Mohan Babu
-
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
అన్నదమ్ముల గొడవ వల్ల మోహన్‌బాబు ఏళ్లతరబడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అంతా బజారుకెక్కింది. పెదరాయుడిగా అందరి సమస్యలు తీర్చే మోహన్‌బాబు ఇంటి గొడవను చక్కదిద్దలేక డీలా పడిపోయాడు. రోజుకో వివాదం, ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతోనే రోజులు గడుస్తున్నాయి. కానీ, ఇంతవరకు వీరి సమస్య ఓ కొలిక్కి వచ్చిందే లేదు.నాన్న మనసు విరిగిందితాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు (Vishnu Manchu) తన ఇంట్లో జరుగుతున్న కలహాలపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. తండ్రిగా మోహన్‌బాబు (Mohanbabu).. మనోజ్‌ను, నన్ను సమానంగా ప్రేమించాడు. మా ఇంటి గొడవ రోడ్డుకెక్కడం వల్ల నాన్నగారి మనసు విరిగిపోయింది. ఆస్తుల గరించి ఒకటి చెప్పాలి. మా నాన్న మమ్మల్ని చదివించారు. తర్వాత ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. రేప్పొద్దున నా పిల్లలు కూడా నాపై ఆధారపడకుండా వారి కాళ్లపైనే నిలబడాలి. వారే సంపాదించుకోవాలి. ఎవరైనా సరే.. తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన ఆస్తి, ఇల్లు అడగకూడదు.అమ్మ కొడుతుందేమో..కుటుంబ విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నన్ను కొడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మతో పది నిమిషాల పైన మాట్లాడితే చాలు తిట్టడం మొదలుపెడుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ వివాదంలో ఎక్కువ నలిగిపోయింది అమ్మ. ఏదో ఒకరోజు అమ్మ మా అందర్నీ కొడుతుందేమోననిపిస్తోంది. ఇంటి గొడవ వీధిన పడ్డప్పుడు అందరం బాధపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో దగ్గరివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఇతర ఇండస్ట్రీకి చెందిన మోహన్‌లాల్, ప్రభుదేవా.. వంటివారు కూడా ఫోన్లు చేసి బాధపడ్డారు అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు)మనోజ్‌తో కలిసిపోతా..మనోజ్ (Manchu Manoj)కు భయపడి దుబాయ్‌కు షిఫ్ట్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు నేను ఎవ్వరికీ భయపడను. ఈ జన్మలో భయపడటమనేదే జరగదు. జీవితంలో ఎవరికీ జంకొద్దనుకునే టైంలో నా భార్యకు భయపడాల్సి వస్తుంది. పిల్లల్ని దుబాయ్‌లో చదివించాలనుకుంటున్నానంతే! అన్నాడు. మనోజ్‌తో కలిసిపోతారా? అన్న ప్రశ్నకు.. అది కచ్చితంగా జరుగుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాలమే అన్నింటినీ మార్చేస్తుంది. చాలావరకు అన్నీ సద్దుమణిగాయి అన్నాడు. కుటుంబంజెనరేటర్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. జెనరేటర్లో చక్కెర పోస్తే ఫిల్టర్ ప్రాసెస్‌లోనే ఆగిపోతుంది తప్ప పేలదు. ఇది చాలా సిల్లీ అని నవ్వేశాడు. మోహన్‌బాబు కుటుంబ విషయానికి వస్తే.. ఈయన మొదటగా విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు లక్ష్మీ ప్రసన్న, విష్ణు జన్మించారు. విద్యా దేవి మరణించాక ఆమె సోదరి నిర్మలా దేవిని మోహన్‌బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మనోజ్ పుట్టాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విశేషాలుకన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఏడెనిమిది సంవత్సరాలపాటు దీనిపై అధ్యాయం చేశాను. శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్‌ను సంప్రదించినప్పుడు ఆయన ఆఫర్ రిజెక్ట్ చేశారు. మూడుసార్లు అడిగినా ఒప్పుకోలేదు. దర్శకురాలు సుధా కొంగరతో మాట్లాడించి తనను ఒప్పించాను. ప్రభాస్ సినిమాలో భాగమవడానికి నాన్నే కారణం అని చెప్పాడు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.చదవండి: సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మంచు మనోజ్
-
ఆస్తులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు
-
ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు
మోహన్‌బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu Family) లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన మరువక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు మోహన్‌బాబు (Mohan Babu) శనివారం ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలో ఉన్న ఆస్తులను కొంతమంది ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించేసి ఆ ఇంటిని తనకు అప్పగించాలని కోరాడు.కాగా గత కొన్ని రోజుల నుంచి మోహన్‌బాబు తిరుపతిలోనే ఉంటున్నాడు. జల్పల్లిలోని ఇంట్లో భార్య, కూతురితో కలిసి మనోజ్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్‌బాబు కోరాడు. పోలీసుల దగ్గరి నుంచి మోహన్‌బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.. జల్పల్లిలోని ఇంట్లో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు.మోహన్‌బాబు ఫిర్యాదుతో మనోజ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లాడు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిశాడు. జల్పల్లిలోని ఇంటికి అక్రమంగా చొరబడలేదని తెలిపాడు. తమకు ఆస్తి తగాదాలు ఏమీ లేవని, విష్ణు (Manchu Vishnu).. తండ్రిని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడని ఆరోపించాడు. న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు.గత నెలలో మొదలైన గొడవమోహన్బాబు కుటుంబంలో కలహాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజులుగా మనోజ్ (Manchu Manoj), విష్ణు మధ్య వైరం పెరుగుతూనే వస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో మనోజ్ తనపై దాడి జరిగింది. మోహన్‌బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. నడవలేని స్థితిలో మనోజ్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో ఏం జరిగిందన్న ఉత్కంఠ నెలకొంది. అటు మంచు కుటుంబం మాత్రం అలాంటిదేం జరగలేదని ప్రకటించింది.జల్పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకున్న మనోజ్కానీ తర్వాత హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న మోహన్‌బాబు ఫామ్‌హౌస్‌ను మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నాడు. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే మోహన్‌బాబు.. అసాంఘిక శక్తుల నుంచి తనకు ప్రాణహాని అని చెప్తూ మనోజ్-మౌనికపై ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలోని తన నివాసం నుంచి మనోజ్, మౌనికను బయటకు పంపండి అని కోరాడు.చక్కెర గొడవ.. ర్యాలీతో రభసతర్వాత ఓ రోజు మనోజ్ ఇంట్లో పార్టీ చేసుకుంటే విష్ణు జనరేటర్లో చక్కెర పోశాడని గొడవ చేశాడు. అలాంటిదేం లేదని తల్లి స్వయంగా స్పందించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. రెండు రోజుల క్రితం మోహన్‌బాబు యూనివర్సిటీకి 200 మందితో ర్యాలీగా వెళ్లాడు మనోజ్. యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ కోర్టు ఉత్తర్వులు చూపించినా మనోజ్ వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో గొడవ జరగడంతో మనోజ్, మౌనికపై కేసు నమోదు అయింది. అటు మనోజ్ ఫిర్యాదుతో ఎంబీయూ సిబ్బంది, మోహన్‌బాబు బౌన్సర్లపైనా కేసు నమోదైంది.కుక్క తిట్లుఇంతలో శుక్రవారం విష్ణు, మనోజ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అన్న సినిమా డైలాగ్‌ను విష్ణు ట్వీట్ చేశాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని కౌంటరిచ్చాడు.మాట్లాడుకుందాం.. అంతలోనే ట్విస్ట్ఈ రోజు ఉదయం కలిసి మాట్లాడుకుందాం. నాన్నను, ఇంట్లోని ఆడవారిని, సిబ్బందిని అందర్నీ పక్కన పెట్టి రా. నేనూ ఒంటరిగానే వస్తాను. అన్ని విషయాలు చర్చించుకుందాం అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇంతలోనే మోహన్‌బాబు మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించడం.. మనోజ్ కలెక్టరేట్‌కు వెళ్లి న్యాయం కోసం పోరాడతాననడం జరిగిపోయింది. ఇక ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి!చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా -
మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం వేళ.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. గతంలో జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో మోహన్ బాబు ఆస్పత్రి పాలయ్యారు. ఓ ప్రైవేట్ చికిత్స తీసుకుని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల సంక్రాంతి వేడుకల్లో కూడా మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అంత బాగుందనుకున్న తరుణంలో మరోసారి వివాదం మొదలైంది.ఈ పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబుకు యూనివర్సీటికి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. మనోజ్ దంపతులను లోపలికి అనుమతించక పోవడంతో ఆయన అనుచరులు గేటు పైకి ఎక్కి లోపలికి ప్రవేశించారు. మనోజ్‌కు అనుమతి లేదని వారు చెప్పడంతో ఇరువర్గాల వారు దూషణకు దిగారు. మనోజ్ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు. ఆపై ఎంబీయూలో పని చేస్తున్న కిరణ్ కుమార్‌పై దాడి చేశారు.మంచు విష్ణు ట్విటర్ పోస్ట్ వైరల్..ఈ గొడవల నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్ ఆడియోను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. నా ఫేవరేట్ డైలాగ్స్‌లో ఇది ఒకటి.. నా ఫేవరేట్ డైరెక్టర్ ఆర్జీవీ ఈ సినిమాను అందించాడు. ఇందులో ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ అంటూ ఇండస్ట్రీలో మోహన్ బాబు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో చూసేద్దాం.'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్‌ను మంచు విష్ణు షేర్ చేశారు. అయితే వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటి పోస్ట్ చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్‌ను ఉద్దేశించే చేశారా? అనే తెగ చర్చించుకుంటున్నారు. కేసులు నమోదు..ఈ వివాదంతో చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు అయ్యాయి. మనోజ్, మోహన్‌బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురిపై పోలీసులు నమోదు చేశారు.తాత, నానమ్మకు మంచు మనోజ్ దంపతుల నివాళులు..తిరుపతికి వెళ్లిన మంచు మనోజ్.. తన భార్యతో కలిసి తాత, నానమ్మల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు. శ్రీవిద్యానికేతన్‌లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంచు మనోజ్ చెప్పారు. ఆపై సుమారు 200 మందితో కలిసి ర్యాలీగా శ్రీవిద్యానికేతన్ మీదుగా నారావారిపల్లెకు చేరుకున్న మనోజ్.. అక్కడ మంత్రి నారా లోకేశ్‌తో సుమారు 25 నిమిషాల పాటు భేటీ కావడం విశేషం. One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025 -
చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబంలో కొద్దిరోజులుగా జరుగుతున్న గొడవలు తార స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పలు కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆ కుటుంబ సభ్యులు తాజాగా మరో కేసులో చిక్కుకున్నారు. చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు అయ్యాయి. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్(Manchu Manoj) శ్రీవిద్యానికేతన్‌లోకి (Sree Vidyanikethan) వెళ్తుండగా అక్కడి సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈమేరకు మనోజ్, మోహన్‌బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురిపై పోలీసులు నమోదు చేశారు.రెండురోజుల క్రితం మనోజ్.. తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలసి తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి ఎంబీయూ యూనివర్శిటీ సమీపంలోని మోహన్‌బాబు డెయిరీ ఫాం గేటు వద్దకు చేరుకున్నారు. మనోజ్‌కు అనుమతి లేదని వారు చెప్పడంతో ఇరువర్గాల వారు దూషించుకున్నారు. దీంతో ‘రేయ్ ఎవర్రా మీరంతా.. వాళ్లను పట్టుకోండి’ అంటూ మనోజ్ తన అనుచరులను పూరమాయించాడు. మనోజ్ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు. ఆపై ఎంబీయూలో పని చేస్తున్న కిరణ్ కుమార్‌పై దాడి చేశారు. (ఇదీ చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్)గొడవల వల్ల అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అదే సమయంలో మంచు మనోజ్.. తన భార్యతో కలిసి తాత, నానమ్మల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవిద్యానికేతన్‌లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆపై సుమారు 200 మందితో కలిసి ర్యాలీగా శ్రీవిద్యానికేతన్ మీదుగా నారావారిపల్లెకు చేరుకున్న మనోజ్.. అక్కడ మంత్రి నారా లోకేశ్‌తో సుమారు 25 నిమిషాల పాటు భేటీ కావడం విశేషం. -
పండగ పూట మరోసారి ‘మంచు’ వివాదం (ఫోటోలు)
-
ఎంబీయూ వద్ద తీవ్ర ఉద్రిక్తత
చంద్రగిరి: కొద్ది రోజులుగా సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు తార స్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ శ్రీవిద్యానికేతన్‌లోకి వెళ్తుండగా అక్కడి సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం మనోజ్.. తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలసి తిరుపతికి చేరుకున్నారు. సుమారు 200 మందితో కలిసి ర్యాలీగా శ్రీవిద్యానికేతన్ మీదుగా నారావారిపల్లెకు చేరుకున్నారు. అక్కడ మంత్రి నారా లోకేశ్‌తో సుమారు 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం ఏ.రంగంపేట వద్ద జరుగుతున్న జల్లికట్టును వీక్షించి, శ్రీవిద్యానికేతన్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే స్కూల్ గేట్లు మూసివేసి, భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఆయన లోపలికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లేందుకు అనుమతులు లేవంటూ కోర్టు ఉత్తర్వులను చూపించారు. దీంతో మనోజ్ లోపల ఉన్న పీఆర్వో, ఇతరులను పిలిచారు. తనను లోపలికి అనుమతించకపోతే రోడ్డుపై బైఠాయిస్తానంటూ హెచ్చరించారు. పండుగ పూట తాత, నానమ్మల సమా«ధుల వద్దకు వెళ్లి నివాళులర్పించి వెళ్తానని చెప్పారు. ఈ క్రమంలో సీఐ సుబ్బరామిరెడ్డి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం మంచు మనోజ్ కూడా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. కోర్టు ఉత్తర్వుల్లో స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లకూడదని మాత్రమే ఉందని.. తన తాత, నానమ్మల సమాధులు ప్రాంగణంలో లేవని అసహనం వ్యక్తం చేశారు.దాడి.. లాఠీ చార్జ్ఎంబీయూ సమీపంలోని డెయిరీ వద్దకు తన భార్యతో కలిసి చేరుకున్న మనోజ్‌ను అక్కడి వారు అడ్డుకున్నారు. దీంతో ‘రేయ్ ఎవర్రా మీరంతా.. వాళ్లను పట్టుకోండి’ అంటూ మనోజ్ తన అనుచరులను పూరమాయించాడు. మనోజ్ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు. ఎంబీయూలో పని చేస్తున్న కిరణ్ కుమార్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉద్రిక్తత నడుమ మంచు మనోజ్.. తన భార్యతో కలిసి తాత, నానమ్మల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవిద్యానికేతన్‌లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్నందున శ్రీవిద్యానికేతన్ లోపలికి వెళ్లడం లేదన్నారు. అయినప్పటికీ పోలీసులు అడ్డుకోవడం దారుణం అని, ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. కాగా, మనోజ్ తీరుపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఎంబీయూ మీడియా ఇన్చార్జ్ రవి చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. -
Mohan Babu: కోర్టు ధిక్కరణ.. మంచు మనోజ్‌పై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, తిరుపతి: హీరో మంచు మనోజ్‌పై తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు బుధవారం ఓ లేఖ విడుదల చేశాడు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మంచు మనోజ్ సంక్రాంతి పండక్కి నారావారి పల్లెలో ఉన్న తన మేనత్త మేడసాని విజయమ్మగారి ఇంటికి వెళ్తానని కబురు చేశాడు. అందుకామె ఒప్పుకోలేదు. రెండు వందలమందితో లోనికి రావాలని..అన్న విష్ణు (Manchu Vishnu)తో గొడవపడుతున్నావని, తండ్రి మాట కూడా వినడం లేదు.. కాబట్టి తన ఇంటికి రావొద్దని తెలిపింది. అయినా వినకుండా మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఈ రోజు నారావారి పల్లెకు వచ్చాడు. నారా లోకేష్ గారిని కలవగా ఆయన ఒక నిమిషం మాట్లాడి వెళ్ళిపోయారు. నారా రోహిత్ గారితో కలిసి సినిమా తీస్తున్న కారణంగా ఆయనతో మాట్లాడి వచ్చేశాడు. తిరిగి వస్తున్న క్రమంలో డాక్టర్ మోహన్‌బాబు గారి యూనివర్సిటీ గేటు వద్ద 200 మందితో లోనికి రావాలని ప్రయత్నించాడు. (చదవండి: మంచు మనోజ్ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్ల దాడి)గేటు దూకి లోనికి..కోర్టు ఆదేశాల మేరకు విద్యా సంస్థల ప్రాంగణంలోనికి వెళ్లకూడదని పోలీసులు ఎంతోసేపు చెప్పారు. తర్వాత కొంత ముందుకు వెళ్లి మోహన్‌బాబు విద్యా సంస్థల్లోని డైరీ ఫారంలోని గేటుపై నుంచి దూకి లోపలకు ప్రవేశించాడు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుంది. కాబట్టి ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు, కోర్టుకు అప్పీలు చేస్తున్నాను అని లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నాడు.చదవండి: పక్కవాడితో నీకెందుకు.. ముందు నువ్వు బాగుండాలి కదా?: అజిత్ కుమార్ -
తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ క్యాంపస్ వద్ద టెన్షన్ వాతావరణం
-
భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబం
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇవాల్టి నుంచే భోగ భాగ్యాలు తీసుకొచ్చే భోగి పండుగ షురూ అయింది. నగరాలు బోసివేతున్న వేళ.. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఈ పొంగల్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా సినీ నటుడు మోహన్ బాబు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌లో భోగి మంటలు వేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయాలకు, విలువలకు ప్రతీకే సంక్రాంతి పండుగని మోహన్ బాబు అన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.భోగి వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ..'సాంప్రదాయాలకు, విలువలకు ప్రతీక సంక్రాంతి. రైతు సుభిక్షంగా ఉంటేనే సంక్రాంతి వేడుకగా జరుపుకుంటా. సంతోషంగా జరుపుకునే ఈ పండుగ వేళ ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలి' అని అన్నారు. భోగి వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్త కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నామని తెలిపారు. జల్లికట్టుకు రంగంపేట ఫేమస్.. అందుకే యువత జాగ్రత్తగా ఉండాలని మంచి విష్ణు సూచించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
లోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇంటి లోపలకు వచ్చినంత మాత్రాన జర్నలిస్ట్‌పై దాడి చేస్తారా’అంటూ సినీనటుడు మంచు మోహన్‌బాబును సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మరోపక్క మోహన్‌బాబుపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్ర పోలీసులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 10న జల్పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ రాలేదు. దీంతో ఆయన డిసెంబర్ 24న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జర్న లిస్ట్‌పై దాడి జరిగిన సందర్భాన్ని మోహన్‌బాబు తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాస నానికి తెలిపారు. క్షణికావేశంలో మోహన్‌బాబు జర్నలిస్ట్ మైక్ లాక్కొని, అదే మైక్‌ను విసిరారన్నారు. అయితే ఈ ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే బాధిత జర్నలిస్ట్‌కు నష్టపరిహారం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని అభ్యర్థించారు. దవడ విరగడంతో.. పైపు ద్వారా ఆహారంమోహన్బాబు దాడి చేయడం వల్లే జర్నలిస్ట్ దవడ విరిగిందని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసు కెళ్లారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరేందుకే మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లారని ధర్మాస నానికి గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకొని మోహన్‌బాబు జర్నలిస్ట్‌ను బెదిరించలేదని, అయినా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారన్నారు. మోహన్‌బాబు ఇంటిపైకి 20–30 మంది వచ్చారని, ఇది అతిక్రమణ కిందకు వస్తుందని చెప్పారు. మోహన్‌బాబు పేరున్న నటుడని, ఎవరినైనా చంపడం, బాధపెట్టడం ఆయనకు ఇష్టం లేదని ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. ప్రతివాదులకు నోటీసులు జారీ ఈ వాదనలపై జస్టిస్ దులియా స్పందిస్తూ..ఎవరైనా ఇంటిలోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా అని మోహన్‌బాబు తరపు అడ్వొకేట్ రోహిత్గీని ప్రశ్నించారు. అయితే ఇరుపక్షాలు వాదనలు విన్న ధర్మాసనం..ప్రతివా దిగా ఉన్న బాధితుడు పరిహారం కోరుకుంటున్నారా చెప్పాలని కోరింది. దీనిపై జర్నలిస్ట్ న్యాయవాదితో మాట్లాడి, ఆయనకు ఏం కావాలో చేస్తానని ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ వరకు మోహన్‌బాబుపై బలవంతపు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, జర్నలిస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. -
తిరుపతి తొక్కిసలాట: హృదయాన్ని కలిచివేసిందన్న మోహన్‌బాబు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohanbabu) దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. 'తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది.ఇలా జరగడం దురదృష్టంప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయినా ఇలా జరగడం దురదృష్టకరం. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని.. మరణించిన వారి కుటుంబాలకు ఆ వైకుంఠవాసుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు.ఏం జరిగింది?వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. పదిరోజులపాటు కొనసాగే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకోసం తిరుమలలో ఒకటి, తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేశారు. టోకెన్లు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో, పక్క రాష్ట్రాల భక్తులు సైతం భారీగా తరలి వచ్చారు.(చదవండి: మోహన్ బాబును జైలుకు పంపాలా..? నష్టపరిహారం కావాలా..?: సుప్రీంకోర్టు)ఒక్కసారిగా విడిచిపెట్టడంతో..తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్న భక్తులను క్యూలైన్లోకి అనుమతించలేదు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. కిందపడిపోయినవారికి ఊపిరాడక ఆరుగురు మృతి చెందారు.భీతిల్లిన తిరుపతిఅదేవిధంగా శ్రీనివాసం ప్రాంతంలోని కౌంటర్ కేంద్రంలో భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరగ్గా ఒకరు మరణించగా పలువురూ గాయపడ్డారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాల్సిన తిరుమల అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో భీతిల్లింది.కన్నప్ప సినిమా విశేషాలుసినిమా విషయానికి వస్తే.. మోహన్‌బాబు చివరగా శాకుంతలం సినిమాలో నటించాడు. ప్రస్తుతం అతడు కన్నప్ప మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శివ భక్తుడు కన్నప్పగా కనిపించనున్నాడు. విష్ణు తనయుడు అవ్రామ్ బాలకన్నప్పగా మెప్పించనున్నాడు. ఈ చిత్రాన్ని 2023లో ప్రకటించారు. ప్రభాస్, కాజల్, మధుబాల, ఆర్ శరత్‌కుమార్, బ్రహ్మానందం, రఘుబాబు, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు వెళ్ళి అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా…— Mohan Babu M (@themohanbabu) January 9, 2025 చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు -
సంక్రాంతి సంబరాల్లో మోహన్ బాబు (ఫొటోలు)
-
మోహన్ బాబును జైలుకు పంపాలా..? నష్టపరిహారం కావాలా..?: సుప్రీంకోర్టు
కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో (Supreme Court ) స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జరిగే వరకు మోహన్‌బాబుపై (Mohan Babu) ఎలాంటి చర్యలు తీసుకోకవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.అయితే, విచారణలో భాగంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు అడిగింది. జర్నలిస్టులు లోపలికి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా.. ? అంటూ నటుడు మోహన్ బాబును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది ఆవేశంలో జరిగిన ఘటన అని, బాధితుడికి పూర్తి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. అయితే, ఈ కేసుకు సంబంధించి నష్టపరిహారం కావాలా.. ? మోహన్ బాబును జైలుకు పంపాలా..? అని జర్నలిస్టు తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు అడిగింది. అయితే, ఈ అంశం గురించి తదుపరి విచారణలో సమాధానం ఇస్తామని జర్నలిస్ట్ తరఫు న్యాయవాది చెప్పడంతో మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని రంజిత్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది.(ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే హైప్)మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇలా వాదనలు వినిపించారు. జర్నలిస్టులకు ఆహ్వానం లేకుండానే ఎందుకు ఇంటికి వచ్చారని న్యాయవాది ప్రశ్నించారు. అయినప్పటికీ ఇది ఆవేశంలో జరిగిన ఘటనగా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, నష్టపరిహారం చెల్లించేందుకు మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన వయసు 76 సంవత్సరాలు కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ముకుల్ కోరారు. అయితే, మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డానని జర్నలిస్ట్ కోర్టుకు తెలిపారు. ఆ కారణంగా ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ దాడి వల్ల వృత్తిపరంగా తనకు నష్టం జరిగిందని జర్నలిస్ట్ తెలిపారు. -
నిన్న జరిగింది మర్చిపోను.. రేపటి గురించి ఆలోచించను: మోహన్ బాబు
తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో (Mohan Babu University) బుధవారం నాడు సంక్రాంతి (Sankranthi) వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ విద్యార్థులు ముగ్గుల పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, ఈ సంక్రాంతి వేడుకల్లో యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు సినీ డైలాగ్స్‌తో అక్కడి విద్యార్థులను ఆనందపరిచారు. వేదికపై ఆయన మాట్లాడాతూ.. గతం గతః అనే వ్యాఖ్యలు చేశారు.యూనివర్సిటీ వేదికపై మోహన్‌బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. తాను నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. 'నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వెయ్యను, రేపటి గురించి ఆలోచించను' అని మెప్పించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏడాది విద్యార్థులతో కలిసి బోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని మోహన్ బాబు అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి యువత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సంక్రాంతి అంటే రైతు అని, రైతు బాగుంటేనే మనంందరం బాగుంటామని ఆయన గుర్తుచేశారు. కాబట్టి సంక్రాంతి అనేది మనందరి పండుగ అన్నారు.ఈ క్రమంలో మోహన్‌బాబును కన్నప్ప సినిమా పనుల గురించి మీడియా వారు ప్రశ్నించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు ఆయన తెలిపారు. 'ఏఫ్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సినిమాపై నమ్మకంతో మేము ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాం. శ్రీకాళహస్తీశ్వరుడిపై ఇప్పటివరకూ విడుదలైన సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. పరమశివుడి వరంతో నేను జన్మించాను.(ఇదీ చదవండి: హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్ ) అందుకే నా పేరు భక్తవత్సలం అని మా తల్లిదండ్రుల పెట్టారు. కాబట్టి ఆయనే మమ్మల్ని ఆదుకుంటాడు. సినిమా పరిశ్రమలో జయాపజయాలు సహజం. కానీ, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రకృతిని కూడా కోరుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌పై నా బిడ్డ విష్ణు ఎన్నో కలల కన్నాడు. ఒకరకంగా ఇది అతనికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెబుతాను. కాబట్టి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. -
సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో చిక్కుకున్న సినీ నటుడు మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇదే కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. అందుకు అంగీకరించని న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది.ఏం జరిగిందంటే?ఇటీవల మోహన్‌బాబు, మనోజ్ మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు జల్పల్లిలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో జర్నలిస్టు రంజిత్‌పై మోహన్‌బాబు మైక్‌తో దాడి చేశారు. దీంతో ఆయన పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో జర్నలిస్ట్‌పై దాడికి సంబంధించిన కేసులో ఆయన తెలంగాణ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. అయితే, డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వబోమని న్యాయస్థానం తెలిపింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేడు ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలో విచారణ జరగనుంది. -
థియేటర్లలో 200 రోజులు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది: మోహన్ బాబు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తనదైన నటనతో వెండితెరపై అభిమానులను అలరించారు. ఆయన తన కెరీర్లో నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల తన బ్లాక్ బస్టర్‌ను చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో డైలాగ్స్, సీన్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా మరో మూవీకి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.1991లో మోహన్ బాబు నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ. ఈ మూవీ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. థియేటర్లలో 200 రోజులు ఆడి కలెక్షన్ కింగ్ అనే బిరుదును మోహన్ బాబుకు అందించింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. పి.వాసు, పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథను అందించారు. కేవీ మహదేవన్ సంగీమందించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా తన కెరీర్లో గొప్ప మెలురాయిగా నిలిచిపోయిందన్నారు.మోహన్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' అసెంబ్లీ రౌడీ (1991) నా సినీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్, కామెడీ డ్రామాలో శక్తివంతమైన పాత్రను పోషించాను. ఆకట్టుకునే కథాంశంతో పి.వాసు, పరుచూరి బ్రదర్స్ అందించిన ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమాకు నా కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. థియేటర్లలో 200 రోజులు ఆడి రికార్డుల మోత మోగించింది. కలెక్షన్ కింగ్ అనే బిరుదు అందించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలోని కేవీ మహదేవన్ మ్యూజికల్ హిట్లు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి' అంటూ పోస్ట్ చేశారు. 🌟 Assembly Rowdy (1991) – A cherished milestone in my journey! 🌟Playing such a powerful role in this action, comedy-drama, directed by Sri. B. Gopal, was truly memorable. With an engaging storyline by Sri. P. Vasu and impactful dialogues from the Paruchuri Brothers, the film… pic.twitter.com/SX9vHm580D— Mohan Babu M (@themohanbabu) December 25, 2024 -
అజ్ఞాతంలో నటుడు మోహన్ బాబు?
జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో మోహన్ బాబుకు (Mohan Babu) తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఇప్పటివరకు పోలీసుల విచారణకు ఈయన అందుబాటులోకి రాలేదు. దీంతో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు (Hyd Police) సిద్ధమవుతున్నారు. కేసు నమోదైన ఫహడీ షరీఫ్ పోలీసులు.. ఈయన ఎక్కడున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. దీంతో ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.ఇంతకీ ఏం జరిగింది?మంచు మోహన్ బాబుని గత కొన్నిరోజులుగా కుటుంబ సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న కొడుకు మనోజ్ (Manchu Manoj) ఈయనపై దాడి చేశారనే రూమర్స్ తొలుత వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని.. మంచు కుటుంబంలో అంతా బాగానే ఉందని అన్నారు. కానీ తండ్రి-కొడుకు పరస్పరం హైదరాబాద్ ఫహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో మంచు ఫ్యామిలీలో గొడవ బయటపడింది. ఈ వివాదం గురించి తెలుసుకునేందుకు మోహన్ బాబు ఇంటి దగ్గరకు కొన్నిరోజుల క్రితం తెలుగు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మాట్లాడే క్రమంలోనే జర్నలిస్ట్‌పై మోహన్ బాబు మైకుతో దాడి చేశారు. దీంతో అతడి తలకు గాయలయ్యాయి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)ఆ తర్వతా సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా.. దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.అనారోగ్య కారణాల దృష్ట్యా డిసెంబర్ 24వ తేదీ వరకు మోహన్ బాబుని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) ఆదేశించింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయినా సరే ఇప్పటికీ మోహన్ బాబు.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. తొలుత నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!) -
ఆ డైలాగ్స్ వింటే ఇప్పటికీ గూస్బంప్స్: మోహన్ బాబు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా, విలన్‌గా తన నటనతో అభిమానులను మెప్పించారు. అప్పటి స్టార్ హీరోలతోనూ చాలా సినిమాల్లో కనిపించారు. ఇటీవల తాను నటించిన పాత్ర చిత్రాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. తాను నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంబంధించిన పోస్టులు పెడుతున్నారు.తాజాగా మరో బ్లాక్‌బస్టర్ మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 1997లో వచ్చిన అడవిలో అన్న అనే యాక్షన్ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ వింటే ఇప్పటికీ గూస్బంప్స్ ఖాయమని మోహన్ బాబు ట్వీట్ చేశారు.మోహన్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' బి. గోపాల్ దర్శకత్వం వహించిన చిత్రం అడవిలో అన్న. ఈ కథను పరుచూరి బ్రదర్స్ అద్భుతంగా రాశారు. ఈ చిత్రం ఎప్పటికీ సినిమాటిక్ క్లాసిక్‌గా నిలుస్తుంది. వందేమాతరం శ్రీనివాస్ మరపురాని సంగీతం అందించారు. ఇందులో ప్రతి సన్నివేశం ఓ శాశ్వతమైన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే నా సోదరుడు, దివంగత గద్దర్ కూడా ఈ కళాఖండానికి సాహిత్యంతో పాటు కొన్ని డైలాగ్స్ అందించారు. పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్న ఈ ఐకానిక్ సీన్ చూస్తే ఇప్పటికీ గూస్బంప్స్ ఇస్తూనే ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. 🌟 Adavilo Anna (1997) – A Captivating Action Drama 🌟Directed by Sri. B. Gopal and masterfully written by the Paruchuri Brothers, this film stands as a true cinematic classic. With Sri. Vandemataram Srinivas's unforgettable music enhancing its essence, every scene leaves a… pic.twitter.com/f016pexrc5— Mohan Babu M (@themohanbabu) December 24, 2024 -
మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత!
-
మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
ప్రముఖ నటుడు మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం కొట్టేసింది. అనారోగ్యంతో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు కానీ అది నెరవేరలేదు. దీంతో మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.ఇకపోతే మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు ఆయన న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాలును చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది రవిచందర్ చెప్పారు. మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరడంతో.. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్‌లో ఉన్నారని తెలిపారు. దీంతో పాటు జర్నలిస్ట్ స్టేట్మెంట్ కాపీని కూడా హైకోర్టు పరిశీలించింది.(ఇదీ చదవండి: కూటమి పార్టీల్లో ‘బెనిఫిట్ షో’ వివాదం)ఇంతకీ ఏం జరిగింది?మోహన్ బాబు ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి. దీంతో మనోజ్-మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని తొలుత రూమర్స్ వచ్చాయి. అది నిజమో కాదో పక్కనబెడితే పరస్పరం పోలీసు కేసులు అయితే పెట్టుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఓ మూడు నాలుగు రోజుల పాటు ఈ గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటి దగ్గరకు మీడియా ప్రతినిధులు వెళ్లగా.. జర్నలిస్టుపై మైకుతో మోహన్ బాబు దాడి చేశారు. దీంతో తలకు గాయలయ్యాయి.ఆ తర్వతా సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కూడా మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా.. దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన) -
చట్టం ముందు అందరూ సమానులే: డీజీపీ జితేందర్
కరీంనగర్ క్రైం: చట్టం ముందు అందరూ సాధారణ పౌరులేనని, నటులు అల్లు అర్జున్, మోహన్‌బాబు కూడా ఇందుకు అతీతులు కారని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ము న్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఆదివారం ఆయన మహిళా భద్రతా విభాగం డీఐజీ రెమా రాజేశ్వరితో కలసి ప్రారంభించారు. భరోసా కేంద్రంలోని అన్ని విభాగాలను పరిశీలించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చట్టం దృష్టిలో అల్లు అర్జున్ అయినా, మోహన్‌బాబు అయినా.. ఇతరత్రా ఎవరైనా అందరూ సమానులేనని, తప్పు చేస్తే ఎలాంటి తారతమ్యాలు లేకుండా చట్టపరంగా చర్యలుంటాయని తెలిపారు. మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరిట అమాయకులపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.బాలికలు, మహిళల భ ద్రత కోసం ప్రతి జిల్లాలో భరోసా కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలోని 23 ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించామని వివరించారు. ఈ కేంద్రాలు కేవలం తెలంగాణలోనే ఉన్నా యని, వీటి పనితీరును సుప్రీంకోర్టు కూడా అభినందించిందని గుర్తు చేశారు. ఈ కేంద్రాలు పోక్సో కేసుల దర్యాప్తులో సహాయపడతాయని, నిందితులకు శిక్ష పడే శాతాన్ని పెంచుతాయని డీజీపీ చెప్పారు. బాధితులు, మద్దతుదారులకు భద్రత కలి్పంచడంతోపాటు సాక్ష్యాలను సేకరించి కోర్టులో నిందితులకు శిక్ష పడేలా ఈ కేంద్రాలు కృషి చేస్తాయన్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా పనిచేస్తుందని అన్నారు. ఎఫ్ఐఆర్ మొదలు.. తుది పరిష్కారం వరకు భరోసా కేంద్రం బాధితులకు బాసటగా నిలుస్తుందన్నారు. కాగా, కరీంనగర్ భరోసా కేంద్రంలో నియామకాలు చేపట్టామని, ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సీపీ అభిõÙక్ మహంతి, శిక్షణ ఐపీఎస్ వసుంధరాయాదవ్, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, భరోసా కేంద్రం ఏసీపీ మాధవి, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.బౌన్సర్లూ.. హద్దు దాటొద్దుతెలంగాణ పోలీసుల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: సినిమా తారలు, ఇతర ప్రముఖులకు రక్షణగా ఉండే బౌన్సర్లు, ప్రైవే టు బాడీగార్డులు.. చట్టాన్ని అతిక్రమిస్తే చర్య లు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. బౌన్సర్లు, బాడీగార్డుల పేరిట.. చట్టానికి వ్యతిరేకంగా ఇతరులపై దాడులు, బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులతోపాటు జైలు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి బౌన్సర్లు, బాడీగార్డులు, వీరిని సమకూర్చే సంస్థలు ప్రభుత్వ, పోలీస్ నిబంధనలకు లోబ డి చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ పెట్టారు. -
మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు
కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవనే దీనికి కారణం. ఈ వివాదంలో బోలెడన్ని టర్న్స్, ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తండ్రి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారనే రూమర్స్, పరస్పరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం.. మధ్యలో ఊహించని విధంగా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి, ఆపై పోలీసు కేసు.. ఇది కాదన్నట్లు అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరి, కొన్నిరోజులకు డిశ్చార్జ్ కావడం.. ఇలా ఒకటేమిటి ఇండస్ట్రీ మొత్తం ఈ వివాదం గురించే చర్చించుకున్నారు. ప్రస్తుతానికి ఇది కాస్త సద్దుమణిగినట్లే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?)జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు ఓవైపు నడుస్తోంది. మరోవైపు తన ఫొటోలు, వాయిస్ రికార్డింగ్స్‌ని గూగూల్, సోషల్ మీడియాలో ఉపయోగించద్దని ఢిల్లీ హైకోర్ట్‌లో ఈయన పిటిషన్ వేశారు. దీనికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. మోహన్ బాబు కంటెంట్‌ని గూగుల్ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో మంచు ఫ్యామిలీ వివాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్.. గూగుల్ నుంచి డిలీట్ అవుతాయి.(ఇదీ చదవండి: శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో) -
నా మిత్రుడు చిరంజీవితో నటించడం మరిచిపోలేనిది: మోహన్ బాబు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఇటీవల వరుసగా ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. గతంలో నటించిన తన ఫిల్మోగ్రఫీలోని సినిమాలను రోజు ఒకటి గుర్తు చేసుకుంటున్నారు. వాటిలో సూపర్ హిట్ చిత్రాలతో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఇవాళ పట్న వచ్చిన ప్రతివ్రతలు సినిమా గురించి తన అనుభవాన్ని పోస్ట్ చేశారు.1982లో నటించిన పట్నం వచ్చిన ప్రతివ్రతలు సినిమాకు నా ప్రయాణంలో ప్రత్యేకమైన స్థానం ఉందని మోహన్ బాబు అన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మౌలీ తన పాత్రను అద్బుతంగా తీర్చి దిద్దారని కొనియాడారు. అంతేకాకుండా నా మిత్రుడు చిరంజీవితో అన్నదమ్ములుగా నటించడం నా కెరీర్లోనే మరిచిపోలేని పాత్ర అని గుర్తు చేసుకున్నారు. నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని చిత్రాల్లో పట్నం వచ్చిన ప్రతివ్రతలు కచ్చితంగా ఉంటుందని మోహన్ బాబు ట్విటర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Patnam Vachina Pativrathalu (1982) holds a special place in my journey. Directed by the talented Sri. Moulee, I truly cherished portraying my role, especially sharing the screen with my dear friend, Sri. Chiranjeevi, as brothers. This movie remains one of the most unforgettable… pic.twitter.com/fBU68OVpR9— Mohan Babu M (@themohanbabu) December 20, 2024