సివిల్స్‌ సాధించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ సాధించడమే లక్ష్యం

Published Mon, Mar 31 2025 10:54 AM | Last Updated on Mon, Mar 31 2025 1:03 PM

సివిల

సివిల్స్‌ సాధించడమే లక్ష్యం

పెద్దపల్లిరూరల్‌: గ్రూప్‌–1 ఫలితాల్లో పెద్దపల్లి పట్టణానికి చెందిన పొందుగుల భూషిత్‌రెడ్డి 76వ ర్యాంకు ను సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన పొందుగుల విజయలక్ష్మి – భాస్కర్‌రెడ్డి దంపతుల కుమారుడు భూషిత్‌రెడ్డి.. సివిల్స్‌ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఇన్‌కంట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించేందుకు ఓ వైపు పనిచేస్తూనే మరోవైపు కఠోర దీక్షతో చదువుతున్నారని తల్లిదండ్రులు విజయలక్ష్మి, భాస్కర్‌రెడ్డి తెలిపారు.

సివిల్స్‌ సాధించడమే లక్ష్యం 1
1/1

సివిల్స్‌ సాధించడమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement