Rajanna
-
అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు
● ఎస్పీ మహేశ్ బీ.గీతేసిరిసిల్ల: జిల్లాలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలుండాలని, తీవ్రమైన నేరాల్లో శిక్షపడేలా విచారణ జరగాలని ఎస్పీ మహేశ్ బీ.గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో గురువారం పోలీసు అధికారులతో సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా ఉంచాలన ఆదేశించారు. కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ల నిందితులను, తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులను కోర్టు ఎదుట హాజరుపరచాలన్నారు. గంజాయి, పేకాట, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, గుడుంబా వంటి చట్టవ్యతిరేకమైన నేరాలను కట్టడి చేయాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించుకొని సైబర్ కేసులను చేధించాలని తెలిపారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, వీరప్రసాద్, శ్రీనివాస్, మధుకర్, నాగేశ్వరావు పాల్గొన్నారు. -
సన్నబియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంబోయినపల్లి(చొప్పదండి): ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి బోయినపల్లిలో సన్నబియ్యం పంపిణీని గురువారం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో దొడ్డు బియ్యం తినలేక అమ్ముకునే వారని పేదల కడుపు నింపడానికి సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీకి ముందుకొచ్చారన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ సన్నబియ్యం పక్కదారి పట్టకుండా సివిల్ సప్లయ్, పోలీస్‌శాఖ చూడాలని ఆదేశించారు. మండలంలో 33,141 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలి పారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.10.44 లక్షల మేర సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్వో అనంతలక్ష్మి, తహసీల్దార్ కాలె నారా యణరెడ్డి, ఎంపీడీవో భీమ జయశీల, సింగిల్‌విండో చైర్మన్లు జోగినిపల్లి వెంకట్రామారావు, ముదుగంటి సురేందర్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్‌యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, వీసీ నిమ్మ వినోద్‌రెడ్డి, భీంరెడ్డి మహేశ్‌రెడ్డి ఉన్నారు. డేరింగ్ కలెక్టర్ సిరిసిల్ల జిల్లాకు డేరింగ్ కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా పని చేస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తీరుస్తూనే భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తూ ప్రభుత్వ భూములు కాపాడుతున్నారని అభినందించారు. రేషన్ డీలర్ల కమీషన్ పెంచండి తమ సమస్యలు పరిష్కరిండంతోపాటు కమీషన్ పెంచాలని కోరుతూ మండల రేషన్ డీలర్ల సంఘ నాయకులు ఎమ్మెల్యే, కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్ పెంచాలని కోరారు. డీలర్ సంఘ నాయకులు ఎర్ర నర్సయ్య, డబ్బు వెంకటరెడ్డి, తుంగపల్లి మదు, రాజయ్య, నిర్మల, భాస్కర్, అమ్మాయి ఉన్నారు. -
‘రాజీవ్ యువవికాసం’ రుణాలివ్వాలి
● బ్యాంకర్లతో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు బ్యాంకర్లు లక్ష్యం మేరకు రుణాలు అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో గురువారం బ్యాంకర్లతో సమీక్షించారు. సబ్సిడీ రుణాలు, బ్యాంకు లింకేజీని వేగంగా చేయాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, యూబీఐ రీజినల్ హెడ్ అపర్ణ, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వెంకటేశ్, ఎల్డీఎం మల్లికార్జున్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై.. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను వేగంగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. సిరిసిల్ల మున్సిపాలిటీతోపాటు 12 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి 1,023 ఇళ్లను మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులు వేగంగా పనులు ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పూర్తయి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అర్హులైన పేదలు ఆన్లైన్లో ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇన్చార్జి డీఆర్వో రాధాబాయి, హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 408 ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 13 మండలాల్లో 331 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆర్డీవోల వద్ద 61, అదనపు కలెక్టర్ వద్ద 16 దరఖాస్తులు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య జయంతిని కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమురయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజమనోహర్‌రావు, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, సీపీవో శ్రీనివాసాచారి, గొల్ల, కురుమ సంఘాల నాయకులు ఏనుగుల కనకయ్య, సంబ లక్ష్మీరాజం పాల్గొన్నారు. రాజన్న సేవలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వేములవాడ: రాజన్నను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు. -
నేతన్నల డిమాండ్ల సాధనకు పోరాటం
● పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రమేశ్ సిరిసిల్లటౌన్: పనికి తగిన కూలీ లేకుండా శ్రమదోపిడీకి గురవుతున్న నేతకార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ పేర్కొన్నారు. కార్మికుల కూలీ పెంపునకు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం మూడో రోజుకు చేరింది. కార్మికులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేయగా ఠాణాలో నిరసనలు తెలిపారు. ప్రభుత్వం వద్ద చీరల ఉత్పత్తికి ఆర్డర్ తెచ్చుకున్న యాజమాన్యాలకు రేటు నిర్ణయించిన ప్రభుత్వం కార్మికుల కూలి నిర్ణయించలేదన్నారు. బతుకమ్మ చీరల కూలి కంటే తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగమంటి ఎల్లారెడ్డి, అన్నల్దాస్ గణేశ్, సిరిమల్ల సత్యం, ఒగ్గు గణేశ్, నక్క దేవదాసు, గుండు రమేశ్, సబ్బని చంద్రకాంత్, ఎక్కల్దేవి జగదీశ్, ఉడుత రవి తదితరులున్నారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
తంగళ్లపల్లి/ఇల్లంతకుంట: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారుల పాలవుతోందని తెలుపుతూ గురువారం ‘ధాన్యం దళారులపాలు’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా పౌరసఫరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో 238 ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటా యించామని, ఈనెల రెండోవారంలో ప్రారంభిస్తామని తెలిపారు. ధాన్యం ఆరబెట్టి తేమశాతం 17 అంతకంటే తక్కువగా ఉంటే కొనుగోళ్లు చేస్తామని తెలిపారు. ట్రేడ్ లైసెన్సుల పేరుతో అక్రమ వసూళ్లు : కమిషనర్ సిరిసిల్లటౌన్: పురపాలక సంఘం ఉద్యోగుల పేరుతో కొందరు కమర్షియల్ షాపుల నిర్వాహకులకు ఫోన్‌కాల్స్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరూ కూడా అలాంటి ఫోన్‌కాల్స్‌కు స్పందించొద్దని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య కోరారు. 63043 26727, 70916 01526 నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలాంటి ఫోన్‌కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
వాళ్లు అనర్హులే!
● కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో ఓవర్ క్వాలిఫై అభ్యర్థులు ● మొత్తం 25 మంది అనర్హులుగా గుర్తింపు ● వెలువరించిన కోర్టు.. స్వాగతిస్తున్న నిరుద్యోగులు ● ఫలించిన ‘సాక్షి’ వరుస కథనాల పోరాటంసాక్షిప్రతినిధి,కరీంనగర్: గతంలో జరిగిన కోర్టు సబార్డినేట్ పోస్టుల విషయంలో ‘సాక్షి’ వరుస కథనాలు నిజమయ్యా యి. అటెండర్ స్థాయి పోస్టులకు అధిక విద్యార్హ త (ఓవర్‌క్వాలిఫైడ్) ఉన్న వ్యక్తులు అక్రమంగా పరీక్షలు రాసి ఎంపికయ్యారంటూ రెండేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన మాట విధి తమే. తమకు అన్యాయం జరిగిందని, అనర్హులు ఉద్యోగాలకు ఎంపికవడాన్ని సవాలు చేస్తూ పలు వురు ఈ కథనాల ఆధారంగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. పోలీసు యంత్రాంగం విచారణ జరిపింది. పలువురు తాము అధిక విద్యార్హతలు కలిగి ఉన్నామని అంగీకరించి, స్వచ్ఛందంగా తప్పుకుని, ఉద్యోగానికి రాబోమని రాసి ఇచ్చారు. మరికొందరు తమకు ఏమవుతుందిలే అన్న ధీమాతో కొలువుల్లో చేరారన్న ఆరోపణలు ఉన్నాయి. తరువాత కాలంలోనూ అవి వెలుగుచూడటంతో వారిని కూడా తొలగించారు. సంచలనం రేపిన ‘సాక్షి’ కథనాలు.. 2019లో నిర్వహించిన కోర్టు సబార్డినేట్ పరీక్షకు అర్హత పదో తరగతి ఫెయిల్ ఉండాలని నిబంధ న ఉంచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 96 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు. తొలుత 1:3 రేషియోలో మొత్తం 318 మందిని పిలిచిన అధికా రులు.. 93 మందితో తుదిజాబితా ప్రకటించా రు. ఈ అభ్యర్థుల్లో పలువురు ఓవర్ క్వాలిఫైడ్ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చాలా మంది తమ అర్హతలను తగ్గించి చూపించారు. తాము 10వ తరగతి ఫెయిల్ అని కొందరు, అసలు తాము 9వ తరగతితోనే చదువు ఆపేశామని చెప్పుకుని మరికొందరు పరీక్ష రాశారు. అధికారులను నమ్మించేందుకు అప్పటికే మూతబడి ఉన్న చాలా స్కూళ్ల నుంచి బోనఫైడ్ సర్టిపికెట్లను దొడ్డిదారిలో తెచ్చుకుని మరీ సమర్పించారు. దీంతో అవే స్కూళ్లలో చదివి.. ఉద్యోగం రాని వారు.. తమతోపాటు వారు చదవలేదని ఆందోళనలకు దిగారు. ఈ విషయాన్ని పలుమార్లు ‘సాక్షి’వరుస కథనాల ద్వారా ఎత్తిచూపింది. అనంతర కాలంలో ఓ మహిళా ఉద్యోగి గ్రాడ్యుయేట్ అన్న విషయాన్ని గుర్తించిన అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుని, ఉద్యోగం నుంచి తప్పించడం గమనార్హం. రెండేళ్ల తరువాత విడుదలైన జాబితా.. వీరందరి రిక్రూట్మెంట్ ప్రక్రియ 2022లో మొదలైన దరిమిలా.. ఈ దుమారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అనర్హులు (ఓవర్ క్వాలీ ఫైడ్) తమ పొట్ట కొడుతున్నారని ఉద్యోగాలు రాని, పది ఫెయిలై పరీక్ష రాసిన వారంతా ఆందోళనలకు దిగారు. తాము ఆందోళనలు చేసిన ఇన్నేళ్ల తరువాత 25 మందితో కరీంనగర్ కోర్టు నుంచి అనర్హుల జాబితా విడుదల కావడంపై 2019లో పరీక్ష రాసిన అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 25 మందిలోనూ ము గ్గురు రిక్రూట్మెంట్కు గైర్హాజరయ్యారని, ఒకరు ఫామ్నింపలేదని, ఒకరు ఉద్యోగంలో చేరి రాజీ నామా చేశారని, మరో ముగ్గురు పోస్టులో చేరడానికి ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. మిగిలిన 17 మంది మాత్రం అధిక విద్యార్హతలు కలిగి ఉన్నారని విడుదల చేసిన జాబితాలో స్పష్టంచేశారు. దీంతో ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందని న్యాయాధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ జాబితాకు సంబంధించిన కాపీ ప్రస్తుతం కరీంనగర్ కోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మాకు అవకాశం కల్పించాలి కరీంనగర్ కోర్టు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మేం తొలి నుంచి చెప్తున్న విషయం రెండేళ్ల తరువాత నిజమవడం సంతోషం. ఉద్యోగాల్లో చేరని, ఓవర్ క్వాలిఫైడ్ అభ్యర్థుల స్థానంలో తరువాత మెరిట్లో నిలిచిన నిజమైన అభ్యర్థులకు స్థానం కల్పించాలని ప్రార్థిస్తున్నాం. – రమేశ్, హుజూరాబాద్, నిరుద్యోగి -
క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి
● సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ వేములవాడ: క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహిస్తున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ పోటీలను గురువారం ప్రారంభించారు. మహిళా వైద్యులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. విజయం సాధించిన లయన్స్ లెజెంట్స్ టీమ్‌కు బహుమతులు అందజేశారు. కేసీఆర్‌కు రాజన్న ప్రసాదం వేములవాడ: మాజీ సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు గురువారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో చల్మెడ పాల్గొన్నారు. ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించాలి ● డీఎంహెచ్‌వో రజిత తంగళ్లపల్లి(సిరిసిల్ల): జాతీయ ఆరోగ్య పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో రజిత సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ సిబ్బందితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రోగ్రాం అధికారి సంపత్, రామకృష్ణ, పీహెచ్సీ మెడికల్ అధికారి అఫీజా, సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కృషి వేములవాడఅర్బన్: రాజ్యాంగ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జైభీమ్.. జైబాపు..జై సంవిధాన్ జిల్లా ఇన్చార్జి అవేజ్, మండల ఇన్చార్జి చంద్రకళ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లిలో గురువారం నిర్వహించిన పాదయాత్రలో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజ్యంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కూరగాయల కొమురయ్య, చిలివేరి శ్రీనివాస్, బొజ్జ భారతి ఉన్నారు. లాఠీచార్జీపై వినూత్న నిరసన సిరిసిల్లటౌన్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ గురువారం స్థానిక చేనేతచౌక్ వద్ద బీఆర్ఎస్వీ నాయకులు మోకాళ్లపై కూర్చున్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శాంతి యుతంగా నిరసన తెలిపితే లాఠీచార్జీ చే యడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ సర్కారు నిలబడినట్లు చరిత్రలో లేదన్నారు. మట్ట శ్రీనివాస్, ముద్దం అనిల్, కాస ర్ల వినయ్, దేవరాజ్, ముజ్జు, నవీన్, గణేష్, రాజు, వినయ్, నరేశ్, వేణు, మోహన్, పరమేశ్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
ఐరిస్ నమోదు చేస్తూ ధాన్యం కొనుగోళ్లు
● డీఆర్డీవో శేషాద్రిసిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఐరిస్(కంటిపాప)ను నమోదు చేయాలని డీఆర్డీవో శేషాద్రి సూచించారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం ధాన్యం కొనుగోళ్లపై మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చారు. డీఆర్డీవో మాట్లాడుతూ ధాన్యం సేకరణలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్యాడీక్లీనర్తో శుద్ధిచేసిన వడ్లను వ్యవసాయ విస్తరణ అధికారి ధ్రువీకరించిన తర్వాతే సేకరించాలని సూచించారు. సన్న వడ్లను, దొడ్డు వడ్లను వేర్వేరుగా సేకరించాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని కేటాయించిన రైస్‌మిల్లులకు వెంటనే తరలించాలన్నారు. అదనపు డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, డీపీఎంలు సుధారాణి, ఎం.శ్రీనివాస్, పౌరసరఫరాల ఆఫీస్ అధికారి రాజశేఖర్, జిల్లా సమాఖ్య ప్రతినిధులు, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, గంభీరావుపేట ఏపీఎంలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, బుక్‌కీపర్లు పాల్గొన్నారు. -
సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ కోనరావుపేట(వేములవాడ): పేద, మద్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. బుధవారం మండలకేంద్రంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఇచ్చిన బియ్యాన్ని కొందరు వినియోగదారులు దళారులకు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యాన్ని అమ్ముకోకుండా సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో వసంతలక్ష్మి, తహసీల్దార్ వరలక్ష్మి, డెప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు నాయిని ప్రభాకర్‌రెడ్డి, లింభయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, నాయకులు బొర్ర రవీందర్, గోపాల్, గొట్టె రుక్మిణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయాలి వివిధద అసవసరాల నిమిత్తం సర్టిఫికెట్లు కోసం వస్తున్న విద్యార్థులు, నిరుద్యోగ యువకులకు జాప్యం చేయకుండా త్వరగా జారీ చేయాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. కోనరావుపేట తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి అనేక మంది నిరుద్యోగ యువతీయువకులు దరఖాస్తు చేసుకుంటున్నారని, ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆదాయం, కులధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి, వారితో పాటు ఉన్నత విద్య కోసం విద్యార్థులు కూడా వస్తారని, జాప్యం చేయకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ వరలక్ష్మి, డెప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఆర్ఐ రాజశేఖర్ ఉన్నారు. -
రూ.16వేల వరకు రావాలి
నేను జాపర్ పని చేసేవాడిని. అప్పట్లో పని లేక సాంచాలు నడిపి బతుకమ్మ చీరల బట్టనేశాను. రూ.16వేల వరకు యారన్ సబ్సిడీ డబ్బు రావాలి. నా భార్య కవిత బీడీలు చేస్తుంది. ఇప్పుడు పని చేద్దామంటే కార్ఖానాలు బంద్ ఉన్నాయి. చేతిలో డబ్బు లేక ఇబ్బంది అవుతుంది. జౌళిశాఖ అధికారులు సబ్సిడీ సొమ్ము అందించి ఆదుకోవాలి. – కొంక విజయ్‌కుమార్, రాజీవ్‌నగర్ బంగారం అమ్మి అప్పు కట్టిన నేను సిరిసిల్ల శాంతినగర్‌లో గంగుల శ్రీనివాస్ వద్ద బతుకమ్మ చీరల బట్టను నేశాను. రూ.23వేల వరకు సబ్సిడీ డబ్బులు రావాలి. ఆర్నేళ్లుగా పని లేక అప్పులపాలయ్యా. నా భార్య అంబవ్వ బంగారం అమ్మి అప్పులు కట్టిన. పని లేక, చేతిలో పైసలు లేక పొట్టకు వెళ్తలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. సబ్సిడీ డబ్బులు వస్తే కొద్దిగానైనా మా బాధలు తీరుతాయి. – సిరిసిల్ల పోచయ్య, నేత కార్మికుడు నివేదిక సిద్ధంగా ఉంది 2023 నాటి బతుకమ్మ చీరలు నేసిన కార్మికుల వివరాలు, వారు నేసిన బట్ట సమాచారం సిద్ధంగా ఉంది. 4,500 మంది కార్మికులకు సుమారు రూ.5 నుంచి రూ.6 కోట్లు యారన్ సబ్సిడీ చెల్లించాల్సి ఉంటుంది. నివేదిక సిద్ధంగా ఉంది. ఉన్నతాధికారులు కోరగానే పంపిస్తాం. సబ్సిడీ చెల్లింపులు మా పరిధిలో లేదు. ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – రాఘవరావు, చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల -
పన్ను వసూళ్లలో సిరిసిల్ల స్ఫూర్తి
● రాష్ట్రస్థాయిలో బల్దియాకు తృతీయస్థానం ప్రజల సహకారంతో.. 15వ ఆర్థికసంఘం నిధులు పొందేందకు అర్హత సాధించాం. పన్ను వసూళ్లలో ప్రజల సహకారం బాగుంది. ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో వసూళ్లు చేపట్టాం. గతంలో కౌన్సిలర్లు సహకరించగా, ప్రస్తుతం వారి పదివికాలం ముగియడంతో కలెక్టర్ సూచనలతో ముందుకెళ్లాం. – సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల సిరిసిల్లటౌన్: ఆస్తిపన్ను వసూళ్లలో సిరిసిల్ల బల్దియా గత స్ఫూరిని కొనసాగించింది. ఆస్తి పన్ను వసూళ్లలో ఎనిమిదేళ్లుగా ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. ప్రజలు బల్దియాకు పన్నుదన్నుగా నిలవడంతో ఈ కీర్తిని సాధించింది. సంస్థ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేయడంలో ప్రత్యేక అధికారి, కలెక్టర్ నేతృత్వంలో బల్దియా సిబ్బంది అమలు చేస్తున్న క్రియాశీలక విధానాలు ఇందుకు మూలకారణంగా నిలిచాయి. పటిష్ట ప్రణాళికతో.. ప్రత్యేక పాలనాధికారి కలెక్టర్ దిశానిర్దేశంలో ఆస్తి పన్ను విషయంలో మున్సిపల్ సిబ్బంది టార్గెట్ స్థాయిని చేరుకుంది. అధికారులు ఎప్పటిలాగే ప్రణాళిక బద్ధంగా వసూళ్లు చేపట్టారు. ప్రజలు ఈసారి కూడా బాధ్యతతో ఆస్తిపన్ను చెల్లించారు. గతేడాది 39 వార్డుల్లో కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికతో ఇంటింటికీ తిరిగి నూరుశాతం వసూళ్లు చేయగా, ప్రస్తుతం పాలకవర్గం గడువు తీరడంతో అధికారులు పటిష్ట ప్రణాళికతో పన్ను వసూళ్లు చేశారు. గతేడాది 99.52 శాతం పన్ను వసూలు చేసి ప్రథమ స్థానంలో నిలవగా.. ఈసారి 96.99 శాతంతో తృతీయ స్థానంలో నిలవడం విశేషం. వసూళ్ల కోసం 39 వార్డుల్లో 14మంది బిల్‌కలెక్టర్లతో గ్రూపులు ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళ పన్ను వసూలు చేశారు. బల్దియా పన్ను లక్ష్యం రూ.6.32 కోట్లు ఉండగా, కమిషనర్ సమ్మయ్య నేతృత్వంలో సిబ్బంది ఫిబ్రవరి ఆరంభం నుంచే వసూళ్ల పనిలో పడ్డారు. సిరిసిల్ల బల్దియా ట్యాక్సుల స్వరూపం ప్రైవేటు ఆస్తులు 22,989 ప్రభుత్వ ఆస్తులు 67 ట్రేడ్‌లైసెన్స్ ఫీజులు 1,587 వాటర్ ట్యాక్సులు 12,492 అడ్వర్టైజ్మెంట్, తైబాజర్ 281 బల్దియా దుకాణ గదులు 175 -
సర్దార్ పాపన్నకు కలెక్టర్ నివాళి
సిరిసిల్ల: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌కు బుధవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఘనంగా నివాళి అర్పించారు. పాపన్న వర్ధంతిని కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాపన్నగౌడ్ నాటి పాలకులపై తిరుగుబాటు చేసిన తీరును, ఆయన చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు, ఎల్డీఎం మల్లికార్జున్‌రావు, గౌడ సంఘం నాయకులు పులి లక్ష్మీపతి, బొల్గం నాగరాజు, రంగు రాములు, ముష్కం తిరుపతి, బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అర్హులకు మంజూరు చేస్తున్నాంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గిరిజన భూములను సాగులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గిరివికాసం’ పథకంపై జిల్లా అధికారులు అవగాహన కల్పించడం లేదని ‘సాక్షి’లో ‘భూములు బీళ్లుగానే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 67 బ్లాకులకు అర్జీలు వస్తే.. 7 బ్లాకుల్లో బోర్లు వేయించినట్లు తెలిపారు. 2 బ్లాకులలో విద్యుత్ కనెక్షన్ మంజూరు చేశామని, 2 బ్లాకులలో మోటార్ సాంక్షన్ చేసినట్లు వివరించారు. 51 బ్లాకులకు వివిధ సాయిల్లో అనుమతులు పెండింగ్ ఉన్నాయని వివరించారు. 9 బ్లాకులు 5 ఎకరాలలోపు ఉండడం, ఇది వరకే నీటి వసతి ఉండడంతో ఆ దరఖాస్తులను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. రుద్రంగి మండలం వీరునితండా గ్రామంలోని బ్లాకులలో వేసిన బోరుబావులకు సంబంధించి బిల్లులు రూ.1,45,345 హైదరా బాద్ స్థాయిలో పెండింగ్ ఉన్నట్లు వెల్లడించారు. ప్రణాళికతో చదవాలితంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రణాళికతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా విద్యాధికారి జ నార్దన్రావు అన్నారు. బుధవారం తంగళ్లపల్లి ప్ర భుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చే శారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని ప రిశీలించారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ, భాషపై పట్టుసాధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సలహాలు ఇచ్చారు. ఇప్పటి నుంచే పదో తరగతి పరీక్షలకు ప్రణాళికతో సంసిద్ధం కావాలన్నారు. అనంతరం ఎన్ఎంఎంఎస్ సాధించిన విద్యార్థి శివతేజ్ను అభినందించారు. ప్రశాంతంగా ‘పది’ పరీక్షలుసిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో పూర్తయ్యాయి. చివరి రోజు సోషల్ పరీక్షకు 14 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తెలిపారు. జిల్లాలో 35 పరీక్షా కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,753 మంది హాజరైనట్లు, ప్రశాంతంగా జరిగినట్లు వివరించారు. విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. విస్తృతర పచారం చేయాలిసిరిసిల్లకల్చరల్: సీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టంపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీనియర్ సిటిజన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.నరసింహారావు సూచించారు. బుధవారం ఆన్లైన్ సమావేశంలో మాట్లాడారు. ప్రజల్లో ఈ చట్టంపై పూర్తి అవగాహన పెరిగేలా క్షేత్ర స్థాయిలో కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ఇప్పటికే సంబందిత చట్టంలోని అంశాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నామని, వృద్ధులకు సంబంధించిన కేసుల పరిష్కారంలో సహకరిస్తున్నామని జిల్లా శాఖ నుంచి సమావేశంలో పాల్గొన్న జనపాల శంకరయ్య పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన నేతన్నలు.. రెండో రోజుకు సమ్మె
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో నేతన్నలు రోడ్డెక్కారు. వస్త్ర పరిశ్రమ, అనుబంధ రంగాల కార్మికుల కూలి పెంపు కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండోరోజుకు చేరింది. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించగా వందలాది సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని కోరారు. కార్మికుల సమస్యలను వివరిస్తూ కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్, నాయకులు కోడం రమణ, సిరిమల్ల సత్యం, ఒగ్గు గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వస్త్ర పరిశ్రమపై సెస్ పాలకుల కక్ష
సిరిసిల్లటౌన్: వస్త్ర పరిశ్రమపై సెస్ పాలకులలు రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందకట్ల స్వామి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు నేత కార్మికులకు పనులు కల్పించాలన్న ఉద్దేశంతో ఎస్ఎస్హెచ్ సంఘాలకు 8కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తుంటే సెస్ పాలకవర్గం కోర్టు కేసు పేరుతో సిరిసిల్లలోని సుమారు 8వేల పవర్‌లూమ్స్‌కు విద్యుత్ కనెక్షన్లు తొలగించడం సరికాదన్నారు. విద్యుత్ సబ్సిడీ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందని, ఈమేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు విన్నవించడం జరిగిందన్నారు. నేతన్నలకు సెస్ అండగా నిలువాల్సింది పోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణిలోనే కక్ష సాధింపు చర్యలకు దిగడం శోచనీయమన్నారు. వస్త్ర పరిశ్రమ వర్గాలు ఏలాంటి ఆందోళనకు గురికావొద్దని సూచించారు. సంఘం కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ అధ్యక్షుడు మురళి, తాటిపాముల దామోదర్, ఆంకారపు రవి, ఆడెపు భాస్కర్, గౌడ రాజు తదితరులున్నారు. -
బీజేపీ వైపు రమేశ్‌బాబు..?
వేములవాడ: వేములవాడ ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలుపొందిన చెన్నమనేని రమేశ్‌బాబుకు గత ఎన్నికల్లో పౌరసత్వం కేసు అంశంతో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుండా చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు కేటాయించింది. దీంతో అసంతృప్తిలో ఉన్న రమేశ్‌బాబు అసెంబ్లీ ఎన్నికల అనంతరం జర్మనీ వెళ్లిపోయారు. ఇటీవల కుటుంబ సభ్యులతో వేములవాడకు వచ్చారు. ఈక్రమంలో మార్చి 8న రమేశ్‌బాబును ఆయన నివాసంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ కలవడంతో నియోజకవర్గంలో చర్చ మొదలైంది. రమేశ్‌బాబు బీజేపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ అంశంపై ‘సాక్షి’ రమేశ్‌బాబు వ్యక్తిగత సహాయకుడిని సంప్రదించగా కేవలం గాసిప్స్ అంటూ దాటవేశారు. ఇదే విషయాన్ని నేరుగా రమేశ్‌బాబును వ్యాట్సాప్ ద్వారా సంప్రదించగా అవునని సమాధానం చెబుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో.. రమేశ్‌బాబు ఇటీవల వేములవాడకు చేరుకోగా, తన అనుచరులతో భవిష్యత్ రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం ఫ్యామిలీతో ఢిల్లీ పర్యటనకు వెళ్లి అక్కడ బీజేపీ పెద్దలను కలిసినట్లు సమాచారం. అయితే రమేశ్‌బాబు బీజేపీలో చేరి తన చిన్నాన్న విద్యాసాగర్‌రావు కుమారుడు చెన్నమనేని వికాస్‌రావుకు మద్దతుగా నిలుస్తారా..లేక తనకే టికెట్ అడుగుతారా.. అన్న సందేహాలు స్థానికంగా ఊపందుకున్నాయి. ఇటీవల ఆపార్టీ నాయకులు తన నివాసంలో కలవడంతో జోరందుకున్న రాజకీయం బీజేపీలో పెరుగుతున్న పోటీ -
పని లేదు.. పైసల్లేవు
● పొట్టకూటి కోసం తిప్పలు ● ఇది సిరిసిల్ల నేతకార్మికుల దైన్యస్థితి ● శ్రమఫలం కోసం నేతన్నల నిరీక్షణ ● రెండేళ్లుగా ఎదురుచూపులు ● పది శాతం యారన్ సబ్సిడీ కోసం పడిగాపులు‘సాంచాలు నడుపుతూ వస్త్రోత్పత్తి చేస్తున్న ఇతడి పేరు కోడం బాలకిషన్. సిరిసిల్లలోని ఓ కార్ఖానాలో 12 సాంచాలపై పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.8వేలు సంపాదిస్తున్నాడు. నిత్యం సాంచాల మధ్య 10 గంటల పాటు పని చేస్తేనే ఈ మాత్రం కూలి లభిస్తుంది. అదే బతుకమ్మ చీరల బట్ట నడిపితే నెలకు రూ.16వేల వరకు వచ్చేది. ఇప్పుడు బతుకమ్మ చీరల ఆర్డర్లు లేవు. 2023లో బతుకమ్మ చీరలు నేసిన బాలకిషన్‌కు ప్రభుత్వం కూలి సర్దుబాటులో భాగంగా అందించే 10 శాతం యారన్ సబ్సిడీ సొమ్ము రావాల్సి ఉంది. రెండేళ్లుగా ఆ పైకం రాలేదు. సబ్సిడీ సొమ్ములు ఎప్పుడు వస్తాయోనని నిరీక్షిస్తున్నాడు.. ఇలా ఇతనొక్కడే కాదు.. సుమారు ఆరువేల మంది పవర్లూమ్ కార్మికులు యారన్ సబ్సిడీ కోసం పడిగాపులుగాస్తున్నారు’. -
హనుమాన్ జయంతి వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శ్రీహనుమాన్ ఆలయంలో ఈనెల 12న నిర్వహించే జయంతి, రథోత్సవాల ఉత్సవాల వాల్ పోస్టర్‌ను మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆలయ ఈవో నాగరపు శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్, మాజీ ధర్మకర్త చేపూరి నాగరాజు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయండిసిరిసిల్ల క్రైం: మహిళలు వేధింపులకు గురైతే షీ టీంలకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ మహేశ్ బి గీతే అన్నారు. జిల్లాలోని విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సేవలందిస్తున్నట్లు తెలిపారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై 2 కేసులు, 7 పెట్టి కేసులు నమోదు చేశామని అన్నారు. వేధింపులకు గురైతే వెంటనే 87126 56425 ఫిర్యాదు చేయాల సూచించారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం శివారులోని సర్దాపూర్ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపరెడ్డి ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు. ధాన్యం క్వింటాల్‌కు రూ.2,320తో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు దుబాల వెంకటేశం, ఆడెపు జగన్, వెల్ముల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెచ్‌సీయూ భూముల రక్షణకు పోరాటంఇల్లంతకుంట: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణకు పోరాటం చేస్తామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గన్నారం నర్సయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ అన్నారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలి పెట్టిన అనంతరం వారు మాట్లాడారు. తమను అదుపులోకి తీసుకొని వదిలేయడం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపోరాట నాయకులపై నిర్బంధం పెరిగిందన్నారు. ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై దృష్టి సారించాలని కోరారు. -
● ఇది దేశంలోనే ప్రథమం ● రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, కానీ కొన్ని పథకాలు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఇస్తాయని, పేదలకు సన్నబియ్యం ఇవ్వడం మానసికంగా సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్ల కొత్త బస్టాండు సమీపంలోని ఇందిరానగర్ రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీకి మంగళవారం శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలి మనరాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 17,263 రేషన్‌షాపుల్లో సన్నబియ్యం ఇవ్వ డం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళామణులను కోటీశ్వరులుగా చేయాలని సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూ నిట్లు ప్రారంభించామని అన్నారు. అలాగే సోలార్ యూనిట్లు మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సన్న వడ్లు పండించే రైతులకు ప్రతీ క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస మాట్లాడుతూ జిల్లాలోని 345 రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితే, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీవో రాధాబాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, డీఎస్ వో వసంతలక్ష్మీ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజిత, కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన వస్త్రోత్పత్తిదారులు సిరిసిల్లకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను వస్త్రోత్పత్తిదారులు కలిసి విద్యుత్ బిల్లుల సమస్యను వివరించారు. ‘సెస్’ అధికారులు బ్యాక్ బిల్లింగ్ పేరిట కరెంట్ బిల్లులు విధించారని, 126 కార్ఖానాలు మూతపడ్డాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, ప్రతినిధులు గోవిందు రవి, పద్మశాలీ సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై అడ్డంకులు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై రాష్ట్రంలో ప్రజాపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని, ఆ రెండు పార్టీలు కవలపిల్లలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి సంబంధం లేని గోపనపల్లి, కంచ శివారుల్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి చేస్తుంటే.. విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. -
‘ఉపాధి’ భరోసా కరువు
● పనిచేసినా అందని వేతనాలు ● పనులు లేక దిక్కులు చూస్తున్న కూలీలు ● కొత్త జాబ్‌కార్డుల ఊసే లేదు ● పట్టించుకోని అధికారులు ‘ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన మానస జాబ్‌కార్డు కోసం రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత జాబ్‌కార్డు వచ్చిందని పంచాయతీ అధికారి చెప్పడంతో గతేడాది వేసవిలో నాలుగు రోజులు ఉపాధిహామీలో చేపట్టిన కాల్వ పనులకు వెళ్లింది. కానీ ఆ డబ్బులు ఇప్పటి వరకు రాకపోగా.. అసలు జాబ్‌కార్డు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. చేసిన శ్రమ వృథా కావడంతోపాటు జాబ్‌కార్డు మంజూరు కాలేదు.’ ‘ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన పూదరి సతీశ్ గతేడాది వేసవిలో ఉపాధి హామీలో చేపట్టిన కాల్వ పూడికతీత పనులకు వెళ్లాడు. వారానికి పైగా కాల్వ పనులు చేశాడు. ఏడాది గడుస్తున్నా డబ్బులు తన ఖాతాలో జమకాలేదు. డబ్బుల కోసం పంచాయతీలోని ఉపాధిహామీ సిబ్బందిని అడిగినా డబ్బులు రావడం లేదు. ఉపాధికార్డుల వివరాలు మొత్తం జాబ్‌కార్డులు 98,130 జాబ్‌కార్డుల కోసం దరఖాస్తులు 56 పనిచేసిన కుటుంబాలు 51,088 పనిచేసిన కూలీలు 75,756 కల్పించిన పనిదినాలు 21,88,092 ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గ్రామాల్లో వలసల నివారణ, పేదలకు ఉన్న ఊరిలోనే పని చూపెట్టి.. ఆర్థికంగా స్థిరత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పథకం ఉద్దేశం అమలు కావడం లేదు. పనిచేసినా పైసలు రాకపోగా.. పనిచేద్దామని జాబ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు కావడం లేదు. ఈ విషయమై ఉపాధిహామీ అధికారులను అడిగినా సమాధానం రావడం లేదు. దీంతో చేసేదేమి లేక జిల్లాలోని చాలా మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం అమలుపై ‘సాక్షి’ ఫోకస్. కార్డుల సంఖ్యను మించని కూలీలు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 255 గ్రామాల్లో 98,130 జాబ్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా జాబ్‌కార్డుల కోసం 56 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంతకుమించి దరఖాస్తు చేసుకున్నా అధికారుల రికార్డుల్లో నమోదు కాలేవని క్షేత్రస్థాయిలో తెలుస్తోంది. జిల్లాలో గతేడాది కాలంగా జిల్లా వ్యాప్తంగా 51,088 కుటుంబాలకు ఉపాధిహామీ పనులు కల్పించారు. ఆయా కుటుంబాల్లోని 75,756 మంది కూలీలు 21,88,092 పని దినాలకు హాజరయ్యారు. అయితే ఉపాధి పనులకు హాజరైన కూలీల సంఖ్య జాబ్‌కార్డుల సంఖ్యను మించకపోవడం గమనార్హం. గ్రామాల్లో పని కావాలని కూలీలు ఎదురుచూస్తున్నా పనులు చూపెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో పని లేక అడ్డా కూలీలుగా.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఉపాధి దొరక్క చాలా మంది కూలీలు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. నిత్యం ఉదయం సిరిసిల్ల, వేములవాడల్లోని లేబర్ అడ్డాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. సిరిసిల్ల నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల నుంచి కూడా కూలీలు ఉదయమే వెళ్తున్నారంటే గ్రామాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెల్లవారుజామునే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని లేబర్ అడ్డాలకు చేరుకుంటున్న కూలీల్లో కొందరికి మాత్రమే పనులు దొరుకుతున్నాయి. పని దొరకని వారు ఉసూరుమంటూ ఇళ్లకు తిరిగివస్తున్నారు. ఇలా ఆ రోజు తమ రవాణా ఖర్చులు భరించాల్సిందే. పని దొరక్కపోగా.. ఆటో, బస్సు చార్జీలు భరించడం కూలీలకు భారంగా మారుతోంది. జాబ్‌కార్డుల కోసం దరఖాస్తులు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కొత్తగా జాబ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా జాబ్‌కార్డులు రాలేదని సమాచారం. దీంతో వారు ఉపాధిహామీ పనులకు వెళ్లలేకపోతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మూడు, నాలుగు రెట్లు అదనంగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. తక్కువకు తక్కువ గ్రామానికో దరఖాస్తు వచ్చినా 255 దరఖాస్తులు ఉంటాయి. కానీ అధికారులు మాత్రం చాలా తక్కువ చెబుతున్నారు. త్వరలోనే వస్తాయి జాబ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త ఆర్థిక సంవత్సరంలో మంజూరవుతాయి. మూడు, నాలుగు వారాల వేతనాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కొందరికి ఆధార్‌నంబర్ మ్యాచ్ కాకపోవడంతోనే దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంటాయి. వారివి కూడా పరిష్కరిస్తాం. – కొమురయ్య, ఏపీవో, ఎల్లారెడ్డిపేట -
రూ.10వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రూ.10వేల కోట్లతో రాజీవ్ యువవికాసం పథకానికి రూపకల్పన చేసిందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన శిక్షణలో మాట్లాడారు. జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్క యువకుడికి అవకాశం కల్పించాలన్నారు. మండలాల్లోని తహసీల్దార్లు కులం, ఆదాయం సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీస్‌ల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి మండల్ లెవెల్ కమిటీకి పంపిస్తారని వివరించారు. ఆ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత జిల్లా కమిటీకి పంపిస్తారని వెల్లడించారు. అనంతరం అర్హులు ఎంపిక చేసుకున్న రుణాలకు సంబంధించిన శిక్షణను అందజేస్తారని తెలిపారు. ఈ పథకంపై ప్రచారం కల్పించి అర్హులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీవో శేషాద్రి, మున్సిపల్ కమి షనర్లు సమ్మయ్య, అన్వేష్, పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి భారతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహన్రావు, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అర్హులందరికీ అవకాశం కల్పించాలి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా -
అర్చకుల సమస్యలు పరిష్కరించండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం నాయకులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం తిమ్మాపూర్ పీఏసీఎస్ వైస్ చైర్మర్ బుగ్గ కృష్ణమూర్తిశర్మ మాట్లాడుతూ ఆలయాల్లో పూజలు చేసే ధూపదీప నైవేద్య అర్చకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నార అన్నారు. తమ సమస్యల పరిష్కారంపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాచర్ల పార్థసారధిశర్మ, ప్రధాన కార్యదర్శి పరాంకుశం రమేశ్, కోశాధికారి కేవీఆర్ వెంకటారమణాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ల రవికుమార్, ప్రచార కార్యదర్శి చర్లపల్లి సీతారాములుశర్మ, గౌరవ సలహాదారు పారు నంది ఆంజనేయశర్మ తదితరులు ఉన్నారు. -
కూలీ రేట్లు నిర్ణయించాలని..
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో నేత కార్మికులు (పవర్లూమ్) వస్త్రోత్పత్తిని బంద్ చేసి మంగళవారం రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇచ్చిన మహిళా శక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లకు నేత కార్మికులకు చెల్లించే కూలి నిర్ణయించాలని, 2023 నాటి బతుకమ్మ చీరలకు చెల్లించాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ సొమ్మును చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల బీవై నగర్ నుంచి నేతన్న చౌక్ వరకు ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసే కార్మికులకు ఒప్పందం ప్రకారం కూలీ చెల్లించాలని, వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులను యజమానులను చేయాలని, ప్రభుత్వం ఉత్పత్తి చేయిస్తున్న మహిళా శక్తి చీరలకు సంబంధించిన పవర్లూమ్ వార్పిన్, వైపని కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు డిమాండ్లతో నేతకార్మికులు సాంచాలను బంద్ చేసి రోడ్డెక్కి నిరసన తెలిపారు. నేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేదాకా.. వస్త్రోత్పత్తిని నిలిపివేస్తామని, సాంచాలు(పవర్‌లూమ్స్) నడుపమని స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ, కార్మికులు పాల్గొన్నారు. సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతన్నలు వస్త్రోత్పత్తి బంద్ చేసి నేతన్నల ఆందోళన యారన్ సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ -
‘రాజీవ్ యువ వికాసం’కు దరఖాస్తు చేసుకోండి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లాలోని అర్హులైన యువత రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సోమవారం కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి డిప్యూ టీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎల్డీఎం మల్లికార్జున్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అక్రమాలపై నిగ్గుతేల్చాలి సిరిసిల్లటౌన్: మున్సిపల్ పాలకవర్గం పాలన పై రాజకీయ ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికా రి పెదవి విప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ కోరారు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్‌లోని పార్టీ ఆఫీసులో సోమ వారం ప్రెస్మీట్లో మాట్లాడారు. గత ఐదేళ్లు బీఆర్ఎస్ పాలకవర్గంపై కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాల ఆరోపణలు, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నరగా నిధులు విడుదల చేయకపోవడం వంటి అంశాలపై జిల్లా ఉన్నతాధికారి విచారణ చేపట్టాలని కోరారు. గత ఐదేళ్లలో డబుల్బెడ్రూమ్ పంపిణీ తదితర అంశాలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ కమిటీ వేసి నిజనిర్ధారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదే సమయంలో జిల్లా కేంద్రం అభివృద్ధికి కూడా అధికార పార్టీ ప్రత్యేకంగా నిధులు వెచ్చించాలని కోరారు. జిందం కమలాకర్ పాల్గొన్నారు. -
విద్యార్థులపై దాడి అమానుషం
● హెచ్‌సీయూ భూముల విక్రయం విరమించుకోవాలి ● ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించిన విద్యార్థి సంఘాలుిసరిసిల్లటౌన్/ముస్తాబాద్/చందుర్తి(వేములవాడ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దాష్టీకం సరికాదని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూముల విక్రయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు చేస్తున్న సర్కారు కుట్రను ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. మట్టె శ్రీనివాస్, ముగ్దం అనీల్, వెంకటేష్, అడిచెర్ల సాయి, రాజు, మహేష్, నాగరాజు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి ముస్తాబాద్‌లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేశ్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కార్పొరేట్ కంపెనీల కోసం సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మడం సరికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. నిర్ణయం రద్దు చేసుకోవాలి బీఆర్ఎస్వై వేములవాడ నియోజవర్గ అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు చందుర్తిలో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం కుట్రతోనే పండుగ పూట విద్యార్థులపై పోలీసులతో దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అగ్నివీర్‌కు తిమ్మాపూర్ యువకుడి ఎంపిక
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్కు చెందిన పల్లె దినేశ్‌గౌడ్ అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. పల్లె మమత– నాంపల్లి దంపతుల కుమారుడు దినేశ్‌గౌడ్. నాంపల్లి ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డిగ్రీ చదివిన దినేశ్‌గౌడ్ మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. యు వకుడిని ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేశ్‌గౌడ్, నాయకులు బుర్ర ఉపేందర్‌గౌడ్, గరుగుల శ్రీనివాస్‌గౌడ్, దాస్‌గౌడ్ సన్మానించారు. ‘నవోదయ’ విజేతలకు సన్మానంసిరిసిల్ల ఎడ్యుకేషన్: నవోదయ పాఠశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించి పరీక్షలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్లలో సన్మానించారు. జ్ఞాపికతోపాటు నగదు ప్రోత్సాహకంగా అందజేశారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నవోదయలో సీటు సాధించడం హర్షణీయమన్నారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లితండాకు చెందిన భూక్య శ్రీనితరాథోడ్, వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన నగరం గాయత్రి నవోదయ సీట్లు సాధించడంతో అభినందించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తిరుమల జగన్నాథాచారి, గుగులోత్ తిరుపతిజాదవ్లను సన్మానించారు. ఉపాధ్యాయులు జంగిటి రాజు, గుండమనేని మహేందర్‌రావు, పొలాస మల్లేశం, కోటగిరి లక్ష్మణ్, ఆడెపు శివకుమార్, గాలిపెల్లి సంతోష్ పాల్గొన్నారు. నియామకం బోయినపల్లి(మానకొండూర్): కొత్తపేటకు చెందిన మానాల నారాయణ మండల కాంగ్రెస్ సేవాదల్ విభాగం అధ్యక్షుడిగా నియమితు లయ్యారు. ఈమేరకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం నియామకపత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే సత్యం, కాంగ్రెస్ నాయకులకు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. -
తండాలో తాగునీటి తండ్లాట
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గిరిజనుల గొంతెండుతోంది. తాగునీటి కోసం మైళ్లకొద్దీ దూరంలోని వ్యవసాయబావుల వద్దకు వెళ్తున్నారు. మిషన్ భగీరథ నీరు సరిగాసరఫరా కాకపోవడంతో గిరిజన తండాల్లో తాగునీటి తండ్లాట మొదలైంది. నీటి కోసం పనులు సైతం బంద్ చేసుకొని ఇంటి వద్దే ఉంటున్నారు. అధికారులకు ముందుచూపు లేక రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అనేక తండాలు, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగుండారం పరిధి పోచమ్మతండాలో తాగునీటి కోసం గిరిజన మహిళలు వరుసగా రెండో రోజు సోమవారం ఆందోళనకు దిగారు. అయినా అధికారులు తండా వైపు కన్నెత్తి చూడడం లేదు. మిషన్‌భగీరథ నీరు అందకపోవడంతో వ్యవసాయబావెల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా గుండారం రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా గత ప్రజాపాలనలో ఎంపిక చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌గా గుర్తించిన గ్రామంలోనే తాగునీటి కోసం తండావాసులు తండ్లాడుతున్నారు. తండాలో గత 15 రోజులుగా తాగునీరు రావడం లేదని అధికారులకు విన్నవించినా పట్టించుకునే వారు లేరు. తండాలో 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత ప్రభుత్వం ఈ తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి మిషన్ భగీరథ పథకాన్ని ఇక్కడ అమలు చేసింది. అయితే ప్రస్తుతం భగీరథ నీటి పైపులు పగిలిపోయి సరఫరా నిలిచిపోయింది. బావుల నుంచి నీటి తరలింపునకు అభ్యంతరాలు తాగునీటి కోసం తండ్లాడుతున్న గిరిజనులు వ్యవసాయబావుల నుంచి నీటిని తెచ్చుకుంటుండగా.. తాజాగా సోమవారం రైతులు మహిళలను అడ్డుకున్నారు. పంట పొలాలకు నీరు సరిపోవడం లేదని నీటిని తీసుకెళ్లేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఒక్క రోజుతోనే సరిపెట్టిన అధికారులు గిరిజనులు ఆందోళన చేస్తున్న సమయంలో ఒక్క రోజు మాత్రమే ట్యాంకర్ ద్వారా నీటిని అందించిన అధికారులు తర్వాత చేతులు దులుపుకున్నారు. డాలోని ఇండ్లల్లో నీటితొట్టీలు, కుండలు, బిందెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రెండో రోజు మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలపడం తాగునీటి తిప్పలకు అద్దం పడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పగిలిన మిషన్‌భగీరథ పైపులను మరమ్మతు చేసి నీటిసమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నాం తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అంది స్తున్నాం. కొన్ని రోజులుగా తండాలో నీటి సమస్య ఉంది. మిషన్‌భగీరథకు బదులుగా ట్యాంకర్లను ఏ ర్పాటు చేశాం. పైపులను మరమ్మతు చేసి ఈ వేసవిలో ఇబ్బందులు లేకుండా నీటిని అందిస్తాం. – దేవరాజు, కార్యదర్శి, గుండారం -
వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు
వేములవాడ: ప్రజలు, చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా వేములవాడలో వీధివిక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో రూ.80లక్షలతో నిర్మించే వీధి విక్రయ మార్కెట్జోన్, రూ.56.50 లక్షలతో 11, 12వ వార్డుల్లో నిర్మించే సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులకు సోమవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు. కూరగాయల మార్కెట్‌తో రైతులు, చిరువ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల సాక్షి ప్రచురించిన కథనానికి ప్రభుత్వ విప్, కలెక్టర్ స్పందించి రెండోబైపాస్ రోడ్డులోని గంగమ్మగుడి ప్రాంతంలో తాత్కాలిక మార్కెట్ వద్ద రూ.80 లక్షలతో ప్రత్యేక షెడ్లు నిర్మించేందుకు ముందుకొచ్చారు. జనాభాకు అనుగుణంగా పట్టణంలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పట్టణంలోని 28 వార్డుల్లో రూ.10లక్షల చొప్పున వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మూలవాగుపై మూడో బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తవుతాయని, భూసేకరణకు రూ.6కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.47కోట్లతో రోడ్డు విస్తరణ చేయబోతున్నట్లు చెప్పారు. రూ.76కోట్లతో రాజన్న ఆలయ విస్తరణకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు మొదలవుతాయని తెలిపారు. గతంలో మళ్లిపోయిన రూ.20కోట్లు వీటీడీఏ నిధులను తెప్పించి బద్దిపోచమ్మ ఆలయం వద్ద పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. రూ.1.50కోట్లతో బస్తీ దవాఖానా నిర్మిస్తున్నామని, రూ.80లక్షలతో తిప్పాపూర్ వెళ్లే రోడ్డుకు ట్రాక్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ రాకేశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు టెండర్ పూర్తి ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు -
మంత్రివర్యా ఆలకించండి..
● సిరిసిల్లలో నిలిచిన పనులు ● 15 నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ● నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక ● మంత్రిపైనే ఆశలు పెట్టుకున్న ప్రజలు ● నిధులు విడుదల చేయాలని విన్నపంసిరిసిల్ల: ప్రభుత్వాలు మారితే అభివృద్ధి స్వరూపం మారుతుంటోంది. ప్రాధాన్యతాంశాలు మారిపోతుండడంతో గత ప్రభుత్వంలో మొదలైన పనులు నిలిచిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం సిరిసిల్లలో కనిపిస్తోంది. 15 నెలల క్రితం సిరిసిల్లకు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత ఉండేది. నిధుల కేటా యింపు.. పనుల మంజూరులో అగ్రతాంబూలం దక్కేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో మొదలైన పనులకు నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి. సిరిసిల్ల నియోజకవర్గంపై పాలకుల చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడే పనులకు నిధులు మంజూరుకావడం లేదు. నిధులు రాక నిలిచిన అభివృద్ధి పనులపై ‘సాక్షి’ ఫోకస్ కథనం. మంత్రివర్యా అభివృద్ధికి బాటలు వేయండి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సిరిసిల్లలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్నారు. స్థానిక అంబేడ్కర్‌నగర్ రేషన్‌షాపులో మధ్యాహ్నం 12.30 గంటలకు సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. 15 నెలలుగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని కళాశాల మైదానంలో ఓపెన్‌జిమ్ లేదు. మంజూరైన అనేక సిమెంట్ రోడ్డు పనులు సాగడం లేదు. ఇప్పటికే పూర్తయిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఈ ప్రాంత సమస్యలను అధికారులతో సమీక్షించి అభివృద్ధికి బాటలు వేయాలని ఈ స్థానికులు కోరుతున్నారు. సిరిసిల్లపై చిన్నచూపు లేకుండా.. అభివృద్ధిలో ప్రజల ప్రాధాన్యతాంశాలను గుర్తించాలని కోరుతున్నారు.● సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయినిచెరువును కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ నుంచి వచ్చే గోదావరి జలాలతో నింపాల్సిన నీటి పంపింగ్ పథకం మూలనపడింది. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌లో పనులు పూర్తికాలేదు. నీటి పంపింగ్ కోసం తెచ్చిన పైపులు రోడ్డు వెంబడి వేశారు. కానీ మద్దిమల్ల చెరువును నింపే పనులు సాగడం లేదు. ఇది పూర్తయితే వీర్నపల్లి మండలంలోని గిరిజన గ్రామాల్లోని పంట పొలాలకు శాశ్వతంగా సాగునీటి వసతి ఏర్పడుతుందది. ఇప్పటికే మంజూరైన ఈ పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. ఫలితంగా మద్దిమల్ల చెరువుకు నీరు చేరడం లేదు.ఇది సిరిసిల్ల మానేరువాగుతీరంలో విద్యానగర్ నుంచి సాయినగర్ వరకు కొత్తగా డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదిత ప్రాంతం. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో వంద అడుగుల విస్తరణతో రోడ్డు.. డివైడర్లతో, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌తో వాకింగ్ ట్రాక్‌తో నిర్మించాల్సి ఉంది. విద్యానగర్ నుంచి సాయినగర్ వరకు మానేరువాగు వెంబడి మూడు కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మాణం రెండేళ్ల కిందటే ఫార్మేషన్ పూర్తయింది. వాగు వెంట ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్డు వేశారు. అయితే ఇంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. రూ.22కోట్ల పనులకు గ్రహణం పట్టింది. ఎన్నికలు పూర్తయి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరి 15 నెలలు గడుస్తున్నా ఈ పనుల ఊసే లేదు. ● ముస్తాబాద్ మండల కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం సింగిల్‌రోడ్డు ఉండగా.. ఆ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులు జరగడం లేదు. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని మోహినికుంట వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు సింగిల్ రోడ్డు, మలుపులు ఉండడంతో ప్రమాదాలకు నిలయంగా ఉంది. ఈ అంతర్ జిల్లా రోడ్డుకు విస్తరించే పనులు చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలోనే ఆర్అండ్బీ శాఖ ద్వారా నిధులు మంజూరైనా పనులు చేయకపోవడంతో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డుకు మోక్షం లభించడం లేదు. మరోవైపు దుబ్బాక పరిధిలోని సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా సిద్దిపేట జిల్లా అధికారులు మార్చారు. కానీ జిల్లా పరిధిలోని రోడ్డుకు గ్రహణం పట్టింది. ● గంభీరావుపేట మండల కేంద్రం నుంచి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేశారు. రోడ్డు పనులకు మంత్రి హోదాలో కేటీఆర్ అప్పట్లో శంకుస్థాపన చేశారు. కానీ పనులు మొదలు కాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. గంభీరావుపేట నుంచి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తే.. వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోడ్డు కోసం కొత్తపల్లి గ్రామస్తులు దీక్షలు చేశారు. ఆందోళన చేశారు. కానీ పాలకుల నిర్లక్ష్యంతో కొత్తపల్లి రోడ్డుకు అడుగులు పడడం లేదు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, సిరిసిల్ల పట్టణంలోనూ అనేక పనులు మంజూరై.. నిధులు విడుదల లేక పనులు సాగడం లేదు. -
గుండె.. ఆగిపోతోంది
వీణవంక(హుజూరాబాద్): జిల్లా ప్రజలకు గుండె దడ పట్టుకుంది. అప్పటిదాక బాగానే ఉంటున్నారు.. అంతలోనే గుండెపోటుతో అనంతలోకాలకు వెళ్తున్నారు. ఒకప్పుడు పట్టణవాసులకు ఎక్కువగా వస్తుందనేది ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుండెదడ పట్టుకుంది. పొద్దంత పనులు చేసుకొని వచ్చి ఇంటి వద్ద సేద తీరేలోపు గుండెపోటుతో మృతిచెందుతున్నారు. అయితే పౌష్టికాహార లోపం, శారీరక శ్రమ లేకపోవడం, నీళ్లు సరిగా తాగకపోవడం వల్లే గుండెపోటు వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. 40 నుంచి 55లోపు వారే ఎక్కువ... గుండెపోటు 40 నుంచి 55ఏళ్ల లోపు వారికే ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరు నెలల వ్యవధిలో వివిధ వృత్తుల్లో ఉన్న దాదాపు 34 మంది గుండెపోటుతో మృతిచెందారు. కాగా గుండెపోటు ఉపాధి హామీ కూలీలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఎండలో పని చేయడం, సరైన నీరు తీసుకోకపోవడం గుండెపోటుకు ఒక కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. కొంత మంది వ్యాయామం చేసినా గుండెపోటుకు గురవడం కలకలం రేపుతుంది. వణుకు పుట్టిస్తున్న గుండెపోటు ఉమ్మడి కరీంనగర్లో ఆరు నెలల వ్యవధిలో 34 మంది మృతి ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలపై ఎక్కువ ప్రభావం పాటించాల్సిన నియమాలు ముఖ్యంగా ఉపాధి హామీ, వ్యవసాయం చేసే కూలీలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం ఎండలో పని చేయరాదు. శ్రమకు తగ్గ నీరు లేదా నిమ్మరసం తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కవగా పెరగకుండ చెట్లకింద సేద తీరాలి. క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవాలి. పట్టణాలలో ఉండేవారు మానసిక ఒత్తిడికి లోనుకావద్దు. రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్, వ్యాయామం, యోగా చేయాలి. పొగతాగడం మానేయాలి. ఆయిల్ పుడ్ సాధ్యమైనంత వరకు తగ్గించాలి. గుండెపోటు లక్షణాలు గుండెపోటు రావడానికి కారణం గుండెకు సంబంధించి కండరాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీన్నే గుండేపోటు అంటారని వైద్యులు చెబుతున్నారు. ఎడమ చేతి వైపు లాగినట్లు అనిపిచ్చి, ఛాతిలో నొప్పి వస్తుంది. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. వ్యవసాయ కూలీలకు ఎక్కవగా ఎందుకు వస్తుందంటే వారు శ్రమకు తగ్గ నీరు తీసుకోకపోవడమే ప్రధాన కారణం. ఎండలో ఎక్కవగా పని చేయడం వల్ల చెమట ద్వారా లవణాలు కరిగిపోతాయి. లవణాలు తగ్గి గుండె ఎక్కవగా కొట్టుకోవడం కాని, గుండె ఆగిపోవడం జరుగుతుంది. అయితే కూలీలు పని మీద ఉండి నీళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం ఒక కారణం. వంశపార్యంగా గుండెపోటు వస్తుందని కూడా ఒక కారణంగా వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. ఎండలో ఎక్కువ సమయం పని చేయడం వల్ల గుండె ఆగిపోవడం జరుగుతుంది. 7 గంటలు ఎండలో పని చేస్తే కనీసం రెండుగంటలు విశ్రాంతి తీసుకోవాలి. శారీరక శ్రమ అవసరం పతి మనిషికి శారీరక శ్రమ అవసరం. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఊబకాయం, బీపీ, షుగర్ పొగతాగడం అలవాటు ఉన్నవారికి గుండెపోటు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పని చేసినప్పుడు సరైన నీరు తీసుకోవాలి. ఎడమచేతి వైపు నొప్పి వచ్చినట్లైతే డాక్టర్లను సంప్రదించాలి. – డాక్టర్ గొట్టె శ్రావణ్, పీహెచ్సీ వైద్యుడు, శంకరపట్నం మండలం -
రైస్‌మిల్లులో గంజాయి మొక్కలు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కాట్నపల్లి గ్రామ శివారులోని ఓ రైస్‌మిల్లులో గంజాయి మొక్కల పెంపకం సోమవారం బయటపడింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్ రైస్‌మిల్లుకు చేరుకుని గంజాయి మొక్కలు పరిశీలించారు. ఆ సమయంలో యాజమాన్యం, కార్మికులు ఎవరూ అందుబాటులో లేరు. యాజమాన్యానికి సమా చారం ఇచ్చినా స్పందించలేదు. రాత్రివరకూ విచారణ చేపట్టి.. చవరకు కాట్నపల్లి గ్రామానికి చెందిన మేకల పవన్‌కల్యాన్, బిహార్‌కు చెందిన లాల్ అరోబిహార్తోపాటు కాట్నపల్లికి చెందిన రైస్‌మిల్లు యజమాని మట్ట శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
పరువు హత్యకాదు.. కుట్రపూరిత హత్య
ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోటకు చెందిన పూరె ల్ల సాయికుమార్‌ది పరువు హత్య కాదని, కుట్రపూరితంగా చేసిన హత్యేనని పౌరహక్కులు, విప్లవ రచయితలు, తెలంగాణ ప్రజాఫ్రంట్, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు ఆరోపించారు. ముప్పిరితోటలో హత్య జరిగిన ప్రదేశాన్ని సోమవారం వారు సందర్శించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, దళిత లిబరేషన్ ఫ్రంట్ ప్రధానకార్యదర్శి మార్వాడి సుదర్శన్, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ గుమ్మి కొమురయ్య మాట్లాడారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన పూరెల్ల పరుశరాములు–జ్యోత్స్న కుమారుడు సాయికుమార్ పదో తరగతి పూర్తిచేసి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అదే గ్రామంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ముత్యం సమత–సదయ్యల కూతురు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తమ నిజనిర్ధారణలో తేలిందన్నారు. ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాలు, గ్రామస్తులకు తెలుసని అన్నారు. యువతి చదువు పూర్తయ్యాక పె ళ్లి చేసుకునేందుకు నిర్ణయించగా. ఇష్టం లేని యువ తి తల్లిదండ్రులతోపాటు మేనమామ సిద్ధ సారయ్య అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరి ప్రోద్బలంతో సాయికుమార్ హత్యకు కుట్ర చేశారని అన్నారు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సాయికుమార్‌ను గొడ్డలితో నరికి చంపారని తమ విచారణలో తేలిందని చెప్పారు. గతంలో రెండుసార్లు సాయికుమార్‌పై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదని తెలిపారు. అధికార, ప్రతిపక్షపార్టీలు ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ఈ హత్యను తాము ఖండిస్తున్నామని అన్నారు. ప్రేమ, కులం, మతం పేరిట జరిగే హత్యల నివారణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్కోర్టును ఏర్పాటు చేయాలని, సాయికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని వారు కోరారు. పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, విప్లవ రచయితల సంఘం కన్వీనర్ బాలసాని రాజయ్య, నాయకులు బొంకూరి లక్ష్మణ్, ఎన్.సత్యనారాయణ, పుట్ట రాజన్న, రెడ్డిరాజుల సంపత్ పాల్గొన్నారు. సాయికుమార్ హంతకులను కఠినంగా శిక్షించాలి పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
రెండు దుకాణాల్లో చోరీ
హుజూరాబాద్: పట్టణంలో సోమవారం వేకువజామున రెండు దుకాణాల్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్ పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ చౌరస్తాలో పోరండ్ల సమ్మయ్యకు చెందిన రాఘవేంద్ర కిరాణం, జనరల్ స్టోర్ షట్టర్ తాళాలు పగలగొట్టి కౌంటర్లోని రూ.25 వేల నగదును, సామగ్రి ఎత్తుకెళ్లారు. అలాగే వరంగల్ రోడ్డులోని పరమేశ్వర ఎలక్ట్రికల్, వైండింగ్ దుకాణం షట్టర్ తాళాలు తీసి కౌంటర్లోని రూ.25 వేల నగదు, ఐదు తులాల వెండి దొంగిలించారు. కాగా దొంగలు వేకువజామున 2.30 గంటలకు రాఘవేంద్ర కిరాణం, 3.30 గంటలకు ఎలక్ట్రికల్ షాప్ తాళాలు తెరిచే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తిరుమల్‌గౌడ్ తెలిపారు. -
వస్త్రోత్పత్తికి సబ్సిడీ పవర్
సిరిసిల్ల: నష్టాల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2001 నుంచి 50 శాతం సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. 24 ఏళ్లుగా ఈ సబ్సిడీని కొనసాగిస్తోంది. వస్త్రోత్పత్తి సాంచాలను కుటీరపరిశ్రమగా గుర్తిస్తూ కేటగిరీ–4లో విద్యుత్‌ను రూ.4కు యూనిట్‌ను సరఫరా చేశారు. ఇందులో ప్రభుత్వం ప్రతీ యూనిట్‌కు రూ.2 భరిస్తుండగా.. సాంచాల యజమానులు మిగతా రూ.2 ‘సెస్’కు చెల్లించేవారు. ఇలా 24 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యుత్ సబ్సిడీ కొనసాగుతోంది. కానీ 2001లో ఇచ్చిన జీవో ప్రకారం 20 సాంచాలు(అంటే 10 హెచ్‌పీల) వరకే ఈ విద్యుత్ సబ్సిడీని అందించాలని స్పష్టం చేశారు. కానీ సిరిసిల్లలో నెలకొన్న ఆకలిచావులు, ఆత్మహత్యల నేపథ్యంలో 10 హెచ్‌పీల నిబంధనను ఎవరూ అమలు చేయలేదు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లి 10 హెచ్‌పీల నిబంధన అమలు చేయాలని ఆర్డర్ తేవడంతో సబ్సిడీ సమస్య తెరపైకి వచ్చింది. మరోవైపు చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ ఎల్ఆర్.ఆర్సీ నంబరు 895/2014–పి.తేదీ: 20.05.2024 ద్వారా సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి సాంచాలకు సంబంధించిన పరిశ్రమల టారిఫ్ అమలు చేయాలని 10 హెచ్‌పీల నిబంధనల అమలులోకి తేవాలని కోరారు. బ్యాక్ బిల్లింగ్‌తో సమస్యలు కోర్టు ఆదేశాలు.. చేనేత జౌళిశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో సిరిసిల్లలో 119 కార్ఖానాలకు విద్యుత్ సబ్సిడీని రద్దు చేసిన సిరిసిల్ల ‘సెస్’ అధికారులు వంద శాతం బిల్లింగ్ చేశారు. 20 సాంచాల కంటే ఎక్కువ సాంచాలు ఉన్న కార్ఖానాలకు విద్యుత్ సబ్సిడీ లేకుండా వినియోగించిన ప్రతీ యూనిట్‌కు రూ.7.80 చొప్పున బిల్లులు ఇచ్చారు. దీంతో గతంలో ప్రతీ యూనిట్‌కు రూ.2 చెల్లించిన వస్త్రోత్పత్తిదారులు ఇప్పుడు రూ.7.80 చెల్లించలేక కార్ఖానాలను మూసివేశారు. 2017 నుంచి వినియోగించిన విద్యుత్‌కు బ్యాక్ బిల్లింగ్ పేరిట ఒక్కో కార్ఖానాకు రూ.10లక్షల నుంచి రూ.1.20కోట్ల వరకు విద్యుత్ బిల్లులు విధించారు. బ్యాక్ బిల్లింగ్ చెల్లించలేక కొందరు కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందగా.. అదీ తాత్కాలికమే కావడంతో బ్యాక్‌బిల్లింగ్ సమస్య పెండింగ్‌లో ఉంది. ఇటీవల తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ డాక్టర్ డి.నాగార్జున్ సిరిసిల్లలో బహిరంగ విచారణ చేపట్టారు. బ్యాక్ బిల్లింగ్‌ను రద్దు చేయాలని, 10 హెచ్‌పీల వరకు పవర్‌లూమ్స్‌కు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని, 10 నుంచి 25 హెచ్‌పీల వరకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని వస్త్రోత్పత్తిదారులు కోరారు. దీనిపై విద్యుత్ నియంత్రణ మండలి ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా గతంలో ప్రకటించిన 25 హెచ్‌పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి, నిధులు కేటాయించడం విశేషం. బ్యాక్బిల్లింగ్తో మూతపడిన కార్ఖానాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. సిరిసిల్లలోని వంద కార్ఖానాల్లో మళ్లీ సాంచాలపై వస్త్రోత్పత్తి సాగనుంది. 25 హెచ్పీలకు 50 శాతం విద్యుత్ రాయితీ 50 సాంచాల ఆసాములకు సబ్సిడీ వర్తింపు రూ.49.04 కోట్లతో అమలు సిరిసిల్లలో బ్యాక్ బిల్లింగ్ అసలు సమస్య ఇది సిరిసిల్లలోని 50 సాంచాలు(25 జోడీల) కార్ఖాన. ఇక్కడ ఎనిమిది మంది నేతకార్మికులు పనిచేస్తారు. నిత్యం రూ.250 నుంచి రూ.350 వరకు ఒక్కో కార్మికుడు ఉపాధి పొందుతుంటారు. ఇలాంటి 50 సాంచాల వస్త్రోత్పత్తి కార్ఖానాలకు యాభై శాతం విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గతేడాది నవంబర్లోనే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) సిపార్సు చేసింది. గతంలో 10 హెచ్‌పీల సామర్థ్యం గల సాంచాల కార్ఖానాలకు 50 శాతం విద్యుత్ రాయితీ వర్తించేది. కానీ దాన్ని 25 హెచ్పీలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.49.04కోట్లతో 25 హెచ్‌పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల పట్టణంతోపాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, తంగళ్లపల్లి, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లోని వస్త్రోత్పత్తిదారులకు ప్రయోజనం కలుగనుంది. 50 సాంచాల ఆసామికి 50శాతం విద్యుత్ సబ్సిడీ వస్తే సిరిసిల్ల ప్రాంతంలోని 90 శాతం వస్త్రోత్పత్తిదారులకు మేలు కలుగుతుంది. కేవలం వందలాది సాంచాలున్న పెద్దసేట్లకు మాత్రం 50 శాతం విద్యుత్ సబ్సిడీ వర్తించదు. అంటే.. చిన్న, మధ్యతరగతి ఆసాములు, వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. -
వాట్సాప్ పోస్టుతో బీఆర్ఎస్ నాయకుడిపై కేసు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా వాట్సాప్‌లో పోస్టు చేసిన బీఆర్ఎస్ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్ ఆదివారం తెలిపారు. చిన్నలింగాపూర్ మాజీ ఎంపీటీసీ బైరినేని రామును కించపరిచేలా రామచంద్రాపూర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్ వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేశారు. బైరినేని రాము ఫిర్యాదుతో శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌ను జిల్లా నాయకుడు బొల్లి రామ్మోహన్, మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, నాయకులు పరామర్శించారు. -
సివిల్స్ సాధించడమే లక్ష్యం
పెద్దపల్లిరూరల్: గ్రూప్–1 ఫలితాల్లో పెద్దపల్లి పట్టణానికి చెందిన పొందుగుల భూషిత్రెడ్డి 76వ ర్యాంకు ను సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన పొందుగుల విజయలక్ష్మి – భాస్కర్‌రెడ్డి దంపతుల కుమారుడు భూషిత్రెడ్డి.. సివిల్స్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఇన్‌కంట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించేందుకు ఓ వైపు పనిచేస్తూనే మరోవైపు కఠోర దీక్షతో చదువుతున్నారని తల్లిదండ్రులు విజయలక్ష్మి, భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
గ్రూప్–1లో మెరిసిన జిల్లావాసులు
కరీంనగర్: టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో కరీంనగర్‌కు చెందిన కన్నం హరిణి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంక్ సాధించింది. ఎస్సీ కమ్యూనిటీలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించింది. కరీంనగర్ విద్యానగర్‌లో నివాసం ఉంటున్న కన్నం రమేశ్ రామడుగు మండలం వెలిచాల జెడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యాయుడు. భార్య కళాప్రపూర్ణ జ్యోతి రామడుగు జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయురాలు. వీరిది సొంతూరు బోయినపల్లి మండలం అనంతపల్లి. వీరి కూతురు గ్రూప్–1 పరీక్ష రాయగా ఆదివారం వెలువడిన ఫలితాల్లో జోన్–1లో డిప్యూటీ కలెక్టర్ పోస్టు పొందేందుకు అర్హత సాధించింది. హరిణిని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బీటీఎఫ్ నాయకులు కొమ్ము రమేశ్, మానుపాటి రాజన్న, చిలుక దేవశంకర్, బెజగం రమేశ్, మానుపాటి రాజయ్య, మేకల స్వరూప అభినందించారు. ఎస్సీ కోటాలో హరిణికి మొదటి ర్యాంకు -
మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి
జగిత్యాలఅగ్రికల్చర్: మామిడి కొనుగోలు సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలో జగిత్యాల (చల్గల్)లోని మామిడి మార్కెట్లో మామిడి కొనుగోళ్లు ఎలా చేపట్టాలనే అంశంపై అనిశ్చితి నెలకొంది. వ్యాపారుల్లో ఓవర్గం ఓపెన్ (బహిరంగ వేలం) పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలని చూస్తుండగా.. మరోవర్గం కమీషన్ ప్రతిపాదికన చేయాలని భావిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనని మార్కెట్ అధికారులు సతమతం అవుతూ తాత్సారం చేస్తున్నారు. జూన్ వరకు కొనుగోళ్లు జగిత్యాల మామిడి మార్కెట్లో కొనుగోలు చేసిన బంగినపల్లి, దశేరీ, హిమాయత్ తదితర రకాల మామిడి కాయలు నాణ్యతగా ఉంటాయనే పేరుంది. ఇక్కడి కాయలకు ఢిల్లీ, నాగ్‌పూర్, చంఢీఘర్, హర్యానా, పంజాబ్, జమ్మూ, కాశ్మీర్, బంగ్లాదేశ్, దుబాయ్ వంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఆయా ప్రాంతాల వ్యాపారులు మామిడి సీజ న్ రాగానే ఈ ప్రాంతంపై వాలుతుంటారు. మామిడి మార్కెట్ సీజన్ ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభమై.. జూన్ మొదటి వారం వరకు ఉంటుంది. మామిడి మార్కెట్లో ఓ పద్ధతంటూ లేకపోవడంతో గతేడాది కొందరు వ్యాపారులు ఓపెన్మార్కెట్లో కొనుగోలు చేశారు. మరికొందరు కమీషన్ పద్ధతిలో కొన్నారు. ఈ సీజన్లో ఏ పద్ధతిలో కొనుగోలు చేస్తారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో వ్యాపారులు, అధికారులు, రైతుల్లో అయోమయం నెలకొంది. కమీషన్ పద్ధతిలో ఇలా.. మామిడి కొనుగోలుకు మార్కెట్ కమిటీ నుంచి వ్యాపారులు లైసెన్స్ తీసుకుంటారు. మార్కెట్లో షెడ్లు ఏర్పాటు చేసుకుని షెడ్లకు వచ్చిన కాయలను బట్టి ఎవరికి వారే కొనుగోలు చేస్తుంటారు. రైతులు తోటలోని నాలుగైదు కాయలను శాంపిల్‌గా తీసుకొచ్చి వ్యాపారులకు చూపింస్తుంటారు. వ్యాపారులు ఆ కాయల నాణ్యత, పరిమాణం బట్టి ధర నిర్ణయిస్తుంటారు. వ్యాపారులు చెప్పిన రేటు నచ్చితే రైతులు కాయలను తెంపుకొని వచ్చి విక్రయిస్తుంటారు. ఈ పద్ధతిలో రైతులకు అన్యాయం జరుగుతుందని కొందరు వాదిస్తున్నారు. మామిడి శాంపిల్స్ తీసుకొచ్చిన సమయంలో ఓ రేటు.. మొత్తం కాయలు తీసుకొచ్చిన తర్వాత తిరకాసు పెట్టి రేటు తగ్గిస్తున్నారని, దీంతో రైతులు ఏమీ చేయలేక ఏదో ధరకు విక్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా సూట్, రాటన్, క్యాష్ కటింగ్ పేర రైతులను ఇష్టారీతిన దోచుకుంటున్నారని అంటున్నారు. ఓపెన్ మార్కెట్లో ఇలా.. ఓపెన్ పద్ధతిలో కొనుగోళ్లు జరిపితే రైతులకు న్యాయం జరుగుతుందనేది మరికొందరి వాదన. ఈ పద్ధతిలో లోకల్ వ్యాపారులు కాకుండా ఢిల్లీ, నాగ్‌పూర్ వంటి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. తద్వారా వ్యాపారుల్లో పోటీ పెరిగి రైతులకు ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసిన కాయలను వెంటనే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం సాధ్యం కాదని, కాయలు చెడిపోతాయని చెబుతున్నారు. ఈ విధానంలో రైతుల నుంచి నాలుగు శాతం కమీషన్ కట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓపెన్ పద్ధతిలో కొనుగోళ్లు సాగితే మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తుంది. ఓపెన్ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్‌గా మారి రేటు తగ్గించే అవకాశం కూడా ఉందని, తాము కొనుగోలు చేయమని మొండికేస్తే కాయలను ఎక్కడికి తీసుకెళ్లి అమ్ముకోవాలనే దానిపై రైతులు ఆందోళన ఉంది. నిస్సాహాయ స్థితిలో అధికారులు మార్కెట్ నిబంధనల ప్రకారం మామిడి కొనుగోళ్లు ఓపెన్ పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలి. కొందరు రైతులు, వ్యాపారులు ఓపెన్ మార్కెట్‌ను వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు రైతులు, వ్యాపారులు కమీషన్ ప్రతిపాదిత మార్కెట్‌ను బలపరుస్తున్నారు. దీనికితోడు మార్కెట్ అధికారులు వ్యాపారులపై నిబంధనల ప్రకారం ఒత్తిడి తెస్తే రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు, చీవాట్లు. దీంతో రైతులు, వ్యాపారులు, రాజకీయ నాయకుల మధ్య మార్కెట్ అధికారులు నలిగిపోతూ ఏమి చేయలేని నిస్సాహాయ స్థితిలో ఉండిపోయారు. మామిడి మార్కెట్లో కఠిన నిబంధనలు అమలు చేస్తేనే మామిడి మార్కెట్ ఓ దారికి వచ్చే అవకాశం ఉంది. ఎవరి ఇష్టారీతిన వారు వెళ్తుండడంతో చివరకు రైతులు బలవుతున్నారు. ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరితో చర్చించి, ఇతర పండ్ల మార్కెట్ల మాదిరిగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని రైతులు చెబుతున్నారు. ఓపెన్ మార్కెటా..? కమీషన్ మార్కెటా..? అయోమయంలో మార్కెట్ అధికారులు ఆందోళనలో అన్నదాతలు, వ్యాపారులు నిబంధనలు అమలు చేయాలి మామిడి మార్కెట్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారడంతో మార్కెట్‌కు రావాలంటేనే రైతులు భయపడే పరిస్థితి ఉంది. ఎవరి ఇష్టానుసారం వారు కొనుగోళ్లు చేస్తూ చివరకు రైతులను బలిపశువును చేస్తున్నారు. – కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, మామిడి రైతు, మేడిపల్లి అమలు చేస్తాం మామిడి మార్కెట్లో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తాం. మామిడి మార్కెట్‌పై పూర్తి స్థాయిలో చర్చించేందుకు వ్యాపారులు, రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటాం. రైతులకు ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరుగకుండా చూస్తాం. – ప్రకాశ్, జిల్లా మార్కెట్ అధికారి -
సురక్షితం.. సులభతరం
కొత్తపల్లి(కరీంనగర్): ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం నూతన పుంతలు తొక్కుతోంది. ఆ సాంకేతికతను ప్రజలకు అందించేందుకు నిపుణులు విశేషంగా ప్రయత్నిస్తున్నారు. యూపీఐ, ఆన్లైన్ చెల్లింపులు సులభతరం అయ్యాయి. అందులో భాగంగానే విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం విద్యుత్ సంస్థ యాప్‌ను రూపొందించింది. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు రెవెన్యూను సమకూర్చుకునేందుకు ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. బిల్లుల చెల్లింపులో సమయం వృథా కావొద్దనే ఉద్దేశంతో టీజీఎన్పీడీఎల్ యాప్‌ను రూపొందించింది. కొన్నేళ్లుగా ఈ యాప్ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వినియోగదారులు ఆశించినస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రస్తుతం యాప్‌ను విద్యుత్ సంస్థ మరింతగా అభివృద్ధి చేసింది. నెలవారి విద్యుత్ బిల్లులు యాప్ ద్వారా సురక్షింగా, సౌకర్యవంతంగా, సులభంగా చెల్లించవచ్చు. ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ వర్సన్ యాప్‌ను ఆండ్రాయిడ్ వెర్షన్లో డెవలప్ చేసింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు కలిగిన వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీజీఎన్పీడీసీఎల్ యాప్‌లోకి వెళ్లి వినియోగదారుని యూనిక్ సర్వీస్ నంబర్ నమోదు చేసుకొని బిల్లు చెల్లించవచ్చు. ఈ విధంగా ప్రతి నెల జెనరేట్ అయ్యే బిల్లు తాలుకు సమాచారం ఆటోమేటిక్ వస్తుంది. ఇది ఇంట్లోనే ఉండి కేవలం రెండునిమిషాల వ్యవధిలో చెల్లించవచ్చు. ఇప్పటి వరకు కరీంనగర్ సర్కిల్లో 1,27,339మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. తద్వారా రూ.1327.84 లక్షల చెల్లింపులు ఆన్లైన్ ద్వారా జరిగాయి. ఆన్లైన్ చెల్లింపులు చేయండి వినియోగదారులు విద్యుత్ బిల్లులను ఆన్లైన్ ద్వారా చెల్లించి సమయం ఆదా చేసుకోవాలి. మెరుగైన విద్యుత్ అందించేందుకు సంస్థకు సహకరించాలి. వేసవిలో బయటకు రాకుండా, కూలైన్లో నిలబడి సమయం వృథా చేసుకోకుండా ఇంటి వద్దే సురక్షితంగా యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించండి. – మేక రమేశ్‌బాబు, ఎస్ఈ కరీంనగర్ సర్కిల్ విద్యుత్‌శాఖలో డిజిటల్ చెల్లింపులు సులభతరంగా ఆన్లైన్ చెల్లింపులు టీజీఎన్పీడీసీఎల్ యాప్ రూపొందించిన సంస్థ సమయం ఆదా.. ఎక్కడి నుంచైనా చెల్లించే అవకాశం -
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ: రాజన్నను ఆదివారం ఉగాది సందర్భంగా దాదాపు 15వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల ఏర్పాట్లను ఈవో వినోద్‌రెడ్డి, ఏఈవో శ్రీనివాస్, శ్రవణ్, అశోక్, పర్యవేక్షకులు పరిశీలించారు. వేములవాడ: హరిహర క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీసీతారామచంద్రస్వామి నవరాత్రోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాతం, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 6న స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్ ఆధ్వర్యంలో బారీకేడ్ల పనులు చేస్తున్నారు. వసంత నవరాత్రోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి కోరారు. -
అగ్ని ప్రమాదంలో రూ.2.50 లక్షల ఆస్తి నష్టం
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన బేతి లక్ష్మారెడ్డి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. లక్ష్మారెడ్డి ఇంట్లో ఆల్ ఆవుట్ పెట్టి డోర్లు మూసి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఆల్ ఆవుట్ ఫ్లగ్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో ఉన్న బట్టలతో పాటు నిత్యావసర సామగ్రి బియ్యం, నువ్వులు, రూ.60వేల పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలు ఆర్పివేశారు. సుమారు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. రాజన్న ఆలయ అర్చకుడికి ఉగాది పురస్కారంవేములవాడ: విశ్వావసు నామ సంవత్సరం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆలయాల అర్చకులకు ఉగాది పురస్కారాలు అందజేసింది. రాజన్న ఆలయ ఉపప్రధాన అర్చకుడు కటుకూరి వెంకన్న, వేదపారాయణదారు జగన్మోహన్లకు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ శాలువతో సత్కరించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసు పాలకుర్తి(రామగుండం): ముంజంపల్లి గ్రామశివారులో ఇసుకను అక్రమంగా నిల్వచేస్తున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామి తెలిపారు. గోదావరి నదీపరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తీసుకువచ్చి ఎండపల్లి మండలం ముంజంపల్లి శివారులో నిల్వ చేస్తున్నారు. రాత్రివేళల్లో లారీల ద్వారా హైదరాబాద్, జగిత్యాల జిల్లాల్లోకి తరలించి విక్రయిస్తున్నారు. ఈమేరకు అందిన సమాచారంతో పోలీసులు ఇసుక స్థావరాలపై దాడిచేశారు. జేసీబీ, రెండు టిప్పర్లను సీజ్ చేశారు. ఈదందా నిర్వహిస్తున్న బుర్రి మహిపాల్, ముంజాల సురేశ్, తనుగుల తిరుపతి, తనుగుల సురేశ్, వాసం సతీశ్‌తోపాటు గుమ్ముల రాజేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
అవగాహన కల్పించాలి
గిరివికాసం పథకం గురించి గిరిజనులకు పూర్తి వివరాలు తెలియ దు. అధికారులు ఎవరూ గిరిజనుల పల్లెల్లో అవగాహన కల్పించడం లేదు. దీంతో అర్హులైన వారు పథకానికి దూరమవుతున్నారు. గిరిజనశాఖ అధికారులైన అవగాహన కార్యక్రమాలు పెట్టి మా కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించాలి. – రాజునాయక్, బంజార సంఘం జిల్లా నాయకుడుపథకం గురించి తెలియదు మా భూముల్లో గవర్నమెంట్ బోర్లు వేయిస్తుందనే సంగతి మాకు తెలియదు. అధికారులు ఎవరూ వచ్చి చెప్పడం లేదు . ఏళ్లుగా సాగునీరు లేక మా భూములు పడావుగా ఉన్నాయి. ఈ పథకంతో సాగు చేసుకుందామనుకుంటే ఎట్లా దరఖాస్తు చేసుకోవాలో తెలియదు. సార్లు చెప్పితే దరఖాస్తు చేసుకుంటాం. – ధరావత్ కల్యాణ్, దేవునిగుట్ట తండా -
ఏసీపీ కొడుక్కు 80వ ర్యాంకు..
● ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పాలకుర్తి సందీప్ కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ పాలకుర్తి కాశయ్య కుమారుడు పాలకుర్తి సందీప్ గ్రూప్–1 ఫలితాల్లో 80వ ర్యాంకు సాధించాడు. కరీంనగర్లో ఇంటర్ వరకు చదివి, తమిళనాడులో అగ్రికల్చర్ బీఎస్సీ, రాజేంద్రనగర్‌లోని జయశంకర్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన సందీప్ అగ్రికల్చర్ ఆఫీసర్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఏవోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే తపనతో తల్లిదండ్రులు భాగ్యలక్ష్మీ, కాశయ్య సూచనలు, ప్రోత్సాహంతో గ్రూప్–1 ఉద్యోగానికి ప్రిపేర్ అయి విడుదలైన ఫలితాల్లో 80 ర్యాంకు సాధించాడు. సందీప్ సోదరుడు సంజయ్ అమెరికాలో పీహెచ్డీ చేస్తుండగా.. సోదరి సింధు చైన్నెలో ఎంబీబీఎస్ హౌజ్ సర్జన్ చేస్తోంది. సందీప్‌కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఆయిల్‌పామ్ వైపు మెట్ట రైతులు
● సాంప్రదాయ పంటలు వీడి నూతన సాగు ● రైతులకు కలిసొస్తున్న తోటలు ఇల్లంతకుంట(మానకొండూర్): మెట్టప్రాంతం ఇల్లంతకుంట మండలంలోని రైతులు ఆయిల్‌పామ్ సాగుతో లాభాల బాట పడుతున్నారు. ఇన్నాళ్లు సాంప్రదాయ పంటలైన వరి, కూరగాయలు, పత్తి సాగు చేసిన రైతులు.. కొందరు కొత్తగా ఆయిల్‌పామ్ సాగు వైపు మళ్లారు. మండలంలోని ఇల్లంతకుంట, దాచారం, పెద్దలింగాపూర్, పొత్తూరు, గాలిపల్లి, వల్లంపట్ల, రేపాక గ్రామాల పరిధిలో 320 ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఎకరానికి 50 మొక్కలు ఇల్లంతకుంట మండలంలోని దాదాపు 320 ఎకరాలలో ఆయిల్‌పామ్ తోటలు సాగు చేస్తున్నారు. ఒక ఎకరంలో 50 మొక్కలు నాటుతారు. ఒక మొక్క ధర రూ.193 ఉండగా రైతు చెల్లించేది రూ.20 మాత్రమే. 14 నెలల వయసు ఉన్న ఆయిల్‌పామ్ మొక్కలు రైతులకు ఉద్యానశాఖ అధికారులు సరఫరా చేస్తారు. మొక్క నాలుగేళ్ల వయస్సు వచ్చినప్పటి నుంచి దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. మూడేళ్ల వరకు ఆయిల్‌పామ్ తోటలో అంతరపంటలు సాగు చేసుకునే అవకాశం కూడా ఉంది. పంట విత్తినప్పటి నుంచి నాలుగేళ్ల వరకు ఎరువుల కోసం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎకరానికి ఏటా రూ.4.200 చెల్లిస్తారు. పంటకు డ్రిప్ సిస్టం ద్వారా సాగునీటిని అందించాల్సి ఉంటుంది. పంటకు డ్రిప్ పద్ధతి కోసం అవసరమైన పైపులను ఉద్యానశాఖ సబ్సిడీ రుణం మంజూరు చేస్తుంది. డ్రిప్ కోసం ఇచ్చే రుణంలో ఓసీలు, బీసీలకు 80 శాతం చొప్పున, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఏడాది పొడగున నెలకోసారి పంట చేతికొస్తుంది. ఎకరానికి 8 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ధర ఒక టన్నుకు రూ.20,800 ఉంటుందని ఇల్లంతకుంట మండల ఉద్యానశాఖ క్లస్టర్ ఆఫీసర్ వినయ్ తెలిపారు. మండల కేంద్రంలోని ఆయిల్‌పామ్‌ను అమ్ముకునే సౌలభ్యం ఉందని క్లస్టర్ అధికారి పేర్కొన్నారు. లాభసాటిగా ఉండడంతో రైతులు ఆయిల్‌పామ్ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. వరిసాగులో ఉన్నంత కష్టం లేదు వరిసాగు కంటే ఆయిల్‌పామ్ సాగు సులభం. వరిసాగు కంటే తక్కువ నీరు అవసర పడుతుంది. సాగుచేసి నాలుగేళ్లు అవుతుంది. పంట రావడం ఇప్పుడిప్పుడే మొదలైంది. నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. వరి సాగులో పడ్డంత కష్టం అవసరం లేదు. – కడుదుల పద్మ, మహిళా రైతు, వల్లంపట్ల ముందుకొస్తున్నారు ఆయిల్‌పామ్ సాగులో ప్రభు త్వ ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండడంతో రైతులు ము ందుకొస్తున్నారు. మండలంలో 320 ఎకరాల్లో సాగవుతు ంది. వరికి అవసరమైనంత నీరు ఆయిల్‌పామ్‌లో అవసరం లేదు. పని కూడా చాలా తక్కువగా ఉంటుంది. – సురేష్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి, ఇల్లంతకుంట -
గాయపడ్డ ఆశకార్యకర్తలకు పరామర్శ
ఇల్లంతకుంట(మానకొండూర్): లెప్రసీ సర్వే విధులు ముగించుకొని ఆటోలో ఇంటికొస్తుండగా ప్రమాదబారిన పడ్డ ముగ్గురు ఆశ కార్యకర్తలను వైద్యాధికారులు ఆదివారం పరామర్శించారు. రహీంఖాన్‌పేట హెల్త్ సబ్‌సెంటర్ పరిధిలోని ఆశకార్యకర్తలు మచ్చ పద్మ, బట్టి తార, దొంతి ఎల్లవ్వ వెల్జీపురంలో లెప్రసీ సర్వే కోసం శనివారం వెళ్లి తిరిగి వస్తుండగా ఎర్రనర్సుపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. చేయి విరిగి ఇంటి వద్దనే ఉన్న మచ్చ పద్మను, దొంతి ఎల్లవ్వను, బట్టి తారలను స్థానిక వైద్యాధికారి జీవనజ్యోతి, హెచ్‌ఈవో వెంకటరమణ, సూపర్వైజర్ శోభ, ఏఎన్ఎం స్వరూప పరామర్శించారు. కురుమ హాస్టల్‌కు స్థలం కేటాయించాలి బోయినపల్లి(చొప్పదండి): జిల్లా కేంద్రంలో కురుమ హాస్టల్, కురుమసంఘం భవనాల నిర్మాణాలకు ఐదెకరాలు కేటాయించాలని జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, నాయకులు సంబ లక్ష్మీరాజం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నవించారు. కురుమ, గొల్ల సామాజికవర్గాలు ఒకటి కాదని నిర్ధారణ చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. పాస్టర్ ప్రవీణ్‌ను హత్య చేసిన వారిని శిక్షించాలి సిరిసిల్ల: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో హత్యకు గురైన పాస్టర్ పగడాల ప్రవీణ్ హంతకులను శిక్షించాలని కోరుతూ సిరిసిల్లలో పాస్టర్లు ఆదివారం ర్యాలీ తీశారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. మాలమహానాడు రాష్ట్ర నాయకుడు రాగుల రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, పాస్టర్లు మనోహర్, గోవర్ధన్, మోసే, శ్యామ్యూల్, ఏసుదాసు, ప్రేమ్ పాల్గొన్నారు. -
గుండారంలో తాగునీటి తండ్లాట
● రోడ్డెక్కిన తండావాసులు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని ప్రజాపాలన పైలట్ గ్రామం గుండారం గ్రామపంచాయతీలో తాగునీటి తండ్లాట మొదలైంది. ఉగాది పండుగ రోజు నీళ్లు లేకపోవడంతో పోచమ్మ తండావాసులు డ్రమ్ములు, బకెట్లు, బిందెలు రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు. తమ తండాలో 15 రోజులుగా సుమారు 16 ఇండ్లకు తాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామపంచాయతీ కార్యదర్శి దేవరాజును వివరణ కోరగా కొన్ని రోజులుగా ఆ తండాలో తాగునీటి ఇబ్బంది ఉందన్నారు. అందుకోసం మిషన్ భగీరథ నీటికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్‌తో నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. సమస్య గురించి తెలుసుకొని ట్యాంకర్‌తో నీళ్లను అందిస్తామన్నారు. ట్యాంకర్‌తో నీళ్లను అందించకుండా శాశ్వత పరిష్కారం చూపాలని తండావాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరి నిరసనకు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొదావత్ రవీందర్‌నాయక్ మద్దతు తెలిపారు. మూడు రోజుల్లోగా నీటి సమస్య పరిష్కరించకపోతే మండల పరిషత్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
పాఠశాల భవనం నిర్మించాలి
ఆరెపల్లిలో ప్రభుత్వ పాఠశాల ముంపునకు గురైంది. ప్రస్తుతం అద్దె గదిలో నడుస్తోంది. ఇప్పటికై నా అధికారులు పట్టించుకొని ముంపునకు గురైన పాఠశాలకు పరిహారం అందించి, స్థలం కేటాయించి నూతన భవనం నిర్మించాలి. – సిలివేణి ప్రశాంత్, ఆరెపల్లి ఆలయాల పరిహారం అందించాలి ఆరెపల్లిలో ముంపునకు గురైన హనుమాన్, పోచమ్మ ఆలయాల పరిహారం అందించాలి. పరిహారం అందిస్తే కొత్తగా ఆలయాలు నిర్మించుకుంటాం. – ఎస్.అరవింద్, ఆరెపల్లి -
గుడి.. బడిని మరిచారు
● పరిహారం రాక అద్దె భవనంలోనే స్కూల్ ● అద్దె చెల్లిస్తున్న మాజీ ప్రజాప్రతినిధి ● మిడ్‌మానేరు ముంపు గ్రామంలో అద్దె భవనంలోనే స్కూల్ ● పక్కా భవనం లేక ఇబ్బందులువేములవాడఅర్బన్: మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారం అందించినా అధికారులు.. గుడి, బడిని మరిచారు. మధ్యమానేరు నిర్వాసిత గ్రామం వేములవాడ మండలం ఆరెపల్లిలోని గృహాలతోపాటు ప్రభుత్వ పాఠశాల ముంపునకు గురైంది. అప్పటి అధికారులు పాఠశాలకు నోటిఫికేషన్ అవార్డు చేశారు. కానీ పరిహారం అందలేదు. ఆర్అండ్ఆర్ కాలనీలో పాఠశాలకు పక్కా భవనం నిర్మించలేదు. బడికి, గుడికి పరిహారం అందక పక్కా భవనాలు కరువయ్యాయి. అద్దె చెల్లిస్తున్న మాజీ ప్రజాప్రతినిధి గ్రామంలో పాఠశాల మూతబడితే మళ్లీ తెరుచుకోదనే ఉద్దేశంతో మాజీ సర్పంచ్ ఇటుకల నవీనరాజు అద్దె ఇంటిని తీసుకున్నారు. స్కూల్ నిర్వహణకు ఇంటి అద్దెను మాజీ సర్పంచ్ ఆరేళ్లుగా భరిస్తున్నారు. ప్రతీ నెల రూ.2వేల చొప్పున గత ఆరేళ్లుగా చెల్లిస్తూ స్కూల్ నిర్వహణకు సహకరిస్తున్నారు. ముంపునకు గురైన ప్రభుత్వ పాఠశాలకు పరిహారం అందించి, అన్ని హంగులతో నూతన భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేములవాడ మండలంలోని మిడ్‌మానేరు ముంపు గ్రామాలైన సంకెపల్లి, అనుపురం, కొడుముంజ, రుద్రవరం, చింతల్‌ఠాణా, చీర్లవంచ, శాభాష్‌పల్లి గ్రా మాల్లో ముంపునకు గురైన పాఠశాలల స్థానంలో నూతనంగా స్కూల్ భవనాలు నిర్మించారు. కానీ ఆరెపల్లిలో మాత్రం స్కూల్ భవనం గురించి పట్టించుకోవడం లేదు. ఆలయాలకు పరిహారం అందలేదు ఆరెపల్లి గ్రామంలోని శ్రీహనుమాన్ ఆలయం, పోచమ్మ ఆలయం ముంపునకు గురైంది. అప్పటి అధికారులు నోటిఫికేషన్ అవార్డు చేసి వదిలేశారు. నష్టపరిహారం మాత్రం అందించలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అప్పటి ప్రభుత్వంలో గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని గ్రామస్తులు చందాలు వేసుకొని హనుమాన్, పోచమ్మ ఆలయాలు నిర్మించుకున్నారు. ఇప్పటికైనా ఆ ఆలయాల పరిహారం అందిస్తే ప్రస్తుత ఆలయాలను మరింత అభివృద్ధి చేసుకుంటామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. -
భూములు బీళ్లుగానే..
● గిరివికాసంపై అవగాహన కరువు ● ప్రచారం చేయని అధికారులు ● పథకం గురించి తెలియక నష్టపోతున్న గిరిజనులు ● జిల్లాలో ఇప్పటి వరకు 7 యూనిట్లే మంజూరు ● ఇందులోనూ ఇద్దరి బిల్లులు పెండింగ్ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరివికాసం క్షేత్రస్థాయిలో సరిగా అమలుకావడం లేదు. 2018లో ప్రవేశపెట్టిన ఈ పథకంలో ఇప్పటి వరకు ఏడు యూనిట్లు మాత్రమే మంజూరుకావడం దీనికి నిదర్శనం. జిల్లాలో గిరి వికాసం పథకం అమలుతీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పథకం అమలు ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం 2018లో ముఖ్యమంత్రి గిరివి కాసం(సీఎంజీవీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజనుల భూములను సాగులోకి తేవడం ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా ఇద్దరు ఆపైన గిరిజన రైతులు కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడితే ఐదు ఎకరాలు ఆపైన భూములకు ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఆ భూములను సాగులోకి తేవడానికి ఉచితంగా బోరుబావి తవ్వించడం, మోటార్ బిగించడం, విద్యుత్ కనెక్షన్ ఇప్పించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కోసం డీఆర్డీఏ ఆఫీస్‌లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును వారు స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి సర్వే కోసం పంపిస్తారు. మండల కమిటీలోని అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులా.. కాదా.. అని నిర్ణయిస్తే అప్పుడు యూనిట్ మంజూరవుతుంది. ఏడేళ్లలో ఏడు యూనిట్లే ! ముఖ్యమంత్రి గిరివికాసం పథకాన్ని ప్రవేశపెట్టి ఏడేళ్లు గడుస్తుండగా ఏడు యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. ఇందులో ఇంకా ఇద్దరికి బి ల్లులు మంజూరు కావాల్సి ఉంది. పథకం గురించి క్షేత్రస్థాయిలో గిరిజనులకు అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడం లేదు. గిరిజ నశాఖ అధికారులు తండాల్లో ఎలాంటి అవగాహ న కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో వారి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి తెలియడం లేదు. పథకం ఉన్నట్లు తెలిసినా ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏయే ఆఫీ స్లలో కలవాలి.. అనే విషయాలు తెలియక గిరి జనులు లబ్ధి పొందలేకపోతున్నారు. ఫలితంగా గిరిజనుల భూములు బీళ్లుగానే మిగిలిపోతున్నాయి. -
శుభప్రదం విశ్వావసు
వేములవాడ/సిరిసిల్లటౌన్/సిరిసిల్లకల్చరల్: తెలుగు నవవత్సరం శ్రీ విశ్వావసులో ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లుతారని సిద్ధాంతులు, పంచాంగకర్తలు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఉగాది పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం ఆలయాల్లో పూజలు చేశారు. సాయంత్రం పంచాంగ శ్రవణానికి హాజరయ్యారు. వేములవాడ రాజన్న ఆలయంలోని ఓపెన్‌స్లాబ్‌లో ఆలయ ప్రధాన అర్చకుడు చంద్రగిరి శరత్‌శర్మ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పండితులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రాజన్నను కోరుకున్నారు. అంతకుముందు స్వామి వారిని దర్శించుకున్నారు. సిరిసిల్ల వెంకన్న క్షేత్రం, మార్కండేయ ఆలయం, శివసాయిబాబా, వాసవీ కన్యకాపరమేశ్వరీ, బీవైనగర్ భక్తాంజనేయ, విద్యానగర్ అభయాంజనేయస్వామి, నెహ్రూనగర్ హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పండితులతో పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణ ప్రముఖులు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ● భక్తిశ్రద్ధలతో ఉగాది సంబురాలు ● ఆలయాల్లో పచ్చడి వితరణ, పంచాంగ పఠనం -
వస్త్ర పరిశ్రమపై కక్ష సాధిస్తున్నారు
సిరిసిల్లటౌన్: సంక్షోభాన్ని అధిగమించే దశలో ఉన్న సిరిసిల్ల వస్త్రపరిశ్రమపై సెస్ పాలకవర్గం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని పరిశ్రమ, అనుబంధ రంగాల జేఏసీ ప్రతినిధులు కోరారు. సిరిసిల్ల చేనేత, వస్త్రవ్యాపార సంఘం భవనంలో ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా నాలుగు రోజులుగా బ్యాక్‌బిల్లింగ్ సాకుతో పట్టణంలో 250 విద్యుత్ కనెక్షన్లు తొలగించారన్నారు. సెస్ మనుగడ వస్త్రపరిశ్రమపై ఉందన్న విషయాన్ని విస్మరించొద్దన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సబ్సిడీ బి ల్లులు రూ.60కోట్లకు పైగా ఉన్నా ఏనాడూ ప్రభుత్వాన్ని సెస్ పాలకవర్గం అడుగలేదన్నారు. ఇప్పటికై నా సెస్ పాలకవర్గం తమ పద్ధతి మార్చుకో వాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జేఏసీ ముఖ్య నాయకులు తాటిపాముల దామోదర్, పంతం రవి, ఆడెపు భాస్కర్, ఆంకారపు రవి, గౌడ రాజు, బండారి అశోక్, ఏనుగుల ఎల్లప్ప, దూడం శంకర్, గోవిందు రవి, సామల అశోక్, మండల బాలరాజు పాల్గొన్నారు. వస్త్రపరిశ్రమ జేఏసీ ప్రతినిధులు -
ఉచితం అంటూనే వసూలు
● ఒక్కొక్కరికి రూ.వేయి ● కనీస సౌకర్యాలు కరువు ● సిరిసిల్ల ‘సెరాలైఫ్’కు క్యూ కడుతున్న వృద్ధులు ● డిగ్రీ చేసిన యువకుడే వైద్యుడుసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో వృద్ధులు, ఒళ్లునొప్పులతో బాధపడే వారు టార్గెట్‌గా శాసీ్త్రయత లేని వైద్యసేవలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం అంటూ ప్రచారం చేస్తూ ‘సెరాలైఫ్’ సంస్థ పది బెడ్లు వేసి ఓ ఇంటిలో వైద్యం చేస్తోంది. కర్ణాటకకు చెందిన డిగ్రీ చదివిన యువకుడు ఇక్కడ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఒక్క చికిత్సతో ఐదు రకాల ప్రభావాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆక్యుప్రెషర్ పరికరాలను పదింటిని ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు. ‘సెరాలైఫ్’ ప్రచారంతో జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వందలాది మంది వృద్ధులు, మహిళలు నిత్యం ఉదయం 6 గంటల నుంచే జిల్లా కేంద్రంలోని పెద్ద బజారుకు చేరుకుంటున్నారు. రోడ్డుపైనే క్యూ కడుతున్నారు. అక్కడికి వచ్చిన వారికి కనీసం తాగునీటి వసతి, మరుగుదొడ్లు లేవు. క్యూ పద్ధతిలో చూపించేందుకు వచ్చిన వారి చేతులపైనే నంబరు రాయడం గమనార్హం. అన్ని నొప్పులకు ఒక్కటే చికిత్స ! వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, రక్తపోటు(బీపీ), మధుమేహం (షుగర్), ఆస్తమా, స్ట్రోక్, మైగ్రేన్, అధిక వెన్నునొప్పి, చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్, రుమటిజం, హెర్నియా వంటి పలు రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఉచితం పేరిట రూ.వేయి వసూలు ఉచిత వైద్యం అంటూనే ఒక్కొక్కరి వద్ద రూ.వేయి వసూలు చేస్తున్నారు. రూ.వేయి తీసుకుని ఓ కార్డు ఇస్తూ మూడు నెలల వరకు ఉచిత వైద్యం చేస్తామని చెబుతున్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.10 వసూలు చేస్తున్నామని చెబుతూ.. వందలాది మందిని సభ్యులుగా చేర్పించారు. ఇప్పటికే సిరిసిల్ల ‘సెరాలైఫ్’లో 300 మంది రూ.వేయి చొప్పున చెల్లించారు. అంటే రూ.3లక్షల వరకు ఇప్పటికే వసూలుకాగా.. ఇంకా కొత్త సభ్యులు చేరుతూనే ఉన్నారు. ‘సెరాలైఫ్’ సెంటర్‌కు వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నుంచి అనుమతి లేకపోవడం గమనార్హం. ఆక్యుప్రెషర్ పేరిట బెడ్స్ వేసి అందిస్తున్న వైద్యసేవల ఫొటోలు తీసేందుకు ‘సాక్షి’ ప్రయత్నిస్తే నిర్వాహకులు నియంత్రించారు. సిరిసిల్లలో సాగుతున్న ఆక్యుప్రెషర్ వైద్యంపై జిల్లా అధికారులు దృష్టిసారించి వాస్తవికతను బహిరంగ పరచాల్సిన అవసరం ఉంది. సమయం: ఉదయం 7.30 గంటలు స్థలం: సిరిసిల్ల పెద్దబజారు.. హన్మాండ్ల గుడి వద్ద అంశం: ‘సెరాలైఫ్’ సంస్థ ఆక్యుప్రెషర్ వైద్యం ప్రత్యేకత: వైద్యవిద్యలో ఎలాంటి డిగ్రీ లేకున్నా.. పది మంచాలు వేసి వైద్యసేవలు విశేషం: ఉచిత చికిత్స అంటూ ప్రచారం.. ఒక్కొక్కరి వద్ద రూ.వేయి వసూలు కొసమెరుపు : ఆరోగ్యం.. ప్రేమ.. సేవ అంటూ కరపత్రాలు.. అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికి కూర్చోను కుర్చీలు లేవు.. నిల్చోను నీడ లేదు.కార్డుకే రూ.వేయి తీసుకుంటున్నాం ‘సెరాలైఫ్’ సెంటర్‌కు వచ్చే వారికి కార్డు ఇచ్చి రూ.వేయి తీసుకుంటున్నాం. ఈ కార్డు మూడు నెలల వరకు పనిచేస్తుంది. కామారెడ్డి, హైదరాబాద్‌లోనూ మా సెంటర్లు ఉన్నాయి. ఉచిత బస్సు కావడంతో చాలా మంది వృద్ధ మహిళలు పొద్దున్నే వచ్చి రోడ్డుపై కూర్చుంటున్నారు. మా సెంటర్లో ఇంతకంటే వసతి కల్పించే పరిస్థితి లేదు. – కృష్ణ, సెరాలైఫ్ నిర్వాహకుడు, సిరిసిల్ల -
ఆడిటింగ్‌కు సిద్ధంగా ఉండాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఈనెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో జిల్లాలోని అన్ని గ్రామాల సంఘాల పుస్తకాలు రాసి ఆడిటింగ్‌కు సిద్ధంగా ఉండాలని ఐకేపీ డీపీఎం పద్మయ్య సూచించారు. మండల కేంద్రంలోని కావేరి మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం వీఏవోలతో సమావేశమయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన పద్మయ్య మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో ఆర్థిక లావాదేవీలపై మహాసభలు ఏర్పాటు చేయాలన్నారు. మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారంపై మహిళలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీఎం మల్లేశం, మండల సమాఖ్య అధ్యక్షురాలు బైరి జ్యోతి, కార్యదర్శి మీన, కోశాధికారి రమ, సీసీలు మంగ్యానాయక్, దేవేందర్, నాగరాజు, సుధాకర్, రమణ, పద్మ పాల్గొన్నారు. ● ఐకేపీ డీపీఎం పద్మయ్య -
లింగనిర్ధారణ తీవ్ర నేరం
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజితసిరిసిల్ల: గర్భిణులకు స్కానింగ్ చేసి గర్భంలోని బిడ్డ లింగ నిర్ధారణ చేయడం తీవ్రమైన నేరమని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో శుక్రవారం పీసీపీఎన్డీటీ సలహా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో ఫామ్ ఆడిట్లను ప్రతీనెల ప్రోగ్రాం ఆఫీసర్ తనిఖీ చేస్తారని, ధరల పట్టిక, ఇతర సర్టిఫికెట్లను గోడలపై ప్రదర్శించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ చేయరాదని, అబార్షన్లు చేయవద్దన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలినా ఆల్ఫ్రెడ్, గైనకాలజిస్ట్ డాక్టర్ శోభారాణి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, లీగల్ అడ్వయిజర్ శాంతిప్రకాశ్ శుక్లా, మానేరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ చింతోజు భాస్కర్, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్ఈ బాలయ్య పాల్గొన్నారు. -
రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలి
● మంత్రి తుమ్మలను కలిసిన కవ్వంపల్లి ఇల్లంతకుంట(మానకొండూర్): రాయితీపై వ్యవసాయ పనిముట్లు రైతులకు అందించాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం సచివాలయంలో కలిసి ఈమేరకు విన్నవించారు. మానకొండూరు నియోజకవర్గంలోని సాగునీటి సమస్య గల మండలాలకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సేద్యం చేసుకొనుటకు కావలసిన వ్యవసాయ పరికరాలు రాయితీపై అందించాలని కోరారు. వివరాల నమోదుకు సహకరించాలి ● ఏడీఏ రత్నాకర్ ముస్తాబాద్(సిరిసిల్ల): వివరాల నమోదుకు చేపట్టిన డిజిటలైజేషన్‌కు రైతులు సహకరించాలని వ్యవసాయ సహాయ సంచాలకుడు రత్నాకర్ కోరారు. ముస్తాబాద్ మండలం చీకోడు, మోహినికుంటల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు నమోదుపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఏడీఏ మాట్లాడుతూ రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్కులతోపాటు ఆధార్ ద్వారా డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టిందని తెలిపారు. దీని ద్వారా రైతులకు ప్రత్యేక గుర్తింపుకార్డును ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతుభరోసా, రుణమాఫీకి దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. రైతు విశిష్ట సంఖ్యను పొందుటకు ఆధార్, పాస్బుక్కు, ఫోన్‌నంబర్లను సమీపంలోని వ్యవసాయ అధికారులకు అందజేసి నమోదు చేసుకోవాలని కోరారు. మండల వ్యవసాయాధికారి దుర్గ రాజు, ఇతర అధికారులు రెబల్సన్, చిరంజీవి, నరేశ్ పాల్గొన్నారు. కరెంట్ కనెక్షన్లు తొలగించొద్దు వీర్నపల్లి(సిరిసిల్ల): అధిక బకాయిలు ఉన్నాయనే కారణంతో కరెంట్ కనెక్షన్లు తొలగించొద్దని కోరుతూ వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామస్తులు శుక్రవారం సెస్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ గతంలో పనిచేసిన సెస్ అధికారి నిర్లక్ష్యంతోనే గ్రామంలో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని, ఇప్పుడు వాటిని చెల్లించాలంటూ కరెంట్ కనెక్షన్లు తొలగించడం సరికాదన్నారు. అనంతరం సెస్ ఏఈ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజాసంఘాల నాయకులు మల్లారపు అరుణ్‌కుమార్, జాలపెల్లి మనోజ్‌కుమార్, గ్రామస్తులు రాజవ్వ, పద్మ, దేవవ్వ, పూర్ణిమ, వనిత, ఎల్లవ్వ, పుష్ప, మంజుల, రాజవ్వ, ప్రకాశ్, క్రాంతి, జాషువా, కార్తీక్, మనోభిషేక్, విష్ణు రాబిన్సన్ పాల్గొన్నారు. డాక్టర్ పోస్టుల ఖాళీల భర్తీ సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రి, గంభీరావుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తామని జిల్లా వైద్య విధాన పరిషత్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.పెంచలయ్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వేములవాడ ప్రాంతీయ వైద్యశాలలో ఖాళీగా ఉన్న రెండు గైనకాలజిస్ట్, మూడు డ్యూటీ డాక్టర్ పోస్టులు, గంభీరావుపేట సీహెచ్‌సీలో జనరల్ ఫిజీషియన్ లేదా పిల్లల వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వేతనం నెలకు స్పెషలిస్ట్ డాక్టర్‌కు రూ.లక్ష, జనరల్ డాక్టర్లకు రూ.52,351 చెల్లిస్తారని వివరించారు. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతో ఏప్రిల్ 2న కలెక్టరేట్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. -
ఆత్మహత్య.. హత్య!
● దారుణాలకు దారితీస్తున్న కులాంతర ప్రేమలు ● కలకలం రేపుతున్న ప్రేమికుల హత్యలు, ఆత్మహత్యలు ● తాజాగా సాయికుమార్‌ను వెంటాడి నరికి చంపిన వైనం ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఉత్తరాది కల్చర్ ● మరోసారి పరువు హత్యలపై జోరుగా చర్చసాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలి గిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి హత్యల వరకు దారితీస్తున్నా యి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం. పంతాలతో కుటుంబాలు నాశనం సామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది. ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. 2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది. 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది. 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది. 2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది. -
● రేషన్‌కార్డు నిబంధనతో అనర్హత ● దరఖాస్తులోనే చుక్కెదురు ● అందని ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాలు ● రేషన్‌కార్డు అర్హత తొలగించాలని డిమాండ్
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాసంతో స్వయం ఉపాధి పొందాలనుకున్న నిరుద్యోగ యువతకు నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు రాని చాలా మంది యువత ఈ పథకంతో స్వయ ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుందామని ఆశపడితే ఆ స్కీమ్ నిబంధనలతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. రేషన్‌కార్డు నిబంధన తొలి అవరోధంగా మారింది. ఏప్రిల్ 4వ తేదీతో గడువు ముగియనుండడంతో చాలా మంది అర్హత కోల్పోతున్నారు. రేషన్‌కార్డు నిబంధన తొలగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కొత్తకార్డులకు మోక్షం ఎప్పుడో.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే ప్రజాపాలనలో వేలాది మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసి ఏడాది గడిచినా కొత్త రేషన్‌కార్డు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం సైతం పదేళ్లుగా రేషన్‌కార్డుల జారీ, ఉన్న కార్డులో పేర్ల నమోదు చేపట్టలేదు. దీంతో కొత్తగా పెళ్లయిన దంపతులకు రేషన్‌కార్డు లేకపోగా, కార్డులు ఉన్న వారికి సంతానం కలిగితే వారి పేర్లు యాడ్ కావడం లేదు. ఇక కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయల చుట్టూ తిరుగుతున్నారు. బీసీ కార్పొరేషన్‌పైనే ఆశలు బీసీ కార్పొరేషన్ ద్వారా రాజీవ్ యువవికాసంలో స్వయం ఉపాధి పొందాలని వేలాది మంది యువతీయువకులు ఆశ పడుతున్నారు. రూ.లక్ష నుంచి మూడు లక్షల వరకు మూడు విభాగాల్లో 80, 60 శాతం సబ్సిడీతో ప్రభుత్వం రుణాలు అందజేస్తోంది. గతంలో 2022–23లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఐదు సామాజికవర్గాలకు చెందిన 1295 మందికి రూ.50వేల చొప్పున ప్రభుత్వం అందజేసింది. బీసీ కార్పొరేషన్‌కు 2018–19లో 12వేల మంది యువతీయువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా రాజీవ్ యువ వికాసానికి 15 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎన్ని యూనిట్లు మంజూరు చేశారనే విషయంపై స్పష్టత లేదు. సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారులువీరు ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన దంపతులు బెదుర రమేశ్, లాస్య. బీఎస్సీ కంప్యూటర్ చదువుకున్న రమేశ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. భార్య లాస్య డిగ్రీ చదివింది. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించడంతో రమేశ్ దంపతులు స్వయం ఉపాధి పొందవచ్చని భావించారు. ముస్తాబాద్‌లో కర్రీ పాయింట్ పెట్టుకుందామని దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రానికి వెళ్లారు. రమేశ్‌కు రేషన్‌కార్డు లేకపోవడంతో, ఆయన దరఖాస్తును ఆన్లైన్లో స్వీకరించలేదు. తల్లిదండ్రుల పేరుతో ఉన్న కార్డులో రమేశ్ పేరు లేకపోవడం, ఇటీవల భార్య పేరుతో సహా తన పేరుతో కొత్త రేషన్‌కార్డు కోసం చేసిన దరఖాస్తుకు మోక్షం లభించలేదు. దీంతో రేషన్‌కార్డు లేక, రమేశ్ రాజీవ్ యువవికాసానికి అర్హత కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చాలా మంది యువకులు ఎదుర్కొంటున్నారు. -
పౌరహక్కులను కాపాడుకోవాలి
సిరిసిల్ల/కోనరావుపేట/గంభీరావుపేట: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని, పౌరుల హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ అవీజ్ కోరారు. కోనరావుపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో శుక్రవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పార్టీ మండలాల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, హమీద్, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు కచ్చకాయల ఎల్లయ్య, కొమిరిశెట్టి విజయ, వైస్ చైర్మన్లు తాళ్లపెల్లి ప్రభాకర్, అంజిరెడ్డి, మండల కో–ఆర్డినేటర్ వెంకటస్వామి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు వివరించాలి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పాదయాత్రలు చేస్తూ ‘జై బాపూ.. జైభీమ్.. జై సంవిధాన్’ లక్ష్యం నెరవేర్చాలని ఏఐసీసీ కోఆర్డినేటర్ అవీజ్ కోరారు. సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుందని, వారి చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. 18 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీలు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, నాయకులు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, ఆడెపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ● కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ అవీజ్ -
ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలి
● పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలి ● ఎస్పీ మహేశ్ బీ.గీతేచందుర్తి(వేములవాడ): ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలని ఎస్పీ మహేశ్ బీ.గీతే సూచించారు. చందుర్తి సర్కిల్ కార్యాలయంతోపాటు ఠాణాను శుక్రవారం సందర్శించారు. సిబ్బంది పనితీరు, సర్కిల్ పరిధిలో కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ మహేశ్ బీ.గీతే మాట్లాడుతూ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. వీపీవోలు తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ.. గ్రామీణులను అప్రమత్తం చేయాలన్నారు. అక్రమ బెట్టింగ్‌లు, గేమింగ్ యాప్‌లతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం మండలంలోని లింగంపేటలోని పోలీస్ అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు అంజయ్య, అశోక్ ఉన్నారు. విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి రుద్రంగి(వేములవాడ): విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలని ఎస్పీ మహేశ్ బీ.గీతే సూచించారు. రుద్రంగి ఠాణాను సందర్శించిన సందర్భంగా సిబ్బందితో మాట్లాడారు. ఠాణాలో నమోదవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు, విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. ప్రజలకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్ పరిధిలో నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు. -
అసెంబ్లీ నిర్ణయం చారిత్రాత్మకం
కోనరావుపేట: కాంగ్రెస్ ప్రభుత్వం గోర్బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం హర్షణీయమని బానోత్ నరేశ్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలో లంబాడీ బంజారాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో 15 కోట్లు, రాష్ట్రంలో సుమారు 40 లక్షల జనాభా ఉన్నారన్నారు. భాషను షెడ్యూల్లో చేర్చడం వల్ల గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల రక్షణతోపాటు వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. గిరిజన గోర్బోలి భాషను షెడ్యూల్లో చేర్చకుండా విస్మరించా రని, ఇప్పటికైనా కేంద్రమంత్రులు బండి సంజ య్, కిషన్‌రెడ్డి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాల్యా నాయక్, నాయకులు రాజు నాయక్, కిషన్ నాయక్, పంతుల్ నాయక్ , ప్రకాశ్ నాయక్, రాజు బల్కర్, తిరుపతి, రమేశ్, మదన్ నాయక్, మోహ న్, అమృతలాల్, పరింగినాయక్ పాల్గొన్నారు. పాదయాత్రల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలి బోయినపల్లి: ఏఐసీసీ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఏప్రిల్ 2వ తేదీ నుంచి జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కార్యక్రమ మండల కో ఆర్డినేటర్ బొడ్డు రాములు కోరారు. మండల కేంద్రంలో శుక్రవారం కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్‌యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి జంగం అంజయ్య, సంబ లక్ష్మీరాజం, ఏనుగుల కనుకయ్య, అనీల్‌కుమార్, బొలుమాల శంకర్ ఉన్నారు. సతాయిస్తున్న సర్వర్● పది రోజులుగా సర్టిఫికెట్ల కోసం తండ్లాట బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి తహసీల్దార్ ఆఫీస్‌లో పలు రకాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. సర్వర్ ఎర్రర్‌తో సర్టిఫికెట్ల మంజూరులో జాప్యమవుతోంది. ఈనెల 17 నుంచి సర్వర్‌డౌన్ పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ భరించలేక దరఖాస్తులు రిజిస్టర్లో ఎంట్రీ చేసే గదికి రెవెన్యూ సిబ్బంది తాళం వేశారు. సుమారు వేయికి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. తహసీల్దార్ నారాయణరెడ్డిని వివరణ కోరగా.. సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని, ఒకేసారి వందల కొలది దరఖాస్తులు రావడంతో కొంత జాప్యమవుతోందని తెలిపారు. -
రాత్రివేళ.. పీహెచ్సీలో అందని వైద్యం
● తేలు కుట్టడంతో ఆస్పత్రికి వెళ్లిన బాధితుడు ● తలుపు తీయని సిబ్బంది ● 108లో సిరిసిల్లకు తరలింపుకోనరావుపేట(వేములవాడ): రాత్రి వేళ ఆపదలో వస్తే బాధితులకు వైద్యసేవలు అందడం లేదు. మండల కేంద్రానికి చెందిన పని గంగారాంకు గురువారం రాత్రి 10 గంటల సమయంలో తేలు కుట్టింది. వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా సిబ్బంది బయటకు రాకపోవడంతో.. నొప్పి తీవ్రమైంది. దీంతో 108 అంబులెన్స్‌లో సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఈ విషయమై వైద్యాధికారి వేణుమాధవ్‌ను వివరణ కోరగా రాత్రి వేళ మద్యం సేవించి వచ్చి విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. గురువారం రాత్రి కూడా కొందరు మద్యం సేవించి వచ్చారని, వారిని వెళ్లగొట్టి తలుపులు పెట్టుకున్నట్లు తెలిపారు. మళ్లీ తలుపులు తడితే వారే కావచ్చు అని భ్రమపడ్డట్లు చెప్పారు. విధులపై నిర్లక్ష్యం వహించిన ఏఎన్ఎంకు మెమో జారీ చేశామన్నారు. ఆస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. -
‘అయ్యా.. నా భూమి ఇప్పించండి’
రుద్రంగి: ‘అయ్యా నన్ను బతికుండగానే చంపేశారు. చనిపోయిందని దొంగ సంతకాలు పెట్టి కొందరు దళారులు నా వ్యవసాయ భూమిని కాజేశారు. మళ్లీ నా భూమి నాకు పట్టా చేయించుకుందాం అంటే ఆఫీసుల చుట్టూ తిరగడానికి కూడా చిల్లిగవ్వలేని పేదదాన్ని. నా భూమి నాకు ఇప్పించి నాకు న్యాయం చేయాలి’ అని వేడుకుంటున్న ఈ వృద్ధురాలి పేరు నందగిరి కమలవ్వ. రుద్రంగికి చెందిన ఈ వృద్ధురాలికి సర్వే నంబర్ 176/51లో ఒక ఎకరం భూమి వారి తాత, ముత్తాతల నాటి నుంచి సంక్రమించింది. అట్టి భూమిపై ఇటీవల కొందరు దళారులు కన్నేశారు. కమలవ్వ గతంలోనే భూమి అమ్మినట్టు దొంగ అమ్మకపు పత్రం సృష్టించారు. ఆమె బతికి ఉండగానే చనిపోయిందని దొంగ సంతకాలు పెట్టి అధికారులను నమ్మించి మోసం చేసి ఆమె భూమిలో నుంచి 22గుంటల భూమిని దళారుల పేరుపై ఎక్కించుకున్నారని వాపోయింది. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఈ విషయంపై రుద్రంగి తహసీల్దార్ శ్రీలతను వివరణ కోరగా ముందు అధికారులు పట్టా చేసి ఉంటారని, తాము ఎలాంటి అక్రమ పట్టాలు చేయలేదన్నారు. బాధితురాలు దరఖాస్తు చేసుకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వరికి ఊస..రైతుకు బెంగ
వరిపంట ఊస తిరుగుతుంది వరిపంటకు ఎన్ని మందులు వాడిన చేతికొచ్చే సమయంలో ఊస తిరిగి తాలుగా మారుతోంది. వరి పంటకు 10 కర్రలు ఉంటే సగం కర్రలు తాలుగా మారుతుంది. ఎలాంటి మందులో వాడాలో తెలియక ఫర్టిలైజర్ దుకాణ దారులు ఇచ్చినవే వాడుతున్నాం. అవి సరిగా పనిచేయడం లేదు. అధికారులు అవగాహన కల్పిస్తే బాగుండు. – జంగం గంగరాజు, నాంపల్లి అవగాహన కల్పించాం వాతావరణంలో మార్పులతో మార్చి మొదటి వారం, రెండో వారం ఉదయం, రాత్రి, చలి, మధ్యాహ్నం ఎండ ఉంటుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో పంటపై శిలీంద్రం ఉధృతి పెరిగింది. వరిపంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – సాయికిరణ్, మండల వ్యవసాయాధికారి, వేములవాడ ● పంట సాగు నుంచి అన్నదాతకు కష్టాలే.. ● తొలుత సాగునీరు అందక ఎండిన పంటలు ● ఇటీవల వడగండ్లతో నేలవాలిన వైనం ● నేడు ఊసతో తాలుగా మారుతున్న వరివేములవాడఅర్బన్: వరి సాగు చేసిన రైతులను ఈ సీజన్లో కష్టాలు వెన్నంటే ఉంటున్నాయి. తొలుత సాగునీరు అందక పంట ఎండిపోగా.. ఇటీవల వడగండ్లతో మరికొంత పంటనష్టం ఏర్పడింది. ఇప్పుడు ఊస తెగులు ఆశిస్తుండడంతో చివరి దశలో పంట తాలుగా మారుతోంది. ఊస ఆశిస్తుండడంతో సగం పంట కూడా చేతికొస్తుందో.. లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడిపై భయాందోళన జిల్లాలో రైతులు 1,49,366 ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. అయితే నీరందక దాదాపు 419 ఎకరాల్లో పంట ఎండిపోయింది. కొందరు రైతులు పశువులకు మేతగా వదిలేశారు. ఈక్రమంలో వారం రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానతో 1875 ఎకరాల్లో పంట నేలవాలింది. అన్ని తట్టుకొని మిగిలిన పంట చేతికొస్తుందని ఆశపడ్డ రైతులకు ఊస తెగులు భయాందోళనకు గురిచేస్తుంది. ఊస తెగులు ఆశిస్తుండడంతో వరి పంట తాలుగా మారిపోతుంది. ఎకరానికి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టామని.. ఇలా దెబ్బమీద దెబ్బ పడుతుండడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించని అధికారులు జిల్లాలోని 13 మండలాలకు వ్యవసాయాధికారులు ఉన్నారు. వీరు మండలాల్లో పర్యటించి ఏ భూమిలో ఏ పంటలు వేసుకోవాలి, ఏ సమయంలో ఏయే మందులు వేయాలని అనే విషయాలను రైతులకు వివరించాలి. కానీ ఒక్క మండలంలో కూడా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు. పంటలకు ఎలాంటి మందులు వేయాలో తెలియక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు చెప్పిందే సలహా.. ఇచ్చిందే మందు గతంలో వరి పంటలను పరిశీలించి ఫర్టిలైజర్ దుకాణాదారులు, కంపెనీల ఏజెంట్లు పురుగుమందులను ఇచ్చేవారు. అంతేకాకుండా ఒక రైతుపొలంలో పిచికారీ చేసి పనిచేస్తుందా.. లేదా.. అని పరిశీలించిన తర్వాత ఆ క్రిమిసంహారక మందును రైతులకు విక్రయించేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు. రైతులు ఫర్టిలైజర్ షాపులకు వెళ్తే.. అక్కడి వ్యాపారి చెప్పిందే సలహా.. ఇచ్చిందే మందుగా మారింది. కొన్ని సందర్భాల్లో ఆ క్రిమిసంహారక మందులు పనిచేయక పంటనష్టం జరుగుతుంది. జిల్లాలో వరిపంట వివరాలు పంటలు ఎకరాలు వరి 1,49,366ఎండిన పంటలు 419వడగండ్లతో నష్టం 1,875పెట్టుబడి కష్టమే.. వరిపంట ఊస తిరిగి తాలుగా మారుతోంది. పెట్టుబడి రావడం కష్టంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే చేతికొచ్చే వరకు నమ్మకం లేదు. అధికారులు పంటలకు ఎప్పుడు ఎలాంటి మందులు పిచికారీ చేయాలో తెలపడం లేదు. – మానుక కొమురయ్య, తిప్పాపూర్ -
మీడియా కమిషన్ ఏర్పాటు చేయండి
● జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి ● టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్యవేములవాడ: రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతోపాటు మీడియాలో వస్తున్న అనారోగ్యకర భాష నియంత్రణకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలోని మున్నూరుకాపు సంఘం భవన్లో టీడబ్ల్యూజేఎఫ్ వేములవాడ నియోజకవర్గం మహాసభ శుక్రవారం జరిగింది. ఐఏఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్‌కుమార్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, జిల్లా అధ్యక్షుడు పెరుక రవి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వినతిపత్రం ఇవ్వాలని తీర్మానించారు. వేములవాడ నియోజకవర్గ కమిటీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టస్ ఫెడరేషన్ వేములవాడ నియోజకవర్గం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తొగరి కరుణాకర్, కార్యదర్శిగా సుంకరి నరేందర్, కోశాధికారిగా బొప్ప భిక్షపతి, ఉపాధ్యక్షులుగా అవధూత శ్రీధర్, కవ్వాల సురేందర్, ఎండీ షరీఫ్, సహాయ కార్యదర్శులుగా గొల్లపల్లి వేణు, కోటగిరి రాజశేఖర్, గోపు ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా చల్లా రమేశ్, వాసం వెంకటస్వామి, ఎగుమంటి మూర్తిరెడ్డి, కళ్యాడపు వెంకటమల్లు, చక్రహరి దేవేందర్‌రాజు, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, నడిగట్ల భిక్షపతి, సయ్యద్ షబ్బీర్‌లను ఎన్నుకున్నారు. -
రైస్‌మిల్లులో టాస్క్‌ఫోర్స్ అధికారుల సోదాలు
మంథని: సూరయ్యపల్లి రైస్‌మిల్లులో పౌర సరఫరా ల శాఖ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. 2022–23 సీఎమ్మార్ ప్రకారం ధాన్యం నిల్వలపై అనుమానాల్లో భాగంగా సూరయ్యపల్లి రైస్‌మిల్లులో అధికారులు తనిఖీలు చేశారు. మిల్లులో 41,365 క్వింటా ళ్లు ఉండాల్సి స్థానంలో ధాన్యం లేదని గుర్తించారు. కాగా, తాను లీజు తీసుకున్న గంగాపురి సమీపంలో ధాన్యం నిల్వ ఉందని యజమాని చెప్పడంతో అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. అక్కడ 9,689.08 క్వింటాళ్ల ధాన్యం నిల్వ మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా ధాన్యం నిల్వలు అందుబాటులో లేవని తేల్చారు. నిర్దేశించిన ప్రకారం ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, కానీ, అలా చేయక పోవడంతో సోదాల్లో వెలుగుచూసిన అంశాలను కమిషనర్‌కు నివేదిస్తామని స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి తెలిపారు. రూ.కోట్ల విలువైన ధాన్యం అందుబాటులో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు స్ఫష్టత ఇవ్వాల్సి ఉంది. తనిఖీల్లో ఓఎస్డీ ప్రభాకర్, ఎస్ఐ జంగయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలిని వదిలించుకున్నారు
వేములవాడ: రాజన్న ఆలయ వసతి గదులైన లక్ష్మీగణపతి కాంప్లెక్స్ ఎదురుగా 75 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు గల వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం వదిలేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఓ ఆటో డ్రైవర్ సహాయంతో వృద్ధురాలికి స్నానం చేయించి సపర్యలు చేశారు. బట్టలు మార్చి ఒక నైటీని వేయించారు. రూ.కోటి చెల్లించిన తలనీలాల కాంట్రాక్టర్వేములవాడ: రాజన్నకు భక్తులు సమర్పించిన తలనీలాలు సేకరించేందుకు అధికారులు నిర్వహించిన రెండేళ్ల టెండర్ ఏప్రిల్ 11తో ముగియనుంది. కొంతకాలంగా డబ్బులు చెల్లించకుంటా తలనీలాలు సేకరించకుండా కాంట్రాక్టర్ చేతులెత్తేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈక్రమంలో ఇటీవల ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని దేవస్థానానికి రావాల్సిన రూ.9.50కోట్ల బకాయిల్లో రూ.2.50కోట్లు చెల్లించి అధికారులు సేకరించి పెట్టిన తలనీలాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులు ఒప్పందంలో భాగంగా శుక్రవారం రూ.కోటి చెల్లించినట్లు ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. మిగతా రూ.6 కోట్లలో ఏప్రిల్ 10న రూ.కోటి, ఏప్రిల్ 11న రూ.కోటిన్నర చెల్లించడంతోపాటు మిగతా డబ్బులు జూన్ నుంచి డిసెంబర్ వరకు చెల్లిస్తానని ఒప్పందంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 11తో తలనీలాల సేకరణకు టెండర్ ముగియనుండడంతో ఆలయ అధికారులు ఇప్పటికే మూడుసార్లు టెండర్ నిర్వహించగా, ఎవరూ హాజరుకాలేదు. తిరిగి వచ్చే నెల 4న టెండర్ నిర్వహించనున్నారు. 20 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ సీజ్సిరిసిల్లక్రైం: స్థానిక బల్యాలనగర్లోని ఫౌల్ట్రీఫాంలో అక్రమంగా నిల్వచేసిన 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు. కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన బుర్ర అంజయ్య పీడీఎస్ బియ్యాన్ని నిల్వచేసినట్లు సమాచారంతో దాడి చేశారు. బియ్యం పట్టుబడడంతో సీజ్‌చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. గంజాయి కేసులో ఒకరి రిమాండ్ సిరిసిల్లక్రైం: గంజాయికి అలవాటు పడిన వేములవాడ మండలం అగ్రహారం గ్రామానికి చెందిన బండి రాజేశ్, కోనరావుపేట మండలం కొలనూర్‌కు చెందిన దూగూరి సాయికృష్ణ, వేములవాడకు చెందిన ఎనగందుల పవన్‌ను రిమాండ్‌కు పంపినట్లు సీఐ కృష్ణ తెలిపారు. వీరు మరికొందరితో కలిసి గంజాయికి అలవాటుపడి సిరిసిల్లలోని కుమ్మరిగల్లీకి చెందిన ఒక వ్యక్తి నుంచి 150 గ్రాముల గంజాయిని రూ.3,750కు కొన్నారు. దీన్ని సిరిసిల్ల శివారులోని తమ్మలకుంటలోని టన్నెల్ సమీపంలోని బండకింద దాచిపెట్టారు. శుక్రవారం సిగరెట్లో గంజాయిని నింపుకుని తాగేందుకు ప్రయత్నిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. -
కొదురుపాకలో దొంగతనం
● ఐదు తులాల బంగారం.. 24 తులాల వెండి చోరీబోయినపల్లి(చొప్పదండి): అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్లు తెచ్చుకోవడానికి ఇంటికి గడియపెట్టి వెళ్తే తిరిగి వచ్చే సరికి దొంగతనం జరిగింది. ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తెలిపిన వివరాలు. కొదురుపాకకు చెందిన సట్ట జలజ కోడిగుడ్ల కోసం ఇంటికి గడియపెట్టి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లోని రెండు బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువా వద్దకు వెళ్లి చూడగా అందులో ఉన్న తన అత్తమ్మ బంగారం కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 5 తులాల 9 గ్రాముల బంగారు నగలు, 24 తులాల వెండి ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్, డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు. -
పట్టుదలగా చదివితే లక్ష్యం చేరుకోవచ్చు
● ట్రాఫిక్ ఎస్సై రమేశ్సిరిసిల్ల: పట్టుదలగా చదివితే లక్ష్యం ఎంత పెద్దదైనా సాధించవచ్చని, సెల్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని సిరిసిల్ల పట్టణ ట్రాఫిక్ ఎస్సై అల్లం రమేశ్ పేర్కొన్నారు. జిల్లా బీసీ స్టడీసర్కిల్ ఉద్యోగ నైపుణ్య శిక్షణ కేంద్రంలో శుక్రవారం మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, ఎస్ ఎస్సీ కోచింగ్ అభ్యర్థులతో మాట్లాడారు. పోటీప్రపంచంలో చదువుతోనే ఉన్నత స్థితికి చేరుతారన్నా రు. బీసీ స్టడీసర్కిల్‌ను వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, కోర్స్ కోఆర్డినేటర్ హరీష్, ఫ్యాకల్టీ నాగరాజు, సిబ్బంది సురేష్, దివ్య, ప్రసాద్, మురళి, వనిత పాల్గొన్నారు. -
న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా జూపెల్లి శ్రీనివాసరావు, తంగళ్లపెల్లి వెంకటి ఎన్నికయ్యారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలను ఎన్నికల నిర్వహణాధికారి సురభి సత్యనారాయణరావు ప్రకటించారు. అధ్యక్ష స్థానానికి పోటీపడ్డ రమణారెడ్డికి 56 ఓట్లు, ఆవునూరి రమాకాంత్రావుకు 41 ఓట్లు వచ్చాయి. త్రిముఖ పోటీ జరుగగా.. చివరికి శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి రమణారెడ్డిపై 23 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కార్యదర్శి స్థానానికి పోటీచేసిన జవ్వాజి ప్రసాద్‌కు 60 ఓట్లు రాగా 54 ఓట్ల మెజారిటీతో తంగళ్లపెల్లి వెంకటి గెలుపొందారు. వెంకటి వరుసగా రెండో సారి కార్యదర్శిగా గెలుపొందడం. ఉపాధ్యక్షుడిగా ఎస్.అనిల్‌కుమార్ ఏకగ్రీవమయ్యారు. సంయుక్త కార్యదర్శిగా గాజుల రాజమల్లు, కోశాధికారిగా వేముల నరేశ్, మహిళా ప్రతినిధిగా మంద పుష్పలత ఎంపికయ్యారు. నూతనంగా ఎన్నికై న ప్రతినిధులకు సహచర న్యాయవాదులు అభినందనలు తెలిపారు. -
గ్రామీణ బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
● టీజీబీ రీజినల్ మేనేజర్ రాజనరేంద్ర ముస్తాబాద్: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంక్ రీజినల్ మేనేజర్ రాజనరేంద్ర కోరారు. ముస్తాబాద్‌లో నూతన బ్రాంచ్‌ను గురువారం ప్రారంభించారు. రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ టీజీబీలో అన్ని రకాల బ్యాంక్ సేవలు అందిస్తామన్నారు. ఇంటి, బంగారంపై, దీర్ఘకాలిక రుణాలను అందిస్తామని తెలిపారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును అధికంగా చెల్లిస్తామన్నారు. ప్రభుత్వరంగ సేవలను కూడా అందించడం జరుగుతుందన్నారు. బ్రాంచ్ మేనేజర్ రవివర్మ, గూడెంశాఖ మేనేజర్ వేణు, ఫీల్డ్ ఆఫీసర్ అరవింద్, క్యాషియర్ పర్శరాములు ఉన్నారు. -
త్వరపడండి..
● సమీపిస్తున్న ఎల్ఆర్ఎస్ గడువు ● 25 శాతం సబ్సిడీ వినియోగించుకోవాలంటున్న అధికారులు ● ఈనెల 31తో ముగియనున్న అవకాశం ● గడువు దాటితే పూర్తి రుసుం చెల్లించాల్సిందే.. ● ప్రచారం చేస్తున్న అధికారులు ● గ్రామాల్లో డప్పు చాటింపు, వ్యక్తిగతంగా ఫోన్కాల్స్వేములవాడ: లేఅవుట్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన 25 శాతం సబ్సిడీని వినియోగించుకోవాలని మున్సిపల్ అధికారులు ప్రచారం కల్పిస్తున్నారు. ఈనెల 31తో గడువు ముగియనుండగా.. ఆలోపే చలాన్ చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. కాలనీల్లో డప్పు చాటింపు చేయించడంతోపాటు గతంలో రూ.వేయి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. 2020లో రూ.వేయితో దరఖాస్తు అనధికారిక లే–అవుట్లలో ప్లాట్లు కొన్న వారికి తమ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో అవకాశం ఇచ్చింది. రూ.వేయి దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో వేములవాడ మున్సిపల్ పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. తాజాగా గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించింది. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆమేరకు గతంలో రూ.వేయి చెల్లించిన వారు నేరుగా మున్సిపాలిటీకి చేరుకుని ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేసుకోవచ్చని మైక్‌లలో ప్రచారం చేస్తున్నారు. ఇవీ గమనించండి ప్రభుత్వ భూములు, జలవనరుల సమీపంలో ఉన్న లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ పరిధిలోకి రావు. ఫీజు చెల్లింపులు ఆన్లైన్లో లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించకుండా నేరుగా బిల్డింగ్ అనుమతులు పొందితే, అదనంగా 33 శాతం కాంపౌండ్ ఫీజు విధించబడుతుంది. రెగ్యులర్ చేసుకుంటే మంచిది ప్లాట్ల యజమానులు తమ స్థలాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఈనెల 31 వరకు అవకాశం ఉంది. ఆలోపు చేసుకోకుంటే ప్రస్తుతం ఉన్న భూమి విలువతోపాటు ప్రస్తుతం వచ్చే 25 శాతం రాయితీని కోల్పోతారు. ఇంటి నిర్మాణం సమయంలో 33 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. – అన్వేశ్, మున్సిపల్ కమిషనర్వేములవాడలో ఎల్ఆర్ఎస్ ఇలా.. గుర్తించిన ప్లాట్లు : 13,072 చెల్లింపులు జరిగినవి: 1,000 -
నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాముస్తాబాద్(సిరిసిల్ల): వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని.. మిషన్ భగీరథ నీరు నిరంతరం సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. ముస్తాబాద్, చిప్పలపల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను గురువారం కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. చిప్పలపల్లిలో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, కోళ్లమద్ది రిజర్వాయర్ నుంచి నీటిని వాడుకోవాలని సూచించారు. ముస్తాబాద్ డబుల్బెడ్రూమ్ కాలనీతోపాటు ఎస్సీకాలనీల్లో వెంటనే నీటి సరఫరా కావాలని సూచించారు. అనంతరం నామాపూర్ మోడల్‌స్కూల్‌ను తనిఖీ చేశారు. పోతుగల్లో పీహెచ్సీలో రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈఈ జానకి, డీఈలు ప్రేమ్‌కుమార్, రాము, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో బీరయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, వైద్యాధికారి గీతాంజలి, ఈవో రమేశ్, ప్రిన్సిపాల్ నర్సింహారాజు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలను నిర్మూలించాలి సిరిసిల్లకల్చరల్: జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశంలో ఎస్పీ మహేశ్ బీ.గీతేతో కలిసి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయించి నా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులను సమన్వ యం చేసుకుంటూ డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమి షనర్లు సమ్మయ్య, అన్వేశ్, జిల్లా వైద్యాధికారి రజిత, ఇంటర్మీడియెట్ విద్యాధికారి శ్రీనివాస్, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్, డీఏవో అఫ్జ ల్ బేగం, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి
● అసెంబ్లీలో వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీలో గురువారం మాట్లాడారు. వేములవాడలో పోలీస్‌శాఖ బలోపేతానికి నిధులు కేటాయించాలని కోరారు. మహిళల భద్రతను పెంచేందుకు వేములవాడలో మహిళా పోలీస్‌స్టేషన్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేములవాడ అర్బన్ మండలానికి పోలీస్‌స్టేషన్ మంజూరు చేయాలని, రుద్రంగిలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో మోహన్‌రావుపేట నుంచి ఈదులలింగంపేట వరకు డబుల్ రోడ్డు, తాండ్రియాల నుంచి పసునూరు మీదుగా కొత్తగా రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. -
రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాలి
● కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి కోరారు. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ‘జైబాపు.. జై భీమ్.. జై సంవిధాన్’లో మాట్లాడారు. పౌరహక్కులు, ప్రాథమిక హక్కులను హరించేలా కేంద్రం ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ప్రజ ల మధ్య కుల, మత చిచ్చుపెట్టి విడదీసి పాలన చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశా రు. జైబాపు, జై భీమ్ ముస్తాబాద్ ఇన్చార్జి నాగం కుమార్, జిల్లా ఇన్చార్జి ఆవాజ్, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు యెల్ల బాల్‌రెడ్డి, ప్రవీణ్ జే టోని, పట్టణాధ్యక్షుడు గజ్జెల రాజు, ఏఎంసీ చైర్పర్సన్లు తలారి రాణి, నేరెళ్ల నర్సింగంగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ అన్నం రాజేందర్‌రెడ్డి, వైస్‌చైర్మ న్ రాంరెడ్డి, నాయకులు చిలుక రమేష్, హజీజ్, చుక్క రాజశేఖర్, ఆరెపల్లి బాలు పాల్గొన్నారు. -
ఇక సన్నబియ్యమే!
● ఉగాది నుంచి పంపిణీకి అధికారుల ఏర్పాట్లు ● ఉమ్మడి జిల్లాలో 80 శాతం మంది ప్రజలకు ఉపయుక్తం ● దొడ్డుబియ్యం దందాకు శాశ్వత పరిష్కారం ● పేర్లు డిలీట్ అయిన వారికి ఇంకా అందని కార్డులు ● ప్రజాపాలన రేషన్జాబితాలో పేర్లు వచ్చినా అందని సరుకులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల్లో ఇప్పటికే రేషన్‌షాపులకు సన్నబియ్యం వచ్చేశాయి. వీటిని ఉగాది రోజు నుంచే పంపిణీ చేయనున్నారు. కార్డులో ఉన్న ప్రతీవ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ జరగనుంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాదాపు 80 శాతం జనాభాకు తెల్లరేషన్‌కార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డులు) ఉన్నాయి. వీరందరికీ సన్నబియ్యం అందనున్నాయి. గతంలోనూ ఇవే కార్డుల మీద ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేసింది. కానీ... వాటిని లబ్భిదారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. బియ్యం దొడ్డుగా ఉన్న కారణంతో వాటిని హోటళ్లు, వ్యాపారులకు విక్రయించేవారు. ఇవే బియ్యాన్ని సదరు వ్యాపారులు పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి అమ్ముకునేవారు. ఇకపై బియ్యాన్ని లబ్ధిదారులే వినియోగించుకునేలా.. పకడ్బందీగా సన్నబియ్యం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమక్కుమార్ రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉండటంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డులందని, డిలీట్ అయిన వారి కష్టాలు.. కొందరు లబ్ధిదారులకు ఇంకా రేషన్‌కార్డులు అందలేదు. వీరంతా గతేడాది ప్రజాపాలన, మీసేవా, ప్రజావాణి, ఇటీవల మరోసారి ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. కొత్తగా పెళ్లైన జంట లు తమ పేర్లను కుటుంబాల నుంచి డిలీట్ చేసుకుని, కొత్త వాటికి దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా అర్హులైనా.. ఇంతవరకు రేషన్‌కార్డులు అందలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఏప్రిల్‌లో అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, జనవరి 26 సందర్భంగా నిర్వహించిన ఆరుగ్యారెంటీల అమలు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద కొందరు లబ్ధిదారులను అధికారులు రేషన్ జాబి తాలో ఎంపిక చేశారు. వీరికి నెలానెలా సరుకులు వస్తాయనుకున్నా.. నేటికీ ఎలాంటి సరుకులు అందడం లేదు. ఉగాది నుంచైనా కార్డులు పనిచేస్తాయా? లేదా? అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు ఉన్నారు. బియ్యం దందా బంద్అయ్యేనా? ఇంతకాలం రేషన్ బియ్యాన్ని కొని మహారాష్ట్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో విక్రయించే వారికి జిల్లాలో విస్తృత నెట్‌వర్క్‌ఉంది. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ గ్రామం, పట్టణాలలో ఇంటింటికీ మోపడ్ బండ్లపై తిరుగుతూ రేషన్‌బియ్యం సేకరించే వారికి ఇకపై మునపటి స్థాయిలో దందా నడవకపోవచ్చు. గోదావరిఖని, మంథని మీదుగా గోదావరి దాటి మహారాష్ట్రలోకి బియ్యం పంపే వీరు అక్కడ వాటిని ప్రాసెస్, పాలిష్ చేసి కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తారు. రెండేళ్ల క్రితం కరీంనగర్ నుంచే రైల్వే వ్యాగన్లలో రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారంటే వీరి దందా ఏస్థాయిలో నడిచేదో అర్థం చేసుకోవచ్చు. సన్నబియ్యం సరఫరా నేపథ్యంలో వీరి దందా బంద్ అయ్యేనా? లేక రూట్ మారుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
జనావాసాల్లో విషవనాలు
వాతావరణాన్ని కలుషితం చేసే కోనోకార్పస్ మొక్కలు రాష్ట్రంలో ఉన్నాయి. వాటితో అనేక జబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో కోనోకార్పస్ చెట్లు ఎక్కడ ఉన్నా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం.. అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం శాసన సభలో వ్యాఖ్యానించారు. స్పీకర్ మాటలను పరిశీలిస్తేనే అవి ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది.సిరిసిల్ల: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో తెలియకుండానే విషవనాలను నాటేశారు. ఐదేళ్ల క్రితం మొక్కలుగా ఉన్న కోనో కార్పస్ నేడు వృక్షాలుగా మారాయి. పుప్పొడిని వెదజల్లుతూ మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ మొక్కలను ప్రపంచ దేశాలన్నీ ఏనాడో నిషేధించగా.. తెలంగాణలో 2022 జూ న్ 15న నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే అప్పటికే లక్షలాది మొక్కలు నాటగా.. అవి చెట్లుగా ఎదిగాయి. ప్రస్తుతం పూలు పూసి, కాయలు కాసి రోడ్లపైనే వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లాలో ఆ మొక్కలను తొలగిస్తారా.. లేదా.. అనే మీమాంస కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విషవనాలపై ప్రత్యేక కథనం. పర్యావరణానికి పెనుముప్పు ఈ మొక్కలు కోనోకార్పస్ కంబ్రాటేసీ కుటుంబానికి చెందినవి. ఈ మొక్క ఎందుకూ పనికిరాదు. వీటి నీడలో పచ్చిగడ్డి కూడా పెరగదు. భూగర్భ జలాలను ఎక్కువగా తీసుకుంటుంది. ఈ చెట్ల వేర్లకు అడ్డువస్తే పైపులైన్లు, కేబుల్‌వైర్లను సైతం చీల్చుకుని వెళ్తాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపుగా పెరుగుతాయి. సముద్రతీర ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను పట్టణాల్లోకి తెచ్చి జనవాసాల్లో నాటుకున్నారు. ఫలితంగా జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించింది. కోనోకార్పస్ మొక్కల కాయల్లోని పుప్పుడి గాలిలో కలిసి ఆస్తమా, అలర్జీ లాంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతీ పల్లెలో కోనోకార్పస్ మొక్కలు హరితహారంలో నాటిన అధికారులు పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు ప్రమాదకరమంటున్న వైద్యులు అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలతో పీడ తొలగేనా ? -
ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికల వరకే రాజకీయాలు అని.. అభివృద్ధే తమ లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రూ.5లక్షల ఎంపీ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు పనులకు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సహకారంతో గ్రామాల్లో మౌలిక వసతులు, కులసంఘాల భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎల్లారెడ్డిపేట మండలాన్ని అన్ని రంగాల్లో కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కోనేటి సాయిలు, పార్టీ మండలాధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శులు మద్దుల బుగ్గారెడ్డి, బందారపు లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, నాయకులు రాగుల గాల్‌రెడ్డి, చల్ల సత్యంరెడ్డి, కిరణ్‌నాయక్, నంది నరేశ్, దుంపెన స్రవంతి పాల్గొన్నారు. పనిచేసే వారికి గుర్తింపు పార్టీ బలోపేతానికి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. మండలంలోని నారాయణపూర్‌కు చెందిన కోనేటి సాయిలు బీజేపీ ఎస్టీ సెల్ ఏకలవ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా సన్మానించారు. గోపి మాట్లాడుతూ సాయిలు సేవలను గుర్తించి పార్టీ జిల్లా నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు సిరిసిల్లటౌన్/వేములవాడరూరల్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారాముల తలంబ్రాలను భక్తుల ఇంటికే ఆర్టీసీ కార్గో ద్వారా అందిస్తున్నట్లు కార్గో ఏటీఎం రామారావు తెలిపారు. కార్గో సేవల పోస్టర్లను గురువారం సిరిసిల్ల, వేములవాడల్లో ఆవిష్కరించారు. 91542 98576, 91542 98577, 949244889లలో బుకింగ్ చేసుకోవాలని కోరారు. కార్గో రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ రాజు, శేఖర్, శ్రీనివాస్ ఉన్నారు. 3న ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన సిరిసిల్లటౌన్: జిల్లాలో ఏప్రిల్ 3న ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటించనున్నట్లు గురువారం ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబునాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్ల శంకర్, రేణికుంట ప్రవీణ్ వేములవాడకు రానున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. 29న ఉగాది కవి సమ్మేళనం సిరిసిల్లకల్చరల్: ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 29న కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు మానేరు రచయితల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎలగొండ రవి ప్రకటనలో తెలిపా రు. సినారె స్మారక కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే కవి సమ్మేళనానికి గ్రంథాలయసంస్థ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యానారాయణ, కవులు డాక్టర్ కందేపి రాణీప్రసాద్, జూకంటి జగన్నాథం అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. పెద్దసంఖ్యలో కవులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ‘ఉపాధి’లో అక్రమాలు● సామాజిక తనిఖీతో వెలుగులోకి.. ● సొమ్ము రికవరీకి ఆదేశాలు చందుర్తి(వేములవాడ): ఉపాధిహామీ పథకంలో అక్రమాలు వెలుగుచూశాయి. చందుర్తి మండల పరిషత్‌లో గురువారం నిర్వహించిన సామాజిక తనిఖీలో స్వాహాపర్వం వెలుగుచూసింది. మూడు గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. రూ.37,30,117 విలువైన పనులు చేపట్టగా.. రూ.55,392 అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్ప డిన రూ.55,392లతోపాటు రూ.11వేలు జరి మానా విధించినట్లు వెల్లడించారు. డీఆర్డీఏ పీడీ శేషాద్రి, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి అరుణ్‌రెడ్డి, అంబుడ్స్‌మెన్ రాకేశ్, చందుర్తి ఎంపీడీవో ప్రదీప్‌కుమార్, ఉపాధిహామీ ఏపీవో రాజయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఒత్తిడిని అధిగమించొచ్చు
● ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి ● డీఎస్పీ కార్యాలయంలో షటిల్ కోర్టు ప్రారంభం వేములవాడ: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు క్రీడలపై దృష్టి సారిస్తే విధుల్లోని ఒత్తిడిని అధిగమించవచ్చని ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. డీఎస్పీ కార్యాలయంలో షటిల్‌కోర్టును బుధవారం ప్రారంభించారు. అనంతరం సీఐలు, ఎస్సైలతో షటిల్ ఆడారు. సీఐలు వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఎస్సైలు మారుతి, రమేశ్, అంజయ్య, అశోక్, పృథ్వీధర్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత నౌకాదళానికి ఎంపిక కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కొండాపూర్‌కు చెందిన గొల్లపల్లి వివేక్వర్ధన్ భారత నౌకాదళానికి ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన గొల్లపల్లి దేవరాజుగౌడ్–లత దంపతుల కుమారుడు హైదరాబాద్‌లో డీగ్రీ మూడో సంవత్సరం చదువుతూ పరీక్ష రాశాడు. భారత నౌకాదళంలో ఎస్ఎస్ఆర్గా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి దేవరాజు గ్రామంలో గీతకార్మికునిగా పనిచేస్తుండగా తల్లి లత బీడీ కార్మికురాలు. వివేక్వర్ధన్ భారత నౌకాదళానికి ఎంపిక కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కాయకల్ప బృందం వైద్యులు మంజుల, నర్సింగ్ అధికారిణి శ్రావణి సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వసతులు, రికార్డులు, పరిసరాలు, రోగుల రిజిష్టర్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ ఆస్పత్రిలో సాదారణ ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఫార్మసిస్ట్ శ్వేత, జూనియర్ అసిస్టెంట్ లిఖిత, వైద్యులు అజయ్‌కుమార్, ప్రదీప్‌కుమార్, రఘు, సూపరింటెండెంట్ బాబు పాల్గొన్నారు. ప్యాక్స్ చైర్మన్లను కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని గాలిపల్లి, ఇల్లంతకుంట ప్యాక్స్ పాలకవర్గాన్ని కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇల్లంతకుంట, గాలిపల్లి ప్యాక్స్ పాలకవర్గం పదవీకాలం ముగిసిందని, రద్దు చేస్తూ ఈనెల 7న జిల్లా సహకారసంఘం వారు స్పెషలాఫీసర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఇల్లంతకుంట, గాలిపల్లి పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఈమేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాపీని ఇల్లంతకుంట ప్యాక్స్ మాజీ చైర్మన్ తిరుపతిరెడ్డి బుధవారం డీసీవో రామకృష్ణకు అందజేశారు. దీనిపై జిల్లా కో–ఆపరేటీవ్ అధికారి రామకృష్ణను వివరణ కోరగా తమ కార్యాలయానికి హైకోర్టు ప్రతి అందలేదని తెలిపారు. టీకాల కేంద్రం తనిఖీ వేములవాడరూరల్: వేములవాడ మండలం మర్రిపల్లి ఆరోగ్య ఉపకేంద్రంలో వ్యాధి నిరోధక టీకాల కేంద్రాన్ని డీఎంహెచ్‌వో రజిత బుధవారం తనిఖీ చేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల వరకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాల వివరాలు, ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలపై సిబ్బందికి వివరించారు. డీఐవో డాక్టర్ సంపత్‌కుమార్, డీడీఎం కార్తీక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఎవరూ వాటి జోలికి పోవద్దు
ఎవరూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ జోలికి పోవద్దు. అవన్నీ మోసపూరితమైనవే. ఆన్లైన్ ఊబిలోకి కూరుకుపోయిన వారు ఎవరూ బాగుపడలేదు. నా భర్త తెలియక డబ్బులు పెట్టి నిండా మునిగాడు. చివరికి ప్రాణాలు సైతం తీసుకున్నాడు. మేము ఒంటరివారమయ్యాం. ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాలాంటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. – బండి స్వప్న, సింగారం తల్లిదండ్రులు నిఘా పెట్టాలి ఐపీఎల్ బెట్టింగ్‌పై నిఘా ఉంచాం. అన్ని పోలీస్స్టేషన్లలో అప్రమత్తం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలపై నిఘా పెట్టాలి. బెట్టింగ్‌లతో జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. కేసులు నమోదైతే భవిష్యత్‌లో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదు. – కరుణాకర్, డీసీపీ పెద్దపల్లి మానసిక ఒత్తిడితోనే ఈజీగా డబ్బు సంపాదించాలే ఆశతో యువత బెట్టింగ్ ప్రారంభిస్తారు. మొదట డబ్బులు వస్తుంటే ఆశతో ముందుకెళ్తారు. ఆ తర్వాత నష్టపోతుంటే అప్పులు భారంగా మారి అసాధారణమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక నష్టాలు వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూ పుతాయి. ఈ ఒత్తిళ్లు వారికి అదనపు భయం, ఒంటరితనంతో ఆత్మహత్య ఆలోచనలు కలుగుతాయి. ఇలాంటి వారిని గుర్తించి వారు ఒత్తిడిని జయించాలంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు సమర్థవంతమైన మద్దతు ఇవ్వాలి. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. – ప్రీతి, సైకియాట్రిస్టు -
కస్టమర్ల సహకారంతో బ్యాంకు అభివృద్ధి
సిరిసిల్లటౌన్: వినియోగదారుల సహకారంతో బ్యాంకు అభివృద్ధి చెందుతోందని సిరిసిల్ల అర్బన్‌బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సిరిసిల్ల పద్మశాలీ కల్యాణ ట్రస్టు భవనంలో బుధవారం నిర్వహించిన అర్ధ సంవత్సర సభలో మాట్లాడారు. సహకార స్ఫూర్తితో కస్టమర్లకు పారదర్శక సేవలు, సభ్యులకు డివిడెండ్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. సభ్యుల నుంచి సూచనలు కోరగా.. బియ్యంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకులో చాలా రోజులుగా ఖాళీగా ఉంటున్న సీఈవో పోస్టును భర్తీ చేయాలని, సభ్యులు చనిపోతే దహన సంస్కారాల ఖర్చులకు రూ.5వేలు ఇవ్వాలని కోరారు. రాగుల జగన్ మాట్లాడుతూ.. బ్యాంకును, సహకార వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తూ నిబంధనలు అతిక్రమించి పాలకవర్గంలో భాగస్వాములైన వారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగిని సీఈవోగా కొనసాగించవద్దని, ఎల్లారెడ్డిపేట బ్యాంకు లెక్కలను విడిగా చూపించాలని కోరారు. బ్యాంకు వైస్‌చైర్మన్ అడ్డగట్ల మురళి, డైరెక్టర్లు గుడ్ల సత్యానందం, చొప్పదండి ప్రమోద్, పాటి కుమార్రాజు, బుర్ర రాజు, వేముల సుక్కమ్మ, అడ్డగట్ల దేవదాసు, ఎనగందుల శంకర్, వలుస హరిణి, పత్తిపాక సురేష్, కోడం సంజీవ్, సీఈవో పత్తిపాక శ్రీనివా్‌స్, మాజీ చైర్మన్లు గూడూరి ప్రవీణ్, గాజుల నారాయణ, దార్నం లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.● అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ -
చెట్టంత కొడుకు పోయాడు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన భూస కార్తీక్ అనే యువకుడు రెండు నెలల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన భూస శంకరయ్య–స్వరూప దంపతులకు కార్తీక్ ఒక్కగానొక కొడుకు. పెరిగిపెద్దయి అండగా ఉంటా నుకున్న కొడుకు రూ. 6 లక్షలు బెట్టింగ్‌లో పోగొట్టాడు. మనోవేదనతో జమ్మికుంట రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌కు బానిసైన కొడుకు చనిపోయాడని.. చదువుకొని ఉద్యోగం చేస్తాడని ఆశపడితే కడుపుకోతే మిగిలిందని తల్లిండ్రులు బోరుమన్నారు. -
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
● సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): రాజ్యాంగాన్ని రక్షించుకుందామని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల్లో రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసిందన్నారు. జిల్లా కోఆర్డినేటర్ జావిద్ మాట్లాడుతూ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42 శాతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతీ గ్రామంలో ప్రచారం చేయాలని కోరారు. ప్రోగ్రాం ఇన్చార్జి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాబేర బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, డీసీసీ కో ఆర్డినేటర్ లింగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాములునాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హరిలాల్‌నాయక్, కరీంనగర్ గిరిజన విభాగం కోఆర్డినేటర్ గజాన్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారత దిశగా ధాన్యం కొనుగోళ్లు
● శుభ్రం చేసిన ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలి ● అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్సిరిసిల్ల: మహిళా సాధికారత దిశగా జిల్లా అడుగులు వేస్తోందని, అందులో భాగంగానే ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) ద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వింటాలు ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్ధతు ధరగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 172, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 57, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో ఆరు కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. డీఆర్డీవో శేషాద్రి, డీఎస్వో పి.వసంతలక్ష్మి, డీసీవో రామకృష్ణ, పౌరసరఫరాల డీఎం రజిత, జిల్లా వ్యవసాయాధికారి రామారావు, ఏపీడీ గొట్టె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
డెత్‌లైన్ బెట్టింగ్!
ఒంటరి గువ్వలుఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బండి స్వామి(28) ఆటో నడపడంతోపాటు ఎల్లారెడ్డిపేటలో పాల డెయిరీ పెట్టుకున్నాడు. ఈక్రమంలో ఏర్పడ్డ పరిచయాలతో ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.18లక్షలు పోగొట్టుకున్నాడు. నిండా మునగడంతో పాలడెయిరీ, ఆటోలను సైతం అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై 2024 నవంబర్ 11న పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. స్వామి మృతితో భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు సాద్విన్, వర్షిత ఒంటరివారయ్యారు. స్వప్న ప్రస్తుతం బీడీలు చుడుతుండగా.. వారికి ఆసరాగా స్వామి తండ్రి లక్ష్మీనారాయణ మిర్చీ బండి పెట్టుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.బలైన విద్యార్థితిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన సిరికొండ నిఖిల్‌రావు(22)హైదరాబాదులో అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడి భారీ ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది 10 రోజుల క్రితం గ్రామంలోని ఓ వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాగా చదువుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటాడునుకున్న కొడుకు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలికావడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ●బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెడితే నిమిషాల్లోనే ఐదింతలు..పదింతలు అవుతాయనే ప్రకటనలు.. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే క్షణాల్లోనే మీ జీవితాలు మారుతాయనే యాడ్స్.. యువతను ఆకర్షిస్తున్నాయి. చదువుకునే విద్యార్థులు.. అప్పుడప్పుడే జీవితాల్లో స్థిరపడుతున్న యువత.. పిల్లాపాపలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న మధ్యవయసు వారు.. అందరూ బాధితులే. కష్టపడి సంపాదించిన సొమ్మును బెట్టింగ్ యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్‌లు, ఐపీఎల్ బెట్టింగ్‌లలో పెడుతూ నిండా మునుగుతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బయటకు రాలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో దాదాపు 10 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు.. ఇన్ఫ్లుయన్సర్లు.. బుల్లితెర..వెండితెర నటీనటులపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బెట్టింగ్‌యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్ బాధిత కుటుంబాల పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్ టౌన్/ఎల్లారెడ్డిపేట/తిమ్మాపూర్/శంకరపట్నంఈజీమనీ వల.. జీవితాలు విలవల●● అప్పుల ఊబిలోకి లాగుతున్న అత్యాశ ● మనీ సంపాదించవచ్చనే ప్రకటనలకు ఆకర్షణ ● బెట్టింగ్‌యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్‌లలో పెట్టుబడులు ● నిండా మునిగాక బయటకు రాలేకపోతున్న యువత ● ప్రాణాలు తీసుకుంటున్న వైనం ● రోడ్డున పడుతున్న కుటుంబాలుసిటీలకే పరిమితమైన బుకీలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ బెట్టింగ్ దందా సాగిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో స్థానికంగా ఉండే వారిని ఏజెంట్లగా నియమించుకుంటున్నారు. వీరు బెట్టింగ్‌లకు పాల్పడే వారిని గుర్తించి ఫోన్ నంబర్లతో టెలిగ్రామ్ గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేసినందుకు ఏజెంట్లకు కమీషన్ల రూపంలో భారీగానే ముట్టజెప్పుతున్నారు. బెట్టింగ్‌లకు పాల్పడేవారు ఇతరులకు అర్థంకాకుండా కోడ్ భాషలు ఉపయోగిస్తున్నారు. కోడ్ల ప్రకారం బెట్టింగ్‌లు పెడుతున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్ పూర్తయ్యాక వచ్చిన డబ్బులతో గోదావరిఖనికి చెందిన బెట్టింగ్ నిర్వాహకులు పోలీసులకు చిక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసులు నమోదైతే చిక్కులు తప్పవు గతంలో బెట్టింగ్‌లో పట్టుబడితే వారిపై పెట్టి కేసులు నమోదు చేసేవారు. ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. పోలీసుల రికార్డులో పేరు, చిరునామా, ఎలాంటి నేరానికి పాల్పడ్డారు అనే వివరాలు ఉంటున్నాయి. ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. ప్రైవేటు కంపెనీలు సైతం ఉద్యోగావకాశాలు ఇవ్వవు. ఇలా గుర్తించండి బెట్టింగ్‌యాప్ బాధితులు ఎక్కువగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఎక్కువ సమయం ఫోన్లో లీనం కావడం, తెలిసిన వారు, స్నేహితుల వద్ద అప్పులు చేయడం, ఇంట్లో వారికి తెలియకుండానే డబ్బులు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. ఇలా ఫిర్యాదు చేయండి తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం. బెట్టింగ్‌కు పాల్పడిన, ప్రోత్సహించినా, సహకరించినా చట్టరీత్యా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెట్టింగ్‌పై ఆన్లైన్లో www. cybercrime. gov. in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా టోల్‌ఫ్రీ నంబర్ 1930లోనూ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. పెద్దపల్లి జిల్లాలో కొన్ని సంఘటనలు ● 2025 మార్చి 21న మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సాయితేజ ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడటంతో రూ.6లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఇంట్లో విషయం తెలియడంతో మళ్లీ బెట్టింగ్‌ల జోలికి వెళ్లనని హామీ ఇవ్వగా నమ్మిన కుటుంబసభ్యులు అప్పులు తీర్చారు. తిరిగి సాయితేజ బెట్టింగ్‌లకు పాల్పడి రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ● 2024 జూలై 4న సుల్తానాబాద్‌లో రాత్రి వేళ వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రూ.33.10 లక్షల నగదుతో బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పట్టుబడ్డారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఐదు ఫోన్లు సీజ్ చేశారు. ● సుల్తానాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి సుమారు రూ.5లక్షల వరకు నష్టపోయాడు. అవి తీర్చేందుకు లోన్‌యాప్స్‌లో అప్పులు చేశాడు. తల్లిదండ్రులకు తెలిసి మందలించడంతో మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఐపీఎల్ పేరుతో ప్రతీ ఇంటిలోకి తొంగిచూస్తున్న బెట్టింగ్ భూతం బారినపడకుండా కుటుంబసభ్యులే రక్షించాల్సిన అవసరం ఉంది. -
నాలుగు ఇళ్లలో చోరీ
మానకొండూర్: అన్నారం గ్రామంలో మంగళవారం రాత్రి నాలుగిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి, ఓ ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. మానకొండూర్ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. గొట్టెముక్కుల విజయ ఇంట్లో నిద్రిస్తుండగా.. బంగారు పుస్తెల తాడు అపహరించారు. మధునాల వెంకటమ్మ ఇంట్లో 55 తులాల వెండి, రూ.20వేల నగదు, రుద్రోజు వెంకటాచారి ముప్పావు తులం బంగారం, 18 తులాల వెండి పట్టీలు, పాకాల రాజిరెడ్డి ఇంటి ఎదుట ఉన్న స్కూటీని ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ, క్లూస్ టీం పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మిర్చి యార్డులో.. తిమ్మాపూర్: మండల కేంద్రంలోని మిర్చియార్డ్‌లో చోరీ జరిగింది. సుమారు రూ.80 వేలు దొంగిలించారని యజమాని శ్రీనివాస్, అంజయ్య తెలిపారు. ఇద్దరు దొంగలు రాత్రివేళ చోరీకిపాల్పడినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. యజమాని శ్రీనివాస్, ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎల్ఎండీ ఎస్ఐ వివేక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం క్లూస్‌టీంకు సమాచారం అందించగా సీఐతో సిబ్బంది సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు ఆధారాలను సేకరించి విచారణ చేపడతామని తెలిపారు. -
షెడ్లు సిద్ధం.. అందని మగ్గం
● ‘వర్కర్ టు ఓనర్’ పథకంపై నేతన్నల ఆశలు ● కార్మికుడు యజమాని అయ్యేదెప్పుడో ? ● మార్గదర్శకాల ఊసే లేదు..మగ్గాల జాడే లేదు ● 2017లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన ● రూ.374 కోట్లతో 88.03 ఎకరాల్లో సిరిసిల్ల వీవింగ్ పార్క్ఇదీ పథకం స్వరూపం స్థలం: పెద్దూరు వద్ద 88.03 ఎకరాలు నిధులు : రూ.373 కోట్లు ఇప్పటికీ చేసిన ఖర్చు : రూ.210 కోట్లు మొత్తం వర్క్షెడ్లు : 48 ఇప్పటికీ పూర్తయినవి : 40 ఒక్కో షెడ్డు విస్తీర్ణం : 23వేల చదరపు అడుగులు వార్పిన్ షెడ్లు : 04 తొలివిడతగా లబ్ధిపొందే కార్మికులు : 1104 ఆధునిక మరమగ్గాలు : 4416 ఇప్పటికీ బిగించిన లూమ్స్ : 04 పవర్‌లూమ్స్ నడుపుతున్న ఇతను సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన మామిడాల సమ్మయ్య వయస్సు 48 సంవత్సరాలు. గత 28 ఏళ్లుగా నేతకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతని తండ్రి చేనేత మగ్గాలను జీవితకాలం నడిపాడు. రోజూ 10 నుంచి 12 గంటల పాటు 8 పవర్‌లూమ్స్‌పై పాలిస్టర్ బట్టను ఉత్పత్తి చేస్తే వారానికి రూ.1,600 నుంచి రూ.2వేలు వస్తాయి. సమ్మయ్య సంపాదన బట్టకు, పొట్టకే సరిపోతుంది. ఇలాంటి వారికి నాలుగు సాంచాలు(మగ్గాలు) ప్రభుత్వం ఇస్తే.. ఆసాములు లేకుండానే నేరుగా డబుల్కూలీ (రెండింతల ఆదాయం) లభిస్తుంది. సమ్మయ్య లాంటి వారికి సొంత సాంచాలు ఉన్నాయనే ధైర్యంతో మెరుగైన జీవనం సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఆ నాలుగు సాంచాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకురావడం లేదు. ఇది ఒక్క సమ్మయ్య పరిస్థితి కాదు.. సిరిసిల్లలో పనిచేస్తున్న 25వేల మంది కార్మికుల దుస్థితి. కార్మికులను యజమానులను చేయాలి సిరిసిల్లలో ఎన్నో పోరాటాల ఫలితంగా నేతకార్మికులను యజమానులుగా చేయాలనే ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేస్తే మొదటి దశలోనే 1104 మంది కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఈ పథకంపై పేద నేతకార్మికులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం వెంటనే నిర్మాణం పూర్తయిన షెడ్డుల్లో సాంచాలు ఏర్పాటు చేసి ఈ పథకాన్ని అమలు చేయాలి. – మూషం రమేశ్, పవర్లూమ్ కార్మిక సంఘం నాయకుడు ప్రాసెస్ జరుగుతోంది సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో వీవర్స్‌పార్క్ నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. మౌలిక వసతులు పూర్తయ్యాయి. పార్క్‌లో మోడల్లూమ్స్ నాలుగు బిగించాము. వాటిని ట్రయల్ రన్ చేశాం. ఈ పథకం ప్రాసెస్ జరుగుతోంది. కార్మికులకు అందించాల్సిన లూమ్స్ కొనుగోలు చేయాల్సి ఉంది. అది పూర్తయితే వర్కర్ టు ఓనర్ పథకం అమలులోకి వస్తుంది. – వెంకటేశ్వర్రావు, చేనేత, జౌళిశాఖ సీజీఎం సిరిసిల్ల: పాలకులు మారినప్పుడల్లా అభివృద్ధి స్వరూపం మారిపోతుంటుంది. అభివృద్ధి.. సంక్షేమ ప్రాధాన్యతలు మారుతుంటాయి. దీని ప్రభా వం సిరిసిల్ల నేతకార్మికులపై స్పష్టంగా కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించే ‘వర్కర్ టు ఓనర్’ పథకం ఇప్పుడు మూలనపడింది. కార్మికులను యజమానులుగా మార్చే బృహత్కార్యం అప్రధాన్యతగా మారింది. సిరిసిల్ల ఎమ్మె ల్యే, అప్పటి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సిరిసిల్లలో నేతకార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. 2017 అక్టోబరు 11న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శంకుస్థాపన చేయించారు. రూ.374కోట్ల భారీ బడ్జెట్‌తో దేశంలోనే తొలిసారిగా వీవర్స్పార్క్కు శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ‘వర్కర్ టు ఓనర్’ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆధునిక వసతులతో నిర్మాణం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల, మౌలిక వసతుల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో వీవర్స్‌పార్క్ నిర్మాణమైంది. 2023లోనే ఇక్కడ రోడ్లు, వీధిదీపాలు, మురికికాల్వలు, ప్రహరీల పనులు పూర్తయ్యాయి. వర్కర్లు పని చేసేందుకు 48 షెడ్లు నిర్మించారు. కానీ అందులో మగ్గాలను ఏర్పాటు చేయలేదు. నేతకార్మికులు కోటి ఆశలు పెట్టుకున్న ఈ పథకంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రయోగాత్మకంగా రెండు సెమీ ఆటోమేటిక్ లూమ్స్‌ను, మరో స్పన్‌వైండింగ్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. నాణ్యత, నవ్యతతో కూడిన వస్త్రాలను ఉత్పత్తి చేసే లూమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఒకేసారి నాలుగు రంగుల నూలుతో అనేక డిజైన్లతో వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రపంచస్థాయిలో వస్త్రాన్ని వీవర్స్ పార్క్‌లో ఉత్పత్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జారీకాని మార్గదర్శకాలు సిరిసిల్లలో ‘వర్కర్ టు ఓనర్’ పథకానికి ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు జారీకాలేదు. తొలి విడతగా 1,104 మంది పేద కార్మికులను ఎంపిక చేస్తామని 2023లో అధికారులు ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రెండు సెమీ ఆటోమేటిక్, మరో రెండు జకార్డ్ లూమ్స్‌ను, ఒక్క స్పన్ వైండింగ్ మిషన్ ఇస్తారు. ఒక్కో షెడ్డులో 96 లూమ్స్, 24 స్పన్‌వైండింగ్ మిషన్స్‌ను అమర్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఆ లూమ్స్‌ను కొనుగోలు చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక విధానం ప్రకటించకపోవడంతో సిరిసిల్ల నేతన్నల్లో నిరాశ నెలకొంది. తొలుత ఎంపికై న కార్మికులు ప్రాజెక్టు వ్యయంలో పది శాతం చెల్లిస్తే.. 50 శాతం ప్రభుత్వ రాయితీ, మరో 40 శాతం బ్యాంకు రుణం అందించే విధంగా ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేశారు. -
అయ్యో క్యూటీ వెళ్లిపోతున్నావా..
● ఇసుక ట్రాక్టర్ ఢీకొని పెంపుడు కుక్క మృతి ● అశ్రునయనాల మధ్య ఖననం ● డ్రైవర్‌పై కేసు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అయ్యో.. క్యూటీ వెళ్లిపోతున్నావా.. పొద్దున లేస్తే నిన్నే.. పడుకుంటే నిన్నే పిలుద్దుమూ.. ఇప్పుడు ఎవరినీ పిలువమంటావు.. అంటూ ఆ కుటుంబ సభ్యులు రోదించారు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇంటికి తెచ్చుకుని సాదుకున్నామని.. దిక్కుమల్లా ఇసుక ట్రాక్టర్ నీ ప్రాణాలు తీసుకెళ్లిందా.. అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పెంపుడు కుక్క క్యూటీని ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. వెంకటాపూర్‌కు చెందిన కంకనాల బాలలింగం క్యూటీ అనే కుక్కను సాదుకుంటున్నాడు. ఆ కుక్క కుటుంబ సభ్యులలో ఒకరిగా మెదిలేది. అయితే బుధవారం ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఆ కుక్క చనిపోయింది. బాలలింగం కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని రోదించిన తీరు కలచివేసింది. అనంతరం కుక్కను ఖననం చేశారు. కుక్క మృతికి బాధ్యుడైన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకో వాలంటూ ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో క్యూటీ మృతికి కారణమైన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ మామిండ్ల వెంకటేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భూసార పరీక్షలు ఏమైనట్టో..
చందుర్తి(వేములవాడ): పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులకు వారి భూములపై అవగాహన ఉండాలి. ఏ పంటలు వేస్తే ఆ నేలకు అనుకూలమో తెలియాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ క్లస్టర్‌కు భూసార పరీక్షల కిట్లు అందించింది. వీటి ద్వారా భూసార పరీక్షలు చేసి ఆ భూమిలో ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులది. కానీ కొన్నేళ్లుగా భూసార పరీక్షలు చేయడం లేదు. 42 క్లస్టర్లకే మినీ భూసార కిట్లు మినీ భూసార పరీక్ష కేంద్రాలను 2018లో ప్రారంభించారు. జిల్లాలోని 57 క్లస్టర్లు ఉండగా 42 క్లస్టర్లకే మినీ భూసారకిట్లు వచ్చాయి. రెండేళ్లపాటు సేవలందించాయి. ఇందులో కేంద్రం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం వ్యయాన్ని కేటాయించేవారు. ప్రారంభించిన రెండేళ్లకే మట్టిపరీక్షలకు కావాల్సిన రసాయనిక కిట్లను అందజేయకపోవడంతో పరికరాలు రైతువేదికల్లో మూలనపడ్డాయి. భూసార పరీక్షలు చేయాలి రైతులు ఏటా సంప్రదాయ పంటలు సాగుచేస్తూ ఆర్థి కంగా నష్టపోతున్నారు. పంటల్లో అధిక దిగుబడి కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారు. పెట్టుబడుల ఖర్చు రెండింతలు పెరిగిపోతుంది. జాతీయ సుస్థిర వ్యసాయాభివృద్ధి పథకంలో భాగంగా భూసార పరీక్షలు నిర్వహించి, కార్డులను అందజేస్తే వాటికి అనుగుణంగా రైతులు పంటలు సాగుచేస్తారు. – పెంటయ్య, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎలాంటి ఆదేశాలు రాలేదు గ్రామస్థాయిలో భూసార పరీక్షల చేపట్టేందుకు కావాల్సిన పరికరాలు ఉన్నాయి. కానీ పరీక్షలు చేయాలని ఎలాంటి ఆదేశాలు అందలేదు. రైతువేదికలో మినీ భూసార కిట్లు ఉన్నాయి. రసాయనిక కిట్లను అందజేస్తే పరీక్షలు చేస్తాం. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు సాగు చేసుకుంటే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. – రామారావు, ఇన్చార్జి జిల్లా వ్యవసాయాధికారి మూలకుపడ్డ మినీ భూసారకిట్లు సరఫరా లేని రసాయనిక కిట్లు నేల రకాలపై రైతులకు అవగాహన కరువు -
రాజన్న హుండీ ఆదాయం రూ.1.95కోట్లు
వేములవాడ: రాజన్నకు 20 రోజుల్లో రూ.1,95,75,168 నగదుతోపాటు 287 గ్రాములు బంగారం, 18.500 కిలోల వెండి సమకూరిటన్లు ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. గుడి ఓపెన్‌స్లాబ్‌లో బుధవారం సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కించారు. నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం ఆరు నెలలకు రూ.11,47,510 వచ్చినట్లు ఈవో తెలిపారు. వనరుల దోపిడీ ఆపాల్సిందే.. ● పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ పెద్దపల్లిరూరల్: దేశంలోని బడా కార్పొరేట్ శక్తులకు సహజవనరుల సంపదను దోచుకునేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. పెద్దపల్లిలో బుధవారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కనారాయణరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అటవీ సంపదను దోపిడీ చేసేకుట్రలో భాగంగానే మహిళలపై అత్యాచారాలను సాగిస్తోందని ఆరోపించారు. ఆదివాసీల హక్కులను కాపాడి వారికి అండగా ఉండేందుకు అన్నివర్గాల ప్రజలు రక్షణగా నిలవాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల హననాన్ని ఆపేయాలని, మహిళలపై అత్యాచారాలను నిలిపేయాలని, దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఎత్తేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని తీర్మానించారు. కరీంనగర్లో ఏప్రిల్ 20న సభ.. ఆదివాసీహక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 20న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నక్క నారాయణరావు ప్రకటించారు. నాయకులు సదానందం, శ్రీనివాస్, వెంకన్న, రాజమల్లన్న, బాపన్న, రవి, రవీందర్, సదానందం, వినోద్, సంపత్ పాల్గొన్నారు. -
బాలుడి మృతదేహం లభ్యం
గొల్లపల్లి: మండలంలోని రంగదామునిపల్లి గ్రామంలోని రిజర్వాయర్‌లో మంగళవారం గ్రామానికి చెందిన బాలుడు నేరెల్ల నరేశ్ (12) గల్లంతు అయ్యాడు. బుధవారం మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. గ్రామానికి చెందిన నరేశ్ రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి ఇందులో పడి గల్లంతయ్యాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడని తండ్రి నేరెల్ల పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకొని కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో కాంట్రాక్టు కార్మికుడు అవాంచ శివశంకర్(42) బుధవారం ఇంట్లోని ఫ్యా నుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు...గాంధీనగర్‌కు చెందిన శివశంకర్ ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ మానసికంగా బాధపడుతున్నాడని, ఈ క్రమంలోనే ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య లహరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒకరి ఆత్మహత్యసిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయవీధికి చెందిన చౌటపల్లి రాము(42) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు. కుటుంబ కలహాలతో కొద్ది రోజుల క్రితం రాము భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేని సమయాన్ని చూసి మనస్థాపనతో ఉరివేసుకున్నాడు. మృతునికి భార్యతోపాటు పదేళ్లలోపు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. -
మా కులం పేర్లు మార్చండి సారూ...
సిరిసిల్ల/వేములవాడ: ‘మా కులం పేర్లు మార్చండి సారూ.. ఎక్కడైనా చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందని.. మా కులాల పేరు మార్చేలా చర్యలు తీసుకోవాలని పలు కులాల ప్రతినిధులు రాష్ట్ర బీసీ కమిషన్ ఎదుట వాపోయారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ముందుగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామికి దర్శించుకున్నారు. అనంతరం సిరిసిల్ల లోని ఇందిరానగర్, గీతానగర్లలో పర్యటించారు. పలు కులాల వారితో సమావేశమయ్యారు. పిచ్చగూంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మలి కులాల వారు తమ కులాల పేర్లను మార్చాలని కమిషన్ సభ్యులకు విన్నవించారు. తమ్మల కులానికి శూద్ర, నాన్ బ్రాహ్మణ్ పేరిట కులం సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆలయాల్లో అర్చక, ఇతర ఉద్యోగాలు పొందేందుకు ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. తమకు తమ్మల పేరిట కులం సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. దొమ్మరి కులం పేరును సర్టిఫికెట్లో గాడే వంశీయులుగా మార్చాలని కోరారు. వారి ఉపాధి మార్గాలు, ఆదాయం, విద్యాస్థితిపై కమిషన్ చైర్మన్ ఆరా తీశారు. కులం పేరు దొమ్మరి ఉండడంతో విద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో అవమానానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఇందిరానగర్‌లోని పిచ్చగూంట్ల(వంశరాజ్) పలువురు ఇండ్లలోకి వెళ్లి మాట్లాడారు. వారు చేస్తున్న పని, ఆదాయం తదితర వివరాలు తెలుసుకున్నారు. తమ కులస్తులవి 46 ఇండ్లు ఉన్నాయని, పిచ్చగూంట్ల అని చెప్పుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పూరిండ్లలో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కమిషన్ చైర్మన్ నిరంజన్ అధికారులను ఆదేశించారు. మురికి నీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు సూచించారు. బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ప్రాధాన్యం ఇవ్వాలి బీసీ రిజర్వేషన్ ఫలాలు ఇప్పటి వరకు వర్తించని బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కులం పేరిట ఇబ్బంది పడుతున్నవారు ఆత్మన్యూనత భావానికి గురికావద్దని, పిల్లలను చదివించాలని తెలిపారు. రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు పరిష్కరించేందుకు జిల్లాలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాభాయ్, తహసీల్దార్ మహేశ్‌కుమార్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజమనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు. సమాజంలో అవమానానికి గురవుతున్నాం బీసీ కమిషన్ చైర్మన్ ఎదుట పలు కులాల ప్రతినిధుల ఆవేదన -
ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని ధర్నా
సిరిసిల్లటౌన్: తమ తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని బొంగులకింది తండా ప్రజలు కోరారు. మంగళవారం కలెక్టరేట్‌కు తరలొచ్చి ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను తమ తండాను ప్రత్యేక పంచాయతీగా చేయాలని కోరగా ప్రపోజల్ పంపినట్లు ప్రకటించారన్నారు. కానీ, అదే పార్టీలోని కొందరు తమ స్వార్థం కోసం రాజ్‌నాయక్ తండాతో పాటు తమ తండాను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి తాము రాజ్‌నాయక్ తండా జీపీలో ఉండటం లేదని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం పంచాయతీ ఆఫీస్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారని, ఈ క్రమంలో తమ డిమాండ్‌ను గుర్తించి తమ తండాను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని బి. శ్రీనివాస్, భాస్కర్ తదితరులు కోరారు. ఈమేరకు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. -
రాములోరి కల్యాణం ఘనంగా జరిపించాలి
● ఆర్డీవో రాజేశ్వర్ వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు సీతారాముల కల్యాణోత్సవాలను గతంలోకంటే ఘనంగా జరిపించాలని, ఇందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆర్డీవో రాజేశ్వర్ సూచించారు. మంగళవారం చైర్మన్ చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. శ్రీరామనవమి రోజు రాజన్న ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణానికి అశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రీరామనవమికి వచ్చే భక్తులకు తాగునీటి సరఫరా, క్యూ లైన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, రవాణా, పారిశుధ్యం, ఫైర్, కల్యాణ వేదికలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వేసవికాలం దృష్ట్యా భక్తులకు ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖను కోరారు. భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు, అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నూతన ఆవిష్కరణలతో ఉపాధి
● పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు సిరిసిల్ల: నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ వినియోగంతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, స్వయం ఉపాధి పథకాలు, ఉపాధి అవకాశాలపై మంగళవారం కలెక్టరేట్లో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఐటీఐ, డిగ్రీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధిరంగంలో రాణించాలన్నారు. మార్కెట్లో వస్తున్న నూతన టెక్నాలజీ, యంత్రాలు అప్డేట్పై ఎప్పటి కప్పుడు సమాచారం ఉండాలని పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) అమలు చేస్తుందని, ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల అర్హత ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుస్తాయన్నారు. నిరుద్యోగులకు పరిశ్రమలకు వారధిగా ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. డీఆర్డీవో శేషాద్రి, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భారతి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి
● ఎస్పీ మహేశ్ బీ.గీతే కోనరావుపేట(వేములవాడ): సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్పీ మహేశ్ బీ.గీతే అన్నారు. మంగళవారం కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, కేసుల వివరాలు పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్ల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది పెట్రోలింగ్ సమయంలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా పెట్టి తనిఖీ చేయాలన్నారు. విజుబుల్ పోలీసింగ్‌లో భా గంగా తరచూ గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతూ సైబర్ నేరాలు, బెట్టింగ్, గేమింగ్ యాప్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్‌రెడ్డి, ట్రెయినీ ఎస్సై రాహుల్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. కఠినంగా శిక్షించాలివేములవాడ: రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎర్రబాపు ఇస్రాయల్ను ఈనెల 24న హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో దస్తగిరి అనే వ్యక్తి దారుణంగా హత్య చేయడంపై మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును అమల్లోకి తీసుకువచ్చి రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల్‌గౌడ్, రేగుల దేవేందర్, పొత్తూరు అనిల్‌కుమార్, పిట్టల మనోహర్, పెంట రాజు, పురుషోత్తం, గోపికృష్ణ, ప్రతాప సంతోష్, గడ్డం సత్యనారాయణరెడ్డి, గోగికారి శ్రీనివాస్, గొంటి శంకర్, కటకం జనార్దన్, రేగుల రాజకుమార్, గుజ్జే మనోహర్, పంపరి శంకర్, అనిల్, వడ్లకొండ శ్రీకాంత్, కనికరపు శ్రీనివాస్, హరీశ్, నాగేంద్రబాబు, పొత్తూరి మల్లేశ్, అన్నపూర్ణ పాల్గొన్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు వైష్ణవిఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రహీంఖాన్‌పేట ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పయ్యావుల వైష్ణవి జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. ఈనెల 27 నుంచి బిహార్‌లో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా వైష్ణవిని కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఆది శ్రీనివాస్, పాట్రన్ కేకే మహేందర్‌రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ నర శ్రీనివాసరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సాన బాబు, మామిడి శ్రీనివాసు అభినందించారు. ప్రత్యేక పథకాలు అందించాలిసిరిసిల్లటౌన్: తమ సామాజికవర్గం ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అందించాలని ఎరుకల ఏకలవ్య జిల్లా అధ్యక్షుడు కోనేటి సాయన్న కోరారు. మంగళవారం సంఘం ఎన్నికల అనంతరం కార్యవర్గంతో పాటు ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ని ర్వహించారు. 13 మండలాల అధ్యక్షులు, ప్రఽ దాన కార్యదర్శులు సమావేశానికి విచ్చేసి నూ తన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కా ర్యదర్శిగా మొగలి ధర్మరాజు, మహిళా విభాగ జిల్లా అధ్యక్షురాలిగా కుర్ర సావిత్రి, ఉపాధ్యక్షులు మానుపాటి పరశురాములు, అనుముల దేవయ్య, కార్యదర్శి సుల్తాన్ తిరుపతి, కార్యవర్గ సభ్యులు కోలేటి రమేశ్, సుల్తాన్, శేఖర్, మొగిలి నాగరాజు, కట్ట శంకర్, నిమ్మల కనకయ్య, నిమ్మ రాజయ్య, మొగలి రాజశేఖర్, బిజిలి కనకరాజు, వానపాటి తిరుపతి, మొగిలి రవి, బండి యాదగిరి పాల్గొన్నారు. -
‘మాయదారి’ రోగాలు !
● తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు ● వారసులకు ఉద్యోగాలు ● జిల్లాలో అక్రమంగా నియామకాలు ● వరుసగా వెలుగుచూస్తున్న మోసాలుసిరిసిల్ల: కొందరు ఉద్యోగులకు రిటైర్మెంట్కు ఆరేడేళ్ల ముందు మాయదారి రోగాలు వస్తున్నాయి. అప్పటి వరకు ఠంఛన్‌గా విధులకు హాజరైన వారు ఇక అక్కడి నుంచి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్తూ వివిధ రకాలు చికిత్సలు పొందుతున్నారు. కాదు..కాదు.. చికిత్స పొందినట్లు మెడికల్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. చదవండి మీకే తెలుస్తుంది. అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ తాము పనిచేయలేమని తమ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది జిల్లాలోని కొందరు ఉద్యోగులకు అంటుకున్న అసలు మాయదారి రోగం. ఇప్పటి వరకు ఇలా చాలా మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో తమ వారసులను ప్రభుత్వ ఉద్యోగులుగా కూర్చోబెట్టారు. లేని రోగాలను తెచ్చుకుని, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లను ‘కొని’తెచ్చుకున్న వైనాలు జిల్లాలో కొన్ని వెలుగులోకి రాగ.. అనేక సంఘటనలు ఇంకా మరుగునపడి ఉన్నాయి. జిల్లాలో సాగుతున్న అక్రమాలపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసు(రిటైర్మెంట్ గడువు) ఇంకా ఆరు, ఏడు ఏళ్లు ఉందనగా.. దీర్ఘకాలిక సెలవులోకి వెళ్తారు. మెడికల్ లీవ్ పెడతారు. తరువాత కొన్ని నెలలపాటు అనారోగ్య సమస్యలు చూపుతూ వివిధ చికిత్సలు పొందినట్లు, ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించుకుని, మందులు వాడినట్లు రికార్డులు సృష్టిస్తారు. ఆ మెడికల్ రిపోర్టులకు బలాన్నిచ్చేలా హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద ఆస్పత్రులకు, ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలు పొందినట్లుగా మరిన్ని సర్టిఫికెట్లు సాధించుకుంటారు. వీటిని ఆసరా చేసుకుని, ఇక తాము ఉద్యోగం చేసేందుకు అనర్హులమని, అనారోగ్య సమస్యలతో విధులు చేయలేమని అర్జీ పెట్టుకుంటారు. మానవతా దృక్పథంతో తమ వారసులకు ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటారు. వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన ఉద్యోగుల వారసులకు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అధికారం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీకి ఉంటుంది. ఈ కమిటీలో ఆయా ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, డీఎంహెచ్‌వో, ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షకులతో కూడిన కమిటీ ఉంటుంది. ఈ కమిటీ పర్యవేక్షణలో అర్జీ పెట్టుకున్న ఉద్యోగి పనిచేయలేని స్థితిలో ఉన్నారా.. అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అది నిజమే అయితే కమిటీ సిపార్సు మేరకు కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సదరు ఉద్యోగి వారసులకు ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. ప్రభుత్వ జీవో ఆధారంగా అనేక మంది ఇలా వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకున్నారు. ‘సెస్’లో ఏం జరుగుతోంది..!? జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ఉద్యోగులు తమ పిల్లలకు వారసత్వంగా ఉద్యోగాలను ఇప్పించే విధానం లేదు. ‘సెస్’లో పనిచేసే ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఉంటాయి. కానీ ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్ ఉండదు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ఉద్యోగులు ‘సెస్’ పాలకవర్గం అండదండలతో అక్రమ విధానంలో ఉద్యోగాలు పొందారు. ‘మాయదారి’ రోగాలను ‘కొని’తెచ్చుకుని ‘సెస్’ ఉన్నతాధికారులను, మెడికల్‌బోర్డు సభ్యులను డబ్బులతో కొనేసి తప్పుడు ధ్రువీకరణపత్రాలతో తండ్రి ఉద్యోగాన్ని వారసత్వంగా మెడికల్గ్రౌండ్స్(అనారోగ్య సమస్యలతో) సాధించుకున్నారు. ‘సెస్’లో వారసత్వ ఉద్యోగాలు సాధించుకున్న కొందరు నిజంగానే మెడికల్ అన్‌ఫిట్ కావడంతో ఉద్యోగాల్లో చేరగా.. అనేక మంది మాత్రం అన్నీ సవ్యంగా ఉన్నా.. అక్రమ పద్ధతుల్లో ‘సెస్’లో ఉద్యోగాలు సాధించి రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్నారు. జిల్లా పరిధిలోనే జీవితకాలం ఉద్యోగం కావడంతో కడుపులో చల్లకదలకుండా ‘సెస్’ పరిధిలో ఉద్యోగాలు చేస్తున్నారు. వచ్చే 11 ఏళ్లకు సరిపోయేంత మంది వారసులు వివిధ ఖాళీ పోస్టుల్లో ఉద్యోగులుగా చేరిపోయారు. ‘సెస్’ డైరెక్టర్లు, ఉన్నతాధికారుల అండదండలతో అక్రమమార్గంలో విధుల్లో చేరారు. ఏ విచారణ లేకుండా దర్జాగా డ్యూటీ చేస్తున్నారు. తనిఖీలు లేకుండానే ఉద్యోగాలు..? జిల్లాలో దశాబ్దకాలంగా ‘సెస్’తోపాటు, రెవెన్యూ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ ఇలా అన్ని ప్రభుత్వ శాఖల్లో మెడికల్ ఇన్వాలిడేషన్ గ్రౌండ్స్‌లో ఉద్యోగాలు పొందిన వారిపై ఎలాంటి విచారణ లేకపోవడంతో ఏళ్లుగా ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు. కొందరైతే నకిలీ విద్యార్హతల(బోగస్) సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది.. ప్రమోషన్లు పొందినట్లు సమాచారం. ఏది ఏమైనా ‘సెస్’ లాంటి సంస్థతోపాటు ప్రభుత్వ శాఖల్లో తండ్రి ఉద్యోగాన్ని పొందిన వారిపై విచారణ చేపడితే పశువైద్యశాఖ తరహాలో తప్పుడు ధ్రువీకరణపత్రాల భాగోతాలు బయటపడనున్నాయి. ఇటీవల వెలుగుచూసిన ఘటనలు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి పశువైద్యశాలలో పనిచేస్తున్న కొమురయ్య తాను పనిచేయలేని స్థితిలో ఉన్నానని తన కొడుకుకు ఉద్యోగం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు ఏడు నెలల కిందట మెడికల్ ధ్రువీకరణపత్రాలతో అర్జీ పెట్టుకున్నాడు. దీనిపై జిల్లా స్థాయి కమిటీ పరిశీలించింది. అధికారుల పరిశీలనలో మెడికల్ సర్టిఫికెట్లు తప్పుగా ఉన్నట్లు అనుమానించారు. దీంతో కలెక్టర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించారు. కొమురయ్య సమర్పించిన వైద్యుల ధ్రువీకరణపత్రాల ఆధారంగా చేపట్టిన రహస్య విచారణలో ఆ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులు, వారి మెడికల్ సర్టిఫికెట్లు, ఆస్పత్రి లోగో, ఐఎంఏలో వైద్యుల వివరాలు అన్నీ తప్పుడు పత్రాలుగా నిర్ధారణ అయింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్, కొమురయ్యపై పోలీసు కేసు నమోదు చేయించారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పశువైద్యశాలలో అటెండర్‌గా పనిచేసే కె.దేవమ్మ 2024 జూన్ 1న మెడికల్ ఇన్వాలిడేషన్కు తప్పుడు ధ్రువీకరణపత్రాలతో దరఖాస్తు చేయగా.. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. కరీంనగర్‌కు చెందిన డాక్టర్ జి.కిరణ్ ఏడీ, డీఎం(గ్యాస్టో) డాక్టర్ రవికుమార్, పి.శరత్‌రెడ్డి వద్ద వైద్యపరీక్షలు చేయించుకున్నట్లుగా, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నట్లుగా తప్పు డు పత్రాలను సమర్పించినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేవమ్మను కలెక్టర్ సస్పెండ్ చేశారు. దరఖాస్తులు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వడం లేదు మెడికల్ ఇన్వాలిడేషన్ గ్రౌండ్స్‌లో ఒకటి, రెండు దరఖాస్తులు వచ్చాయి. కానీ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగులు చనిపోయిన ఘటనల్లో ఐదు కారుణ్య నియామకాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. మెడికల్ గ్రౌండ్స్‌లో గతంలో ఏం జరిగిందో మా పాలకవర్గానికి సంబంధం లేదు. ఇప్పుడైతే ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవ్వం కూడా. – చిక్కాల రామారావు, ‘సెస్’ చైర్మన్, సిరిసిల్ల, -
పరీక్షలు బాగా రాయాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వేములవాడరూరల్: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మంగళవారం హన్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారీ, స్టోర్ రూం, తరగతి గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. వచ్చే సంవత్సరం అడ్మిషన్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించా రు. అనంతరం లింగంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల బరువు, ఎత్తు వివరాల రిజిస్టర్‌ను పరిశీలించారు. నాణ్యమైన పోష్టికాహారం అందజేయాలని సూచించారు. టోకెన్ పద్ధతిలో కొనుగోళ్లు సిరిసిల్ల: యాసంగి సీజన్లో వరికోతలపై హర్వెస్టర్ యజమానులతో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి నియంత్రిత విధానంలో కోతలు జరిగేలా చూడాలని, టోకెన్ విధానంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై మంగళవరం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రైతులంతా ఒకేసారి ధాన్యం తీసుకువచ్చి ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాలన్నారు. కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్, వేయింగ్ యంత్రాలు, తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్నారు. లారీల్లో మాత్రమే ధాన్యం తరలించాలని స్పష్టం చేశారు. కొనుగోళ్లపై ఫిర్యాదుల నమోదుకు జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి, డీఎస్వో వసంతలక్ష్మి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రజిత, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, మార్కెటింగ్ శాఖ డీఎం ప్రకాష్, డీసీవో రామకృష్ణ, డీఏవో రామారావు, తూనికలు కొలతల అధికారి రూపేశ్ పాల్గొన్నారు. నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు జిల్లాలోని మధ్యమానేరు, అనంతగిరి జలాశయాల్లో ముంపునకు గురైన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ముంపు గ్రామాలైన గుర్రంవానిపల్లి, చీర్లవంచ, చింతలఠాణా, కొదురుపాక, రుద్రవరం, సంకెపల్లి, ఆరెపల్లి, తదితర గ్రామాల నిర్వాసితులు ఏప్రిల్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. -
బస్టాండ్‌లో పోలీసుల తనిఖీలు
సిరిసిల్ల: అది సిరిసిల్ల పాతబస్టాండ్.. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో సికింద్రాబాద్‌కు వెళ్లే మొదటి బస్సు అప్పుడే చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన మహిళా కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుల్, ఎస్సై ఆ బస్సులోకి ప్రవేశించి ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆధార్‌కార్డును చెక్ చేస్తూ వివరాలు ఆరా తీశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించారు. తమ డిమాండ్ల సాధనకు ఆశవర్కర్లు ‘చలో అసెంబ్లీ’ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. చివరికి 16 మంది ఆశకార్యకర్తలను సిరిసిల్ల ఠాణాకు తరలించారు. -
ఎండిన పొలంపై వడగండ్ల దాడి
● అకాలవర్షంతో దెబ్బతిన్న పంటలు ● జిల్లాలో భారీగా పంటనష్టం ● చందుర్తిలో 500 ఎకరాలకు పైగానే.. ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు తిప్పని భూమేశ్. తనకున్న ఎనిమిదెకరాల్లో ఏడున్నర ఎకరాల్లో వరిసాగు చేశాడు. మిగతా 20 గుంటల్లో నువ్వు సాగుచేశాడు. 6 ఎకరాల వరిపొలం మరో 20 రోజుల్లో కోత దశలో ఉంది. శుక్రవారం కురిసిన వడగండ్ల వానకు సగానికి పైగా వడ్లు రాలిపోయాయి. ఇప్పటికే ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టాడు. సగానికి పైగా పంట దెబ్బతినడంతో పెట్టుబడి చేతికి రాదన్న బెంగతో ఉన్నాడు.చందుర్తి(వేములవాడ): నీరు లేక పొలాలు ఎండి పోగా.. వడగండ్ల వాన దాడితో రైతులు మరింత నష్టపోయారు. జిల్లాలో భారీ స్థాయిలో పంట నష్టం ఏర్పడింది. చందుర్తి మండలంలో దాదాపు 500 ఎకరాలకు పైగా వరిపంట నష్టం ఏర్పడింది. ముస్తాబాద్, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో వరిపంటకు తీవ్రస్థాయిలో నష్టం ఏర్పడింది. మరో 20 రోజుల్లో పంట కోతకు రానుండగా అకాలవర్షానికి పంట నేలపాలైంది. వడగండ్ల వానతో వరిపొలాలు నేలకొరిగిపోగా.. మామిడికాయలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు పంటనష్టం వివరాలు సేకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో నష్టం తెలియనుంది. నీరు లేక సగానికి పైగా పంట ఎండిపోయిందని, వడగండ్ల వానతో మిగిలిన సగం కూడా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.25వేలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. -
● రేషన్ కార్డు కోసం పేర్లు డిలీట్ చేసుకున్న కొత్త జంటలు ● రాజీవ్ యువ వికాసం, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య శ్రీ పథకాలకు దూరం ● రేషన్‌కార్డులు వచ్చే వరకు పథకాలు లేనట్లే ● లబోదిబోమంటున్న అర్హులైన లబ్ధిదారులు
ఈ యువకుడు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బూస రాకేశ్. వివాహం అనంతరం తన భార్యతో కలిసి కొత్త రేషన్‌కార్డు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అధికారులు పాతకార్డులో పేరు తీసివేశారు. కొత్త రేషన్ కార్డు జారీచేయలేదు. పాతకార్డులో పేరు ఉండక, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తోందో తెలియక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాడు.సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్‌కార్డును ప్రామాణికం చేయడంతో కొత్తకార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వకాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా చేర్పులు, మార్పులకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా.. జారీ విషయంలో ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లయినవారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్‌కార్డు నుంచి చాలామంది పేర్లు రద్దు చేసుకుని కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సైతం రేషన్‌కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే ఉన్న నాలుక ఊడిపోయిన చందంలా మారినట్లయింది. కొత్త కార్డులొస్తాయని ఆశతో... ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతో మంది కొత్తగా వివాహం అయినవారు రేషన్‌కార్డు పొందేందుకు, తమ తల్లిదండ్రులతో ఉన్న తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి రాకపోగా, ఉన్న పాత రేషన్‌కార్డులో పేరు డిలీట్ కావడంతో ప్రభుత్వం అందించే సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, తదితర ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్‌యువ వికాసం పథకం సైతం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,78,620 రేషన్‌కార్డులుండగా, కొత్త కార్డుల కోసం సుమారు 50వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా.. రేషన్ కార్డులు ఉన్న పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నా లేని పేదల సంగతేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా.. కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదలు నష్టపోతున్నారు. -
సిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిల
న్యాయం చేయండి మాది సిరిసిల్లలోని రాజీవ్‌నగర్. ఆరు నెలల కింద ఇద్దరు వచ్చి నా దగ్గర రూ.20వేలు తీసుకున్నారు. ఒకరు ప్రకాశ్‌రావు వకీలు వద్ద పనిచేస్తానని, మరొకరు పోలీస్ అని చెప్పారు. నా బంగారం తాకట్టుపెట్టి ఆ డబ్బులు ఇచ్చాను. నాకు న్యాయం చేయాలి. – కోన లక్ష్మి, సిరిసిల్ల పింఛన్ ఇప్పించాలి మాది గంభీరావుపేట మండలం. నాకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది. కొద్దిరోజుల క్రితం నా ఖాతాలో రూ. 50వేలు జమయ్యాయి. అది నాకు తెల్వదు. బ్యాంక్ వాళ్లు నా అకౌంటు ఫ్రీజ్ చేశారు. బ్యాంకు అఽధికారులను అడిగితే పోలీసోళ్లకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. నాకు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు కావాలంటే తీసుకోవడానికి వీల్లేకుండా ఉంది. – మేర్గు లక్ష్మి, గంభీరావుపేట బ్యాటరీ వీల్‌చైర్ ఇప్పించండి నాకు 14 సంవత్సరాలు. మాది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్. డీఎంవో వ్యాధితో బాధపడుతున్నాను. నేను నడవలేను. నాకు బ్యాటరీ వీల్‌చైర్ ఇప్పించాలి. ఇది వరకు కూడా దరఖాస్తు ఇచ్చాం. కలెక్టర్ సార్ దయచూపాలి. – మహమూద్, ఎల్లారెడ్డిపేటస్కూటీ ఇప్పించాలి మాది సిరిసిల్ల శివారులోని సర్దాపూర్. పుట్టుకతో దివ్యాంగురాలిని. పూర్తిగా నడవలేని స్థితి. గతంలో కూడా పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేశాం. మూడు చక్రాల స్కూటీని అందించాలి. – మట్టె దివ్య, సర్దాపూర్ మందులు కొరత తీర్చాలి జిల్లా ఆస్పత్రిలో మందుల కొరతను తీర్చాలి. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలు బయట డబ్బులు పెట్టి మందులు కొంటున్నారు. కొంతమంది సిబ్బంది రోగులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. – అన్నల్దాస్ గణేష్, సిరిసిల్ల -
ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు
సిరిసిల్ల: జిల్లాలో ఎనిమిది మందికి కారుణ్య నియామకపత్రాలను కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అందించారు. జెడ్పీ ఉద్యోగులు ఇటీవల అకాల మరణంతో వారి కుటుంబ సభ్యులకు వారసత్వంగా కారుణ్య పథకంలో నియమించారు. ఈమేరకు కర్ర సాత్విక, తాటికొండ శ్రీజ, అనగందుల వెంకటేశ్, ఆరుట్ల/మధునాల స్నేహ, ఎస్.వెన్నెల, తీగల మంజులత, మల్లారపు సహజ, వొల్లాద్రి రక్షితకు నియామకపత్రాలను అందించారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈవో వినోద్, డీఆర్డీవో శేషాద్రి పాల్గొన్నారు. టీబీ నియంత్రణ అందరి బాధ్యత సిరిసిల్లటౌన్: జిల్లాలో క్షయ(టీబీ) నియంత్రణలో పౌరులు బాధ్యతగా పాల్గొనాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీబీ రహిత గ్రామాలుగా శివంగాలపల్లి, అనంతపల్లి, రామన్నపేట, కంచర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్‌వో రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పది పరీక్షలు తనిఖీ సిరిసిల్లఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర పరిశీలకుడు రాజీవ్ పలు కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో 35 పరీక్షా కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,750 మంది హాజరైనట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్లలోని విజ్ఞానవర్ధిని హైస్కూల్, డీఈవో వేములవాడలోని హంసిని డీజీ హైస్కూల్, చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్, గౌతమ్ హైస్కూల్, వేములవాడ బాలికల హైస్కూల్, కోనరావుపేట మండలం ధర్మారం హైస్కూలోని కేంద్రాలను తనిఖీ చేశారు. -
గ్రీవెన్స్ డేకు 13 ఫిర్యాదులు
సిరిసిల్లక్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 13 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ మహేశ్ బీ.గీతే తెలిపారు. బాధితులతో మాట్లాడిన అనంతరం అర్జీల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. బీడీ కార్మికుల ఆస్పత్రి ఏర్పాటు చేయాలి కోనరావుపేట(వేములవాడ): సిరిసిల్లలో బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు జవ్వాజి విమల కోరారు. మల్కపేటలో సోమవారం మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా మంది కార్మికులకు అందడం లేదన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కొమ్ము సుభద్ర, ఎర్రోళ్ల ఎల్లవ్వ, కంబంపెల్లి వరలక్ష్మి, భవాని, దేవేంద్ర, లక్ష్మి, భూమయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు. అంజన్న ఆలయ ఇన్చార్జి ఈవోగా శ్రీనివాస్ వేములవాడఅర్బన్: అగ్రహారం శ్రీహనుమాన్ ఆల య అడిషనల్ ఇన్చార్జి ఈవోగా నాగారపు శ్రీనివా స్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఈవో మారుతీ బదిలీపై వెళ్లారు. ఈనెల 28న హుండీ లెక్కించనున్నట్లు తెలిపారు. ఐడీఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాజు సిరిసిల్ల: ఇండియన్ డెంటల్ అసోసియేషన్(ఐడీఏ) జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ పి.రాజు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎస్.సతీశ్‌కుమార్, కోశాధికారిగా డాక్టర్ డి.శ్యాంసుందర్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఐడీఏ జిల్లా తొలికార్యవర్గ ప్రమాణస్వీకారం ఐడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డీఎన్ స్వామి, కార్యదర్శి డాక్టర్ డి.చలపతిరావు, కార్యదర్శి డాక్టర్ డి.నవీన్ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు డీఎన్ స్వామి మాట్లాడుతూ వృత్తిపరమైన అభివృద్ధిని పెంపొందించడానికి నోటి ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించాలన్నారు. జిల్లా దంతవైద్యులు శివరామకృష్ణ, పూర్ణచందర్, గోపీకృష్ణ, కె.రాజేందర్, సంతోష్, ఎం.రాజేందర్, నరేశ్, ఓం బ్రహ్మం, వెంకటేశ్, వంశీ, ఎ.సంతోష్, విజయకుమార్, రమ్య, స్నేహ, ఆకాంక్ష, స్రవంతి, ప్రియాంక, గీత, త్రిసంధ్య, లహరి, చందన, నిఖిత, జయశ్రీ, శిల్ప పాల్గొన్నారు. సెమిస్టర్ పరీక్షలు బహిష్కరిస్తాం వేములవాడఅర్బన్: ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో సెమిస్టర్ పరీక్షలు బహిష్కరిస్తామని శాతవాహన యూ నివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఎస్‌యూ రిజి స్ట్రార్ రవికుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సుప్మా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడు తూ రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్ తేదీలను ప్రకటించవద్దని కోరామన్నారు. పరీక్షల తేదీలను ప్రకటించి నిర్వహణకు ముందుకొస్తే బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు అయాచితుల జితేందర్‌రావు, విష్ణు ఉన్నారు. నేడు కేంద్ర పథకాలపై అవగాహనసిరిసిల్లకల్చరల్: కేంద్రం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న వివిధ పథకాలు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ, పీఎం విశ్వకర్మ, పీఎం ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం, పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజేస్ స్కీమ్, పీఎం ఇంటర్న్‌షిప్ తదితర పథకాలపై మంగళవారం కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పరి శ్రమల శాఖ జిల్లా మేనేజర్ హనుమంతు తెలి పారు. పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలిసి నిర్వహించే సదస్సుకు నిరుద్యోగ యువత హాజరుకావాలని కోరారు. -
ఇది ‘కేటీఆర్.. ఓ టీస్టాల్’ కథా చిత్రం!
సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ చిరు వ్యాపారి.. కేటీఆర్ పేరుతో నడుపుకుంటున్న టీ కొట్టు డబ్బాను అధికారులు ఇటీవల ఎన్నికల సమయంలో మూసివేయించిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాపారికి కేటీఆర్ అండగా నిలిచారు. మళ్లీ టీకొట్టు పెట్టిస్తానని భరోసా ఇచ్చారు. గత నెలలో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మఘాట్ వద్ద కేటీఆర్ పేరు, ఫొటోతో ఉన్న టీస్టాల్‌ను అధికారులు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ లేదన్న సాకుతో ఫిబ్రవరి 19న మూయించారు. అయితే బీఆర్ఎస్ అభిమానులు, కేటీఆర్ అనుచరులు అదే రోజు సాయంత్రమే హోటల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్‌తో టీస్టాల్‌ను తెరిపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న సాయంత్రం టీస్టాల్ డబ్బాకు అనుమతి లేదని పేర్కొంటూ మున్సిపల్ అధికారులు ఆ డబ్బాను పోలీస్ రక్షణ మధ్య తొలగించి, ట్రాక్టర్‌పై మరోచోటికి తరలించారు. ఈ చర్యతో శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్, బత్తుల శ్రీనివాస్‌కు ఫోన్ చేసి తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఇచి్చన మాట ప్రకారం ఇటీవల సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా శ్రీనివాస్‌కు ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బులతో మరోచోట హోటల్ పెట్టుకోవాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. కేటీఆర్ సలహాతో పట్టణంలోని గాం«దీచౌక్‌లో శ్రీనివాస్ కొత్తగా టీస్టాల్‌ను కేటీఆర్ పేరుతో ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేటీఆర్, ఎమ్మెల్సీ రమణతో కలసి శ్రీనివాస్ టీస్టాల్‌ను ప్రారంభించారు. -
చి‘వరి’కి మేతగా..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలు నీరందక చి‘వరి’కి మూగజీవాలకు మేతగా మారుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల రైతుల వరప్రదాయిని సింగసముద్రం ఆయకట్టు కింద సాగుచేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. సింగసముద్రంలో 24 ఫీట్ల వరకు నీరు ఉండగా, ఈ నీటితో 1,600 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సి ఉంది. చివరి భూముల్లోని పంటలు చేతికి రావాలనే ఉద్దేశ్యంతో నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు సమావేశమై వెయ్యి ఎకరాలకే తైబందీ విధించుకున్నారు. అయినా నీరు అందక పంటలు ఎడిపోతున్నాయి. రాచర్లబొప్పాపూర్ శివారులోని పంట పొలాల్లో ఆదివారం మేకలు, గొర్రెలు మేయడం కనిపించింది. -
గెలవాల్సిందే..
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 202513 అసెంబ్లీ స్థానాలుమధ్యాహ్న కార్మికుల నిలువు దోపిడీ ● ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిర్వహకులైన కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తోందని ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్ విమర్శించారు. గంభీరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మూడు మండలాల కార్మికులు ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ ఎదుట ఆందోళనకు దిగారు. లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10వేల జీతాన్ని ఇస్తామని చెప్పి ఇప్పటికి అమలు చేయలేదన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.30చొప్పున, కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భోజన నిర్వహణ కమిటీ ప్రతినిధులు మణెమ్మ, బొడ్డు నర్సమ్మ, భాగ్య, గంగవ్వ, దేవలక్ష్మి, జ్యోతి, లక్ష్మి, మల్లవ్వ, బాలమణి, రేఖ, మహేశ్వరి పాల్గొన్నారు. ఉద్యమకారులకు స్వాగతం వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని తెలంగాణచౌక్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య బస్సుయాత్రకు ఉద్యమ కళాకారులకు రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి ఆదివారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి, మొక్కులు చెల్లించుకున్నారు. ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు బొజ్జ కనకయ్య, బొడ్డు రాములు, శ్రీనివాస్, వారాల దేవయ్య, హనుమాన్, శంకరయ్య, నారయణ, చందు, రాజేశం, లక్ష్మీనారాయణ, రమేశ్ తదితరులు ఉన్నారు. ఉద్యమకారుల బోర్డు ఏర్పాటు చేయాలి సిరిసిల్లటౌన్: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ..చేపట్టిన చైతన్య యాత్ర ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరింది. ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, రూ.26వేలు పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఏప్రిల్ 21న సికింద్రాబాద్‌లో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వెంగళ శ్రీనివాస్, గోనె ఎల్లప్ప, కుసుమ విష్ణు, ఐలయ్య, లక్ష్మణ్, వెంకటేశ్, శంకర్, గంగరాజం పాల్గొన్నారు. శాకాహారంతో శాంతియుత సమాజంసిరిసిల్లకల్చరల్: శాకాహారంతోనే మానవ సమాజంలో సాధు జీవనం సాధ్యమవుతోందని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ రాష్ట్ర బాధ్యుడు విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. మూమెంట్ స్థానిక శాఖ ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. అనాగరిక సమాజం నుంచి ఆధునిక నాగరికత వైపు మనిషి పురోగమిస్తున్నా మాంసాహారం తీసుకోవడంతో అశాంతి చెలరేగుతోందన్నారు. జంతుహింసతో ప్రకృతి సమతూకం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాకాహారం తీసుకోవడం ద్వారా సమాజం శాంతియుతంగా పరిణామం చెందుతోందన్నారు. దాదాపు 1200 మంది శాకాహారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేముల యాదగౌడ్, మల్యాల కళావతి, జక్కని భూపతి, చిక్కుడు రాజయ్య, జక్కని శివప్రసాద్, బొల్లి సురేశ్, గుడ్ల పావని, సామల గీత, లక్ష్మక్క, బల్యాల రాజు, గడ్డం మనోజ్, గడప శారద, సుజాత, కోళ్ల లక్ష్మి, పాల్గొన్నారు. 25న సాహిత్య సమాలోచన సదస్సు సిరిసిల్లకల్చరల్: రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ సౌజన్యంతో మానేరు రచయితల సంఘం, అ గ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా 25, 26 తేదీల్లో జాతీయ సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, ప్రముఖ కవి జూకంటి జగన్నాథం సాహిత్యంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రజతోత్సవ వేడుకల వేళ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, కార్యకర్తలకు జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చా రు. బీఆర్ఎస్ హయాంలో వివిధ వర్గాలకు జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా వివరించేలా కార్యకర్తలు తయారవాలన్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టా నం నుంచి పరిశీలకులు, సమన్వయకర్తలు వస్తార ని వెల్లడించారు. కేసీఆర్‌కు కరీంనగర్ అంటే ప్రత్యేకమైన అభిమానమని, సింహగర్జన నుంచి రైతుబంధు, దళితబంధు వరకు అనేక కార్యక్రమాలు ఇక్కడే మొదలుపెట్టారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లో కేవలం ఐదుమాత్రమే గెలిచామని, అందులో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వెళ్లారన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలు మనమే గెలవాలని పిలుపునిచ్చారు. చెక్‌పోస్టులు పెట్టి మరీ: గంగుల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెక్‌పోస్టులు పెట్టి మరీ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మానేరు రివర్ ఫ్రంట్, తీగల బ్రిడ్జి వంటి ప్రాజెక్టులు మొదలుపెడితే.. వాటిని ఖతం చేశారని, ఇదేంటని కాంట్రాక్టర్‌ను అడిగితే.. కాంగ్రెస్ హయాంలో అనేక మంది లీడర్లు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడని చెప్పారు. అమాయక ప్రజలను చెక్‌పోస్టులు పెట్టి పీల్చిపిప్పి చేస్తున్నారని కట్టెలమోపు కథ ద్వారా వివరించారు. ఒక తరాన్ని పరిచయం చేశారు బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా వరంగల్‌లో గొప్ప సభ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. పకేసీఆర్ను శత్రువులు ఇబ్బందులు పెడితే, ఇక్కడికి వచ్చి గాలిపీలిస్తే ఆయనకు ఉత్తేజం వస్తదని తెలిపారు. శ్రీఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే అందులో కేసీఆర్ లీడర్‌గా ఎదిగారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నేను పోటీ చేశాం. పిల్లగాళ్లు అని కాంగ్రెస్ వాళ్లు ఎగతాళి చేసినా గెలిచి చూపించాం. అలా కేసీఆర్ కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. 33 శాతం రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, బాల్క సుమన్, నాయకులు రాజేశంగౌడ్, చల్మెడ లక్ష్మీనరసింహరావు, నారదాసు లక్ష్మణరావు, తోట ఆగయ్య, కర్ర శ్రీహరి, రాగిడి లక్ష్మారెడ్డి, రవీందర్రావు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దావ వసంత, రాకేశ్, తుల ఉమ, కోలేటి దామోదర్, హరీశ్ శంకర్, పొన్నం అనిల్‌గౌడ్ పాల్గొన్నారు. జోష్‌నింపిన బైక్ ర్యాలీ అంతకుముందు కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికిన గులాబీ నాయకులు మంకమ్మతోట సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి బైపాస్ రోడ్డులోని వీ కన్వెన్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమావేశ మందిరం నాయకులతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తానికి కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త జోష్ నిండింది. ప్రతిపాదనలు కాదు.. పరిహారం ఇవ్వండిముస్తాబాద్(సిరిసిల్ల): వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలు సర్వే చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయడం కాకుండా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలం బందనకల్, వెంకట్రావుపల్లి, మొర్రాపూర్ తండాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను అమలు చేయాలన్నారు. అంజాగౌడ్, రమేశ్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, నరేశ్, శ్రీనివాస్‌రావు, వెంకటేశ్, క్రాంతి, మహేందర్, శంకర్, కార్తీక్, కృష్ణ ఉన్నారు. వడగళ్లతో 500 ఎకరాల్లో నష్టం●● సర్వే చేపట్టిన వ్యవసాయాధికారులు ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలో వడగళ్ల వానతో 500 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. బందనకల్, వెంకట్రావుపల్లి, మల్లాపూర్తండాల్లో శనివారం రాత్రి కురిసిన వడగళ్లవానతో సుమారు 500 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆదివారం మూడు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధాన్యం రాలిపోయిన పంటల వివరాలను సేకరించి రైతుల పేర్లను నమోదు చేసుకున్నట్లు ఏఈవో రేవతి తెలిపారు. శ్రీనగర్ కాలనీలో మురికి కాల్వను పరిశీలిస్తున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాసిరిసిల్ల: చెత్తను, మురికి కాల్వలను నిత్యం శుభ్రం చేయాలని, సిరిసిల్ల పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్ కమాన్ వద్ద డ్రెయినేజీని, శ్రీనగర్‌కాలనీ, పద్మనగర్, కొత్తచెరువు ప్రాంతాలను ఆదివారం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మురికి కాల్వల్లో ఎక్కడా నీరు నిలవకుండా వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మురికి నీరు వెళ్లేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. పద్మనగర్‌లోని మురికినీటి శుద్ధి(ఈటీపీ) ప్లాంట్‌ను పరిశీలించారు. కొత్తచెరువు వద్ద పరిసరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చెత్తా చెదారం, గడ్డి వ్యర్థాలు తొలగించాలని, నాలాలోని పూడిక తొలగించాలని, మురుగునీరు నిలిచిన ప్రదేశాల్లో ఆయిల్‌బాల్స్, పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. పందులు కనిపించ వద్దుపందుల పెంపకం కోసం ఐదెకరాలు ఇచ్చామని.. అయినా పట్టణంలో ఎందుకు కనిపిస్తున్నాయని మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనగర్‌కాలనీలో పర్యటించగా.. డ్రెయినేజీ సమస్యను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీనగర్‌కాలనీలో నిర్మించే రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి, మొక్కలు పెట్టించాలని ఆదేశించారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మాజీ కౌన్సిలర్ ముడపు శ్రీదేవి, మున్సిపల్ పర్యావరణ ఇంజినీరు రఘు, సానిటరీ అధికారులు పాల్గొన్నారు. న్యూస్రీల్కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల: పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, మళ్లీ వచ్చేది కేసీఆర్ పాలనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని బీవైనగర్ షాదీఖానాలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ పండుగ సందర్భంగా పేదలకు అందించే రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ కానుకలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్లు, చిరువ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా.. ఓ భరోసా ఉండేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి 1.40 లక్షల మంది ముస్లిం పిల్లలకు చదువు చెప్పించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం లౌకికపాలన అందించిందన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నాయకులు జిందం కళాచక్రపాణి, గూడూరి ప్రవీణ్, దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, ఏనుగు మనోహర్‌రెడ్డి, సిద్దం వేణు, రాఘవరెడ్డి, జక్కుల నాగరాజు, బండ నర్సయ్యయాదవ్, చంద్రయ్యగౌడ్, మజీద్ కమిటీ అధ్యక్షుడు స య్యద్ షమీ, ముస్లిం పెద్దలు యూసుఫ్, సలీం, సత్తార్, అక్రమ్, ఫయాజ్, చాంద్‌పాషా, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం నాయకులు ఘర్షణ ఇఫ్తార్ విందు సందర్భంగా షాదీఖానాలో ముస్లిం నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. కేటీఆర్ వేదికపైకి రాగానే సత్తార్, సోహెల్, చాంద్‌పాషాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేటీఆర్ సమక్షంలో ఇరువర్గాలు గొడవకు దిగడంతో తోపులాట జరిగింది. కేటీఆర్ జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని సముదాయించారు. ఇటీవల మజీద్ కమిటీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రెండు వర్గాలుగా ముస్లింలు చీలిపోయి ఈ ఘటనకు దారితీసింది. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చెక్‌పోస్టులు పెట్టి కాంగ్రెస్ లీడర్లు దోచుకుంటున్నారు: గంగుల ఉద్యమ వ్యతిరేకి చేతిలో రాష్ట్ర పగ్గాలు: ఈశ్వర్ కేసీఆర్ ఒక తరాన్ని పరిచయం చేశారు: వినోద్‌కుమార్ జోష్ నింపిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాలీ, సమావేశం సిరిసిల్ల పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పందులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాఉద్యమ వ్యతిరేకి చేతిలో.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా పదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎవరి పాలనలో అయితే సుఖశాంతులతో ఉంటా రో దాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘ఎన్నో పోరాటాలు, త్యాగాలతో రాష్ట్రం సా ధించుకున్నాం. ఉద్యమానికి వ్యతిరేకంగా కరీంనగర్ ప్రజల మీదకు తుపాకీ పట్టుకుని వచ్చిన వాడి చేతిలో రాష్ట్రం ఉంది. ఈ చెర నుంచి విడిపించాల్సి న బాధ్యత మనపై ఉంది’ అని పిలుపునిచ్చారు. -
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
● బీజేపీ కుట్రలను తిప్పికొడదాం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్లటౌన్: అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని, దాని ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. స్థానిక కె–కన్వన్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాహుల్‌గాంధీ పాదయాత్రతో దేశంలోని వివక్షను రూపుమాపేందుకు కృషి చేస్తున్నారన్నారు. గత పదేళ్లలో బీజేపీ పేదలకు ఉపయోగపడే ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. బీజేపీ విధివిధానాలు ఎండగడుతూ ముందుకుపోవాలని కార్యకర్తలకు సూచించారు. కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొడుతూనే.. వాటికి చట్టబద్ధత కల్పించామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్బిన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ రుద్రా సంతోష్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆవేశ్‌ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి వేములవాడఅర్బన్: ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం మారుపాక, గుర్రంవానిపల్లిల్లో రూ.2.25కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలకు ఆదివారం భూమిపూజ చేశారు. విప్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలకు మిడ్‌మానేరులో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశాలను పరిశీలించాలని జిల్లా అధికారులకు సూచించారు. పార్టీ మండలాధ్యక్షుడు పిల్లి కనకయ్య ఉన్నారు. -
చెత్తశుద్ధి కరువాయే..
జలవనరులను రక్షించుకోవాలి వేములవాడఅర్బన్: జలవనరులను రక్షించుకోవాలని ఉమ్మడి జిల్లా యూత్ అధికారి వెంకట రాంబాబు కోరారు. అగ్రహారం డిగ్రీ కాలే జీలో శనివారం అవగాహన కల్పించారు. ● సిరిసిల్ల బల్దియా.. పరిశుభ్రత లేదయా ● పేరుకుపోతున్న డస్ట్‌బిన్స్ ● కంపుకొడుతున్న అంతర్గతకాలనీలు ● గత స్వచ్ఛకీర్తి కొనసాగేనా..?మోరీలు కంపుకొడుతున్నాయి మోరీలు కంపు కొడుతున్నాయి. మా వీధిలో చెత్త వేయడానికి డస్ట్‌బిన్స్ లేక రోడ్డు పక్కనే పడేస్తున్నారు. ఇక మోరీల్లో బాటిళ్లు, డైపర్స్ పడేయడంతో నీరు నిలుస్తుంది. వర్షం పడితే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుంటుంది. – మసూరి గోపి, అనంతనగర్ టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలి మా వాడలో మోరీలోంచి తీసిన సిల్టును మూడు రోజుజులైనా తొలగించడం లేదు. చెత్త సేకరణలో నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసేందుకు అధికారులు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. – బియ్యంకార్ శ్రీనివాస్, సిద్దులవాడ చెత్త సేకరణపై దృష్టి పెట్టాలి వార్డుల్లో చెత్తసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో పారిశుధ్య పనులు బాగా జరిగేవి. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. వార్డులకు ప్రత్యేక ఆఫీసర్లు ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. – సుల్తాన్ బాలరాజు, 12వ వార్డు నిర్లక్ష్యం లేదు పట్టణంలో పారిశుధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదు. నిత్యం ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరిస్తున్నాం. అన్ని వార్డుల్లో ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే ప్రజలు ‘సిటిజెన్ బడ్డీ’ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే పరిష్కరిస్తాం. స్వచ్ఛ సిరిసిల్ల కీర్తి కొనసాగుతుంది. – ఎస్.సమ్మయ, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ● ఇది సిరిసిల్లలో నిత్యం ఇంటింటికి వెళ్లి పారిశుధ్య సిబ్బంది ట్రాక్టర్లో చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి, హానికర చెత్తలుగా విడదీసి ప్రజలు అందిస్తుంటారు. 39 వార్డుల్లో నిత్యం 40 టన్నులకు పైగా చెత్త వస్తుంటుంది. ● ఇది కొత్తబస్టాండ్ ప్రాంగణంలోని చెత్తడబ్బాలు. ఇందులో ఒకటి విరిగిపోయి నిరుపయోగంగా మారింది. అప్పట్లో వీటి కోసం సుమారు రూ.15లక్షలు వెచ్చించారు. వీటితోపాటు పట్టణ వ్యాప్తంగా లిఫ్టింగ్ డస్ట్బిన్లు, సాధారణ డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. కానీ చాలా డస్ట్బిన్లు ప్రస్తుతం పాడయ్యాయి. సిరిసిల్ల మున్సిపల్ సమాచారం జనాభా : 1.11 లక్షలు వార్డులు : 39 శానిటేషన్ సిబ్బంది : 277 ప్రతిరోజు చెత్త ఉత్పత్తి : 52 మెట్రిక్ టన్నులు సేకరిస్తున్న చెత్త : 48 మెట్రిక్ టన్నులు ప్రతిరోజు ప్లాస్టిక్ పదార్థాల ఉత్పత్తి : 12 టన్నులు -
నేడు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
● ముఖ్య అతిథులుగా కేటీఆర్, హరీశ్‌రావు కరీంనగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నహాక సమావేశం ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్‌లో జరగనుంది. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరు కానున్నారు. శనివారం వీకన్వెన్షన్ ఫంక్షన్‌హాల్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
వడగండ్లు మిగిల్చిన క డగండ్లు
సిరిసిల్ల: జిల్లాలో శనివారం సాయంత్రం వడగళ్ల వాన పడింది. కోనరావుపేట, చందుర్తి, వీర్నపల్లి మండలాల్లో ఓ మోస్తరు రాళ్లవాన పడింది. రాళ్లవానలతో పొట్టదశలో ఉన్న వరి పొలాలకు, మామిడితోటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. సిరిసిల్ల పట్టణంలో తుంపరతో కూడిన జల్లు కురిసింది. జిల్లా అంతటా అకాల వర్షాలు కురిశాయి. కోనరావుపేట: మండలంలోని గొల్లపల్లి (వట్టిమల్ల), భుక్యారెడ్డితండా, కనగర్తి, సుద్దాల గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. గొల్లపల్లికి చెందిన సుంక భూమయ్య, దుప్యా నాయక్, వంకాయల రమేశ్, శ్రీనివాస్ తదితర రైతుల పంటలు దెబ్బతిన్నాయి. ముస్తాబాద్: మండలంలోని బందనకల్, వెంకట్రావుపల్లి, మొర్రాపూర్ తండాల్లో వడగండ్ల వాన కురిసింది. బందనకల్‌లో వరిపంట దెబ్బతిందని రైతులు రమేశ్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తెలిపారు. మొర్రాపూర్లో వడగండ్లకు పొట్టదశకు వచ్చిన వరి దెబ్బతిందని రైతు కపూర్‌నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. బందనకల్‌లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఇల్లంతకుంట: మండలంలోని రామాజీపేట, ఓబులాపూర్‌లో రాళ్లతో కూడిన వర్షం పడింది. గాలిపల్లి, ఇల్లంతకుంట, వల్లంపట్ల, అనంతారం గ్రామాల్లో వర్షం అరగంటపాటు కురిసింది. కోతకు వచ్చిన పంటపొలాలు దెబ్బతిన్నాయి. రుద్రంగి(వేములవాడ): వడగండ్ల వానకు మండలంలోని మామిడితోటలకు తీవ్ర నష్టం జరిగింది. కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. పంటనష్టంపై అధికారుల సర్వే చందుర్తి/వీర్నపల్లి: చందుర్తి మండలం సనుగుల, జోగాపూర్, మల్యాల, చందుర్తి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయాధికారి అనూష, ఆర్ఐ శ్రీనివాస్, ఏఈవోలు శనివారం సర్వేచేశారు. వర్షానికి మండలంలోని సనుగులలో 35, జోగాపూర్‌లో 25, మల్యాలలో 20, చందుర్తిలో 10 ఎకరాలలో వరిపంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. వీర్నపల్లి మండలం శాంతినగర్‌లో మండల వ్యవసాయాధికారి జయ పరిశీలించారు. ఏవో మాట్లాడుతూ 35 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. రైతులు లక్పతినాయక్, తిరుపతి, మోహన్, రాజు ఉన్నారు. -
వేములవాడలో అంబేడ్కర్ కాంస్య విగ్రహం
● రూ.16లక్షలతో ఏర్పాటు ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్ల: వేములవాడలో అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు రూ.16లక్షలు మంజూరు చేసి, టెండర్లు పిలిచామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్లో శనివారం మహనీయుల జయంతి వేడుకలపై అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాల పోస్టర్లు తయారు చేయాలన్నారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్‌రామ్ జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్చార్జి ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజా మనోహర్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి, వివిధ ఎస్సీ, ఎస్టీ కులసంఘాల నాయకులు రా గుల రాములు, గుంటి వేణు, బొలుమాల శంకర్, బడే స్వామిదాస్, జక్కుల యాదగిరి, కొమ్ము బాల య్య, కె.సుధాకర్, మేకల కమలాకర్ పాల్గొన్నారు. -
పర్యాటకాభివృద్ధికి కృషి చేయండి
● అసెంబ్లీలో ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: జిల్లాలో పర్యాటకాభివృద్ధికి నిధులు విడుదల చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ మిడ్‌మానేరు, రాజన్న గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓసారి వేములవాడ ప్రాంతాన్ని పర్యటించాలని విన్నవించారు. నాంపల్లిగుట్టపైకి రోప్‌వే ఏర్పాటుతో భక్తులకు సులభంగా దర్శనభాగ్యం కలిగే అవకాశం ఉందన్నారు. హరితహోటల్‌ను ఆధునికీకరించాలని కోరారు. వేములవాడ ప్రాంతంలోని అనుబంధ మామిడిపల్లి సీతారామస్వామి, సనుగుల గోవిందరాజులస్వామి, రుద్రంగి శ్రీలక్ష్మీనర్సింహస్వామి, పోతారంలోని లొంకరామేశ్వరస్వామి, నాగారం సీతారామ ఆలయం, మన్నెగూడెం, భీమారం ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరారు. పర్యాటకాభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. పేపర్ లీకులు.. నోటిఫికేషన్లు వాయిదా ● కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి సిరిసిల్లటౌన్: పోటీపరీక్షల పేపర్ లీకులు..నోటిఫికేషన్ల వాయిదాలు తప్ప పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఇచ్చిందేమీ లేదని సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి విమర్శించారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల రాక్షసపాలన నుంచి విముక్తి కోరిన తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సంక్షేమం అంటే ఏంటో చూపించారన్నారు. బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై అసెంబ్లీలో తీర్మానం చేయడమే ఆయా వర్గాలపై కాంగ్రెస్‌కు ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, సోనియాగాంధీలపై చిల్లర, మల్లర ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పట్ట ణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, కాముని వనిత, వెల్ముల స్వరూపరెడ్డి, గోనె ఎల్లప్ప, బైరినేని రాము, గంభీరావుపేట ప్రశాంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ది నిరంకుశ పాలన సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధుల కేటాయింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్వీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వారు మాట్లాడుతూ బడ్జెట్లో విద్యారంగానికి 25 శాతం నిధులు కేటాయించాలని కోరారు. స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదని విమర్శించారు. గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే కనీసం రివ్యూ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు మానాల అరుణ్, ఎస్కే బాబాషేక్, సికింధర్, కంచర్ల రవిగౌడ్, కనుకుంట్ల వెంకటరమణ ఉన్నారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభంలో గుర్తిస్తే నివారించవచ్చు ● స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ అరుణశ్రీ తంగళ్లపల్లి(సిరిసిల్ల): కుష్ఠు వ్యాధిని ప్రారంభదశలో గుర్తిస్తే అంగవైకల్యం నుంచి కాపాడవచ్చని స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ అరుణశ్రీ పేర్కొన్నారు. మండలంలోని నేరెళ్ల పీహెచ్సీ పరిధిలో నిర్వహిస్తున్న ఎల్సీడీసీ లిప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపేయిన్ (కుష్టు వ్యాధి నివారణ ప్రచారం)ను శనివారం పరిశీలించారు. జిల్లెల్ల హెల్త్ సబ్‌సెంటర్‌ను తనిఖీ చేశారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె.అనిత, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రిక, డీపీఎంవోలు సీహెచ్.శ్రీనివాస్, ఈ.దేవ్‌సింగ్, సూపర్వైజర్ రాజేందర్ పాల్గొన్నారు. -
యారన్ సబ్సిడీ విడుదల చేయాలి
● పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ సిరిసిల్ల: నేతకార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్ అమృత్లాల్ కార్మిక భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. 2023లో కార్మికులు నేసిన బతుకమ్మ చీరల 10 శాతం యారన్ సబ్సిడీ పెండింగ్‌లో ఉందన్నారు. ప్రస్తుతం వస్త్రపరిశ్రమ సరిగ్గా నడువక కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే యారన్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణాధ్యక్షుడు నక్క దేవదాస్ మాట్లాడుతూ వస్త్రపరిశ్రమ సమస్యలపై అధికారులు కార్మికులతో మాట్లాడడం లేదని యజమానులతో మాట్లాడి కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అన్నల్దాస్ గణేశ్, సూరం పద్మ, సిరిమల్ల సత్యం, ఒగ్గు గణేశ్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు. -
హిందీ పరీక్షకు 17 మంది గైర్హాజరు
సిరిసిల్ల/సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలో శనివారం జరిగిన పదోతరగతి హిందీ పరీక్షకు 17 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు. గీతానగర్ బాలికల జెడ్పీ హైస్కూల్, శివనగర్‌లోని కుసుమ రామయ్య హైస్కూల్లోని కేంద్రాలను ఎస్పీ మహేశ్ బీ.గీతే తనిఖీ చేశారు. డీఈవో జనార్దన్‌రావు -
రైతన్నకు గుండె‘కోత’
సిరిసిల్ల: జిల్లాలో వ్యవసాయానికి 17 గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతోంది. రాత్రి 12.30 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటల పాటు సరఫరా చేస్తున్నారు. కానీ అప్రకటిత కోతలతో పొలాలు పారడం లేదు. మధ్యలో కరెంట్ పోతే.. రైతులు పొలాల వద్దకు మళ్లీ వెళ్లకుండా రాత్రి నిద్రపోవడంతో పొలం పారడం లేదు. నిరాటంకంగా విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వైపు లోవోల్టేజీ సమస్యలతో కూడిన కరెంట్ సరఫరా అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లపై విద్యుత్ వినియోగ భారం పడి కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే.. రీప్లేస్ చేసేందుకు రెండు, మూడు రోజులు పడుతుంది. ఫలితంగా ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని బోర్లు, మోటార్లు నడవడం లేదు. ఒక్కసారి పొలం ఆరితే.. మళ్లీ పారడం కష్టమవుతుంది. ఎండలు మండిపోతున్న దశలో కరెంట్ కష్టాలు ఇబ్బందిగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) విద్యుత్ పంపిణీ చేస్తుండగా.. ఎనీ్పడీసీఎల్ అధికారులు విద్యుత్ సబ్స్టేషన్లను పర్యవేక్షిస్తున్నారు. సబ్స్టేషన్లలో మరమ్మతుల కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగానే చివరి దశలో వరి మడి.. తడి ఆరి రైతులు తల్లడిల్లుతున్నారు. పక్షమైతే పంట చేతికి జిల్లా వ్యాప్తంగా మరో పక్షం రోజుల్లో వరి పంట చేతికి అందుతుంది. యాసంగి సీజన్లో 1,82,256 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి పంట 1,78,350 ఎకరాల్లో సాగైంది. గతంతో పోలి్చతే జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు ఎత్తిపోయి 20 శాతం మేరకు పంటలు పొట్టదశలో ఎండిపోయాయి. ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో చేతికందే దశలో పొలాలు తడారుతున్నాయి. ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేవు జిల్లా వ్యాప్తంగా వి ద్యుత్ సరఫరాలో ఇబ్బందులేమీ లేవు. వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఎప్పటిలాగే అందిస్తున్నాం. ఎక్కడైనా ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్ అయితే వెంటనే మార్చుతున్నాం. ట్రాన్స్ఫార్మర్ల రవాణాకు ఆరు వాహనాలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలతో అప్పుడప్పుడూ సరఫరాలో అంతరాయం సహజంగానే ఉంటుంది. విద్యుత్ కోతలు ఏమీ లేవు. – విజయేందర్‌రెడ్డి ‘సెస్’ఎండీ, సిరిసిల్ల -
అకాల వర్షం.. అన్నదాత ఆగం
● వట్టిమల్లలో వడగండ్ల వాన ● పలు చోట్ల విరిగిన చెట్లువేములవాడ/చందుర్తి/కోనరావుపేట: జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షంతో అన్నదాతలు ఆగమయ్యారు. పొట్టదశకు వచ్చిన వరిపంట చేతికి అందకుండా పోతుందని ఆందోళన చెందారు. వేములవాడ పట్టణంలో రోడ్లపై వరదనీరు ప్రవహించింది. కోనరావుపేట మండలం వట్టిమల్లలో చెట్లు నేలకూలాయి. నిమ్మపల్లి, అజ్మీరతండా, కమ్మరిపేటతండా, రెడ్డితండా, వట్టిమల్ల గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. చేతికొచ్చిన వరి పంటలు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్‌తీగలు తెగిపడడంతో నిజామాబాదు, కనగర్తి గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి/ఇల్లంతకుంట: ముస్తాబాద్ మండలం పోతుగల్, నామాపూర్, గూడూరులలో రోడ్లపై వరదనీరు ప్రవహించింది. ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దుమాల, రాగట్లపల్లి, నారాయణపూర్, బండలింగంపల్లి, ఎల్లారెడ్డిపేట, రాచర్లగొల్లపల్లి, రాచర్లబొప్పాపూర్, రాజన్నపేట, అల్మాస్పూర్, అక్కపల్లి గ్రామాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. వీర్నపల్లి మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, వెంకట్రావుపల్లి, వెల్జీపురం, ఇల్లంతకుంటల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
ఊరూవాడ చెప్పుకోవాలి
● రైతు రుణమాఫీ, రైతుభరోసా లబ్ధిదారుల పేర్లు ప్రదర్శన ● గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం ● లబ్ధిదారుల వివరాలు, పేర్ల ముద్రణకు రంగం సిద్ధం ● జిల్లాలవారీగా టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ ● ఉగాది నాటికి ఏర్పాటు లక్ష్యంగా ప్రయత్నాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: చేసింది చెప్పుకోవాలి.. అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాము అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు, అందుకోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ప్రభుత్వం కన్నా అధిక మొత్తంలో ఏకకాలంలో రుణమాఫీ చేశామని, రైతు భరోసా అమలు చేశామని, ఈ విషయాలను గ్రామస్తులు చర్చించుకునే విధంగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకోసం లబ్ధిదారుల పేర్లను గ్రామంలోని ముఖ్యవీధుల్లో ప్రదర్శించడం, తద్వారా తాము చేసిన పనులకు ఇంటింటికి తెలియజేయడం, ప్రజల మనసు గెలుచుకోవాలన్న తాపత్రయంతో వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన పలువురు యువతకు నియామక పత్రాలు ప్రభుత్వ పెద్దలు స్వయంగా అందజేస్తున్న తరహాలోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిసింది. వచ్చే స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఈ ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఏం చేస్తారు? రైతు రుణమాఫీ, రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.కోట్లు విడుదల చేస్తోంది. అదే సమయంలో తాము అత్యధిక నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించామన్నది కాంగ్రెస్ వాదన. అదే సమయంలో రుణమాఫీ, రైతు భరోసా అమలు తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అందుకే, ప్రతిపక్షాల వాదనలను సమర్థంగా తిప్పికొట్టేందుకే ప్రభుత్వం తాము చేసిన పనులను ఊరూ, వాడా చెప్పుకునేలా ఈ ఆలోచనకు తెరతీసింది. ప్రతీ గ్రామంలో కనీసం మూడు ముఖ్యమైన కూడళ్ల వద్ద ఆ గ్రామంలో రైతు భరోసా, రైతు రుణమాఫీలో ఏ రైతుకు ఎంత లబ్ధి జరిగింది? ఆ రైతు పేరు, మాఫీ వివరాలు అంకెల్లో పేర్కొంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు. వీటిని వీలైనంత మంది ఎక్కువగా ప్రజలు వీక్షించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఉగాదిలోగా టెండర్లు, ముద్రణ పూర్తి కావాలన్న లక్ష్యంతో కలెక్టర్లు, వ్యవసాయాశాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల రైతుల పూర్తి వివరాలు గణాంకాలతో సహా సిద్ధం చేశారు. టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ రాష్ట్రంలోని అన్నిజిల్లాల వ్యవసాఽయశాఖ అధికారులు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల్లో రైతుల పేర్ల ముద్రణకు ఫ్లెక్సీ టెండర్లు పిలిచారు. వాస్తవానికి ఈ టెండర్‌కు అనుకున్నంత ప్రచారం జరగలేదు. ఈ ప్రకటన ద్వారా వచ్చిన టెండర్లను ఖరారు చేసి త్వరలోనే అధికారికంగా ముద్రణకు ఆదేశాలివ్వనున్నారు. ఆరుగడుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఈ ఫ్లెక్సీలు ఉండనున్నాయి. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ఫొటోలు ఫ్లెక్సీలో ఉండనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, ముద్రణకు ఆర్డర్ ఇవ్వడం, ఫ్లెక్సీలను గ్రామాల్లో కూడళ్లలో ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2.46 లక్షల మంది రైతులకు మూడు నుంచి నాలుగు దశల్లో ఇటీవల రైతు రుణమాఫీ జరిగింది. వీరికి దాదాపు రూ.రెండువేల కోట్ల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత మాఫీ అయిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ స్వరూపం జిల్లా రుణమాఫీ మాఫీ అయిన పొందిన మొత్తం రూ.కోట్లు రైతులు కరీంనగర్ 70,348 536.55 జగిత్యాల 80,515 721.74 పెద్దపల్లి 51,827 379.52 రాజన్నసిరిసిల్ల 43,770 346.16 -
కరెంట్ కట్‌కట!
ఇతను గుగులోత్ రవి. వీర్నపల్లి మండలం భూక్యాతండాకు చెందిన గిరిజన రైతు. యాసంగి సీజన్లో రెండు ఎకరాల్లో వరిపంట వేశాడు. పంట పొట్టదశలో ఉండగా.. త్రీఫేజ్ కరెంట్ సరఫరా సరిగ్గా లేక అర ఎకరం పొలం ఎండిపోయింది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, కరెంట్ సరఫరాలో అంతరాయంతో పొలం ఎండిపోయింది. ఇతను రుద్రంగికి చెందిన చిట్టిపాక మల్లయ్య. తనకున్న 60 గుంటలతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. బోరులో పుష్కలంగా నీరున్నా కరెంట్ కోతలు, లోవోల్టేజీతో మోటారు నడవడం లేదు. ఫలితంగా పొలం పారడం లేదు. పొట్టదశలో ఉన్న పొలం ఎండిపోతుంది. లోవోల్టేజీ కరెంట్‌తో పలుమార్లు మోటార్లు కాలిపోయాయి.ఎండుతున్న పంటలు●● కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు ● తడారుతున్న వరిపొలాలు ● ఆందోళనలో రైతులు ● చి‘వరి’కి తిప్పలే..ఇతను ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన చిన్ని అంజిరెడ్డి. ఏడు ఎకరాలను పోత్గల్‌కు చెంది రైతు వద్ద కౌలుకు తీసుకుని వరిపంట వేశాడు. రెండు బోర్లలో ఒకటి ఎండిపోవడంతో ఒకటే పోస్తుంది. త్రీఫేజ్ కరెంట్ సరిగ్గా రాకపోవడంతో పొలం పారడం లేదు. అందరి బోర్లు నడవడంతో అంజి రెడ్డి పొలం పారడం లేదు. దీంతో జనరేటర్‌ను అద్దెకు తీసుకుని గంటకు ఆరు నుంచి ఎనిమిది గుంటల పొలాన్ని పారిస్తున్నాడు. రోజుకు డీజిల్, జనరేటర్ అద్దె రూ.2వేలు అవుతుంది.. ఇలా జిల్లా వ్యాప్తంగా రైతులు ‘కరెంట్’ కష్టాలు ఎదుర్కొంటున్నారు.సిరిసిల్ల: జిల్లాలో వ్యవసాయానికి 17 గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతోంది. రాత్రి 12.30 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటల పాటు సరఫరా చేస్తున్నారు. కానీ అప్రకటిత కోతలతో పొలాలు పారడం లేదు. మధ్యలో కరెంట్ పోతే.. రైతులు పొలాల వద్దకు మళ్లీ వెళ్లకుండా రాత్రి నిద్రపోవడంతో పొలం పారడం లేదు. నిరాటంకంగా విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వైపు లోవోల్టేజీ సమస్యలతో కూడిన కరెంట్ సరఫరా అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లపై విద్యుత్ వినియోగ భారం పడి కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే.. రీప్లేస్ చేసేందుకు రెండు, మూడు రోజులు పడుతుంది. ఫలితంగా ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని బోర్లు, మోటార్లు నడవడం లేదు. ఒక్కసారి పొలం ఆరితే.. మళ్లీ పారడం కష్టమవుతుంది. ఎండలు మండిపోతున్న దశలో కరెంట్ కష్టాలు ఇబ్బందిగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) విద్యుత్ పంపిణీ చేస్తుండగా.. ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ సబ్స్టేషన్లను పర్యవేక్షిస్తున్నారు. సబ్స్టేషన్లలో మరమ్మతుల కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగానే చివరి దశలో వరి మడి.. తడి ఆరి రైతులు తల్లడిల్లుతున్నారు. పంట చేతికి జిల్లా వ్యాప్తంగా మరో పక్షం రోజుల్లో వరి పంట చేతికి అందుతుంది. యాసంగి సీజన్లో 1,82,256 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి పంట 1,78,350 ఎకరాల్లో సాగైంది. గతంతో పోల్చితే జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు ఎత్తిపోయి 20 శాతం మేరకు పంటలు పొట్టదశలో ఎండిపోయాయి. ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో చేతికందే దశలో పొలాలు తడారుతున్నాయి. ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేవు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులేమీ లేవు. వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఎప్పటిలాగే అందిస్తున్నాం. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే వెంటనే మార్చుతున్నాం. ట్రాన్స్ఫార్మర్ల రవాణాకు ఆరు వాహనాలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలతో అప్పుడప్పుడూ సరఫరాలో అంతరాయం సహజంగానే ఉంటుంది. విద్యుత్ కోతలు ఏమీ లేవు. – విజయేందర్‌రెడ్డి ‘సెస్’ ఎండీ, సిరిసిల్లజిల్లా విద్యుత్ సమాచారం గ్రామాలు : 260 వ్యవసాయ కనెక్షన్లు : 78,611 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు : 9,928 వ్యవసాయ ఫీడర్లు : 175 మిశ్రమ ఫీడర్లు : 90 వరి విస్తీర్ణం : 1,78,350 ఎకరాలు విద్యుత్ సబ్స్టేషన్లు : 72 -
‘పది’ పరీక్షలు ప్రారంభం
సిరిసిల్లఎడ్యుకేషన్/తంగళ్లపల్లి/బోయినపల్లి/వేములవాడఅర్బన్: జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు శుక్రవారం తెలుగు పరీక్షకు 6,766 మంది విద్యార్థులకు 6,752 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు పర్యవేక్షించారు. మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పరీక్షల నియంత్రణ సహాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలోని కేంద్రాలు తనిఖీ చేశారు. బోయినపల్లి హైస్కూల్, వేములవాడ కిడ్స్ కాన్వెంట్, వేములవాడ హైస్కూల్, ప్రభుత్వ పాఠశాలల్లోని కేంద్రాలను జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తనిఖీ చేశారు. ఆటో ఏర్పాటు చేసిన యూత్ నాయకుడు తంగళ్లపల్లి మండలం మండెపల్లి డబుల్ బెడ్రూమ్ సముదాయం(కేసీఆర్ నగర్)లోని పదో తరగతి విద్యార్థుల కోసం యూత్ నాయకుడు కట్ట రవికుమార్ రెండు ఆటోలను ఏర్పాటు చేశాడు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆటోలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అటు గొర్రెలు.. ఇటు విద్యార్థులు బోయినపల్లి మండలకేంద్రంలోని హైస్కూల్లోని పదోతరగతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. మరో వైపు గొర్రెలు స్కూల్ ఆవరణలోకి ప్రవేశించాయి. హైస్కూల్‌కు ప్రహరీ లేకపోవడంతో గ్రౌండ్లోకి పశువులు, మేకలు, గొర్రెలు ప్రవేశిస్తున్నాయి.● తొలిరోజు 6,752 మంది హాజరు -
రైతుల రిలే నిరాహార దీక్ష విరమణ
ఇల్లంతకుంట(మానకొండూర్): రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న ఎల్ఎం–6 కాల్వ పనులు పూర్తి చేయాలని కోరుతూ 19 రోజులుగా పెద్దలింగాపూర్‌లో రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం విరమించారు. స్థానిక తహసీల్దార్ ఫారుక్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా అధికారుల ఆదేశాలతో దీక్షా శిబిరానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. కాల్వపనులకు, భూకేటాయింపులకు నిధులు మంజూరయ్యాయని మూడు నెలల్లో పనులు పూర్తవుతాయని తెలపడంతో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. రంగనాయకసాగర్ ప్రాజెక్టు డీఈ సీతారాం, ఆర్ఐ షఫీ, రైతులు అశోక్, నర్సయ్య, గాదె మధుసూదన్, కరికె నవీన్, లక్ష్మి, అనిత, రేణ పాల్గొన్నారు. అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం సిరిసిల్లకల్చరల్: చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ అదనపు సంచాలకుడు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 30ఏళ్లలోపు వయసు, చేనేతరంగంలో పదేళ్ల అనుభవం ఉన్న వారుఅర్హులు అని పేర్కొన్నారు. డిజైనర్లు పాతికేళ్లలోపు వయసుతోపాటు డిజైన్ల రంగంలో కనీసం ఐదేళ్లకు తగ్గకుండా అనుభవం గల వారు దరఖాస్తుకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న చేనేత కళాకారులు, డిజైనర్లు నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, తగిన శాంపిళ్లతో ఏప్రిల్ 15లోపు జౌళి శాఖ ఆఫీస్‌లో అందజేయాలని తెలిపారు. వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలి ● సీనియర్ సివిల్ జడ్జి రాఽధికా జైశ్వాల్ సిరిసిల్లటౌన్: పౌరులు వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ రాధికా జైశ్వాల్ పేర్కొన్నారు. స్థానిక విద్యానగర్ వెల్ఫేర్ సొసైటీ భవన్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా ఫోరంలో రూ.కోటి వరకు, రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో రూ.కోటి నుంచి రూ.10కోట్ల వరకు, జాతీయ వినియోగదారుల కమిషన్‌లో రూ.10కోట్లు ఆపైన ఫిర్యాదులు దాఖలు చేయవచ్చని వివరించారు. వస్తువు కొనుగోలు చేసిన సమయంలో తీసుకున్న బిల్లు ఉండాలన్నారు. లోక్ అదాలత్ మెంబర్లు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎస్.మల్లేశ్‌యాదవ్, సొసైటీ అధ్యక్షుడు పబ్బతి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. మగ్గంవర్క్తో మహిళలు ఆర్థికంగా ఎదగాలి● నాబార్డ్ ఏజీఎం శ్రీకాంత్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మగ్గం వర్క్ శిక్షణను పూర్తి చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని నాబార్డ్ ఏజీఎం శ్రీకాంత్ కోరారు. ఎల్లారెడ్డిపేటలోని ఐకేపీ ఆఫీస్‌లో నాబార్డ్, స్పందన సేవా సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మగ్గం వర్క్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. మహిళలు చేస్తున్న మగ్గంవర్క్ను పరిశీలించి అభినందించారు. డీడీఎంలు జయప్రకాశ్, దిలీప్‌చంద్ర, ఏపీఎం మల్లేశం, స్పందన సొసైటీ సీఈవో శోభారెడ్డి, సీసీలు, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. వయోవృద్ధులపై నిర్లక్ష్యం తగదు ఇల్లంతకుంట(మానకొండూర్): వయోవృద్ధులపై సంతానం నిర్లక్ష్యం చేయొద్దని, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే పిల్లలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధి కారి లక్ష్మీరాజం హెచ్చరించారు. మండలంలోని గాలిపల్లిలో శుక్రవారం వయోవృద్ధుల సమావేశంలో మాట్లాడారు. వయోవృద్ధులను సంతానం నిర్లక్ష్యం చేస్తే జిల్లా అధికారులు, ట్రిబ్యునల్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మహిళా సాధికారత కోఆర్డినేటర్ రోజా, జెండర్ స్పెషలిస్ట్ దేవిక, అంగన్వాడీ సూపర్వైజర్ సూర్యకళ పాల్గొన్నారు. -
కార్డు రాక పరేషాన్
ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగుండారం గ్రామానికి చెందిన గూడెపు రాము–కవిత. గత జనవరి 26న నిర్వహించిన గ్రామసభలో తమ కుమారుడు శర్వింద్ పేరును రేషన్‌కార్డులో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రేషన్‌కార్డు ప్రొసీడింగ్ కాపీ అందగా.. అందులో రాము, కవితల పేర్లు తొలగించి వాళ్ల కుమారుడు శర్వింద్ ఒక్కడి పేరిటనే రేషన్‌కార్డు మంజూరు చేశారు. కార్డులో తమ పేర్లు లేకపోవడంతో తహసీల్దార్ ఆఫీస్‌కు వెళ్లి కొత్త రేషన్‌కార్డు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు రాలేదు. ● ఏళ్లుగా ఎదురుచూపులే.. ● కొత్తగా పెళ్లయిన దంపతులకు అందని బియ్యం ● పిల్లలు పెరిగినా కార్డుల్లో లేని పేర్లు ● జిల్లాలో 25వేల దరఖాస్తులు ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన మందాటి రేఖ. రేషన్‌కార్డులో వీరి దంపతుల పేర్లు ఉన్నాయి. కానీ పిల్లల పేర్లు లేవు. దీంతో 2020లో తన కొడుకు హిమాన్ష్ పేరు నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ దరఖాస్తు పెండింగ్‌లోనే ఉంది. ఇటీవల తన కూతురు శ్రీయాన్షి పేరు సైతం కార్డులో నమోదు చేయాలని రెండో దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదటి దరఖాస్తు పెండింగ్‌లో ఉండడంతో రెండో దరఖాస్తు ఆన్లైన్లో స్వీకరించడం లేదు. ఫలితంగా వీరి పిల్లల పేర్లు రేషన్‌కార్డులో నమోదుకావడం లేదు. ఇలా జిల్లాలో ఓ వైపు కొత్త రేషన్‌కార్డులు రాక, ఉన్న కార్డులలో పిల్లల పేర్లు నమోదుకాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా ఉంది జిల్లాలోని కొత్త రేషన్‌కార్డుల వ్యవహారం. తమ కార్డుల్లో పిల్లల పేర్లు నమోదుచేయాలని దరఖాస్తు చేసుకుంటే తల్లిదండ్రుల పేర్లు తొలగించి పిల్లలనే యజమానులుగా పేర్కొంటూ మంజూరు చేయడంతో అవాక్కవడం పెద్దల వంతైంది. ఇలాంటి వింత సంఘటనలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన పైలట్ గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగుండారంలో కనిపిస్తాయి. ఈ గ్రామంలో కొత్తగా మంజూరైన 37 కార్డులలో 5 కార్డులు ఒంటరి మహిళల పేరుతో రాగా మిగతా కార్డుల్లో తల్లిదండ్రుల పేర్లు తొలగించి పిల్లలనే యజమానులుగా పేర్కొంటూ మంజూరుకావడం విడ్డూరంగా ఉంది. రేషన్‌కార్డుల మంజూరులో అనేక తప్పిదాలు జరగడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. 25వేల దరఖాస్తులు కొత్తగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. ప్రజాపాలనలో నూతన రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని 13 మండలాలు, రెండు మున్సిపాలిటీల వ్యాప్తంగా రేషన్‌కా ర్డుల కోసం దాదాపు 25వేల దరఖాస్తులు వచ్చి నట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. ఇందులో కొత్త పెళ్లయిన దంపతులు, పిల్లల పేర్లు లేని వారు అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు గత నాలుగైదు ఏళ్లుగా రేషన్‌కార్డులు మంజూరుకాక, పిల్లల పేర్లు నమోదుకాకపోవడంతో వారికి బియ్యం అందడం లేదు. వీటితోపాటు ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కొత్త దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం రెండు శాఖ లకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. ఆయా శాఖల అధికారులు దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత కార్డులు మంజూరుకానున్నట్లు సమాచారం. 1.73 లక్షల కార్డులు.. 3,300 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, 13 మండలాల వ్యాప్తంగా 1,73,745 రేషన్‌కార్డులున్నాయి. 4,97,103 కుటుంబాలు ఉండగా వీరి కోసం 3,300 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతీ నెల వస్తోంది. ఆయా కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే గ్రామపంచాయతీల సెక్రటరీలు, ఇతర ఉద్యోగుల ద్వారా సమాచారం అందడంతోనే వారి పేర్లు తొలగిస్తున్న అధికారులు.. కొత్తగా పేర్లు నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు.డీఎస్వోలో పెండింగ్ ఉన్నాయి రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశాం. మా దగ్గర పెండింగ్ లేవు. ఆన్లైన్ చేసిన దరఖాస్తులు డీఎస్వోలో పెండింగ్ ఉన్నా యి. ఎప్పుడు మంజూరవుతాయో సమాచారం లేదు. – సుజాత, ఎల్లారెడ్డిపేట తహసీల్దార్జిల్లాలో రేషన్‌కార్డుల సమాచారం రేషన్‌కార్డులు : 1,73,745 కుటుంబాలు : 4,97,103 నెలవారీ బియ్యం కోటా : 3,300 మెట్రిక్ టన్నులు కొత్త దరఖాస్తులు : 25 వేలు -
తెలంగాణలో పలు చోట్ల వర్ష బీభత్సం
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది.మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి వడగళ్ల వాన కురిసింది. కాగజ్ నగర్లో దుకాణాలపై కప్పులు కూడా ఎగిరిపోయాయి. పోచమ్మ గుడి ముందున్న సుమారు 150 ఏళ్ల వృక్షం నేలమట్టం అయ్యింది. దీంతో వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు.జగిత్యాల జిల్లాలో వాతావరణం చల్లబడటంతో ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊరట చెందారు. రాళ్లవానతో అక్కడక్కడా మామిడి రైతులకు నష్టం. వాటిల్లింది. గాలి దుమారానికి పిందెలు రాలిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో మంథని, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్, మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, ఎలిగేడు మండలం దూళికట్టలో వడగళ్ల వాన పడింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. బోయిన్పల్లి రామడుగు మల్యాల మండలాల్లో మోస్తరు కంటే ఎక్కువ వర్షం కురుస్తోంది. -
ఉపాధి హామీలో మెరుగు..
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పించాల్సిన పనిదినాల విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకన్నా మెరుగ్గా ఉండటం విశేషం. ముందుచూపుతో రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలను కల్పించడంలో సక్సెస్ అయ్యారు.ర్యాంకు జిల్లా లక్ష్యం కల్పించిన శాతం (లక్షల్లో) పనిదినాలు 2 కరీంనగర్ 28.4 26.1 92.1 8 సిరిసిల్ల 21.8 19.6 90.0 12 జగిత్యాల 40.0 35.7 89.4 14 పెద్దపల్లి 25.5 22.8 89.4 -
మహిళల అభివృద్ధికి కృషి
● సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్వేములవాడఅర్బన్/రుద్రంగి(వేములవాడ): మహిళలను కోటీశ్వరులు చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వేములవాడరూరల్ మండల పరిధిలో రూ.9లక్షలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ 23చెక్కులు, అర్బన్ మండలానికి రూ.5.50 లక్షల విలువ చేసే 26 చెక్కులు పంపిణీ చేశారు. రుద్రంగి రైతువేదికలో 35మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. బడ్జెట్లో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మర్రిపల్లి రిజర్వాయర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. 42శాతం రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. పుట్టినగడ్డ రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఇప్పటివరకు రుద్రంగి మండల పరిధిలో అనేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని పేర్కొన్నారు. వేములవాడలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్లు విజయ ప్రకాశ్‌రావు, ఎండీ అబూబకార్, ఎంపీడీవో రాజీవ్‌మల్హోత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పిల్లి కనుకయ్య, వకుళభరణం శ్రీనివాస్, రుద్రంగిలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీలత, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, గట్ల మీనయ్య, తర్రె మనోహర్ పాల్గొన్నారు. -
జీడీడీపీలో అంతంతే..
ఒక ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువే జీడీడీపీ. జిల్లా ఆర్థికాభివృద్ధికి ముఖ్య కొలమానంగా పరిగణించే జీడీడీపీలో కరీంనగర్ మెరుగ్గా ఉంది. సిరిసిల్ల రాష్ట్రంలోనే 29వస్థానంలో నిలిచింది.జిల్లా జీడీడీపీ(రూ.కోట్లలో) ర్యాంకు కరీంనగర్ 30.216 12 పెద్దపల్లి 27,649 13 జగిత్యాల 24,011 18 సిరిసిల్ల 13,981 29 -
టోకెన్ పద్ధతిలో ధాన్యం కొనుగోళ్లు
● అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల: జిల్లాలో టోకెన్ పద్ధతిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్లో గురువారం సమీక్షించారు. జిల్లాలో 2.50లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనా ఉందన్నారు. ఈసారి ఐకేపీ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని అన్నా రు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, తేమ యంత్రాలు ,ప్యాడీ క్లీనర్లు, టార్ఫాలిన్లు కొనుగోలు కేంద్రాలకు ఎన్ని అందిస్తున్నారో పూర్తి వివరాలు నివేదిక అందించాలని ఆదేశించారు. డీఎస్వో పి.వసంతలక్ష్మీ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.రజిత, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘సెస్’ పరిధిలో సోలార్ హబ్● ఇండో– జర్మన్ సహకారంతో జిల్లాలో ఏర్పాటుకు ప్రతిపాదనలు ● డీపీఆర్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశాలు సిరిసిల్ల: ఇండో– జర్మన్ సహకారంతో జిల్లాలో విద్యుత్ పంపిణీ చేసే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల భాగస్వామ్యంతో సోలార్ హబ్‌గా మార్చేందుకు జర్మన్ సహకారం పొందనున్నారు. గత ఏడాది వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని, సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి రాష్ట్ర సహకార, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిశారు. అంతర్జాతీయ వ్యవసాయ సహకార సంస్థ(ఐఏకే) అగ్రర్ కన్సల్టింగ్ జీఎంబీహెచ్ జర్మనీ సంస్థ చీఫ్ స్వెన్ గెల్హార్ నేతత్వంలో మంత్రి తుమ్మ ల నాగేశ్వర్రావుతో చర్చించారు. తెలంగాణ లో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో పునరుత్పాదక శక్తికి, సౌరశక్తి(సోలార్)గా మార్చడానికి సెస్ పరిధిలోని 253,501 విద్యుత్ వినియోగదారులను సౌరశక్తి ఉత్పత్తిదారులుగా మార్చడం లక్ష్యంగా పాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు నిధులు ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు, ఇండో–జర్మన్ సహకారంతో జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ (కేఎఫ్‌డబ్ల్యూ) ద్వారా వస్తాయని అంచనా వేశారు. సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో సోలార్‌హబ్ ప్రాజెక్టుకు డీపీఆర్‌ను సమర్పించాలని మంత్రి కోరారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే జిల్లాలో ‘సెస్’ విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది. -
‘పది’ పరీక్షలకు రెడీ
● జిల్లాలో 35 కేంద్రాలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ● హెల్ప్‌లైన్ నంబర్ 94414 40849సిరిసిల్ల ఎడ్యుకేషన్/చందుర్తి: నేటినుంచి జరిగే పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30గంటలకు ముగియనున్నాయి. వచ్చేనెల నాలుగో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నుంచి 1,452 మంది, ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,144 మంది, ఆదర్శ పాఠశాలల నుంచి 590 మంది, కేజీబీవీల నుంచి 508, గురుకుల విద్యాలయాల నుంచి 1,074 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణపై గురువారం జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు పరీక్షకేంద్రాలను తెలుసుకునేందుకు వీలుగా హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 35 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటిలో 5సీ సెంటర్లుగా ఉన్నాయని తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం జిల్లాకేంద్రంలోని గీతానగర్ బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్, తంగళ్లపల్లి, వెంకంపేట, ఇల్లంతకుంటలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. క్యూఆర్ కోడ్‌తో బుక్లెట్ ఈ సారి పరీక్షలకు క్యూఆర్ కోడ్‌తో ముద్రించిన 24పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. తొలిసారిగా ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీంతో ప్రశ్నపత్రం లీక్ అయినా ఏ సెంటర్ నుంచి లీక్ అయ్యిందో సలువుగా తెలిసే ఆవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్‌లో విద్యార్థికి సంబంధించి అన్ని వివరాలు ఉంటాయి. గతంలో పదో తరగతి పరీక్షల్లో 11పేపర్లు ఉండేవి. ఈసారి ఏడు పేపర్లే ఉండనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయోలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో 12పేజీల బుక్‌లెట్‌తో నిర్వహించనున్నారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ఐదు నిమిషాలు మినహాయింపు కూడా ఇచ్చారు. కేంద్రానికి 100మీటర్ల వరకు 144సెక్షన్ అమలులో ఉండనుంది. -
నేతన్నల విషయంలో సర్కారు నిర్లక్ష్యం
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేనే త, పవర్‌లూం రంగాలపై నిర్లక్ష్యం చూపిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ విమర్శించారు. చేనేత, పవర్లూమ్ రంగాల కు బడ్జెట్లో రూ.371కోట్లు కేటాయించడంపై యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల నేతన్నచౌక్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత, పవర్‌లూం రంగానికి బడ్జెట్లో కేవలం రూ.371 కోట్లు మాత్రమే కేటాయించి, నేతన్నలకు మొండిచేయి చూపారన్నారు. గత 15నెలలుగా చేనేత, పవర్‌లూం రంగాల్లో సంక్షోభం నెలకొని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 30మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చేనేత– పవర్‌లూం రంగాలకు 2వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలను ఐక్యంచేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు అన్నల్దాస్ గణే శ్, పవర్‌లూం వర్కర్స్ యూని యన్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, వార్ఫి న్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కుమ్మరికుంట కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికతో సుస్థిర పాలన ముస్తాబాద్(సిరిసిల్ల): ఒకే దేశం ఒకే ఎన్నికతో దేశంలో సుస్థిర పరిపాలన జరిగి అభివృద్ధి జరగుతుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి అన్నారు. ముస్తాబాద్ బీజేపీ కార్యాలయంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మనదేశంలో వివిధ రాష్ట్రాలలో విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పరిపాలన సులభమై, పథకాలు ప్రజలదరికీ చేరుతాయన్నారు. ప్రతిసారి ఎన్నికల కోడ్ రావడం, వివిధ దశలలో ఎన్నికలను నిర్వహించడం ద్వారా దేశానికి ఆర్థికంగా భారమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి సంతోష్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, క్రాంతి, నరేశ్, మహేందర్, వెంకన్న, మహేశ్వర్, పద్మ, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సురేశ్, భగత్, కార్తీక్, కృష్ణ పాల్గొన్నారు. రాజన్న తలనీలాల సేకరణ టెండర్లు వాయిదా వేములవాడ: వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాలు సేకరణకు మూడోసారి నిర్వహించిన టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి గురువారం తెలిపారు. తిరిగి నిర్వహించే తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. గత రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్ ఏప్రిల్ 11తో ముగియనుంది. గతసారి రూ.19.01కోట్లతో రెండేళ్లకు టెండర్ దక్కించుకున్నారు. తీరా రూ.10 కోట్ల మేర కాంట్రాక్టర్ బాకీపడగా, ఇటీవల రూ.2.50 కోట్లు చెల్లించి ఆలయ అధికారులు పోగుచేసిన తలనీలాలను తీసుకెళ్లారు. మిగతా డబ్బులు ఎప్పుడి చెల్లిస్తాడో..? ఏమో అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో తలనీలాలకు డిమాండ్ తగ్గడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని నాయీబ్రాహ్మణులు అంటున్నారు. మొత్తానికి రాజన్నకు ఈసారి తలనీలాల సేకరణలో గండి పడనుందని చెప్పుకుంటున్నారు. అధికారులు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానం సిరిసిల్ల: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో ఎస్సీ విద్యార్థినీ, విద్యార్థుల నుండి విదేశీ విద్య స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తులను కోరుతున్నామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజా మనోహర్‌రావు గురువారం తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులకు రూ.20లక్షల వరకు స్కాలర్ షిప్‌లు అందిస్తారని ఆయన వివరించారు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేయాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు ఆఫీస పని వేళల్లో 79893 84801 ఫోన్ నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఆదాయం అంతంతే..
● తలసరి ఆదాయంలో పెద్దపల్లి టాప్ ● అటవీ విస్తీర్ణంలో కరీంనగర్ లాస్ట్, ఉపాధి హామీలో భేష్ ● తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్‌లుక్–2025లో వెల్లడిగనుల ద్వారా ఆదాయం ఉమ్మడి జిల్లా సహజ వనరులకు నెలవైన ప్రాంతం. బొగ్గు, గ్రానైట్, ఇసుక, ఇటుక బట్టీలు తదితర మైనింగ్ కార్యకలాపాలతో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతుంది. ఉమ్మడి జిల్లా నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.190.62 కోట్లకు గాను రూ.156.21కోట్ల ఆదాయం ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది.సాక్షి, పెద్దపల్లి: జిల్లాల పురోగతికి సూచికగా భావించే స్థూల జిల్లా దేశీయోత్పత్తి విలువ(జీడీడీపీ)లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు పర్వాలేదన్నట్లుగా ఉండగా.. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం విషయంలో జగిత్యాల మినహా మిగతా జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. అర్బన్ జనాభాలో కరీంనగర్లో 3లక్షలు, రామగుండంలో 2.5లక్షలు, జగిత్యాలలో లక్షమంది పట్టణాల్లో నివసిస్తున్నారు. జిల్లా విస్తీర్ణంలో అత్యల్పంగా అడవులు కలిగి ఉండి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా చివరి స్థానంలో నిలవగా, ఖనిజాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో ఉమ్మడి జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్‌లుక్– 2025లో ఈ అంశాలన్నీ వెల్లడయ్యాయి. జిల్లా టార్గెట్ వసూలైంది (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) పెద్దపల్లి 2,465.99 2,264.30 సిరిసిల్ల 1,465.07 1,342.18 కరీంనగర్ 12,872.16 10,658.72 జగిత్యాల 2,259.05 1,356.26 -
‘నిమ్మకాయల బాబా’ బాగోతం బట్టబయలు.. మహిళలకు మత్తుమందు ఇచ్చి..
సాక్షి, సిరిసిల్ల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా బాబా ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ దొంగ బాబా బాగోతాన్ని సిరిసిల్ల జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. మహిళలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ ఫేక్ బాబా ఆటకట్టించారు. వేములవాడకి చెందిన బాపు స్వామి అనే వ్యక్తి.. సమస్యలను పరిష్కరిస్తానంటూ.. ఆరోగ్యం బాగలేకపోతే నయం చేస్తానని నమ్మించి ఆడవాళ్లను మోసం చేస్తున్నాడు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తాను పూజలు చేసి నయం చేస్తానని నమ్మించి.. ప్రత్యేక పూజల పేరుతో మహిళలకు మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఈ ఫేక్ బాబా తన పూజల సమయంలో నిమ్మకాయలలో నిద్రమాత్రలు కలిపి మహిళలకు వాసన చూపించి, వాటిని తాగించేవాడు.. స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడు. నిందితుడి నుంచి పోలీసులు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో వందలాది మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
శరభ.. శరభ
వేములవాడ: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో శివకల్యాణోత్సవాలకు ప్రత్యేకత ఉంది. అన్ని ఆలయాల్లో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్ల వివాహ వేడుకను తిలకించి పులకించిపోతారు. కానీ వేములవాడలో శివకల్యాణం సందర్భంగా అత్యధిక మంది శివుడిని పెళ్లాడటం ఆనవాయితీ. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తే స్వామినే పెళ్లాడుతామని మొక్కుకుంటారు. ఆ నమ్మకంతో కష్టాలు తొలగిపోయిన వారు ఏటా శివకల్యాణోత్సవం సందర్భంగా త్రిశూలం పట్టుకొని స్వామిని వివాహమాడుతుంటారు. శివకల్యాణోత్సవాల్లో ఆకట్టుకునే మరో ప్రత్యేకత వీరశైవులు (జంగమయ్యలు) వీరభద్రుడికి ఆహ్వానం పలికే వేడుక. వీరభద్రుడికి వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఇక్కడి జంగమయ్యలు పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీరశైవ అర్చకులు దండకాలు (ఖడ్గాలు) వేస్తూ స్వామిని ఆహ్వానిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో పట్టణానికి చెందిన 28 కుటుంబాలు పాల్గొంటాయి. స్మార్థ వైదిక పద్ధతిని అనుసరించి.. రాష్ట్రంలోని మిగతా శైవక్షేత్రాలలో ‘కారణాగమము’అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే కల్యాణోత్సవాలు చేస్తుంటారు. కానీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం ‘స్మార్థ వైదిక’పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీరాజరాజేశ్వరుల వివాహం జరిపిస్తుంటారు.ఈశ్వరుడు తపస్సులో ఉండగా, మన్మథుడు తన బాణాన్ని సంధించి తపస్సును భగ్నం చేశాడని, దీంతో ఈశ్వరునికి కోపమొచ్చి మన్మథున్ని త్రినేత్రంతో దహనం చేశాడని, అందుకోసమే కామదహనం తర్వాత మరుసటి రోజున ఈశ్వరుడు పార్వతిని కల్యాణం చేసుకుంటాడని అర్చకులు చెబుతున్నారు. ఇల్లు సల్లంగుండాలని.. ఏటా రాజన్నను పెళ్లాడే శివపార్వతులు ముందుగా ఇల్లు సల్లంగుండాలని రుద్రాక్ష పూజ చేసుకుంటారు. తమ ఆరోగ్యాలు బాగుండాలని, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలని, కుటుంబ సమస్యలు తీరాలని, మానసిక పరిస్థితులు మెరుగుపడాలని ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న వారంతా వయో, లింగభేదం లేకుండా ఇక్కడి వీరశైవులతో రుద్రాక్షపూజ నిర్వహించుకుంటారు. అనంతరం రాజన్న కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఇక్కడి వీరశైవులు వీరికి ప్రత్యేక పూజలు చేసి రుద్రాక్షధారణ నిర్వహిస్తారు. అనంతరం వారంతా రాజన్న సేవలో తపించడంతోపాటు తమతమ కుటుంబ వ్యవహారాల్లోనూ కొనసాగుతుంటుంటారు. రాజన్నకు ఉచిత ప్రచార కర్తలుగా పని చేస్తుంటారు. -
రెవె‘న్యూ’ అధికారులు !
● కలెక్టర్ మార్క్ బదిలీలు ● 9 మంది తహసీల్దార్లు.. 14 మంది డిప్యూటీ తహసీల్దార్లకు స్థానచలనం ● అదనపు కలెక్టర్ విధుల్లో చేరిన మరుసటి రోజే చర్యలు ● భారీ బదిలీలతో రెవెన్యూలో కుదుపు సిరిసిల్ల: జిల్లా రెవెన్యూశాఖ బదిలీలతో కుదుపునకు గురైంది. ఏకకాలంలో ఇంత పెద్ద సంఖ్యలో అధికారుల బదిలీలు జరగడం ఈమధ్య కాలంలో ఇదే కావడం విశేషం. జిల్లా ఆవిర్భవించినప్పటి నుంచి ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. 9 మంది తహసీల్దార్లు, 14 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ మార్క్ బదిలీలు అనే చర్చ సాగుతోంది. ఇటీవల బదిలీపై వచ్చి విధుల్లో చేరిన వారిని సైతం మళ్లీ బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో రెవె‘న్యూ’ అధికారులే కనిపిస్తున్నారు. బదిలీ అయిన డిప్యూటీ తహసీల్దార్లు వీరే.. జిల్లాలో 14 మంది డిప్యూటీ తహసీల్దార్(డీటీ)లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీర్నపల్లి డీటీ డి.మారుతీరెడ్డిని గంభీరావుపేటకు బదిలీ చేస్తూ తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కలెక్టరేట్లో ఎలక్షన్స్(ఎపిక్) విభాగంలో పనిచేసే ఎండీ ముక్తార్పాషాను వీర్నపల్లికి బదిలీ చేస్తూ తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. గంభీరావుపేట డీటీ సయ్యద్ అఫ్జల్ రహమాన్‌ను కలెక్టరేట్ ఎన్నికల విభాగానికి బదిలీ చేశారు. ప్రత్యేక ఉపకలెక్టర్ ఆఫీస్‌లో డీటీగా పనిచేసే వి.మురళీకృష్ణను ఎల్లారెడ్డిపేట డీటీగా నియమించారు. కలెక్టరేట్లోని పౌరసరఫరాల విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసే సీహెచ్ రవీంద్రాచారిని కలెక్టరేట్లోని ఎస్డీసీ ఆఫీస్‌లో డీటీగా, బోయినపల్లి డిప్యూటీ తహసీల్దార్ ఎ.దివ్యాజ్యోతిని సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో డీటీగా నియమించారు. సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసే జి.అపర్ణను ముస్తాబాద్ డిప్యూటీ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. ముస్తాబాద్ డీటీ ఎన్.భూపేశ్కుమార్ను బోయినపల్లి డీటీగా, కలెక్టరేట్లో పౌరసరఫరాల విభాగంలోని డీటీ కె.నవీన్‌కుమార్‌ను సిరిసిల్ల ఎస్డీసీ ఆఫీస్‌లో డీటీగా నియమించారు. సిరిసిల్ల ఎస్డీసీ ఆఫీస్‌లోని డీటీ కె.సురేశ్‌కుమార్‌ను వేములవాడ డిప్యూటీ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. వేములవాడ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసే జి.రజితను కలెక్టరేట్ పౌరసరఫరాల విభాగం డీటీగా నియమించారు. సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో డీటీగా పనిచేసే కె.మోహన్‌రావును రుద్రంగి డీటీగా, రుద్రంగి డీటీగా పనిచేసే బి.యాదగిరిని సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా నియమించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. గంభీరావుపేట మండలం నర్మాల నుంచి తంగళ్లపల్లి మండలం చీర్లవంచ ముంపు గ్రామం వరకు మానేరువాగు వెంబడి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇల్లంతకుంట మండలంలో బిక్కవాగు, కోనరావుపేట మండలంలో మూలవాగు పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణా రాత్రి వేళల్లో సాగుతోంది. ఇసుక అక్రమ రవాణా కట్టడికి కలెక్టర్ పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా.. దందా సాగుతూనే ఉంది. మరోవైపు మొరం తరలింపులు, అక్రమ మైనింగ్‌లు సాగుతున్నాయి. మరోవైపు రేషన్‌బియ్యం పక్కదారి పట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు జిల్లాలో రేషన్‌బియ్యం అక్రమాలపై కేసులు నమోదుచేస్తున్నారు. రేషన్‌బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేయాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ పనిని పోలీసులు చేస్తున్నారు. జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం వైఫల్యంతోనే ఇవి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను ఎత్తిచూపడంలో రెవెన్యూ అధికారులు విఫలమైనట్లు ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో రెవెన్యూ యంత్రాంగాన్ని గాడిలో పెట్టేందుకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా భారీ ఎత్తున బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు భావిస్తున్నారు. అదనపు కలెక్టర్ విధుల్లో చేరిన వెంటనే... జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ 45 రోజులు దీర్ఘకాలిక సెలవులో వెళ్లి.. సోమవారం విధుల్లో చేరారు. ఆయన విధుల్లో చేరిన మరుసటి రోజే 9 మంది తహసీల్దార్లను, 14 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్ సెలవులో ఉండగా ఆ బాధ్యతలను పర్యవేక్షించిన కలెక్టర్ రెవెన్యూ అధికారుల పనితీరును నిషితంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూశాఖలో భారీగా బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు. జిల్లాలో మరికొందరు రెవెన్యూ అధికారులు, ఆర్ఐలు, రెవెన్యూ ఆఫీస్‌లో సిబ్బందిని కూడా బదిలీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
భక్తుల చెంతకే సీతారాముల తలంబ్రాలు
● సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు సిరిసిల్లటౌన్: శ్రీరామనవమి సందర్బంగా భక్తుల చెంతకే భద్రాచలం సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలనుకార్గో ద్వారా అందిస్తున్నామని ఆర్టీసీ సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు తెలిపారు. స్థానిక బస్‌స్టేషన్‌లో బుధవారం తలంబ్రాల బుకింగ్ రశీదు పుస్తకాలను ఆవిష్కరించారు. బుకింగ్ కోసం 91542 98576, 91542 98577, 94924 48189 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ‘డబుల్’ లబ్ధిదారుల నుంచి తాళాలు వాపస్ ఇల్లంతకుంట(మానకొండూర్): అనుమతి లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ప్రవేశించిన వారి నుంచి తాళాలను తహసీల్దార్ ఫారుక్ తీసుకున్నారు. కొందరు లబ్ధిదారులు ఇళ్ల పంపిణీలో జాప్యం చేస్తున్నారని మంగళవారం ఆక్రమించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్, ఆర్ఐ షఫీ, వీఆర్వో సింగారెడ్డిలతో కలిసి మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను పరిశీలించి తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం తహసీల్దార్ ఆఫీస్‌కు అక్రమంగా ప్రవేశించిన లబ్ధిదారులను పిలిపించి నచ్చజెప్పారు. మౌలిక వసతులు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతులమీదుగా అందజేస్తామని హామీ ఇచ్చారు. టీబీ నిర్మూలనకు కృషి చేయాలి ● టీబీ అలర్ట్ ఇండియా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాను టీబీ రహితంగా మార్చడానికి కృషి చేయాలని టీబీ అలర్ట్ ఇండియా ఆర్గనైజేషన్ ప్రోగ్రాం అధికారి దండుబోయిన శ్రీనివాస్ కోరారు. మండలంలోని వెంకటాపూర్, నారాయణపూర్, బండలింగంపల్లి, కిషన్‌దాస్‌పేట, ఎల్లారెడ్డిపేట, రాచర్లబొప్పాపూర్ సబ్‌సెంటర్ల వైద్య సిబ్బందితో టీబీ నివారణపై స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం అవగాహన కల్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అధికసంఖ్యలో కేసులు ఇండియాలోనే నమోదవుతున్నాయన్నారు. టీబీని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. టీబీ వ్యాధి నిర్మూలనకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాలు ఎంపిక చేయగా.. రాజన్నసిరిసిల్ల ఒక్కటన్నారు. టీబీ బారిన పడి జయించిన వారిని టీబీ చాంపియన్‌గా గుర్తించి శిక్షణ ఇచ్చి ప్రచారం చేయాలని సూచించారు. వైద్యాధికారి సారియా అంజుమ్, టీబీ సూపర్వైజర్ పద్మ, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. సీఎమ్మార్ లక్ష్యం పూర్తి చేయాలి ● అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లాలోని రైస్‌మిల్లర్లతో సమావేశమయ్యారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ జిల్లాలోని రైస్‌మిల్లర్లు రబీ సీజన్ 2023–24లో దిగుమతి చేసుకున్న 2,56,343 టన్నుల ధాన్యానికి 1,74,313 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 1,43,656 టన్నులు ఇచ్చారని వివరించారు. ఖరీఫ్ 2024–25 సీజన్లో దిగుమతి చేసుకున్న ధాన్యం 2,11,572 టన్నులకు బియ్యం 1,42,150 టన్నులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి దాకా 21,103 టన్నులు మాత్రమే అందించారని పేర్కొన్నారు. రైస్‌మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని, రోజు వారీ లక్ష్యాలు నిర్ణయించి, సమీక్షించాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. డీఎస్వో వసంతలక్ష్మి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజిత, రైస్‌మిల్లర్ల ప్రతినిధులు గరిపెల్లి ప్రభాకర్, మల్లేశం, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అనవసర హంగామా లేకుండా వాస్తవికత అద్దంపట్టేలా బడ్జెట్‌ను రూపొందించారన్నారు. రైతులు, మహిళలు, దళిత, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉందన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే తెలంగాణ వృద్ధి రేటు 10.01 శాతంగా నమోదైందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 దేశ తలసరి ఆదాయం కంటే 1.8 రెట్లు అధికంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. రాజన్నకు రూ.100కోట్లపై కృతజ్ఞతలు రాష్ట్ర బడ్జెట్లో వేములవాడ రాజన్నకు రూ.100 కోట్లు కేటాయించడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ పట్టణంతోపాటు రాజన్న ఆలయం, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. బీసీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలసి స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను శాలువాతో సత్కరించారు. నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలి వేములవాడఅర్బన్: వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్‌బెడ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటిశుద్ధి సరఫరా ల్యాబ్‌ను బుధవారం పరిశీలించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజీ వివరాలను తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో ఇంటింటికీ నల్లా నీరు వచ్చేలా చూడాలన్నారు. నీటి నాణ్యతను రోజూ నాలుగు సార్లు పరిశీలించాలని సూచించారు. మిషన్ భగీరథ ఇంజినీర్లు జానకి, శేఖర్‌రెడ్డి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై హర్షంసిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో బుధవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మ్యాన ప్రసాద్, గడ్డం నర్సయ్య, నీలి రవీందర్, గంభీరావుపేట ప్రశాంత్, వంతడ్పుల రాము, గోనె ఎల్లప్ప, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు పెద్దపీట
కరీంనగర్ స్మార్ట్‌సిటీ రూ.101 కోట్లుస్పోర్ట్స్ స్కూల్ వరంగల్– కరీంనగర్ రూ.41 కోట్లుసాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర బడ్జెట్ 2025–26లో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులకే పెద్దపీట వేసింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు, తాయిలాల ప్రకటనకు ఈసారి ప్రభుత్వం దూరంగా ఉంది. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, పాత ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులకు పెద్దపీట వేసింది. కాళేశ్వరం, ఎల్లంపల్లి, వరదకాల్వల నిర్వహణకు నిధుల విడుదల చేయడం ఇందుకు నిదర్శనం. అదే సమయంలో పత్తిపాక ప్రాజెక్టుపై ప్రకటన లేకపోవడం, జగిత్యాల మెడికల్ కాలేజీ నిధులు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి మిగిలిన బకాయిల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. శాతవాహన వర్సిటీకి, కరీంనగర్ స్మార్ట్‌సిటీకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. మానేరు రివర్‌ఫ్రంట్‌కు నిధులు కేటాయించకపోవడం విశేషం. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో రూ.2,685 కోట్లు ప్రగతిపద్దులో కేటాయించడం చెప్పుకోదగిన అంశం. కేటాయింపులు ఇలా.. ● శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) నుంచి మిడ్‌మానేరును కలిపే వరద కాల్వకు రూ.299.16 కోట్లు పూర్తి కాని పనుల కోసం వాడనున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రూ.349.66 కోట్లు స్టేజ్–2లో పూర్తిచేయాల్సిన పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. ● మానేరు ప్రాజెక్టుకు రూ.లక్ష, బొగ్గులవాగు (మంథని): రూ.34 లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్: రూ.2.23 కోట్లు, చిన్న కాళేశ్వరం రూ.0, కాళేశ్వరం రూ.2,685 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. ఈ నిధులను పలుఅభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. కానీ.. అంతా ఆశించిన పత్తిపాక ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడం ఉమ్మడి జిల్లా వాసులను నిరాశకు గురిచేసింది. ● శాతవాహన యూనివర్సిటీకి రూ.35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర క్రీడా విద్యాలయాలైన కరీంనగర్–వరంగల్‌లకు కలిపి రూ.41 కోట్లు ప్రకటించింది. ● అదే సమయంలో కరీంనగర్‌లోని ప్రతిష్టాత్మక మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) కోసం ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. మొత్తం రూ.800 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు వాస్తవానికి ఈఏడాది మేలో పూర్తవాల్సి ఉంది. గత ప్రభుత్వం రెండు విడదలుగా ఒకసారి రూ.310 కోట్లు మరోసారి రూ.234 కోట్లు మొత్తం కలిపి రూ.545 కోట్ల పైచిలుకు నిధులు విడుదల చేసింది. దీనికి టూరిజం వాళ్లు మరో రూ.100 కోట్లు కలపాల్సి ఉంది. కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడం, కొత్త కేటాయింపులు లేకపోవడం, సాంకేతిక కారణాల వల్ల ప్రాజెక్టులో జాప్యం నెలకొంది. గతంలో రూ.210 కోట్లు విడుదలవగా, ఇటీవల మరో రూ.130 కోట్ల వరకు విడుదలయ్యాయని తెలిసింది. ● కరీంనగర్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు రూ.101 కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్లకు సాయం కింద ఏమీ కేటాయించలేదు. ● ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.12,500 కోట్లు కేటాయించింది. పథకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో 3500 మంది లబ్ధిదారుల చొప్పున ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షల వరకు ప్రభుత్వం సాయం చేయనుంది. ప్రస్తు తం కేటాయింపుల ప్రకారం..చూసినపుడు119 నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గంలో దాదా పు 2100 ఇండ్లకే ఈ సాయం సరిపోతుంది. ● ఇక ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, కొండగట్టులకు ఎలాంటి ప్రకటన లేకపోవడం భక్తులను నిరాశకు గురిచేసింది. ● కీలకమైన కాకతీయ కాల్వల ఆధునికీకరణ, కల్వల ప్రాజెక్ట్ లకు నిధులు ఇవ్వకపోవడంపైనా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సంక్షేమం, సాగునీటి రంగానికి నిధులు ఎల్లంపల్లి, వరదకాల్వకు కేటాయింపులు కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యధికంగా.. మానేరు రివర్ ఫ్రంట్‌కు రిక్తహస్తమే కరీంనగర్ స్మార్ట్‌సిటీకి రూ.101 కోట్లు 2025–26 బడ్జెట్లో కానరాని కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన -
గంజాయిని నిర్మూలిస్తాం
చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు చందుర్తి(వేములవాడ): గంజాయి నిర్మూలనకు పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపుతోందని చందుర్తి సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చందుర్తి సర్కిల్ ఆఫీస్‌లో గంజాయి కేసులలో నిందితులకు బుధవారం సీఐ కౌన్సెలింగ్ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ నిందితులు తమ ప్రవృత్తిని మార్చుకోవాలని సూచించారు. లేకపోతే హిస్టరీషీట్స్, పీడీయాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పాత నేరస్తులపై నిఘా ఉంటుందని తెలిపారు. గంజాయి సేవించిన, రవాణా చేసిన, క్రయవిక్రయాలు కొనసాగించిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి పరీక్షలు నిర్వహణకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి సహకారంతోనే రవాణాదారులను, విక్రయదారులను పట్టుకుంటామని వివరించారు. చందుర్తి ఎస్సై అంజయ్య, ప్రొబేషనరీ ఎస్సై అనిల్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి
సిరిసిల్లటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధివిధానాలు మానుకోవాలని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో సవరణలు చేయాలని కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇస్తామన్న రూ.4వేల జీవన భృతి వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషేధం విధించాలన్నారు. అసంఘటిత కార్మిక రంగానికి బోర్డులను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. ఈనెల 29న రాష్ట్ర బీడీ కార్మిక సంఘ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించే మహాసభను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు సుధీర్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిలివేరి కృష్ణయ్య, మహిళా కార్యకర్తలు మంజుల, కీర్తి పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని సింగారం వద్ద బుధవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. సింగారంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బియ్యం తరలిస్తున్న వాహనం పట్టుబడింది. మండలంలోని నారాయణపూర్‌కు చెందిన అనరాసి దేవరాజు తన ఆటోలో సుమారు 10 క్వింటాళ్ల బియ్యాన్ని గంభీరావుపేట మండలం లింగన్నపేట రైస్‌మిల్లుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. గ్రామాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి బియ్యం తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బియ్యంతో పాటు ఆటోను సీజ్ చేసి దేవరాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అక్రమ పట్టాదారుడు అరెస్ట్
● తహసీల్దార్‌తోపాటు ముగ్గురిపై కేసు చందుర్తి(వేములవాడ): పట్టాదారులకు తెలియకుండా భూమిని అక్రమ పట్టా చేసుకున్న వ్యక్తితోపాటు తహసీల్దార్, వీఆర్వోపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై అంజయ్య తెలిపారు. ఎస్సై అంజయ్య తెలిపిన వివరాలు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దొంగరి వెంకటరాములుకు చెందిన 73 సర్వేనంబర్‌లో 2.08 ఎకరాల భూమిని, అదే సర్వేనంబర్‌లోని దొంగరి శంకర్‌కు చెందిన 2.07 ఎకరాలను అదే గ్రామానికి చెందిన ఈర్లపల్లి రాములు ఉరప్ చిన్నరాములు 4.15 ఎకరాల పట్టా చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో అక్రమ పట్టా చేసుకున్న ఈర్లపల్లి రాములుతోపాటు పట్టాచేసిన అప్పటి తహసీల్దార్ రాజగోపాల్రావు, వీఆర్వో రాజేశంలపై కేసు నమోదు చేశారు. అక్రమ పట్టా చేసుకున్న రాములును పోలీసులు అదుపులోకి తీసుకోగా, తహసీల్దార్, వీఆర్వోలు పరారీలో ఉన్నారు. త్వరలోనే పట్టుకోనున్నట్లు ఎస్సై తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం● రూ.50వేలు ఆర్థికసాయం అందించిన కలెక్టర్ సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాలో అంగోతు రాములు ఇల్లు బుధవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఇంట్లో నిల్వచేసిన ధా న్యం, వంట సామగ్రి, బట్టలు బూడిదయ్యాయి. రాములు కుమారుడు గణేశ్ చదువుకుంటున్న సర్టిఫికెట్లు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పరామర్శించారు. ఈ విషయం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా దృష్టికి వెళ్లడంతో వెంటనే ప్రభుత్వం తరఫున రూ.50వేల చెక్కును అందజేశారు. రాజన్న సేవలో ఎమ్మెల్సీ అంజిరెడ్డివేములవాడ: రాజన్నను ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకుడు ప్రతాప రామకృష్ణ, వేములవాడ టౌన్ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ప్రసాదాలు అందించి సత్కరించారు. -
ధాన్యం బాధ్యత మహిళా సంఘాలదే!
● యాసంగి కొనుగోళ్లు ఐకేపీలకే.. ● సహకార సంఘాలకు ‘నో చాన్స్’ ● జిల్లాలో 259 కేంద్రాలు ● గతంలో ఐకేపీ 44, ప్యాక్స్ కేంద్రాలు 202 ● డీసీఎంఎస్ కేంద్రాలు 9, మెప్మా కేంద్రాలు 4సిరిసిల్ల: ధాన్యం కొనుగోళ్లకు మహిళా సంఘాలను సిద్ధం చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) అధికారులకు సమాచారం అందించారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1,78,350 ఎకరాల్లో వరి సాగుచేశారు. 4.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. గతేడాదిత యాసంగి సీజన్లో 259 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) ఆధ్వర్యంలోనే 202 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) పరిధిలో 44 కేంద్రాలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 9, మెప్మా పరిధిలో 4 కేంద్రాలను ప్రారంభించి వడ్లను కొన్నారు. ఈ ఏడాది మాత్రం ఎక్కువ స్థానాల్లో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే మహిళా సంఘాలను పర్యవేక్షించే డీఆర్డీఏ అధికారులకు జిల్లా ముఖ్య అధికారి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మహిళా సంఘాలతో సాధ్యమేనా..? గతేడాది ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఐరిష్(కంటిపాప) నమోదు విధానాన్ని అమలు చేశారు. భోగస్ రైతులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. అసలైన రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 170 ఐరిష్ మిషన్లు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మరో పక్షం రోజుల్లో వరికోతలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలు చేపట్టాలనే నిర్ణయం సాధ్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులు మాత్రం సింగిల్‌విండోలకు ధాన్యం కొనుగోళ్ల బాధ్యతలు ఇవ్వకుండా మహిళా సంఘాలకే ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐకేపీ కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేయాలనే నిర్ణయాన్ని మెజార్టీ పీఏసీఎస్(పాక్స్)లు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం సహకారం సంఘాలకు ఎన్నికై న పాలకవర్గాలు లేవు. ప్రభుత్వ ఆదేశాలతో ఆరు నెలలు పొడగింపు సంఘాలు పర్సన్ ఇన్చార్జి కమిటీలు ఉన్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉంటాయో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఐకేపీ కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. కానీ కాలక్రమంలో ఐకేపీ కేంద్రాల సంఖ్యను తగ్గిస్తూ పీఏసీఎస్‌లకు ఆ బాధ్యతలను అప్పగిస్తూ వచ్చారు. దీంతో జిల్లాలో సహకార సంఘాలదే అగ్రస్థానమైంది. మళ్లీ ఇప్పుడు మహిళలకు ఆ బాధ్యతలను ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా స్పష్టత రాలేదు ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమక్షంలో సమావేశం జరగాల్సి ఉంది. ఆ సమావేశం జరిగితే కొనుగోళ్ల బాధ్యత ఎవరిదో తెలుస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. గతంలో ఐకేపీ కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. మహిళా సంఘాలకే ధాన్యం కొనుగోళ్ల బాధ్యతపై స్పష్టత రాలేదు. – శేషాద్రి, డీఆర్డీవో సహకార సంఘాలకే అప్పగించండి వేములవాడఅర్బన్: సహకార సంఘాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేసేలా చూడాలని జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు విన్నవించారు. బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఈమేరకు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఇన్నాళ్లు అవినీతికి తావు లేకుండా ధాన్యం కొనుగోలు జరిగాయన్నారు. 2010లో అప్పటి మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ చొరవతో సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. పీఏసీఎస్ చైర్మన్లు, నాయకులు గుండారపు కృష్ణారెడ్డి, ఏనుగు తిరుపతిరెడ్డి, బండ నర్సయ్య, భాస్కర్‌గౌడ్, దేవదాస్ ఉన్నారు. -
ఒకే దేశం.. ఒకే ఎన్నికపై దృష్టి
తంగళ్లపల్లి: ఒకే ఓటు..ఒకే దేశం.. ఒకే ఎన్నిక బీజేపీ దృష్టికోణమని ఆ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా ఇన్చార్జి మల్లారపు సంతోష్‌రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. మల్లారపు సంతోష్‌రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు మాట్లాడారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడంతో ఖర్చులు తగ్గించవచ్చన్నారు. జమిలీ ఎన్నికలను బీజేపీ 1984 మేనిఫెస్టోలో ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు. కన్వీనర్ రెడ్డిమల్ల సుఖేందర్, కోకన్వీనర్ మోర శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, కార్యదర్శి ఆశీర్వాద్, ఉపాధ్యక్షుడు గోనెపల్లి శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు కోసిని వినయ్, ఓబీసీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, నాయకులు బొలగం భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
● రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డిసిరిసిల్లటౌన్: ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని ఆఫీస్‌లో బుధవారం నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పేదరెడ్డీలను దృష్టిలో పెట్టుకొని రూ.10వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో పేద రెడ్డీలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. తీన్మార్ మల్లయ్య రెడ్డీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు ఎగుమామిడి కృష్ణారెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, డబ్బు తిరుపతిరెడ్డి, గడ్డమీద ప్రసాద్‌రెడ్డి, కూతురు వెంకట్‌రెడ్డి, లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మడుపు ప్రమోదరెడ్డి, మహిళా సంయుక్త కార్యదర్శి దుండ్ర జలజారెడ్డి, సంయుక్త కార్యదర్శులు ముసుకు తిరుపతిరెడ్డి, ఏమిరెడ్డి కనకారెడ్డి, జువ్వెంతుల లక్ష్మారెడ్డి, మంద బాల్‌రెడ్డి పాల్గొన్నారు. న్యాయం చేయండి సిరిసిల్లటౌన్: ఏళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ ప్రజాప్రతినిధి భర్త ఇబ్బందులు పెట్టారని.. ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని సిరిసిల్లకు చెందిన మచ్చ ప్రభాకర్ కుటుంబం మున్సిపల్ ఎదుట బుధవారం బైటాయించింది. వారు మీడియాతో మాట్లాడారు. నెహ్రూనగర్‌కు చెందిన ప్రభాకర్ ఇంటి పక్కనే మాజీ కౌన్సిలర్ ఇల్లు ఉంది. తమకు సంబంధించిన స్థలంలో కొంతభాగాన్ని తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈవిషయంలో తమకు న్యాయం కావాలని ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వారితో మున్సిపల్ అధికారులు మాట్లాడి ఇంటికి పంపించారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌కు చెందిన కమటం ఉదయ్(35) మానేరువాగులోకి చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. ఇంటి నుంచి రెండు రోజుల క్రితం వెళ్లిన వ్యక్తి వాగులో శవమై తేలడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. ఉదయ్ సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 17న సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజుల నుంచి ఉదయ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో గాలించారు. ఈక్రమంలోనే బుధవారం మానేరువాగులో శవమై తేలినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ఉదయ్‌గా గుర్తించారు. చేపలు పడుతున్న క్రమంలో అదుపుతప్పి వాగులో పడి నీట మునిగినట్లు భావిస్తున్నారు. మృతుడికి భార్య సరళ, ఇద్దరు కూతుళ్లు అత్విక, అశ్విక ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేతముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని రామలక్ష్మణపల్లి మానేరువాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు. ముస్తాబాద్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బి.సురేశ్‌ను రిమాండ్ తరలించామని, ట్రాక్టర్ల యజమానులతోపాటు మరో డ్రైవర్‌పై కేసులు నమోదు చేశామన్నారు. -
దురలవాట్లకు దూరంగా ఉండాలి
● సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ ● నేతన్నలకు సామూహిక కౌన్సెలింగ్సిరిసిల్ల: నేతకార్మికులు దురలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి ఆహారం తీసుకుంటూ.. ఆరో గ్యాన్ని కాపాడుకోవాలని ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ సూచించారు. స్థానిక కార్మికవాడలో జిల్లా జనరల్ ఆస్పత్రి మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్విని యోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలన్నారు. పవర్లూమ్ కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు మహిళాశక్తి చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చిందని వివరించారు. నేతన్నలు మానసిక, శారీరక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. తంబాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. మరమగ్గాల పారిశ్రామికులు దూస ప్రసాద్, మైండ్ కేర్ సిబ్బంది వేముల అన్నపూర్ణ, రాపెళ్లి లత, కొండ ఉమ, బూర శ్రీమతి పాల్గొన్నారు. -
విద్యతోనే విచక్షణ
● డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి సిరిసిల్లఎడ్యుకేషన్: విద్యతోనే విచక్షణ, జ్ఞానం వస్తాయని డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్లో జరిగిన పదో తరగతి వీడ్కోలు సమావేశానికి హాజరై మాట్లాడారు. విద్యతోనే జీవితాన్ని సరైన దిశలో మలుచుకునే అవకాశం లభిస్తుందన్నారు. వ్యక్తిగత జీవితంతోపాటు సమాజ వికాసానికి దోహదపడుతుందన్నారు. ఇష్టపడి చదివితే విజయాలు దరిచేరుతాయని పేర్కొన్నారు. హెచ్ఎం మోతిలాల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఉమా, మాజీ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, స్టాప్ సెక్రెటరీ మల్లేశం పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలి
● అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదంపై హర్షం ● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు సిరిసిల్ల: విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలకు 29 నుంచి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ఆమోదం పొందడంపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో మంగళవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. హన్మాండ్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని కోరారు. చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించకుంటే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. అనం తరం స్వీట్లు పంచి, టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. నాయకులు తడక కమలాకర్, బొప్ప దేవయ్య, చొక్కాల రాముముదిరాజ్, గోలి వెంకటరమణ, జగ్గాని మల్లేశ్‌యాదవ్, సమ్మెట రవి, ఇల్లంతకుంట తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లలో శాసీ్త్రయతను పాటించాలి బీసీ రిజర్వేషన్లలో శాసీ్త్రయతను పాటించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షుడు పొలాస నరేందర్ కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఆమోదించడంపై హర్షం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని కోరారు. -
అప్రమత్తతతోనే అదుపులో శాంతిభద్రతలు
● ఎస్పీ మహేశ్ బి.గీతే ● తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ తంగళ్లపల్లి(సిరిసిల్ల): అధికారుల అప్రమత్తతతోనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. సీజ్చేసిన వాహనాలు, స్టేషన్ రికార్డులు పరిశీలించి కేసులు త్వరగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. డయల్ 100, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై రామ్మోహన్ ఉన్నారు. ఒకే దేశం..ఒకే ఎన్నిక అవసరం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: పరిపాలన సామర్థ్యం పెంచేందుకు ఒకే దేశం.. ఒకే ఎన్నిక అవసరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్ల మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడమే లక్ష్యమన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ కారెడ్ల మల్లారెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పనులు చేపట్టాలి ● డీఆర్డీవో పీడీ శేషాద్రి చందుర్తి(వేములవాడ): ఉపాధిహామీ పనులు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని డీఆర్డీవో శేషాద్రి కోరారు. మండలంలోని మర్రిగడ్డలో చేపట్టిన ఫీడర్‌చానల్, కోళ్ల ఫారం షెడ్ పనులను మంగళవారం పరిశీలించారు. కూలీల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చేపడుతున్న ఉపాధిహామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. పనిచేసే చోట కూలీలకు వసతులు కల్పించాలని సూచించారు. ఉపాధిహామీ ఏపీవో రాజయ్య, మర్రిగడ్డ గ్రామ కార్యదర్శి కవిత ఉన్నారు. ఓటరుగా నమోదు చేసుకోవాలి ● వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ వేములవాడఅర్బన్: 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ కోరారు. తహసీల్దార్ ఆఫీస్‌లో వివిధ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. కొత్త ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. తహసీల్దార్ మహేశ్‌కుమార్, పార్టీల ప్రతినిధులు పొలాస నరేందర్, రాము, రామస్వామి తదితరులు ఉన్నారు. ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం చేయండి కోనరావుపేట(వేములవాడ): వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని, ధర్మారంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. మాతాశిశు, అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాలపై సమీక్షించారు. మండల వైద్యాధికారి వేణుమాధవ్, ప్రోగ్రాం అధికారులు అనిత, సంపత్, రామకృష్ణ, సూపర్వైజర్లు రషీద్, సువర్ణ, మెర్సీ ఉన్నారు. -
అన్నం పెట్టిన అమ్మలకు చిరుకానుక
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తమకు ఇన్నాళ్లు పాఠశాలలో రుచికరమైన మధ్యాహ్న భోజనం వండి పెట్టిన అమ్మలకు మండలంలోని జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులు కృతజ్ఞతను చాటుకున్నారు. తమకు ఆరో తరగతి నుంచి రుచికరమైన భోజనం వండి పెడుతున్న మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు మంగళవారం చీరలు బహూకరించి తమ ప్రేమను చాటారు. విద్యార్థులు మాట్లాడుతూ ఐదేళ్లుగా తమను కన్నతల్లి లాగా చూసుకొని కడుపునిండా అన్నంపెట్టారని కొనియాడారు. అనంతరం ఆఫీస్ సబార్డినేట్ సంతోష్‌కు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థులను పాఠశాల హెచ్ఎం జోగినపల్లి అనురాధ అభినందించారు. -
విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● కుక్కకాటుకు గురైన బాలికకు పరామర్శ సిరిసిల్ల: కుక్కకాటుకు గురై, గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. చిన్నబోనాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టెముక్కల సువర్ణపై సోమవారం వీధికుక్క దాడి చేసింది. విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై సిరిసిల్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం విద్యార్థినిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులను, బ్లడ్‌బ్యాంక్‌ను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలి వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో తాగునీటి సరఫరా, వేసవి ప్రణాళికపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఇబ్బందులున్న ప్రాంతాలను ముందే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. మిడ్‌మానేర్, అప్పర్‌మానేర్ నుంచి తాగునీరు వేములవాడలోని గుర్రంవానిపల్లి 120 ఎంఎల్డీ, గంభీరావుపేట మండలంలోని కోళ్లమద్ది 7 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి 300 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతుందని, 75 ఆవాసాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈలు జానకి, శేఖర్‌రెడ్డి, రాము, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేశ్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సమాచారం ఇవ్వండి వేములవాడఅర్బన్: ఎల్ఆర్ఎస్–2020 దరఖాస్తుదారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. వేములవాడ నందికమాన్ ప్రాంతంలోని అంజన డెవలపర్స్‌కు సంబంధించిన శ్రీనివాస్ తన వెంచర్లో మొత్తం 11.25 ఎకరాల భూమి ఉండగా, అందులో 117 ప్లాట్స్ చేశారు. 1.06 ఎకరాలు పార్క్ కోసం వదిలినట్లు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ వెంచర్‌ను జిల్లా కలెక్టర్, ఎల్ఆర్ఎస్ జిల్లా చైర్మన్ సందీప్‌కుమార్ ఝా, కమిటీ సభ్యులు ఆర్డీవో రాజేశ్వర్, పీఆర్, ఆర్‌ఆండ్‌బీ ఈఈలు, నీటీపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, డీటీసీపీవో అన్సర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
‘డబుల్’ ఇళ్లలోకి ప్రవేశించిన లబ్ధిదారులు
ఇల్లంతకుంట(మానకొండూర్): తమకు డబుల్ బెడ్రూము ఇళ్లను అధికారులు ఇచ్చేలా లేరనుకుని మండల కేంద్రానికి చెందిన 10 మంది లబ్ధిదారులు మంగళవారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ప్రవేశించారు. ఇళ్లకు అధికారులు వేసిన తాళాలు పగులకొట్టి వెళ్లారు. వారు మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఇళ్లు కేటాయించిన అధికారులు ఇప్పటి వరకు అప్పగించలేదన్నారు. సొంతిళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. అద్దె ఇళ్ల ఇబ్బందులు తప్పించుకునేందుకు తాము తమకే వచ్చి, ఖాళీగా ఉంటున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లినట్లు చెప్పారు. ‘డబుల్’ ఇళ్ల పరిధిలో 163 సెక్షన్ అమలు ఇల్లంతకుంటలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ఎవరూ వెళ్లకూడదని, ఆ ప్రాంతంలో 163 సెక్షన్ అమలులో ఉంటుందని తహసీల్దార్ ఫారుఖ్ మంగళవారం రాత్రి ప్రకటనలో తెలిపారు. ఆ ఇళ్ల చుట్టుపక్కల కూడా ఎవరూ ఉండకూడదని పేర్కొన్నారు. -
న్యాయం చేయండి
● మండుటెండలో ఆరుగంటల పాటు ధర్నా ● పోలీసుల హామీతో విరమణ బోయినపల్లి(చొప్పదండి): ఇల్లు లేదు. భూమి లేదు.. బతుకుదెరువు లేదు.. ఇంటి పెద్ద చనిపోయాడు.. మాకు న్యాయం చేయండి సారు.. అంటూ ట్రాక్టర్ ఢీకొని సోమవారం రాత్రి మృతి చెందిన సురకాని మల్లేశం కుటుంబీకులు, బంధువులు మంగళవారం బోయినపల్లిలో ధర్నాకు దిగారు. మృతుడి భార్య గంగాజల ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఎండలో బైటాయించడం చూసేవారిని కంట తడి పెట్టించింది. గంగాధర మండలం ఉప్పరమల్యాలకు చెందిన మల్లేశం కొంతకాలంగా బోయినపల్లిలో ఉంటూ గొర్రెలకాపరిగా ఉపాధి పొందుతున్నాడు. గొర్రెలమంద వద్దకు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీ కొని మృతిచెందాడు. ఈక్రమంలో తమ కుటుంబా నికి న్యాయం చేయాలంటూ స్థానిక పోలీసుస్టేషన్ వద్దకు మృతుని కుటుంబసభ్యులు, బంధువులు చే రుకున్నారు. ప్రమాద కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్‌ను అరెస్టు చేయాలని కోరారు. అక్కడి నుంచి బోయినపల్లి–గంగాధర ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టా రు. వేములవాడ రూరల్, టౌన్ సీఐలు శ్రీనివాస్, వీరప్రసాద్, ఎస్సై పృథ్వీధర్‌గౌడ్, మారుతితో పాటు దాదాపు 50 మంది సిబ్బంది అక్కడికి చేరుకొని బందోబస్తు చేపట్టారు. దాదాపు ఆరు గంటల పాటు ధర్నా కొనసాగింది. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి సైతం ఽసంఘటన స్థలం వద్దకు వచ్చి వాకబు చేశా రు. చివరికి సాయంత్రం ఆరు గంటల సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామమని పోలీసుల హామీతో ధర్నా విరమించారు. -
ఏక్ భారత్.. శ్రేష్ట భారత్
వేములవాడఅర్బన్: వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏక్ భారత్.. శ్రేష్ట భారత్‌లో భాగంగా మంగళవారం వేషధారణలతో పాఠశాలకు హాజరయ్యారు. హెచ్ఎం శ్రీకాంత్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్వీసు పర్సన్ సస్పెన్షన్ చందుర్తి(వేములవాడ): మండలంలోని నర్సింగపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సర్వీసు పర్సన్‌గా పనిచేస్తున్న బండి రాకేశ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మండల విద్యాధికారి వినయ్‌కుమార్ తెలిపారు. పాఠశాల ఆవరణలో మద్యం తాగుతూ విద్యార్థులను చెడు వ్యవసనాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి మృతిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం ఇటలీ దేశానికి వెళ్లిన ఓ వలస జీవి రోడ్డు ప్రమాదంలో ప్రా ణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన మహ్మద్ రషీద్(47) రెండేళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయం అక్కడి మిత్రులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా మంగళవారం సమాచారం అందించారు. రషీద్ కుటుంబ సభ్యులు కొంతకాలంగా సిద్దిపేటలో ఉంటున్నారు. రషీద్ మృతదేహం బుధవారం ఎల్లారెడ్డిపేటకు రానుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి శాత్రాజుపల్లి రహదారిలోని తెలంగాణ సోషల్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలోని విద్యార్థినిలు క్రీడాపోటీల్లో ప్రతిభ చూపారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్వైకేఎస్ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. కబడ్డీలో రమ్య, శైలజ, శృతి, రోజా, గౌతమి, గీతాంజలి, శృతి, వాలీబాల్‌లో శ్రావణి, కీర్తి, వెన్నెల, శ్రీజ, ప్రవళ్లిక, నేహ, రన్నరప్ జట్టులో హారిక, మానస, కావ్య, శృతి, అఖిల, అక్షయ, మాళవిక, 200 మీటర్ల రేసులో వర్షిత, చైత్రిక విజయం సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ లావణ్య, వైస్ ప్రిన్సిపాల్ సుమలత, దేవిక, అభినందించారు. దుబాయ్‌లో ఉద్యోగాలు.. ఐటీఐలో రిజిస్ట్రేషన్లు సిరిసిల్లకల్చరల్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో నైపుణ్యం గల నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నిర్ణయించింది. ఈమేరకు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(దుబాయి)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ సరిత ప్రకటనలో తెలిపారు. సిరామిక్ కాప్టర్జూనియర్ ప్రాసెస్ ఆపరేటర్, ప్రెస్ మెకానిక్, పాలిసింగ్ మెకానిక్, డిజైనర్, ప్రొడక్షన్ సూపర్వైజర్, బాడీ ప్రిపరేషన్ ఇన్చార్జ్, పోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, షవల్ ఆపరేటర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.tomcom.telanga na.gov.in వెబ్సైట్లో లేదా 94400 49937లో సంప్రదించాలని సూచించారు. -
ట్రాన్స్ఫార్మర్ కాలిపోలే రైతులు డబ్బులు కట్టాలా..
మా కొడుకు ప్రణీత్‌రెడ్డి 2023లో విద్యుత్ ప్రమాదంలో గాయపడ్డాడు. మా ఇంటి పక్కనే వద్దనంగా విద్యుత్‌లైన్ వేశారు. కోతులను కొట్టేందుకు ఇంటిపైకి వెళ్లిన మా కొడుకు కరెంట్ షాక్ తగిలి 80 శాతం గాయాలయ్యాయి. ప్రాణాలకు గ్యారంటీ లేదన్నారు. రూ.20లక్షలు అప్పు చేసి వైద్యం చేయించుకుని ప్రాణాలను కాపాడుకున్నాం. ‘సెస్’ సంస్థ ఒక్కపైసా పరిహారం కూడా ఇవ్వలేదు. – ప్రణీత్ తల్లి, పదిర గ్రామం ట్రాన్స్పార్మర్ కాలిపోతే.. రైతులే మోటారు ఇంత అని డబ్బులు వసూలు చేసి ‘సెస్’ సిబ్బందికి ఇస్తున్నారు. ‘సెస్’కు ఐదు వాహనాలు ఉన్నా ప్రైవేటు వాహనాల్లో ట్రాన్స్ఫార్మర్ తెస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ పనిచేయదు. మీటింగ్‌ల సమాచారం ఇవ్వరు. విద్యుత్ ప్రజావాణి మొక్కుబడిగా నిర్వహించి ఫొటోలు దిగుతున్నారు. ‘సెస్’ సంస్థ రూ.కోట్ల అప్పుల్లో ఉంది. ఆస్తులను కోల్పోతుంది. – జోగినిపల్లి సంపత్‌రావు, నర్సింగాపూర్ జిల్లాలో 140 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. 124 హె చ్పీల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని హెచ్‌టీ బిల్లింగ్ చేస్తున్నారు. ఎల్టీ బిల్లింగ్‌ను హెచ్టీగా మార్చడంతో ఎక్కువ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. దీన్ని సవరించాలని చెప్పినా ‘సెస్’ అధికారులు పట్టించుకోవడం లేదు. బిల్లు కట్టకుంటే డిస్కనెక్షన్ చేస్తున్నారు. దీంతో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లకు నష్టం జరుగుతుంది. సిటిజన్ చార్టర్‌ను ‘సెస్’లో అమలు చేయడం లేదు. – గర్రిపెల్లి ప్రభాకర్, సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమలో బ్యాక్ బిల్లింగ్ పేరిట గతంలో వినియోగించిన విద్యుత్‌కు ఇప్పుడు బిల్లులు వేస్తున్నారు. ఒక్కో మరమగ్గాల పరిశ్రమ రూ.లక్షల్లో బ్యాక్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని విద్యుత్ కట్ చేస్తున్నారు. పాతికేళ్లుగా అమలులో ఉన్న 50 శాతం విద్యుత్ రాయితీలో పరిశ్రమ నడిచింది. ఇప్పుడు కొత్తగా బ్యాక్ బిల్లింగ్ వేయడం సరికాదు. ఈఆర్సీ చొరవ చూపి బ్యాక్ బిల్లింగ్‌ను రద్దుచేసి వస్త్రపరిశ్రమను రక్షించాలి. – తాటిపాముల దామోదర్, సిరిసిల్ల సంస్థలో 20 ఏళ్లుగా ఒకే చోట ఉద్యోగులు పాతుకుపోయారు. వారిని బదిలీ చేయకుండా ఉన్నతాధికారులు, పాలకవర్గం మీకు మేము.. మాకు మీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతులు, వినియోగదారులు విద్యుత్ సమస్యలతో వస్తే అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. సరిగ్గా డ్యూటీలు చేయకుండా రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. ‘సెస్’ సంస్థను ఎన్పీడీసీఎల్లో కలపాలి. – దేవయ్య, ఎల్లారెడ్డిపేట మధ్యమానేరు ముంపు గ్రామాల్లోని రూ.కోట్ల విలువైన విద్యు త్ పరికరాలను అమ్మేసి సొ మ్ము చేసుకున్నారు. కేంద్రం అ మలు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ సోలార్ ఎనర్జీని ‘సెస్’ సంస్థ ఎందుకు ప్రోత్సహించడం లేదు. సంస్థ స్వ యం సమృద్ధి సాధించడం లేదు. సిక్ యూనిట్లకు వన్టై మ్ సెటిల్మెంట్లు చేసి మొండి బకాయిలను వసూలు చేయాలి. ఆదర్శ ‘సెస్’ను ఎన్పీడీసీఎల్లో కలపాల నే డిమాండ్ వస్తుందంటే పాలకవర్గం ఆలోచించాలి. – పులి లక్ష్మీపతిగౌడ్, స్తంభంపల్లి ‘సెస్’ సంస్థలో ఒకప్పుడు సే వా భావం ఉండేది. ఇప్పుడు లేదు. 124 కేవీ విద్యుత్ రైస్ మిల్లులకు శాపంగా మారింది. నేను అదనంగా రూ.5లక్షలు చె ల్లించాను. మా ఊరిలో బైరి దుర్గయ్య అనే దళితుడు రూ.7,600 చెల్లించి 2 పోల్స్ కావాలంటే ఇవ్వలేదు. కానీ అతని పేరిట మెటీరియల్ డ్రా చేశారు. దీనికి బాధ్యులు ఎవరు? ఊరిలో లోవోల్టేజీ సమస్య ఉందని, ఓ ట్రాన్స్ఫార్మర్ వేయాలంటే పట్టించుకోవ డం లేదు. సంస్థలో పని చేసే వారు కరువయ్యారు. – వెన్నమనేని వంశీకృష్ణరావు, మర్తనపేటప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు నష్టం ముంపు గ్రామాల్లోని మెటీరియల్ ఏమైంది