బ్రిటన్ రాజు చార్లెస్(75) అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపధ్యంలో మరోమారు ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. దీనికి ముందు ఆయన ఒక ప్రసంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో అతని భార్య క్వీన్ కెమిల్లా కంట నీరు పెట్టుకున్నారు. వైద్యబృందం నుంచి క్లియరెన్స్ తీసుకున్న అనంతరం ఈ కార్యక్రమంలో రాజు పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు బ్రిటన్ రాజు తన ప్రసంగాన్ని 45 నిమిషాలకు కుదించారు.
బ్రిటన్ కింగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ గత ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. రాజు ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేసిన బకింగ్‌హామ్ ప్యాలెస్ ఆయన చికిత్స ప్రక్రియలో ఆందోళనకర అంశం వైద్యుల దృష్టికి వచ్చిందని తెలిపింది.
బ్రిటన్ రాజు వీలైనంత త్వరగా సాధారణ విధులలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఆకాంక్షించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని దేశమంతా ప్రార్థిస్తోందని సునక్ అన్నారు. బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా చార్లెస్ కింగ్ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షించింది.
Comments
Please login to add a commentAdd a comment