Srikanth
-
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిచారని..
బౌద్ధనగర్: పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలవడంతో ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన వారాసిగూడ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంనగర్ రామాలయం ప్రాంతానికి చెందిన మచ్చ శ్రీకాంత్ (32) ముషీరాబాద్ జీహెచ్‌హెంసీ సర్కిల్లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కారి్మకుడిగా పని చేస్తున్నాడు. అతడి భార్య శృతి క్యాటరింగ్లో పని చేస్తుంది. గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నెల 13న ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 16న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు శ్రీకాంత్‌కు సమాచారం అందించారు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ ఆదివారం చున్నీతో ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన అతడి తండ్రి స్థానికుల సహాయంతో కిందకు దించి 108కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘గేమ్ ఛేంజర్’ గెటప్‌తో ఇంటికి వెళ్లా..అమ్మ షాకైంది: శ్రీకాంత్
శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెబుతున్నారా? అని అనుకున్నాను.సెకండాఫ్ చెప్పిన తరువాత ఈ పాత్రను కచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. నా కారెక్టర్ అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది’అన్నారు నటుడు శ్రీకాంత్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘గేమ్ ఛేంజర్’లో నా గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా నాన్నగారి గెటప్ చూసే నాకు ఈ పాత్ర ఇచ్చారు. ఓ సారి ఆ గెటప్ వేసుకొని ఇంటికి వెళ్తే.. నన్ను చూసి మా అమ్మ షాకయ్యింది. అప్పుడే నా గెటప్ సరిగ్గా సెట్ అయిందని అర్థమైంది.→ నేను ఇంత వరకు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని నటించలేదు. కానీ అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది.ప్రోస్థటిక్ మేకప్‌కే నాలుగు గంటలు పట్టేది. నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. సినిమాకు ముఖ్యమైన క్యారెక్టర్ నాది. ఇంత మంది అవకాశం రావడం నా అదృష్టం.→ శంకర్ గారి పనితనం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సహనంతో ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ప్రతీ కారెక్టర్‌ను ఆయన నటించి చూపిస్తారు.→ గోవిందుడు అందరివాడేలే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి పని చేశాడు. అప్పుడు రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు చాలా ఎదిగాడు. గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు.→ ప్రస్తుతం ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్‌తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.→ అందరి డేట్లు సెట్ అవ్వకపోవడం వల్లే ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయింది. దాదాపు ఏడాది వేస్ట్ అయింది. దేవర షూటింగ్లో ఉన్నప్పుడు గేమ్ చేంజర్ కోసం అడిగారు. అలా అందరి డేట్లు సెట్ చేసుకుని షూటింగ్ చేసే సరికి ఆలస్యం అయింది.→ ప్రస్తుతం రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటున్నాను. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటు గట్టులో నటిస్తున్నాను. కళ్యాణ్ రామ్ మూవీలో నటిస్తున్నాను. సుష్మిత గోల్డెన్ బాక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. -
అల్లు అర్జున్ ను కలిసిన శ్రీకాంత్
-
రాజకీయ కక్షతోనే నాపై కేసు.. మీ అరెస్టులకు భయపడేది లేదు
-
గ్రాండ్‌గా ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లిలో రష్మిక, విజయ్, కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
విభిన్నంగా శ్రీకాంత్ లుక్
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయి దుర్గా తేజ్ నటిస్తున్న చిత్రం ‘ఎస్డీటీ 18’ (వర్కింగ్ టైటిల్). రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘ఎస్డీటీ 18’ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.శ్రీకాంత్ లుక్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్డీటీ 18’. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చేయని పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు సాయి దుర్గా తేజ్. అలాగే శ్రీకాంత్ పాత్ర విభిన్నంగా ఉంటుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియన్ మూవీగా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్. -
తెలుగులో సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరికొత్త కంటెంట్ ఉన్న సిరీస్‌లు, సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగులో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హరికథ.. సంభవామి యుగేయుగే. పీరియాడికల్ బ్యాప్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటి, బిగ్‌బాస్ దివి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సరికొత్త వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో తొలిఅడుగు వేయనుంది. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసింది సంగతి తెలిసిందే.త్వరలోనే హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
నాని కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా
-
ఇంగితజ్ఞానం లేదా పవన్ కళ్యాణ్... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
-
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మాజీ మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్
-
డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు ..
-
బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే స్కెచ్ వేసిన నాని
-
ఖడ్గంలో నన్ను తీసుకోవద్దన్నారు: శ్రీకాంత్
‘‘ఖడ్గం’ సినిమాలో నన్ను తీసుకోవద్దని నిర్మాత మధు మురళిగారు అన్నారు. కానీ కృష్ణవంశీ ధైర్యం చేసి, ఆయన్ని ఒప్పించి నన్ను తీసుకున్నారు. నా జీవితంలో ఈ సినిమాని మర్చిపోలేను. తరాలు మారినా దేశభక్తి చిత్రాలన్నింటిలో ‘ఖడ్గం’ గొప్ప చిత్రం. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, శివాజీ రాజా, షఫీ, సోనాలీ బింద్రే, సంగీత తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబర్ 29న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.కాగా ఈ నెల18న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాను’’ అని చెప్పారు. ‘‘ఖడ్గం’లో నేను చేయనని చెప్పాను. కానీ, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటిలో నాకు మంచి పేరు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే’’ అన్నారు శివాజీ రాజా. ‘‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ‘ఖడ్గం’. ఈ సినిమాలో చాన్స్ ఇచ్చి నా వనవాసం ముగింపునకు కారణమైన కృష్ణవంశీగారికి కృతజ్ఞతలు’’ అని నటుడు షఫీ తెలిపారు. -
22 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న దేశ భక్తి సినిమా
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన దేశ భక్తి సినిమా ఖడ్గం. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2002లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. అక్టోబర్ 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ, “మాకు ఈ సినిమా తీయడం లో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో ఈ సినిమా కి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం.22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా కి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్.” అని చెప్పారు.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ ఫిల్మ్స్ అన్నిటిలో ఖడ్గం ఒక గొప్ప చిత్రం. అసలు ఖడ్గం సినిమా లో నిర్మాత మధు మురళి నన్ను వద్దు ఆన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.” అన్నారు. ‘షనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు’ అని షఫి అన్నారు. -
వారికి కూడా.. మీతో సమానమైన వాటా వస్తుంది!
నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లలూ తల్లి వద్దనే ఉంటారు. మా తండ్రి గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా? – శరత్ కుమార్, రాజమండ్రిమీ తండ్రి నుంచి మీకు సంక్రమించిన ఆస్తి ఆయన స్వార్జితమై ఉండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి ఉంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కూ ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది ఉంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది.అలాకాకుండా మీ తండ్రి గారికి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయి వుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేక వాళ్ల అమ్మతోనే ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఒకవేళ మీతో΄ాటు ఇతర సంతానం అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ అమ్మగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాయనమ్మ) ఉంటే వారికి కూడా మీతో΄ాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటా అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ ΄÷ందే హక్కు ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఇవి చదవండి: సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్ -
అవయవాల అమ్మకం కథ కంచికేనా?
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా షెట్పల్లికి చెందిన రేవెళ్లి శ్రీకాంత్ అవయవ దానం వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా, అంబులెన్స్ నిర్వాహకులే శ్రీకాంత్ అవయవాలు అమ్ముకున్నారనే చర్చ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదికాస్త రోజు రో జుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆగస్టు 6న ప్రమాదానికి గురైన శ్రీకాంత్ హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చనిపోయాడు. అనంతరం అతడి అవయవాలు అంబులెన్స్ డ్రైవర్లే అమ్ముకున్నారనే చర్చ మొదలైంది. అంబులెన్స్ డ్రైవర్లు మొదటి నుంచీ అవయవాలు దానం చేయాలంటూ ప్రోత్సహించడం మృతుడి కుటుంబ సభ్యులకు అనుమా నం కలిగించింది. అవయవాలను ఎక్కువ ధరకు అమ్ముకొని తమకు తక్కువ డబ్బులు ఇప్పించారేమోననే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 13న ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో అదే నెల 14న ‘అవయవాలు అమ్ముకున్నారు’అనే శీర్షికన ‘సాక్షి’దినపత్రికలో కథనం ప్రచురితం కాగా, సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని కార్పొరేట్, కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. గత నెల 19న స్థానిక ఏసీపీ కార్యాలయంలో అవయవాలు అమ్ముకున్నారనే కథనంపై డీసీపీ భాస్కర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అవయవాలు అమ్మకం జరగలేదని, కేవలం జీవాన్‌దాన్ అనే సంస్థకు శ్రీకాంత్ కుటుంబసభ్యుల ఒప్పందం మేరకు అవయవాలు దానం చేశారని వెల్లడిస్తూ శ్రీకాంత్‌ను ఆస్పత్రిలో చేరి్పంచడంలో కమీషన్ల కోసం వేర్వేరు ఆస్పత్రులకు తిప్పుతూ కాలయాపన చేసినందుకు, అవయవాలు అమ్ముకున్నారనే అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఆరోపణలు చేసినందుకు కిరణ్, నరేష్, శ్రావణ్, సాయిరాం, సాగర్‌లపై చీటింగ్ కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై వదిలేశారు. అవయవాలు అమ్మకం జరగలేదనే విషయాన్ని తేల్చేశారు. రూ.3లక్షలు ఇచ్చింది ఎవరు..? శ్రీకాంత్ అవయవాలు అమ్మకం జరగకపోతే శ్రీకాంత్ మృతదేహాన్ని అప్పగించిన తర్వాత కార్పొరేట్ ఆస్పత్రి సర్జన్.. శ్రీకాంత్ భార్య స్వప్న, కుటుంబ సభ్యులను పిలిపించి ఖర్చులకు తీసుకోమని రూ.3లక్షలు ఇచి్చనట్టు చెబుతున్నారు. అవయవాలు దానం చేస్తే రూ.3లక్షలు ఇవ్వడం ఎందుకు, దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్‌ను కరీంనగర్ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వెళుతున్న క్రమంలో అవయవాలు దానం చేసిన ఆస్పత్రి నుంచి యాదగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి కరీంనగర్ వైద్యులు సూచించిన ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకొని మాయమాటలు చెప్పి ఆ ఆస్పత్రికి రప్పించుకున్నాడు. ఈ యాదగిరి ఎవరనే దానిపై పోలీసులు దృష్టి సారించలేదు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఇచ్చింది ఎవరనేదానిపైనా పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోయారు. రూ.3లక్షల ప్రస్తావన, శ్రీకాంత్ భార్య స్పప్న ఫోన్‌నంబర్ ఎలా వెళ్లిందనే దానిపై స్పష్టత ఇవ్వకుండా పొంతన లేని సమాధానాలు చెప్పి దాటవేశారు. చివరకు కేసు విచారణ పూర్తి కాలేదని, అంబులెన్స్ నిర్వాహకులను మళ్లీ కస్టడీకి తీసుకొని శాస్త్రీయ ఆధారాలు సేకరించి ఈ కేసులో పూర్తి విచారణ చేపడుతామని పేర్కొనడం గమనార్హం. పూర్తిస్థాయి విచారణ ఏమైంది.. అవయవాలు అమ్ముకున్న కథ కంచికేనా అన్న చందంగా మారింది. విచారణ పేరిట రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీకాంత్ అవయవాలు ఎవరు..? ఎంతకు అమ్ముకున్నారనేది ఇంకా ప్రజల్లో చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. పోలీసులు మాత్రం విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు. గత నెల 27న కరీంనగర్ ఆస్పత్రి నిర్వాహకులు మంచిర్యాలకు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ బన్సీలాల్‌ను సంప్రదించగా విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో అంబులెన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, అవయవాలు అమ్మకంపై వస్తున్న వదంతులపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నామని, విచారణ సాగుతోందని తెలిపారు. -
తుపాకులతో బంధించడం కొత్తగా ఉంది: హీరో శ్రీకాంత్
ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారు..కానీ ‘పోలీస్ వారి హెచ్చరిక’ పోస్టర్లో పోలీసునే తుపాకులతో కట్టి బంధించడం కొత్తగా ఉంది. సినిమా కూడా అంతే కొత్తగా ఉండి..అందరికి ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’అని అన్నారు హీరో శ్రీకాంత్. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ ను విడుదల గావించుకున్న మా "పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని" దర్శకుడు బాబ్జీ అన్నారు. నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని శ్రీకాంత్ ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం అని నిర్మాత బెల్లి జనార్ధన్ అన్నారు. ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖ నటుడికి రెమ్యునరేషన్ రూ.101.. ఎందుకంటే?
పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో శరద్ కేల్కర్ విలన్‌గా చేశాడు. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో దానిలో యాక్ట్ చేయలేదు. అదే టైంలో హిందీలో వెబ్ సిరీసులు, సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌లోనూ ప్రియమణికి బాస్‌గా చేసింది ఇతడే. పాపులర్ యాక్టర్స్‌లో ఒకరైన శరద్.. రీసెంట్గా 'శ్రీకాంత్' మూవీలో నటించినందుకుగానూ కేవలం రూ.101 తీసుకున్నాడట. తాజాగా ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)'తుషార్ ('శ్రీకాంత్' డైరెక్టర్) దగ్గర డబ్బుల్లేవు. కానీ నన్ను సినిమాలో పెట్టుకోవాలని ఉంది. తను సినిమా గురించి అడగ్గానే.. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయకూడదని అనుకున్నాను. ఇదే కాదు తుషార్ నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. అలానే తుషార్ నిజాయతీ నచ్చింది. డబ్బులుంటే నీకు ఇవ్వాల్సినంత ఇచ్చేవాడనని చెప్పాడు. ఇది విన్న తర్వాత రెమ్యునరేషన్ తీసుకోవాలనిపించలేదు. అందుకే రూ.101 మాత్రమే తీసుకున్నాను' అని శరద్ కేల్కర్ చెప్పాడు.రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన 'శ్రీకాంత్' సినిమాని తెలుగు కుర్రాడు శ్రీకాంత్ బొల్ల జీవితం ఆధారంగా తెరకెక్కించారు. చిన్నతనంలో చూపు కోల్పోయిన శ్రీకాంత్.. బిజినెస్‌మ్యాన్ ఎలా అయ్యాడు? పలు ఇండస్ట్రీలకు యజమాని ఎలా అయ్యాడు అనేదే స్టోరీ. ఇందులో సెకండాఫ్‌లో వచ్చే చిన్న పాత్రలో శరద్ కేల్కర్ నటించాడు. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?) -
పాతబస్తీలో పంజా విసరనున్న నాని
-
నా మొహం ఎలా చూపించను
శ్రీరాంపూర్: జీవితంలో సక్సెస్ కావాలి..డబ్బు సంపాదించాలి.. కుటుంబ సభ్యులను ఉన్నత స్థితిలో ఉంచాలంటూ ఆ యువకుడు ఎన్నో కలలు క న్నాడు. మొదట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి లా భాలు బాగానే వచ్చాయి. ఆ తర్వాత తెలిసిన వారి వద్ద, లోన్‌యాప్‌లలో అప్పు చేసి పెట్టిన పెట్టుబడు లు ఆవిరయ్యాయి. మూడేళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నా కలిసి రావడం లేదని.. లోన్‌యాప్‌ల వేధింపులు తాళలేక.. ఉరేసుకొని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో శనివారం వెలుగులోకి వచి్చంది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌కు చెందిన నమ్తబాజీ శ్రీకాంత్(29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్రుతి, 9 నెల ల కుమారుడు ఉన్నారు. భార్య కొడుకుతో కలిసి రాఖీ పండుగకు ఊరెళ్లింది. దీంతో ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు వైరు తో ఉరేసుకున్నాడు. ఇంటి సమీపంలోనే తల్లిదండ్రులు ఉంటారు. శనివారం ఉదయం శ్రీకాంత్ తమ్ముడు సాయికుమార్ ఇంటికొచ్చి తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో బలవంతంగా త లుపులు తెరిచి చూడగా, ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు శ్రీకాంత్ సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి.సెల్ఫీ వీడియో తీసుకొని.. శ్రీకాంత్ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నేను ఒక కొడుకుగా, అన్నగా, భర్త గా, తండ్రిగా ఫెయిల్ అయ్యాను. లైఫ్‌లో సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. సక్సెస్ కాకపోగా, లోన్‌యాప్స్‌లో లోన్ తీశాను. బయట కూడా అప్పు తీసుకొచ్చాను. ఇంట్లో వారిని గొప్ప గా ఉంచాలి. మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని స్టాక్ మార్కెట్లో డబ్బులన్నీ పెట్టా. ట్రేడింగ్ చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. మాఫ్రెండ్ వాళ్ల అన్న దగ్గరి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నా. మా డాడీ దగ్గర రూ.2 లక్షలు అట్లనే వేర్వేరు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా. అన్నీ పోగొట్టుకున్నా. నాకు చాలా అప్పులున్నాయ్. దానికి తోడు ఈ లోన్‌యాప్స్. ప్రతి నెలా ఈఎంఐలు కచి్చతంగా కట్టేసిన. ఈ నెలొక్కటే కట్టలేదు. ఏడెనిమిది యాప్‌ల దాకా కట్ట లేదు. ఫోన్లలో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఇంటికి వస్తామని వేధించారు. కుటుంబ సభ్యుల వద్ద మొహం చూపెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నా ను’ అని ఆ వీడియోలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
విద్యుత్‌కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: విద్యుత్‌కు దేశంలో డిమాండ్ ఏటా భారీగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏటా 11 గిగావాట్ల చొప్పున డిమాండ్ పెరగ్గా.. వచ్చే ఆరేళ్ల పాటు ఏటా 15 గిగావాట్ల మేర అధికం అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ అదనపు సెక్రటరీ శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. సుమారు 40 గిగావాట్లు స్టోరేజ్ రూపంలో ఉంటుందన్నారు. ‘‘2030 నాటికి రోజులో సూర్యరశ్మి ఎక్కువగా ఉండే సమయంలో (సోలార్ హవర్స్) అదనంగా 85 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ తోడవుతుంది. అదే నాన్ సోలార్ హవర్స్‌లో 90 గిగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవుతుంది’’అని శ్రీకాంత్ వెల్లడించారు. 2030 నాటికి స్టోరేజ్ సామర్థ్యంపై ఆధారపడే పరిస్థితి వస్తుందన్నారు. సోలార్ హవర్స్‌లో నిల్వ చేసిన విద్యుత్‌ను, నాన్ సోలార్ హవర్స్‌లో వినియోగించుకోవచ్చన్నారు. ఐఈఈఎంఏ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతోపాటు, సోలార్, పవన (విండ్), స్టోరేజ్, ప్రసారం సామర్థ్యాల విస్తరణ కూడా చేపడుతున్నట్టు చెప్పారు. 300 గిగావాట్ల లక్ష్యం.. 2030 నాటికి శిలాజ ఇంధనేతర మార్గాల ద్వారా (పునరుత్పాదక/పర్యావరణ అనుకూల) 500 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో 200 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినట్టు శ్రీకాంత్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మరో 300 గిగావాట్ల సామర్థ్యం ఆచరణలోకి వస్తుందన్నారు. ఇందులో 225 గిగావాట్లు కేవలం సోలార్, పవన విద్యుత్ రూపంలో ఉంటుందని తెలిపారు. సోలార్ సామర్థ్యం దండిగా ఉన్న రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాంతాలతో కూడిన ఆర్ఈ జోన్లలో సామర్థ్యం ఎక్కువగా వస్తుందన్నారు. గుజరాత్, తమిళనాడు తీరాల్లో ఆఫ్‌షోర్ (సముద్ర జలాలు) విండ్ ఫార్మ్‌లు, ఒడిశా, గుజరాత్, తమిళనాడు తీరాల్లో గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాల ఏర్పాటు ప్రణాళికలను సైతం వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), డేటా కేంద్రాల రూపంలోనూ విద్యుత్‌కు డిమాండ్ గణనీయంగా పెరగబోతోందన్నారు. దేశం మొత్తాన్ని ఒకే ఫ్రీక్వెన్సీతో నడిచే ఒకే గ్రిడ్‌తో అనుసంధానించడం వల్ల 170 గిగావాట్ల విద్యుత్‌ను, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయొచ్చన్నారు. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్టు శ్రీకాంత్ వెల్లడించారు. ‘‘40 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(బీఈఈఎస్)ను, 19 గిగావాట్ల పీఎస్పీ సామర్థ్యాన్ని ఆరేళ్లలో సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. -
రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్‌కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్‌లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్ రూల్స్ లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్‌లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?
హీరోయిన్ త్రిష వయసు 41 ఏళ్లు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా తన హవా చూపిస్తోంది. రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. 40 దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. త్రిషపై వదంతులు చాలానే ఉన్నాయి. అలానే గతంలో ఓసారి నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది. ఇదంతా పక్కనబెడితే ఓ హీరో పెళ్లికి.. త్రిష అడ్డుపడిందని మీకు తెలుసా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అలియా శ్రీరామ్.. త్రిషతో 'మనసెల్లామ్' అనే మూవీ చేశాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2007లో శ్రీకాంత్, వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వందనకు త్రిష అంతకు ముందే తెలుసు. దీంతో పెళ్లికి ముందు వందనతో నువ్వు శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకోవద్దని, అతడు మంచివాడు కాదని, ఇంగ్లీష్ మాట్లాడటం రాదని త్రిష చెప్పింది. ఇదే విషయాన్ని వందన, శ్రీకాంత్ దగ్గర చెప్పింది.ఎందుకలా చెప్పావ్ అని త్రిషని శ్రీకాంత్ అడగ్గా.. నువ్వు నా ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోబోతున్నావ్ కదా, అందుకే ప్రాంక్ చేశానని త్రిష చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇదిలా ఉండగా 1999లో 'జోడీ' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన త్రిష.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేసింది. మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. కానీ '96'తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. 'పొన్నియన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలాపాల్.. వీడియో వైరల్!)