● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: గర్భిణులకు స్కానింగ్ చేసి గర్భంలోని బిడ్డ లింగ నిర్ధారణ చేయడం తీవ్రమైన నేరమని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో శుక్రవారం పీసీపీఎన్‌డీటీ సలహా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్‌లలో ఫామ్ ఆడిట్లను ప్రతీనెల ప్రోగ్రాం ఆఫీసర్ తనిఖీ చేస్తారని, ధరల పట్టిక, ఇతర సర్టిఫికెట్లను గోడలపై ప్రదర్శించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ చేయరాదని, అబార్షన్లు చేయవద్దన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలినా ఆల్ఫ్రెడ్, గైనకాలజిస్ట్ డాక్టర్ శోభారాణి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, లీగల్ అడ్వయిజర్ శాంతిప్రకాశ్ శుక్లా, మానేరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ చింతోజు భాస్కర్, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్‌ఈ బాలయ్య పాల్గొన్నారు.