కన్నప్ప రిలీజ్.. మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్! | Manchu Lakshmi Prasanna Post On Kannappa Movie Release Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Lakshmi Manchu: 'శివుని సేవ చేసినవాడికి లోకమంతా సహాయకరమే'.. మంచు లక్ష్మీ పోస్ట్!

Jun 27 2025 10:26 PM | Updated on Jun 28 2025 1:47 PM

Manchu Lakshmi Prasanna Post On Kannappa Movie release

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన కన్నప్ప ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో కన్నప్ప టీమ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ చూసిన మంచు మనోజ్ తన రివ్యూ కూడా ఇచ్చేశారు. అన్న ఇంత బాగా చేస్తాడని ఊహించలేదని అన్నారు. అలాగే ప్రభాస్ నటనపై ప్రశంసలు కురిపించారు.

అయితే తాజాగా మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న కూడా కన్నప్ప మూవీపై పోస్ట్ చేసింది.  శివుని సేవ చేసినవాడికి లోకమంతా సహాయకరమే అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఈ సందర్భంగా కన్నప్ప టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిది. మీరంతా కన్నప్ప సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలంటూ అభిమానులను కోరింది. మంచు ఫ్యామిలీ వివాదం తర్వాత మొదటిసారి మంచు మనోజ్, మంచు లక్ష్మీప్రసన్న పాజిటివ్‌గా పోస్టులు చేయడంతో విష్ణు ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement