
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అభిమానులను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని ఫ్యాన్స్‌కు సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్‌పై ఆయన మాట్లాడారు.
అజిత్ మాట్లాడుతూ.. 'ఇతరుల విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. మీరు చేయాల్సిన పనిపై ముందు దృష్టి పెట్టండి. ఇతరుల గురించి ఆలోచిస్తూ మీరు టైన్షన్ తెచ్చుకోకండి. అలాంటి వాటితో మీకేలాంటి ఉపయోగం ఉండదు. ముందు మీ లైఫ్ గురించి ఆలోచించండి. నేను నా అభిమానులకు కూడా ఇదే చెబుతా. సినిమాలు చూడటం వరకు ఓకే.. కానీ జై అజిత్.. జై విజయ్ అంటుంటే జై కొడుతూ ఉంటే నువ్వెప్పుడు బాగుపడతావ్. మీ చూపిస్తున్న ప్రేమకు నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ మీ జీవితం బాగున్న తర్వాతే కదా ఏదైనా. నా ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారని తెలిసినప్పుడే నాకు సంతోషంగా అనిపిస్తుంది' అని అన్నారు.
కాగా.. ఇటీవల దుబాయ్ కారు రేసింగ్‌లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అజిత్ కారు రేసింగ్ గెలవడంపై సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన తర్వాత జాతీయ జెండా పట్టుకుని అజిత్ సంతోషం వ్యక్తం చేశారు.
విదాముయార్చి వాయిదా..
కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌లో నిర్మించారు.
మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..
అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్‌గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment