
హనుమాన్ జయంతి వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శ్రీహనుమాన్ ఆలయంలో ఈనెల 12న నిర్వహించే జయంతి, రథోత్సవాల ఉత్సవాల వాల్ పోస్టర్‌ను మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆలయ ఈవో నాగరపు శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్, మాజీ ధర్మకర్త చేపూరి నాగరాజు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయండి
సిరిసిల్ల క్రైం: మహిళలు వేధింపులకు గురైతే షీ టీంలకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ మహేశ్ బి గీతే అన్నారు. జిల్లాలోని విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సేవలందిస్తున్నట్లు తెలిపారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై 2 కేసులు, 7 పెట్టి కేసులు నమోదు చేశామని అన్నారు. వేధింపులకు గురైతే వెంటనే 87126 56425 ఫిర్యాదు చేయాల సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం శివారులోని సర్దాపూర్ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపరెడ్డి ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు. ధాన్యం క్వింటాల్‌కు రూ.2,320తో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు దుబాల వెంకటేశం, ఆడెపు జగన్, వెల్ముల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌సీయూ భూముల రక్షణకు పోరాటం
ఇల్లంతకుంట: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణకు పోరాటం చేస్తామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గన్నారం నర్సయ్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ అన్నారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలి పెట్టిన అనంతరం వారు మాట్లాడారు. తమను అదుపులోకి తీసుకొని వదిలేయడం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపోరాట నాయకులపై నిర్బంధం పెరిగిందన్నారు. ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై దృష్టి సారించాలని కోరారు.

హనుమాన్ జయంతి వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

హనుమాన్ జయంతి వాల్‌పోస్టర్ ఆవిష్కరణ