hospital
-
ఆస్పత్రిలోనే పోప్ ఫ్రాన్సిస్
రోమ్: పోప్ ఫ్రాన్సిస్(88) ప్రమాదం నుంచి బయటపడలేదు కానీ, ఆయనకు ప్రాణాపాయం లేదని ఆయనకు చికిత్స చేస్తున్న రోమ్‌లోని గెమెల్లి ఆస్పత్రి వైద్య బృందం తెలిపింది. వచ్చే వారమంతా ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని కూడా వైద్యులు స్పష్టం చేశారు. బ్రాంకైటిస్, న్యుమోనియాతో తీవ్ర అనారోగ్యం బారిన పడిన పోప్ ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో చేరిన విష యం తెల్సిందే. శుక్రవారం మొదటిసారిగా పోప్ ఆరోగ్యంపై వారు స్పష్టత ఇచ్చారు. ‘అప్పుడప్పుడూ ఆయనకు విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆక్సిజన్‌ను అందజేస్తున్నాం. న్యుమోనియా రెండు ఊపిరితిత్తుల్లోనూ ఉంది. దీని నివారణ వైద్య చికిత్సలకు ఆయన సరిగ్గానే స్పందిస్తున్నారు’అని గెమెల్లి ఆస్పత్రి వైద్య బృందం వివరించింది. శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్తోనూ ఆయన ఇబ్బంది పడుతున్నట్లు పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. ఇలా ఉండగా, పోప్ ఫ్రాన్సిస్ దీర్ఘకాలంపాటు ఆస్పత్రిలోనే కొనసాగాల్సి అవసరం వస్తే పరిస్థితి ఏమిటి? ముఖ్యమైన రోజు వారీ విధులను నిర్వహించలేనప్పుడు ఆ బాధ్యతల నుంచి ఆయన తప్పుకుంటారా అన్న చర్చ కార్డినల్స్లో ఇప్పటికే మొదలైందని చెబుతున్నారు. -
ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్ మాజీ భార్య
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ తన వివాహ బంధానికి ముగింపు పలికారు. సైరా భానును పెళ్లాడిన ఆయన గతేడాది తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించిన అభిమానులకు షాకిచ్చాడు. దాదాపు 29 సంవత్సరాల వివాహబంధం తర్వాత డివోర్స్ కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తాము పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయంలో దయచేసి ప్రైవసీ ఇవ్వాలని అభిమానులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత వీరిపై కొన్ని ఊహగానాలు రావడంతో సైరా బాను తన భర్త రెహమాన్ చాలా మంచివాడంటూ ఓ నోట్‌ను కూడా విడుదల చేసింది. ఆ తర్వాత రూమర్స్‌కు చెక్ పడింది.అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే ఆసుపత్రిలో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారని సైరా భాను తరఫున ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటనలో.. 'కొన్ని రోజుల క్రితం సైరా భాను మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కఠినమైన సమయంలో త్వరగా కోలుకోవడంపైనే ఆమె దృష్టి ఉంది. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. మీ అందరి మద్దతు, ప్రేమతో క్షేమంగా తిరిగొస్తా.' అని రాసుకొచ్చారు. ఈ కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చినందుకు లాస్ ఏంజిల్స్‌లోని స్నేహితులు రసుల్ పూకుట్టి, అతని భార్య షాదియా, వందనా షా, మిస్టర్ రెహమాన్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 'అంటూ నోట్ విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vandana Shah (@advocate.vandana) -
వైద్య లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేలా వింత శిశువు జననం..!
బెంగళూరు: వైద్య లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేలా వింత శిశువు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని హురా గ్రామంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించింది. పుట్టిన శిశువును చూసి తల్లిదండ్రులు, వైద్యులు నోరెళ్లబెట్టారు. విచిత్రమైన కళ్లు, పెదవులు, ఒళ్లంతా బొగ్గులా నలుపు రంగుతో కూడి చూపరులకు వింత గొలిపింది. హురా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వ్యాప్తిలోని ఒక గ్రామానికి చెందిన గర్భిణి నెలలు నిండి ప్రసవానికి చేరింది. కాన్పు కాగా శిశువు వింత ఆకారంతో జన్మించడం చూసి అవాక్కయ్యారు. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మైసూరులోని చెలువాంబ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు.ఇది రెండోసారిఈ మహిళకు వింత శిశువు జన్మించడం ఇది రెండవసారి. కొన్నేళ్ల క్రితం ఇదే దంపతులకు ఇలాంటి రూపం కలిగిన శిశువు జన్మించింది. నాలుగైదు రోజుల తర్వాత మరణించింది. ఇప్పుడు పునరావృతమైంది. ఈ పరిణామం వైద్య లోకానికి సవాలు విసిరినట్లయింది. చాలా దగ్గరి బంధువుల మధ్య పెళ్లి జరగడం, లేదా ఆ దంపతులలో విపరీతమైన జన్యు సమస్యలు ఉండడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. -
సూడాన్‌లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 30 మంది మృతి
ఆఫ్రికాలోని సూడాన్‌లో ఘోరం జరిగింది. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 30 మంది మృతి చెందారు. పలువురు గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అత్యవసర సేవలు అందిస్తున్న కేంద్రం ధ్వంసమైంది. 2023 ఏప్రిల్ నుంచి సూడాన్‌పై పట్టు కోసం సైన్యం, పారా మిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు పోరు కొనసాగిస్తున్నాయి. అయితే ఏ గ్రూప్ ఈ చర్యకు పాల్పడిందో తెలియాల్సి ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.సూడాన్‌లో పారామిలిటరీ ఫోర్స్, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు. 2023 ఏప్రిల్ 15వ తేదీ నుంచి మొదలైన ఈ అంతర్యుద్ధంతో వేల సంఖ్యలో మృతి చెందినట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఆ సంక్షోభాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నాలు ఫలించడం లేదు. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోషకాహార లోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీల విడుదలకాగా, పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా గత ఏడాది (2024) నిలిచింది. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు.ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ పేర్కొంది. -
అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ దందా
-
అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ దందాపై ప్రభుత్వం సీరియస్
-
వైద్య శాఖ కాంట్రాక్టుల్లో వింత నిబంధనలతో దోపిడీకి సిద్ధం
-
మీరు డాక్టరా.. లేకుంటే ఇంజినీరా..
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రతిమారాజ్ కొనసాగిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జీజీహెచ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సైతం సమీక్ష సమావేశంలో మండిపడ్డారు. ఈ క్రమంలో గత శుక్రవారం ఫిట్స్‌తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన మహిళను, కుటుంబ సభ్యులను సిబ్బంది పట్టించుకోని తీరు వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రి సిబ్బంది రోగికి స్కానింగ్ చేయకుండా, ప్రైవేట్‌కు వెళ్లమని సూచించారు.చివరికి ఆస్పత్రి నుంచి గెంటి వేయడంతో మహిళా రోగితో పాటు ఆమె భర్త, పిల్లలు సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు ఆస్పత్రి ప్రధాన గేట్ బయట చలిలో గడపడం.. తదితర అంశాలు ఆస్పత్రి నిర్వహణ తీరుపై అందరిలో ఆగ్రహం తెప్పించాయి. ఆస్పత్రిలో ఇలా రోగులు ఇబ్బంది పడుతుండగా.. మరోవైపు సూపరింటెండెంట్ తన చాంబర్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులకు గురవుతున్న తీరు.. సిబ్బంది పట్టింపులేని తనంపై మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో డాక్టర్ ప్రతిమారాజ్‌ను ఇన్చార్జి సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్థూ ఆదేశాలతో డీహెచ్ తొలగించారు. అంతేగాకుండా అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.ఆరోపణలు ఇవే..రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బయట మార్కెట్లో అమ్ముకున్నారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్టీఐ కింద సమాచారం అడిగిన వారు పోలీసు కేసు పెట్టించారు. గత వైద్యారోగ్యశాఖమంత్రి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు లేకుండా రూ. 28 లక్షలతో షెడ్డుతో పాటు, లిఫ్టు మరమ్మతులు, ఇతర పనులకు రూ. కోటికి పైగా వెచ్చించారు. దీంతో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సీరియస్‌గా స్పందించి మీరు డాక్టరా.. లేకుంటే ఇంజినీరా.. అని మండిపడడంతోనే ఇంజినీర్ పనుల్లో జోక్యం ఆగింది.సుమారు నాలుగేళ్ల పాటు డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫోన్‌ను సొంతంగా వినియోగించకుండా సూపరింటెండెంట్ తన పీఏకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా అధికారులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్యులు ఎవరు ఫోన్ చేసినా పీఏనే ఫోన్ ఎత్తి మాట్లాడేవారు, సమాధానాలు చెప్పేవారు. వైద్యుల అటెండెన్సులు వేస్తూ ప్రతి నెల కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి.విచారణకు ఆదేశాలు..జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రతిమారాజ్ కొనసాగిన సమయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేయనున్నారు. సుమారు ఐదేళ్ల పాటు జరిగిన లావాదేవీలు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లలో జరిగిన అవకతవలు, ఆరోగ్య శ్రీ నిధులు రూ.10 కోట్ల దుర్వినియోగం, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కు సంబంధం లేకుండా నాసిరకంగా చేపట్టిన పనులు, మందుల కొనుగోళ్లపై క్షుణ్ణంగా విచారణ చేపట్టనున్నారు. అతి త్వరలోనే విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. -
వైఎస్ జగన్ గూస్ బంప్స్ విజువల్స్
-
ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్
సాక్షి, తాడేపల్లి : నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు (aarogyasri) నిలిచిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపేయాలని హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుండి రావాల్సిన రూ. 3వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.తొలివిడత కనీసం రూ.రెండు వేల కోట్లయినా రిలీజ్ చేయాలంటున్న నెట్ వర్క్ ఆస్పత్రులు (network hospitals) కోరుతున్నాయి. ఇవ్వాల్టి నుండి ఈహెచ్ఎస్ సేవలు, ఓపీని నిలిపేయాలని, 26 నుండి అత్యవసర సేవలను కూడా నిలిపేస్తామని అల్టిమేటం జారీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ మేలు చేకూర్చింది. ఏకంగా 45,10,645 మందికి ఉచిత వైద్యం అందించారు. ఇందుకోసం రూ.13,421 కోట్లు ఖర్చయ్యింది. కానీ నేడు చంద్రబాబు పైసా కూడా విదల్చకపోవటంతో నెట్వర్క్ ఆస్పత్రులు ఉపక్రమించాయి. బకాయిలు చెల్లించాల్సిందేనెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశం అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ సీహెచ్ అవినాష్ మీడియాతో మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు ప్రతీనెలా రూ.300 కోట్లు బిల్లులు అవుతున్నాయి. మాకు రూ.3,000 కోట్ల వరకు బకాయిలున్నాయి. గతేడాది ఆగస్టులో ఈ బకాయిలపై ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తే సెప్టెంబరులో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేం సేవలు అందించలేం. పాత బకాయిలకు అదనంగా ప్రతినెలా వస్తున్న బిల్లులు తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేం ఆస్పత్రులను నిర్వహించలేం. మాకు రావాల్సిన మొత్తంలో రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేస్తే సేవలు కొనసాగిస్తాం. లేనిపక్షంలో సోమవారం నుంచి ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తాం. ఆరోగ్యశ్రీలో ఉచిత ఓపీ సేవలను నిలిపివేస్తాం’.బీమా ప్యాకేజీలపై తీవ్ర అభ్యంతరం..ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ (insurance) విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. బీమా సంస్థలకు ప్యాకేజీ రేట్లతో బిడ్డింగుకు అనుమతించారో వాటిని ముందుగా నెట్వర్క్ ఆస్పత్రులతో చర్చించకపోవడం ఆందోళన కలిగించే ఆంశం. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాం.బీమా సంస్థలకు ఏ రేట్లు చెల్లిస్తారో వెల్లడించాలి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సమయంలో నిరుపేదలకు మాత్రమే వర్తించడంతో సేవాభావంతో వైద్యం చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ధరలు 35 శాతం పెరగాలి. ఇప్పటివరకు పెంచకపోగా కనీసం దీనిపై ప్రభుత్వం చర్చించలేదు. ఈనెల 25లోగా మాకు రావాల్సిన బకాయిల్లో సగం మొత్తం రూ.1,500 కోట్లు చెల్లిస్తే సేవలు పునరుద్ధరిస్తాం. లేదంటే గడువు తర్వాత ఆరోగ్యశ్రీ సేవలూ నిలిపివేస్తాం’ అని స్పష్టం చేశారు. -
సూడాన్ శిశువుకు పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్/ నాంపల్లి: సూడాన్ దేశానికి చెందిన ఓ శిశువుకు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న శిశువుకు సుమారు నెల రోజులపాటు నిలోఫర్‌లో పూర్తి ఉచితంగా వైద్యం అందించారు. సూడాన్ దేశానికి చెందిన దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు ఏడాది క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఓ కార్పొరేట్ హాస్పిటల్లో సయీదా అబ్దుల్ వాహెద్ అనే మహిళ ఐవీఎఫ్ చేయించుకుని నెలరోజుల క్రితం మగ పిల్లాడికి జన్మనిచ్చి0ది. శిశువుకు పుట్టుకతోనే బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్టుగా గుర్తించారు. శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరు రోజులపాటు కార్పొరేట్ ఆసుపత్రి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో సూడాన్ దంపతుల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోవడంతో శిశువును నిలోఫర్‌కు రిఫర్ చేశారు. ఆ శిశువును అడ్మిట్ చేసుకున్న నిలోఫర్ డాక్టర్లు నెల రోజులపాటు పూర్తి ఉచితంగా చికిత్స అందించారు. శిశువు తల్లిదండ్రులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. శిశువు పూర్తిగా కోలుకోవడంతో, మంగళవారం డిశ్చార్జ్ చేశామని చికిత్స చేసిన నిమోనాటాలజిస్ట్ డాక్టర్ స్వప్న తెలిపారు. తన బిడ్డను బతికించిన డాక్టర్లకు ఆ తల్లి (43 ఏళ్లు) కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఇప్పటికే ఐదుసార్లు అబార్షన్ అయిందని, ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం తపించామని ఆమె తెలిపారు. చావుబతుకుల్లో ఉన్న తన బిడ్డకు నిలోఫర్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారన్నారు. విషమ పరిస్థితిలో ఉన్న శిశువుకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ల బృందాన్ని, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అభినందించారు. -
ఏరియా ఆస్పత్రిలో గర్భిణి మృతి
నర్సీపట్నం: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పురిటి నొప్పులతో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. దీనికి వైద్యులు, వైద్య సిబ్బందే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సయ్యద్ మహాగున్నిషా అలియాస్ దేవి(30), నానాజీది ఎస్.రాయవరం మండలంలోని చిన్నగుమ్ములూరు. వీరిద్దరిది మతాంతర వివాహం. వీరికి మూడేళ్ల పాప ఉంది. దేవికి మొదటి కాన్పు సాధారణంగానే జరిగింది. రెండో కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం చేరింది. రాత్రి 8 గంటలకు డాక్టర్ వచ్చి పరీక్షించి వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో వైద్య సిబ్బంది వచ్చి టాబ్లెట్ ఇచ్చారు. విపరీతమైన నొప్పులు రావడంతో ఆపరేషన్ చేయాలని గర్భిణీ ఎంత మొత్తుకున్నా వైద్యులు కానీ, సిబ్బంది కానీ పట్టించుకోలేదని మృతురాలి అత్త లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రిపరేషన్ వార్డులో నైట్ డ్యూటీ సిబ్బంది లేరని, మూడు గంటల సమయంలో లేపి తీసుకొచి్చనా.. ఏం పర్లేదు.. డెలివరీ అయిపోతుందని చెప్పి వెళ్లిపోయారని అత్త, బంధువులు కన్నీళ్లపర్యంతమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కడుపులో బిడ్డతో సహా గర్భిణి మరణించింది. దీంతో భర్త నానాజీ సొమ్మసిల్లి పడిపోయాడు. గర్భిణి మరణానికి వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణ, స్త్రీ వైద్య నిపుణులు లక్ష్మణ్‌రావు బంధువులకు నచ్చజెప్పేందుకు యత్నిoచారు. అయినా ఫలితం లేదు. దీంతో వైద్యులు, బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది.ఎస్ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బందితో ఆస్పత్రికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై ఇన్చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరణ కోరగా వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పారు. -
ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి
జూనియర్ ఎన్టీఆర్ సాయం చేస్తానని మాట తప్పారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బాబు ఆస్పత్రి చికిత్స కోసం ఆర్థికసాయం చేయలేదంటూ మహిళ మాట్లాడిన వీడియో నెట్టింట వైరలైంది. ఆమె చేసిన కామెంట్స్‌తో ఎన్టీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆరోగ్యంపై ఎన్టీఆర్ టీమ్ ఆరా తీసింది.క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్‌ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు ఎన్టీఆర్ టీమ్.. అంతేకాదు అతని చికిత్సకు అయిన ఖర్చును మొత్తం చెల్లించారు. దీంతో తమను ఆదుకున్న ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా కౌశిక్ తల్లి ధన్యవాదాలు తెలిపింది.(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)థాంక్యూ ఎన్టీఆర్ సార్.. కౌశిక్ తల్లిఅయితే తాను ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆమె తెలిపింది. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నా కుమారుడు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడని పేర్కొంది. ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్నామని ఆమె వెల్లడించింది. మా కుటుంబం అంతా ఎన్టీఆర్‌కు అభిమానులు అని.. నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
బిల్ క్లింటన్‌కు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
వాషింగ్టన్:అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు.చికిత్స కోసం ఆయనను వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు.బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్లింటన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. క్రిస్మస్ పండుగకు ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా,అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ రెండు సార్లు (1993-2001) పనిచేశారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టెంట్లు అమర్చారు. తర్వాత కొద్ది రోజులకు ఆయన పూర్తిగా కోలుకున్నారు.ఇటీవల 2021లో మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స తీసుకున్నారు.నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమోక్రట్ల తరఫున ఆయన చురుకుగా ప్రచారం నిర్వహించారు. -
Vinod Kambli: క్షీణించిన ఆరోగ్యం.. ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ!
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలయ్యాడు. తీవ్రమైన అనారోగ్యంతో శనివారం రాత్రి థానెలోని ఓ హాస్పిటల్లో చేరాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వార్తా సంస్థ IANS అందించిన వివరాల ప్రకారం.. క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది.ఈ నేపథ్యంలో ఆయనను శనివారం రాత్రి థానెలో గల ఆకృతి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. కాస్త విషమంగానే ఉందని తెలుస్తోంది. ఈ మేరకు IANS ఎక్స్ ఖాతాలో వివరాలను పోస్ట్ చేసింది.కాగా ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్కు చిన్ననాటి స్నేహితుడు. ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద ఓనమాలు నేర్చుకున్న వీళ్లిద్దరు అద్భుతమైన నైపుణ్యాలు కలవాళ్లే. చెడు వ్యసనాల వల్లే?అయితే, సచిన్ ఆటలో శిఖర స్థాయికి చేరుకోగా.. కాంబ్లీ మాత్రం పాతాళానికి పడిపోయాడు. వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం, చెడు అలవాట్ల వల్లనే అతడికి ఈ పరిస్థితి ఎదురైందని కాంబ్లీ సన్నిహిత వర్గాలు గతంలో వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. గతంలో కాంబ్లీకి గుండెపోటు వచ్చింది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్ టెండుల్కర్తో కలిసి ముంబైలో వేదిక పంచుకున్న సమయంలో.. కాంబ్లీ పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపించింది.సాయం తీసుకుంటా.. చెప్పినట్లు వింటాఈ నేపథ్యంలో కపిల్ దేవ్ సారథ్యంలోని 1983 వరల్డ్‌కప్ విజేత జట్టులోని సభ్యులు.. కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, అతడు రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటేనే సహాయం అందిస్తామని షరతు విధించారు. ఇందుకు అంగీకరించిన వినోద్ కాంబ్లీ.. తాను మద్యం, పొగతాగడం మానేశానని.. చికిత్స తీసుకుంటానని స్పష్టం చేశాడు.అయితే, తాజా సమాచారం ప్రకారం వినోద్ కాంబ్లీ మరోసారి తీవ్ర అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. కాగా భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. తన తొమ్మిదేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 రన్స్ చేశాడు. అంతేకాదు.. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. తిలక్ వర్మకు చేదు అనుభవం In pictures: Cricketer Vinod Kambli's condition deteriorated again, leading to his admission at Akriti Hospital in Thane late Saturday night. His condition is now stable but remains critical. pic.twitter.com/7NBektzQ54— IANS (@ians_india) December 23, 2024 -
'అల్లు అర్జున్ రాకపోవడానికి కారణమదే'.. శ్రీతేజ్‌కు అల్లు అరవింద్ పరామర్శ
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులతో చర్చించారు.( ఇది చదవండి: శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది: సీపీ సీవీ ఆనంద్)సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని.. రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించిందని అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని వివరించారు. అందుకే అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని వచ్చా..అల్లు అరవింద్ మాట్లాడుతూ..'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూసేందుకు వచ్చా. ప్రస్తుతం బాలుడు క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుంది. శ్రీతేజ్ కోలుకోడానికి మేం ఎంతైనా సహాయం చేస్తాం. తను సంపూర్ణంగా ఆరోగ్యంతో తిరిగిరావడానికి ప్రభుత్వం సహకరిస్తామనడం అభినందనీయం. చాలా మంది అభిమానులు, బంధువులు, స్నేహితులు అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించలేదని అడుగుతున్నారు. అల్లు అర్జున్ హాస్పిటల్‌కు రాకపోడానికి కారణం ఉంది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఆస్పత్రికి అల్లు అర్జున్ వస్తానని అనుకున్నాడు. కానీ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు వద్దని వారించడంతో రాలేదు. అదే రోజు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఎవరితో మాట్లాడవద్దని మా న్యాయవాది నిరంజన్ రెడ్డి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేం రావడానికి అనేక నిబంధనలు అడ్డొచ్చాయి. బన్నీ బాధపడుతూ నన్ను వెళ్లి చూసి రమ్మన్నారు. అందుకే ప్రభుత్వ అనుమతితో బాలుడు శ్రీతేజ్ పరిస్థితిని అడిగితెలుసుకున్నా' అని తెలిపారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే ఒక రోజు ముందే ఈ మూవీ ప్రీమియర్స్ షోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బన్నీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో సినిమా వీక్షించారు. అదే సమయంలో ఫ్యాన్స్ దూసుకురావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. -
ఆస్పత్రి నుంచి టాలీవుడ్ నటుడు మోహన్ బాబు డిశ్చార్జ్
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఆయన ఇంటి వద్ద గొడవ జరిగిన అనంతరం అస్వస్థతకు గురైన మోహన్ బాబు కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స తీసుకున్న మోహన్ బాబు ఇవాళ ఇంటికి వెళ్లారు. అయితే వారం రోజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం చివరికీ పోలీసుల వద్దకు చేరింది. మంచు మనోజ్, మోహన్‌బాబు మధ్య గొడవకు దారితీసింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు ఓ ఆడియో సందేశాన్ని మీడియాకు రిలీజ్ చేశారు.(ఇది చదవండి: హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!)అంతేకాకుండా ఈ విషయంపై మంచు విష్ణు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇది మా ఫ్యామిలీ గొడవని.. ఎవరి కుటుంబాల్లోనైనా సాధారణంగా ఉండేవని తెలిపారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని వెల్లడించారు. ఈ వివాదంపై రాచకొండ సీపీ ఎదుట మంచు విష్ణు, మనోజ్ హాజరై జరిగిందంతా వివరించారు. తన వైపు ఎలాంటి గొడవ జరగదని సీపీకి మంచు మనోజ్ హామీ ఇచ్చారు. -
తెలంగాణకు మణిహారం.. తెలుగు ప్రజలకు సంజీవని
సాక్షి, సిద్దిపేట: మరణం అంచుకి వెళ్లిన చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి పునర్జన్మనిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా, తెలుగు ప్రజలకు సంజీవనిలా సత్యసాయి ఆస్పత్రి సేవలందిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్, రీసెర్చ్‌లో తొలిసారి గుండె ఆపరేషన్లు జరగ్గా.. శనివారం హరీశ్‌రావు సందర్శించిన అనంతరం మాట్లాడారు. దేశంలో 5వ ఆస్పత్రిని సిద్దిపేటలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం చేయని పనిని సత్యసాయి ట్రస్ట్, మధుసూదన్ సాయి చేస్తున్నారని కొనియాడారు. గుండె ఆపరేషన్ల కోసం రూ.3 నుంచి రూ.5 లక్షలు ఖర్చు పెట్టలేక ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, ఉచితంగా సర్జరీలు చేయడం అభినందనీయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో 5.77 లక్షల మందికి ఓపీ, 33,600 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేశారన్నారు. ఆరు రోజుల్లో 18 మంది చిన్నారులకు సర్జరీలు పూర్తి చేసి వారికి పునర్జన్మ ప్రసాదించడం గొప్ప విషయం అని కొనియాడారు. మధుసూదన్ సాయి కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమానికి వచి్చనప్పుడు ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని 2022లో కోరానని, దీంతో స్పందించి 2023లో ఓపీ ప్రారంభించారని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే పదవుల్లో అనుభూతి కంటే గుండె ఆపరేషన్ అయిన తర్వాత పిల్లల్లో సంతోషం చూసి తన జన్మ ధన్యమైందన్నారు.శ్రీసత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మొదట కొండపాకలో యంగ్ అడోల్సెంట్ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా.. హరీశ్‌రావు చొరవతో ఇక్కడ గుండె శస్త్రచికిత్సల ఆస్పత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కఫొటోతో బాడీ ప్రొఫైల్ వచ్చే విధంగా హెచ్డీ స్టెత్‌తో గుండె పనితీరు తెలుసుకునే అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఆరు నెలల కిందట తెలిసింది నా బిడ్డ పేరు రక్ష. వయసు పదేళ్లు. ఆర్నెల్ల కిందట నిలోఫర్‌లో డాక్టర్లు పరిశీలించి గుండెలో హోల్ ఉందని చెప్పారు. బయట ఆస్పత్రుల్లో రూ.5 లక్షలు అవుతాయన్నారు. అయితే సిద్దిపేటలో ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేస్తారని నిలోఫర్ డాక్టర్లు చెప్పారు. దీంతో అక్కడ ఆపరేషన్ చేయించాం. ఈ డాక్టర్లకు, ట్రస్ట్‌కు మేము రుణపడి ఉంటాం. నా బిడ్డ కూడా డాక్టర్ అయి ఇలా ఉచితంగా సేవలందిస్తుంది. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేంమాది మెదక్ జిల్లా చిన్నశంకరంపే ట. మెకానిక్ గా పని చేస్తా. నా బిడ్డ వయసు ఆరేళ్లు. దగ్గు, జలుబు, వాంతులు అయ్యా యి. అప్పుడు వెంటనే లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. వారు చూసి గుండె స్పీడ్ గా కొ ట్టుకుంటోంది అని చెప్పారు. దీంతో నిమ్స్, నిలోఫర్ ఆ స్పత్రులు తిరిగాం. ఇక్కడ ఫ్రీగా చేస్తారని తెలిసింది వెంటనే వచ్చాం. నా బిడ్డకు పునర్జన్మనిచి్చన డాక్టర్లు, ట్రస్ట్ వారికి ఏమిచి్చనా రుణం తీర్చుకోలేం. -
నన్నే కాదంటావా.. ఆసుపత్రిలో నర్సుపైకి దూసుకెళ్లి..
బెంగళూరు: ఇటీవలి కాలంలో తమ ప్రేమను నిరాకరించారన్న కారణంగా యువతులపై దాడి ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో ఓ నర్సు.. పెళ్లికి నిరాకరించిదనే కారణంగా ఆమెపై దాడి చేశాడు యువకుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బెళగావిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. ప్రసాద్ జాదవ్ అనే వ్యక్తి అక్టోబర్ 30వ తేదీన బెళగావిలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. తాను తీసుకెళ్లిన బ్యాగులో నుంచి ఓ రాడును తీసి అక్కడే ఉన్న నర్సుపై దాడి చేయబోయాడు. ఈ క్రమంలో దాడిని గమనించిన బాధితురాలు.. అతడిని ఎంతో ధైర్యంగా అడ్డుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి లోపల ఉన్న మిగతా సిబ్బంది కూడా అతడిని అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రసాద్ జాదవ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.అయితే, ప్రసాద్ జాదవ్ కొద్దిరోజులుగా సదరు నర్సును వేధింపులకు గురిచేశాడు. ఆసుపత్రికి దగ్గరలోనే ప్రసాద్ నివాసం ఉండటంతో తరచూ నర్సును ఫాలో చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడని బాధితురాలు తెలిపింది. ఇక, ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితులు.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు ప్రసాద్ జాదవ్ ను హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న ప్రసాద్.. నర్సుపై దాడి చేశాడు. One-sided love, attack on nurseAttacked with sickle for refusing to marry.The incident came to light from CCTV footage.The incident of a young man attacking a nurse with a sickle in Belgaum city of Karnataka has created a stir.#karnataka #love #hindi #belgaum #gulynews pic.twitter.com/H4OLr0mVl0— Guly News (@gulynews) November 28, 2024 -
ఆస్పత్రుల్లో ప్రైవేటు సైన్యం!
సాక్షి, సిటీబ్యూరో: వాళ్లు సెక్యూరిటీ గార్డులు..గేటు దగ్గరి నుంచి డాక్టర్‌ను కలిసే దాకా అడుగడుగునా ఉరుముతూ కనిపిస్తుంటారు. తెలిసీతెలియక ఏదైనా అడిగితే చిరాకు పడుతుంటారు. మరోసారి అడిగామంటే అంతే సంగతులు..అక్కడికి వచ్చే పేషెంట్ గజగజలాడాల్సిందే. ఈ పరిస్థితి ఏదో ప్రైవేటు ఆస్పత్రుల్లోనిది కాదు.. మన భాగ్యనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల వ్యవహార శైలి. నిజం..నగరంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సెక్యూరిటీ రాజ్యం నడుస్తోంది. ఒక రకంగా ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తున్నట్టే ఉంది వ్యవహారం. దూరభారాల నుంచి వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం..గట్టిగా మాట్లాడితే దుర్భాషలాడటం.. మరీ కాదంటే దౌర్జన్యం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న పరిస్థితుల గురించి పాఠకులకు తెలియజేసేందుకు ఫొటోలు తీసేందుకు వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై ప్రైవేటు సెక్యూరిటీ గార్డు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రుల్లోని ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఆగడాలపై మరోసారి చర్చకు తెరలేచింది. అంత ఉలుకెందుకు? ఆస్పత్రుల్లో తాకిడిని నియంత్రించేందుకు థర్డ్ పార్టీ ద్వారా ప్రైవేటు సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పరచుకుంటుకున్నారు. అయితే వారి వ్యవహార శైలి ఏ ఆస్పత్రిలో చూసినా.. ఎప్పుడైనా వివాదాస్పదమే. చిన్న విషయాలకే రోగులపై విరుచుకుపడటం, దుర్భాషలాడటం సర్వసాధారణం అయింది. ఆస్పత్రులకు వచ్చే వారు అనారోగ్యంతో ఎంతో బాధతో వస్తుంటారు. కనీసం వారితో మర్యాదగా మాట్లాడుదామనే ఆలోచనే ఉండట్లేదని రోగులు వాపోతున్నారు. నేరస్తులను చూసినట్టు చూస్తుంటారని, చేతిలో లాఠీల్లాంటి కర్రలతో బెదిరిస్తుంటారని చెబుతున్నారు. శిక్షణ లేకుండానే విధుల్లోకి..? ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించే ప్రైవేటు సెక్యూరిటీకి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. ప్రజలతో ఎలా మెలగాలి? వారితో ఎలా ప్రవర్తించాలి..? అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..? మానవతా దృక్పథం ఎలా అలవర్చుకోవాలి వంటి అనేక అంశాలపై వారికి అవగాహన కలి్పంచాలి. పైగా వీరిని గమనించే ఇన్చార్జి వారి ప్రవర్తన ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ప్రతిసారి షిఫ్ట్ మారుతున్న సమయంలో రోల్ కాల్‌కు పిలిచి వారికి సూచనలు చేస్తుండాలి. కానీ ఏ ఆస్పత్రిలో కూడా ఇలా జరుగుతున్న దాఖలాలు లేవు. దీంతో సెక్యూరిటీ గార్డులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సమస్యలు దాస్తే ఏం లాభం? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన పరిపాలనా యంత్రాంగం.. మసిపూసి మారేడు కాయ చేయడంపైనే దృష్టిసారిస్తోంది. ఆస్పత్రుల్లోని సమస్యలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా కూడా ఎన్నడూ లేని ఆంక్షలు విధిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి..ఆ సమస్యలు బయటకు రాకుండా మేనేజ్ చేస్తే సరిపోతుందిలే అన్న చందంగా పాలక వర్గం వ్యవహరిస్తోంది. దీంతో రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పోతోంది. మీడియాపై ఆంక్షలు విధించి, సమస్యలను దాచేస్తే సరిపోతుందా.. నిజాలు బయటకు రాకుండా ఎంతకాలం దాస్తారంటూ పలువురు రోగులు ప్రశి్నస్తున్నారు.‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి.. విధుల్లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రిలో పరిస్థితిని ప్రపంచం ముందు పెట్టేందుకు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ఫొటోగ్రాఫర్ జి.బాలస్వామిపై అక్కడి సెక్యూరిటీ గార్డు దాడి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కెమెరా లాక్కుని దుర్భాషలాడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాను విధుల్లో భాగంగా ఇక్కడికి వచ్చానంటూ ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు సూపరింటెండెంట్‌ను నిలదీయగా, సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించామని తెలిపారు. అయితే వ్యవస్థ మొత్తం ఇలాగే ఉండగా, ఒక్కరిపై వేటు వేసి చేతులు దులుపుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని చెబుతున్నారు. ఎన్నడూ లేనంత ఆంక్షలు ఇప్పుడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. -
Jhansi Hospital Fire: ముగ్గురు చిన్నారులను కాపాడి.. సొంత కుమారుడు ఏమయ్యడో తెలియక..
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గల మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవదహనమ్యారు. ముక్కుపచ్చలారని తమ చిన్నారుల మృతిని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. బాధితులలో ఒకరైన మహోబా నివాసి కులదీప్‌కు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. శుక్రవారం రాత్రి మెడికల్ కాలేజీలోని శిశు వార్డులో అగ్నిప్రమాదం నుండి ముగ్గురు పిల్లలను రక్షించిన కులదీప్ తమ శిశువును రక్షించుకోలేకపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించగా, 16 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు.10 రోజుల క్రితమే కులదీప్‌కు కుమారుడు జన్మించాడు. సాధారణ పరీక్షల కోసం ఆ శిశువును ఆసుపత్రిలో ఉంచారు. ప్రమాదం జరిగిన సమయంలో కులదీప్‌తో పాటు అతని భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్నారు. ఇంతలో వారి కుమారుడు ఉంటున్న వార్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కులదీప్ వార్డులోకి వెళ్లి ముగ్గురు చిన్నారులను రక్షించాడు. ఈ నేపధ్యంలో అతని చేతికి కాలిన గాయమయ్యింది.తరువాత కులదీప్ తన కుమారుడిని బయటకు తీసుకురావాలనుకున్నాడు. అయితే వార్డులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. తన కుమారుడు వార్డులో ఎలా ఉన్నాడో తెలియక తల్లడిల్లిపోయాడు. అక్కడి పరిస్థితులను చూసి కులదీప్ భార్య కన్నీటి పర్యంతమయ్యింది. తమ కుమారుడెక్కడున్నాడో తెలియక కులదీప్ దంపతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఇది కూడా చదవండి: Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’ -
ప్రముఖ జ్యువెలర్స్ చొరవ.. ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’
త్రిస్సూర్: భారత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచే దిశగా ప్రముఖ జ్యువెలరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ముందడుగు వేసింది. చైర్మన్ జోస్ ఆలుక్కా 80వ పుట్టినరోజు సందర్భంగా త్రిస్సూర్ జూబ్లీ మిషన్ హాస్పిటల్ భాగస్వామ్యంతో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోటి రూపాయల ఈ సంచార వైద్య కేంద్రాన్ని ప్రముఖ నటి మంజు వారియర్ ప్రారంభించారు.ఇందులో ఈసీజీ, మల్టీ పారా మోనిటర్లు, మినీ ల్యాబ్ ఉన్నాయి. ఒకేసారి ఆరుగురు రోగులకు చికిత్స చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడం, అధునాతన వైద్యాన్ని మారుమూల ప్రజలకు చేర్చడమే ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ ముఖ్య లక్ష్యమని జోస్ ఆలుక్కా తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కాస్, పాల్ జె ఆలుక్కాస్, జాన్ ఆలుక్కాస్, జూబ్లీ మిషన్ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ సింటో కరేపరంబన్, సీఈవో డాక్టర్ బెన్నీ జోసెఫ్ నీలంకవిల్ తదితరులు పాల్గొన్నారు. -
అద్భుతం.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా శిశువులో చలనం
విశాఖ: కేజీహెచ్‌లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణం లేకుండా పుట్టిన శిశువుకు అంత్యక్రియలు జరిపించేందుకు తరలిస్తుండగా ఒక్కసారిగా చలనం వచ్చింది. దీంతో అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.కేజీహెచ్‌లో శుక్రవారం రాత్రి 9 గంటలకి దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రాణం లేకుండా శిశువు జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించిన..శిశువులో ఎలాంటి చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆస్పత్రి రికార్డ్స్‌లో ఎంట్రీ చేశారు. అనంతరం శిశువును తండ్రికి అప్పగించారు.శిశువు మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు నిర్ధారించడంతో అంత్యక్రియలు జరిపించేందుకు తండ్రి బరువెక్కిన హృదయంతో అంబులెన్స్‌లో ఇంటికి బయలు దేరాడు. అప్పుడే ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ ఎక్కిన ఆ తండ్రి ఒడిలో ఉన్నశిశువులో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయి. అప్రమత్తమైన తండ్రి కేజీహెచ్ వైద్యులకు సమాచారం అందించారు. చికిత్స చేసిన వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అప్పటి వరకు విగతజీవిగా ఉన్న పసికందులో చలనం రావడంతో కుటుంబ సభ్యులు పసికందును చేతుల్లోకి తీసుకొని ఆనందంలో మునిగిపోయారు. అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. -
సికింద్రాబాద్‌లో భారీగా మత్తు ఇంజక్షన్లు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్త నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో సోదాలు చేపట్టారు. జీవీ సలూజా ఆసుపత్రిలో భారీగా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్ చేశారు.మౌలాలీలోని నేహా భగవత్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు నార్కోటిక్ డగ్ర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేహా భగవత్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.పెద్దమొత్తంలో సలూజా ఆసుపత్రిలో మత్తుమందును యాజమాన్యం నిల్వచేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా మత్తు మందుని దిగుమతి చేసి ఆసుపత్రి యాజమాన్యం విక్రయిస్తోంది. మహారాష్ట్రకు చెందిన నేహా భగవత్ సాయంతో మత్తు మందులు విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. -
ఇజ్రాయెల్ సైన్యం చెరలో గాజా ఆస్పత్రి సిబ్బంది
కైరో: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిరంతర దాడులకు తెగబడుతోంది. అయితే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర గాజాలోని ఆస్పత్రి సముదాయం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయి. అయితే ఈ ఆస్పత్రిని టార్గెట్ చేసి, దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ సైనికులు ఇక్కడి వైద్య సిబ్బందిని, కొంతమంది రోగులను తమ అదుపులోకి తీసుకున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో అనేక ఇళ్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా తెలిపింది. మరోవైపు గాజా స్ట్రిప్‌లోని బీట్ లాహియా ప్రాంతంలోని ఒక భవనంలో ఉన్న హమాస్ మిలిటెంట్లపై ఆయుధాలను ఉపయోగించి, దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసారం చేసిన ఫుటేజీలో ఇజ్రాయెల్ దళాలు అక్కడి నుంచి ఉపసంహరించుకున్న దృశ్యాలతో పాటు అనేక భవనాలు దెబ్బతిన్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. 70 మంది సభ్యుల ఆస్పత్రి బృందంలో 44 మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే ఆస్పత్రి డైరెక్టర్‌తో సహా 14 మందిని విడుదల చేసినట్లు సైన్యం తెలిపింది. కాగా ఆసుపత్రి నివేదికపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నిరాకరించారు. ఇది కూడా చదవండి: ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి -
ప్రాణం నిలిపి.. ప్రాణాలకు తెగించి
మన్షిదా బాను మంగుళూరులోని కద్రి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. ఈమధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరారు. అక్టోబర్ 23 తెల్లవారు జామున 3.40 కి ఆ స్టేషన్ కి కాల్ వచ్చింది. అక్కడికి దగ్గర్లోని పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో పెద్ద ఆక్సిడెంట్ అయింది. పికప్ వెహికల్, కంటైనర్ ట్రక్కు డీ కొట్టుకున్నాయి. ఇదీ ఆ కాల్. వెంటనే మన్షిదా తన స్కూటీ పై ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె వెళ్ళేటప్పటికి ఆ వాహనాలు తుక్కు తుక్కు అయి ఉన్నాయి. ఒక వ్యక్తి రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. ఆ రెండు వాహనాలలో ఒకదాని క్లీనర్ అతను. మన్షిదా అతడి పరిస్థితిని గమనించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అతడిని అతి కష్టమ్మీద లేపి, తన స్కూటర్ పై నేరుగా ఆ దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి మోసుకెళ్లారు. అతడి ప్రాణాలని నిలబెట్టగలిగారు.ఆమె టైమ్ సైన్స్ ఆమె వేగం, ఆమె ధైర్యం, ఆమెలోని కారుణ్యం, ఆమె యూనిఫామ్.. అన్నీ పంచభూతాల్లా ఒకటై ఆ వ్యక్తి ్రపాణాలను కాపాడాయనే అనుకోవాలి. అదే కనుక.. పోలీస్ కాకుండా ఒక మామూలు వ్యక్తి ఎవరైనా అంతలా గాయపడిన వారిని తీసుకెళితే ప్రైవేటు హాస్పిటల్స్ చేర్చుకుని ఉండేవా?! ‘మేం అడ్మిట్ చేసుకోడానికి లేదు. ఇది పోలీస్ కేస్..‘ అని ఉండేవి.‘వాయు వేగంగా స్పందించి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన కద్రి స్టేషన్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ మన్షిదా బానుకు‘ అభినందనలు అంటూ తెల్లారగానే మంగుళూరు సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ట్వీట్ పెట్టారు. మంగుళూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మన్షిదాకు ప్రశంసలు అందాయి.డ్యూటీ మైండెడ్ మాత్రమే అయి ఉంటే ఘటనా స్థలానికి వెళ్ళగానే ఫార్మాలిటీస్ లో పడి ఉండేవారు మన్షిదా. కానీ ఆమె అలా చేయలేకపోయారు. ఆమెలోని మానవతా హృదయం.. ఉద్యోగ విధి విధానాలను దాటి మరీ స్పందించింది. అందుకు ‘తగిన శిక్ష‘ ఏదైనా ఉందంటే.. అది ప్రమోషనో, ప్రశంసాపత్రమో తప్ప మరొకటి అవుతుందా?! మన్షిదా మాత్రం.. ‘నేను చేసింది ఏముందీ..!‘ అని చిరునవ్వుతో అంటున్నారు.. తనపై కురుస్తున్న అభినందనల జల్లులలో తడిసి ముద్ద అవుతూ.సాహసాన్ని వెన్నెముకగా ధరించే వాళ్లకు అసాధ్యం ఉండదు. హై–రిస్క్ అనేది ఉండదు. ఈ విషయాన్ని మరోసారి అక్షరాలా నిరూపించింది పైలట్ రీనా వర్గీస్. అడవిలో, అత్యంత ప్రతికూల పరిస్థితులలో ప్రాణాపాయంలో ఉన్న జవాన్‌ను ఆస్పత్రికి తరలించింది. రీనా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో... 2009లో సీనియర్ పోలీసు అధికారులను తీసుకు వెళుతున్న హెలికాప్టర్‌ను మావోయిస్ట్‌లు కూల్చివేశారు. తాను చేస్తున్న ఉద్యోగం ఎంత రిస్క్ అనేది అర్థం చేసుకోవడానికి ఆ సంఘటన రీనాకు ఉపయోగపడింది.తాజా విషయానికి వస్తే...మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కమాండోలు, మావోయిస్ట్‌లకు మధ్య ఎనిమిది గంటల పాటు జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో ఒక కమాండో తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్ట్‌ల రాకెట్ దాడులకు అవకాశం ఉన్న ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడిన కమాండోను అక్కడి నుంచి తరలించడం అంటే ్రపాణాలను పణంగా పెట్టడమే. ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని అందుకున్న రీనా వర్గీస్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా హన్స్ హెలికాప్టర్‌తో రంగంలోకి దిగింది. కో–పైలట్‌కు కమాండ్స్ అందజేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో హెలికాప్టర్‌ను వీలైనంత వరకు దించి కిందికి దూకింది.తాడు సహాయంతో గాయపడిన కమాండోను హెలికాప్టర్లోకి తీసుకువచ్చింది. 30 నిమిషాలలో గడ్చిరోలికి అక్కడి నుండి నాగ్‌పూర్ తరలించింది. మూడు బుల్లెట్లు తగిలిన కమాండోకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ చేసిన రీనా వర్గీస్ గతంలో ఎన్నో ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో బాధితులను లక్షద్వీప్ నుంచి కొచ్చికి తరలించే రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొని ప్రశంసలు అందుకుంది. -
డాక్టర్ లేరు.. వైద్య పరికరాలూ లేవంట!
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లాలో ఓ మైనర్ బాలిక కేసులో వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థత వెలుగుచూసింది. కిడ్నాప్‌కు గురైన బాలికకు వైద్య పరీక్షల నిర్వహణలో ఓ ఏరియా ఆస్పత్రి డొల్లతనం బట్టబయలైంది. బాధితురాలిని రాత్రి 11 గంటల ప్రాంతంలో తీసుకొస్తే.. డాక్టర్ 12.30కు తీరిగ్గా వచ్చారు. పైగా.. పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు ఆస్పత్రిలో లేవని.. వాటిని బయట నుంచి తెచ్చుకోమని స్లిప్పై రాసివ్వడంపై వివాదాస్పదమవుతోంది. వివరాలివీ.. నరసరావుపేట పట్టణానికి చెందిన పదహారేళ్ల మైనర్ బాలికను వినుకొండ పట్టణానికి చెందిన వెంకటేష్ ప్రేమ పేరుతో వంచించి గత సోమవారం ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు మంగళవారం కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వినుకొండలో బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను నరసరావుపేటకు తీసుకొచ్చారు. రెండ్రోజులపాటు బాలికను నిందితుడు తన వద్దే నిర్బంధించడంతో పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాత్రి 11గంటలకు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.కానీ, ఆ సమయంలో వైద్యపరీక్షలు చేసేందుకు నైట్‌డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేరు. రాత్రి 12.30 గంటలకు తీరుబడిగా వచ్చిన డాక్టర్ తమ వద్ద మెడికల్ పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, లిక్విడ్స్, గ్లౌజులు అందుబాటులో లేవని చెప్పారు. పరీక్షలు నిర్వహించాలంటే బయట నుంచి వాటిని తెచ్చుకోవాలంటూ బాధితులకు స్లిప్ రాసి ఇచ్చారు.కానీ, అప్పటికే అర్థరాత్రి దాటడంతో మెడికల్ షాపులు మూసేశారు. దీంతో.. బాధితురాలికి సకాలంలో చేయాల్సిన వైద్య పరీక్షలు నిలిచిపోగా.. బుధవారం ఉదయం వైద్య పరికరాలు తీసుకురావడంతో దాదాపు 12 గంటల తర్వాత బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బంధువుల ఆందోళన..ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడంపై బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో సాక్ష్యాలు చెదిరిపోయి కేసు నీరుగారిపోతుందేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పరీక్షలకు అవసరమైన కనీస పరికరాలు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో లేకపోవటంపట్ల వారు మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వైరల్: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని..
భాగల్పూర్: తనను కాటేసిన పాము నోటిని గట్టిగా పట్టుకుని ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. బీహార్‌లోని భాగల్పూర్లో ఈ ఘటన జరిగింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఐదు పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురైన ప్రకాశ్ మండల్.. పాముని మెడలో వేసుకుని ఆస్పత్రికి వైద్యం కోసం రావడంతో అక్కడ వారంతా షాక్ అయ్యారు. భయంతో పరుగులు తీశారు.ఈ సమయంలో పామును చేతిలో పట్టుకుని ఆసుపత్రి అంతా తిరుగుతూ కొంతసేపు నేలపై పడుకున్నాడు. అతని ఎడమ చేతికి పాము కాటు వేయగా, అక్కడ ఉన్న డాక్టర్లు కూడా అతని దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోయారు. పామును పట్టకుని ఉంటే వైద్యం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో అతి కష్టం మీద పామును ఒక సంచిలో వేసి కట్టేసిన తర్వాత ప్రకాశ్ మండల్‌కు చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రిలో జరిగిన ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.बिहार के भागलपुर में एक शख्स को सांप ने काट लिया, जिसके बाद आदमी सांप पकड़कर अपने साथ अस्पताल ले आया. pic.twitter.com/jwoxj1N1sM— Priya singh (@priyarajputlive) October 16, 2024 ఇదీ చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..! -
ఆరు నెలల పాపకు ప్రాణం పోసిన అంకురా హాస్పిటల్ ..
స్త్రీ, శిశు ఆరోగ్యంలో ప్రత్యేక సేవలందించే ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ అంకురా ఫర్ ఉమెన్ & చిల్డ్రన్ ఆస్పత్రి అరుదైన ఘనతను సాధించింది. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల పాపకు ప్రాణం పోసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్తాపూర్‌లోని అంకురా హాస్పిటల్ వైద్య బృందం సదరు శిశువుకి అత్యాధునికి చికిత్స అందించి పెరిటోనియల్ డయాలసిస్ చేయించారు. తద్వారా ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని అందించడమే గాక తల్లిదండ్రులలో కొండంత ఆశను నింపారు.చిన్నారిని అంకురా హాస్పిటల్‌కు తీసుకువచ్చినప్పుడు..వివిధ అనారోగ్యాలతో తీవ్రమైన స్థితిలో ఉంది. వేగంగా శ్వాస తీసుకోవడం, తీవ్రమైన నిర్జలీకరణం, మూడు నుంచి నాలుగు నెలల వరకు బరువు పెరగకపోవడం, పొటాషియం స్థాయిలు తక్కువగా ఉండటం, శరీరంలో ఆమ్లం పెరగడం వంటి సమస్యలతో ఉంది. అత్యవసర పరిస్థితిని గుర్తించిన అత్తాపూర్ అంకురా ఆసుపత్రికి చెందిన పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ఖలీల్ ఖాన్ వెంటనే చిన్నారిని ఐసీయూలో చేర్చి వెంటిలేటర్‌పై ఉంచారు. క్లినికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా, శిశువు మూత్రపిండ గొట్టపు అసిడోసిస్తో బాధపడుతున్నట్లు తేలింది.అత్తాపూర్‌లోని అంకురా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అంకుష్ కొమ్మవార్ మాట్లాడుతూ.. "క్లినికల్ పరీక్ష ఫలితాల ఆధారంగా, రోగి మూత్రపిండ గొట్టపు అసిడోసిస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించాము. శిశువుకు మూత్రం, మూత్రపిండాలు రావడంలో ఇబ్బంది ఉంది. రోగికి పెరిటోనియల్ డయాలసిస్ అనేది సాధారణంగా పని చేయడం లేదు. కాబట్టి ఈ ప్రక్రియ గురించి పిల్లల తల్లిదండ్రులతో చర్చించి, వారి ఆమోదం పొందిన తర్వాత, డాక్టర్ రవిదీప్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ మార్గదర్శకత్వంలో వైద్య బృందం అత్యంత సున్నితమైన, కష్టతరమైన ప్రక్రియను నిర్వహించింది. తల్లిదండ్రుల సహాకారంతో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యుల మార్గదర్శకత్వంలో చికిత్స అందించారు. ఫలితంగా శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. బరువు పెరిగింది. అలాగే ఇంటరాక్టివ్ వయస్సు తగిన విధంగా మైలురాళ్లను చేరుకుంది. చిన్నారిని విజయవంతంగా డిశ్చార్జి చేశారు.ఈ మేరకు హైదరాబాద్‌లోని అంకురా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ.. "అంకురా హాస్పిటల్లో ప్రాణాలను కాపాడటం, రోగుల శ్రేయస్సును నిర్ధారించడం మా లక్ష్యం. శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన వైద్యుల బృందం మా వద్ద ఉంది. అత్తాపూర్‌లోని అంకురా హాస్పిటల్లో ఆ శిశువుకి అందించిన అపూర్వమైన సంరక్షణ ఇందుకు నిదర్శనం. అంకురా హాస్పిటల్లో ఖచ్చితమైన ప్రణాళిక, నైపుణ్యంతో కూడిన బృందం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రోగులకు సేవలందిస్తోందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
కోల్‌కతా: పేషెంట్ కుమారుడిపై దాడి.. భద్రతపై జూడాల ఆందోళన
కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం హాస్పిటల్‌లోని ఓ రోగి కుమారుడిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఇవాళ(ఆదివారం) ఉదయం ఆస్పత్రిలోకి చొరబడి ఒక రోగి బంధువుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్జీ కర్ ఘటనకు వ్యతిరేకంగా, డాక్టర్ల భద్రతా చర్యల గురించి జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.‘‘ఉదయం 8 గంటల సమయంలో 10-15 మంది వ్యక్తులు మోటారుబైక్‌లపై వచ్చి ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలోని ట్రామా కేర్ సెంటర్‌కు చొరబడి, ఈ రోజు డిశ్చార్జ్ కావాల్సిన బంకురాకు చెందిన రోగి కుమారుడు సౌరవ్ మోదక్పై దాడి చేశారు. మోదక్‌కు తీవ్రగాయాలవడంతో అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు’’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.Mob attack on patient's relatives at Trauma Care Centre of SSKM Hospital, Kolkata. Police once again mere spectators! This is the state of security and healthcare safety in a top government medical college like SSKM. Shame! What will the political slaves of TMC say now? Or are… pic.twitter.com/E71IpS34aq— Dr. Abhinaba Pal (@abhinabavlogs) October 13, 2024 జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో.. ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేశామనే సీఎం మమమతా ప్రభుత్వ భరోసాపై ఈ దాడి ఘటన తీవ్ర అనుమానాలకు తావిస్తోందని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. ఆసుపత్రి భద్రతా వ్యవస్థ వైఫల్యానికి ఈ ఘటన స్పష్టమైన ఉదాహరణ అని ఓ జూనియర్ డాక్టర్ అన్నారు. ఎస్ఎస్కేఎం వంటి పెద్ద ఆసుపత్రిలో ఇటువంటి దాడి సంఘటన జరిగితే.. భద్రతను కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం నిబద్ధతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని తెలిపారు.ఇక.. ఈ దాడిలో గాయపడిన వ్యక్తి ట్రామా కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిపై జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముక పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(86) ఇక లేరు. అనారోగ్యం కారణంగా ముంబైలోని బ్రీచ్‌కాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుదవారం రాత్రి ఆయన మరణించారు.1937 డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. గత కొంత కాలంగా రతన్ టాటా అనారోగ్యంతో బాదపడుతున్నారు. రతన్ టాటా మరణించినట్టు టాటా సన్స్ గ్రూప్ ప్రకటించింది. -
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్
హైదరాబాద్: ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నెల రోజుల పాటు 500 మంది మధుమేహ బాధితులకు ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనుంది. మధుమేహ బాధితులకు కాళ్లు తొలగించాల్సిన అవసరం లేకుండా.. ముందుగానే ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే తగిన చికిత్సలతో నయం చేయవచ్చని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.ఆస్పత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఈ వివరాలు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునేవారు 9010100536 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తమ పేర్లు నమోదుచేసుకోవచ్చు. సెప్టెంబరు 22 నుంచి నవంబరు 20వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఇంకా అదనపు పరీక్షలు అవసరమైతే వాటిమీద 50% రాయితీ వర్తిస్తుంది. ఈ పరీక్షలు చేయించుకోవడానికి మధుమేహ బాధితులు ఎవరైనా అర్హులే. అయితే తాజాగా మధుమేహం బయటపడినవారి కంటే నాలుగైదేళ్లుగా దీంతో బాధపడుతున్నవాళ్లకు అయితే వెంటనే బయటపడుతుంది. ఇప్పటికే కాళ్లలో కొంత ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. -
ప్రిస్క్రిప్షన్ అడిగి మరీ .. డాక్టర్ని కాల్చి చంపిన టీనేజర్లు
ఢిల్లీ : గాయమైన తన కాలుకి వైద్యం చేసిన ఓ డాక్టర్‌ను ప్రిస్క్రిప్షన్ అడిగి మరీ ఓ ఇద్దరు టీనేజర్లు కాల్చి చంపారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపుతుంది. ఢిల్లీ పోలీసు వివరాల మేరకు.. ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలో జావేద్ అక్తర్ యునాని వైద్యుడిగా చెలామణీ అవుతున్నారు. నిమా ఆస్పత్రి పేరుతో ప్రాచీన వైద్యాలుగా పేరుగాంచిన యునానీ వైద్య పద్ధతుల ద్వారా పేషెంట్లకు వైద్య సేవలందిస్తున్నారు.జావెద్ అక్తర్ రెండ్రోజుల క్రితం కాలికి గాయమైన ఇద్దరు టీనేజర్లకు ట్రీట్మెంట్ అందించారు. అయితే ఆ ఇద్దరు టీనేజర్లు మరోసారి బుధవారం అర్థరాత్రి 1.30గంటల సమయంలో కాలికి డ్రెస్సింగ్ చేయాలని కోరారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది వారికి డ్రెస్సింగ్ చేశారు. అనంతరం ప్రిస్క్రిప్షన్ కావాలంటూ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్లారు. వెళ్లిన క్షణాల్లోనే క్యాబిన్ నుంచి కాల్పులు శబ్ధం వినపడింది. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ క్యాబిన్‌ను పరిశీలించగా.. డాక్టర్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు.వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల గురించి ఆరా తీశారు. పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. రెండ్రోజుల క్రితం ఆ ఇద్దరు టీనేజర్లు ఆస్పత్రి భయట రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆస్పత్రిలో రజినీకాంత్.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్.. రజినీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని విజయ్ ట్వీట్ చేశారు. రజినీకాంత్ సార్ పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. అియితే అనారోగ్యంతో తలైవా సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చెన్నై అపోలో వైద్యులు చికిత్స అందించారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడ ఉందని తెలిపారు. రెండో రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని బులెటిన్ విడుదల చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే దళపతి విజయ్ ఇటీవలే ది గోట్ చిత్రంతో అభిమానులను అలరించాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. రజినీకాంత్ సైతం ప్రస్తుతం దసరా బరిలో నిలిచారు. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో ఆయన నటించిన వేట్టైయాన్ ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டு குணமடைந்து வரும் சூப்பர் ஸ்டார் திரு. @rajinikanth sir அவர்கள் விரைவில் பூரண உடல்நலத்துடன் வீடு திரும்ப வேண்டும் என்று உளமார இறைவனை வேண்டுகிறேன்.— TVK Vijay (@tvkvijayhq) October 1, 2024 -
HYD: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి,హైదరాబాద్: అనారోగ్య సమస్యతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మంగళవారం(అక్టోబర్1) చేరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి వైద్యపరీక్షలు పూర్తవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో కవిత పలుసార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కవితకు గతంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైలులో గడిపిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత ఇటీవలే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఒకప్పుడు పులి: ఎంపీ అర్వింద్ -
నాటి చావులు గుర్తులేవా కేటీఆర్?
సాక్షి, హైదరాబాద్: ‘‘గత ప్రభుత్వ హయాంలో 2017లో కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో మూడు రోజు ల్లో ఆరుగురు బాలింతలు, అదే ఏడాది ఐదు రోజు ల వ్యవధిలో నిలోఫర్ ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు, 2022లో డీపీఎల్ పద్ధతిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో నలుగురు మహిళలు, 2019లో జూన్, జూలై నెలల్లో డెంగీతో 100 మంది చనిపోవడం.. ఇవన్నీ గుర్తులేవా కేటీఆర్? గత ప్ర భుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపకనే పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది..’’ అని వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేశారు.గత పదేళ్లలో నిర్వీర్యమైన వైద్య రంగాన్ని తాము గాడిలో పెడుతున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాజకీయం కోసం ఆస్పత్రులను వేదికగా వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అనేక దుర్ఘటనలు జరిగాయని.. అవన్నీ బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసినా.. కేటీఆర్‌కు తలకు ఎక్కడం లేదని మంత్రి మండిపడ్డారు. ఖాళీలకు బాధ్యులు ఎవరు? ‘‘తప్పుడు సమాచారంతో ట్వీట్ చేసి, అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్.. తప్పును కవర్ చేసుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరిట డ్రామాలు చేస్తున్నారు. గత పదేళ్ల పాలనా వైఫల్యాలను పది నెలల ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి మరణాలను ప్రభుత్వ వైద్యుల వైఫల్యంగా చిత్రీకరించడం బీఆర్ఎస్ అజ్ఞానానికి నిదర్శనం. అసలు వైద్యారోగ్యశాఖలో ఖాళీలకు బాధ్యులు ఎవరు?’’ అని దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మూడేళ్లలో హడావుడిగా 25 మెడికల్ కళాశాల ఏర్పాటుకు జీవోలు ఇచ్చి చేతులు ఎత్తేశారని.. 3,368 మంది టీచింగ్ స్టాఫ్ అవసరమైతే, కేవలం 1,078 మందిని భర్తీ చేశారని మండిపడ్డారు. స్టాఫ్, సదుపాయాలు లేకుండా మొక్కుబడిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని విమర్శించారు. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులలో అడ్మిని్రస్టేషన్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి దామోదర తెలిపారు. త్వరలోనే 612 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేపట్టబోతున్నామని వెల్లడించారు. కొత్త వైద్య కళాశాలల్లో డీఎంఈ కింద 19,530 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వం భర్తీ చేసింది 1,500 లోపేనని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే అన్ని విభాగాల్లో కలిపి 7,308 పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. మరో 5,660 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలు 2022లో 500 జరిగితే.. 2023లో 542 ఉండగా, 2024లో ఇప్పటివరకు 309 మరణాలు జరిగాయని వెల్లడించారు. నెలవారీ సగటు చూస్తే 2022లో 42 చొప్పున, 2023లో 45 చొప్పున, 2024లో 39 చొప్పున జరిగాయని వివరించారు. -
Bihar: ఆస్పత్రి నుంచి శిశువు అపహరణ
బెగుసరాయ్: బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో శిశువు అపహరణకు గురయ్యింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది. అందులో ఒక వృద్ధ మహిళ శిశును తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహిళ ఒక నవజాత శిశువును ఒక వస్త్రంలో చుట్టి తీసుకువెళ్లడం సీసీటీవీలో రికార్డయ్యింది.వివరాల్లోకి వెళితే బెగుసరాయ్‌లోని లోహియా నగర్‌కు చెందిన నందనీ దేవి డెలివరీ కోసం ఒక ఆస్పత్రిలో చేరింది. శనివారం ఆమె ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆ శిశువు అదృశ్యమయ్యింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సివిల్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ కుమార్ సింగ్ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి -
దీప్‌వీర్ బిడ్డను చూసేందుకు తరలివెళ్లిన అంబానీ
బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులకు ఇటీవల (సెప్టెంబర్ 8)న ఆడబిడ్డ పుట్టింది. ఈ నేపథ్యంలో పలువురుబాలీవుడ్ పెద్దలు, ఇతర సెలబ్రిటీలకు ఈజంటకు అభినందనలు అందించారు. మరికొంతమంది స్వయంగా హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లి రణ్వీర్, దీపిక తొలి సంతానాన్ని ఆశీర్వదించారు. అలాగే దీపికా, రణ్వీర్ దంపతులతో సన్నిహిత సంబంధాలున్న, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భారీ భద్రత మధ్య దక్షిణ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. రణ్వీర్, దీపికకు అభినందనలు తెలిపారు. వారి ముద్దుల తనయను ఆశీర్వదించారు.Mukesh Ambani made a late night visit to H.N. Reliance Hospital to meet Deepika, Ranveer and their baby.#DeepikaPadukone #RanveerSingh pic.twitter.com/4oLdspp7PN— Deepika Padukone Fanpage (@DeepikaAccess) September 10, 2024 కాగా బిలియనీర్ ముఖేష్ అంబానీ బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. అంబానీ ఇంట ఏ పండుగ, ఏ వేడుక జరిగిన బాలీవుడ్ పెద్దలంతా అక్కడ హాజరు కావాల్సిందే. అనంత్, రాధిక ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు, మొన్న అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. అయితే గర్భంతో ఉన్న నేపథ్యంలో దీపికా రాలేకపోయినప్పటికీ, రణ్వీర్ అనంత్ , రాధిక వివాహ వేడుకల్లో ప్రత్యేక డ్యాన్స్‌తో అలరించారు. -
ఆస్పత్రికి వెళ్లిన కల్కి భామ.. త్వరలోనే గుడ్‌న్యూస్!
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ముద్దుగుమ్మ.. ఈ నెలలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలాఖరులోహా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది. తాజాగా తన తల్లి ఉజ్జల పదుకొణెతో కలిసి ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే దీపికా పదుకొణె రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రి వెళ్లనట్లు తెలుస్తోంది. ఇటీవలే తన భర్తతో కలిసి సిద్ధివినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితమే తన భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ పిక్స్ పంచుకున్నారు. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఫోటోలు వైరలయ్యాయి.ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా పదుకొణె సినిమాలకు విరామం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్స్‌లో పాల్గొనదని తెలుస్తోంది. ఇటీవలే ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి కల్కి 2898 ఏడీ సినిమాతో అభిమానులను అలరించింది. కల్కి పార్ట్-2 లోనూ దీపికా కనిపించనుంది. అంతే కాకుండా బాలీవుడ్ మూవీ సింగం ఎగైన్లోనూ నటించనుంది. -
ఆర్జీ కర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి!
బెంగాల్ వైద్యురాలిపై హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో.. ఘటన జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఓ యువకుడు మరణించాడు. అయితే తన కొడుకు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అతడి తల్లి ఆరోపిస్తోంది.వివరాలు.. కోల్‌కతాకు 25 కి. మీ దూరంలో ఉన్నహుగ్లీలోని కొన్నాగర్‌లో 28 ఏళ్ల యువకుడు విక్రమ్ భట్టాచాజీ నివాసముంటున్నాడు. ఇటీవల అతడిని ట్రక్కు ఢీకొట్టడంతో ఆర్జీకర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం బిక్రమ్ మరణించాడు. అయితే ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు అందుబాటులో లేరని, కొడుక్కి చికిత్స అందించడంలో ఆలస్యం చేయడం వల్లే మరణించినట్లు అతని తల్లి ఆరోపించింది.ఆసుపత్రికి వచ్చిన సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. చాలా సమయం వృధా అయింది. ఆ లోపు అతని సర్జరీ పూర్తి కావాల్సి ఉంది. కనీసం అత్యవసర వైద్యుడు కూడా లేడు’ అని ఆమె వాపోయింది. అయితే, ఆర్జి కర్ ఆసుపత్రి అధికారులు మాత్రం మృతుడి కుటుంబ వాదనలను తోసిపుచ్చారు. శుక్రవారం ఉదయం విక్రమ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వెంటనే ట్రామా కేర్‌కు తీసుకెళ్లారని వైద్య సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సప్తర్షి ఛటర్జీ పేర్కొన్నారు. అతని శరీరంపై తలపై పెద్ద గాయం అయ్యిందని, సీటీ స్కాన్ కోసం తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే సీటీ స్కాన్ చేస్తున్నప్పుడు విక్రమ్ ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు తెలిపాడు.కాగా గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై ఆర్జీ కర్ హాస్పిటల్ వైద్యులు నిరంతరం నిరసనలు చేస్తున్న తరుణంలో.. ఈ ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
రూ. 5 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం.. పదేళ్లలో రాని ఒక్క రోగి.. కారణమిదే!
ఎక్కడైనా ఆసుపత్రులను నిర్మించడం పెద్ద సవాలుతో కూడుకొని ఉంటుంది. నిధుల సేకరణ, బిల్డింగ్‌ను కట్టడం, వైద్య పరికరాలు అమర్చడం, వైద్యులను నియమించడం, వసతులు కల్పించడం ఇలా ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉంటాయి. కానీ అదే ఆసుపత్రిని కట్టడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనేక జబ్బులను నయం చేయవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకంటే..బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కోట్లాది రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిని అయితే నిర్మించారు కానీ గత పదేళ్లుగా అక్కడ ఒక్క రోగి కూడా వైద్యం అందలేదు. ఇందుకు ఇంకా ఆ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయకపోవడమే కారణం. అవును నిజమే..చాంద్ పురా ప్రాంతంలో ఆరు ఎకరాల్లో 30 పడకల ఆసుపత్రిని 2015లో రూ.5 కోట్లతో నిర్మించారు. అత్యాధునిక వసతులు కల్పించారు. కానీ ప్రారంభోత్సవం చేయకుండానే వదిలేయడంతో పొలం మధ్యలో శిథిలావస్థకు చేరుకుని దొంగలు, మందుబాబులుగా అడ్డాగా మారింది. అక్కడ ఒక్క రోగికి కూడా వైద్యం అందకపోవడంతో వైద్య పరికరాలు పాడైపోయాయి. ఆసుపత్రిని నిర్మించి పదేళ్లు కావస్తున్నా దీనినివైద్యారోగ్య శాఖ ఆధీనంలోకి తీసుకోలేదని, ఈ సౌకర్యాల గురించి అసలు తమకు తెలియదని అధికారులు చెబుతుండటం గమనార్హం.ఈలోపు దొంగలు ఆసుపత్రి కిటికీలు, డోర్ ఫ్రేమ్‌లు, తలుపులు, గ్రిల్స్, గేట్లు, కప్బోర్డ్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో ఆసుపత్రి ఓ అస్థిపంజరంలా మిగిలిపోయింది. ఆసుపత్రి క్యాంపస్‌లో మూడు భవనాలు ఉండగా.. ఆరోగ్య కార్యకర్తల నివాసం, పరీక్షా కేంద్రం, ప్రధాన భవనాలుగా నిర్మించారు.#Bihar Hospital Abandoned for 10yrs Becomes Haven for Thieves Government hospital in #Muzaffarpur Bihar built in 2015 at cost of ₹5 Crs, has never been inaugurated or opened for patients. The 30-bed hospital, equipped with modern facilities, has been left to deteriorate, with… pic.twitter.com/In9CAFQZW3— Nabila Jamal (@nabilajamal_) September 6, 2024ఆసుపత్రి నానాటికీ క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం నగరవాసులు నగరానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు లక్ష జనాభా నివాసం ఉంటుంది. ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నప్పుడు, దాని గొప్పతనాన్ని చూసి, చుట్టుపక్కల ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇకపై నగరానికి 50 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం లేదని భావించారు. కానీ ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు తెరుచుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు నగరానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయంపై సబ్ డివిజనల్ ఆఫీసర్ షెరియాను ఆరా తీయగా.. ఆసుపత్రి గురించి తనకు తెలియదని, పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. సివిల్ సర్జన్, సర్కిల్ అధికారి వారి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని, విచారణ అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని చెప్పారు. -
ఆస్పత్రిలో బాలీవుడ్ భామ.. అభిమానులు ఇలా కూడా ఉంటారా?
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన చేతి వేలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది. "నా కోసం ప్రార్థించండి" అంటూ నోట్ రాసుకొచ్చింది. అయితే చిన్న గాయానికే ఇంత బిల్డప్ అవసరమా అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.అయితే తాజాగా ఊర్వశి రౌతేలా మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఎర్రటి గులాబీలతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తన డైహార్డ్ ఫ్యాన్స్ లక్ష గులాబీలు పంపించారంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తాను కోలుకోవాలంటూ కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది ముద్దుగుమ్మ. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. డైహార్డ్ అభిమానులను కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయ నటి అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.కాగా.. చివరిసారిగా గుస్పైథియా అనే చిత్రంలో ఊర్వశి రౌతేలా నటించింది. అంతకుముందు తెలుగులో వాల్తేరు వీరయ్య, అఖిల్ మూవీ ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్‌పై దాడి
ఢిల్లీ: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లకు 11 రోజుల పాటు సమ్మె చేసి ఇటీవల విరమించారు. సమ్మె విరమించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓ రెసిడెంట్ డాక్టర్, మెడికల్ డ్రెస్సర్‌పై దాడి జరిగింది. ఈ ఘటన ఢిల్లీలోని కర్కర్దూమాలో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ హాస్పిటల్లో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. బాధిత డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘శనివారం అర్ధరాత్రి 1 గంటలకు తలపై గాయంతో ఓ వ్యక్తి హాస్పిటల్‌కు వచ్చాడు. గాయానికి కుట్లు వేయటం కోసం డ్రెసింగ్ రూంలోకి పేషెంట్‌ను తీసుకువెళ్లాను. నేను గాయానికి కుట్లు వేస్తున్న సమయంలో పేషెంట్ ఒక్కసారిగా నాపై దుర్భాషలాడు. రూంకి బయట ఉన్న.. పేషెంట్ కుమారుడు వెంటనే లోపలికి నా ముఖంపై దాడి చేశాడు. తర్వాత ఇద్దరూ నన్ను దుర్భాషలాడారు’’ అని బాధిత రెసిడెంట్ డాక్టర్ తెలిపారు. పేషెంట్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని డాక్టర్ తెలిపారు. ఢిల్లీలోని వందలాది రెసిడెంట్ డాక్టర్లు ఆగస్టు 23న తమ సమస్యలను పరిష్కరించి, రక్షణ కల్పించాలని సమ్మె చేపట్టారు. అయితే సుప్రీంకోర్టు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అనుసరించి విధుల్లో చేరారు. రెసిడెంట్ డాక్టర్లు.. ఆగస్టు 12న ప్రారంభించిన సమ్మె కారణంగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. -
డైరెక్టర్ వివి వినాయక్‌కు మేజర్ సర్జరీ
ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. కొన్ని నెలలుగా కాలేయానికి సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకున్నారని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. కాలేయానికి సంబంధించి వినాయక్‌కు మేజర్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన ఆయన నుంచి రాలేదు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులందరికీ న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందించే వరకు బాధితుల తరపున పోరాడుతాం. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్సార్సీపీ ధర్నాకు దిగుతుంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, విశాఖపట్నం/తుమ్మపాల/అనకాపల్లి: ఒకవైపు కాలిన గాయాలు.. మరోవైపు సర్కారు నిర్లక్ష్యంతో కుమిలిపోతున్న అచ్యుతాపురం ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులను అండగా నేనున్నానంటూ ఓదార్చారు. తృటిలో ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో తల్లడిల్లుతున్న క్షతగాత్రుల్ని ఊరడించి కన్నీళ్లు తుడిచారు. ఆత్మీయ స్పర్శతో కొత్త ఊపిరి అందించారు. విశాఖ అచ్యుతాపురం సెజ్ ప్రమాదం జరిగి మూడు రోజులు కావస్తున్నా ప్రభుత్వం అందించలేని ప్రేమ పూర్వక భరోసాని వైఎస్ జగన్ అందించారు. ఎవరూ అధైర్యపడొద్దు.. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకుంటారు.. నిబ్బరంగా ఉండాలంటూ ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. చికిత్స అనంతరం అందరూ ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం ప్రతి ఒక్కరికీ అందేలా మేం అండగా నిలిచి పోరాడతామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. ఎవరికి, ఎలాంటి సమస్య ఎదురైనా మా పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారని, వెంటనే వారి దృష్టికి తేవాలని సూచించారు. ఆస్పత్రి అంతా కలియతిరిగి..విశాఖ ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో అనకాపల్లి వచ్చారు. ఉషా ప్రైమ్ హాస్పిటల్‌కు 11 గంటలకు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ చికిత్స పొందుతున్న 19 మంది క్షతగాత్రుల్ని పరామర్శించారు. సుమారు గంటన్నరకుపైగా ఆస్పత్రిలో గడిపారు. మూడు ఫ్లోర్లలో ఐసీయూ, ఇతర వార్డుల్లో కలియతిరిగి చికిత్స పొందుతున్న వారి దగ్గరకు వెళ్లారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా సంభవించింది..? వైద్యం ఎలా అందుతోందని ఆరా తీశారు. ఆస్పత్రిలో ప్రతి ఒక్కరి బాధని తెలుసుకుంటూ.. సమస్యలను వింటూ సావధానంగా ఆలకించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు క్షతగాత్రులను పలకరించారు. ప్రతి ఒక్కరినీ పేరుతో పలుకరిస్తూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని వాకబు చేశారు. క్షతగాత్రులంతా 22 నుంచి 45 ఏళ్లు లోపు వారే ఉన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో పరిహారం వచ్చే వరకూ పోరాడతామని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా కల్పించారు. రెండో ఫ్లోర్లో క్షతగాత్రుడు జె.వర్థన్‌ను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. మీ భరోసాతో గాయాలు మానిపోయినట్లుగా ఉందని వర్థన్ ఆత్మస్థైర్యంతో చెప్పాడు.» అన్నా.. ఎలా ఉంది ఆరోగ్యం ఇప్పుడు.? » ఇప్పుడు ఫర్వాలేదు సర్. కాస్త బాగుంది.» ప్రమాదం ఎలా జరిగిందన్నా..?» ఏమో సర్.. అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. నేను ‘ఏ’ షిఫ్ట్‌లో పని చేస్తున్నా. మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వస్తున్న టైమ్‌లో పెద్ద పేలుడు శబ్ధం వచ్చింది. నేను పడిపోయా. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. కాలిన గాయాలు, దెబ్బలతో నరకం చూశా. ఇప్పుడు కాస్త కోలుకున్నా.» ఏం భయం లేదన్నా.. ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా ఉంటే త్వరగా నయమవుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉంటే.. ఇంత ఘోరం జరిగేది కాదు. మీకు రావాల్సిన పరిహారం వచ్చేలా మేం చూస్తాం. జాగ్రత్తన్నా. అనంతరం పక్కనే చికిత్స పొందుతున్న వెంకటాపురం గ్రామానికి చెందిన జి.రాజారావు దగ్గరకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్ ఆరా తీశారు.» ఇప్పుడెలా ఉందన్నా..? ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు.?» సార్.. మీరు బాగున్నారా సర్. ఇప్పుడు కొంత ఫర్వాలేదు సర్. నిన్నటిమీద కొంచెం మెరుగుపడింది. నేనప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా. బ్లాస్ట్ అయిన వెంటనే భయంతో అక్కడి నుంచి దూకేశా. కాలు విరిగిపోయింది. కదల్లేకపోయా. నా పక్కనే ఉన్న మరో ఇద్దరు మాత్రం ప్రమాదంలో చనిపోయారు (విలపిస్తూ).» వైఎస్ జగన్ ఆయన్ను ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని, మీకు తోడుగా మేం ఉంటామంటూ భరోసా ఇచ్చారు.మరో వార్డులో చికిత్స పొందుతున్న సోమలింగపాలెం ప్రాంతానికి చెందిన కె.రామ్మెహర్బాబుని పరామర్శించిన వైఎస్ జగన్ యోగక్షేమాలు తెలుసుకున్నారు.» అన్నా.. ట్రీట్మెంట్ బాగా జరుగుతోందా? ఇప్పుడెలా ఉందన్నా?» జగనన్నా.. నమస్తే.. దేవుడి దయతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డా. పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. ఏమైందో తెలుసుకునే లోపు గాయాలపాలయ్యా. తల, మెడ, కాలికి దెబ్బలు తగిలాయి. డాక్టర్లు బాగానే చూసుకుంటున్నారు.» మీరేం దిగులు పడకండన్నా. అమ్మా..! రామ్‌మెహర్ బాబుని జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా మేం పోరాడతాం... అంటూ బాధితుడి భార్యకు జగన్ భరోసానిచ్చారు.అక్కడి నుంచి మూడో ఫ్లోర్లో చికిత్స పొందుతున్న యలమంచిలికి చెందిన డి.అప్పారావును వైఎస్ జగన్ పలకరించారు.» అన్నా ఎలా ఉన్నారు? వైద్యం బాగా అందుతోందా?» నమస్తే జగనన్నా.. ఇప్పుడు బాగానే ఉంది. వైద్యం బాగానే అందుతోంది.» ప్రమాదం ఎలా జరిగిందన్నా.? అప్పుడు మీరు ఏం చేస్తున్నారు..?» అన్నా.. కంపెనీలో నేను ‘బీ’ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లా. నేను పైకి వెళ్తున్న సమయంలో ఏ–షిఫ్ట్ వాళ్లంతా కిందకి వస్తున్నారు. ఇంతలో పెద్ద శబ్ధం వచ్చిందన్నా.. అద్దాలు పగిలిపోయాయి. అందరం కిందపడిపోయాం. నా తలకు బలంగా ఓ అద్దం ముక్క తగిలింది. కాసేపటికి కొందరు వచ్చి నన్ను హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. » అయ్యో.. జాగ్రత్తన్నా.. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయమందిందా..?» ఇంకా లేదన్నా.. ఇస్తామని చెప్పారు. నా భార్య సత్యవతి, మా ఇద్దరు పాపలు నా జీతం మీదే ఆధారపడి బతుకుతున్నారు. నేను ఉద్యోగానికి వెళ్లకపోతే ఇల్లు గడవదన్నా.» మరేం ఫర్వాలేదన్నా.. మీరు ధైర్యంగా ఉండండి. మీకు రావాల్సిన పరిహారం వచ్చేలా మేం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం.పక్కనే చికిత్స పొందుతున్న యలమంచిలికి చెందిన ఎ.పరమేశ్ని వైఎస్ జగన్ పరామర్శించారు. » అన్నా.. ఎలా ఉంది ఆరోగ్యం..?» నమస్తే అన్నా.. ఏదో బయటపడ్డాం అన్నా. ప్రమాదం జరిగిన క్షణాల్లో తల, చెవి, చేయి కాలిపోయింది. ఆస్పత్రికి వచ్చి ట్రీట్మెంట్ అందేవరకూ కాలిన గాయాలతో నరకం చూశా. నా కుటుంబం దగ్గరకు చేరుకుంటానా లేదా అనే ఆందోళనే నాలో ఎక్కువైపోయిందన్నా..» బాధ పడొద్దన్నా.. మీరు త్వరగా కోలుకుంటారు. జాగ్రత్త అంటూ ఆత్మీయంగా పరామర్శించారు.దేశ పాత్రుని పాలెం ప్రాంతానికి చెందిన కె.షణ్ముఖరాజుని జగన్ పరామర్శించారు.» అన్నా.. కంటికి గాయమైందా.? ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తున్నారన్నా.?» నమస్తే సర్.. నేను ప్రొడక్షన్లో పనిచేస్తున్నా. ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్నా. ఆ శబ్దానికి తూలిపోయి కిందపడ్డా. కంటిమీద, మొహం మీద బాగా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు బాగానే ఉంది కానీ పైనుంచి పడిపోవడం వల్ల.. ఒళ్లంతా నొప్పిగా ఉందన్నా.. కదల్లేకపోతున్నా.» తగ్గిపోతుందన్నా.. మీరు ధైర్యంగా ఉండండి. ట్రీట్మెంట్కు సహకరిస్తే.. అంతా మంచే జరుగుతుంది. పరిహారం కచ్చితంగా అందేలా నేను చూసుకుంటానంటూ ధైర్యాన్నిచ్చారు.బాధితుడు ప్రభాత్ యాదవ్ వద్దకు వచ్చిన వైఎస్ జగన్ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.» అన్నా.. ఎలా ఉంది ఇప్పుడు..? కంపెనీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు.?» నాది హైదరాబాద్ బ్రాంచ్. నెల రోజుల ట్రైనింగ్ కోసం ఇక్కడికి ఈ నెల 18న వచ్చా. ఆ రోజు నాతోపాటు ఇక్కడే పనిచేస్తున్న మరో ఇద్దరు కలిసి మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్తున్నాం. ఇంతలో భారీ శబ్దం వచ్చింది. తర్వాత ఏమీ కనిపించలేదు. కాసేపటి తర్వాత చూసే సరికి.. ముగ్గురం రక్తాలు కారుతూ వేర్వేరు చోట్ల పడి ఉన్నాం. నా పక్కన ఉన్న వాళ్లిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. » అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నా. మీరు జాగ్రత్తగా ఉండండి... మీకు పరిహారం అందేలా చూస్తామంటూ జగన్ భరోసా ఇచ్చారు.మరో వార్డులో చికిత్స పొందుతున్న ఉమ్మలాడకు చెందిన యామినిని వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు.» తల్లీ ఎలా ఉంది ఇప్పుడు.? ఎంతకాలం నుంచి అక్కడ పనిచేస్తున్నావు?» నమస్తే జగనన్నా.. నేను ఏడాది క్రితం నుంచి ఎసైన్షియాలో కెమిస్ట్రీ ల్యాబ్‌లో పనిచేస్తున్నా. » ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్నావా తల్లీ.?» అవునన్నా.. కంపెనీ డిపో పక్కనే ఉన్న ల్యాబ్‌లో పనిచేస్తున్నా. ఇంతలో పెద్ద బాంబు పేలినట్లుగా శబ్దం వచ్చింది. పై నుంచి కిందకు పడిపోయా. ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను తీసుకెళ్లడం గుర్తుంది. తలకు దెబ్బతగిలింది. తుంటి ఎముక విరిగిపోయింది.» భయపడొద్దు తల్లీ.. ఆరోగ్యం జాగ్రత్త. పాప క్షేమంగా ఇంటికి వస్తుంది. మీరేం కంగారు పడకండమ్మా.. అంటూ యామిని తల్లిదండ్రులకు జగన్ భరోసా ఇచ్చారు. -
మరో ఫార్మా సెజ్ ఫ్యాక్టరీలో ప్రమాదం
-
అందుకే రిషబ్ భయ్యా పెళ్లి చేసుకోవడం లేదు.. ఊర్వశిపై దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అక్కర్లేదు. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఊర్వశి చివరిసారిగా బాలీవుడ్లో గుస్పైతియా చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చిత్రంలో కనిపించనుంది ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా.. తాను ఆస్పత్రిలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన చేతికి అయిన గాయాన్ని చూపిస్తూ తన కోసం ప్రార్థించండి అంటూ పోస్ట్ చేసింది.అయితే ఊర్వశి రౌతేలా పోస్ట్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అంత చిన్న మైనర్ గాయానికి ఆస్పత్రిలో ఎందుకు అడ్మిట్ అయ్యారని నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ వీడియోపై ఒకరు స్పందిస్తూ.. వేలికి చిన్న గాయంతో ఆసుపత్రిలో చేరిన మొదటి భారతీయ మహిళ అని ఫన్నీగా కామెంట్స్ చేశాడు. మరొకరు అంతర్జాతీయ స్థాయిలో గాయపడిన మొదటి భారతీయ మహిళ ఊర్వశి అని రాసుకొచ్చాడు. ఇంత చిన్న గాయానికి ఏకంగా ఆక్సిజన్ తీసుకుంటున్నారా? అసలేంటి నాన్సెన్స్ అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటి ప్రవర్తన కారణంగానే రిషబ్ భాయ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం లేదంటూ ఓ నెటిజన్ రాశారు. అయితే నెటిజన్ల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో బాలీవుడ్ భామ ఆశ్చర్యపోయింది.అంతేకాకుండా తనపట్ల మీడియాలో వస్తున్న వార్తలపై ఊర్వశి రౌతేలా మండిపడింది. త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు చెప్పే బదులు.. తనపై అన్ని హద్దులు దాటి ప్రవర్తించడంతో నిరాశకు గురయ్యానని తెలిపింది. ఇటువంటి విపరీతమైన, అగౌరవపరిచే సంస్కృతి సమాజంలో అత్యాచారం లాంటి దారుణమైన చర్యలకు పునాదిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ వార్త ప్రచురించిన క్లిప్‌ను కూడా షేర్ చేసింది ముద్దుగుమ్మ. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
ఢిల్లీలోని మూడు మాల్స్, ఓ ఆసుపత్రికి బాంబు బెదిరింపు
దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. పాఠశాలలు, షాపింగ్ మాల్స్, ప్రార్థన స్థలాలు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, ప్రముఖుల ఇళ్లే టార్గెట్‌గా వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా దక్షిణ ఢిల్లీలోని మూడు మాల్స్‌కు, ఓ ఆసుపత్రికి సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.చాణక్యపురిలోని చాణక్య మాల్, సాకేత్ ప్రాంతంలోని సెలెక్ట్ సిటీవాక్, వసంత్ కుంజ్‌లోని ఆంబియెన్స్ మాల్ సహా చాణక్యపురిలోని ప్రైమస్ ఆసుపత్రికి ఈ మెయిల్ ద్వారా బాబు బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని గంటల్లో బాంబు పేలుతుందంటూ దుండగులు మెయిల్లో పేర్కొన్నట్లు చెప్పారు.సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఆయా మాల్స్, ఆసుపత్రి వద్దకు చేరుకొని సోదాలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. చివరకు ఆ బెదిరింపు బూటకమని తేలిందికాగా ఈ నెల 17న గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు మాల్ మేనేజ్మెంట్కు మెయిల్ ద్వారా బెదిరించారు. ‘ప్రతి ఒక్కరినీ చంపేందుకు మాల్లో బాంబులు అమర్చాం. మీలో ఎవ్వరూ తప్పించుకోలేరు, అందరూ చస్తారు’ అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన మాల్ అధికారులు వెంటనే పోలీసులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని మాల్‌ను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అప్పుడు కూడా ఎలాంటి బాంబూ దొరకలేదని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ఇక -
15 వేల అడుగుల ఎత్తు నుంచి.. పోర్టబుల్ ఆస్పత్రి పారా–డ్రాప్
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, వైమానిక దళం కలిసి అరుదైన ఘనతను సాధించాయి. పోర్టబుల్ ఆస్పత్రి ‘ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్’ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా లక్షిత ప్రాంతంలో నేలపైకి దింపాయి. అత్యంత ఎత్తులో నుంచి విజయవంతంగా పూర్తి చేసిన ఈ పారా–డ్రాప్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిదని రక్షణ శాఖ తెలిపింది. ఇందులోని క్రిటికల్ ట్రామాకేర్ క్యూబ్‌లను భీష్మ(భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి)ప్రాజెక్టులో భాగంగా దేశీయంగానే రూపొందించినట్లు వెల్లడించింది. మారుమూల, అటవీ కొండ ప్రాంతాల్లో వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో బాధితులకు అత్యంత వేగంగా, సమర్థమైన వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పోర్టబుల్ ఆస్పత్రికి రూపకల్పన జరిగిందని వివరించింది. ఇందులోనున్న వసతులతో 200 మందికి వైద్య సేవలందించొచ్చని తెలిపింది. ఈ క్యూబ్‌ను అధునాతన రవాణా విమానం సీ–130జే సూపర్ హెర్క్యులస్ ద్వారా అనుకున్న చోట అనుకున్న విధంగా నేలపైకి సురక్షితంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఆర్మీ ఇందుకోసం అత్యాధునిక ప్రెసిషన్ డ్రాప్ సాంకేతికతను వినియోగించుకుందని తెలిపింది. -
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్
ఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన పోర్టబుల్ హాస్పిటల్‌ను విజయవంతంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌గా పేర్కొనే ఈ ఆస్పత్రిని 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు పేర్కొంది. భీష్మా (భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి) అనే ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌ని ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సంబంధించిన వీడియోను రక్షణ శాఖ విడుదల చేసింది. ఇక.. ఇది ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ కావటం విశేషం.#IAF & #IndianArmy have jointly carried out a first-of-its-kind precise para-drop operation of Aarogya Maitri Health Cube at a high-altitude area close to 15,000 ft.These critical trauma care cubes have been indigenously developed under Project #BHISHM👉🏻https://t.co/QmA6ZYBPST pic.twitter.com/iEufwVcEG3— Defence Production India (@DefProdnIndia) August 17, 2024విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర సేవలు అందించాలనే ప్రధాని మోదీ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు ప్రారంభించినట్లు తెలిపింది. మారుమూల, పర్వత ప్రాంతాల్లో విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ చర్యలు అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఇక.. పోర్టబుల్ హాస్పిటల్లో మొత్తం 72 క్యూబ్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించి 200 మందికి ఆరోగ్య సేవలందించవచ్చు. భారత వైమానికి దళానికి సంబంధించిన విమానం సీ-130జీని సాయంతో దీనిని నిర్దేశించిన ప్రాంతానికి చేరవేస్తుంది. -
దీదీ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ దుశ్చర్యను ఖండిస్తూ.. ఓవైపు వైద్యులు, విద్యార్ధులు తీవ్ర నిరనసలువ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఘటన జరిగిన ఆర్జీ కర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. తాజాగా దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పోలీసులే తమను తాము రక్షించుకోలేకపోతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు నిర్భయంగా ఎలా విధులు నిర్వర్తించగలగరని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలిపింది.ఒకవేళ రాష్ట్ర పోలీసులు వైద్యులకు రక్షణ కల్పించలేకపోతే అవసరమైతే ఆసుపత్రిని మూసివేసి.. అక్కడి రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తామని హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలోనే పోలీసులను మందలించింది. ‘పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకావం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. కానీ ఇంత గొడవ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతాన్ని మీరు ఎందుకు చుట్టుముట్టలేదు. ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? 7000 మంది ప్రజలు నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అనేది అసాధ్యం కదా? అంటూ మండిపడింది. ఇలాంటి సంఘటనలు వైద్యులు, వైద్య సిబ్బంది నైతికత, విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయిఇంత మంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. హింసకు భయపడకుండా వైద్యులు, ఇతర సిబ్బంది తమ విధులను నిర్వహించే వాతావరణాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి’ అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.అదే విధంగా ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులను వివరంగా సీబీకి తెలియజేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆసుపత్రిపై దుండగుల దాడి ఘటనపై కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. తమ కేసు విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను దాఖలు చేయాలని సీబీఐను కోర్టు కోరింది.అయితే దుండగుల దాడిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన గదిలో సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించిన నేపథ్యంలో క్రైమ్‌సీన్ చెక్కుచెదరకుండా ఉందని నిరూపించే ఫొటోలను చూపించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ‘పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకావం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు..? 7 వేల మంది ఒకేసారి నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అనేది అసాధ్యం. ఇంత మంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. వైద్యులు, మెడికల్ సిబ్బంది తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సందర్భంగా ఆస్పత్రిలో విధ్వంసానికి పాల్పడిన 19 మందిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ప్రకారం బుధవారం అర్థరాత్రి 40 నుంచి 50 మంది వ్యక్తుల గుంపు ఆసుపత్రి ఆవరణలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. -
కోల్‌కతా ఉదంతం: క్రైమ్ సీన్‌ను నాశనం చేశారా? పోలీసులేమన్నారంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. ఈ ఘటనను విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారాలతో దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని కోల్‌కతా పోలీసులు అంటున్నారు.ఆర్జీ కర్ హాస్పిటల్ ముందు నిన్న (బుధవారం) ‘స్వాతంత్రం వచ్చిన అర్థరాత్రి మహిళల స్వాతంత్రం కోసం’ పేరుతో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. గుంపుగా కొంతమంది ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అయితే తాజాగా.. ఈ ఘటనకు పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యాచార జరిగిన స్థలం ఎటువంటి ధ్వంసానికి గురికాలేదని వెల్లడించారు."Crime Scene not disturbed," says Kolkata Police after vandalism at RG Kar Medical CollegeRead @ANI Story | https://t.co/EiRtFIht5H #RGKarMedicalcollege #doctor #murder #rape #KolkataPolice pic.twitter.com/cYUsPKJrcq— ANI Digital (@ani_digital) August 15, 2024 ‘‘నిరసనల ముసుగులో దాదాపు 40-50 మంది గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్థరాత్రి ఆసుపత్రి ఆవరణలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జి చేసినట్లు తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని కోల్‌కతా పోలీసులు వెల్లడించారు.#WATCH | Aftermath of vandalism by mob in Emergency Department of RG Kar Medical College and Hospital in Kolkata last night pic.twitter.com/d7HI8crQ4l— ANI (@ANI) August 15, 2024 ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజీ అధికారం ఘటనను, దాడిచేసిన మరికొందరి కదలికలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆస్పత్రిలో చొరబడి ఇటువంటి దారుణమైన ధ్వంసానికి పాల్పడటంపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఈ) అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడింది. డాక్టర్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువ వైద్య విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దుండగుల గుంపు దాడి చేసిందని ఐఎంఈ పేర్కొంది.జూనియర్ డాక్టర్ హత్య కేసును విచారిస్తున్న సీబీఐ బృందం గురువారం బాధితురాలి నివాసానికి చేరుకుంది. ఆస్పత్రిలో సీజ్ చేసిన ఘటనాస్థలం విధ్వంసంపై తనిఖీ చేయడానికి దర్యాప్తు సంస్థ అర్జీ కర్ ఆసుపత్రిని కూడా సందర్శించనుంది. మరోవైపు.. ఆస్పత్రిలో దుండగుల గుంపు చేసిన విధ్వంసానికి వ్యతిరేకంగా నర్సులు గురువారం ఉదయం నిరసన తెలిపారు. నేరం జరిగిన సెమినార్ గదిలోకి దుండగులు చొరబడాలని ప్రయత్నించారని నర్సుల్లో ఒకరు తెలిపారు.#WATCH | West Bengal | Visuals of the aftermath from RG Kar Medical College and Hospital campus in Kolkata. A scuffle broke out when a mob entered the campus last night and damaged the property. pic.twitter.com/qf0rO5eVm2— ANI (@ANI) August 15, 2024ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ సీఎం మమత ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సాక్ష్యాలను తారుమారు చేయటం కోసం టీఎంసీ గూండాలు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణుల చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.ప్రచారం: బాధితురాలి ఒంట్లో ముగ్గురి వీర్యం ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతుండడం.. దాని ఆధారంగా మీడియా, సోషల్ మీడియా కథనాలుశవపరీక్షలో అలాంటి విషయం తేలేది లేదని కోల్‌కతా పోలీసుల స్పష్టీకరణప్రచారం: కాలర్(మెడ) బోన్, పొత్తి కడుపు కింది భాగంలో ఎముక విరిగిపోయిందన్న ప్రచారంఅలాంటిదేం జరగలేదన్న పోలీసులుప్రచారం: బాధితురాలి తండ్రికి ఓ పోలీస్ అధికారి డబ్బును ఆశ చూపించి.. కేసును చల్లబర్చే ప్రయత్నం చేశారనే ప్రచారంఅంతా ఉత్తదేనన్న కోల్‌కతా పోలీసులుప్రచారం: బాధిత కుటుంబానికి ఫోన్ చేసి.. ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కోల్‌కతా పోలీసులు చెప్పారనే ప్రచారం.. అలాంటిదేం జరగలేదని, అసలు కోల్‌కతా పోలీసుల నుంచి అలాంటి కాల్ రాలేని స్వయంగా బాధిత కుటుంబం ద్వారా వివరణ ఇప్పించిన కోల్‌కతా పోలీసులు -
ముమ్మా..నిన్ను మిస్సవుతున్నా..
సుభాష్‌నగర్: ‘‘ముమ్మా నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నీవు లేకుండా అసలు అయితలే..నేను నీ దగ్గరకే వచ్చేస్తున్నా.. మన మధ్య మనస్పర్థలు సృష్టించారు., నేను చనిపోయాక అందరికీ నిజం తెలుస్తుంది.. అరేయ్ రాజురెడ్డి అన్నింటికీ నీవే కారణం, ఇద్దరం పెళ్లి చేసుకునేందుకు వెళ్లాం. తేజు లేనిదే నేను లేను.. నాది వన్ సైడ్ లవ్ కాదు.. ఒకరంటే ఒకరికి ప్రాణం. ముమ్మా నీ దగ్గరికే వస్తున్నా శ్రీ.. అక్క నీవే మమ్మీని చూసుకో’’.. అంటూ.. ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9న దోమడుగుకు చెందిన తేజస్వి అనే యువతి ఇంటి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తేజస్వి ఆత్మహత్యకు శ్రీహరి వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికిలోనైన శ్రీహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అతడిని సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రీహరి సోమవారం రాత్రి ఆస్పత్రి నుండి తప్పించుకున్నాడు. దీంతో తమ కుమారుడు కనిపించడం లేదని అతడి తల్లిదండ్రులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.బుధవారం బహదూర్‌పల్లిలోని సాయినా సొసైటీలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని శ్రీహరిగా గుర్తించారు. ఘటనా స్థలంలో శ్రీహరి రాసిన సుసైడ్ నోట్ స్వా«దీనం చేసుకున్నారు. అందులో తాను, తేజస్వీ ప్రేమించుకున్నామని, బీజేపీ నాయకుడు రాజురెడ్డి, తేజస్వీ తండ్రి, సోదరుడు తమను విడదీసేందుకు యతి్నంచారని పేర్కొన్నాడు. తేజస్వీ లేనిదే తాను లేనని, తాను కూడా ఆమె దగ్గరకే వెళ్తున్నానని, తమ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అందులో పేర్కొన్నాడు. పోలీసులు శ్రీహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రైనీ డాక్టర్ హత్య.. నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు!
కోల్‌కతా : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసు సంచలనంగా మారింది. ఆర్జీ కార్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. దీంతో నిందితుల్ని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్లు, విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా.. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సంజయ్ రాయ్ తల్లి మాలతీ రాయ్ మాత్రం ‘నా కొడుకు నిర్ధోషి.పోలీసుల ఒత్తిడితోనే చేయని తప్పును చేసినట్లు ఒప్పుకున్నాడని’ అన్నారు.అరెస్ట్ అనంతరం నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు నిందితుడు నివాసం ఉంటున్న ప్రాంతాల్ని, స్థానికులు, బంధువుల్ని ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని, దుష్ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతన్ని విడిచిపెట్టినట్లు తెలిపారు. నాలుగో భార్య గతేడాది క్యాన్సర్‌తో మరణించింది. నిందితుడు తాగిన మత్తులో తరచూ అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడని స్థానికులు చెప్పారు. సూపరింటెండెంట్ తొలగింపు మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్యతో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ని ఆ పదవి నుండి తొలగిస్తూ పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా ఆసుపత్రికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ వశిష్టను తొలగించారు. అతని స్థానంలో ఆసుపత్రి డీన్ బుల్బుల్ ముఖోపాధ్యాయను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. Prof. Dr Sanjay Vashisth now employed as MSVP, RGkar Medical College to act until further order as a Professor in the Department of Physiology, Calcutta National Medical College, Kolkata and Prof. Dr Bulbul Mukhopadhyay, now employed as Professor, of Physiology, at RGkar Medical… pic.twitter.com/Kn9mQs6ojh— ANI (@ANI) August 11, 2024 బాధ్యులైన వారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు, వైద్య విద్యార్థులు కొనసాగుతున్న నిరసనల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది.నాలుగు పేజీల ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఆర్జీ కార్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ నాలుగు పేజీల ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. ఆమె కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలయ్యాయి. ఆమె రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్ అయినట్లు పోస్టు మార్టం నివేదికలో తేలింది. -
ఎక్స్పైరీ సెలైన్ ఎక్కించేశారు!
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు కాలం చెల్లిన మందులతో చికిత్స చేస్తున్నారు. శుక్రవారం ఓ రోగికి కాలం చెల్లిన సెలైన్ పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎస్.కె.అజారుద్దీన్ జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అతడిని అడ్మిట్ చేసుకుని వైద్యుల సూచన మేరకు అతడికి సెలైన్ పెట్టారు. అక్కడే ఉన్న అజారుద్దీన్ సోదరుడు ఆసిఫ్..సెలైన్ సరిగ్గా ఎక్కడం లేదని దానిని పరిశీలించగా ఎక్స్పైరీ డేట్ చూసి షాక్ అయ్యాడు.ఈ ఏడాది మార్చితోనే సెలైన్ కాలపరిమితి ముగిసినట్లు గుర్తించిన వెంటనే అక్కడి వైద్యులు, సిబ్బందిని నిలదీశాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మీడియా ఆస్పత్రి ఆవరణలోని ఓ మెడిసిన్ ట్రాలీలోని మందులను పరిశీలించగా, మూడు వాయిల్స్ కాలం చెల్లినవి కనిపించాయి. అక్కడి నుంచి ఇంజెక్షన్ ఓపీకి వెళ్లి చూడగా అందులో సైతం ఓ వాయిల్ 3 నెలల ముందే గడువు ముగిసినట్లు కనిపించింది.దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ వంశీ మాధవ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. కాగా, ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రాత్రి డీసీహెచ్ సురేశ్, డీఎంహెచ్‌వో రాజేందర్ సందర్శించారు. కాలంచెల్లిన మందులు వాడటంపై కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిని తని ఖీ చేసినట్లు తెలిపారు. అజారుద్దీన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
మరోసారి ఆస్పత్రిలో చేరిన అద్వానీ!
ఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, సీనియర్ బీజేపీ నేత లాల్‌కృష్ణ అద్వానీ మరోసారి అనారోగ్యంతో మంగళవారం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. 96 ఏళ్ల అద్వానీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి డాక్టర్లు పేర్కొన్నట్లు పీటీఐ వార్త సంస్థ వెల్లడించింది.జూలై 3న అద్వానీ ఆనారోగ్యం బారిన పడటంతో అయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఒక రోజు చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. దీనికంటే వారం రోజల ముందు కూడా అద్వానీ వృద్దాప్యంతో కూడిన అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి ఒకరోజు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. -
వెంకోజిపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: వెంకోజిపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం ధాటికి పొగ దట్టంగా అలుముకుంది. ఆసుపత్రి సెల్లార్లో యూపీఎస్ బ్యాటరీలు పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది.దట్టంగా పొగ వ్యాపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. -
జేడీఎస్ అధినేత కుమారస్వామికి అస్వస్థత
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఆదివారం(జులై 28) సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో బీజేపీ, జేడీఎస్ నాయకులు ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతుండగా కుమారస్వామి ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం కారింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
వాల్స్.. వండర్స్.. ప్రతి గోడా ఓ కళాఖండంలా..
ఖైరతాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.. అయితే మనలో చాలా మంది అనారోగ్యంపాలైనప్పడు ఆస్పత్రులకు వెళ్లక తప్పదు..వెళ్లాలి కదా..! ఇప్పుడేమంటారు? అంటారా.. అదేనండి.. ఆస్పత్రులు అనగానే చాలా మంది బెదిరిపోతారు.. ఎందుకంటే ఓ వైపు మందుల వాసన, మరోవైపు ఫినాయిల్కంపు, ఎక్కడ చూసినా గోడలకు రోగాలకు సంబంధించిన పోస్టర్లు, చూట్టూ రోగులు.. అబ్బో నా వల్ల కాదు బాబోయ్ అంటారు. అలాంటి వారు కూడా ఈ ఆస్పత్రికి వెళ్లాలంటే మాత్రం ఎంచక్కా మ్యూజియంకో, ఎగ్జిబిషన్‌కో వెళ్తున్నట్లు రెడీ అయిపోతారు.. అదే నగరంలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.. క్యారికేచర్స్గా డాక్టర్స్ ఫొటోలు.. ఆయా డిపార్ట్మెంట్ల ముందు డాక్టర్ల ఫొటోలను పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల్లాగా కాకుండా లైటర్వేయిన్తో క్యారికేచర్స్గా ప్రత్యేకంగా రూపొందించి ఏర్పాటుచేశారు. ఈ ఫొటోలను చూసి హాస్పిటల్‌కు వచ్చిన వారు ఎంజాయ్ చేయడంతో పాటు ఉత్సాహంగా ఫోన్లో ఫొటోలు భద్రపరుచుకుంటున్నారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్న మనిషికి ఆధునిక వైద్య విధానాలు ఎన్ని వచి్చనప్పటికీ ఆప్యాయంగా... ప్రేమగా పలకరించే వైద్యులు, వారి బాధలు చెప్పుకునేంత సమయం.. ఓర్పు, సహనం కలిగిన వైద్యులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే హాస్పిటల్‌కు వెళ్లామనే ïఫీలింగ్ పేషెంట్లకు కలిగించేందుకు కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తున్నాయి పలు హాస్పటల్స్. ఈ తరహా ప్రయత్నమే చేస్తోంది నగరంలోని బేగంపేట కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్. రొటీన్ వాతావరణానికి భిన్నమైన అనుభూతిని కలి్పంచేలా ఓ మ్యూజియంకు వెళ్లామనే అనుభూతి, పేషెంట్‌ను పేషెంట్‌గా కాకుండా ఒక గెస్ట్‌గా ఆహా్వనించే పద్దతి, ఎక్కడ ఏ సమస్య వచి్చనా వెంటనే హాజరై సలహాలు, సూచనలు చేసే సిబ్బంది ఉంటే ఆ రోగికి సగం జబ్బు నయమైపోయినట్లే అంటున్నారు విశ్లేషకులు. సంస్కృతిని ప్రతిబింబించేలా..హాస్పిటల్లోకి వెళ్లగానే బాబోయ్ హాస్పిటల్‌కు వచ్చామనే ఫీలింగ్ లేకుండా ఉండేవిధంగా లోపలికి అడుగు పెట్టగానే తెలుగు సాంప్రదాయ పద్దతిలో చేతులు జోడించి నమస్కారంతో స్వాగతం పలికే సిబ్బంది మొదలుకొని డాక్టర్ల వరకూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. హాస్పిటల్లో డాక్టర్ ఓపి పరిసరాల్లో ఉండే గోడలపై భారతీయతను ప్రతిబింబించేలా తెలుగు పండగలు, అలనాటి క్రీడలు, అన్ని మతాలనూ ప్రబోధిస్తూ ఫొటోలు, తెలుగు రాష్ట్రాల చీరలు, రామాయణం, మహాభారతం, మనదేశ సంప్రదాయ నృత్యాలు, తల్లిప్రేమను ప్రతిబింబించే ఫొటోలు, మెడిసిన్ హిస్టరీని తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్, ఆయా డిపార్ట్మెంట్ల ప్రాముఖ్యతను తెలిపే ఫొటోలు, మన శరీరం ఆకృతిని నిర్దేశిస్తూ శరీరంలో ఉండే అస్థిపంజరం నమూనాలు, పెయింటింగ్స్ పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటు మనస్సుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తాయని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చే వారు ప్రతి ఫ్లోర్లో మనస్సు నింపుకొని వెళ్లే విధంగా ఉండటం కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ ప్రత్యేకత.సిబ్బంది పద్దతి నచ్చింది..మేము ఉండేది కొండాపూర్, మా చుట్టుపక్కల ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. అయినా గంటన్నర ప్రయాణం చేసి బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌కు వస్తాం. ఇక్కడి వాతావరణం, నర్సులు, ఇతర సిబ్బంది పద్దతి మాకు బాగా నచ్చింది. బాధ్యతతో వ్యవహరించే డాక్టర్లు, హాస్పిటల్లో ప్రతి ఫ్లోర్లో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం మాలో బరోసాను పెంపొందిస్తుంది. – జే.సుమిత్ర, కొండాపూర్, గృహిణిసేవా ధృక్పథంతో...మేమంతా సేవా ధృక్పథంతో పనిచేస్తున్నాం. మా అందరి గురువు డాక్టర్ గురవారెడ్డి. ఆయన అడుగు జాడల్లో రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి బాధలు చెప్పుకునేంత సమయం ఇస్తూ, వారి ఆనందంలో భాగస్వాములవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడి సిబ్బంది ఒక కుటుంబంలా పనిచేయడం ఎంతో సంతోషం. – డాక్టర్ నివేదిత సాయిచంద్ర, న్యూరో ఫిజీషియన్కంఫర్ట్ ఇవ్వగలగాలి..రొటీన్ పద్దతికి స్వస్తిచెప్పి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించేలా మ్యూజియం, హార్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. రానున్న సంవత్సరంలో పేషెంట్‌ను గెస్ట్‌లా భావిస్తున్నాం. ఆస్పత్రిలో మంచి వాతావరణం ఉండటం వల్ల సగం జబ్బు నయమవుతుంది. గోడలను రకరకాల పెయింటింగ్స్, డిజైన్స్, ఫొటోలతో ఏర్పాటు చేశాం. అన్ని బాధలూ మేము తగ్గించకపోవచ్చు, కానీ అందరికీ ఆత్మస్థైర్యాన్ని, కంఫర్ట్‌ని ఇవ్వగలగాలి. ఇంగ్లిష్‌లో ఓక సామెత ఉంది ‘యు మే నాట్ క్యూర్ ఆల్ ది టైం.. బట్ యు కెన్ కంఫర్ట్ ఆల్ ది టైం’ అనేది నేను బలంగా నమ్ముతాను. – డాక్టర్ ఏవీ గురవారెడ్డి, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. -
అర్ధరాత్రి ఆసుపత్రిలో పిల్లాడిని ఎత్తుకెళ్లిన దుండగులు
-
ఆస్పత్రిలో జాన్వీ కపూర్
హీరోయిన్ జాన్వీ కపూర్ అస్వస్థతకు గురయ్యారు. కల్తీ ఆహారం తినడం వల్ల జాన్వీ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారని, రెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అవుతారని జాన్వీ తండ్రి–నిర్మాత బోనీ కపూర్ వెల్లడించినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే ముందుగా జాన్వీ కపూర్ ఆస్పత్రిపాలయ్యారని వార్తలు రావడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. స్వల్ప అస్వస్థత మాత్రమే అని బోనీ కపూర్ పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’, రామ్‌చరణ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్), హిందీలో వరుణ్ ధావన్‌తో ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు జాన్వీ. అలాగే ఈ బ్యూటీ నటించిన హిందీ చిత్రం ‘ఉలజ్’ ఆగస్టులో విడుదలకు రెడీ అవుతోంది. -
ఆస్పత్రిలో చేరిన దేవర హీరోయిన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే జూలై 12న అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన ముద్దుగుమ్మ ఆస్పత్రిలో చేరారు. జాన్వీ కపూర్ ఫుడ్ పాయిజనింగ్‌కు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ సైతం కపూర్ ధృవీకరించారు.జాన్వీ అనారోగ్యానికి గురి కావడంతో ఈ వారంలో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుందని జాన్వీ సన్నిహితులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. జూలై 12న ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో అభిమానులను అలరించింది. ప్రస్తుతం జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన ఉలజ్ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా రామ్ చరణ్‌కు జోడీగా కనిపించనుంది. -
భార్యను కాటేసిన పాము.. ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త ఏం చేశాడంటే
సాధారణంగా పామును చూస్తేనే దానికి దూరం పరుగెత్తుతారు. ఒకవేళ పాము కాటుకు గురైతే భయపడిపోయి ప్రాణభయంతో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి పరుగుతీస్తాం. కానీ బీహార్ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన మహిళను ఆమె భర్త ఆసుపత్రికి తీసుకురాగా ఆమెతోపాటు కాటు వేసిన పామును కూడా తీసుకురావడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు.సబౌర్‌లోని జుర్ఖురియా గ్రామంలో నిషా అనే మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురైంది. సాయం కోసం కేకలు వేయడంతో, భర్త రాహుల్ ఆమె దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. ఈ లోపు పాము పారిపోతుంటే దాని వెంట వెళ్లి ఇంట్లో దేవుడి ఫోటోల వెనక్కి నక్కిన పాము కనిపించింది.వెంటనే కర్రతో దానిని తీసి బకెట్లో వేశాడు. అప్పటికే నిషా స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను తన బైక్‌పై కూర్చోబెట్టి, బకెట్లో పాముతోపాటు బైక్ హ్యాండిల్‌కు వేలాడదీశాడు. భాగల్పూర్ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వైద్యులు మొదట పామును చూసి భయపడిపోయారు.అయితే ఆ పాము తన భార్యను కరిచిందని చెబుతూ.. ఆమెను కాపాడాల్సిందిగా వైద్యులను వేడుకున్నాడు నిషా భర్త.. అనంతరం దానిని దూరంగా ఉంచమని చెప్పి.. మహిళను చికిత్స కోసం అత్యవసర విభాగానికి పంపారు. ఆ పాము విషాన్ని అంచనా వేయడం ద్వారా ఆమెకు వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం నిషా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పామును మళ్లీ అడవిలో విడిచిపెట్టారు. -
శిశు విక్రయ ఘటన.. కలెక్టర్ సీరియస్.. ఆసుపత్రి సీజ్
సాక్షి, కామారెడ్డి జిల్లా: శిశు విక్రయ ఘటనలో సమన్విత ఆసుపత్రిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. వైద్య శాఖ అధికారులు ఆసుప్రతిని సీజ్ చేశారు. అనుమతి లేకున్నా.. ఫెర్టిలిటీ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ, స్త్రీ లింగం పై వివక్ష చట్టం కింద కేసులు నమోదు చేశారు. శిశు విక్రయ కేసులో ఆసుపత్రి ప్రభుత్వ వైద్యుడు సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, పుట్ట బోయేది ఆడో మగో తెలుసుకోవడానికి జనం ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుండగా.. వారి ఆసక్తిని సొమ్ము చేసుకుంటూ వాటి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టేది అడబిడ్డ అని తెలియగానే కడుపులోనే చంపేయాల నుకుంటున్నవారి అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ అబార్షన్లు చేస్తున్నారు. స్కానింగ్, అబార్షన్ల కోసం రెండు మూడు రాష్ట్రాల నుంచి కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రికి వచ్చేవారంటే.. ఆ ఆస్పత్రి ఎంత ఫేమస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆస్పత్రులలో తనిఖీలు చేయకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులూ ఈ పాపంలో భాగమయ్యారు.గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేనపు డు, బిడ్డ వల్ల తల్లికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నపుడు అబార్షన్ చేస్తారు. దీనికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనుమతులు పొందాల్సి ఉంటుంది. సమన్విత ఆస్పత్రికి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని వైద్యారోగ్య శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా సమన్విత ఆస్పత్రిలో వైద్య సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంటీపీకి సంబంధించి చార్జీలు పొందుపరచడాన్ని చూసి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అవాక్కయ్యారు. మూడు నెలలలోపు గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 5 వేలు, మూడు నెలలు దాటిన గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 10 వేలు చార్జీగా అందులో పేర్కొనడం విశేషం. -
‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
కామారెడ్డి క్రైం: పుట్టబోయే బిడ్డను వదిలించుకోవాలనుకున్న ఓ గర్భిణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా డెలివరీ చేయడంతోపాటు నవజాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్‌తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సాన్నిహిత్యం ఉండటంతో ఆ కారణంగా పెళ్లి సమయానికే ఆమె గర్భం దాలి్చంది. పెళ్లయిన నెల రోజులకు భర్తకు ఈ విషయం తెలియడంతో నాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. పుట్టబోయే బిడ్డ తనతో లేకపోతే భర్త మళ్లీ చేరదీస్తాడని భావించిన లావణ్య.. ఏప్రిల్‌లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమని్వత ఆస్పత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్‌కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారు మొత్తం రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కాస్త నగదు, ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు.ఏప్రిల్ 11న అర్ధరాత్రి లావణ్యకు డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచి్చంది. అప్పటికే రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో బిడ్డను కొనే వారితో డాక్టర్, ఆయన తండ్రి ఒప్పందం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాన గ్రామానికి చెందిన భూపతి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో పసిబిడ్డను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. రూ. 20 వేలు తీసుకుని ఏప్రిల్ 12న పాపను భూపతి దంపతులకు అప్పగించారు. మహేశ్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. విషయం తెలుసుకున్న లావణ్య భర్త మహేశ్ డీసీపీవో స్రవంతికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్‌మన్ బాలరాజుతోపాటు లావణ్య, మధ్యవర్తులు బాలకృష్ణ, దేవయ్య, భూపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 2021లో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిన డాక్టర్ ప్రవీణ్, ఆయన తండ్రి ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలడంతో సిద్దిరాములుతోపాటు కొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. -
కిడ్నీ మార్పిడి కేసు: విశాఖ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి బిగ్గుస్తున్న ఉచ్చు
సాక్షి, విశాఖపట్నం: కిడ్నీ మార్పిడి కేసులో విశాఖ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఎన్ఆర్ఐ ఆసుపత్రి.. కిడ్నీ మార్పిడి చేస్తామని పది లక్షలు దోచేసి.. మొహం చాటేసింది.కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడుగా వ్యవహరించారు. డీసీపీ-1ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు సీపీ శంఖబ్రత బాగ్చీ స్పెషల్ టీం వేశారు. నేటి నుంచి కిడ్నీ రాకెట్ కేసులో విచారణ జోరు అందుకుంది. నిందితులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. -
ఆస్పత్రిలో స్టార్ హీరో భార్య.. అసలేమైంది?
కోలీవుడ్ స్టార్ అజిత్ ప్రస్తుతం విడాముయర్చి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే అజిత్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా అజిత్ భార్య షాలిని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అజిత్ పక్కనే ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. లవ్ యూ ఫరెవర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆమెకు ఏమైందని అజిత్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిందా? లేదా మరేమైనా కారణాలున్నాయా? తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
‘సఫ్దర్‌జంగ్’లో మంటలు.. అద్దాలు పగులగొట్టి..
దేశ రాజధాని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోని పాత ఎమర్జెన్సీ విభాగంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 10 అగ్నిమాపక వాహనాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 70 మంది రోగులు, ముగ్గురు నర్సులను బయటకు తీసుకొచ్చారు. అయితే ఇందుకోసం జేసీబీ సాయంతో భవనంలోని అద్దాలు పగలగొట్టవలసి వచ్చింది. ఈ విభాగంలో కుక్కకాటు బాధితులకు ఇంజక్షన్ ఇస్తుంటారు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. షార్ట్‌సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు
బ్రిటన్ రాజు చార్లెస్(75) అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపధ్యంలో మరోమారు ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. దీనికి ముందు ఆయన ఒక ప్రసంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో అతని భార్య క్వీన్ కెమిల్లా కంట నీరు పెట్టుకున్నారు. వైద్యబృందం నుంచి క్లియరెన్స్ తీసుకున్న అనంతరం ఈ కార్యక్రమంలో రాజు పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు బ్రిటన్ రాజు తన ప్రసంగాన్ని 45 నిమిషాలకు కుదించారు.బ్రిటన్ కింగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ గత ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. రాజు ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ను షేర్ చేసిన బకింగ్‌హామ్ ప్యాలెస్ ఆయన చికిత్స ప్రక్రియలో ఆందోళనకర అంశం వైద్యుల దృష్టికి వచ్చిందని తెలిపింది.బ్రిటన్ రాజు వీలైనంత త్వరగా సాధారణ విధులలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఆకాంక్షించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని దేశమంతా ప్రార్థిస్తోందని సునక్ అన్నారు. బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా చార్లెస్ కింగ్ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షించింది. -
ఆస్పత్రిలో చేరిన బిగ్‌బాస్ బ్యూటీ.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 10 ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కన్నడ నటి నమ్రత గౌడ. తాజాగా ఆమె ఆస్పత్రిలో చేరారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.నమ్రత గౌడ తన ఇన్‌స్టాలో రాస్తూ.. " ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతానికి నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు" అని రాసింది. కాగా.. నమ్రత ఆసుపత్రి బెడ్‌పై ఉండగా.. తన తల్లి ఆహారం తినిపిస్తున్న ఫోటోను షేర్ చేసింది. కన్నడ టీవీ సీరియల్ షో నాగినిలో శివాని పాత్ర పోషించినందుకు నమ్రత గౌడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ టెలివిజన్ పరిశ్రమలో 2011లో 'కృష్ణ రుక్మిణి' అనే సీరియల్‌తో ఆమె కెరీర్ ప్రారంభించారు. -
ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్..!
టాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Tollywood producer Bandla Ganesh has been admitted to Apollo Hospital and is currently undergoing treatment for chest pain! pic.twitter.com/dFH5wBTMcs— Madhu (@offlinemadhu) June 3, 2024 -
ఎండకు సొమ్మసిల్లిన 50 మంది విద్యార్థినులు.. ఆస్పత్రికి తరలింపు
ఉత్తరాదిన ఎండలు దంచికొడుతున్నాయి. తాజాగా బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎండ వేడిమికి తాళలేక 50 మందికి పైగా విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో పాఠశాలలో కలకలం చెలరేగింది.అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య శాఖను సంప్రదించారు. ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో ఆ విద్యార్థినులందరినీ పాఠశాల సిబ్బంది ప్రైవేట్ వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్థూ స్థానికులు రోడ్డుపై ధర్నాకుదిగారు.బీహార్‌లోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంతటి ఎండ వేడిమిలోనూ రాష్ట్రంలోని పాఠశాలలు పనిచేస్తున్నాయి. బుధవారం ఉదయం మండుటెండల కారణంగా అరియారి బ్లాక్‌లోని మన్కౌల్ మిడిల్ స్కూల్లో విద్యార్థినులు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు.ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రార్థనల అనంతరం పదుల సంఖ్యలో చిన్నారులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. దీంతో పిల్లలందరినీ ప్రైవేట్ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ చిన్నారులంతా డీహైడ్రేషన్ బారిన పడ్డారని వైద్యుడు సత్యేంద్ర కుమార్ తెలిపారు. పిల్లలకు చికిత్స అందిస్తున్నామన్నారు. -
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ విపత్తు ఆస్పత్రి!ఎక్కడంటే..
ఆస్పత్రిని అప్పటికప్పుడూ సెట్ వేసినట్లుగా సెటప్ చేసే పోర్టబుల్ ఆస్పత్రి గురించి విన్నారా. పైగా ఈ ఆస్పత్రి సాయంతో దాదాపు 200 మంది రోగులకి ఒకేసారి వైద్యం అందించొచ్చట కూడా. ఇంతకీ ఏ దేశం ఈ ఆస్పత్రి మోడల్ని తీసుకొచ్చిందంటే..భారతదేశం ప్రపంచంలోనే తొలి విపత్తు ఆస్పత్రిని ప్రవేశపెట్టింది. దీనిని ఎయిర్‌లిఫ్ట్ చేసి సుమారు 72 క్యూబ్‌లు ప్యాక్ చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ను 'ఆరోగ్య మైఔత్రి క్యూబ్' అని పిలుస్తారు. భీష్మ(భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి ప్రాజెక్ట్)లో భాగంగా ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. ఈ క్యూబ్లలో ఆపరేషన్ థియేటర్, మినీ ఐసీయలు, వెంటిలేటర్లు, రక్త పరీక్షపరికరాలు, ఎక్స్‌రే యంత్రం, వంట స్టేషన్, ఆహారం, నీరు, షెల్టర్ పవర్ జనరేటర్ వంటి అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రత్యేక కేజ్‌లో దాదాపు వందమంది రెండు రోజుల పాటు జీవించేందుకు అవసరమైన సామాగ్రితో నింపిన 36 మినీ క్యూబ్‌లను చూడవచ్చు. వీటిలో రెండు మెయిన్ కేజ్‌లు ఉంటాయి.వాటిని మాస్టర్ క్యూబ్స్ అని పిలుస్తారు. వీటిల్లో దాదాపు 200 మంది ప్రాణాలను రక్షిచవచ్చు. ఈ మినీ ఫోర్టబుల్ ఆస్పత్రి 40 బుల్లెట్ గాయాలు, 25 పెద్ద రక్తస్రావం, 25 పెద్ద కాలిన గాయాలు, సుమారు 10 హెడ్ ఇంజూరీస్, వెన్నెముక గాయాలు, ఛాతీ గాయాలు, వెన్నుముకకి అయ్యే పగళ్లు గాయాలు వంటి వివిధ రకాల తీవ్రమైన గాయాలను నిర్వహించగల సామర్థ్యం గలది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్ట్ బీష్మలో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్‌ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్‌ని గత జనవరిలో జరిగిన గ్లోబల్ సదస్సులో ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన వైద్య సామాగ్రిని అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు.ఆగస్టులో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన మెడ్‌టెక్ ఎక్స్‌పోలో జరిగిన జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ఈ ప్రాజెక్టు అధికారిక ప్రారంభం జరిగింది. అంతేగాదు ఈ ప్రాజెక్టును మొదటగా మయన్మార్ అధికారులకు చూపించారు. ఇక ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆరోగ్య, రక్షణ మంత్రిత్వ శాఖలకు ఈ ఆలోచనను అందించారు. ఆయన సూచనల కారణంగా ఆయుర్వేద ఉత్పత్తులకు క్యూబ్స్‌లోని వస్తువులు జాబితాలో జోడించామని అధికారులు తెలిపారు. భారతదేశం మయన్మార్‌కు రెండు ఆరోగ్య మైత్రి క్యూబ్‌లను విరాళంగా అందించింది ఒక శ్రీలంకకు కూడా ఒకటి విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.(చదవండి: మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్‌తో పనిలేదు..!) -
పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి
ఢిల్లీ: ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర ఢిల్లీలోని వివేక్ విహార్ పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసింది. బేబీ కేర్ ఆస్పత్రిలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు శిశువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురు శిశువులను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.six babies killed and several others injured after a massive fire broke out at a children's hospital in Delhi Vivek Vihar area#delhi #BreakingNews #fire #vivekvihar pic.twitter.com/isMZ3AvQJa— Monu Lodhi 🇮🇳 (@monu_lodh) May 26, 2024 ఈ ప్రమాదంలో మంటలు చెలరేగిన భవనం నుంచి 12 మంది పిల్లలను రెస్య్కూ చేసి బయలకు తీసుకురాగా.. అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలతో ఫైర్ సిబ్బంది మంటలార్పారు. రెస్య్కూలో ఆపరేషన్ చేపట్టి ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలను కాపాడారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.BREAKING 🚨 7 newborns killed in massive fire at Delhi children's hospital• Six newborns rescued, one in ventilator• Cause of the fire yet to be ascertained• Rescue operations currently underway pic.twitter.com/aHKv5tMPy0— Gitanjali (@GitanjaliWrites) May 26, 2024 -
కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు
-
ఏఎంసీలో ఏమైంది?
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలోని పాత అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ఏసీలు పని చేయకపోవడంపై బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నిమ్స్ మెడికల్ సూరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణను ఆదేశించింది. దీంతో నిమ్స్ యాజమాన్యం ఏఎంసీలోని పరిస్థితులపై సంజాయిషీ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. నిమ్స్‌లోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ యూనిట్లు(ఏసీ) పురాతనమైనవి కారణంగా పనిచేయడం లేదని, మరమ్మతులు చేసినా ఫలితం కని్పంచడం లేదని లేఖలో అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్యాకేజీ యూనిట్లను మరింత సమర్థవంతమైన డక్టబుల్ యూనిట్లతో భర్తీ చేయడానికి రూ.12.50 లక్షల వ్యయంతో అంచనా వేశామని తెలిపారు. ఈ మేరకు నిపుణుల అభిప్రాయం కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా టెండర్లు వేయడం కుదరదని అడ్మిని్రస్టేషన్ సూచించిందని, ఈ కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని తాత్కాలికంగా అదే బ్లాక్‌లోని పాత ఐసీయూకి మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..బుధవారం సాయంత్రానికల్లా ఏసీలను తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. దీంతో పనిచేయడం మొదలు పెట్టాయని రోగుల బంధువులు పేర్కొన్నారు. ‘సాక్షి’ పుణ్యమా అని తమకు ఉపశమనం లభించిందని ఓ రోగి సహాయకుడు డానియేల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఆస్పత్రికి షారూఖ్ ఖాన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు మ్యాచ్‌కు హాజరైన షారుక్ డీహైడ్రేషన్‌కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు.కాగా.. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కు షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. కోల్‌కతా జట్టుకు యజమానిగా ఉన్న షారూఖ్ ఖాన్ టీమ్‌కు మద్దతుగా స్డేడియంలో సందడి చేశారు. దీంతో అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బకు గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లిన బాద్షా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో షారుక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. Due to heat stroke dehydration, but sir is fine now and he’s been discharged, nothing to worry.Love You @iamsrk ❤️#ShahRukhKhan https://t.co/5k5S5z1ixD— Sudhir Kothari (@sudhirkothari03) May 22, 2024 -
ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
ఇది మామూలు ఆసుపత్రి కాదు..ఏ పట్టణంలోదో..పల్లెల్లోదో అంతకన్నా కాదు. సాక్ష్యాత్తు రాజధాని నగరం హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్). కానీ ఇక్కడి అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)సెంటర్లో ఏసీ పనిచేయడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవు. దీంతో ‘ఏసీ పనిచేయడం లేదు..మీరే ఫ్యాన్లు తెచ్చుకోండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది రోగుల సంబందీకులకు సెలవిస్తున్నారు. వాస్తవానికి ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యంత వైద్య సంరక్షణ అందించేందుకు ఏఎంసీని వినియోగిస్తారు. కానీ ఇప్పుడు నిమ్స్ ఏఎంసీని చూస్తే జనరల్ వార్డుకన్నా అధ్వానంగా మారింది. లక్డీకాపూల్: నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందించే నిమ్స్ ఆస్పత్రిలో సేవలు పొందడం చాలా కష్టతరమైంది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన సేవలు, సౌకర్యాలు కలి్పంచడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఇందుకు ఉదాహరణగా ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డును పేర్కొనవచ్చు. వ్యాధి సమస్య తీవ్రరూపం దాలి్చన స్థితిలో రోగిని ఇక్కడకి తరలించి వైద్యసేవలను అందిస్తారు. వాస్తవానికి ఏఎంసీ సాధారణ వ్యాధులు(జనరల్ మెడిసిన్) విభాగానికి సంబంధించిన ఐసీయూ(అత్యవసర చికిత్సా కేంద్రం). ఇందులో రోగి ప్రాణపాయస్థితికి చేరినప్పడు వైద్యసేవలను అందిస్తారు.ముఖ్యంగా అన్ కంట్రోల్ డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారిని, డెంగ్యూ ఫీవర్, తీవ్రమైన స్థాయిలో రక్తాన్ని కోల్పోతున్న రోగులకు ఏఎంసీలో చికిత్స అందిస్తుంటారు. అదే విధంగా జ్వరంతో బాధపడుతున్న వాళ్లతో పాటు ఇతర మెడికల్ కండిషన్లో రోగులకు సైతం ఏఎంసీలో వైద్యసేవలను అందిస్తారు. ప్రస్తుతం ఈ వార్డులో 16 పడకలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రోగులతో నిండుకున్నాయి. అయితే..అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఏసీలు పని చేయకపోవడంతో రోగుల బాధలు వర్ణణాతీతం. ఇక్కడకి చికిత్స కోసం వచ్చే రోగులకు ముందు ఫ్యాన్ తెచ్చుకోవాలని అక్కడి వైద్య సిబ్బంది నేరుగా సూచించడం పరిపాటి. రెండు దశాబ్దాల నాటి ఏసీలు చెడిపోయాయి. దీంతో ఏఎంసీ దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. కాలం చెల్లిన ఏసీలు.. దాదాపు 15 ఏళ్ల నాటి ఏసీలే ఇప్పటికీ వినియోగిస్తుండడంతో అవి మొరాయిస్తున్నాయి. కనీసం రిపేరుకు స్పేర్ పార్ట్స్ కూడా దొరక్క వాటిని ఆపేస్తున్నారు. ఏఎంసీ వార్డులో కూడా ఇదే జరిగింది. కండెన్సర్లు దెబ్బతినడంతో ఏసీలు పని చేయడం మానేశాయి. మరొపక్క ఆస్పత్రిలో ఏసీ లోడ్ భారం కూడా విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. ఆస్పత్రిలో ఒకప్పుడు 200 పడకల సామర్ధ్యం కలిగిన ఐసీయూ యూనిట్లు ఉండేవి. ప్రస్తుతం 500ల వరకు ఐసీయూ పడకలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. దానికి తోడు వైద్య పరీక్షల్లో మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో అందుబాటులోకి తీసుకువచి్చన అత్యాధునికి వైద్య పరికరాలకు సైతం ఏసీల అవసరం ఉంది.మరమ్మతులు చేయిస్తాం.. ‘ఏఎంసీలో ఏసీలు పని చేయడం లేదు..రోగులే ఫ్యాన్లు తెచ్చకుంటున్నారు. ఇది నిజమే. ఆ ఏసీలను రిపేరు చేయాలంటే ఆ వార్డును ఖాళీ చేయాలి. అందులో ఉన్న రోగులను ఎక్కడికి షిప్ట్ చేయాలో తెలియడం లేదు. అందుకే సకాలంలో రిపేరు చేయించలేకపోతున్నాం. ఏఎంసీని పూర్తిగా ఆధునీకరించేందుకు దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో చర్యలు తీసుకుంటాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. హెచ్‌డీయూ లేదు..సాధారణంగా ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగానికి సంబంధించి ఏఎంసీతో పాటు హై డిఫెడెంట్ యూనిట్(హెచ్‌డీయూ)ను కూడా ఏర్పాటు చేయాలి. కానీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రిఫరల్ ఆస్పత్రిగా ఖ్యాతి చెందిన నిమ్స్‌లో హెచ్డీయూను విస్మరించారు. ఏఎంసీలో వైద్య సేవలకు అంతరాయం కలిగినప్పుడే కాకుండా వ్యాధి తీవ్రత మేరకు ఏంఎంసీపై భారం తగ్గించడానికి హెచ్‌డీయూ ఉపయుక్తంగా ఉంటుంది. ఒక విధంగా ఈ విభాగాన్ని ఏఎంసీ సపోరి్టంగ్ యూనిట్‌గా వినియోగిస్తారు. అలాంటి దాని విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా ప్రస్తుత పరిస్థితుల్లో రోగులు నానా అగచాట్లకు గురవుతున్నారు. ఏసీలు పని చేయని కారణంగా.. రోగులే సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకుని వైద్యసేవలు పొందాల్సి వస్తోంది. -
రెప్పపాటులోనే మృత్యు ఒడికి
హైదరాబాద్: చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన దంపతులపై అకస్మాత్తుగా చెట్టు కూలి మీద పడడంతో భర్త దుర్మరణం పాలయ్యాడు. భార్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. ఈ విషాదకర సంఘటన బొల్లారం పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తూంకుంటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి రవీందర్..బొల్లారం పయనీర్ బజార్ ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భార్య సరళకుమారితో కలిసి హోండా యాక్టివాపై బొల్లారం ఆస్పత్రికి వచ్చారు. వాహనం ఆవరణలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా సరళకుమారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం సరళాదేవిని గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న సహచర ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. సరళకుమారి అనారోగ్యం బారిన పడడంతో చికిత్స కోసం బొల్లారం ఆసుపత్రికి వచ్చారని వారు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఎండిన భారీ వృక్షాన్ని తొలగించినట్లయితే ప్రమాదం జరిగేది కాదని, పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్.. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు.. చెట్టు కూలి భర్త మృతి https://t.co/kUxuCIxNku pic.twitter.com/SGDpJqzx1l— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024 -
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆమె తల్లి మరణం, భర్తతో వివాదం తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా రాఖీ సావంత్ తీవ్రమైన గుండె సమస్యతో ముంబయిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె బ్రదర్ రాకేశ్ వెల్లడించారు. తన సోదరి డిప్రెషన్లో ఉండడం వల్లే గుండె సమస్య వచ్చిందని ఆమె సోదరుడు రాకేష్ సావంత్ వెల్లడించారు.మా అమ్మ చనిపోయాక అందరూ రాఖీని పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఆమెను అందరూ వేధింపులకు గురి చేశారని అన్నారు. ఆదిల్ తన సోదరి వద్ద ఉన్న డబ్బునంతా కాజేసి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిల్‌పై ఇప్పటివరకు ఛార్జ్‌షీట్ వేయలేదని..డబ్బులతో అందరినీ మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. తన సోదరి కోసం ప్రార్థించాలని ఆమె అభిమానులను కోరారు. అందరూ కలిసి రాఖీకి ద్రోహం చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాకేశ్ పేర్కొన్నారు. రాఖీకి ఏదైనా జరిగితే ఆమె అభిమానులు తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టరని రాకేశ్ సావంత్ అన్నారు. ఆమెకు అపరేషన్ బాగా జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Bollywood Khabar (@bollywoodkhabarofficial)