సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండేవారిలో మంచు లక్ష్మి ఒకరు. నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే ఆమె తాజాగా ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మంచు విష్ణు తన కుటుంబ సభ్యులను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేస్తుంటే వీడియో తీస్తూ ఎంజాయ్ చేసింది లక్ష్మి. ఇంతలో విష్ణు అందరి వంతు అయిపోంది కానీ ఇంకా ఒక్కరు బ్యాలెన్స్ ఉన్నారనుకున్నాడు.
వెంటనే లక్ష్మి దగ్గరకు వెళ్లి ఆమెను ఎత్తుకుని పూల్ వైపు నడిచాడు. దీంతో విషయం అర్థమైన లక్ష్మి వద్దంటూ కేకలు పెట్టింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ మోహన్‌బాబు సైతం విష్ణుకి సాయం చేస్తూ ఆమెను నీళ్లలో పడేశారు. తండ్రి కూడా తనకు సాయం చేయకుండా విష్ణుకే సపోర్ట్ చేసి పూల్‌లో ఎత్తేసినందుకు ఆమె కాస్త కోపంతో అరిచింది కూడా! అంతా నా కర్మ అంటూ సదరు వీడియోను పంచుకోగా మీ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment