంబంధించి ఎదురయ్యే భారీ వ్యయాలను తట్టుకోవడం సాధ్యపడుతుంది. టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు ఇక హెల్త్ ఇన్సూరెన్స్‌లో టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు కూడా ఉంటాయి. ఇందులో సూపర్ టాపప్ ఎక్కువ అనుకూలం. ఇవి డిడక్షన్ క్లాజుతో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వారు, రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ కూడా జోడించుకున్నారని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు మొదటి రూ.5 లక్షలు దాటిన తర్వాతే సూపర్ టాపప్ ప్లాన్ కింద కవరేజీ పొందగలరు. రూ.50 లక్షల వరకు బిల్లు ఎంత వచ్చినా సరే.. మొదటి రూ.5 లక్షలకు సూపర్ టాపప్‌లో పరిహారం రాదు. దాన్ని సొంతంగా భరించడం లేదంటే బేస్ ప్లాన్ నుంచి కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా రూ.50 లక్షల బేస్ ఇండెమ్నిటీ ప్లాన్‌తో పోలి్చతే.. రూ.5–10 లక్షల మేర బేస్ ప్లాన్ తీసుకుని, 50 లక్షలకు సూపర్ టాపప్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం కొంత తగ్గుతుంది. -
రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?
సాధారణంగా రైలు ప్రయాణాల్లో ఒక్కొసారి విలువైన వస్తువులు పొరపాటున మర్చిపోతుంటాం. చాలామంది వాటిని తిరిగి పొందేందుకు(క్లైయిమ్ చేసుకునేందుకు) ప్రయత్నించారు. ఆ ఇంకెక్కడుంటుంది. ఈపాటికి ఎవరో ఒకళ్లు పట్టుకుపోయి ఉంటారులే అనుకుంటారు. ఓ మూడు, నాలుగురోజులు అబ్బా..! అలా ఎలా వదిలేశాను? అని తెగ బాధపపడిపోతూ.. మర్చిపోయే యత్నం చేస్తారు. చాలామటుకు అందరూ ఇలానే చేస్తారు. అలా బాధపడనక్కర్లేకుండా ఆ వస్తువులను ఎలా తిరిగి సంపాదించుకోవాలి? వాటిని రైల్వే అధికారులు, సిబ్బంది ఏం చేస్తారు తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!. రైలులో ఎవ్వరైనా ఏదైన విలువైన వస్తువు మర్చిపోతే బాధపడుతూ కూర్చొనవసరం లేదు. పైగా ఇక దొరకదనుకుని డిసైడ్ అయ్యే పోనక్కర్లేదు. ఏం చేయాలంటే?..మనం వస్తువుని రైల్లో మరచిన వెంటనే చేయాల్సింది.. మన టిక్కెట్‌ని జాగ్రత్త చేయాలి. ఇప్పుడూ మొబైల్ ఫోన్‌కి టికెట్ వచ్చినట్లు మెసేజ్ వస్తుంది కాబట్టి దాన్ని డిలీట్ చేయకూడదు. ఆ తర్వాత మనకు సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ అధికారులకు తెలియజేయాలి. వారు విచారించి మీరు ప్రయోణించిన ట్రైయిన్ తాలుకా లిస్ట్ తీసి.. ఆ రైలు లాస్ట్ స్టేషన్ వద్ద సిబ్బంది కలెక్ట్ చేసిని వస్తువుల సమాచారం లిస్ట్‌ని తీయడం జరుగుతుంది. ఆయా వ్యక్తులు పలానా ట్రెయిన్లో తాము ఈ వస్తువు మర్చిపోయామని పూర్తి వివరాలను తెలియజేస్తే..ఆ జాబితాలో ఉందా లేదా అనేది నిర్థారిస్తారు అధికారులు. ఆ తర్వాత సదరు వ్యక్తి కోల్పోయిన వస్తువు వివరాలు, ప్రయాణించిన ట్రైయిన టిక్కెట్ ఆధారంతో అతడి వస్తువని నిర్థారించుకుంటారు. ఆ తర్వాత రైల్వే అధికారులు అతడు పొగొట్టుకున్న వస్తువులను అందచేయడం జరుగుతుంది. అలాగే ఇలా రైలులో యాత్రికులు మర్చిపోయిన వస్తువులను రైల్వే సిబ్బంది కలెక్ట్ చేసి రైల్వే మాస్టర్‌కి అందజేస్తారు. ఆ తర్వాత ప్రయాణికులెవరైనా.. వచ్చి కలెక్ట్ చేసుకోవాడానికి వస్తారేమో!.. అని కొన్ని రోజులు వేచి చూస్తారు. రానీ పక్షంలో వాటిని వేలం ద్వారా విక్రయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే రైల్వే అధికారిక మార్గదర్శకాలను తెలుసుకుంటే సరిపోతుంది. అది ఐఆర్సీటీసీ సైట్లో లేదా రైల్వేస్టేషన్ అడిగి సవివరంగా తెలుసుకోవచ్చు. ఇక నుంచి రైలులో వస్తువు పోతే దొరకదని వదిలేయకండి. కనీసం రైల్వే హెల్ప్ సెంటర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే యత్నం చేయండి. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
గురివింద ప్రయాసే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా పొరుగు రాష్ట్రం నుంచి రాళ్లేస్తున్న రాజ గురివింద ప్రవాసాంధ్రులకు బీమా రక్షణ కరువైందంటూ కన్నీళ్లు పెట్టారు! చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో బీమా క్లెయిమ్‌గా నలుగురు బాధిత కుటుంబాలకు చెల్లించిన మొత్తం రెండంటే రెండు లక్షల లోపే ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక 28 లక్షల మందికి రూ.42 లక్షలకుపైగా క్లెయిమ్ పరిహారం అందచేసింది. మరో రూ.25 లక్షల మొత్తానికి సంబంధించిన క్లెయిమ్‌లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ప్రవాసుల భద్రత, డబ్బు విషయంలో వెనుకాడే ప్రభుత్వమైతే సొంత ఖర్చులతో విపత్తు వేళ ఆగమేఘాలపై వారిని స్వస్థలాలకు తరలిస్తుందా? బీమా ప్రీమియం స్వల్ప మొత్తంలోనే రూ.ఐదారు వందలు లోపే ఉంటుంది. అయితే ప్రవాసాంధ్రుల్లో చాలా మంది విదేశాల్లో తాము పని చేస్తున్న చోట్ల బీమా కవరేజీని పొందుతున్నందున ప్రవాసాంధ్ర బీమా భరోసాను తీసుకోవడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అనే రీతిలో రోత కథనాలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందాన్ని పొందడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 2.5 లక్షల మందికి ఏపీ ఎన్ఆర్టీఎస్ సేవలు ఏపీ ఎన్ఆర్టీఎస్ గత నాలుగేళ్లలో 2,55,000 మంది ప్రవాసాంధ్రులకు వివిధ సేవలతో సాయాన్ని అందించింది. 24/7 ద్వారా ప్రవాసాంధ్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవాసాంధ్రుల బీమా పథకం క్లెయిమ్ కింద కేవలం నలుగురికి రూ.2 లక్షల లోపే అందించగా ఇప్పుడు గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం 28 మందికి పరిహారంగా రూ.42,05,604 చెల్లించింది. రూ.25,53,700 విలువైన మరో పది క్లెయిమ్‌లు పురోగతిలో ఉన్నాయి. బీమానే కాకుండా అంబులెన్సు, ఎక్స్‌గ్రేషియా, రీ పాట్రియేషన్ ద్వారా అధిక సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందారు. అనారోగ్య బాధితులతోపాటు మృతుల భౌతిక కాయాలను విమానాశ్రయాల నుంచి స్వస్థలాలకు తరలించేందుకు 1,077 అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. ఇందుకోసం రూ.1.93 కోట్లకు పైగా వెచ్చించింది. ప్రమాదవశాత్తు విదేశాల్లో మరణించిన 489 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.2.44 కోట్లకుపైగా చెల్లించింది. వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న 4,622 మందిని రీపాట్రియేషన్తో స్వస్థలాలకు క్షేమంగా తరలించింది. – వెంకట్ మేడపాటి, ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ ♦ దాదాపు 20 లక్షల మంది ప్రవాసాంధ్రుల్లో గత సర్కారు కేవలం 16,713 మందికి (ఒక్క శాతం) మాత్రమే బీమా కల్పిస్తే అది చాలా గొప్పంటూ డప్పు కొట్టిన రామోజీకి కరోనా విపత్తులో వేల మంది ప్రవాసులను ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా మాతృభూమికి తరలించిన విషయం తెలుసా? ఉక్రెయిన్ యుద్థం లాంటి సందర్భాల్లో ప్రభుత్వం సత్వరమే స్పందించి డబ్బుకు వెనుకాడకుండా ప్రవాసులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచి్చంది. ఇమ్మిగ్రేషన్ అధికారులతో సంప్రదించి 50 వేల మంది వలస కార్మికులను రాష్ట్రానికి క్షేమంగా తరలించింది. ♦ బీమా రక్షణ అనేది స్వచ్ఛందం. అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అవసరమైన వారు ముందుకొచ్చి తీసుకుంటారు. అమెరికా, కెనడా, యూకే, ఐరోపా, ఆస్ట్రేలియా తదితర చోట్ల తాము పని చేస్తున్న సంస్థల్లో బీమా ప్రయోజనాలు అందుతున్నందున ప్రవాసులు ప్రభుత్వ పథకంలో చేరడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. మరి ఇది కూడా ప్రభుత్వ తప్పిదమేనా రామోజీ? ♦కోవిడ్ విపత్తు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లక్షల మంది ప్రవాసాంధ్రులు వెనక్కి వచ్చేశారు. బీమా సౌకర్యం లేని వారిని గుర్తించి పథకం ప్రయోజనాలు వివరిస్తూ అందులో చేర్చేందుకు ఏపీ ఎన్ఆర్టీఎస్ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. తద్వారా గత ప్రభుత్వ హయాం కంటే మెరుగ్గా 33,596 మందికిపైగా బీమా ప్రయోజనాన్ని పొందారు. విదేశాలకు వలస వెళ్లే కార్మికులకు మూడేళ్లకు కేవలం రూ.550 ప్రీమియం అంటే రోజుకు సుమారు 50 పైసలకే అందిస్తున్నా అది కూడా భారమే అంటూ రాగాలు తీయడం వారిని అవమానించడం కాదా? ♦ ఎలా చూసినా గత సర్కారు రెండేళ్లలో ప్రవాసాంధ్రులకు అందించిన ప్రయోజనం కంటే గత నాలుగేళ్లుగా చేకూరిన లబ్ధి 10 రెట్లు అధికంగా ఉంది. -
రైతు సంక్షేమమే లక్ష్యం: ప్రధాని మోదీ
దేశంలోని రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చెరకు కొనుగోలు ధరల పెంపుదలకు కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభించిన నేపధ్యంలో మోదీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ పెంపుదలతో కోట్లాది మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. చక్కెర సీజన్ 2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) కోసం చక్కెర మిల్లులు చెల్లించాల్సిన చెరకు ‘న్యాయమైన, లాభదాయక ధర’ (ఈఆర్పీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో చెరకు ఎఫ్ఆర్పి క్వింటాల్‌కు రూ. 340 ప్రాథమిక రికవరీ రేటు 10.25 శాతంగా నిర్ణయించారు. 10.25% కంటే ఎక్కువ రికవరీలో ప్రతి 0.1% పెరుగుదలకు, క్వింటాల్‌కు రూ. 3.32 ప్రీమియం అందించనున్నారు. ఇదేకాకుండా 9.5 శాతం లేదా అంతకంటే తక్కువ రికవరీ కలిగిన చక్కెర మిల్లులకు ఎఫ్ఆర్పి క్వింటాల్‌కు రూ.315.10గా నిర్ణయించారు. కొత్త రేట్లు 2024, అక్టోబర్ 1 నుండి వర్తించనున్నాయి. देशभर के अपने किसान भाई-बहनों के कल्याण से जुड़े हर संकल्प को पूरा करने के लिए हमारी सरकार प्रतिबद्ध है। इसी कड़ी में गन्ना खरीद की कीमत में ऐतिहासिक बढ़ोतरी को मंजूरी दी गई है। इस कदम से हमारे करोड़ों गन्ना उत्पादक किसानों को लाभ होगा।https://t.co/Ap14Lrjw8Z https://t.co/nDEY8SAC3D — Narendra Modi (@narendramodi) February 22, 2024 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ కొత్త రేట్లకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు ఎఫ్ఆర్పి కంటే ఇది 8 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఐదు కోట్ల మందికి పైగా చెరకు రైతులకు లబ్ధి చేకూరనుంది. -
భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..
చాలా విచిత్రమైన కేసులు చూసుంటాం. ఇలాంటి విచిత్రమైన కేసు చూసే అవకాశం లేదు. అవకాశం దొరకాలే కానీ చిన్న కారణంతో అవతల వాళ్లని ఇబ్బంది పెట్టి డబ్బులు గుంజాలని చూస్తుంటారు కొందరూ. అలాంటి కోవకు చెందని వాడే భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ వ్యక్తి. ఎంత విచిత్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కాడో వింటే ఆశ్చర్యపోతారు. కేసు నిలబడుతుందనుకున్నాడో, తన వాదన నెగ్గుతుందనో తెలియదు చాలా హాస్యస్పదమైన ఆరోపణలతో కేసు వేశాడు. చివరికీ ఏమైందంటే.. ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి వ్యక్తి అనిల్ కొప్పుల అనే వ్యక్తి భార్యకు 2018లో రాయల్ ఉమెన్స్ హాస్పటల్స్ సీజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. అక్కడ ఆస్పత్రి నిబంధనల ప్రకారం భార్య ఆపరేషన్ టైంలో భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పేలా ప్రోత్సహిస్తారు. అతడు కూడా ఆపరేషన్ థియోటర్లో వైద్యుల తోపాటే ఉన్నాడు. అప్పటి నుంచి మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాను. మానసిక అనారోగ్యానకి గురయ్యాను. ఆ ఆపరేషన్‌లో నా భార్య అంతర్గత అవయవాలు, బ్లీడింగ్ చూడటం కారణంగా తన వైవాహిక జీవితం కూడా సరిగా లేదని ఆరోపణలు చేస్తూ కోర్టు మెట్లు ఎక్కాడు అనిల్ కొప్పుల. తన మానసికా ఆరోగ్యం, వైవాహిక జీవితం దెబ్బతినడానికి కారణమైన సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడమే గాక అందుకు ప్రతిగా రూ. 5వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేసు పెట్టాడు. సోమవారం విక్టోరియాలోని సుప్రీం కోర్టు వాదోపవాదనలు విన్నాక తల్లి బిడ్డల సంరక్షణ విషయమై వైద్యులు సీజేరియన్ ఆప్షన్ ఎంచుకుంటారు. తల్లి, బిడ్డల సంరక్షణ కోసం భర్తను థియెటర్లోని అనుమతించడం అనేది కూడా సర్వసాధారణ విషయం. దీని వల్ల అతను ఎలాంటి ఆర్థిక నష్టాన్ని చవిచూడలేదు. పైగా అతను ఆరోపిస్తున్న మానసికి అనారోగ్యం అనేది తీవ్రమైన గాయం కింద పరిగణించేది కాదని తేల్చి చెప్పింది. అందువల్ల అతనికి ఎలాంటి నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ..కోర్టు అతడి కేసుని తోసిపుచ్చింది. (చదవండి: బొప్పాయి గింజలు పడేస్తున్నారా..? తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..) -
IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!
IT Refund Scam: ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు ఒక ఎత్తయితే.. రిఫండ్ రావడం మరో ఎత్తు. రిటర్న్స్ దాఖలు యుగియడంతో రీఫండ్ ప్రక్రియ కూడా షురూ అయింది. దీంతో తమ ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తయిన రీఫండ్ ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. దీన్నే అవకాశంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతారు. ఫేక్ మెసేజ్‌లతో పన్ను చెల్లింపుదారులు మభ్యపెట్టి, వారి ఖాతాలను ఖాళీ చేస్తున్న కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీ రీఫండ్ మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని పీఐబీ హెచ్చరించింది. ఏమిటీ మెసేజ్ దీనిక థ కమామిష్ష ఏమిటో ఒకసారి చూద్దాం. ఇదీ స్కాం ఇటీవల కాలంలో చాలా మందికి ఈ తరహా మెసేజ్ లు వచ్చాయి “Dear Sir, You have been approved for an income tax refund of ₹15,490/-, the amount will be credited to your account shortly. Please verify your account number 5XXXXX6755. If this is not correct, please update your bank account information by visiting the link below’’ ఇలాంటి మెసేజ్ వచ్చిందా? ఐటీ విభాగం నుంచి వచ్చిందని బావించి వెంటనే తప్పులో కాలేసారో, భారీ నష్టాల్ని మూటగట్టుకోవాల్సి ఉంది. (లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?) ఆదాయ పన్ను రీఫండ్ కు అనుమతి లభించింది. ఈ రీఫండ్ డైరెక్టుగా రావాలంటే.. బ్యాంక్ ఖాతాను అప్ డేట్ చేసుకోవాలి అంటే మనల్ని బురిడీ కొట్టిస్తారు. ఆ మెసేజ్ ను నమ్మి, వారు అడిగిన వివరాలను ఇవ్వకండి.ఎందుకంటే ఇది సైబర్ నేరస్తులకొత్త ఎత్తుగడ.వాస్తవానికి ఇలాంటి సందేశాలేవీ ఐటీ విభాగం పంపదు. ఇది నకిలీ మెసేజ్ అని, సైబర్ నేరస్తుల కొత్త తరహా మోసమని గుర్తించాలని పీఐబీ ఫాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. (గుడ్ న్యూస్: అమెరికా షాక్, దిగొస్తున్న పసిడి) A viral message claims that the recipient has been approved for an income tax refund of ₹ 15,490.#PIBFactCheck ✔️ This claim is 𝐅𝐚𝐤𝐞. ✔️ @IncomeTaxIndia has 𝐧𝐨𝐭 sent this message. ✔️𝐁𝐞𝐰𝐚𝐫𝐞 of such scams & 𝐫𝐞𝐟𝐫𝐚𝐢𝐧 from sharing your personal information. pic.twitter.com/dsRPkhO3gg — PIB Fact Check (@PIBFactCheck) August 2, 2023 రీఫండ్ ఎలా వస్తుంది? ఐటీ రీఫండ్ అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులకు, సంబంధిత (వాలిడేషన్ సమయంలో ఇచ్చిన) బ్యాంక్ ఖాతాకు ఆ రీఫండ్ మొత్తం జమ అవుతుంది. బ్యాంక్ వివరాలను అప్ డేట్ చేయమని కానీ, బ్యాంక్ ఖాతా వివరాలను తెలపమని కానీ, ఓటీపీ, పిన్, పాస్ వర్డ్ వంటి రహస్య, వ్యక్తిగత వివరాలను వెల్లడించమని కానీ కోరుతూ ఐటీ విభాగం ఎలాంటి సందేశాలను పంపించదు అనేది గమనించాలి. రీఫండ్ ఎపుడు వస్తుంది? ఆదాయపు పన్ను వాపసు స్వీకరించడానికి పట్టే సమయం పూర్తిగా ఆదాయపు పన్ను శాఖ అంతర్గత ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, మీరు మీ రిటర్న్‌ను ఇ-ధృవీకరించిన తర్వాత 90 రోజులు. కానీ 7 నుండి 120 రోజులు పడుతుంది. రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసేలి ఆదాయపు పన్ను శాఖ ఫిబ్రవరి 2021న కొత్త రీఫండ్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ను అమలు చేసింది. ఎలా చెక్ చేసుకోవాలి? యూజర్ ID, పాస్వర్డ్, పుట్టిన తేదీ / ఇన్కార్పొరేషన్ తేదీ , క్యాప్చాతో ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి, రీఫండ్ స్టాటస్‌ను చెక్ చేసుకోవచ్చు. -
Fact Check: అర్హులకు పరిహారం జమచేస్తే నిందలా?
‘సంక్షేమ ఫలాలు అందని అర్హులెవరైనా ఉంటే వెతికి మరీ వారికి నేరుగా అందిస్తుంటే ఎవరైనా అభినందించాలిగానీ ఈనాడు మాత్రం పనిగట్టుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. వాస్తవాలు తెలుసుకోకుండా బటన్ నొక్కిన ఏడాదికి ఖాతాల్లో సొమ్ము అంటూ తప్పుడు కథనాన్ని వండివార్చింది’.. అంటూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించింది. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫైడ్ పంటలను సాగుచేసిన ప్రతీ ఎకరాకు డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి బీమా కల్పిస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదు ప్రామాణికంగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. అర్హత పొందిన వారికి తరువాత ఏడాది సీజన్ ప్రారంభమయ్యేలోగా పరిహారం చెల్లిస్తున్నారు. ఇలా గడిచిన నాలుగేళ్లుగా 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారం చెల్లించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్–2021 సీజన్లో అర్హత పొందిన 15.61 లక్షల మంది రైతులకు గతేడాది జూన్ 14న రూ.2,977.82 కోట్లు జమచేసింది. ఒక సీజన్‌కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పరిహారం అందించడం చరిత్రలో ఇదే తొలిసారి. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో పరిహారం అందని వారి నుంచి, ఆర్బీకేల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత సాధించిన మేరకు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. అయితే, కొన్ని సంశయాత్మక ఖాతాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పునఃపరిశీలన చేశారు. అందులో అర్హత పొందిన వారికి సంబంధించిన విస్తీర్ణానికి గతంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా లేదా అని కూడా పునఃపరిశీలన చేశారు. ఒకటి రెండుసార్లు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన తర్వాత అన్ని వి«ధాలుగా అర్హత పొందిన వారి జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించారు. ఇలా అర్హత పొందిన 9 వేల మందికి ఈనెల 14న రూ.90 కోట్లు జమచేశారు. తొలుత అర్హత పొందిన వారిలో వీరు కేవలం 0.2 శాతం మాత్రమే. వాస్తవాలిలా ఉంటే.. సాంకేతిక కారణాలతో ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన జాప్యాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుని బీమా పరిహారం ఏడాదికి జమచేసినట్లుగా వాస్తవాలను మరుగున పరిచేలా ప్రచురించిన వార్తను ఖండిస్తున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. -
హాట్ టాపిక్‌గా షిండే కుమారుడి వ్యాఖ్యలు!
మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థలతో సహా రాబేయే అన్ని ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించిన కొద్దిరోజులకే శ్రీకాంత్ ఈవిధంగా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. శుక్రవారం డోంబివలి యూనిట్లో శ్రీకాంత్ షిండే మాట్లాడారు. బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. కొంతమంది బీజేపీ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం షిండే వర్గానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. తనకు ఏ పదవిపై కోరిక లేదన్నారు. ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్నది కూటమే నిర్ణయింస్తుందని చెప్పారు. మహారాష్ట్రలో శివసేన కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యం అని శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే అన్నారు. ఆ దిశగా తాము చేస్తున్న పనిని ఎవరైనా అడ్డుకున్నా.. లేదా కూటమిలో ఉంటూ ఇబ్బందులు పెట్టినా.. పదవులకు రాజీనామా చేసేందుకైనా సిద్ధమేననన్నారు. భవిష్యత్తులో, మంచి మెజారిటీతో గెలిచి, మహారాష్ట్రను అన్ని రంగాలలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేలా ప్రయత్నిస్తామని శ్రీకాంత్ షిండే చెప్పారు. కాగా, లోక్‌సభ, విధానసభ మరియు స్థానిక సంస్థల ఎన్నికలతో సహా రాబోయే అన్ని ఎన్నికల్లో శివసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఏక్నాథ్ షిండే ఈ నెల ప్రారంభంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: మెల్లమెల్లగా బీజేపీ పట్టు కోల్పోతోంది.. నిన్న కర్ణాటక.. రేపు రాజస్థాన్.. ) -
ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎల్ఐసీ బాసట
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) బాసటగా నిలిచింది. ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ అవసరాన్ని మినహాయించి, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సడలించనున్నట్లు ఎల్ఐసీ చైర్పర్సన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల ఎల్ఐసీ ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని మహంతి పేర్కొన్నారు. మృతులు, బాధితులకు బాసటగా నిలుస్తుందని, ఆర్థిక ఉపశమనం అందించడానికి క్లయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తుందని చైర్పర్సన్ వివరించారు. ఎల్ఐసీ పాలసీల క్లయిమ్‌దారులు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారుల కష్టాలను తగ్గించడమే దీని లక్ష్యం అని తెలిపారు. రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్లకు బదులుగా రైల్వే అధికారులు, పోలీసులు, ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితాను పాలసీదారుల మరణానికి రుజువుగా అంగీకరించనున్నట్లు ఎల్ఐసీ చైర్పర్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే క్లయిమ్ సంబంధిత సందేహాలకు నివృత్తికి, హక్కుదారులకు సహాయం అందించడానికి డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. -
బ్యాంకుల్లో రూ.35 వేల కోట్ల డిపాజిట్లు.. వారసులకు అందేదెలా?
కోటీ, రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.35 వేల కోట్లు. బ్యాంకుల్లో పదేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తమిది. డిపాజిట్‌దారులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యుల(వారసులు)కు కూడా తెలియని డిపాజిట్లు కొన్నయితే, వారసులు ఎవరో తేలక బ్యాంకులోనే ఉండిపోయినవి కొన్ని. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఎవరూ క్లెయిమ్ చేయని ఈ డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లుగా కేంద్ర ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. 10,24,00,599 ఖాతాలకు చెందిన ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిబంధనల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు పేర్కొంది. ఈ సొమ్ము మృతుల వారసులకు చెందాల్సి ఉందని తెలిపింది. ఈ క్లెయిమ్‌లను పరిష్కరించడంలో కుటుంబ సభ్యులకు సహకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. మృతుల ఖాతాలకు సంబంధించి చట్టపరమైన ప్రాతినిధ్యం లేకుండా క్లెయిమ్‌లు పరిష్కరించరు. ఇందుకోసం నిర్దిష్టమైన దరఖాస్తు, నిబంధనలు ఉంటాయి. వీటిని మృతుల కుటుంబ సభ్యులు సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించినట్లు ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ దరఖాస్తులు సరైన వివరాలు లేకుండా, అసంపూర్తిగా ఉంటే వాటిని బ్యాంకులు తిరస్కరిస్తాయని, అయితే వాటిని తిరస్కరించడానికి కారణాలను క్లెయిమ్‌దారులకు బ్యాంకులు తెలియజేయాలని, సక్రమంగా నమోదు చేయడానికి సహకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థి క శాఖ పేర్కొంది. ఈ ఖాతాల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పింది. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, చట్టబద్ధమైన వారసులను కనుగొనేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఒక సంవత్సరానికంటే ఎక్కువ కాలం కార్యకలాపాలు లేని ఖాతాలను ప్రతి ఏడాదీ సమీక్షించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిందని తెలిపింది. ఆ ఖాతాదారులను సంప్రదించి కారణాలను తెలుసుకోవడంతో పాటు ఎటువంటి లావాదేవీలు జరగలేదని లిఖితపూర్వకంగా నిర్ధారించుకోవాలని సూచించినట్లు చెప్పింది. -
Motor Accident Claims: ఆ కేసులను వేగంగా పరిష్కరించండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మోటార్ వాహనాల ప్రమాదాల క్లెయిమ్ కేసులను వేగంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకోసం మూడు నెలల్లోగా పోలీసు స్టేషన్లలో ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. రోడ్డు ప్రమాద క్లెయిముకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ నజీర్, జేకే మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ‘‘రోడ్డు ప్రమాదంపై ఫిర్యాదు అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దర్యాప్తు అధికారి మోటారు వాహనాలు(సవరణ) నిబంధనలు–2022 ప్రకారం నడుచుకోవాలి. ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్టును 48 గంటల్లోగా క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌కు సమర్పించాలి’’ అని పేర్కొంది. -
3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా..
వాషింగ్టన్: ‘రెండు నిమిషాల్లో రెడీ.. 3 నిమిషాల్లో రెడీ..’ అని ఇన్స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్‌పై వివరాలు ఇస్తుంటాయి కంపెనీలు. వాటిని ఉడికించబోతే చెప్పిన సమయం కంటే ఎక్కువే తీసుకుంటాయి. అది మామూలేలే.. అని మనం పట్టించుకోం. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఈ మహిళ ఊరుకోలేదు. చెప్పిన టైమ్‌లో పాస్తా ఉడకలేదని ఫుడ్ కంపెనీపై రూ.40కోట్లు దావా వేసింది. ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీరేజ్... క్రాఫ్ట్ హీంజ్ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ ఛీజ్‌ను కొనుగోలు చేసింది. దాన్ని మైక్రోవేవ్‌లో ఉడికిస్తే.. మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్‌పై రాసి ఉంది. కానీ అందులో వివరించినట్టుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్ ఛీజ్ ఉడకలేదని, ప్యాక్‌పై ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమాండా ఆరోపించింది. పరిహారం కింద రూ.40 కోట్లు, జరిగిన నష్టానికి రూ.80 లక్షలు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది. చదవండి: మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా! -
ఇన్సూరెన్స్ రంగంలో ‘బీమా సుగమ్’ గేమ్ చేంజర్
న్యూఢిల్లీ: బీమా సుగమ్ అన్నది బీమా రంగం స్వరూపాన్నే మార్చేస్తుందని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా అన్నారు. బీమా పాలసీల విక్రయం, కొనుగోలు, రెన్యువల్ (పునరుద్ధరణ), క్లెయిమ్‌ల పరిష్కారం సహా అన్ని రకాల సేవలను అందించే ఏకీకృత ప్లాట్‌ఫామ్‌గా ఉంటుందన్నారు. దేశంలో బీమా వ్యాప్తి విస్తరణకు ఈ టెక్నాలజీ పోర్టల్ సాయంగా నిలుస్తుందన్నారు. కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందన్నారు. యూపీఐ విప్లవం వంటిది... బీమా రంగానికి బీమా సుగమ్ అన్నది యూపీఐ విప్లవం వంటిదని వ్యాఖ్యానించారు. బీమా కంపెనీలు ఈ ప్లాట్ఫామ్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. బీమా ఏజెంట్లు, వెబ్ అగ్రిగేటర్లు సహా అన్ని రకాల మధ్యవర్తులకూ ఈ పోర్టల్ యాక్సెస్ ఉంటుందని చెప్పారు. పాలసీదారులు ఈ పోర్టల్ నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. బీమాకు సంబంధించి దీన్నొక షాపింగ్ మాల్గా పాండా అభివర్ణించారు. -
సీనియర్లు అయితే హెల్త్ క్లెయిమ్ ఆలస్యం
న్యూఢిల్లీ: వృద్ధులు (60 ఏళ్లు దాటిన వారు) హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో కొంత సమయం తీసుకుంటున్నారు. 60 ఏళ్లలోపు వారితో పోలిస్తే వారం ఆలస్యంగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు ‘సెక్యూర్ నౌ’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఆస్పత్రిలో చేరినా కానీ, తమ చికిత్స గురించి బీమా సంస్థకు సమాచారం ఇచ్చే విషయంలో వారు జాప్యం చేస్తున్నారు. నగదు రహిత చికిత్సను వృద్ధులు ఎంపిక చేసుకోపోతే, వారు క్లెయిమ్‌లను కచ్చితత్వంతో దాఖలు చేసేందుకు ఆస్పత్రులు, బీమా సంస్థలు, మధ్యవర్తులు సాయం అందించాలని మెహతా సూచించారు. 60 ఏళ్లలోపు వారికి క్లెయిమ్ పరిష్కారం అయ్యేందుకు 23 రోజుల సయం పడుతోంది. అదే సీనియర్ సిటిజన్లు అయితే 28 రోజుల సమయం తీసుకుంటోంది. ఇతరులతో పోలిస్తే వృద్ధులు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారన్న విషయాన్ని మెహతా గుర్తు చేశారు. 30 ఏళ్ల వ్యక్తికి ప్రీమియం రూ.10,365గా ఉంటే, 45 ఏళ్లకు ఇది రూ.15,239, 60 ఏళ్లకు రూ.31,905 అవుతున్నట్టు చెప్పారు. ఇక 75 ఏళ్ల వయసులో వీరు రూ.66,368 చెల్లించాల్సి వస్తుందన్నారు. డయేరియా, కేన్సర్, ప్రొస్టేట్ పెరుగుదల సమస్య, కరోనరీ గుండె జబ్బులకు క్లెయిమ్ నిష్పత్తి (వృద్ధులకు) తక్కువగా ఉంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. -
ధీమాగా బీమా ఇలా..!
ఆరోగ్య బీమా అవసరాన్ని గతంతో పోలిస్తే నేడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. డిజిటల్ వేదికలు విస్తృతం కావడం, స్మార్ట్ఫోన్ల వినియోగం ఊపందుకోవడం హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన పెరగడానికి సాయపడుతున్నాయి. కరోనా మహమ్మారి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలిసేలా చేసింది. కానీ, ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలున్నాయి. బీమా పాలసీని తీసుకునేందుకు ఇవి అడ్డుపడొచ్చు. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పనిచేసే విధానం, క్లెయిమ్‌కు సంబంధించి కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. వీటిని తొలగించుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారు. ఇలాంటి కొన్ని అపోహలు, వాటికి సంబంధించి వాస్తవాలను నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రొడక్ట్స్, క్లెయిమ్స్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా వెల్లడించారు. ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స తీసుకుంటేనే బీమా క్లెయిమ్‌కు అర్హత లభిస్తుందన్నది అపోహే. కానీ వాస్తవం వేరు. ఆధునిక పరిశోధన ఆధారిత ఔషధాలు, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో చాలా చికిత్సలకు నేడు 24 గంటల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఏర్పడడం లేదు. వీటిని డే కేర్ ట్రీట్మెంట్స్గా (రోజులో వచ్చి తీసుకుని వెళ్లే వీలున్నవి) చెబుతారు. కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాటరాక్ట్ ఆపరేషన్, కిడ్నీల్లో రాళ్లు తొలగించే సర్జరీ ఇలాంటివన్నీ డేకేర్ ట్రీట్మెంట్స్ కిందకు వస్తాయి. డేకేర్ ట్రీట్మెంట్స్లో చాలా వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ లభిస్తోంది. కేన్సర్‌కు సంబంధించి ఓరల్ కీమోథెరపీకి అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్లలో కవరేజీ ఉంటోంది. క్లెయిమ్ మొత్తం వస్తుందనుకోవద్దు నియంత్రణ సంస్థ అనుమతి మేరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వేటికి చెల్లింపులు చేయవో తెలియజేస్తూ ఒక జాబితా నిర్వహిస్తుంటాయి. పీపీఈ కిట్, మాస్క్, బ్యాండేజ్, నెబ్యులైజర్ తదితర ఇలా చెల్లింపులు చేయని వాటి జాబితాను బీమా సంస్థలు పాలసీ వర్డింగ్స్లో ప్రత్యేకంగా పేర్కొంటాయి. అందుకుని ఆస్పత్రిలో అయ్యే బిల్లు మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయని అనుకోవద్దు. అయితే, వీటికి కూడా చెల్లింపులు చేసే రైడర్లను కొన్ని బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. రైడర్‌ను జోడించుకుని, కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా డిస్పోజబుల్స్‌కు సైతం క్లెయిమ్ తీసుకోవచ్చు. ఇక పాలసీల్లో మరికొన్ని ఇతర పరిమితులు కూడా ఉంటాయి. కోపేమెంట్, రూమ్‌రెంట్, డాక్టర్ కన్సల్టేషన్ చార్జీల పరంగా చెల్లింపుల పరిమితులు ఉంటాయి. అంటే వీటికి సంబంధించి బీమా సంస్థలు పాలసీ నియమ, నిబంధనల్లో పేర్కొన్న మేరకే చెల్లింపులు చేస్తుంటాయి. కనుక క్లెయిమ్ మొత్తం వస్తుందని అనుకోవద్దు. చెల్లింపుల్లో పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు సింగిల్ రూమ్ అని పాలసీ డాక్యుమెంట్లో ఉంటే.. హాస్పిటల్లో సాధారణ సింగిల్ రూమ్‌లో చేరినప్పుడే చికిత్సకు అయ్యే వ్యయాలపై పూర్తి చెల్లింపులు పొందడానికి ఉంటుంది. డీలక్స్ రూమ్/సూట్లో చేరితే అది పరిమితికి మించినది అవుతుంది. దీంతో క్లెయిమ్‌లో కొంత మేర కోత పడుతుంది. దీన్నే రూమ్ రెంట్ క్యాప్ అని కూడా అంటారు. వీటిపై పాలసీదారులు ముందే తగిన అవగాహనతో ఉండాలి. అందుకని కచ్చితంగా పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. లేదంటే బీమా సంస్థ కస్టమర్ కేర్ లేదా ఏజెంట్‌ను సంప్రదించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది పేషెంట్ కోలుకున్న తర్వాత నిర్ణీత కాలం పాటు అతనికి బీమా సంస్థ కొత్త పాలసీని ఆఫర్ చేయకపోవడం. కానీ, దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా ఎత్తివేయాలని పాలసీదారులు భావిస్తుంటారు. అంతేకాదు, బీమా సంస్థలు ఆరోగ్యవంతులు, ఆస్పత్రి అవసరం ఏర్పడని వారికే పాలసీని ఆఫర్ చేస్తాయని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ వెనుక ఉన్న తార్కికత ఏమిటంటే.. ఒక ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకున్న తర్వాత ఏవైనా కొత్త సమస్యలు ఏర్పడతాయేమో అంచనా వేసేందుకు కావాల్సిన సమయంగా అర్థం చేసుకోవాలి. కరోనా చికిత్స లేదా సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పాలసీదారులు మరింత కవరేజీకి అర్హత సాధిస్తారు. వీటిని ముందస్తు నుంచి ఉన్న సమస్యలుగా బీమా సంస్థలు పరిగణించవు. అలాగే క్లెయిమ్ సమయంలో అస్పష్టతను కూడా తగ్గిస్తుంది. ఎక్కడైనా క్యాష్‌లెస్ బీమా క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకం, సౌకర్యంగా మార్చడంపై బీమా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. క్లెయిమ్‌ను క్యాష్‌లెస్ (పాలసీదారు చెల్లించాల్సిన అవసరం లేకుండా) లేదా రీయింబర్స్మెంట్ విధానంలో దాఖలు చేసుకోవచ్చు. కానీ, నగదు రహిత చికిత్స సేవలు పొందాలంటే మీరు చేరే హాస్పిటల్.. బీమా సంస్థ క్యాష్‌లెస్ హాస్పిటల్ నెట్‌వర్క్‌లో భాగమై ఉండాలి. ఇలా కాకుండా పాలసీదారు చికిత్స తీసుకుని అందుకు సంబంధించిన మొత్తం వారే చెల్లించి తర్వాత బీమా సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఇందుకోసం అన్ని రకాల పత్రాలను సమర్పించాలి. అప్పుడే బీమా సంస్థ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయగలదు. క్యాష్‌లెస్ అన్నది సౌకర్యమైనది. దీనివల్ల ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సకు అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా సమకూర్చుకునే ఇబ్బంది తప్పుతుంది. పైగా డిశ్చార్జ్ ప్రక్రియ క్యాష్‌లెస్ విధానంలో సులభంగా పూర్తవుతుంది. బీమా వ్యాపారం అన్నది ప్రజల నిధులతో కూడుకున్నదని అర్థం చేసుకోవాలి. ప్రజల డిపాజిట్లకు సంరక్షకుడిగా బీమా సంస్థ అన్ని రకాల నిజమైన క్లెయిమ్‌లను గౌరవించాల్సి ఉంటుంది. బీమా సంస్థలు పాలసీ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకునేందుకు వీలుగా సులభ పరిభాషతో రూపొందిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కొనుగోలుకు ముందు శ్రద్ధగా వీటిని చదవడం వల్ల.. క్లెయిమ్‌ల సమయంలో అనవసర తలనొప్పులను రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. అధిక కవరేజీ కోసం హెల్త్ చెకప్ పాలసీ జారీ చేసే ముందు అన్ని బీమా సంస్థలూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరడం లేదు. పెద్ద వయసులో ఉన్నారని లేదా అధిక కవరేజీ కోరుతున్నారని వైద్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలనేమీ లేదు. ఉదాహరణకు ప్రముఖ హెల్త్ ప్లాన్లు అన్నింటికీ ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు. కొన్ని ప్రత్యేక కేసుల్లోనే నిర్ధేశిత వైద్య పరీక్షలను బీమా సంస్థలు కోరుతుంటాయి. దరఖాస్తుదారులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా గతంలో ఏవైనా ఎదుర్కోని ఉంటే ప్రస్తుత ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరతాయి. ఇందుకు అయ్యే వ్యయాలను బీమా సంస్థలు పూర్తిగా భరిస్తుంటాయి. -
కోవిడ్ కేటుగాళ్లు..!
-
జీవిత బీమా ‘క్లెయిమ్’ చేయాల్సి వస్తే..?
మనం ఎంతగానో ప్రేమించే వారు దూరమైతే కోలుకోవడానికి సమయం పడుతుంది. అదే సమయంలో దూరమైన వ్యక్తికి సంబంధించి కుటుంబం ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. జీవిత బీమా ఉంటే ఈ సవాళ్లను కొంత వరకైనా అధిగమించే శక్తిని సమకూర్చుకోవచ్చు. దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణానికి గురైతే నామినీగా నమోదై ఉన్న వారు క్లెయిమ్ (జీవిత బీమా పరిహారం కోసం) ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా, వేగంగా నిర్వహిస్తే.. అంతే వేగంగా పరిహారం చేతికి అందుతుంది. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని తెలియజేసే ‘ప్రాఫిట్ ప్లస్’ కథనమే ఇది. క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు నామినీగా ఉన్నవారు పాలసీదారు మరణానికి సంబంధించి సమాచారాన్ని జీవిత బీమా సంస్థకు తెలియజేయడం మంచిది. ఈ మెయిల్ లేదా ఫోన్ రూపంలో సమాచారం ఇవ్వొచ్చు. ఆ తర్వాత కావాల్సిన పత్రాలతో క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో పాలసీదారుల సౌలభ్యం కోసం బీమా సంస్థలు ఆన్లైన్లోనే చాలా వరకు ప్రక్రియలను అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎక్సైడ్ లైఫ్ క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో చేపడుతున్నాయి. ఆన్లైన్లో అనుమతిస్తున్నాయంటే.. భౌతికంగా శాఖల రూపంలో అనుమతించడం లేదని పొరపడకండి. వీలుంటే ఆయా బీమా సంస్థ కార్యాలయానికి వెళ్లి అయినా క్లెయిమ్‌ను దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ మెయిల్ లేదా వాట్సాప్ లేదా కంపెనీ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించొచ్చు. ఏజెంట్ సాయాన్ని అయినా తీసుకోవచ్చు. కరోనా మరణ కేసుల్లో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు గాను ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశాయి. కొన్ని సాధారణ డాక్యుమెంట్లను కూడా క్లెయిమ్ దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి వస్తుంది. క్లెయిమ్ ఫారమ్‌ను బీమా సంస్థల పోర్టళ్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెత్ సర్టిఫికెట్, వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్, మెడికల్ రికార్డులు లేదా పరీక్షల ఫలితాల కాపీలను క్లెయిమ్ ఫారమ్‌తోపాటు జత చేయాల్సి ఉంటుంది. అలాగే, ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్, నామినీ బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ కేవైసీ (చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలతో), క్యాన్సిల్డ్ చేసిన చెక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాద మరణం అయినా, కరోనా మరణం అయినా, సాధారణ మరణం అయినా క్లెయిమ్ ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సంస్థలు ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేశాయి. ఆన్లైన్లోనే క్లెయిమ్‌ను దాఖలు చేసి, డాక్యుమెంట్లను ఆప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్, మొబైల్ యాప్, చాట్‌బాట్స్, వెబ్ పోర్టల్ ఏ రూపంలో అయినా బీమా కంపెనీని సంప్రదించొచ్చు. 30 రోజుల ప్రక్రియ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నిబంధనల ప్రకారం జీవిత బీమా సంస్థలు మరణ పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. క్లెయిమ్ దాఖలు చేసిన రోజు నుంచి ఈ గడువు అమలవుతుంది. ఒకవేళ పాలసీదారు మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు బీమా సంస్థలు దర్యాప్తు అవసరమని భావించొచ్చు. కనుక దర్యాప్తు అవసరమైన కేసుల్లో 90 రోజుల సమయాన్ని బీమా సంస్థలు తీసుకోవచ్చు. అంటే 90 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి సందేహాల్లేకుండా, అన్ని పత్రాలు దాఖలు చేసిన కేసుల్లో ఏడు రోజుల వ్యవధిలోనే బీమా సంస్థలు పరిహారాన్ని విడుదల చేస్తున్నాయి. గతంతో పోలిస్తే క్లెయిమ్ ప్రక్రియ డిజిటలైజ్ కారణంగా వేగాన్ని సంతరించుకుందని చెప్పుకోవాలి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు క్లెయిమ్‌ను చాలా ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తున్నాయి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్ లైఫ్ 48 గంటల్లోనే క్లెయిమ్‌ను పరిష్కరించేస్తున్నాయి. కాకపోతే కంపెనీ కోరిన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత 48 గంటలను పరిగణనలోకి తీసుకోవాలి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 24 గంటల్లోనే ఈ ప్రక్రియను ముగించేస్తోంది. ఇక పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థ దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ కేవలం మూడు గంటల్లోనే పరిష్కరిస్తుండడం గమనించాలి. గతంతో పోలిస్తే క్లెయిమ్‌ల విషయంలో బీమా సంస్థలు మరింత వేగాన్ని, నాణ్యతను సంతరించుకున్నాయి. డాక్యుమెంట్ల పరంగా.. కొన్ని బీమా సంస్థలు డాక్యుమెంట్ల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాయి. కరోనా వైరస్ నియంత్రణ వల్ల అమలవుతున్న ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ చర్యలు తీసుకున్నాయి. ఆస్పత్రిలో మరణం నమోదైతే సాధారణంగా క్లెయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ (మరణ ధ్రువీకరణ పత్రం) సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి డెత్ సర్టిఫికెట్ అందుకునేందుకు సాధారణంగా 10–15 రోజులు వేచి ఉండాల్సి రావచ్చు. అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టే పరిస్థితి ఉండచ్చు. అందుకనే ఎల్ఐసీ డెత్ సర్టిఫికెట్ బదులు.. మరణించిన తేదీ, సమయం, కారణం తదితర వివరాలతో ఆస్పత్రులు జారీ చేసే డెత్ సమ్మరీని కూడా అనుమతిస్తోంది. డెత్ సమ్మరీ సర్టిఫికెట్‌పై ఎల్ఐసీ క్లాస్–1 అధికారి లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ సంతకంతోపాటు.. క్రిమేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించడం ద్వారా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు ఎల్ఐసీ అనుమతిస్తోంది. అలాగే, ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్ డెత్ సర్టిఫికెట్ దాఖలు నుంచి మినహాయింపునిచ్చాయి. ఆస్పత్రుల్లో చనిపోయిన వారికే ఈ మినహాయింపు పరిమితం. ఎందుకంటే ఆస్పత్రి యాజమాన్యాలు మరణానికి కారణం, ఇతర వివరాలతో డెత్ సమ్మరీని జారీ చేస్తాయి. కనుక దీన్ని ఆధారంగా పరిగణిస్తున్నాయి. ఇతర క్లెయిమ్‌లు జీవిత బీమా కంపెనీల నుంచి తీసుకునే ఇతర పాలసీల విషయంలోనూ క్లెయిమ్‌లకు సంబంధించి నిబంధనల పరంగా సడలింపు అమలవుతోంది. గడువు తీరిన పెన్షన్ పాలసీల (యాన్యుటీ ప్లాన్లు) విషయంలో పాలసీదారు లైఫ్ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం సాధారణంగా వ్యక్తిగతంగా హాజరుకావాలి. కరోనా మహమ్మారి తీవ్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను కంపెనీలు అనుమతిస్తున్నాయి. ఎల్ఐసీ కూడా యాన్యుటీ ప్లాన్ల విషయంలో లైఫ్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపును కల్పించింది. వీడియోకాల్ రూపంలో ఈ ప్రక్రియను చేపడుతోంది. ఎస్బీఐ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ సంస్థలు సైతం యాన్యుటీ ప్లాన్ల విషయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అనుమతిస్తున్నాయి. -
ధూమపానం.. లంగ్ క్యాన్సర్ లింక్‌కు ఆధారాల్లేవు!
అహ్మదాబాద్: ఒక పేషెంటు అతిగా పొగతాగడం వల్ల మరణించాడని పేర్కొంటూ క్లెయిమ్ చెల్లించేందుకు నిరాకరించిన బీమా కంపెనీకి వినియోగదారుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సదరు పేషెంటుకు వైద్య బీమా వ్యయ మొత్తాన్ని ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. పొగతాగడం వల్లనే సదరు పేషెంటుకు లంగ్‌క్యాన్సర్ వచి్చందనేందుకు సరైన ఆధారాల్లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం చికిత్స రిపోర్టులో పొగతాగడం అలవాటైంది(అడిక్షన్ స్మోకింగ్) అని రాయడాన్ని తిరస్కరణకు కారణంగా పేర్కొనలేమంది. పొగతాగని వాళ్లకు కూడా లంగ్‌క్యాన్సర్ వస్తుందని గుర్తు చేసింది. అలోక్ కుమార్ బెనర్జీ అనే వ్యక్తి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. అతని వైద్య చికిత్సకు అయిన రూ. 93,927 చెల్లించేందుకు బీమా కంపెనీ తిరస్కరించింది. దీంతో బెనర్జీ భార్య స్మిత కన్జూమర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సదరు మొత్తాన్ని 7 శాతం వడ్డీతో కలిపి 2016 ఆగస్టు నుంచి లెక్కించి ఇవ్వాలని పేర్కొంది. -
అసలే వర్షాకాలం, కారు ఇంజిన్ పాడైతే బీమా వర్తిస్తుందా? ఏం చేయాలి?
వర్షాకాలం వచ్చింది అంటే చాలు వాహదారులకు పట్టపగలు చుక్కలు కనిపిస్తాయి. చిన్న పాటి వర్షానికి మన మెట్రో నగరాలు సముద్రాలను తలపిస్తాయి. వర్షం కాలంలో వాహనాలకు ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. అందుకే వర్షాకాలంలో ప్రతి సంవత్సరం ఇంజిన్ సమస్యలతో బీమా కంపెనీలకు భారీగా క్లెయిమ్స్ వస్తాయి. వర్షాకాలంలో వచ్చే చాలా క్లెయిమ్స్ ప్రకృతి కారణంగా నష్ట పోయినవే. నీరు లేదా హైడ్రోస్టాటిక్ లాక్ కారణంగా కారు ఇంజిన్ డ్యామేజీ అవుతాయి. కారు యజమానుల నిర్లక్ష్యం చేత బీమా కంపెనీలు ఎక్కువగా ఈ క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నాయి. నీటి వల్ల ఇంజిన్ దెబ్బతినడం సాధారణంగా రెండు సందర్భాల్లో జరుగుతుంది. ఒకటి కారు నీటిలో మునిగిపోయినప్పుడు, రెండవది కారు యజమాని వరద నీటిలో నుంచి ప్రయాణించినప్పుడు. మొదటి సందర్భంలో కారు మునిగిపోయి తేలిన తర్వాత వాహన యజమాని ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, మీరు ఇటువంటి సందర్భంలో బీమా కంపెనీకి కాల్ చేయడం మంచిది. కాల్ చేశాక మీ పరిస్థితి వివరించి ఏమి చేయాలో అడగండి. తనిఖీ కొరకు వారు వాహనాన్ని దగ్గరల్లో ఉన్న అధీకృత గ్యారేజీకి తీసుకెళ్లాలని బీమా కంపెనీ సూచించవచ్చు. ఒకవేళ ఇంజిన్ పూర్తిగా పాడైపోయినట్లయితే అది ప్రమాదంగా పరిగణిస్తారు, అది నిర్లక్ష్యం కాదు. ఇక రెండవ సందర్భంలో నీటితో నిండిన ప్రాంతం గుండా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంజిన్ డ్యామేజీని వివాద అంశంగా పరిగణిస్తారు. అయితే, డ్రైవ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి వారికి ఎలాంటి మార్గం లేనందున బీమా కంపెనీ ఇటువంటి క్లెయిమ్స్ తిరస్కరిస్తాయి. ఇలాంటప్పుడు ఏమి చేయాలంటే, వరద ప్రాంతంలో కారు మునిగిపోతే దానిని స్టార్ట్ చేయకుండా ఉండటం మంచిది. నీటి మట్టం తగ్గిన తర్వాత, బీమా కంపెనీకి కాల్ చేసి, ఏమి చేయాలో అడగండి. ఇటువంటి సమయంలో క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశం తక్కువ. లోతట్టు ప్రాంతాలలో, ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న వారు ఇటువంటి వివాదాలను పరిష్కరించడం కొరకు, మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ కవర్ ని తీసుకుంటే మంచిది. యాడ్ ఆన్ ఇంజిన్ కు అన్ని రకాల డ్యామేజీలను కవర్ చేస్తుంది. ఒకవేళ నీరు క్యాబిన్ లోనికి ప్రవేశించి, స్పీకర్ లు, సెన్సార్ లు, ఎలక్ట్రిక్ ఎక్విప్ మెంట్ వంటి భాగాలు డ్యామేజీ అయితే, బీమా కంపెనీ వీటికి నగదు చెల్లించదు. ఫ్యాక్టరీలో ఫిట్ చేయబడ్డ భాగాలకు మాత్రమే చెల్లిస్తుందని గమనించాలి. చదవండి: రెండో రోజు భారీగా పడిపోయిన బంగారం ధరలు -
క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరిస్తే.. కుదరదు
కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా కలిగిన వారు సాధారణంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్సలను పొందొచ్చు. కానీ, ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో చాలా ఆస్పత్రులు నగదు చెల్లించేవారికే చికిత్సలు అందిస్తూ బీమా ప్లాన్లపై నగదు రహిత వైద్య సేవలను తిరస్కరిస్తున్నాయి. దీంతో ఐఆర్డీఏఐ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నగదు రహిత కరోనా చికిత్సల క్లెయిమ్‌లను తిరస్కరించొద్దంటూ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాలసీదారులకు నగదు రహిత వైద్య చికిత్సలు అందేలా చూడాలని కోరింది. కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు కరోనా చికిత్సలకు అధిక రేట్లను వసూలు చేయడమే కాకుండా.. నగదునే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రుల వైఖరి వల్ల పాలసీదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రా ణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో నగదు కోసం పాట్లు పడేలా పరిస్థితులను ఆస్పత్రులు మార్చేశాయి. ఇటువంటి ప్రతికూలతలు ఎదురైతే పాలసీదారుల ముందున్న మార్గాలేంటో చూద్దాం... బీమా సంస్థలు, ఆస్పత్రులు కుదుర్చుకున్న సేవల ఒప్పందాన్ని అమలు చేసే దిశగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఇప్పటికే రెండు పర్యాయాలు సర్క్యులర్లను జారీ చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. నిబంధనలను పాటించాలంటూ ఆస్పత్రులను కోరింది. ‘‘నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు పాలసీదారు గుర్తించినట్టయితే.. పాలసీ ఒప్పందం మేరకు ఆయా నెట్వర్క్ ఆస్పత్రిలో నగదు రహిత వైద్యం పాలసీదారుకు అందేలా బీమా సంస్థలు చర్యలు తీసుకోవాలి’’ అని తన ఉత్తర్వుల్లో ఐఆర్డీఏఐ కోరింది. నగదు రహిత వైద్యాన్ని ఆస్పత్రి తిరస్కరిస్తే.. అందుకు వీలు కల్పించాలని కోరుతూ పాలసీదారులు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (బీమా సంస్థ తరఫున క్లెయిమ్ సేవలు అందించే మూడో పక్షం/టీపీఏ)కు అధికారికంగా తెలియజేయాలి. అప్పటికీ నగదు రహిత వైద్యం లభించకపోతే.. ఆస్పత్రికి వ్యతిరేకంగా బీమా సంస్థకు నేరుగా ఫిర్యాదు దాఖలు చేయాలి. నగదు రహిత వైద్యం పాలసీదారులకు ఎంతో శ్రమను తప్పిస్తుంది. కనుక ఒక నెట్వర్క్ ఆస్పత్రి ఈ సేవను తిరస్కరించినట్టయితే.. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ సమయం వేచి చూసే పరిస్థితి ఉండదు. అటువంటి సందర్భాల్లో మరో నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లి నగదు రహిత చికిత్సలను తీసుకోవడం ఒక పరిష్కారం. దీనివల్ల పాలసీదారులు తమ జేబుల నుంచి భారీగా వ్యయం చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఆస్పత్రులు అంగీకరించిన ధరలనే వసూలు చేసేలా చూడాలని కూడా బీమా సంస్థలను ఐఆర్డీఏఐ కోరింది. ‘‘నెట్వర్క్ ఆస్పత్రులు అంగీకరించిన ధరలకే పాలసీదారులకు చికిత్సలు అందించేలా బీమా సంస్థలు చూడాలి. ఎటువంటి అదనపు చార్జీలు తీసుకోకుండా చూడాలి. ఒకవేళ ఒప్పందానికి విరుద్ధంగా నగదు రహిత చికిత్సలకు తిరస్కరిస్తే, ఆయా ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఐఆర్డీఏఐ కో రింది. ఒకవేళ ఆస్పత్రులు అధికంగా చార్జీలు వసూలు చేసినట్టయితే ఆ తర్వాత ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా వాటి సంగతి తేల్చవచ్చు. మంచి ఆస్పత్రి అని భావిస్తుంటే, నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో నగదు చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ పొందడం ఒక్కటే మార్గం. ఇతర ఆస్పత్రులు నగదు రహిత చికిత్సలకు తిరస్కారం ఎదురైన సందర్భాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రికి సైతం వెళ్లొచ్చు. ఎందుకంటే చికిత్సల వ్యయాలను సొంతంగా భరించి, ఆ తర్వాత రీయింబర్స్మెంట్ చేసుకోవడమే కనుక ఎక్కడైనా రిజిస్టర్డ్ హాస్పిటల్లో వైద్య సేవలను పొందొచ్చు. ముఖ్యంగా ఆయా క్లిష్ట సందర్భాల్లో ప్రాణాలను కాపాడుకోవడాన్ని ప్రాధాన్య అంశంగా చూడాలి. అందుకే కీలక సమయంలో కాలయాపనకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించడం మంచిది. నిధులు సర్దుబాటు అయితే అందుబాటులోని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ వచ్చేందుకు నెల వరకు సమయం తీసుకుంటుంది. ఆస్పత్రిపై ఫిర్యాదు నగదు రహిత వైద్యం తిరస్కరణపై ఐఆర్డీఏఐ తీవ్రంగా స్పందించింది. ఎటువంటి ఆటంకాల్లేని సేవలు లభించేందుకు నెట్వర్క్ ఆస్పత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులకు ఏర్పాట్లు చేసుకోవాలని బీమా కంపెనీలకు సూచించింది. పాలసీదారుల ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని.. చట్టపరమైన చర్యల కోసం స్థానిక అధికార యంత్రాంగం దృష్టికి ఆయా ఆస్పత్రుల వ్యవహారాలను తీసుకెళ్లాలని కోరింది. ఒకవేళ ఆస్పత్రుల వ్యవహారశైలి పట్ల సంతృప్తిగా లేకపోతే బీమా సంస్థకు, స్థానిక అధికార యంత్రాగానికి పాలసీదారులు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు దాఖలు ఎలా..? ఫిర్యాదును దాఖలు చేయడమే కాదు.. తగిన పరిష్కారాన్ని పొందడమూ ముఖ్యమే. పాలసీదారులు ముందుగా బీమా సంస్థకు చెందిన పాలసీదారుల ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని సంప్రదించాలి. 15 రోజుల్లోపు బీమా సంస్థ నుంచి సరైన పరిష్కారం లభించకపోయినా, పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోయినా అప్పుడు సమగ్ర ఫిర్యాదుల పరిష్కార విభాగం రూపంలో ఐఆర్డీఏఐ దృష్టికి సమస్యను తీసుకెళ్లొచ్చు. ఈ పోర్టల్‌లో (https://igms.irda. gov.in/) పాలసీదారులు తమ వివరాలతో నమోదు చేసుకోవాలి. అనంతరం లాగిన్ అయ్యి ఫిర్యాదును దాఖలు చేయడంతోపాటు పురోగతిని తెలుసుకోవచ్చు. అలాగే ఈ మెయిల్ (complaints@irdai.gov.in) రూపంలో నూ ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదు చేయవచ్చు. 1800 4254 732 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించొచ్చు. -
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఇలా చేస్తే మరింత బెటర్!
కరోనా క్లెయిమ్‌ల రూపంలో రానున్న రెండు మూడు నెలల్లో బీమా సంస్థలు పెద్ద మొత్తాలే చెల్లించుకోవాల్సి రావచ్చని అంచనా. ఈ భారాన్ని దింపుకునేందుకుగాను ఆరోగ్య బీమా ప్రీమియంను ఇప్పటికే పలు కంపెనీలు పెంచగా.. మిగిలినవీ అతి త్వరలోనే వడ్డించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సామాన్యులకు బీమా ప్రీమియం భారంగా మారింది. రానున్న రోజుల్లో వడ్డనలతో ఆ భారం మరికాస్త పెరగనుంది. ఇందుకు పాలసీదారులు సిద్ధం కావాల్సిందే. సాధారణంగా ప్రతీ నాలుగేళ్లకు ఒక పర్యాయం తమ ఖర్చులు, వైద్య ద్రవ్యోల్బణం (చికిత్సల వ్యయాలు పెరగడం), ఇతర అంశాల ఆధారంగా ఆరోగ్య బీమా ప్లాన్ల ప్రీమియంలను సవరించేందుకు బీమా కంపెనీలకు అనుమతి ఉంది. సవరణ తర్వాత ప్రస్తుత పాలసీదారులపై ఆ మేరకు పెంపును అమలు చేయడంతోపాటు, కొత్త పాలసీలను ప్రవేశపెడుతుంటాయి. పాలసీదారుల వయసు, ఆరోగ్య సమస్యలు, క్లెయిమ్‌ల చరిత్ర ఈ అంశాలన్నీ నాలుగేళ్లకోసారి ప్రీమియం సవరణలో కీలక పాత్ర పోషించే ఇతర అంశాలు. మొత్తానికి ప్రీమియం భారంగా మారితే.. పాలసీదారుల ముందు పలు మార్గాలున్నాయి. ప్రీమియం తగ్గించుకునేందుకు వీటిల్లో ఒక్కొక్కరికి ఒక్కోటి ఉపయోగకరంగా ఉండొచ్చు.. టాపప్ చేసుకోవడం.. ఆరోగ్య బీమా ప్రీమియంను తగ్గించుకునే మార్గాల్లో.. బేసిక్ పాలసీకి బూస్టర్ ప్లాన్‌ను జోడించుకోవడం ఒకటి. టాపప్, సూపర్ టాపప్ పేరుతో ఉండే ప్లాన్‌ను బేసిక్ ప్లాన్‌కు తోడుగా తీసుకోవచ్చు. ‘‘మీకు బేసిక్ ప్లాన్ ఉండి.. కవరేజీని మరింత పెంచుకునేందుకు మరో బేసిక్ ప్లాన్‌ను తీసుకుంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు బేసిక్, బూస్టర్ ప్లాన్‌ను కలిపి తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దర్ సూచించారు. ఈ విధానంలో ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.5 లక్షల కవరేజీతో ఇండెమ్నిటీ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. అలాగే, మరో రూ.5 లక్షలకు టాపప్ ప్లాన్‌ను దీనికి అదనంగా తీసుకున్నారని అనుకుంటే.. ఆస్పత్రిలో చేరి చికిత్సా వ్యయం రూ.5 లక్షలు దాటిపోయిన సందర్భంలో టాపప్ ప్లాన్ అక్కరకు వస్తుంది. క్లెయిమ్ రూ.5 లక్షల వరకు బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ నుంచే చేసుకోవాలి. రూ.5 లక్షలు మించిపోయిన సందర్భాల్లోనే టాపప్ ఫోర్స్‌లోకి వస్తుంది. కానీ, బేసిక్ పాలసీకి, టాపప్ ప్లాన్‌కు మధ్య ప్రీమియం వ్యత్యాసం ఎంతో ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తికి రూ.5 లక్షల హెల్త్ కవరేజీకి కోసం ప్రీమియం రూ.6,621గా ఉంటే.. మరో రూ.5లక్షలకు మరో కంపెనీ నుంచి బేసిక్ ప్లాన్ తీసుకోవాలంటే ప్రీమియం రూపంలో మొత్తం మీద రూ.10 లక్షల కవరేజీకి రూ.13,242 చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు టాపప్‌ను ఎంపిక చేసుకున్నట్టయితే రెండింటికీ కలిపి చెల్లించాల్సిన ప్రీమియం రూ.9,156 అవుతుంది. ఇందులో సూపర్ టాపప్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్, టాపప్ ప్లాన్ కుడా చాలని వారు సూపర్ టాపప్‌తో కవరేజీని మరింత పెంచుకోవచ్చు. ‘‘ఈ తరహా హెల్త్ కవరేజీ ప్లాన్ల కలయికతో ఉంటే.. అవయవ మార్పిడి లేదా శస్త్రచికిత్సల వంటి సందర్భాల్లో మంచిగా ఉపయోగపడుతుంది’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్‌రైటింగ్ క్లెయిమ్స్ చీఫ్ సంజయ్‌దత్తా పేర్కొన్నారు. బేసిక్ ప్లాన్ రూ.5–10 లక్షలు కలిగిన వారు.. అదనంగా రూ.10 లక్షల నుంచి టాపప్ ప్లాన్‌ను ఎంచుకోవడం నేటి పరిస్థితుల్లో కొంచెం అర్థవంతంగా ఉంటుందని నిపుణుల సూచన. ఇక్కడ టాపప్‌కు, సూపర్ టాపప్‌కు మధ్య వ్యత్యాసం ఉంది. టాపప్‌లో రూ.5–10 లక్షలు డిడక్టబుల్ (మినహాయింపు) ఉందనుకుంటే.. బిల్లు రూ.5–10 లక్షలు దాటిన సందర్భాల్లోనే టాపప్ అక్కరకు వస్తుంది. సూపర్ టాపప్ అలా కాదు. ఒక ఏడాదిలో ఒక వ్యక్తి మూడు సార్లు ఆస్పత్రిలో చేరాల్చి వచ్చి మొత్తం రూ.13లక్షలు బిల్లు అయ్యిందనుకుందాం. అప్పుడు రూ.13 లక్షల నుంచి డిడక్టబుల్ రూ.5–10 లక్షలు అమలవుతుంది. మిగిలిన మొత్తాన్ని సూపర్ టాపప్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకే టాపప్‌తో పోలిస్తే సూపర్ టాపప్ ప్రీమియం కాస్త ఎక్కువ. కో–పే, డిడక్టబుల్ కో–పే, డిడక్టబుల్(నిర్ణీత శాతం మేర మినహాయించి) ఆప్షన్లు హెల్త్ ప్లాన్లలో సాధారణంగా అందుబాటులో ఉంటుంటాయి. కో–పే అంటే సహ చెల్లింపు అని. ప్రతీ క్లెయిమ్‌లోనూ పాలసీదారు నిర్ణీత శాతాన్ని కో–పే కింద భరించాల్సి వస్తుంది. అప్పుడు మిగిలిన శాతం మేర బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఈ కో–పే 10–30 శాతం మధ్య ఉంటుంది. కో–పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ప్రీమియం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.30 ఏళ్ల వ్యక్తికి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ రూ.5 లక్షలకు ప్రీమియం రూ.7,283. 20 శాతం కో–పే ఎంపిక చేసుకుంటే ఇదే వ్యక్తికి ప్రీమియం రూ.6,548 అవుతుంది. ప్రీమియం రూ.735 తగ్గింది. ‘‘కో–పే అన్నది క్లెయిమ్‌లో నిర్ణీత శాతం మేర ఉంటుంది. పాలసీదారు తన జేబు నుంచి నిర్ణీత శాతం మేర చెల్లించిన తర్వాతే బీమా సంస్థ మిగిలిన మేర చెల్లిస్తుంది’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం చీఫ్ అమిత్ ఛబ్ర తెలిపారు. ఉదాహరణకు రూ.5 లక్షల ప్లాన్‌లో 20 శాతం కోపే కింద ఎంపిక చేసుకున్నారనుకుంటే.. ఆస్పత్రిలో బిల్లు రూ.2లక్షలు అయ్యిందనుకోండి.. అప్పుడు పాలసీదారు 20 శాతం కింద రూ.40,000ను స్వయంగా భరించాలి. మిగిలిన రూ.1.60 లక్షలను నిబంధనలకులోబడి బీమా సంస్థ చెల్లిస్తుంది. ప్రీమియం చెల్లించలేని పరిస్థితుల్లోనే కో–పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వెల్నెస్ రాయితీలు పాలసీదారులకు ఆరోగ్యకరమైన జీవనంపై బీమా సంస్థలు పలు ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. రివార్డులు, ప్రీమియంలో రాయితీలను పాలసీదారులు పొందొచ్చు. ఇలా కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివ్ హెల్త్ ప్లాన్ అయితే 100 శాతం ప్రీమియాన్ని రివార్డులతో సర్దుబాటును ఆఫర్ చేస్తోంది. పాలసీదారులు రోజూ ఎన్ని అడుగులు నడిస్తే అంత మేరకు రివార్డులను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ‘యాక్టివ్డేజ్’ కార్యక్రమం కింద ఆదిత్య బిర్లా హెల్త్ యాక్టివ్ ప్లాన్‌లో రోజూ 10,000 అడుగులు నడిచినా లేదా 30 నిమిషాలు జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసి 300 కేలరీలను కరిగించుకుంటే గణనీయమైన హెల్త్ రివార్డులను పోగు చేసుకోవచ్చు. ఈ రివార్డులను ప్రీమియం చెల్లింపుల కోసం వినియోగించుకోవచ్చు. ప్రీమియం భారం చాలా వరకు తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోకీ ఇదే అత్యుత్తమైనది. మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ రీఅష్యూర్ ప్లాన్ కూడా ఇదే తరహా రివార్డులను ఆఫర్ చేస్తోంది. రోజూ ఎన్ని అడుగుల మేర నడిచారన్న దాని ఆధారంగా రివార్డులు సమకూర్చుకుని.. ప్రీమియంలో గరిష్టంగా 30 శాతం తగ్గింపులను ఈ పాలసీలో పొందడానికి అవకాశం ఉంది. ఇందుకోసం బీమా సంస్థకు చెందిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అదే విధంగా ఫార్మసీ కొనుగోళ్లపై తగ్గింపులు, ఉచిత వైద్యుల సంప్రదింపులు, హెల్త్ చెకప్‌లను కూడా ఈ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ‘‘చాలా వరకు బీమా సంస్థలు ఇప్పుడు జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు సమస్యల ఆధారంగా అండర్‌రైటింగ్ పాలసీని పాటిస్తున్నాయి. దీంతో ఆరోగ్యంగా ఉండే పాలసీదారు అధిక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు’’ అని టాటాఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్ పరాగ్వేద్ తెలిపారు. కుటుంబ పాలసీ ఎవరికివారు విడిగా కవరేజీ తీసుకోకుండా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను తీసుకోవడం వల్ల ప్రీమియం భారాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ఒకే ప్లాన్‌లో రెండు, అంతకుమించి సభ్యులు ఉంటే బీమా సంస్థలు ప్రీమియంలో 15 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. ‘‘ఎక్కువ మంది కుటుంబ సభ్యులను చేర్చడం వల్ల బీమా సంస్థలకు నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. దీంతో తగ్గిన మేర పాలసీదారులకు ప్రయోజనాలను బదిలీ చేయడం జరుగుతుంది’’ అని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన వేద్ తెలిపారు. ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలకు కలిపి ఒకే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను తీసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. కానీ, అదే ప్లాన్‌లో వృద్ధులైన తల్లిదండ్రులను సభ్యులుగా చేర్చవద్దు. దీనివల్ల ప్రీమియం తగ్గకపోగా భారీగా పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రీమియం అన్నది ప్లాన్‌లో ఎక్కువ వయసున్న వ్యక్తి ఆధారంగా నిర్ణయమవుతుంది. వృద్ధులైన తల్లిదండ్రుల కోసం ఇండివిడ్యువల్ ప్లాన్లను తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. కుటుంబ సభ్యులు అందరూ ఒకే విడత ఆస్పత్రిలో చేరడం అన్నది చాలా అరుదు. కనుక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అన్నది చాలా మందికి సరిపోతుంది. పైగా చాలా బీమా కంపెనీలు నేడు రీస్టోరేషన్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఏడాదిలో కనీసం ఒక పర్యాయం బీమా కవరేజీ పూర్తిగా అయిపోతే తిరిగి అంతే కవరేజీని పునరుద్ధరిస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు అయితే పాక్షికంగా కవరేజీని వినియోగించుకున్నా కానీ పూర్తిస్థాయి కవరేజీని రీస్టోర్ చేస్తుండడాన్ని గమనించాలి. గ్రూపు ప్లాన్‌లో తక్కువ గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా బీమా కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. సాధారణంగా కార్పొరేట్ టైఅప్‌లో భాగంగా వీటిని ఇస్తుంటాయి. ఇలాంటివి ఎంపిక చేసుకోవడం వల్ల స్టాండలోన్ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ ప్లాన్లలో ఎక్కువ మంది సభ్యులుగా ఉంటారు. కనుక మొత్తం సభ్యులపై ప్రీమియం భారం సమానంగా ఉంటుంది. రెండు మూడేళ్లకు ఒకేసారి.. ఒకే విడత రెండు, మూడేళ్లకు కలిపి ప్రీమియం చెల్లించడం ద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు. ఇలా ఒకే పర్యాయం రెండు మూడేళ్ల చెల్లింపులపై 7.5–15 శాతం మధ్య బీమా సంస్థలు తగ్గింపునిస్తున్నాయి. కాకపోతే బీమా సంస్థ సేవలు, తీసుకున్న పాలసీలోని సదుపాయాల పట్ల మీకు సంతృప్తి అనిపిస్తేనే ఇలా మల్టీ ఇయర్ ఆప్షన్ తీసుకోవడం సరైనది అవుతుంది. ‘‘ఒకే సారి అధిక ప్రీమియం చెల్లింపులపై బీమా సంస్థ వడ్డీ ఆదాయం సమకూర్చుకుంటుంది. దీన్నే పాలసీదారులకు తగ్గింపు రూపంలో ఆఫర్ చేస్తుంది’’ అని ఛాబ్రా తెలిపారు. ‘‘గతంలో ఇలా ఒకే సారి ఎక్కువ సంవత్సరాలకు ప్రీమియం చెల్లింపులపై ఒకటికి మించిన సంవత్సరాల్లో పన్ను ఆదాకు అవకాశం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ప్రీమియం చెల్లింపులను ఆయా సంవత్సరాల మధ్య వేరు చేసి క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంది’’అని మిశ్రా పేర్కొన్నారు. పైగా పాలసీ ప్రీమియం భారాన్ని ఈ విధానంలో కొంత కాలం పాటు వాయిదా వేసుకునేందుకు అవకాశం ఉంటుందని సిక్దర్ వివరించారు. ‘‘ఒక వ్యక్తి మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించారనుకోండి. నాలుగు సంవత్సరాల తర్వాత ప్రీమియం పెంపు ఉంటుంది. దీంతో ఈ పెంపునకు ముందే తిరిగి మూడేళ్లకు ఒకే సారి ప్రీమియం చెల్లించడం వల్ల రెండేళ్ల పాటు ప్రీమియం భారం పడకుండా చూసుకోవచ్చు’’ అని సిక్దర్ తెలిపారు. నోక్లెయిమ్ బోనస్‌ల వినియోగం కంపెనీలు ఒక ఏడాది లో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే నో క్లెయిమ్ బోనస్‌ను ఆఫర్ చేస్తుంటాయి. క్యుములేటివ్ బోనస్ ఆప్షన్లో బీమా కవరేజీ పెరుగుతుంది. మరో విధానంలో బోనస్ కింద బీమా కవరేజీని పెంచకుండా ప్రీమియంలో తగ్గింపులను ఆఫర్ చేస్తున్నవీ ఉన్నాయి. తగ్గింపు అయితే 20–50 శాతం మధ్య ఉంటుంది. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ.. పాలసీదారు మొదటి కొన్నేళ్లలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకపోతే ఆ తర్వాత రెన్యువల్ ప్రీమియంలో 80% వరకు తగ్గింపు ఇస్తోంది. హెల్త్ సూపర్‌సేవర్ 1ఎక్స్, 2ఎక్స్ ప్లాన్ల రూపంలో ఇది అందుబాటులో ఉంది. క్యుములేటివ్ బోనస్ కింద బీమా సంస్థలు 10% నుంచి 100% వరకు బీమా కవ రేజీ (సమ్ ఇన్సూరెన్స్)ని పెంచుతున్నాయి. చౌక పాలసీకి మారడమే చివరిగా ఉన్న మార్గం.. చౌక ప్రీమియంతో కూడిన పాలసీకి మారిపోవడం. మీరు పాలసీ ఎంపిక చేసుకున్న సమయంలో ప్రీమియం సరసంగానే అనిపించి ఉండొచ్చు. కానీ, కొన్నేళ్ల తర్వాత కంపెనీ ఆఫర్ చేస్తున్న సేవలతో పోలిస్తే ప్రీమియం ఎక్కువగా ఉందనిపిస్తే.. తొలుత తక్కువకు ఆఫర్ చేసి, తర్వాత ప్రీమియం పెంచడం వల్ల భారంగా అనిపించినప్పుడు మార్కెట్లో మెరుగైన ఇతర ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం భారం తగ్గించుకునేందుకు ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడొద్దు. ఇప్పటికే ఉన్న పాలసీలో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా కొత్తగా ఎంపిక చేసుకున్న ప్లాన్‌లోనూ ఉండాలి. ఇంకా అదనపు ప్రయోజనాలతో కూడిన పాలసీ తక్కువ ప్రీమియంతో వస్తుంటే పోర్ట్ పెట్టేసుకుని ఆ కంపెనీకి మారిపోవచ్చు. రూమ్‌రెంట్ లిమిట్ అన్నది ప్రస్తుత పాలసీలో ఉందనుకోండి. పాలసీ తీసుకుని ఇప్పటికే 5–10 ఏళ్లు అయి ఉంటే.. ఈ నిబంధన ఇక మీదట ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. రూమ్మెంట్ క్యాప్‌ను సమ్ ఇన్సూరెన్స్‌లో 1 శాతంగా కంపెనీలు అమలు చేస్తున్నాయి. దీంతో రూ.5లక్షల పాలసీ కలిగిన వారు ఆస్పత్రిలో చేరితే రూ.5,000కు మించిన రూమ్‌లో చేరినట్టయితే పెరిగిన మేర పాలసీదారే తన జేబు నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆస్పత్రుల్లో చార్జీలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ తరహా నిబంధనలు కలిగిన పాలసీల నుంచి మెరుగైన పాలసీలోకి మారిపోవడం కూడా ప్రయోజనకరమేనని మర్చిపోవద్దు. గత కొన్నేళ్లలో చాలా కంపెనీలు ప్రీమియంలను భారీగా పెంచేశాయి. కానీ, సేవలు, ప్రయోజనాల విషయంలో అంత మెరుగుదల లేదు. కనుక ఈ పాలసీల నుంచి మారిపోవడాన్ని కూడా పరిశీలించొచ్చు. -
ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పాలసీదారులు తమ మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను దేశంలోని సమీప ఎల్ఐసి కార్యాలయంలో ఎక్కడైనా జమ చేయవచ్చని మార్చి 18న ప్రకటించింది. ఎల్ఐసీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. "పాలసీ హోమ్ బ్రాంచ్ తో సంబంధం లేకుండా, మెచ్యూరిటీ చెల్లింపులు చెల్లించాల్సిన పాలసీదారులు తమ మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ 113 డివిజనల్ కార్యాలయాలు, 2048 శాఖలు, 1526 ఉప కార్యాలయాలు, 74 కస్టమర్ జోన్లలో సమర్పించవచ్చు అని తెలిపింది. అయితే, వాస్తవానికి క్లెయిమ్ ప్రాసెస్ హోమ్ బ్రాంచ్ ద్వారా మాత్రమే చేయబడుతుంది. ఎల్ఐసీ ఆల్ ఇండియా నెట్వర్క్ ద్వారా పత్రాలు డిజిటల్‌గా బదిలీ చేయబడతాయి" అని పేర్కొంది. ఈ సదుపాయం వల్ల పాలసీదారుడు ఒక నగరంలో ఉన్న అతని పాలసీ పత్రాలు మరొక నగరంలో సమర్పించాల్సి ఉంటే, తన పత్రాలను దగ్గరలోని ఎల్ఐసీ శాఖలో సమర్పించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎల్ఐసీ కార్యాలయాల్లో అధికారులకు ఈ అధికారం ఇవ్వబడింది. ఒక ఎల్ఐసీ పాలసీదారుడు ఈ విషయంలో సహాయం కోసం అధీకృత అధికారిని కూడా అడగవచ్చు. ఈ సదుపాయం ట్రయల్ ప్రాతిపదికన 2021 మార్చి 31 వరకు లభిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ పెరుగుతున్న కారణంగా పాలసీదారులు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది. గత ఏడాది కూడా కరోనా మహమ్మారి వచ్చిన కొత్తలో ఎల్ఐసీ మెచ్యూరిటీ క్లెయిమ్ ప్రాసెస్ కోసం వినియోగదారులకు ఈ అవకాశం కల్పించింది. లాక్డౌన్ కారణంగా ఎల్ఐసీ తన పాలసీదారులకు మెచ్యూరిటీ క్లెయిమ్ సంబంధిత పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి అనుమతించింది. చదవండి: ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్ -
ఇంటర్ ఫెయిల్.. భద్రమ్ సినిమా చూసి దారుణం
పేద కుటుంబాలే టార్గెట్. ప్రాణాంతక వ్యాధులతో మృత్యుముఖంలోకి వెళుతున్న వారిని గుర్తించడం.. ఎలాగూ పోయేవాడే కదా నాలుగు రోజుల ముందే ఆయువు తీస్తే తప్పేముందని, డబ్బు ఆశ చూపి కుటుంబీకులను ఒప్పించడం. వారి పేరిట భారీ మొత్తానికి పాలసీ చేయించడం. ఆపై చంపేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి.. బీమా క్లెయిమ్ చేసుకొని డబ్బులు పంచుకోవడం. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పకడ్బందీగా ప్లాన్ అమలు. ఇదంతా సినిమాటిక్‌గా అనిపిస్తోంది కదా? ఇది సినిమా కథే. చిత్రం పేరు ‘భద్రమ్’. దాని నుంచే ప్రేరణ పొందాడు నల్లగొండ ఇన్సూరెన్స్ కుంభకోణం నిందితుడు రాజు. అమల్లో పెట్టేశాడు. ఇంటర్ ఫెయిల్ అయినా.. నేరాల్లో మాస్టర్ మైండ్. డబ్బు యావతో ఐదుగురి ప్రాణాలను తీసేశాడు. సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఇన్సూరెన్స్ కుంభకోణంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్ ఫెయిలైన రాజు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నేరాలు చేసిన విధానం, ఆ డబ్బును పంచుకున్న తీరు, ఈ క్రమంలో ఎక్కడా ఇటు పోలీసులకుగానీ, అటు వైద్యులకు గానీ చిక్కకుండా తప్పించుకున్న విధానం చూసి పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి నిందితుడు రాజు ఇంటర్ ఫెయిల్ కానీ, నేరాలు చేయడంలో ఆరితేరాడు. గతంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేసేవాడు. క్రైం సీరియళ్లు, సినిమాలు చూసి నేరప్రవృత్తిని వంటబట్టించుకున్నాడు. ప్రాణాంతక వ్యాధులతో మరణానికి చేరువవుతున్న వారిని గుర్తించడం, వారి కుటుంబసభ్యులతో ముందే ఒప్పందం చేసుకోవడం తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. సాధారణ పాలసీలు అయితే చాలాకాలం వేచి చూడాలి. పైగా క్లెయిమ్ చేసుకునే సమయంలో సవాలక్ష సమాధానాలు చెప్పాలి. అదే యాక్సిడెంటల్ డెత్ పాలసీ అయితే, కేవలం ఒక ప్రీమియం కట్టేసి... మనిషిని లేపేసి డబ్బులు జేబులో వేసుకోవచ్చన్న దుష్టాలోచనతో అడుగులేశాడు. చట్టాల్లోని చిన్న చిన్న లోపాలను బాగా అధ్యయనం చేసి... వాటిని వాడుకొని మనుషుల ప్రాణాలను తీసి, అక్రమంగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించాడు. తక్కువ ప్రీమియంతో... భారీగా డబ్బు 2013లో సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్‌కు చెందిన సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీప బంధువులే కావడంతో సక్రియా కుటుంబాన్ని నిందితుడు ధీరావత్ రాజు సంప్రదించాడు. చనిపోయిన వ్యక్తి బతికున్నట్లుగా పంచాయతీ కార్యదర్శి సాయంతో పత్రాలు సృష్టించి, ఆ తరువాత డెత్ సర్టిఫికెట్ తీసుకుని చనిపోయాడని రూ.1.4 లక్షల బీమా క్లెయిమ్ చేసుకున్నాడు. ఆ పథకం విజయవంతంగా అమలైంది. అది మొదలు రాజులో దుర్భుద్ధి పుట్టింది. కానీ, ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాలేదు. 2014లో తొలి బీమా హత్య చేసే వరకు అతను దాదాపు 6 నుంచి 10 నెలలపాటు ఖాళీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఏం చేశాడు? అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2014లో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ‘భద్రమ్’ను నిందితుడు చూశాడు. యాక్సిడెంట్ పాలసీ చేయించి, అమాయకులను చంపి, రోడ్డు ప్రమాదాలుగా చిత్రించి, బీమా డబ్బులను క్లెయిమ్ చేసుకునే రాకెట్ నేపథ్యంతో సాగే కథ ఇది. ఇలాంటి నేపథ్యాలతో సాగిన సినిమాలతోనే నిందితుడు రాజు ప్రేరణ పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే సాధారణ బీమా చేయిస్తే.. అది అంత త్వరగా వర్తించదు. అదే యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకుంటే తీసుకున్న మరునాడే మరణించినా.. పూర్తిస్థాయి డబ్బులు వస్తాయి. ఏడాది కాలానికే వర్తించే యాక్సిడెంటల్ డెత్ పాలసీల్లో తక్కువ ప్రీమియంతో (కట్టిన ప్రీమియం వెనక్కిరాదు) ఎక్కువ రిస్క్ కవరేజి ఉంటుంది. ఇక్కడే రాజు తన తెలివితేటలు ప్రదర్శించాడు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) కొత్త నిబంధన ప్రకారం.. భార్య, రక్త సంబంధీకులకు తప్ప ఇతరులకు బీమా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. అందుకే నామినీగా పెట్టేవారితో (కుటుంబీకులతో) రాజు ముందే ఒప్పందం చేసుకునే వాడు. బీమా డబ్బు రాగానే అనుకున్న ప్రకారం వాటాలు పంచుకునేవాడు. నాగార్జునసాగర్‌లో మరో కుంభకోణం నల్లగొండలో ఈ ఇన్సూరెన్స్ హత్యల దర్యాప్తు సాగుతుండగానే.. మరో బీమా కుంభకోణాన్ని నల్లగొండ పోలీసులు ఛేదించారు. నాగార్జునసాగర్‌లో ఆరేళ్ల క్రితం మామను యాక్సిడెంట్ పాలసీ చేయించి చంపిన అల్లుడి దుష్టపన్నాగం ఇది. ఇందులో నిందితుడు తన మామ పేరిట మూడు భారీ వాహనాలు కొనుగోలు చేయించాడు. ఆ మూడింటికి యజమాని మరణిస్తే.. నెలనెలా వాయిదాలు కట్టకుండా రద్దయిపోయేలా బీమా చేయించాడు. ఆ తరువాత మామకు భారీ మొత్తానికి యాక్సిడెంట్ పాలసీ చేయించాడు. అనంతరం ఇంకో అడుగు ముందుకేశాడు. ఇంకా తెలివిగా ఓ ప్రముఖ బ్యాంకులో మామకు ఖాతా తెరిపించాడు. ఈ బ్యాంకు నిబంధనల ప్రకారం.. ఖాతాదారులకు యాక్సిడెంటల్ పాలసీని వర్తింపజేస్తారు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా మామను హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ కేసులో అల్లుడు యాక్సిడెంట్ పాలసీ కింద భారీ మొత్తాన్ని రాబట్టుకున్నాడు. పైగా మూడు భారీ వాహనాలకు నెల వాయిదాలు రద్దు అయ్యాయి. మరోవైపు బ్యాంకు వాళ్లు తమ ఖాతాదారుడు చనిపోయాడని బీమా సొమ్ము అందజేశారు. ఈ విధంగా ఐదు పాలసీల నుంచి లబ్ది పొందాడు. చదవండి: (దారుణం: బీమా చేయించారు.. 8 మందిని చంపేశారు) ఐఐబీకి రంగనాథ్ లేఖ ఈ వ్యవహారంలో మరిన్ని అక్రమాలు దాగి ఉన్నాయన్న అనుమానంతో వాటిపై కూపీలాగేందుకు నల్లగొండ ఎస్పీ, డీఐజీ ఏవీ రంగనాథ్ నడుం బిగించారు. గత పదేళ్లలో నల్లగొండ జిల్లాలో బీమా చేసిన ఏడాదిలోగా క్లెయిమ్ అయిన పాలసీల వివరాలు వెల్లడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ)కి లేఖ రాశారు. ఈ సంస్థ అందించే వివరాల ఆధారంగా అనుమానాస్పద కేసులను తవ్వి తీయాలని నిర్ణయించారు. గత కేసుల సమయంలో పోలీసులు, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? లేక నిందితులతో సంబంధాలున్నాయా? అన్న విషయంలోనూ సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. నిందితుడు ధీరావత్ రాజు ఇంటర్ ఫెయిలైనా.. క్రిమినల్ మైండ్‌లో మాత్రం మాస్టర్ అని, అతను ఇవి కాకుండా ఇంకా కొన్ని నేరాలు చేశాడా? లేక ఇతని సలహాలు, సూచనలతో ఇలాంటి నేరాలు ఉమ్మడి జిల్లాలో ఇంకా ఎక్కడైనా జరిగాయా? అన్న కోణంలోనూ డీఐజీ కూపీ లాగుతున్నారు. మొత్తంగా ఈ ముఠా ఇప్పటిదాకా ఐదుగురిని హతమార్చి, చనిపోయిన ఇద్దరి శవాలను తీసుకెళ్లి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి బీమా డబ్బులు తీసుకుంది. మరో ఇద్దరిని చంపేందుకు ప్లాన్ చేసింది. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉంది. ఏపీలో రెండుసార్లు విఫలం... రెండేళ్లు జైలులో నిందితుడు రాజు పోలీసులకు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం. 2017లోనే దేవిరెడ్డి కోటిరెడ్డి హత్యకు ప్లాన్ చేశాడు. ఈ మేరకు అతని భార్యను సంప్రదించి ఒప్పించాడు. అదే సమయంలో అతని స్నేహితులు ఏపీలోని ప్రకాశం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి విషయంలోనూ ఇలాగే ఇన్సూరెన్స్ చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు. ఆ క్రమంలో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్లి రోడ్డు ప్రమాదమని నమ్మబలికేందుకు రాజు యత్నించాడు. కానీ, వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమివ్వడంతో రాజు జైలుకెళ్లాడు. ఆ తరువాత గుంటూరు జిల్లా దాచేపల్లిలోనూ మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే క్రమంలోనూ విఫలమయ్యాడు. దీంతో దాదాపు రెండేళ్ల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. విడుదలయ్యాక తిరిగి దామరచర్లకు వచ్చాడు. ఈలోపు కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో కోటిరెడ్డి హత్యలో మరింత జాప్యం జరిగింది. లాక్డౌన్ ఎత్తివేయగానే తిరిగి కోటిరెడ్డి పేరిట పలు ప్రైవేటు బీమా కంపెనీల నుంచి రూ.1.20 కోట్ల ఇన్సూరెన్సులు తీసుకున్నాడు. మొత్తానికి, కోటిరెడ్డిని చంపేందుకు 2017లోనే అవగాహన కుదిరినా.. దాన్ని అమలు చేసేందుకు 2021 వరకు సమయం పట్టిందని సమాచారం. ఈ అన్ని కేసులను రాజు క్షుణ్నంగా అధ్యయనం చేయడం గమనార్హం. వ్యక్తిని చంపాక పోలీసులు ఘటనాస్థలానికి రావడం, పంచనామా సమయంలో ఏయే ఆధారాలను నోట్ చేసుకుంటున్నారు? ఏయే అంశాల ఆధారంగా రోడ్ యాక్సిడెంట్ అని నమ్ముతున్నారు అన్న విషయాలను పోలీసుల పక్కనే ఉండి నిందితుడు అధ్యయనం చేసినట్లు విచారణలో వెల్లడించడంతో పోలీసులు విస్మయం చెందారు. అందుకే, వ్యక్తులను చంపాక.. ఒకటికి రెండుసార్లు వాహనాలను వారి శరీరాలపై ఎక్కించడం, టైర్మార్కులు, వాహనం వచ్చిన డైరెక్షన్.. తదితర అంశాలను కచ్చితంగా పాటించి చూడగానే అది యాక్సిడెంట్ అనిపించేలా పకడ్బందీగా వ్యవహరించాడని తెలిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై అమెరికాలో దావా?
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిందంటూ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై అమెరికాలో దావాకు రంగం సిద్ధమవుతోంది. ఇన్వెస్టర్ల హక్కుల సాధనకు సంబంధించి న్యాయ సేవలు అందించే రోజెన్ లా ఫర్మ్ ఈ అంశం వెల్లడించింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే వ్యాపారపరమైన సమాచారాన్ని ఇచ్చి ఉండవచ్చన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ తాము దావా వేయనున్నట్లు రోజెన్ తమ వెబ్సైట్లో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందన్న ఆరోపణలకు సంబంధించిన వార్తలు, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభాల అంచనాలను అందుకోలేకపోవడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించింది. మదుపుదారుల తరఫున వేసే ఈ కేసుకు సంబంధించి ‘హెచ్డీఎఫ్సీ షేర్లు కొన్నవారు మా వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఈ దావాలో భాగం కావచ్చు‘ అని పేర్కొంది. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్) రూపంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు అమెరికాలోని ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీలో ట్రేడవుతుంటాయి. మరోవైపు, దావా విషయం తమ దాకా రాలేదని, మీడియా ద్వారానే తెలిసిందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. వివరాల వెల్లడిలో తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది. దావాకు సంబంధించిన వివరాలు అందిన తర్వాత పరిశీలించి, తగు విధంగా స్పందిస్తామని బ్యాంకు తెలిపింది. వాహన రుణాల విభాగంలో ఒక కీలక అధికారి తీరుపై ఆరోపణలు రావడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూలైలో అంతర్గతంగా విచారణ ప్రారంభించడం దావా వార్తలకు ఊతమిచ్చింది. రోజెన్ లా సంస్థ గతేడాది కూడా ఇదే తరహాలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై క్లాస్ యాక్షన్ దావా వేస్తున్నామంటూ హడావుడి చేసింది. కంపెనీలోని ఉన్నత స్థాయి అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఓ ప్రజావేగు చేసిన ఆరోపణల ఆధారంగా దీన్ని సిద్ధం చేసింది. -
భారతీయ ఫార్మా కంపెనీలపై దావా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ కంపెనీలు యూఎస్‌లో ఓ దావాను ఎదుర్కొంటున్నాయి. వీటిలో సన్ ఫార్మా, లుపిన్, అరబిందో సహా 26 కంపెనీలు ఉన్నాయి. కుట్రపూరితంగా ధరలను కృత్రిమంగా పెంచడం, పోటీని తగ్గించడం, యూఎస్‌లో జరుగుతున్న జనరిక్ డ్రగ్స్ వ్యాపారాన్ని అడ్డుకున్నాయని ఆరోపిస్తూ మేరీల్యాండ్ అటార్నీ జనరల్ బ్రియాన్ ఇ ఫ్రోష్ కనెక్టికట్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించారు. జనరిక్ డ్రగ్ మార్కెట్ తిరిగి గాడిలో పడేందుకై ఈ కంపెనీలతోపాటు 10 మంది వ్యక్తులను ఇందుకు బాధ్యులుగా చేస్తూ వీరి నుంచి నష్టపరిహారం, జరిమానాతోపాటు తగు చర్యలు తీసుకోవాలని దావాలో కోరారు. 80 రకాల జనరిక్ డ్రగ్స్ విషయమై విచారణ సాగనుంది. మేరీల్యాండ్‌తోపాటు యూఎస్‌లోని అన్ని రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ దావా దాఖలులో సహ పార్టీలుగా ఉన్నారు. ఈ కంపెనీల ధర నియంత్రణ పథకాలు రోగులకు, బీమా కంపెనీలకు భారంగా మారాయి అని ఫ్రోష్ వెల్లడించారు. ఇప్పటికే కొనసాగుతున్న విచారణకుతోడు తాజాగా వేసిన దావా మూడవదికాగా, కంపెనీలు ఇలా ఏకమై ధరలు పెంచిన కేసు యూఎస్ చరిత్రలో అతిపెద్దది అంటూ వ్యాఖ్యానించారు. -
బీమా పాలసీ క్లెయిమ్ కాలేదా? ఈ స్టోరీ చదవండి
సాక్షి, ముంబై: ఆపద సమయంలో ఆదుకుంటుందన్న భరోసాతో బీమా (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పాలసీ తీసుకునే వినియోగదారులకు భారీ నిరాశ ఎదురయ్యే ఉదంతాలు చాలా చూశాం. ఇలాంటి ఘటనలో న్యాయ పోరాటం చేయడం కూడా చాలా అరుదు. కానీ ఒక పాలసీదారుని భార్య మాత్రం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)పై పోరుకు దిగారు. చట్టపరంగా తనకు దక్కాల్సిన పాలసీ సొమ్ముపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ను ఆశ్రయించి విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే..ముంబైకి చెందిన దిగంబరరావు ఠాక్రే 2000 సంవత్సరంలో ఎల్ఐసీ నుంచి మూడు బీమా పాలసీలను తీసుకున్నారు. అనారోగ్యంతో మార్చి13, 2003న ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన భార్య రత్న తనకు రావాల్సిన బీమా సొమ్మును చెల్లించాల్సిందిగా ఎల్ఐసీని కోరగా అందుకు ఆ సంస్థ తిరస్కరించింది. పాలసీ తీసుకునేముందు పాలసీదారుడు ఠాక్రే ఆస్తమాతో ఆసుపత్రిలో చేరడం తదితర విషయాలను దాచి పెట్టారని వాదించింది. దీంతో 2005లో ఆమె వార్ధాలోని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. దీన్ని విచారించిన ఫోరమ్ ఆమె క్లెయిమ్‌ను చెల్లించాలని ఎల్ఐసీని ఆదేశించింది. ఇందుకు నిరకారించిన ఎల్ఐసీ ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఎన్‌సీడీఆర్‌సీలో రివ్యూ పిటిషన్ వేసింది. అయితే ఎల్ఐసీ వాదనను తిరస్కరించిన ఎన్సీడీఆర్సీ ఆమెకు రావాల్సిన రూ. 9.3 లక్షలు చెల్లించాలని తాజాగా ఆదేశించింది. ఎల్ఐసీ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవనీ, పైగా ఠాక్రేకు ఇంతకుముందు అలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ, ఎల్ఐసీ పాలసీ జారీ చేసే సమయానికి ఆరోగ్యంగా ఉన్నందున, ఆ కాంట్రాక్టును తొలగించలేమని ఎన్సీడీఆర్సీ ప్రిసైడింగ్ సభ్యుడు దీపా శర్మ వ్యాఖ్యానించారు. వినియోగదారుని అభ్యర్థనను బీమా సంస్థ తిరస్కరించడం సేవలో లోపంగానే పరిగణించాలని పేర్కొన్నారు. -
రాహుల్‌గాంధీపై సీఎం కొడుకు దావా
భోపాల్/ఇండోర్: పనామా పేపర్ల అవినీతి కేసులో తనపై రాహుల్ అసత్య ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ కొడుకు కార్తికేయ మంగళవారం రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. సోమవారం జబువాలో రాహుల్ ఎన్నికల ప్రచారం చేస్తూ సీఎంపై ఈ ఆరోపణలు చేశారు. అనంతరం తన ఆరోపణలు వెనక్కు తీసుకున్నారు. ‘నేను కొంత గందరగోళానికి గురయ్యాను, శివరాజ్‌సింగ్ కుమారుడికి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు’ అని అనంతరం రాహుల్ వివరణ ఇచ్చారు. అయితే రాహుల్ ఉద్దేశపూర్వకంగానే తనపై ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగం కలిగించారని కార్తికేయ తన లాయర్ శిరీష్ శ్రీవాస్తవ ద్వారా ప్రత్యేక కోర్టు అదనపు జిల్లా జడ్జి ఎదుట దావా వేశారు. ఒకవేళ పరువు నష్టం దావా నిరూపితమైతే భారత శిక్షాస్మృతి ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. కోర్టు కార్తికేయ వాదనను విన్న తరువాత కేసును నవంబర్ 3కు వాయిదా వేసింది. -
భారతీ ఆక్సా... క్లెయిమ్‌లు వాట్సాప్‌లో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా కంపెనీ భారతీ ఆక్సా దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా క్లెయిమ్ సేవలను పొందే వీలు కల్పించింది. కస్టమర్లకు మరింత పాదర్శకతంగా, వేగంగా క్లయిమ్ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చామని కంపెనీ సీఈవో, ఎండీ వికాస్ సేత్ ఒక ప్రకటనలో తెలిపారు. నామినీ... భారతీ ఆక్సాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే చాలు... క్లెయిమ్ దరఖాస్తు తాలూకు లింక్ వస్తుందని.. సంబంధిత దరఖాస్తును పూర్తి చేసి డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేసి నేరుగా బ్యాంక్ ఖాతాలో క్లెయిమ్‌ను జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా క్లెయిమ్ సేవలను అందించేందుకు ప్రత్యేకంగా అధికారులుంటారన్నారు. -
గెలుపు హింస
ఒకసారి బుద్ధునితో ఒక వ్యక్తి వాదానికి దిగాడు. వాదం చివరి దశకు వచ్చింది. అవతలి వ్యక్తి ఓటమి అంచుల దాకా వచ్చాడు. అలాంటి సమయంలో.. ‘‘నేనీ వాదన నుంచి విరమించుకుంటున్నాను’’అని ప్రకటించి వెళ్లిపోయాడు బుద్ధుడు. బుద్ధుని పక్కనే ఉన్న భిక్షువులే కాదు, ప్రత్యర్థి కూడా ఆశ్చర్యపోయాడు. గెలుస్తానని తెలిసి కూడా బుద్ధుడు అలా ఎందుకు విరమించుకున్నాడో వారెవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఆ వ్యక్తి బుద్ధుని దగ్గరకు వెళ్లి ‘‘గౌతమా! నేను ఓడిపోతానని తెలిసి కూడా నీవెందుకు మధ్యలోనే లేచి వచ్చావు?’’అని అడిగాడు. మిగిలిన భిక్షువులు కూడా అలాగే అడిగారు.. ‘‘భగవాన్ గెలుపును ఎందుకు తోసిపుచ్చారు?’’అని. అప్పుడు బుద్ధుడు ఇలా చెప్పాడు. ‘‘నేను ఇలా విరమించుకోవడానికి మూడు కారణాలున్నాయి. ఒకటి: ఇప్పటికి ప్రత్యర్థికి నన్ను ఓడించే జ్ఞానశక్తి లేకపోవచ్చు. రెండు: నేను ఇప్పుడు వాదించిన విషయం కూడా రేపు కార్యాచరణలో మరిన్ని మార్పులు తీసుకోవచ్చు. దేన్నీ ‘ఇదే అంతిమ లక్ష్యం’ అని తేల్చలేం. ఇప్పుడు నేను గెలుపును అందుకున్నానంటే అది అంతిమ సత్యమై ఉండాలి. అంతిమ సత్యం కాని దాన్ని పట్టుకుని ఎలా గెలుపును సొంతం చేసుకోగలం? ఇక మూడు: ఒక అంతిమ సత్యం కాని దానితో నేను గెలిచాను అంటే.. అవతలి వ్యక్తిని నేను సత్యం కాని దానితో ఓడించినట్టే. అలా ఓడిన వ్యక్తి మనసు గాయమవుతుంది. ఓటమి వల్ల సిగ్గు చెందుతాడు. దుఃఖపడతాడు. ఒక వ్యక్తిని గెలుపు పేరుతో ఇలా ఓడించడం కూడా హింసే అవుతుంది’’ అని చెప్పాడు. బుద్ధుని విశాల దృక్పథానికి భిక్షువులతోపాటు ప్రత్యర్థి కూడా ప్రణమిల్లాడు. – బొర్రా గోవర్ధన్ -
క్లెయిమ్ చెల్లింపు ఆలస్యమైతే జరిమానా
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో భాగంగా ఆసుపత్రులకు క్లెయిమ్‌ల చెల్లింపులో ఆలస్యం చేసే బీమా కంపెనీలపై జరిమానా విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్లెయిమ్‌ల సెటిల్మెంట్కు 15 రోజుల కన్నా ఎక్కువ జాప్యం జరిగితే, చెల్లించాల్సిన మొత్తంపై సదరు బీమా కంపెనీ వారానికి ఒక శాతం చొప్పున వడ్డీ కట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జరిమానాను బీమా కంపెనీయే నేరుగా ఆసుపత్రికి చెల్లించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే ఈ పథకంలో చేరడానికి ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీ, పంజాబ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఇంకా తమ స్పందన తెలపలేదు. -
రూ.37,500 కోట్లు మిగిలిపోయాయ్!
న్యూఢిల్లీ: రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గుర్తింపు కోల్పోయిన కంపెనీలకు సంబంధించి దేశీ బ్యాంకుల్లో రూ.37,500 కోట్లు మూలుగుతున్నాయి. నీరవ్ మోదీ బ్యాంకులను ముంచిన రూ.13,000 కోట్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లు ఎక్కువ. డీమోనిటైజేషన్ తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ఆయా డొల్ల కంపెనీలు క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు తెలియజేశాయి. ఈ నిధులన్నీ కూడా పేపర్‌పై నడిచే కంపెనీల తాలూకు అక్రమ చలామణి నగదుగా (నల్లధనం) కేంద్రం భావిస్తోంది. ఎటువంటి కార్యకలాపాల్లేని 2.97 లక్షల కంపెనీల గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ గతేడాది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా అవి తమ కార్యకలాపాలను కొనసాగిస్తే గుర్తింపును తిరిగి పునరుద్ధరిస్తామంటూ, అప్పటి వరకు డిపాజిట్లను తిరిగి పొందే అవకాశం లేకుండా చేసింది. అయితే, 2.97 లక్షల కంపెనీల్లో గుర్తింపు పునరుద్ధరణకు ముందుకు వచ్చినవి 60 వేల కంపెనీలేనని అధికార వర్గాలు తెలిపాయి. మిగిలిన కంపెనీలు ఆయా డిపాజిట్లు ఎలా వచ్చాయో నిరూపించుకోవాల్సి వస్తుందన్న భయంతో మిన్నకుండిపోయాయి. ‘‘2.37 లక్షల కంపెనీల లావాదేవీల సమాచారం ఇవ్వాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ బ్యాంకులను కోరగా, ప్రైవేటు రంగ బ్యాంకులు తొలుత అయిష్టతను ప్రదర్శించాయి. బ్యాంకింగ్ సెక్రటరీ బ్యాంకులతో సమావేశమైన తర్వాతే వాటి నుంచి సమాచారం వచ్చింది’’ అని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రానున్న రోజుల్లో షెల్ కంపెనీలకు సంబంధించి కార్పొరేట్ శాఖ మరో జాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం. -
బోగస్ రిఫండ్ క్లెయిమ్‌ల రాకెట్ రట్టు
న్యూఢిల్లీ: బోగస్ క్లెయిమ్‌లతో పన్ను రిఫండ్లు పొందుతూ ఆదాయపన్ను శాఖను మోసం చేస్తున్న ఓ రాకెట్‌ను ఆ శాఖాధికారులు ఎట్టకేలకు ఛేదించారు. ఐబీఎం, ఇన్ఫోసిస్, వొడాఫోన్ తదితర బడా కంపెనీల ఉద్యోగులు సైతం ఇందులో పాత్రధారులు కావటం గమనార్హం. ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌తో కలసి ఉద్యోగులు ఈ పనికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నివాసంపై బుధవారం ఆదాయపన్ను శాఖ పరిశోధన విభాగం అధికారులు సోదాలు నిర్వహించగా, పలు క్లయింట్లకు సంబంధించి బోగస్ క్లెయిమ్‌ల పత్రాలు, వారి మధ్య నడిచిన వాట్సాప్ సంభాషణల ఆధారాలు లభించాయి. సదరు సీఏ తప్పుడు ఆదాయ పన్ను రిటర్నులు వేయడంతోపాటు, తిరిగి మోసపూరితంగా రిఫండ్ క్లెయిమ్‌లను చేసేందుకు ఓ ఉపకరణంగా పనిచేస్తున్నట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇంటిపై నష్టం వచ్చిందని పేర్కొంటూ సీఏ ఇప్పటి వరకు 1,000 రిటర్నులను దాఖలు చేసినట్టు, ఈ నష్టం రూ.18 కోట్లుగా చూపించినట్టు పేర్కొంది. సీఏకి క్లయింట్లుగా ఉన్న 50 ప్రముఖ కంపెనీల ఉద్యోగులను విచారించే పనిలో ఉన్నట్టు తెలిపింది. ‘‘పేరున్న కంపెనీలు ఐబీఎం, వొడాఫోన్, ఎస్ఏపీ ల్యాబ్స్, బయోకాన్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, సిస్కో, థామ్సన్ రాయిటర్స్ ఇండియా తదితర కంపెనీల ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి సవరణ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా మోసపూరిత క్లెయిమ్‌లకు పాల్పడ్డారు’’ అని ఆదాయపన్ను శాఖ తన ప్రకటనలో వివరించింది. వీరిలో చాలా మందిని బుధవారం నుంచి విచారించామని, ఇంటిపై ఆదాయం విషయంలో వారికి నిజంగా ఎటువంటి నష్టం కలగలేదని గుర్తించినట్టు స్పష్టం చేసింది. విచారణలో భాగంగా ఉద్యోగులు నెపాన్ని సీఏపై మోపారు. తమ తరఫున రిఫండ్లను తెచ్చిపెడతానని సీఏ చెప్పినట్టు వెల్లడించారు. 10 శాతం చార్జీలను వసూలు చేసినట్టు వాట్సాప్ ఆధారాలను కూడా కొందరు చూపించారు. అయితే, క్లయింట్ల బలవంతంతోనే తానీ క్లెయిమ్‌లు చేసినట్ట సీఏ చెప్పడం ఆశ్చర్యకరం. విచారణ ఇంకా కొనసాగుతోందని, తప్పుడు క్లెయిమ్‌లు చేసిన సీఏ, ఉద్యోగులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. -
ఫేస్బుక్లో ఫొటోలు పెడితే అంతే!
ఇష్టమైన వారితో కలసి మనం దిగిన ఫొటోలను ట్వీటర్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తుంటాం. మన జ్ఞాపకాలు, మనం చేసిన చిలిపి పనులను ప్రపంచానికి తెలియజేయాలనే ఆనందంతో ఇలా పెడుతుంటారు. ఇలాగే ఓ తల్లి కూడా తన కొడుకు ఫొటోలను ఫేస్బుక్లో పెట్టింది. అందులో వింతేముంది సాధారణమే కదా అనుకుంటున్నారా..? అయితే అదే ఆమె కొంప ముంచింది. ఎందుకంటే ఆ కన్న కొడుకు తల్లిపై కోర్టుకెక్కాడు. తన అనుమతి లేకుండా ఫేస్బుక్లో ఫొటోలను అప్లోడ్ చేసిందంటూ కోర్టులో దావా వేశాడు. తన తల్లి ఎప్పుడూ ఫేస్బుక్లో తన ఫొటోలు పెడుతోందని ఇటలీకి చెందిన 16 ఏళ్ల బాలుడు గతేడాది డిసెంబర్ 23న కోర్టులో కేసు వేశాడు. ఈ ఫొటోల వల్ల తన సామాజిక సంబంధాలు దెబ్బతిన్నాయని, దీంతో అమెరికాకు వెళ్లి చదువుకోవాలని భావిస్తున్నట్లు వాపోయాడు. దీంతో ఆ ఫొటోలన్నింటినీ 2018 ఫిబ్రవరి 1లోగా తొలగించాలని.. లేకపోతే దాదాపు రూ.7.8 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుందని రోమ్‌లోని కోర్టు జడ్జి మోనికా వెల్లెట్టి తీర్పునిచ్చారు. -
మీ బీమా 'పాలసీ' సరైనదేనా!!
తక్కువ ప్రీమియంతో అత్యధికంగా జీవిత బీమా కవరేజీనిచ్చేవి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు. అయితే, ఏ టర్మ్ ప్లాన్ తీసుకోవాలి.. కవరేజీ ఎంత ఉండాలి.. ఎక్కడ తీసుకోవాలి.. ఏమేం జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాల్లో సందేహాలు ఉంటూనే ఉంటాయి. అలాంటివి నివృత్తి చేసే ప్రయత్నమే ఈ కథనం... 1. ఎంత ముందుగా తీసుకుంటే అంత మేలు.. ఈ వయస్సులోనే తీసుకోవాలంటూ టర్మ్ పాలసీకి ప్రత్యేకమైన పరిమితులేమీ లేవు. అయితే, వీలైనంత ముందుగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ కట్టాల్సిన ప్రీమియం కూడా పెరుగుతుంది. పై పెచ్చు.. ఇతరత్రా అనారోగ్యం లాంటివేమైనా వచ్చినా.. తర్వాత కాలంలో పాలసీ రావడం కూడా కష్టం కావొచ్చు. కనుక మీకు ఉండాల్సిన కవరేజీపై స్పష్టత వచ్చిన తర్వాత .. సాధ్యమైనంత త్వరగా తీసేసుకోవడం ఉత్తమం. 2. రిటైర్మెంట్ దాకానే.. టర్మ్ పాలసీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాక.. ఇంతకీ ఎన్నేళ్ల వ్యవధికి తీసుకోవాలనే సందేహం తలెత్తవచ్చు. ప్రస్తుతం ముప్పై ఏళ్లున్న వ్యక్తి ఎనభై ఏళ్ల వ్యవధికి తీసుకోవాలా అంటే.. లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే..యవ్వనంలో ఉన్నప్పుడు ఆర్థిక బాధ్యతలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి.. కాబట్టి అధిక కవరేజీ అవసరమవుతుంది. అదే, వయస్సు పెరిగే కొద్దీ క్రమంగా మన అసెట్స్ పెరగవచ్చు. అలాగే.. రిటైర్మెంట్ తర్వాత మనపై ఆర్థికంగా ఆధారపడే కుటుంబ సభ్యుల సంఖ్య పెద్దగా ఉండకపోవచ్చు. 3. చౌక ప్రీమియం లెక్కల మాయలో పడొద్దు.. ఈ మధ్య చాలా మటుకు బీమా కంపెనీలు పాలసీ ప్రీమియంలను రోజువారీ లెక్కలు వేసి చాలా చౌకైనవిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. రోజుకి పాతిక రూపాయలకే 1 కోటి రూపాయల పాలసీలంటూ పలు సంస్థలు ఊదరగొడుతున్నా యి. అయితే, ఈ లెక్కల మాయలో పడొద్దు. కారణమేంటంటే.. ఈ లెక్కం తా నిర్దిష్ట వయస్సుల్లో ఉన్నవారికి.. నిర్దిష్ట వ్యవధికి మాత్రమే వర్తిస్తుంది. చాలా మటుకు పాతికేళ్ల వయస్సు గల వారు ఓ నలభై ఏళ్లకు తీసుకునే పాలసీల్లాంటివి మాత్రమే ఇంత చౌకగా ఉంటాయి. కనుక.. మన వయస్సు, కాల వ్యవధి మొదలైనవన్నీ పరిగణనలోకి తీసుకునే ముందడుగు వేయాలి. 4. సింగిల్ ప్రీమియం పాలసీలకు దూరం.. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు సింగిల్ ప్రీమియం అనీ విడతల వారీగా సాధారణ ప్రీమియం చెల్లింపులనీ రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. కట్టగలిగే స్థోమత ఉంది కదా అని కొందరు వన్‌టైమ్ ప్రీమియంని ఎంచుకుంటే బాగుంటుందని అనుకుంటారు. ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప అన్ని వేళలా ఇది సరికాదు. ఉత్తమమైన ఆప్షన్ ఏదైనా ఉందంటే.. అది వార్షిక ప్రీమియం విధానం. ఖర్చులు తగ్గుతాయనే కారణంతో వన్‌టైమ్ పేమెంటు ఆకర్షణీయంగా కనిపించినా దాన్ని ఎంచుకోకపోవడమే మంచిది. 5. ప్రీమియం పెరిగిందని ఆందోళన వద్దు.. టర్మ్ ప్లాన్ (ఆ మాటకొస్తే.. హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే) తీసుకునేటప్పుడు ప్రీమియంలు.. ముందు అనుకున్న దానికన్నా వైద్య పరీక్షల తర్వాత మరికాస్త పెరగొచ్చు. మీ ఆరోగ్యపరమైన అంశాల ఆధారంగానే ఇది జరుగుతుంది. ఉదాహరణకు సిగరెట్స్, మద్యపానం లాంటి అలవాట్లతో పాటు గతంలో ఇతరత్రా తీవ్ర అనారోగ్య సమస్యలు మొదలైనవేమైనా ఉన్నా హై రిస్క్ కేటగిరీలోకి వస్తారు. కంపెనీ ముందుగానే దీన్ని గుర్తించి దానికి తగ్గట్లుగా ప్రీమియంలు తీసుకోవడం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే తర్వాత దశలో ఏదైనా జరిగితే ఇలాంటి కారణాలు చూపించి క్లెయిమ్‌ను తిరస్కరించడానికి ఉండదు. 6. రైడర్స్‌పై అత్యుత్సాహం వద్దు... టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు అదనంగా కొన్ని రైడర్స్ కూడా లభిస్తాయి. ఇవి అందుబాటులో ఉన్నాయి కదాని తీసుకోవడం కాకుండా.. నిఖార్సుగా అవసరమైతేనే తీసుకోవడం మంచిది. ఉదాహరణకు.. ఎక్కువగా పర్యటనలు చేసే వారై ఉండి.. ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అనుకున్నప్పుడు యాక్సిడెంటల్ రైడర్‌ను కూడా తీసుకోవడంలో అర్థం ఉంటుంది. అంతే తప్ప.. బీమా కంపెనీ ఆఫర్ చేస్తోందికదా అని తీసుకోవడంలో అర్థం లేదు. అలాగే భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్యాలకేమైనా కవరేజీ కావాలనుకుంటే ప్రత్యేకంగా మరో పాలసీ తీసుకోకుండా..క్రిటికల్ కవర్ తీసుకోవచ్చు. వివిధ రకాల టర్మ్ ప్లాన్స్ రైడర్లేమిటంటే.. ♦ యాక్సిడెంటల్ డెత్ రైడర్ ఊ శాశ్వత, పాక్షిక అంగవైకల్యం ♦ క్రిటికల్ ఇల్నెస్ ఊ ప్రీమియం వెయివర్ ఊ ఇన్కమ్ బెనిఫిట్ రైడర్ 7. బేసిక్ పాలసీ శ్రేయస్కరం .. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లలోనూ అనేక వెరైటీలు ఉంటున్నాయి. సాధారణంగా బేసిక్ పాలసీ విషయం తీసుకుంటే.. పాలసీదారు మరణానంతరం కుటుంబానికి ఏకమొత్తంగా క్లెయిమ్ లభిస్తుంది. అలా కాకుండా.. ప్రధాన కవరేజీతో పాటు పదేళ్లు.. ఇరవై ఏళ్లు స్థిరంగా ఆదాయాలు కూడా ఇస్తామనో.. లేదా వచ్చే పది, ఇరవై ఏళ్ల పాటు ఆదాయమిస్తూ.. క్లెయిమ్ సమయంలో కేవలం కొంత మొత్తం మాత్రమే వచ్చేలాగానో కొన్ని పాలసీలు ఉంటున్నాయి. ఇలాంటివి ఏవో కొన్ని సందర్భాలకు తప్ప అందరికీ పనిచేయవు. కనుక.. చాలా పరిస్థితుల్లో బేసిక్ పాలసీనే ఎంచుకోవడం శ్రేయస్కరం. 8. సిగరెట్స్, మద్యం అలవాటుంటే దాచొద్దు.. సిగరెట్లు, మద్యం సేవించడం మొదలైన అలవాట్లు ఉంటే.. జీవిత బీమా పాలసీ తీసుకుంటున్నప్పుడు దాచిపెట్టకుండా కచ్చితంగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగిపోతుందేమోనన్న భయంతో చెప్పకుండా ఊరుకుంటే.. తీరా ఏదైనా జరిగితే.. ఇదే విషయంపై క్లెయిమ్ తిరస్కరణకు గురికావొచ్చు. ఫలితంగా పాలసీ ఉన్నా ప్రయోజనం లేకుండా పోతుంది. అప్పుడప్పుడు ఏదో ఒకటో రెండో సిగరెట్లు కాలుస్తాను.. కనుక నాన్–స్మోకర్ కిందికే వస్తాను అనుకోవద్దు. ఎప్పుడో ఓసారైనా సరే రెండు కాల్చినా.. ఒకటి కాల్చినా కంపెనీ స్మోకర్ కిందే పరిగణిస్తుంది. మందు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఏజెంటు కాకుండా సాధ్యమైనంత వరకూ మీ పాలసీ దరఖాస్తు మీరే నింపండి. అందులో కచ్చితంగా విషయాలన్నీ వెల్లడించండి. 9. ఆరోగ్య సమస్యలేమీ దాచిపెట్టొద్దు.. సాధారణంగా ప్రీమియంలు పెరిగిపోతాయేమో అన్న భయంతో కొన్ని సందర్భాల్లో కీలకమైన ఆరోగ్యపరమైన అంశాలను వెల్లడించకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే ఆ తర్వాత బైటపడిందంటే క్లెయిమ్ తిరస్కరణకు కూడా గురికావొచ్చు. కనుక ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నా.. కీలకమైన ఆపరేషన్లు గట్రా చేయించుకున్నా.. పాలసీ దరఖాస్తులో ఆ విషయాలన్నీ పొందుపర్చడమే మంచిది. కుటుంబసభ్యుల అనారోగ్యాలూ వెల్లడించాలి.. పాలసీ విషయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర కూడా ముఖ్యమే. ఒకవేళ తల్లిదండ్రులు గానీ తోబుట్టువులకు కానీ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న పక్షంలో అవి కూడా వెల్లడించడమే మంచిది. ప్రీమియం తగ్గించుకుందామనే భావనతో దాచిపెట్టొద్దు. ఉదాహరణకు పేరెంట్స్‌కి మధుమేహం ఉన్నా.. తమకు దానివల్ల సమస్య ఉండదనుకుంటారు. కానీ అది తప్పు. అరకొర కవరేజీ వద్దు.. మన దేశంలో సాధారణంగా పాలసీల సమ్ అష్యూర్డ్ పరిమాణం సగటున కేవలం రూ. 90,000– రూ. 1,00,000 దాకా మాత్రమే ఉంటోంది. చాలా మందికి ఆ మాత్రం బీమా కవరేజీనిచ్చే పాలసీలు కూడా ఉండటం లేదు. అది వేరే సంగతనుకోండి. అయితే, పాలసీ తీసుకుంటున్నవారు కూడా అరకొర కవరేజీ తీసుకోవడమే ప్రధాన సమస్య. ప్రస్తుతం అందరికీ రూ. 1 కోటి కవరేజీ ఫేవరెట్‌గా ఉంటోంది. కానీ .. ఖర్చులు పెరిగిపోతున్న పరిస్థితుల్లో రేప్పొద్దున్న ఇది ఏ మూలకూ సరిపోకపోవచ్చు. అందరికీ ఇదే స్థాయి సరిపోతుందనుకోవడానికి లేదు. సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ లెక్కింపునకో ఫార్ములా ఉంది. ఇందుకోసం మన అప్పులన్నింటినీ లెక్కేసుకుని, నెలవారీ ఖర్చులకు మూడు వందల రెట్లు దానికి జోడిస్తే.. ఎంత కవరేజీ అవసరమవుతుందన్నది ఒక అంచనాకు రావొచ్చు. దానికి మరికాస్త అదనంగా కలిపి పాలసీ కవరేజీ ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు మీకు రూ. 1.3 కోట్ల కవరేజీ అవసరం పడుతోందనుకుంటే.. రూ. 1 కోటికి కాకుండా రూ. 1.5 కోట్లకు పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. మరీ నాన్చొద్దు.. పాలసీ తీసుకుందామని నిర్ణయించుకున్నప్పటికీ.. బెస్ట్ పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో, దాన్ని అన్వేషిస్తూ కాలయాపన చేస్తుంటారు మరికొందరు. అనేకానేక కంపెనీల పాలసీలను పోల్చి చూసుకుంటూ గడిపేస్తుంటారు. తీరా తీసుకునే సమయానికి పుణ్యకాలం కాస్త గడిచిపోవచ్చు. కాబట్టి పాలసీలో ఫీచర్లు, ప్రీమియంలు మొదలైన వాటి గురించి మరీ ఎక్కువగా విశ్లేషించుకుంటూ కూర్చోకుండా కీలకమైన అంశాల గురించి అధ్యయనం చేసి ముందుగా ఒక మెరుగైన పాలసీ తీసుకోవడం మంచిది. అసలే కవరేజీ లేకపోవడం కన్నా ఏదో ఒక కవరేజీ ఉండటం శ్రేయస్కరం కదా. ఆన్లైన్ బ్రోకింగ్ సంస్థలనూ పరిశీలించవచ్చు.. ప్రస్తుతం బీమా రంగంలోనూ పాలసీబజార్, కవర్‌ఫాక్స్ వంటి ఆన్లైన్ బ్రోకింగ్ సంస్థలు వచ్చాయి. కస్టమరుకు ఎటువంటి అదనపు ఖర్చులూ లేకుండా వేగవంతమైన సర్వీసులు, క్లెయిమ్ సెటిల్మెంట్ సహాయం మొదలైనవి అందిస్తున్నాయి. ఇందుకోసం ఆయా బీమా కంపెనీల నుంచి వాటికి కొంత మొత్తం లభిస్తుంది. అందుకే కస్టమరుకు భారం కాకుండా ఇవి సర్వీసులు అందించగలుగుతున్నాయి. పాలసీని నేరుగా కంపెనీ నుంచి కొన్నా.. లేదా ఈ బ్రోకింగ్ సంస్థ నుంచి తీసుకున్నా ప్రీమియం ఒకే రకంగా ఉండగలదు. కాబట్టి వీటినీ ఒకసారి ప్రయత్నించి చూడొచ్చు. లేదా సాంప్రదాయ పద్ధతిలోనే కంపెనీ నుంచే కొనుక్కోనూవచ్చు. నామినీ పేరు మరవొద్దు.. బీమా ఫాం నింపేటప్పుడు నామినీ పేరు కచ్చితంగా పేర్కొనాలి. జీవిత భాగస్వామి, పిల్లలతో పాటు ఇతరత్రా ఎవరికైతే టర్మ్ ప్లాన్ సొమ్ము చెందాలనుకుంటున్నారో వారి పేర్లను పొందువర్చవచ్చు. వీలైనంత వరకూ వయోవృద్ధులను నామినీలుగా ఎంచుకోకపోవడం మంచిది. ఇక వీలునామా లాంటిదేదైనా ఉంటే.. అందులో కూడా ఈ వివరాలను పొందుపర్చాలి. టర్మ్ ప్లాన్ గతంలో ఎప్పుడో తీసుకున్నదైనా.. తాజాగా ప్రాధాన్యతలు మారిన పక్షంలో ఆ మేరకు నామినీలను కూడా మార్చుకోవాలి. పాత పాలసీ గురించి చెప్పాలి.. సాధారణంగా జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు మనం అప్పటికే తీసుకున్న పాత బీమా పాలసీలు, వాటి కవరేజీ గురించి కూడా తెలియజేయడం తప్పనిసరి. అదనంగా ఎంత కవరేజీ ఇవ్వొచ్చనే దానిపై బీమా కంపెనీ సరైన అంచనా వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇప్పటికే పాత పాలసీల గురించి చెప్పకుండా తీసుకున్న టర్మ్ పాలసీ ఉన్న పక్షంలో.. ఆ వివరాలను ఇప్పటికైనా కంపెనీకి తెలియజేయడం శ్రేయస్కరం. ఒకటో.. రెండో చాలు.. జీవిత బీమాకు సంబంధించి ఒక టర్మ్ ప్లాన్ చాలు. కావాలనుకుంటే గరిష్టంగా రెండు చాలు. పాలసీల సంఖ్య అంతకు మించొద్దు. రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజీని.. రూ. 50 లక్షల చొప్పున నాలుగు పాలసీలుగా తీసుకునే వారూ ఉన్నారు. దానికి బదులుగా పెద్ద మొత్తానికి ఒకటే తీసుకోవచ్చు. అలా కాదనుకుంటే గరిష్టంగా రెండింటి కింద తీసుకోండి. చాలు. పత్రాలు పరిశీలించాలి.. పాలసీ వచ్చిన తర్వాత తక్షణమే అన్ని కీలకమైన వివరాలు సరిగ్గా పేర్కొన్నారో లేదో పరిశీలించుకోవాలి. పేరు, వయస్సు, బ్లడ్ గ్రూపు, చిరునామా మొదలైనవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ తేడాలేమైనా ఉంటే తక్షణమే కంపెనీ దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలి. మార్కెటింగ్ గిమ్మిక్కులకు పడొద్దు.. మన వార్షికాదాయానికి పది రెట్లు కవరేజీ ఉండాలంటూ కాల్ సెంటర్ మార్కెటింగ్ వాళ్లు చెప్పే మాటల్లో పడొద్దు. నికార్సుగా చెప్పాలంటే.. మన ఖర్చులు, అప్పులే కవరేజీ లెక్కింపునకు ప్రామాణికం కావాలి. నెలవారీ ఖర్చులకు మూడు వందల రెట్లు లెక్కించి.. దానికి అప్పులను కూడా కలిపి కూడితే.. కావాల్సిన కవరేజీ తెలుస్తుంది. ఇతరత్రా ఆర్థిక లక్ష్యాల సాధన కోసం (పిల్లల చదువు వగైరా) కూడా కలిపి మరి కాస్త జోడిస్తే.. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలనేది తెలుస్తుంది. ఉదాహరణకు నెలకు రూ. 50,000 ఖర్చులు, రూ. 60 లక్షల రుణబకాయి ఉందనుకుంటే.. 300 ్ఠ 50,000+ 60 లక్షలు కింద లె క్కిస్తే కనీసం రూ. 2.1 కోట్లు అవసరమవుతాయి. అలాం టప్పుడు కాస్త అటూ ఇటూగా రూ. 2.5 కోట్లకు కవరేజీ తీసుకోవచ్చు. కవరేజీకి ఖర్చులు, అప్పులే ప్రాతిపదిక కావాలి తప్ప ఆదాయం కాదు. మంచి బ్రాండ్‌ని ఎంచుకోవాలి.. ప్రస్తుతం దేశీయంగా ఇరవై నాలుగు పైచిలుకు జీవిత బీమా కంపెనీలు ఉన్నాయి. ఆయా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ తీరుతెన్నులు, క్లయింట్లతో వ్యవహరించే విధానం, వైద్య పరీక్షల నిర్వహణ శైలి, వ్యాపార నిర్వహణ తీరుతెన్నులు మొదలైనవన్నీ పరిశీలించాలి. ఇందుకోసం ఆన్లైన్లో డేటా చూడొచ్చు.. వాటిపై రివ్యూలు చదివి తెలుసుకోవచ్చు. కంపెనీ పెద్దదే కావాలనేమీ లేదు.. సర్వీసులు మెరుగ్గా అందించేదిగా పేరొందిన బ్రాండ్‌ని ఎంచుకోవచ్చు. ఇంట్లో చెప్పాలి.. టర్మ్ పాలసీ తీసుకున్నప్పుడు ఆ విషయం ఇంట్లో వారికి తప్పనిసరిగా చెప్పాలి. పాలసీ పత్రాలు, బీమా కంపెనీ కాంటాక్టు నంబరు మొదలైనవి ఇవ్వాలి. సంతోషపర్చే విషయం కాకపోయినప్పటికీ .. క్లెయిమ్ ప్రక్రియలో కీలకాంశాల గురించి అవగాహన కల్పించాలి. కావాలంటే ఈ ప్రక్రియ మొత్తం ఒక పేపరులో రాసి, ఎక్కడో ఒక దగ్గర భద్రపర్చి ఆ విషయాన్ని కుటుంబసభ్యులకూ చెప్పాలి. ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు ఇలా .. ♦ ఎంత కవరేజీ అవసరమవుతుందో ముందే లెక్కగట్టుకోవాలి. ♦ ఆన్లైన్లో వివిధ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్స్ ఉపయోగించుకుని ప్రీమియం అమౌంటును లెక్కించుకోవాలి. ♦ ప్రీమియం మీ బడ్జెట్లోబడే ఉంటే.. టర్మ్ ప్లాన్‌కి అప్లై చేయొచ్చు. ♦ ప్రాథమికంగా ప్రీమియం చెల్లించి, డాక్యుమెంటేషన్ ప్రక్రియ ప్రారంభించవచ్చు. ♦ బీమా కంపెనీయే వైద్య పరీక్షల ఏర్పాట్లు చేస్తుంది. సమయం లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. ♦ అన్నీ సరిగ్గా ఉన్న పక్షంలో బీమా కంపెనీ మీకు పాలసీ జారీ చేస్తుంది. -
విష..విషాదం
-
9/11 దావాకు ఒబామా నో
వాషింగ్టన్: అమెరికాలోని ‘9/11’ దాడి బాధిత కుటుంబాలు సౌదీ అరేబియాపై వేయాలనుకున్న దావాను ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వీటోతో అడ్డుకున్నారు. సౌదీపై దావా వేసేందుకు ప్రవేశపెట్టిన జస్టిస్ ఎగెనైస్ట్ స్వాన్సర్స్ ఆఫ్ టైజం బిల్లు రిపబ్లికన్లు అధికంగా ఉన్న కాంగ్రెస్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. బాధిత కుటుంబాలపై తనకు సానుభూతి ఉన్నా.. అమెరికా సార్వభౌమత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని ఒబామా తెలిపారు. శనివారం వాషింగ్టన్లో ‘స్మిత్సోనియన్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ, కల్చర్ నేషనల్ మ్యూజియం’ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. -
9/11 దావాకు ఒబామా నో
-
స్విస్ చాలెంజ్‌పై నేడు హైకోర్టులో వాదన
-
గర్భిణులూ వ్యాయామం చేయొచ్చు!
లండన్ః క్రీడాకారులు ప్రతిరోజూ వ్యాయామం చేసి శరీరాన్ని ధృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే గర్భం దాల్చిన సమయంలో మహిళలు అటువంటి వ్యాయామాలు చేసేందుకు, పరుగు పెట్టేందుకు అనుమానిస్తారు. ప్రసవం అయ్యే వరకూ పరుగు వంటి వాటి జోలికి పోకుండా ఉండిపోతారు. అటువంటి మహిళలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు. గర్భంతో ఉన్న మహిళలు సైతం పరిగెట్టవచ్చని, వ్యాయామం చేయొచ్చునని చెప్తున్నారు. గర్భిణులుగా ఉన్నపుడు క్రీడాకారిణులు వ్యాయామం చేయడం వల్ల ఎటువంటి పత్రికూల ప్రభావం ఉండదని ఇంగ్లాండ్ కు చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. అథ్లెటిక్ అయిన మహిళల్లో ఎటువంటి రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఉండవని, వీరు వ్యాయామం చేయడంవల్ల గర్భిణికి గాని, లోపల పెరిగే బిడ్డకు గాని సమస్య ఉండదని నార్వైన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ ప్రొఫెసర్ కరి బో వెల్లడించారు. అంతేకాదు వీరు ఎక్సర్ సైజ్ చేయడంవల్ల రక్త ప్రసరణ మెరుగవ్వడంతోపాటు, గర్భంలోని పిండం, ప్లాసింటా ధృఢంగానూ, ఆరోగ్యంగాను తయారౌతాయని తెలిపారు. అయితే గర్భిణులు చేసే వ్యాయామం కాస్త తేలిగ్గా ఉండాలని, ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం తెలుస్తోంది. గర్భిణిలు తేలికపాటి వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి చేయడంవల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గడంతోపాటు, మానసిక స్థైర్యాన్ని కూడ కలుగజేస్తుందని చెప్తున్నారు. అయితే వ్యాయామం చేసేప్పుడు ఏమాత్రం కష్టంగా అనిపించినా చేయకుండా ఉండటం మంచిదని హెచ్చరిస్తున్నారు. కడుపులోని పిల్లలకు ఇబ్బందిగా ఉంటుందేమోనని చాలామంది గర్భిణులు వ్యాయామం చేయడం మానేస్తుంటారని, అయితే వ్యాయామం చేసేప్పుడు బయటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా లేకుండా చల్లబాటున చేయడం ఉత్తమమని ప్రొఫెసర్ బో చెప్తున్నారు. అంతేకాక సరైన వ్యాయామం చేయడంవల్ల కడుపులోని పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే కాక, ప్రసవం కూడ సులభం అవుతుందని చెప్తున్నారు. -
కార్పొ బ్రీఫ్స్...
స్టార్ హెల్త్ నుంచి గోల్డ్ ప్లాన్ టాప్ అప్.. సూపర్ సర్ప్లస్ ఇన్సూరెన్స్, స్టార్ సర్ప్లస్ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ పథకాల కింద స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా గోల్డ్ ప్లాన్ ఆవిష్కరించింది. ఈ టాప్ అప్ పాలసీ అత్యంత చౌకగా మరింత ఎక్కువ కవరేజీ అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఆస్పత్రి వ్యయాలు పాలసీదారు నిర్దేశించిన పరిమితిని దాటిన పక్షంలో గోల్డ్ ప్లాన్‌తో క్లెయిమ్ చేసుకోవచ్చు. గది అద్దెపై ఎటువంటి పరిమితులు ఉండవు. పైగా ఎయిర్ అంబులెన్స్, 405 డే కేర్ ప్రొసీజర్స్‌కి వర్తింపు తదితర ప్రయోజనాలు ఉంటాయి. ముందస్తు వైద్య పరీక్షలేమీ లేకుండా 65 ఏళ్ల దాకా వయసు గల వ్యక్తులు ఈ ప్లాన్ కింద రూ.25 లక్షల దాకా కవరేజీ పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఈజీ హెల్త్ ప్లాన్.. శస్త్రచికిత్సలు, క్రిటికల్ ఇల్నెస్ మొదలైన వాటి కవరేజీకి సంబంధించి పాలసీదారు ఏకమొత్తం లేదా వాయిదాల పద్ధతిలో ప్రీమియంలు కట్టే వెసులుబాటు కల్పిస్తూ హెచ్డీఎఫ్సీ లైఫ్ తాజాగా ఈజీ హెల్త్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. అయిదేళ్ల కాల వ్యవధికి గరిష్టంగా రూ. 5,00,000 దాకా కవరేజీకి దీన్ని తీసుకోవచ్చు. దీని కింద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అవసరాన్ని బట్టి రోజువారీ రూ. 250 నుంచి రూ. 5,000 దాకా, 138 శస్త్రచికిత్సలు.. 18 క్రిటికల్ ఇల్నెస్ అంశాల్లో ఏకమొత్తం పొందవచ్చు. సమ్ అష్యూర్డ్ పూర్తిగా వినియోగమయ్యే దాకా పలు సర్జరీలకు క్లెయిమ్ చేసుకోవచ్చు. బిర్లా సన్‌లైఫ్ సెక్యూర్ప్లస్ ప్లాన్.. ఇటు బీమా కవరేజీతో పాటు అటు కట్టిన ప్రీమియానికి రెట్టింపు మొత్తాన్ని అందించేలా బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ బీఎస్‌ఎల్‌ఐ సెక్యూర్ప్లస్ ప్లాన్ ప్రవేశపెట్టింది. దీనికింద రెండు ఆప్షన్లు ఉంటాయి. ఉదాహరణకు ఆప్షన్ ఏ ఎంచుకున్న వారు 12 ఏళ్ల పాటు ఏటా రూ. 1 లక్ష చొప్పున కడితే.. 14వ ఏడాది రూ. 2 లక్షలు, 15వ ఏడాది రూ. 3 లక్షలు.. ఇలా 19వ సంవత్సరంలో రూ. 6 లక్షలు పొందవచ్చు. రెండో ఆప్షన్లో 12 ఏళ్ల పాటు .. కట్టిన ప్రీమియంలకు రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు. ఉదాహరణకు.. 12 ఏళ్ల పాటు ఏటా రూ. 1 లక్ష కడితే.. 14వ సంవత్సరం మొదలుకుని ప్రతీ సంవత్సరం రూ. 2 లక్షల చొప్పున అందుకోవచ్చు. చెల్లించే ప్రీమియంకు 14.5-19 రెట్లు లైఫ్ కవరేజీ ఉంటుంది. -
రోగి చికిత్స ఆపినా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్!
చంఢీఘర్: వైద్యం పని చేయదనే డాక్టర్ల సలహా మేరకు చికిత్స ఆపేవేసి మరణించే రోగులకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. రోగి చికిత్స చేయించుకోకుండా మరణిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదంటూ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం వైద్యం ఆపివేసిన తర్వాత మరణించే రోగులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో దశాబ్దాలుగా ట్రీట్ మెంట్ మానేసిన రోగులకు మరణానంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు ఇవ్వకుండా ఉంటున్న కంపెనీల ఆటలు ఇక సాగవని వైద్య రంగ నిపుణులు చెప్తున్నారు. చికిత్స తీసుకోకపోవడం రోగికి ఇష్టం లేక కాదని, శారీరక స్థితి సహకరించకపోవడం వ్యక్తి తప్పుకాదని కోర్టు వ్యాఖ్యనించింది. ఇటువంటి కేసుల్లో కంపెనీలు కచ్చితంగా బాధితునికి ఇన్సూరెన్స్ చెల్లించాలని కోర్టు తేల్చి చెప్పింది. మతపరమైన నమ్మకాలు ఉండటం వల్ల కొంతమంది రోగులు(రక్త మార్పిడి తదితరాలు) చికిత్సకు అంగీకరించటం లేదని దీనిపై ప్రజలు మరోసారి ఆలోచించుకోవాలని జస్టిస్ కన్నన్ అన్నారు. చండీఘర్ కు చెందిన బ్యాంకు ఉద్యోగి మరణానంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ పై జరిగిన వాదనల్లో బాధిత కుటుంబానికి రూ.35.46లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. -
‘టాప్ అప్’ కావాలా? సూపర్ టాప్ అప్ కావాలా?
ఫైనాన్షియల్ బేసిక్స్ రవికి 30 ఏళ్లు. ఆరోగ్య బీమా కవరేజీ రూ.2 లక్షల వరకు ఉంది. పాలసీ తీసుకొని కొన్నేళ్లు గడిచాక రవి ఒక విషయాన్ని గమనించాడు. రోజులతో పాటు వైద్య ఖర్చులూ పెరుగుతున్నాయని, భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తితే అప్పుడు తీసుకున్న ఇన్సూరెన్స్ సరిపోదనే అంచనాకు వచ్చాడు. కొత్తగా మరొక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నాడు. వయసు ఎక్కువయ్యే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుందనే విషయం రవికి తెలుసు. అప్పుడు కొత్తగా పాలసీ తీసుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాలి కదా...! అన్నది అతడి ఆలోచన. ఈ సమయంలో రవికి తన స్నేహితుడు శంకర్ తారసపడ్డాడు. రవి ఈ విషయాన్ని శంకర్‌కు చెప్పాడు. అప్పుడు శంకర్.. రవికి హెల్త్ పాలసీలకు టాప్ అప్, సూపర్ టాప్ అప్ చేయించుకోవాలని సలహా ఇచ్చాడు. ఎందుకంటే వీటి ద్వారా అదనపు కవరేజీ పొందొచ్చు. అవెలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం... రవికి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది. అతను టాప్ అప్ పాలసీల ద్వారా మరో రూ.5 లక్షల వరకు బీమా తీసుకున్నాడు. రవి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ చేరాడు. ఒక ఏడాదిలో నాలుగుసార్లు చేరటంతో 1.8 లక్షలు ఖర్చయింది. ఆ మొత్తం అంతటినీ బీమా కంపెనీయే భరించింది. కానీ అదే ఏడాది ఐదోసారి కూడా రవి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు బిల్లు ఏకంగా రూ.3 లక్షలయింది. పాలసీలో కవరేజీ మొత్తం రూ.20 వేలే ఉన్నా... టాప్ అప్ రూ.5 లక్షల వరకు ఉండటంతో మిగిలిన రూ.2.8 లక్షలు కూడా బీమా కంపెనీయే భరించింది. కాకపోతే టాప్ అప్ను ఏడాదిలో ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేసే వీలుంటుంది. అది కూడా ... మన మామూలు బీమా కవరేజీ మొత్తం అయిపోతున్న సందర్భంలో... దానికన్నా ఎక్కువ ఎంత అవసరమైతే అంత, మన టాప్ అప్ పరిధిలో క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. మరి సూపర్ టాప్ అప్ అంటే...! సూపర్ టాప్ అప్ అంటే... టాప్ అప్ కన్నా కొంచెం ఎక్కువన్న మాట. టాప్ అప్ను ఏడాదిలో ఒకసారే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సూపర్ టాప్ అప్ అలా కాదు. దాని కవరేజీ మొత్తం పరిధిలో... ఏడాదిలో ఎన్నిసార్లయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రవినే తీసుకుందాం. రవి ఆ ఏడాది ఐదోసారి ఆసుపత్రిలో చేరటంతో కవరేజీ మొత్తం అయిపోయింది. టాప్ అప్ గనక ఒకసారి రూ.2.8 లక్షలు చెల్లించారు. అదే రవి గనక సూపర్ టాప్ అప్ను రూ.5 లక్షలకు తీసుకుంటే... రూ.2.8 లక్షలు క్లెయిమ్ చేశాక కూడా ఇంకా కవరేజీ రూ.2.2 లక్షలుంటుంది. దాన్ని కూడా ఆ ఏడాది అవసరమైన పక్షంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. పూర్తిగా రూ.5 లక్షలూ క్లెయిమ్ చేసుకునేదాకా ఇది వర్తిస్తుంది. కాకపోతే టాప్ అప్, లేదా సూపర్ టాప్ అప్ విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. ఇవి బీమా కవరేజీకి అదనంగా పనిచేస్తాయి తప్ప ఇవే బీమా కవరేజీ కాదు. ఒక ఏడాదిలో లిమిట్ దాటిపోయిన పక్షంలో ఇవి అక్కరకు వస్తాయి. మన క్లెయిమ్ లిమిట్ పరిధిలోనే ఉంటే... వీటిద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లున్నాయా?
దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.5,124 కోట్లు * ఇపుడు వివరాలన్నీ బ్యాంకు సైట్లలో లభ్యం * క్లెయిమ్‌కు కేవైసీ వివరాల సమర్పణ తప్పనిసరి ప్రసాద్‌కు ఐదు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. కనీస నిల్వ ఉంచాలి కనక ప్రతి ఖాతాలో రూ.10 వేలకు తగ్గకుండా ఉంచుతాడు. అన్ని ఖాతాలున్నా... అత్యధిక లావాదేవీలకు వాడేది మాత్రం రెండు ఖాతాలనే. ఒకటి ఆఫీసు జీతం జమచేసే ఖాతా. రెండోది తన పర్సనల్‌గా ఇంటి దగ్గరి బ్రాంచిలో తీసుకున్న ఖాతా. మిగిలిన ఖాతాల్లో ఎప్పుడోకానీ లావాదేవీలుండవు. కొన్నాళ్లకు వాటి ఊసే మరిచిపోయాడు ప్రసాద్. పదేళ్ల పాటు ఏ లావాదేవీ లేకపోవటంతో ఆ ఖాతాల్లోని సొమ్ము అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా మారింది. ఇంతలో ప్రసాద్ మరణించటంతో అతని కుటుంబీకులకు కూడా విషయం తెలియకుండానే ఉండిపోయింది. శంకర్రావుది మరో కథ. ఆయనకు వెనకా ముందూ ఎవ్వరూ లేరు. ఉన్న డబ్బుల్లో కొంత బ్యాంకులో డిపాజిట్లుగా పెట్టాడు. నామినీ ఎవ్వరినీ పెట్టలేదు. విషయం తన దగ్గరి వాళ్లక్కూడా చెప్పలేదు. అతను మరణించటంతో ఆ డబ్బును తీసుకునేవారే లేకుండా పోయారు. కొన్నాళ్లకు అది అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా మారింది. ప్రసాద్, శంకర్రావు లాంటి వ్యక్తులు దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి క్లెయిమ్ చేయకుండా వదిలేసిన మొత్తమెంతో తెలుసా? 2013 సంవత్సరాంతానికి ఈ మొత్తం ఏకంగా రూ.5,124 కోట్లు. నిజానికి ఈ మొత్తం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ బ్యాంకులు అనేక జాగ్రత్తలు తీసుకుని, పదేళ్లు నిండిన తరవాతే వీటిని అన్క్లెయిమ్డ్గా ప్రకటిస్తున్నాయి. ఇంకా పదేళ్లు నిండకపోయినా అన్క్లెయిమ్డ్గా ఉన్న మొత్తం చాలా ఎక్కువే ఉంటుందనేది బ్యాంకింగ్ వర్గాల మాట. అన్క్లెయిమ్డ్ వివరాలు తెలుసుకోవటమెలా? నిజానికి ప్రతి ఒక్కరూ వారి ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకోవాలి. లేకపోతే బ్యాంక్ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి రావచ్చు. బ్యాంకులు కూడా ఆన్క్లైయిమ్డ్ డిపాజిట్ల తాలూకు డిపాజిటర్లు, ఇతర వివరాలను వాటి వెబ్సైట్లలో ఉంచాయి. ఇన్ని చేసినా మీ ఇంట్లో వాళ్ల డిపాజిట్ల వివరాలు వారి మరణానంతరం కూడా మీకు తెలియకపోతే... ఇంట్లో ఏవైనా బ్యాంక్ సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయేమో వెదకండి. ప్రయోజనం లేకపోతే బ్యాంక్ వెబ్సైట్లలో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను జల్లెడ పట్టండి. బ్యాంకు ఖాతాదారుని పేరు మీద సెర్చ్ చేస్తే వివరాలను తెలసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఖాతాదారు పేరు, పుట్టిన తేదీ, పాన్ నంబర్, పాస్‌పోర్ట్ సంఖ్య వంటి ఆప్షన్ల ద్వారా కూడా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తెలియజేస్తున్నాయి. క్లెయిమ్ చేసుకోవాలంటే... ఆయా బ్యాంకుల వెబ్సైట్ల ద్వారా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తెలుసుకున్నాక ఆ విషయాన్ని సదరు బ్యాంకుకు తెలియజేయాలి. కొన్ని బ్యాంకులు మీకు కాల్ చేస్తాయి. లేకపోతే స్వయంగా మీరే దగ్గర్లోని బ్యాంక్ బ్రాంచీకి వెళ్లి విషయాన్ని చెప్పాలి. ఆ డిపాజిట్లోని మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలని భావిస్తే.. క్లెయిమ్ ఫామ్‌ను సదరు బ్యాంకుకు సమర్పించాలి. మీరు బ్యాంక్ వెబ్సైట్ నుంచి/బ్రాంచ్ నుంచి ఈ ఫామ్‌ను పొందొచ్చు. దీంతోపాటు బ్యాంకు వారికి ఖాతాదారు బ్యాంక్ పాస్‌బుక్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. చనిపోయిన మీ కుటుం బ సభ్యుల ఖాతాకు సంబంధించి క్లెయిమ్ చేసుకోవాలంటే అప్పుడు వారి మరణ ధ్రువీకరణ పత్రాన్నీ బ్యాంకుకు సమర్పించాలి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను క్లెయిమ్ చేస్తే... అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ ఖాతాలు ఉండొచ్చు. ఫిక్స్డ్ డి పాజిట్ల వడ్డీ రేట్లు, ఇతర ఖాతాల వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ మీరు అన్ క్లెయిమ్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బును క్లెయిమ్ చేసుకోవాలంటే అప్పుడు బ్యాంకు మీకు సాధారణ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటునే చెల్లిస్తుంది. ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గతేడాది ఫిబ్రవరిలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఒక ప్రకటన జారీ చేసింది.బ్యాంకులు అన్క్లెయిమ్డ్ డిపాజిటర్ల వివరాల సేకరణపై అధిక దృష్టి కేంద్రీకరించాలని బ్యాంకులకు సూచించింది. 2015, మార్చి 31 నాటికి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఆయా బ్యాంకులు వాటి వెబ్సైట్లలో తప్పక ఉంచాలని ఆదేశించింది. బ్యాంక్ వెబ్సైట్లలో మనకు ఖాతాదారు పేరు, అడ్రస్ మాత్రమే కనిసిస్తాయి. అకౌంట్ నంబర్, బ్రాంచ్ వివరాలు ఉండవు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా బ్యాంకులు సెర్చ్ ఆప్షన్‌ను ఉంచాలని, బ్యాంకులు ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని కూడా ఆర్బీఐ సూచించింది. క్లెయిమ్ ఫారాలను వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని కూడా పేర్కొంది. -
మేలుకో పాలసీదారుడా మేలుకో..
బీమా పాలసీలతో అనేక ప్రయోజనాలున్నాయి. జీవితంలో ఊహించడానికి వీలులేని సంఘటన ఏదైనా జరిగితే మనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అంతేకాదు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో బీమాపై ప్రజల్లో అవగాహన క్రమేపీ పెరుగుతోంది. కేవలం పాలసీ తీసుకోవడమే కాకుండా దానిపై ఉండే హక్కులపై కూడా అవగాహన పెంచుకోవాలి. పాలసీదారుడిగా వాటి హక్కులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. బీమా లో పాలసీదారునికి ఉండే హక్కులను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పాలసీ కొనుగోలు సంబంధిత హక్కులు, కొనుగోలు తర్వాత పాలసీ సర్వీసులను పొందే హక్కులు, క్లెయిమ్ సంబంధిత హక్కులు. కొనుగోలు హక్కులు బీమా కంపెనీలు పాలసీలను విక్రయించడానికి శత విధాలా ప్రయత్నిస్తాయి. తొందరపడి వారి బుట్టలో పడొద్దు. ముందుగా బీమా కంపెనీకి సంబంధించిన విషయాలతోపాటు, ఆ పథకం వివరాలన్నీ ఏజెంట్‌ను క్షుణంగా అడిగి తెలుసుకోండి. పాలసీ కొనుగోలుదారునిగా ఈ పథకానికి సంబంధించిన అంశాలతో పాటు బీమా కంపెనీ గత చరిత్ర, దాని పనితీరును, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ఫిర్యాదుల పరిష్కారం వంటి పలు అంశాలను అడిగి తెలుసుకునే హక్కు ఉంది. అవసరమైతే ఈ విషయాలను కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా పొందొచ్చు. మీరు ఎంచుకున్న పథకానికి సంబంధించిన లాభ నష్టాలను తెలియజేయాలి. ఏదైనా పథకం సూచించేటప్పుడు అతని వయసు, ఆర్థిక లక్ష్యాలను తప్పక పరిగణలోకి తీసుకోవాలి. అలాకాకుండా కస్టమరే ఏదైనా పథకాన్ని ఎంచుకుంటే... ఆ పథకానికి అతను అర్హుడా? కాదా? అనే అంశాన్ని 15 రోజుల్లోగా బీమా కంపెనీ తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే పాలసీ కట్టించుకుంటే 30 రోజుల్లో డాక్యుమెంట్లను కస్టమర్లకు అందివ్వాలి. బీమా కంపెనీలు కస్టమర్ల వద్ద నుంచి అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలి. కస్టమర్లు కూడా ఎలాంటి ఇతర సమాచారాన్ని వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని బీమా కంపెనీలు బయటి వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవు. పాలసీ సర్వీసులను పొందే హక్కులు ఒక్కసారి పాలసీని తీసుకున్న తర్వాత ఆ పాలసీ ప్రయోజనాలను పొందే హక్కు వస్తుంది. ఒకవేళ ఆ పాలసీని వద్దనుకుంటే దాన్ని 15 రోజుల్లోగా తిరస్కరించే అవకాశం ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఇలా 15రోజుల్లోగా పాలసీని రద్దు చేసుకున్నప్పుడు సదరు బీమా కంపెనీ స్టాంప్ డ్యూటీ చార్జీలను, వైద్యపరీక్షల ఖర్చులను మినహాయించుకొని తిరిగి మన ప్రీమియాన్ని మనకు చెల్లిస్తుంది. కస్టమర్ బీమా కంపెనీ సర్వీసులు, ప్రాడక్టుతో సంతృప్తి చెందకపోతే అతను బీమా కంపెనీ నోడల్ ఆఫీస్‌లో కానీ, అంబూడ్స్‌మెన్, లేదా కన్సూమర్ కోర్టులో కానీ ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన తర్వాత ఈ కేసును 14 రోజుల్లోగా ముగించాల్సి ఉంటుంది. క్లెయిమ్ సంబంధిత హక్కులు బీమా కంపెనీ నిర్దేశించిన సమయంలో కస్టమర్‌కు లేదా అతని సంబంధీకులకు క్లెయిమ్‌ను అందిస్తే ఎలాంటి గొడవ ఉండదు. కానీ క్లెయిమ్ సెటిల్మెంట్లలో ఏవైనా జాప్యాలు జరిగితేనే అసలు సమస్య. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కంపెనీకి ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే క్లెయిమ్ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా అడగాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా దర్యాప్తు అవసరమైతే 180 రోజుల్లోగా పూర్తి చేయాలి. ఎలాంటి దర్యాప్తు అవసరం లేకపోతే 30 రోజుల్లోగా క్లెయిమ్‌ను సెటిల్ చేయాలి. -
చేదుగా మారుతున్న 'రసగుల్లా'..!
రసగుల్లా కథ కంచికి చేరేట్టు కనిపించడం లేదు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య మొదలైన 'రస'వత్తరమైన చర్చకు తెరపడటం లేదు. రసగుల్లా వంటకం మాదంటే మాదంటూ.. పేటెంట్ కోసం రెండు రాష్ట్రాల గొడవలు ముదిరి రసకందాయంలో పడ్డాయి. న్యాయ నిర్ణేతగా తమిళనాడుకు బాధ్యతలు అప్పగించినా... విషయం తేలేట్టు కనిపించడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ మినిస్టర్ డాక్యుమెంటరీలున్నాయంటూ వాదన లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. భారత దేశానికి తూర్పుభాగంలో ప్రసిద్ధి చెందిన తియ్యని పంచదార వంటకం.. ఇప్పుడు రెండు రాష్ట్రాలమధ్య చేదుగా మారింది. రసగుల్లా పూరిలో పుట్టిందని ఒడిశా... కోల్ కతాలో పుట్టిందని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కొన్నాళ్ళుగా కొట్టుకుంటున్నాయి. పేటెంట్ హక్కులు తమకే కావాలంటూ ఇరు రాష్ట్రాలూ పోటీ పడుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ మంత్రి మళ్ళీ రసగుల్లాకు తామే యజమానులమనడం తగవుకు దారితీసింది. రసగుల్లా బెంగాల్ దేనని నిరూపించడానికి తమ వద్ద పుష్కలంగా ఆధారాలు (డాక్యుమెంటరీలు) ఉన్నాయని మంత్రి రబిరంజన్ చటోపాధ్యాయ అనడం మళ్ళీ మొదటికొచ్చింది. రసగొల్లాగా పిలిచే... గుండ్రని తీపి పదార్థం కేవలం బెంగాల్ కు చెందినదేనని, ఒడిషా ఆరు వందల ఏళ్ళక్రితం తమ రాష్ట్రంలో పుట్టిందని చెప్పినా తగిన.. ఆధారాలు (డాక్యుమెంటరీలను) చూపించ లేకపోయిందని వెస్ట్ బెంగాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అంటున్నారు. అయితే పంచదార పాకాన్ని ఆరు వందల ఏళ్ళక్రితమే తమ రాష్ట్రం కనుగొందని, దీనిపై నిర్థారణకోసం ఒడిశా ప్రభుత్వం మూడు కమిటీలను కూడ వేసిందని ఒడిశా మంత్రి ఇటీవల తెలిపారు. అంతేకాదు తమ రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయంలో మొదటిసారి 12వ శతాబ్దంలోనే ఈ స్వీట్ వడ్డించినట్లుగా ఆధారాలున్నాయని, బెంగాల్ చూపించే ఆధారాలు 150 ఏళ్ళ క్రితం వేనని అంటున్నారు. కాగా బెంగాల్ ప్రభుత్వం ఈ రుచికరమైన వంటకం తమదేనంటూ తాజాగా ఓ అప్లికేషన్ సమర్పించడంతోపాటు, దానికి సంబంధించిన వివరణాత్మక పత్రాలను కూడ అందజేసినట్లు బెంగాల్ మినిస్టర్ చెప్పారు. -
క్లెయిమ్ తిరస్కరించకుండా జాగ్రత్తలు ఇవీ!
వి.విశ్వానంద్: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కుటుంబ పెద్దకి జరగకూడనిదేదైనా జరిగినా.. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులపాలు కాకుండా చూసేందుకు తీసుకునేదే జీవిత బీమా పాలసీ. అయితే, కొన్ని సందర్భాల్లో క్లెయిములు తిరస్కరణకు గురవుతుంటాయి. ఇలాంటప్పుడు... అసలు పాలసీ లక్ష్యమే దెబ్బతింటుంది. బీమా కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల క్లెయిమ్‌లను తిరస్కరించేందుకు చట్టబద్ధమైన కారణాలే ఉంటాయి. వీటిని గురించి కొంత అవగాహన ఉన్నట్లయితే, క్లెయిమ్‌లు తిరస్కరణకు గురి కాకుండా జాగ్రత్తపడే వీలుంటుంది. ప్రపోజల్ ఫారంలో వివరాలన్నీ ఉండాలి.. చాలామటుకు పాలసీదారులు తమ పాలసీ దరఖాస్తును సొంతంగా నింపకుండా.. బీమా ఏజెంట్లకే వదిలేస్తుంటారు. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే సేల్స్ టార్గెట్లను సాధించాలన్న తాపత్రయంతో వారు కొన్ని సందర్భాల్లో సరైన సమాచారాన్ని దరఖాస్తుల్లో పొందుపర్చకపోవచ్చు. లేదా వారికి పాలసీదారు ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు దరఖాస్తులో అరకొర సమాచారం మాత్రమే పొందుపర్చడం జరుగుతుంది. ఈ వివరాల ఆధారంగానే బీమా కంపెనీ పాలసీ జారీ చేస్తుంది. ఒకవేళ బీమా కంపెనీ మీరు దరఖాస్తులో పూర్తి వివరాలు పొందుపర్చలేదని భావించినా, ఏవైనా వివరాలు సరిగ్గా ఇవ్వలేదని భావించినా ఆ కారణం మూలంగానైనా క్లెయిమును తిరస్కరించే అవకాశాలున్నాయి. కాబట్టి, వృథా శ్రమ అని భావించకుండా ఎవరి దరఖాస్తును వారే పూర్తి చేయడం మంచిది. పాలసీ రెన్యువల్ మర్చిపోవద్దు.. యాక్టివ్‌గా ఉన్న పాలసీల క్లెయిములను మాత్రమే బీమా సంస్థలు సెటిల్ చేస్తాయి. కనుక ప్రీమియంను గడువులోగా కట్టేయాలి. లేకపోతే, ప్రీమియంలు చెల్లించకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోయిందన్న కారణంతోనూ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల సమయంలోగా ప్రీమియం కట్టలేకపోతే.. గ్రేస్ పీరియడ్లోనైనా కట్టేసేందుకు ప్రయత్నించాలి. సమాచారాన్ని దాచిపెట్టొద్దు.. మీరు దరఖాస్తులో పొందుపర్చే ప్రతీ వివరమూ కీలకమే. దీని ఆధారంగానే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ణయిస్తుంటాయి. మీ వయస్సు, వృత్తి, స్మోకింగ్.. డ్రింకింగ్ అలవాట్లు, అప్పటికే ఉన్న రుగ్మతలు, కుటుంబ ఆరోగ్య వివరాలు, ఇతరత్రా ఉన్న పాలసీల సమాచారం మొదలైనవన్నీ కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ఏ వివరాన్నీ కూడా కప్పిపుచ్చకుండా అన్నీ అందజేయండి. లేదా క్లెయిము రిజెక్ట్ కావడానికి ఇవి కూడా కారణాలు కావొచ్చు. అలాగే అనారోగ్య సమస్యల విషయానికొస్తే.. పాలసీ కింద ఏయే వ్యాధులకు కవరేజీ ఉంటుందో క్షుణ్నంగా తెలుసుకోవాలి. నామినేషన్ వివరాలు అప్డేట్గా ఉండాలి.. సాధారణంగా వివాహం జరగడానికి ముందు తీసుకునే పాలసీల్లో తల్లిదండ్రులనే నామినీలుగా దరఖాస్తుల్లో పేర్కొంటూ ఉంటాం. అయితే వివాహం జరిగిన తర్వాత జీవిత భాగస్వామి పేరును కూడా చేర్చడం ఉత్తమం. ఇలాంటి మార్పులు, చేర్పులు ఏవైనా ఉంటే బీమా కంపెనీకి తప్పనిసరిగా తెలియజేసి నామినీ వివరాలను అప్డేట్ చేస్తే.. తదుపరి చెల్లింపుల్లో సమస్యలు ఉండవు. ఇక, చివరిగా .. క్లెయిమ్‌ను ఫైల్ చేయడంలో జాప్యం కూడదు. ఇది సందేహాలకు దారితీయొచ్చు.. క్లెయిమ్ చెల్లింపు ప్రక్రియ జాప్యం కావొచ్చు. సాధారణంగా బీమా కంపెనీలు క్లెయిమ్స్ విషయంలో సహాయం చేసేందుకు ప్రత్యేక అధికారి సర్వీసులు అందిస్తుంటాయి. మాట్లాడటానికి కష్టతరమైన అంశమే అయినప్పటికీ.. పాలసీదారు తాను తీసుకున్న పాలసీల గురించి, ఏజెంటు కాంటాక్టు నంబరు, జీవిత బీమా సంస్థ గురించి, క్లెయిముకు అవసరమైన పత్రాల గురించి నామినీలకు అన్ని వివరాలు తెలియజేయాలి. బంగారం... నెల గరిష్టం విదేశీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతుండటం, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరగటం వంటి తదితర అంశాల వల్ల దేశంలో బం గారం ధరలు నెల గరిష్ట స్థాయికి చేరాయి. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,490తో పోలిస్తే రూ.265 పెరిగి రూ.26,755 వద్ద ముగిసింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,340తో పోలిస్తే రూ.265 పెరిగి రూ.26,605 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఒకానొక సందర్భంలో నెల గరిష్ట స్థాయి అయిన 1,156 డాలర్లకు చేరింది. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారంగా ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ ప్రకటనతో 1,145 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది అంతక్రితం వారంతో పోలిస్తే 8 డాలర్లు అధికం. -
క్లెయిమ్‌కు దారిదీ!
బీమా కంపెనీలందించే సేవల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది క్లెయిమ్. అన్ని కాగితాలతో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే కంపెనీలు ఏడు రోజుల్లోపే వీటిని పరిష్కరిస్తాయి. కానీ సరైన సమాచారం ఇవ్వకుండా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే మటుకు బీమా కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. అసలు క్లెయిమ్ చెయ్యడానికి ఏవి అవసరమో, ఏ పత్రాలు కావాల్సి వస్తాయో ఓసారి చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్.. ఇందులో 2 రకాల క్లెయిమ్లుంటాయి. ఒకటి క్యాష్‌లెస్. మరోటి రీ-ఇంబర్స్మెంట్. క్యాష్‌లెస్ సౌకర్యం ఉంటే బీమా కంపెనీ సూచించిన ఆసుపత్రిలో చేరి పాలసీతో పాటు మీకిచ్చిన కార్డును ఇస్తే సరిపోతుంది. మిగిలినదంతా వారే చూసుకుంటారు. అదే రీ-ఇంబర్స్మెంట్ అయితే కనుక బిల్లులు మొత్తం జాగ్రత్త చేసి వాటిని క్లెయిమ్ దరఖాస్తుతో పాటు జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బీమా కంపెనీ వీటిని పరిశీలించిన తర్వాత క్లెయిమ్‌ను సెటిల్ చేస్తుంది. హోమ్ ఇన్సూరెన్స్.. ఇతర క్లెయిమ్‌లతో పోల్చితే హోమ్ ఇన్సూరెన్స్ విషయంలో కొద్దిగా హోం వర్క్ ఎక్కువ చేయాలి. వరదలు, తుపాను, అగ్ని ప్రమాదం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టం వివరాలను పూర్తిగా వాటి వాస్తవ విలువలతో తెలియజేయాల్సి ఉంటుంది. ఇతర సంఘటనలో జరిగిన నష్టాల్లో కూడా నష్టపోయిన ఆస్తి విలువలను (అసలు) పేర్కొంటూ క్లెయిమ్ మొత్తాన్ని కోరాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసిన తర్వాత సర్వేయర్ వచ్చి నష్టం విలువ అంచనా వేస్తాడు. అదే దొంగతనం, దోపిడీ వంటి విషయాల్లో అయితే పై వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆనంద్కి దూరదృష్టి ఎక్కువే. తను ఉన్నా.. లేకున్నా తన కుటుంబం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ పడకూడదన్న ఉద్దేశంతో అన్ని చర్యలూ తీసుకున్నాడు. ఇందులో భాగంగానే తగిన బీమా పాలసీ కూడా తీసుకున్నాడు. కానీ, తను అమితంగా ప్రేమించే జీవిత భాగస్వామికి ఎలాంటి కష్టాలూ రాకూడదన్న ఉద్దేశంతో పాలసీలు తీసుకున్న ఆనంద్.. ఆవిషయాన్ని మాత్రం భార్యకు చెప్పలేదు. అప్పుడప్పుడు ఆయన చెప్పబోతే.. అలాంటి అపశకునం మాటలెందుకంటూ ఆయన భార్య పెద్ద రాద్ధాంతమే చేసేది. దీంతో ఎప్పుడూ వారిద్దరూ తమ పాలసీలు, క్లెయిమ్‌ల గురించి చర్చించుకోవటమే కుదరలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రమాదాలు మనకు తెలిసిరావు. ఒక రోజు ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆనంద్ అక్కడికక్కడే మరణించాడు. అప్పుడు మొదలయ్యాయి ఆయన భార్య కష్టాలు. అసలు ఆనంద్ ఏ పాలసీలు తీసుకున్నాడో ఆమెకు తెలియదు. ఆయన ఎక్కడెక్కడ డిపాజిట్లు చేశాడో కూడా తెలియదు. ఇంట్లో ఉన్న పత్రాల ఆధారంగా కొన్ని పాలసీల గురించి తెలుసుకుంది. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలన్న అవగాహన కూడా ఆమెకు లేదు. చివరికి బంధువుల సహాయంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటూనే క్లెయిమ్‌లు పూర్తి చేసింది. ఇంకా విచిత్రమేమిటంటే ఆనంద్ మరణించిన ఆరు నెలలకు ఓ బీమా కంపెనీ నంచి ప్రీమియం కట్టాలంటూ లేఖ వచ్చింది. దాంతో ఆ పాలసీ కూడా ఉన్నట్లు ఆయన భార్యకు తెలిసి.. ఆ క్లెయిమ్ కూడా పూర్తి చేసింది. ఆనంద్ కట్టిన పాలసీలన్నింటినీ ఆయన భార్య క్లెయిమ్ చేసిందా. అన్న ప్రశ్నకు నిజామానికి ఆమె దగ్గర సమాధానమే లేదు. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కుటుంబీకులతో చర్చించకపోతే అసలు లక్ష్యం నెరవేరటం కష్టం. పెపైచ్చు క్లెయిమ్‌పై కూడా అవగాహన అవసరం. లేదంటే సమయం, డబ్బు వృథా కాకతప్పదు. జీవిత బీమాతో పాటు, ఆటో, హెల్త్, ట్రావెల్, ఇన్సూరెన్స్‌ల విషయంలో క్లెయిమ్ ఎలా చేయాలన్న విషయమై అవగాహన పెంచేందుకు ఈ ప్రాఫిట్ కథనం.. మోటార్ ఇన్సూరెన్స్.. ఇందులో యాక్సిడెంట్ క్లెయిమ్, ఓన్ డ్యామేజీ, దొంగతనం వంటి రకరకాల క్లెయిమ్లుంటాయి. ముందుగా యాక్సిడెంటల్ క్లెయిమ్ గురించి చూస్తే. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. - ప్రమాదానికి మరో వాహనం కారణమైతే వెంటనే ఆ వాహనం నంబర్ రాసుకోవాలి. - అలాగే ఆ ప్రమాదానికి ఎవరైన ప్రత్యక్ష సాక్షులుంటే వారి వివరాలు, చిరునామా లేదా ఫోన్‌నంబర్లు సేకరించి పెట్టుకోవాలి. - ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించాలి. - ఒక వేళ మీరే ఎదుటి వాహనాన్ని ఢీకొన్నా.. థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం జరిగితే పారిపోకుండా సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం అందించండి. ఢీకొట్టి పారిపోవటాన్ని మన చట్టాలు అతిపెద్ద నేరంగా పరిగణిస్తాయి. - ప్రమాదం తర్వాత మీ వాహనం కదల్లేని స్థితిలో ఉంటే బీమా కంపెనీకి ఆ సమాచారం అందించి దగ్గర్లోని గ్యారేజీకి తీసుకెళ్లండి. - ప్రమాదం జరిగిన వెంటనే తొలుత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నాక క్లెయిమ్ కోసం బీమా కంపెనీని సంప్రదించాలి. నేరుగా లేదా ఏజెంట్ ద్వారా లేదా టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయవచ్చు. కావాల్సిన పత్రాలు.. - సంతకం చేసిన క్లెయిమ్ దరఖాస్తు - పాలసీ డాక్యుమెంట్లు (మొదటి రెండు పేజీలు) - వాహనం ఆర్సీ కాపీ - మీ డ్రైవింగ్ లెసైన్స్ - రిపేరు వ్యయానికి సంబంధించి ఒరిజినల్ బిల్ ఈ కాగితాలన్నీ జతపరిచి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే చాలు. థర్డ్‌పార్టీ, దొంగతనం, యాక్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజీలకే ఎఫ్ఐఆర్ కావాల్సి ఉంటుంది. క్లెయిమ్ దరఖాస్తు చేసిన 24 గంటల్లో సర్వేయర్ వచ్చి నష్టాన్ని అంచనా వేసి క్లెయిమ్ మొత్తాన్ని నిర్ధారిస్తాడు.ఇప్పుడు చాలా కంపెనీలు రిపేర్లకు క్యాష్‌లెస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంటే బీమా కంపెనీ ప్యానెల్లో ఉన్న గ్యారేజీల్లో ముందు డబ్బులివ్వకుండానే రిపేరు చేయించుకోవచ్చు. సర్వేయర్ గ్యారేజీకొచ్చి నష్టాన్ని చూసి క్లెయిమ్‌ను అంచనా వేస్తాడు. ఆ మొత్తాన్ని గ్యారేజీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇంకా ఎక్కువైతే ఆ మొత్తాన్ని మీరే చెల్లించాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్.. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనం విదేశాలకెళ్లినప్పుడు ప్రయాణంలో బ్యాగేజీ పోవడమో, దెబ్బతినటమో జరిగినప్పుడు ప్రయాణం ఆలస్యం వల్ల నష్టం జరిగినా విమానం రద్దు కావటమో మరోటి జరిగి ప్రయాణం రద్దయి నష్టపోతే.. పాస్‌పోర్ట్ పోవటం, ప్రమాదం, ఆసుపత్రి పాలు కావటం.. తదితరాలు జరిగితే బీమా ర క్షణ ఉంటుంది. ప్రయాణించేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఏ కంపెనీది తీసుకున్నారో ఆ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్, పాలసీ నంబర్ దగ్గర పెట్టుకోవటం మర్చిపోవద్దు. మీరు ఏ దేశంలో ఎక్కడ ఉన్నా క్లెయిమ్ సంభవించినప్పుడు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే కంపెనీ దగ్గర్లోని క్యాష్‌లెస్ సౌకర్యం ఉన్న ఆసుపత్రి వివరాలతో పాటు అక్కడెలా క్లెయిమ్ చెయ్యాలన్న విషయంలో కూడా మీకు సహాయం చేస్తుంది. జీవిత బీమా.. జీవిత బీమాలో క్లెయిమ్ రెండు రకాలు. ఒకటి మెచ్యూరిటీ క్లెయిమ్ కాగా, రెండోది డెత్ క్లెయిమ్. మెచ్యూరిటీ క్లెయిమంటే పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత పాలసీదారు చేతికి వచ్చే మొత్తం. దీనికి మనం చేయాల్సింది ఏమీ ఉండదు. పాలసీ కాలపరిమితి ముగియగానే చాలా బీమా కంపెనీలు నేరుగా మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాయి. లేదంటే మీ పేరు మీద చెక్కును మీ ఇంటికే పంపిస్తాయి. దీనికన్నా నెల రోజుల ముందు మీ పాలసీ గడువు పూర్తి కావ స్తోందని.. మెచ్యూరిటీ క్లెయిమ్ అందబోతోందని చెబుతూ ఒక పత్రాన్ని పంపిస్తాయి. దానిపై సంతకం పెడితే చాలు. అలాంటి పత్రాలేవీ రానట్లయితే దగ్గర్లోని బ్రాంచిని కానీ, ఏజెంట్‌ను కానీ సంప్రదిస్తే దానికి సంబంధించిన కాగితాలిస్తారు. డెత్ క్లెయిమ్.. మెచ్యూరిటీ క్లెయిమ్‌తో పోలిస్తే దీని విధానం కొంత సుదీర్ఘం. ఇక్కడ పాలసీదారుడికి కాకుండా నామినీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి కంపెనీలన్నీ క్లెయిమ్‌లను ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా పరిశీలించి కానీ సెటిల్ చెయ్యవు. ఎలాంటి వివాదాలు లేకుండా అన్ని కాగితాలు ఉంటే క్లెయిమ్‌ను దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లోపు సెటిల్ చేస్తారు. లేదంటే కొంత ఆలస్యమవుతుంది. అయితే బీమా నియంత్రణ రెగ్యులేటరీ సంస్థ (ఐఆర్ డీఏ) నిబంధనల ప్రకారం ఏ క్లెయిమ్నైనా దరఖాస్తు చే సిన 30 రోజుల్లోగా సెటిల్ చేయాలి. లేకపోతే వివాదాల పరిష్కార సెల్‌ను ఆశ్రయించవచ్చు. ఇవీ కావాల్సిన పత్రాలు.. - బీమా కంపెనీలకు క్లెయిమ్ కోరుతూ ఇచ్చే దరఖాస్తుతో పాటు పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. - ప్రమాదంలో మరణించినట్లయితే దాని ఎఫ్ఐఆర్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వాలి. - ఏదైనా వ్యాధితో మరణిస్తే వైద్య చికిత్సకు సంబంధించిన కాగితాలు, డిశ్చార్జి కాగితాలు సమర్పించాల్సి ఉంటుంది. - మీరిచ్చిన సమాచారంతో బీమా కంపెనీలు తృప్తి చెందితే క్లెయిమ్‌ను వెంటనే పరిష్కరిస్తాయి. లేకపోతే అదనపు సమాచారాన్ని అడగవచ్చు. సాధారణ బీమా విషయానికొచ్చే సరికి ఇందులో మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి అవసరమైన సందర్భాల్లో క్లెయిమ్ చెయ్యటం మాత్రమే ఉంటుంది. వీటిలో చాలా కేసుల్లో మనకు ఎఫ్ఐఆర్ అవసరమవుతుంది. మోటార్ ఇన్సూరెన్స్, హోమ్, హెల్త్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ ఎలా చేయాలో, ఏ పత్రాలు అవసరమవుతాయో ఓ సారి చూద్దాం. మొదట ఏం చేయాలంటే.. - పాలసీదారు మరణించిన సందర్భంలో క్లెయిమ్ కు ఆ మరణం విషయాన్ని సాధ్యమైనంత త్వర గా బీమా కంపెనీకి లిఖిత పూర్వకంగా తెలపాలి. - పాలసీదారు పేరు, పాలసీ నంబర్, మరణించిన తేదీ, మరణానికి కారణం, క్లెయిమ్‌కు దరఖాస్తు చేసిన వారి వివరాలు తెలియజేయాలి. - క్లెయిమ్ ఫారాన్ని మీ దగ్గర్లోని బ్రాంచి కార్యాలయం లేదా బీమా ఏజెంట్ ద్వారా పొందవచ్చు. కంపెనీ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంపెనీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి క్లెయిమ్ చేయడానికి తగిన సమాచారాన్ని ఇస్తారు. -
ఇక ఆన్లైన్లోనే పీఎఫ్ క్లెయింల పరిష్కారాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల ‘భవిష్య నిధి (పీఎఫ్) క్లెయింలను త్వరలో ఆన్లైన్లోనే ఖాతాదారులు పరిష్కరించుకునే విధంగా ఈపీఎఫ్‌వో చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ మధ్యలో పూర్తిస్థాయిలో కొత్త విధానం అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. ఇది 5 కోట్ల మంది ఖాతాదారులకు ఉపకరిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారు తమ క్లెయింలను పొందేందుకు నిబంధనల ప్రకారం నెల, అంతకు మించి సమయం తీసుకుంటోంది. ఆన్లైన్ విధానంలో దీన్ని అధిగమించి దరఖాస్తు చేసుకున్న మూడురోజుల్లోనే పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. అయితే దీనికోసం సభ్యులు తమ ఆధార్, బ్యాంకు ఖాతాలను పీఎఫ్‌తో అనుసంధానించాల్సిన అవసరం ఉంది. కొత్త విధానం అమల్లోకి వస్తే అవినీతి, అక్రమాలకు కూడా కళ్లెం పడనుందని అధికారులు భావిస్తున్నారు. -
తుపాన్ క్లెయిమ్స్ కోసం..
హుదూద్ తుపాన్ వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించడానికి బీమా కంపెనీలు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నాయి. బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హుదూద్ తుపాన్ బాధితుల కోసం 1800 209 7072 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను బజాజ్ అలయంజ్ ఏర్పాటు చేసింది. ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవడంతో పాటు, క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఐసీఐసీఐ లాంబార్డ్ జరిగిన నష్టం వివరాలకు సంబంధించి తక్కువ కాగితాలను సమర్పించడం ద్వారా క్లెయిమ్‌ను వేగవంతంగా పరిష్కరించే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు, సర్వేయర్ అంచనా, కేవైసీ నిబంధనలు ఇస్తే సరిపోతుంది. అలాగే వాహనానికి సంబంధించి ఆర్సీతో పాటు మరమ్మత్తులకు సంబంధించి మెకానిక్ ఇన్వాయిస్ బిల్ ఇస్తే సరిపోతుంది. హెచ్‌డీఎఫ్‌సీలైఫ్ జీవిత బీమా క్లెయిమ్‌లకు సంబంధించి హెచ్డీఎఫ్సీ లైఫ్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల వాళ్లు 9885097340 అనే నెంబర్లో మహేశ్‌ని, విశాఖపట్నంలో 9848283713 అనే నంబర్లో రామ్.కే, ఒరిస్సా బరంపురంలో శ్రీధర్ పాండాని 9853257626 అనే నంబర్లలో సంప్రదించవచ్చు. ఇది కాకుండా 18602679999 అనే టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సేవలు పొందవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కేవలం మూడు డాక్యుమెంట్లతో జీవిత బీమా క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ కోరుతూ రాత పూర్వక సమాచారంతో పాటు నామినీ ఫోటో గుర్తింపు కార్డు, పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. 24 గంటలు సేవలు అందించడానికి 18602667766 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. -
సులభంగా క్లెయిమ్
బీమా కంపెనీ పనితీరును గుర్తించడంలో క్లెయిమ్‌ల పరిష్కారం అనేది చాలా ప్రధానమైనది. అందుకే ఇప్పుడు బీమా కంపెనీలు త్వరితగతిన క్లెయిమ్ పరిష్కారంపై దృష్టి సారిస్తున్నాయి. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి చికాకులు లేకుండా సులభంగా క్లెయిమ్ మొత్తం పొందొచ్చు. క్లెయిమ్ సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను తెలుసుకుందాం... కంపెనీకి తెలియ చేయడం క్లెయిమ్‌లో అత్యంత కీలకమైన, ముఖ్యమైన అంశం ఏమిటంటే..పాలసీదారుడి మరణానికి సంబంధించిన వార్త బీమా కంపెనీకి తెలియచేయడమే. అప్పటి నుంచే క్లెయిమ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. సాధ్యమైనంత తొందరగా కంపెనీ కార్యాలయంలో కాని లేదా ఈ మెయిల్ ద్వారా కాని వివరాలను చెప్పొచ్చు. పాలసీదారుని పేరు, పాలసీ నంబర్, మరణం సంభవించిన తేదీ, మరణానికి కారణం, క్లెయిమ్ కోరుతున్నవారి వివరాలన్నీ తెలియచేయాలి. ఇవన్నీ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇవి అందితేనే క్లెయిమ్ ప్రక్రియ మొదలవుతుంది. ఇవి జత చేయాలి.. ప్రాథమికంగా క్లెయిమ్ గురించి బీమా కంపెనీకి తెలియచేసిన తర్వాత అధికారికంగా క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కొన్ని కాగితాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. క్లెయిమ్ దరఖాస్తును పూర్తి చేసి దానిని ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్‌తో బీమా కంపెనీకి అందచేయాలి. వీటితో పాటు మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న మరణ ధుృవీకరణ పత్రంతో పాటు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తున్న నామినీ ఫొటోలు, గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. జత చేసే జిరాక్స్ కాపీలన్నీ కనీసం ఏదైనా ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేయించాలి. సాధారణంగా బీమా కంపెనీకి ఈ వివరాలు సరిపోతాయి. కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌ను బట్టి అదనపు సమాచారాన్ని అడుగుతాయి. కాలపరిమితి ఉందా? క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయడానికి ఎటువంటి కాలపరిమితి లేదు కాని ఆలస్యం కాకుండా ఉండాలంటే ఎంత తొందరగా క్లెయిమ్ చేసుకుంటే అంత తొందరగా పూర్తవుతుంది. కాని క్లెయిమ్‌కు దరఖాస్తు చేసిన తర్వాత గరిష్టంగా 30 రోజుల్లో క్లెయిమ్‌ను పరిష్కరించాలని, ఒకవేళ ఆలస్యం అయితే దానికి గల కారణాలను తెలియచేయాలని ఐఆర్డీఏ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు క్లెయిమ్ స్టేటస్‌ను ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఒక వేళ బీమా కంపెనీ సరైన కారణాలు చూపకుండా క్లెయిమ్ పరిష్కారం చేయడంలో ఆలస్యం చేస్తే ఐఆర్డీఏకి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐజీఎంఎస్)ను సంప్రదించవచ్చు. లేదా పాలసీదారుడు వినియోగదారుల ఫోరం, కోర్టు, అంబుడ్స్‌మన్‌లో ఏదో ఒకదాన్ని ఆశ్రయించవచ్చు. -
మార్గదర్శకాలు పాటించాల్సిందే
క్రియాశీలంగాలేని పీఎఫ్ ఖాతాలపై కార్యాలయాలకు ఈపీఎఫ్ఓ ఆదేశాలు న్యూఢిల్లీ: క్రియాశీలకంగాలేని ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించడంలో మార్గదర్శక సూత్రాలను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి అక్రమాలు జరక్కుండా నివారించేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన క్షేత్రస్థాయి కార్యాలయాలను ఆదేశించింది. వరుసగా 36 నెలలపాటు ఈపీఎఫ్ఓకు ఎలాంటి చెల్లింపులు జరపని పీఎఫ్ ఖాతాలను క్రియాశీలకంగా లేని ఖాతాలుగా వర్గీకరించారు. ఇలాంటి ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కారంలో ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, అక్రమాలను నివారణకు, క్లెయిమ్‌లు సక్రమమేనని ధ్రువీకరించుకునేందుకు, వాస్తవికమైన క్లెయిమ్దారులకే చెల్లింపులు జరిగేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఈపీఎఫ్ఓ తన సిబ్బందిని ఆదేశించింది. ఈపీఎఫ్ఓ ఈ మేరకు ఒక ఉత్తర్వు కూడా జారీ చేసింది. క్రియాశీలకంగాలేని ఖాతాల క్లెయిమ్‌ల పరిష్కారం కావాలంటే నిబంధనల ప్రకారం సంబంధిత యాజమాన్యంనుంచి క్లెయిమ్‌ల ధ్రువీకరణ అవసరమని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఒకవేళ, క్లెయిమ్దారును గుర్తించే యాజమాన్య సంస్థ అందుబాటులో లేనపుడు, బ్యాంకు అధికారులు గుర్తింపును ధ్రువీకరించాలని, ఇందుకు కేవైసీ(నో యువర్ కస్టమర్) ఫారం, నివాస ధ్రువీకరణ అవసరమని ఈపీఎఫ్ఓ తెలిపింది. ప్రభుత్వం జారీచేసే, పాన్‌కార్డు, ఓటర్ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ఈఎస్ఐ గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లెసైన్స్ లేదా ఆధార్ కార్డులను కేవైసీ ఫారంగా ఉపయోగించుకోవచ్చు. క్లెయిమ్‌దారుకు చెల్లించవలసిన మొత్తం రూ. 50,000కు మించినట్టయితే, అందుకు అసిస్టెంట్ ప్రావిడెంట్ కమిషనర్ ఆమోదం అవసరమని, చెల్లింపు జరపవలసిన మొత్తం రూ. 25,000లకు పైబడి, రూ. 50,000లకు లోబడి ఉంటే, అక్కౌంట్స్ ఆఫీసర్ ఆమోదం సరిపోతుందని, రూ. 25,000ల కంటే తక్కువగా ఉంటే డీలింగ్ అసిస్టెంట్ ఆమోదం అవసరమని ఈపీఎఫ్ఓ తెలిపింది. క్రియాశీలకంగాలేని ఖాతాలకు వడ్డీని జమచేసే ప్రక్రియను 2011 ఏప్రిల్ 1నుంచి ఈపీఎఫ్ఓ నిలిపివేసింది. అయితే, ఆ ఖాతాల క్లెయిమ్‌దారులు సదరు ఖాతాలనుంచి విత్‌డ్రాయల్, బదిలీకి దరఖాస్తుచేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 31వ రకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, క్రియాశీలకంగాలేని పీఎఫ్ ఖాతాల్లో రూ. 26,496.61 కోట్లు జమై ఉంది. -
మళ్లీ పుట్టాడు
-
మీ కారు బీమా మారుస్తారా..?
కారు కొనుక్కునేటప్పుడు అనేక విషయాలు ఆలోచిస్తాం. బోలెడంత రీసెర్చ్ చేస్తాం. మన లైఫ్‌స్టయిల్‌కి, బడ్జెట్‌కి తగినట్లుగా ఉంటుందా లేదా అనేది చూసుకుని కొంటాం. ఇలా లక్షలు పోసి కొనుక్కున్న కారు నుంచి పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందాలంటే .. దాని మెయింటెనెన్స్ కూడా ముఖ్యమే. అలాగే, ఎలాంటి దుర్ఘటనా జరగకుండా.. కారు రోడ్డెక్కడానికి ముందే బీమా రక్షణ ఉండటమూ అవసరమే. మరి బీమా పాలసీ తీసుకునే ముందు పాటించాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి చూద్దాం... చాలామటుకు పాలసీలు ఒకే విధంగా కనిపిస్తాయి. ఒకోసారి ఏది తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి తలెత్తుతుంటుంది. ఇలాంటప్పుడు అయిదు అంశాలను కొలమానంగా పెట్టుకుంటే పాలసీ ఎంపిక కొంత సులువవుతుంది. అవేంటంటే.. బ్రాండు, పాలసీ కవరేజీ, కస్టమర్ సర్వీసు, సేవల లభ్యత, ప్రీమియం. బ్రాండు.. కంపెనీ (బ్రాండు) ఎంత పెద్దదైనా కావొచ్చు. క్లెయిముల చెల్లింపులు తదితర అంశాల్లో దాని రికార్డు ఎలా ఉందో చూడాలి. ఎన్ని క్లెయిములు సెటిల్ చేసింది? క్లెయిమ్ సెటిల్మెంట్కు ఎంత సమయం తీసుకుంటోంది? ఇవన్నీ ఆయా బీమా కంపెనీల వెబ్సైట్లలో సాధారణంగా పొందుపర్చి ఉంటాయి. ఈ విషయాల్లో మెరుగైన ట్రాక్ రికార్డున్న సంస్థల పాలసీలు తీసుకుంటే మంచిది. ఒకవేళ ఇప్పటికే వేరే కంపెనీల నుంచి తీసుకున్నా.. మరొక కంపెనీకి బదలాయించుకునేందుకు మోటార్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ సదుపాయం కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో క్రితం పాలసీ ప్రయోజనాలేమీ నష్టపోనక్కర్లేదు. కవరేజీ... ఏ కంపెనీ నుంచి పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకున్నాక.. కవరేజీ గురించి చూసుకోవాలి. సాధారణంగా కారు ఇన్సూరెన్స్ పాలసీలో థర్డ్ పార్టీ లయబిలిటీ, ఓన్ డ్యామేజి అని రెండు కవరేజీలుంటాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీ తప్పనిసరి. ఓన్ డ్యామేజి అన్నది ఐచ్ఛికం. కానీ, ఈ రెండు కవరేజీలు ఉండేలా తీసుకుంటే అటు థర్డ్ పార్టీ రిస్కులతో పాటు ప్రమాదవశాత్తు కారుకేమైనా జరిగినా బీమా రక్షణ ఉంటుంది. కారు ప్రమాదానికి గురైనా, మంటలు.. తుపాను, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల్లోనూ, ఉగ్రవాద దుశ్చేష్టల్లో ధ్వంసమైనా బీమా రక్షణ లభిస్తుంది. ఇక, కారు ఢీకొనడం వల్ల వేరొకరు గాయపడినా, మరణించినా థర్డ్ పార్టీ లయబిలిటీ కింద కవరేజీ లభిస్తుంది. ప్రస్తుతం పాలసీల్లో పలు యాడ్-ఆన్ ఫీచర్లు కూడా వస్తున్నాయి. క్లెయిమ్ కారణంగా కారు రిపేర్ల కోసం గ్యారేజిలో ఉన్నంత కాలం పాలసీదారు రోజువారీ ప్రయాణ ఖర్చులను కూడా చెల్లించేలా యాడ్ ఆన్ కవరేజీ తీసుకోవచ్చు. ఇలాగే, నిల్ డెప్రిసియేషన్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్ట్ లాంటి యాడ్ ఆన్ కవరేజీలు కూడా ఉన్నాయి. అవసరాలకు అనుగుణమైన కవరేజీలను పాలసీదారు ఎంచుకుని తీసుకోవచ్చు. కస్టమర్ సర్వీసులు... మోటార్ ఇన్సూరెన్స్‌లో కస్టమర్ సర్వీసుల విషయానికొస్తే.. ముఖ్యంగా మూడంశాలుంటాయి. అవేంటంటే, పాలసీ జారీ చేయడం, క్లెయిమ్స్‌ని డీల్ చేయడం, ఫిర్యాదులను పరిష్కరించడం. గతంలోలా రోజుల తరబడి నిరీక్షించాల్సిన పని లేకుండా ప్రస్తుతం చాలా బీమా కంపెనీలు అప్పటికప్పుడు పాలసీలను జారీ చేస్తున్నాయి. మార్పులు, చేర్పులూ ఏమైనా చేయాల్సి వచ్చినా సత్వరమే చేస్తున్నాయి. ఇక క్లెయిమ్‌ల విషయానికొస్తే.. పలు కంపెనీలు క్యాష్‌లెస్ సెటిల్మెంట్ కోసం చాలా చోట్ల గ్యారేజీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తద్వారా పాలసీదారుకు శ్రమ తగ్గుతోంది. కాబట్టి, విస్తృతంగా గ్యారేజీలతో ఒప్పందాలు ఉండటంతో పాటు క్లెయిములను వేగంగా సెటిల్ చేసే బీమా కంపెనీలను ఎంచుకోవాలి. సేవల లభ్యత.. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఎవర్ని సంప్రదించాలో అర్థం కాని పరిస్థితి నెలకొనొచ్చు. ఇలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా .. పాలసీదారు అవసరాలకు అనుగుణంగా సత్వరమే స్పందించగలిగే కంపెనీని ఎంచుకోవాలి. పలు కంపెనీలు కస్టమర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ సేవలు అందిస్తున్నాయి. ప్రీమియం.. పాలసీ తీసుకోవడంలో.. ఎంత ప్రీమియం చెల్లిస్తున్నామన్నది ముఖ్యమే అయినా, ఇదే ప్రామాణికం కాకూడదు. అన్నింటికన్నా తక్కువ ప్రీమియం ఉందనే కారణంతో కంపెనీని ఎంచుకోకూడదు. పై అంశాలన్నీ చూసి మరీ సంస్థను ఎంచుకోవాలి. సాధారణంగా ప్రమాదాలు ఎంత ఎక్కువ జరిగే అవకాశం ఉంటే.. ప్రీమియాలూ అంత ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా కారు మోడల్, దాన్ని ఉపయోగించే ప్రాంతాన్ని బట్టి ప్రీమియం రేటు ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు కారు ఎంత పాతది, ఎందుకోసం ఉపయోగిస్తున్నారు, రోజువారీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది వంటివికూడా ప్రీమియం రేటు నిర్ధారణలో పరిగణనలోకి తీసుకుంటారు.