సర్దార్‌ పాపన్నకు కలెక్టర్‌ నివాళి | - | Sakshi
Sakshi News home page

సర్దార్‌ పాపన్నకు కలెక్టర్‌ నివాళి

Apr 3 2025 12:59 AM | Updated on Apr 3 2025 12:59 AM

సర్దా

సర్దార్‌ పాపన్నకు కలెక్టర్‌ నివాళి

సిరిసిల్ల: సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌కు బుధవారం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఘనంగా నివాళి అర్పించారు. పాపన్న వర్ధంతిని కలెక్టరేట్‌లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాపన్నగౌడ్‌ నాటి పాలకులపై తిరుగుబాటు చేసిన తీరును, ఆయన చేసిన సేవలను కలెక్టర్‌ కొనియాడారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు, ఎల్‌డీఎం మల్లికార్జున్‌రావు, గౌడ సంఘం నాయకులు పులి లక్ష్మీపతి, బొల్గం నాగరాజు, రంగు రాములు, ముష్కం తిరుపతి, బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

అర్హులకు మంజూరు చేస్తున్నాం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గిరిజన భూములను సాగులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గిరివికాసం’ పథకంపై జిల్లా అధికారులు అవగాహన కల్పించడం లేదని ‘సాక్షి’లో ‘భూములు బీళ్లుగానే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 67 బ్లాకులకు అర్జీలు వస్తే.. 7 బ్లాకుల్లో బోర్లు వేయించినట్లు తెలిపారు. 2 బ్లాకులలో విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేశామని, 2 బ్లాకులలో మోటార్‌ సాంక్షన్‌ చేసినట్లు వివరించారు. 51 బ్లాకులకు వివిధ సాయిల్లో అనుమతులు పెండింగ్‌ ఉన్నాయని వివరించారు. 9 బ్లాకులు 5 ఎకరాలలోపు ఉండడం, ఇది వరకే నీటి వసతి ఉండడంతో ఆ దరఖాస్తులను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. రుద్రంగి మండలం వీరునితండా గ్రామంలోని బ్లాకులలో వేసిన బోరుబావులకు సంబంధించి బిల్లులు రూ.1,45,345 హైదరా బాద్‌ స్థాయిలో పెండింగ్‌ ఉన్నట్లు వెల్లడించారు.

ప్రణాళికతో చదవాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రణాళికతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా విద్యాధికారి జ నార్దన్‌రావు అన్నారు. బుధవారం తంగళ్లపల్లి ప్ర భుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చే శారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని ప రిశీలించారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ, భాషపై పట్టుసాధించి, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ డెవలప్‌ చేసుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సలహాలు ఇచ్చారు. ఇప్పటి నుంచే పదో తరగతి పరీక్షలకు ప్రణాళికతో సంసిద్ధం కావాలన్నారు. అనంతరం ఎన్‌ఎంఎంఎస్‌ సాధించిన విద్యార్థి శివతేజ్‌ను అభినందించారు.

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు

సిరిసిల్లఎడ్యుకేషన్‌: జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో పూర్తయ్యాయి. చివరి రోజు సోషల్‌ పరీక్షకు 14 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తెలిపారు. జిల్లాలో 35 పరీక్షా కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,753 మంది హాజరైనట్లు, ప్రశాంతంగా జరిగినట్లు వివరించారు. విలాసాగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.

విస్తృతర పచారం చేయాలి

సిరిసిల్లకల్చరల్‌: సీనియర్‌ సిటిజన్ల సంక్షేమ చట్టంపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీనియర్‌ సిటిజన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.నరసింహారావు సూచించారు. బుధవారం ఆన్‌లైన్‌ సమావేశంలో మాట్లాడారు. ప్రజల్లో ఈ చట్టంపై పూర్తి అవగాహన పెరిగేలా క్షేత్ర స్థాయిలో కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ఇప్పటికే సంబందిత చట్టంలోని అంశాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నామని, వృద్ధులకు సంబంధించిన కేసుల పరిష్కారంలో సహకరిస్తున్నామని జిల్లా శాఖ నుంచి సమావేశంలో పాల్గొన్న జనపాల శంకరయ్య పేర్కొన్నారు.

సర్దార్‌ పాపన్నకు   కలెక్టర్‌ నివాళి1
1/1

సర్దార్‌ పాపన్నకు కలెక్టర్‌ నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement