ఓపెన్ ఛాలెంజ్ | Open Challenge | Sakshi
Sakshi News home page

ఓపెన్ ఛాలెంజ్

Published Thu, Jun 25 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

ఓపెన్ ఛాలెంజ్

ఓపెన్ ఛాలెంజ్

సుధీర్‌బాబు, నందిత జంటగా శిరీషా శ్రీధర్  నిర్మించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం ఇటీవ ల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి ఓ టీవీ చానల్‌లో ‘ఇది ఫీల్ గుడ్ మూవీ... కానీ, భయపడి కామెడీని ఇరికించారు’ అని చెప్పారట. ‘‘మంచి సినిమా తీసిన ఆనందంలో ఉన్న మమ్మల్ని ఆ వ్యాఖ్య చాలా బాధపెట్టింది.
 
 అందుకే, ఈ ఓపెన్ ఛాలెంజ్  చేస్తున్నా’’ అని శిరీషా శ్రీధర్ అన్నారు. సవాల్ ఏంటంటే... నేడు (గురువారం) హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో 3 గంటల 15 నిమిషాలకు ప్రదర్శితమయ్యే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ షో చూసినవాళ్లు, అక్కడ జరిగే ఈ చిత్రం విజయోత్సవంలో పాల్గొనవచ్చు.
 
 నచ్చినవాళ్లు తమ అనుభూతిని పంచుకోవచ్చు. నచ్చలేదని ఎవరైనా అంటే, టికెట్ డబ్బు వెనక్కి ఇచ్చేస్తామని శిరీషా శ్రీధర్ అన్నారు. ‘‘సినిమా చూసిన వాళ్లు తమ అభిప్రాయాన్ని ‘8886084077’ నంబర్‌కు వాట్సప్ కూడా చేయొచ్చని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement