manchu Vishnu
-
మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ.. అన్నపై మనోజ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో మళ్లీ ముసలం మొదలైంది. మంచు మనోజ్.. తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మోహన్‌బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తిపైనా కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఏడు పేజీల ఫిర్యాదును సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు.ఏం జరిగిందంటే?కాగా డిసెంబర్ 8న మోహన్‌బాబు (Mohan Babu) ఇంట్లో హైడ్రామా నడిచింది. మనోజ్‌పై మోహన్‌బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరలవగా.. అంతలోనే నడవలేని పరిస్థితిలో మనోజ్ ఓ ఆస్పత్రిలో చేరాడు. మనోజ్ తనపై దాడి జరిగిందంటూ డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్‌బాబు, మనోజ్ (Manchu Manoj) ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు.ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9న రాత్రి మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్‌బాబు.. తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశాడు. మనోజ్, అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరాడు. జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే.. ఇటీవల తన ఇంటి జనరేటర్లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురి చేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలో నిజం లేదని మోహన్‌బాబు సతీమణి నిర్మల వివరణ ఇచ్చింది.చదవండి: శ్రీదేవి నాతో ఉన్నట్లే ఉంది.. అప్పుడెంతో ప్రయత్నించా, కానీ..: బోనీ కపూర్ -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవల కన్నప్ప కామిక్ బుక్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యానిమేటెడ్ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను మంచు విష్ణు విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. 🌟 Unveil the saga of '𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚' 🌟Dive into the epic tale of #Kannappa🏹 in our first Animated Comic Book—devotion, bravery, and sacrifice brought to life.Episode 1 is streaming now on YouTube! 🎥✨🔗Telugu: https://t.co/iolkS7zeS3🔗Tamil: https://t.co/sQP4xKrQGG… pic.twitter.com/pqJf9ZXPSm— Vishnu Manchu (@iVishnuManchu) December 23, 2024 -
'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తోంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. మోహన్ బాబు- మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం దగ్గర నుంచి తాజాగా మోహన్ బాబు భార్య నిర్మల.. మనోజ్ చేసిందని తప్పంటూ లేఖ విడుదల చేయడం వరకు వచ్చింది. దీని వల్ల మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓ నెటిజన్‌కి ట్వీట్‌కి విష్ణు ఆసక్తికర రిప్లై ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'కన్నప్ప'. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు-కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.'కన్నప్ప'లో ప్రభాస్ కూడా అతిథి పాత్ర చేస్తున్నాడు. తాజాగా ఓ నెటిజన్.. విష్ణుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. 'అన్నా.. మూవీ ఎలా ఉన్నా పర్లేదు. ప్రభాస్ లుక్స్, పాత్ర తేడా రాకుండా చూస్కో. ఐదు సార్లు వెళ్తా మూవీకి' అని రాసుకొచ్చాడు. దీనికి రిప్లై ఇచ్చిన విష్ణు.. '100 శాతం మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్. కాస్త ఓపిగ్గా ఉండు. త్వరలో బోలెడన్ని విషయాలు చెబుతా' అని అన్నాడు. (ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల)My brother, I am 100% sure you will love my brother #prabhas character and I wish I can tell you more. Exciting to reveal more. Patience please 🙏 🤗🥰 https://t.co/956puAYJ4X— Vishnu Manchu (@iVishnuManchu) December 17, 2024 -
విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు : నిర్మల మోహన్ బాబు
-
నా కుమారుడు మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన నిర్మల
మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల పహాడీషరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. డిసెంబర్ 14న నిర్మల పుట్టినరోజును మనోజ్ సెలబ్రేట్ చేశారు. ఆ సమయంలో విష్ణు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే, విష్ణు .. తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తాజాగా నిర్మల ఒక లేఖ ద్వారా ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు తెలిపారు.పహాడీషరీఫ్ పోలీసులకు మంచు నిర్మల ఇలా తెలిపారు. 'డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకుని జల్పల్లిలోని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు సీసీ ఫుటేజ్‌ని బయట పెట్టి, ఆపై విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేశాడు. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కానీ, ఆరోజు అలాంటి ఘటన ఏమీ జరగలేదు. కేక్ కట్ చేయడం పూర్తి అయిన తర్వాత విష్ణు తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. నా చిన్న కుమారుడైన మనోజ్‌కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కుమారుడు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. ఆ సమయంలో విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ ఫిర్యాదు చేసిన దానిలో ఎలాంటి నిజం లేదు. ఇంట్లో పని చేసే వాళ్లు కూడా 'మేమిక్కడ పని చేయలేమని' వాళ్లే వెళ్లిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు.' అని తెలుపుతున్నాను అంటూ నిర్మల ఒక లేఖ విడుదల చేశారు.మనోజ్ చేసిన ఫిర్యాదు ఏంటి..?తన తల్లి నిర్మల పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చారని మనోజ్ తెలిపారు. ఆ సమయంలో వారు ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్‌ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మంచు ఫ్యామిలీ గొడవపై RGV కామెంట్స్
-
కన్నప్పలో 'కిరాట'గా మలయాళ స్టార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారని వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కన్నప్ప’ సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు మోహన్‌బాబు. -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మోహన్ లాల్ క్యారెక్టర్ రివీల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు.ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024 -
కేక్ వంకతో విష్ణు ఇంట్లోకి వచ్చారు: మనోజ్
-
మంచు ఫ్యామిలీలో ‘పంచదార’ గొడవ
ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జల్పల్లిలోని మంచు మోహన్‌బాబు నివాసంలో మనోజ్, విష్ణుల మధ్య మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. తన తల్లి పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చి ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్‌ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు హైడ్రామా చోటు చేసుకుంది. తండ్రి మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గేట్లు తోసుకుని బలవంతంగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. మరోవైపు జర్నలిస్ట్‌పై దాడి ఘటనపై మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
జర్నలిస్ట్ రంజిత్‌కు మోహన్ బాబు పరామర్శ (ఫొటోలు)
-
జర్నలిస్ట్‌పై దాడి.. రంజిత్‌కు మోహన్‌బాబు పరామర్శ
జర్నలిస్ట్ రంజిత్‌కు సీనీ నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ని కలిసి పరామర్శించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యలను కలిసి.. తన వల్లే తప్పిదం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా రంజిత్ని కొట్టలేదని చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, రంజిత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తనపై దాడి జరిగితే.. జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణలు మీడియాకే చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మోహన్ బాబుతో పాటు మంచు మిష్ణు కూడా ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించాడు. కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. మరోవైపు తన కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మంచు మోహన్ బాబు కూడా కేసు పెట్టాడు. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేశాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్టులంతా ధర్నాకు దిగారు. పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్‌బాబు కనపడుటలేదు…! అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రంజిత్ని కలిసి పరామర్శించాడు. -
Mohan Babu: గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబును కోరిన పోలీసులు
-
హాలీవుడ్ నటుడితో మంచు విష్ణు భాగస్వామ్యం
ప్రముఖ హీరో-నిర్మాత మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఓవైపు కుటుంబ సమస్యలతో సతమవుతున్న ఇతడు.. తరంగ వెంచర్స్ పేరుతో మీడియా-ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. 50 మిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టనున్నారు. హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్.. ఇందులో భాగస్వామి అయ్యేందుకు సుముఖంగా ఉన్నారని స్వయంగా విష్ణునే బయటపెట్టాడు. త్వరలో శుభవార్త వింటారని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మోహన్ బాబు పరారీలో ఉన్నాడా? ట్వీట్ వైరల్)విష్ణు ఆధ్వర్యంలోని తరంగ వెంచర్స్.. ఓటీటీ, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చెయిన్, సరికొత్త టెక్నాలజీలైన ఏఆర్, వీఆర్, ఏఐ వంటి సాంకేతికతకు సంబంధించిన సేవలను అందించనుంది. ఇందులో మంచు విష్ణు, ఆది శ్రీ, ప్రద్యుమన్ ఝాలా, వినయ్ మహేశ్వరి, విల్‌స్మిత్, దేవేష్ చావ్లా, సతీష్ కటారియాలు భాగస్వాములుగా ఉన్నారు. వీళ్లతో పాటు మరికొందరు కూడా ఆసక్తి చూపుతున్నారట.మంచు విష్ణు లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. రాబోయే ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ ఉంటుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీలో విష్ణుతోపాటు మోహన్‌బాబు, శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నారు. (ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?) -
మద్యం మత్తులో దురుసు ప్రవర్తన? క్లారిటీ ఇచ్చిన మనోజ్
మద్యం మత్తులో హీరో మంచు మనోజ్ ఓ పెద్దాయనతో దురుసుగా ప్రవర్తించాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై మనోజ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన బిడ్డను ఇంట్లో బంధించి, తన దగ్గరకు వెళ్లనివ్వకపోతే ఇంకెలా ప్రవర్తిస్తానని ప్రశ్నించాడు. అలాగే తాను మద్యం సేవించలేదని స్పష్టం చేశాడు.నేనే మీడియాను పిలిచా'తెలంగాణ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత జరిగిన ఓ బాధాకర సంఘటన గురించి చెప్పాలి. దానివల్ల నేను, నా భార్య ఎంతో నరకం అనుభవించాం. మా తొమ్మిది నెలల కుమార్తెను ఇంట్లో బంధించి మమ్మల్ని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మాపై దాడి చేశారు. ఆ సమయంలో నా చొక్కా కూడా చిరిగిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను మీడియా సాయం కోరాను. మా ఇంటి ఆవరణలోకి రావడంలో వాళ్లది ఏమాత్రం తప్పులేదు.నా ఛాతీపై కొట్టడంతో..దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయాలని విష్ణు భాగస్వామి రాజ్ కొందూరును కోరుతున్నాను. ఇప్పటికే కిరణ్, విజయ్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణ పూర్తయితే నిజాలు బయటకు వస్తాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో విషయానికి వస్తే.. తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి నా ఛాతీపై కొట్టాడు. నన్ను నేను రక్షించుకునే క్రమంలో ఆయన్ను వెనక్కు నెట్టేశాను. రెండురోజుల్లో నాపై జరిగిన రెండో దాడికి ఇదే నిదర్శనం. మీరైతే ఏం చేస్తారు?అయినా మీ తొమ్మిది నెలల చిన్నారి నుంచి మిమ్మల్ని దూరం చేస్తే మీరేం చేస్తారో చెప్పండి.. ఆ సమయంలో నేను తాగి ఉన్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ రోజంతా నేను పోలీసులతో, మీడియాతోనే ఉన్నాను. అలాంటి సమయంలో నేనెక్కడ మందు తాగాను? వినయ్ కావాలనే నాపై ఈ పుకార్లు సృష్టించాడు. ఆస్తి కోసం డిమాండ్ చేస్తున్నానన్నాడు. నా పరువు మర్యాదలకు భంగం కలిగించి నా నోరు నొక్కేయాలని చూస్తున్నాడు. కానీ నేను వెనక్కు తగ్గను.ఆయుధాలతో భయపెట్టాలని చూసిన విష్ణుఇదంతా జరుగుతున్నప్పుడు నా సోదరుడు విష్ణు ఎక్కడా కనిపించలేదు. మా నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే కనిపించాడు. దీనికంటే ముందు నాకు సపోర్ట్‌గా వచ్చినవారిని తన బౌన్సర్లతో భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలు కూడా తీసుకువస్తానన్నాడు. అయినప్పటికీ వారు ఏమాత్రం జంకకుండా నా కూతురికి రక్షణగా నిలబడ్డారు.నేను పారిపోవడం లేదువినయ్ నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇది అన్యాయం, అనైతికం. నేను ఏ తప్పూ చేయలేదు. సాక్ష్యాధారాలతో నాపై చేసిన ప్రతి ఆరోపణను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. నిజం నిప్పులాంటిది.. కచ్చితంగా బయటకు వస్తుంది అని మనోజ్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు.Press NoteI wish to address the deeply distressing incident that occurred following my visit to the Telangana DGP office. My wife and I were subjected to immense trauma when we were locked out of our own home, with our 9-month-old daughter left inside.After forcing our way… https://t.co/dlwU6wLcgS— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 13, 2024చదవండి: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ -
అలా చేయాల్సిన అవసరం నాకు లేదు: మోహన్ బాబు సంచలన కామెంట్స్
ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన మోహన్ బాబు మరో ఆడియో సందేశం రిలీజ్ చేశారు. ఈ ఘటన జరిగినందుకు తాను ఎంతో చింతిస్తున్నట్లు ఆడియో సందేశమిచ్చారు. మొదట తాను నమస్కారం పెట్టానని.. అయినప్పటికీ అతను మైక్ పెట్టాడని అన్నారు. జర్నలిస్టును కొట్టాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. మీడియాపై దాడి ఘటనపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు.నా కన్నుకు మైక్ తగలబోయిందని.. తృటిలో తప్పించుకున్నానని మోహన్ బాబు వెల్లడించారు. ఇలా మీడియా ప్రతినిధులపై దాడి చేయాల్సి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం తనకు లేదన్నారు. నా ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం న్యాయమేనా?అని ప్రశ్నించారు. నేను చేసింది న్యాయమా? అన్యాయమా? అనేది ప్రజలు, నాయకులు ఆలోచించాలని మోహన్ బాబు కోరారు.(ఇది చదవండి: ఆస్పత్రి నుంచి టాలీవుడ్ నటుడు మోహన్ బాబు డిశ్చార్జ్)నా ఇంట్లోకి వచ్చింది మీడియా వాళ్లు అవునో, కాదో తనకు తెలియదని మోహన్ బాబు చెప్పారు. నా ఇంటి లోపలికి వచ్చి ఏకాగ్రత, ప్రశాంతతను భగ్నం చేశారని అన్నారు. ఆవేశంలో తాను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందని.. ఈ ఘటనకు బాధపడుతున్నానని వివరించారు. జర్నలిస్టును కొట్టాలని ఆ దేవుడి సాక్షిగా తాను అనుకోలేదని మోహన్ బాబు వెల్లడించారు. మా కుటుంబ సమస్యకు మధ్యవర్తులు అవసరం లేదని.. నా పిల్లలతో కలిసి తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.పోలీసులపై సంచలన వ్యాఖ్యలు..పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు. పోలీసుల ప్రవర్తనను ప్రజలంతా గమనించాలని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఎవరి కుటుంబంలోనైనా ఇలాంటి గొడవలు సహజమేనని ఆడియో సందేశంలో మాట్లాడారు. -
మోహన్ బాబు కొత్త ఆడియో విడుదల
-
రాష్ట్రంలో తొలిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్: రాచకొండ సీపీ
మంచు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు మేనేజర్‌ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ వివాదంపై మొత్తం మూడు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా సెలబ్రిటీ బైండోవర్ తీసుకొచ్చామని అన్నారు. దీంతో పాటు మనోజ్‌ను ఏడాదిపాటు బైండోవర్ చేసినట్లు సీపీ వివరించారు. ఆయన నుంచి లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ తీసుకున్నామని పేర్కొన్నారు.మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన ఘటనపై కూడా కేసు నమోదు చేసినట్లు సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని.. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు బౌన్సర్లు గొడవ పడటమే వివాదానికి కారణమని సీపీ అన్నారు.బైండోవర్ అంటే ఏంటో తెలుసా?ఎవరి వల్ల అయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తే ఆ వ్యక్తిని తహసీల్దార్, ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. చట్ట వ్యతిరేక పనులు చేయనని బాండ్ పేపర్‌పై అతనితో లిఖితపూర్వకంగా సంతకం తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. దీన్నే బైండోవర్ అంటారు. బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్. బాండ్ ఇచ్చిన రోజు నుంచి ఆరు నెలల వరకు ఎలాంటి నేరాలు చేయకూడదు. ఈ ఆరు నెలల్లో ఏదైనా నేరం చేసినా, కేసు నమోదైనా బైండోవర్ సమయంలో చేసిన డిపాజిట్ డబ్బులను ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. భారత శిక్షాస్మృతి చట్టం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు బైండోవర్ అయితే అతనిపై రౌడీషీట్ తెరవొచ్చు. -
ఉదయం మనోజ్.. రాత్రి విష్ణు
సాక్షి, హైదరాబాద్/పహాడీషరీఫ్: మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు, పరస్పర ఫిర్యా దులు, జల్పల్లిలోని మంచు టౌన్ షిప్లో మూడు రోజు లుగా చోటు చేసుకున్న ఘటనలపై రాచకొండ పోలీసు కమిషనర్ సుదీర్‌బాబు బుధవారం మోహన్‌బాబు కుమారులు, సినీనటులు మనోజ్, విష్ణులను విచారించారు. ఉదయం మనోజ్, రాత్రి విష్ణు నేరేడ్మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. పోలీసు కమిషనర్ సు«దీర్‌బాబు అదనపు జిల్లా మేజి్రస్టేట్ హోదాలో వారిని విచారించారు. దాదాపు గంటన్నర చొప్పున వారిని ప్రశ్నించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఘటనలతో జల్పల్లిలో ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరి స్థితి మరోసారి నెలకొనకుండా ఉండాలంటే.. చట్టానికి లోబడి వ్యవహరించాలని వారికి స్పష్టం చేశా రు. మంచు టౌన్íÙప్ పరిసరాల్లో శాంతియుత వాతావరణానికి ఆటంకం కలిగించొద్దని ఆదేశించా రు. ఈ మేరకు మనోజ్, విష్ణు ఇద్దరూ ఏడాది పాటు అదనపు జిల్లా మేజి్రస్టేట్, సీపీ సు«దీర్‌బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని విడివిడిగా బాండ్ రాసి ఇచ్చారు. రూ.లక్ష చొప్పున పూచీకత్తు చెల్లించారు. ఈ మేరకు మనోజ్, విష్ణులను పోలీసులు బైండోవ ర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధన లను పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. బౌన్సర్లు, బయటి వ్యక్తులను పంపేసిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం మంచు టౌన్‌షిప్‌లోని బౌన్సర్లు, బయటి వ్యక్తులను పహాడీషరీఫ్ పోలీసులు బయటికి పంపించారు. మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డిల పర్యవేక్షణలో భద్రత చర్యలు చేపట్టారు. ఆ నివాసంలో కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకులు మాత్రమే ఉండాలన్నారు. బయటివారు ఎవరూ ఉండకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ప్రతి రెండు గంటలకు ఒక సారి ఆ ప్రాంతంలో భద్రత పరిస్థితిని సమీక్షించారు. మోహన్‌బాబు సహాయకుడు వెంకట కిరణ్ అరెస్ట్ మంచు మనోజ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు బుధవారం పహాడీషరీఫ్ పోలీసులు వెంకట కిరణ్‌ను అరెస్ట్ చేశారు. ఆదివారం తనపై జరిగిన దాడికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీల హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లారంటూ వెంకట కిరణ్‌పై మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మోహన్‌బాబుకు వెంకట కిరణ్ సహాయకుడని సమాచారం. మరోవైపు మంగళవారం రాత్రి మోహన్‌బాబు ఇంటి వద్ద పలువురు జర్నలిస్ట్‌లపై దాడి ఘటనకు సంబంధించి.. బుధవారం ఉదయం మంచు టౌన్షిప్ ముందు జర్నలిస్టులు ఆందోళన చేశారు. మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాం డ్ చేశారు. ఇంట్లోనే ఉన్న మనోజ్ బయటికి వచ్చి జర్నలిస్ట్‌ల ఆందోళనకు మద్దతు తెలిపారు. అంతా ఆ ఇద్దరే చేస్తున్నారు: మనోజ్ ‘‘మా నాన్న దేవుడు.. కానీ ఈ రోజు చూస్తున్న నాన్న కాడు. నాపై మా అన్న విష్ణు, అతడి అనుచరుడు విజయ్ లేనిపోనివి మా నాన్నకు నేర్పుతూ నన్ను విలన్‌గా చిత్రీకరించారు. నా వ్యక్తిగత జీవితంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది. నాన్న చెప్పిన అన్ని పనుల కోసం గొడ్డులా కష్టపడ్డాను. ఒక్క రూపాయి కూడా అడగట్లేదు..’’అని మంచు మనోజ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఒంటరిగా ఉన్నామని, తన భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. అమ్మ, నాన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారని, అన్న దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యారని.. తన భార్య మౌనికకు తన తల్లి అండ ఉండాలని తండ్రి స్నేహితులు కొందరు చెప్పడంతోనే ఇంటికి తిరిగి వచ్చానని మనోజ్ చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటన్నింటినీ సాక్ష్యాధారాలతో బయటపెడతానని పేర్కొన్నారు. ‘‘నా భార్య వచ్చాక నేను చెడ్డవాడినయ్యానని ఆరోపిస్తున్నారు. తల్లితండ్రి లేని నా భార్యకు అన్నీ నేనై చూసుకోవాలి. తాను సొంతంగా టాయ్ కంపెనీ పెట్టుకుంది. స్నేహితుల సహకారంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారాన్ని కొనసాగించగలుగుతున్నాం..’’అని తెలిపారు. తనపై దాడి జరిగిన రోజు ఇంట్లో పది కార్లు ఉన్నప్పటికీ.. తాను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మోహన్‌బాబు ముఖంపై గాయాలు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు ఆయన ఛాతీపైనా గాయాలు.. కంటి కింద వాపు హైబీపీ, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్టు వెల్లడి సాక్షి, హైదరాబాద్: కుటుంబ కలహాలతో తీవ్ర అస్వస్థతకు గురైన నటుడు మోహన్‌బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ గురు ఎన్.రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారని.. ఆ సమయంలో ఆయనకు బీపీ ఎక్కువగా ఉందని, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు. మోహన్‌బాబు ముఖం, ఛాతీపై కొన్ని గాయాలు ఉన్నాయని.. కంటి కింద వాపు ఉన్నట్టు గుర్తించామని వివరించారు. ఈసీజీ, ఈకో నివేదికలు సాధారణంగానే ఉన్నాయని, సీటీ స్కాన్ చేశాక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అంచనాకు వస్తామని తెలిపారు. చిరునవ్వులతో మంచు లక్ష్మి కుమార్తె వీడియో: మంచు కుటుంబంలో మంటలు రేగుతున్న వేళ.. మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న సామాజిక మాధ్యమంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ముంబైలో ఉన్న మంచు లక్ష్మి తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో తన కుమార్తె విద్యా నిర్వాణ చిరునవ్వులు చిందిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు ‘పీస్ (ప్రశాంతత)’అని క్యాప్షన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. -
మంచు విష్ణు VS మంచు మనోజ్ మాటల యుద్ధం
-
హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!
హైకోర్టులో మంచు మోహన్‌బాబు భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్‌బాబు ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. నిన్న జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబం వ్యవహారం అని ధర్మాసనం అభిప్రాయపడింది. మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా, మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.కాలి నొప్పితో బాధపడుతున్న మోహన్ బాబుఅనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఆయన మెడ, కాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గురునాథ్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతు ఇదే విషయాన్ని చెప్పారు. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. -
వివాదంలో మంచు ఫ్యామిలీ.. రాజీకి మనోజ్, విష్ణు రెడీ?
క్రమశిక్షణకు మారుపేరైన మంచు కుటుంబంలో.. వివాదం రాజుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పైగా మీడియా మీద మోహన్‌బాబు దాడి తర్వాత వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. -
నాకు సీపీని కలవాల్సిన అవసరం లేదు.. కానీ కలుస్తా..
-
అమ్మ ఇంట్లోనే ఉంది.. మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా: మనోజ్
రాచకొండ సీపీ ముందు విచారణకు హాజరైన మంచు మనోజ్ కీలక విషయాలు వెల్లడించారు. తానెప్పుడూ ఆస్తులు అడగలేదని.. నాపై కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. జల్పల్లిలోని మా ఇంట్లోనే అమ్మ ఉందని.. ఆస్పత్రికి వెళ్లలేదని.. ఈ విషయంపై అబద్ధాలు చెబుతున్నారని మనోజ్ తెలిపారు.కూర్చోని మాట్లాడుకోవడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని మంచు మనోజ్ వెల్లడించారు. సిపీని కలిసి జరిగిందంతా వివరించినట్లు తెలిపారు. నా వైపు నుంచి ఎలాంటి గొడవ జరగదని సీపీకి చెప్పినట్లు వివరించారు. మీడియా ప్రతినిధులపై దాడి జరగడం దురదృష్టకరమని.. నాన్న తరఫున నేను క్షమాపణలు కోరుతున్నానని మనోజ్ అన్నారు. ఇవాళ సాయంత్రం ప్రెస్మీట్లో అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.కాగా.. మంగళవార మోహన్ బాబు ఇంటి వద్ద గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద మనోజ్‌ను సెక్యూరిటీ అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఫ్యామిలీలో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు గన్స్ సీజ్ చేశారు. అంతేకాకుండా సీపీ ముందు హాజరవ్వాలని మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. -
మోహన్ బాబు సంచలన ఆడియో లీక్..!