క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి | - | Sakshi
Sakshi News home page

క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి

Apr 4 2025 1:46 AM | Updated on Apr 4 2025 1:46 AM

క్రీడ

క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి

● సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధికా జైస్వాల్‌

వేములవాడ: క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్‌ పేర్కొన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహిస్తున్న క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌ పోటీలను గురువారం ప్రారంభించారు. మహిళా వైద్యులతో కలిసి కాసేపు క్రికెట్‌ ఆడారు. విజయం సాధించిన లయన్స్‌ లెజెంట్స్‌ టీమ్‌కు బహుమతులు అందజేశారు.

కేసీఆర్‌కు రాజన్న ప్రసాదం

వేములవాడ: మాజీ సీఎం కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు గురువారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో చల్మెడ పాల్గొన్నారు.

ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించాలి

డీఎంహెచ్‌వో రజిత

తంగళ్లపల్లి(సిరిసిల్ల): జాతీయ ఆరోగ్య పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో రజిత సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సిబ్బందితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రోగ్రాం అధికారి సంపత్‌, రామకృష్ణ, పీహెచ్‌సీ మెడికల్‌ అధికారి అఫీజా, సిబ్బంది పాల్గొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణకు కృషి

వేములవాడఅర్బన్‌: రాజ్యాంగ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జైభీమ్‌.. జైబాపు..జై సంవిధాన్‌ జిల్లా ఇన్‌చార్జి అవేజ్‌, మండల ఇన్‌చార్జి చంద్రకళ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్‌ పరిధి నాంపల్లిలో గురువారం నిర్వహించిన పాదయాత్రలో మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రాజ్యంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ కనికరపు రాకేశ్‌, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్‌, కూరగాయల కొమురయ్య, చిలివేరి శ్రీనివాస్‌, బొజ్జ భారతి ఉన్నారు.

లాఠీచార్జీపై వినూత్న నిరసన

సిరిసిల్లటౌన్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ గురువారం స్థానిక చేనేతచౌక్‌ వద్ద బీఆర్‌ఎస్వీ నాయకులు మోకాళ్లపై కూర్చున్నారు. బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థులు శాంతి యుతంగా నిరసన తెలిపితే లాఠీచార్జీ చే యడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ సర్కారు నిలబడినట్లు చరిత్రలో లేదన్నారు. మట్ట శ్రీనివాస్‌, ముద్దం అనిల్‌, కాస ర్ల వినయ్‌, దేవరాజ్‌, ముజ్జు, నవీన్‌, గణేష్‌, రాజు, వినయ్‌, నరేశ్‌, వేణు, మోహన్‌, పరమేశ్‌, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి1
1/4

క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి

క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి2
2/4

క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి

క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి3
3/4

క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి

క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి4
4/4

క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement