
శ్రీ సత్యసాయి: సినీ నటుడు శ్రీకాంత్, ఊహ దంపతులు మంగళవారం లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహాన్ని సందర్శించి ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్, ఊహ దంపతులతో సెల్ఫీలు తీసుకునేందుకు పర్యాటకులతో పాటు స్థానికులూ ఉత్సాహం చూపారు.
అంతకుముందు అర్చకులు, పలువురు స్థానికులు శ్రీకాంత్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. జేఏసీ కమిటీ సభ్యులు అంజినరెడ్డి, రవీంద్రనాథ్, రామాంజనేయులు, ఈరన్న, చంద్రశేఖర్ తదితరులు వారి వెంట ఉన్నారు.