
సామాజిక మాధ్యమాల్లో వైరల్
కర్ణాటక: గతంలో తెరవెనుక జరిగే రొమాన్స్ నేడు వీధుల్లోకి వచ్చింది. మెట్రో రైల్వేస్టేషన్లో ఓ జంట పట్టపగలే అందరి ముందు ప్రేమ కలాపాల్లో మునిగిపోయిన వీడియో భారీ వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని మెజెస్టిక్ మెట్రోస్టేషన్ ఒకటో ప్లాట్‌ఫాంలో ఓ జంట, చుట్టుపక్కల ప్రయాణికులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యం ఎవరో మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రేమికులు ప్రేమకలాపం చోటు చేసుకున్నది మెజెస్టిక్ మెట్రోస్టేషనా లేక మాదావర స్టేషన్‌లోనా అనే స్పష్టత లేనప్పటికీ అందరి ముందు ఇలా ప్రవర్తించడంపై ఆ జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఒక నిమిషం 30 సెకండ్ల నిడివి ఉన్న ప్రేమికుల రొమాన్స్ వీడియోపై వేలాదిమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దృశ్యాలు విదేశాల్లో మాత్రమే చూడవచ్చు. ఇటీవల రోజుల్లో ఇక్కడ కూడా ఇలాంటి ప్రవృత్తి పెచ్చుమీరడం మంచిది కాదని సోషల్ మీడియాలో నెటిజన్ ఒకరు తెలిపారు.