Ajith Kumar
-
ఈ స్టార్ హీరో ఓ సాహసి.. స్పెయిన్ బార్సిలోనా ఎఫ్ 1 రేసులో అజిత్ కుమార్ (ఫొటోస్)
-
ఏంది స్వామీ ఆ స్పీడు.. అదేం షూటింగ్ కాదు..కాస్తా తగ్గించు!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం విడాముయార్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీ రోల్ పోషిస్తున్నారు.ఇదిలా ఉండగా.. అజిత్‌కు కారు, బైక్ రేసులు అంటే మహా సరదా. కాస్తా షూటింగ్ విరామం దొరికితే చాలు.. బైక్ రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. సినిమాలకు కాస్తా గ్యాప్ రావడంతో తాజాగా తన లగ్జరీ కారుతో రైడ్‌కు వెళ్లారు. ఆడి కారులో ఏకంగా 234 కిమీ స్పీడ్‌తో డ్రైవ్ చేస్తూ కనిపించారు. అయితే సీటు బెల్ట్ కూడా లేకుండా.. ఏమాత్రం భయం లేకుండా అంత స్పీడులో అజిత్ కారును నడపడం విశేషం.అయితే ఇది చూసిన అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి స్టంట్స్ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. రోల్ మోడల్‌గా ఉన్న మిమ్మల్ని చూసి యువత అదే స్పీడులో వెళ్లితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ కారును నడిపింది ఇండియాలోనా లేదా విదేశాల్లోనా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సీటు బెల్ట్ లేకుండా అంత వేగంతో వెళ్తే మనదేశంలో అయితే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా అన్నదే డౌటానుమానం. ఏదేమైనా కారు అంత స్పీడుతో నడపడం మంచిది కాదని చాలామంది నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. New video of #Ajithkumar during the racing🏎️Speed👀🔥pic.twitter.com/Qsyi6BYtgZ— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2024 -
ప్రొ కబడ్డీ లీగ్‌లో 118 మంది
ముంబై: రెండు రోజుల పాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంపాట ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోగా... తొలిరోజు రూ.2 కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడని ఫ్రాంచైజీలు రెండో రోజు మాత్రం పెద్దగా ఎగబడలేదు. శుక్రవారం ‘సి’, ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహించగా ఏ ఒక్కరు రూ. కోటి దాకా వెళ్లలేకపోయారు. రెయిడర్ అజిత్ కుమార్‌కు అత్యధికంగా రూ. 66 లక్షలు దక్కాయి. రెండో రోజు వేలంలో ఇదే పెద్ద మొత్తం కాగా, పుణేరి పల్టన్ ఆ రెయిడర్‌ను దక్కించుకుంది. జై భగవాన్ను రూ. 63 లక్షలకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. వీరిద్దరితో పాటు ‘సి’ కేటగిరీలో మరో ఇద్దరు రూ.అరకోటి మార్క్ దాటారు. ఆల్‌రౌండర్ గుర్దీప్ను రూ. 59 లక్షలకు, డిఫెండర్ దీపక్ రాజేందర్ సింగ్‌ను రూ. 50 లక్షలకు పట్నా పైరేట్స్ పైరేట్స్ కొనుక్కుంది. ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో రెయిడర్ అర్జున్ రాఠికి అత్యధికంగా రూ.41 లక్షలు లభించాయి. బెంగాల్ వారియర్స్ అతన్ని చేజిక్కించుకోగా, ఆ తర్వాత ఇంకెవరూ ఈ జాబితాలో కనీసం రూ.20 లక్షలైనా పొందలేకపోయారు. డిఫెండర్ మొహ్మద్ అమన్‌ను రూ.16.20 లక్షలకు పుణేరి పల్టన్, రెయిడర్ స్టువర్ట్ సింగ్‌ను రూ.14.20 లక్షలకు యు ముంబా జట్లు తీసుకున్నాయి. మొత్తం మీద ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఇద్దరు ప్లేయర్లు సచిన్ (రూ.2.15 కోట్లు; తమిళ్ తలైవాస్), మొహమ్మద్ రెజా (రూ.2.07 కోట్లు; హరియాణా) రెండు కోట్లపైచిలుకు అమ్ముడయ్యారు.ఆరు మందికి రూ.కోటికి పైగా మొత్తం లభించింది. ఇక 12 ఫ్రాంచైజీల్లో ఆటగాళ్ల కోసం అత్యధికంగా హరియాణా స్టీలర్స్ ఫ్రాంచైజీ దాదాపు రూ. ఐదు కోట్లు (రూ.4.99 కోట్లు) ఖర్చు చేసింది. -
స్టైలిష్ యాక్షన్
అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న మూవీ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.ఈ కీలకమైన షెడ్యూల్లో అజిత్‌తోపాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రోజుకి 21 గంటల పాటు షూటింగ్‌లోనే.. బిజీ, బిజీగా తమిళ హీరో అజిత్..
-
ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!
కొందరు కార్లు పిచ్చి, మరికొందరకి బైక్స్ పిచ్చి. కానీ తమిళ స్టార్ హీరో అజిత్‌కి మాత్రం ఇవంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే డబ్బుల్ని దాచుకుంటాడో లేదో తెలీదు గానీ కొత్త కొత్త స్పోర్ట్స్ బైక్స్, కార్స్‌ని ఎప్పటికప్పుడు కొనేస్తుంటాడు. తాజాగా అలానే అత్యంత ఖరీదైన సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారుని సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఈ కారు స్పెషాలిటీ ఏంటి? రేటు ఎంత?(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)అప్పట్లో తెలుగు డబ్బింగ్ సినిమాలతో ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న అజిత్.. ఇప్పుడు పూర్తిగా తమిళంకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 'విడామయూర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు దాదాపు రూ.9 కోట్ల విలువ చేసే ఎరుపు రంగు ఫెర్రరీ ఎస్ఎఫ్ 90 కారుని కొనుగోలు చేశాడు!ఈ ఫెర్రారీ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఇది హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్. దీనితో పాటు అజిత్ కారు కలెక్షన్స్‌లో బీఎండబ్ల్యూ 740ఎల్ఐ, ఫెర్రారీ 458 ఇటాలియా, కవసాకీ నింజా జెడ్ ఎక్స్ 14ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, హోండా ఎకార్డ్ తదితర వెహికల్స్ ఉన్నాయి. వీటితో పాటు పలు స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఆస్పత్రి పాలైన హీరో కమల్ హాసన్ సోదరుడు.. ఏమైందంటే?) View this post on Instagram A post shared by Actor Ajithkumar🔵 (@ajithkumar_offll) -
కెజియఫ్ 3 లో అజిత్.. కోలీవుడ్ షేక్..
-
అజర్బైజాన్ కు బై
అజర్బైజాన్ కు బై బై చెప్పారు అజిత్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా, అర్జున్ , ఆరవ్, రెజీనా, నిఖిల్ ఇతర రోల్స్‌లో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తాజాగా అజర్బైజాన్లో ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ పూర్తయింది. అజిత్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారట మేకర్స్.కాగా దాదాపు పదమూడేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గ్యాంబ్లర్’ (2011) సినిమా తర్వాత అజిత్–అర్జున్ –త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విడాముయర్చి’ కావడం విశేషం. హీరో కుటుంబం విహారయాత్రకు వెళ్తుంది. అక్కడ హీరో భార్య, అతని కుమార్తె అదృశ్యం అవుతారు. వారి ఆచూకీని హీరో ఎలా కనుక్కున్నాడు? ఏ విధంగా రక్షించాడు? అన్నది ‘విడాముయర్చి’ కథ అని కోలీవుడ్ టాక్. -
ఆస్పత్రిలో స్టార్ హీరో భార్య.. అసలేమైంది?
కోలీవుడ్ స్టార్ అజిత్ ప్రస్తుతం విడాముయర్చి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే అజిత్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా అజిత్ భార్య షాలిని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అజిత్ పక్కనే ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. లవ్ యూ ఫరెవర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆమెకు ఏమైందని అజిత్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిందా? లేదా మరేమైనా కారణాలున్నాయా? తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
పట్టు వదలకుండా..!
అజిత్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం ‘విడా ముయర్చి’ (పట్టు వదలకుండా ప్రయత్నించడం). లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి అజిత్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లైకాప్రోడక్షన్స్ హెడ్ జీకేఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో అజిత్‌తో సినిమా ప్రకటించినప్పట్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను చేరుకునేలా మంచి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆగస్ట్‌లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విడుదల ఎప్పుడనేది త్వరలో చెబుతాం’’ అన్నారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్రకథ ఏంటంటే... ఓ భార్యాభర్త విహార యాత్రకు వెళతారు. అకస్మాత్తుగా భార్య కనిపించకుండా పోతుంది. ఆమెను కనుగొనే క్రమంలో కనిపించని శత్రువులతో పట్టు వదలకుండా హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్, అర్జున్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: ఓం ప్రకాశ్. -
పాలిటిక్స్ లోకి విజయ్.. స్పీడ్ పెంచిన అజిత్
-
'దయచేసి అది నమ్మొద్దు'.. ఫ్యాన్స్‌ను కోరిన స్టార్ హీరో భార్య
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాదికి పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది. దీంతో పాటు విడాయమర్చి అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.అయితే అజిత్ నటి షాలినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2000లో అజిత్ కుమార్- షాలిని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా షాలిని పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా బయటపడింది. ఈ విషయాన్ని షాలిని అజిత్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. 'ప్రతి ఒక్కరికీ నా మనవి.. ఇది నా అఫీషియల్ ట్విటర్ అకౌంట్ కాదు.. దయచేసి ఎవరూ కూడా నమ్మి ఫాలో అవ్వొద్దు. ధన్యవాదాలు' అంటూ అభిమానులను కోరింది. షాలిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
గుడ్ బ్యాడ్ సెట్లో...
అజిత్ కుమార్ హీరోగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా షురూ అయింది. ఈ చిత్రానికి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అజిత్ కుమార్‌తో తమ కొత్తప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ ఇటివల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలోప్రారంభమైంది.ఈ కీలక షెడ్యూల్ కోసం ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. అజిత్‌తో పాటు కీలక పాత్రధారులు ఈ షూట్లో పాల్గొంటున్నారు. ‘‘ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ప్రాజెక్ట్లలో ఒకటిగా రూపొందుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అభినందన్ రామానుజం. -
Natarajan Birthday Photos: నటరాజన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. కేక్ తినిపించిన అజిత్ (ఫోటోలు)
-
స్టార్ హీరోతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ చిత్రం.. !
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు తనకంటూ ప్రత్యేక శైలి, స్థానం సంపాదించుకున్నారు. అగ్రస్టార్‌గా కొనసాగుతున్న అజిత్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ విజయాలను సాధించడంతో పాటు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా ఇంతకుముందే అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తుణివు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విడాయమర్చి చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తదుపరి 63వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విశాల్ హీరోగా మార్క్ ఆంటోని వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయం గురించి చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించకపోయినా టైటిల్ చూస్తుంటే అర్థమవుతోంది. నటుడు అజిత్ ఇంతకుముందు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వరలారు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారన్నది గమనార్హం. ఆ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా దాదాపు 18 ఏళ్ల తరువాత అజిత్ మళ్లీ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో మూడు పాత్రల్లో అలరించునున్నారు. ఇది నిజమైతే ఆయన అభిమానులకు ఇక పండగే. -
సంక్రాంతి బరిలో ఏడో సినిమా.. వర్కౌట్ అయ్యే పనేనా?
మొన్నీమధ్యే సంక్రాంతి వెళ్లింది. నాలుగు సినిమాలొస్తే అందులో 'హనుమాన్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, విజేతగా నిలిచింది. అలానే వచ్చే ఏడాది పండక్కి ఇంకా చాలా టైముంది. కానీ ఇంతలోనే బాక్సాఫీస్ బరిలో అర డజనుకు పైగా చిత్రాలు కర్చీఫ్ వేసేస్తున్నాయి. తెలుగు హీరోలని పక్కనబెడితే తాజాగా తమిళ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ సంస్థ పోటీలో పెట్టింది. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మాములుగా ఉండదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీగా ఉంటారు. 2025 పండగ బరిలో చిరంజీవి 'విశ్వంభర' ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. బయటకు చెప్పనప్పటికీ.. ప్రభాస్ 'రాజా సాబ్', బాలకృష్ణ-బాబీ మూవీ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమా, నాగార్జున బంగార్రాజు ఫ్రాంచైజీ మూవీ, శతమానం భవతి సీక్వెల్ చిత్రాలు కూడా పండకే రావాలని గట్టిగా ఫిక్సయ్యాయి. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) ఇప్పుడు వీటికి పోటీగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, తమిళ స్టార్ హీరో అజిత్ కాంబోలో తీయబోయే చిత్రం కూడా సంక్రాంతికే రానుంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టైటిల్ ఫిక్స్ చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. తమిళంలో ఈ సినిమా రిలీజ్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తెలుగులోకి వచ్చేసరికి చిరుతో పోటీపడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత సంఖ్య బట్టి చూస్తే దాదాపు ఏడు సినిమాల వరకు సంక్రాంతి బరిలో ఉన్నాయి. చివరకొచ్చేసరికి వీటిలో ఎన్ని నిలబడతాయ్? ఎన్ని తప్పుకొంటాయనేది చూడాలి? మరోవైపు అజిత్‌కి తెలుగులో ఫ్యాన్ బేస్ తక్కువే. దీంతో మైత్రీ-అజిత్ కాంబో తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుందా అనేది సస్పెన్స్. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?) With Wholesome Humbleness herewith, we Announce the title of AK's Next Movie Called as #GoodBadUgly #AjithKumar @Adhikravi @ThisIsDSP @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl@SureshChandraa @supremesundar#kaloianvodenicharov #Anuvardhan @valentino_suren@Donechannel… pic.twitter.com/EU4qKO5fEO — Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2024 -
ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో.. అసలు కారణం ఇదే!
తమిళ స్టార్ హీరో గతేడాది తునివు(తెగింపు) చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అజిత్ కుమార్ విడాయమర్చి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమా త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఇదిలా ఉండగా అజిత్ సడన్‌గా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గురువారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇంతకీ తమ హీరోకు అసలు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే వచ్చారంటూ సన్నిహితులు వెల్లడించారు. కానీ తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆయన నరాల వాపుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. చెవిని మెదడుకు కలిపే నరంలో వాపు రావడం వల్ల చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని అజిత్ ప్రతినిధి సురేష్ చంద్ర తెలిపారు. అంతే కాకుండా బ్రెయిన్ సిస్ట్‌తో బాధపడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అజిత్ సర్జరీ గురించి వచ్చిన కథనాలు అవాస్తవమని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సురేష్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స పూర్తయిందని.. ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. -
Ajith Kumar: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడీయాలో తెగ వైరలవతున్నాయి. ఇంతకీ తమ స్టార్ హీరోకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విడాయమర్చి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ అభిమానులు నమ్మవద్దని కోరుతున్నారు. త్వరలోనే బయటికి వస్తారని వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న విడాయమర్చి చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్‌కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తోంది. గతంలో అజిత్, త్రిష కలిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జతకట్టారు. AK Sir Visited To Apollo Hospital For Regular Health Check-up... #AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/4Pbht78oqU — Ajith Seenu 2 👑 DARK DEVIL... தல..தாய்..தாரம்.. (@ajith_seenu) March 7, 2024 AK has admitted to Apollo hospital just for a regular checkup 👍#VidaaMuyarchi .. #AjithKumar pic.twitter.com/RPZFZGG1K7 — 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) March 7, 2024 -
కోలీవుడ్ స్టార్ హీరో మూవీ.. నిర్మించనున్న టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ప్రస్తుత 'విడాయమర్చి' చిత్రంతో నటిస్తున్నారు. ఇటీవలే అజర్బైజాన్లో మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. కొద్ది రోజుల క్రితమే అజిత్ ఇండియాకు చేరుకున్నారు. అయితే సీన్స్ కోసం టీమ్ మరోసారి అదే లొకేషన్‌కి వెళ్లినున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం యూఏఈకి చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అజిత్ తన 63వ చిత్రం కోసం మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాత గోపీచంద్ మలినేని సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. -
హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే..
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు హీరో 'అజిత్ కుమార్'. సినిమాల్లో బిజీగా ఉంటూ సమయం దొరికినప్పుడు ఖరీదైన బైకులపై రైడింగ్ చేస్తూ ఉంటాడు. కాగా ఈయన తాజాగా 'వీనస్ మోటార్ సైకిల్ టూర్స్' (Venus Motor Cycle Tours) అనే సంస్థ స్టార్ట్ చేసాడు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బైక్ రేసింగ్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్న అజిత్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ సంస్థ స్థాపించాడు. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా UAE, ఒమన్, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాల్లో కూడా సేవలను అందించనుంది. గతంలో చెప్పిన విధంగానే అజిత్ మోటార్ సైకిల్ టూర్స్ ప్రారంభించాడు. ఈ సంస్థ వివిధ ప్రాంతాల్లో రైడింగ్ చేసేవారికి సహాయం చేస్తుంది. కావున రైడర్లు దీని ద్వారా ప్రపంచంలోనే అందమైన ప్రాంతాల్లో పర్యటించవచ్చు. సంస్థ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు.. బైకులు అద్దెకు తీసుకోవడం, అవసరమైన అంతర్జాతీయ అనుమతులను, కావాల్సిన డాక్యుమెంట్స్ పొందటానికి ఇది సాయం చేస్తుంది. ఈ నెల 23 నుంచి బైక్ టూరింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. బైక్ రైడింగ్ వెళ్లాలనుకునే వారి కోసం ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా ట్వీట్లో షేర్ చేసిన ఫొటోలో వెల్లడించారు. Ajith sir's @VenusMotoTours now launched. Our best wishes and congratulations for the successful venture. | #AK #Ajith #Ajithkumar | #VidaaMuyarchi | pic.twitter.com/BK4vxVK412 — Ajith | Dark Devil (@ajithFC) October 5, 2023 -
ఆ ఇద్దరు కాదు.. స్టార్ హీరో సినిమాలో బాలీవుడ్ భామ..!
సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. దీనికి తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త చిత్రమే ఉదాహరణ. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు అజిత్ ఇటీవల నటించిన తుణివు(తెగింపు) చిత్రం విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఆ తర్వాత చిత్రం గురించి ప్రకటించి కూడా చాలా నెలలు అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విడాముయిర్చి అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఇప్పటికీ ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ లోగా దర్శకుడు విఘ్నేశ్ శివన్ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత దర్శకుడు మగిళ్ తిరుమేణి పేరు తెరపైకి వచ్చింది. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! ) దీంతో ఇక మిగిలింది షూటింగ్ ప్రారంభించడమే అనుకున్నారు. అతే విడాముయిర్చి చిత్రానికి ఇంకా ముహూర్తం కుదరలేదు. అజిత్ బైక్ విదేశీ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో విడాముయిర్చి చిత్రం ఆగిపోయిందనే ప్రచారం పెద్దఎత్తున వైరలైంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ చిత్రం ఆగిపోలేదని.. త్వరలోనే ప్రారంభం అవుతుందని నిర్మాత సుభాస్కరన్ ఇటీవల స్పష్టం చేశారు. హీరోయిన్ ఎవరు? ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మొదట నటి త్రిష నాయకిగా నటించనున్నారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆమె వైదొలిగారనే ప్రచారం జోరందుకుంది. అలాగే మలయాళ నటి మంజు వారియర్ పేరు కూడా వినిపించింది. తాజాగా బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈమె ఇంతకుముందే అజిత్‌తో వలిమై చిత్రంలో నటించారు. చివరికీ హ్యుమా ఖురేషీ పేరన్న ఫైనల్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ‘తగ్గేదేలే’ అంటున్న నవీన్ పోలిశెట్టి, ఇప్పుడు అమెరికాలో కూడా..) -
పుణెలో భారీ షూటింగ్ సెట్.. ఆ స్టార్ హీరో కోసమే!
అజిత్ చిత్రం ఇంతకుముందు నటించిన తుణివు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ తరువాత ఆయన చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం ఆయన అభిమానులను నిరాశపరిచే విషయమే. అజిత్ తాజా చిత్రానికి విడా ముయర్చి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆది నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. (ఇది చదవండి: మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్.. సూర్య రిపీట్ చేస్తాడా?) ముందుగా నయనతార భర్త విఘ్నేష్‌శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆయన రాసిన స్క్రీన్‌ప్లే నచ్చలేదన్న కారణంతో చిత్రం నుంచి తొలగించారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత అజిత్ భూటాన్, నేపాల్ దేశాల్లో బైక్ పర్యన చేసొచ్చారు. కాగా విడా ముయర్చి చిత్రానికి మగిళ్ తిరుమేణిని ఫిక్స్ చేశారు. దీంతో అజిత్ దర్శకుడు మగిళ్ తిరుమేణి కలిసి కథా చర్చలకోసం ఇటీవల లండన్‌లో మకాం పెట్టారు. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెలాఖరులో పూణేలో విడా ముయర్చి చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇందుకోసం అక్కడ భారీ సెట్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఇందులో అజిత్ సరసన త్రిష నటిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా నటుడు అర్జున్‌దాస్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. (ఇది చదవండి: తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) -
త్రిష VS శ్రీలీల ఫుల్ డిమాండ్
-
కొత్త బిజినెస్ ప్రారంభించిన స్టార్ హీరో అజిత్
తాను, తన ప్రపంచం అన్నట్టుగా జీవన విధానాన్ని మలుచుకున్న నటుడు అజిత్. ఈయన నటనతో పాటు ఫొటోగ్రఫీ, బైక్, కార్ రేసింగ్, చిన్న చిన్న డ్రోన్లు రూపొందించడం వంటి విషయాలపై ఆసక్తి కనబరుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బైక్ పయనంతో దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు. తాజాగా భూటాన్, నేపాల్ నగరాల్లో బైక్ విహార యాత్ర ముగించుకుని చైన్నెకి తిరిగొచ్చారు. కాగా అనుహ్యంగా ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తాను చాలాకాలం తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నానన్నారు. జీవితం ఒక అందమైన ప్రయాణమని.. అందులోని మలుపులు, తెరిచిన మార్గాలను అనుభవించండి అని పేర్కొన్నారు. తన స్వదేశీ, విదేశీ బైక్ రైడింగ్ విహార యాత్రను ఇప్పుడు ఒక వృత్తిగా మార్చే ప్రయత్నం చేశానన్నారు. ఏకే మోటో రైడ్ పేరుతో మోటార్ సైకిల్ విహార యాత్ర సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా భారత దేశంలోని ప్రకృతి అందాలను, అంతర్జాతీయ రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్ సంస్థ విహార పయనం నేర్చుకోవడానికి సహకరిస్తుందన్నారు. అలాంటి వారికి తగిన భద్రతతో పాటు సౌకర్యవంతమైన మోటార్ బైక్‌లను సమకూర్చడం జరుగుతుందన్నారు. అదే విధంగా అనుభవం కలిగిన మోటార్ బైక్ రైడర్స్‌ను సమకూర్చడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
కొత్త రంగంలోకి అజిత్
తమిళ సినిమా: తాను, తన ప్రపంచం అన్నట్టుగా జీవన విధానాన్ని మలుచుకున్న నటుడు అజిత్. ఈయన నటనతో పాటు ఫొటోగ్రఫీ, బైక్, కార్ రేసింగ్, చిన్న చిన్న డ్రోన్లు రూపొందించడం వంటి విషయాలపై ఆసక్తి కనబరుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బైక్ పయనంతో దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు. తాజాగా భూటాన్, నేపాల్ నగరాల్లో బైక్ విహార యాత్ర ముగించుకుని చైన్నెకి తిరిగొచ్చారు. కాగా అనుహ్యంగా ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తాను చాలాకాలం తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నానన్నారు. జీవితం ఒక అందమైన ప్రయాణమని.. అందులోని మలుపులు, తెరిచిన మార్గాలను అనుభవించండి అన్ని పేర్కొన్నారు. తన స్వదేశీ, విదేశీ బైక్ రైడింగ్ విహార యాత్రను ఇప్పుడు ఒక వృత్తిగా మార్చే ప్రయత్నం చేశానన్నారు. ఏకే మోటో రైడ్ పేరుతో మోటార్ సైకిల్ విహార యాత్ర సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా భారత దేశంలోని ప్రకృతి అందాలను, అంతర్జాతీయ రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్ సంస్థ విహార పయనం నేర్చుకోవడానికి సహకరిస్తుందన్నారు. అలాంటి వారికి తగిన భద్రతతో పాటు సౌకర్యవంతమైన మోటార్ బైక్‌లను సమకూర్చడం జరుగుతుందన్నారు. అదే విధంగా అనుభవం కలిగిన మోటార్ బైక్ రైడర్స్‌ను సమకూర్చడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అజిత్