సాక్షి, తిరుపతి: హీరో మంచు మనోజ్‌పై తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు బుధవారం ఓ లేఖ విడుదల చేశాడు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మంచు మనోజ్ సంక్రాంతి పండక్కి నారావారి పల్లెలో ఉన్న తన మేనత్త మేడసాని విజయమ్మగారి ఇంటికి వెళ్తానని కబురు చేశాడు. అందుకామె ఒప్పుకోలేదు.
రెండు వందలమందితో లోనికి రావాలని..
అన్న విష్ణు (Manchu Vishnu)తో గొడవపడుతున్నావని, తండ్రి మాట కూడా వినడం లేదు.. కాబట్టి తన ఇంటికి రావొద్దని తెలిపింది. అయినా వినకుండా మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఈ రోజు నారావారి పల్లెకు వచ్చాడు. నారా లోకేష్ గారిని కలవగా ఆయన ఒక నిమిషం మాట్లాడి వెళ్ళిపోయారు. నారా రోహిత్ గారితో కలిసి సినిమా తీస్తున్న కారణంగా ఆయనతో మాట్లాడి వచ్చేశాడు. తిరిగి వస్తున్న క్రమంలో డాక్టర్ మోహన్‌బాబు గారి యూనివర్సిటీ గేటు వద్ద 200 మందితో లోనికి రావాలని ప్రయత్నించాడు.
(చదవండి: మంచు మనోజ్ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్ల దాడి)
గేటు దూకి లోనికి..
కోర్టు ఆదేశాల మేరకు విద్యా సంస్థల ప్రాంగణంలోనికి వెళ్లకూడదని పోలీసులు ఎంతోసేపు చెప్పారు. తర్వాత కొంత ముందుకు వెళ్లి మోహన్‌బాబు విద్యా సంస్థల్లోని డైరీ ఫారంలోని గేటుపై నుంచి దూకి లోపలకు ప్రవేశించాడు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుంది. కాబట్టి ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు, కోర్టుకు అప్పీలు చేస్తున్నాను అని లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నాడు.
చదవండి: పక్కవాడితో నీకెందుకు.. ముందు నువ్వు బాగుండాలి కదా?: అజిత్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment