ఆస్పత్రిలో స్టార్‌ హీరో భార్య.. అసలేమైంది? | Kollywood Star Ajith Kumar Wife Admits In Hospital Goes Viral | Sakshi
Sakshi News home page

Ajith Kumar Wife: ఆస్పత్రిలో అజిత్ భార్య షాలిని.. పోస్ట్ వైరల్!

Jul 3 2024 4:00 PM | Updated on Jul 3 2024 4:11 PM

Kollywood Star Ajith Kumar Wife Admits In Hospital Goes Viral

కోలీవుడ్ స్టార్‌ ‍అజిత్ ప్రస్తుతం విడాముయర్చి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను లైకా ప్రోడక్షన్స్‌పై మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే అజిత్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమా కోసం  అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా అజిత్ భార్య షాలిని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అజిత్ పక్కనే ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. లవ్‌ యూ ఫరెవర్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అయితే ఆమెకు ఏమైందని అజిత్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిందా? లేదా మరేమైనా కారణాలున్నాయా? తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement