సన్నబియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

సన్నబియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం

Apr 4 2025 1:46 AM | Updated on Apr 4 2025 1:46 AM

సన్నబియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం

సన్నబియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం

● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినపల్లి(చొప్పదండి): ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి బోయినపల్లిలో సన్నబియ్యం పంపిణీని గురువారం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో దొడ్డు బియ్యం తినలేక అమ్ముకునే వారని పేదల కడుపు నింపడానికి సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీకి ముందుకొచ్చారన్నారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ సన్నబియ్యం పక్కదారి పట్టకుండా సివిల్‌ సప్లయ్‌, పోలీస్‌శాఖ చూడాలని ఆదేశించారు. మండలంలో 33,141 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలి పారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.10.44 లక్షల మేర సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్డీవో రాజేశ్వర్‌, డీఎస్‌వో అనంతలక్ష్మి, తహసీల్దార్‌ కాలె నారా యణరెడ్డి, ఎంపీడీవో భీమ జయశీల, సింగిల్‌విండో చైర్మన్లు జోగినిపల్లి వెంకట్రామారావు, ముదుగంటి సురేందర్‌రెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌, మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బోయిని ఎల్లేశ్‌యాదవ్‌, సెస్‌ డైరెక్టర్‌ కొట్టెపెల్లి సుధాకర్‌, వీసీ నిమ్మ వినోద్‌రెడ్డి, భీంరెడ్డి మహేశ్‌రెడ్డి ఉన్నారు.

డేరింగ్‌ కలెక్టర్‌

సిరిసిల్ల జిల్లాకు డేరింగ్‌ కలెక్టర్‌గా సందీప్‌కుమార్‌ ఝా పని చేస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తీరుస్తూనే భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తూ ప్రభుత్వ భూములు కాపాడుతున్నారని అభినందించారు.

రేషన్‌ డీలర్ల కమీషన్‌ పెంచండి

తమ సమస్యలు పరిష్కరిండంతోపాటు కమీషన్‌ పెంచాలని కోరుతూ మండల రేషన్‌ డీలర్ల సంఘ నాయకులు ఎమ్మెల్యే, కలెక్టర్‌లకు వినతిపత్రం ఇచ్చారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్‌ పెంచాలని కోరారు. డీలర్‌ సంఘ నాయకులు ఎర్ర నర్సయ్య, డబ్బు వెంకటరెడ్డి, తుంగపల్లి మదు, రాజయ్య, నిర్మల, భాస్కర్‌, అమ్మాయి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement