మా కొడుకు ప్రణీత్‌రెడ్డి 2023లో విద్యుత్ ప్రమాదంలో గాయపడ్డాడు. మా ఇంటి పక్కనే వద్దనంగా విద్యుత్‌లైన్ వేశారు. కోతులను కొట్టేందుకు ఇంటిపైకి వెళ్లిన మా కొడుకు కరెంట్ షాక్ తగిలి 80 శాతం గాయాలయ్యాయి. ప్రాణాలకు గ్యారంటీ లేదన్నారు. రూ.20లక్షలు అప్పు చేసి వైద్యం చేయించుకుని ప్రాణాలను కాపాడుకున్నాం. ‘సెస్’ సంస్థ ఒక్కపైసా పరిహారం కూడా ఇవ్వలేదు.
– ప్రణీత్ తల్లి, పదిర గ్రామం
ట్రాన్స్‌పార్మర్ కాలిపోతే.. రైతులే మోటారు ఇంత అని డబ్బులు వసూలు చేసి ‘సెస్’ సిబ్బందికి ఇస్తున్నారు. ‘సెస్’కు ఐదు వాహనాలు ఉన్నా ప్రైవేటు వాహనాల్లో ట్రాన్స్‌ఫార్మర్ తెస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ పనిచేయదు. మీటింగ్‌ల సమాచారం ఇవ్వరు. విద్యుత్ ప్రజావాణి మొక్కుబడిగా నిర్వహించి ఫొటోలు దిగుతున్నారు. ‘సెస్’ సంస్థ రూ.కోట్ల అప్పుల్లో ఉంది. ఆస్తులను కోల్పోతుంది.
– జోగినిపల్లి సంపత్‌రావు, నర్సింగాపూర్
జిల్లాలో 140 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. 124 హె చ్‌పీల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని హెచ్‌టీ బిల్లింగ్ చేస్తున్నారు. ఎల్‌టీ బిల్లింగ్‌ను హెచ్‌టీగా మార్చడంతో ఎక్కువ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. దీన్ని సవరించాలని చెప్పినా ‘సెస్’ అధికారులు పట్టించుకోవడం లేదు. బిల్లు కట్టకుంటే డిస్‌కనెక్షన్ చేస్తున్నారు. దీంతో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లకు నష్టం జరుగుతుంది. సిటిజన్ చార్టర్‌ను ‘సెస్’లో అమలు చేయడం లేదు.
– గర్రిపెల్లి ప్రభాకర్, సిరిసిల్ల
పవర్‌లూమ్ పరిశ్రమలో బ్యాక్ బిల్లింగ్ పేరిట గతంలో వినియోగించిన విద్యుత్‌కు ఇప్పుడు బిల్లులు వేస్తున్నారు. ఒక్కో మరమగ్గాల పరిశ్రమ రూ.లక్షల్లో బ్యాక్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని విద్యుత్ కట్ చేస్తున్నారు. పాతికేళ్లుగా అమలులో ఉన్న 50 శాతం విద్యుత్ రాయితీలో పరిశ్రమ నడిచింది. ఇప్పుడు కొత్తగా బ్యాక్ బిల్లింగ్ వేయడం సరికాదు. ఈఆర్‌సీ చొరవ చూపి బ్యాక్ బిల్లింగ్‌ను రద్దుచేసి వస్త్రపరిశ్రమను రక్షించాలి.
– తాటిపాముల దామోదర్, సిరిసిల్ల
సంస్థలో 20 ఏళ్లుగా ఒకే చోట ఉద్యోగులు పాతుకుపోయారు. వారిని బదిలీ చేయకుండా ఉన్నతాధికారులు, పాలకవర్గం మీకు మేము.. మాకు మీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతులు, వినియోగదారులు విద్యుత్ సమస్యలతో వస్తే అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. సరిగ్గా డ్యూటీలు చేయకుండా రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. ‘సెస్’ సంస్థను ఎన్‌పీడీసీఎల్‌లో కలపాలి.
– దేవయ్య, ఎల్లారెడ్డిపేట
మధ్యమానేరు ముంపు గ్రామాల్లోని రూ.కోట్ల విలువైన విద్యు త్ పరికరాలను అమ్మేసి సొ మ్ము చేసుకున్నారు. కేంద్రం అ మలు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ సోలార్ ఎనర్జీని ‘సెస్’ సంస్థ ఎందుకు ప్రోత్సహించడం లేదు. సంస్థ స్వ యం సమృద్ధి సాధించడం లేదు. సిక్ యూనిట్లకు వన్‌టై మ్ సెటిల్‌మెంట్లు చేసి మొండి బకాయిలను వసూలు చేయాలి. ఆదర్శ ‘సెస్’ను ఎన్‌పీడీసీఎల్‌లో కలపాల నే డిమాండ్ వస్తుందంటే పాలకవర్గం ఆలోచించాలి.
– పులి లక్ష్మీపతిగౌడ్, స్తంభంపల్లి
‘సెస్’ సంస్థలో ఒకప్పుడు సే వా భావం ఉండేది. ఇప్పుడు లేదు. 124 కేవీ విద్యుత్ రైస్ మిల్లులకు శాపంగా మారింది. నేను అదనంగా రూ.5లక్షలు చె ల్లించాను. మా ఊరిలో బైరి దుర్గయ్య అనే దళితుడు రూ.7,600 చెల్లించి 2 పోల్స్ కావాలంటే ఇవ్వలేదు. కానీ అతని పేరిట మెటీరియల్ డ్రా చేశారు. దీనికి బాధ్యులు ఎవరు? ఊరిలో లోవోల్టేజీ సమస్య ఉందని, ఓ ట్రాన్స్‌ఫార్మర్ వేయాలంటే పట్టించుకోవ డం లేదు. సంస్థలో పని చేసే వారు కరువయ్యారు.
– వెన్నమనేని వంశీకృష్ణరావు, మర్తనపేట
ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు నష్టం
ముంపు గ్రామాల్లోని మెటీరియల్
ఏమైంది
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోలే రైతులు డబ్బులు కట్టాలా..
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోలే రైతులు డబ్బులు కట్టాలా..
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోలే రైతులు డబ్బులు కట్టాలా..
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోలే రైతులు డబ్బులు కట్టాలా..
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోలే రైతులు డబ్బులు కట్టాలా..
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోలే రైతులు డబ్బులు కట్టాలా..