రాచకొండ సీపీ ఎదుట హాజరైన మంచు మోహన్‌బాబు కుమారులు
గంటన్నర చొప్పున విచారణ.. మంచు టౌన్‌షిప్ వ్యవహారంపై వివరణ తీసుకున్న కమిషనర్
ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ హోదాలో ఇద్దరినీ బైండోవర్ చేసిన సీపీ.. శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దని ఆదేశం
మంచు టౌన్‌షిప్ నుంచి బౌన్సర్లు, బయటి వ్యక్తులను పంపేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్/పహాడీషరీఫ్: మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు, పరస్పర ఫిర్యా దులు, జల్‌పల్లిలోని మంచు టౌన్ షిప్‌లో మూడు రోజు లుగా చోటు చేసుకున్న ఘటనలపై రాచకొండ పోలీసు కమిషనర్ సుదీర్‌బాబు బుధవారం మోహన్‌బాబు కుమారులు, సినీనటులు మనోజ్, విష్ణులను విచారించారు. ఉదయం మనోజ్, రాత్రి విష్ణు నేరేడ్‌మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. పోలీసు కమిషనర్ సు«దీర్‌బాబు అదనపు జిల్లా మేజి్రస్టేట్ హోదాలో వారిని విచారించారు.
దాదాపు గంటన్నర చొప్పున వారిని ప్రశ్నించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఘటనలతో జల్‌పల్లిలో ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరి స్థితి మరోసారి నెలకొనకుండా ఉండాలంటే.. చట్టానికి లోబడి వ్యవహరించాలని వారికి స్పష్టం చేశా రు. మంచు టౌన్íÙప్ పరిసరాల్లో శాంతియుత వాతావరణానికి ఆటంకం కలిగించొద్దని ఆదేశించా రు.
ఈ మేరకు మనోజ్, విష్ణు ఇద్దరూ ఏడాది పాటు అదనపు జిల్లా మేజి్రస్టేట్, సీపీ సు«దీర్‌బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని విడివిడిగా బాండ్ రాసి ఇచ్చారు. రూ.లక్ష చొప్పున పూచీకత్తు చెల్లించారు. ఈ మేరకు మనోజ్, విష్ణులను పోలీసులు బైండోవ ర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధన లను పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.
బౌన్సర్లు, బయటి వ్యక్తులను పంపేసిన పోలీసులు
హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం మంచు టౌన్‌షిప్‌లోని బౌన్సర్లు, బయటి వ్యక్తులను పహాడీషరీఫ్ పోలీసులు బయటికి పంపించారు. మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డిల పర్యవేక్షణలో భద్రత చర్యలు చేపట్టారు.
ఆ నివాసంలో కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకులు మాత్రమే ఉండాలన్నారు. బయటివారు ఎవరూ ఉండకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ప్రతి రెండు గంటలకు ఒక సారి ఆ ప్రాంతంలో భద్రత పరిస్థితిని సమీక్షించారు.
మోహన్‌బాబు సహాయకుడు వెంకట కిరణ్ అరెస్ట్
మంచు మనోజ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు బుధవారం పహాడీషరీఫ్ పోలీసులు వెంకట కిరణ్‌ను అరెస్ట్ చేశారు. ఆదివారం తనపై జరిగిన దాడికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీల హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లారంటూ వెంకట కిరణ్‌పై మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
మోహన్‌బాబుకు వెంకట కిరణ్ సహాయకుడని సమాచారం. మరోవైపు మంగళవారం రాత్రి మోహన్‌బాబు ఇంటి వద్ద పలువురు జర్నలిస్ట్‌లపై దాడి ఘటనకు సంబంధించి.. బుధవారం ఉదయం మంచు టౌన్‌షిప్ ముందు జర్నలిస్టులు ఆందోళన చేశారు. మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాం డ్ చేశారు. ఇంట్లోనే ఉన్న మనోజ్ బయటికి వచ్చి జర్నలిస్ట్‌ల ఆందోళనకు మద్దతు తెలిపారు.
అంతా ఆ ఇద్దరే చేస్తున్నారు: మనోజ్
‘‘మా నాన్న దేవుడు.. కానీ ఈ రోజు చూస్తున్న నాన్న కాడు. నాపై మా అన్న విష్ణు, అతడి అనుచరుడు విజయ్ లేనిపోనివి మా నాన్నకు నేర్పుతూ నన్ను విలన్‌గా చిత్రీకరించారు. నా వ్యక్తిగత జీవితంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది. నాన్న చెప్పిన అన్ని పనుల కోసం గొడ్డులా కష్టపడ్డాను. ఒక్క రూపాయి కూడా అడగట్లేదు..’’అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఒంటరిగా ఉన్నామని, తన భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. అమ్మ, నాన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారని, అన్న దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యారని.. తన భార్య మౌనికకు తన తల్లి అండ ఉండాలని తండ్రి స్నేహితులు కొందరు చెప్పడంతోనే ఇంటికి తిరిగి వచ్చానని మనోజ్ చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటన్నింటినీ సాక్ష్యాధారాలతో బయటపెడతానని పేర్కొన్నారు.
‘‘నా భార్య వచ్చాక నేను చెడ్డవాడినయ్యానని ఆరోపిస్తున్నారు. తల్లితండ్రి లేని నా భార్యకు అన్నీ నేనై చూసుకోవాలి. తాను సొంతంగా టాయ్ కంపెనీ పెట్టుకుంది. స్నేహితుల సహకారంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారాన్ని కొనసాగించగలుగుతున్నాం..’’అని తెలిపారు. తనపై దాడి జరిగిన రోజు ఇంట్లో పది కార్లు ఉన్నప్పటికీ.. తాను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
మోహన్‌బాబు ముఖంపై గాయాలు
ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
ఆయన ఛాతీపైనా గాయాలు.. కంటి కింద వాపు
హైబీపీ, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్టు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కుటుంబ కలహాలతో తీవ్ర అస్వస్థతకు గురైన నటుడు మోహన్‌బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ గురు ఎన్.రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మంగళవారం సాయంత్రం మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారని.. ఆ సమయంలో ఆయనకు బీపీ ఎక్కువగా ఉందని, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు. మోహన్‌బాబు ముఖం, ఛాతీపై కొన్ని గాయాలు ఉన్నాయని.. కంటి కింద వాపు ఉన్నట్టు గుర్తించామని వివరించారు. ఈసీజీ, ఈకో నివేదికలు సాధారణంగానే ఉన్నాయని, సీటీ స్కాన్ చేశాక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అంచనాకు వస్తామని తెలిపారు.
చిరునవ్వులతో మంచు లక్ష్మి కుమార్తె వీడియో: మంచు కుటుంబంలో మంటలు రేగుతున్న వేళ.. మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న సామాజిక మాధ్యమంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ముంబైలో ఉన్న మంచు లక్ష్మి తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో తన కుమార్తె విద్యా నిర్వాణ చిరునవ్వులు చిందిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు ‘పీస్ (ప్రశాంతత)’అని క్యాప్షన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment