మోహన్‌ బాబు ఫిర్యాదుపై మనోజ్ రియాక్షన్‌ ఇదే.. | Manchu Manoj Released Press Note Released To His Father Mohan Babu Over Shocking Allegations, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Manchu Family Dispute: మోహన్‌ బాబు ఫిర్యాదుపై మనోజ్ రియాక్షన్‌ ఇదే..

Published Tue, Dec 10 2024 7:53 AM | Last Updated on Tue, Dec 10 2024 9:54 AM

Manchu Manoj Press Note Released To His Father Mohan babu

సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.  సోమవారం రాత్రి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి మంచు మనోజ్‌ ఫిర్యాదు చేశారు. కానీ, తనపై దాడి చేసింది ఎవరో ఆయన పేర్కనలేదు. అయితే, అది జరిగిన గంటలోనే మోహన్‌బాబు వాట్సాప్‌ ద్వారా రాచ కొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబుకు ఫిర్యా­దు పంపారు.  తన కుమారుడు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మనోజ్‌,  అతని భార్య మౌనికపై చర్యలు తీసు­కో­వాలని కోరారు. 

అసాంఘిక శక్తుల నుంచి తన ప్రా­ణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ క్రమంలో మనోజ్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మోహన్‌బాబు కోరారు. దీంతో పోలీసులు మనోజ్‌పై  329,351,115 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఆపై  క్రైం నెంబర్ 644/2024 పహడి షరీఫ్ పోలీసులు కేటాయించారు. తండ్రి చేసిన ఆరోపణలపై తాజాగా మంచు మనోజ్‌ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ చేశారు.

మోహన్‌ బాబు ఫిర్యాదు తర్వాత మనోజ్‌ పత్రికా ప్రకటన చేశారు. 'నాపై, నా భార్య మౌనికపై నా తండ్రి డాక్టర్ ఎం. మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన, తప్పుడు ఆరోపణలు నాకు చాలా బాధ కలిగించింది. నా తండ్రి చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవాలు. నా పరువు తీయడానికి, నా గొంతును నొక్కడానికి,కుటుంబ కలహాలు సృష్టించడానికి ఉద్దేశపూర్వక చేసే ప్రయత్నంలో ఇదొక భాగం. నాకు, నా భార్యకు వ్యతిరేకంగా ఆయన చేసిన వాదనలు పూర్తిగా కల్పితం. అంటూ మనోజ్‌ కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చారు.

  • నేను ఎప్పుడూ ఆర్థిక సహాయం కోసం నా కుటుంబంపై ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తులను కోరలేదు. నేను  ప్రస్తుతం ఒక సంవత్సరం నుండి మా నాన్న ఇంట్లోనే నివసిస్తున్నాను.

  • నా సోదరుడు దుబాయ్‌కి వెళ్లిన తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉన్నందున నన్ను ఇంటికి రమ్మని మా నాన్న పిలిచారు. అప్పుడు నేను మా నాన్నకు చెందిన ఇంట్లోకి మారాను. ఏడాదికిపైగా అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. నేను తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చినట్లు నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు.  ఫిర్యాదులో నన్ను, నా భార్యను తప్పుగా ఇరికించే ఉద్దేశ్యంతో ఆరోపణ చేశారు. నేను ఆ ఇంట్లో నివసిస్తున్నానని నిర్ధారించుకోవడానికి గత సంవత్సరం నుంచి నా మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్‌ను ధృవీకరించాల్సిందిగా అధికారులను అభ్యర్థిస్తున్నాను.

  • ఈ గొడవలోకి నా 7నెలల కుమార్తెను  లాగడం చాలా బాధకరమైనది, అమానవీయం ఘటన. ఇలాంటి వివాదంలోకి నా పిల్లలను లాగడం వెనకున్న ఉద్దేశం ఏంటి..?కుటుంబ పెద్దల పట్ల అత్యంత గౌరవం చూపే నా భార్యకు ఉద్దేశాలు ఆపాదించబడడం దురదృష్టకరం.

  • ఇంట్లో పనిచేసే మహిళాలపై మా నాన్న చాలా ఎక్కువగానే తిడుతూ ఉంటారు. దీంతో వారు భయపడిపోవడమే కాకుండా తీవ్రమైన మనోవేదనకు గురయ్యేవారు కూడా..  ఇంట్లో మా నాన్న అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో జీవిస్తారు. అందుకు అవసరమైన అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశామని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మా అమ్మ పర్యవేక్షణతో పాటు ఆయా వద్ద మా కూతురిని ఉంచాం. నా భార్య, నేను కేవలం నాకు తగిలిన గాయాల వైద్య చికిత్స కోసం ఆ సమయంలో హాస్పిటల్‌కి వెళ్ళాం.

  • మంచు ఫ్యామిలీలో ముదిరిన వివాదం
  • విష్ణుకు సహచరులు విజయ్‌రెడ్డి, కిరణ్‌లు సీసీటీవీ డ్రైవ్‌లను ఎందుకు తొలగించారు..? ఈ వివాదంలో వారు ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు..? ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరుతున్నాను.

  • నేను ఎల్లప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను, నా కృషి, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల ఆశీర్వాదం వల్ల  నా వృత్తిని నిర్మించుకున్నాను. నేను ఎనిమిదేళ్లకు పైగా మా నాన్న, సోదరుల చిత్రాల కోసం అవిశ్రాంతంగా పని చేశాను. ఈ క్రమంలో అనేక పాటలు, ఫైట్లు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. తరచుగా కమర్షియల్ హీరోగా నా స్థాయికి తగ్గ పాత్రలను పోషిస్తున్నాను. ఒక్క రూపాయి తీసుకోకుండా, పూర్తిగా నా కుటుంబ ప్రయోజనాల కోసమే ఇదంతా చేశాను. అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా విధ్వంసానికి గురయ్యాయి. నా సోదరుడు విష్ణు… ఇప్పటికీ నాన్న నుంచి మద్దతు, ప్రయోజనం పొందుతూనే ఉన్నాడు.

  • నేను ఎప్పుడూ ఆస్తులు లేదా వారసత్వం ఆస్తులు కోసం అడగలేదు. నేను అడిగి ఉంటె సాక్ష్యాలు అందించమని నేను ఎవరినైనా సవాలు చేస్తున్నాను.  నా జీవితం, నా స్వంత యోగ్యతతో కుటుంబ సంపదపై ఆధారపడకుండా నా పిల్లలను గౌరవంగా పోషించుకుంటుంన్నందుకు నేను గర్వపడుతున్నాను.

  • విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారు. వారికి మద్దతుగా నేను బహిరంగంగా మాట్లాడటంతోనే ఈ ఫిర్యాదు చేశారు. వారి ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కావాలంటే వాటిని  అధికారులకు సమర్పిస్తాను.

  • నా తండ్రి ఎప్పుడూ కూడా విష్ణుకు మద్దతుగానే ఉంటూ వచ్చారు. కుటుంబ విషయంలో నా త్యాగాలు ఉన్నప్పటికీ ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. ఇప్పటికే పరువు నష్టంతో పాటు పలుమార్లు వేధింపులకు గురయ్యాను. విష్ణు స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకుంటూ వచ్చాడు. కానీ, నేనెప్పుడూ స్వతంత్రంగానే జీవిస్తూ వస్తున్నాను. నేను పైన చెప్పిన వాటి విషయంలో  అధికారులకు పూర్తి ఆధారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement