‘‘హంట్’ మూవీ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. స్నేహం నేపథ్యంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులు నాపాత్రతో ప్రయాణిస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ సినిమా ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని పంచుతుంది’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. మహేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘హంట్’. శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలు చేశారు. వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు.
► ఓ సినిమా కోసం 50, 60 కథలు వింటుంటే ఒక మంచిపాయింట్ నచ్చుతుంది. దాన్ని ఎందుకు వదులుకోవడం? కొత్త దర్శకుడైనా మనం ఎందుకు సపోర్టు చేయకూడదు? అని ఆలోచిస్తాను. నాకు డౌట్స్ ఉంటే ముందు ప్రశ్నలు అడుగుతా.. ఆ తర్వాత టెస్ట్ షూట్ చేయమని చెబుతా. ‘హంట్’ సరికొత్త కథ. పైగా, భవ్య క్రియేషన్స్‌లాంటి అనుభవం ఉన్న నిర్మాతలున్నారు. ఆ నమ్మకం తోనే ఈ సినిమా చేశాను.
► ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ అర్జున్‌పాత్ర చేశాను. గతం మర్చిపోవడానికి ముందు, గతం మర్చిపోయిన తర్వాత.. ఇలా రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఇందులో యాక్షన్ రియల్‌గా ఉండాలనుకున్నాం. అందుకే డూప్స్, రోప్స్ వాడలేదు. ‘జాన్ విక్ 4’కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లు మా మూవీకి పనిచేశారు. ఫారిన్‌లో ఫైట్లు షూట్ చేశాం. నాలుగు రోజుల్లో యాక్షన్ సీక్వెన్సులు తీశాం.
► ‘హంట్’లో హీరోయిన్ లేదు. మేం అక్కడే రూల్ బ్రేక్ చేశాం. రెండు నిమిషాల్లో కథలో లీనమవుతారు. నాకు, నా కుటుంబ సభ్యులకు, ప్రీమియర్ చూసిన వందల మందికి సినిమా నచ్చింది. అయితే ప్రతి హీరో అటెంప్ట్ చేసే స్టోరీ కాదు ఇది.
► మా మామయ్య కృష్ణగారు చాలా ప్రయోగాలు చేశారు. నేను కొత్తగా చేసిన ‘హంట్’ చూసి అభినందిస్తారనే నమ్మకం ఉండేది. కానీ, ఆయన మన మధ్య లేకపోవడంతో వెలితిగా ఉంది. ప్రస్తుతం హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్ర’ సినిమా, యూవీ క్రియేషన్స్‌లో అభిలాష్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను’’ అన్నారు.
అందుకే డూప్స్.. రోప్స్ వాడలేదు
Published Wed, Jan 25 2023 4:38 AM | Last Updated on Wed, Jan 25 2023 8:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment