మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థలతో సహా రాబేయే అన్ని ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించిన కొద్దిరోజులకే శ్రీకాంత్ ఈవిధంగా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.
శుక్రవారం డోంబివలి యూనిట్‌లో శ్రీకాంత్ షిండే మాట్లాడారు. బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. కొంతమంది బీజేపీ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం షిండే వర్గానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. తనకు ఏ పదవిపై కోరిక లేదన్నారు. ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్నది కూటమే నిర్ణయింస్తుందని చెప్పారు. మహారాష్ట్రలో శివసేన కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యం అని శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే అన్నారు.
ఆ దిశగా తాము చేస్తున్న పనిని ఎవరైనా అడ్డుకున్నా.. లేదా కూటమిలో ఉంటూ ఇబ్బందులు పెట్టినా.. పదవులకు రాజీనామా చేసేందుకైనా సిద్ధమేననన్నారు. భవిష్యత్తులో, మంచి మెజారిటీతో గెలిచి, మహారాష్ట్రను అన్ని రంగాలలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేలా ప్రయత్నిస్తామని శ్రీకాంత్ షిండే చెప్పారు.
కాగా, లోక్‌సభ, విధానసభ మరియు స్థానిక సంస్థల ఎన్నికలతో సహా రాబోయే అన్ని ఎన్నికల్లో శివసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఏక్‌నాథ్ షిండే ఈ నెల ప్రారంభంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: మెల్లమెల్లగా బీజేపీ పట్టు కోల్పోతోంది.. నిన్న కర్ణాటక.. రేపు రాజస్థాన్.. )
Comments
Please login to add a commentAdd a comment