breaking news
Rajanna Sircilla District News
-
వేములవాడను సుందరంగా తీర్చిదిద్దుతాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే తమ కర్తవ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మల్లారంరోడ్డు చౌరస్తా నుంచి బతుకమ్మ తెప్ప మీదుగా జగిత్యాల బస్టాండ్, సాయిరక్ష దాబా వరకు రూ.2.60కోట్లతో డివైడర్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ పనులకు మంగళవారం భూమిపూజ చేశారు. 146 కొత్త పోల్స్ వేసుకుంటూ 3.6 కిలోమీటర్ల మేర నూతన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూడవ బ్రిడ్జి నిర్మాణం, ప్రతి వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. రెండేళ్లలో వేములవాడ రూపు రేఖలు మారనున్నాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అన్వేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ట్రస్ట్ సేవలు అభినందనీయం మై వేములవాడ ట్రస్టు సేవలు అభినందనీయమని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఆలయ ఈవో రమాదేవి, ఆర్యవైశ్య నాయకులు, ట్రస్ట్ నిర్వాహకులు పుర ప్రముఖులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంను కలిసిన ప్రభుత్వ విప్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్‌లో కలుసుకుని పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. కాచారంలో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. రుద్రంగిలో 220 కేవీ సబ్‌స్టేషన్‌కు భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు. -
పునర్విభజన శాసీ్త్రయంగా జరగాలి
● కేసీఆర్ తన కుటుంబసభ్యులకు జిల్లాలు పంచారు ● కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విషయంలో కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహారించారని కుటుంబ ఆస్తులను పంచినట్లు కొడుకు, కూతురు, అల్లుడి కోసం జిల్లాలను ఏర్పాటు చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదే తీరు వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవన్నారు. జిల్లాల పునర్విభజన శాసీ్త్రయంగా జరిగపేందుకు తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చే సి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వీబీ–జీ రామ్ జీ’’ పథకం బాగుందని కొనియాడారు. గ్రామానికి స్థిర ఆస్తులను సృష్టించడంతోపాటు ప్రతీ ఒక్కరికి కచ్చితంగా 125 రోజుల పని దొరుకుతుందన్నారు. వ్యవసాయ సీజన్లో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం ద్వారా ఉపశమనం కలగనుందన్నారు. గతంతో పోలిస్తే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.17 వేల కోట్లు కేటాయిస్తారని తెలిపారు. ఫలితంగా తెలంగాణకు రూ.340 కోట్లు అదనంగా వస్తాయన్నారు. ఇంత గొప్ప పథకాన్ని అడ్డుకోవాలని చూడటం కాంగ్రెస్ నీచ రాజకీయమని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తీసేయడంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తుందన్నారు. పాలకులు మారినప్పుడు పథకాల పేర్లు మారడం సహజమేనని, పథకాల మార్పుపై కాంగ్రెస్ చేస్తే సంసారం... మేం చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. గతంలో ఉపాధి పథకం కింద ఏటా రూ.86 వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసినా గ్రామానికి ఆస్తులు మాత్రం పెద్దగా పెరగలేదన్నారు. తవ్విన గుంతలే తవ్వడం వంటి పనులే చేశారని తెలిపారు. ‘వీబీ–జీ రామ్ జీ’’ కూలీలకే కాదు, రైతుల నెత్తిన పాలుపోసే పథకమని, వ్యవసాయ సీజన్లో ఈ చట్టం కింద పనులు చేపట్టకుండా నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చామని వెల్లడించారు. సీజన్ లో కచ్చితంగా ఏటా 60 నుంచి 80 రోజుల పని దొరుకుతుందని.. ఇవిగాక జీ రామ్ జీ పథకం ద్వారా 125 రోజుల పని ఉంటుందని.. మొత్తంగా ఏటా సగటున 200 రోజులు పని పక్కాగా దొరికే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్ కు అక్కసు ఎందుకని ప్రశ్నించారు. శ్రీరాముడి పేరును బతికినంత కాలం పెట్టుకుంటామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ స్టాండ్ క్లీయర్ గా ఉందని, మతపరమైన రిజర్వేషన్లను తొలగించాల్సిందేనన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి‘కో’ ఆప్షన్!
సిరిసిల్ల: గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కోఆప్షన్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 2018 పంచాయత్ రాజ్ చట్టం ప్రకారం ప్రతీ గ్రామ పంచాయతీలోనూ మరో మూడు కోఆప్షన్ పదవులు ఏర్పాటవుతాయి. కో ఆప్షన్ సభ్యులుగా ఓ రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి, గ్రామాభివృద్ధి కోసం ఏదైనా విరాళంగా అందించిన దాత, మరో మహిళా సంఘం సభ్యురాలు లేదా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నియామకం కానున్నారు. ఈ ముగ్గురు కోఆప్షన్ సభ్యులకు గ్రామ పంచాయతీలో ప్రాతినిథ్యం ఉండటంతో పలువురు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వపరంగా వచ్చే ఆదేశాల కోసం పల్లెల్లో పలువురు నిరీక్షిస్తున్నారు. పాలకవర్గాలకు శిక్షణ గ్రామాల్లో కొత్తగా ఎన్నికై న పాలకవర్గాలు ఇంకా గ్రామపంచాయతీపై పట్టు సాధించలేదు. డిసెంబర్ 22న సర్పంచులు, వార్డుసభ్యులు ప్రమాణస్వీకారం చేయగా నిధులు, విధులకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో కొత్త పాలకవర్గాలు పూర్తిస్థాయి ఆజమాయిషీ చేయలేకపోతున్నాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు గ్రామాల్లో వారి విధులు, బాధ్యతలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఎంపీడీవోలకు, ఎంపీవోలకు, ఉపాధిహామీ ఇబ్బందికి హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ పొందిన వారు క్షేత్రస్థాయిలో మండలాల వారీగా గ్రామపంచాయతీ పాలకవర్గాలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ తెరపైకి వస్తుందని భావిస్తున్నారు. గతంలో మొక్కుబడి పాత్రనే.. 2019లోనూ అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ముగ్గురు చొప్పున ప్రభుత్వ నిబంధనల మేరకు కో ఆప్షన్ సభ్యులను నియమించారు. కానీ పల్లె పాలనలో వారి పాత్ర మొక్కుబడి తంతుగానే ఉంది. నిజానికి గ్రామపంచాయతీ పాలన సవ్యంగా సాగేందుకు రిటైర్డు ఉద్యోగి అనుభవాలను, ఊరికి ఉపకారం చేసిన దాత ఆలోచనలను, మహిళా సంఘం సభ్యురాలు లేదా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సేవా భావాలను పల్లె పాలనలో రంగరించి కొనసాగించాలనే ఉదాత్తమైన ఆలోచన ఆచరణలో విఫలమైంది. కానీ ఈసారి కోఆప్షన్ సభ్యులను నియమించి వారిని చురుగ్గా పని చేసే విధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామపంచాయతీ పాలకవర్గాలకు విధులు, బాధ్యతలపై శిక్షణ పూర్తి కాగానే కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఆదేశాలు వస్తాయని భావిస్తున్నారు.జిల్లాలోని గ్రామాల్లో డిసెంబర్ 22న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారులైన 116 మంది, ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారులు 106, బీజేపీకి చెందిన 22 మంది, సీపీఎం మద్దతుదారులు ఇద్దరు, బీఎస్పీ ఒక్కరు, స్వతంత్రులు మరో 13 మంది సర్పంచులుగా ఉన్నారు. వార్డుసభ్యుడిగా పోటీచేసి ఖర్చు పెట్టుకుని అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఏ ఇబ్బంది లేకుండానే కోఆప్షన్ సభ్యుడిగా గ్రామపంచాయతీలో కూర్చునే అవకాశాన్ని వినియోగించుకోవాలని పలువురు స్థానిక నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఎన్నికై న సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డుసభ్యులను మచ్చిక చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ముగ్గురు కాంగ్రెస్, ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా నిర్వహించాలి
సిరిసిల్ల క్రైం: బాల కార్మికులను నిర్మూలించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్ స్మైల్‌ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గడిచిన 13రోజుల్లో 28మంది పిల్లలను పట్టుకొని మూడు కేసులు నమో దు చేసినట్లు తెలిపారు. పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాంలు, మె కానిక్షాప్లు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, సీడబ్ల్యూసీ చైర్మన్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపించాలిసిరిసిల్లటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.రజిత అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశ, నోడల్ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్ర భుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ప్రో త్సహించాలని, ప్రమాదకర గర్భిణిని గుర్తించడం, వారికి సకాలంలో రక్తహీనత లేకుండా, రక్తపోటు నివారణ చికిత్స అందించాలని సూ చించారు. ఆరోగ్యపై అవగాహన కల్పిస్తూ.. లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలితంగళ్లపల్లి(సిరిసిల్ల): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా అధికారి (డీటీవో) లక్ష్మణ్ అన్నారు. జాతీయ రహదారి భద్ర త మాసోత్సవాల సందర్భంగా మంగళవారం తంగళ్లపల్లిలోని తాడూరు చౌరస్తాలో డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని, దీనిని ప్రతిఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని తెలిపారు. అనంతరం ఐటీడీఆర్ మండెపల్లిలో డ్రైవర్లతో సమావేశం నిర్వహించి అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. వా హనదారులు, డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్, ఏఎంవీఐ రజినీదేవి, ట్రాక్టర్, ఆటో డ్రైవర్లు, యజమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాను ఎత్తివేస్తే కాంగ్రెస్ భూస్థాపితమేసిరిసిల్లటౌన్: దశాబ్దం క్రితం బీఆర్ఎస్ సర్కారుపై పోరాడి సాధించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని జిల్లా ఉద్యమకారుల జేఏసీ హెచ్చరించింది. మంగళవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొద్ది రోజులుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తున్న ప్రకటనల నేపథ్యంలో గతంలో పోరాడిన జిల్లా ఉద్యమకారులు మరోసారి ఉద్యమించి జిల్లాను రక్షించుకుంటామన్నారు. ఈవిషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని సూచించారు. జేఏసీ నాయకులు చొక్కాల రాము, కంసాల మల్లేశం. సోమిశెట్టి దశరథం. వీరబోయిని మల్లేశ్‌యాదవ్. ఎండీ సలీం. రంజిత్, లింగంపల్లి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. జాబితాకు సహకరించాలిసిరిసిల్లటౌన్: పోలింగ్స్టేషన్ల జాబితా తయారీకి అన్ని పార్టీలు సహకరించాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖాదీర్‌పాషా అ న్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ ంలో పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ముసాయిదా జాబితాను విడుదల చేశారు. అంతకు ముందు వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ముసాయిదా జాబితాపై వా రి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. -
సకినాలు.. గారెలు.. అరిసెలు
సంక్రాంతి అంటేనే పిండివంటలు.. పండక్కి వారంరోజుల ముందునుంచే ప్రతీ ఇంటినుంచి ఘుమఘుమలు వస్తుంటాయి. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి రెండుమూడు రోజులు కష్టపడి తయారు చేస్తుంటారు. ఇరుగుపొరుగు వారితో జతకలిసి అవసరమైన అన్నిరకాలు సిద్ధం చేసుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సకినాలు.. గారెలు.. అరిసెలు తప్పనిసరిగా పండుగ మెనూలో ఉంటాయి. గురువారం నుంచి సంక్రాంతి సంబురాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటింటా పిండివంటలు సిద్ధం అయ్యాయి. ఇళ్లలో సాధ్యపడని కొందరు బయట హోంఫుడ్స్ను ఆశ్రయిస్తున్నారు. వారు అవసరం మేరకు అన్ని రకాల పిండి వంటలు తయారు చేసి ఇస్తున్నారు. ఆర్డర్లు ఇస్తే విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి రుచులు.. స్వగృహ వ్యాపారాలపై ప్రత్యేక కథనం.. – వివరాలు 8లో.. -
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీఒక్కరి బాధ్యత
సిరిసిల్లక్రైం: జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. యువత, క్రీడాకారులు, ఉపాధ్యాయులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. అరైవ్ అలైవ్‌పై ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యం, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని, ఆ సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. జాతరలు సంప్రదాయాలకు ప్రతీక వేములవాడరూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. వేములవాడరూరల్ మండలం నాగయ్యపల్లిలో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించే శ్రీదుబ్బరాజన్న స్వామి జాతర పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. జాతరలో భక్తులు శాంతియుతంగా పాల్గొని పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. -
‘ఇందిరమ్మ’ పనుల్లో వేగం పెంచాలి
వీర్నపల్లి(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం వీర్నపల్లిలో లబ్ధిదారులు లెంకల దివ్య, మహ్మద్ నూర్జహ, మహ్మద్ రేష్మా, ఎర్రగడ్డతండాలో మాలోత్ విజయల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు మొదలు పెట్టారు? ప్రభుత్వ ఆర్థిక సాయం అందుతుందా? ఆరా తీశారు. స్లాబ్ దశలో ఉన్న ఇళ్లను ఈనెలాఖరులోగా పూర్తిచేసి గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామంలో సేకరిస్తున్న చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి సెగ్రిగేషన్ చేయాలని ఎర్రగడ్డతండా సర్పంచ్ నీలాబాయ్కి సూచించారు. వీర్నపల్లి పీహెచ్సీ తనిఖీ వీర్నపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, వ్యాక్సిన్ గది, ల్యాబ్, ఫార్మిసీ తదితర వాటిని పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. యూడీఐడీ బ్లాక్ పూర్తి చేయాలి సిరిసిల్లటౌన్: యూడీఐడీ బ్లాక్ (విభాగం) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో యూడీఐడీ కేంద్రం కోసం బ్లాక్ (విభాగం), ప్రత్యేక టాయిలెట్ నిర్మాణ పనులు, ఫర్నిచర్, ఇతర పనులను మంగళవారం పరిశీలించారు. యూడీఐడీ బ్లాక్ (విభాగం) ప్రవేశ ద్వారం వద్ద నేమ్ బోర్డు రాయించాలని, గోడలపై రంగులు వేయించాలని, ఆవరణ అంతా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇటీవల భోజనంలో పురుగులు రావడంతో పేషెంట్లకు భోజనాలు సిద్దం చేసే గదిని తనిఖీ చేశారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బ్లాక్ స్పాట్లు గుర్తించాలి బ్లాక్ స్పాట్లు గుర్తించి, నియంత్రణ చర్యల ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో ఆర్అండ్బీ నేషనల్ హైవేస్, పీఆర్, పోలీస్, ట్రాన్స్‌పోర్టు, వైద్య, విద్య, ఎకై ్సజ్, ఆర్టీసి తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రవాణా, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, పోలీస్ శాఖ సంయుక్తంగా చేసిన క్షేత్రస్థాయి పరిశీలనపై ఆరా తీశారు. ఎస్పీ మహేశ్ బీ గితే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్ అలైవ్ జిల్లాలో 10రోజుల పాటు అమలు చేస్తామని అన్నారు. ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, నిర్వహిస్తామని వివరించారు. టీపీటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సిరిసిల్లఅర్బన్: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డైరీ, 2026 క్యాలెండర్‌ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆవిష్కరించారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాల రామనాథ్‌రెడ్డి, నాయకులు అంజయ్య, శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్, రామచంద్రం,కృష్ణ, బండి ఉపేందర్, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు భోగి
కొత్త ఏడాదిలో కొంగొత్తగా సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధం అవుతున్నారు. నేడు భోగి.. 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలకు ఏర్పాట్లు చేశారు. భోగి భోగ భాగ్యాలను.. సంక్రాంతి జీవితంలో కొత్తక్రాంతి ఇస్తుందని.. కనుమ రోజు బొమ్మల కొలువు అనురాగాలకు వేదికగా ఉంటుందని ప్రతీతి.. నేటి వేకువజామున భోగి మంటలు వేస్తారు. ముంగిళ్లలో మహిళలు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు, వాటిమధ్య పూలు, నవధాన్యాలు పోస్తారు. డూడూ బసవన్న విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలతో సంక్రాంతి వేడుకలు ప్రారంభం అవుతాయి. – సిరిసిల్ల కల్చరల్ -
సంచారి.. స్వయం ఉపాధి
ఇతను ఇబ్రహీంపూర్‌కు చెందిన నర్సింలు. రోజూ ఉదయం 5 గంటలకే బైకుపై కారీల కాటన్ పెట్టుకుని, మైకు బిగించుకొని బయలుదేరుతాడు. మెమొరీ కార్డులో రికార్డు చేయించుకున్న వాయిస్‌ను మైకులో పెట్టి ఉపాధి పొందుతున్నాడు. ఇలా నిత్యం పది గ్రామాలు తిరుగుతూ ఉదయం 9 గంటల్లోపు 20 కిలోల కారీలను అమ్ముతాడు. తర్వాత సొంతూరికి వెళ్లి హోటల్ నిర్వహించుకుంటున్నాడు. రోజుకు రూ.వెయ్యి వరకు సంపాదిస్తూ.. పనిలేదని చెప్పే నిరుద్యోగ యువతకు ఆదర్శం ఈ యువకుడు.అల్లం, ఎల్లిగడ్డ అమ్ముతున్న ఇతను యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన రాజునాయక్. వ్యాన్‌లో అల్లం, ఎల్లిగడ్డలు అమ్ముతున్నాడు. పదో తరగతి వరకు చదివిన రాజు రోజు 30 గ్రామాలు తిరుగుతాడు. రోజు క్వింటాలుకు పైగా సరుకు విక్రయిస్తాడు. వాహనంలోనే వంట చేసుకొని, రాత్రయితే అందులోనే పడుకుంటాడు. ఇలా ఐదు రోజులు వ్యాపారం చేసి రెండు రోజులు ఇంటి వద్ద ఉంటాడు. సరుకు మొత్తం అమ్ముడుపోయాక హైదరాబాద్‌కు వెళ్లి కొనుక్కొని, మళ్లీ ఊర్ల బాట పడతాడు. ఇలా వారానికి రూ.15వేల వరకు సంపాదిస్తాడు.ముస్తాబాద్(సిరిసిల్ల): ఒకప్పుడు కోడికూతలతో నిద్రలేచే పల్లెజనం.. నేడు మైకుల ప్రచారంతో దినచర్యను ప్రారంభిస్తున్నారు. దశాబ్దం క్రితం టమాట.. పచ్చకూర.. కొత్తిమీర.. చేపలు.. అంటూ మహిళా రైతులు నెత్తిన గంపలు పెట్టుకొని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ విక్రయించేవారు. ఆత్మీయ పలకరింపులతో అమ్మకాలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. యాంత్రీకరణ శరవేగంగా జరగడంతో చిరువ్యాపారులు గ్రామాల్లోకి వాహనాలతో ప్రవేశించారు. నిత్యం ఇంటి వద్దకే తాజా కూరగాయలు, పండ్లు, తినుబండారాలతో వస్తున్నారు. వందలాది మంది యువకులు బైకులు, ఆటోలపై సరుకులు పెట్టుకుని మైకులతో ప్రచారం చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు. సూపర్మార్కెట్లు, మాల్స్‌కు ధీటుగా.. ఎన్ని సూపర్మార్కెట్లు, షాపింగ్‌మాల్స్ వచ్చినా పల్లెజనం వారి వద్దకు వచ్చే చిరువ్యాపారుల వద్ద కొంటూనే ఉన్నారు. దీంతో వారికి మంచి ఉపాధి దొరుకుతుంది. కూరగాయలు మొదలు బట్టలు, నిత్యావసర వస్తువులు ఆఖరికి ఇంటి ముందు వేసే రాయిముగ్గు, ఇడ్లి, దోశ కూడా ఇంటికే వస్తుండడంతో దుకాణాలకు వెళ్లడం తప్పుతుంది. -
మున్సిపాలిటీల్లో తుది ఓటర్ల జాబితా
● సిరిసిల్లలో 81,959, వేములవాడలో 40,877 మంది ఓటర్లు సిరిసిల్ల/వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పోలింగ్స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను సోమవారం అధికారులు వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులు ఉండగా.. 81,959 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39,942, మహిళలు 42,011 మంది, థర్డ్ జెండ ర్ ఆరుగురు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబి తాపై 47 అభ్యంతరాలు రాగా.. 37 ఫిర్యాదులను మున్సిపల్ సిబ్బంది, మరో 10 దరఖాస్తులను ఈఆర్వో పరిష్కరించారు. తుది ఓటర్ల జాబితాను మున్సిపల్ నోటీసుబోర్డుపై, కలెక్టరేట్లో, ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీస్‌ల్లో ఉంచామని మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా తెలిపారు. వేములవాడలో 28 వా ర్డులు ఉండగా.. 40,877 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,580, మహిళలు 21,279, థర్డ్ జెండర్ ఓటర్లు 18 మంది ఉన్నారని మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ తెలిపారు. 117 ఫిర్యాదులు రాగా అన్నింటిని పరిష్కరించినట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలిసిరిసిల్ల క్రైం: ప్యాసింజర్, గూడ్స్ రవాణా వాహనాల డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలని ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. నాలుగు చక్రాల వాహనాలు నడిపేటప్పుడు సీట్‌బెల్ట్, ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సిబ్బంది సౌమ్య, రమ్య, ప్రశాంత్, ఎల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓట్లేసి దండుగ
● అమృత్ కింద రూ.104 కోట్లు ఇస్తే ఏం చేశారు? ● బీజేపీని గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం ● కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్సిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓట్లేసి దండుగేనని బీజేపీని గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలో సోమవారం బీజేపీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లలో ఆరు గ్యారంటీలు అమలయ్యాయా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ.5వేలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండి పడ్డారు. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్ధిక సంఘం నిధులు రూ.30 కోట్లు ఇచ్చిందని తెలిపారు. అమృత్ కింద రూ.104 కోట్లు ఇచ్చిందన్నారు. కేంద్రం ఇంత పెద్ద ఎత్తున నిధులిస్తే.. ఎన్నడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు మోదీ ప్రభుత్వం పైసలిచ్చిందని చెప్పలేదన్నారు. కేంద్రం నిధులిస్తే సక్రమంగా ఖర్చు చేయకుండా, వర్షం వస్తే సిరిసిల్ల మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. చివరికి కలెక్టరేట్ కూడా మునిగి పోయిన దుస్థితిని మనం చూశామన్నారు. మున్సి పల్ ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తే... రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు తీసుకొస్తామన్నారు. బీఆర్ఎస్కు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే అన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మన్ స్థానాలు దక్కించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్, ఆడెపు రవీందర్, అన్నల్దాస్ వేణు, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మోర రవి, బర్కం లక్ష్మీనవీన్, శీలం రాజు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడఅర్బన్: విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాలను సోమవారం సందర్శించా రు. తరగతి గదులు, క్యాంటీన్, వంటగదులు, ల్యాబ్‌ను పరిశీలించారు. మోనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. గతంలో విద్యార్థులు ఇబ్బందిపడితే వెంటనే సమస్యను పరిష్కరించామన్నారు. గతంలో డిగ్రీ కళాశాల సందర్శించినప్పుడు బాలికల హాస్టల్‌ను రూ.10కోట్లతో మంజూరు చేశామన్నారు. హాస్టల్ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం కళాశాలలో వసతులు కల్పించలేదన్నారు. త్వరలోనే కాలేజీకి శాశ్వత భవనం ముంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఫైనలియర్ విద్యార్థులకు అకాడమీ ద్వారా ఉచిత కోచింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జేఎన్టీయూహెచ్ వైస్‌చాన్స్‌లర్ కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ ఉన్నారు. -
గోల్డెన్ అవర్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి
● 108 జిల్లా మేనేజర్ అరుణ్‌కుమార్ సిరిసిల్లటౌన్: అత్యవసర సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా అంబులెన్స్ సిబ్బంది ఎళ్లవేలలా అందుబాటులో ఉండాలని 108 జిల్లా మేనేజర్ అరుణ్‌కుమార్ సూచించారు. జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తనిఖీ చేసి మాట్లాడారు. గోల్డెన్ అవర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. 108 సిబ్బంది పెద్ది శ్రీనివాస్, జలగం సత్యసాగర్, పోచంపల్లి పరశురాములు, నునావత్ మదన్, మొగిలి సుధాకర్, పొలబోయిన గణేష్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూ నియన్ జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి ఆరోపించారు. సిరిసిల్లలోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి.. నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. నాయకులు కోల శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, నర్సవ్వ, మంజుల, సుధాకర్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: ప్రజాసమస్యలపై నిజాయితీగా పోరాడే నాయకులనే ప్రజలు మున్సిపల్ ఎన్ని కల్లో గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడా రు. ప్రస్తుత రాజకీయాలు వ్యాపారంగా మారి పోయాయన్నారు. డబ్బులు వెచ్చించి గెలిచి మళ్లీ సంపాదించుకోవాలన్నా ఆకాంక్షనే తప్ప ప్రజలకు సేవ చేయాలని ఎవరికీ లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సీనియర్ నాయకులు రాపల్లి రమేశ్, కోల శ్రీనివాస్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: జిల్లా కోసం ఉద్యమించిన నాయకులపై జిల్లా ఏర్పడ్డ తర్వాత కూడా కేసులు కొనసాగించడం సరికాదని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర నాయకుడు సోమిశెట్టి దశరథం పేర్కొన్నారు. జిల్లా ఉద్యమ నేపథ్యంలో పెట్టిన కేసులో సోమవారం కరీంనగర్ కోర్టుకు హాజరై మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమిస్తే అప్పటి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందన్నారు. జైలుకు పంపినా భయపడకుండా పోరాడడంతో జిల్లా ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు జిల్లా రద్దుపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులు వెంకటేశం, కంసాని మల్లేశం పాల్గొన్నారు. జిల్లా భూసర్వే అధికారిగా శ్రీనివాస్సిరిసిల్ల: జిల్లా భూసర్వే అధికారిగా పి.శ్రీనివాస్ ని యమితులయ్యారు. గతంలో జిల్లా భూసర్వే ఇన్చార్జి అధికారిగా పనిచేసిన శ్రీని వాస్‌ను మంచిర్యాల జిల్లా భూసర్వే అధికారిగా కొనసాగిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో డీఐగా పనిచేస్తున్న పి.శ్రీనివాస్‌ను పదోన్నతిపై జిల్లాకు కేటాయించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ జిల్లా భూసర్వే అధికారిగా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించారు. వేములవాడ: భక్తులకు భద్రత కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుంది. సోమవారం భీమన్న, బద్దిపోచమ్మ ఆలయాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హుండీలు నిండిపోవడంతో వాటికి తాళాలు వేసి సీల్ చేసి పెట్టారు. దీంతో ప్రత్యేక పోలీసులచే భద్రత ఏర్పాట్లు చేశారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ నిర్వహించారు. -
గోల్మాల్!
మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026గురుకులం పదోన్నతుల్లోసాక్షి ప్రతినిధి, కరీంనగర్: గురుకులాల డిప్యూటీ సెక్రటరీ పోస్టుల విషయంలో గోల్మాల్ చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదోన్నతుల విషయంలో ఉన్నతాధికారులు నిబంధనలు పట్టించుకోలేదని, నచ్చినవారికి పదవులు కట్టబెట్టారని, పైరవీలదే పైచేయి అయిందని సిబ్బంది అంటున్నారు. అధి కారులు ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరుకు తాము జీవితకాలం నష్టపోవాల్సి వచ్చిందని గురుకులాల సీనియర్ ప్రిన్సిపాల్స్ వాపోతున్నారు. రోజులు గడిచినా.. నవంబర్‌లో జరిగిన సెక్రటరీ రివ్యూ మీటింగ్‌లో హామీ ఇచ్చి.. పదిరోజుల్లో ప్రమోషన్స్ భర్తీ చేస్తామన్న మినిట్ సర్క్యులర్ రిలీజ్ చేసినప్పటికీ రోజులు గడిచినా ఇప్పటికీ ఇవ్వలేదని, రెగ్యులర్ ప్రమోషన్లు ఇస్తే అక్రమంగా ఇచ్చిన పదోన్నతుల బాగోతం బయటపడుతుందని ఇన్చార్జిలతో కాలం వెల్లదీస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఇన్చార్జి ప్రిన్సిపాళ్లతో నడుస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బోధనా అనుభవం, క్షేత్రస్థాయిలో గురుకులాల నిర్వహణపై అవగాహన లేని ప్రధాన కార్యాలయ సిబ్బంది కీలక పోస్టుల్లో అక్రమంగా కొనసాగుతుండటం ద్వారా గురుకులాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారై నిరంతరం ఏదో సమస్య వేధిస్తోందని విమర్శిస్తున్నారు. అనుభవజ్ఞులైన సీనియర్ ప్రిన్సిపాళ్లకు పదోన్నతులు కల్పించి బాధ్యతలు అప్పగిస్తే.. అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. వెలుగుచూసిందిలా.. అడ్వకేట్ వీ.రాజేశ్వరరావు ఈ అంశంపై పోరాటం చేస్తున్నారు.నాలుగు నెలల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా సాంఘిక సంక్షేమ గురుకులం సెక్రటరీని ప్రశ్నించగా.. 15 రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. అర్హత లేకున్నా.. ముగ్గురు అసిస్టెంట్లకు డిప్యూటీ సెక్రటరీలుగా ప్రమోషన్స్ ఇచ్చి.. రెగ్యులర్ ప్రిన్సిపాళ్లకు వాళ్ల అవకాశాలను దూరం చేశారు. ఇలా చేయడం ద్వారా గతంలో ముగ్గురు ప్రిన్సిపాళ్లు నష్టపోగా.. ఇప్పుడు వచ్చే మార్చి, ఏప్రిల్‌లో రిటైర్డ్ కానున్న ప్రిన్సిపాళ్లు పదోన్నతి బెన్ఫిట్స్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.గురుకులాల సొసైటీ ఇటీవల పలు డిప్యూటీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేసింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం బోధన సిబ్బంది (ప్రిన్సిపాల్ గ్రేడ్–1)కి ఇవ్వాల్సిన ఆ పోస్టులను అక్రమంగా ప్రధాన కార్యాలయంలోని బోధనేతర సిబ్బందికి కట్టబెట్టారని ప్రిన్సిపాల్స్ ఆరోపిస్తున్నారు. సాంఘిక సంక్షేమ గురుకులం సొసైటీలోని ఆరు డిప్యూటీ సెక్రటరీ పోస్టుల్లో నిబంధనల ప్రకారం మూడుపోస్టులు ప్రిన్సిపాల్ గ్రేడ్–1కు ఒకటి, హెడ్ ఆఫీస్‌లోని బోధనేతర సిబ్బంది అయిన అసిస్టెంట్ సెక్రటరీకి రెండు పోస్టులను డిప్యూటేషన్‌పై ఇతర డిపార్ట్మెంట్ల నుంచి తీసుకోవాల్సి ఉంది. కానీ.. మొత్తం నాలుగు డిప్యూటీ సెక్రటరీ పోస్టులను హెడ్ ఆఫీస్‌లోని బోధనేతర సిబ్బందికి కట్టబెట్టి నిబంధనలు ఉల్లంఘించారని, తద్వారా గ్రేడ్–1 ప్రిన్సిపాల్స్‌కు అన్యాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అన్యాయమని నిలదీసిన తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ వాపోతున్నారు. అంతేకాకుండా తమకు పదోన్నతులు ఇవ్వకుండా ఆపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పదోన్నతిలో భాగంగా భర్తీ చేసే సుమారు 8కి పైగా జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, రీజనల్ కో–ఆర్డినేటర్ పోస్టులు ఏడాదికిపైగా ఖాళీగా ఉన్నా.. అర్హులకు ఇవ్వకుండా అక్రమార్గంలో తమ వారిని ఇన్చార్జి పేరిట అందలం ఎక్కించి కాలం గడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. అర్హత లేని జూనియర్ ప్రిన్సిపాల్‌కు ఇన్చార్జి జాయింట్ సెక్రటరీ పదవి, ఫిజికల్ డైరెక్టర్‌కు నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ సెక్రటరీ పదవిని ఇన్చార్జి రూపంలో కట్టబెట్టి నాలుగైదు నెలల్లో రిటైర్డ్ అవుతున్న తమకు ప్రమోషన్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని సీనియర్ ప్రిన్సిపాల్స్ ఆరోపిస్తున్నారు. -
డూడూ.. బసవన్న
‘డూడూ బసవన్న.. ఇటు రారా బసవన్న.. ఉరుకుతూ రారన్నా.. రారా బసవన్నా.. అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు.. ఈ ఇంటికి మేలు జరుగుతుందని చెప్పు’.. అంటూ గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ బిక్షాటన చేసే గంగిరెద్దుల వారి కుటుంబాల్లో తరాలు మారినకొద్ది వృత్తులూ మారిపోతున్నాయి. సంక్రాంతి అంటేనే గంగిరెద్దులవారి సందడి.. బసవన్నలు చేసే విన్యాసాలు.. అవి ఇంటి ముంగిట అడుగుపెడితే శుభమని ప్రజల నమ్మకం.. బసవన్నల కాళ్లు కడిగి మంచి రోజులు రావాలని మొక్కుకుంటారు. ప్రస్తుతం పండుగ వేళ గ్రామాల్లో వారి సందడి కనిపించినా, సరైన ఆదరణ లేక అనాధిగా వస్తున్న ఆచారానికి దూరమై ఆధునికత వైపు అడుగులేస్తున్నారు. తాతాముత్తాల నుంచి వస్తున్న వృత్తిని వదిలేస్తూ వ్యవసాయం, ఇతర పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. – IIలో... -
నో హెల్మెట్.. నో పెట్రోల్
● ప్రతి బంక్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి ● డే కేర్ సెంటర్‌ను వినియోగించుకోవాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ప్రతీ పెట్రోల్ బంక్ యజమానులు సామాజిక బాధ్యతగా ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ను అమలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. రోడ్డు భద్రత జాతీయ మాసోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో సోమవారం జిల్లాలోని పెట్రోల్ బంక్‌ల యజమానులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గతేడాది 290 ప్రమాదాలు జరిగాయని, ఎక్కువ ప్రమాదాలు ద్విచక్రవాహనదారులకు జరుగుతున్నాయన్నారు. పెట్రోల్‌బంక్ యజమానులు సామాజిక బాధ్యతగా నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు చేయాలని, బంక్‌లలో పనిచేసే సిబ్బందికి ఈ సమాచారం చేరవేసి పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ ప్రతీ బంక్ యజమానులు తమ బంక్‌లో నో హెల్మెట్ .. నో పెట్రోల్ ఫ్లెక్సీలు రెండు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్, పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్, డీఎం రజిత పాల్గొన్నారు. డే కేర్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి డే కేర్ సెంటర్ సేవలను వృద్ధులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రణామ్ పేరిట ఏర్పాటు చేసిన వృద్ధుల డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వృద్ధుల డే కేర్ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. వృద్ధుల మానసికోల్లాసం, భద్రత, సంరక్షణ లక్ష్యంగా ‘ప్రణామ్’లో ప్రభుత్వం మల్టీసర్వీస్ డే కేర్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. సెంటర్లలో లైబ్రరీ, ఇండోర్‌గేమ్స్, టీవీ సదుపాయంతో అందుబాటులో ఉంటాయని వివరించారు. వృద్ధులకు ఉచితంగా స్నాక్స్తోపాటు టీ అందిస్తారని తెలిపారు. దినపత్రికలు, పక్ష, మాసపత్రికలు, కథల పుస్తకాలు, మ్యాగజైన్లు ఉంటాయని వివరించారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ నేత కె.కె.మహేందర్‌రెడ్డి, ఐఆర్సీఎస్ జిల్లా అధ్యక్షుడు గుడ్ల రవి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్‌ప్రెసిడెంట్ జలపాల శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు. ఘనంగా వివేకానంద జయంతి కలెక్టరేట్లో జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీవైఎస్వో రాందాస్ పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల గరం..గరం
● అభ్యర్థుల హడావుడి ● చర్చించుకుంటున్న పట్టణ ప్రజలు వేములవాడ: మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే వేములవాడ వీధుల్లో రాజకీయ సెగలు మొదలయ్యాయి. ఒకవైపు రిజర్వేషన్ల ఉత్కంఠ, మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని మెయిన్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద మిత్రులు రాజు, రహీం మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆ ముచ్చట్లు వారి మాటల్లోనే...రాజు: ఏం రహీం భాయ్.. పొద్దున్నే హోటల్ కాడ ఫుల్‌ఖుషీలో ఉన్నావ్? ఏంటి మతలబు? రహీం: ఏముంటది రాజు అన్న.. ఇగో ఈ రిజర్వేషన్లు ఎప్పుడు తేలుతాయోనని చూస్తున్నా. ఇవాల ఖరారు అంట గదా! మన వార్డు ఎవరికి వత్తదో.. ఏమో..! రాజు: రిజర్వేషన్లు రాకముందే మనోళ్లు ఇండ్ల చుట్టూ తిరుగుతుండ్రు. నిన్న మా ఇంటికి ఒకాయన వచ్చి, వార్డు ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా.. లేదా.. అని అడుగుతుండు. నా పేరు ఆయనకేం ఎరుక అనుకున్న. తీరా చూస్తే ఫోన్ నంబర్ కూడా పట్టుకొచ్చిండు. రహీం: (నవ్వుతూ) అవును రాజు నాకై తే పొద్దున్నే ఫోన్ వచ్చింది. భాయ్, ఎట్లున్నవ్? ఏమన్నా పని ఉంటే చెప్పు అని అడుగుతుండ్రు. ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది, ఇప్పుడు చుట్టాల కంటే ఎక్కువగా పలకరిత్తాండ్రు. ఇదంతా ఈ ఎన్నికల మహిమే కదా..! రాజు: నిజమే భాయ్.. వార్డులో ఎవరు నిలబడ్డా.. ముందుగా మనల్ని టచ్‌లో ఉంచుకోవాలని చూత్తాండ్రు. కానీ ఓటర్లు కూడా తెలివైనోళ్లే. రిజర్వేషన్లు వచ్చాక చూద్దాం లే అని లోలోపల నవ్వుకుంటుండ్రు. ఈసారి పోటీ మామూలుగా ఉండదు. ఒక్కొక్కరు రూ.30 లచ్చల నుంచి రూ.50 లచ్చలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుత్తాంది. రహీం: ఏది ఏమైనా రాజు.. రిజర్వేషన్లు ఖరారైతే అసలు ఆట మొదలవుద్ది. అప్పటి దాకా ఈ ఫోన్‌కాల్స్, ఇండ్ల మీద పడటం ఆగవు. ఇక్కడ హోటల్ల టీ ఎంత వేడిగా ఉందో.. మన మున్సిపల్ పాలిటిక్స్ కూడా అంతే వేడెక్కినయ్. -
ఉపాధిహామీ పేరు మార్చడం దుర్మార్గం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ముస్తాబాద్(సిరిసిల్ల): ఇరువై ఏళ్లుగా పేదలకు ఉపాధి కల్పించిన ఉపాధిహామీ పథకం పేరు మార్చడం దుర్మార్గమైన చర్య అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సీపీఐ శత జయంతి ఉత్సవాలను ఆదివారం ముస్తాబాద్‌లో నిర్వహించారు. కొత్తబస్టాండ్ నుంచి రాజీవ్‌చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ఈనెల 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శత జయంతి ఉత్సవాలకు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. నాయకులు శంకర్, సదానందం, గుంటి వేణు, మీసం లక్ష్మణ్, రాకేశ్, భూదయ్య, నర్సయ్య పాల్గొన్నారు. కామ్రెడ్ గోపాల్‌రావు సేవలు చిరస్మరణీయం భూస్వామి కుటుంబంలో పుట్టినా పేదల కోసం పనిచేసిన కామ్రెడ్ గోపాల్‌రావు సేవలు చిరస్మరణీయమని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పోతుగల్లో మాజీ సర్పంచ్ తన్నీరు గోపాల్‌రావు స్మారకార్థం నిర్మించే కార్మిక భవన్‌కు భూమిపూజ చేశారు. గో పాల్‌రావు కుమారులు ప్రభాకర్‌రావు, వెంకట్రా వు, శ్రీరంగారావులు భవనం నిర్మిస్తున్నారు. ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, సర్పంచ్ పెద్దిగారి యా దమ్మ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, కనమేని చక్రధర్‌రెడ్డి, గౌతంరావు, సుధాకర్‌రావు, నారాయణరావు, వెంకట్రావు, తోట ధర్మేందర్, శంకర్, శ్రీనివాస్, నర్సింలు పాల్గొన్నారు. -
జోలికొస్తే ఊరుకోం..
సిరిసిల్ల: ప్రజా ఉద్యమాలతో ఏర్పాటైన రాజన్నసిరిసిల్ల జిల్లా కార్మిక..ధార్మిక..కర్షక క్షేత్రంగా భాసిల్లుతోంది. 2016లో ఏర్పాటైన జిల్లా పసిడిరాశులు.. పచ్చదనంతో కళకళలాడుతోంది. ఉత్తరాన వేములవాడ రాజన్న.. దక్షిణాన జిల్లెల్ల వ్యవసాయ కాలేజీ.. పశ్చిమాన పచ్చటి అడవులు.. తూర్పున మధ్యమానేరు జలాశయంతో అలరారుతోంది. సిరిసిల్ల నడిబొడ్డున నేతన్నల వస్త్రోత్పత్తి రంగం స్థిరపడగా.. జిల్లాలోని భూగర్భజలాలు గణనీయంగా పెరిగిన వైనం శిక్షణ ఐఏఎస్ ఆఫీసర్లకు పాఠ్యాంశమైంది. బీడీ, నేతకార్మికులు, గల్ఫ్ వలసలు.. విప్లవోద్యమాల ఖిల్లా.. తొమ్మిదేళ్లుగా పాలన కేంద్రంగా ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లాను రద్దు చేసే ఆలోచనను పాలకులు చేస్తుండడంతో అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా జోలికొస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లా కొనసాగింపుపై ప్రభుత్వ పరంగా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు జిల్లా ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేస్తున్నారు. జిల్లాపై నెలకొన్ని సందిగ్ధం నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే... ఎవరి దయా దాక్షిణ్యాలపై జిల్లా ఏర్పాటు కాలేదు. జిల్లా ప్రజలు సామూహికంగా పోరాడి సాధించుకున్నారు. జిల్లాలను కుదిస్తామని, తగ్గిస్తామని పనికిమాలిన ప్రకటనలు చేయడం సరికాదు. రాజన్నసిరిసిల్లను రద్దు చేస్తే ప్రజాపోరాటం ఎలా ఉంటుందో పాలకులకు చూపిస్తాం. ఇప్పటికే జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. వస్త్రోత్పత్తి రంగం ఇబ్బందుల్లో ఉంది. ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాను రద్దు చేస్తే కొరివితో తలగోక్కున్నట్లు అవుతుంది. – రెడ్డబోయిన గోపి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజన్నసిరిసిల్ల జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణ పేరుతో కొన్ని జిల్లాలను తగ్గిస్తామనడం పాలకుల పని తీరుకు అద్దం పడుతుంది. జిల్లాను రద్దు చేస్తే పాలకుల మెడలు వంచేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. సిరిసిల్ల ప్రాంతానికి పోరాటం కొత్త కాదు. జిల్లాను అభివృద్ధి చేయాలే తప్ప.. కుదిస్తామని, పొరుగు జిల్లాల్లో కలుపుతామని చెప్పడం మానుకోవాలి. – తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జిల్లా సాధన కోసం 13 ఏళ్ల కిందట ఉద్యమం మొదలుపెట్టినం. ఇది అయ్యేదా.. పొయ్యేదా అని చాలా మంది నవ్వుకున్నారు. సిరిసిల్ల రెవెన్యూ డివిజన్‌ను మూడు ముక్కలు చేస్తారని భావించిన తరుణంలోనే ప్రజలంతా ఏకమైన పోరాటం సాగించారు. కొత్త జిల్లాల ప్రస్తావన రాగానే జిల్లా సాధన సమితి రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అందరి భాగస్వామ్యంతో జిల్లా సిద్ధించింది. పోరాడి సాధించుకున్న జిల్లా జోలికి రావద్దు. – బుస్సా వేణు, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు రాజన్నసిరిసిల్ల జిల్లాగా ఏర్పాటై అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో జిల్లా ఉనికిని చెరిపేసే ప్రయత్నాన్ని పాలకులు విరమించుకోవాలి. పునర్ వ్యవస్థీకరణ పేరిట కొన్ని జిల్లాలను తగ్గించడం, కొన్ని మండలాలను మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కంటే ఎన్నో చిన్న జిల్లాలు ఉన్నాయి. మా జిల్లా ఉసురు తీయొద్దు. – కటుకం సత్తయ్య, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నామని చెబు తున్నారు. అయితే జిల్లాను రద్దు చేస్తే ఆ ప్రజా‘పాలన’ ప్రజలకు దూరమవుతుంది. జిల్లా ప్రజలు ఎవరూ దీన్ని సహించరు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరాయి. కొత్తగా ప్రభుత్వంపై భారం పడే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో రాజకీయంగా ఎవరి మీదనో కోపంతో జిల్లాను రద్దు చేయడం సరికాదు. ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. – గుంటి వేణు, సీపీఐ జిల్లా అధ్యక్షుడు జిల్లా సాధన ఉద్యమానికి అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు పలికారు. అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా జిల్లా ఇవ్వాల్సిందేనని మాట్లాడారు. ఇప్పుడు జిల్లాలను సరిచేస్తామంటూ రెవెన్యూ మంత్రి చెప్పడం పరోక్షంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తామని సంకేతాలు ఇవ్వడం సరికాదు. ఇప్పటికే వస్త్రపరిశ్రమ సంక్షోభంలో ఉంది. జిల్లా రద్దు ఆలోచనను విరమించుకోవాలి. – మూషం రమేశ్, సీపీఎం, జిల్లా ప్రధాన కార్యదర్శి -
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
● ఇంట్లో చిచ్చు ఆర్పలేనివారు ప్రగల్భాలు పలుకుతున్నారు ● రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు గోదావరిఖని: ‘ఇంటిపోరును చక్కదిద్దుకోని మీరు ప్రజలకేం న్యాయం చేస్తార’ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడారు. పేదల ఆత్మగౌరవం కాపాడేందుకు రూ.22,500 కోట్లతో రాష్ట్రంలో 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. పంచా యతీ ఎన్నికల్లో 67శాతం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించిన ప్రజలు రాష్ట్రప్రభుత్వానికి మద్దతు పలికారని అన్నారు. ట్రాన్స్జెండర్లకు తొలిసారి రామగుండంలోనే ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్ 76 జీవో జారీచేయగా.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఈ జీవో ప్రకారం సింగరేణి ప్రాంతంలో పేదల ఇళ్లకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో అదనంగా ఎమ్మార్వో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, పాత్రికేయుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొండి గోడలుగా మిగిలిన 633 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తిచేస్తున్నామని, అసంపూర్తిగా మిగిలిన మరో 300 ఇళ్లకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అడ్లూరు లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, ఆర్డీవో గంగయ్య పాల్గొన్నారు. -
ఘనంగా వడ్డె ఓబన్న జయంతి
సిరిసిల్ల: వడ్డె ఓబన్న జయంతిని కలెక్టరేట్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పాల్గొన్నారు. ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): వరంగల్‌లో కాలేజీలో చదివే రోజుల్లో ఖర్చుల కోసం నేను కూడా రాత్రిపూట ఆటో నడిపానని.. కార్మికుల ఏంటో నాకు తెలుసునని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఇల్లంతకుంటలో ఆదివారం మండల ఆటోకార్మికులకు కేటీఆర్ ఇన్సూరెన్స్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. ఆటోకార్మికులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఆటోకార్మికులు అందరి కోసం బతుకుతారని పేర్కొంటూ ఉచిత బస్సు ప్రయాణంలో లోపాలున్నాయని పేర్కొన్నారు. ఆటో కార్మికులకు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు రామ్మోహన్, మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, పల్లె నర్సింహారెడ్డి, ఒగ్గు నర్సయ్య, కమటం రాములు, కెవిన్రెడ్డి, వెంకటేశం పాల్గొన్నారు. సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ వస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. స్థానిక శాంతినగర్‌లో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వస్తున్నారని వివరించారు. పట్టణంలోని పార్టీ శ్రేణులు హాజరుకావాలని కోరారు. వేములవాడ: ఓట్ల అభ్యంతరాలపై ఫిర్యాదు చేసిన పత్రాలు, అధికారులు ఇచ్చిన వివరణ పత్రాలను సామాజిక కార్యకర్త పుప్పాల మోహన్ ఆదివారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట తగులబెట్టారు. మోహన్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని వార్డులలో అక్రమంగా ఇతర గ్రామాల నుంచి ఓటర్లు నమోదు చేయించారన్నారు. ఓటర్ ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత ఈనెల 8న 11వ వార్డులో దాదాపు 400లకుపైగా ఇతర గ్రామాలకు చెందిన వారిని ఓటర్లుగా నమోదు చేయించారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు నిబంధనల మేరకు ఏమీ చేయలేమని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో ఓ ప్రధాన పార్టీకి చెందిన ఆశావహుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆదివారం ఉదయం వరకు చినిగిపోయి ఉంది. దీనిపై ఫ్లెక్సీ ప్రదర్శించిన వ్యక్తి అదే వార్డుకు చెందిన మరో ప్రధాన పార్టీ నేత కారకుడిగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈవిషయంపై చర్యలు తీసుకోవాలని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడం పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. -
ప్రయోగం దక్కింది
సిరిసిల్ల ఎడ్యుకేషన్: సామాన్యుల అవసరాలు.. సమస్యలను తీర్చే క్రమంలో బాలమేధావులు ఆలోచనలకు రూపం తీసుకొచ్చారు. విద్యార్థుల ఆవిష్కరణలు నిర్వాహకులను అబ్బురపరిచాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని అందించేలా కొత్త కొత్త పరికరాలను ఆవిష్కరించారు. కామారెడ్డిలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మానక్ పోటీలో జిల్లా నుంచి 25 ప్రాజెక్ట్‌లను విద్యార్థులు గైడ్‌టీచర్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఇచ్చారు. జిల్లా నుంచి ఏడు ప్రదర్శనలు జాతీయస్థాయికి ఎంపికై నట్లు జిల్లా సైన్స్ ఆఫీసర్ పాముల దేవయ్య తెలిపారు. రైతుకష్టాలు మొదలుకొని ఉపాధ్యాయుల బోధన వరకు, గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడం, రోగులకు వైద్యసేవలు అందించే సౌకర్యాలకు సులభతరం చేసే ప్రయోగాలను విద్యార్థులు చేశారు. నీరు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. నేటికీ సుదూర ప్రాంతాల నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చే మహిళలను చూస్తూనే ఉన్నాం. వారి కష్టాలను తీర్చేందుకు ఇంధనం అవసరం లేకుండానే నడిచే ఫుల్ పంప్ హైడ్రాలిక్‌ను ఆవిష్కరించాం. లోతట్టు ప్రాంతంలో పారుతున్న నీటిలో ఈ పరికరాన్ని ఉంచడం ద్వారా ప్రెషర్ చాంబర్లో ఒత్తిడి పెరిగి 24 గంటలు నిరంతరం నీటిని పైకి లాగుతుంది. దీన్ని తయారు చేయడానికి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు అయింది. గైడ్ టీచర్‌గా ఝాన్సీ ఉన్నారు. – ఎం.జాహ్నవి, జెడ్పీహెచ్ఎస్ మల్యాల మాట్లాడలేని, పక్షవాతం వచ్చిన వారికి సకాలంలో మాత్రలు వేయడం ముఖ్యం. వారికి మాట్లాడే వీలు ఉండదు. స్మార్ట్ విధానంలో వారికి అవసరమైన మందులు అందించేందుకు స్మార్ట్ గ్లౌస్‌ను ఆవిష్కరించాం. ఐదు సెన్సార్లతో ఏర్పాటు చేసిన ఈ గ్లౌస్ బొటనవేలితో మరొక వేలును తాకగానే సెన్సార్‌కు ఇచ్చిన ఆదేశం(కమాండ్)తో రోగికి మందులు అవసరమని తెలుసుకుంటుంది. మరికొంత మెరుగ్గా రోగి బీపీ, హార్ట్ బీట్‌ను దీని ద్వారా లెక్కించేందుకు స్మార్ట్‌గా తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి సుమారు రూ.3వేలు ఖర్చయింది. గైడ్‌టీచర్ మహేశ్‌చంద్ర వ్యవహరించారు. ఈ పరికరంతో సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా స్పీకర్ ద్వారా వాయిస్ బయటకు వినిపించేలా ఏర్పాటు చేశారు. – ఒడ్నాల రేష్మ, జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట రైతులు వరిని పండించేందుకు ముందుగా వడ్లను చల్లి, మొలకను విప్పి నారు పోస్తుంటారు. మొలకవిప్పే సమయంలో మొలకెత్తిన వడ్లు చేతులకు గుచ్చుకోవడం ద్వారా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు గుర్తించాం. ఆ బాధ నుండి రైతులను విముక్తి చేసేందుకు పాడి సీడింగ్ ప్రిపరేషన్ యంత్రాన్ని ఆవిష్కరించాం. పాత ఇనుప సామగ్రి, సైకిల్పుళ్లలు, కార్డుబోర్డు, ఒక బ్యాటరీ సహాయంతో ఏర్పాటు చేశాం. ఈ యంత్రం మొలకను సులభంగా విప్పుతుంది. దీన్ని రైతులు సులువుగా వరి నారు వేసే స్థలంలో చల్లుటకు వీలుంటుంది. దీని తయారీకి రూ.వెయ్యి ఖర్చు అయ్యింది. గైడ్ టీచర్‌గా భాస్కర్‌రెడ్డి వ్యవహరించారు. – శ్రవణ్తేజ, జెడ్పీహెచ్ఎస్, రాచర్లబొప్పాపూర్ రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి 7 ఎగ్జిబిట్లు ఎంపికయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా మన జిల్లా నుంచే ఎంపికయ్యాయి. ఎంపికై న విద్యార్థులు జాతీయ, సౌత్ ఇండియా స్థాయి పోటీల్లో మరింత ఉత్తమ ప్రతిభ కనబరిచి పేరు తీసుకురావాలి. – పాముల దేవయ్య, జిల్లా సైన్స్ అధికారి -
సౌకర్యాలపై దృష్టి సారించాలి
కొండగట్టుకు వచ్చే భక్తులు ఏటా పెరుగుతున్నా.. సౌకర్యాలు కల్పించడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. కాలినడకన వెళ్లే భక్తుల కోసం మెట్లదారిని అభివృద్ధి చేసి, లైట్లు ఏర్పాటు చేయాలి, నడిచివెళ్లలేని వృద్ధుల కోసం ప్రత్యేకంగా వాహనాలు గుడి సమీపంలోకి వెళ్లేందుకు అనుమతించాలి. వైజంక్షన్ సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలి. – గడ్డం నాగరాజు, గొల్లపల్లె మంగళ, శనివారాల్లో అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కేవలం 200మందికి మాత్రమే ఉచిత అన్నదానం అందిస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అంజన్న అన్న ప్రసాదం అందడం లేదు. 400మంది భక్తులకు ఉచిత అన్నదానం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. – చీకట్ల రవీందర్, మ్యాడంపల్లి -
అంజన్న చెంత.. అవస్థల చింత
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు అంజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తారు. భక్తులకు అనుగుణంగా వసతులు లేకపోవడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. స్వామివారి ఉచిత అన్నదానం కోసం వందలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. భక్తుల నుంచి విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసిన అధికారులు.. భక్తులందరికీ అన్నదానం అందించేలా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. అస్తవ్యస్తంగా మెట్లదారి.. కాలినడకన వెళ్లి స్వామివారికి మొక్కులు అప్పగించాలని వేలాది మంది భక్తులు భావిస్తుంటారు. అయితే మెట్లదారి మీదుగా నడిచివెళ్లాలంటే కష్టతరంగా మారింది. ఆ దారిని పట్టించుకోకపోవడంతో ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగాయి. చెత్తాచెదారంతో నిండిపోయింది. దీనికితోడు దుర్గంధం వెదజల్లుతోంది. ఏటా పెరుగుతున్న భక్తులు కొండగట్టు అంజన్న దర్శనానికి మాల ధరించి వచ్చే దీక్షాపరులు ఏటా పెరుగుతున్నారు. హనుమాన్ చిన్న, పెద్ద జయంతి ఉత్సవాల్లో లక్షలాది మంది స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. ఆ సమయంలో మాత్రమే మెట్లదారి వెంట వెలుగులు ఏర్పాటు చేస్తున్న అధికారులు అనంతరం పట్టించుకోవడం లేదు. పార్కింగ్ తిప్పలు..ట్రాఫిక్ జామ్ దూరప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు పార్కింగ్ స్థలం కొరతతో ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్ స్థలంలో భక్తుల కోసం గతంలో షెడ్డు నిర్మించడంతో స్థలం కుచించుకుపోయింది. ఘాట్‌రోడ్డు వెంట వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాలు ఆలయం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో వృద్ధులు, చి న్నారులు ఆలయం వరకు వెళ్లలేకపోతున్నారు. ప్ర తి మంగళవారం, శనివారాల్లో వైజంక్షన్ వద్ద తీవ్ర టాఫిక్ జామ్ ఏర్పడుతోంది. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. నిలిచిన ఎత్తిపోతల పథకం.. ఆలయంలో నీటి సమస్య పరిష్కారానికి వరదకాలువ నుంచి సంతలొద్దికి నీటిని పంపింగ్ చేసి.. అక్కడి నుంచి కొండపైకి తరలించే పథకం మధ్యలో నిలిచిపోయింది. గత ప్రభుత్వ పాలనలో ప్రారంభించిన ఎత్తిపోతల పథకం రెండున్నరేళ్లు గడుస్తున్నా నేటికి పూర్తికావడం లేదు. ఫలితంగా మిషన్ భగీరథ నీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వంద మందికే అన్నదానం ఆలయ ఆధ్వర్యంలో కొండగట్టుకు వచ్చే భక్తులకు నిత్యం 100మంది భక్తులకు మాత్రమే అన్నదానం అందుతోంది. మంగళ, శనివారాల్లో మాత్రం 200 మందికి అందిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. అన్నదానాల సంఖ్య పెంచకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వెనుదిరుగుతున్నారు. రోజూ 200 మందికి, మంగళ, శనివారాల్లో 400మందికి అన్నదానం అందించేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా మెట్లదారి.. వాహనాల పార్కింగ్ మరుగున పడిన మాస్టర్ ప్లాన్ నిలిచిన ఎత్తిపోతల పథకం భక్తులను వేధిస్తున్న గదుల కొరత -
పుష్కరకాలంగా ఇదే ‘దారి’ద్య్రం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో ఉన్న ‘అమ్మా అనాథ వృద్ధాశ్రమం’లో విషాదకర పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ రావడానికి సరైన దారి లేక వృద్ధులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. ఆశ్రమంలో ఉంటున్న యాంసాని సత్యలక్ష్మి (78) శనివారం కాలుజారి పడడంతో ఆమె నడుము విరిగింది. అలాగే గోగుల లక్ష్మి (65) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆశ్రమ నిర్వాహకులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కాగా, ఆశ్రమానికి వెళ్లే దారి బురదమయంగా ఉండటంతో వాహనం లోపలికి రాలేకపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది సుమారు గంట సేపు శ్రమించి, బాధితులను స్ట్రెచర్‌పై పడుకోబెట్టి చాలా దూరం మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకువచ్చారు. 13 ఏళ్లుగా ఆశ్రమానికి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరీ దారుణంగా ఉంటుందని, అత్యవసర వైద్యం అందక వృద్ధుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వృద్ధాశ్రమానికి సీసీ రోడ్డు నిర్మించాలని వేడుకుంటున్నారు. -
ప్రవాస భారతీయులకు అండగా ప్రభుత్వం
ముస్తాబాద్(సిరిసిల్ల): విదేశాల్లోని భారతీయుల కోసం ప్రభుత్వం మరింత అండగా నిలవాలని ప్రవాసీమిత్ర జనగామ శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్‌లోని టెక్ మహింద్రా ఆడిటోరియంలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌కు హాజరయ్యారు. యూఏఈ, కతార్, సౌదీ, ఒమన్ దేశాల్లో కష్టాల్లో ఉన్న భారతీయులకు సేవలు అందించామన్నారు. ప్రవాసీయులకు తాము అందించిన సేవలను గుర్తించి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్ సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం రూ.లక్ష విరాళంగా అందించారు. ఆలయ నూతన కమిటీ చైర్మన్, సర్పంచ్ ఇల్లందుల గీతాంజలిశ్రీనివాస్రెడ్డి, వైస్‌చైర్మన్ కొండాపురం వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు శనివారం ఎమ్మెల్యేను కలిశారు. ఆలయ కమిటీ సభ్యులు కొండాపురం బాల్‌రెడ్డి, మొడుసు నారాయణ, ముత్యాల సత్యంరెడ్డి, బండ సతీశ్‌లు ఉన్నారు. ● ఆలయ ఈవో రమాదేవి వేములవాడఅర్బన్: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం వారి నిత్యాన్నదాన సత్రాన్ని ఆలయ ఈవో రమాదేవి శనివారం పరిశీలించారు. అన్నదాన సత్రానికి వచ్చే భక్తులకు అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. పర్యవేక్షకులు పూజిత, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, కూరగాయల శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడరూరల్: ప్రైడ్ ఆఫ్ యంగ్ హిందుస్థాన్ అవార్డుకు వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లికి చెందిన వంగపల్లి మణిసాయి ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని ఉలాశనగర్లో యంగిస్థాన్ ఫౌండేషన్ నిర్వహించిన ‘ప్రైడ్ ఆఫ్ యంగ్ హిందుస్థాన్’ అవార్డు కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 15 మంది ప్రతిభావంతులను ఎంపిక చేశారు. వీరిలో రాష్ట్రానికి చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత వంగపల్లి మణిసాయివర్మ ఉన్నారు. బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) నుంచి శనివారం ఎల్ఎండీకి నీటిని విడుదల చేశారు. సాయంత్రం ఏడు గంటల వరకు ఎల్ఎండీకి 250 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా వంద క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మిడ్‌మానేరులో నీటిమట్టం 26.478 టీఎంసీలకు చేరింది. సిరిసిల్ల క్రైం: జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిఘా కొనసాగుతోందని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీ చేసి నేరప్రవత్తి గల వ్యక్తుల కార్యకలాపాలపై ఆరా తీశారు. నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. -
అంతర్రాష్ట్ర సైబర్ నిందితుడి అరెస్ట్
వేములవాడరూరల్: అంతర్రాష్ట్ర సైబర్ ప్రధాన నిందితుడు లక్కీకుమార్ అలియాస్ సదానంద్కుమార్ను శనివారం అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రుత్విక్‌సాయి పేర్కొన్నారు. వేములవాడరూరల్ సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బిహార్‌లోని బహుదూర్పూర్ గ్రామానికి చెందిన లక్కీకుమార్ హైదరాబాద్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించాడు. సరిగా నడవకపోవడంతో బిహార్ వెళ్లిపోయాడు. అనంతరం ఆన్లైన్ ద్వారా లోన్ల పేరుతో ప్రజలను మోసం చేయాలని పథకం రూపొందించాడు. అనిల్‌నాయక్, బోడ రజిత, భరత్రాజ్తో కలిసి ఫేస్బుక్లో ఇండియాబుల్స్ ధని ఫైనాన్స్ పేరుతో నకిలీ పేజీ సృష్టించి, తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇప్పిస్తామని ప్రచారం చేశాడు. ఆ పేజీని సందర్శించిన వారి ఫోన్ నంబర్లకు ఫోన్‌చేసి నమ్మించి పత్రాలు, చార్జీల పేరుతో డబ్బు వసూలు చేసి లోన్ మంజూరు చేయకుండా మోసం చేశాడు. ఇందులో బాధితుడైన వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్‌కు చెందిన పోగుల మల్లేశంకు ఫోన్ చేసి రూ.5 లక్షల లోన్ వస్తుందని తెలిపి, ప్రాసెసింగ్ ఫీజు రూ.1,18,400 వసూలు చేశాడు. బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సైబర్‌క్రైంలో ఫిర్యాదు చేయగా, లక్కీకుమార్, అనిల్‌నాయక్, బోడ రజిత, భరత్రాజ్పై కేసు నమోదు చేశారు. వేములవాడరూరల్ సీఐ ఆధ్వర్యంలో సైబర్ ఆర్ఎస్సై జునైద్, ఎస్సై వెంకట్రాజం, కానిస్టేబుల్ కిట్టు, చందు టీమ్ హరియాణాలో లక్కీకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీ పోర్టల్‌లో 30 ఫిర్యాదులు ఉన్నాయని ఏఎస్పీ తెలిపారు. -
శివాలయంలో ప్రత్యేక పూజలు
సిరిసిల్లటౌన్: సోమనాథ ఆలయంపై వెయ్యేళ్ల క్రితం జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు శనివారం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ సనాతన ధర్మం గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెప్పేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, పట్టణ మాజీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు నర్సయ్య, దేవరాజు, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కొండ నరేశ్, అధికార ప్రతినిధులు చొప్పదండి శ్రీనివాస్, మోర రవి, సూరం వినయ్, ఎర్రం విజయ్, సుధాకర్ పాల్గొన్నారు. -
వీబీ జీ రామ్ జీ చట్టం రద్దు చేయాలి
● కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల అర్బన్: వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత ఇరువై ఏళ్లుగా ఉపాధిహామీ పథకం దేశంలోని పేదలకు సొంతూరిలోనే ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వందశాతం కేంద్ర నిధులతో అమలవుతున్న ఉపాధిహామీ ప థకం పేరు మార్చడంతోపాటు 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించేలా నిబంధనలు తేవడం దారుణమన్నారు. ఉపాధిహామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 8 నుంచి వివిధ కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళా నాయకురాలు మడుపు శ్రీదేవి పాల్గొన్నారు. -
వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు మాయం
చందుర్తి(వేములవాడ): ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల పుస్తెలతాడు అపహరించిన సంఘటన చందుర్తి మండలం మర్రిగడ్డలో జరిగిందని ఎస్సై రమేశ్ తెలిపారు. మర్రిగడ్డకు చెందిన కత్తి సులోచన అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటుంది. కాగా శనివారం వృద్ధురాలికి స్నానం చేయిస్తుండగా మెడలో పుస్తెలతాడు లేదని గుర్తించారు. అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్న తన తల్లి మెడలోంచి పుస్తెలతాడును శుక్రవారం మధ్యాహ్నం అహరించుకుపోయారని కుమారుడు వేణు ఫిర్యాదు చేశారు. ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీంను రంగంలోకి దింపినట్లు చందుర్తి ఎస్సై రమేశ్ తెలిపారు. -
నలుగురు దొంగలు అరెస్ట్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన నలుగురు దొంగలను పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.30వేల నగదుతోపాటు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన మరాటి రాజేశ్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అల్లూరుకు చెందిన కోసిడిగ నగేశ్, హయత్‌నగర్ పరిధి గౌరవెల్లికి చెందిన బొంతశేఖర్, సిరిసిల్ల పట్టణానికి చెందిన ఆడెపు రవి జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్నారు. గతంలో వీరందరిపై దొంగతనం, గంజాయి విక్రయించిన కేసులు ఉన్నాయి. శేఖర్ అనే వ్యక్తిపై 34 కేసులు ఉండగా, రాజేశ్‌పై 22, నగేశ్‌పై 14 కేసులు ఉన్నాయి. వీరు పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇండ్లను చూసి అదే రోజు రాత్రి దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా చేసుకున్నారు. ఈక్రమంలోనే రెండు రోజుల వ్యవధిలో గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడి రూ.80వేల నగదుతోపాటు బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై రాహుల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టారు. దొంగలను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు. చైనా మాంజా అమ్మితే జైలుకే.. చైనా మాంజా దారం అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. చైనా మాంజాతో ప్రకృతికి విఘాతం కలగడమే కాకుండా, వాహనదారుల గొంతులకు తగిలితే చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్ డివిజన్ పరిధిలో ఎవరి వద్దనైనా చైనా మాంజా సంబంధించిన సరుకులు దొరికితే కేసులు నమోదు చేస్తామన్నారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌లో వచ్చే పోస్టులను ఓపెన్ చేయొద్దనిని సూచించారు. రూ.30వేల నగదు, బైక్ స్వాధీనం -
ఫిబ్రవరిలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
సిరిసిల్ల: వేములవాడలో ఫిబ్రవరి 18, 19, 20, 21వ తేదీల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు వేములవాడ కాలేజీ మైదానంలో నాలుగు రోజులపాటు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల నిర్వహణకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అంగీకరించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి అజ్మీరా రాందాస్‌లు ఆది శ్రీనివాస్‌ను కలిసి చర్చించారు. ఈలోగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పోటీల వేదికను రుద్రంగికి మార్చే అవకాశం ఉంది. -
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హామీలు అమలు చేస్తున్నాంవేములవాడరూరల్: ప్రజలకు ఇచ్చిన హా మీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకుపోతున్నామని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 1, 2వ వార్డుల్లో రూ.23లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి శనివారం భూ మిపూజ చేసి మాట్లాడారు. మున్సిపాలిటీలో విలీనమైన శాత్రాజుపల్లిలో రూ.1.43 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మించినట్లు తెలిపా రు. శాత్రాజుపల్లివార్డును ఒక హబ్‌గా తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్న ఆరేడు గ్రామాలకు ఈ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందన్నారు. రూ.15లక్షలతో ప్రధాన కూడలి వద్ద జంక్షన్ ఏర్పాటు చేసి సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, నాయకులు సంగ స్వామి, హన్మవ్వ, లింగంపల్లి కిరణ్, పొన్నాల మోహన్, తిరుపతి, కిషన్, అంజయ్య, కొమురయ్య, లక్ష్మీరాజం ఉన్నారు. వేములవాడఅర్బన్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో పట్టణ పరిధి లోని అర్హులైన 40 మందికి రూ.14 లక్షల సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. -
ప్రజా కోణం చూడాలి
జిల్లా ఏర్పాటు అనేది ప్రజల ఆకాంక్ష మేరకు జరిగింది. అప్పటి పాలకులు జిల్లాను ముక్కలు చేయాలని చూస్తే.. ప్రజలు ఉద్యమించి సాధించుకున్నారు. ఇప్పుడు మళ్లీ జిల్లాలను కుదించి.. రాజన్నసిరిసిల్ల జిల్లాను తొలగిస్తామంటే ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధమవుతారు. ప్రజా కోణమే చూడాలి. – ఆవునూరి రమాకాంత్‌రావు, జిల్లా సాధన జేఏసీ చైర్మన్ జిల్లా సాధన కోసం అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసులతో జైలుకు వెళ్లాం. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మేం జైలులో ఉండగానే జిల్లా ఏర్పాటు ప్రకటన వచ్చింది. జైలు అధికారులే మీ ఉద్యమం వృథా కాలేదని చెబుతూ అభినందించారు. మేం పడిన కష్టాలన్నీ మరిచిపోయి సంతోషపడ్డాం. ఇప్పుడు జిల్లాను రద్దు చేస్తామంటే ఊరుకోం. – చొక్కాల రాము, జిల్లా సాధన జేఏసీ ప్రతినిధి 2016లో జైలుకు వెళ్లాం. ఇప్పుడు రద్దు చేయడం సరికాదు. పాలకులు మారినప్పుడల్లా జిల్లాల స్వరూపం మార్చడం సరికాదు. ప్రభుత్వం ఆలోచించి జిల్లాను కొనసాగించాలి. ఇది ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాలతో సాధించుకున్న జిల్లా. అప్పటి ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి జిల్లా సాధనకు సంఘీభావం తెలిపిన సంగతి మరిచిపోవద్దు. – లింగంపల్లి మధుకర్, జిల్లా సాధన జేఏసీ ప్రతినిధి -
ఉంటుందా.. పోతుందా !
రాజన్న సిరిసిల్ల● జిల్లా పునర్ వ్యవస్థీకరణపై రాజకీయ చర్చలు ● అసెంబ్లీ వేదికగా రెవెన్యూశాఖ మంత్రి ‘పొంగులేటి’ ప్రసంగం ● జిల్లాల సంఖ్యను కుదిస్తామని వ్యాఖ్యలు ● ఇప్పటికే పడిపోయిన రియల్ ఎస్టేట్ ● మంత్రి మాటలతో మరింత కుదేలుIఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026‘రాష్ట్రంలో సంఖ్య కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. ఒక్క రెవెన్యూ డివిజన్లోని మండలాన్ని మరో జిల్లాలో, ఒక్క నియోజకవర్గంలోని మండలాలను మూడు నాలుగు జిల్లాల్లో కలుపుతూ.. ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. పునర్ వ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.’ ఈ ప్రకటనతో జిల్లాలోని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలోని 33 జిల్లాలను కుదిస్తారని సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో జిల్లా ఉంటుందా.. పోతుందా ? అనే చర్చ సాగుతోంది. సిరిసిల్ల: అది 2016.. తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రోజులు. అదే సమయంలో జిల్లా ఏర్పాటు ఉద్యమం మొదలైంది. వాస్తవానికి సిరిసిల్ల డివిజన్లో తొమ్మిది మండలాలు ఉండగా... గంభీ రావుపేటను కామారెడ్డి, ముస్తాబాద్, ఇ ల్లంతకుంటలను సిద్దిపేట జిల్లాలో కలి పేందుకు ప్రతిపాదనలు చేశారు. ఈక్రమంలో సిరిసిల్ల డివిజన్‌ను విడదీయొద్దని, కొత్తగాా జిల్లాను ఏర్పాటు చేయాలని ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. స్థానికులు జేఏసీగా ఏర్పాటయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమం మాదిరిగానే జిల్లా సాధన ఉద్యమం ఊరూరా సాగింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో రిలేదీక్షలు రోజుల తరబడి కొనసాగాయి. చివరికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ఏర్పాటు చేసింది. ● రేవంత్‌రెడ్డి సైతం మద్దతు జిల్లా సాధన ఉద్యమానికి మద్దతుగా ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డి సైతం సిరిసిల్ల అంబేడ్కర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జిల్లా సాధన ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అధికార బీఆర్ఎస్తోపాటు అన్ని పార్టీల నాయకులు జిల్లా ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. చాలా మంది ఉద్యమకారులు జైలుపాలయ్యారు. ● 2016 అక్టోబరు 11న సాకారం రాజన్నసిరిసిల్ల జిల్లా 2016 అక్టోబరు 11న ఏర్పాటైంది. అనంతరం కలెక్టరేట్, జిల్లా పోలీస్ ఆఫీస్(డీపీవో), నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు మంజూరై భవనాలు పూర్తయ్యాయి. వ్యవసాయకాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, అపెరల్ పార్క్ పూర్తయ్యాయి. ఇంకా కొన్ని భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుకాగా.. సొంత భవనాలకు నోచుకోలేదు. జిల్లా కోర్టు సముదాయం నిర్మాణంలో ఉంది. రాజన్నసిరిసిల్ల కంటే రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు అన్ని కోణాల్లోనూ చిన్నవిగా ఉన్నాయి. ● రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ ఢమాల్ నిజానికి రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ పరుగులు తీయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకాగానే కుప్పకూలింది. టెంపుల్‌సిటీ వేములవాడ, కార్మిక క్షేత్రం సిరిసిల్లతోపాటు ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, గంభీరావుపేట, బోయినపల్లి, రుద్రంగి మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగడం లేదు. తాజాగా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనతో జిల్లా ఉంటుందా.. పోతుందా.. అనే చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కొనసాగింపుపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. గ్రామపంచాయతీలు : 260 రెవెన్యూ గ్రామాలు : 171 మండలాలు : 13 మున్సిపాలిటీలు : సిరిసిల్ల, వేములవాడ జనాభా : 5,52,037 పురుషులు: 2,74,109 మహిళలు: 2,77,928 భౌగోళిక విస్తీర్ణం : 1,908 చదరపు కిలోమీటర్లు భూ విస్తీర్ణం : 4,77,125 ఎకరాలు అక్షరాస్యత శాతం: 66.27 అటవీ విస్తీర్ణం : 379.14 చదరపు కిలోమీటర్లు ప్రత్యేకత : వేములవాడ రాజన్న ఆలయం, వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్ల ఆదాయం: వ్యవసాయం, వలసలు, వస్త్రోత్పత్తి -
ఊరెళ్తున్నారా.. జర భద్రం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల క్రైం: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటే జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. సెలవుల నేపథ్యంలో రాత్రి వేళల్లో పోలీస్గస్తీ పెంచినట్లు తెలిపారు. ఊరికి వెళ్లే వారు విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లే వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. ప్రయాణ వివరాలను సోషల్‌మీడియాలో పంచుకోవద్దన్నారు. అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. వేములవాడఅర్బన్: వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలోని దుబ్బరాజన్న ఆలయంలో ఈనెల 17, 18న నిర్వహించే జాతర పోస్టర్‌ను రాజన్న ఆలయ ఈవో రమాదేవి శనివారం ఆవిష్కరించారు. ఈవో రమాదేవి మాట్లాడుతూ గ్రామదేవత ఆశీస్సులతో జాతరను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిరిసిల్లటౌన్: జిల్లా గ్రంథాలయం శనివారం మూసి ఉండడంపై వివాదం నెలకొంది. లైబ్రరీ అధికారుల నిర్లక్ష్యంతో నిరుద్యోగులకు అనువైన సమయంలో లైబ్రరీ మూసేయడం సరికాదంటూ పలువురు నిరుద్యోగులు గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. లైబ్రేరియన్ శంకరయ్య మాట్లాడుతూ రెండో శనివారం సెలవు దినం అయినప్పటికీ లైబ్రరీ తెరిచామని, తమ సిబ్బంది రావడం ఆలస్యమెందని వివరించారు. గతంలో నిరుద్యోగుల కోరిన నేపథ్యంలో సెలవు దినాల్లోనూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంచుతున్నామని తెలిపారు. -
వృద్ధులకు డే కేర్ సెంటర్
సిరిసిల్ల: వృద్ధుల కాలక్షేపానికి డేకేర్ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. జిల్లా సీనియర్ సిటిజన్ డైరీని అసోసియేషన్ ప్రతినిధులు శనివారం కలెక్టర్‌కు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ మీ అనుభవాలు భవిష్యత్ తరాలకు అందించేలా ప్రయత్నించాలన్నారు. ప్రభుత్వం డేకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని, తొందరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సీని యర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, ప్రతినిధులు కోడం నారాయణ, దొంత దేవదాస్, డాక్టర్ జనపాల శంకరయ్య, ఏనుగుల ఎ ల్లయ్య, శ్రీగాద మైసయ్య, గౌరిశెట్టి ఆనందం, గుడ్ల శ్రీధర్, కైలాసం, శ్రీహరిరెడ్డి, రాజిరెడ్డి, శ్రీహరి ఉన్నారు. -
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు సావనపెల్లి రాకేశ్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి మూడో రోజుకు చేరింది. మండలంలోని రోడ్లు బాగుచేయాలని, డిగ్రీ కాలేజీ, మినీస్టేడియం ఏర్పాటు చేయాలని, అసంపూర్తి బ్రిడ్జి పూర్తి చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. రాకేశ్‌కు సంఘీభావంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మ్యాకల మల్లేశం, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు పసుల బాలరాజు, సీపీఐ మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు సావనపల్లి మల్లేశం, గుండ్రేటి రాజు, ఏనుగుల లింగన్న, గడిగే రవి, రామచంద్రం, రాజేశం పాల్గొన్నారు. -
కోతులను పట్టిస్తాం
గ్రామంలో కోతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. పాలకవర్గం కొలువుదీరిన తర్వాత కోతుల సమస్యను పరిష్కరించాలని తీర్మానించాం. ఇందులో భాగంగా గ్రామస్తుల సహకారంతో కోతులను పట్టించాలని నిర్ణయించాం. ఇందుకు పది మందితో కమిటీ వేశాం. – దొమ్మాటి నర్సయ్య, నారాయణపూర్ సర్పంచ్ త్వరలో తీర్మానిస్తాం గ్రామంలో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. వాటిని ఊరి నుంచి తరిమివేయడానికి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కోతులు, కుక్కల సమస్య పరిష్కారానికి అందరి సహకారంతో ముందుకెళ్తాం. – ఇల్లందుల గీతాంజలి, రాచర్లబొప్పాపూర్ సర్పంచ్ -
క్రీడలతో మానసికోల్లాసం
సిరిసిల్ల/సిరిసిల్ల అర్బన్: క్రీడలతో స్నేహభావం పెంపొందడంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. సర్దాపూర్ 17వ బెటాలియన్‌లో శుక్రవారం వార్షిక స్పోర్ట్స్ మీట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడ ఉన్న వారందరిని చూస్తే తాను ఐపీఎస్‌గా 2019లో శిక్షణ తీసుకున్న అంశాలు గుర్తుకొస్తున్నాయన్నారు. ఫిట్నెస్, క్రమశిక్షణతో ఉత్తమ ప్రతిభ చూపుతామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. అసిస్టెంట్ కమాండెంట్ రాందాస్, సురేష్, ఆర్ఐలు కుమారస్వామి, శ్రీనివాస్, శ్యామ్‌రావు, రాంబ్రహ్మం పాల్గొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు రాజన్న కోడెలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు రాజన్నకు చెందిన 300 కోడెలను ఈనెల 21న ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు ఆధార్‌కార్డు, పట్టాదార్పాస్బుక్లతో https://rajannasiricilla.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యక్ష అనుభవంతో సంపూర్ణ అవగాహన ప్రత్యక్ష అనుభవంతో సంపూర్ణ అవగాహన వస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. పీఎంశ్రీలో తంగళ్లపల్లి మండలం మండెపల్లి టైడ్స్‌కు ఎక్స్పోజర్ విజిట్ కార్యక్రమాన్ని శుక్రవారం గీతానగర్ జెడ్పీ స్కూల్లోని 6వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు. కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వృద్ధుల డే కేర్ సెంటర్లో వసతులు కల్పించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంను కలెక్టర్ ఆదేశించారు. సుభాష్‌నగర్ వృద్ధుల డే కేర్ సెంటర్‌ను పరిశీలించారు. ఫిజియోథెరపి, పాలియేటీవ్ సేవలు అందుబాటులోకి తేవాలని తెలిపారు. తహసీల్దార్ మహేశ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎములాడలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
వేములవాడఅర్బన్: మున్సిపల్‌పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాలింగేశ్వరగార్డెన్లో శుక్రవారం కాంగ్రెస్ పట్టణశాఖ ఆధ్వర్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. వేములవాడ మున్సిపల్లోని 28 వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరారు. రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి రెండు కళ్లలా ముందుకు పోతున్నామన్నారు. వేములవాడను పర్యాటకరంగంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇటీవల రాజన్న గుడి చెరువులో బోటింగ్ ఏర్పాటుకు రూ.1.40కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే నాంపల్లి గుట్టపై రోప్ వే, ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో 42 కులసంఘాలకు సుమారు రూ.6 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కనికరపు రాకేశ్, సాగరం వెంకటస్వామి, కొమురయ్య, చిలుక రమేశ్ ఉన్నారు. -
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ముస్తాబాద్(సిరిసిల్ల): జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ముస్తాబాద్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల విద్యార్థి విష్ణువర్ధన్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్ తెలిపారు. హర్యానాలో జరిగిన జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీల్లో విష్ణువర్ధన్ ప్రతిభ చాటాడన్నారు. ఈనెల 13 వరకు భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే జాతీయస్థాయి సబ్‌జూనియర్ విభాగంలో తెలంగాణ జట్టు తరఫున ఆడనున్నట్లు తెలిపారు. వినియోగదారులకు సమాచారం ఇవ్వండి వేములవాడఅర్బన్: వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని సెస్ అధికారులపై సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడలోని రాజశ్రీ ఫంక్షన్హాల్లో శుక్రవారం సెస్ వేములవాడ డివిజన్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, సభ్యులు సత్యనారాయణ, రాజాగౌడ్, ఇన్చార్జి డీఈ శ్రీనివాస్, ఏఈలు సిద్ధార్థ, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
బస్సు కోసం మంత్రికి వినతి
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాకకు బస్సును వేయాలని సర్పంచ్ ఖాతా మల్లేశం రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందించారు. మంత్రిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. గతంలో కరీంనగర్ నుంచి బెజ్జంకి మీదుగా గుండారం, చీలాపురం, రేపాక, ఇల్లంతకుంట మండలానికి నాలుగు ట్రిప్పులు బస్సు నడిచేదని అది కరోనా సమయం నుంచి బంద్ చేశారని పునరుద్ధరించాలని కోరారు. బస్సు పునరుద్ధరిస్తే బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ మంత్రికి విన్నవించుకున్నారు. వాజ్‌పేయి రాజనీతిజ్ఞతతో దేశాభివృద్ధి సిరిసిల్లటౌన్: ప్రధానిగా అటల్ బిహార్ వాజ్‌పేయి తన రాజనీతిజ్ఞతతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోనీ పార్టీ ఆఫీస్‌లో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సుపరిపాలన సమ్మేళనం నిర్వహించారు. ఎర్రం మహేశ్, లింగంపల్లి శంకర్, కోల కృష్ణస్వామి, ఆడెపు రవీందర్, సిరికొండ శ్రీనివాస్, బర్కం లక్ష్మి, శీలం రాజు, దుమాల శ్రీకాంత్ పాల్గొన్నారు. ‘వర్కర్ టు ఓనర్’ వర్తింపచేయాలి సిరిసిల్లటౌన్: వస్త్రపరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకం అందించాలని తెలంగాణ రాష్ట్ర పవర్లూమ్ కార్మిక సంఘం అధ్యక్షుడు మూషం రమేశ్ డిమాండ్ చేశారు. పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సిరిసిల్లలోని చేనేత, జౌళి శాఖ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. కోడం రమణ, నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, గుండు రమేశ్, ఉడుత రవి, బెజుగం సురేష్, బాస శ్రీధర్, అవదూత హరిదాసు, కందుకూరి రమేశ్ పాల్గొన్నారు. సర్పంచ్.. ట్రాక్టర్ డ్రైవర్వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని లాల్‌సింగ్‌తండా సర్పంచ్ భూక్య గంగారెడ్డి శుక్రవారం స్వయంగా ట్రాక్టర్ నడిపి రోడ్లను శుభ్రం చేశారు. సర్పంచ్ గంగారెడ్డి మాట్లాడుతూ తండాలోని ప్రజలు తమ ఇంటి వద్ద శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. -
కోతుల పంచాయితీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇళ్ల పెంకులు.. పండ్ల చెట్లు.. ధాన్యం కుప్పలు కనిపిస్తే చాలు కోతుల మంద వచ్చి చేరుతున్నాయి. క్షణాల్లో గుల్ల చేసి వెళ్లిపోతున్నాయి. వందలాది కోతుల వస్తుండడంతో ప్రజలు సైతం భయాందోళన చెందుతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇటీవల జిల్లాలో కోతుల దాడిలో గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈక్రమంలోనే కొత్తగా కొలువుదీరిన పాలకవర్గాలకు కోతుల నివారణ సవాల్‌గా మారింది. అత్యధిక గ్రామాల్లో ఎన్నికల మేనిఫెస్టోగా కోతులను తరిమికొడతామని ప్రచారం చేసి విజయం సాధించారు. ఈక్రమంలోనే ఇటీవల చాలా గ్రామాల్లో కోతులను పట్టిస్తున్నారు. గ్రామస్తులు, పాలకవర్గాలు సంయుక్తంగా కోతులను ఊరి నుంచి తరిమికొట్టేందుకు సిద్ధమవుతున్నారు. కమిటీలతో ముందుకు.. గ్రామాల్లో కోతుల నివారణ సవాల్‌గా మారడంతో నూతన పాలకవర్గాలు మొదటి తీర్మానంగా దీన్ని ఎంచుకుంటున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉండగా అన్ని జీపీల్లో కోతులతో కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికల ప్రధాన హామీ అయిన కోతుల నివారణకు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో పాలకవర్గం, గ్రామస్తులు సంయుక్తంగా ముందుకొచ్చారు. ఇంటికి రూ.300 చొప్పున జమచేయాలని నిర్ణయించారు. నిధుల సేకరణ, కోతుల తరలింపు బాధ్యతలు చూసుకునేందుకు గురువారం సమావేౖశమైన గ్రామస్తులు 10 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఇల్లంతకుంట, బోయినపల్లి, వేములవాడ మండలాల్లో కోతులు పట్టే వారిని తెప్పించారు. దాడులు.. భయాందోళన పల్లె ప్రజలపై కోతుల దాడులు ఇటీవల పెరిగిపోయాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో కోతులు తర మడంతో భయాందోళనతో ఓ వృద్ధురాలు పరుగులు తీసి చేదబావిలో పడిపోయింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు తాడుతో పైకి లాగారు. సింగారంలో లక్ష్మి అనే మహిళపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. సొంత డబ్బులతో ఇంజక్షన్లు వేయించుకుంది. ముస్తాబాద్ మండలంలో ఓ మహిళ గాయపడింది. కోనరావుపేట మండలంలోని ఎగ్లాస్పూర్లో స్కూ ల్ పిల్లలు కోతుల భయంతో చేతుల్లో కట్టెలతో పాఠశాలకు వెళ్తున్నారు. ఇలాంటి దృశ్యాలు రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏ పల్లెకు వెళ్లిన కనిపిస్తున్నాయి. ఈ ఫొటో ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం సమావేశం. గ్రామంలోని కోతుల సమస్య తీవ్రం కావడంతో ఎలా పరిష్కరిద్దామని చర్చించారు. కోతుల నివారణకు పది మందితో కమిటీ వేశారు. పాలకవర్గం సభ్యులు స్వచ్ఛందంగా కొంత మొత్తం నగదును జమచేయడంతోపాటు గ్రామంలోని ప్రతీ ఇంటి నుంచి నగదు జమ చేయాలని తీర్మానించారు. ఈ డబ్బులతో కోతులు పట్టేవారిని తెప్పించాలని నిర్ణయించారు. -
డ్రంకెన్‌డ్రైవ్‌పై సీరియస్
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల క్రైం: జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే స్పష్టం చేశారు. శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్‌డ్రైవ్‌లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 61 మందిపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన 55 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. చందుర్తి(వేములవాడ): బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలోని పేర్లను పరిశీలించాలని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. చందుర్తి తహసీల్దార్ ఆఫీస్‌లో రెవెన్యూ అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్వోలతో గురువారం సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ 2025 జాబితాలో 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని 2002 జాబితాతో పరిశీలించాలని సూచించారు. అనంతరం మూడపల్లిలోని మినీస్టేడియానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ భూపతి, ఆర్ఐలు శ్రీనివాస్, మహేందర్, సర్వేయర్ చామంతి ఉన్నారు. సిరిసిల్ల అర్బన్: జిల్లాలోని వైన్స్‌షాపు నిర్వా హకులు విచ్చలవిడిగా బెల్ట్‌షాపులకు మద్యం విక్రయిస్తున్నారని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు ఏఐఎస్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లోని ఆఫీస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయన్నారు. సంబంధిత అధికారులు సైతం బెల్ట్‌షాపుల వైపు చూడడం లేదన్నారు. దేవదాస్, సత్తయ్య, ఎల్లయ్య, రాజేశం పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ ఎంపిక పోటీలు గురువారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో జిల్లాలోని 13 మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఎంపికైన 30 మంది క్రీడాకారులను ఈనెల 18న ఆదిలాబాదు జిల్లాలో జరిగే రాష్ట్ర పోటీలకు పంపించారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గొట్టె రామచంద్రం, జాయింట్ సెక్రెటరీ అజయ్‌కుమార్, అశోక్, సంతోష్, కడారి అశోక్, ఎఫ్సిబా పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల కడుపు కొడుతూ కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఈనెల 19న సిరిసిల్లలో జరిగే నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య, అన్నల్దాస్ గణేశ్, బింగి సంపత్ పాల్గొన్నారు. వేములవాడ: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్‌జాదవ్, జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి హాజరయ్యారు. -
రేషన్‌షాపులపై టాస్క్‌ఫోర్స్ దాడులు
● అధికారులతో పొలిటికల్ నేతల వాగ్వాదం ● వివాదాస్పదమైన తనిఖీలు.. డీలర్లపై విమర్శలుసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని రేషన్ షాపుల్లో హై దరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. స్థానిక సివల్ సప్లయ్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. స్టాక్రిజిష్టర్లు, పంపిణీపై ఆరా తీశారు. అబ్దుల్ షేక్ రఫీక్, బండారి వేణు, శ్రీనివాస్ తదితర రేషన్ డీలర్ల దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలిసి కొందరు షాపులు మూసి వెళ్లిపోయారు. అధికారులతో వాగ్వాదం తనిఖీల నేపథ్యంలో పలువురు రేషన్ డీలర్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో కేసులు నమోదు చేయడంపై విమర్శలు చేశారు. కమిషనర్ ఆదేశాలతో తనిఖీలు చేపడుతుంటే డీలర్లు రాజకీయనాయకులతో ఒత్తిడి తేవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. చివరికి నాలుగు రేషన్ షాపుల్లో తనిఖీలు చేయగా.. నెహ్రూనగర్‌లోని షాపు నంబరు 3908034లో స్టాక్‌లో తేడాలు గుర్తించినట్లు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ టీం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీరాజం తెలిపారు. షాపుడీలర్ అబ్దుల్ షేక్ రఫీక్‌పై కేసు నమోదు చేసి దుకాణాన్ని సమీప డీలర్ గాజుల శ్రీనివాస్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు. షాపులో పీడీఎస్ బియ్యం 28 క్వింటాళ్లు, దొడ్డు బియ్యం 50 క్వింటాళ్లు తేడా వచ్చినట్లు వివరించారు. సిరిసిల్ల డీటీసీఎస్ రజిత, వేములవాడ డీటీసీఎస్ సత్యనారాయణ ఉన్నారు. -
శుక్రవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026
శ్రీలక్ష్మీవేంకటేశ్వర ఆలయంలో దీపోత్సవంసునోజీ.. ఏఐ గురూజీ!● ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ పాఠాలు ● డిజిటల్ విద్యతో ఆసక్తి చూపుతున్న విద్యార్థులు ● బోధన సులభం.. అభ్యసన మెరుగు ● భాష పరిజ్ఞానంలో మంచి ఫలితాలు ● వెనుకబడిన విద్యార్థులకు ఎంతో మేలుతిమ్మాపూర్: మూడేళ్లుగా మా పాఠశాలలో హిందీ పాఠ్యాంశాల బోధనలో నేను సొంతంగా సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నా. హిందీలో స్పష్టమైన ఉచాచ్ఛారణ నేర్చుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ ఎంతో దోహదపడుతోంది. నేను రూపొందించిన ‘బడిబాట’ ప్రచార వీడి యో రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సాంకేతికతను తరగతి గదికి అనుసంధానించడం ద్వారా కఠినమైన పాఠాలను దృశ్యరూపంలో విద్యార్థులకు అందిస్తున్నా. – షరీఫ్ అహ్మద్, హిందీ ఉపాధ్యాయుడు, మల్లాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలవిద్యాబోధనలో పలకాబలపం పద్ధతి మారింది. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో కంప్యూటర్ ప్రవేశించింది. డిజిటల్ విద్యతో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అభ్య సన(లెర్నింగ్)ను సులభతరమవుతోంది. వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థంకావడంలో దోహదపడుతోంది. ప్రైమరీ స్కూళ్లలో గణితం, ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులలో రాణించేందుకు ఉపయోగపడుతుంది. హైస్కూళ్లలో డిజిట ల్ బోర్డుల ద్వారా ఫ్లోచార్ట్, త్రీ డైమెన్షన్ మ్యాప్స్ పరిశీలించి పాఠాలు సులభంగా అర్థం చేసుకుంటున్నారు. పాఠ్యాంశాలను డిజిటలైజ్డ్ చేయడంతో విద్యార్థుల్లో జిజ్ఞాస పెరుగుతోంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు వినూత్న మార్పు తీసుకొచ్చాయి. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. -
ఎరువుల కొరత లేదు
సిరిసిల్ల: జిల్లాలో ఎరువుల కొరత లేదని.. నిల్వలు, పంపిణీని పరిశీలించేందుకు మండల, జిల్లా స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి మండలాల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,87,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయన్నారు. 21 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ఇప్పటికే 13 వేల మెట్రిక్ టన్నుల విక్రయాలు పూర్తయ్యాయన్నారు. ఇంకా రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. యూరియా ఇబ్బందులు రాకుండా అపెరల్ పార్కులో నిల్వ చేసినట్లు తెలిపారు. పీఏసీఎస్‌ల వద్ద రైతుల కోసం షామియానా ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ తనిఖీలు ఎరువుల పంపిణీ, నిల్వల పరిశీలనకు జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, డీఆర్డీవో, మార్క్‌ఫెడ్ డీఎంలతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందం, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీమ్‌లో తహసీల్దార్, ఎస్‌హెచ్‌వో, మండల వ్యవసాయ అధికారి బృందం పని చేస్తుందని తెలిపారు. మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందం నిత్యం రెండు షాపులను తనిఖీ చేయాలని సూచించారు. స్టాక్ నిల్వలో తేడాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎరువులను ఇతర అవసరాలకు వాడకుండా పర్యవేక్షించాలని టాస్క్‌ఫోర్స్ బృందాలకు ఎస్పీ మహేష్ బీ గీతే సూచించారు. నకిలీ ఎరువుల విక్రయాలపై దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీవో గీత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. నెలాఖరులోగా వంద ఇళ్లు పూర్తి చేయించండి సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. నెలాఖరులోగా వంది ఇళ్లను పూర్తి చేయించి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని సూచించారు. సిరిసిల్లలో 808 ఇళ్లు మంజూరు చేయగా.. 554 ఇళ్లకు ముగ్గుపోశారని, 461 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో, 326 ఇళ్లు గోడల వరకు, 250 స్లాబ్లెవల్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా ఉన్నారు. -
పోషకాహార లోపంతోనే పిల్లల మరణాలు
● జిల్లా వైద్యాధికారి రజితసిరిసిల్ల: ఐదేళ్లలోపు చిన్నారుల మరణానికి పోషకా హారలోపం, తక్కువ బరువులో ఏడు నెలల కాన్పులు కారణమని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. కలెక్టరేట్లోని జిల్లా వైద్యాధికారి ఆఫీస్‌లో గురువారం జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో మా ట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లల మరణానికి గల కారణాలపై ఆరా తీశారు. మూడు నెలల్లో జిల్లాలో ఏడుగురు చిన్నారులు మరణించారని, ప్రధాణంగా త క్కువ బరువుతో పుట్టిన పిల్లలు, ఏడు నెలల కాన్పులు, పోషకాహార లోపమే కారణమన్నారు. సకాలంలో టీకాలు వేయకపోవడంతో వ్యాధి నిరోధకశక్తి తగ్గి అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారని పే ర్కొన్నారు. ఆశకార్యకర్తలు ఐదేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయాలని సూచించారు. పిల్లల మరణాలు తగ్గించేలా తీసుకోవాల్సిన చర్యలపై విశ్లేషించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల వైద్య నిపుణులు సా యికుమార్, శృతి, ప్రోగ్రాం అధికారులు నాగేంద్రబాబు, సంపత్‌కుమార్, రామకృష్ణ, అనిత, డిప్యూ టీ డెమో రాజ్‌కుమార్, మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
● ప్రమాద బాధితులను కాపాడితే రూ.25వేలు పురస్కారం ● హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయొద్దు : కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : ఎస్పీ మహే శ్ బీ గీతేతంగళ్లపల్లి(సిరిసిల్ల): రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మండలంలోని మండెపల్లి ఐటీడీఆర్లో గురువారం రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది 268 ప్రమాదాలు జరిగాయని తెలిపారు. డ్రైవర్లు తమ కుటుంబ బాధ్యతను గుర్తించి వాహనం నడపాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను అమలు చేస్తామని స్పష్టం చేశారు. సెల్‌ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని హెచ్చరించారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం ‘రహవీర్ గుడ్ సామరిటన్’ పథకం కింద రూ.25వేలు ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ప్రమాదాలు 40 శాతం తగ్గాయని, దీనిని సున్నాకు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్(టైడ్స్) కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి పాల్గొన్నారు. -
మాంజా.. ప్రమాదాల పంజా
సిరిసిల్ల: సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఏ గల్లీలో చూసినా పిల్లలు పతంగులు(గాలిపటాలు) ఎగురవేస్తూ కనిపిస్తుంటారు. గాలిపటాలు ఎగురవేస్తూ సంతోషంగా గడపడం వరకే బాగానే ఉన్నా.. వాటికి చైనా మాంజా(దారం) కట్టడమే ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ మాంజాకు తాకిన పక్షులు చనిపోతుండగా మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఒకప్పటి మాదిరిగా నూలుపోగులతో చేసిన దారాన్ని వినియోగించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు. పండుగను సరదాగా జరుపుకోవాలే కానీ ప్రమాదాలకు కారణంగా నిలువు వద్దని సూచిస్తున్నారు. నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ముప్పును గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2017 జూలై 11న చైనా మాంజా విక్రయాలపై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1966 ప్రకారం చైనా మాంజాను అమ్మినా.. కొనుగోలు చేసినా.. వినియోగించినా నేరం. ఈ మాంజా అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధిస్తారు. మూడు శాఖల తనిఖీలు జిల్లా వ్యాప్తంగా చైనా మాంజాల కోసం మూడు ప్రభుత్వ శాఖలు వేర్వేరుగా తనిఖీలు చేస్తున్నాయి. పోలీసులు నిఘా బృందాలను రంగంలోకి దింపి చైనా మాంజాల అన్వేషణలో ఉన్నాయి. మరోవైపు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దుకాణాలలో తనిఖీలు చేస్తున్నారు. చైనామాంజా విక్రయించొద్దని అవగాహన కల్పిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ అధికారులు మరో అడుగు ముందుకేసి చైనా మాంజా విక్రయిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు సైతం చైనా మాంజాను పిల్లలు వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అధికారులు అంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదం సంక్రాంతి సీజన్లో పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తారు. నూలుపోగులను వినియోగిస్తే గట్టిగా ఉండదని, ప్లాస్టిక్, గాజు పొడి, ఇతర రసాయనాలతో తయారు చేసిన చైనా మాంజా(దారం) వినియోగిస్తున్నారు. అయితే ఆ దారం తెగిపోయి విద్యుత్ తీగలను, చెట్లను తట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అటుగా వెళ్లిన పక్షులు, కోతులు, కొండెంగలు, ఇతర జంతువులు మాంజాకు చిక్కుకుని గాయపడుతున్నాయి. మరోవైపు బైక్‌పై వెళ్లే వారికి సైతం ఆ మాంజా వైరు తాకి గాయపరుస్తున్నాయి. -
ఇంటి నుంచి ఇస్రోకు..!
సక్సెస్ స్టోరీగంభీరావుపేట(సిరిసిల్ల): వారిది సామాన్య కుటుంబం.. కుటుంబ పెద్ద ఆర్టీసీ ఉద్యోగి. ఆయన భార్య గృహిణి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. అనారోగ్య సమస్యలు వెంటాడినప్పటికీ ఆ దంపతులు మా త్రం తమ కుమారుడికి మంచి చదువు చెప్పించారు. సమస్యలన్నింటినీ చదివిన వారి కుమారుడు బాగా చదువుకున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా తన అడుగులు వేశాడు. చిన్నప్పటి నుంచి గణితం, భౌతిక శాస్త్రంపై మక్కువ పెంచుకున్న ఆ యన.. ఇస్రో ఆధ్వర్యంలో గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు హాజరయ్యాడు. ఇటీవల వె లువడిన ఫలితాల్లో సైంటిస్ట్ (జియో ఇన్ఫర్మేటిక్స్) గా ఎంపికయ్యాడు. డిసెంబర్లో నిర్వహించిన ఇంటర్వ్యూలో వందకు 65.92 మార్కులు సాధించాడు. సామాన్య కుటుంబం.. గంభీరావుపేటకు చెందిన చొక్కయ్యగారి శ్రీనివాస్ కుమారుడు సాయిచరణ్. గంభీరావుపేటలోని ఒక ప్రైవేటు పాఠశాలలో హైస్కూల్ విద్య పూర్తిచేశాడు. చిన్నప్పటి నుంచే గణితం, భౌతికశాస్త్రం అంటే మక్కువ ఎక్కువ. టెన్త్‌లో 9.2 జీపీఏ సాధించాడు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలల్లో చదివేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. తన స్నేహితులు కోచింగ్‌కు వెళ్లినా.. సాయిచరణ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వెళ్లలేకపోయాడు. కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేరాడు. ఇంటర్ ఎంపీసీలో వెయ్యికి 969 మార్కులు సాధించాడు. ఆ తర్వాత జేఈఈ, ఎంసెట్‌లోనూ అర్హత సాధించాడు. మళ్లీ ఆర్థిక పరిస్థితులు, తండ్రి అనారోగ్య సమస్యలు ఎదురై ఇంజినీరింగ్ చేయలేకపోయాడు. ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ సైఫాబాద్‌లో డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ చదివి 8.58 సీజీపీఏతో ఉత్తీర్ణుడయ్యాడు. పర్యావరణ అధ్యయనాలపై ఆసక్తి సాయిచరణ్‌కు చిన్నప్పటి నుంచి సైన్స్, పర్యావరణ అధ్యయనాలపై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో శాటిలైట్ డాటా ద్వారా భూపరిశీలన(ఎర్త్ అబ్జర్వేషన్), పర్యావరణ విశ్లేషణ చేసే జియో ఇన్ఫర్మెటిక్స్ గురించి తెలుసుకున్నాడు. ఇందులో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. ఈ దశలో వాతావరణ మార్పులు, సుస్థిరత, పర్యావరణ పరిరక్షణపై తనకున్న నిబద్ధతను మరింత బలోపేతం చేశాయి. వ్యవసాయంపై దృష్టి.. తూర్పు తెలంగాణలో వరద మ్యాపింగ్, వ్యవసా యం, పశువుల నుంచి వెలువడే మిథేన్ ఉద్గారాల పై సాయిచరణ్ అనేక జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించాడు. దేశానికి వెన్నెముకగా ఉండి 60 శాతం మంది జనాభాకు జీవనాధారమైన వ్యవసాయరంగంపై ఆయన దృష్టి సారించాడు. శాసీ్త్రయ ప్రణాళికల ద్వారా, నీటి వినియోగాన్ని నియంత్రిస్తూ, భూసారం తగ్గకుండా, కార్బన్ సీక్వెస్ట్రేషన్ పెంచుతూ రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని సాయిచరణ్ అపార విశ్వాసం. జీవితంలో మలుపు.. 2020లో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పర్యటన సందర్భంగా సాయిచరణ్ అక్కడి రైతులు యాసంగిలో ఎదుర్కొంటున్న నీటిఎద్దడిని కళ్లారా చూశాడు. ఆ పర్యటన తన జీవితంలో కీలకమలుపుగా సాయిచరణ్ చెబుతుంటాడు. తన అనుభవం ద్వారా నీటిని పొదుపు చేయడానికి ఎల్‌నినో, కరువు వంటి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి పంటరకం, ఎదుగుదల దశల ఆధారంగా నీటి అవసరాలను ప్లాన్ చేయడం ఎంతముఖ్యమో గ్రహించాడు. అప్పటి నుంచి ‘నాసా’, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అగ్రికల్చరల్, హైడ్రోలాజికల్ నమూనాలు అధ్యయనం చేశాడు. నీటి వినియోగాన్ని లెక్కించడానికి శాటిలైట్ ఆధారిత ‘ఎవాపోట్రాన్స్‌పిరేషన్’ అంచనా, కచ్చితమైన సాగునీటి సలహాలను అందించే ‘సాయిల్ వాటర్ బ్యాలెన్స్’ మోడల్స్‌పై పని చేశాడు. రిమోట్ సెన్సింగ్ అనలిస్ట్‌గా.. సాయిచరణ్ ప్రస్తుతం నిరుతి సంస్థలో రిమోట్ సె న్సింగ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. రిటైర్డ్ నాసా శాస్త్రవేత్త, సంస్థ వ్యవస్థాపకులైన రామకృష్ణ నేమని పర్యవేక్షణలో పనిచేస్తున్నాడు. ఆయన అనుభవం, మార్గదర్శకత్వంలో శాసీ్త్రయ ఆలోచన విధానాన్ని, పరిశోధన పద్ధతులను మెరుగుపరుచుకున్నాడు.నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ఉపాధ్యాయులు, గురువులకు ధన్యవాదాలు. భవిష్యత్తరాల కోసం సుస్థిర పర్యావరణ పర్యవేక్షణ, ప్రణాళికలో నా వంతు కృషి చేస్తా. సైన్స్ ద్వారా సమాజానికి సేవ చేయడం కొనసాగించడానికి ‘ఎర్త్ సైన్సెస్’లో పీహెచ్డీ చేయాలని ఆశిస్తున్నా. – సాయిచరణ్ -
స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్థాపూర్‌లో గల 17వ బెటాలియన్‌లో బుధవారం బెటాలియన్ ఇంటర్ కంపెనీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌ను బెటాలియన్ కమాండెంట్ ఎంఐ. సురేశ్ ప్రారంభించారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది తీరక లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారికి మానసికోల్లాసం కోసం ఈ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. అసిస్టెంట్ కమాండెంట్లు జె.రాందాస్, ఎస్.సురేశ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమీల, ఆర్ఐలు కుమారస్వామి, శ్రీనివాస్, శ్యాంరావు, వసంతరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుడి చెరువులో బోటింగ్వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటుకు రూ.1.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన అనుభూతి కల్పించాలనే లక్ష్యంతో కొంతకాలంగా ప్రభుత్వాన్ని పలుమార్లు కోరడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో విజ్ఞప్తి చేసినందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి త్వరలోనే బోటింగ్ సౌకర్యం ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. దీంతో రూ.1.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పత్యేక కార్యదర్శి జయేష్ రంజాన్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్‌ను కలిసిన వైస్ చాన్స్‌లర్, రిజిస్టర్వేములవాడ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను బుధవారం అగ్రహారం జేఎన్టీయూ కళాశాల వై స్ చాన్స్‌లర్ కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్టార్ డాక్టర్ వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలి శారు. పుష్పగుచ్ఛం అందించి కళాశాలలోని పలు సమస్యలను వివరించారు. త్వరలోనే కళాశాలను సందర్శిస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ హామీ ఇచ్చారు. ‘సైన్స్‌కథలు’ పుస్తకం ఆవిష్కరణసిరిసిల్లటౌన్: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అమరావతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ బాలసాహితీవేత్త డా.కందేపి రాణీప్రసాద్ రచించిన సైన్స్‌కథలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. వచన కవితా సదస్సులో ప్రకాశం జిల్లా రచయితలు తేళ్ల అరుణ, నూనె అంకమ్మ రావు, రామలక్ష్మి, ముద్దు వెంకటలక్ష్మి, పంతుల వెంకటేశ్వర రావులు పాల్గొన్నారు. విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కలిగించడానికి, సైన్స్‌పై భయం పోవడానికి అనేక రచనలు చేస్తున్న రాణీప్రసాద్‌కు సభాముఖంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. మరిమడ్లలో చిరుత సంచారంకోనరావుపేట: మండలంలోని మరిమడ్ల అట వీప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం అజ్మీరాతండాకు చెందిన గొర్రెల కాపరి మాలోత్ చెన్న గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను హతమార్చడంతో పాటు మరో గొర్రెను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లినట్లు తెలిపారు. సమీప గ్రామస్తులు, గొర్లకాపరులు ఆందోళన చెందుతున్నారు. తరగతి గదులు దాటి.. ప్రత్యక్ష పాఠాలుగంభీరావుపేట(సిరిసిల్ల): నిత్యం తరగతి గదుల్లో అధ్యాపకులు చెప్పే పాఠాలు వినే విద్యార్థులు తరగతి గదులు దాటి ప్రత్యక్ష అవగాహన పాఠాలు నేర్చుకున్నారు. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లైఫ్ సైన్స్ చదువుకునే విద్యార్థులు బుధవారం సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. ఉద్యాన్ ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఏకో బజార్, ఆధునిక వ్యవసాయ పద్ధతుల పరిచయం, నర్సరీ స్టాల్స్, వర్క్ షాప్ ఏరియా, పట్టు పురుగుల పెంపకం తదితర ప్రదర్శనలను వీక్షించారు. సంబంధిత విభాగాల అధ్యాపకులు వాణి, బిక్షమయ్య, సుచరణ్ తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన దొంగలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడి నగలు, నగదు, బైక్ ఎత్తుకెళ్లారు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన నరెండ్ల సంతోష్ ఇంటి ఎదుట నిలిపిన బైక్ అపహరణకు గురైంది. అదే గ్రామానికి చెందిన మొడుసు ఎల్ల వ్వ ఇంటికి తాళం వేసి తన కూతురు ఇంట్లో పడుకుంది. బుధవారం ఉదయం ఇంటికొచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి పరిశీలించగా రూ.4వేల నగదు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. వంగ వజ్రవ్వ ఇంటికి తాళం వేసి కొడుకు వద్ద వెళ్లగా వెండి ఆభరణాలు, రూ.10వేలు నగదు ఎత్తుకెళ్లారు. దీంతోపాటు రాచర్లగొల్లపల్లిలోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఒకే రోజు రెండు గ్రామాల్లో మూడు ఇళ్లల్లో దొంగలు పడడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్‌టీమ్‌తో వెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. రెండు గ్రామాలు.. మూడు ఇళ్లలో చోరీ తాళం వేసిన ఇళ్లే టార్గెట్ బంగారం, నగదు, బైక్ అపహరణ -
గల్ఫ్ నుంచి స్వగ్రామానికి మృతదేహం
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన వేముల చొక్కయ్య(55) దుబాయిలో మృతిచెందాడు. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. చొక్కయ్య దుబా యిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గతనెల 31న డ్యూటీకి వెళ్లి రాత్రి తన గదికి వచ్చాడు. రాత్రి 7 గంటల సమయంలో చాతీలో నొప్పి ఉందంటూ పడిపోయాడు. తోటి మిత్రులు గమనించేసరికే మృతి చెందాడు. చొక్కయ్య పదేళ్లుగా దుబాయి వెళ్లివస్తున్నాడు. రెండు నెలల క్రితం వచ్చి తిరిగి వెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. చొక్కయ్యకు భార్య నర్సవ్వ, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కువైట్ నుంచి.. కోనరావుపేట: కువైట్‌లో ఈనెల 4న మృతి చెందిన మారుపాక నర్సయ్య మృతదేహం బుధవారం చింతకుంటకు చేరింది. వివరాలు ఇలా.. కనగర్తికి చెందిన నర్సయ్య ఉపాధి నిమిత్తం కొంతకాలంగా కువైట్ దేశానికి వెళ్తున్నాడు. భార్య పిల్లకు కరీంనగర్ మండలం చింతకుంటలో ఉంటున్నారు. ఏడాది క్రితం కువైట్‌కు వెళ్లిన నర్సయ్య ఈనెల 4న తన గదిలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతదేహం బుధవారం రాగా, భార్య పిల్లలు చింతకుంటలో ఉండటంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. సుధాకర్, శ్రీకాంత్‌లను కోర్టులో హాజరు పర్చాలిసిరిసిల్లటౌన్: రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శుద్ధపల్లి సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీకాంత్‌లను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బానోతు సంతోష్‌నాయక్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 6న మధ్యాహ్నం 2గంటలకు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలోని వారి స్వగృహంలో శ్రీకాంత్‌ను సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఉమ్మడి నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సుధాకర్ స్వస్థలంలో పోలీసులు అదుపులో తీసుకున్నారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని రైతు కూలీ సంఘం నిషేధిత సంఘం కాదని, ప్రభుత్వం గుర్తించుకోవాలని తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతవేములవాడఅర్బన్: వేములవాడ పట్టణంలోని మూలవాగు నుంచి ఇసుకను ఆక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను బుధవారం పట్టుకున్నట్లు తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించామని అన్నారు. -
మారలే.. తొలగలే..
● అవే వార్డులు.. తొలగని తప్పులు ● ఓటరు జాబితాపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ● అధికారుల తీరుపై విమర్శలుసిరిసిల్లటౌన్: బల్దియా ఎన్నికల్లో మొదటి అడుగు తడబడింది. తప్పులు లేని ఓటరు జాబితా అందించడంలో అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. ఎన్నికల సమయంలోనే హడావిడి చేస్తూ ఓటరు జాబితాను తయారు చేస్తూ మమా అనిపించడం పరిపాటైంది. గత ఎన్నికల్లో దొర్లిన తప్పులను సవరించకుండానే ఓటరు జాబితాను వెల్లడించడం సిరిసిల్లలో విమర్శలకు తావిస్తోంది. మారని వార్డుల పరిధులు జిల్లా కేంద్రమైన సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులున్నాయి. మొత్తంగా 81,959 ఓటర్లు ఉండగా పురుగులు 39,942, మహిళలు 42,011, ఇతరులు ఆరుగురు ఉన్నారు. 2020లో ఖరారు చేసిన వార్డులనే తిరిగి వార్డుల పరిధిలుగా గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. గత ఎన్నికలకు ముందు సిరిసిల్ల మున్సిపల్లో విలీనమైన పెద్దూరు, సర్దాపూర్, రాజీవ్‌నగర్, చంద్రంపేట, రగుడు, చిన్నబోనాల, పెద్దబోనాల కలుపుకుని ఏర్పడిన 39 వార్డులను అలాగే ఉంచారు. ఓటరు జాబితాపై ఫిర్యాదులు సిరిసిల్ల మున్సిపల్ ఓటరు జాబితాలో దొర్లిన తప్పులపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, ఇతర అభ్యంతరాలను తెలపడానికి గడువు విధించారు. ఇప్పటి వరకు 13 ఫిర్యాదులు అందాయి. వాటిలో ఎక్కువగా చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని, ఇతర వార్డులో ఉన్న తమ ఓటును సొంత వార్డుకు మార్చాలని కోరారు. అధికారులకు వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యంగా 13వ వార్డులో పి.కార్తికేయ తన ఓటు పోలింగ్‌స్టేషన్ మార్చాలని, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ తమ వార్డులో ఓటరులిస్టును ఇంటి నంబర్లు ప్రకారం క్రమపద్ధతిలో అందించాలని పేర్కొన్నారు. మొత్తంగా 13 ఫిర్యాదుల్లో తమ పరిధిలో పరిష్కరించే వాటిపై బల్దియా అధికారులు ఫోకస్ చేశారు. మిగతా ఫిర్యాదులను ఆర్డీవోకు నివేదిస్తున్నారు. -
● ఆర్ఎంపీల ఇష్టారాజ్యం ● అర్హతకు మించి వైద్యం ● అవగాహన లేకున్నా యాంటిబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్స్ ● అమాయకుల ప్రాణాలతో చెలగాటం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో కొందరు శంకర్‌దాదా ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అర్హత ఉండదు.. అనుమతులు ఉండవు. అయినా వైద్య చికిత్సలు చేసేస్తుంటారు. అడిగే వారు లేకపోవడం, తనిఖీలు చేసేవారు ఆ విషయమే మరచిపోవడంతో ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత్యంతరం లేక స్థానికంగా అందుబాటులో ఉందనే ఉద్దేశంతో తమ వద్దకు వస్తున్న రోగులకు చుక్కలు చూపుతున్నారు. రోగుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌ల వద్దనే ల్యాబ్, ఫార్మసీ ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలు చోట్ల ఆర్ఎంపీలు చేసిన వైద్యం వికటించి కొందరి ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్నారులు, బాలింతలు ఇబ్బంది పడిన ఉదంతాలూ వెలుగుచూశాయి. దీనికితోడు సమీప పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల వారితో ఆర్ఎంపీలు కుమ్మకై ్క రోగులను అక్కడికి పంపిస్తూ అడ్డగోలుగా ‘కమీషన్’ రూపంలో సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన అర్హతలు, నిబంధనలు లేకుండా యాంటీ బయాటిక్స్ డ్రగ్స్ విక్రయించడం, సరఫరా చేయడం చట్టవిరుద్ధం. డగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ 1940 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ కలిగిన ప్రతీ డ్రగ్ డీలర్, హోల్‌సేల్ వ్యాపారులు తమ మందుల సరఫరాలో పారదర్శకత పాటించాలి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) నిబంధనల ప్రకారం మందులు నిల్వ ఉంచాలి. ఎవరుపడితే వారు నిల్వ చేస్తే కఠిన చర్యలకు అర్హులవుతారు – షానవాజ్ ఖాసీం, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డైరెక్టర్ జనరల్ -
యథేచ్ఛగా గ్యాస్ దందా
● హోటళ్లలో కుప్పలు తెప్పలుగా రాయితీ సిలిండర్లు ● తనిఖీల్లేవ్.. అమ్యామ్యాలే ● పట్టించుకోని అధికారులు డీమార్ట్ పక్కన గల శ్రీలక్ష్మి ఫుడ్ కోర్టు ఇది. ఇక్కడ సబ్సిడీ గ్యాస్ యథేచ్చగా వినియోగిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడమే తప్ప నామమాత్రమే. అంబేడ్కర్ స్టేడియం సమీపంలోని పరిపూర్ణ టిఫిన్ సెంటర్లో ఇష్టారాజ్యంగా సబ్సిడీ గ్యాస్ వినియోగిస్తున్నారు. నిత్యం ఇదే ప్రక్రియ కాగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కలెక్టర్, అదనపు కలెక్టర్లుండే నగరంలో అడుగడుగునా సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగమవుతుండటం ఆందోళనకరం. వ్యాపార కేంద్రాల్లో సబ్సిడీ గ్యాస్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. మామూళ్ల మత్తులో మునిగిన సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు అవేవీ కనిపించకపోవడం విడ్డూరం. కరీంనగర్లో దాదాపు హెచ్చు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లు, బార్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు అన్నింటా ఇవే కనిపించడం అధికారుల డొల్లతనాన్ని చాటుతోంది. పత్రికల్లో కథనాలు వస్తే మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం, లోతుగా దర్యాప్తు లేకుండానే హోటళ్ల వరకే చర్యలకు పరిమితమవడం. పలు ఏజెన్సీలు నిబంధనలను విస్మరించి భారీ అక్రమ వ్యాపారానికి తెరదీశారు. పర్యవేక్షించాల్సిన శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. తనిఖీలేవీ.. ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుండటంతో క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాల్సిన పౌరసరఫరాల శాఖ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నగరంలో ఇండెన్, హెచ్‌పీ, భారత్ కంపెనీల వినియోగదారులుండగా 11 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీలు, గోడౌన్లలో తనిఖీలు చేపట్టాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు విధులు మరిచారన్న విమర్శలున్నాయి. అయితే సివిల్ సప్లై ఇన్స్పెక్టర్, డీటీ సివిల్ సప్లయ్, ఏఎస్‌వోలు ప్రతీనెలా తనిఖీలు నిర్వహించాలన్న టార్గెట్ ఉంటుండగా తనిఖీలు చేస్తే ఇంత బహిరంగంగా ఎలా వినియోగిస్తారన్నది అంతుచిక్కని ప్రశ్న. రూ.కోట్లలో అక్రమ వ్యాపారం ఆహార నాణ్యత అటుంచితే హెచ్చు ప్రాంతాల్లో కమర్షియల్ సిలిండర్లు పేరుకు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. కానీ వినియోగించేది మాత్రం సబ్సిడీ గ్యాస్. కమర్షియల్ సిలిండర్ ధర రూ.1946 ఉండగా సబ్సిడీ గ్యాస్ రూ.924కే దొరుకుతుండటం, అందుకు గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్‌ల సంపూర్ణ సహకారముండటంతో కమర్షియల్ సిలిండర్ వాడకాన్ని 80శాతం తగ్గించారు. ఒక్కో హోటల్లో కస్టమర్లను బట్టి కనిష్టంగా నెలకు 10 నుంచి 50సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రాయితీ గ్యాస్ వినియోగించే ఒక్కో హోటల్లోనే రూ.20వేల నుంచి 70వేల వరకు అక్రమంగా లాభపడుతున్నారు. రాయితీ గ్యాస్ వినియోగించే అన్ని ప్రాంతాలను లెక్కిస్తే నెలకు రూ.కోట్లలో ప్రయోజనం పొందుతున్నారు. భారీగా తేడాలు జిల్లాలో రెస్టారెంట్లు, హోటళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, టీస్టాల్స్, నూడిల్స్ పాయింట్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, తోపుడు బండ్లు అన్ని కలిపి 2వేల వరకు ఉంటాయని అంచనా. కానీ వారు బుక్ చేసే సిలిండర్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. విపరీతంగా కస్టమర్లు ఉన్న హోటళ్లలోనూ తక్కువ కమర్షియల్ సిలిండర్లు వాడారంటే అక్రమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా ఉన్న సంఖ్యకు వారు వినియోగిస్తున్న కమర్షియల్ సిలిండర్ల మధ్య భారీ వ్యత్యాసాలున్నాయని పక్కా సమాచారం. విద్యార్థుల వద్ద లక్షల్లో ఫీజులు వసూలు చేసే పలు విద్యాసంస్థల్లో సైతం రాయితీ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను పరిగణనలోకి తీసుకుంటే నెలకు సుమారు 10వేల సిలిండర్ల వినియోగం జరగాలి. కేవలం వందల్లోనే కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో సగటున ఒక నెలకు 20వేల సిలిండర్లు పక్కదారి పడుతున్నాయని సమాచారం. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కేవలం గృహాల్లో మాత్రమే వినియోగించాలి. కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వ్యాపారులు వినియోగించాలి. తనిఖీలు చేసి చర్యలు చేపడతాం. – నర్సింగరావు, కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల అధికారిప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రోడ్డులో టీఎస్02యుబి4971 నంబర్ గల ఆటోలో సిలిండర్లను తరలిస్తుండగా సదరు ఆటో డ్రైవర్ డ్రెస్‌కోడ్ లేకుండా గ్యాస్ డెలివరీ చేశారు. గ్యాస్ రీపేర్ చేసే దుకాణంలో గ్యాస్ బండ వేయగా అదేంటని శ్రీసాక్షిశ్రీ ప్రశ్నించగా సమాధానం దాటవేశాడు. విజయభారత్ గ్యాస్ ఏజెన్సీ అని, అదొక్కటే బ్లాక్‌లో వేశానని చెప్పుకొచ్చారు. -
యూరియా ఏ‘దయా’
ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌లో యూరియా అందక అన్నదాతలు బుధవారం ఆందోళనకు దిగారు. రైతులు మాట్లాడుతూ వరినార్లు పోసుకొని నెలరోజులు గడుస్తున్నా యూరియా అందక నార్లు ముదిరిపోతున్నాయన్నారు. మూడు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా దొరకడం లేదన్నారు. అధికారులు స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. గత సీజన్లోనే యూరియా దొరక్క దిగుబడి పడిపోయిందని, ఇప్పుడు కూడా సమయానికి ఇవ్వకపోతే పరిస్థితి ఏందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద లింగాపురంలో లైన్.. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురంలో పీఏసీఎస్ ఎరువుల గోదాము ఎదుట యూరియా కోసం రైతులు లైన్లో బుధవారం వేచి ఉన్నారు. గోదాం ఇన్చార్జి రవి మాట్లాడుతూ ఇప్పటివరకు పెద్ద లింగాపురంలో మూడువేల యూరియా బస్తాలు పంపిణీ చేశామని, ఎలాంటి కొరతలేదని తెలిపారు. –ఎల్లారెడ్డిపేట/ఇల్లంతకుంట -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని, అధికారులంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే సాధ్యమవుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ‘ఆపరేషన్ స్మైల్–2026’పై స మీక్ష నిర్వహించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శా ఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ లు చేయాలని ఆదేశించారు. ఆపరేషన్ స్మైల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఆర్డీవో గీత, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మెన్ అంజయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, సీడబ్ల్యూవో కవిత పాల్గొన్నారు. లూయిస్ బ్రెయిలీకి నివాళి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లూ యిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో కలెక్టర్ గరీమా అగ్రవాల్ పాల్గొన్నారు. దివ్యాంగులతో కలిసి బ్రెయిలీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి, పంపిణీ చేశారు. అభ్యంతరాలను పరిష్కరించాలి సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని ఓటర్ల జాబితా పై వచ్చిన అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. 12న వార్డుల వారీగా ఫొటో ఎలక్టరోల్స్ జాబితాను ప్రచురించడంతో పాటు, 13వ తేదీన డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల ప్రచురించాలన్నారు. శివరాత్రిలోగా పనులు పూర్తిచేయాలి సిరిసిల్లఅర్బన్: రానున్న శివరాత్రిలోగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు జంక్షన్ వద్ద రూ.3.10 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మున్సిపల్ డీవైఈఈ వాణి, ఏఈ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్ హోం పనులు వేగవంతం చేయాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండెపల్లిలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోం భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. బుధవారం మండెపల్లిలోని ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్, వృద్ధాశ్రమాలను సందర్శించారు. వృద్ధులకు పండ్లు ప ంపిణీ చేశారు. ఆశ్రమంలో వసతులు, భోజనం, ఆ రోగ్య అంశాలపై ఆరా తీశారు. వృద్ధుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాలియేటివ్ కేర్ వా హన సేవలను వినియోగించుకోవాలని అన్నారు. త్యాగరాజ ఉత్సవాలకు వృద్ధులను తీసుకెళ్లండి వేములవాడలో జరిగే త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలకు ఆశ్రమ వృద్ధులను తీసుకువెళ్లాలని జి ల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను కలెక్టర్ ఆదేశించారు. సర్పంచులు గదగోని సాగర్, గడ్డం రచన చో టు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వర్కర్ టూ ఓనర్ ప్రారంభించాలి
సిరిసిల్లటౌన్: నేత కార్మికులను యజమానులు చేయడానికి వర్కర్ టూ ఓనర్ పథకాన్ని సిరిసిల్లలో వెంటనే ప్రారంభించాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ కోరారు. బుధవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందిరా మహిళాశక్తి చీరలకు సంబంధించి 10శాతం యారన్ సబ్సిడీని పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు అందించాలన్నారు. కార్మికుల సమస్యల సాధన, సంక్షేమ పథకాల అమలుకై ఈనెల 9న బీవైనగర్‌లోని చేనేత శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిపై కత్తిపోట్లు
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామశివారులో నర్సింగాపూర్ గ్రామానికి చెందిన శశిప్రీతమ్పై అదే గ్రామానికి చెందిన శ్రీధర్ వివాహేతర సంబంధం అనుమానంతో కత్తితో దాడి చేసినట్లు వేములవాడరూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. తాపీమేసీ్త్రగా పనిచేస్తున్న శ్రీధర్ భార్య కరీంనగర్‌లోని ఓ మార్టులో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. శశిప్రీతమ్ కరీంనగర్‌లోని కారు షోరూంలో పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం శశిప్రీతమ్ భార్య వచ్చి శ్రీధర్ భార్యతో గొడవ పడ్డారు. ఈవిషయం తెలుసుకున్న శ్రీధర్ మాట్లాడుకుందామని శశిప్రీతమ్ను రమ్మన్నాడు. ఇద్దరు కలిసి బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని కొదురుపాక మీదుగా వస్తుండగా దేశాయిపల్లి గ్రామశివారులో శ్రీధర్ అనే వ్యక్తి శశిప్రీతమ్ను కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శశిప్రీతమ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని రూరల్ సీఐ శ్రీనివాస్ సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కలిగి ఉండాలిసిరిసిల్ల: ప్రతిఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రత చర్యలు పాటించాలని సిరిసిల్ల సహాయ రవాణాశాఖ అధికారి పృథ్వీరాజ్ వర్మ అన్నారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేట బైపాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్‌పై పాఠశాల విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పెయింటింగ్‌పై ఆచరణాత్మక ప్రదర్శన నిర్వహించి వివరించారు. జిల్లా రవాణా శాఖ సిబ్బంది రమ్య, సౌమ్యరాణి, ప్రశాంత్, ఎల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. రేషన్ డీలర్‌పై కేసు సిరిసిల్ల: పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని ఇందిరానగర్‌లో రేషన్ డీలర్‌పై పౌరసరఫరాల అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. రేషన్ డీలర్ ఆకునూరి అశోక్ షాపును పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ తనిఖీ చేశారు. సన్నబియ్యం 92.51 క్వింటాళ్లు, దొడ్డు బియ్యం 62.55 క్వింటాళ్లు, చక్కెర 87 కిలోల వ్యత్యాసం ఉంది. రేషన్ షాపులో ఉన్న నిల్వ సన్నం బియ్యం 31.50 క్వింటాళ్లు, చక్కెర 35 కిలోలు మాత్రమే ఉంది. స్టాకులో వ్యత్యాసం గురించి వివరాలు కోరగా సరైన సమాధానం రాలేదు. దీంతో రేషన్ షాపులోని సరుకులు సీజ్ చేసి మరో రేషన్ డీలర్ విజయకు అప్పగించారు. అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు పౌరసరఫరా అధికారులు పేర్కొన్నారు. -
జనశక్తి మాజీ నక్సలైట్ల అరెస్ట్
● 9ఎంఎం పిస్టల్, ఐదు బుల్లెట్లు స్వాధీనం ● నలుగురి అరెస్ట్ ● ఎస్పీ మహేశ్ బి గితే వెల్లడి సిరిసిల్ల: సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీకి చెందిన మాజీ నక్సలైట్లను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి వారి వద్ద 9 ఎంఎం పిస్టల్, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎస్పీ మహేశ్ బీ గితే వివరాలు వెల్లడించారు. తంగళ్లపల్లి మండలం రామన్నపల్లెకు చెందిన తోకల శ్రీకాంత్, జగిత్యాల జిల్లాకు చెందిన వంజరి సురేందర్ అలియాస్ విశ్వనాథ్ అలియాస్ బాదం సూర్యప్రకాశ్‌రెడ్డి, తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన దాసరి తిరుపతి, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన పయ్యావుల గోవర్దన్ అనే నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు గురిచేస్తూ డబ్బు వసూలు చేయడం, భూ వివాదాలలో జోక్యం చేసుకోవడం లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనాలని ప్రయత్నిస్తున్నారు. సమాచారం మేరకు తంగళ్లపల్లి గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అపి తనిఖీ చేయగా వీరివద్ద 9 ఎంఎం పిస్తోల్, 05 బుల్లెట్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, టాస్క్‌ఫోర్స్ సీఐ నటేశ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రవి, తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. నలుగురిలో ముగ్గురూ జనశక్తి మాజీలే.. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ముగ్గురు సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీకి చెందిన ముగ్గురు మాజీ నక్సలైట్లు ఉన్నారు. వంజరి సురేందర్ అలియాస్ విశ్వనాథ్ జనశక్తి పార్టీలో చాలా కాలం పని చేశారు. గతంలో సుద్దాల మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌రావు(ప్రభాకర్‌రావు) హత్య కేసులో ప్రధాన నిందితుడు. తోకల శ్రీకాంత్ సైతం గతంలో జనశక్తిలో పని చేశారు. గోవర్ధన్‌కు సైతం జనశక్తి పార్టీతో సంబంధాలు ఉన్నాయి. సారంపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దాసరి తిరుపతి కొత్తగా వారితో చేరడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. -
కుమారులు పోషించడం లేదు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కని, పెంచి, పెద్దచేసిన తర్వాత ఆస్తులు తీసుకున్న కుమారులు తమ పోషణ విస్మరించారని వృద్ధ దంపతులు కలెక్టర్, ఎస్పీలకు విన్నవించుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన అందె పోచయ్య(79), అందె లక్ష్మి(69) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వారి పెళ్లిళ్లు చేసిన తర్వాత కొడుకులు చెరో రెండెకరాలను బలవంతంగా రిజిస్ట్రే షన్ చేసుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. భూమి తీసుకున్నా.. పదేళ్లుగా సాగు చేయడంలేదు. దీంతో అది బీడుగా మారింది. తమ బతుకుదెరువు కోసం ఇటీవల ఆభూమిని వృద్ధ దంపతులు దున్నించేందుకు యత్నించగా.. పెద్దకొడుకు అడ్డుకున్నాడు. రూ.30వేల వరకు ఖర్చుచేసి వరి నారు పోస్తే పంట వేసుకోనివ్వడం లేదు. అందులో పంటలు వేసుకునే అవకాశం కల్పించేందుకు, ఇద్దరి కొడుకులను పిలిపించి మాట్లాడి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. పంచాయతీ అధికారులకు ప్రత్యేక శిక్షణతంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇటీవల కొత్తగా ఎన్నికై న సర్పంచులకు పంచాయతీ రాజ్ శాఖ చట్టాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లాల నుంచి పలువురు పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఎంచుకుని వారిని హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ప్రారంభించింది. ఈ శిక్షణకు సిరిసిల్ల జిల్లా నుం,చి డీఎల్పీవో వీరభద్రయ్య, ముస్తాబాద్ ఎంపీడీవో పుట్టి లచ్చాలు, బోయినపల్లి ఎంపీడీవో జయశీల, రుద్రంగి ఎంపీడీవో నటరాజ్, చందుర్తి ఎంపీవో ప్రదీప్, వేములవాడ ఎంపీవో రమేశ్, కోనరావుపేట ఏపీవో శ్రీనివాస్, తంగళ్లపల్లి టీఏ లక్ష్మణ్ గౌడ్ తరలివెళ్లారు. వీరు ఈనెల 9వరకు ప్రత్యేక శిక్షణ తీసుకుని అనంతరం జిల్లాలో సర్పంచులకు శిక్షణ తరగతులు చేపట్టనున్నారు. కలెక్టర్‌ను ఆశ్రయించిన వృద్ధ దంపతులు -
ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సేవలు
● పోలీసులు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ● ఎస్పీ మహేశ్ బి గీతేముస్తాబాద్(సిరిసిల్ల): పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి మెరుగైన సేవలు అందించగలుగుతారని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. బుధవారం ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో శ్రీతిరుమల నర్సింగ్‌హోం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. రేయింబవళ్లు శాంతిభద్రతల కోసం పనిచేసే పోలీసులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారన్నారు. అలాంటి వారి కోసం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 34 రకాల వైద్య పరీక్షలు, గుండె పరీక్షలు నిర్వహించారు. సీఐ మొగిలి, ఎస్సై గ ణేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చేరువగా పోలీసు విధులు ఇల్లంతకుంట: ప్రజలకు చేరువగా పోలీసు విధులు ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు, పలు రికార్డులు, స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించి క్రైం హాట్ స్పాట్స్ అడిగి తెలుసుకున్నారు. ప్రజల కు సత్వర న్యాయం, విజిబుల్ పోలిసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్,, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులను రివ్యూ చేసి ప లు సూచనలు చేశారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ మొగిలి, ఎస్సై అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల కేరీర్‌కు ఆరోగ్యమే ముఖ్యం ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యార్థుల కేరీర్‌కు ఆరోగ్యం దోహదం చేస్తుందని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. ముస్తాబాద్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. -
ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పాపయ్యపల్లె గ్రామంలో పొలంలో ప్రమాదవశాత్తు పడి వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన సలేంద్రి మల్ల య్య(65) అనే వృద్ధుడు మతిస్థిమితం సరిగా లేక భిక్షాటన చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 5న ఇంటిలో నుంచి వెళ్లిన మల్లయ్య బుధవారం ఉదయం పాపయ్యపల్లెలోని ఓ రైతు పొలంలోని బురదలో పడి మృతిచెంది కనిపించాడు. మొదట గుర్తుతెలియని మృతదేహంగా సోషల్ మీడియాలో పోలీసులు పోస్టు చేయగా సిరిసిల్లకు చెందిన వాడిగా ఆచూకీ లభించింది. దీంతో మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. ట్రాక్టర్‌పై నుంచి పడి వ్యక్తి..బోయినపల్లి: మండలంలోని మాన్వాడ గ్రామానికి చెందిన బత్తిని దేవయ్య (48)ట్రాక్టర్‌పై నుంచి పడి మృతిచెందినట్లు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన దేవయ్య ఇసుక రవాణా అనుమతులతో డ్రైవర్ సాయంతో ఇసుక జారవేస్తాడు. వెంకట్రావుపల్లిలో బైక్ పెట్టి ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వేణుతో కలిసి కొదురుపాకలో ఇసుక ట్రిప్ పోసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా వెంకట్రావుపల్లి వద్ద ట్రాక్టర్ బ్రేక్ వేయడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం దేవయ్యను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్యగంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన మేళ్ల నారాయణ(64) అనారోగ్య సమస్యల కారణంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ కొంత కాలంగా కిడ్నీ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి పొలం వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఉరేసుకొని వ్యక్తి..తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బస్వాపూర్‌కు చెందిన సుధగోని పరశురాములు (48) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీత కార్మికుడిగా పనిచేస్తున్న పరశురాములు ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యం పాలవడంతో మానసికంగా కృంగిపోయి బాత్రూంలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య మంగవ్వ, కూతురు, కొడుకు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. -
విలీన గ్రామాల్లో ఇష్టారాజ్యం
‘ఇది వేములవాడ మున్సిపాల్టీలోని ఓ వార్డులో ప్రధాన రహదారి పక్కన జరుగుతున్న ఇంటి నిర్మాణం. దీని కోసం మున్సిపాల్టీలో దరఖాస్తు చేసుకున్న యజమాని సర్వేనంబర్ ఒక ప్రాంతంలో చూపించి మరో ప్రాంతంలో నిర్మాణం చేపడుతున్నట్లు ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. కాగా, విలీన గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొంత మంది మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగుల సహకారంతో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుంట లేరనే ఆరోపణలున్నాయి.’ -
గ్రామాభివృద్ధికి
ఉపాధి..హామీ!కేటాయించిన నిధులు: రూ.349.71 కోట్లుపక్కా భవనాలులేని పంచాయతీలు: 81ఈ ఏడాది గుర్తించిన పనులు: 315భవనాల్లేని అంగన్వాడీ కేంద్రాలు: 140సిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి.. కొత్తగా పాలకవర్గాలు కొలువుదీరాయి. సర్పంచ్‌గా ఎన్నికై నందుకు సంబరంగా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలకు నిధుల కొరత వెంటాడుతుండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సవాలే. ఈ పరిస్థితుల్లో ఉపాధిహామీ పథకం అండగా నిలుస్తోంది. పక్కాగా, ప్రణాళికబద్ధంగా పనులు చేయించగలిగితే కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, పల్లెలను ప్రగతి దిశగా తీసుకుపోవచ్చు. గతంతో పోలిస్తే పథకంలో కొన్ని మార్పులు చేశారు. పథకంపేరు మార్చడంతో పాటు పనిదినాలు 100 నుంచి 1,25కు పెంచారు. 266 పనులు అదనంగా గుర్తించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాటిపై సర్పంచులు దృష్టిసారిస్తే గ్రామాభివృద్ధి ఇట్టే సాధ్యం.ఉపాధి కూలీలు: 1.95 లక్షలుమరుగుదొడ్లులేని కుటుంబాలు: 516జాబ్‌కార్డులు ఉన్నవారు: 97 వేలుపంచాయతీలు: 260‘దారి’ వేసుకోవచ్చు గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పంట పొలాలకు దారులు లేని ప్రాంతాలకు ఉపాధి పథకం కింద పొలం బాటలు వేసుకోవచ్చు. ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలవుతుంది. గ్రామంలో పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం లేకుంటే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకునే వీలుంది. హరితహారం పెంచాలి గ్రామాల్లో మొక్కలునాటి హరితవనం పెంపొందించేందుకు వీలుంది. పంచాయతీల్లో నర్సరీ అందుబాటులో ఉంటుంది. గుంతలు తవ్వడం మొదలు, మొక్కలు నాటడం.. పోషణకూ డబ్బులు ఇస్తున్నారు. నీటిని నిల్వచేసుకోవచ్చు సాగు భూముల్లో కాంటూరు కందకాలు, ఊటకుంటలు, పాంపాండ్స్, చెక్ డ్యాంలు, రాళ్లకట్టలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని పక్కాగా పనులు పూర్తిచేస్తే.. భూగర్భ జలమట్టం పెరుగుతుంది. స్వచ్ఛ గ్రామాలుగా ముందుకెళ్లొచ్చు గ్రామాలను సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉంది. మరుగుదొడ్ల నిర్మాణంలో అవసరమైన గుంతలను కూలీలతో తవ్వించి, ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించవచ్చు. సాగు.. బాగు.. గ్రామాల్లో చెరువులు, చెక్‌డ్యాంలు, ఊటకుంటలు, ప్రాజెక్టు కాల్వల నుంచి పూడిక తీసుకునేందుకు అవకాశం ఉంది. కూలీలతో పనులు చేయిస్తే వారికి ఉపాధి చూపడంతో పాటు ఇటు నీటి వనరులు బాగు చేసుకోవచ్చు. సాగునీటి సమస్య లేకుండా చేసుకోవచ్చు. వీరిని సంప్రదించండి ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు మండలస్థాయిలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. జిల్లాలో పీడీతో పాటు ఏపీడీ, మండలాల్లో ఏపీవో, సాంకేతిక సహాయకులు, గ్రామాల్లో క్షేత్ర సహాయకులు ఉంటారు. మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనుల గుర్తింపు, ఎంపిక, ఆమోదం, మంజూరు ఉంటాయి. -
● అనుమతులు ఒక చోట.. నిర్మాణాలు మరో చోట ● పట్టించుకోని అధికారులు
వేములవాడరూరల్: వేములవాడ మున్సిపాల్టీలో విలీనమైన శాత్రాజుపల్లి, కోనాయపల్లి, అయ్యోరుపల్లి, తిప్పాపూర్, నాంపల్లి తదితర గ్రామాల్లో ఇష్టారాజ్యంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి సెట్‌బ్యాక్ లేకుండా అనుమతి ఒకచోట, నిర్మాణం మరోచోట చేపడుతున్నారని పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కొంతమంది ఉద్యోగులు సంబంధిత ఇళ్ల యజమానుల వద్ద ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జోరుగా నిర్మాణాలు.. మున్సిపల్ పాలకవర్గం ముగిసి ఏడాది గడిచింది. పాలకవర్గం లేకపోవడంతో కొంత మంది అధికారులకు ముడుపులు అప్పగించి ఇష్టారీతిన ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని కొంతమంది యజమానులు నిబంధనలు పాటించకుండా నూతన నిర్మాణాలు జోరుగా చేపడుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మాజీ కౌన్సిలర్లదే పెత్తనం వేములవాడ మున్సిపాల్టీలో 5 గ్రామాలు విలీనం కాగా వార్డుల సంఖ్య 28కి చేరింది. కొంతమంది మాజీ కౌన్సిలర్ల ప్రమేయంతోనే అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అనుమతులకు ఇబ్బందిగా ఉంటుందని ఇంటి యజమానులు, పాలకులు, అధికారులకు అడిగినంత అప్పజెప్పి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. -
కందేపికి ఆంధ్ర సారస్వత పురస్కారం
సిరిసిల్లటౌన్: పట్టణంలోని సృజన్ పిల్లల ఆసుపత్రి నిర్వహణకు గాను ఎండీ డాక్టర్ కందేపి రాణిప్రసాద్కు భాష సేవా పురస్కారం వరించింది. మంగళవారం గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు సభల్లో త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాన్ని అందుకున్నారు. కర్ణాటక రాష్ట్ర మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్, మహా సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ శాలువా, గోల్డ్‌మెడల్ అందించారు. రాణిప్రసాద్ పురస్కారం అందుకోవడం మన జిల్లాకు గర్వకారణమని రచయితలు పేర్కొన్నారు. తాము పాతికేళ్లుగా చేస్తున్న తెలుగు భాష కృషికి గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. మహాసభలలో అనేక మంది గవర్నర్లు, మారిషస్ దేశాధినేత, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
త్యాగరాజ ఉత్సవాలకు రండి
వేములవాడ: రాజన్న క్షేత్రంలో ఈనెల 8 నుంచి 12 వరకు జరిగే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలకు హాజరుకావాలని ఈవో రమాదేవి, అర్చకుల బృందం మంగళవారం అసెంబ్లీలోని చాంబర్లో విప్ ఆది శ్రీనివాస్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. అనంతరం అర్చకులు చంద్రగిరి శరత్‌శర్మ, నమిలికొండ రాజేశ్వరశర్మ, తమ్మల వెంకన్న ఆశీర్వచనం గావించి ప్రసాదం అందజేశారు. బాలికలు అన్నిరంగాల్లో ముందుండాలిసిరిసిల్లఅర్బన్: బాలికలు చదువుతోపాటు, అన్నిరంగాల్లో ముందుండాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. బాల వివాహ ముక్త్ భారత్‌లో భాగంగా మంగళవారం పట్టణ పరిధిలోని చంద్రంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. బాలికల రక్షణకు షీ టీంలు, యంగ్ ఇండియా స్కూల్స్, పలు రకాల చట్టాలపై వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని చదువులో ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించాలన్నారు. మహిళా సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలిఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌వో ఎస్.రజిత అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గర్భి ణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశాలు అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలని, లేకుంటే నోటీసులు జారీ చేయబడతాయని హెచ్చరించారు. ఆమె వెంట ఎంహెచ్ ఎన్ ప్రోగ్రాం అధికారి నాగేంద్రబాబు, వైద్యాధికారి జీవనజ్యోతి ఉన్నారు. మేడారం జాతరకు ప్రత్యేక బస్సులుసిరిసిల్లటౌన్: మేడారం జాతరకు సిరిసిల్ల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.రాజు పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్ల డిపోలో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాతర నిర్వహణకు సంబంధించి పాటించాల్సిన సూచనలు, భద్రతా నియమాలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఉద్యోగులకు సదుపాయాలపై వివరించారు. ఆర్టీసీ డిప్యూ టీ రీజినల్ మేనేజర్ భూపతిరెడ్డి, డిపో మేనేజర్ ఎ.ప్రకాష్‌రావు, అన్ని కేటగిరీలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు సిరిసిల్ల: రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఏఎంవీఐ బేతి రజని అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం సిరిసిల్లలోని రెయిన్బో, శ్రీకృష్ణవేణి, కాకతీయ హైస్కూళ్లలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరికి వారు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుంటే ప్రమాదాలు జరగవన్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగానే అనే ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. రిటైర్డ్ అధ్యాపకులు మద్దికుంట లక్ష్మణ్, పిల్లి ధర్మయ్య జిల్లా రవాణాశాఖ మెంబర్ సంగీతం శ్రీనాథ్, ఏఎంవీఐ పృథ్వీరాజ్‌వర్మ, రవాణా శాఖ సిబ్బంది సౌమ్య, రమ్య, ప్రశాంత్ పాల్గొన్నారు. -
నెలరోజుల్లో 280 ఇళ్లు ప్రారంభించాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలోని ఎంపీడీవోలు నిత్యం పది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ముగ్గు పోసినవారితో ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. లబ్ధిదారులకు ఇటుక, ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా, సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలన్నారు. లబ్ధిదారుల నుంచి ఇంటి నిర్మాణ పనుల అడ్వాన్స్ తీసుకొని వెళ్లిపోయిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బోయినపల్లి మండలంలో 23, తంగళ్లపల్లి మండలంలో 14 ఇళ్లు పూర్తి చేసిన ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులను అభినందించారు. నెలరోజుల్లో జిల్లాలో 280 ఇళ్ల ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్, మండల ప్రత్యేక అధికారులు గీత, అఫ్జల్‌బేగం, లక్ష్మీరాజం, రవీందర్‌రెడ్డి, హనుమంతు, షరీఫోద్దీన్, రామకృష్ణ, క్రాంతి, నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సర్వే పరికరాలతో కచ్చితమైన భూకొలతలు అధునాతన పెన్‌టెక్స్ రోవర్స్ సర్వే పరికరాలతో ఇళ్ల స్థలాల కచ్చితమైన కొలతల వివరాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ గరీమా అగ్రవాల్ వెల్లడించారు. సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ హైదరాబాద్ నుంచి కేటాయించిన మూడు పెన్‌టెక్స్ రోవర్స్ సర్వే పరికరాలు జిల్లాకు చేరుకున్నాయి. మంగళవారం వాటి పనితీరును కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, భూ సర్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఇంటి సరిహద్దులు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఇతర ఖాళీ స్థలాల విస్తీర్ణం వివరాలు ఈ పరికరం ద్వారా సర్వే చేస్తారని, ఆ వివరాలు శాటిలైట్‌లో నమోదు చేయడంతో కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. పరికరాలపై జిల్లాలోని ఇద్దరు డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు వెంకటాచారి, వెంకటరత్నం, ఐదుగురు సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లకు కంపెనీ బాధ్యులు మూర్తి శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
సద్వినియోగం చేసుకుంటాం
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులకు తోడుగా ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. గ్రామాల్లో లింకురోడ్లు, సిమెంట్ రోడ్లు, మురికి కాల్వలు, ఇతర అన్ని పనుల్లో ఉపాధి హామీ కూలీలను భాగస్వాములను చేస్తూ పనులు చేస్తాం. స్థానిక వనరులను వినియోగించుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీల ఆదాయ వనరులను పెంచుకుంటాం. మా ఊరి అభివృద్ధికి ఉపాధి హామీని, రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులను పూర్తి స్థాయిలో వినియోగించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. – షేక్ యాస్మిన్‌పాషా, సర్పంచ్, బావుసాయిపేట -
ఫైర్ స్టేషన్ మంజూరు చేయండి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండలకేంద్రానికి ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అసెంబ్లీలో విన్నవించారు. ఫైర్ స్టేషన్లు ఉన్న కోరుట్ల, వేములవాడ పట్టణాలు రుద్రంగికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా పట్టణాల నుంచి ఫైరింజన్లు వచ్చేసరికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని కోరారు.సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకుడు, స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌శర్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం సంతాపం తెలిపారు. రాజన్న ఆలయానికి భీమాశంకర్ అందించిన సేవలు మరువలేనివని, గతంలో తాము ఆలయాన్ని సందర్శించినప్పుడు దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆయన మరణం భక్తులకు, వేములవాడ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
బాధితులకు సత్వర న్యాయం
సిరిసిల్ల క్రైం: బాధితులకు సత్వరన్యాయం ద క్కేలా గ్రీవెన్స్‌డేలో వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నా రు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో 28 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాల్సిందిగా సంబంధిత పోలీ స్స్టేషన్ల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వేములవాడఅర్బన్: మైనర్ల డ్రైవింగ్ చట్ట విరుద్ధమని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రజనీదేవి పేర్కొన్నారు. వేములవాడ నందికమాన్ వద్ద ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూ ల్లో మోటార్ వాహన నిబంధనలపై సోమవారం అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమించడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. సహా యక మోటారు వాహనల తనిఖీ అధికారి పృథ్వీరాజ్‌వర్మ తదితరులు ఉన్నారు. సిరిసిల్లటౌన్: రిటైర్డ్ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీ నేపథ్యంలో సిరిసిల్లలో పోలీసులు ముందస్తుగా ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి ధ్యానపల్లి పరమేశ్్, కార్యదర్శి మద్దికుంట లక్ష్మణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. మల్లారపు పురుషోత్తం మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలపై ప్రశ్నిస్తే స్పందన లేదన్నారు. ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సిరిసిల్లటౌన్: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర నిర్వీర్యం చేస్తుందని సీపీఐ జిల్లా నాయకుడు గుంటి వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో సోమవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. 2005లో ప్రారంభమైన ఈజీఎస్ పథకం ద్వారా దేశంలో 12 కోట్ల మందికి పట్టెడన్నం దొరుకుతుందన్నారు. పేదలకు తిండి పెట్టే పథకాన్ని కాదని ఈజీఎస్ రాంచరణ్ కొత్త పథకాన్ని తీసుకురావడం అన్యాయమన్నారు. రాజు, మల్లేశం, బాలరాజు, చంద్రం, శేఖర్, ఆనందు, బాలయ్య, మల్లయ్య పాల్గొన్నారు. సిరిసిల్లకల్చరల్: సరిహద్దుల్లో పహారా కాస్తూనే తీరిక సమయాల్లో కవిత్వాలు రాస్తు న్న అక్షర సైనికుడు పెరుక రాజును విశిష్ట కవిరత్న పురస్కారం వరించింది. నవభారత కళాక్షేత్రం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేశారు. అతిథులు మాట్లాడుతూ దేశ రక్షణ విధులు నిర్వహిస్తూనే కవి, రచయితగా రాణించడం గర్వకారణమన్నారు. కోనరావుపేట(వేములవాడ): మండలంలోని గ్రామాల్లో చిరుత సంచారంతో గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని శివంగాలపల్లికి చెందిన గొర్లకాపరి బొడ్డు శంకర్‌కు చెందిన గొర్రైపె చిరుత దాడి చేసింది. అది అరవడంతో వదిలిపెట్టి వెళ్లింది. -
రబీకి నీటిని విడుదల చేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నుంచి రబీ పంటలకు నీటిని విడుదల చేయాలని కలెక్టర్ గరీ మా అగ్రవాల్ ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటి మట్టాలు, ప్రణాళికపై సోమవారం కలెక్టరేట్లో సమీక్షించారు. ముందుగా ఎగువ, మిడ్‌మానేరు ప్రాజెక్టులు, మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లలో నీటిమట్టం వివరాలపై ఆరా తీశారు. మల్కపేట రిజర్వాయర్, ఎగువ మానేరులో 1.8 టీఎంసీలు, అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 3.30 టీఎంసీలు, మిడ్‌మానేరులో 26.65 టీఎంసీల నీరు నిలువ ఉందని నీటిపారుదల అధికారులు వివరించారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, నీటి పారుదల శాఖ అధికారులు కిశోర్‌కుమార్, జగన్, సంత్ప్రకాశ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. కులాంతర పెళ్లికి ప్రోత్సాహక బాండ్ పంపిణీ కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ.2.50 లక్షల ప్రోత్సాహక బాండ్‌ను కలెక్టర్ అందజేశారు. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన జక్కుల జిల్లాలో మొత్తం 180 దరఖాస్తులు రాగా.. 57 మందికి రూ.1.42 కోట్లు పంపిణీ చేశామని, మరో 11 మందికి త్వరలో ఇస్తామని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. -
రాజన్న సిరిసిల్ల
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 20267వేములవాడ: ఫిబ్రవరి 15న వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు ముందుగా శివదీక్షలు చేపడతారు. సోమవారం దాదాపు 500 మంది శివదీక్షలను చేపట్టారు.సిరిసిల్లటౌన్: శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు సోమవారం ముగిశాయి. గోవింద నామస్మరణలతో మారుమోగింది. వాతావరణం ప్రకాశవంతంగా ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. -
పారదర్శకంగా ఓటరు జాబితా
● సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు సిరిసిల్లటౌన్/వేములవాడ: ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందిస్తున్నట్లు సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఎంఏ ఖాదీర్‌పాషా, అన్వేశ్ తెలిపారు. ఈమేరకు సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్ని రాజకీయ పార్టీలతో ఓటరు జాబితా పరిశీలన, సవరణలపై సమీక్షించారు. వార్డుల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తున్నట్లు తెలిపారు. జాబితాలో సవరణలు, తప్పొప్పులు ఉంటే సూచించాలని కోరారు. డబుల్ ఎంట్రీలు, మరణించిన వారి వివరాలు తెలియజేయాలన్నారు. ఈనెల 9 వరకు సవరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు సలహాలు, సూచనలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్, జిందం చక్రపాణి, దుమాల శ్రీకాంత్, వేములవాడ మేనేజర్ సంపత్‌రెడ్డి పాల్గొన్నారు. -
నేతల చూపు!
రిజర్వేషన్ల వైపు..సిరిసిల్ల: మున్సిపాలిటీల్లో వార్డులు, చైర్మన్ పదవుల రిజర్వేషన్లపై నేతలు దృష్టి సారించారు. రిజర్వేషన్ కలిసొస్తే పోటీలో దిగేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు వెల్లడించారు. మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలతో ఆశావహులు ఉన్నారు. 2025 జనవరితో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోగా.. ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్న తరుణంలో మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలు, వార్డుల రిజర్వేషన్లు చర్చనీయాంశమైంది. మహిళా ఓటర్లే అధికం సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో 2,069 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండగా.. వేములవాడలో 1,699 మంది ఎక్కువగా ఉన్నారు. వార్డుల వారీగా పరిశీలించినా మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. గెలుపోటములు నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ సీటుపై గురి సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలను ఏ సామాజిక వర్గాలకు రిజర్వు చేస్తారనే చర్చ సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో మున్సిపాలిటీల సంఖ్య ఆధారంగా ఓటర్ల సంఖ్య ఆధారంగా మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్ కల్పిస్తారు. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాలను బీసీ మహిళలకు కేటాయించారు. అప్పుడు జిందం కళాచక్రపాణి, రామతీర్థపు మాధవి పాలన పగ్గాలు చేపట్టారు. ఈసారి కలిసొస్తే వార్డు కౌన్సిలర్‌గా గెలిచి చైర్మన్/చైర్పర్సన్ సీటుపై కూర్చోవాలని పలువురు దృష్టి సారించారు. ఈమేరకు పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. సిరిసిల్లలో రెండు దశాబ్దాలుగా మహిళలకు కేటాయిస్తుండగా, వేములవాడలో కాస్త భిన్నమైన రిజర్వేషన్లు వచ్చాయి. వార్డుల రిజర్వేషన్లపై కూడా ఉత్కంఠ నెలకొంది. మున్సి‘పల్స్’పై పార్టీ నజర్ ● మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్ల నాడి పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఇప్పటికే స్థానిక బీఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా పోటీదారులపై ఆరా తీశారు. మెజార్టీ స్థానాలు సాధించి గులాబీజెండా సిరిసిల్ల మున్సిపాలిటీపై ఎగురవేయాలని సూచించారు. ● కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని బీజేపీ ముఖ్యమైన నాయకులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తే కాషాయం జెండా ఎగరడం ఖాయమనే స్పష్టం చేశారు. ● వేములవాడలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో సమావేశమై.. మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. సిరిసిల్లలోనూ మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని వ్యూహం రూపొందిస్తున్నారు. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే పార్టీ టిక్కెట్ ఇస్తుందని, పార్టీపరంగా సర్వే చేసిన తర్వాతే టిక్కెట్ల పంపిణీ ఉంటుందని ఆయా పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ సహితంగా బీ–ఫామ్‌లతో జరిగే మున్సిపల్ ఎన్నికలు ఆయా రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. 2020లో సర్‘కారు’ జోరు సిరిసిల్లలో 22 స్థానాల్లో, వేమువాడలో 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించి చైర్పర్సన్ స్థానాలను దక్కించుకుంది. అధికార బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా విజయం సాధించారు. ఎన్నికల తరువాత 9 మంది బీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు, మరో ముగ్గురు ఇండిపెండెట్లు అధికార బీఆర్ఎస్లో చేరడంతో మున్సిపాలిటీలో కౌన్సిలర్ల బలం 34కు చేరింది. సిరిసిల్లలో ముగ్గురు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. వేములవాడలో 16 స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఆరు స్థానాల్లో బీజేపీ, ఒక్క స్థానంలో కాంగ్రెస్, ఐదు స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఇలా 2020 నాటి మున్సిపాల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ సత్తాచాటుకుంది.మున్సిపల్ వార్డులు ఓటర్లు మహిళలు పురుషులు థర్డ్ జెండర్ సిరిసిల్ల 39 81,959 42,011 39,942 06 వేములవాడ 28 40,877 21,279 19,580 18 -
తెర్లుమద్దికి ఏమైంది?
● పక్షం రోజుల్లో పది మంది మృతి ● ‘తెర్లు’ అవుతున్న కుటుంబాలు ● భయాందోళనలో గ్రామస్తులు ● వ్యాధులే కారణమా? ● మరణాలపై అన్వేషణఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధ దంపతులు ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన దాదగారి అంజవ్వ, నర్సయ్య. మరణించిన భర్త రమేశ్ ఫొటోతో ఉన్నది బాల్‌లక్ష్మి. వృద్ధ దంపతుల కుమారుడు దాదగారి రమేశ్(45) పక్షవాతంతో మృతిచెందాడు. రమేశ్ తల్లిదండ్రులు అంజవ్వ, నర్సయ్య కూడా పక్షవాతంతో మంచం పట్టారు. వ్యవసాయ పనులు చేసుకునే రమేశ్ పలు వ్యాపారాలు సైతం నిర్వహించి నష్టపోయాడు. తీవ్ర మనోవేదన, టెన్షన్‌తో పెరాలసిస్‌కు గురయ్యాడు. చికిత్స కోసం ఎకరం భూమి అమ్మడంతోపాటు రూ.5లక్షలు అప్పులు చేసినా ప్రాణం దక్కలేదు. కొడుకు పోయిన దుఖంలో నెలరోజుల వ్యవధిలో వృద్ధ దంపతులకు పక్షవాతం వచ్చింది. ఇప్పుడు వారికి చికిత్స చేయించే స్థోమత లేని కోడలు బాల్‌లక్ష్మి బీపీ టాబ్లెట్లతోనే అత్తామామలను పోషిస్తోంది. బాల్లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. వీరిని ఎలా పోషించేదని, పెరాలసిస్‌తో ఉన్న అత్తామామలను ఎలా కనిపెట్టుకునేదని ఆవేదన చెందుతోంది. పెరాలసిస్ తమ జీవితాలను తలకిందులు చేసిందని రోదిస్తోంది. ముస్తాబాద్(సిరిసిల్ల): వరుస మరణాలతో ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది వణికిపోతుంది. ఎప్పుడు.. ఎవరూ మరణిస్తున్నారో తెలియక గ్రా మీణులు భయాందోళన చెందుతున్నారు. మరణా లకు కారణాలకు బహిరంగంగా తెలుస్తున్నా ఎన్న డూ లేని విధంగా పదిహేను రోజుల్లోనే పది మంది ప్రాణాలు కోల్పోవడం గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది. దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్యం కారణాలు పైకి కనిపిస్తున్నా మరణాల సంఖ్య అధికంగా ఉండడమే వారి భయాందోళనకు కారణం. ఉసురుతీస్తున్న పెరాలసిస్ తెర్లుమద్దిలో పెరాలసిస్‌తో బాధపడుతున్న వారు పక్షం రోజుల్లో ముగ్గురు మృతిచెందారు. గ్రామానికి చెందిన చెక్కపల్లి లక్ష్మి, ఉల్లి కొమురవ్వ, మామిండ్ల వెంకవ్వ పక్షవాతంతో బాధపడుతూ మృతిచెందారు. వీరంతా కొన్నేళ్లుగా పక్షవాతంతోనే బాధపడుతున్నారు. అయితే వరుసగా చనిపోతుండడంపై ఆందోళన నెలకొంది. కాలేయ వ్యాధితో ఈర్ల బాబు(38) మృతిచెందగా, కొమ్మెట రమేశ్(33) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మదునూరి మల్లవ్వ(72) గుండెపోటుతో, చలి తీవ్రతతో పుట్ట నారాయణ(75) మృతిచెందాడు. నారాయణ ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే అంత్యక్రియలు నిర్వహించారు. పుట్ట రమేశ్ ఆత్మహత్య చేసుకోగా, మామిండ్ల రామస్వామి గొంతు క్యాన్సర్, బైతి రాజయ్య విద్యుదాఘాతంతో చనిపోయారు. వెగ్గళం లక్ష్మీనారాయణ(82), దానవేని పెద్ద మల్లయ్య(81) వృద్ధాప్య సమస్యలతో మృతిచెందారు. బైతి లక్ష్మి(90) చలిని తట్టుకోలేక మృతిచెందింది. రెండు నెలల వ్యవధిలో ఈ మరణాలు సంభవించాయని సర్పంచ్ బైతి దుర్గవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధులతోనే మరణాలా..?! తెర్లుమద్ది వ్యవసాయ ఆధారిత గ్రామం. మానేరు ప్రాజెక్టు పరివాహక పరిధిలో ఉంటుంది. ఒక పక్క అందమైన గుట్టలు. మరోపక్క నక్కవాగు ప్రవాహతో ఊరు పచ్చగా కళకళలాడుతుంటుంది. వరి ప్రధానంగా సాగుచేస్తున్నారు. గ్రామంలో 2007లో పంచాయతీలో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంటు ద్వారా తాగునీరు తీసుకెళ్తున్నారు. మిషన్ భగీరథ నీరు నాలుగురోజులకోసారి కూడా రావడం లేదు. ఎవరైన మరణిస్తే పది రోజుల్లో మరో వ్యక్తి కూడా మృతి చెందుతున్నాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఓ కుటుంబంలో పెద్ద దికై ్కన నలుగురు పురుషులు పదేళ్లలో మృత్యువాత పడ్డారు. గ్రామంలో రకరకాల కారణాలతోనే వరుస మరణాలు సంభవిస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. జనాభా: 1596 (2011 లెక్కలు) పురుషులు: 807, మహిళలు: 789 దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పెరాలసిస్ : 06, క్యాన్సర్: 03గ్రామంలో పలు రకాల వ్యాధులతోనే మరణాలు సంభవిస్తున్నాయి. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. చలి, గుండెపోటు, పెరాలసిస్తోనే మరణాలు సంభిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో సర్వే చేయిస్తాం. – డాక్టర్ రాజ్‌కుమార్, పల్లెదవాఖాన, వైద్యాధికారిరోజుల వ్యవధిలోనే పలువురు మృతిచెందడం బాధాకరం. వారి మరణం కుటుంబాలలో తీవ్ర విషాదం మిగిల్చింది. వరుస మరణాలతో ప్రజలు భయపడుతున్నారు. మేము వ్యాధిగ్రస్తులను గుర్తించి ధైర్యం చెబుతున్నాం. మంచి వైద్యం కోసం అవగాహన కల్పిస్తున్నాం. వైద్యశాఖ దీనిని సీరియస్‌గా తీసుకుని కారణాలను అన్వేషించాలి. – బైతి దుర్గవ్వ, సర్పంచ్, తెర్లుమద్ది -
తగ్గేదెలే..తవ్వుడే !
చందుర్తి(వేములవాడ): చీకటి పడితే చాలు మట్టి, ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. తమ పంట పొలాలకు నష్టం జరుగుతుందని అడ్డుకోబోతే అంతుచూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక రైతులు కుమిలిపోతున్నారు. మార్కెట్లో మట్టి, ఇసుకకు డిమాండ్ ఉండడంతో చందుర్తి సర్కిల్ పరిధిలోని ఒర్రెలు, కుంటల్లోని నుంచి ఇసుకను, ప్రభుత్వ భూముల్లో నుంచి, ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువ మట్టిని తరలించుకుపోతున్నారు. జోరుగా దందా చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో రాత్రింబవళ్లు మట్టి, ఇసుక తరలిపోతుంది. గతంలో చందుర్తి సర్కిల్ పరిధిలో మట్టి అక్రమ రవా ణాను కలెక్టర్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహాయంతో ట్రాక్టర్లు, జేసీబీలను సీజ్ చేయించిన సంఘటనలు ఉన్నాయి. కొన్ని రోజులుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కొరత సృష్టించి.. ధర పెంచి ! ఇళ్ల నిర్మాణాదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇసుక కొరత సృష్టిస్తున్నారు. అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని, ఇసుక దొరకడం లేదంటూ ధరలు పెంచేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.4,500 నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మట్టి అవసరం ఉన్న వారికి బాధలు మాత్రం వర్ణనాతీతం. గతంలో రూ.500 నుంచి రూ.700 లభించే మట్టికి ప్రస్తుతం ట్రాక్టర్‌కు రూ.1800 నుంచి రూ.2200 వరకు వసూలు చేస్తున్నారు. పోలీసుల కదలికలు తెలుసుకొని.. అక్రమ రవాణాలో ఆరితేరిన మాఫియాలోని కొందరు స్థానిక కానిస్టేబుళ్లతో సన్నిహితంగా ఉంటూ రాత్రి వేళ పెట్రోలింగ్ పార్టీల కదలికలు తెలుసుకుంటూ దందా చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు మూమూళ్లు ఇస్తున్నామంటూ చెప్పుకుంటేనే అక్రమ రవాణాకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చందుర్తి మండలంలో ఆశిరెడ్డిపల్లెలో గత 20 రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువ మట్టిని జేసీబీ, టిప్పర్ల సహాయంతో తోడేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వాహనాలు పట్టుబడినా ఇందిరమ్మ ఇళ్ల పేరిట వదిలేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉన్నతాఽధికారులకు అనుమానం రాకుండా అప్పడప్పుడు ఒకటి, రెండు ఇసుక, మట్టి వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చందుర్తిలో తెల్లవారుజామున ఇసుక తరలింపు‘ఆరు రోజుల క్రితం కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులోని అటవీ ప్రాంతంలో రుద్రంగి మండలం చింతామణితండాకు చెందిన గుగులోతు గంగాధర్ ఇసుక ట్రాక్టర్‌పై నుంచి పడి చనిపోయాడు. అక్రమంగా ఇసుక తరలిస్తూ వేగంగా పోవడంతోనే యువకుడు మరణించినట్లు తెలుస్తోంది. ’ ‘రుద్రంగి మండల కేంద్రానికి కథలాపూర్ మండలంలోని ఒర్రెలు, వాగుల్లో నుంచి ఇసుకను టిప్పర్లతో తరలిస్తున్నారు. ఇదంతా రాత్రి వేళల్లోనే తరలిపోతుంది. ఇందుకు ఇటీవల పోలీసులకు చిక్కిన టిప్పర్లే నిదర్శనం.’ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తప్పవు. ఎక్కడైనా మట్టి , ఇసుక రవాణా జరిగితే మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. రుద్రంగిలో ఇప్పటికే రెండు ఇసుక టిప్పర్లను సీజ్ చేశాం. ఇసుక అక్రమ డంప్‌లను రెవెన్యూ అధికారులకు అప్పగించాం. అక్రమ రవాణాదారులపై కఠినంగా వ్యవహరిస్తాం. – గాండ్ల వెంకటేశ్వర్లు, సీఐ, చందుర్తి -
అన్నింటికీ భీమేశ్వర సదన్
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో భీమేశ్వర సదన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనుల కారణంగా ఇటు ఈవో కార్యాలయం, ఇంజినీరింగ్ విభాగం, అకౌంట్స్ విభాగాలను భీమేశ్వరసదన్లోకి మార్చారు. దీంతో ఆలయ పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు, రోజువారీ కార్యకలాపాలు అన్నీ ఒకే చోట నుంచి సాగుతున్నాయి. ఉత్సవాలకు వేదిక కార్తీక దీపోత్సవం, హుండీ లెక్కింపులతోపాటు ఈనెల 7న నిర్వహించే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు కూడా భీమేశ్వర సదన్ వేదికగానే సాగుతున్నాయి. మహాజాతర ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు, రాజన్న ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశాలు భీమన్న సదన్‌లోనే నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు భక్తులకు విడిదిగా ఉన్న భీమేశ్వర సదన్ ఇప్పుడు రాజన్న ఆలయ పరిపాలన విభాగాలకు కేంద్రంగా మారింది. గతనెల 30న మహాశివరాత్రి జాతర మహోత్సవాల సమన్వయ కమిటీ సమావేశం సైతం భీమేశ్వర సదన్ పోర్టికోలోనే నిర్వహించారు. రూ.11కోట్లతో మూడంతస్తులు.. 80 ఏసీ గదులు నిర్మించిన భీమేశ్వర సదన్ ఇప్పుడు రాజన్న ఆలయ పరిపాలన కేంద్రంగా మారింది. -
చిన్నారి వైద్యానికి సాయం
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్‌కు చెందిన సూర వైష్ణిక వైద్యానికి పలువురు దాతలు ఆర్థిక సాయం చేస్తున్నారు. ‘సాక్షి’లో ఆదివారం ‘చిన్నారికి ‘ఊపిరి’ పోయండి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. గూడెం గ్రామానికి చెందిన పారిశ్రామివేత్త చిట్నేని వెంకేటశ్వర్రావు రూ.10వేలు అందించారు. మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు స్పందించి వైష్ణిక తండ్రి రాజశేఖర్‌తో మాట్లాడారు. సిద్దిపేటలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులతో చర్చించారు. వైష్ణికకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సుతో మాట్లాడారు. ఆయన ఆసుపత్రికి వెళ్లి బాధిత బాలికకు అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఖర్చు కోసం భయపడొద్దని, తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి చిన్నారికి వైద్యం అందేలా ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పొత్తూరులో లూజ్ విద్యుత్ తీగల సమస్యను పరిష్కరిస్తామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు. పొత్తూరులో విద్యుత్ పోల్స్ పరిస్థితి పరిశీలించిన తర్వాత మాట్లాడారు. గ్రామంలో మెయిన్ రోడ్డు వెంబడి ఉన్నటువంటి పోల్స్ సమస్యను కూడా సత్వరమే పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఎన్నికై న గ్రామ సర్పంచ్ పట్నం అశ్విని, పాలకవర్గ సభ్యులు చిక్కాల రామారావును, సెస్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డిని సన్మానించారు. మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, సిద్ధం శ్రీనివాస్, తోడేటి సతీశ్, పావని, మహేందర్, సాగర్, గుంటి మధు, కట్ట సాయి, కిరణ్, భీరయ్య పాల్గొన్నారు. కోనరావుపేట(వేములవాడ): ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క హామీని అమలు చేయలేదని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు విమర్శించారు. మండలంలోని నిజామాబా ద్‌కు చెందిన ఎన్నారై సింగం ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎదురుగట్ల అంజయ్యలతోపాటు వందమంది ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మండలంలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలన్నారు. సెస్ వైస్‌చైర్మన్ తిరుపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రయ్య, ప్యాక్స్ చైర్మన్ రాంమోహన్‌రావు, సర్పంచులు కుంటెల్లి నాగరాజు, మల్యాల స్వామిదాసు, వంశీకృష్ణా రావు, వంగపెల్లి శ్రీనివాస్, శివతేజ, మంతెన సంతోష్, రాజిరెడ్డి, భూంరెడ్డి పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రను ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు కోరారు. మండలంలోని బందనకల్‌లో ఉపాధిహమీ కూలీలతో ఆదివారం మాట్లాడారు. పల్లెల్లో పనులు కరువైన భూములు లేని నిరుపేదలే ఉపాధిహామీలో ఉపాధి పొందుతున్నారన్నారు. పేదలకు అన్నం పెడుతున్న ఈజీఎస్ చట్టాన్ని కేంద్రం రద్దు చేసే యోచనలో ఉందన్నారు. రాంరెడ్డి, తిరుపతి, బాలయ్య, గోపాల్, రమేశ్, రాజేందర్, అశోక్, నవీన్, వెంకటేశ్, శ్రీనివాస్, కనకయ్య పాల్గొన్నారు. కరాటే పోటీల్లో ప్రతిభతంగళ్లపల్లి: మండలంలోని జిల్లెల్లకు చెందిన బర్ల సాయి ప్రభంజన్ నేషనల్ ఓపెన్ కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆదివారం వరంగల్‌లో జరిగిన నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని గెలుపొందాడు. సాయి ప్రభంజన్ జిల్లెల్లలోని విజ్ఞాన్ విద్యానికేతన్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. -
నిబంధనలు పాటించాలి
● జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ ● 200 మంది డ్రైవర్లకు కంటి వైద్యపరీక్షలుసిరిసిల్ల: వాహనదారులు రవాణాశాఖ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. సిరిసిల్ల ఆర్టీవో ఆఫీస్‌లో ఆదివారం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులతో ఉచిత నేత్రవైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ‘సడక్ సురక్ష అభియాన్’లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీటుబెల్టు ఆవశ్యకత, హెల్మెట్ వినియోగం, డ్రంకెన్‌డ్రైవ్, ర్యాష్‌డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదమో వివరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 200 మంది డ్రైవర్లకు కంటి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎంవీఐ వంశీధర్, ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యులు, ఏఎంవీఐలు రజనీ, పృథ్వీరాజ్‌వర్మ, ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్ పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్ల ఆరోగ్యానికి ధీమా
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): ఆరోగ్య ప్రమాద బీమా.. ఆటో డ్రైవర్ల ఆరోగ్యానికి ధీమాగా ఉంటుందని ఈ పథకాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలంలోని ఆటోడ్రైవర్లకు ప్రమాదబీమా కార్డులను అందించారు. ఆయా మండల కేంద్రాల్లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఆటోడ్రైవర్లకు మనోధైర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, సర్పంచులు అందె సుభాష్, కొండ రమేశ్, నరసింహులు, శరవింద్, తిరుపతినాయక్, తిరుపతి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, మాజీ సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గుళ్లపల్లి నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బోయిని రవి, ఆటో యూనియన్ మండల అధ్యక్షులు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
మీకేం కాదని..
మేమున్నామని..సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అక్రమాల విషయంలో మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. గత వీసీల హయాంలో జరిగిన అక్రమాల విషయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయి ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు ఇటీవల నివేదిక సమర్పించారు. త్వరలోనే కొందరు విచారణ నివేదిక మీద ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుందని అంతా అనుకుంటున్న క్రమంలో కొందరు పైరవీకారుల రంగప్రవేశం చర్చనీయాంశంగా మారింది. తాము విచారణ నివేదికను తొక్కిపెడతామని, బుట్టదాఖలు చేస్తామని, ఎలాంటి చర్యలూ లేకుండా కాపాడతామంటూ బయల్దేరారు. అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చిన సమయంలో పనిచేసిన వర్సిటీ మాజీ, ప్రస్తుత సిబ్బందికి ఏకంగా అభయమిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఏయే అంశాలపై ఫిర్యాదు చేశారంటే.. ప్రభుత్వ జీవోను తుంగలో తొక్కి నాన్ టీచింగ్ సిబ్బందిని ఇష్టానుసారంగా నియామకం చేయడం, యూజీసీ నియమనిబంధనలు పాటించకుండా రిటైర్డ్ అధ్యాపకులను నియమించడం, అర్హత లేకపోయినా నచ్చిన వారిని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా అక్రమ క్యాష్ ప్రమోషన్లు ఇవ్వడం, 12బీ యూజీసీ గుర్తింపు కోసం తప్పుడు నివేదికలతో ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులను తప్పుడు ఆరోపణలతో తొలగించారు. అంతేకాకుండా రెగ్యులర్ కోర్సులుగా నడుస్తున్న నాలుగు డిపార్ట్మెంట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చడం, అర్హతలేని వ్యక్తిని ఫైనాన్స్ ఆఫీసర్‌గా, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేకపోయినా రిటైర్డ్ ప్రొఫెసర్‌ను నియామకం చేసుకోవడం, ఫోన్ ట్యాపింగ్ పేరిట సిబ్బందిని బెదిరించారంటూ ఆరోపిస్తూ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలు తెలుసంటూ.. శాతవాహన యూనివర్సిటీలో మాజీ ఉపకులపతి హయాంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని పలు ఆధారాలతో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, విజిలెన్స్ డీజీకి 2024 జూన్ 18న ఫిర్యాదు వెళ్లింది. శాతవాహన ప్రొటెక్షన్ డెవలప్మెంట్ ఫోరం తరఫున కోట శ్యాంకుమార్, శ్రవణ్ దాదాపు 15 అంశాలపై పెద్ద నివేదికను ఆధారాలతో సహా సమర్పించారు. దీనిపై 2024 జూలై, ఆగస్ట్‌లో విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు 15 నెలల అనంతరం పూర్తి నివేదికను కరీంనగర్ విజిలెన్స్ కార్యాలయం నుంచి 2025 సెప్టెంబర్‌లో రాష్ట్ర విజిలెన్స్ కార్యాలయానికి పంపారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని విజిలెన్స్ ఉన్నతాధికారుల వద్ద నివేదిక ఉంది. గతంలో వర్సిటీలో పనిచేసిన కొందరికి గత ప్రభుత్వ పెద్దలతో బంధుత్వం ఉందని, వారిలో కొందరు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారు విజిలెన్స్ నివేదికపై చర్యలు లేకుండా అడ్డుకోగలరని చెబుతున్నారు. దీంతో విజిలెన్స్ విచారణను తొక్కిపెట్టేందుకు తాము సహకరిస్తామని, ఇతర ఉద్యోగుల వద్ద పైరవీలకు దిగుతున్నారు. వీరికి చెక్‌పెట్టేలా వర్సిటీలో జరిగిన అక్రమాలపై వెంటనే చర్యలు చేపట్టాలని విజిలెన్స్ డీజీ, ముఖ్యమంత్రిని విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. -
మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగరాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● అభివృద్ధి పనులకు శంకుస్థాపన వేములవాడ: మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మీకాలనీ 4, 5వ వార్డులలో రూ.45లక్షలతో సీసీరోడ్డు, సైడ్ డ్రెయినేజీ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరై, పలు కులసంఘం భవన నిర్మాణాలకు మంజూరుపత్రాలు అందజేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణం, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాన్ని సుమారు రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో గతేడాది రూ.800 కోట్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా వేములవాడ పరిధిలో సుమారు 45 కుల సంఘాలకు నిధుల మంజూరు చేసినట్లు తెలిపారు. మూలవాగుపై మూడో బ్రిడ్జి, మార్కెట్‌యార్డు జంక్షన్ నుంచి తెలంగాణచౌక్ వరకు రోడ్డు పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. వేములవాడ పట్టణంలోని ప్రతీ వార్డుకు రూ.10లక్షల చొప్పున మంజూరు చేసి పనులు చేస్తున్నట్లు వివరించారు. జమ్మిగద్దె వరకు సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మికాలనీలో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. -
ఆరోగ్య అవగాహన కల్పించాలి
● వైద్యపరీక్షలు చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ఎస్ఐఆర్–2022పై వీడియో కాన్ఫరెన్స్సిరిసిల్ల: జిల్లాలోని ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని, వైద్యపరీక్షలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో శనివారం వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షించారు. ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు, టీబీ, కుష్టు తదితర కేసులపై చర్చించారు. టీబీ, కుష్టు వ్యాప్తితో కలిగే ఇబ్బందులు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్సీడీ స్క్రీనింగ్ సకాలంలో పూర్తి చేసి అవసరమైన వారికి చికిత్స అందించాలని సూచించారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఇన్చార్జి డీసీహెచ్ఎస్ రవీందర్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తి చేయాలి ఎస్ఐఆర్–2022 జాబితాతో 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. రానున్న 15 రోజుల్లో 70 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయి అధికారి రోజూ 30 ఎంట్రీలు టార్గట్‌గా పని చేయాలన్నారు. అంతకుముందు ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈవో సుదర్శన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఐఆర్పై సమీక్షించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్‌ల్లో హెల్ప్‌డెస్క్‌లు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. మున్సిపల్ ఓటర్ జాబితాలో అవసరమైన సహాయం చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లు పనిచేస్తాయన్నారు. ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 9లోగా ఆయా మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
సావిత్రిబాయి జీవితం ఆదర్శం
సిరిసిల్లటౌన్: ప్రపంచంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా సేవలందించిన సావిత్రిబాయిపూలే జీవితం మహిళా లోకానికి ఆదర్శనీయమని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, కరుణాల భద్రాచలం, సామాజిక సంఘాల ప్రతినిధులు ఆకునూరి బాలరాజు, రాగుల రాములు, వంకాయల కార్తీక్ పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు ఆధ్వర్యంలో పలువురు నివాళి అర్పించారు. వేముల లక్షయ, కోకన్వీనర్ శ్రీహారిక, పెండెల ఆదిత్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుర్ర రాకేశ్, మంద అనిల్‌కుమార్, అమృత్లాల్ శుక్లా భవనంలో ఐద్వా జిల్లా కార్యదర్శి జువ్వాజి విమల, సూరం పద్మ, సీపీఎం నేతలు ఎగమంటి ఎల్లారెడ్డి, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. -
నిఘా నిద్రపోతోంది !
● పల్లెల్లో పనిచేయని సీసీ కెమెరాలు ● పట్టించుకోని అధికారులు ● దొరకని దొంగలువేములవాడరూరల్: పల్లెల్లో నిఘా కరువైంది. గతంలో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలలో సగానికి పైగా పనిచేయడం లేదు. రెండేళ్లుగా పల్లెల్లో పాలకవర్గాలు లేకపోవడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. దొంగతనాలు, ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు.. ఎవరు నిందితులో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో జిల్లాలో చాలా కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. 13 మండలాలు.. 3,200 సీసీ కెమెరాలు జిల్లాలోని 13 మండలాల్లో దాదాపు 3,200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో జిల్లా పోలీస్ శాఖ ఆదేశాలతో చాలా గ్రామాల్లో అప్పటి ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, దాతలు ముందుకొచ్చారు. కొన్ని రోజులు బాగానే పర్యవేక్షించిన గ్రామపంచాయతీ సిబ్బంది తర్వాత పట్టించుకోలేదు. దీంతో చాలా గ్రామాల్లో సగానికి పైగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో దొంగతనాలు జరిగిన సమయంలో దొంగలను గుర్తించడం కష్టంగా మారింది. నిఘా నేత్రంతో 32 కేసులు ఛేదన జిల్లాలో గతేడాది సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో 32 కేసులను పోలీసులు ఛేదించారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను సకాలంలో పట్టుకోలేకపోయారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఉండడంతో క్షణాల్లో నిందితులను పట్టుకునే అవకాశాలు ఉంటాయని పోలీస్‌లు చెబుతున్నారు. గ్రామాల్లోని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తాం. చాలా గ్రామాల్లో కోతులు, వర్షాలతో సాకెట్లు, ప్లగ్‌లు పోతున్నాయి. దీంతో పనిచేయడం లేదు. వెంటనే ప్రజాప్రతినిధులతో మాట్లాడి పనిచేసేలా విధంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్, వేములవాడరూరల్ -
హైదరాబాద్ తరలిన డీఆర్డీవో బృందం
సిరిసిల్ల: హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందం శనివారం తరలివెళ్లింది. హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్‌తో జరిగే సమావేశానికి డీఆర్డీవో మచ్చ గీత, ఏపీడీ శ్రీనివాస్, జిల్లా అధికారుల బృందం ప్రత్యేక వాహనంలో వెళ్లారు. మహిళా సంఘాలను బలో పేతం చేయడం, పేదరిక నిర్మూలన పథకాన్ని సమర్థంగా నిర్వహించే లక్ష్యంతో సమావేశం జరిగింది. దివ్యాంగుల పెళ్లికి రూ.లక్ష నజరానసిరిసిల్లకల్చరల్: దివ్యాంగుల జంటకు లక్ష నజరానా ఇవ్వనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం ప్రకటనలో తెలిపారు. ఇద్దరు దివ్యాంగులైనా, జంటలో ఒక్కరు దివ్యాంగులైనా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. 2005 మే 19 తరువాత జరిగిన ఈ తరహా వివాహాలను ప్రభుత్వం అందించే లక్ష ప్రోత్సాహకానికి అర్హులుగా పేర్కొన్నారు. www.epass.telangana.gov.in వెబ్సైట్ ద్వారా పెళ్లయిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకుని సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు కాపీ అందజేయాలని పేర్కొన్నారు. -
జిల్లా జడ్జికి శుభాకాంక్షలు
సిరిసిల్లటౌన్: జిల్లా జడ్జి పి.నీరజను శనివారం లోక్‌అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్ కలి శారు. జడ్జికి పుష్పగుచ్ఛం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వేములవాడ: పర్యావరణాన్ని కాపాడాలని సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ కోరారు. వేములవాడ కోర్టు ఆవరణలో శనివారం మొక్కలు నాటి మాట్లాడారు. కోర్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెట్లను నరికివేస్తే మన ఉనికికే ప్రమాదమన్నారు. సిరిసిల్లటౌన్: అసెంబ్లీలో సిరిసిల్ల పవర్లూమ్ వస్త్రపరిశ్రమ సమస్యలను ప్రస్తావించాలని సీపీఐ నేతలు ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు విన్నవించారు. హైదరాబాద్‌లో శనివారం కలిసి ఈమేరకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ యజమానుల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులు ఇవ్వలేదన్నారు. వర్కర్స్ టు ఓనర్ పథకాన్ని అమలుచేయడం లేదన్నారు. యారన్డిపోలో నెల రోజులుగా యారన్ నిల్వలు లేవన్నారు. పై సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని కోరారు. నాయకులు పంతం రవి, సోమ నాగరాజు, గాజుల లింగం, రాయమల్లు, మండల వెంకటేశ్ ఉన్నారు. సిరిసిల్లకల్చరల్: దేశవ్యాప్తంగా నిషేధించిన చైనా మాంజాను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఖాధిర్పాషా హెచ్చరించారు. సిటిజెన్స్ ఎంపవర్మెంట్ త్రు అవేర్నెస్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి, సంస్థ ప్రతినిధి ఆడెపు వేణుతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాంజా నిషేధంపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను పురపాలక సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ నిషేధిత సింథటిక్, మాంజా క్రయ విక్రయాలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థ ప్రతినిధులు ఆడెపు ఆంజనేయులు, యేముల రామ్ సాహుల్, పత్తిపాక ముక్తేశ్వర్, గుండేటి కృష్ణహరి, ఆర్పీ విక్రమ్ పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరుగవని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇల్లంతకుంట హైస్కూల్లో శనివారం నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల సమావేశంలో మాట్లాడారు. పాఠశాల స్థాయి విద్యార్థులు వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. హైస్కూల్ హెచ్ఎం ప్రేమలత, ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్, వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ పాల్గొన్నారు. -
అజరామరం!
అభీష్టం..అభ్యుదయం..● వృత్తిలో రాణిస్తూ.. ప్రవృత్తిలో ప్రతిభ చాటుతూ.. ● కుటుంబ బాధ్యతలు మోస్తూ.. సమాజసేవలో తరిస్తూ.. ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఇష్టమైన పనిచేయడం సాధారణం.. ఆ పనినే విభిన్నంగా చేయడం అభీష్టం. అభీష్టాలను సమాజానికి ఉపయోగపడేలా చేయడం అభ్యుద యం. అంతటి అభ్యుదయ భావాలతో సమాజంలోని అవసరార్ధులు.. అన్నార్థులు.. అనాథలను ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తిని కొనసాగిస్తూనే ప్రవృత్తిగా సేవ చేస్తున్నారు. బతుకుదెరువు వెతుకుతూనే.. గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. కొందరు అన్నార్థుల ఆకలి తీరుస్తుండగా.. మరికొందరు అనాథశవాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఇలాంటి వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ మూలకు వెళ్లినా కనిపిస్తారు. ఇలాంటి వారిపై ఈ వారం సండే స్పెషల్. గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 20 ఏళ్లుగా అనాథ వృద్ధుల ఆశ్రమం నిర్వహిస్తున్న మల్లుగారి నర్సాగౌడ్ దాదాపు 30 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. 20 ఏళ్లుగా వృద్ధులు, అనాథల ఆలనాపాలన చూస్తున్నారు. ఆశ్రమంలో ఎవరైనా వృద్ధులు చనిపోతే.. మతాచారాలు, సంప్రదాయాలు అన్నీ పాటిస్తూ పూర్తి గౌరవంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఎవరూ లేని వాళ్లు కూడా చివరి ప్రయాణంలో ఒంటరిగా ఉండకూడదు అన్నది నర్సాగౌడ్ నమ్మకం.రామగుండం: జీవనశైలిలో మార్పు చేసుకుంటేనే ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఉంటుందని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అంటున్నారు. పదిహేనేళ్లుగా పూర్తిగా భోజనం మానేసి ఉదయం వ్యాయామంతో జీవన విధానాన్ని ఆరంభించడం అలవాటుగా మారిందని తెలిపారు. రోజూ ఆహారంగా అంబలి, రాగిజావ, మొక్కజొన్న గటుక, మొలకెత్తిన పెసర్లు, చిరుధాన్యాలు తీసుకుంటానని, తద్వారా చురుగ్గా ఉండి మానసిక ప్రశాంతత పొందగలుగుతాం అని వివరించారు. తాను నిత్యం ప్రజాక్షేత్రంలో తిరిగే క్రమంలో వాహనంలో క్యారెట్, కీరదోస తదితరాలను తీసుకుంటానని, దీంతో మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ నిత్య యవ్వనంగా ఉన్నట్లు అనిపిస్తుందని, అదే తన ఆరోగ్య రహస్యమని వివరించారు. -
బిల్లుల పంచాయితీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇటీవల కొలువుదీరిన గ్రామపంచాయతీల నూతన పాలకవర్గాలకు విద్యుత్ బిల్లుల బకాయిలు కలవరపెడుతున్నాయి. కొన్నేళ్లుగా విద్యుత్ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదలకాకపోవడంతో పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా శ్రీసెస్‌శ్రీ సంస్థకు గ్రామపంచాయతీలు విద్యుత్ బిల్లుల రూపంలో రూ.386 కోట్లు బకాయిలు పడ్డాయి. ఈ బిల్లులు చెల్లించడం నూతన పాలకవర్గాలకు తలకుమించిన భారంగా మారింది. అదే విధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కలుపుకొని రూ.700 కోట్లకు పైగా బకాయిలు పడ్డట్లు సెస్ అధికారులు చెబుతున్నారు. ఈ బకాయిలతో సెస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. నిధులు లేక నీరసం జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉండగా.. రూ.386కోట్లు విద్యుత్ బకాయిలు పడ్డాయి. ఏళ్లుగా పంచాయతీలలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించడం ఇబ్బందిగా మారింది. జీపీలలో నిధులు లేకపోవడం, వివిధ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం పంచాయతీల్లోని మల్టీపర్పస్ వర్కర్లకు, చెత్తసేకరణకు ఉపయోగించే ట్రాక్టర్ నిర్వహణకే సరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సెస్ విద్యుత్ సంస్థ అధికారులు కరెంట్ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడం కొత్త పాలకవర్గాలకు తలనొప్పిగా మారింది. సెస్‌పై భారం జిల్లా వ్యాప్తంగా 13 మండలాలకు సెస్ సంస్థ విద్యుత్ సేవలు అందిస్తుంది. సెస్ సంస్థ ఎన్పీడీసీఎల్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తుంది. ఇలా సేవలు అందించినందు కు కొంత మొత్తంలో లాభాలు సైతం తీసుకుంటుంది. అయితే జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. గ్రామాల్లోని వీధిదీపాలు, నీటి సరఫరా మోటార్ల బిల్లులు ప్రతీ నెల లక్షల్లోనే వస్తున్నాయి. ఈ బిల్లులు పంచాయతీలు చెల్లించకపోవడంతో సెస్ సంస్థపై భారంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ.700 కోట్లకు పైగానే బకాయిలు సెస్ సంస్థకు రావాల్సి ఉంది. ఈ బిల్లులు వసూలు అయితే సెస్ సంస్థ అభివృద్ధి దిశలో దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. వివరాలు ఇలా.. గ్రామపంచాయతీలు : 260 బకాయి బిల్లులు : రూ.386 కోట్లు మున్సిపాలిటీలు : 02 విద్యుత్ బకాయిలు : రూ.114 కోట్లు జిల్లా వ్యాప్తంగా సెస్‌కు బకాయిలు : రూ.700 కోట్లు -
సేవలకు గుర్తింపు
● ఉత్తమ సహకార సంఘంగా ఇల్లంతకుంట పీఏసీఎస్ఇల్లంతకుంట(మానకొండూర్): రైతులకు రుణాలు మంజూరు చేయడంతోపాటు రికవరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుండడం.. బ్యాంకుకు సంబంధించిన నిధులు నిల్వ ఉండడం.. గోదాముల ద్వారా ఎరువులు, విత్తనాల సరఫరాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఇల్లంతకుంట ప్రాథమిక సహకార సంఘానికి 2025వ సంవత్సరానికి సంబంధించిన అత్యుత్తమ పురస్కారం లభించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. 1983 నుంచి రైతుల సేవలో.. ఇల్లంతకుంట సహకార సంఘం 1983లో ఏర్పడింది. అంతకుముందు 1958లో గ్రామస్థాయిలో సంఘంగా ఉండేది. సింగిల్‌విండోగా ఏర్పడినప్పటి నుండి సొసైటీ అభివృద్ధి బాటలోనే నడుస్తోంది. ప్రస్తుతం ఇల్లంతకుంట ప్యాక్స్ 28 గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది. ఇల్లంతకుంట సహకార సంఘంలో 4,478 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సంఘం పరిధిలోని 371 మంది రైతులకు దీర్ఘకాలిక రుణాల కింద రూ.20.29కోట్ల రుణాలు అందజేశారు. స్వల్పకాలికంగా పంట రుణాల కింద 1683 మందికి రూ.17.40 కోట్లు అందజేశారు. సొసైటీ పరిధిలో కందికట్కూర్, రేపాక, పెద్దలింగాపురం, ఇల్లంతకుంటల్లో ఎరువుల గోదాములు ఉన్నాయి. సొసైటీ ఆవరణలో పెట్రోల్, డీజిల్ బంక్ ఏర్పాటు చేశారు. దీని కోసం ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకోలేదు. సొంత నిధులతోనే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. అదేవిధంగా సొసైటీకి సంబంధించిన ఐదు ఎకరాల కమర్షియల్ భూమి కూడా ఉంది. సొసైటీ ద్వారా ఇచ్చిన వివిధ రకాలైన రుణాల రికవరీ 95 శాతం వరకు ఉందని సొసైటీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి తెలిపారు. ఇల్లంతకుంట ప్యాక్స్‌కు ఎఫ్‌పీవో(రైతు ఉత్పత్తిదారుల సంస్థ)గా గుర్తింపు దక్కింది. దీని కింద రూ.3.50లక్షలు సమకూరినట్లు కార్యదర్శి పేర్కొన్నారు. -
మధ్యాహ్న భోజనంపై ఎంఈవో నిలదీత
● సుద్దాల జెడ్పీహెచ్ఎస్లో ఘటన కోనరావుపేట(వేములవాడ): నిత్యం ఉడకని అన్నం నీళ్లచారుతో విద్యార్థులు భోజనం చేయలేని పరిస్థితి ఉందని మండల విద్యాధికారి మురళీనాయక్‌ను సుద్దాల హైస్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు శుక్రవారం ఎంఈవో రాగా అక్కడే ఉన్న తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనం నిర్వహణ సరిగా లేదని ఫిర్యాదు చేశారు. అన్నం సరిగా ఉడకడం లేదని, కూరలో కారం, ఉప్పు ఎక్కువగా వేస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే భోజనంలో నాణ్యత ఉండడం లేదన్నారు. -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
కోనరావుపేట(వేములవాడ): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలోని గర్భిణీల రిజిస్ట్రేషన్, చెకప్ ఆన్లైన్ నమోదు పరిశీలించారు. కేంద్ర ఆరోగ్య పథకాల ఎన్సీడీ, టీబీ వ్యాధి ఇతర ఆరోగ్య కార్యక్రమాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వైద్యాధికారులు వేణుమాధవ్, సురేష్, సీహెచ్‌వో బాలచంద్రం, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబు, డిప్యూటీ డెమో రాజుకుమార్ పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో చేనేతలక్ష్మి
సిరిసిల్లటౌన్: చేనేత కార్మికులకు ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసే ‘చేనేత లక్ష్మి’ కార్యక్రమం ఈ ఏడాది ఆరంభమైంది. ఈమేరకు కలెక్టరేట్లో చేనేత వస్త్రోత్పత్తుల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్కీమ్‌తో చేనేత కార్మికులకు చేతినిండా పని, సరసమైన ధరలలో బట్టలు డిస్కౌంట్లో లభిస్తాయని సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు తెలిపారు. పనులు పూర్తి చేస్తాం రుద్రంగి(వేములవాడ): మండలంలోని గైదిగుట్టతండాలో పనులు మధ్యలోనే నిలిచిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల భవనం పనులను మార్చి 31లోగా పూర్తి చేస్తామని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ సత్యానందం తెలిపారు. డీఈ సంపత్ కుమార్, ఏఈ మాధురిలతో కలిసి భవనం పనులను శుక్రవారం పరిశీలించారు. ప్రిన్సిపాల్ ప్రతిభ, రుద్రంగి మాజీ వైస్ ఎంపీపీ పీసరి చిన్నభూమయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దెగావత్ తిరుపతి ఉన్నారు. రోడ్డు నియమాలు పాటించాలివేములవాడఅర్బన్: ప్రతి ఒక్కరు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. వేములవాడ నందికమాన్ వద్ద శుక్రవారం రోడ్డు భద్రత మసోత్సవాల భాగంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కార్లను తనిఖీ చేశారు. కార్లు డ్రైవింగ్ చేసే సమయంలో సీటుబెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనలు నడపొద్దని, రాంగ్రూట్లో వెళ్లకూడదని సూచించారు. వేములవాడ ట్రాఫిక్ ఎస్సై రాజు, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, రజనీ, ఫృథ్వీరాజ్వర్మ పాల్గొన్నారు. సర్పంచ్‌కు పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక సర్పంచ్ డాక్టర్ కత్తెరపాక మంజుల మలేషియా పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ పొందారు. కరీంనగర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మంజుల ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించారు. 2020లో జేఎన్టీయూలో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం మలేషియాలోని లింకన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ పొందినట్లు మంజుల తెలిపారు. వైద్యకళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా నాగార్జున చక్రవర్తిసిరిసిల్లటౌన్: జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ నాగార్జున చక్రవర్తి శుక్రవారం నియమితులయ్యారు. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ హెచ్‌వోడీ అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ నాగార్జున చక్రవర్తిని రాష్ట్ర డీఎంఈ ఆదేశాలతో ఈమేరకు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నియమించారు. నాగార్జున చక్రవర్తిని తోటి వైద్యులు, సిబ్బంది అభినందించారు. సెలవులో రాజన్న ఈవోవేములవాడ: రాజన్న ఆలయ ఈవో రమాదేవి వారం రోజులపాటు సెలవులో వెళ్లినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 6 వరకు ఆమె సెలవులో ఉండనున్నారు. ఈనెల 7 నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నారు. -
వేములవాడలో కాషాయజెండా ఎగురవేద్దాం
వేములవాడ: రాజన్న క్షేత్రం కొలువై ఉన్న వేములవాడలో కాషాయ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి స్పష్టం చేశారు. సిరిసిల్లలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గతంలో మాదిరిగానే బీజేపీ కాషాయ జెండాను ఎగురవేసేందుకు నాయకత్వం, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ గతంలో కంటే బీజేపీ ఇప్పుడు బలంగా ఉందన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు ఎర్రం మహేష్, సిరికొండ శ్రీనివాస్, కృష్ణస్వామి, సంటి మహేష్, రేగుల రాజ్‌కుమార్, రాధిక, వివేక్, సంతోష్, వెంకన్న, అశోక్, గడ్డమీద శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నిధులు లేవు.. పన్నులు సరిపోవు
గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గ్రామంలోని పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, సిబ్బంది జీతభత్యాలు, వీధిలైట్ల మరమ్మతులకే సరిపోవడం లేదు. పాత విద్యుత్ బకాయిలు చెల్లించడం తలకు మించిన భారమవుతుంది. ప్రభుత్వం కరెంట్ బిల్లుల కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి. – ఎలగందుల నర్సింలు, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ బకాయిలు చెల్లించి.. సంస్థను కాపాడండి జిల్లా వ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా సెస్‌కు బకాయిలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలోనైనా గ్రామపంచాయతీల నూతన పాలకవర్గాలు, వినియోగదారులు బకాయి విద్యుత్ బిల్లులు చెల్లించాలి. బిల్లులు చెల్లించినప్పుడే సెస్ మనుగడ సాధ్యమవుతుంది. బిల్లులు చెల్లించి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలి. – చిక్కాల రామారావు, సెస్ చైర్మన్ -
రోడ్డు ప్రమాదాలే అధికం
ఉమ్మడి జిల్లాలో 31వ తేదీన 108 సేవలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: డిసెంబరు 31.. అంటేనే సంబరాల రోజు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే దినోత్సవం వేళ.. మద్యం ఏరులై పారింది. అదేస్థాయిలో ప్రమాదాలకు కూడా కారణమైంది. డిసెంబరు 31న రాత్రి పూట 108 సిబ్బంది దాదాపు 216 మంది ప్రాణాలు కాపాడగా.. అందులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి. అందులోనూ మద్యంమత్తులో జరిగినవే అధికంగా ఉన్నాయని ఈఎంటీ సిబ్బంది వెల్లడించారు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా పలు ఎమర్జెన్సీ కేసుల విషయంలో స్పందించిన సిబ్బంది పలువురి ప్రాణాలు కాపాడారు. 54 వాహనాలు, 108 మంది సిబ్బంది డిసెంబరు 31న రాత్రి మొత్తం 54 వరకు 108 అంబులెన్సుల్లో 108 మంది విధుల్లో ఉన్నారు. వీరిలో 54 మంది పైలెట్లు, 54 మంది ఈఎంటీలు ఉన్నారు. వాస్తవానికి పండగ రోజు, లోకమంతా సెలబ్రేషన్లలో మునిగి తేలుతున్నా.. అత్యవసర సేవలు కావడంతో వీరంతా విధినిర్వహణలోనే మునిగిపోయారు. ఈక్రమంలోనే 107 అత్యవసర కేసులు కాగా, 109 వరకు చిన్నా చితకా రోడ్డు ప్రమాదాల కేసులే అధికంగా నమోదవడం గమనార్హం. చిన్న రోడ్డు ప్రమాదాల్లోనూ 109 కేసుల్లో 90శాతం మద్యం వల్ల జరిగిన ప్రమాదాలే కావడం గమనార్హం. అదే రోజు రాత్రి ఉమ్మడిజిల్లాలో ప్రతీ చోటా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు జరిపినా.. తాగి వాహనాలు నడపవద్దని కోరినా.. మందుబాబుల్లో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. గర్భిణుల తరలింపు 36 తీవ్ర రోడ్డు ప్రమాదాలు 16 గుండెపోట్లు 32 శ్వాస సంబంధ వ్యాధులు 23 మైనర్ రోడ్డు ప్రమాదాలు 109 మొత్తం కేసులు 216 -
రూ.3.10 కోట్లు తాగేశారు
సిరిసిల్లక్రైం: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 నాడు రూ.3.10కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు. ఎక్సైజ్ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా బుధవారం ఒక్క రోజే 2,766 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 3,885 బీర్ కేసుల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ మొత్తం గణాంకాలను పరిశీలిస్తే 59,968 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 76,974 బీర్ కేసుల విక్రయాలు జరిగింది. డిసెంబర్ నెలలో రూ.67.14 కోట్ల మేర మద్యం వ్యాపారం జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. -
మట్టిబిడ్డలు.. పల్లె పాలకులు
● సర్పంచులుగా వ్యవసాయ కూలీలు ● వీర్నపల్లిలో 8 మంది మహిళా సర్పంచులు ● గ్రామాభివృద్ధిలో ముందుంటామంటున్న అతివలువీర్నపల్లి(సిరిసిల్ల): వారంతా మట్టిబిడ్డలు. నిన్న..మొన్నటి వరకు మనలో ఒకరు. కొందరు వ్యవసాయ కూలీలు.. మరికొందరు టెయలరింగ్ చేస్తూ కుటుంబాలకు ఆర్థికంగా దన్నుగా నిలిచారు. రిజర్వేషన్లు కలిసిరావడంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఇన్నాళ్లు కుటుంబాలను సరైన మార్గంలో నడిపామని.. ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామంటున్నారు. వీర్నపల్లి మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మహిళా సర్పంచులపై ప్రత్యేక కథనం. పొలం నుంచి పంచాయతీకి.. వీర్నపల్లి మండలంలో 17 గ్రామాలకు 8 గ్రామపంచాయతీల్లో మహిళలే సర్పంచులుగా గెలుపొందారు. మండలంలోని శాంతినగర్, సీతారాంనాయక్‌తండా, జవహర్లాల్నాయక్తండా, అడవిపదిర, ఎర్రగడ్డతండా, వీర్నపల్లి, మద్దిమల్లతండా, రంగంపేట గ్రామాల సర్పంచులుగా మహిళలు విజయం సాధించారు. వీరంతా ఇన్నాళ్లు వ్యవసాయపనులు చేసిన వారే. కొందరు సొంత వ్యవసాయ భూమిలో పనికి వెళ్తే, మరికొందరు వ్యవసాయ కూలీలుగా పనిచేశారు. ఇప్పుడు వీరంతా ఆయా పల్లెల ప్రథమ పౌరులుగా ఎన్నికయ్యారు. -
ఆశావహుల సందడి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో 15 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలు కాగా.. మిగిలినవి పురపాలికలు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు కసరత్తు ప్రారంభించడంతో మున్సిపాలిటీలలో ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఆశావహుల సందడితో పట్టణాలు, నగరాల్లో రాజకీయ సందడి నెలకొంది. నిన్నటివరకు పల్లెపోరు కారణంగా పట్టణాల్లో మౌనంగా ఉన్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు రంగంలోకి దిగారు. బల్దియాల పరిధిలో ప్లెక్సీలు వెలుస్తుండటంతో ఎన్నికల హడావుడి మొదలైనట్లే అనిపిస్తోంది. మున్సిపాలిటీల్లోని ప్రతివార్డు, డివిజన్‌లోనూ తానే అభ్యర్థిని అన్నట్టు ఆశావహుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా శుభాకాంక్షల బ్యానర్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఏకాదశి, కొత్త ఏడాది, సంక్రాంతి వంటి పండుగలను వేదికగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. శుభాకాంక్షలతో పాటు పరిచయం పెంచుకోవడం అనే వ్యూహంతో ఇంటింటికీ తిరుగుతూ నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు పంచుతూ.. తమ ఉనికిని గుర్తు చేస్తున్నారు. ఇది కేవలం పండుగల శుభాకాంక్షలు మాత్రమే కాకుండా.. రాబోయే ఎన్నికలకు రిహార్సల్‌లా మారింది. పార్టీలకు ప్రతిష్టాత్మకం ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆటుపోట్లను చవిచూసిన పార్టీలు.. మున్సిపల్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బల్దియాల్లో పాగా వేసేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే పక్కాప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి జోష్ మీదున్న అధికార కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికలపైనా ధీమాగా ఉంది. గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీల్లో తామేం తక్కువ కాదన్నట్లు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక బీజేపీ పంచాయతీ ఎన్నికలో ఊహించిన దానికన్నా ఎక్కువ బలం పెంచుకుని మున్సిపాలిటీలపై కన్నేసింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆశావహుల గల్లీ బాట ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించి.. పోటీ చేసే ఆశావహులు గల్లీల బాట పట్టారు. ఉదయం ఆలయ దర్శనాలు.. మధ్యాహ్నం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం.. సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు. ఇదే రోజువారీ షెడ్యూల్‌గా మారింది. ప్రజల సమస్యలు వింటూ.. చిన్నచిన్న హామీలు ఇస్తూ తమపై సానుకూల అభిప్రాయం ఏర్పడేలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. పార్టీ పెద్దల కంట్లో పడేందుకు చేస్తున్న తాపత్రయం మరోస్థాయికి చేరుతోంది. జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే దానిపై ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ప్రజల్లో బలం చూపించాలి. మరోవైపు పార్టీ హైకమాండ్‌కు నమ్మకం కలిగించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించేందుకు వారు విశేషంగా శ్రమిస్తున్నారు. కొందరు ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో ముందుండగా.. మరికొందరు సేవా కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.బల్దియా వార్డులు జనాభా ఎస్టీ ఎస్సీ కరీంనగర్ 66 3,28,870 5,999 36,902 (కార్పొరేషన్) రామగుండం 60 2,37,636 4,278 50,744 (కార్పొరేషన్) ధర్మపురి 15 17,423 200 2,079 జగిత్యాల 50 83,168 547 5,229 కోరుట్ల 33 69,479 342 6,467 మెట్పల్లి 26 54,042 504 5,819 రాయికల్ 12 15,308 179 1,766 చొప్పదండి 14 16,459 205 3,062 హుజూరాబాద్ 30 34,555 309 6,326 జమ్మికుంట 30 39,476 286 7,623 మంథని 13 18,282 208 2,513 పెద్దపల్లి 36 50,762 312 4,527 సుల్తానాబాద్ 15 19,772 309 2,561 సిరిసిల్ల 39 92,091 104 6,346 వేములవాడ 28 43,620 453 6,545ప్రభుత్వపరంగా ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా కీలకంగా మారాయి. కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని పురపాలికల ఎన్నికలపై ప్రజల అభిప్రాయం, స్థానిక సమస్యలు, అధికార పార్టీపై ఉన్న సంతృప్తి.. లేదా అసంతృప్తి వంటి అంశాలను సేకరించేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. తొలి విడత సర్వే పూర్తయ్యిందని, రెండో విడతకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రూపకల్పన చేయనున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఆయా పార్టీలు ప్రైవేటు సర్వేలు చేయిస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలతో వార్డులు, డివిజన్లలో సర్వేలు చురుకుగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. రాజకీయంగా మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆశావహుల సందడి, పార్టీ వ్యూహాలు, ప్రభుత్వ సర్వేలు.. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల సమరం మొదలైనట్టే అనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
హామీల అమలులో సర్పంచులు
బోయినపల్లి/ఇల్లంతకుంట/వీర్నపల్లి: నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. బోయినపల్లి మండలం కొదురుపాక సర్పంచ్ కత్తెరపాక మంజుల తాను గెలిస్తే ఆడపిల్ల పుడితే రూ.5వేలు కట్నంగా ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చారు. గ్రామానికి చెందిన ర్యాకం గౌతమి–తిరుమలేశ్ కూతురి పేరిట పోస్టాఫీస్‌లో సుకన్య సమృద్ధి పథకం కింద రూ.5వేలు డిపాజిట్ చేసి వారికి అందజేశారు. ఇల్లంతకుంటలో కుక్కల తరలింపు ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు హామీ మే రకు గ్రామంలోని కుక్కలను తరలించేందుకు అమలాపురం నుంచి ఒక టీమ్‌ను తెప్పించారు. 8 మంది గురువారం ఒక్క రోజే 121 కుక్కలను పట్టుకొని వ్యాన్‌లో తరలించారు. మూడు రోజుల్లో గ్రామంలోని మొత్తం కుక్కలను పట్టుకెళ్లాలని ఒప్పందం చేసుకుంది. గ్రామంలోని పందులను కూడా ఊరు బయటకు తరలించాలని పందుల యజమానులకు తెలిపినట్లు సర్పంచ్ రాజు పేర్కొన్నారు. ఉచితంగా మినరల్ వాటర్వీర్నపల్లి మండలం అడవిపదిర సర్పంచ్ గుర్రపు స్వరూప ఉచితంగా మినరల్ వాటర్‌ను గురువారం అమలు చేశారు. ఐదేళ్లపాటు ఉచితంగా అందజేస్తానని తెలిపారు. ఏఎంసీ డైరెక్టర్ పని నర్సింగం, ఉపసర్పంచ్ తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పని శివరామకృష్ణ పాల్గొన్నారు. -
శుభాకాంక్షల వెల్లువ
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026సిరిసిల్ల/వేములవాడఅర్బన్: జిల్లాలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా అధికారులు, ప్రజలు కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. టీజీఈజేఏసీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్‌కుమార్, కన్వీనర్ సమరసేన్ తదితరులు కలెక్టర్ గరీమా అగ్రవాల్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీజీఈజేఏసీ కార్యదర్శి గాజుల సుదర్శన్, సహా అధ్యక్షుడు మెట్ట శ్రీకాంత్, కోశాధికారి మహమ్మద్ రియాజ్ పాషా, ట్రస్సా జిల్లా అధ్యక్షుడు జయంత్ కుమార్, ఏఎస్‌వోల జిల్లా అధ్యక్షుడు సుమన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జీవన్ పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు విప్‌ను సన్మానించారు.తిప్పాపూర్‌లో కేక్ కట్ చేస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న అధికారులు -
ప్రజల ప్రాణాల రక్షణే ధ్యేయం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: రోడ్డు ప్రమాదాల నివారించి ప్రజల ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లాలో జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించే జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీటీవో లక్ష్మణ్, ఎంబీఏ వంశీధర్, ఏఎంవీఐ రజనీదేవి, పృథ్వీరాజ్‌వర్మ పాల్గొన్నారు. వేములవాడ: రిటైర్డ్ ఉద్యోగులకు 2024 మార్చి నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు గురువారం వినతిపత్రం అందించారు. వెంకటయ్య, ధర్మయ్య, తిరుపతి, శ్రీనివాస్, చక్రపాణి, రవీందర్ తదితరులు ఉన్నారు. సిరిసిల్ల: చేనేత జౌళిశాఖ ఇన్చార్జి సహాయ సంచాలకులుగా బి.సంతోష్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సిరిసిల్ల ఏడీగా పనిచేసిన రాఘవరావును కరీంనగర్ ఏడీగా బదిలీ చేశారు. కరీంనగర్ ఏడీగా పనిచేసిన విద్యాసాగర్ బుధవారం ఉద్యోగ విరమణ చేయగా.. ఆయన స్థానంలో రాఘవరావును నియమించారు. సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ ఆఫీస్‌లో అభివృద్ధి అధికారి(డీవో)గా పనిచేస్తున్న బి.సంతోష్‌కుమార్‌కు ఏడీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ ఆదేశాలు చేశారు. నూతనంగా ఏడీగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్‌కుమార్‌ను పలువురు వస్త్రోత్పత్తిదారులు పుష్పగుచ్ఛంతో అభినందించారు. బదిలీ అయిన ఏడీ రాఘవరావుకు వీడ్కోలు పలికారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిశారు. బెజ్జంకిలో కలిసి శాలువాతో సన్మానించారు. పార్టీ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, యువజన విభాగం మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్‌కుమార్, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, చిట్టి ప్రదీప్‌రెడ్డి, ఎండీ జమాల్, రేగుల కార్తీక్, కాసుపాక శంకర్ ఉన్నారు. సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పోలింగ్స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాను గురువారం వెల్లడించారు. ఓటర్ల జాబితాను మున్సిపల్ నోటీసుబోర్డుపై అతికించారు. సిరిసిల్లలో 81,959 మందిలో పురుషులు 39,942, మహిళలు 42,011, థర్డ్ జెండర్ ఓటర్లు ఆరుగురు ఉన్నారు. జాబితాలో పేరు, చిరునామాలో తప్పులు ఉంటే తగిన ఆధారాలతో మున్సిపల్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. -
వృద్ధులకు రెండు పూటలా భోజనం
● గూడెంలో అన్నపూర్ణ అమ్మ ఫౌండేషన్ దాతృత్వంముస్తాబాద్(సిరిసిల్ల): ఆకలితో అలమటించే వృద్ధులు.. కొడుకులు ఉన్నా పట్టింపు కరువైన తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు అన్నపూర్ణ అమ్మ ఫౌండేషన్ ముందుకొచ్చింది. కొత్త సంవత్సరం వేళ ముస్తాబాద్ మండలం గూడెంలోని 30 మంది వృద్ధులకు నిత్యం రెండు పూటలా భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 11 మంది స్వశక్తి సంఘాల మహిళలు కలిసి అన్నపూర్ణ అమ్మ ఫౌండేషన్‌ను గురువారం ప్రారంభించారు. ఫౌండేషన్ చైర్పర్సన్ కుర్ర సావిత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇంటింటా ప్రచారం నిర్వహించినప్పుడు ఎంతో మంది వృద్ధులు ఆకలితో అలమటించడం కనిపించిందన్నారు. అప్పుడే వారికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. నిరాధరణకు గురవుతున్న గ్రామంలోని 30 మంది వృద్ధులకు నిత్యం రెండు పూటలా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు మద్దినేని స్వరూప, అంబాటి సుజాత, పిల్లలమర్రి విజయ, బొప్ప విజయలక్ష్మి, పద్మలత, లక్ష్మి, కవిత, స్వాతి, స్వప్ప, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల/వేములవాడ: భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. భీమన్న ఆలయంలో స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లను ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ రుత్విక్‌సాయి, ఆర్డీవో రాధాభాయిలతో కలిసి పరిశీలించారు. ఆర్అండ్బీ ఈఈ నర్సింహాచారి, ఆలయ ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, తహసీల్దార్ విజయ ప్రకాశ్‌రావు, ఏఈవో శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలిరోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, ఎంవీఐ వంశీధర్, డీసీఎస్వో బి.చంద్రప్రకాశ్, ఏఎంవీఐలు రజనీదేవి, పృథ్వీరాజ్‌వర్మ పాల్గొన్నారు. -
జీవో 252 సవరించేలా చొరవ చూపాలి
● మాజీ మంత్రి కేటీఆర్‌కు జర్నలిస్టుల వినతి సిరిసిల్ల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నంబర్ 252లో సవరణలు చేసేలా చొరవ చూపాలని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే హెచ్–143) విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా అధ్యక్షుడు లాయక్‌పాషా ఆధ్వర్యంలో సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్ తెలంగాణ జర్నలిస్టుల పక్షాన నిలబడతామని భరోసా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా టెంజు అధ్యక్షుడు ఇరుకుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శులు సామల గట్టు, మహమ్మద్ అజీం, ట్రెజరర్ అందె దేవేందర్, ప్రవీణ్, కలీం, సల్మాన్, పహద్పాషా తదితరులు పాల్గొన్నారు. -
మా నాన్నను కాపాడండి
సిరిసిల్లకల్చరల్: ప్రైవేట్ లెక్చరర్‌గా జీవనం సాగిస్తున్న బత్తుల మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరుకు చెందిన మహేశ్ సిరిసిల్లలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సివిక్స్ లెక్చరర్‌గా పని చేసేవారు. గతంలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల నిర్వాహకుడిగా వ్యవహరించారు. వారం క్రితం ఉన్నట్టుండి ఇంట్లోనే పడిపోయాడు. వెంటనే సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి బంధువులు తీసుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించి... వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించే దిశగా బ్రెయిన్ సర్జరీ చేశారు. మందులు, వైద్యఖర్చులు, ఇతర పరీక్షల నిమిత్తం ఇప్పటికే రూ.4లక్షలు ఖర్చయ్యాయి. ఇదంతా మహేశ్ అన్న వేణు అప్పులు చేసి సమకూర్చాడు. మహేశ్‌ను ప్రస్తుతం ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మెదడు నుంచి ఓ వాల్వ్ అమర్చాల్సి ఉంటుందని ఇంకో రూ.4లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తేల్చారు. గ్రామస్తులు తలోచేయి వేసి రూ.50వేల వరకు పోగు చేసి అందజేశారు. తనకు వచ్చిన జబ్బు ఆరోగ్యశ్రీలో లేకపోవడం, వైద్యానికి అవసరమైన డబ్బులు సరిపోకపోవడం, ఆర్థిక పరిస్థితి దీనంగా ఉండడంతో మహేశ్ భార్యాపిల్లలు, బంధువులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మహేశ్ భార్య మాధవి, తన ఏడేళ్లలోపు ఇద్దరు పిల్లలు తండ్రిని బతికించండంటూ వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు 97018 13527, 98492 89250లలో సంప్రదించాలని కోరుతున్నారు. మృత్యువుతో పోరాడుతున్న ప్రైవేట్ లెక్చరర్ వైద్యానికి డబ్బు లేక దైన్యం ఆదుకోవాలంటూ కుటుంబం వేడుకోలు -
క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారించవచ్చు
వేములవాడ: క్యాన్స్‌ర్‌ను ముందుగానే గుర్తిస్తే నివారించుకోవచ్చని లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ చీకోటి సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. క్యాన్సర్‌పై లయన్స్‌క్లబ్, మాతశ్రీ హాస్పిటల్, గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన, ఉచిత స్క్రీనింగ్, టెస్టుల శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని మాతృశ్రీ ఆసుపత్రిలో ఈ శిబిరం నిర్వహించారు. గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్ వైద్యులు వందమందికి పరీక్షలు చేశారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు చీకోటి సంతోష్‌కుమార్ -
అర్హులకు సదరం సర్టిఫికెట్లు అందిస్తాం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందించాలని, క్రమం తప్పకుండా సదరం శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం డీఆర్డీఏ, జిల్లా జనరల్ ఆస్పత్రి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైకల్య నిర్ధారణ పరీక్ష కేంద్రంలో వసతులు కల్పించాలన్నారు. దివ్యాంగుల దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్, డీపీఎం వంగ రవీందర్ పాల్గొన్నారు. అంతకు ముందు సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరం శిబిరాలు, యూడీఐడీ కార్డుల జారీపై సమీక్షించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి సిరిసిల్ల అర్బన్: ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్, పెద్దూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని తనిఖీ చేశారు. ప్రధానంగా షాపుల్లో ప్రస్తుతం రిజిస్టర్, స్టాక్ ఎరువుల నిలువలను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని బస్తాల ఎరువులు విక్రయించారో ఆరా తీశారు. ఇప్పటి వరకు విక్రయించిన ఎరువులు, రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల వివరాలు తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, మండల వ్యవసాయాధికారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
● టిప్పర్లు, మూడు పికప్ వ్యాన్లు, ట్రాక్టర్, జేసీబీలు సీజ్ముస్తాబాద్(సిరిసిల్ల): ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 8 భారీ వాహనాలను సీజ్ చేయడమే కాదు.. ఇసుక స్మగ్లర్లపై కేసులు నమోదు చేశారు. ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె, కొండాపూర్ మధ్య మానేరువాగు నుంచి ఇసుక రవాణాపై డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఇసుక స్మగ్లర్లు పారిపోగా మూడు టిప్పర్లు, మూడు పికప్ వాహనాలు, ఒక జేసీబీ, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న రామలక్ష్మణపల్లెకు చెందిన చంద్రమౌళితోపాటు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. పంట పొలాల్లో డంపు చేసిన ఐదు ట్రిప్పుల ఇసుకను సీజ్ చేశారు. ఎస్సై గణేశ్ ఉన్నారు. -
నాలుగు రోజుల్లో బోడగుట్ట సర్వే చేయాలి
● అదనపు కలెక్టర్ నగేశ్ చందుర్తి(వేములవాడ): మండల కేంద్రం శివారులోని 442 సర్వే నంబర్లోని బోడగుట్ట ప్రాంతంలో ప్రభుత్వ భూమిని నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. బోడగుట్ట ప్రాంతంలో 54 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా సగానికి పైగా కబ్జాకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అసైన్మెంట్ కమిటీ తీర్మాణంతోపాటు అక్రమ పట్టాలపై వెంటనే రికార్డులు పరిశీలించి, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని సూచించినట్లు తెలిసింది. జిల్లా సర్వేయర్ శ్రీనివాస్, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ భూపతి, డీఐ వెంకటరత్నం, మండల సర్వేయర్ చామంతి, ఆర్ఐలు శ్రీనివాస్, మహేందర్ ఉన్నారు. రాజన్న సేవలో ఐఆర్ఎస్ అధికారివేములవాడ: రాజన్నను ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్) అధికారి వంశీకృష్ణారెడ్డి బుధవారం దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వేదోక్త ఆశీర్వచనం గావించారు. రాధాకృష్ణరెడ్డి, రేగూరి లక్ష్మణ్, మహేశ్ ఉన్నారు. -
రెండేళ్లుగా ‘హానీట్రాప్’ దందా..!?
మెట్‌పల్లిరూరల్: మూడురోజుల క్రితం మెట్పల్లిలో వెలుగుచూసిన హానీట్రాప్ దందాలో లెక్కలేని మంది బాధితులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సుమారు రెండేళ్లుగా ఈ ముఠా తమ దందాను కొనసాగించినట్లు సమాచారం. ముఠాలో ముగ్గురిని బుధవారం సాయంత్రం పోలీసులు రిమాండ్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కిన అనంతరం తిరిగివస్తామని చెప్పి జాడలేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నిందితుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే యత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. రెండేళ్లుగా దందా మెట్పల్లిలో వెలుగుచూసిన హానీట్రాప్ దందా సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు సమాచారం. నిందితుని సెల్ఫోన్లో పదుల సంఖ్యలో వీడియోలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో బాధితుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హానీ ట్రాప్‌లో చిక్కుకుపోయిన నిందితులు తమ పరువు ఎక్కడ పోతుందన్న భయంతో ఈ ముఠా అడిగినంత మేర డబ్బులు చెల్లించి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కొంత మంది వ్యాపారులు, రియల్టర్లు, చిన్నాచితక లీడర్లు ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి రావడంతో కొంతమంది బాధితులు పోలీసులను కలిసి తాము సైతం మోసపోయామని చెప్పుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు వేగవంతంగా.. లోతుగా విచారణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. నిందితుల సెల్ఫోన్లను పూర్తిస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించే యత్నాల్లో ఉన్నారు. నిందితుల్లో ఒకరి సెల్పోన్లో సుమారు రూ.20 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హానీ ట్రాప్ ముఠాలో నిందితులు బల్మూరి స్వప్న, కోరుట్ల రాజు, దేవ నర్సయ్యను బుధవారం సాయంత్రం పోలీసులు రిమాండ్ చేసినట్లు సమాచారం. మొదట పోలీసుల అదుపులో ఉండి తరువాత కనిపించకుండా పోయిన మరో ముగ్గురు నిందితులు ఎక్కడున్నారో జాడ తెలియడం లేదు. మంగళవారం రాత్రి నుంచి ఈ ముగ్గురు నిందితులు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేసే క్రమంలోనే జాడ లేకుండా పోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. వీరి సెల్పోన్లు ఠాణాలోనే ఉండటంతో వీరి జాడ తెలియడం సమస్యగా మారినట్లు తెలిసింది. మెట్పల్లి పరిసరాల్లో హానీట్రాప్ అంశం చర్చనీయాంశంగా మారిన క్రమంలో ఇదివరకు మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని సమాచారం. బాధితులు ఎందరో.. నిందితుల్లో ముగ్గురు రిమాండ్ మరింత లోతుగా విచారణ జాడలేని మరో ముగ్గురు నిందితులు -
విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
వేములవాడ ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు వేగంగా చేయిస్తాం. మహాశివరాత్రి నాటికి పనులు ఓ రూపానికి వచ్చేలా చేస్తాం. సంక్షేమ పథకాలను సమర్థంగా, పారదర్శకంగా అమలు చేస్తాం. పాలనలో తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. విద్య, వైద్యానికి తొలి ప్రాధాన్యతనిస్తాం. స్కూళ్లను జిల్లా స్థాయి అధికారులకు దత్తత ఇచ్చి.. అభివృద్ధికి బాట లు వేస్తాం. టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విద్యారంగాన్ని బాగుచేస్తాం. పేదలకు సర్కారు వైద్యం మెరుగ్గా అందేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పర్యాటక రంగాన్ని గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. అపెరల్ పార్క్, టెక్స్టైల్పార్క్లతో పాటు కొత్త ఉపాధికి, ఉద్యోగాల కల్ప నకు ప్రణా ళికాబద్ధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. – గరీమా అగ్రవాల్, కలెక్టర్ -
నేరాలు నియంత్రిస్తాం
నేరాల నియంత్రణకు శ్రమిస్తాం. కొత్త ఏడాదిలో ప్రజాక్షేత్రంలో మరింత సమర్థంగా పనిచేస్తుంది. నేరం చేస్తే.. శిక్ష తప్పదనేలా నిందితులకు శిక్ష పడేలా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. సైబర్ నేరాలను సవాల్‌గా తీసుకుని శాసీ్త్రయంగా వారి ఆటలను కట్టడి చేస్తాం. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. గంజాయి రహిత జిల్లాగా మార్చుతాం. జిల్లాలో గంజాయి రవాణా, నిల్వలు, విక్రయాలపై నిఘా ఉంచి కట్టడిచేస్తాం. గంజాయిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలి. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ శాంతిభద్రత పరిరక్షణలో ముందుంటాం. పోలీసులు ప్రజలకు చేరువయ్యేలా చూస్తాం. నేరాల నియంత్రణకు టెక్నాలజీని వినియోగించుకుంటాం. జిల్లా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు. – మహేశ్ బీ గీతే, ఎస్పీ -
బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చూపిస్తా
● కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్సిరిసిల్ల: మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని, సిరిసిల్ల, వేములవాడ పట్టణాలను బీజేపీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. సిరిసిల్ల శివారులోని రగుడు వద్ద ఓ ఫంక్షన్హాల్లో బుధవారం బీజేపీ శ్రేణులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిందన్నారు. అభివృద్ధి విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు రెండు పట్టణాల్లో పాదయాత్ర చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టిక్కెట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావులేదని, సర్వే రిపోర్టు ఆధారంగా గెలుపు గుర్రాలకే అవకాశం దక్కుతుందని స్పష్టం చేశారు. టిక్కెట్ల కోసం తనతోపాటు తన కుటుంబ సభ్యులకు ఫోన్లు కూడా చేయొద్దని, ఎవరైనా ఒత్తిడి తెస్తే వాళ్లకు వచ్చే టిక్కెట్లు కూడా రావని హెచ్చరించారు. టిక్కెట్లు రాకపోయినా పార్టీ పరంగా, నామినేటెడ్ పోస్టుల పరంగా న్యాయం చేస్తామన్నారు. హద్దు మీరి గొడవలు చేస్తే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పార్టీ నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు, అల్లాడి రమేశ్, ఎర్రం మహేశ్, కుమ్మరి శంకర్, బోయినిపల్లి ప్రవీణ్‌రావు, బండ మల్లేశంయాదవ్, ఆడెపు రవీందర్, అన్నల్దాస్ వేణు, బర్కం లక్ష్మీనవీన్‌యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మ్యాన రాంప్రసాద్, కొక్కు దేవేందర్‌యాదవ్, గర్రి పెల్లి ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని శ్రీనగర్‌కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కలిసి వరద ముంపు, కచ్చకాల్వ, సీసీ రోడ్ల సమస్యలను వివరించారు. వేములవాడలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు వేములవాడ: పట్టణంలోని ఓకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న నిర్వహించే రాష్ట్రస్థాయి కరాటే పోటీల బ్రోచర్‌ను ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. స్థానిక శ్రీనివాస్ ఫంక్షన్హాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మన్నాన్ తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి రుద్రంగి(వేములవాడ): యువత డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఏఎస్పీ రుత్విక్‌సాయి సూచించారు. రుద్రంగి పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే నేరాల నియంత్రనకు కృషి చేయాలని సూచించారు. వేడుకల పేరిట ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు. హన్మాజిపేటలో చిరుత సంచారం వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజిపేట శివారులో చిరుతపులి సంచరించినట్లు ఫారెస్టు అధికారులు గుర్తించారు. రైస్‌మిల్ ప్రాంతంలో చిరుత అడుగులను గుర్తించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా పోలీస్, ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. చిరుత అడుగులను గుర్తించిన ఎఫ్ఆర్వో ఖలీలొద్దీన్ మాట్లాడుతూ రుద్రంగి, మరిమడ్ల మీదుగా హన్మాజిపేటకు వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని రైతులు జాగ్రత్తగా ఉండాలని, పశువులను బయట ఉంచొద్దని సూచించారు. -
హ్యాపీ న్యూ ఇయర్
సిరిసిల్లటౌన్: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణలోని బేకరీలు, మిఠాయి దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి. మహిళలు రంగులు కొనడానికి ఉత్సాహం చూపారు. గ్రీటింగ్‌కార్డులు, కేకుల విక్రయాలతో మార్కెట్లో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఆసిఫ్పురకాలనీలో చిన్నారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విద్యానగర్ శ్రీఅభయాంజనేయ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సంగీతం, నృత్యాలతో హోరెత్తించారు. -
కొత్త ఆశలు.. అభివృద్ధి భాసలు
సిరిసిల్ల: కొత్త ఏడాది.. కొంగొత్త ఆశలను మోసుకొచ్చింది. ప్రజలు సైతం నూతన సంవత్సరంలో తమకు కొంతైనా మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. ఈక్రమంలో నూతన సంవత్సరంలో కొత్తగా ఏం చేస్తారని జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేలను బుధవారం ‘సాక్షి’ పలకరించింది. 2026లో అనేక ప్రణాళికలతో.. అభివృద్ధికి బాటలు వేయాలని భావిస్తున్నట్లు వారి అంతరంగాన్ని ఆవిష్కరించారు. వారు చెప్పిన విశేషాలు.. వారి మాటల్లోనే...ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రంగా అభివృద్ధి రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ వేగంగా పూర్తి చేస్తాం. రూ.150కోట్లతో పనులు సాగుతున్నాయి. కార్మిక క్షేత్రం సిరిసిల్ల పట్టణ అభివృద్ధితోపాటు నేతన్నల ఉపాధికి, వస్త్రపరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తాం. నేతన్నలకు యారన్ డిపో ఏర్పాటు చేసి నూలు అందిస్తున్నాం. రైతులకు శాశ్వత ప్రాతిపదికన సాగునీరు అందించే మర్రిపల్లి, లచ్చపేట, కొలనూర్, కలికోట సూరమ్మ రిజర్వాయర్లను పూర్తిచేస్తాం. నిమ్మపల్లి మూలవాగుకు గోదావరి జలాలను మళ్లించే పనులు చేపడతాం. మల్కపేట ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేశాం. మారుపాక శివారులో కాల్వ భూసేకరణకు నిధులు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డిపేట మీదుగా ఎగువమానేరు వరకు గోదావరి జలాలు తరలింపు 9వ ప్యాకేజీలో పూర్తిచేస్తాం. జిల్లాలో 70 ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చి రైతులకు అండగా ఉంటాం. అర్హత గల పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించాం. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే -
సరదాగా.. సందడిగా కేటీఆర్
● క్రికెట్ విజేతలకు బహుమతులు.. విద్యార్థులకు బ్యాగుల పంపిణీ ● బీఆర్ఎస్ శ్రేణులకు ఎన్నికలపై దిశానిర్ధేశంసిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కె.తారక రామారావు బుధవారం సిరిసిల్లలో సరదాగా క్రికెట్ ఆడి.. విద్యార్థులతో కేక్ కట్ చేసి సందడిగా గడిపారు. తొలుత తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శ్రేణులతో మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై సమీక్షించారు. వార్డుల వారీగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై ఆరా తీశారు. సిరిసిల్ల మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని, అందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తాను వస్తానని, క్షేత్రస్థాయిలో ప్రతీ ఇంటికి అభ్యర్థులు వెళ్లాలని, ఓటర్లను నిత్యం కలవాలని దిశానిర్ధేశం చేశారు. కాలేజీ మైదానంలో క్రికెట్ బ్యాటింగ్ సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘కేటీఆర్ కప్–2025’ క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ తిలకించారు. కాసేపు బ్యాటింగ్ చేశారు. విజేతగా నిలిచిన అన్నారం శ్రీనివాస్ ఎలెవన్ జట్టుకు, ద్వితీయస్థానం పొందిన తవక్కళ్ జట్లకు ట్రోఫీలు అందించారు. బెస్ట్బౌలర్గా వినయ్, బ్యాట్స్‌మెన్‌గా అమ్ములకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు సత్తార్, ఉస్మాన్, గెంట్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థులతో కేక్ కటింగ్ సుందరయ్యనగర్‌లోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులతో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలతో సరదాగా గడిపారు. హాస్టల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని ఆరా తీశారు. వసతి గృహంలోని విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు తోట ఆగయ్య, న్యాలకొండ అరుణ, జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, మంచె శ్రీనివాస్, దేవరకొండ తిరుపతి, పబ్బతి విజయేందర్‌రెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డయాలసిస్ దయనీయం
● జిల్లాలో 25 డయాలసిస్ బెడ్లు ● 2 వేలకు పైగా కిడ్నీ బాధితులు ● నెలలో పక్షం రోజులు ఆస్పత్రుల చుట్టూ.. ● దూరభారంతో వ్యాధిగ్రస్తుల విలవిలముస్తాబాద్(సిరిసిల్ల): మారుతున్న జీవన విధానాలు.. ఆహారపు అలవాట్లు.. తాగునీటిలో పలు మార్పులతో కిడ్నీలు పాడవుతున్నాయి. ఇటీవల జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. జిల్లాలో ఏకై క డయాలసిస్ సెంటర్ సిరిసిల్లలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంది. అక్కడ రోగులకు అనుగుణంగా బెడ్లు లేకపోవడంతో చాలా మంది కరీంనగర్, దుబ్బాక పట్టణాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖర్చు తడిసి మోపెడవడంతోపాటు దూరభారంతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో 20 బెడ్లు సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలోని 20 డయాలసిస్ బెడ్లపై రోజుకు 100 మంది చికిత్స పొందుతున్నారు. గత ప్రభుత్వం చొరవతో సిరిసిల్ల ఆస్పత్రిలో 20 బెడ్లపై డయాలసిస్ మిషన్లను ఏర్పాటు చేశారు. వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలో ఐదు బెడ్లతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నెలలో 450 మంది కిడ్నీ పేషంట్లకు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. రోజుకు 20 మందికి నాలుగు షిప్టుల్లో డయాలసిస్ నిర్వహిస్తున్నారు. అయితే ఒక పేషంట్‌కు కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక పేషంట్ ఆస్పత్రికి రావాలంటే ఆటో లేదా కారు అద్దెకు తీసుకోవాలి. దానికి రూ.2వేల నుంచి రూ.4వేలు అద్దె చెల్లించాల్సిందే. ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా డయాలసిస్ నిర్వహిస్తున్నా దూరభారం పేషంట్లకు శాపంగా మారింది. ప్రత్యామ్నాయం ఆరోగ్యకేంద్రాలు జిల్లాలోని వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, రుద్రంగి మండలాల నుంచి జిల్లా కేంద్రానికి రా వా లంటే ప్రత్యేకంగా ఓ వాహనం తీసుకోవాల్సి వ స్తుంది. ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో రద్దీ పెరగడంతో కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ పట్ట ణాలకు వెళ్తున్నారు. రోగి ప్రాణాలు కాపాడుకునేందుకు అత్యవసరంగా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో జిల్లాలో ఉన్న 13 మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం రెండు బెడ్లతోకూడిన డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల్లోని రోగులు కోరుతున్నారు. ఉద్యోగుల కుటుంబాలకు అందని డయాలసిస్ జిల్లా ఆస్పత్రితోపాటు వేములవాడలోని ప్రాంతీయ వైద్యశాలలో ఉద్యోగుల కుటుంబాలకు డయాలసిస్ వైద్యం అంద డం లేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా వీరికి హెల్త్‌కార్డులు, రీయింబర్స్మెంట్ ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయడం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు డయాలసిస్ కోసం కరీంనగర్, హైదరాబాద్, వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. తాము అంతా దూరం వెళ్లలేమని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ చికిత్స అందించి, రీయింబర్స్మెంట్ తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
ఏడాదిగా సిద్దిపేటకు వెళ్తున్నాం
కరీంనగర్ ఆస్పత్రికి డయాలసిస్‌కు వెళ్లాం. కొద్ది రోజులు సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ పేషంట్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి నన్ను తీసుకెళ్తున్నారు. పోతుగల్ పీహెచ్సీలో డయాలసిస్ ఏర్పాటు చేస్తే ముస్తాబాద్ మండలంలోని కిడ్నీ పేషంట్లను ఆదుకున్నావారవుతారు. – గూడెపు మణెమ్మ, ముస్తాబాద్ కరీంనగర్ వెళ్లడం ఇబ్బందిగా ఉంది నెల రోజుల క్రితం కిడ్నీ వ్యాధికి గురయ్యాను. డయాలసిస్ చేయాలన్నారు. నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగి. సిరిసిల్ల గవర్నమెంట్ దవాఖానలో నాకు డయాలసిస్ చేయరాదన్నారు. వారం రోజులకోసారి కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లడం చాలా బాధ కలుగుతుంది. మాకు ఇక్కడే డయాలసిస్ చేస్తే బాగుండేది. – తడుకల దేవయ్య, బండలింగంపల్లి కిడ్నీ పేషంట్లు పెరుగుతున్నారు వేములవాడ ఏరియా ఆస్పత్రికి కిడ్నీ పేషంట్లు భారీగా వస్తున్నారు. ఇక్కడ ఐదు బెడ్లు మాత్రమే ఉన్నాయి. నెలలో 450 మందికి ఇక్క డ డయాలసిస్ చేస్తున్నాం. మరో ఇరవై బెడ్లు ఏర్పాటు చేస్తే కిడ్నీ రోగులందరికీ డయాలసిస్ చేయడం సులభమవుతుంది. ఈమేరకు అధికారులకు నివేదిక పంపాం. – డాక్టర్ నాగరాజు, వేములవాడ, ప్రాంతీయ ఆస్పత్రి -
● ప్రజాహితమే లక్ష్యంగా ముందుకు
సిరిసిల్ల: ప్రజల పక్షాన నిలుస్తూ, ప్రజా సమస్యలనే ఎజెండాగా.. నిత్యం వార్తలను, కథనాలను అందిస్తూ ‘సాక్షి’ ముందుకు సాగుతుంది. 2025లో జిల్లాలో అనేక కథనాలను పాఠకుల ముందుంచుతూ ముందుకు సాగింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భ్రూణహత్యలను ఎండగట్టింది. అక్రమంగా నాలా కబ్జాలను వెలికితీసింది. చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయాలను ఎలుగెత్తి చాటింది. సామాన్య గిరిజన రైతు విద్యుత్ బిల్లును కట్టకుంటే కరెంట్ కట్ చేస్తే అతడికి అండగా నిలిచింది. చీకటి ఇంటికి వెలుగులు వచ్చేలా ‘సాక్షి’ చొరవ చూపింది. ‘సెస్’ అధికారులు స్పందించి విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఇసుక అక్రమ రవాణా, పల్లెల్లో బెల్ట్‌షాపులు, అటవీ భూముల ఆక్రమణలు ఇలా.. సహజ వనరులను రక్షించేందుకు ‘సాక్షి’ నడుం కట్టింది. రైతులను చైతన్యవంతులను చేస్తూ, జిల్లా వ్యవసాయ అధికారులతో ‘ఫోన్ ఇన్’ నిర్వహించింది. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ కమిషనర్లతో నేరుగా ప్రజలు మాట్లాడే అవకాశం కల్పిస్తూ, మున్సిపల్ కమిషనర్లతో ఫోన్ ఇన్ కార్యక్రమాలను చేపట్టింది. సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్యాధికారితో ఫోన్ ఇన్ చేపట్టింది. ఇలా ప్రజాహితమే లక్ష్యంగా ‘సాక్షి’ సాగిపోతుంది. -
చలితో అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్లటౌన్: జిల్లాలో చలితీవ్రత పెరిగింది. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న నేపథ్యంలో చలితో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకమంగా మారుతుంది. ఈనేపథ్యంలో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ వైద్యం, తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజితతో మంగళవారం ‘సాక్షి’ ఫోన్‌ఇన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రజలు అడిగిన ప్రశ్నలకు డీఎంహెచ్‌వో వివరంగా సమాధానాలు ఇస్తూ వారివారి సందేహాలను నివృత్తిచేశారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత ఉన్నారు. ● చలి తీవ్రతతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి. వాకింగ్ ఏ సమయంలో చేయాలి. గుండెపోట్లు ఎక్కువగా వస్తాయా.. వేడినీళ్లు తీసుకోవడం మంచిదేనా.? – గుంటి పోచమల్లు, కరుణాకర్– బోయిన్పల్లి, తోట ధర్మేందర్– పోత్గల్, దినేశ్– సిరిసిల్ల, కూర్మాచలం సత్యనారాయణ– రుద్రంగి, గోగూరి ప్రభాకర్‌రెడ్డి– నారాయణపూర్ డీఎంహెచ్‌వో: చలిగాలుల ప్రభావంతో వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముంది. శ్వాసకోశ, చర్మం పొడిబారడం, ముక్కుకారడం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, బీపీ, షుగర్, గుండె, ఇతర వ్యాధిగ్రస్తులు ఉదయం ఎండ రాకుండా బయటకు వెళ్లొద్దు. సాయంత్రం 6గంటల్లోపు ఇంటికి చేరుకోవాలి. చలికాలం సాధారణ వ్యక్తులు కూడా ఉదయం 6.30గంటల తర్వాత వాకింగ్ చేయడం మంచిది. చల్లని, వేడి నీళ్లు కాకుండా సాధారణ నీరు తాగాలి. వేడినీళ్లు తీసుకోవాల్సి వస్తే రెండు రోజులు తాగి వదిలేయాలి. ● జలుబు, దగ్గు విపరీతంగా ఉంటోంది. ఆర్ఎంపీ వద్ద మందులు తీసుకుంటున్నా తగ్గడం లేదు. మందులు చెప్పండి? – సత్యనారాయణ– ఇల్లంతకుంట, చిట్టాపురం రాజారం– రుద్రంగి, దోశల శంకర్– గంభీరావుపేట డీఎంహెచ్‌వో: చలికాలంలో వ్యాప్తి చెందే వైరస్‌తో సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. వాటి ప్రభావంతోనే జ్వరాలు, జలుబు, దగ్గు, ఒంటినొప్పులు వంటి లక్షణాలు ప్రజల్లో కనిపిస్తున్నాయి. జలుబు, దగ్గు కోసం లివోసెట్రిజిన్ మోంటెలుకాస్ట్ వాడండి. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో మందులు ఉన్నాయి. తాజా ఆహారం తీసుకుంటూ ఆరోగ్య నియమాలు పాటించాలి. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తారు. ప్రతి వ్యాధికి అక్కడే కచ్చితమైన వైద్యం అందుతుంది. ● చలి ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులకు జాగ్రత్తలు వివరించండి. బాబుకు తుమ్ములు, గొంతునొప్పి తగ్గడం లేదు.? – నులిగొండ శ్రీనివాస్– తంగళ్లపల్లి, కిరణ్, తమిశెట్టి అమర్–బోయిన్పల్లి, సతీష్– వీర్నపల్లి డీఎంహెచ్‌వో: వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు తప్పకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఉన్ని వస్త్రాలు ధరించాలి. ఆహార నియమాలు పాటించాలి. చిన్నపిల్లలు మినహా అందరూ వ్యాయామం, నడక, యోగా అలవాటు చేసుకోవాలి. అస్తమా రోగులు చల్లని ఆహారం తీసుకోవద్దు. తీసుకుంటే ఊపిరితిత్తుల గదులు దగ్గరకు ముడుచుకుని శ్వాస ఇబ్బందులు ఏర్పడుతాయి. చిన్నపిల్లలకు జలుబు ఎక్వువగా ఉంటే నాసల్ డ్రాప్స్ ఒక్కొక్కటి చొప్పున మూడూ పూటలు వేయొచ్చు. ● సీజనల్ వ్యాధులపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటులో ఫీజులు నిలువరించాలి, పేరొకరిది, చికిత్స చేసే వైద్యులున్నారత్సే చర్యలు తీసుకుంటారు? – మారవేని రంజిత్– రాచర్ల బొప్పాపూర్, గాంతుల మహేశ్– ముస్తాబాద్ డీఎంహెచ్‌వో: అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు, స్టాఫ్ వివరాలు, టెస్టుల ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశాం. నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటివాటికి అనుమతులు ఇవ్వం. ఇక గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, రక్షణపై ఏఎన్ఎంలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. మందుల కొరత లేదు. ప్రజలంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవడం మంచిది. ● మా గ్రామంలో జలుబు, జ్వరాలు వస్తున్నాయి. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు చెప్పండి? – ఏగుర్ల రాజు– వట్టెంల, తిరుపతి– వన్‌పల్లి, ఉపసర్పంచ్, అర్జన్– గంభీరావుపేట, వార్డుమెంబర్ డీఎంహెచ్‌వో: అన్నిగ్రామాల్లో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి సీజనల్ రోగాలపై అవగాహన కల్పిస్తూ మందులు ఇస్తున్నారు. ప్రజలంతా కచ్చితంగా దగ్గరిలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలి. బీపీ, షుగర్, గుండె జబ్బు ఉన్నవారు చలిలో తిరగొద్దు. చలి ప్రభావంతో రక్తప్రసరణలో ఇబ్బందులు తలెత్తి హైపర్‌టెన్షన్, బ్రెయిన్‌స్ట్రోక్, గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. నిల్వ ఉన్నవి, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినవి, బయట దొరికే చిరుతిండి, కూల్‌డ్రింక్స్, ఐస్క్రీంల జోలికి వెళ్లొద్దు. నీటిని తగిన మోతాదులో తీసుకోవాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. -
నిధులు మంజూరు చేయాలి
మా గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో భవనం పనులు పూర్తయ్యాయి. లోపల చిన్నపాటి పనులు మిగిలాయి. వాటి కోసం నిధులు మంజూరు చేస్తే పంచాయతీకి పక్కా భవనం అందుబాటులో ఉంటుంది. – భూక్య తిరుపతినాయక్, సర్పంచ్, గుంటపల్లిచెరువు తండా మాది కొత్త గ్రామపంచాయతీ. పంచాయతీ కార్యాలయం కోసం ప్రభుత్వం పక్కా భవనం మంజూరు చేయాలి. తాత్కాలికంగా రేకులషెడ్డులో ఆఫీస్‌ను పెట్టుకున్నాం. పక్కా భవనం లేక ఇబ్బంది పడుతున్నాం. – ముడావత్ గణేశ్, జైసేవాలాల్తండా -
సమన్వయంతో ఆపరేషన్ స్మైల్
సిరిసిల్లక్రైం: చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని, సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపెళ్లి చందన హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ మహేశ్ బీ గితేతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జనవరి 1 నుంచి 31 వ రకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని సమన్వయంతో అమలు చేయాలన్నారు. జిల్లాలో ఎ క్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సమీప పోలీస్‌స్టేషన్‌కు స మాచారం అందించాలని ప్రజలను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో కట్టుబ డి ఉందన్నారు. ఆ పరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని ఏఎస్పీ చంద్ర య్య ఆధ్వర్యంలో అమలు చేస్తామని తెలి పారు. డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజయ్య పాల్గొన్నారు. డీఆర్డీవో శేషాద్రి బదిలీసిరిసిల్ల: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి బదిలీ అయ్యారు. ఐదు రోజుల క్రితం ఆయనను మాతృసంస్థలో చేరాలని మౌఖిక ఆదేశాలు రావడంతో హైదరాబాద్ వెళ్లి జాయిన్ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో జెడ్పీ సీఈవో హోదాలో ఉన్న శేషాద్రి హైదరాబాద్ పీఆర్ శాఖకు వెళ్లినట్లు సమాచారం. జిల్లా డీఆర్డీవోగా 2023 ఫిబ్రవరి 14న విధుల్లో చేరారు. జిల్లాలో ఇప్పటికే జిల్లాస్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలు కీలక శాఖలకు ఇన్చార్జి అధికారులు ఉన్నారు. తాజాగా డీఆర్డీవో బదిలీ కావడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. జెడ్పీ డిప్యూటీ సీఈవోగా ఉన్న మచ్చ గీతకు ఇన్చార్జి డీఆర్డీవోగా నియమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించాలిసిరిసిల్లటౌన్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించాలని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ వాటిపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తామని మాటిచ్చి తప్పిందన్నారు. బెల్ట్ షాపులకు మద్యం రవాణా చేస్తున్న వైన్స్‌లపై చర్యలు తీసుకోకుంటే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భామనుల రవీందర్, అనసూర్య, సంగీత, త్రివేణి, దేవదాసు, సుజాత, లత తదితరులున్నారు. -
షెడ్లలోనే పంచాయతీలు
● పక్కా భవనాలు లేక ఇబ్బంది ● కొన్ని గ్రామాల్లో రేకులషెడ్లు ● మరికొన్ని గ్రామాల్లో అవి కూడా కరువు ● నిధులు లేక నిలిచిపోయిన నిర్మాణాలు● ‘ఈ చిత్రం ఎల్లారెడ్డిపేట మండలం బాకూర్‌పల్లితండా గ్రామపంచాయతీ కార్యాలయం. ఈ పంచాయతీ కార్యాలయం నిర్మాణానికి నిధులు మంజూరుకాగా, స్థలం లేక నిధులు వెనక్కిపోయాయి. దీంతో అద్దె ఇంట్లోనే ఆఫీస్ కొనసాగుతుంది’.● ‘ఈ ఫొటో ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లిచెరువు తండాలోని పంచాయతీ భవనం. నిధులు లేక భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. రూ.20లక్షలు మంజూరుకాగా నిధులు సరిపోక చిన్నపాటి పనులు మిగిలిపోయాయి. పనుల కోసం సైతం మరిన్ని నిధులు కావాలని ప్రతిపాదనలు పంపారు’. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు అంటారు. కానీ, ఆ పల్లెకు గుండెకాయ అయిన గ్రామపంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు కరువయ్యాయి. నిధులు లేక కొన్ని గ్రామాల్లో అర్ధంతరంగా నిలిచిపోగా, మరికొన్ని గ్రామాల్లో గ్రామస్తులే రేకులషెడ్లు ఏర్పాటు చేసుకొని ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నూతనంగా ఏర్పడ్డ తండా గ్రామాల్లో అద్దె ఇళ్లు తీసుకొని ఆఫీస్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీ నెల అద్దె చెల్లించడం కూడా జీపీలకు భారంగా మారుతుంది. 50 జీపీలకు భవనాలు కరువు జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా, 50 గ్రామాల్లో కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. దీంతో అద్దె ఇళ్లు, రేకులషెడ్లలో కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ● ఎల్లారెడ్డిపేట మండలం బాకూర్‌పల్లితండా, జైసేవాలాల్తండా, గుంటపల్లిచెరువుతండాల్లో జీపీ భవనాలు లేవు. ● గంభీరావుపేట మండలంలో ఇటీవల ఏర్పడిన హీరాలాల్తండా గ్రామంలో పంచాయతీ కార్యాలయం లేదు. ● ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లి, గోపాల్పల్లిల్లో జీపీలకు పక్కా భవనాలు నిర్మించలేదు. ● రుద్రంగి మండలం గైదిగుట్టతండా, అడ్డబోర్తండా, వీరునితండా, సర్పంచ్‌తండా, చింతామణి, రూప్లా, బడితండాల్లో పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక అద్దె ఇళ్లు, ప్రభుత్వ బడులలో కొనసాగుతున్నాయి. -
మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..?
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్వేములవాడఅర్బన్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరుపట్టిక, స్టోర్ రూమ్‌లో ఆహార సామగ్రి, కోడిగుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడిగుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రణాళికతో ముందుకెళ్లి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. -
అర్హులకు ఇళ్లు కేటాయించాలి
సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడం దురదృష్టకరమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ అన్నారు. మంగళవారం శాంతినగర్‌లోని డబుల్ బెడ్రూం ఇళ్లను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రజల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఇళ్లలోని ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామగ్రి దొంగలపాలవుతున్నాయన్నారు. ఈ ప్రాంతం అసాంఽఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని, అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు కొండ నరేశ్, మెరుగు శ్రీనివాస్, మోర రవి, నర్సయ్య, సురేశ్, శ్రీనివాస్, శ్రీధర్, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను కలిసిన ‘కొండూరి’
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లపై దృష్టి సారించాలిసిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్: పాఠశాల విద్యార్థులకు సంబంధించి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు పూర్తి చేయడంలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. అర్హులైన విద్యార్థులెవరూ మిస్సవకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. దరఖాస్తునకు అవసరమయ్యే ధృవపత్రాల జా రీ బాధ్యత తహసీల్దార్ పర్యవేక్షించాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ నిఖిత, డీఈవో వినోద్‌కుమార్, డీఎస్సీడీవో రవీందర్‌రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి భారతి, ఎల్డీఎం మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ హయాంలో అక్రమ కేసులు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులపై దాడులు చేయడమే కాకుండా, ఎల్లారెడ్డిపేట పోలీసులు మాజీ మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. గతంలో పోలీసులు బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేయగా సోమవారం సిరిసిల్ల కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. అప్పట్లో ఎల్లారెడ్డిపేట ఠాణాలోకి బీఆర్ఎస్ నాయకులు చొచ్చుకొని వచ్చి తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. తిరిగి తమ పార్టీ కార్యకర్తలపైనే కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు హాజరైన వారిలో పార్టీ మండలాధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, నాయకులు బోనాల సాయి, మారవేణి రంజిత్‌కుమార్, మద్దుల బుగ్గారెడ్డి, దాసరి గణేశ్, కోనేటి సాయిలు తదితరులున్నారు. -
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో సోమవారం విషాదం నింపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సారంపల్లికి చెందిన మహమ్మద్ హమీద్(47)కు సోమవారం చాతిలో మంటగా అనిపించింది. కుటుంబ సభ్యులు బద్దెనపల్లిలోని ఆర్ఎంపీ క్లినిక్‌కు తీసుకెళ్లగా రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే హమీద్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హమీద్‌ను వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హమీద్ అప్పటికే మరణించాడని తెలపడంతో కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య షబేరా, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో తన భర్త మరణించాడని మృతుని భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. మరిమడ్ల హాస్టల్ విద్యార్థినికి అస్వస్థతకోనరావుపేట: మండలంలోని మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థిని అస్వస్థతకు గురి కాగా ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. నిహారిక అనే ఆరో తరగతి విద్యార్థిని సోమవారం భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురైంది. గమనించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వెంటనే 108 అంబులెన్స్‌లో సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
ముక్కోటికి ముస్తాబు
సిరిసిల్లటౌన్/కోనరావుపేట(వేములవాడ): ముక్కోటి ఏకాదశి వేడుకలకు జిల్లాలోని వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. సిరిసిల్లలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ సెట్టింగులతో తిరుమల ఆలయం మాదిరిగా సప్తద్వారాలు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ ఈవో మారుతిరావు తెలిపారు. కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇన్చార్జి దేవయ్య తెలిపారు. సిరిసిల్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం -
కిక్ బాక్సింగ్‌లో బంగారు పతకాలు
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పబ్లిక్ స్కూల్ ఐపీఎస్ అకాడమీలో అస్మిత ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ వెస్ట్‌జోన్ పోటీలలో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపారు. మ్యూజికల్ ఫామ్ హార్డ్ స్టైల్ వెపన్ జూనియర్స్‌లో గంగణవేణి ప్రవళిక గోల్డ్ మెడల్ సాధించారు. సబ్ జూనియర్స్‌లో గజ్జెల శ్వేదిక కాంస్యం సాధించారు. తమిళనాడులో మార్చిలో జరిగే అస్మిత జాతీయస్థాయి ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. వీరిని వాకో కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడు సంతోష్‌కుమార్ అగర్వాల్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, మహిపాల్ అభినందించారు. మాస్టర్ అథ్లెటిక్స్‌లో బహుమతి సిరిసిల్లటౌన్: రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా నుంచి కడారి అశోక్‌కుమార్ 10 కి.మీ పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించారు. కరీంనగర్లో జరిగిన పోటీల్లో పాల్గొని జాతీయస్థాయికి ఎంపికయ్యారు. మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, గొట్టిముక్కుల శేఖర్, మునీందర్‌రెడ్డి అభినందించారు. వాహనం అదుపు తప్పి యువకుడి మృతిరాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలూరుకు చెందిన జటోతు భూమేశ్ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూమేశ్ స్నేహితుడైన దినేశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై రాయికల్ నుంచి చింతలూరు వైపు వెళ్తున్నారు. భూపతిపూర్ శివారులో వాహనం అదుపుతప్పి రేలింగ్‌కు ఢీకొనడంతో భూమేశ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దినేశ్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో భూమేశ్ కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. -
తాళం వేస్తే టార్గెట్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తాళం వేసి ఊరెళ్లుతున్నారా.. అయితే మీ ఇల్లు దొంగలకు టార్గెట్ కానుంది. తిరిగొచ్చే సరికి ఇల్లు గుల్ల కావడం ఖాయం. ఇటీవల జిల్లాలో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తే తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగల ఆచూకీ దొరకడం లేదు. వరుస సంఘటనలు ఎల్లారెడ్డిపేట మండలంలో నెల రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. తాజాగా రాచర్లగొల్లపల్లిలోని తాళం వేసిన ఉన్న రెండు ఇళ్లలోకి ప్రవేశించి నగదు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు. అంతకుముందు అల్మాస్పూర్లో మూడు ఇళ్లల్లో దొంగతనం చేశారు. పనిచేయని సీసీ కెమెరాలు జిల్లా వ్యాప్తంగా 257 గ్రామపంచాయతీలకు దాదాపు 65 శాతం గ్రామాల్లో స్థానికులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిర్వహణపై పట్టింపు లేక సగానికి పైగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. జిల్లాలో 1,225కు పైగా సీసీ కెమెరాలను గతంలో ఏర్పాటు చేశారు. అయితే ఇందులో వెయ్యికి పైగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఎన్నికై న గ్రామపంచాయతీల పాలకవర్గాలు సీసీ కెమెరాల నిర్వహణపై దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. వేలిముద్రల సేకరణలో పోలీసులు జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వలస కార్మికుల రాక పెరిగింది. జిల్లాలో భవన నిర్మాణాల పనులు ముమ్మరం కావడం, వ్యవసాయ పనులు ఊపందుకోవడం, కోళ్లషెడ్లలో పనిచేసేందుకు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి కార్మికులు వస్తున్నారు. వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో అపరిచిత వ్యక్తుల సంచారం పెరగడంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అంతేకాకుండా గత పదిహేను రోజులుగా జిల్లాలో జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో వలసకూలీల వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో వలసకూలీల వివరాలతో కూడిన జాబితాను తయారు చేయడమే కాకుండా వేలిముద్రలు సేకరిస్తున్నారు. దొంగతనాలు జరిగిన సందర్భాల్లో వలసకార్మికుల వేలిముద్రలతో పోల్చి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలోని వేముల కల్యాణి ఇంట్లోని బీరువా పరిస్థితి. ఈనెల 7న దొంగలు పడి బీరువాలోని విలువైన వస్తువులు, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. గ్రామంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగల సమాచారం దొరకడం లేదు. 25 రోజులు గడుస్తున్నా దొంగల ఆచూకీ తెలియడం లేదు. ఇలా మండలంలో నెల రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు జరిగాయి. దొంగతనాల నేపథ్యంలో నిఘా తీవ్రం చేశాం. రాచర్లగొల్లపల్లిలో రెండు ఇండ్లల్లో జరిగిన దొంగతనంపై విచారణలో భాగంగా పలువురి వేలిముద్రలు సేకరించాం. పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన దొంగలను పట్టుకున్నాం. గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయక నిందితులు సులభంగా తప్పించుకోగలుగుతున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – రాహుల్‌రెడ్డి, ఎల్లారెడ్డిపేట ఎస్సై -
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం మాట్లాడుతూ అదే సమయంలో 2026–27 బడ్జెట్లో గల్ఫ్‌కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించి, సహాయం అందించేలా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రవాసి ప్రజావాణి ఫిర్యాదు కేంద్రంలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దాదాపు 10 లక్షల మంది గల్ఫ్ కార్మికుల పిల్లలు ఉన్నారని.. రానున్న విద్యాసంవత్సరానికి గురుకులాల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏటా కేంద్రం నిర్వహించినట్లు రాష్ట్రంలో ‘ప్రవాసి తెలంగాణ దివస్’ నిర్వహించాలని కోరారు. ఈ దిశగా టాంకామ్, న్యాక్ సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రతీ నెల సుమారు 100 ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న మాతాశిశు సంరక్షణ(ఎంసీహెచ్)ను 50 పడకలకు పెంచాలని కోరారు. -
క్రీడాకారులకు అభినందనలు
సిరిసిల్ల: జాతీయస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొన్న జిల్లాకు చెందిన క్రీడాకారులను ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం అభినందించారు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన 49వ జాతీయస్థాయి క్రీడాపోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన జట్టులో జిల్లాకు చెందిన క్రీడాకారులు ఐదుగురు పాల్గొన్నారు. వీరిని ఇన్చార్జి కలెక్టర్ అభినందించారు. జిల్లా యువజన అధికారి రాందాస్, జట్టు కోచ్ సంపత్‌గౌడ్, అసిస్టెంట్ కోచ్ జగన్ మోహన్ ఉన్నారు. సిరిసిల్లటౌన్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శ్రీ రుషి ప్రభాకర్ విద్యా కేంద్రంలో రాష్ట్రస్థాయి గీత శ్లోక పఠన పోటీలు నిర్వహించారు. సిద్ధ సమాధి యోగా బ్రహ్మోపదేశకులు ఆచార్య దయాకర్ ఆధ్వర్యంలో బాలబాలికలకు నిర్వహించగా సిరిసిల్ల చిన్మయ బాలవిహార్ విద్యార్థిని కుడిక్యాల తేజస్వి ప్రథమ బహుమతి గెలుచుకుంది. తేజస్విని బాలవిహార్ ఆచార్యులు చిన్మయ మిషన్ సిరిసిల్ల ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ, అధ్యక్షుడు సజ్జనం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ లకావత్ మోతిలాల్, కోశాధికారి మేరుగు మల్లేశం, కార్యవర్గ సభ్యులు జక్కని రమేశ్, వెంగళ కమలాకర్, చేపూరి బుచ్చయ్య, అంజనాదేవి, దేవయ్య అభినందించారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యచందుర్తి(వేములవాడ): ఇద్దరు భార్యలు విడాకులు తీసుకోవడంతో ఒంటరిగా బతుకున్న వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన ఇందూరి రాములు(45)కు గతంలో రెండు వివాహాలు కాగా.. ఇద్దరు భార్యలు విడాకులు తీసుకున్నారు. 2017 నుంచి మతిస్థిమితం కోల్పోయాడు. తల్లి సత్తవ్వ పలు దవాఖానాలలో చూపించినా నయం కాలేదు. ఒంటరితనం భరించలేక సోమవారం ఇంట్లోని దూలానికి ఉరివేసుకున్నాడు. అనంతరం వచ్చిన తల్లి ఇంట్లోకి వెళ్లగా కొడుకు దూలానికి వేలాడుతూ కనిపించడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై రమేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తల్లి సత్తవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సిరిసిల్లటౌన్: తమకు రావలసిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. తమ సమస్యల సాధనకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో సర్పంచులను అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. సీపీఆర్‌పై అవగాహనవేములవాడఅర్బన్: అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేసి ప్రాణాలు నిలపవచ్చని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చీకోటి సంతోష్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు, అధ్యాపకులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. డాక్టర్ నాగర్జున, రాజేశ్వరీ, వంశీకృష్ణ, ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, శంకరయ్య, శ్యామ్, కుమారస్వామి, మానస, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
భీమేశ్వరుడికి మొక్కులు
వేములవాడ: శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం భీమన్నను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండం మూసివేయడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ప్రత్యేక స్నానపు గదులను రాజేశ్వరపురం వసతి గదులు కూల్చివేసిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవమూర్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా ఫ్లైఓవర్ బ్రిడ్జీలను తాత్కాలికంగా తొలగించనున్నారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలను చేపట్టే పనులపై జాతర సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. -
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ప్రజావాణికి 146 దరఖాస్తులుసిరిసిల్ల అర్బన్: ప్రజావాణికి వచ్చిన అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఽఖితతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. మొ త్తం 146 దరఖాస్తులు వచ్చాయి. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు వి ధిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ
గంభీరావుపేట మండలం నర్మాల వద్ద 50 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా ‘ఆగస్త్య ఫుడ్స్’ కంపెనీ ‘సూపర్ ఫుడ్స్’ యూనిట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 130 మందికి ఉపాధి కల్పిస్తూ ఆగస్త్య కంపెనీ ‘సూపర్ ఫుడ్స్’ తయారు చేస్తూ ఎగుమతి చేస్తుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేశారు. వివిధ పంటలను రైతులు పండించేలా అవి ఇక్కడే ప్రాసెస్ అయి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తొలియూనిట్ ఈ ఏడాది పని ప్రారంభించింది. -
రాజన్న సిరిసిల్ల
చలి తీవ్రత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు● నేడు డీఎంహెచ్‌వో రజితతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ఫోన్ నంబరు 96036 07550సమయం : మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకుమంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 20257సిరిసిల్లటౌన్: చలితీవ్రత పెరిగింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు, పౌరులు ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దగ్గు, జలుబు, జ్వరపీడితులకు ఆయా ఆస్పత్రులలో మందులు, వైద్యం తదితర అంశాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రజితతో ‘సాక్షి’ మంగళవారం ఫోన్ ఇన్ నిర్వహిస్తుంది. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. -
ఎన్నికలతో ముగిసి..!
ఆటలతో మొదలై..పోలీస్ స్పోర్ట్స్ మీట్‌తో మొదలైన 2025.. ఎమ్మెల్సీ ఎన్నికలతో వేగం అందుకుని, పంచాయతీ ఎన్నికలతో ప్రశాంతంగా ముగిసింది. దక్షిణకాశీగా పిలిచే వేములవాడలో దర్శనాలు నిలిపివేయడం భక్తులకు తీవ్ర అసౌకర్యం కల్పించినా.. ఆలయాభివృద్ధి కోసం తప్పలేదు. సీబీఐ వామనరావు దంపతుల కేసు.. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై విచారణ ప్రారంభించింది. క్రిప్టో కరెన్సీ పేరిట వెలుగుచూసిన రెండు కుంభకోణాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేశాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్‌ను ‘సిట్’ విచారించింది. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
ఇక.. పుర వేఢీ!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాలకవర్గాల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న బల్దియాల్లో ఎన్నికల నగరా మోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణకు కార్యాచరణ చేపట్టింది. మంగళవారం నుంచి వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి, జనవరి 1న పట్టణ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. 5న ఆయా మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ కమిషనర్లు రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జనవరి 10న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ చేపట్టనున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. -
అందుబాటులో సాగుకు సరిపడా యూరియా
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలో యాసంగి సీజన్ పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం తెలిపారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందొద్దన్నారు. పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో యాసంగి సాగుకు 21 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి దాకా 10,991 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ప్రైవేటు డీలర్లు 223, సహకారం సంఘాల(పీఏసీఎస్) షాపులు 54, డీసీఎంఎస్ దుకాణాలు 16, ఏఆర్ఎస్కే పరిధిలో 13 ఎరువుల షాపులు ఉన్నాయని వెల్లడించారు. అన్ని షాప్‌లలో రోజూ ఉదయం ఆరు గంటల నుంచి విక్రయాలు మొదలుపెట్టాలన్నారు. ఎరువులకు సంబంధించిన సమస్యలు ఉంటే రైతులు టోల్ ఫ్రీ నంబరు 18005995779లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆనందోత్సాహాల మధ్య వేడుకలు చేసుకోవాలిసిరిసిల్ల క్రైం: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజాభద్రతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, అధిక శబ్ద పరికరాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీజేలపై నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. భక్తులకు సంపూర్ణ రక్షణవేములవాడ: రాజన్న, భీమన్న దర్శనాలకు వచ్చే భక్తులకు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చే వారికి సంపూర్ణ రక్షణ కల్పిస్తామని ఏఎస్పీ రుత్విక్‌సాయి పేర్కొన్నారు. భీమన్నగుడి ప్రాంతం, భీమేశ్వర సదన్, క్యూలైన్లు, తాత్కాళిక ఉత్తరద్వారం, జాతర సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించే ప్రాంతాలను సోమవారం ఈవో రమాదేవితో కలిసి పరిశీలించారు. చేపట్టాల్సిన బందోబస్తుపై టౌన్ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై రాజుకు దిశా నిర్ధేశం చేశారు.గంభీరావుపేట(సిరిసిల్ల): అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న సింగిల్‌విండోలను గుర్తించారు. గంభీరావుపేట, ఇల్లంతకుంట సింగిల్‌విండోలను ఎంపిక చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా కొండూరు రవీందర్రావు, రాజిరెడ్డి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీకి స్టాండింగ్ కౌన్సెల్ నియామకానికి సంబంధించి న్యాయవాదుల ప్యానెల్ దరఖాస్తుల సమర్పణ గడవును జనవరి 3 వరకు పొడగించారు. ఈమేరకు సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల్లో ఓసీ 1, బీసీ 2, ఎస్సీ 2 మాత్రమే అందాయని పేర్కొన్నారు. మహిళల కేటగిరీ దరఖాస్తు అందకపోవడంతోపాటు ఎస్టీ కేటగిరీకి చెందిన ఒక దరఖాస్తు తిరిగి పంపించినట్లు పేర్కొన్నారు. ఒక మహిళా కేటగిరీ, ఒక ఎస్టీ కమ్యూనిటీ దరఖాస్తు కోసం గడవు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రాజన్నకు శోభ.. నేతన్నకు ధీమా
ఇందిరా మహిళా శక్తి చీరను ప్రదర్శిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు(ఫైల్)వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు(ఫైల్)సిరిసిల్ల: కాలగమనంలో మరో ఏడాది కలిసిపోతుంది. 2025లో జిల్లాలో అభివృద్ధి పనులకు అడుగుజాడలు పడినా.. ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై చర్చ సాగుతూనే ఉంది. అభివృద్ధి విషయంలో అనేక అంశాలు మన కళ్ల ముందు మెదులుతున్నాయి. 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఈ ఏడాది అడుగులు పడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడకు వచ్చి శంకుస్థాపన చేసిన పనుల్లో భాగంగా రూ.76కోట్లతో పనులు సాగుతున్నాయి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఆలయ అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. వచ్చే వందేళ్లకు సరిపడే వసతులతో అభివృద్ధి చేయాలని ప్రణాళికతో పనులు సాగుతున్నాయి. ఇరుకుగా ఉన్న వేములవాడ పట్టణ రోడ్లను ఎన్నడూ లేని విధంగా విస్తరిస్తున్నారు. దశాబ్దాలుగా రాజకీయ క్రీనీడలో రోడ్ల విస్తరణ ప్రహసనంగా మారింది. కానీ ఈసారి ఏకంగా అడుగులు పడ్డాయి. రోడ్డు విస్తరణలో ఇళ్లు నష్టపోతున్న వారికి రూ.40కోట్లు పరిహారంగా అందించారు. రోడ్డు నిర్మాణానికి రూ.8.50కోట్లు కేటాయించారు. ఆలయంలో నిత్యపూజలు కొనసాగిస్తూనే భీమన్న ఆలయంలో దర్శనాలు చేయిస్తున్నారు.వస్త్రోత్పత్తిదారులకు అరువుపై నూలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ మార్కెట్‌యార్డులో నూలుడిపో ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే నేరుగా నూలు కొని నేతన్నలకు అందిస్తుంది. ఈ ఏడాది 1.20కోట్ల మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలు ఇచ్చేందుకు నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చింది. ఇప్పటికే టెస్కో అందించిన రెండు ఆర్డర్లు పూర్తయ్యాయి. మూడో ఆర్డర్ చీరల ఉత్పత్తి మొదలైంది. వస్త్రోత్పత్తి రంగానికి రూ.550 కోట్ల విలువైన ఆర్డర్లను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వమే నాణ్యమైన నూలు అరువుపై అందించడంతో మధ్యతరగతి వస్త్రోత్పత్తిదారులకు ఊరట లభించింది. మరోవైపు ఇతర ప్రభుత్వ శాఖల వస్త్రాల ఆర్డర్లు, స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్లు యథావిధిగా అందా యి. నేతన్నలకు ‘వర్కర్ టు ఓనర్’ అమలైతే నిరుపేద నేతకార్మికులకు శాశ్వత ఉపాధి దొరుకుతుంది. వస్త్రోత్పత్తి ఆర్డర్లు ‘పుండు ఒక్క చోట ఉంటే.. మందు మరో చోట’ రాసినట్లుగా మారుతుంది. -
ఫలితాలు సాధించినప్పుడే గుర్తింపు
కోనరావుపేట(వేములవాడ): విద్యార్థులు పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించినప్పుడే పాఠశాలకు, గ్రామానికి గుర్తింపు లభిస్తుందని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు పేర్కొన్నారు. మండలంలోని కొలనూర్, ధర్మారం, కోనరావుపేట, నాగారం గ్రామాల్లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లు పంపిణీ చేసి మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. మండలంలో మొదటి విడతగా నాలుగు గ్రామాల్లో అందించామని, త్వరలోనే మిగతా గ్రామాల్లోని విద్యార్థులకు సైకిళ్లు అందుతాయని తెలిపారు. ఎంఈవో మురళీనాయక్, సర్పంచులు మిర్యాల్‌కార్ బాలాజీ, అజ్మీరా జయరాం, అప్పాల భూషణం, మాజీ జెడ్పీటీసీ అన్నపూర్ణ, నాయకులు సురేందర్‌రావు, తిరుపతి, సురేశ్, నాగరాజు పాల్గొన్నారు. -
పొలాలకు సెక్యూరిటీ
కోనరావుపేట(వేములవాడ): వ్యాపార సముదాయాలు.. బ్యాంకులు... నివాసాలు ఉన్న ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం సాధారణం. కానీ పంట పొలాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వింతే. కానీ ఇది నిజం. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామ రైతులు పంట పొలాల వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. దొంగతనాలకు చెక్ పొలాల వద్ద వ్యవసాయ సామగ్రి, కరెంట్ వైర్లు, మోటార్లు ఉంటాయి. కొన్ని సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్‌మోటార్లు, వైర్లు, వ్యవసాయ పరికరాలను ఎత్తుకెళ్తుంటారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి నీటిపైపులను సైతం కోసుకెళ్తుంటారు. అసలే అంతంతే లాభాలు వచ్చే వ్యవసాయంలో ఈ దొంగతనాలు రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ పంట పొలాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని రైతులు తమ సెల్ఫోన్లకు అనుసంధానించుకోవడంతో పొలాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి పొలాల వద్ద వస్తువులు మాయం కావడం లేదు. -
హత్యలు.. మోసాలు
సెల్ఫోన్లను బాధితులకు అప్పగిస్తున్న ఎస్పీ మహేశ్ బీ గీతే (ఫైల్)సత్యానారాయణరెడ్డి (కోసా) అంతిమయాత్ర (ఫైల్)సిరిసిల్లక్రైం: ప్రతీకార హత్యలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందారు. ఓ రియల్టర్.. మాజీ నక్సలైట్ల ప్రతీకారహత్యలు.. చందుర్తిలో ఆస్తి తగాదాలో ఓ మహిళ ప్రాణాలు తీసిన సంఘటనలు కలకలం రేపాయి. దొంగతనాలు, దోపిడీలు తగ్గినా సైబర్‌మోసాలు పెరిగిపోయాయి. సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని జిల్లా ప్రజలు భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. అదే సమయంలో పోలీసులు చాకచక్యంగా అంతరాష్ట్ర సైబర్మోసగాళ్లను పట్టుకున్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఫలించి నేరాలశాతం తగ్గాయి. అదే సమయంలో హత్యలు.. దాడులతో 2025లో జిల్లా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చందుర్తిలో మహిళ దారుణ హత్య రెండు కుటుంబాల మధ్య 20 గుంటల భూమి తగాదాలో చందుర్తి మండల కేంద్రంలోని తన పెద్దమ్మను ఓ యువకుడు మే 26వ తేదీన హత్య చేశాడు. అదే కత్తితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తానే చంపినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సదరు యువకుడు గతంలోనూ ఓ హత్య చేయడంతో పీడీయాక్ట్ నమోదు చేశారు. సిరిసిల్లలో రియల్టర్.. సిరిసిల్ల మాజీ కౌన్సిలర్, రియల్టర్ సిరిగిరి రమేశ్(48)ను అతని భాగస్వాములే హత్య చేశారు. అతని కారులోనే అందరూ కలిసి వెళ్లి వెంట తీసుకెళ్లిన కత్తితో గొంతు కోశారు. సెప్టెంబర్ 20న రమేశ్ మృతదేహాన్ని వేములవాడ నందికమాన్ సమీపంలోని అతని వెంచర్లో కారును వదిలేసి వెళ్లడం కలకలం రేపింది. వారం రోజుల తర్వాత హత్యకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకారంతో సిద్ధన్న హతం నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన కాలంలో దళం సూచనలతో తాను ఒకరిని చంపిన విషయాన్ని మాజీ నక్సలైట్ సిద్ధన్న(బల్లెపు నర్సయ్య) ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూను చూసిన సదరు మృతుని కొడుకు జక్కుల సంతోష్.. సిద్ధన్నతో స్నేహం పెంచుకొని పథకం ప్రకారం అగ్రహారం గుట్టల్లోకి తీసుకెళ్లి బండతో మోది హతం చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోవడంతో హత్య విషయం వెలుగుచూసింది. కోసా ఎన్కౌంటర్ మావోయిస్టు అగ్రనేత కోసా ఉరఫ్ కడారు సత్యనారాయణరెడ్డి సెప్టెంబర్ 22న ఎన్కౌంటర్లో మృతిచెందారు. తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లికి చెందిన కోసా 1980లో అజ్ఞాతంలోకి వెళ్లారు. చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. విద్యావంతుడుగా ఉద్యోగంలో స్థిరపడిన సత్యనారాయణరెడ్డి పీడిత ప్రజల కోసం నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లి సుదీర్ఘకాలం పనిచేశారు. మద్యం మత్తులో కారునడిపి.. మద్యం మత్తులో కారు నడిపి ఒకరి మృతికి కారణ మైన ఘటన జూన్ 20న జరిగింది. తంగళ్లపల్లి మండలం నేరళ్ల శివారులో సిద్దిపేట వైపు నుంచి తంగళ్లపల్లి వైపు వస్తూ ద్విచక్రవాహదారుడు కుర్మ నరేశ్(38)ను కొరు ఢీకొట్టింది. అక్కడే ఉన్న వారందరూ కారులోని యువకుడిని నిలదీయగా.. కేసు పెడితే జైలుకు పోతానని మద్యంమత్తులో చిందులు వేయ డం అక్కడి వారిని హతాశులను చేసింది. ఆస్పత్రికి తరలించేలోపే నరేశ్ ప్రాణాలు కోల్పోయాడు. అధికార, ప్రతిపక్ష పార్టీల లడాయి అభివృద్ధి పథకాలు, పనుల ప్రారంభోత్సవంలో సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటో లేదని బీఆర్ఎన్ నేతలు నిరసనలు తెలిపారు. మే నెలలో జరిగిన ఈ వివాదం ఎమ్మెల్యే కేటీఆర్ అధికారిక నివాసంపై కాంగ్రెస్ నేతల దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. స్మార్ట్‌గా చీటింగ్ సైబర్‌నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇటీవల సెస్ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగికి వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయగా అతని ఖాతాలో ఉన్న రూ.13లక్షలను సైబర్ మోసగాళ్లు కాజేశారు. జిల్లాలో ఇలా ఏడాదిలో 114 కేసులు నమోదు కాగా.. రూ.67.93 లక్షలను సైబర్ విభాగం హోల్డ్ చేసి అందులోంచి రూ.39.11లక్షలు రికవరీ చేసింది.


