sudhir babu
-
Sudheer Babu: కథలో నుంచి హీరో పుట్టాలి
‘‘నాకు కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టమే. కానీ హీరో కోసం కథలో ప్రత్యేకమైన కమర్షియల్ అంశాలు ఉండకూడదు. కథలో నుంచి హీరో పుట్టాలి. అలాంటి కథలను ఎంచుకోవడానికి ఇష్టపడతాను . ‘హరోం హర’ ఈ తరహా చిత్రమే. తెలుగు సినిమాలోని మొదటి పది యాక్షన్ సినిమాల్లో ఎప్పటికీ ‘హరోం హర’ ఉంటుందని నమ్ముతున్నాను. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అని సుధీర్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు. ⇒ ఈ చిత్రంలో నా ΄ాత్ర పేరు సుబ్రహ్మణ్యం. కుప్పంలోని ఓ మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం. అక్కడో సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటి? సుబ్రహ్మణ్యం ఎందుకు గన్స్ మేకింగ్‌లోకి రావాల్సి వచ్చింది? అన్నదే ఈ చిత్రకథ. కథలో కొన్ని లేయర్స్ ఉన్నాయి. అందులో మైథాలజీ అంశాలు కూడా ఉన్నాయి. నాకు తెలుగు భాష వచ్చు కాబట్టి కుప్పం యాసలో డైలాగ్స్ చెప్పడం పెద్దగా కష్టం అనిపించలేదు. ⇒ జ్ఞానసాగర్ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇంత పెద్ద కథను చేయగలడా? అనిపించింది. కానీ నాకు చెప్పిన కథను చెప్పినట్లుగా విజువల్‌గా తెరపై చూపించాడు. ఈ విషయంలో అతనికి నూటికి నూరు మార్కులు వేస్తాను. అదే విధంగా ఇటీవలి కాలంలో తెలుగులో ‘హరోం హర’లాంటి సినిమా రాలేదని నా నమ్మకం. ఈ సినిమాలో ఓ సస్పెండెడ్ ΄ోలీస్ కానిస్టేబుల్ పళని ΄ాత్రను సునీల్‌గారు చేశారు. సుబ్రహ్మణ్యంకు స΄ోర్టివ్గా ఉండే ΄ాత్ర ఇది. ఈ సినిమా కథ డిమాండ్ చేసిన మేరకు ఖర్చు పెట్టారు నిర్మాత సుమంత్. ‘హరోం హర’కు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. స్టోరీ లైన్ ఉంది. అయితే ఈ సినిమా రిజల్ట్‌పై స్వీకెల్ ఆధారపడి ఉంటుంది. ⇒ జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్‌కి చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ మన ఊర్లో ఉంటే, మన పక్కింటి కుర్రాడు గన్స్ తయారు చేయాల్సి వస్తే కొంచెం నాటుగా ఉంటుంది. అందుకే ‘హరోం హర’ సినిమాను జేమ్స్ బాండ్ బ్యాక్‌డ్రాప్ ఇన్ కుప్పం అనొచ్చు. ⇒ సూపర్‌స్టార్ కృష్ణగారు నన్ను మాస్ యాక్షన్ మూవీలు చేయమని చెప్పేవారు. ఆయన మంచి మాస్ హీరో. గతంలో నేను చేసినవి చాలావరకు క్లాస్ చిత్రాలు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ‘హరోంహర’ నేను చేసిన మంచి యాక్షన్ మూవీ అని నమ్మకంగా చూపించేవాడిని. ⇒ నా గత చిత్రాల్లో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. అవి ‘హరోం హర’ సినిమాలో పునరావృతం కాకుండా చూసుకున్నానని అనుకుంటున్నాను. నా ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతాను. అయితే కొన్నిసార్లు మనం ఊహించిన ఫలితాలు రాక΄ోవచ్చు. కానీ ఏదో ఒక మోటి వేషన్ను తీసుకుని ముందుకు వెళ్తుంటాను. -
కృష్ణగారు యాక్షన్ సినిమాలు చేయమనేవారు: సుధీర్‌బాబు
‘‘సూపర్‌స్టార్ కృష్ణగారి జయంతి (మే 31) సందర్భంగా ‘హరోం హర’ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. యాక్షన్ సినిమాలు చేయమని కృష్ణగారు చెప్పే వారు. ‘హరోం హర’ విషయంలో ఆయన ఆనందపడతారని నమ్ముతున్నాను. తెలుగు, ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ ‘హరోం హర’లాంటి నేపథ్యం ఉన్న సినిమా రాలేదనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్‌బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి. నాయుడు నిర్మించారు.ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు గురువారం సోషల్ మీడియాలో రిలీజ్ చేసి, ‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సుధీర్‌బాబు, టీమ్‌కు శుభాకాంక్షలు’ అన్నారు. అనంతరం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ వేడుకకి దర్శకులు అనిల్ రావిపూడి, సంపత్ నంది అతిథులుగా హాజరయ్యారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ–‘‘హరోం హర’లో హీరో పాత్ర గురించి సింగిల్ లైన్లో చెప్పాలంటే జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం లేదా రాంబో ఇన్ కుప్పం అనొచ్చు’’ అన్నారు.‘‘ఈ సినిమా సుధీర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టవుతుంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘ఈ మూవీ ట్రైలర్ టెరిఫిక్‌గా అనిపించింది’’ అన్నారు సంపత్ నంది. ‘‘హరోం హర’లో రెండు వేల మందితో షూట్ చేసిన ఓ సీక్వెన్స్ థియేటర్స్‌లో అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు జ్ఞానసాగర్ ద్వారక. ‘‘నేనిప్పటివరకూ చేయని పాత్రను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు మాళవికా శర్మ. ‘‘మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు సుమంత్ జి. నాయుడు. నిర్మాతలు సుబ్రహ్మణ్యం, కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ పాల్గొన్నారు. -
జూన్‌లో హరోం హర
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా విడుదల తేదీ మారింది. ముందుగా ఈ నెల 31న సినిమా విడుదలకు యూనిట్ ΄్లాన్ చేసింది. అయితే జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, సుధీర్ కొత్తపోస్టర్ని రిలీజ్ చేశారు.జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ‘హరోం హర’లో మాళవికా శర్మ కథానాయిక. సుమంత్ జి. నాయుడు నిర్మించారు. ‘‘ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘హరోం హర’. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగే పీరియాడికల్ ఫిల్మ్ ఇది’’ అన్నారు మేకర్స్. -
ఆ రోజే హరోం హర
సూపర్ స్టార్ కృష్ణ జయంతి మే 31న. కృష్ణ అల్లుడు, హీరో సుధీర్‌బాబు నటించిన ‘హరోం హర’ చిత్రం ఆ రోజే ధియేటర్లలోకి రానుంది. 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ‘హరోం హర’ రూపొందింది. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం శనివారం ప్రకటించింది.జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ కథానాయికగా నటించగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘‘ఈ సినిమా కోసం సుధీర్ బాగా మేకోవర్ అయ్యారు. కథానుసారం కుప్పం స్లాంగ్‌లో డైలాగులు చె΄్పారు. ఈ వేసవి సెలవుల్లో మంచి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
ఇక రౌడీలపై పాజిటివ్ షీట్లు
సాక్షి, హైదరాబాద్: నేర ప్రవృత్తిని వీడనాడే రౌడీలపై ఇక నుంచి పాజిటివ్ షీట్లు తెరుస్తామని, దీంతో వారు చేసే మంచి పనులు కూడా రౌడీ షీట్ రికార్డులో నమోదవుతాయని, మార్పు పూర్తిగా వస్తే రౌడీ షీట్‌ను తొలగిస్తామని రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుదీర్ బాబు తెలిపారు. మార్పు కోసం ప్రయత్నించే రౌడీలకు సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. ఆదివారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో వందకు పైగా రౌడీ షీటర్లు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో నేరాలకు పాల్పడిన వారు వాటిని వీడనాడి ప్రస్తుత సమాజంతో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాలని సూచించారు. తొందరపాటులో నేరాలు చేసి నా సరే.. తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందన్నారు. డాక్టర్ బిడ్డలు డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలు పోలీసులు అవుతున్నారని.. రౌడీ షీటర్ల పిల్లలు కూడా తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్తులుగా తయారు అవుతారని పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఇదో మంచి అవకాశమని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇక నుంచి డిసెంబర్ 31 అంటే రౌడీ మార్పు దినోత్సవంగా గుర్తిండిపోవాలని పిలుపునిచ్చారు. రౌడీషీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి ధారావత్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎస్ఓటి డీసీపీ –1 గిరిధర్ రావుల, ఎస్ఓటి డీసీపీ–2 మురళీధర్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్ ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు సీపీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. సైబరాబాద్ జాయింట్ సీపీ అడ్మిన్‌గా పనిచేస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతికి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా పనిచేసిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జి సు«దీర్‌బాబు రాచకొండ సీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించారు. ఇప్పటి వరకు సైబరాబాద్, రాచకొండ సీపీలుగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర, దేవేంద్రసింగ్ చౌహాన్లను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మల్టీజోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం మరో ఉత్తర్వును జారీ చేశారు. ఒకేసారి భారీ మార్పులపై సీఎం కసరత్తు! కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మంగళవారం జరిగిన ఐపీఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఒకేసారి బదిలీ చేయడం అందులో భాగమని చర్చ జరుగుతోంది. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి తన మార్క్ టీంను సెట్ చేస్తున్నారు. త్వరలోనే పలు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సహా భారీ సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తకోటకు చాలాకాలం తర్వాత కీలక పోస్టింగ్ హైదరాబాద్ సీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి చాలా ఏళ్ల తర్వాత అత్యంత కీలక పోస్టింగ్ దక్కింది. గతంలో ఆపరేషన్స్ అడిషనల్ డీజీగా పనిచేసిన ఆయన తర్వాత అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ అయ్యారు. గత కొన్ని నెలలుగా అక్కడ పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం అత్యంత కీలక పోస్టింగ్‌లోకి బదిలీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను తప్పించిన సర్కార్ ఆయన స్థానంలో అవినాశ్ మహంతికి బాధ్యతలు అప్పగించింది. సైబరాబాద్ సీపీ పోస్టు ఐజీ ర్యాంకు అయినా..డీఐజీ ర్యాంకులో ఉన్న అవినాశ్ మహంతికి అనూహ్యంగా ఆ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇక రాచకొండ పోలీస్ కమిషనర్‌గా డిసెంబర్ 2022లో బాధ్యతలు తీసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ కేవలం పదకొండు నెలలకే బదిలీ అయ్యారు. ఇదే కమిషనరేట్‌లో గతంలో సుదీర్ఘ కా లంపాటు పనిచేసిన సు«దీర్‌బాబుకు కొత్త ప్రభు త్వం పోలీస్ కమిషనర్‌గా అవకాశం కలి్పంచింది. శాండిల్యకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయంతో హైదరాబాద్ సీపీగా అసెంబ్లీ ఎన్నికల ముందు బాధ్యతలు చేపట్టిన సందీప్‌శాండిల్యను సైతం ప్రభుత్వం తప్పించింది. సమర్థవంతమైన అధికారిగా పేరున్న సందీప్శాండిల్యకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దృఢ నిశ్చయంతో ఉండడంతో నిక్కచ్చిగా వ్యవహరించే సందీప్శాండిల్యకు నార్కోటిక్స్ బ్యూరో బాధ్యతలు అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. -
వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు
కథలు ఊహల్లో నుంచే కాదు.. వాస్తవ జీవితాల్లో నుంచి కూడా వస్తుంటాయి. ఇలా రియల్‌గా జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా కొందరు దర్శకులు రాసుకున్న కథలతో కొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. రియల్ టు రీల్‌గా రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ‘డాన్ శీను (2010)’, ‘బలుపు (2013)’, ‘క్రాక్ (2021)’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించనున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇది కంప్లీట్ పీరియాడికల్ ఫిల్మ్ అని, ఆంధ్రప్రదేశ్‌లో 1991లో జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. మరోవైపు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ కూడా కొన్ని వాస్తవ ఘటనల ప్రేరణతో తెరకెక్కి, హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ► హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుంది. అయితే ఈ సినిమా కథలోని కొంతభాగం వాస్తవ ఘటనల ఆధారంగా ఉంటుందని ఈ చిత్ర రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ గత ఏడాది అక్టోబరులో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కథను బట్టి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా రాజమౌళి అండ్ కో ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ► శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన దాదాపు 25 మంది మత్స్యకారులు బతుకుతెరువు కోసం గుజరాత్ తీర ప్రాంతంలోని వీరవల్ వద్ద చేపల వేట కొనసాగిస్తూ, 2018 నవంబరులో పోరపాటున పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ అధికారులకు బందీలుగా చిక్కారు. దాదాపు ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించిన వారి జీవితాల్లోని వాస్తవ ఘటనల సమాహారంగా ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది. ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబి నేషన్‌లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఇది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులోప్రారంభం కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా వివాహం జరిగిన కొద్ది కాలానికే, తాను తండ్రి కాబోతున్న సమయంలోనే పాకిస్తాన్లో ఖైదు కాబడిన శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నట్లుగా తెలిసింది. వచ్చే ఏడాది చివర్లో ‘తండేల్’ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ► ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. హిందీ, తెలుగు భాషల్లో రూపోందిన ఈ ద్విభాషా చిత్రంతో శక్తీ ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో మానుషీ చిల్లర్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వరుణ్ తేజ్ హిందీకి పరిచయం అవుతున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చోటు చేసుకున్న కొన్ని వైమానిక దాడుల వాస్తవ ఘటనల సమాహారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ్రపోడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. తొలుత ఈ సినిమాను డిసెంబరు 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని, వచ్చే ఏడాదిప్రారంభంలో విడుదల చేసే ఆలోచన ఉందని యూనిట్ వెల్లడించింది. ► సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరోం హర: ది రివోల్ట్’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రధారి. కాస్త రివెంజ్ టచ్ ఉన్న ఈ సినిమా 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 22న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ తేదీకి ప్రభాస్ ‘సలార్’ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘హరోం హర’ చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ► శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా రూపోందిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. ఖుషీ రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ఇతర ప్రధాన పాత్రలుపోషించారు. ఓ నిజజీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, చిత్రీకరణ సమయంలో కొన్ని ఘటనలు జరగడంతో కాస్త భయంగానే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ చిత్రదర్శకుడు సాయికిరణ్ దైదా చెబుతున్నారు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 15న విడుదల కానుంది. 1930, 1990.. ప్రస్తుతం.. ఇలా మూడు కాలాలతో ‘పిండం’ స్క్రీన్ ప్లే ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇలా వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుని, ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. -
మావయ్యగారి బయోపిక్‌లో నటించాలనుంది
‘‘మామా మశ్చీంద్ర’ చిత్రం మెంటల్‌గా, ఫిజికల్‌గా నాకు ఓ సవాల్. కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా ఇది. ఫ్యామిలీతో కలసి హాయిగా చూడొచ్చు’’ అని హీరో సుధీర్ బాబు అన్నారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు చెప్పిన విశేషాలు. ► నా కెరీర్లో ఇప్పటివరకూ నా వద్దకు వచ్చిన కథల్లో నాకు నచ్చినవి చేశాను. కానీ, ఫలానా జానర్, ఫలానా కథ కావాలంటూ దర్శకులను అడగలేదు. ‘మనం, గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలతో మంచి రైటర్‌గా నిరూపించుకున్నారు హర్ష. ఆయనపై ఉన్న నమ్మకంతో కథ తీసుకురమ్మని చెప్పాను. హర్ష చెప్పిన ‘మామా మశ్చీంద్ర’ కథ చాలా నచ్చింది. హర్ష మంచి రచయిత, నటుడు. మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా ఆయన ఈ సినిమా తెరకెక్కించారు. ► ఈ సినిమాలో నేను చేసిన మూడు పాత్రల్లో (దుర్గా, పరశురాం, డీజే) ఒక్కో పాత్ర ఒక్కో యాస (తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ) మాట్లాడుతుంది. పరశురాం పాత్ర కోసం బరువు పెరిగాను. దుర్గ పాత్రకు ప్రోస్థటిక్స్ వాడాం. ఈ పాత్ర కోసం నిజంగా బరువు పెరగాలనుకున్నాను. అయితే ఒక్కసారిగా అంత బరువు పెరగడం మంచిది కాదని మహేశ్ బాబుగారితో పాటు సన్నిహితులు చెప్పడంతో ప్రోస్థటిక్ మేకప్‌ని వాడాం. డీజే పాత్ర కోసం డైట్ పాటించాను. ► నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావుగార్లు ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశారు. ‘మామా మశ్చీంద్ర’లో మా మావయ్య కృష్ణగారితో ఓ సీన్ చేయించాలనుకున్నాను. కానీ ఆయన దూరమయ్యారు. ఆయన లేకపోతే ఆ సన్నివేశానికి ప్రాధాన్యతే లేదు. అందుకే వేరే వారితో ఆ సీన్ తీయలేదు. నా ప్రతి సినిమా రిలీజ్ రోజు మావయ్య చూసి, ఫస్ట్ ఫోన్‌కాల్ చేసి మాట్లాడేవారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. మావయ్యగారి బయోపిక్‌లో నటించే చాన్స్ వస్తే హ్యాపీగా చేస్తాను. ప్రస్తుతం నేను నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ డబ్బింగ్ జరుగుతోంది. నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘హరోం హర’ షూటింగ్ చేస్తున్నాం. పుల్లెల గోపీచంద్ బయోపిక్ కచ్చితంగా ఉంటుంది. -
అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి – శర్వానంద్
‘‘మేం ఒక్క పాత్ర చేయడానికి చాలా కష్టపడుతున్నాం. అలాంటిది ‘మామా మశ్చీంద్ర’లో సుధీర్ ఏకంగా మూడు పాత్రలు చేశారు.. ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు శర్వానంద్. సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల అతిథులుగా హాజరయ్యారు. ‘‘సుధీర్ మూడు పాత్రలు చేశారంటే కథ ఎంత విలక్షణంగా ఉండి ఉంటుందో అర్థమవుతోంది’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘సుధీర్ కొత్త రకం కథలు ప్రయత్నిస్తుంటారు’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘మామా మశ్చీంద్ర’లో మంచి కథ, పాటలు, వినోదం.. అన్నీ ఉంటాయి’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘ఇది ఒక అమ్మ, తండ్రీకూతుళ్ల కథ’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘రచయితల నుంచి డైరెక్టర్స్‌గా మారిన త్రివిక్రమ్, కొరటాల శివల్లా హర్షవర్ధన్ కూడా పెద్ద డైరెక్టర్ కావాలి’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
మనం లాంటి అనుభూతి కలుగుతుంది – సుధీర్ బాబు
‘‘మామా మశ్చీంద్ర’లో త్రిపాత్రాభినయం చేశాను. ఏయన్నార్ ఫ్యామిలీ నటించిన ‘మనం’ చూసినప్పుడు అరుదైన సినిమాగా ఎలా అనుభూతి చెందారో, ‘మామా మశ్చీంద్ర’ చూశాక అలాంటి అనుభూతే కలుగుతుంది. ఈ సినిమాతో హర్షవర్ధన్ టాప్ డైరెక్టర్ అవుతారు’’ అన్నారు సుధీర్ బాబు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇషా రెబ్బా, మృణాలినీ రవి హీరోయిన్లు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో మహేశ్ బాబు షేర్ చేశారు. ‘‘మనం’ రచయితగా మీ అందరి ప్రేమాభిమానాలు పొందాను. ఇంతకాలం విరామం తీసుకొని ‘మామా మశ్చీంద్ర’ చేయడానికి కారణం.. ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘ఈ చిత్రంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక మలుపు, సర్ర్పైజ్ వస్తుంది’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
ట్రిపుల్ ట్రీట్: ఒక సినిమా.. మూడింతల ఆనందం
వెండితెరపై తమ అభిమాన హీరో ఒక్క పాత్రలో కనిపిస్తేనే కేకలు, విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తారు అభిమానులు. అదే హీరో ద్విపాత్రాభినయం చేస్తే ఫ్యాన్స్ ఆనందం డబుల్ అవుతుంది. ట్రిపుల్ గెటప్స్‌లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఆనందం మూడింతలు అవుతుంది. తాజాగా దక్షిణాదిలో ధనుష్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, టొవినో థామస్ వంటి హీరోలు తొలిసారి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం. కెప్టెన్ మిల్లర్ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళుతున్నారు హీరో ధనుష్. ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఆయన పాన్ ఇండియా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’ చేస్తున్నారు. 1930–1940 నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ధనుష్ మూడు గెటప్స్‌లో కని పిస్తారు. ఇప్పటికి రెండు గెటప్స్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ లుక్‌లో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, పెద్ద సైజు గన్ను పట్టుకుని చుట్టూ మరణించిన సైనికుల మధ్య యుద్ధ భూమిలో నిల్చుని ఉన్న ధనుష్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ధనుష్ చేస్తున్న పాత్రల్లో కెప్టెన్ మిల్లన్ పాత్ర ఒకటి. మిగతా రెండు పాత్రల వివరాలు తెలియాల్సి ఉంది. మామా మశ్చీంద్ర కెరీర్ పారంభం నుంచి వినూత్నమైన, కథా బలమున్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు హీరో సుధీర్ బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు, డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాలినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. ఈ సినిమాలో తొలిసారి మూడు పాత్రల్లో (డీజే, డాన్, దుర్గ) సందడి చేయనున్నారు సుధీర్ బాబు. ఈ మూడు లుక్స్‌కి సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రీక్వెల్‌లో మూడు పాత్రలు.. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సామజ వరగమన’ జూన్ 29న విడుదలై సూపర్ హిట్‌గా దూసుకెళుతోంది. శ్రీ విష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లు (ఇప్పటికే 40 కోట్లు దాటాయి) సాధించిన చిత్రంగా ‘సామజ వరగమన’ నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు తాను ఓ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రాజ రాజ చోర’ (2021)తో హిట్ కాంబో అనిపించుకున్న శ్రీ విష్ణు– డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ మూవీలోనే శ్రీ విష్ణు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ‘రాజ రాజ చోర’కి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. -
మా నాన్న సూపర్ హీరో!
‘మా నాన్న సూపర్‌హీరో’ అంటున్నారు సుధీర్ బాబు. ‘లూజర్’ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ‘మా నాన్న సూపర్ హీరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీలో ఆర్నా హీరోయిన్. సీఏఎం ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం (జూన్ 18) ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ‘‘తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ‘మా నాన్న సూపర్ హీరో’ ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో రాజు సుందరం ఓ కీలక పాత్రలో నటిస్తూనే, కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయిచంద్, సాయాజీ షిండే, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జై క్రిష్, కెమెరా: సమీర్ కల్యాణి. -
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి?
దాగుడు మూతలాట ఆడుకోని వాళ్లుండరు... కళ్లకు గంతలు కట్టి పేర్లు అడిగితే చెప్పాలి. ఇది రియల్ ఆట. రీల్ గేమ్ విషయానికి వస్తే.. గంతలు కట్టకుండా.. ఆర్టిస్ట్‌ని ఎదురుగా నిలబెట్టి, ‘వీరి పేరేమి’ అని అడిగితే.. ఆ ఆర్టిస్ట్నిగుర్తుపట్టడానికి కాస్త టైమ్ పడుతుంది. అసలు గుర్తు పట్టకపోవచ్చు కూడా. అంతలా కొందరు స్టార్స్ క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. ఫిజికల్ మేకోవర్‌తో, మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆ హీరోల గురించి తెలుసుకుందాం. ♦ పాత్రల కోసం రూపా న్ని మార్చుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు విక్రమ్. ‘శివపుత్రుడు, అపరిచితుడు, ఐ’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనం. తాజాగా ‘తంగలాన్’లో కొత్త అవతారంలో కనిపించనున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు విక్రమ్. గనుల తవ్వకాల పనులు చేసే వ్యక్తుల జీవితాల నేపథ్యంలో దర్శకుడు పా . రంజిత్ పా న్ ఇండియా మూవీగా ‘తంగలాన్’ని తెరకెక్కిస్తున్నారు. ♦ క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోవాలనుకుంటారు అల్లు అర్జున్. గతంలో ‘దేశ ముదురు’ సినిమా కోసం సిక్స్ ΄్యాక్ చేశారు. తాజాగా ‘పుష్ప’ కోసం ఫిజికల్ మేకోవర్‌తో పా టు మేకప్ పరంగానూ వ్యత్యాసం చూపించారు. స్మగ్లర్ పుష్పరాజ్‌గా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో రెచ్చి పోయారు అల్లు అర్జున్. మలి భాగం ‘పుష్ప:ది రూల్’ చిత్రీకరణ జరుగుతోంది. కాగా.. పుష్పరాజ్‌గా గుర్తు పట్టలేనంతగా అల్లు అర్జున్ మారలేదు. కానీ రెండో భాగంలో జాతర బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఒక ఫైట్‌లో గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు. పండగ చివరి రోజు స్త్రీ వేషధారణలో పురుషులు చెడును నాశనం చేసే గంగమ్మ తల్లిగా మారతారని, ఈ ఫైట్‌లో అల్లు అర్జున్ గెటప్ అదే అని తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ♦ దుర్గ, పరశురామ్, డీజే.. ఈ మూడు పా త్రల్లో సుధీర్‌బాబు కనిపించనున్న చిత్రం ‘మామా మశ్చింద్ర’.. వీటిలో దుర్గ పా త్ర డిఫరెంట్. ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్ అన్నమాట. మామూలుగా సు«దీర్‌బాబు చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంటారు. అయితే ఈ పా త్రలో అందుకు భిన్నంగా బొద్దుగా కనబడతారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది, ♦ అటు మలయాళంకి వెళితే సీనియర్ హీరో మోహన్‌లాల్, యంగ్ హీరో పృథ్వీ రాజ్కుమారన్లు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. మోహన్‌లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ బర్రోజ్. ఆ నిధిని వాస్కో అసలు వారసునికి అప్పగించడానికి ఆ ఆత్మ వేచి ఉంటుంది. కాల్పనిక కథతో త్రీడీ చిత్రంగా ‘బర్రోజ్’ రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయడంతో పా టు మోహన్ లాల్ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ♦ మరో మలయాళ హీరో–దర్శకుడు పృథ్వీ రాజ్కుమారన్ గొర్రెల కాపరిగా కనిపించనున్న చిత్రం ‘ఆడు జీవితం’. 2008లో ఇదే పేరుతో వచ్చిన నవల నేపథ్యంలో బ్లెస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నజీబ్ అనే మలయాళీ వలస కార్మికుడి పా త్రలో పృథ్వి రాజ్ కనిపిస్తారు. సౌదీ అరేబియాకి వలస వెళ్లిన నజీబ్‌ను గొర్రెల కాపరిని చేసి, బలవంతంగా బానిసత్వంలోకి నెట్టివేస్తారు. నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. సవాళ్లను ఇష్టపడని స్టార్స్ ఉండరు. అయితే సవాళ్లు అరుదుగా వస్తుంటాయి. అందుకే చాలెంజింగ్ రోల్స్ వచ్చి నప్పుడు ‘సై’ అంటూ ఎంత కష్టపడటానికైనా సిద్ధపడిపోతారు. ఈ సవాళ్లు స్టార్స్‌కి కిక్కే.. అభిమానులకూ కిక్కే. సినిమా సరిగ్గా క్లిక్ అయితే బాక్సాఫీస్కీ కిక్కే. -
ఐ హేట్ లవ్
‘‘దేవుడడిగాడంట.. నన్ను చేరడానికి ఏడు జన్మలు నాకు భక్తుల్లా బతుకుతారా...లేక మూడు జన్మలు రాక్షసుల్లా బతుకుతారా అని. ఏడు జన్మలు నీకు దూరంగా ఉండే కన్నా... మూడు జన్మల రాక్షస బతుకే మిన్న అని దేవతలే కోరుకున్నారట’, ‘ఐ హేట్ లవ్’ అనే డైలాగ్స్‌తో విడుదలైంది ‘మామా మశ్చీంద్ర’ టీజర్. సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుçస్కూర్ రామ్మోహన్రావు నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. శనివారం ఈ సినిమా టీజర్‌ను హీరో మహేశ్‌బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రంలో దుర్గ, డీజే, పరశురామ్ పాత్రలు చేశారు సుధీర్‌బాబు. -
అందుకే డూప్స్.. రోప్స్ వాడలేదు
‘‘హంట్’ మూవీ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. స్నేహం నేపథ్యంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులు నాపాత్రతో ప్రయాణిస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ సినిమా ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని పంచుతుంది’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. మహేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘హంట్’. శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలు చేశారు. వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు. ► ఓ సినిమా కోసం 50, 60 కథలు వింటుంటే ఒక మంచిపాయింట్ నచ్చుతుంది. దాన్ని ఎందుకు వదులుకోవడం? కొత్త దర్శకుడైనా మనం ఎందుకు సపోర్టు చేయకూడదు? అని ఆలోచిస్తాను. నాకు డౌట్స్ ఉంటే ముందు ప్రశ్నలు అడుగుతా.. ఆ తర్వాత టెస్ట్ షూట్ చేయమని చెబుతా. ‘హంట్’ సరికొత్త కథ. పైగా, భవ్య క్రియేషన్స్‌లాంటి అనుభవం ఉన్న నిర్మాతలున్నారు. ఆ నమ్మకం తోనే ఈ సినిమా చేశాను. ► ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ అర్జున్పాత్ర చేశాను. గతం మర్చిపోవడానికి ముందు, గతం మర్చిపోయిన తర్వాత.. ఇలా రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఇందులో యాక్షన్ రియల్‌గా ఉండాలనుకున్నాం. అందుకే డూప్స్, రోప్స్ వాడలేదు. ‘జాన్ విక్ 4’కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లు మా మూవీకి పనిచేశారు. ఫారిన్లో ఫైట్లు షూట్ చేశాం. నాలుగు రోజుల్లో యాక్షన్ సీక్వెన్సులు తీశాం. ► ‘హంట్’లో హీరోయిన్ లేదు. మేం అక్కడే రూల్ బ్రేక్ చేశాం. రెండు నిమిషాల్లో కథలో లీనమవుతారు. నాకు, నా కుటుంబ సభ్యులకు, ప్రీమియర్ చూసిన వందల మందికి సినిమా నచ్చింది. అయితే ప్రతి హీరో అటెంప్ట్ చేసే స్టోరీ కాదు ఇది. ► మా మామయ్య కృష్ణగారు చాలా ప్రయోగాలు చేశారు. నేను కొత్తగా చేసిన ‘హంట్’ చూసి అభినందిస్తారనే నమ్మకం ఉండేది. కానీ, ఆయన మన మధ్య లేకపోవడంతో వెలితిగా ఉంది. ప్రస్తుతం హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్ర’ సినిమా, యూవీ క్రియేషన్స్‌లో అభిలాష్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. -
మంచి కథకు పాటలు అవసరంలేదు
సుధీర్‌బాబు హీరోగా, శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. ఎస్. మహేశ్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఎస్. మహేశ్ మాట్లాడుతూ– ‘‘ఓ యాక్సిడెంట్లో గతం మర్చిపోయే ఓ పోలీసాఫీసర్ తన గురించి ఎలా తెలుసుకున్నాడు? తన లైఫ్‌లో జరిగిన ఓ చేదు ఘటన తాలూకు మిస్టరీని ఎలా ఛేదించాడు? అన్నదే ఈ చిత్రకథ. మంచి కథ కుదిరితే సినిమాలో కమర్షియల్ సాంగ్స్ అవసరం ఉండదు. ‘హంట్’లో అలాంటి పాటలు ఉండవు. అయితే సందర్భోచితంగా సాగే ఒకే ఒక్క పాట ఉంటుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ లేదు. ఈ మధ్య వచ్చిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాల్లో హీరోయిన్ పాత్ర, కమర్షియల్ పాటలు లేకపోయినా ప్రేక్షకులు ఆదరించారు. నేను ‘హంట్’ చేయడానికి ఆ సినిమాలు కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఇక ఈ సినిమాలోని ఆరు యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. క్లైమాక్స్ చూశాక ఓ మంచి ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్తారు’’ అని అన్నారు. -
యాక్షన్ ఎంటర్టైనర్
సుధీర్ బాబు హీరోగా కొత్త సినిమా షురూ అయింది. రచయిత, నటుడు హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత రామ్మోహన్ రావు క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. సుధీర్ బాబు సరికొత్తగా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా. -
సీఐడీ దర్యాప్తు జరగాల్సిందే..
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి తుళ్లూరు తహసీల్దార్ అన్నె సుదీర్‌బాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం, స్టే ఇవ్వడం లాంటివి చేయరాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టంగా చెప్పిందని పేర్కొంది. ఈ వ్యవహారంలో సుదీర్‌బాబుపై తీవ్రమైన ఆరోపణలున్నాయని గుర్తు చేసింది. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అన్నె సుధీర్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఐడీ తరఫున పీపీ కె.శ్రీనివాసరెడ్డి, సుదీర్‌బాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. పేదల అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చడంలో సు«దీర్‌బాబు కీలక పాత్ర పోషించారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న శ్రీనివాసరెడ్డి వాదనతో కోర్టు ఏకీభవించింది. ఎస్సీ, ఎస్టీలను భూములు అమ్ముకునేలా చేసి ఇతరులకు లబ్ధి చేకూర్చడంలో సుదీర్బాబుదే కీలక పాత్ర అనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయన్న శ్రీనివాసరెడ్డి వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. పెద్ద మొత్తం చేతులు మారిందని, ఇందులో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందన్న వాదనను పరిగణలోకి తీసుకుంది. -
ఎంతసేపు కనిపించామన్నది ముఖ్యం కాదు
‘‘ఈ లాక్డౌన్లో తెలుగు నేర్చుకుంటున్నాను. అలాగే ఈ ఆరు నెలలు సహనంతో ఎలా ఉండాలి? దయగా ఎలా ఉండాలి? అనేది నేర్పించాయి’’ అంటున్నారు అదితీ రావ్ హైదరీ. శుక్రవారం రాత్రి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘వి’ చిత్రంలో ఆమె ఒక హీరోయిన్గా నటించారు. నాని విలన్‌గా, సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. ఆదివారం అదితీ రావ్ హైదరీ మీడియాతో మాట్లాడుతూ – ‘‘వి’ సినిమాలో నానీతో నా ప్రేమకథ చాలా ఉద్వేగంగా ఉంటుంది. సినిమాకు హార్ట్ లాంటి పాత్రలో నటించటం చాలా ఆనందంగా ఉంది. సినిమాలోని నా పాత్ర నిడివి తక్కువగా ఉండటం గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఓ సినిమాలో ఎన్ని నిమిషాలు కనబడ్డాం అనేది ముఖ్యం కాదు.. ఆ పాత్రలో ఎంత బాగా నటించాం? దానికి ఎంత పేరొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇంద్రగంటి మోహనకృష్ణగారే నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేయటం బావుంటుంది. ఆయన సినిమాలో క్యారెక్టర్స్ మాట్లాడే విధానం కొత్తగా ఉంటుంది. ‘వి’ సినిమాని థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూద్దామనుకున్నాను. అది మిస్సయ్యాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని డిజిటల్లో రిలీజ్ చేయాలన్నది మంచి నిర్ణయమే. ప్రస్తుతం నేను బాలీవుడ్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. మేం ఉంటున్న కార్వ్యాన్స్ను గంటకోసారి శానిటైజ్ చేయడంతో పాటు షూటింగ్ టైమ్‌లో తక్కువ మంది సెట్లో ఉండేటట్లు ప్లా¯Œ చేశారు. ప్రస్తుతం నా చేతిలో మూడు హిందీ సినిమాలు, రెండు తమిళ్ సినిమాలు, ఒక తెలుగు సినిమా.. మొత్తం ఆరు సినిమాలు ఉన్నాయి’’ అన్నారు. -
ఓటీటీలో విడుదల
థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఒకవేళ ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా? అనేది పెద్ద డౌట్. ఆల్రెడీ చిన్న సినిమాలు మెల్లిగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. హిందీలో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. కానీ తెలుగులో పెద్ద సినిమా ఏదీ ఓటీటీలో విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం నేరుగా ఓటీటీలో (అమెజాన్ ప్రైమ్) విడుదల కానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే వారం రానుందని తెలిసింది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించారు. దాదాపు 35 కోట్ల వ్యయంతో ఈ సినిమా రూపొందినట్టు సమాచారం. సౌత్ లో ఇంత వ్యయంతో రూపొంది, ఓటీటీలో విడుదలవుతున్నతొలి భారీ చిత్రమిదే అవుతుంది. అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నాని విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆయన కెరీర్ లో 25వ చిత్రం. -
వ్యూహం పన్నారా?
‘సమ్మోహనం’ సక్సెస్ తర్వాత దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సుధీర్‌బాబు, నానిలతో ఈ మల్టీస్టారర్ రూపొందనుంది. ఇందులో నాని పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందని సమాచారం. నాని సరసన అదితీరావ్ హైదరీ, సుధీర్‌కి జోడీగా నివేదా థామస్ నటించనున్నారట. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ నలుగురిలో ఎవరు వ్యూహం పన్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే. ‘సమ్మోహనం’ తర్వాత సుధీర్, అదితీలను, ‘జెంటిల్‌మేన్’ తర్వాత నాని, నివేదా థామస్‌లను ఇంద్రగంటి రిపీట్ చేస్తున్నారు. జులైలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. -
ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
సాక్షి,మోత్కూరు(తుంగతుర్తి) : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ ప్రచారం, స్వేచ్ఛగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. సోమవారం సాయంత్రం మోత్కూరు పోలీస్‌స్టేషన్‌ను భువనగిరి డీసీపీతో కలిసి సందర్శించారు. చౌటుప్పల్ ఏసీపీ బాపురెడ్డి, రామన్నపేట సీఐ ఎం.శ్రీనివాస్, స్థానిక ఎస్ఐ సీహెచ్.హరిప్రసాద్లతో ఎన్నికలకు సంసిద్ధత కావడంపై సమీక్షించారు. అనంతరం జాయింట్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చాలా సున్నితంగా వ్యవహరిం చాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిలో ఎలా వ్యవహరించాలని తమ సిబ్బందికి వివరించినట్లు తెలి పారు. ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ శాఖ అన్నిరకాల బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
‘చెడ్డీ గ్యాంగ్’ చిక్కింది!
సాక్షి, హైదరాబాద్: నగర శివారుల్లో వరుస చోరీలతో కలకలం సృష్టించిన కరడుగట్టిన అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని దహోడా జిల్లా సహోదా గ్రామానికి చెందిన అన్నదమ్ములు పారమౌర్ కిషన్ బాధ్య, పారమౌర్ రావోజీ బాధ్య, వీరి బంధువు గనవ భరత్ సింగ్‌ను ఆదిభట్ల ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని చెట్లపొదల్లో తచ్చాడుతుండగా రాచకొండ ఎస్వోటీ, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3,50,000ల విలువచేసే 10 తులాల బం గారం, కిలో వెండి ఆభరణాలు, రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ సుధీర్‌బాబు, క్రైమ్స్ డీసీపీ నాగరాజుతో కలసి కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు తెలిపారు. సహోదా గ్రామంలో దినసరి కూలీలుగా పనిచేసుకునే కిషన్, రావోజీ, భరత్ సింగ్‌తో పాటు మరో 8 మందిని అదే గ్రామానికి చెందిన రామ్‌జీ.. సూరత్‌లో పని కోసం తీసుకెళ్లి చోరీల బాట పట్టించాడు. అలా నేరాలబాట పట్టిన వీరు 2010లో ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిం చారు. 2012లో బోయిన్పల్లి పోలీసులు ఈ గ్యాంగ్ లో ఒకరిని, 2014లో మేడిపల్లి పోలీసులు మరికొంత మందిని అరెస్టు చేశారు. 2017లో మీర్‌పేట ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసులో దినేశ్ అరెస్టు కాగానే అతడి వేలిమద్రలు, వ్యక్తిగత వివరాలు తీసుకున్నారు. దినేశ్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం మీర్‌పేట ఠాణా పరిధిలోని బడంగ్‌పేటలో, అగ్రికల్చర్ కాలనీలో చెడ్డీ గ్యాంగ్ చోరీలతో కలకలం సృష్టించింది. మియాపూర్, ఘట్కేసర్ ప్రాంతాల్లోనూ కలకలం సృష్టించింది. దీంతో వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయా చోరీల్లో పోలీసులకు లభించిన వేలిముద్రలతో చెడ్డీ గ్యాంగ్ దగ్గర తీసుకున్నవాటితో సరిపోయాయి. దీంతో ఇది చెడ్డీ గ్యాంగ్ పనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దినేశ్ నుంచి సేకరించిన వివరాల ప్రకారం సహోదా గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారికి నేరచరిత్ర లేదు: దినేశ్ గురించి అక్కడ పోలీసులను వాకబు చేయగా నేరచరిత్ర ఏమీ లేదని తేలింది. ఆ గ్రామంలో 35 కుటుంబాలు ఉండగా అంతా బంధువులే కావడం విశేషం. స్థానిక పోలీసుల సహకారంతో ఆ ఊరులోకి వెళ్లిన రాచకొండ పోలీసులకు చిత్రవిచిత్రాలు కనిపించాయి. ప్రతి ఇంటి ముందు ముళ్ల పొద ఉంది. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు అనేక మార్గాలు ఉండటం కనిపించింది. దినేశ్ కోసం వచ్చారని తెలుసుకున్న ఆ గ్రామవాసులు మిగతావారిని కూడా అప్రమత్తం చేయడంతో తప్పించుకున్నారు. ఇలా నెలరోజుల పాటు అక్కడే ఉండి వారిని పట్టుకునే అవకాశం రాలేదు. కానీ ఆ గ్యాంగ్ సమాచారం తెలుసుకోగలిగారు. ఆదిభట్లలో అరెస్టు: పోలీసులు సహోదాలోనే ఉన్నట్లుగా భావించిన ఈ గ్యాంగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆదిభట్ల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో తచ్చాడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిని పట్టుకున్నారు. అనుమానం వచ్చి వారిని మీర్‌పేట ఠాణాకు తరలించారు. గతంలో సేకరించిన వేలిముద్రలతో ఇద్దరివి సరిపోలడంతో వారు చెడ్డీ గ్యాంగ్‌గా తేలింది. దినేశ్, సురేశ్, కిషన్‌లు ముఠాగా మారి చోరీలు చేస్తున్నారని తేలింది. ఇక్కడ చోరీలతో సొంతూర్లో దీపావళి.. ‘చోరీలు చేసేందుకు రైలు మార్గం ద్వారా వచ్చే వీరు 4 ప్రాంతాలను ఎంచుకొని ఒక్కో స్టేషన్లో దిగిపోతారు. ఆయా స్టేషన్లలో ఇద్దరు ఉంటే మరో ఇద్దరు వెళ్లి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి వచ్చేవారు. శివారు ప్రాంతాల్లో ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవారు. పగటి వేళ అడవి లాంటి ప్రాంతంలో ఉండి రాత్రి కాగానే ప్యాంట్, షర్ట్ విప్పేసి చెడ్డీ వేసుకొని నడుంకు షర్ట్ చుట్టుకొని చెప్పులు చేతపట్టుకొని చోరీకి బయలుదేరతారు. శరీరానికి నూనెను రాసుకుంటారు. గోడలు ఎక్కి దూకే సందర్భంలో ప్యాంట్ వేసుకొని ఉంటే కిందపడే అవకాశముంటుందని చెడ్డీలు ధరిస్తారు. తాళాలు పగులగొట్టడంలో అనుభవమున్న ఇద్దరు ఆ పనిచూస్తారు. చోరీలు చేశాక ఒక ప్రాంతంలో కలుసుకుంటారు. చందానగర్ ప్రాంతంలో జరిగిన చోరీని దినేశ్ గ్యాంగ్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీపావళికి 2 నెలల ముందు, సంక్రాంతికి హైదరాబాద్ వచ్చి చోరీలు చేస్తుంటామని విచారణలో తెలిపారు. చోరీ చేసిన ఆభరణాలను గుజరాత్లో అమ్మి సొంతూరులో దీపావళి చేసుకుంటామన్నారు. వీరి అరెస్టుతో రాచకొండ కమిషనరేట్‌లో 8 చోరీలు, సైబరాబాద్ పరిధిలో 4, హైదరాబాద్ పరిధిలో ఒకటి, ఏపీలోని 15 కేసులు కొలిక్కివచ్చాయి. -
అందుకే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశా
తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు సుధీర్‌బాబు. ఇప్పుడు ఆయన ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘తన సమర్థత మీద ప్రయాణించే మంచి మనసున్న వ్యక్తి సు«ధీర్బాబు. ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను’’అన్నారు. ‘‘సుధీర్‌బాబు నిర్మాత అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్ నిర్మాతగా సుధీర్‌బాబు పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను’’అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సుధీర్‌బాబు మాట్లాడుతూ–‘‘ ఏదో ఒకరోజు నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసే స్టేజ్‌లో ఉంటే కొత్తవాళ్లను తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. అలాగే స్టార్ట్ చేశా. కృష్ణగారు, మహేశ్ వాళ్లను వాడేసుకుని ఎప్పుడూ సినిమాలు చేయాలనుకోలేదు. సొంతంగా ఎదగాలని కోరుకుంటాను. అందులో ఒక తృప్తి ఉంటుంది. నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టడానికి అదే రీజన్. మంచి సినిమాలు, జనాలకు గుర్తుండే సినిమాలు చేయాలన్నదే నా విజన్. ప్రొడ్యూసర్ అవుతానని అనుకోలేదు. అయ్యా. దర్శకుణ్ణి కూడా అవుతానేమో. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. బయటి ప్రొడక్షన్లో కూడా నటిస్తాను. మా బ్యానర్లో రాబోతున్న తొలి సినిమా షూటింగ్ ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో తుదిదశకు చేరుకుంది. మంచి సందర్భం చూసుకుని ఇలాగే గ్రాండ్‌గా ఈ సినిమా గురించి ప్రకటిస్తాం. ఇప్పుడు ఏ విషయం ఎనౌన్స్ చేయడం లేదు. ఎందుకంటే నేను హీరోగా చేసిన ‘సమ్మోహనం’ సినిమా రిలీజ్ అవుతుంది. అందుకే ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేద్దామనుకోవడం లేదు. అందుకే బ్యానర్ లాంచ్ వరకు మాత్రమే పెట్టాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సందీప్ కిషన్, దర్శకులు వంశీ పైడిపల్లి, శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, అనిల్ సుంకరలతోపాటు చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
కూసుమంచి: ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు అన్నారు. సోమవారం పాలేరులోని బీబీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏమయ్యాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ రైతులను నిలువునా ముంచుతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు నష్ట పోతున్నారని, టమాట రైతులు పంటను రోడ్లపై పోసే దుస్థితి నెలకొందని అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దళారులు, కమీషన్ దారులు కుమ్మక్కై రైతుల వద్ద రోజుకు రూ.లక్షలు దండుకుంటున్నారని విమర్శించారు. మార్కెట్లోకి ఇతర రాజకీయ పార్టీల నాయకులను, మీడియాను అనుమతించటం లేదని, ఇది ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనమని అన్నారు. మంగళవారం జరిగే మార్కెట్ ముట్టడి కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. సబ్సిడీ ట్రాక్టర్లను రైతులు కానీ వారికి, పార్టీ నాయకులకే కట్టబెట్టారని లక్కినేని విమర్శించారు. జక్కేపల్లి ఉప ఎన్నికలో హామీలు ఇచ్చిన పార్టీ నాయకులు ఎన్నికల తరువాత ముఖం చాటేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో కంకర రహదారే ఉండదని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి తుమ్మలకు గురువాయిగూడెం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నాలుగేళ్ల ప్రభుత్వ పాలన ముగిసినా నేటి వరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవ్చేలేని సీఎంకే సీఆర్ దేశం దిశను మారుస్తా అనటం హాస్యస్పదంగా ఉందని అన్నారు. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు వైవీడీ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తా నరేందర్‌రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి రోషిరెడ్డి, నాయకులు బండ్ల వెంకటరెడ్డి, నూకల హుస్సేన్, ఎడవెల్లి పుల్లారెడ్డి, కొత్తా వెంకటేశ్వరరెడ్డి, ఆతుకూరి చినరాములు, విజయ్‌పాల్‌రెడ్డి, గోపె రాము, ఉపేందర్‌రెడ్డి, జగత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నారాయణరెడ్డి, చిన వెంకన్న,అనంతరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.